TS 7th Class Telugu Guide 12th Lesson రాణి శంకరమ్మ

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 12th Lesson రాణి శంకరమ్మ Textbook Questions and Answers.

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి: (TextBook Page No.116)

TS 7th Class Telugu Guide 12th Lesson రాణి శంకరమ్మ 1

ప్రశ్నలు:

ప్రశ్న 1.
బొమ్మలో కనిపిస్తున్నదెవరు ?
జవాబు.
బొమ్మలో కనిపిస్తున్నది రాణి రుద్రమదేవి.

ప్రశ్న 2.
ఆమె ఏం చేస్తున్నది ? ఎవరితో పోరాడుతున్నది ? ఎందుకు పోరాడి ఉండవచ్చు ?
జవాబు.
ఆమె యుద్ధం చేస్తున్నది. శత్రువులతో పోరాడుతున్నది. దేశరక్షణ కోసం పోరాడి ఉండవచ్చు.

ప్రశ్న 3.
యుద్ధంలో శౌర్యాన్ని చూపిన స్త్రీలను ఏమంటారు ?
జవాబు.
యుద్ధంలో శౌర్యాన్ని చూపిన స్త్రీలను వీరనారీమణులు అంటారు.

ప్రశ్న 4.
మీకు తెలిసిన వీరనారీమణుల పేర్లు చెప్పండి.
జవాబు.
నాకు తెలిసిన వీరనారీమణులు ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, దుర్గాబాయి దేశముఖ్, బాలనాగమ్మ మొ||గువారు.

I. ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.120)

ప్రశ్న 1.
“త్యాగాలకు, వీరత్వానికి మారుపేరు తెలంగాణ” దీన్ని మీరెట్లా సమర్థిస్తారు ?
జవాబు.
త్యాగాల పురిటిగడ్డ తెలంగాణ. ఎందరో వీరులు తెలంగాణ అభివృద్ధి కోసం, సాధనకోసం ప్రయత్నించారు. ఎందరో తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించారు. సాయుధపోరాట సమయంలో రజాకార్ల దుష్ట చర్యలకు బలీ అయ్యారు. ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వెయ్యిమందిపైగా అమరులు అయ్యారు. వారి త్యాగాల పునాదులపైనే తెలంగాణ ఏర్పడింది.

ప్రశ్న 2.
ఏ ఏ గుణాలు కల్గి ఉంటే “సుగుణాల పట్టి” అంటారు ?
జవాబు.
ధైర్యం, తెగువ, సాహసం, వినయం, చదువు, అందచందాలు, సంస్కృతీ సంప్రదాయాల పట్ల విశ్వాసం మొదలైన గుణాలు కల్గి ఉంటే అటువంటి బాలికను ‘సుగుణాల పట్టి’ అని అంటారు.

TS 7th Class Telugu Guide 12th Lesson రాణి శంకరమ్మ

II. ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No.122)

ప్రశ్న 1.
శంకరమ్మ యుద్ధరంగంలో ధైర్యం చూపింది. మరి స్త్రీలు ఏయే సందర్భాలలో ధైర్యం చూపాలో చర్చించండి.
జవాబు.
స్త్రీలు అనేక విషయాలలో ధైర్యాన్ని చూపాలి. ముఖ్యంగా అవినీతికరమైన పనులు జరుగుతున్నప్పుడు, తమ ఆస్తిని . ఇతరులు ఆక్రమించుకున్నప్పుడు, తమను శారీరకం గాను, మానసికంగాను, వేధించేవారి విషయంలోను, పోకిరీలపట్ల ధైర్యం చూపాలి. దుర్మార్గులను జైల్లో పెట్టించడానికి తమవంతు కృషి చేయాలి.

