TS Inter 1st Year Telugu Model Paper Set 3 with Solutions

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers Set 3 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Model Paper Set 3 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి.

1. మలయజము ………….. నివాళించు మఱియు.
జవాబు:
తే. మలయజము మేన జొబ్బిల్ల నలఁది యంత,
శ్రమము వాయంగఁ దాళవృంతమున విసరి
బంధురామోదకలిత ధూపంబు లొసఁగి,
మించు మణిదీపముల నివాళించు మఱియు.

భావం : కస్తూరి పచ్చకర్పూరము కలిపిన మంచి గంధమును కుచేలుని శరీరమునకు పూసెను. అగరుధూపము వేసి, అలసట పోవునట్లుగా మిత్రునకు విసనకర్రతో విసరెను. మణిమయ దీపాలతో హారతి పట్టెను.

2. బుడమిలో ………… దురితదూర!
జవాబు:
తే. బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ దెలిపి
సజ్జనులఁ జేయలేఁడేంత చతురుఁడైన ;
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర!

భావము : భుజముల శక్తిచే పెద్దపులుల చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్ట వచ్చును. బ్రహ్మరాక్షసులు ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్ప వచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును. కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించవచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.

TS Inter 1st Year Telugu Model Paper Set 3 with Solutions

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
దున్న ఇద్దాసు జీవితం – తాత్వికతను సమగ్రంగా వివరించండి ?
జవాబు:
“అచలం” అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. ఇది దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” గ్రంథం లోనిది.
దున్న ఇద్దాసు తెలంగాణలో ప్రసిద్ధ తత్వకవి. ఈయన 1811 1919 సం॥ల మధ్య కాలంలో జీవించాడు. నల్గొండ జిల్లా ‘చింతపల్లి గ్రామానికి చెందినవాడు. తల్లిదండ్రులు రామయ్య, ఎల్లమ్మలు. ఇతని అసలు పేరు ఈదయ్య. తాత్వికునిగా మారాక ‘ఇద్దాసు’గా ప్రసిద్ధివహించాడు. డా. బిరుదురాజు రామరాజు’ఇద్దాసు’ను మాదిగ మహాయోగిగా కీర్తించాడు.

ఇద్దాసు బాల్యంలో మోతుబరిరైతు వద్ద పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించాడు. భావిదగ్గర ‘మోట’ కొడుతూ గీతాలను అశువుగా పాడుకునేవాడు. ‘ ఈతని మధుర గీతాలను విన్న వరసిద్ధి జంగమ దేవర’ పూదోట బసవయ్య’ ఈతనికి ‘పంచాక్షరీ’ మంత్రాన్ని ఉపదేశించాడు. మెడలో లింగధారణ చేశాడు. ఇద్దాసు అడవులలో సంచారం చేస్తూ “రాజయోగాన్ని” ఏకాంతంగా సాధన చేశాడు. అష్టసిద్ధులను పొందాడు. పూర్వతాత్త్విక కవులైన శివరామ దీక్షితులు, పోతులూరి వీరబ్రహ్మం, ఈశ్వరాంబల ప్రభావం ఇతనిపై ఉంది.

ఇద్దాసు. వేమనలా తత్త్వవేత్తగా, అచలుడిగా, వీరశైవ తత్త్వజ్ఞానిలా కన్పిస్తాడు. పటేల, పట్వారీలతోపాటు ప్రజలు ఈతని శిష్యులయ్యారు. సంచారం చేస్తూ నల్గొండ నుండి మహబూబ్ నగర్ జిల్లా వరకు ఆధ్యాత్మిక పర్యటనలు చేశాడు. అచ్చంపేట తాలూకాలోని అయ్యవారిపల్లె, పోలేపల్లి, ఆవులోనిపల్లి, కాంసానిపల్లి, కల్వకుర్తి తాలూకాలోని గుడిగానిపల్లి దేవరకొండ తాలూకాలోని జీడికట్ల వంటి గ్రామాలలో ఈశ్వరమ్మ పీఠాలను నెలకొల్పాడు. వీరశైవ భక్తితో ఈయన 30కిపైగా తత్వాలను మేలుకొలుపులను, మంగళహారతులను రచించాడు.

ప్రశ్న 2.
‘విద్యాలక్ష్యం’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి ?
జవాబు:
ద్రోణుడు అగ్నివేశుడనే మహాముని వద్ద ధనుర్విద్యా పాఠంగతుడయ్యాడు. అనేక దివ్యాస్త్రాలు పొందాడు. తండ్రి ఆజ్ఞతో కృపాచార్యుని చెల్లెలైన కృపిని వివాహమాడాడు. అశ్వత్థామ అనే కుమారుడిని పొందాడు. ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళి వినయంతో తన్న తాను పరిచయం చేసుకుని ధనాన్ని ఆశించి మీ వద్దకు వచ్చాను అని అనగా పరశురాముడు తన వద్దనున్న ధనాన్నంతటినీ వేదజ్ఞానంగల బ్రాహ్మణులకు ఇచ్చివేసానని, తన దగ్గర శరీరం, శస్త్రాస్త్రాలు మాత్రమే ఉన్నాయి అన్నాడు. అప్పుడు ద్రోణుడు ధనాలలో మిక్కిలి శ్రేష్ఠమైనవి శస్త్రాస్త్రములు కాబట్టి వాటిని ప్రసాదించ మనగా పరశురాముడు అనేక దివ్యాస్త్రాలను బోధించాడు.

ఆ విధంగా పరశురాముని వద్ద నుండి యుద్ధవిద్యలు అభ్యసించి ధనాన్ని కోరి తన చిన్ననాటి మిత్రుడయిన ద్రుపదుని వద్దకు వెళ్ళగా ద్రుపదుడు ధన, అధికార గర్వంతో పేదవాడైన ద్రోణుని తీవ్రంగా అవమానపరచాడు. అవమాన భారంతో, కలత చెందిన మనసు కలవాడై, తన భార్య, కుమారుడు, అగ్రిహోత్రం, శిష్యసమేతంగా హస్తినాపురానికి బయలుదేరాడు. ఆ పట్టణం బయట కౌరవ, పాండవులు చెండాట ఆడుతుండగా వాళ్ళాడుతున్న బంగారు బంతి బావిలో పడింది.

ఆకాశంలోని నక్షత్రంలా మెరుస్తున్న ఆ బంతిని బయటకు తీయలేక రాకురులం అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో అటువచ్చిన ద్రోణుడు ఆ బంతిని తన బాణము లతో తాడులాగా చేసి బంతిని బయటకు లాగి ఇచ్చాడు. అది చూసిన రాజకుమారు లందరూ ఆశ్చర్యపడి ద్రోణుడిని తీసుకుని వెళ్ళి భీష్మునికి జరిగినదంతా చెప్పారు. భీష్ముడు ద్రోణుడి వివరములడుగగా ద్రోణుడు తన వివరాలన్నీ తెలిపి ద్రుపదుని వలన కలిగిన అవమానం, కుమారుని ఆకలి బాధలు అన్నీ తెలిపాడు.

అది విన్న భీష్ముడు వెదకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లు సంతోషించి ద్రోణుని గౌరవించి, ధనదానాలిచ్చి సంతోషపరచాడు. అంతేకాక తన మనమళ్ళ నందరినీ ద్రోణునికి చూపించి, వీరికి గురుత్వం వహించి వీరులుగా తీర్చిదిద్దుమని కోరాడు ద్రోణుడు వారందరినీ శిష్యులుగా స్వీకరించాడు.

అర్జునుడు శస్త్రాస్త్ర విద్యలలో అధికుడై వినయంతో ఎప్పుడూ గురుపూజ చేస్తూ ద్రోణుణ్ణి సంతోషపరచాడు. అస్త్రవిద్యలో అర్జునునికి గల పట్టుదలకి సంతోషించి అతనికంటే విలువిద్యలే అధికులు లేరు అన్నట్లుగా విద్య నేర్పిస్తానని వాగ్ధానం చేసాడు. ద్రోణుడు కూడా అర్జునునికి అన్ని రకాల యుద్ధవ్యూహాలు, అస్త్ర, శస్త్రాలు సర్వము బోధించాడు. ఒకనాటి పరశురాముడు కూడా ఇంటివాడు కాదు అన్నట్లుగా అర్జునునికి విద్య నేర్పించాడు.

ద్రోణుని వలన శస్త్రాస్త్ర విద్యాబోధనను పొందటంలో రాజకుమారులు అంతా సమానమే అయినా అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వశ్రేష్ఠుడయ్యాడు. రాజకుమారుల నైపుణ్యం తెలుసుకోవటం కోసం చెట్టు చివరన పక్షిబొమ్మను ఉంచి విద్యార్ధుల ఏకాగ్రతను ద్రోణుడు పరీక్షించగా అందరూ విఫలమవ్వగా అర్జునుడు తన ఏకాగ్రతతో లక్ష్యాన్ని భేదించాడు. తరువాత మరొకసారి ద్రోణుడు సరస్సులో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ద్రోణుని కాలును పట్టుకోగా తాను సమర్థుడై ఉండి కూడా శిష్యుల నైపుణ్యం పరీక్షించదలచి రాకుమారులను కాపాడమని కోరాడు. వారంతా విడిపించలేక దిక్కుతోచని స్థితిలో ఉండగా మహాపరాక్రమంతో ఐదు బాణాలతో ఆ మొసలిని సంహరించి గురువును కాపాడుకున్నాడు అర్జునుడు. సంతోషించిన ద్రోణుడు అర్జునునికి అనేక దివ్యాస్త్రాలు ప్రసాదించాడు అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు.

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
రాజాబహద్దూర్ సంఘసేవా తత్పరతను పరిచయం చేయండి.
జవాబు:
రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన “వెంకటరామారెడ్డి జీవిత చరిత్ర” అన్న గ్రంథం నుండి గ్రహించబడినది.

వెంకటరామారెడ్డి గొప్ప సంఘ సేవా తత్పురుషులు. విద్యార్థుల కోసం, బాలికల విద్యకోసం వితంతు వివాహాలు, బాల్య వివాహాల నిరసన, అనాధల వేశ్యల రక్షణ మొదలగు అంశాలపై ఆయన చేసిన సేవ మెచ్చతగింది. హైదరాబాద్లో చదువుకునే రెడ్డి విద్యార్థులకు (హాస్టల్) వసతి గృహం, నిర్మించటం, మాతృభాషలో విద్యాభ్యాసం చేసే విద్యార్థినులకు పాఠశాలలను నిర్మించటం వారి సేవలో ప్రధాన భాగాలు.

