TS Inter 1st Year Telugu Model Paper Set 4 with Solutions

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers Set 4 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Model Paper Set 4 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి. (1 × 6 = 6)

1. తోటమాలి ………. కన్పించని దేవుణ్ణి
జవాబు:
తే. తోటమాలి బలిదానం చేస్తేనే
పువ్వులు పరిమళాల నీవగలవు.
మానవుడు కలవాలి మానవుణ్ణి
తిడితే ఏం లాభం కన్పించని దేవుణ్ణి

భావము : తోటమాలి తన జీవితాన్ని బలిదానంగా చేస్తేనే పువ్వులు సువాసనలను వెదజల్లుతాయి. మానవులు ఒకరితో ఒకరు కలిసి పోవాలి. మనం చేయాల్సింది చేయకుండా దేవుని తిడితే ప్రయోజనం ఏమిటి ?

2. అని నిశ్చయించి ద్రుపదునొద్దకుంబోయి ……… దనవృత్తాంతంబంతయుఁ జెప్పిన.
జవాబు:
వ. అని నిశ్చయించి ద్రుపదునొద్దకుంబోయి నన్నెఱింగించిన, నాతండు ధన రాజ్యమదంబున
నన్నును దన్నును నెఱుంగక ‘యేను రాజను నీవు పేద పాఱుండవు; నాకును నీకును
నెక్కడి సఖ్యం బని పలికిన వానిచేత నవమానితుండనయి వచ్చితి’ నని ద్రోణుండు
దనవృత్తాంతంబంతయుఁ జెప్పిన.

భావము : అని నిర్ణయించుకొని ద్రుపదుని దగ్గరకు వెళ్ళి నన్ను నేను పరిచయం చేసికొనగా, అతడు రాజ్యమదం చేత నన్ను తననూ ఎరుగకుండా నేను రాజును, నీవు బీద బ్రాహ్మణుడివి, నాకూ నీకూ స్నేహం ఎక్కడిది ? అని పలికాడు. ఆ విధంగా అతని చేత అవమానం పొంది వచ్చానని ద్రోణుడు తన వృత్తాంతం అంతా తెలిపాడు.

TS Inter 1st Year Telugu Model Paper Set 4 with Solutions

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
పాఠ్యాంశం ఆధారంగా నృసింహ శతకంలోని భక్తితత్త్వాన్ని తెలపండి ?
జవాబు:
శేషప్పకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ప్రాంతం వాడు. ధర్మపురిలోని నరసింహస్వామిపై రాసిన శతకం నరసింహ శతకం. ఇది సీస పద్యాలలో రచింపబడిన ద్విపాద మకుట శతకం. శతకం లేని పద్యాలలో నరసింహస్వామిని సంబోధించడంలో ప్రేమ, మృదుత్వం, కాఠిన్యం, కోపం ఇంకా అనేక విధాలుగా తన భక్తిని ప్రదర్శించాడు.

ఆభరణములతో మిక్కిలి ప్రకాశించేవాడా! దుష్టులను సంహరించేవాడా! పాములకు దూరమైనవాడా! ధర్మపురము నందు నివసించే ఓ నరసింహస్వామీ!
భూమిలో వేయేండ్లు దేహం నిలవదు. ధనమెప్పటికీ స్థిరం కాదు. ఆలుబిడ్డలు తన వెంటరాలేరు. సేవకులు చావును తప్పింపలేరు. చుట్టముల గుంపు తనను బ్రతికించుకోలేదు. శక్తి శౌర్యమేమి పనికిరాదు. గొప్పగ సకల సంపదలున్నను గోచి పాతంతైన తీసుకొని పోలేడు. పిచ్చికుక్కలలాంటి ఆలోచనలను ఆలోచించక నిన్ను కొలిచే వారికి మిక్కిలి సౌఖ్యం కలుగుతుంది.

కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, ముధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

గాడిదకు కస్తూరిబొట్టు, కోతికి గంధము, పులికి చక్కెరపిండివంట, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూలచెండు, గుడ్లగూబకు చెవుల పోగులు, దున్నపోతునకు పరిశుభ్రవస్త్రము, కొంగలకు పంజరము ఎలా అవసరంలేదో అలాగే చెడ్డ ఆలోచనలుచేసే దుర్మార్గులకు తియ్యనైన నీ నామం అనే మంత్రం (దైవభక్తి) అవసరం లేదు అని భావము.

ఆభరణములతో మిక్కిలి ప్రకాశించువారా! దుష్టులకు సంహరించువారా! పాములకు దూరమైనవారా! ధర్మపురమునందు నివసించే ఓ నరసింహస్వామీ!

నరసింహస్వామి ! తల్లిదండ్రులు, భార్య, కొడుకులు, స్నేహితులు, బావము అందులు, అన్నాలు, మేనమామలు, ఇంకా పెద్ద చుట్టుములున్నాను. తాను వెడలగ వెంటరాదు. యమదూతలు ప్రాణము తీసుకుని పోవునపుడు వారు ప్రేమతో పోరాడి గెలవలేరు. చుట్టుములందరూ దుఃఖపడుదురే గాని ఆయువునివ్వలేదు. కావున చుట్టుముల మీద ప్రేమ చూరున చెక్కి, ఎప్పుడూ నిన్ను నమ్ముకొనుటే ఉపయోగము.

భుజముల శక్తిచే పెద్దపులుల చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్టవచ్చును. బ్రహ్మరాక్షసుల ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్పవచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును. కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించవచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.

ఈ విధంగా మృదు మధుర, సులభమైన ఉపమానాలలో శేషప్ప కవి నరసింహస్వామిపై తనకున్న భక్తిని చాటుకున్నాడు.

ప్రశ్న 2.
ద్రోణార్జునుల గురుశిష్య సంబంధాన్ని చర్చించండి ?
జవాబు:
భరద్వాజ మహర్షి పుత్రుడైన ద్రోణాచార్యుడు గొప్ప అస్త్ర విద్యా నిపుణుడు. కౌరవులకు, పాండవులకు విలువద్య నేర్పడానికి భీష్ముడు ద్రోణాచార్యుడిని రాజగురువు గా నియమించాడు. దివ్యాస్త్రాలతో సహా అన్నిరకాల అస్త్ర, శస్త్ర యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు ద్రోణుడు. అర్జునుడు అతని ప్రియ విద్యార్ధి. ద్రోణుడికి అర్జునుని కన్నా ప్రియమైనవారు ఎవరన్నా ఉంటే అది అతని కుమారుడు అశ్వత్థామ మాత్రమే.

మహాభారత ఇతిహాసంలో ఉత్తమ గురువుగా ద్రోణాచార్యుడు, మరియు ఉత్తమ విద్యార్ధిగా అర్జునుడు గురుశిష్య బంధానికి తార్కాణంగా నిలిచి పోయారు. రాజకుమారులందరికీ గురువుగా ఉన్న ద్రోణుడు అర్జునుడు ఒక అసాధారణ విద్యార్ధి అని గమనించాడు.

విద్యార్ధులందరికీ పెట్టిన తొలి పరీక్షలోనే అర్జునుడిలోని అపారమైన సంకల్పం మరియు ఏకాగ్రతను గమనించాడు ద్రోణుడు. ఒక రోజు గొప్ప యోధుడవుతాడని గ్రహించాడు. ద్రోణాచార్యుడు పెట్టిన అన్ని పరీక్షలలోను అర్జునుడు అందరినీ మించిపోయాడు. అర్జునుడు అపారమైన గురుభక్తితో ద్రోణుడిని సేవించాడు.

భీష్మునిచే ఆచార్యునిగా నియమింపబడగానే రాకుమారులందరినీ చూసి నా దగ్గర అస్త్ర విద్యలు నేర్చి నా కోరికమీలో ఎవ్వడు తీర్చగలడు? అన అడుగగా కౌరవులందరూ పెడమొగం పెట్టగా, అర్జునుడు నేను తీరుస్తానని ముందుకు వచ్చాడు. అలా ముందుకు వచ్చిన అర్జునుని అపారప్రేమతో కౌగలించుకున్నాడు. అలాగే ద్రోణుని సరస్సులో మొసలి పట్టుకున్న సమయంలో అర్జునుడే ద్రోణుని మొసలి నుంచి విడిపించి తన ప్రతిభను చాటుకున్నాడు.

చీకటిలో బాణాలు వేయడం అభ్యసిస్తున్నా అర్జునుని చూసి, అస్త్రవిద్యలోని అతని పట్టుదలకి శ్రద్ధకు సంతోషించి నీకంటే విలువిద్యలో అధికులు లేనట్లుగా నేర్పిస్తానన్నాడు ద్రోణుడు అన్నట్లుగానే సకల విద్యాయుద్ధకౌశలాన్ని, అస్త్ర, శస్త్రాలను, దివ్యాస్త్రాలను యుద్ధవ్యూహాలను సంపూర్ణంగా బోధించి ఒకనాటి పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటి వాడు కాడు అనేట్లుగా అర్జునుని తీర్చిదిద్దాడు.

అర్జునునికన్నా విద్యపట్ల శ్రద్ధ, ఆసక్తి, గురుభక్తి, వినయ కారణంగా ద్రోణుడి – ప్రియ శిష్యుడయ్యాడు. బ్రహ్మాస్త్రాన్ని అర్జునునికి ఇచ్చి సాధారణ యోధులకి వ్యతిరేకంగా వాడవద్దని చెప్పాడు.

విలువిద్య కళను నేర్చుకోవటంతో ఉన్న అంకిత భావం అచంచల ఏకాగ్రత కారణంగా గురువు హృదయంలో స్థానం సంపాదించాడు. ద్రోణుడు కూడా తనకున్న విద్యాజ్ఞానాన్నంతటినీ శిష్యులకు ధారపోసాడు. గురుద్రోణాచార్య, శిష్యుడు అర్జునుడు పంచుకున్న బంధం భారత ఇతిహాసంలో ప్రత్యేకంగా నిలిచి పోయింది.

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదాన్ని వివరించండి ?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే “రచించబడిన సాహితీ నీరాజనం అన్న వ్యాస సంకలనం లోనిది. ఇందులో ఆయన మానవతావాదాన్ని గురించి చక్కగా వివరించారు.

మానవతావాదం అంటే మానవ సంక్షేమాన్ని మానవ ప్రగతిని, లక్ష్యంగా పెట్టుకుని ఒక మానవుడు తోటి మానవుని గురించి శుభకామనతో చేసే ఆలోచనా రీతి. దీనిని మానవతావాదం అనే కన్నా మానవతా దృక్పధం అనటం సబబని రవ్వాహరి అభిప్రాయం. ఈ మానవతా దృక్పధానికి మూలం ప్రేమ. మానవుడు తోటి మానవుని పట్ల ప్రేమ భావాన్ని స్నేహభావాన్ని చూపించగలిగితే సమాజం ఆనందమయం అవుతుంది.

ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి, మానవతా వాదానికి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సంస్కృతంలో వేద వాఙ్మయం అతి ప్రాచీనమైంది. ఆ వేదాలలో ఋగ్వేదం మొదటిది. దానిలోని ‘పదవ మండలంలో అన్నదాన మహాత్మ్యాన్ని చెప్పే శ్లోకం ఒకటి ఉంది. ప్రాచీన సాహిత్యంలో కన్పించే అన్నదాన ఘట్టాలన్నీ మానవతా వాద ప్రతిపాదకాలే ! ఆకలితో బాధపడేవానికి అన్నం పెట్టనివాడు చనిపోయిన వానితో సమానుడుట.

వాల్మీకి రామాయణం ఆరంభమే మానవతావాదంతో ప్రారంభమయింది. “మానిషాద ప్రతిష్ఠాం….” అన్న ఆది కావ్యా రామాయణ వాక్యాలు సరమ కారుణ్య భావానికి ప్రతీకలు. ప్రేమ భావాన్ని దయాభావాన్ని మానవులపైనే కాక సకల జీవరాశిపై చూపించాలన్నది నిజమైన మానవతావాదం. బోయవాడు క్రౌంచ పక్షులలో మగపక్షిని బాణంతో కొట్టాడు. ఆడపక్షి దుఃఖం వాల్మికిని కదిలించిందట. ఇది అసలైన కారుణ్యభావం కదా !

ఇక ‘మహాభారతంలో ఉన్నదే మరొక చోట కూడా ఉంటుంది. మహాభారతంలో లేనిది మరెక్కడా ఉండదు. ధర్మప్రతిపాదన మహాభారత లక్షణం. దధీచి, శిబి, రంతి దేవుని కథలు మానవతా వాదానికి మచ్చుతునకలు. రంతిదేవుడు నోట వ్యాసుడు “న త్వహం కామయే రాజ్యం….” అన్న శ్లోకం ద్వారా నాకు రాజ్యము వద్దు, స్వర్గము . వద్దు, మోక్షం అసలే వద్దు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తిని తొలగించటమే కావాలంటాడు. దీనికి మించిన మానవతా వాదం ఇంకా ఎక్కడున్నది.

