Telangana SCERT 7th Class Telugu Guide Telangana 8th Lesson గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు Textbook Questions and Answers.
TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి: (TextBook Page No.72)
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పై బొమ్మ దేనిని గూర్చి తెలియజేస్తున్నది ?
జవాబు.
పై బొమ్మ గ్రామంలో గుడి వాతావరణాన్ని తెలియచేస్తున్నది.
ప్రశ్న 2.
పై బొమ్మలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ?
జవాబు.
పై బొమ్మలో కొంతమంది ఆడవారు బిందెలతో నీళ్ళు మోస్తున్నారు. దుకాణందారుడు అమ్ముతున్నాడు. కావడివాడు కావడి మోస్తున్నాడు. అమ్మాయి కూరగాయలు అమ్ముతున్నది.
ప్రశ్న 3.
మీరు ఎప్పుడైనా జాతరలకు వెళ్ళారా ? ఏయే జాతరలకు వెళ్ళారు ?
జవాబు.
నేను మా అమ్మమ్మ వాళ్ల గ్రామంలో జాతరలకు వెళ్ళాను. గంగానమ్మ జాతర, పోలేరమ్మ జాతరలకు వెళ్ళాను.
ప్రశ్న 4.
మీకు తెలిసిన / చూసిన జాతర గురించి చెప్పండి.
జవాబు.
తెలంగాణా ప్రాంతంలో జరిగే ముఖ్యమైన గిరిజన జాతర్లలో మేడారం జాతర ఒకటి. ఈ జాతరలో పాల్గొనటానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు. కుల, మత, జాతి భేదం లేకుండా అందరూ భక్తి భావంతో పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ జాతరలో పాల్గొన్నారు. ఇంకా పలు రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ప్రముఖ జాతీయ, రాష్ట్రీయ నాయకులు, జిల్లా అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.
I. ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.75)
ప్రశ్న 1.
స్త్రీలు ఏయే పాటలు పాడుకుంటారు ? మీకేమైనా తెలిస్తే చెప్పండి.
జవాబు.
భారతదేశం సంప్రదాయాలకు, కళలకు పుట్టిల్లు. నిద్ర లేచింది మొదలు మరల నిద్రించేవరకు ఈ జీవన యాత్రలో ఎన్నో అడ్డంకులు, అలసటలు. వాటి నుండి సేద తీరటానికే పాటలు, గేయాలు పుట్టుకొచ్చాయి. శారీరక, మానసిక శ్రమను మరచి పోవటానికి, ఉత్సాహంగా చేసే పని సాగటానికి ఉపకరించేవి ఈ పాటలే. వ్యవసాయక దేశమైన మన ప్రాంతంలో నాటు వేసింది మొదలు కుప్ప కొట్టేవరకు స్త్రీల సాయంతోనే మగవారు వ్యవసాయం చేస్తున్నారు. వారి శారీరక శ్రమ మరచిపోవడానికి నాటువేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు ఎన్నో పాటలు తుమ్మె పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాళి పదాలు, జాజర పాటలు పాడుకుంటారు. ప్రత్యేకంగా పెండ్లిపాటలు, కూతురిని అప్పగించే అప్పగింత పాటలు, పసిపిల్లలను నిద్రపుచ్చే జోలపాటలు స్త్రీలు పాడే పాటలు వీనుల విందు చేస్తాయి.
ప్రశ్న 2.
గ్రామీణులను ఎక్కువగా ఆకర్షించిన కళారూపం ఏది ? అది ఎందుకు బాగా నచ్చి ఉంటుంది ?
జవాబు.
గ్రామీణులను ఎక్కువగా ఆకర్షించిన కళారూపం తోలుబొమ్మలాట. ఇందులో ప్రదర్శన, పాటలు ఉంటాయి. కథాగమనం ఉత్తేజకరంగా ఉంటుంది. అందువల్ల తోలుబొమ్మలాట గ్రామీణులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది.
ప్రశ్న 3.
మీకు నచ్చిన గ్రామీణ వినోదం ఏది? అది ఎందుకు నచ్చింది ?
జవాబు.
నాకు నచ్చిన గ్రామీణ వినోదం యక్షగానం. ఇందులోని కథలు ఆసక్తికరంగా ఉంటాయి. కథకులు చక్కగా పాటలు పాడుతూ ప్రజలను ఉత్తేజపరుస్తారు. వీరగాథల ద్వారా యువతలో చైతన్యాన్ని కలిగిస్తారు. అందుకే నాకు యక్షగాన కళారూపం అంటే చాలా ఇష్టం.
II. ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.77)
ప్రశ్న 1.
స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు, పాటలు ఎందుకు ప్రజలకు నచ్చుతాయో చెప్పండి.
జవాబు.
చూచి ఆనందించడంకంటే ప్రత్యక్షంగా, పాల్గొనడం ద్వారా కలిగే ఆనందం అద్భుతంగా ఉంటుంది. స్వయంగా పాల్గొని ఆటలు ఆడడం వల్ల, పాటలను పాడడం వల్ల పూర్తిగా లీనమౌతాము. దాంతో గొప్ప ఆనందాన్ని పొందుతాము.
ప్రశ్న 2.
ఈ రోజుల్లో స్త్రీలు మధ్యాహ్నవేళ పచ్చీసు మొదలైన ఆటలు ఎందుకు ఆడటం లేదో చెప్పండి.
జవాబు.