ప్రశ్న 2.
శంకరమ్మ చేసిన మంచి పనికి ఉంగరం ఇస్తే తీసుకోలేదు కదా ! దీనిని బట్టి మీరేం గ్రహించారు?
జవాబు.
ప్రత్యుపకారాన్ని ఆశించి ఉపకారం చేసే మనస్తత్వం శంకరమ్మది కాదని తెలుస్తుంది. ఇతరులగుండా, ముఖ్యంగా పరపురుషుల నుండి కానుకలను తీసుకునే ‘మనస్తత్వం ఆమెకు లేదని, పరువుప్రతిష్టలకు ప్రాధాన్యతను ఇచ్చే వ్యక్తిత్వం కలదిగాను అర్థమయింది.

ప్రశ్న 3.
“కండ్లలో సముద్రం నింపుకోవడం” అన్న జాతీయాన్ని ఏయే సందర్భాల్లో వాడుతారు ?
జవాబు.
విపరీతమైన బాధ కల్గినప్పుడు దుఃఖం వస్తుంది. కళ్ళ నుండి నీరు వస్తుంది. అవిశ్రాంతంగా మిక్కిలి బాధతో కన్నీళ్ళతో ఏడ్చుచున్న సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

III. ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No.123)

ప్రశ్న 1.
“చీకట్లో చిరుదీపం” అనడంలో ఆంతర్యమేమిటి ?
జవాబు.
శంకరమ్మ అరణ్యంలో ఒంటరిగా ఉంది. తనకు ఎవరూ కనిపించలేదు. తాను ఎలా వెళ్ళాలో, ఏ దారిలో వెళ్ళాలో తెలియదు. ఆ సమయంలో ఒక కోయవాడు కనిపించాడు. చీకటిలో ఉన్నవానికి వెలుగుతున్న దీపం ఎట్లు వెలుగును అందిస్తుందో, అట్లే ఆపదలో ఉన్నవానికి ఒక వ్యక్తి కనిపిస్తే అతనికి ఎంతో అండగా ఉన్నట్లు అనిపిస్తుంది.

ప్రశ్న 2.
ప్రజలను కన్నబిడ్డలుగా పాలించడం అంటే మీకేమర్థ మైంది?
జవాబు.
రాజు ప్రజలను ధర్మబద్ధంగా పాలించాలి. తల్లిదండ్రులు తమ బిడ్డలను ఏవిధంగా దగ్గరుండి రక్షించుకుంటారో, వారికి అవసరమైనవి సమకూరుస్తారో, అట్లే రాజు అనేవాడు ప్రజలందరిని తన సంతానంగా భావించాలి. వారి కష్టసుఖాలను దగ్గరుండి చూచుకోవాలి అని అర్థం.

ప్రశ్న 3.
రాణి శంకరమ్మ కథ ద్వారా మీకేమర్థమైంది ?
జవాబు.
రాణి శంకరమ్మ ద్వారా మానవులు వీరోచితంగా పోరాడాలని, ముఖ్యంగా మహిళలు తాము అబలలంకాదని, సబలలమని లోకానికి చాటాలని అనుకుంటున్నాను.. స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను.

TS 7th Class Telugu Guide 12th Lesson రాణి శంకరమ్మ

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
రాణి శంకరమ్మ కథలో మీకు నచ్చిన / ఆశ్చర్యం కలిగించిన సంఘటన ఏది ? దాని గురించి మాట్లాడండి.
జవాబు.
శంకరమ్మ ఒకసారి గౌడిచర్ల ప్రాంతంలో ఒక చిరుతపులితో కలబడింది అనే సంఘటన నాకు బాగా నచ్చింది. అలాగే చిరుత గాండ్రిస్తూ తన పంజా విసురుతున్నా భయపడలేదు. కట్టెతో పులిని కొడుతూ ధైర్యంగా ఎదుర్కోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది. చిరుతపులిని కాళ్ళతో తొక్కి చంపటం నాకు చాలా ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించింది.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