సంఘ సంస్కారం : గోల్కొండ పత్రికను స్థాపించి దాని ద్వారా యువతలో చైతన్యాన్ని నింపారు. రెడ్డిగారు పూర్వకాలం వారు అయన్పటికీ సంఘసంస్కారం కలవారు. బాల్య వివాహాలను నిరసించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. కీ॥శే॥ పండిత కేశవరావుగారు వాటిపై రెండు చిత్తు శాసనాలను చేస్తే వాటికి రెడ్డిగారు మద్దతు నిచ్చారు. దీనిపై శాసనసభవారు ఒక ఉప సంఘాన్ని నియమించారు. ఆ ఉపసంఘంలో రెడ్డిగారు ముఖ్యపాత్ర వహించారు. ఒక రెడ్డి హాస్టల్ విద్యార్థి వితంతు వివాహం చేసుకుంటే అతనని ప్రోత్సహించి ఉపాధిని కల్పించారు. వీరికి కులభేధ పట్టింపులు లేవు. మూఢాచారాలను నిరసించారు. అన్ని కులాల మతాల వారితో కలిసి జీవించారు.

అనాథలపై ప్రేమ : రెడ్డిగారికి అనాధలపై, వృద్ధులపై, రోగ గ్రస్తులపై, చివరకు జంతువులపై కూడా ప్రేమ ఉండేది. జంతు హింస నివారణ సంఘంలో ముఖ్యులుగా పనిచేశారు. అనాధ బాలికలను ధనవంతులు, నవాబులు ఉంచుకొనుట ఆచారంగా ఆ రోజులలో ఉండేది. నాటి పోలీసు అధికారి ‘సర్ ట్రెంచ్’ గానిని సంప్రదించి “శిశివుల సంరక్షక శాసనమునుస”ను చేయించి అనాధ బాలికలను రక్షించారు.

సికిందరాబాద్లో రెండు వృద్ధాశ్రమాలుండేవి. వాటికి ద్రవ్యసహాయాన్ని రెడ్డిగారు. పలుమార్లు చేశారు. హైదరాబాద్లో కుష్ఠిరోగుల చికిత్సాలయం ఉండేది. అక్కడి రోగుల పట్ల సేవాభావంతో చాలాసార్లు ఆర్థిక సహాయం చేశారు. అనాదలపై వీరికి ఎంతటి సేవాభావం ఉండేదో అలాగే హరిజనులపై ఉండేది. హిందువుల దురాచారాలలో అస్పృశ్యత ఒకటి. దీనితో పాటుగా మరొక కుసంస్కారం ఉండేది. హరిజన బాలికలను చిన్నతనంలోనే “మురళీలు”గను, బసివిరాండ్రు”గను తయారుచేసి అగ్రవర్ణాలవారు వారితో వ్యభిచారం చేసేవారు. వారికిక వివాహం అంటూ ఉండేదికాదు. జీవితాంతం వ్యభిచారులుగానే గడపవలసి వచ్చేది. రెడ్డిగారు దీనిని నిరసించి వారిని ఆదుకున్నారు. సర్వజనులకు పరోపకారి, కరుణా సముద్రులు, ప్రజానురంజకులు, రాష్ట్రసేవాపరాయణులుగా ప్రజా సేవచేస్తూ కీర్తి ప్రతిష్టలను పొందారు. రామారెడ్డిగారు.

ప్రశ్న 2.
ఉర్దూ నుంచి తెలుగులోకి చేరినప్పుడు పదాలలో జరిగిన మార్పును వివరించండి .
జవాబు:
తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించ బడింది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువడిన “వ్యాస గుళుచ్ఛం”, రెండవ భాగం నుండి గ్రహించబడింది. ఇందులో తెలంగాణా తెలుగులో ఉర్దూ పదాల మూలాలను చక్కగా వివరించారు.

ఉర్దూ ఒక ప్రత్యేక భాషకాదు. పారసీ, అరబ్బీ, తర్కీ శబ్దాల కలగాపులగం ఉర్దూ భాష. దీనిని ఇది మన దేశంలో 14వ శతాబ్దంలో రూపుదిద్దుకున్నది. దీనిని తొలుత హిందుయి జబానే హిందూస్థాన్ అన్న పేర్లతో పిలువబడింది. 18వ శతాబ్దానికి కాని అది ఉర్దూ అని పిలువబడలేదు.

తెలుగులో కొన్ని ఉర్దూ పదాలు యథాతదంగానే చేరాయి. కమలము, కలందాన్, ఖజానా, జమీందారు. జాగీర్దారు, ఖుషీ, గులాము రోజు, కూలీ, బాకీ, బజారు, దుకాణం మొదలగు పదాలు ఇందకు ఉదాహరణము. హలంతమైన ఉర్దూ భాషలోని పదాలు అజంతమైన తెలుగు భాషలో చేరినప్పుడు ఆ పదాలు అజంతమవటం సహజం. ఉదాహరణకు కలమ్-కలము అయింది. జమీందార్-జమీందారు అయింది. బజార్- బజారు అయింది.

కొన్ని పదాలు ఉర్దూ నుండి తెలుగులోకి వచ్చేటప్పుడు తమ రూపాన్ని మార్చుకున్నాయి. ఉదాహరణకు బాఖీ అనే ఉర్దూ పదం తెలుగులో బాకీ అయింది. అలాగే ‘సఖద్’ నగదుగా మారింది.

ఉర్దూపదం – తెలుగు పదం
ఉదార్ – ఉద్దర
సొహబత్ – సోబతి
మస్జిద్ – మసీదు
కుర్సీ – కుర్చీ
ఘిలాప్ – గలీబు/గలేబు
జుర్మానా – జుల్మానా
నఖ్స్ – నగిషీ
అబ్రూ – ఆబోరు
ఇలా ఉర్దూపదాలు తెలుగులో మార్పుచెందాయి.

కొన్ని ఉర్దూపదాలు తెలుగులోకి వచ్చి అర్థాన్ని కూడా మార్చుకున్నాయి. ఉదాహరణకు ‘ముదామ్’ అనే పారసీ పదానికి ‘ఎల్లప్పుడూ అనే అర్థం ఉంది. ఇది తెలుగులో ‘ముద్దాయిగా’ మారి ‘ప్రత్యేకించి’ అనే అర్థంలో వాడబడుతుంది. ఇలా పలు మార్పులతో అనేక పదాలు ఉర్దూ నుండి తెలుగు భాషలోకి ప్రవేశించాయి.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
స్నేహలతాదేవి ఎదుర్కున్న సమస్యలను చర్చించండి ?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగము డా. ముదిగంటి సుజాతారెడ్డిచే రచించబడిన. “విసుర్రాయి” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి ఆర్థిక స్వాలంబనకు చాలా ప్రాధాన్యత ఉందనే వాస్తవాన్ని వివరిస్తుంది. యువత చిన్న విషయానికే కుంగిపోయి, అసంతృప్తికి, నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. అలాంటి ప్రతికూల ధోరణులను ఆ కథ నిరసిమైంది. ఆత్మ విశ్వాసంలో దేన్నైనా సాధించవచ్చు అన్న నమ్మకాన్ని ఇస్తుంది. అమ్మా నాన్నలకు స్నేహలత రాసినలేఖ పై విషయాలను రుజువుచేస్తుంది.

స్నేహలత తన పెళ్ళి విషయముపై తన తల్లిదండ్రులు దిగులు పెట్టుకున్నారని తెలుసుకుంది. వారిని ఓదార్చుతూ వర్తమానకాలంలోని యువతులకు ధైర్యాన్నిస్తూ వ్రాసిన లేఖ స్నేహలతాదేవి లేఖ. అమ్మ నాకు పెళ్ళికాలేదని మీరు చింతపెట్టుకున్నారు. మిమ్మల్నిచూసి నాకు మొదట్లో చింతగానే ఉంది. ఏకాంతంగా ఎన్నో సార్లు ఏడ్చాను కూడా? పెళ్ళిచూపులకు వచ్చిన ప్రతి మగాడు నన్ను కాదనటం వల్ల నాకు న్యూనతా భావం కలిగింది. నాలో నాకే ఎన్నో లోపాలు కన్పించడం మొదలుపెట్టాయి. పెళ్ళిచూపుల

మీద పెళ్ళిచూపులు జరిగాయి. పెళ్ళి చూపులనే తతంగం ఆడదానికి జరిగే ఎన్నో అవమానాలలో ఒకటిగా స్నేహలత భావించింది.

నిజంగా పెళ్ళి చూపులకు వచ్చిన వారిలో చాలా మంది నాకు నచ్చలేదు. కాని ఆ మాటలను చెప్పే హక్కునాకు లేదని మీరు, సమాజం నాకు నేర్పారు. అందుకే నోరు మూసుకున్నాను. నేను పెళ్ళి చూపులకు వచ్చిన వారికి వచ్చాకపోవటానికి నా అందం కాదు ప్రమాణం అని నాకు తెలిసింది. వారికి నచ్చంది మీరిచ్చే కట్నకానుకలు నేను చదువకున్నాను. వచ్చేవాడు ఏమంటాడోనని నన్ను ఉద్యోగ ప్రయత్నం మీరు చేయనీయలేదు. నేను మరీ అంత అందగత్తెను కాకున్నా వికారంగా మాత్రం లేను కదా! ఎంతోమంది పెళ్ళిచూపులకు వచ్చారు కదా? ఒక్కరన్నా నా చదువు సంస్కారం గురించి అడిగారా! కట్న కానుకలను గురించి బేరాలాడటమే సరిపెట్టారు. ఈ సమాజంలో ఆచారాలు కట్టుబాట్లు ఆడదాన్ని బేరమాడే అంగట్లో వస్తువుగా చేశాయి. అమ్ముడు పోయేది వరుడు అవమానాల పాలయ్యేది వధువు ఇదేమి విడ్డూరం. ఇదేమి సంస్కారం.

వరకట్న వ్యతిరేకంగా పొసెషన్లు, నినాదాలు చేసి రోడ్లమీద తిరిగితే ప్రయోజనం ఉండదు. మానవ మనస్తత్వాలు మారాలి. స్త్రీలలో ఈ పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం రావాలి. స్త్రీలు తమ జీవితాలను తమకు ఇష్టమైన రీతిలో మలచు కోవటానికి ప్రయత్నించాలి. ఒత్తిడితో ధైర్యాన్ని కోల్పోయి ప్రాణత్యాగం చేయవద్దని కోరింది. తనకు ఎదురైన సమస్యలు నేటి సమాజంలోని ప్రతి స్త్రీ ఎదుర్కోంటుందని వారిందరికి . ధైర్యం నూరిపోసింది స్నేహలతాదేవి.

TS Inter 1st Year Telugu Model Paper Set 3 with Solutions

ప్రశ్న 2.
పాతిమా గొప్ప మనసును వివరించండి ?
జవాబు:
ఇన్సానియత్ కథ ‘డా. దిలావర్’ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్ని ఆత్మీయ మానవ సంబంధాలను చిత్రించింది. వాటికి ‘ఫాతిమా’ గొప్ప మనసు ఒక నిదర్శంగా నిలుస్తుంది.