ఇక దానాలన్నింటిలో అన్నదానం గొప్పదంటారు. ఎందుకంటే అది క్షుద్బాధను తీరుస్తుంది. కాబట్టి. తాను కడుపునిండా తింటే కొందరు ఆకలితో అలమటిస్తుంటే ఉదాసీనంగా పట్టనట్లుగా ఉంటే అది మానవత్వం అన్నించుకోదు. ప్రాచీన సాహిత్యమంతటిలో ఏ దానమైన నిత్యం చేస్తే అది మానవత్వం అనిపించుకుంటుందని చెప్పబడింది.

భాగవతంలోని సప్తమ అధ్యాయంలో గృహస్థ ధర్మాలను వ్యాసులవారు వివరించారు. ఏ మనవునికైనా తన కడుపునింపుకునే ధనం మీద మాత్రమే అధికారం ఉంది. అంతకంటే ఎక్కువ ఉంచుకుంటే అది పాపమే అవుతుంది అన్నాడు. చరకుడు తన చరకసంహితలో సమస్త ప్రాణుల సంతోషాన్ని కోరుకున్నాడు.

అష్టాంగ హృదయంలో ‘బాల వృద్ధేభ్యః అన్నమదత్వాన భుజంతీ” అని చెప్పబడింది. అంటే బాలలకు వృద్ధులకు అన్నంపెట్టిన తరువాతే మనం భుజించాలని అర్థం.

మానవులందరూ సుఖంగా ఉండాలి. సర్వజీవులు ఆనందంగా జీవించాలని అన్నది మన ప్రాచీనుల ఆదర్శమని రవ్వా శ్రీహరి పేర్కొన్నారు.

ప్రశ్న 2.
భాషల మధ్య జరిగే ఆదానప్రదానాలను చర్చించండి ?
జవాబు:
తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలెవడిన “వ్యాసగుళుచ్ఛం’ రెండవ భాగం నుండి గ్రహించబడింది. ఇందులో భాఫల మధ్య ఆదాన ప్రదానాలు. సహజంగానే జరుగుతాయని సదాశివ వివరించారు.

ఒక భాషా పదాన్ని మరొక భాష స్వీకరించడం కొత్తేమీకాదు. పలు భాషలు మాట్లాడే ప్రజలు ఒక చోట కలిసి మెలసి ఉన్నప్పుడు భాషలలో ఆదాన ప్రదానాలు సహజంగా జరుగుతుంటాయి. ఒక భాషా పదాన్ని వేరొక భాష స్వీకరించేటప్పుడు ఏదో ఒక విభక్తి ప్రత్యయాన్ని చేర్చి ఆ భాషా పదాన్ని మరొక భాషాపదం స్వీకరిస్తుంది. ఒక్కొక్కసారి యథాతదంగాను లేదా ఒక అక్షరాన్ని చేర్చి, ఒక అక్షరాన్ని తీసేసి, లేదా ఒక అక్షరాన్ని మార్చి స్వీకరించటం జరుగుతుంది.

స్వీకరించిన భాష తాను స్వీకరించిన మూల భాషా పద అర్థాన్నే స్వీకరిస్తుంది. కొన్ని సందర్భాలలో వేరే భాషా పదాన్ని స్వీకరించిన భాష మూల యొక్క అర్థాన్ని కాక కొత్త అర్థంలో కూడ స్వీకరించడం జరుగుతుంది. ఇలా భారతీయ భాషలన్నింటిలోనూ సంస్కృత భాషా ప్రభావం అధికంగా ఉంది.

అలాగే ఆంగ్లభాషా ప్రభావం కూడా ! అన్య భాషా పదాలను స్వీకరించడంలో వర్ణాగమ, వర్ణాలోప, వర్ణవ్యత్యయాల ద్వారా ఆదాన ప్రదానాలు జరుగుతుంటాయి.
ఉదాహరణకు : లార్డ్ అనే ఆంగ్లపదం ఉర్దూలోనికి ‘లాట్సాహెబ్’ గా మారటం. ఫిలాసఫీ అనే ఆంగ్లపదం ఫల్సఫాగా ఉర్దూలోకి రావటం సొహబత్ అనే ఉర్దూపదం తెలుగులో ‘సోబతి’ అవటం. ఉర్దూలో ఆబ్రూ అనే పదం తెలుగులో ఆబోరుగా మారటం వర్ణలోప వర్ణాగమ వర్ణవ్యత్యయాలకు ఉదాహరణులుగా చెప్పవచ్చు.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
స్నేహలతాదేవి ఎదుర్కున్న సమస్యలను చర్చించండి ?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగము డా. ముదిగంటి సుజాతారెడ్డిచే రచించబడిన. “విసుర్రాయి” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి ఆర్థిక స్వాలంబనకు చాలా ప్రాధాన్యత ఉందనే వాస్తవాన్ని వివరిస్తుంది. యువత చిన్న విషయానికే కుంగిపోయి, అసంతృప్తికి, నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. అలాంటి ప్రతికూల ధోరణులను ఆ కథ నిరసిమైంది. ఆత్మ విశ్వాసంలో దేన్నైనా సాధించవచ్చు అన్న నమ్మకాన్ని ఇస్తుంది. అమ్మా నాన్నలకు స్నేహలత రాసినలేఖ పై విషయాలను రుజువుచేస్తుంది..

స్నేహలత తన పెళ్ళి విషయముపై తన తల్లిదండ్రులు దిగులు పెట్టుకున్నారని తెలుసుకుంది. వారిని ఓదార్చుతూ వర్తమానకాలంలోని యువతులకు ధైర్యాన్నిస్తూ వ్రాసిన లేఖ స్నేహలతాదేవి లేఖ. అమ్మ నాకు పెళ్ళికాలేదని మీరు చింతపెట్టుకున్నారు. మిమ్మల్నిచూసి నాకు మొదట్లో చింతగానే ఉంది.

ఏకాంతంగా ఎన్నో సార్లు ఏడ్చాను కూడా? పెళ్ళిచూపులకు వచ్చిన ప్రతి మగాడు నన్ను కాదనటం వల్ల నాకు న్యూనతా భావం కలిగింది. నాలో నాకే ఎన్నో లోపాలు కన్పించడం మొదలు పెట్టాయి. పెళ్ళిచూపుల మీద పెళ్ళిచూపులు జరిగాయి. పెళ్ళి చూపులనే తతంగం ఆడదానికి జరిగే ఎన్నో అవమానాలలో ఒకటిగా స్నేహలత భావించింది.

నిజంగా పెళ్ళి చూపులకు వచ్చిన వారిలో చాలా మంది నాకు నచ్చలేదు. కాని ఆ మాటలను చెప్పే హక్కునాకు లేదని మీరు, సమాజం నాకు నేర్పారు. అందుకే నోరు మూసుకున్నాను. నేను పెళ్ళి చూపులకు వచ్చిన వారికి వచ్చాకపోవటానికి నా అందం కాదు ప్రమాణం అని నాకు తెలిసింది. వారికి నచ్చంది మీరిచ్చే కట్నకానుకలు నేను చదువకున్నాను. వచ్చేవాడు ఏమంటాడోనని నన్ను ఉద్యోగ ప్రయత్నం మీరు చేయనీయలేదు.

నేను మరీ అంత అందగత్తెను కాకున్నా వికారంగా మాత్రం లేను కదా! ఎంతోమంది పెళ్ళిచూపులకు వచ్చారు కదా? ఒక్కరన్నా నా చదువు సంస్కారం గురించి అడిగారా! కట్న కానుకలను గురించి బేరాలాడటమే సరిపెట్టారు. ఈ సమాజంలో ఆచారాలు కట్టుబాట్లు ఆడదాన్ని బేరమాడే అంగట్లో వస్తువుగా చేశాయి. అమ్ముడు పోయేది వరుడు అవమానాల పాలయ్యేది వధువు ఇదేమి విడ్డూరం. ఇదేమి సంస్కారం.

వరకట్న వ్యతిరేకంగా పొసెషన్లు, నినాదాలు చేసి రోడ్లమీద తిరిగితే ప్రయోజనం ఉండదు. మానవ మనస్తత్వాలు మారాలి. స్త్రీలలో ఈ పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం రావాలి. స్త్రీలు తమ జీవితాలను తమకు ఇష్టమైన రీతిలో మలచు కోవటానికి ప్రయత్నించాలి. ఒత్తిడితో ధైర్యాన్ని కోల్పోయి ప్రాణత్యాగం చేయవద్దని కోరింది. తనకు ఎదురైన సమస్యలు నేటి సమాజంలోని ప్రతి స్త్రీ ఎదుర్కోంటుందని వారిందరికి ధైర్యం నూరిపోసింది స్నేహలతాదేవి.

TS Inter 1st Year Telugu Model Paper Set 4 with Solutions

ప్రశ్న 2.
గొల్ల రామవ్వ ఉద్యమకారుని ఏ విధంగా రక్షించింది ?
జవాబు:
‘గొల్ల రామవ్వ’ అను పాఠ్యభాగం మాజీ భారతదేశ ప్రధాని కీ॥శే॥ పాములపర్తి వేంకట నరసింహారావుచే రచించబడింది. శ్రీమతి సురభివాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన “గొల్లరామవ్వ – మరి కొన్ని రచనలు” కథా సంపుటి నుండి గ్రహించబడింది. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తిపోరాటకాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది.

నిజాం పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక స్టేట్ కాంగ్రెస్ ‘వాలంటీరును, విప్లవ కారుడిని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతివృత్తం గొల్లరామవ్వకథ. తెలంగాణపోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్

తెలంగాణలో అదో పల్లె. ఆ పల్లెలోకి ఉద్యమకారులు ప్రవేశించి రజాకార్లను. పోలీసులకు, నవాబులకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేస్తున్నారని నిజాం ప్రభుత్వవాదన. ఆ రోజు ఇద్దరు పోలీసుల్ని చంపినట్లు సమాచారం. అర్ధరాత్రి ప్రశాంత వాతావరణాన్ని చిన్నాభిన్నం చేస్తూ బాంబులమోత.

గొల్లరామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చొని ఉంది. ఆమె వడిలో భయం భయంగా పదిహేనేండ్ల బాలిక తలదాచుకుని ఉంది.

“అవ్వా గిప్పుడిదేం చప్పుడే” అని ప్రశ్నించింది మనమరాలు. “నీకెందుకే మొద్దుముండ, గదేంది గిదేంది – ఎప్పటికి అడుగుడే” అని కసిరింది. ఇంతలో ఇంటికిటికీ చప్పుడు ఆ కిటికీ గుండా ఓ అగంతకుడి ప్రవేశం. అతడు అవ్వ దగ్గరకు వచ్చి “చప్పుడు చేయకు” నేను దొంగను కాను, రజాకార్నుకాను, పోలీసును కాను, మిమ్మల్ని ఏమీ అనను. లొల్లి చేయకండి” అన్నాడు.

నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీరును వారి నుండి మిమ్మల్ని రక్షించేవాడిని అన్నాడు. అతని శారీరక పరిస్థితిని తెలుసుకున్న అవ్వ మనఃస్థితిలో కాయకల్పమైంది. భావ పరివర్తన కలిగింది. “ఇదేం గతిరానీకు? గట్టేందుకైనవు కొడకా? అని ప్రశ్నించింది.

“రాజోలిగెఉన్నవు కొడకా! నీ కెందుకు కొచ్చెరా ఈ కట్టం. పండు పండు గొంగల్ల ఎండు, బీరిపోతవేందిరా! పండు” అని అతన్ని ఓదార్చి సపర్యలు చేసింది. “కొడకా కొద్దిగ గింత గటుక చిక్కల ల పిసుక్కచ్చిన గింత కడుపుల పడేసుకో” అంది. యువకుడు లేచాడు. అవ్వ ఇచ్చినది ప్రసాదంగా తీసుకున్నాడు.

పాలు పిండేవేళయింది. యువకుడు నిద్రపోతునే ఉన్నాడు. ఇంతలో “చస్తి సస్తి నీబాంచెన్… నాకెరుక లేదు, అయ్యో వావ్వో! వాయ్యో అన్న అరుపులు మిన్ను ముట్టే ఆక్రోశాలు” యువకుడు లేచాడు రివాల్వరు తోటాలతో నింపుకుని బయలుదేరాడు. వెనుక నుండి అతని భుజం మీద మరొక చేయబడ్డది”. యాడికి? అన్న ప్రశ్న. ముసల్వ మరేం మాట్లాడలేను. అతన్ని చెయ్యపట్టి వెనక్కి లాంగింది.

యువకునికి మనవరాలి చేత దుప్పటి కండువాను ఇప్పించింది. అతడిచే “గొల్లేశమేయిచింది. ఎవడన్నా మాట్లాడితే గొల్లునోలె మాట్లాడాలె” అన్నది. ఈ లోపు పోలీసులు అవ్వ ఇంటికి రానేవస్తిరి. ఇంకేముంది గొల్ల వేసమంతా వ్యర్థమైనట్లే అనుకున్నాడు యువకుడు.