ప్రశ్న 1.
పాఠం చదువండి. రాణి శంకరమ్మ పరాక్రమాన్ని తెలిపే పదాలను గుర్తించండి.
జవాబు.
ఉదా : బండరాళ్ళను పిండిగా జేయడం.
కండబలమూ, గుండెబలమూ కల్గి ఉండడం
మగరాయుని వోలె పంచెనూ కట్టడం
అన్ని విద్యలలో ఆరితేరినది కావడం
మీసాలు లేకున్నా రోసమును చూపడం

ప్రశ్న 2.
కింది గద్యాన్ని చదువండి. కింద ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబును ఎన్నుకొని కుండలీకరణంలో రాయండి.
స్త్రీని మాతృదేవతగా భావించి, పూజించి, ఆరాధించేవారు భారతీయులు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అన్నది ఆర్యోక్తి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఒక తరం నుండి మరో తరానికి వారసత్వంగా అందిస్తూ ఉంటారు మహిళలు: సభ్యత, సంస్కారాల రూపంలో జాతి జీవన శక్తిని మరింత వేళ్ళూనుకునేటట్లు చేసింది భారతీయ మహిళే.

ఇటు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, అటు సమాజ ఉన్నతికై పరిశ్రమిస్తూ తమ వంతు పాత్రను పరిపూర్ణం చేసుకుంటూ, అవసరమైనపుడు సంస్కృతి రక్షణకై పూనుకుంటారు. అవసరమైతే మహిళలు మాతృభూమి రక్షణకోసం ప్రాణాత్యాగాలు చేస్తుంటారు.

ప్రశ్న 1.
స్త్రీలను – భారతీయులు ఎట్లా పూజిస్తారు ?
క) మాతృదేవతగా
గ) పితృదేవతగా
చ) అతిథిదేవతగా
జవాబు.
క) మాతృదేవతగా

ప్రశ్న 2.
మహిళలు ఒక తరం నుండి మరో తరానికి దేనిని అందిస్తూ ఉంటారు ?
క) భారతీయ ఆర్థిక వ్యవస్థను
గ) భారతీయ సంస్కృతిని
చ) భారతీయ వ్యవహారాలను
జవాబు.
గ) భారతీయ సంస్కృతిని

ప్రశ్న 3.
జాతి జీవనశక్తి దేనివలన వెళ్ళూనుకొని ఉంటుంది ?
క) సభ్యత, సంస్కారాలు
గ) కుళ్ళు కుతంత్రాలు
చ) ఎత్తుకు పై ఎత్తులు
జవాబు.
క) సభ్యత, సంస్కారాలు

ప్రశ్న 4.
వేటి ఉన్నతికై స్త్రీలు పరిశ్రమిస్తారు ?
క) సిరిసంపదలు,
గ) కుటుంబం – సమాజం
చ) తమకోసం తాము
జవాబు.
గ) కుటుంబం – సమాజం

ప్రశ్న 5.
దేనికోసం ప్రాణత్యాగం చేయవచ్చు ?
క) సంపదలకై
గ) ఆచారాలకై
చ) మాతృభూమి రక్షణకై
జవాబు.
చ) మాతృభూమి రక్షణకై

TS 7th Class Telugu Guide 12th Lesson రాణి శంకరమ్మ

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) శంకరమ్మ ధైర్యంగా పులితో పోరాడిన సంఘటనను వర్ణించండి.
జవాబు.
శౌర్య శంకరమ్మ పల్లెటూర్లో అపర రుద్రమ వలె, అపరంజి బొమ్మలా అవతరించింది. కండబలమూ, గుండెబలమూ కల్గి ఉన్నది. మీసాలు లేకున్నా, రోసమును చూపుతూ ధైర్య లక్ష్మీదేవిలాగా పెరగసాగింది.