ఫాతిమా సుబానీ తల్లి, సుబాని, రాంరెడ్డి, కాపోల్ల ఎంకన్నలు పేకాడుకుంటారు. సుబాని చేతిలో వారు ప్రతి ఆట ఓడిపోయారు. రాంరెడ్డి ఇజ్ఞత దెబ్బతింది. సుబానీని నానా మాటలూ అన్నాడు. ఆ దిగులుతో ఇంఇకి వచ్చిన సుబానీని తల్లి ఫాతిమా ఏం జరిగిందని అడిగింది. రాంరెండ్డి అన్నమాటలన్నీ సుబాని తల్లికి చెప్పాడు. రోజులు మారిపోయాయి అనుకుంది ఫాతిమా! పల్లెకు రజాకార్లోత్తే ఊరోల్ల పానానికి తన పానం అడ్డమేసుండు మీ బాపు. ఊరోల్ల మీ బాబును పానానికిపానంగా చూసుకునేటోల్లు. ఇప్పుడు మనిషికి మనిషికి మధ్య ఎడం పెరుగుతుంది. మనమే మనకు పరాయిల్లెక్క కండ్ల బడన్నమ్” గీ దుష్మనీ, కచ్చలు, నరుక్కోటం సంపుకోటం, మత పిచ్చిగాల్లు రామ్ – రహీమ్ల నడ్మ చిచ్చుపెట్టడం గియన్ని ఎన్నటి జమానలమేం ఎరగంబిడ్డా! ఒకలకు ఆపతొత్తే ఒకల్లు ఆదుకునే టోల్లు.

సుబానీకు యాక్సిడెంటైనా సమయాన తన కొడుకు ఎలానూ బ్రతకడు. రాంరెడ్డి కొడుకన్నా బతికితే అంతేచాలు అని అనున్నది పాతిమా!

“మర్దీ సీమకు సుత అపకారం చెయ్యాలి. నా కొడుకుని చూసి ఓర్వలేక ఆ అల్లా తీస్కపోతన్నడు” అని తన బాధను రాంరెడ్డి వద్ద వెళ్ళపోసుకుంది.

అప్పుడు రాంరెడ్డి ఫాతిమా!” గిసుంటి ఆపతిల తల్లి మనసు ఎంత తండ్లాడ్తదో నాకెర్క లేదు కాదు. జర అటు ఇటు నేను సుత నీవోల్గెనె ఉన్న. ఎంకెట్రెడ్డి సావు బతుకుల్ల ఉన్నాడు. గాని పానాలు గిప్పుడు మీ చేతుల్లవున్నయ్” నా కొడుకు కిడ్నీలు పూరాగా పాడైపోయినయ్. పన్నెండు గంటల్లో ఏరే కిడ్నీలు దొరక్కుంటే నా ఒక్కగానొక్క కొడుకు నాకు దక్కడు. ఫాతిమా! నీకు చేతులెత్తి మొక్కుత! సుబాని కిడ్నీలు…. అని రాంరెడ్డి గొంతుక పూడిపోయి మాట రాలేదు.

ఫాతిమా ఒక్కసారి షాక్ అయింది. సుడిగాలికి ఎండు టాకులా వణికింది.

‘మర్షీ! కడుపుకోత ఎట్లు అగులు బుగులుగ ఉంటుందో అనుబగిత్తన్నా! నా కడుపు కాలినట్లు ఇంకొకల్లకు ఎందుకు కావాలె? నా కొడుకును మట్టిలో గల్పుకుంటన్నగా మట్టిల్నుంచి ఒక చిన్న మొక్క పానం బోస్కోనికి మోక వుంటే ఎందుకడ్డబడాలే! నాకొడుకు పానం అసుమంటిదే నీ కొడుకు పానం. నా కొడుకు హయత్సుత బోస్కోని నీ కొడుకు నిండు నూరేండ్లు బత్కొలె! గందుకునన్నే జెయ్యమంటే ‘గజేస్త…. అన్నది ఫాతిమా!

ఫాతిమా మనసు…. మనిషికి కావలసింది. ఇన్సానియత్ గాని కులాల మతాలు కావని” చెప్పకనే చెప్పింది. ఇంతటి గొప్ప మనసు ఫాతిమావంటి తల్లులకు ఎప్పుడూ
ఉంటుంది.

ప్రశ్న 3.
‘గొల్లరామవ్య’ కథ ఇతివృత్తాన్ని పరిచయం చేయండి.
జవాబు:
‘గొల్లరామయ్య కథ’ దక్షిణ భారతదేశం నుండి తొలిసారి భారత ప్రధాని అయిన పాముల పర్తి వేంకటనరసింహారావుచే రచించబడింది. శ్రీమతి సురభి వాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన ‘గొల్లరామవ్వ – మరికొన్ని రచనలు’ సంపుటి నుండి గ్రహించబడింది.

నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటంలో చిత్రించబడిన అద్భుతఘట్టం గొల్లరామవ్య కథ. పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజాశ్రేయస్సు కోసం విజృంభించిన ఒక సాహస విప్లవ కారుని ఓక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వఘటం, ఇందులోని ఇతివృత్తం. తెలంగాణా పోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్.

అదో తెలంగాణ పల్లె, గొల్ల రామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చుని ఉంది. ఆమె వడిలో పదిహేనేండ్ల బాలిక. ఆ గ్రామంలో అప్పుడు అయిన పెద్ద శబ్దాలకు గ్రామంలోకి వారితోపాటు వీరిద్దరి మొహాల్లో భయం తాలూకా ప్రకంపనలు కన్పిస్తున్నాయి.

“అవ్వా! గిప్పుడిచేం చప్పుడే! అని ఆ బాలిక ప్రశ్నించింది” “నీకెందుకే మొద్దముండా… అన్నీ నీకే కావాలె” అని నోరు మూయిచింది గొల్లరామవ్వ: హఠాత్తుగా కిటికీని ఎవరో తట్టినట్లుంది రజకార్లో, పోలీసులో అని భయపడింది గొల్లరామవ్వ. ఆమెకు మిన్ను విరిగి మీద పడ్డట్లయింది. అగంతకు డొకడు ఆ ఇంటి కిటికీ ద్వారా ఇంట్లోకి వచ్చాడు. సందేహం లేదు. రజాకార్లో, తురకోడో, పోలీసోడు అయి ఉండాడు. తనకు చావు తప్పదు. తను అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళి చేసిన తన మనవరాలికి మానభంగం తప్పదు అని తల్లడిల్లిపోయింది.

అంతలో ఆగంతకుడు నేను దొంగను కాను, రజాకారును కాను పోలీసునూ కాను నేను మీలానే ఒక తెలుగోడిని. ఇది రివల్వార్ మిమ్మల్ని చంపేవాళ్ళను చంపేందుకది. ఈ రాత్రి ఇద్దరు పోలీసుల్ని చంపాను. మొన్న మీ గ్రామంలో నలుగురు అమాయకులను చంపిన పోలీసు లే, లే, ‘నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీర్’ను నైజాం రాజుతోటి కాంగ్రెస్ పోరాడుతుంది.

తెల్లవారుతుండగా పోలీసులు గ్రామంలోకి ప్రతి ఇల్లును సోదాచేస్తున్నారు. గొల్ల రామవ్వ ఇంటికి కూడా వచ్చారు. ఆమె భయపడిపోయింది. కాంగ్రెస్ వాలంటీర్ అయిన ఆ యువకుని ఎలాగైనా రక్షించాలనుకుంది. తన మనవరాలిని గొంగళితో ఆయువకుని కప్పి ఉంచమన్నది. వారిద్దరిని ఒకే మంచంపై పడుకోమని ఆజ్ఞాపించింది. అతనికి గొల్లవేషం వేయించింది. ఇంటిలోపలికి ప్రవేశించిన పోలీసులతో ఆ పిల్లలిద్దరూ నా మనవరాలు ఆమె పెనిమిటి అని బొంకింది. పోలీసోడు గొల్ల రామవ్వను వాడు ఎవడన్నావ్. కాంగ్రెసోడా ఏం అని ప్రశ్నించిన రామవ్వ కంగారు పడలేదు.

పోలీసులు వెళ్ళిపోయారు. రామవ్వ మంచం మీద కూర్చొంది. ఒక వైపు యువకుడు, మరోవైపు ఆమె మనవరాలు వారిది అపూర్వ సమ్మేళనం అన్పించింది ఆ యువకునికి “అవ్వా! నీవు సామాన్యురాలివి కావు. ‘సాక్షాత్ భరతమాతవే’ అన్నాడు. ఇలా ఒక విప్లవ కారుని సామాన్య వృద్ధురాలు రక్షించిన కథే గొల్ల రామవ్వ కథ.

ప్రశ్న 4.
‘బిచ్చగాడు’ కథలోని రచయిత అభిప్రాయాలను పరిశీలించండి ?
జవాబు:
‘బిచ్చగాడు’ అను పాఠ్యభాగం ‘అంపశయ్య నవీన్’ చే రచించబడింది. నవీన్ రచించిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది. నవీన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసి పదవీరమణ పొందారు.

ప్రపంచంలో అనేక రకాల దోపిడీలు మోసాలు జరుగుతున్నాయి. అందులోను శ్రామికులు కార్మికుల జీవితాలలో జరిగే దోపిడీలు అత్యంత భయంకరమైనవి. మానవతా విలువలను దిగజార్చేచవని నవీన్ గారి అభిప్రాయం. రోజువారి కూలీపనులు చేస్తూ సంచార జీవన చేసేవారిలో దారిద్య్రం, దైన్యం కన్పిస్తుందని అటువంటి వారిని కూడా దోపిడీ చేసే మనస్తత్వం గలవారు మన సమాజంలో ఉన్నారని వారిలో మార్పురావాలన్నది నవీన్ భావన. రోజూ అడుక్కుంటూ పొట్టపోసుకునే వ్యక్తులు దోపిడీకి గురి అవటం శోచనీయం అంటారు నవీన్. ఇలాంటి వారు గౌరవనీయమైన వృత్తులలో ఉన్నవారి చేతుల్లోనే దోపిడీకి గురి అవుతున్నారు. అందుకు ఈ కథ ఒక ఉదాహరణం.

టికెట్ దొరకలేదని లబోదిబో మంటూ ఏడుస్తూ పరిగెత్తుకొచ్చి బిచ్చగాడిని చూసి ఒక పెద్దమనిషి ఇష్టమెచ్చినట్లు తిట్టడం రచయిత తప్పుపడతాడు. బిచ్చగాడు టికెట్ దొరకక తన వారినందరిని బండి దిగిపోండన్నప్పుడు ఆ పెద్ద మనిషి అన్న మాటలు ” అరె వోరి పిచ్చిగాడిద కొడకా, నీ బండెడు సామాను దించే వరకు బండి ఆగుతుందిరా! ఈ మాటలు మానవత్వానికి మచ్చ అని రచయిత అభిప్రాయం.