అవ్వ మనవరాలితో “మల్లీ! ఆ మూలకు మంచం వాల్చి గొంగడయ్యె! పిల్లగా ఆండ్ల పండుకో. ఈ పండుకో” అంది. “పొల్లా పోరని మంచానికి నాగడంచే అడ్డం పెట్టు” “మల్లీ మాట్లాడక ఆ పోరని పక్కల పండు ఊపడూ అంది”. “చెయ్యని పండుకో పోండా దానిమీద! చూసెటోని కనువాదం రావద్దు” అంది.

అంతలోనే ఇట్లకొచ్చిన పోలీసోళ్ళు ఆ యువకుని చూసి “వాడు యెవడన్నాప్ చెప్పు! కాంగ్రెసోడా యేం” అని అవ్వను గద్దించాడు వాడెవ్వడా! ఎవ్వడు పడితేవాడు. నూ పక్కలల్ల పండుటానికి మేమేం బోగమోల్ల మనుకున్నావా? నిన్నెవడన్నా గట్లనే అడుగుతే ఎట్లంటది అని బొంకింది. అవ్వ మంచం మీద కూర్చుంది. ఒక వైపు యువకుడు మరో వైపు మల్లి. అపూర్వ సమ్మేళనం. అవ్వా నీవు సామాన్యరాలువుకావు. సాక్షాత్తు భారతమాతనే” అన్నాడు.

ప్రశ్న 3.
ఇన్సానియత్ కథలోని సందేశాన్ని చర్చించండి ?
జవాబు:
‘ఇన్సానియత్’ కథ డా. దిలావర్ చే రచించిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఆత్మీయ మానవ సంబంధాలను చిత్రిస్తుంది. కులమత బేధం లేకుండా ప్రజలందరి మధ్య నెలకొన్న స్నేహాలు, వరుసలు పరస్పర సహకారాలు సహజీవన సంస్కృతిని తెలియచేస్తుంది. కాలక్రమేణ నగరాల్లోని స్వార్థం, కులాభిమానఁ, మతోన్మాదం వికృతరూపం దాల్చి గ్రామీణ ప్రాంతంలోకి వ్యాపించ టం ప్రారంభమౌతుంది.

ఈ నేపథ్యంలో గ్రామీణ :- ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఉన్న ఉన్నత మానవీయ సంబంధాలను ఈ కథ తెలియచేస్తుంది. వర్తమాన సమాజంలో లుప్త మౌతున్న ఆదర్శాలను విలువలను తెలుపుతూ కులమత దురభిమానంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఈ కథ సూచిస్తుంది.

రాంరెడ్డి సుబానీలు పేకాడుతున్నారు. సుబాని చేతిలో రాంరెడ్డి ఓడిపోతున్నాడు. అతడు పేకాటలో ఓడిపోతున్నట్టు లేదు. తన దర్జా దర్పం ఒక్కొక్క మెట్టు దిగ జారిపోతున్నట్టుగా ఉంది. అంతవరకు పేకాటలో రాంరెడ్డిని ఓడించినవాడు లేడని ప్రతీతి పొందాడు. సుబాని ఈనాడు రాంరెడ్డిని బట్టలూడదీసి నడిబజార్లో నిలబెట్టినట్టుంది. తట్టుకోలేక ఎన్నెన్నో అన్నాడు దానికి ఎంకన్న వంతు పాడాడు. “ఒక్కటేకాదు మల్ల ఇంకే ఆటైనా గంతే. ‘కిర్కెట్లో పాకిస్తాన్ అగరబాగెలిస్తే పండగచేస్కుంటారు”

“నువ్వెన్ని జెప్పు… వీళ్ళంతా గంతే…. తినేది ఇండియా సొమ్ము… పాడేది పాకిస్తాన్పట” కసిగా అన్నాడు రాంరెడ్డి. సుబానీకి “కండ్లపొంటి నీల్లు గిర్రున తిర్గుతాంటి.

సుబాని దిగులుగా ఇంటికి చేరిండు. తల్లి అతని దిగులు గమనించి ఏమయిందని అడిగింది. రాంరెడ్డి అన్న మాటలన్నీ చెప్పిండు సుబాని. ఆ తరువాత సంఘటనలో సుబానీకి యాక్సిడెంట్ అయింది. రాంరెడ్డి కొడుక్కి కిడ్నీఫెయిలయింది. రాంరెడ్డి అడగలేక అడగలేక సుబానీ తల్లిని తన కుమారునికి ప్రాణభిక్ష పెట్టమని కోరాడు.

సుబానీ తల్లి రాంరెడ్డిని “మర్ది కడుపుకోత ఎట్ల అగులు గుబులుగా ఉంటుందో అనుభవిస్తున్న. నా కడుపు కాలినట్లు ఇంకొకల్లకు ఎందుక్కొవాలె. నా కొడుకును మట్టెల గల్పుకుంటున్న, గా మట్టిల్నుంచి ఒక చిన్న మొక్క పానం బోస్కానికి మోక ఉంటే ఎందుకడ్డంబడాలె” అన్నది.

అపుడు రాంరెడ్డి! “సుబానీ! నీ తోని నేనొక్క పేకాటల్నే వోడిపోయిన అనుకున్న, గనినీ సావుసుత నన్ను ఓడిచ్చింది. మనిషికి కావల్సింది. ఇన్సానియత్ గని కులాలు మతాలూ కావని సుత సాటి చెప్పినవ్” అన్నాడు. మానవత ముందు ఏదైనా తలవంచాల్సిందేని ఇన్సానియత్ కథ చెప్తుంది.

ప్రశ్న 4.
బిచ్చగాడు కథలోని ప్రయాణీకుల మనస్తత్వాన్ని విశ్లేషించండి ?
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీన్ చే రచించబడింది. ఈయన అసలుపేరు దొంగరి ‘మల్లయ్య. ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీనమనసత్వాలను చక్కగా వివరించాడు. సమాజంలోని మనుషుల స్పందనా రాహిత్యాన్ని అమానవీయతను నైతిక పతనాన్ని ఈ కథ వివరిస్తుంది.

రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహానికి వెళ్ళి తిరిగి వరంగల్కు ప్రయాణం చేసే సందర్భంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన కథ ఇది. ఆ రోజు స్టేషన్ చాల రద్దీగా ఉంది. టికెట్ దొరికే అవకాశం ఏ మాత్రం కన్పించలేదు. అంతలో ఒకప్పటి తన విద్యార్థి భాస్కర్ సి. ఐగా పని చేస్తాడు. అతని పుణ్యమా అని టికెట్ సంపాదించి ట్రైన్లోకి ప్రవేశించాడు. కూర్చోటానికి సీటు ఎక్కడా ఖాళీ లేదు.

చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఒక సీటు మొత్తాన్ని ఒక స్త్రీ తన సామానులతో ఆక్రమించింది. ఆ సామానంతా అటూ ఇటూ జరిపితే ఐదుగురు కూర్చోవచ్చు. ఆ స్త్రీ చాలపేదరాలుగా ఉంది. బిచ్చగత్తెలా ఉంది. నలుగురు సంతానంతో చినిగిపోయిన గుడ్డపీలికలు కట్టుకునుండి. మురికిగా అసహ్యంగా ఉన్నారు. ఎలాగోలా అక్కడ కూర్చోవాలని “ఇదిగో ఇటుచూడు…. ఆ సామానంతా క్రిందపెట్టేస్తే ఇక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చుగా అన్నాడు. ఆ స్త్రీ “గదంతేం లేదు మేము సామాను తియ్యం. ఇంకో డబ్బాలోకి పోయికూకో”చాలా మొరటుగా సమాధానం చెప్పింది.

ఇంతలో అక్కడ కూర్చున్న పెద్ద మనిషి. “అధునా భిచ్చముండవు. – నీ కింత .పొగరుండీ మాకెంతుండాల్నే? ఆ సారెంత మర్యాదగా అడిగిండు- ఈ రైలు మీ తాతదనుకన్నావా” అని గద్దించాడు. చివరికి అక్కడ కూర్చున్నారు కవిగారు.

ఇంతలో గార్డువిజిల్ విన్పించింది. ఆ బిచ్చగత్తె గొంతులో ఆందోళన. “మీ అయ్యేడిరా! ఎక్కడ సచ్చిండు? రైలు పోతాంది” అంది ఇంతలో టికెట్ కోసం వెళ్ళిన వాడు వచ్చాడు. “టికెట్ దొరకనేలేదు బండిపోతాంది. సామానునంతా కిందకి దించి. మీరు దిగుండే” అన్నాడు.

“ఓరిపిచ్చిగాడిద కొడకా సామానునంతా దించే వరకు బండి ఆగుతుందా ఏమిటి? టి.సి. గారితోని చెప్పి బండిలో కూర్చో అన్నాడు ఆ పెద్దమనిషి. అప్పటికే ఆ బిచ్చగాడు బండిదిగి టికెట్ తీయమని డబ్బులిచ్చిన వాడి దగ్గరకు పరిగెత్తాడు. ఆడురాక పోతే టి.సీకి కట్టడానికి నీ దగ్గర డబ్బులున్నాయా అన్నారొకరు. “ఒక్కపైసాలేదు. లేదు బాంచెను “అందామె ఏడుస్తూ “నువ్వట్లనే అంటావు. ఇయ్యాళేపు బిచ్చగాళ్ళ దగ్గరున్నన్ని డబ్బులు మా అసంట్లోళ్ళ దగ్గర కూడా లేవు. మీకేందే పెట్టుబడి లేని వ్యాపారం” అన్నాడు ఎగతాళిగా. అక్కడ ఉన్నవారందరూ చులకనగా నవ్వారు.

మీ పనే బాగుందిరా. ఎక్కడా బిచ్చమే… కానీ ఖర్చులేని బతక్కు అన్నాడకొడు. ఊళ్ళన్నీ వాళ్ళవే! దేశాలన్నీ వాళ్ళవే దొరికింది తింటారు. లేకుంటే పస్తులుంటారు. ఏ బాదరాబందీ లేదు. మనకంటే వాళ్ళేనయం అన్నాడో ప్రయాణీకుడు. టి.సి రావడం ఆ బిచ్చగాణ్ణి బెదిరించడం జరిగాయి. ఆ బిచ్చగాడి రుమాలులో డబ్బులు కిందపడ్డాయి. అక్కడి ప్రయాణీకులలో బిచ్చగాడిపట్ల అప్పటి వరకు ఉన్న సానుభూతి ఎరిగిపోయింది.

“దొంగముండా కొడుకులు. వీళ్ళను చచ్చినా నమ్మోద్దు. టి.టి గారికి వీళ్ళ సంగతి బాగా తెలుసు. మంచిపని చేసుండు” అన్నాడు ఆ ఖద్దరు బట్టల నాయకుడు. నిండుచూలాలు వీళ్ళకు ఇలా జరుగుతుంటే వారిపై ప్రయాణీకులెవరికి జాలికలుగలేదు. అదే విషయం సినిమాలో చూస్తే కళ్ళ వెంట నీళ్ళు కారుస్తారు.

మేమంతా, టికెట్లు కొన్నాం. వీళ్ళు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. మనకు లేని ప్రివిలేజ్’ వీళ్ళకెందుకు పొందాలి అన్న ఈర్ష్య వారిలో కన్పించింది. టీ.సి గర్భిణి నుండి ‘ సంచిని లాక్కొని డబ్బంతా కింద బోర్లించాడు. ఫైనుతో టికెట్కు సరిపడా డబ్బులు తీసుకుని మిగిలినవి. ఆమెకివ్వబోయాడు. “వాటిని కూడా వార్నేతీసుకోమనురి” అంది ఆమె.

“చెప్పుతీసుకుని తంతాను దొంగముండా” అని ఇష్టమొచ్చినట్లు తిట్టి ఒక కాగితం ముక్క ఆ బిచ్చగాడి చేతిలో పెట్టాడు. ఆ చీటిలో 22 రూపాయలే రాసి ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఎవరు బిచ్చగాడో కవిగారికి అర్థం కాలేదు. భిన్నమనస్తత్వాలు గల వ్యక్తులు వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారని కవి బాధపడ్డాడు.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
రంగులు వేరైనా నరజాతి నరంగు మానవత్వమే.
జవాబు:
పరిచయము : ఈ వాక్యము కవిరాజుమూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘ కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
సందర్భము : కవి మానవతను గూర్చి వివరించిన సందర్భంలోనిది.
భావము : ఏడురంగుల సమ్మేళనం ఇంద్రధనస్సు. కాని దాని ఛాయ ఒకటే. ఏడు రంగుల సమ్మేళం అయినా చంద్రుని కాంతి తెలుపే. ఎన్ని వర్ణాలవారున్నా మానవులు నందరిని నడిపించే సరంగు మానవత్వమే అని ఇందలి భావము.

ప్రశ్న 2.
రాక్షసినైనా మైత్రికి రానిత్తును భయం లేదు
జవాబు:
పరిచయం : ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన ‘నాపేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అను ఖండకావ్యం లోనిది.
సందర్భము : మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని వివరించిన సందర్భము లోనిది.
భావము : అందరం మానవులమే. ఒకరినొకరు ద్వేషించు కోవటం ఎందుకు. రాక్షస స్వభావం ఉన్న వారిని కూడా నేను ఆహ్వానిస్తాను అని ఇందలి భావం.