ఈ విధంగా ఎదుగుతున్న శంకరమ్మ ఒకసారి గౌడిచర్ల ప్రాంతంలో ఒక చిరుతపులితో కలబడింది. చిరుత గాండ్రిస్తూ తన పంజా విసురుతున్నా భయపడలేదు. కట్టితో పులిని కొడుతూ ధైర్యంగా ఎదుర్కొన్నది, చిరుతపులిని కాళ్ళతో తొక్కింది. దానిని చంపివేసింది.

ఆ) మీరు తప్పిపోతే ధైర్యంగా ఏవిధంగా ఇంటికి చేరుకుంటారో రాయండి.
జవాబు.
నేను తప్పిపోతే కంగారు పడతాను అనుకోవద్దు. నేను నింపాదిగా ఎలా ఇంటికి చేరాలి అని ఆలోచిస్తాను. తరువాత దగ్గరలో ఏవన్నా ఇళ్ళు ఉన్నా వారి దగ్గరకు వెళ్ళి నా వివరాలు చెబుతాను. లేకుంటే మెయిన్ రోడ్డుకు చేరుకొని ఎవరిదైనా వాహనంలో సహాయం కోరి మా ఇంటికి చేరుకుంటాను.

ఇ) రాణి శంకరమ్మ మంచి పాలనాదక్షురాలు అనడానికి ఉదాహరణలు రాయండి.
జవాబు.
రాణి శంకరమ్మ తన భర్తకు రాజధర్మం గురించి చెప్పి రాజ్యపాలన చేయించింది. తన భర్త చనిపోయాక శంకరమ్మను నైజాం రాజు మరాఠీల పైకి యుద్ధానికి పంపాడు. ఆ యుద్ధంలో విజయం పొందాక నైజాం నవాబ్ ‘రాయబాగిన్’ అనే బిరుదునిచ్చాడు. అందోలు రాజ్యానికి 1764వ సం॥లో శంకరమ్మను రాణిగా ప్రకటించాడు. ఆమె చక్కగా రాజ్యపాలన చేసింది.

రాజ్యాన్ని తన శూరత్వంతో విస్తరించుకున్నది. అనేక విజయాలను సాధించింది. ప్రజలకు పన్నుల భారం తగ్గించింది. ఆమె తన తండ్రిపేరిట సంగారెడ్డి, తల్లిపేరిట రాజంపేట పట్టణాల్ని నిర్మించింది. గరుడాద్రి గుట్టపై రంగనాథాలయాన్ని కట్టించింది.

ఈ) రాణి శంకరమ్మ గొప్పతనం గురించి నేటికీ పాటల రూపంలో పాడుకోవడానికి కారణాలు ఏమిటో రాయండి.
జవాబు.
అవకాశం లభిస్తే మహిళలు ఏ పనినైనా సాధించగలరు. తమ శక్తి సామర్థ్యాలకు పదును పెట్టుకొని, ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారు. అటువంటి కోవకు చెందిన మహిళ శంకరమ్మ. నేటి మహిళలలో స్ఫూర్తిని నింపడానికి, ధైర్యాన్ని కలిగించడానికి రాణి శంకరమ్మలాంటి వీరనారీమణుల గొప్పతనం పాటల రూపంలో పాడుకోవటానికి అవకాశాలు ఇస్తున్నారు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) రాణి శంకరమ్మ పరాక్రమాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు.
తెలంగాణలో మెతుకు సీమ సిగలో విరిసిన శౌర్య పారిజాతం రాణి శంకరమ్మ. ఈమె నేటి మెదక్ జిల్లాలోని అందోలును రాజధానిగా చేసుకొని రాజ్యం చేసింది. శత్రువులకు సింహ స్వప్నమైంది. ప్రజలకు ఆరాధ్యదేవతైంది. నేటికీ ఈమె గురించిన కథలు, పాటలుగా, గాథలుగా చెప్పుకుంటారు పల్లెప్రజలు. శంకరమ్మకు ఒక చిరుతపులి ఎదురుపడితే దాన్ని ధైర్యంతో ఎదుర్కొన్నది. కాళ్ళతో తొక్కింది.