“పాపం వాళ్ళలా బిక్కచచ్చి యేడుస్తుంటే మీరు ఇలా నవ్వటం ఏమిటి? అని వాళ్ళందరిని రచయిత గద్దించాలనుకున్నాడు. నేనలా అంటే నన్ను పిచ్చివాడిలా భావిస్తారేమోనని రచయిత భయమేసి ఊరుకున్నాడు. టి.టి బిచ్చగాడిని గద్దించి డబ్బురాబట్టడానికి ప్రయత్నిస్తుంటే, రచయిత టీ.టీగారూ! అతడు చెప్తున్నది కొంచెం విన్పించుకోండి అని ఇంగ్లీషులో మాట్లాడేసరికి కొంచెం టి.టి. తగ్గాడు. ఇక్కడ సత్యానికి విలువలేదు. సభ్యతకు తావులేదు. డబ్బుకే విలువ అన్న అభిప్రాయాన్ని రచయిత తెలియచేస్తున్నారు. నిండుచూలాలుగా ఉన్న ఆ నిర్భాగ్యురాలిని చూసి ఆ కంపార్ట్మెంట్లో ఉన్నవారికి జాలి కలుగక పోగా ద్వేషపూరిత భావం కలగడం రచయితను బాధించింది. ఇలాంటి దృశ్యాన్నే సినిమాలో చూస్తే అందరూ కళ్ళంట నీళ్ళు కారుస్తారు. మనుషులలో ఈ భిన్న భావావేశాలకు కారణం ఏమిటి? అని రచయిత ఆలోచించాడు. ఎలాగైతేనేం ఆ బిచ్చగాడు. బిచ్చగత్తె లిద్దరి వద్దా డబ్బురాబట్టుకున్నాటు టి.టి. వాళ్ళచేతిలో ఒక రిసీట్ పెట్టాడు. రచయిత ప్రక్కనే ఉండటంతో ఆ రిసీట్ మీద 22 రూ॥ మాత్రమే రాసుంది అన్న విషయం తెలిసింది. 56 రూపాయలు దండుకున్న టి.టి మోసాన్ని అందరికీ చెప్తామనుకున్నాడు రచయిత. కాని ఇవన్నీ మామూలే అని పెదవి విప్పలేకపోయాడు రచయిత. దోపిడీ చేసేవారికి ఉచ్చనీచాలు లేవని రచయిత అభిప్రాయంగా మనకు అర్థమౌతుంది.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
మనలోమన చీలిక మృత్యుదేవకి నాలుక.
జవాబు:
పరిచయం :- ఈ వాక్యము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ దీర్ఘ కావ్య సంపుటి నుండి గ్రహించబడింది.
సందర్భము :- కవి మానవులలో ఐకమత్యము యొక్క ఆవశ్యకతను వివరించిన సందర్భం లోనిది.
భావము :- మనమంతా మానవులం. రంగు రూపు వేరైనా మానవజాతి ఒక్కటే. అందుకే మానవజాతి అంతా ఐకమత్యంతో మెలగాలి. లేని ఎడల, మానవుల మధ్య చీలికలు వచ్చిన ఎడల అది జాతి పతనావస్థకు దారి తీస్తుంది. మఋత్యువుకు దగ్గర చేస్తుందని ఇందలి భావం.

ప్రశ్న 2.
వట్టిచేతితో శత్రువుపై దుమికే శక్తి ఉంది.
జవాబు:
పరిచయము :- ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “నాపేరు ప్రజాకోటి” అని పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. “పునర్నవం” అన్న కవితాఖండికలోనిది.
సందర్భము :- కవి “అహింసా” శక్తిని గురించి వివరించే సందర్భములోనిది.
భావము : చిన్నపాటి అంకుశంతో గున్నఏనుగు బంధించే కొత్త శక్తిని కనుగొన్నాను. అలగే వట్టి చేతులతో ‘అహింస’నే ఆయుధంగా చేసుకుని శత్రువుపై దూకే శక్తిని తెలుసుకున్నాని ఇందలి భావం.

ప్రశ్న 3.
అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం నన్నయభట్టు చే రచింపబడిన శ్రీమదాంధ్ర మహా భారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.
భావం : జనులచేత ప్రశంసించబడే ఓ పరశురామా! ధనాలలో మిక్కిలి శ్రేష్ఠమైనవి. శస్త్రాస్త్రములు. కాబట్టి సంతోషంతో వాటిని తీసుకుని కృతార్థుడనవుతాను. శస్త్రాస్త్ర సమూహాన్ని నాకు ఇవ్వవలసింది అని ద్రోణుడన్నాడు.

ప్రశ్న 4.
నిన్ను భాజన చేసెడి వారికి పరమ సుఖము.
జవాబు:
పరిచయము :- శేషప్పకవిచే రచింపబడిన నృసింహ శతకం నుండి గ్రహించిన పద్యంలోనిది.
సందర్భము :- శరీరం, సంతానం, బంధుగణం, బలపరాక్రమాలు, సంపదలు శాశ్వతం కాదని నరసింహస్వామి భజన చేయటే శాంతకరణమని చెప్పిన సందర్భంలోనిది. భావము :- చేతులతో సదా దానం చేయుట, సదా సత్యమునే పలుకుట, గురుపాదార విందాలకు శిరస్సు దాల్చుట, భుజయుగమునకు జయమునిచ్చే పరాక్రమాన్ని, నిర్మలమైన మనస్సును, చెవులకు శాస్త్ర శ్రవణం – ఇవి సత్పురుషులకు ఐశ్వర్యము లేకపోయినను గొప్ప అలంకారములు.

VI. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
గురువు తత్వం వివరించండి ?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడింది. ‘దున్న విశ్వనాథం’ సంపాదనకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” అను గ్రంథం నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది.

ఈ లోకంలో గురువే బ్రహ్మం గురువే విష్ణువు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. మూలాధారం, స్వాధిష్టానం అనాహతం, మణిపూరకం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలు, వీటిలో చివరిది సహస్రారం, అది విచ్చుకునే శక్తిని ప్రసాదించేవాడు. గురువు. అపుడే మోక్షప్రాప్తి కలుగుతుంది. కనుక ఆ రహస్యాన్ని తెలుసుకుని మంచి గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా మోక్షాన్ని పొందమని ఇద్దాసు వివరిస్తున్నాడు.

ప్రశ్న 2.
శ్రీకృష్ణుడు, కుచేలుడిని ఏవిధంగా ఆదరించాడు ?
జవాబు:
శ్రీకృష్ణుడు మిక్కిలి ఆదరముతో ఎదురుగా వెళ్లి కుచేలుని ప్రేమతో కౌగిలించు కొనాడు.

బంధుత్వము, మిత్రత్వము వెల్లడియగునట్లుగా తీసుకొని వచ్చి, ప్రేమాదరములతో తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు. కుచేలుని తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు. ప్రేమతో బంగారు చెంబులోని నీటితో ఆయన పాదములు కడిగినాడు. ఆ కాళ్లు కడిగిన నీటిని భక్తితో తన శిరస్సు మీద చల్లుకొనినాడు. కస్తూరి పచ్చకర్పూరము కలిపిన మంచి గందమును కుచేలుని శరీరమునకు పూసెను. అగరుధూపము వేసి, అలసట పోవునట్లుగా మిత్రునకు విసనకర్రతో విసరెను. మణిమయ దీపాలతో హారతి పట్టెను.మంచి సువాసనలు గల పూలదండలు కుచేలుని జుట్టుముడిలో అలంకరించెను. కర్పూర తాంబూలము నొసంగెను. గోదానమిచ్చెను.

ఇట్లు కృష్ణుడు తనకు సాదరముగా స్వాగతము పలుకగా, కుచేలుని శరీరమున గగుర్పాటుతో వెంట్రుకలు నిక్కబొడుచుకొనెను. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పములు స్రవించెను. ఆ సమయమున సాక్షాత్తు శ్రీకృష్ణుని సతీమణియైన రుక్మిణీదేవి చేతుల గాజులు ఘల్లుఘల్లు మనుచుండగా వింజామరలు విసరెను అప్పుడు పుట్టిన చల్లని గాలులు మార్గాయాసముచేత పుట్టిన కుచేలుని శరీరము నందలి చెమట బిందువులను పోగొట్టెను. ఈ ఘట్టమును చూచి, అంతఃపుర కాంతామణులు ఆశ్చర్యపోయి, తమలో తామిట్లనుకొనసాగిరి.

ప్రశ్న 3.
సజ్జనుడి మాట తీరును తెలపండి ?
జవాబు:
మేఘుడు నీటి బిందువులనే వర్షించును. ఒకానొకప్పుడు చలువ కొరమే వడగండ్లను కురిపించినను, అవి వెంటనే చల్లని నీళ్ళగునుమారి రాళ్ళుగా ఉండవు. అదే విధంగా మంచివాడు మంచి మాటలనే పల్కును. ఒకానొక సమయమందున కఠోర వచన మును పలికినను మేలుగానే ఉంటుంది కీడుగా ఉండవు.

ప్రశ్న 4.
ఎవరెవరి మధ్య సఖ్యత కుదరదని ద్రుపదుడు చెప్పాడు ?
జవాబు:
ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు. సమానమైన స్వభావం, విద్య కలవాళ్ళకు, సమానమైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచి నడవికలవాళ్ళకు స్నేహం, వివాహం ఏర్పడతాయి. కాని సమానులు కానివాళ్ళకు అవి ఏర్పడతాయా? (ఏర్పడవని భావం)

VII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
‘రాజా బహద్దూర్’ హరిజనుల పట్ల దృష్టి తెలుపండి ?
జవాబు:
రాజాబహద్దూర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డి గారిచే రచించబడిన ‘రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి’ జీవిత చరిత్ర నుండి గ్రహింపబడింది. వీరు తన బలమును, ధనమును అధికారమును, ప్రజాభ్యుదయానికి వినియోగించారు. మంచి సంఘసంస్కరణాభిలాషి, అనాధలపై వీరికి ఎంతటి అనురాగమో హరిజనులపై కూడా అంతటి ప్రేమాదరణలను కలిగియున్నారు.

హిందూ దురాచారాలలో అగ్రస్థానం వహించిన అస్పృస్యతా నివారణను పెద్ద దోషము గా రామారెడ్డిగారు భావించారు. వారిని కూడా హిందూ సోదరులుగా భావించి వారికి సమానత్వాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. హరిజనులలో ఒక దుష్ట సంప్రదాయం ఉండేది. హరిజనులు తమ ఆడపిల్లలను ‘మురళీలుగా’ ‘బసివిరాండ్రుగా’ తయారు చేసేవారు. బాల్యంలోనే ఇలా తయారుచేయబడిన హరిజన బాలికలు వారి జీవితాంతం వ్యభిచారులుగా బ్రతుకవలసి వచ్చేది. సమాజంలోని అగ్రవర్ణాలవారు వీరితో వ్యభిచారం చేసేవారు. ఈ దుష్ట సంప్రదాయాన్ని రూపుమాపటానికి రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి గారు తీవ్రమైన కృషి చేశారు. ఈయన సర్వజన ప్రియులై అఖండకీర్తి ప్రతిష్టలందుకున్నారు.