ప్రశ్న 3.
వెల్తికుండ తొఁదొలుకుచునుండు
జవాబు:
పరిచయం : ఈ వాక్యం మారద వెంకయ్యచే రచింపబడిన భాస్కర శతకం నుండి గ్రహించిన పద్యంలోనిది.
సందర్భము : నీచుడికి, గుణవంతుడికి ఉన్న లక్షణాలను కవి తెలిపిన సందర్భం లోనిది.
భావము : వెలితి కుండ తొణకును గాని, నీరు నిండుగా గల కుండ తొణకదు. అట్లే గుణములేని నీచుఁడు న్యాయమునెంచక కఠినపు పలుకులను మాట్లాడును. సద్గుణములలో ప్రకాశించే గుణవంతుడు. అటువంటి కఠినపు మాటలను మాట్లాడడు.

ప్రశ్న 4.
సోహమే తన సొమ్మయా !
జవాబు:
పరిచయం : ఈ వాక్యము ‘దున్న ఇద్దాసు’చే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి” తత్వాలు అనుగ్రంథం నుండి గ్రహించబడింది.
సందర్భము : ఈ దేహం మనదికాదు మోహాన్ని విడువమని చెప్పిన సందర్భంలోనిది.
భావము : ఈ దేహం మనదికాదు. దానిమీద మోహాన్ని వదలిపెట్టండి. ప్రయత్నించి. గురుసేవ చేసుకుంటే ఆత్మ పరమాత్మను చేరాక తప్పుతుందా! అని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Model Paper Set 4 with Solutions

VI. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
పాఠ్యాంశంలోని కవి ప్రతిపాదించిన త్రికాల దృష్టిని వివరించండి ?
జవాబు:
‘నా పేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “పునర్నవం” అను కవితా సంపుటి నుండి గ్రహించబడింది. కవి అనేవాడు. మొదట మానవతా వాది కావాలి. కన్పించే మంచికి చెడుకు స్పందించే మనసుండాలి. గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును తెలుసుకోగలగాలి.

గతకాలాన్ని మంచి కాలంగా భావించి జీవితాలను గడిపే వ్యక్తులను వెక్కిరించే మనస్తత్వ దృష్టి ఉండకూడదంటాడు.

“గతమే జీవిత మనుకుని వర్తమానమె వలదని
వెనక్కు నడిచేవారిని
వెక్కిరించు కోర్కిలేదంటాడు”

అలాగే గతమంతా శూన్యం జ్ఞాన ప్రదమైన వర్తమానాన్ని మాత్రమే మంచిగా భావించాలను తలపొగరు గలవారిని నిందించే ఆలోచనా చేయకూడదు. గతము వర్తమానము కత్తికి రెండు వైపులా ఉండే పదును. రెండింటిని సమర్థిస్తానన్నాడు.
“గతాన్ని కాదనలేను
వర్తమానం వద్దనుబోను
భవిష్యత్తు వదులుకోను”

అని గతాన్ని, వర్తమాన్ని భవిష్యత్తును ఒకటిగా చూసే దృష్టి కలవాడు దాశరథి.

ప్రశ్న 2.
ద్రుపదుడి చేతిలో ద్రోణుడు ఏ విధంగా భంగపడ్డాడు ?
జవాబు:
ఆ విధంగా పరశురాముని వద్ద నుండి దివ్యాస్త్రాలను మంత్ర, ప్రయోగ రహస్యాలతో సహాపొంది, విలువిద్యను అభ్యసించి, ధనాన్ని కోరి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని వద్దకు వెళ్ళి, నేను నీ బాల్యమిత్రుడిని, నీతో కలిసి చదువుకున్న వాడిని, తెలుసుకదా అని స్నేహపూర్వకంగా మాట్లాడగా, ద్రుపదుడా మాటలను సహించలేక కోపంతో ‘ ఇలా అన్నాడు. ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు.

ప్రశ్న 3.
మనుషులు ఎందుకు భ్రమల్లో మునుగుతున్నారు ?
జవాబు:
‘అచలం’ అనుపాఠ్యభాగముదున్న ‘ఇద్దాసు’ చేరచించబడింది. ప్రస్తుత పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
ఈయన రాసిన తత్వాలు, ఆత్మపరంగా, తత్త్వపరంగా తెలంగాణ మట్టి నుండి పుట్టిన మాణిక్యాలు. ఈ దేహము మనదికాదు, మోహాన్ని విడచి ప్రయత్నం చేసి గురువును చేరుకోవాలన్నాడు. ఆలు, బిడ్డలు ధనము నాది అనుభ్రమల్లో మానవులు బతుకుతున్నారు. భార్యా బిడ్డలు ధన, ధాన్యాలు ఏవీ శాశ్వతంకావు. ఆ భ్రమల్లో బ్రతుకుతూ సత్యాన్ని తెలుసుకునే లోపే జీవితం పూర్తయిపోతున్నది. కీలు విడచిన బొమ్మలాగా నేలలో కలిసిపోతున్నారు. కావున ఆ భ్రమలు వీడి నిజాన్ని తెలుసుకుని ప్రవర్తించాలి అని ఇద్దాసు వివరించాడు.

ప్రశ్న 4.
అధమ, మద్యమ, ఉత్తములను కొలిచేవారి స్థితి ఎలా ఉంటుందని కవి వర్ణించాడు ?
జవాబు:
కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, మధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

VII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
‘బసవపురాణం’ కావ్యం గురించి సంక్షిప్తంగా రాయండి ?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మ రచించిన ‘చైతన్యలహరి’ అను వ్యాససంపుటి నుండి గ్రహించబడింది.

బసవపురాణం పాల్కురికి ద్విపద రచన. ఆయన ఒకనాడు శ్రీశైల క్షేత్రమును దర్శించి అక్కడ భక్తుల ద్వారా బసవేశ్వరుని దివ్య చరితమును విని బసవపురాణాన్ని రచించాడు ఈ ద్విపద కావ్యంలో నందికేశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు. బిజ్జలుడు ప్రతినాయకుడు. బసవేశ్వరుని చరిత్రతోపాటుగా ఈ కావ్యంలో 75 మంది శివభక్తుల కథలున్నాయి. ఈ కావ్యమందు సోమనాథుని కథా కథననైపుణ్యం కన్పిస్తుంది. ముగ్ధ సంగయ్య కథ, బెజ్జమహాదేవికథ, గొడగూచి కథ, ఉడుమూరి కన్నకప్పకథ, మడిమేలు మాచయ్య కథలు చక్కగా వర్ణించబడ్డాయి.

సోమనాథుని రచనా రీతిలో అంత్యానుప్రాసల ప్రభావం అధికం. ఇది పోతన లోని అంత్యప్రాసరచనకు కారణమైందని చెప్పవచ్చు. ద్విపద రచనలో సోమనాథునికి మంచిపేరు కావ్యం బసవపురాణం.

ప్రశ్న 2.
ఉర్దూ వానా పదాన్ని వివరించండి ?
జవాబు:
తెలంగాణా పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడినది. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువడిన ‘వ్యాసగుళుచ్ఛం’, రెండవ భాగం నుండి గ్రహించబడింది.

మన దేశంలోని భాషలన్నింటిపై సంస్కృత భాషా ప్రభావం ఎలా ఉందో అలాగే ఆంగ్లభాషా ప్రభావం ఉర్దూ భాషపై ఉంది. ఉర్దూ భాషా శాస్త్రవేత్తలు, ‘ఉర్దూవానా’ అనే పదాన్ని తరుచుగా వాడుతుంటారు. ఉర్దూ, పండితులు పలు ఆంగ్లపదాలను పద బంధాలను ఉర్దూలోకి అనువదించుకున్నారు. అవిగాక ఒక భాష అన్యభాషా పదాలను స్వీకరించే వర్ణాగమ, వర్ణలోప వర్ణవ్యత్యయ పద్ధతులలో ఎన్నో ఆంగ్లపదాలను ఉర్దూభాషలోకి మార్చుకున్నారు. ఆభాషా రూపమే ‘ఉర్దూవానా’..

ఉదా : లార్డ్ అనే ఆంగ్లపదం లాట్ సాహెబ్ ను
కమాండ్ అనే ఆంగ్లపదం కమాన్ ను
ఫిలాసఫీ అనే పదం ఫల్సపా గాను

ఇలా పలు ఆంగ్లపదాలు ఉర్దూలోకి వచ్చాయి. ఆ పదాల సమూహంతో వచ్చిన దానిని ‘ఉర్దూవానా’ అన్నారు.

ప్రశ్న 3.
అన్నదాన ప్రాముఖ్యతను తెలియచేయండి ?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతా వాదం అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వాశ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజం’ అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. ఇందులో అన్నదాన మహిమను వర్ణించారు.

దానాలన్నింటిలోకి అన్నదానం గొప్పది. అది మానవుల ఆకలి బాధను తీరుస్తుంది. తాను కడుపునిండా తింటూ కొందరు ఆకలితో అలమటిస్తుంటే చూసి చూడనట్లుండటం మానవత్వం కాదు అని మన ప్రాచీన గ్రంథాలలో వివరించబడింది. తైత్తిరీయ ఉపనిషత్తులో, అన్నాన్ని ఎక్కువగా వండాలని ఆకలితో అలమటించే దీనులకు అన్నం పెట్టాలని అలా పెట్టనివాడు నరకానికి పోతాడని వివరించబడింది. అలా అన్నార్తులకు అన్నం పెట్టనీవాడు కేవలం పాపాన్నే భుజిస్తాడని చెప్పింది.

ఎవరు తనకోసం మాత్రమే వండుకుంటాడో అంటే ఎవరు అన్నార్తుల బాధను పట్టించుకోకుండా తన పొట్టమాత్రమే చూసుకుంటాడో వాడు నరకాన్ని పొందుతాడని పాపాన్ని ప్రోగుచేసుకుంటాడని స్మృతులు వివరించాయి. భాగవతంలో కూడా గృహస్థ ధర్మాన్ని వివరిస్తూ తన కడుపు నింపుకోవడానికి అవసరమైన ధనం మీదే మానవునకు అధికారం ఉంటుంది. మిగిలినది అన్నార్తులకు వినియోగించాలని చెప్పింది. ఇలా అన్నదాన ప్రాముఖ్యాన్ని మన ప్రాచీన గ్రంథాలు వివరించాయి.

TS Inter 1st Year Telugu Model Paper Set 4 with Solutions

ప్రశ్న 4.
బొడ్డెమ్మ ఆటను గురించి రాయండి ?
జవాబు:
‘బతుకమ్మపండుగ’ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అను గ్రంథం నుండి స్వీకరించబడింది.

బొడ్డెమ్మఆట బతుకమ్మ ఆటకు పూర్వరంగం బతుకమ్మతోపాటు ఎర్రమట్టిముద్దను త్రిభుజాకారంలో తయారుచేసి దానిపై వెంపలిచెట్టు కొమ్మను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి పూజచేస్తారు. దీనిని కూడా నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ బొడ్డెమ్మ ఆట వినాయక చవితి నుండి ప్రారంభమై మహాలయ అమావాస్య నాటికి పూర్తవుతుంది. న బొడ్డెమ్మ ఆటలో ఎర్రమట్టి ముద్దను త్రిభుజాకారంలో మలచటం, పూజించటం భూమిని స్త్రీ మూర్తిగా భావించి అర్చింటమే ! ఇది ఆటవికులు భూదేవిని పూజిస్తూ చేసే నాట్యాలలో వలే విందులు వినోదాలతో పాటలతో జరుపబడుతుంది. భూదేవికి ప్రతిరూపమైన బొడ్డెమ్మను పూజించటం, అడవిపూలైన తంగేడు, ముత్యాలపూలతో పూజించటం ఆటవికుల నమ్మకాల ప్రభావంగా భావించాలి.

VIII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు / రచయితలు) (2 × 3 = 6)

ప్రశ్న 1.
దాశరథి కవితా సంపుటాలను తెలియచేయండి ?
జవాబు:
‘నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులుచే రచించబడిన “పునర్నవం” కవితా సంపుటి నుండి గ్రహించ బడింది.

ఆధునికాంధ్ర సాహిత్యంలో దాశరథిది విశిష్ట స్థానం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’ గా అమర్చాడు. ఉర్దూ, తెలుగు సంస్కృం, ఆంగ్లభాషా సాహిత్యాలను అధ్యయనం చేశాడు. వీరి కవితా సంపుటాలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం ఆలోచనా లోచనలు, తిమిరంతో సమరం, మహాబోధి కథాకావ్య రచన చేశాడు. నవ మంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా అన్న గేయ రచనలు చేసాడు. వీటితో పాటుగా ‘నవిమి’ నాటికల సంపుటిని వెలువరించాడు. దాశరథి శతకంతోపాటు గాలిబుగీతాలను తెలుగునకు అనువదించారు.