ఈ రోజుల్లో ప్రసార మాధ్యమాలు విరివిగా ఉన్నాయి. వివిధ రకాల టి.వీ చానళ్ళు వచ్చి ఉన్నాయి. ఇవి రోజంతా వివిధ రకాల సినిమాలను, సీరియళ్ళను ప్రసారం చేస్తున్నాయి. ఇప్పటి స్త్రీలకు వాటిని చూడ టానికే సమయం సరిపోతుంది మరియు కొంతమంది స్త్రీలు ఉద్యోగస్థులుగా ఉన్నారు. అందువలన ఈ రోజుల్లో స్త్రీలు మధ్యాహ్నవేళ పచ్చీసు మొదలైన ఆటలు ఆడటం లేదు.
III. ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.79)
ప్రశ్న 1.
మీకు తెలిసిన జాతర గురించి చెప్పండి.
జవాబు.
నాకు తెలిసిన జాతరలలో సమ్మక్క సారలమ్మ జాతర ముఖ్యమైనది. అది మూడురోజులపాటు జరుగుతుంది. వరంగల్ జిల్లాలో ఈ జాతర జరుగుతుంది. ఇక్కడికి లక్షలాదిగా భక్తులు వస్తారు. బెల్లంతో తూలాభారం వేస్తారు.
ప్రశ్న 2.
“ముగ్గులు స్త్రీల కళాభిరుచికి ఉదాహరణలు” అనే రచయిత అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు.
స్త్రీలు సంక్రాంతికి అందంగా ముగ్గులు వేస్తారు. రకరకాలైన వర్ణాలతో ముగ్గులు వేస్తారు. అవి అందరినీ ఆకట్టుకుంటాయి. ఆ ముగ్గులు వారి కళాభిరుచికి నిదర్శనంగా నిలుస్తాయి.
ప్రశ్న 3.
గ్రామీణ ఉత్సవాల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి ? గ్రామీణ ఉత్సవాల వల్ల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ప్రజల మధ్య మంచి సంబంధాలు
జవాబు.
పెరుగుతాయి. ఐక్యత వృద్ధి పొందుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.
ఇవి చేయండి:
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:
ప్రశ్న 1.
గ్రామాలలోని కళలు, క్రీడలు నేడు మనకు కనిపించకపోవడానికి కారణాలు చెప్పండి.
జవాబు.
గ్రామాలలో ప్రజలంతా ఒకచోట సమావేశమై భజనలు గావించుట మన పల్లెటూళ్ళలోని వినోదాలలో ఒక ప్రత్యేకమైన వినోదము. ఈ వినోదాలలో బొబ్బిలి కథ, బాలనాగమ్మ కథ మొదలైనవి ఉండేవి. ఈ కథలను చెప్పేవారు ఈనాటి మారిన పరిస్థితులలో తగ్గిపోతున్నారు. పిల్లలు మైదానాలకు దూరమై చరవాణి, కంప్యూటర్లతో ఆటలాడుతున్నారు. ప్రసార మాధ్యమాలలోని విపరీతపోకడల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఇరుగుపొరుగు వారి సంబంధాలకు దూరమౌతున్నారు.
ప్రశ్న 2.
గ్రామీణ కళలు, క్రీడలు ప్రజలను సమైక్యంగా ఎట్లా ఉంచాయో చర్చించండి.
జవాబు.
గ్రామీణ ప్రాంతాలలో అన్ని తరగతుల వారికి అభిమానాస్పదమైన వేడుకలు, వినోదాలు, మన పల్లెటూళ్ళలో పుష్కలముగా ఉన్నవి. కొన్ని వినోదాలు, క్రీడలు స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైనవి. కాముని పున్నమకు ముందు వెన్నెల రాత్రులలో యువతులు ఈ కోలాటము చేసే పద్ధతి తెలంగాణపు పల్లెటూళ్ళలో బాగా ప్రచారంలో ఉంది. పురుషులు కూడా కోలాటము వేయడం, ఆ సందర్భాలలో పాటలు పాడటం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. అందుచే ఈ క్రీడలు ప్రజలను సమైక్యంగా ఉంచుతాయి.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:
ప్రశ్న 1.
కింది విషయాలు పాఠంలో ఏయే పేరాలలో ఉన్నాయో వెతికి వాటికి సంబంధించిన ముఖ్యాంశాలు పట్టికలో రాయండి.
జవాబు.
విషయం | పేరా | ముఖ్యాంశాలు |
1. తోలు బొమ్మలాట | 5వ పేరా | వీధి నాటకము |
2. చిర్రగోనె ఆట | 6వ పేరా | తెలంగాణ ఆట |
3. అక్షక్రీడ | 7వ పేరా | పాచికల ఆట |
ప్రశ్న 2.
కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు తయారుచేయండి.
మన రాష్ట్రంలో సాధనాశూరులు ఇంద్రజాలవిద్యను అద్భుతంగా ప్రదర్శిస్తారు. ‘వీరి ప్రదర్శన గ్రామం మధ్యలో ఖాళీ ప్రదేశంలో ఏర్పాటుచేస్తారు. ప్రేక్షకులు చూస్తుండగానే తెల్లని వస్త్రాలతో ఒక గుడారం ఏర్పాటుచేసి, ప్రదర్శన ప్రారంభిస్తారు. గుడారంముందు హాస్యగాడు. నిలబడి తనకు వివిధ దేవతల విగ్రహాలు కావాలని ప్రధాన సాధనాశూరుని కోరతాడు. వేములవాడ రాజన్న, ధర్మపురి నర్సన్న, తిరుపతి వెంకన్న, కొండగట్టు అంజన్న…. అంటూ హాస్యగాడు వివిధ దేవుళ్ళ పేర్లు చెబుతుంటాడు. ప్రధాన సాధనాశూరుడు ఒక్కొక్కరాయిని ఒక్కో దేవునిగా అభివర్ణిస్తూ, మూసి ఉన్న గుడారంలో పెడతారు. చివరకు గుడారం తెరచి చూస్తే రాళ్ళకు బదులుగా దేవతల విగ్రహాలు ధూపదీప నైవేద్యాలతోసహా ప్రత్యక్షమైతాయి. దీంతో చూపరులు ఆశ్చర్యచకితులౌతారు.