TS Inter 1st Year Telugu Model Paper Set 3 with Solutions

ప్రశ్న 2.
బతుకమ్మ పాటలోని విశేషాలు ఏమిటి ?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అను గ్రంతం నుండి గ్రహించబడింది. బతుకమ్మ పండుగ ఆట పాటల మేలు కలయిక. స్త్రీల పాటలన్నీ ఒడిదుడుకులు లేక క్రమగతిలో ఒకే స్వరంలో సాగిపోతాయి. కంఠస్వరంనాళాలకు, గర్భాశయానికి హానికలుగని మధ్యమస్థాయిలో స్త్రీలు పాటలు పాడుతుంటారు. సహజ సంగీతంతో సాగిపోయే బతుకమ్మ పాటలను సంగీత శాస్త్ర నియమాలు, లక్షణాలతో పనిలేదు. వీరి పాట నాట్యాన్ని అనుసరించి ఉంటుంది. బతుకమ్మ ఆటకు అనుగుణంగా ఉంటాయి. వీరి పాటలు పౌరాణిక గీతాలుగా, నీతి బోధకాలుగా, కథాగేయాలుగా ఉంటాయి. వారి పాటలలో ఉయ్యాలో, వలలో, చందమామ అన్న పల్లవులు ఆవృతాలవుతుంటాయి. సూర్యాస్త సమయంలో బతుకమ్మ పాటలు పాడతారు కాబట్టి “చందమామ” అని, గౌరమ్మను నీటిలో ఓలలాడిస్తారు కావున “వలలో” అని ‘ఊయలవలె’ ఊగుతూ పాడతారు కావున “ఉయ్యాలో” అన్న పదాలుంటాయి.
బతుకమ్మకు వీడ్కోలు చెప్తున్న ఈ పాటలో
“నిద్రపో గౌరమ్మ నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు…..”

ఈ పాటలో జగజ్జపనికి జనని జానపదయువతి. స్త్రీది మాతృ హృదయం. చిన్నారి పాపను జో కొడుతూ పాడే పాటలను బతుకమ్మ పాటగా పాడుతుంది. బతుకమ్మ పాటలలో స్త్రీల మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.
ఉదాహరణకు.
“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో – గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో – వచ్చేరిసతిగూడి ఉయ్యాలో”
పనులలో అలుపు సొలుపు తెలియకుండా పాడే ఈ పాటలు పరమాత్మ స్వరూపాలు.

ప్రశ్న 3.
రంతిదేవుని ద్వారా వ్యాసుడు పలికించిన ధర్మం ఏమిటి ?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతా వాదం అన్న ‘పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అను వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది.

మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించే అంశాలు కోకొల్లలు. వేదముల నుండి పురాణాల వరకు అన్నింటిలోనూ ఈ ప్రస్తావన ఉంది. మహాభారతంలో దధీచి, శిబి, రంతిదేవుని పాత్రల ద్వారా ఈ విషయాన్ని వ్యాసుల వారు వివరించారు. మానవతావాది, త్యాగశీలి, దయాశీలి రంతిదేవుని మాటల్లో
“సత్వహం కామయే రాజ్యం”……

అన్న శ్లోకం ద్వారా “నాకు రాజ్యము వద్దు, నాకు స్వర్గమూ వద్దు, నాకు మోక్షము వద్దు దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తి తొలగి పోవటమేకావాలి” అని చెప్పబడింది. భాగవతంలో కూడా “న కామయే హం …హం గతి మీశ్వరాత్….” అన్న శ్లోకంలో కూడా దుఃఖపీడితుల హృదయాల్లో తానుడంటూ వాళ్ళ బాధలను తాను అనుభవించైనా వారి దుఃఖాలను పోగొట్టాలి అని రంతిదేవుడు చెప్పిన మాటలు నిజంగా మానవతకు సంబంధించినది.

ప్రశ్న 4.
కావ్య భాషను గురించి సోమన అభిప్రాయాలు తెలపండి ?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణశర్మచే రచించబడిన చైతన్యలహరి అను వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. దీనిలో సోమనాథునకు కావ్యభాష పట్ల ఉన్న అభిప్రాయాన్ని వివరించాడు.

గుడ్డెద్దు చేలో పడినట్లు కాకుండా కావ్య భాష, భాష, భావము, రూపాలలో నూతనత్వాన్ని పొందాలన్నాడు. ఎక్కడా కావ్యభాషకు మర్యాదగౌరవాలు తక్కువ కాకూడదన్నాడు. కావ్యభాషను గురించి వివరిస్తూ
“ఉరుతర గద్య పద్యోక్తుల కంటె
సరసమై బదిగిన జాను తెనుంగు…..”

అని చెప్తూ కావ్యభాష లోక వ్యవహారంలో సర్వజనులకు అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు. నిఘంటువులలోని మారుమూల పదాలుకాక, మారుమూలల్లోని అచ్చతెలుగు పదాలు కాక నిత్య వ్యవహారంలో సుపరిచితమైన పదాలతో కావ్య భాష ఉండాలన్నారు. వర్ణనలు, సహజ సుందరంగా ఉండాలన్నాడు. సోమనాథుడు శైవమత ప్రచారానికే సాహిత్య సృష్టి చేసినప్పటికీ కావ్యభాషకు ఎక్కడా లోపాన్ని రానీయలేదు.

VIII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు / రచయితలు)

ప్రశ్న 1.
నన్నయభట్టు గురించి తెలపండి ?
జవాబు:
నన్నయ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి. ఉభయభాషా కావ్యరచనా శోభితుడు. ఆదికవి, శబ్ధశాసనుడు అనే బిరుదులు కలిగినవాడు. రాజరాజు కోరికపై వ్యాస భారతాన్ని తెలుగులోకి అనువదించాడు. రెండున్నర పర్వముల వరకే నన్నయ్య భారతరచన సాగింది. ఆంధ్రశబ్ద చింతామణి, ఇంద్రవిజయం, లక్షణసార వంటి ఇతర గ్రంథాలు రచించాడు.

ప్రశ్న 2.
పోతన గురించి తెలుపండి.
జవాబు:
భక్తకవిగా ప్రసిద్ధి చెందిన బమ్మెర పోతన 15వ శతాబ్దపు కవి. కేసన, లక్కమాంబ తల్లిదండ్రులు. వ్యాస భాగవతాన్ని రసరమ్యంగా తెలుగువారికి అందించాడు. పోతనకు సహజపండితుడు అనే బిరుదు ఉంది. పోతన వీరభద్ర విజయం, భోగినీ దండకం కూడా రచించాడు.

ప్రశ్న 3.
గడియారం రామకృష్ణశర్మ సాహిత్యసేవను తెలుపండి ?
జవాబు:
గడియారం రామకృష్ణ శర్మ సుబ్బమ్మ జ్వాలాపతి దంపతులకు మార్చి 6. 1919న అనంతపురం జిల్లాలో జన్మించాడు. ఆయన జీవితమంతా మహబూబ్ నగర్ జిల్లా అలంపురంలోనే గడిచింది. ఈయన తిరుపతి వేంకటకవులు శిష్యుడైన వేలూరి శివరామశాస్త్రి వద్ద విద్యలనభ్యసించాడు. సంస్కృతం, తెలుగు, కన్నడ, ఆంగ్ల సాహిత్యాలలో పండితుడయ్యాడు. కవిగా, పండితునిగా, కావ్య పరిష్కర్తగా, శాసన పరిశోధకునిగా, చరిత్రకారునిగా, సంఘసంస్కర్తగా, ఉద్యమకర్తగా క్రియాశీలక పాత్రను
పోషించాడు.

నిజాం రాష్ట్రంలో తెలుగు భాషను చిన్నచూపు చూడటం సహించలేక ఆంధ్రమహాసభల ఏర్పాటుకు కృషి చేశారు. తెలంగాణమంతా పర్యటించి ‘భాగ్యనగర్ రేడియో, ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. బాలవితంతువును వివాహమాడటంతోపాటు వితంతు వివాహాలు జరిపించాడు. ‘సుజాత’ పత్రికను ప్రారంభించారు. మెకంజీ కైఫీయత్తులను వ్రాయించారు. ‘తెలంగాణ శాసనాలు’ రెండవ సంపుటిని తీసుకువచ్చారు. కన్నడ సాహిత్య చరిత్రను రాశారు. కన్నడ కవి రన్నడు రాసిన ‘గదాయుద్ధాన్ని’ తెలుగునకు అనువదించినాడు. అలంపురం చరిత్ర, విద్యారణ్యుల చరిత్రలను రాశాడు. వీరి ఆత్మకథ ‘శతపత్రం’ 2006లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డునందుకుంది.

ప్రశ్న 4.
రావిప్రేమలత రచనలను తెలుపండి ?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం రావిప్రేమలతచే రచించబడిన, జానపదవిజ్ఞానం పరిశీలనం అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.

రావిప్రేమలత సిద్ధాంత వ్యాసం తెలుగు జానపదసాహిత్యం – పురాగాథలు తొలిరచన. జానపద విజ్ఞానంలో స్త్రీ ప్రేమలత వ్యాససంపుటి. తెలుగు స్త్రీల ముగ్గులపై పరిశోధన చేసి ‘తెలుగు స్త్రీల చిత్రలిపి’ అనే వైవిధ్య భరితమైన గ్రంథాన్ని రాశారు. ఇది బిరుదురాజు రామరాజు జానపదవిజ్ఞాన బహుమతిని, తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని అందుకున్నది. ఈమె రాసిన ‘వ్యాసలతిక’ తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ విమర్శ గ్రంథంగా బహుమతినందుకున్నది. డా. కురుగంటి శ్రీలక్ష్మితో కలిసి ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న వ్యాస సంపుటిని వెలువరించారు. Folk Tales of South India Andhra Pradesh అన్న కథా సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఈమె రచనలన్నీ జానపద సాహిత్యంతోనే ముడిపడి ఉండటం ముదావహం.

IX. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి.
(పద్యభాగం నుండి)

ప్రశ్న 1.
పరశురాముడు తన ధనాన్ని ఎవరికి ఇచ్చాడు ?
జవాబు:
విప్రులకు దానం చేసాడు.

ప్రశ్న 2.
పువ్వులు పరిమళాన్ని ఎప్పుడు వ్యాపింపచేస్తాయి ?
జవాబు:
తోటమాలి బలిదానం చేసినపుడు

ప్రశ్న 3.
దుర్జనులు ఎలాంటి ఆలోచనలను చేస్తారు ?
జవాబు:
చెడ్డ ఆలోచనలు

ప్రశ్న 4.
ద్రోణాచార్యుడికి ఎవరెవరు అస్త్రశస్త్రాలు ప్రసాదించారు ?
జవాబు:
అగ్నివేశుడు, పరశురాముడు

ప్రశ్న 5.
నృసింహ శతక కర్త ఎవరు ?
జవాబు:
శేషప్పకవి

ప్రశ్న 6.
దాశరథి ప్రసిద్ధ నినాదమేది ?
జవాబు:
“నా తెలంగాణ కోటి రతనాల వీణ” అన్నది దాశరథి ప్రసిద్ధనినాదం.