ప్రశ్న 2.
కవిరాజు మూర్తి రచనలను పేర్కొనండి ?
జవాబు:
‘మహైక’ అను పాఠ్య భాగము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ ‘దీర్ఘ కవిత’ నుండి గ్రహించబడింది. మూర్తిగారు ఉన్నత కుటుంబంలో పుట్టినా ఆనాటి నియంతృత్వ, భూస్వామ్య అధికారుల పీడనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. రైతుల పక్షాన, అణగారిన పీడిత ప్రజల పక్షాన మధ్యతరగతి జీవుల కోసం రచనలు చేశాడు.

మూర్తిగారు దీర్ఘకవితలు రాసిన తొలితరం కవులలో అగ్రగణ్యులు. మహైక, ప్రణుతి, మానవ సంగీతం దీర్ఘకవితా సంపుటాలను వ్రాసారు. “మైఁగరీబుఁ ఉర్దూనవలలను రాసి జవహర్లాల్ నెహ్రూకు అంకితం చేశాడు. గిడుతూరి సూర్యం తెలుగులోకి అనువదించాడు. హీరాలాల్ మోరియా ఉర్దూలో రాసిన కావ్యాన్ని మహాపథంగా తెలుగులోకి అనువదించారు. గాంధీజీ దివ్య చరితను జముకుల కథగా రాసాడు. ఉర్దూలో ‘లాహుకే లఖీర్’ అంగారే. తెలుగులో చివరి రాత్రి, మొదటి రాత్రి జారుడు బండ నవలలను రచించాడు. నవయుగ శ్రీ పేరుతో గేయాలు, ఉర్దూ పారశీకవుల గజళ్ళు “మధుధారలు” పేరుతో ముక్త కాలుగా రాశాడు” తిరుగుబాటు సాహిత్యంలో ధ్రువతార”గా దాశరథి చేత ప్రశంసించబడ్డాడు.

ప్రశ్న 3.
గడియారం రామకృష్ణశర్మగారి గూర్చి తెలుపండి ?
జవాబు:
గడియారం రామకృష్ణ శర్మ మార్చి 6. 1919న అనంతపురం. జిల్లాలో సుబ్బమ్మ జ్వాలాపతీ దంపతులకు జన్మించాడు. ఆయన పుట్టింది అనంతపురం జిల్లాలో అయినా స్థిరపడింది ప్రస్తు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా అలంపురం లో ! ఆయన తన జీవితాన్నంతటిని తెలంగాణ సంస్కృతి వారసత్వ పరిరక్షణకు ధారపోశారు ! ఈయన గురువు తిరుపతి వేంకటకవులు శిష్యుడైన వేలూరి శివరామశాస్త్రి. ఈయన సంస్కృతం, తెలుగు, కన్నడ, ఆంగ్ల భాషలలో పండితుడు.

తెలుగు భాషపట్ల నిజాం ప్రభువు చిన్నచూపు చూడటం సహించలేక ఆంధ్ర మహాసభల ఏర్పాటుకు కృషి చేసి కార్యదర్శిగా పనిచేశారు. ‘ఆంధ్ర సారస్వత పరిషత్’ స్థాపనలో కీలక పాత్ర వహించారు. నిజాం ప్రభుత్వ రేడియోకి వ్యతిరేకంగా ‘భాగ్యనగర్ రేడియో’ను అజ్ఞాతంగా నడిపారు.

గడియారం వారు మంచి సంఘసంస్కర్త. సంస్కరణను తనతోనే ప్రారంభించి. వితంతు వివాహం చేసుకున్నారు. పలువితంతువివాహాలను గూడా జరిపించారు. 1972 ఆగిపోయిన సుజాత పత్రికను పునరుద్ధరించారు. మెకంజీ కైఫీయత్తులను పరిశీలించి వ్రాయించారు. ‘తెలంగాణ శాసనాలు’ గ్రంథం రెండవ సంపుటిని ప్రచురించారు. కన్నడ సాహిత్య చరిత్రను పరిశోధనాత్మంగా వ్రాశాడు. కన్నడకవి ‘న్నడు’ ‘రన్నడు’ వ్రాసిన గదాయుద్ధాన్ని’ తెలుగునకు అనువదించాడు. అలంపురం చరిత్ర, విద్యారణ్యస్వామి చరిత్రలను ప్రామాణిక ‘శతపత్రం’, 2006ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 2006 జులైలో గడియారం వారు తుదిశ్వాస విడిచారు.

ప్రశ్న 4.
డా॥ సామల సదాశివగారి గూర్చి తెలుపండి ?
జవాబు:
డా॥ సామల సదాశివ భిన్న భాషా సంస్కృతులకు వారధి. ఈయన మే 11, 1928న ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలం తెలుగు పల్లె గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు. అధ్యాపక వృత్తిని చేపట్టి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా రిటైరయ్యారు. సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ, తెలుగు భాషలలో పాండిత్యాన్ని సంపాదించారు. ప్రభాతము అనే లఘు కావ్యాన్ని సాంబశివ శతకం, నిరీక్షణ, అంబపాలి, సరవ్స్వదానం, విశ్వామిత్రము వీరి తొలి రచనలు.

హిందూస్థానీ సంగీత కళాకారులపై మలయ మారుతాలు ప్రముఖులు జ్ఞాపకాలరు, అనుభవాలుగల ‘యాది’ సంగీత శిఖరాలు, వీరి రచనలే. అమాన్ రుబాయిలు’ అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2011లో లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సన్మానించాయి. ఈయన రచనలపై పరిశోధనలు జరిగాయి. ఆగస్టు 7, 2012న పరమపదించారు.

ప్రస్తుత పాఠ్యభాగం డా॥ సి.నారాయణరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ‘వ్యాసగుళచ్చం’ రెండవ భాగం నుండి గ్రహించబడింది.

IX. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద వాక్య సమాధానం రాయండి.
(పద్యభాగం నుండి)

ప్రశ్న 1.
మనలో మన చీలిక వల్ల కలిగే నష్టాలు ఏమిటి ?
జవాబు:
మనలో మన చీలిక మన పతనానికి దారి తీస్తుంది. మృత్యువు దరికి చేరుస్తుంది.

ప్రశ్న 2.
ఇద్దాసు ఎవరి సమాధిని దర్శించాడు ?
జవాబు:
కందిమల్లయ్యపల్లెలో ఉన్న ఈశ్వరాంబ సమాధిని దర్శించాడు.

ప్రశ్న 3.
చతురుడైన వాడు కూడా చేయలేని పని ఏమిటి ?
జవాబు:
దుర్మార్గులకు దేవుని గురించి తెలిపి వారిని మంచివారుగా చేయలేరు.

ప్రశ్న 4.
దాశరథి తన పేరు ఏమని చెప్పకున్నాడు ?
జవాబు:
నా పేరు ప్రజాకోటి అని చెప్పుకున్నాడు.

ప్రశ్న 5.
నన్నయ్యకు భారత రచనలో ఎవరు సహాయపడ్డారు.
జవాబు:
నారాయణభట్టు

ప్రశ్న 6.
కుచేలుడు శ్రీకృష్ణుని ఇచ్చేందుకు ఏమి తీసుకొని వెళ్ళాడు ?
జవాబు:
అటుకులు.

ప్రశ్న 7.
‘మాదిగ మహాయోగి’ అని ఇద్దాసును ఎవరు పేర్కొన్నారు ?
జవాబు:
డా. బిరుదురాజు రామరాజుగారు.

ప్రశ్న 8.
కవిరాజు మూర్తి నెలకొల్పిన సాహిత్య సంస్థ పేరు ఏమిటి ?
జవాబు:
‘ప్రజాసాహిత్య పరిషత్తు’ను ఖమ్మంజిల్లాలో స్థాపించాడు.

X. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి.
(గద్యభాగం నుండి)

ప్రశ్న 1.
‘లాట్ సాహెబ్’ పదానికి మూల పదం ఏది ?
జవాబు:
‘లాట్ సాహెబ్’ అనే పదానికి మూల పదం ‘లార్డ్’ అనే ఆంగ్లపదం.

ప్రశ్న 2.
తెలుగు స్త్రీల ముగ్గులపై రావిప్రేమలత రాసిన గ్రంథం పేరేమిటి ?
జవాబు:
“తెలుగు స్త్రీల చిత్రలిపి” రావి ప్రేమలత స్త్రీల ముగ్గులపై వ్రాసిన గ్రంథం.

ప్రశ్న 3.
సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యమేది ?
జవాబు:
సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యం వాల్మీకి రచించిన ‘రామాయణం’.

ప్రశ్న 4.
స్వార్థం లేకుండా పరోపకారిణీ బాలికల పాఠశాల నడిపినదెవరు ?
జవాబు:
కీ॥శే॥ సీతమ్మగారు

ప్రశ్న 5.
ద్విపదలో సోమన రచించిన గ్రంథాలేవి ?
జవాబు:
సోమన ద్విపద గ్రంథాలు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర.

ప్రశ్న 6.
జాతీయాలలో ఏ చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది
జవాబు:
జాతీయాలలో తరతరాల తెలంగాణ సామాజిక చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది.

TS Inter 1st Year Telugu Model Paper Set 4 with Solutions

ప్రశ్న 7.
‘జుర్మానా’ అనే ఉర్దూపదం తెలుగులో ఏ విధంగా మారింది ?
జవాబు:
జుర్మానా అనే ఉర్దూపదం తెలుగులో ‘జుల్మానా’గా మారింది.

ప్రశ్న 8.
రావి ప్రేమలత పిహెచ్.డి పరిశోధనాంశం పేరేమిటి ?
జవాబు:
“తెలుగు జానపద సాహిత్యం – పురాణగాథలు” రావి ప్రేమలత పిహెచ్.డి పరిశోధనాంశం.

XI. ఈ కింది వానిలో ఒకదానికి సమాధానం రాయండి. (1 × 5 = 5)

ప్రశ్న 1.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు జిల్లా కలెక్టర్ గారికి లేఖ వ్రాయండి.
జవాబు:

ఉద్యోగానికి లేఖ

నల్లగొండ,
26.07.2023.

శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి,
నల్లగొండ.
నమస్కారములు.
విషయము: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు దరఖాస్తు
నిర్దేశము: నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రకటన, తేది: 20.07.2023.
ఆర్యా,

ఈ నెల తేది 20.07.2023 నాటి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ఉద్యోగ ప్రకటనను చూసాను. మీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికపై నింపుతున్నట్లు, అరులైన వారు దరఖాస్తు చేసుకొమ్మని ప్రకటించారు. తమ ప్రకటన ప్రకారం ఆ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు అన్నీ నాకు ఉన్నాయి. అలాగే, కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కావున, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను.

ఈ ఉద్యోగమును క్రమశిక్షణతో, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని మనవి చేసుకుంటున్నాను. కావున, నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
కృతజ్ఞతలతో,

ఇట్లు,
మీ భవదీయుడు.
XXXX.

దరఖాస్తుతో జత చేసిన పత్రాలు :

  1. ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం
  2. జనన ధ్రువీకరణ పత్రం
  3. స్థానిక ధ్రువీకరణ పత్రం
  4. ఉద్యోగానుభవ ధ్రువీకరణ పత్రం

ప్రశ్న 2.
మీ కళాశాల నుండి వెళ్ళిన విహారయాత్ర గురించి తల్లిదండ్రులకు లేఖ వ్రాయండి.
జవాబు:

తల్లిదండ్రులకు లేఖ

వరంగల్,
10-02-2023.

పూజ్యులైన అమ్మానాన్నలకు నమస్కారములు.

నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. మీరు కూడా క్షేమమే అని తలుస్తున్నాను . నేను బాగా చదువుతున్నాను. ఇక్కడ మాకు ఉపన్యాసకులు చక్కగా బోధిస్తున్నారు. పాఠ్యాంశాలు పూర్తి అయినవి.

ఇటీవల మా కళాశాల నుండి హైదరాబాదుకు విజ్ఞాన విహారయాత్రకు వెళ్లి వచ్చాం. నగరంలోగల సాలార్జంగ్ మ్యూజియంనందున్న పురాతన వస్తువులు, నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో నేను ఇంతవరకు చూడని ఎన్నో జంతువులను చూశాను. బిర్లా మందిర్ అద్భుతమైన పాలరాతి కట్టడం, బిర్లా ప్లానిటోరియం మరియు సైన్స్ మ్యూజియం, రామోజీ ఫిల్మ్ సిటీ, గోలకొండ కోట వంటివి నన్ను ఎంతగానో ఆకర్షించాయి.

ఈ విజ్ఞాన, విహారయాత్రకు వెళ్ళడం వలన ఎన్నో చారిత్రక విషయాలు తెలుసుకోవ డంతో పాటు, ఎంతో విజ్ఞానం పొందడం జరిగింది. ఈ విజ్ఞాన, విహారయాత్ర నా భవిష్యత్ విద్యకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్తి విషయాలు ఇంటికి వచ్చిన తరువాత వివరిస్తాను. తాతయ్యకు, నానమ్మకు నా నమస్కారాలు తెలియజేయండి.

ఇట్లు,
మీ కుమారుడు,
XXXX.

చిరునామా
జి.. రాజేశ్వర్
ఇంటి నెంబర్ 1-3-178,
ఎ. యన్. రెడ్డి కాలని, నిర్మల్,
పిన్ నం. 504106.