వీరి ప్రదర్శనలో ప్రేక్షకుని తలపై పొయ్యిపెట్టి పూరీలను కాల్చడం, నీళ్ళకుండలో మూడురంగుల ఇసుకను పోసి, విడి విడిగా మూడురంగుల ఇసుకను ముద్దలు ముద్దలుగా తీయడం, గుడారంలోని ఒక కర్రకు కట్టిన వ్యక్తి మరో కర్రకు మారడం వంటి అంశాలు అందరినీ ఆకర్షిస్తాయి.
జవాబు.
- మన రాష్ట్రంలో సాధనాశూరులు ఏ విద్యను ప్రదర్శిస్తారు ?
- హాస్యగాడు ఏ ఏ దేవుళ్ళ పేర్లు చెబుతుంటాడు ?
- గుడారం లోపల ఏమి ఉంటాయి ?
- ఇంద్రజాల విద్యను ఎక్కడ ప్రదర్శిస్తారు ?
- గుడారంముందు ఏయే విగ్రహాలు కావాలని కోరతాడు ?
III. స్వీయరచన:
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) స్త్రీల పాటల వల్ల స్త్రీలకు, పిల్లలకు ఎట్లా ఆనందం కలుగుతుందో వివరించండి.
జవాబు.
ప్రత్యేకంగా స్త్రీలు పాడుకునే పాటలు ఎన్నో ఉన్నాయి. ఇందులో పెండ్లిపాటలు, కూతురిని అత్తమామలకు అప్పగించే సందర్భంలో పాడే అప్పగింత పాటలు, మంగళహారతులు ముఖ్యమైనవి. మన ఇండ్లలో పసిపిల్లలను ఉయ్యాలలో నిద్రబుచ్చుట కొరకు పాడే జోలపాటలు వింటూ ఉన్నాము. ఈ విధంగా స్త్రీలపాటల వల్ల స్త్రీలకు, పిల్లలకు ఆనందం కలుగుతుంది.
ఆ) “వినేవారి రక్తము ఉడుకెత్తునట్లు కథ చెప్పడం” అంటే మీరు ఏమనుకుంటున్నారో రాయండి.
జవాబు.
పల్లెటూర్లలో పల్నాటిసీమ పౌరుషం, బాలనాగమ్మ కథలు మొ||నవి, హరికథలు, బుర్రకథలు మొ||నవి చెప్తారు. ఈ కథలను చెప్పేవారు గంటల తరబడి, ఒక్కొక్కసారి ప్రొద్దంతా చెప్పి ప్రజలను ఆనందింపచేస్తుంటారు. ఈ కథలను చెప్పేవారి నేర్పు చాలా గొప్పది. వినేవారి రక్తము ఉడుకెత్తునట్లుగా చెప్పుచున్నారు అంటారు. అంటే వినేవారికి కూడా పౌరుషం కలిగేటట్లు చెబుతారని అర్థం.
ఇ) కొన్ని వినోదాలు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండేవి” అనే వాక్యాన్నిబట్టి వినోదాలకు, ఆర్థికస్థితికి గల సంబంధాన్ని చెప్పండి.
జవాబు.
కొన్ని క్రీడలు, వినోదాలు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. శ్రీమంతులు వారి ఇండ్లలో జరిగే పెండ్లిండ్లు మొదలైన శుభకార్యాలలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అంత గొప్పగా భావిస్తారు. కాబట్టి ఆర్థికస్థితిని బట్టి వినోదాలు అందుబాటులో ఉంటాయి.
ఈ) ఒకనాటి బాలికల ఆటలకు, నేటి బాలికల ఆటలకు గల తేడాలు చెప్పండి.
జవాబు.
ఒకనాటి బాలికలు చెమ్మచెక్క, అచ్చనగండ్ల, ఓమనగుంటల ఆట, గుజ్జనగూళ్ళ ఆటలు, బొమ్మరిండ్ల ఆటలు, గీరనగింజల ఆటలు ఆడేవారు. నేటి బాలికలకు ఇటువంటి ఆటలు ఉన్నాయి అనే పరిజ్ఞానము లేకపోతున్నది సరికదా ఎప్పుడూ కంప్యూటర్ల వద్ద కూర్చుని ఛాటింగ్లు, చరవాణీలు పట్టుకొని గంటలకొద్దీ కబుర్లు చెపుతుంటారు. నాటి బాలికలు ముగ్గులు వెయ్యడంలో నైపుణ్యము ప్రదర్శించేవారు. నేటి బాలబాలికలకు ముగ్గులు అంటేనే తెలియని స్థితి. ఇది ఈనాటి బాలికల పరిస్థితి.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) క్రీడలు, వినోదాలు మానవ జీవితానికి ఎందుకు అవసరమో తెలుపుతూ మీ అభిప్రాయం రాయండి.
జవాబు.
క్రీడలు, వినోదాలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడే ఆటలు. అందువలన మనం వీటి గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం. ఆటపాటలు మన సంస్కృతిలో భాగం. కొన్ని క్రీడలు సార్వజనికమైనవి. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉంటాయి. జనుల ఆర్థికస్థితిని అనుసరించి, వయస్సును అనుసరించి, విజ్ఞానాన్ని అనుసరించి క్రీడలు పుష్కలంగా ఉన్నాయి. క్రీడాభిరామమైన పల్లెటూరి జీవితములోని ఉత్తమ సంస్కృతిని క్రీడలు, వేడుకలు, వినోదాలు మనకు వెల్లడి చేస్తాయి.