ప్రశ్న 7.
సాహసంతో గురుని చేరాక లభించేది ఏది ?
జవాబు:
సోహము లభిస్తుంది.

ప్రశ్న 8.
శ్రీకృష్ణ – కుచేలులు ఎవరి వద్ద విద్యాభ్యాసం చేసారు ?
జవాబు:
సాందీపని

X. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి.
(గద్యభాగం నుండి)

ప్రశ్న 1.
పప్పుధాన్యాలను పొడిచేసి పెట్టే నైవేద్యాన్ని ఏమంటారు ?
జవాబు:
‘సద్దులు’ అంటారు.

ప్రశ్న 2.
సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యమేది ?
జవాబు:
సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యం వాల్మీకి రచించిన ‘రామాయణం’.

ప్రశ్న 3.
‘పాల్కురికి సోమనాథుడు’ పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
గడియారం రామకృష్ణ శర్మ

ప్రశ్న 4.
సోమన తల్లిదండ్రులెవరు ?
జవాబు:
తల్లి శ్రియాదేవి, తండ్రి విష్ణురామిదేవుడు.

ప్రశ్న 5.
ఏ గ్రంథానికి సామల సదాశివకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ?
జవాబు:
స్వరలయలు అనే గ్రంథానికి

ప్రశ్న 6.
బొంబాయిలో మహిళా విద్యాపీఠాన్ని ఎవరు స్థాపించారు ?
జవాబు:
బొంబాయిలో మహిళా విద్యాపీఠాన్ని స్థాపించిన వారు ‘కార్వే’ మహాశయుడు.

ప్రశ్న 7.
వేముల పెరుమాళ్ళు ప్రసంగాల సంకలనం పేరేమిటి ?
జవాబు:
మానవతా పరిమళాలు

ప్రశ్న 8.
చరక సంహితలో చరకాచార్యుడు ఏమని శాసించాడు ?
జవాబు:
మానవుడు నిత్యమూ సమస్త ప్రాణుల కళ్యాణాన్ని కోరుకోవాలని శాసించాడు.

XI. ఈ కింది వానిలో ఒకదానికి సమాధానం రాయండి. (1 × 5 = 5)

ప్రశ్న 1.
బదిలీ పత్రము (టి.సి) కొరకు కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ వ్రాయండి.
జవాబు:

కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ

కరీంనగర్,
15-06-2023.

గౌరవనీయులైన ప్రధానాచార్యులు గారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
కరీంనగర్. నమస్కారాలు.

విషయము : టి.సి. (బదిలీ పత్రము) ఇప్పించుటకు విజ్ఞప్తి.

నేను మీ కళాశాలలో యం.పి.సి. గ్రూపు ద్వారా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసాను. ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ప్రస్తుతం నేను పై తరగతులు చదువుటకై డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ”దోస్త్’ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసాను. ‘దోస్త్’ వెబ్ సైట్ వారు విడుదల చేసిన మొదటి జాబితాయందు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి అనుమతి లభించినది. ప్రవేశం పొందుటకు గాను నాకు బదిలీ పత్రము అవసరం ఉంది. కావున, నాకు బదిలీ పత్రము విజ్ఞప్తి.

కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ విద్యార్థి
XXXX

TS Inter 1st Year Telugu Model Paper Set 3 with Solutions

ప్రశ్న 2.
ఇటీవల మీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరం గురించి వివరిస్తూ స్నేహితునికి లేఖ వ్రాయండి.
జవాబు:

స్నేహితులకు లేఖ

మెదక్
09-08-2023.

ప్రియమైన సౌమ్యకి,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు ఎలా ఉన్నావు? నేను బాగా చదువుతున్నాను. నీవు ఎలా చదువుతున్నావో ఉత్తరం ద్వారా తెలియజేయగలవు.

ఇటీవల మా కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ (N.S.S) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రమాదాలు జరిగినపుడు గాని, శస్త్రచికిత్సలు చేసినపుడు గాని మనిషి ప్రాణాన్ని కాపాడడానికి కొన్నిసార్లు రక్తం అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేసి సాటివారి ప్రాణాలు కాపాడాలని తెలియజేసారు. ఈ మాటలు విన్న వింటనే నేను రక్తదానం చేశాను. నీవు కూడా రక్తదానం చేస్తావని భావిస్తున్నాను.

మన స్నేహితులు సమత, సంధ్య, ప్రవళిక ఎలా ఉన్నారు ? వారిని అడిగానని చెప్పు. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు తెలియజేయగలవు. వచ్చే దసరా సెలవులలో మనం కలుసుకుందాం. నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

ఇట్లు
నీ ప్రియమైన
స్నేహితురాలు
XXXXX

చిరునామా
ఎ. సౌమ్య
ఇంటి నంబర్ 21-12/68,
సుచిత్ర, సికింద్రాబాద్,
పిన్. నం – 500067.

XII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1. అదెట్లు
జవాబు:
అదెట్లు = అది + ఎట్లు = ఇకారసంధి.
సూత్రము : ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పకముగాను.

2. చేతులెత్తి
జవాబు:
చేతులెత్తి
చేతులు + ఎత్తి = చేతెలెత్తి – ఉకారసంధి/ఉత్వసంధి
సూత్రము : ఉత్తన కచ్చు పరంబగునపుడు సంధియగు.

3. ఆగమైపోతారయా
జవాబు:
ఆగమైపోతారయా – ఆగము + అయిపోతారు + అయా – ఉత్వసంధి/ఉకారసంధి
సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు

4. పదాబ్జాతంబు
జవాబు:
పదాబ్జాతంబు : పద + అఙ్ఞాతంబు = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

5. సంగమమైనా
జవాబు:
సంగమమైనా – సంగమము + ఐన – సంగమమైనా – ఉకార సంధి/ఉత్వసంధి
సూత్రము : ఉత్తనకచ్చు పరంబగునపుడు సంధియగు

6. రెండంచులు
జవాబు:
రెండంచుల : రెండు + అంచులు = రెండంచులు – ఉకారసంథి/ఉత్వసంథి
సూత్రము : ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు.

7. దారిద్ర్యాంధకార
జవాబు:
దారిద్ర్యాంధకార : దారిద్య్ర్య + అంధకార = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

8. భాగ్యంబెంత
జవాబు:
భాగ్యంబెంత
భాగ్యంబు + ఎంత = ఉకారసంధి
సూత్రము : ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగును.

XIII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 8)

1. ఆహ్లాదగీతిక
జవాబు:
ఆహ్లాదగీతిక : ఆహ్లాదమైన గీతిక – విశేషణపూర్వపద కర్మధారయ సమాసం

2. ఆలు పిల్లలు
జవాబు:
ఆలు పిల్లలు : ఆలియును పిల్లలును – ద్వంద్వసమాసం

3. తల్లిదండ్రులు
జవాబు:
తల్లిదండ్రులు : తల్లి మరియు తండ్రి – ద్వంద్వ సమాసం

4. తపోవృత్తి
జవాబు:
తపోవృత్తి : తపస్సు అనెడి వృత్తి – రూపక సమాసం

5. ద్వారకానగరంబు
జవాబు:
ద్వారకానగరంబు : ద్వారక అను పేరుగల నగరము – సంభావన పూర్వపద కర్మధారయ సమాసము

6. కంఠమాల
జవాబు:
కంఠమాల : కంఠమునందలి మాల – సప్తమీ తత్పురుష సమాసం

7. పుత్రలాభం
జవాబు:
పుత్రలాభం : పుత్రుని వలన లాభం – పంచమీ తత్పురుష సమాసం

8. నరజాతి
జవాబు:
నరజాతి : నరుల యొక్క జాతి – షష్ఠీతత్పురుష సమాసం

XIV. ఈ క్రింది అంశాలలో ఒకదానిని గురించి వ్యాసం రాయండి. (1 × 5 = 5)

1. యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం
జవాబు:
యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం

శ్రీకృష్ణుడు ఒకప్పుడు తన నోట్లో విశ్వరూప సందర్శనం చేయిస్తే ఇప్పుడు నట్టింట్లో ‘నెట్’ తిష్ఠ వేసుక్కూచున్నది. ‘ఇంటర్ నెట్ ఇవాళ మనుషుల పనిలో భారాన్ని తగ్గించి మనసుల మధ్య దూరాన్ని పెంచుతున్నది. ఒకప్పుడు ‘లేఖ’లు, టెలిగ్రామ్ లు, టెలిఫోన్లు మనుషుల మధ్య ఇంత సమాచార వేగాన్ని పెంచకపోయినా ఒత్తిడి లేని జీవనం ఉండేది. ఇప్పుడు ‘సెల్ ఫోన్’ శరీరభాగాల్లో ఒకటిగా మారిపోగా, టీవీ ఇంట్లోని వస్తువుల్లో ఒకటిగా మారింది. ఫోను సంభాషణలు, వీడియోకాల్స్ మనిషికి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు ఆత్మీయతానుబంధాలను మాయం చేశాయి.

వేగవంతమైన ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలు ఆత్మీయత, అనుబంధాలను పెంచుతున్నాయో, తుంచుతున్నాయో అర్థం కానంత సంఘర్షణలో సమాజం జీవిస్తున్నది. మనలాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఆధునిక సమాచార వ్యవస్థ వల్ల లాభనష్టాలు రెండూ కలగలిసి ఉన్నాయి. పూర్వం ప్రతివారూ బాల్యంలో రెండు అగ్గిపెట్టెల్లోని బాక్స్ లకు దారం కట్టి ఒకరు చెవికి పెట్టుకొంటే ఇంకొకరు మాట్లాడేవారు.

ఇదే పెద్ద ఆనందం..! మరిప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి మాధ్యమాలు, అనేక ‘యాప్స్’ అపరిమిత జ్ఞానంతో పాటు అనవసర విషయాలకు ప్రాధాన్యం ఎక్కువగా. ఇస్తున్నాయి. ‘అరచేతిలో వైకుంఠం’ ‘లాగా ఇప్పుడు అన్నీ మనచేతి ఫోన్ లో తెలుసుకొనే సౌకర్యం కలిగింది. ‘అన్నీ’ ఉన్నప్పుడు అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.

1857లో స్కాట్లాండ్ దేశానికి చెందిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనే శాస్త్రవేత్త ఫోన్ ను కనుగొని 1892లో ప్రథమంగా న్యూయార్క్ నుండి షికాగో మాట్లాడాడు. దాని అంచెలంచెల పరిణామాల అవతారాలు ఈ రోజు మన చేతిలో విన్యాసం చేస్తున్న కర్ణపిశాచి అవతారం వరకు రూపాంతరం చెందింది.