XII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1. భానోదయము
జవాబు:
భానోదయము – భాను + ఉదయము = సవర్ణదీర్ఘ సంధి
సూత్రము : అ, ఇ, ఉ, ఋ వర్ణములకు సవర్ణములైన అచ్చులు పరమైనచో వానికి దీర్ఘములు ఏకాదేశమగును.

2. రెండంచులు
జవాబు:
రెండంచులు రెండు + అంచులు = రెండంచులు – ఉకారసంధి/ఉత్వసంధి.
సూత్రము : ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు.

3. మూలమెరిగిన
జవాబు:
మూలమెరిగిన మూలము + ఎరిగిన = ఉకార సంధి. ఉత్వసంధి
సూత్రము : ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు

4. ముద్దుసేయగ
జవాబు:
ముద్దుసేయగ – ముద్దు + చేయగ = గసడదవాదేశ
సూత్రము : కళలైన క్రియా పదములపై పరుషములకు గసడడవలు వైకల్పికముగానగు.

5. దర్శనోత్సాహి
జవాబు:
దర్శనోత్సాహి దర్శన + ఉత్సాహి = గుణ సంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ వర్ణములు పరమైనచో క్రమముగా ఏ, ఓ, అర్ – లు ఏకాదేశమగును.

6. నాటనేసి
జవాబు:
నాటనేసి = నాటన్’ + ఏసి – ద్రుతప్రకృతిక సంధి
సూత్రం : ఇకాదులకు దక్క ద్రుత ప్రకృతికంబులకు సంధిలేదు.

7. క్షణమాగాలి
జవాబు:
క్షణమాగాలి – క్షణము + ఆగాలి – క్షణమాగాలి – ఉకార సంధి/ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగును.

8. వాలుఁగన్నులు
జవాబు:
వాలుఁగన్నులు : వాలున్ + కన్నులు = సరళాదేశ సంధి
సూత్రం : ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.

XIII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.

1. యమపాశము
జవాబు:
యమపాశము : యముని యొక్క పాశము – షష్ఠీతత్పురుష సమాసం

TS Inter 1st Year Telugu Model Paper Set 4 with Solutions

2. బసవగురుడు
జవాబు:
బసవగురుడు : బసవ అనుపేరుగల గురుడు సంభావనాపూర్వపద కర్మధారయము

3. శిథిలవస్త్రంబు
జవాబు:
శిథిలవస్త్రంబు : శిధిలమైన వస్త్రము – విశేష పూర్వపద కర్మధారయ సమాసము

4. బాణం
జవాబు:
దివ్యబాణం : దివ్యమైన బాణం – విశేషణపూర్వపద కర్మధారయం

5. శర్కరాపూపంబు
జవాబు:
శర్కరాపూపంబు : శర్కరము (చక్కెర) తో చేసి అపూకము (పిండివంట) తృతీయా తత్పురుష సమాసం

6. మహాశక్తి
జవాబు:
మహాశక్తి : మహాత్తైన శక్తి – విశేషణ పూర్వపద కర్మధారయము

7. చక్రపాణి
జవాబు:
చక్రపాణి : చక్రము పాణియందుకలవాడు – బహువ్రీహి కర్మధారయ సమాసము

8. ఆలు పిల్లలు
జవాబు:
ఆలు పిల్లలు – ఆలియును పిల్లలును – ద్వంద్వసమాసం

TS Inter 1st Year Telugu Model Paper Set 4 with Solutions

XIV. ఈ క్రింది అంశాలలో ఒకదానిని గురించి వ్యాసం రాయండి.

1. తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వైభవం
జవాబు:
తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వైభవం

ప్రతీ సమాజానికి తనదైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. అది ఆ ప్రాంత ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆలోచనాపరుడైన మనిషికి తన ఉనికి గురించి, తన ప్రాంత చరిత్ర గురించి, తన భాషాసంస్కృతుల విశిష్టతల గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. చరిత్రను, సంస్కృతిని అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం ద్వారా ఉత్తేజాన్ని, ప్రేరణను పొందవచ్చు.

చరిత్రను తెలుసుకోకుండా చరిత్రను నిర్మించలేమని పెద్దలు చెబుతుంటారు. అలాగే, సంస్కృతి కూడా నిత్యజీవితంలోని అనేక సందర్భాలను ఉత్సాహభరితం చేస్తుంది. చరిత్ర, సంస్కృతి రెండూ సమాజాన్ని ఒక రీతిగా తీర్చిదిద్దుతాయి.

తెలంగాణ ప్రాంతవాసులుగా మన చరిత్ర, సంస్కృతుల పైన మనం కనీస అవగాహనను కలిగి ఉండడం, వాటిని పరిరక్షించుకోవడం అవసరం. తెలంగాణలో ఆదిమానవ సమాజానికి సంబంధించిన క్రీ.పూ. రెండువేల ఏళ్ల నాటి బృహత్ శిలాసమాధులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. నవీన శిలాయుగానికి సంబంధించిన రేఖాచిత్రాలు అనేక గుహలలో చిత్రించబడినాయి. తెలంగాణ ప్రాంతానికి ప్రాచీన గ్రంథాలలో క్రీ.పూ ఆరవ శతాబ్దం నాటికి అశ్మక (అస్సక), ములక, మహిషక, మంజీరక, తెలింగ అనే పేర్లున్నాయి.

గోదావరీ పరీవాహక ప్రాంతాలలో తొలినాటి ఆవాసాలకు సంబంధించిన ఆధారాలున్నాయి. తెలంగాణను పాలించిన తొలి రాజవంశం శాతవాహన వంశం. వీరు కోటిలింగాల, పైఠాన్, పాలనాకేంద్రాలుగా కొండాపురం టంకశాలగా క్రీ.పూ. మూడవ శతాబ్దం నుండి క్రీ. శ. మూడవ శతాబ్దం వరకు పరిపాలించారు.

వీరి కాలంలోనే శాతవాహన రాజైన హాలుడు సంకలనం చేసిన ప్రాకృత గాథాసప్తశతిలో అత్త, పత్తి, పడ్డ, పాడి, పిల్ల, పొట్ట మొదలైన తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. శాతవాహన కాలపు మట్టికోటల ఆనవాళ్ళు, అవశేషాలు కోటిలింగాల, ధూళికట్ట, పెద్ద బొంకూరు, ఫణిగిరి, గాజుల బండ, కొండాపురం లాంటి ప్రాంతాల్లో లభించాయి. అట్లాగే, శాతవాహ నులు వేయించిన నాణాలు తెలంగాణలో లోహపరిశ్రమ ఉండేదనడానికి సాక్ష్యాలుగా ఉన్నాయి.

తర్వాత విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, వాకాటకులు పరిపాలించారు. తదనంతరం కాకతీయుల సామ్రాజ్యం క్రీ.శ. 950 నుండి 1323 వరకు విస్తరిల్లింది. ముసునూరు నాయకులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, బహమనీలు (క్రీ.శ. 1518 1686) అసఫ్ జాహీలు (క్రీ.శ. 1724- 1948 తెలంగాణ నేలను పరిపాలించారు.

క్రీస్తుపూర్వం వేలసంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న గోండులు ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకుంటూ ‘ టేకం, మార్కం, పూసం, తెలింగం’ అనే నలుగురు మూలపురుషుల్ని దేవతలుగా పేర్కొంటారు. ఈ ‘తెలింగ’ శబ్దమే ‘తెలుంగు’ శబ్దానికి మూలంగా భావించవచ్చు. మెదక్ జిల్లా తెల్లాపూర్ లో బయట పడిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో ‘తెలుంగణ’ పదం, 1510 వెలిచర్ల శాసనంలో ‘తెలంగాణ’ పదం ప్రయోగించబడింది. అనంతర కాలంలో, వ్యవహారాల్లో ‘తెలంగాణ’ పదం విస్తృత ప్రచారంలోకి వచ్చింది.

కాకతీయ రాజులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల నీటి పారుదల కోసమే చెరువుల ‘ నిర్మాణం అధికంగా జరిగింది. పెద్ద చెరువులు, గొలుసు చెరువులు, చెరువులవ్యవస్థ ప్రత్యేకంగా కనిపించటం వల్ల అప్పట్లో ఈ ప్రదేశాన్ని ‘చెరువులదేశం’గా పిలిచేవారు. వరి, గోధుమ, నువ్వులు, పత్తి వంటి తృణధాన్యాలతో పాటు తోటల పెంపకం కూడా కొనసాగింది.

ఆ క్రమంలో ‘బాగ్ ‘ల విస్తరణ ‘బాగ్’ (తోటలు)కు నెలవైన నగరం కనుకనే హైదరబాద్ కు ‘బాగ్ నగర్’ అనే పేరొచ్చింది. వ్యవసాయం చుట్టూ అనేక వృత్తులు ఏర్పడ్డాయి. పనిముట్లు చేసేవారు. అవసరాలు చూసేవారు, పనులు చేసేవారు వివిధ వృత్తులుగా మార్పు చెందుతూ వచ్చినారు.

పురోహితులు, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, పద్మశాలి, గొల్ల, బెస్త, గౌండ్ల, గాండ్ల, చర్మకార వడ్డెర వంటి ఎన్నో వృత్తులు కొనసాగుతూ వచ్చినాయి. శాతవాహనుల కాలం నాటికే నిర్మల్ కత్తులు ప్రసిద్ధి పొందాయి. పట్టువస్త్రాలకు పోచంపల్లి, గద్వాల, ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వ్యవసాయం, కుటీర పరిశ్రమల ఉత్పత్తులతో గ్రామాలచుట్టూ ఎన్నో పండుగలు, జాతరలు తెలంగాణ సంస్కృతిలో వర్థిల్లినాయి.

తెలంగాణ ప్రజలు వ్యవహరించే తెలుగు విశేషమైంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. గ్రాంథికానికి, జాను తెలుగుకు దగ్గరగా, వ్యాకరణ ప్రమాణాలతో కూడి ఉంటుంది. తెలుగులో తొలి ప్రాచీన కందపద్యాలు బొమ్మలమ్మగుట్ట శాసనంలో లభించి, క్రీ.శ. 9 శతాబ్ది నాటికే ఛందోబద్ధ సాహిత్యమున్నదని నిరూపిస్తున్నాయి. కన్నడంలో, తెలుగులో పద్యాలు రాసిన పంపమహాకవి చరిత్ర తెలంగాణకు గర్వకారణం.

మల్లియరేచన రచించిన ‘కవిజనాశ్రయం’ తెలుగులో తొలిఛందోగ్రంథం. ‘వృషాధిప శతకం’ పేరుతో తొలిశతకాన్ని పాల్కురికి సోమన రచించాడు. సామాజిక చైతన్యానికి, దేశీరచనలకు బీజం వేసిన పాల్కురికి సోమన తెలంగాణ ఆదికవి. తెలుగులో తొలి స్వతంత్ర రచన చేసిన కవి. జానపద, సంప్రదాయిక, ప్రజాస్వామిక సాహిత్యాలు తెలంగాణాలో విస్తృతంగా వర్ధిల్లినాయి.

ఆదిమ సమాజ జీవనవిధానానికి ఆనవాళ్లు గిరిజనులు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవితల్లినే దేవతగా కొలిచే వీరి కళలన్నీ ప్రకృతి అనుకరణ రూపాలే.. మన తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఇత్యాది జిల్లాల్లో కోయ, గోండు, కొండరెడ్డి, లంబాడ, గుత్తికోయల, చెంచులు మొదలైన గిరిజన తెగలవారు జీవిస్తున్నారు. రుంజలు, బైండ్లు, ఒగ్గుకథ, శారదకథ, హరికథ,

చిందు భాగోతం, బాలసంతులు, బుడిగె జంగాలు, గంగిరెద్దులు, సాధనాశూరులు, బహురూపులు, పెద్దమ్మలు, గుస్సాడీ నృత్యం, చెంచు, కోయ, బంజారా ప్రదర్శనలు కళకళలాడినాయి. బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వనభోజనాలు, పీరీలు, దసరా,, రంజాన్, కాట్రావులు, కొత్తలు, సంక్రాంతి, ఉగాది పండుగులు ఎన్నో కొనసాగుతున్నాయి. పేరిణి శివతాండవం, లాస్యం, భజనలు, చిరుతలు, శిల్పకళ, పెంబర్తి జ్ఞాపికలు, నిర్మల్ బొమ్మలు, నకాశీ చిత్రాలు, కరీంనగర్ వెండిపనులు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాయి.

సమ్మక్క సారక్క, బల్మూరి కొండలరాయుడు, సర్వాయి పాపన్న, రాణి శంకరమ్మ, సోమనాద్రి, సదాశివరెడ్డి, రాంజీగోండు, కొమురంభీం, బండి సాయన్న, ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బందగీ, రేణుకుంటరామిరెడ్డి మొదలగు ఎందరో వీరుల 5. సాహసగాథలు కళారూపాలు సంతరించుకొని వీరగాధలుగా విస్తరిస్తున్నాయి.

తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన చుక్క సత్తయ్య ‘ఒగ్గు’ కథకు జాతీయస్థాయి గౌరవాన్ని కలిగించారు. అదేవిధంగా మిద్దె రాములు ఎల్లమ్మకథకు తెచ్చిన ప్రాచుర్యం కూడా అలాంటిదే. చిందు ఎల్లమ్మ, గడ్డం సమ్మయ్యలాంటి కళాకారులు చిందు యక్షగానానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు.

చరిత్రలో ఆయా రాజులకాలంలో నిర్మితమైన గోల్కొండ, ఓరుగల్లు, దేవరకొండ, రాచకొండ, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, ఎలగందల, జగిత్యాల, రామగిరి వంటి కోటలు ప్రసిద్ధి చెందాయి. వివిధ మతాలకు చెందిన రామప్ప, భద్రాచలం, పాకాల, జోగులాంబ, మక్కా మసీదు, మెదక్ చర్చి, వేములవాడ, కాళేశ్వరం, బాసర, యాదాద్రి, ప్రార్థనా స్థలాలుగా అలరారుతున్నాయి.

వేయిస్తంభాల గుడి, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, కొలనుపాక, నేలకొండపల్లి, పైగా, కుతుబ్ షాహీ సమాధుల వంటి చారిత్రక పర్యాటక ప్రదేశాలున్నాయి. కుంటాల, బొగత, పొచ్చర అలీసాగర్, నిజాంసాగర్, హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్, కాళేశ్వరం వంటి రమణీయ జలపాతాలు. ప్రాజెక్టులున్నాయి. నెహ్రూ జంతు ప్రదర్శనశాల, కవ్వాల్, పిల్లలమట్టి, పోచారం, శివ్వారం, ఏటూరునాగారం వంటి వన్యప్రాణి సందర్శన స్థలాలు తెలంగాణలో ఉన్నాయి.

తెలంగాణలో భాషా ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, రైతాంగ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, విప్లవోద్యమం, మద్యపాన వ్యతిరేకోద్యమం, జలసాధనోద్యమం, హరితహారం లాంటి అనేక ప్రజా ఉద్యమాలు వర్ధిల్లి ప్రజాసమూహాలను చైతన్య పరుస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఎంతో గొప్ప చరిత్రకు, సంస్కృతికి, ఎన్నో కళలకు పుట్టినిల్లు మనందరి తెలంగాణ. ఆడుదాం… పాడుదాం… అభివృద్ధిలో పోటీపడదాం. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం.

2. యువత – జీవన నైపుణ్యాలు
జవాబు:
యువత – జీవన నైపుణ్యాలు

ఒకదేశ అభివృద్ధి. ఆ దేశ యువత శక్తిసామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతీయువకులే కీలక పాత్ర పోషిస్తారు. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే చీకటి మాసిపోతుందని, లోకం మారిపోతుందని కవులు ఉపదేశించారు. ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన పదిమంది యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మించ వచ్చునని స్వామి వివేకానంద గొప్పభరోసాను అందించాడు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువతీయువకులు కలిగిన దేశం భారతదేశం.

ఉత్తుంగ తరంగాలతో పొటెత్తే నదికి ఆనకట్ట కట్టి, ఆ నదీజలాలతో బంగారు పంటలు పండించినట్లు, నెత్తురుమండే శక్తులు నిండే యువతీయువకులను సమర్థ మానవవనరులుగా తీర్చిదిద్ది ప్రగతి సిరులను పండించవచ్చు. యువతీయువకులు సునిశితమైన జీవన నైపుణ్యాలను సమకూర్చుకుంటే దేశ భావినిర్ణేతలుగా రాణిస్తారు. “We cannot always build the future for our youth, but we can build our youth for the future” అని ఫ్రాంక్ లిన్ డి. రూజ్ వెల్ట్ అన్నట్లుగా సమున్నతమైన భవితకోసం సమర్థవంతమైన యువతరం రూపొందాలి.

జ్ఞానసముపార్జనతోపాటు ఆ జ్ఞానసంపదను సద్వినియోగ పరుచుకోవటానికి జీవన నైపుణ్యాలను పెంపొందింపజేసుకోవాలి. విద్యార్థులు, యువకులు పోటీ ప్రపంచంలో విజేతలుగా ఎదగడానికి, ఉత్తమ పౌరులుగా, నవ సమాజనిర్మాతలుగా రూపొందటానికి తగిన జీవన నైపుణ్యాలను విధిగా అలవర్చుకోవాలి.

పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటమే ప్రధానం కాదు, అవరోధాలను అధిగమించి, ఉపద్రవాలను సాహసోపేతంగా ఎదుర్కొని జీవితాన్ని గెలిచే నైపుణ్యాలను కూడా నేటి యువత సొంతం చేసుకోవాలి. జీవన నైపుణ్యాల తీరుతెన్నుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చర్చించారు. బాల్యం నుండి విద్యార్థులు సమకూర్చుకోవలసిన కింది జీవన నైపుణ్యాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యంగా ప్రస్తావించింది.

1. స్వీయ అవగాహన (Self Awareness): ప్రతి మనిషికి తనపైన తనకు అవగాహన ఉండాలి. తన సామర్థ్యంపట్ల సరైన అంచనా ఉండాలి. ‘స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్య అన్నాడు దాశరథి. తనను తాను తెలుసుకోవడమే అసలైన విద్య. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, ఉన్నత గుణాలను సమకూర్చు కుంటూ యువత ముందడుగు వేయాలి. తమ బలాలను, బలహీనతలను సహేతుకంగా సమీక్షించుకొని, అందుకనుగుణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ లక్ష్యసాధనకు అకుంఠిత దీక్షతో యువత కృషిచేయాలి.

2. సహానుభూతి (Empathy): పరస్పరం సహాయమర్థిస్తూ జీవించే మానవుల సమూహమే సమాజం. కావున, సాటి మనిషి కష్టసుఖాల పట్ల సహానుభూతి ఉండాలి. ఇతరుల సమస్యలకు తక్షణం స్పందించగలిగే మానవీయస్పృహను యువత అందిపుచ్చు కోవాలి. తద్వారా మానవ సంబంధాలు బలోపేతమవుతాయి.

3. భావవ్యక్తీకరణ నైపుణ్యం (Communication skill): మాటే మనిషికి శాశ్వత ఆభరణం. మంచిమాట తీరువల్ల మహాకార్యాలను కూడా చక్కబెట్టుకోవచ్చు. సమయస్ఫూర్తితో కూడిన, నైపుణ్యవంతమైన భావవ్యక్తీకరణ మనకు అనేక విధాలుగా మేలుచేస్తుంది. విద్యావిషయక స్ఫూర్తిని ఇనుమడింపజేసుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందటానికి, వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, రోజువారి వ్యవహారాలను త్వరితగతిని సాధించు కొనటానికి భావవ్యక్తీకరణ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ఉద్వేగరహితంగా, ప్రభావశీలంగా, ప్రియంగా, హితంగా, సత్యసమ్మతంగా, అంగీకారయోగ్యంగా మాట్లాడే సామర్థ్యాలను యువత సంపాదించుకోవాలి.

4 భావోద్వేగాల నియంత్రణ (Management of emotions): యువతీయువకుల హృదయాల్లో ఎన్నోరకాల భావోద్వేగాలు అనునిత్యం సుడులు తిరుగుతుంటాయి. ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆగ్రహావేశాలను సంయమనంతో నియంత్రించుకోవాలి. సమయ, సందర్భాలను అనుసరించి ఓపికతో వ్యవహరించాలి. యువత భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోతే అనేక అనర్థాలు సంభవిస్తాయి.

5. సమస్యనధిగమించే నైపుణ్యం (Problem solving skill): సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, సానుకూల దృష్టితో సావధానంగా ఆలోచించి తగిన పరిష్కారాన్ని . కనుగొనాలి. నిరాశ చెందకూడదు. చిన్నసమస్యను అతి పెద్దగా ఊహించుకొని ఒత్తిడికి గురి కాకూడదు. ప్రతికూల ఆలోచనతో సమస్యనుండి పారిపోకూడదు. మనచుట్టూ ఉన్నదారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏమాత్రం భయపడకూడదు. ఇక లాభం లేదని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడకూడదు. ఎక్కడో. మరొకదారి మన కోసం తెరిచేవుంటుం దన్న నమ్మకంతో, ఆశావహదృక్పథంతో నలుమూలలా అన్వేషించాలి.

సమస్య గురించి స్నేహితులతో, శ్రేయోభిలాషులతో నిర్భయంగా చర్చించాలి. సానుకూల అవగాహనతో ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ఆపదనుండి బయటపడాలి. గెలుపు ఓటములను, కష్టసుఖాలను సమతౌల్యంతో స్వీకరించే స్థితప్రజ్ఞతను యువత అలవాటు చేసుకోవాలి.

6. నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision making): సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వల్ల సత్వర ఫలితాలను పొందవచ్చు. ఒక అంశం గురించి అన్ని కోణాలలో ఆలోచించి, అనంతర పర్యవసానాలను గ్రహించి, లాభనష్టాలను అంచనావేసి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమాత్రం కాలయాపన చేయకూడదు. ఆ నిర్ణయం బహుళ ప్రయోజనదాయకంగా ఉండాలి.

7. విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యం (Critical thinking): ప్రతివిషయాన్ని గ విమర్శనాత్మకంగా ఆలోచించాలి. స్వీయదృక్కోణంలో నుండి మాత్రమే కాకుండా బహుముఖీన కోణాల నుండి ఆలోచించాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎవరో పెద్దలు చెప్పారనో, ఇంకెవరో సెలవిచ్చారనో ప్రతివిషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. స్వీయానుభవాల ఆధారంగా, ప్రమాణబద్ధంగా నిర్ధారించుకున్న తరువాత సంబంధిత విషయాన్ని ఆమోదిం చాలి. తార్కిక అవగాహనతో ఆలోచించాలి.

8. సృజనాత్మక ఆలోచనా నైపుణ్యం (Creative thinking): యువతలో అనుకరణ ధోరణి బాగా పెరిగిపోతుంది. ఆయా రంగాలలో ప్రసిద్ధులైన వారి ఆలోచనాధోరణితో వేలం వెర్రిగా ముందుకుపోతున్నారు. వారిని స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలిగాని అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిక్షణం కొత్తగా ఆలోచించాలి. కాలానుగుణంగా స్వతంత్రంగా ఆలోచించడం మూలంగా అందరికీ మార్గదర్శకంగా ఉండవచ్చు.

ఈ విధమైన జీవననైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలను, పరోపకారదృష్టిని, సామాజిక స్పృహను, పర్యావరణ ఎరుకను, దేశభక్తిని సమకూర్చుకుంటే యువతీయువకులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ‘పావన నవజీవన బృందావననిర్మాత’లుగా జాతి పునర్నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.

3. యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం
జవాబు:
యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం

శ్రీకృష్ణుడు ఒకప్పుడు తన నోట్లో విశ్వరూప సందర్శనం చేయిస్తే ఇప్పుడు నట్టింట్లో ‘నెట్’ తిష్ఠ వేసుక్కూచున్నది. ‘ఇంటర్ నెట్ ఇవాళ మనుషుల పనిలో భారాన్ని తగ్గించి మనసుల మధ్య దూరాన్ని పెంచుతున్నది. ఒకప్పుడు ‘లేఖ’లు, టెలిగ్రామ్ లు, టెలిఫోన్లు మనుషుల మధ్య ఇంత సమాచార వేగాన్ని పెంచకపోయినా ఒత్తిడి లేని జీవనం ఉండేది. ఇప్పుడు ‘సెల్ ఫోన్’ శరీరభాగాల్లో ఒకటిగా మారిపోగా, టీవీ ఇంట్లోని వస్తువుల్లో ఒకటిగా మారింది. ఫోను సంభాషణలు, వీడియోకాల్స్ మనిషికి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు ఆత్మీయతానుబంధాలను మాయం చేశాయి.

వేగవంతమైన ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలు ఆత్మీయత, అనుబంధాలను పెంచుతున్నాయో, తుంచుతున్నాయో అర్థం కానంత సంఘర్షణలో సమాజం జీవిస్తున్నది. మనలాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఆధునిక సమాచార వ్యవస్థ వల్ల లాభనష్టాలు రెండూ కలగలిసి ఉన్నాయి. పూర్వం ప్రతివారూ బాల్యంలో రెండు అగ్గిపెట్టెల్లోని బాక్స్ లకు దారం కట్టి ఒకరు చెవికి పెట్టుకొంటే ఇంకొకరు మాట్లాడేవారు.

ఇదే పెద్ద ఆనందం..! మరిప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి మాధ్యమాలు, అనేక ‘యాప్స్’ అపరిమిత జ్ఞానంతో పాటు అనవసర విషయాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాయి. ‘అరచేతిలో వైకుంఠం’ లాగా ఇప్పుడు అన్నీ మనచేతి ఫోన్ లో తెలుసుకొనే సౌకర్యం కలిగింది. ‘అన్నీ’ ఉన్నప్పుడు అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.