(లేదా)
ఆటకు, పాటకు వీడరాని చుట్టరికమున్నదనే రచయిత మాటలను సమర్థిస్తూ రాయండి.
జవాబు.
ఆటకు, పాటకు వీడరాని చుట్టరికము ఉన్నది. ఎందుకంటే తెలుగు పల్లెలలో రకరకాలైన ఆటలను మనము చూడవచ్చు. ఈ ఆటలు మనస్సుకు ఉల్లాసము కలిగించే వేడుకలు. తోలుబొమ్మలాటలు ఎక్కువగా రామాయణభారత కథలకు సంబంధించినవి. స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు, పాటలు చాలా ఉన్నవి. పల్లెటూళ్ళలో ఉయ్యాలలూగుట బాలబాలికలే గాక పెద్దలు కూడా మిక్కిలి మక్కువ జూపించే ఆట. ఈ విధంగా అన్ని తరగతుల వారికి అభిమానా స్పదమైన ఆటలు, పాటలు మన పల్లెటూళ్లలోనే పుష్కలంగా ఉన్నాయి.
IV. సృజనాత్మకత / ప్రశంస:
ప్రశ్న 1.
మీకు తెలిసిన ఏవేని నాలుగు పద్యాలను బతుకమ్మ పాటలాగా మార్చి రాయండి.
ఉదా : ఉప్పుకప్పురంబు ఉయ్యాలో……..
ఒక్క పోలికనుండు ఉయ్యాలో ……….
చూడచూడరుచుల ఉయ్యాలో …………..
జాడలువేరమ్మ ఉయ్యాలో ………..
జవాబు.
అ) పుత్తడి గలవాని పుండు ఉయ్యాలో ………….
బాధైనను వసుధలోన ఉయ్యాలో …………..
చాల వార్తకెక్కు ఉయ్యాలో ………..
పేదవాని యింట ఉయ్యాలో
పెండైన యెరుగరు ఉయ్యాలో ………..
ఆ) కలిమి గల లోభికన్నను ఉయ్యాలో ………….
విలసితముగ పేదమేలు ఉయ్యాలో ………….
వితరణియైనన్ ఉయ్యాలో ………….
చలి చెలమ మేలు కాదా ………….
ఇ) పుస్తకముల నీవు ఉయ్యాలో ………….
పూవువోలెను చూడు ఉయ్యాలో ………….
చింపబోకు ఉయ్యాలో ………….
మురికి చేయబోకు ఉయ్యాలో ………….
ఈ) సానబెట్టిన వజ్రంబు ఉయ్యాలో ………….
లీను కాంతి ఉయ్యాలో ………….
పొలము చక్కగ దున్నిన ఉయ్యాలో ………….
ఫలము నిచ్చు ఉయ్యాలో ………….
(లేదా)
ప్రశ్న 2.
గ్రామీణ కళాకారులను ప్రశంసిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.
లేఖ
హైదరాబాదు,
X X X X X.
ప్రియమైన మిత్రుడు రాముకు,
నీ స్నేహితుడు వ్రాయునది, నేను క్షేమము. నీవు ఎలా వున్నావు ?
ముఖ్యంగా వ్రాయునది ఏమనగా నేను ఈసారి వేసవి సెలవులకు మా తాతగారింటికి వచ్చాను. ఇక్కడ రామాలయంలో ఉత్సవాలు జరిగాయి. అందులో భాగంగా తోలుబొమ్మలాటలు, హరికథలు, గారడీ విద్యలు, కుస్తీ పోటీలు నిర్వహించారు. నాకు గ్రామాలలోని ప్రాచుర్యం పొందిన ఈ ఆటలు చాలా బాగా నచ్చాయి. ఈ ఆటలలో గ్రామీణ కళాకారుల నైపుణ్యం ఇంకా బాగా ఉంది. నేను అక్కడకు వచ్చిన తరువాత మిగతా విశేషాలు తెలియచేస్తాను. అమ్మ, నాన్నగార్లకు నా నమస్కారాలు తెలుపవలెను.
ఇట్లు
నీ మిత్రుడు,
x x x x x.
చిరునామా :
కె. రాము,
S/o కె. చలపతిరావు,
డో.నెం 31/27-3/8,
శివాలయం వీధి, నల్గొండ.
IV. పదజాల వినియోగం:
1. కింది పదాలకు అర్థాలను రాయండి.
ఉదా : మేలుకొలుపు = మా నాయనమ్మ మేలుకొలుపు గీతాలు చక్కగా పాడుతుంది.
అ) ఆసక్తి = __________
జవాబు.
ఆపేక్ష, ఆస
ఆ) వీనులవిందు = __________
జవాబు.
ఇష్టమైన ధ్వన్యాదులచే చెవులకు ఇంపు గొలుపుట
ఇ) శోభ = __________
జవాబు.
కాంతి, ఇచ్ఛ
ఈ) పురాతనమైన = __________
జవాబు.
బహుదినములనాటిది, పాతదైన
2. కింది వాక్యాలు చదివి సమాన అర్థం వచ్చే పదాలకింద గీత గీయండి.
అ) శ్రీరామనవమి పండుగ వైభవంగా జరిగింది. ఈ పర్వాన్ని చూడటానికి ప్రజలు తరలివచ్చారు. ఈ వేడుక అందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది.
జవాబు.