1973లో మార్టిన్ కూపర్ అనే అమెరికా దేశస్తుడు ‘మొబైల్ ఫోను’ అందుబాటులోకి తెచ్చారు. అలాగే 1857లో చార్లెస్ బాబేజ్ కంప్యూటరకు రూపకల్పన చేయగా 1936లో దానికి ఓ సాంకేతిక రూపం వచ్చింది. పర్సనల్ కంప్యూటర్ను 1977లో రూపొందిస్తే 1983లో ఐ.బి.ఎం. అనే సంస్థ అందరికి అందుబాటులోకి వచ్చేట్లు చేసింది.

ఇది మనదేశంలోకి ఇంకో రూపంలో ప్రవేశించేసరికి మరో ఇరవై ఏళ్లు పట్టింది. పాటలు వినడం, అలారం, సమాచారం, సమయం మాత్రమే తెలుసుకొనే అవకాశం ఉన్న ఈ మొబైల్ ఫోన్లు 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టగానే అనేక కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇరవై ఏళ్లలో మొబైల్ ఫోను నేటి నిత్యావసర సరుకుగా మారిపోయింది.

ఈ ఫోన్లకు ఇప్పుడు ఇంటర్నెట్ తోడవడంతో ప్రపంచం ఫోన్లోకి వచ్చి కూర్చొంది. సినిమాలు, డిక్షనరీలు, ఆటలు, లైవ్ ప్రోగ్రాంలు, టైపింగ్, విజ్ఞానం, సౌందర్యం వంటి మార్పులు, మత విజ్ఞానం, భాషలు, సైన్సు, విస్తృత సమాచారం, లలితకళలు, యోగవిజ్ఞానం, 24 గంటలు వార్తలు, ఇలా సమస్త ప్రపంచం ఇందులోకి చేరి ‘ఇందులో లేనిది ప్రపంచంలో లేదు. ప్రపంచంలో లేనిది ఇందులో లేదు’ అన్న స్థితికి చేరాం.

ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అవసరమైన అనవసరమైన సమాచారం ఒకచోట కలగాపులగంగా ఉండడం వలన సమాజంలో దుష్ప్రభావాలకు దారి సులభంగా ఏర్పడింది. ప్రతాపరుద్రుడు, స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి స్ఫూర్తిమూర్తుల చరిత్రలుకూడా నెట్లో దొరుకుతున్నాయి.

మనుషులు ఎప్పుడైనా చెడువైపు త్వరగా ఆకర్షితులవుతారు. సమాచారం ఉప్పెనలా మనమీద పడిన తర్వాత మనుషులు సెల్ ఫోన్ లోని సోషల్ మీడియా అనే అష్టదిగ్బంధనంలో చిక్కుకపోయారు. తనతోపాటు తన చుట్టుప్రక్కల వ్యక్తులతో, ప్రకృతితో సంబంధం కోల్పోయారు. ఇటీవల కాలంలో మనం రైలు, బస్సు ఎక్కి కూర్చొంటే ప్రక్కనున్న సీట్లోని మనిషి ఎక్కడికి వెళ్తున్నారని వారి యోగక్షేమాలను పూర్వంలా ఎవరూ అడగడం లేదు.

ఎవరి ఫోన్లో వారు తలదూర్చే దృశ్యం చూస్తున్నాం. మానవసంబంధాల యాంత్రికతకు ఇదో నిదర్శనం. అలాగే కొందరు ఇళ్లలో అస్తమానం కంప్యూటర్ లోనో, ఫోన్లోనో తలపెట్టి పక్కకు చూడడం లేదు. సుదీర్ఘంగా ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల మెడ, వెన్ను నొప్పి వంటి దేహబాధలు తప్పడం లేదు.

అలాగే కదలకుండా కూర్చొని ఊబకాయం, చక్కెర వ్యాధి వంటి వ్యాధులు కొని తెచ్చుకొంటున్నారు. మైదానాల్లో ఆడాల్సిన కబడ్డీ, క్రికెట్ వంటి ఆటలు ఫోన్లోనే ఆడడం వల్ల శారీరక వ్యాయామం జరగడం లేదు. కాలాన్ని ఎక్కువగా వాటిలోనే దుర్వినియోగం చేస్తున్నారు.

తోటివారితోనే కాకుండా తనకుతానే సంబంధం కోల్పోతున్నాడు. తననుతానే వదిలి పెట్టినవాడు సమాజంతో ఎలా సంబంధం నెరపగలడు! అందుకే ఇటీవల ‘వర్చువల్ మీటింగ్స్’ తో పెళ్లిళ్లు, ఆఖరుకు అంత్యక్రియలు కూడా ఇంటర్నెట్లో చూసే దుస్థితికి దిగజారాయి. అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తో, అప్లోడ్ డౌన్లోడ్ లతో జీవితం దుర్భరం చేసుకొంటు న్నారు. అనవసరమైన ‘చెత్త సమాచారం’ ఫార్వార్డ్ చేస్తూ అనవసర భారం ఇతరుల తలల్లోకి చొప్పిస్తున్నారు.

కొన్నిసార్లు విశ్వసనీయత లేని సమాచారం ఫార్వార్డ్ చేసి సామాజిక అశాంతికి కారణం అవుతున్నారు. అసత్యాలతో కథనాలు, వీడియోలు రూపొందించి సంచలనం చేసే సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు ఎక్కువైపోయి సోషల్ మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్నది. అసత్య కథనాలతో సంచలనాలతో డబ్బు సంపాదించే వ్యక్తులు సోషల్ మీడియాలో ఉండటం వల్ల భావోద్వేగాలకు సంబంధించిన కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొట్టే సమాచారం ఇతరులకు పంపించి వాళ్లలో లేనిపోని ఉద్రిక్తతలు కలిగిస్తున్నారు.

ఒకప్పుడు గొప్ప అవధానంతో ఎన్నో శ్లోకాలు, పద్యాలు మనవాళ్లు ధారణ చేసేవారు. పల్లెటూళ్లలో జానపదులు సైతం ఎన్నో సామెతలు, జానపద గీతాలు, కథలు నోటికి చెప్పేంత ధారణ ఉండేది. విద్యార్థులు ఎక్కాలు’ శతక పద్యాలు వల్లెవేసి ఎక్కడ అవసరం వస్తే అక్కడ ధారాళంగా చదివేవారు.

ఇపుడు ప్రతీది ‘ఇంటర్నెట్ సమాచారం తప్ప ‘స్వీయశక్తి’తో జ్ఞాపకాన్ని జ్ఞానంగా మార్చుకోవడం లేదు. తమ తమ స్వీయ జ్ఞానాన్ని’ వీడియోలుగా మార్చి సమాజానికి అందిస్తున్నారు. ఇందులో గుణదోషాలు రెండూ ఉన్నాయి. అలాగే అశ్లీల వెబ్ సైట్లు సమాజంలో అత్యాచారాలకు ప్రధాన కారణం అవుతున్నాయి.

ఆటల్లో గడపాల్సిన యువత ఎక్కువగా ఫోన్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి, అనవసర మానసికఒత్తిడి పెరిగి మెదడు మొద్దుబారే స్థితి వచ్చింది. చదువుకోసం విస్తృత సమాచారం ఇవాళ నెట్టింట్లో దొరుకుతుంది. అంతవరకు యువత స్వీకరిస్తే వారి జీవితం పూలబాటగా మారుతుంది.

బియ్యంలోని రాళ్లు తొలగించుకొన్నట్లు అనవసర సమాచారం తొలగించి సదసద్వివేకంతో ఈ మాధ్యమాలను తమ జ్ఞానానికి అనుకూలంగా మార్చుకోవడమే నేటి యువతరానికి ఉండవలసిన వివేకం. అదేవిధంగా ‘పిచ్చోడిచేతి’లో రాయిగా మారిన ‘సామాజిక మాధ్యమాలు’ ఇపుడు కొందరికి వ్యాపారవనరుగా మారడం మరో కోణం. యువతరం మాదకద్రవ్యాల మత్తులో పడకుండా ఎంత జాగ్రత్తగా మెలగాలో అలాగే ఈ మాధ్యమాల వలలో పడకుండా చైతన్యంతో ఉత్తమ భవిష్యత్తుకోసం ఆదర్శమార్గంలో నడవాలి.

TS Inter 1st Year Telugu Model Paper Set 3 with Solutions

2. జాతీయ విపత్తులు
జవాబు:
జాతీయ విపత్తులు

అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.

విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది.

విపత్తు లక్షణాలు

  • ఆకస్మికంగా సంభవించడం
  • అతివేగంగా విస్తరించడం
  • ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం

ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.

సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి.

  1. సహజమైనవి
  2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.

భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.

ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ. వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.

భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే – భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని. అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం.

విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు

  • ఉపశమన చర్యలు
  • సహాయక చర్యలు
  • పునరావాసం.

విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం కలదు.

అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు. విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి.

విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.

విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. దీనికి ఉదాహరణ కోవిడ్-19 వ్యాధి.

దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.

విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి. విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.

3. యువత – జీవన నైపుణ్యాలు
జవాబు:
యువత – జీవన నైపుణ్యాలు

ఒకదేశ అభివృద్ధి ఆ దేశ యువత శక్తిసామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతీయువకులే కీలక పాత్ర పోషిస్తారు. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే చీకటి మాసిపోతుందని, లోకం మారిపోతుందని కవులు ఉపదేశించారు. ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన పదిమంది యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మించ వచ్చునని స్వామి వివేకానంద గొప్పభరోసాను అందించాడు.

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువతీయువకులు కలిగిన దేశం భారతదేశం. ఉత్తుంగ తరంగాలతో పొటెత్తే నదికి ఆనకట్ట కట్టి, ఆ నదీజలాలతో బంగారు పంటలు పండించినట్లు, నెత్తురుమండే శక్తులు నిండే యువతీయువకులను సమర్థ మానవవనరులుగా తీర్చిదిద్ది ప్రగతి సిరులను పండించవచ్చు.

యువతీయువకులు సునిశితమైన జీవన నైపుణ్యాలను సమకూర్చుకుంటే దేశ భావినిర్ణేతలుగా రాణిస్తారు. “We cannot always build the future for our youth, but we can build our youth for the future” అని ఫ్రాంక్ లిన్ డి. రూజ్ వెల్ట్ అన్నట్లుగా సమున్నతమైన భవితకోసం సమర్థవంతమైన యువతరం రూపొందాలి.

జ్ఞానసముపార్జనతోపాటు ఆ జ్ఞానసంపదను సద్వినియోగ పరుచుకోవటానికి జీవన నైపుణ్యాలను పెంపొందింపజేసుకోవాలి. విద్యార్థులు, యువకులు పోటీ ప్రపంచంలో విజేతలుగా ఎదగడానికి, ఉత్తమ పౌరులుగా, నవ సమాజనిర్మాతలుగా రూపొందటానికి తగిన జీవన నైపుణ్యాలను విధిగా అలవర్చుకోవాలి.

పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటమే ప్రధానం కాదు, అవరోధాలను అధిగమించి, ఉపద్రవాలను సాహసోపేతంగా ఎదుర్కొని జీవితాన్ని గెలిచే నైపుణ్యాలను కూడా నేటి యువత సొంతం చేసుకోవాలి. జీవన నైపుణ్యాల తీరుతెన్నుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చర్చించారు. బాల్యం నుండి విద్యార్థులు సమకూర్చుకోవలసిన కింది జీవన నైపుణ్యాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యంగా ప్రస్తావించింది.

1. స్వీయ అవగాహన (Self Awareness): ప్రతి మనిషికి తనపైన తనకు అవగాహన ఉండాలి. తన సామర్థ్యంపట్ల సరైన అంచనా ఉండాలి. ‘స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్య అన్నాడు దాశరథి. తనను తాను తెలుసుకోవడమే అసలైన విద్య. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, ఉన్నత గుణాలను సమకూర్చు కుంటూ యువత ముందడుగు వేయాలి. తమ బలాలను, బలహీనతలను సహేతుకంగా సమీక్షించుకొని, అందుకనుగుణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ లక్ష్యసాధనకు అకుంఠిత దీక్షతో యువత కృషిచేయాలి.

2. సహానుభూతి (Empathy): పరస్పరం సహాయమర్థిస్తూ జీవించే మానవుల సమూహమే సమాజం. కావున, సాటి మనిషి కష్టసుఖాల పట్ల సహానుభూతి ఉండాలి. ఇతరుల సమస్యలకు తక్షణం స్పందించగలిగే మానవీయస్పృహను యువత అందిపుచ్చు కోవాలి. తద్వారా మానవ సంబంధాలు బలోపేతమవుతాయి.

3. భావవ్యక్తీకరణ నైపుణ్యం (Communication skill): మాటే మనిషికి శాశ్వత ఆభరణం. మంచిమాట తీరువల్ల మహాకార్యాలను కూడా చక్కబెట్టుకోవచ్చు. సమయస్ఫూర్తితో కూడిన, నైపుణ్యవంతమైన భావవ్యక్తీకరణ మనకు అనేక విధాలుగా మేలుచేస్తుంది. విద్యావిషయక స్ఫూర్తిని ఇనుమడింపజేసుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందటానికి, వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, రోజువారి వ్యవహారాలను త్వరితగతిని సాధించు కొనటానికి భావవ్యక్తీకరణ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ఉద్వేగరహితంగా, ప్రభావశీలంగా, ప్రియంగా, హితంగా, సత్యసమ్మతంగా, అంగీకారయోగ్యంగా మాట్లాడే సామర్థ్యాలను యువత సంపాదించుకోవాలి.

4. భావోద్వేగాల నియంత్రణ (Management of emotions): యువతీయువకుల హృదయాల్లో ఎన్నోరకాల భావోద్వేగాలు అనునిత్యం సుడులు తిరుగుతుంటాయి. ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆగ్రహావేశాలను సంయమనంతో నియంత్రిం చు కోవాలి. సమయ, సందర్భాలను అనుసరించి ఓపికతో వ్యవహరించాలి. యువత భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోతే అనేక అనర్థాలు సంభవిస్తాయి.

5. సమస్యనధిగమించే నైపుణ్యం (Problem solving skill): సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, సానుకూల దృష్టితో సావధానంగా ఆలోచించి తగిన పరిష్కారాన్ని కనుగొనాలి. నిరాశ చెందకూడదు. చిన్నసమస్యను అతి పెద్దగా ఊహించుకొని ఒత్తిడికి గురి కాకూడదు. ప్రతికూల ఆలోచనతో సమస్యనుండి పారిపోకూడదు. మనచుట్టూ ఉన్నదారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏమాత్రం భయపడకూడదు. ఇక లాభం లేదని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడకూడదు.

ఎక్కడో మరొకదారి మన కోసం తెరిచేవుంటుం దన్న నమ్మకంతో, ఆశావహదృక్పథంతో నలుమూలలా అన్వేషించాలి. సమస్య గురించి స్నేహితులతో, శ్రేయోభిలాషులతో నిర్భయంగా చర్చించాలి. సానుకూల అవగాహనతో ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ఆపదనుండి బయటపడాలి. గెలుపు ఓటములను, కష్టసుఖాలను సమతౌల్యంతో స్వీకరించే స్థితప్రజ్ఞతను యువత అలవాటు చేసుకోవాలి.

6. నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision making): సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వల్ల సత్వర ఫలితాలను పొందవచ్చు. ఒక అంశం గురించి అన్ని కోణాలలో ఆలోచించి, అనంతర పర్యవసానాలను గ్రహించి, లాభనష్టాలను అంచనావేసి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమాత్రం కాలయాపన చేయకూడదు. ఆ నిర్ణయం బహుళ ప్రయోజనదాయకంగా ఉండాలి.

7. విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యం (Critical thinking): ప్రతివిషయాన్ని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాలి. స్వీయదృక్కోణంలో నుండి మాత్రమే కాకుండా బహుముఖీన కోణాల నుండి ఆలోచించాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎవరో పెద్దలు చెప్పారనో, ఇంకెవరో సెలవిచ్చారనో ప్రతివిషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. స్వీయానుభవాల ఆధారంగా, ప్రమాణబద్ధంగా నిర్ధారించుకున్న తరువాత సంబంధిత విషయాన్ని ఆమోదిం చాలి. తార్కిక అవగాహనతో ఆలోచించాలి.

8. సృజనాత్మక ఆలోచనా నైపుణ్యం (Creative thinking): యువతలో అనుకరణ ధోరణి బాగా పెరిగిపోతుంది. ఆయా రంగాలలో ప్రసిద్ధులైన వారి ఆలోచనాధోరణితో వేలం వెర్రిగా ముందుకుపోతున్నారు. వారిని స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలిగాని అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిక్షణం కొత్తగా ఆలోచించాలి. కాలానుగుణంగా స్వతంత్రంగా ఆలోచించడం మూలంగా అందరికీ మార్గదర్శకంగా ఉండవచ్చు. :

ఈ విధమైన జీవననైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలను, పరోపకారదృష్టిని, సామాజిక స్పృహను, పర్యావరణ ఎరుకను, దేశభక్తిని సమకూర్చుకుంటే యువతీయువకులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ‘పావన నవజీవన బృందావననిర్మాత’లుగా జాతిపునర్నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.

XV. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. There is plenty of water in that region.
జవాబు:
ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది.

2. Maturity comes with experience not age.
జవాబు:
పరిణతి, వయసుతో కాదు, అనుభవంతో వస్తుంది.

3. A picture is a poem without words.
జవాబు:
పదాలు లేని పద్యమే చిత్రం

4. By failing to prepare you are preparing to fail.
జవాబు:
మీరు సంసిద్ధులు కావటంలో విఫలమవుతున్నారంటే, విఫలమవ్వటానికి సిద్ధపడుతున్నారని అర్థం.

5. Sometimes, later becomes never do it now.
జవాబు:
కొన్నిసార్లు, తరువాత అనుకున్నది ఎప్పటికీ కాదు, అందుకే ఇప్పుడే చెయ్యాలి.

TS Inter 1st Year Telugu Model Paper Set 3 with Solutions

XVI. ఈ క్రింది వ్యాసాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

సాహిత్య ప్రక్రియల్లో నాటకం శక్తివంతమైన ప్రక్రియ. సంస్కృతంలో ‘కావ్యేషు నాటకం రమ్యం, నాటకాంతం హి సాహిత్యం ‘ అని నాటక ప్రాశస్త్యాన్ని పండితులు ప్రశంసించారు. కాళిదాసు వంటి మహాకవులు నాటక ప్రక్రియను దృశ్యకావ్యంగా మలచి అద్భుతమైన నాటకాలను రచించారు. ప్రాచీన సాహిత్యంలోని నాటక ప్రక్రియకంటే భిన్నంగా పాశ్చాత్య నాటకాల ప్రభావంతో ఆధునిక తెలుగునాటకం రూపుదిద్దుకుంది. 1860లో కోరాడ రామచంద్రశాస్త్రి రాసిన ‘మంజరీ మధుకరీయము’ మొదటి తెలుగునాటకం.

సంస్కృతనాటకాలు ఐదు నుండి పది అంకాల నిడివివుండేవి. తెలుగునాటకాలు మాత్రం మూడు, నాలుగు అంకాలుగానే ప్రదర్శితమయ్యేవి. కాలక్రమేణా నాటకం అంక విభజనను వదిలేసి కథానుగుణంగా రంగాలుగా విభజిస్తున్నారు. కాలపరిమితి గంట, రెండుగంటల మధ్య సంక్షిప్తంగా, సన్నివేశ గాఢత, సంభాషణా ప్రాధాన్యతతో నాటకాలు ప్రదర్శితమవు తుంటాయి. నాటికలు, ఏకాంకికలు నాటకశాఖకు చెందిన ఉపప్రక్రియలే.

ఆంధ్రనాటక పితామహుడి’గా పేరుగాంచిన ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన ‘విషాదసారంగధర’ నాటకం పాఠ్యాంశంగాను చదువుకోవడం విశేషం. ధర్మవరం తరువాత కోలాచలం శ్రీనివాసరావు చారిత్రక, ఇతిహాస నాటకాలు రచించి ‘ఆంధ్రచారిత్రక నాటక పితామహుడు’గా పేరుగాంచాడు. ‘ధార్వాడ’, పార్సీ నాటకసమాజాల వల్ల కూడా తెలుగు ప్రాంతంలో నాటక ప్రక్రియ ప్రాచుర్యం పొందింది.

కందుకూరి వీరేశలింగం ‘వ్యవహారధర్మబోధిని’ నాటకం 1880 ప్రాంతంలో తన చారిత్రక బాధ్యతను నిర్వర్తిస్తూ నాటక ప్రక్రియకు వ్యాప్తిని అందించింది. తెలుగునాట అనేక నాటక సమాజాలు ఏర్పడి ప్రజలలో నాటక అభిరుచిని, చైతన్యాన్ని కలిగించాయి. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ మొదటి వ్యవహారిక, సాంఘిక నాటకంగా సంచలనాన్ని సృష్టించింది. 1911లో చందాల కేశవదాసు రాసిన ‘కనకతార’ తెలంగాణ నుండి వచ్చిన తొలి నాటకంగా భావిస్తున్నారు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
మొదటి తెలుగు నాటకం ఏది ?
జవాబు:
మంజరీ మధుకరీయము.

ప్రశ్న 2.
‘ఆంధ్రనాటక పితామహుడు’ ఎవరు ?
జవాబు:
ధర్మవరం రామకృష్ణమాచార్యులు.

ప్రశ్న 3.
కందుకూరి రాసిన నాటకం పేరు ?
జవాబు:
వ్యవహారధర్మబోధిని.

ప్రశ్న 4.
వ్యవహారిక భాషలో వెలువడిన తొలి నాటకం ఏది ?
జవాబు:
కన్యాశుల్కం.

ప్రశ్న 5.
‘కనకతార’ నాటకకర్త ఎవరు ?
జవాబు:
చందాల కేశవదాసు.

Leave a Comment