దానిని చంపివేసింది. ఆమె నారసింహారెడ్డిని వివాహం చేసుకొంది. శంకరమ్మ నారసింహారెడ్డిని రాజ్యపాలన చక్కగా చేయమని రాజధర్మాన్ని చెప్పింది. తన భర్త మరణించినపుడు నిజాం రాజు మరాఠీల పైకి యుద్ధానికి పంపాడు. విజయం తర్వాత నైజాం నవాబు శంకరమ్మకు ‘రాయబాగిన్’ అనే బిరుదునిచ్చాడు.

1764వ సం||లో అందోలు రాజ్యానికి శంకరమ్మ రాణి అయ్యింది. చక్కగా రాజ్యపాలన చేసింది. రాజ్యాన్ని తన శూరత్వంతో విస్తరించుకున్నది. ప్రజలను కన్నబిడ్డలుగా పాలించింది. ప్రజలకు పన్నుల భారం తగ్గించింది. ఆమె తన తండ్రిపేరిట సంగారెడ్డి, తల్లిపేరిట రాజంపేట పట్టణాలను నిర్మించింది. గరుడాద్రి గుట్టపై రంగనాథాలయాన్ని కట్టించింది. 1774వ సంవత్సరంలో శంకరమ్మ తుది శ్వాస విడిచింది. అందోలు చరిత్రలో ఆమె కీర్తి సువర్ణాక్షరాలతో లిఖించబడింది.

IV. సృజనాత్మకత / ప్రశంస.

1. రాణి శంకరమ్మ చరిత్రను ఏకపాత్రాభినయం చేయడానికి వీలుగా తగిన అంశాలతో రచన చేయండి. ప్రదర్శించండి.
జవాబు.
రాణి శంకరమ్మ ఏకపాత్రాభినయం

నువ్వెవరివో గాని ఉయ్యాలో – వేయి దండాలయ్య ఉయ్యాలో
ఉంగరం గింగరం ఉయ్యాలో – నాకేమి వద్దయ్య ఉయ్యాలో
ఈ ఉంగరం జూస్తేను ఉయ్యాలో – మా అయ్య మా అవ్వ ఉయ్యాలో
తప్పు జేసిన వంచు ఉయ్యాలో – కోదండమేతురూ ఉయ్యాలో
నాకొద్దు నాకొద్దు ఉయ్యాలో – ఈ ఉంగారమ్ము ఉయ్యాలో

రాజు చెంత చేరి

నామీది ప్రేమతో ఉయ్యాలో – ప్రజలను మరిచినవు ఉయ్యాలో
రాజ్యమంత జూడు ఉయ్యాలో – రంజిల్లు టాలేదు ఉయ్యాలో
రాజధర్మం గాదు ఉయ్యాలో – ఇది పద్ధతి గాదు ఉయ్యాలో
ప్రజల హితమును గోరి ఉయ్యాలో – కన్న బిడ్డల్లా జూడు ఉయ్యాలో
మొదట రాజ్యం పనులు ఉయ్యాలో – కుదురుగా జేయాలి ఉయ్యాలో

TS 7th Class Telugu Guide 12th Lesson రాణి శంకరమ్మ

V. పదజాల వినియోగం.

1. గీత గీసిన పదాలకు అర్థాలు రాసి, వాటితో సొంతవాక్యాలు రాయండి.

అ) నిర్మల్ కొయ్య బొమ్మల తయారీకి ప్రసిద్ధి.
జవాబు.
ప్రసిద్ధి – ఖ్యాతి
కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి.

ఆ) బాగా చదువుకొని స్వప్నం నెరవేర్చుకోవాలి.
జవాబు.
స్వప్నం – కల
మన స్వప్నం నిజం కావాలంటే ముందు లక్ష్యం ఉండాలి.