పండుగ, వేడుక, పర్వం
ఆ) శ్రీజకు చిత్రలేఖనం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆ అపేక్షతో బొమ్మలు గీసింది. ఆమె అభిరుచిని ఉపాధ్యాయులు అభినందించారు.
జవాబు.
ఆసక్తి, అపేక్ష, అభిరుచి.
ఇ) రామయ్య గృహం నిర్మించుకోవాలనుకుని, ఇల్లుకు సరిపోయే స్థలం కొని, సదనం నిర్మించాడు.
జవాబు.
గృహం, ఇల్లు, సదనం
3. కింది వికృతి పదాలకు సరిపోయే ప్రకృతి పదాలు గళ్ళలో ఉన్నాయి. వాటిని వెతికి రాయండి.
అ) పబ్బము : __________
జవాబు.
పండుగ
ఆ) పున్నమి : __________
జవాబు.
పూర్ణిమ
ఇ) జీతం : __________
జవాబు.
జీవితం
ఈ) కర్జము : __________
జవాబు.
కార్యము
VI. భాషను గురించి తెలుసుకుందాం:
1. కింది వాక్యాల్లో “సమాపక”, “అసమాపక క్రియలేవో గుర్తించి రాయండి.
అ) శిరీష అన్నం తిని, సినిమాకు వెళ్ళింది.
జవాబు.
అసమాపక క్రియ తిని సమాపక క్రియ వెళ్ళింది.
ఆ) రమ బడికి వెళ్ళి, చదువుకున్నది.
జవాబు.
అసమాపక క్రియ వెళ్ళి సమాపక క్రియ చదువుకున్నది.
ఇ) విజయ్ పుస్తకం చదివి, నిద్రపోయాడు.
జవాబు.
అసమాపక క్రియ చదివి సమాపక క్రియ నిద్రపోయాడు.
ఈ) భరత్ బొమ్మలు గీసి, ప్రదర్శనకు పెట్టాడు.
జవాబు.
అసమాపక క్రియ గీసి సమాపక క్రియ పెట్టాడు.
క్రియలనుబట్టే కాకుండా అర్థాన్నిబట్టి కూడా వాక్యాలలో తేడాలుంటాయని గమనించండి.
ఉదా : అ) ఆహా ! ఎంత బాగుందో !
ఆ) ‘చేతులు కడుక్కో’
ఇ) మన రాష్ట్ర రాజధాని ఏది ?
పై వాక్యాలు ఒక్కో భావాన్ని సూచిస్తున్నాయి. అదెట్లాగో చూద్దాం !
ఆహా ! ఎంత బాగుందో ! ఇది ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆశ్చర్యాన్ని తెలియజేస్తే వాక్యం ‘ఆశ్చర్యార్థక వాక్యం’.
ఇక రెండో వాక్యం ‘చేతులు కడుక్కో’. ఇది ‘విధిగా చేయాలి’ అనే అర్థాన్ని సూచిస్తుంది. అంటే చేయాల్సిన పనిని విధిగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించే వాక్యం ‘విధ్యర్థక వాక్యం’.
ఇక మూడో వాక్యం మన రాష్ట్ర రాజధాని ఏది ? ఇది ప్రశ్నార్థకాన్ని సూచిస్తుంది. ప్రశ్నించే విధంగా ఉండే వాక్యమే ‘ప్రశ్నార్థక వాక్యం’.
2. ఈ వాక్యాలు ఏ రకమైనవో గుర్తించండి.
అ) మీరు ఏ ఊరు వెళ్తున్నారు ?
జవాబు.
(ప్రశ్నార్థకం)
ఆ) ఈ పాఠం చదువు.
జవాబు.
(విధ్యర్ధకం)
ఇ) వసంత ఎంత బాగా పాడిందో !
జవాబు.
(ఆశ్చర్యార్థకం)
ఈ) మన పాఠశాలకు ఎవరు వచ్చారు ?
జవాబు.
(ప్రశ్నార్థకం)
ఉ) చెరువులో తామరలు ఎంతో అందంగా ఉన్నాయి కదా !
జవాబు.
(ఆశ్చర్యార్థకం)
ఊ) పూలనన్నింటినీ హారంగా కూర్చండి.
జవాబు.
(విధ్యర్థకం)
ప్రశ్నార్థక వాక్యాల చివర ప్రశ్నార్థకం (?), ఆశ్చర్యార్థక వాక్యాల చివర ఆశ్చర్యార్థకం (!) ఉంటుంది.
ప్రాజెక్టు పని:
అ) మీ జిల్లాలోని ముఖ్యమైన / పెద్ద చెరువులు ఏవి ? అవి ఎక్కడ ఉన్నాయి ? మొదలగు విషయాలను ఒక పట్టిక ద్వారా వివరించండి. నివేదిక రాయండి. ప్రదర్శించండి.
జవాబు.
మాది వరంగల్ జిల్లా. మా జిల్లాలో ఎన్నో చెరువులు ఉన్నాయి. హనుమకొండ హసన్పల్లి ప్రాంతాల్లో ఎన్నో ముఖ్యమైన చెరువులు ఉన్నాయి. ఇవన్నీ కాకతీయుల కాలంలో త్రవ్వబడినాయి. ప్రజల అవసరాల కోసం వాటిని త్రవ్వించారు. అలనాటి చెరువులతో ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అందుతున్నాయి. సురక్షితమైన నీరు లభిస్తున్నది. వర్షపునీరు వ్యర్థం కాకుండా నిల్వ ఉంటుంది.
