AP Inter 1st Year Botany Notes Chapter 9 కణం: జీవప్రమాణం

Students can go through AP Inter 1st Year Botany Notes 9th Lesson కణం: జీవప్రమాణం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 9th Lesson కణం: జీవప్రమాణం

→ కణం అనేది జీవనం యొక్క ప్రాధమిక ప్రమాణం. ఇది జీవులన్నింటిలో మౌలికమైన, నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం.

→ అన్ని జీవులు కణాలు మరియు కణసంకలితాలతో ఏర్పడి ఉంటాయి.

→ కణాలు ఆకారం, పరిమాణం మరియు విధులలో భిన్నంగా ఉంటాయి.

→ ‘కణసిద్ధాంతం’ ను ప్లీడన్ మరియు ష్వాన్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. తరువాత రుడాల్ఫ్ విర్షా అనే శాస్త్రవేత్త కణసిద్ధాంతానికి పరిపూర్ణత కల్పించాడు.

→ కణసిద్ధాంతం:

అన్ని జీవులు కణాలు మరియు కణసంకలితాలతో నిర్మితమవుతాయి.
(ii) కొత్త కణాలు పూర్వపు కణాల నుండి ఏర్పడతాయి.

AP Inter 1st Year Botany Notes Chapter 9 కణం: జీవప్రమాణం

→ కణాల రకాలు: (i) కేంద్రక పూర్వకణం (ii) నిజకేంద్రక కణం

→ వృక్ష కణాలు యొక్క ‘ద్రవాభిసరణతను’ నియంత్రించుటలో ‘రిక్తికలు’ ముఖ్య పాత్రను పోషిస్తాయి. [IPE]

→ మెటాసెంట్రిక్ క్రోమోసోమ్ మధ్యభాగంలో సెంట్రోమియర్ ను కలిగి రెండు సమాన బాహువులను ఏర్పరుస్తుంది.

→ కొన్ని క్రోమోసోమ్లలో ఉండే చిన్న ఖండికలాంటి నిర్మాణాన్ని ‘శాటిలైట్’ అంటారు.
ఇది ప్రధాన క్రోమెసోమ్ నుండి ద్వితీయ కుంచనం ద్వారా వేరు చేయబడుతుంది. [IPE]

→ ‘మధ్య పటలిక’ కాల్షియం పెక్టెట్తో తయారవుతుంది. ఇది ప్రక్కనున్న ఇతర కణాలను బంధించి ఉంచుతుంది.

→ హరిత వర్ణకాన్ని కలిగి ఉన్న కణాంగాలను ‘హరితరేణువులు’ అంటారు. [IPE]

→ మైటో కాండ్రియాలు ‘కణ శక్త్యాగారాలు’. [IPE]

→ కేంద్రక నిర్మాణం నాలుగు ప్రధాన అంశాలతో జరుగుతుంది. అవి: [IPE]

  1. కేంద్రక త్వచం
  2. కేంద్రకమాత్రిక
  3. క్రోమాటీన్ పదార్ధం
  4. న్యూక్లియోలస్

AP Inter 1st Year Botany Notes Chapter 9 కణం: జీవప్రమాణం

→ క్రోమోజోముల రకాలు (సెంట్రోమియర్ ఆధారంగా): [IPE]

  1. మెటాసెంట్రిక్
  2. సబ్మెటా సెంట్రిక్
  3. ఏక్రోసెంట్రిక్
  4. టీలోసెంట్రిక్

→ క్రొమాటిన్ మీద ఉన్న పూసల వంటి నిర్మాణాలను న్యూక్లియోసోమ్స్ అంటారు.

→ న్యూక్లియోసోమ్ నిజకేంద్రక క్రోమోజోమ్ యొక్క నిర్మాణాత్మక ప్రమాణం. [IPE]

Leave a Comment