1857లో స్కాట్లాండ్ దేశానికి చెందిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనే శాస్త్రవేత్త ఫోన్ ను కనుగొని 1892లో ప్రథమంగా న్యూయార్క్ నుండి షికాగో మాట్లాడాడు. దాని అంచెలంచెల పరిణామాల అవతారాలు ఈ రోజు మన చేతిలో విన్యాసం చేస్తున్న కర్ణపిశాచి అవతారం వరకు రూపాంతరం చెందింది. 1973లో మార్టిన్ కూపర్ అనే అమెరికా దేశస్తుడు ‘మొబైల్ ఫోను’ అందుబాటులోకి తెచ్చారు. అలాగే 1857లో చార్లెస్ బాబేజ్ కంప్యూటరకు రూపకల్పన చేయగా 1936లో దానికి ఓ సాంకేతిక రూపం వచ్చింది. పర్సనల్ కంప్యూటర్ను 1977లో రూపొందిస్తే 1983లో ఐ.బి.ఎం. అనే సంస్థ అందరికి అందుబాటులోకి వచ్చేట్లు చేసింది.

ఇది మనదేశంలోకి ఇంకో రూపంలో ప్రవేశించేసరికి మరో ఇరవై ఏళ్లు పట్టింది. పాటలు వినడం, అలారం, సమాచారం, సమయం మాత్రమే తెలుసుకొనే అవకాశం ఉన్న ఈ మొబైల్ ఫోన్లు 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టగానే అనేక కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇరవై ఏళ్లలో మొబైల్ ఫోను నేటి నిత్యావసర సరుకుగా మారిపోయింది. ఈ ఫోన్లకు ఇప్పుడు ఇంటర్నెట్ తోడవడంతో ప్రపంచం ఫోన్లోకి వచ్చి కూర్చొంది. సినిమాలు, డిక్షనరీలు, ఆటలు, లైవ్ ప్రోగ్రాంలు, టైపింగ్, విజ్ఞానం, సౌందర్యం వంటి మార్పులు, మత విజ్ఞానం, భాషలు, సైన్సు, విస్తృత సమాచారం, లలితకళలు, యోగవిజ్ఞానం, 24 గంటలు వార్తలు, ఇలా సమస్త ప్రపంచం ఇందులోకి చేరి ‘ఇందులో లేనిది ప్రపంచంలో లేదు.

ప్రపంచంలో లేనిది ఇందులో లేదు’ అన్న స్థితికి చేరాం. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అవసరమైన అనవసరమైన సమాచారం ‘ఒకచోట కలగాపులగంగా ఉండడం వలన సమాజంలో దుష్ప్రభావాలకు దారి సులభంగా ఏర్పడింది. ప్రతాపరుద్రుడు, స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి స్ఫూర్తిమూర్తుల చరిత్రలుకూడా నెట్లో దొరుకుతున్నాయి.

మనుషులు ఎప్పుడైనా చెడువైపు త్వరగా ఆకర్షితులవుతారు. సమాచారం ఉప్పెనలా మనమీద పడిన తర్వాత మనుషులు సెల్ ఫోన్ లోని సోషల్ మీడియా అనే అష్టదిగ్బంధనంలో చిక్కుకపోయారు. తనతోపాటు తన చుట్టుప్రక్కల వ్యక్తులతో, ప్రకృతితో సంబంధం కోల్పోయారు. ఇటీవల కాలంలో మనం రైలు, బస్సు ఎక్కి కూర్చొంటే ప్రక్కనున్న సీట్లోని మనిషి ఎక్కడికి వెళ్తున్నారని వారి యోగక్షేమాలను పూర్వంలా ఎవరూ అడగడం లేదు. ఎవరి ఫోన్లో వారు తలదూర్చే దృశ్యం చూస్తున్నాం.

మానవసంబంధాల యాంత్రికతకు ఇదో నిదర్శనం. అలాగే కొందరు ఇళ్లలో అస్తమానం కంప్యూటర్ లోనో, ఫోన్లోనో తలపెట్టి పక్కకు చూడడం లేదు. సుదీర్ఘంగా ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల మెడ, వెన్ను నొప్పి వంటి దేహబాధలు తప్పడం లేదు. అలాగే కదలకుండా కూర్చొని ఊబకాయం, చక్కెర వ్యాధి వంటి వ్యాధులు కొని తెచ్చుకొంటున్నారు. మైదానాల్లో ఆడాల్సిన కబడ్డీ, క్రికెట్ వంటి ఆటలు ఫోన్లోనే ఆడడం వల్ల శారీరక వ్యాయామం జరగడం లేదు. కాలాన్ని ఎక్కువగా వాటిలోనే దుర్వినియోగం చేస్తున్నారు.

తోటివారితోనే కాకుండా తనకుతానే సంబంధం కోల్పోతున్నాడు. తననుతానే వదిలి పెట్టినవాడు సమాజంతో ఎలా సంబంధం నెరపగలడు! అందుకే ఇటీవల ‘వర్చువల్ మీటింగ్స్’ తో పెళ్లిళ్లు, ఆఖరుకు అంత్యక్రియలు కూడా ఇంటర్నెట్లో చూసే దుస్థితికి దిగజారాయి. అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తో, అప్లోడ్ డౌన్లోడ్ లతో జీవితం దుర్భరం చేసుకొంటు న్నారు. అనవసరమైన ‘చెత్త సమాచారం, ఫార్వార్డ్ చేస్తూ అనవసర భారం ఇతరుల తలల్లోకి చొప్పిస్తున్నారు.

కొన్నిసార్లు విశ్వసనీయత లేని సమాచారం ఫార్వార్డ్ చేసి సామాజిక అశాంతికి కారణం అవుతున్నారు. అసత్యాలతో కథనాలు, వీడియోలు రూపొందించి సంచలనం చేసే సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు ఎక్కువైపోయి సోషల్ మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్నది. అసత్య కథనాలతో సంచలనాలతో డబ్బు సంపాదించే వ్యక్తులు సోషల్ మీడియాలో ఉండటం వల్ల.. భావోద్వేగాలకు సంబంధించిన కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొట్టే సమాచారం ఇతరులకు పంపించి వాళ్లలో లేనిపోని ఉద్రిక్తతలు కలిగిస్తున్నారు.

ఒకప్పుడు గొప్ప అవధానంతో ఎన్నో శ్లోకాలు, పద్యాలు మనవాళ్లు ధారణ చేసేవారు. పల్లెటూళ్లలో జానపదులు సైతం ఎన్నో సామెతలు, జానపద గీతాలు, కథలు నోటికి చెప్పేంత ధారణ ఉండేది. విద్యార్థులు ఎక్కాలు’ శతక పద్యాలు వల్లెవేసి ఎక్కడ అవసరం వస్తే అక్కడ ధారాళంగా చదివేవారు. ఇప్పుడు ప్రతీది ‘ఇంటర్నెట్ సమాచారం తప్ప ‘స్వీయశక్తి’తో జ్ఞాపకాన్ని జ్ఞానంగా మార్చుకోవడం లేదు.

తమ తమ స్వీయ జ్ఞానాన్ని’ వీడియోలుగా మార్చి సమాజానికి అందిస్తున్నారు. ఇందులో గుణదోషాలు రెండూ ఉన్నాయి. అలాగే అశ్లీల వెబ్ సైట్లు సమాజంలో అత్యాచారాలకు ప్రధాన కారణం అవుతున్నాయి. ఆటల్లో గడపాల్సిన యువత ఎక్కువగా ఫోన్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు.

దీనివల్ల శారీరక శ్రమ తగ్గి, అనవసర మానసికఒత్తిడి పెరిగి మెదడు మొద్దుబారే స్థితి వచ్చింది. చదువుకోసం విస్తృత సమాచారం ఇవాళ నెట్టింట్లో దొరుకుతుంది. అంతవరకు యువత స్వీకరిస్తే వారి జీవితం పూలబాటగా మారుతుంది. బియ్యంలోని రాళ్లు తొలగించుకొన్నట్లు అనవసర సమాచారం తొలగించి సదసద్వివేకంతో ఈ మాధ్యమాలను తమ జ్ఞానానికి అనుకూలంగా మార్చుకోవడమే .

నేటి యువతరానికి ఉండవలసిన వివేకం. అదేవిధంగా ‘పిచ్చోడిచేతి’లో రాయిగా మారిన ‘సామాజిక మాధ్యమాలు’ ఇపుడు కొందరికి వ్యాపారవనరుగా మారడం మరో కోణం. యువతరం మాదకద్రవ్యాల మత్తులో పడకుండా ఎంత జాగ్రత్తగా మెలగాలో అలాగే ఈ మాధ్యమాల వలలో పడకుండా చైతన్యంతో ఉత్తమ భవిష్యత్తుకోసం ఆదర్శమార్గంలో నడవాలి.

TS Inter 1st Year Telugu Model Paper Set 4 with Solutions

XV. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. There is plenty of water in that region.
జవాబు:
ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది.

2. What you do is more important than what you say.
జవాబు:
నువ్వు చెప్పే మాటలకంటే నువ్వు చేసే పనులే నీ గురించి మాట్లాడతాయి.

3. A poor workman blames his tools.
జవాబు:
పని చేతకానివాడు పనిముట్లని నిందిస్తాడు.

4. What time is our meeting on Wednesday?
జవాబు:
బుధవారం మన సమావేశం ఎన్ని గంటలకు ?

5. I completed reading the book yesterday.
జవాబు:
నేను పుస్తకం చదవటం నిన్న పూర్తి చేశాను.

XVI. ఈ క్రింది వ్యాసాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

కవిత్వం పద్య, గేయ రూపంలోగాకుండా వ్యవహారిక పదాలు, వాక్యాలతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. పాశ్చాత్య కవితాధోరణుల ప్రభావం దీనికి ప్రధాన కారణం. ఫ్రెంచి భాషలోని ‘verse libre’ అని, ఆంగ్లంలో ‘free verse’ అని పిలుచుకుంటున్న కవితా పద్ధతే తెలుగులో వచనకవితగా స్థిరపడింది. వచనకవితకు ఆద్యుడుగా చెప్పుకునే శిష్ట్లా ఉమామహేశ్వరరావు తను రాసిన వచనకవితల్ని 1938లో ‘విష్ణుధనువు’, ‘నవమి చిలుక’ సంపుటాలుగా ప్రకటించాడు.

వచనకవిత ప్రయోగదశ, తొలిదశలో వచ్చిన ఈ కవిత్వాన్ని శిష్ట్లా ‘ప్రాహ్లాద కవిత’గా పేర్కొన్నాడు. అటుతర్వాత వచన గేయం, వచన పద్యం, ముక్తచ్ఛంద కవిత, స్వచ్ఛంద కవిత, ఫ్రీవర్, వరి లిబర్, వచనకవిత అనే పలు పేర్లు వ్యాప్తిలోకి వచ్చినా వచనకవిత అనే పేరు స్థిరపడిపోయింది. వ్యవహార భాషా ప్రయోగాలతో భావపరమైన చిన్న వాక్యాల పాద విభజనతో వచనకవిత నడుస్తుంది. భావగణాలతో, అంతర్లయ గల వాక్యాలతో వచనకవిత స్వేచ్ఛానుగుణంగా కదులుతుంది. ప్రతి వచనకవికి తనదైన నిర్మాణ శిల్పం వుండటం వచనకవిత ప్రత్యేకత, వచనకవితలో పాఠకునికి భావోద్వేగం కలిగించేట్లుగా ఒక విరుపు, భావలయ, అంతర్లయలు నిగూఢంగా వుంటాయి.

వచనకవిత ఆవిర్భావదశలో 1939లో పఠాభి ‘ఫిడేలు రాగాల డజన్’ కవితాసంపుటి, ‘నయాగరా’ కవితాసంకలనం ముఖ్యమైనవి. తెలుగులో తొలి వచనకవితా సంకలనమైన ‘నయాగరా’ను కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాస్, ఏల్చూరి సుబ్రహ్మణ్యంలు ప్రచురించారు. కుందుర్తి వచనకవితకు ఉద్యమస్ఫూర్తిని అందించాడు. వచన కావ్యంగా ‘తెలంగాణ’ కావ్యాన్ని రచించి ‘వచనకవితాపితామహుడి’గా ప్రసిద్ధి చెందాడు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
వచన కవితకు ఆద్యుడుగా ఎవరిని భావిస్తున్నాం ?
జవాబు:
శిష్ట్లా ఉమాహేశ్వరరావు

ప్రశ్న 2.
శిష్ట్లా తన కవిత్వానికి పెట్టుకున్న పేరు ఏమిటి ?
జవాబు:
ప్రహ్లాద కవిత

ప్రశ్న 3.
‘వచనకవితాపితామహుడు’ ఎవరు ?
జవాబు:
కందుర్తి

ప్రశ్న 4.
తెలుగులో తొలి వచనకవితా సంకలనం ఏది ?
జవాబు:
‘విష్ణుధనువు’, ‘నవమిచిలుక’

ప్రశ్న 5.
పిడేలు రాగాల డజన్’ కవితా సంపుటి కర్త?
జవాబు:
శిష్ట్లాఉమాహేశ్వరరావు

Leave a Comment