చెరువు | ప్రదేశం |
1. ఎల్లంపేట చెరువు | ఉయ్యాలవాడ |
2. పూరచెరువు | ఉయ్యాలవాడ |
3. నందివారట్ల చెరువు | పెరుమాండ్ల |
4. రాముని చెరువు | బల్కోడు |
5. తుమ్మిడిచెరువు | చిన్నగూడూరు |
6. అతిపెద్ద చెరువు | పరకాల |
(లేదా)
ఆ) గ్రామీణ వేడుకలు లేదా క్రీడలకు సంబంధించిన పాట / కథ / వ్యాసం సేకరించి నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
భారతదేశమంతటిలో ఉన్నట్లే తెలుగుసీమలో కూడా నూటికి తొంబదిపాళ్ళు జనులు పల్లెటూళ్ళలో ఉన్నారు. తరతరాల నుండి వ్యాప్తిలోనున్న వేడుకలు, క్రీడా వినోదాలు ఎన్నో ఇక్కడ కలవు. ఈ వినోదాలలోను, వేడుకలలోను, పాటలను మొట్టమొదట పేర్కొనవలసి ఉంటుంది.
తెలుగు పల్లెలలో రకరకాలైన ఆటలను మనము చూడవచ్చును. ఈ ఆటలు మనస్సుకు ఉల్లాసము కలిగించే వేడుకలు. తోలుబొమ్మలాటలు, యక్షగానాలు అనే వీధినాటకాలు ఎంతో బహుళ ప్రచారము పొందినవి. పసిపిల్లలను ఉయ్యాలలో నిద్రబుచ్చుట కొరకు పాడే జోలపాటలను మనదేశంలో విననివారు ఉండరని చెప్పవచ్చును. ఈ విధంగా వివిధములైన పాటలు వివిధ సందర్భాలలో మన పల్లెటూళ్ళల్లో వీనులకు విందు చేస్తాయి.
TS 7th Class Telugu 8th Lesson Important Questions గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు
I. అవగాహన – ప్రతిస్పందన:
అపరిచిత గద్యాలు:
1. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు. ఈమె పూర్తి పేరు సునీతా పాండ్యకృష్ణ. ఈమె 1965లో సెప్టెంబర్ 19వ తేదీన జన్మించింది. ఈమెకు బాల్యము నుండి అంతరిక్ష యాత్ర చేయాలని ఆకాంక్ష. ఈమె అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు. 1998లో ‘NASA’ చేత ఎంపిక కాబడి 2007లో భారతదేశంలో పర్యటించిన ఈమె అనేక అంతరిక్ష పరిశోధనలు చేసి అంతరిక్షంలో అత్యధిక సమయాన్ని గడిపిన తొలి మహిళ.
గుజరాత్లో గల జులాసన్ స్వగ్రామంలో సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించింది. విశ్వప్రతిభ అవార్డు, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ డీసెంట్ అవార్డను పొందినది. 2007 అక్టోబర్ 4వ తేదీన “అమెరికన్ ఎంబసీ”లో ప్రసంగించింది. తర్వాత భారత ప్రధానితో సమావేశం కూడా జరిపింది.
2008లో ‘NASA’ డిప్యూటీ చీఫ్ గా బాధ్యతలను నిర్వహించిన అంతరిక్ష పరిశోధకురాలు సునీతా పాండ్యకృష్ణ.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
సునీతా విలియమ్స్ పూర్తి పేరు ?
జవాబు.
సునీతా పాండ్యకృష్ణ
ప్రశ్న 2.
సునీతా బాల్యంలో ఏం చేయాలనుకొనేది ?
జవాబు.
అంతరిక్షయాత్ర
ప్రశ్న 3.
ఏ ఆశ్రమాన్ని సందర్శించింది ?
జవాబు.
సబర్మతి ఆశ్రమం
ప్రశ్న 4.
ఈమె ఏ అవార్డులు పొందింది ?
జవాబు.
విశ్వప్రతిభ, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ డీసెంట్ అవార్డులు
ప్రశ్న 5.
‘NASA’ డిప్యూటీ చీఫ్ గా ఏ సం॥లో బాధ్యతలు నిర్వహించింది ?
జవాబు.
2008లో
2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కవికుల గురువుగా పేరొందిన కాళిదాసు రచనలకు వ్యాఖ్యానమందించిన పరిష్కర్త మల్లినాథ సూరి. మెదక్ జిల్లాలోని కొల్చారం ఈయన స్వస్థలం. బహుభాషా కోవిదుడైన మల్లినాథ సూరి అశేష శాస్త్రపాండిత్యం గడించాడు. సంస్కృత పంచమహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రాశాడు. కాళిదాసు రచనలకు సంజీవని వ్యాఖ్య. కిరాతార్జునీయానికి ఘంటాపథం వ్యాఖ్య, శిశుపాలవధకు సర్వంకష వ్యాఖ్య, నైషధానికి జీవాతువు వ్యాఖ్య. ఇట్లా 15 గ్రంథాలకు వ్యాఖ్యానాలు రచించిన ఘనత మల్లినాథ సూరిది. ఈ వ్యాఖ్యానాలే ఈయనను వ్యాఖ్యా చక్రవర్తి బిరుదాంకితుడిని చేశాయి.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
సూరి స్వస్థలం ఏది ?
జవాబు.
మెదక్ జిల్లాలోని కొల్చారం
ప్రశ్న 2.
ఈయన కాళిదాసు రచనలకు రాసిన వ్యాఖ్య ఏది ?
జవాబు.
సంజీవని
ప్రశ్న 3.
కిరాతార్జునీయానికి రాసిన వ్యాఖ్య ఏది ?
జవాబు.
ఘంటాపథం
ప్రశ్న 4.
నైషధానికి రాసిన వ్యాఖ్య ఏది ?
జవాబు.
జీవాతువు
ప్రశ్న 5.
మల్లినాథ సూరి బిరుదు ఏమిటి ?
జవాబు.
వ్యాఖ్యా చక్రవర్తి
II. స్వీయరచన:
అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)
ప్రశ్న 1.
“రేడియో ప్రసంగం” ప్రక్రియ గూర్చి రాయండి.
జవాబు.
ఒక లక్ష్యంతో చేసే యాత్ర వంటిది ప్రసంగం. ప్రసంగానికి ముఖ్య సూత్రాలు నాలుగు – స్పష్టంగా మాట్లాడటం, హృదయం నుండి మాట్లాడటం, చెప్పవలసింది చెప్పడం అలా చెప్పిన తర్వాత ముగించడం. సిద్ధం చేసుకొన్న వ్యాసం రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది. విషయ క్లుప్తత, సరళత రేడియో ప్రసంగ లక్షణాలు.
ప్రశ్న 2.
జనుల పోషణ మీద ఆధారపడి పనులను వృత్తిగా తీసుకొని జీవిస్తున్న వారెవరు ?
జవాబు.
గంగిరెద్దులను అలంకరించి, ఇల్లిల్లు తిరిగేవారు, పగటి వేషాలు వేసుకొని ప్రజలను వినోదింప చేసేవారు. వీరినే బహురూపులవారని పిలుస్తారు. విప్ర వినోదులనే వారు గారడీ విద్య ప్రదర్శిస్తుంటారు. వీరందరూ జనుల పోషణ మీద ఆధారపడి ఈ పనులను వృత్తిగా తీసుకొని జీవిస్తున్నారు.
ప్రశ్న 3.
పులిజూదం ఆట గురించి రాయండి.
జవాబు.
చదరంగము వంటి ఆట పులిజూదము. ఒక పటము మీద చిన్నరాళ్ళనో లేక చింతగింజలనో తీసుకొని, కొన్నింటిని పులులు గాను, కొన్నింటిని మేకలుగాను భావించి ఆడే ఆట ఇది. పులుల సంఖ్య మూడింటి కన్న మించదు. మేకల సంఖ్య పదహారు వరకు ఉంటుంది. ఒకరు పులులను తీసుకొని, ఇంకొకరు మేకలను తీసుకొని ఈ ఆటను ఆడతారు.
ప్రశ్న 4.
అక్ష క్రీడ అంటే ఏమిటి ?
జవాబు.
మన పల్లెటూళ్ళలోని ఉన్నత కుటుంబాలలో విశేష ఆసక్తితో ఆడిన ఆట పాచికల ఆట. దీనికే అక్ష క్రీడ అని పేరు. ఈ ఆట తరతరాల నుండి మనదేశంలోని ప్రజలను ఆకర్షించింది. మన ప్రబంధాలలో ఈ ఆటను రమణీయంగా మన కవులు వర్ణించారు. రుక్మిణీ కృష్ణులు ఈ ఆటను ఆడినట్లు ఉత్తర హరివంశంలో మనోహరంగా వర్ణించారు.
ఆ) క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (8 మార్కులు)
ప్రశ్న 1.
నీకు తెలిసిన పండుగలు, అవి ఏ తిథులలో వస్తాయో తెల్పండి.
జవాబు.
పండుగలు |
తిథులు |
1. ఉగాది | చైత్ర శుద్ధ పాడ్యమి |
2. శ్రీరామనవమి | చైత్ర శుద్ధ నవమి |
3. హోళి | ఫాల్గుణ పౌర్ణమి |
4. ఏరువాక పున్నమి | జ్యేష్ఠ పౌర్ణమి |
5. మహాశివరాత్రి | మాఘ బహుళ చతుర్దశి |
6. శ్రీకృష్ణాష్టమి | శ్రావణ బహుళ అష్టమి |
7. వినాయక చవితి | భాద్రపద శుద్ధ చవితి |
8. దసరా | ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు |
9. దీపావళి | ఆశ్వీయుజ బహుళ అమావాస్య |
10. బతుకమ్మ | ఆశ్వీయుజ శుద్ధ దశమి |
ప్రశ్న 2.
స్త్రీలు ఏయే పాటలు పాడుకుంటారు ? మీకేమైనా తెలిస్తే చెప్పండి.
జవాబు.
భారతదేశం సంప్రదాయాలకు, కళలకు పుట్టిల్లు. నిద్ర లేచింది మొదలు మరల నిద్రించేవరకు ఈ జీవన యాత్రలో ఎన్నో అడ్డంకులు, అలసటలు. వాటి నుండి సేద తీరటానికే పాటలు, గేయాలు పుట్టుకొచ్చాయి. శారీరక, మానసిక శ్రమను మరచి పోవటానికి, ఉత్సాహంగా చేసే పని సాగటానికి ఉపకరించేవి ఈ పాటలే. వ్యవసాయక దేశమైన మన ప్రాంతంలో నాటు వేసింది మొదలు కుప్ప కొట్టేవరకు స్త్రీల సాయంతోనే మగవారు వ్యవసాయం చేస్తున్నారు. వారి శారీరక శ్రమ మరచిపోవడానికి నాటువేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు ఎన్నో పాటలు తుమ్మె పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాళి పదాలు, జాజర పాటలు పాడుకుంటారు. ప్రత్యేకంగా పెండ్లిపాటలు, కూతురిని అప్పగించే అప్పగింత పాటలు, పసిపిల్లలను నిద్రపుచ్చే జోలపాటలు స్త్రీలు పాడే పాటలు వీనుల విందు చేస్తాయి.
IV. భాషాంశాలు:
పదజాలం:
నానార్థాలు:
ప్రశ్న 1.
వ్యవసాయం = __________
జవాబు.
కృషి, ప్రయత్నం, పరిశ్రమ
ప్రశ్న 2.
కళ = __________
జవాబు.
విద్య, అందం, చంద్రునిలో పదునాఱవ భాగం
ప్రశ్న 3.
రుచి = __________
జవాబు.
కాంతి, ఆకలి, రంగు, కోరిక
ప్రశ్న 4.
బలి = __________
జవాబు.
బలి చక్రవర్తి, గంధకం, అర్పణం, యమదండం
ప్రశ్న 5.
శక్తి = __________
జవాబు.
పార్వతి, బలిమి, వశిష్ఠుని కుమారుడు, బల్లెము
ప్రశ్న 6.
రక్తము = __________
జవాబు.
నెత్తురు, కుంకుమ, ఎరుపు
వ్యాకరణాంశాలు:
సంధులు:
ప్రశ్న 1.
జీవనమంత = __________
జవాబు.
జీవనము + అంత = ఉత్త్వసంధి
ప్రశ్న 2.
దేవాలయం = __________
జవాబు.
దేవ + ఆలయం = సవర్ణదీర్ఘసంధి
ప్రశ్న 3.
క్రీడాభిరామం = __________
జవాబు.
క్రీఢ + అభిరామం = సవర్ణదీర్ఘసంధి
వాక్యరకాలు:
ప్రశ్న 1.
తెలుగువారి భాష యొంత మధుర మైనదో !
జవాబు.
ఆశ్చర్యార్థక వాక్యం
ప్రశ్న 2.
ఆటలు ఆడండి
జవాబు.
విధ్యర్థక వాక్యం
ప్రశ్న 3.
నీకు ఏఏ ఆటలు ఆడటం వచ్చు ?
జవాబు.
ప్రశ్నార్థక వాక్యం
సమాసాలు:
సమాసపదం-విగ్రహ వాక్యం-సమాసం పేరు
ప్రశ్న 1.
మహోద్యమం = __________
జవాబు.
గొప్పదైన ఉద్యమం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రశ్న 2.
ఏబది సంవత్సరాలు = __________
జవాబు.
ఏబది అను సంఖ్య గల సంవత్సరాలు – ద్విగు సమాసం
ప్రశ్న 3.
బాలబాలికలు = __________
జవాబు.
బాలురు, బాలికలు – ద్వంద్వ సమాసం
ప్రశ్న 4.
దివిటీల వెలుగు = __________
జవాబు.
దివిటీల యొక్క వెలుగు – షష్ఠీ తత్పురుష సమాసం
ప్రశ్న 5.
గారడీ విద్య = __________
జవాబు.
గారడీ అను పేరు గల విద్య – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
భాషాభాగాలు గుర్తించండి.
ప్రశ్న 1.
చేతులు కడుక్కో.
జవాబు.
క్రియ
ప్రశ్న 2.
ఆహా ! ఎంత బాగుందో !
జవాబు.
అవ్యయం
ప్రశ్న 3.
మీరు ఏ ఊరు వెళ్తున్నారు ?
జవాబు.
సర్వనామం
కఠిన పదాలకు అర్థాలు:
గోచరించుట = కనిపించట
పుష్కలము = అధికము
మక్కువ = కోరిక
ఇంచుమించు = దాదాపు
మనోహరము = అందము
పురాతనము = ప్రాచీనము
పాఠం ఉద్దేశం:
నేడు సామాన్య ప్రజానీకానికి వివిధ రకాలైన వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచమే ఒక చిన్న గ్రామమైనది. ఎక్కడ ఏం జరిగినా, ఇంట్లో కూర్చొని ప్రసార మాధ్యమాల ద్వారా వాటిని చూస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందకముందు గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకు ఏయే వినోదసాధనాలు ఉండేవో, వాటి ద్వారా గ్రామీణులు ఎట్లా ఆనందాన్ని పొందేవారో, తద్వారా ఆనాటి సంస్కృతిని తెలుసుకొని గౌరవించడం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ ప్రక్రియలో సిద్ధం చేసుకొన్న వ్యాసం రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది. విషయ క్లుప్తత, సరళత రేడియో ప్రసంగ లక్షణాలు.
రచయిత పరిచయం:
రచయిత : దేవులపల్లి రామానుజరావు
కాలం : 1917 – 1993
తల్లిదండ్రులు : వేంకట చలపతిరావు, ఆండాళమ్మ
జన్మస్థలం : వరంగల్ అర్బన్ జిల్లాలోని దేశాయిపేట గ్రామం
మొదటి సంపాదకీయం : 1946లో ‘శోభ’ అనే సాహిత్య మాసపత్రిక
ఇతర రచనలు : పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెనుగు సాహితి, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొ॥
ఆత్మకథ : “ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు”
ప్రవేశిక:
గ్రామీణ ప్రాంతాల ఆటలు ఈ రోజుల్లో దాదాపుగ కనుమరుగైనాయి. ప్రస్తుతం ప్రజలు ఆడే ఆటలు గెలుపు ఓటములే లక్ష్యంగా, కొన్ని సందర్భాలలో జూదంగా పరిణమించాయి. పిల్లలు మైదానాలకు దూరమై కంప్యూటర్లతో, చరవాణి (సెల్ఫోన్) లతో ఆటలాడుతూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో శారీరక, మానసిక వికాసానికి దోహదపడే ఆటలు, వినోదాల గూర్చి తెలుసుకోవడం అత్యంత అవసరం. పూర్వం గ్రామాలలో ఎలాంటి ఆటలు, వినోదాలు ఉండేవో తెలుస్తున్నాయి.
నేనివి చేయగలనా?