ఇ) మహాభారత సమరంలో ధర్మం గెలిచింది.
జవాబు.
సమరం = యుద్ధం
రాణి రుద్రమదేవి సమరంలో తన పరాక్రమం చూపించింది.

ఈ) అపాయకర సంఘటనలు ఎదురైనపుడు శౌర్యం చూపాలి.
జవాబు.
శౌర్యం = పరాక్రమం
అశోకుడు శౌర్యం చూపి శత్రువుల గుండెల్లో నిద్రించాడు.

ఉ) సూర్యుని దీప్తి లేకపోతే లోకమంతా చీకటిమయం.
జవాబు.
దీప్తి = కాంతి
శరత్కాలంలో శశాంకుని దీప్తి స్వరమూ సిద్ధమయింది.

2. కింది పదాలను వివరించండి.

అ) సాహితీ జ్యోతులు :
జవాబు.
సాహిత్యానికి చెందిన విషయాలలో ప్రసిద్ధి చెందిన వాటిని పరిశీలించినపుడు, దానిలో నైపుణ్యులు అయిన వారిని గురించి తెలియజేయునపుడు ఈ పదాన్ని వాడుతారు.

ఆ) శౌర్యచంద్రికలు :
జవాబు.
ఎవరినైనా వారి యొక్క గొప్పతనాన్ని, కీర్తి ప్రతిష్ఠలను గూర్చి చెప్పేటప్పుడు వాడతారు. శౌర్యచంద్రికలు అంటే పౌరుషాన్ని, ప్రతిష్ఠలను చెప్పేటప్పుడు ఈ పదాన్ని వాడుతారు.

ఇ) అపరంజి బొమ్మ :
జవాబు.
అందమైన వాటిని, అందంగా చెక్కిన విగ్రహాలను గురించి వివరించేటప్పుడు ఈ పదాలను వాడుతారు.

ఈ) అజరామరం :
జవాబు.
లెక్కించుటకు వీలుకాని, ఎప్పటికి గుర్తుంచుకునే వాటిని వివరించేటప్పుడు ఈ పదాన్ని వాడుతారు.

TS 7th Class Telugu Guide 12th Lesson రాణి శంకరమ్మ

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పదాలను విడదీయండి. సంధిని గుర్తించి సంధిపేరు రాయండి.

అ) రంగనాథాలయం = ____________
జవాబు.
రంగనాథ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి

ఆ) అమృతాన్నం = ____________
జవాబు.
అమృత + అన్నం – సవర్ణదీర్ఘ సంధి

ఇ) అజరామరం = ____________
జవాబు.
అజర + అమరం – సవర్ణదీర్ఘ సంధి

ఈ) కవీంద్రుడు = ____________
జవాబు.
కవి + ఇంద్రుడు – సవర్ణదీర్ఘ సంధి

2. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.

అ) చదువుసంధ్యలు : ____________
జవాబు.
చదువును, సంధ్యయును – ద్వంద్వ సమాసం

ఆ) పామూముంగిసలు : ____________
జవాబు.
పాముయును, ముంగీసయును – ద్వంద్వ సమాసం

ఇ) ఎండావానలు : ____________
జవాబు.
ఎండయును, వానయును – ద్వంద్వ సమాసం

ఈ) కొండాకోనలు : ____________
జవాబు.
కొండయును, కోనయును – ద్వంద్వ సమాసం

ఉ) మంత్రతంత్రాలు : ____________
జవాబు.
మంత్రమును, తంత్రమును – ద్వంద్వ సమాసం

ఊ) తల్లిదండ్రులు : ____________
జవాబు.
తల్లియును, తండ్రియును – ద్వంద్వ సమాసం

ఋ) రామకృష్ణులు : ____________
జవాబు.
రాముడును, కృష్ణుడును – ద్వంద్వ సమాసం

ౠ) కూరగాయలు : ____________
జవాబు.
కూరయును, కాయయును – ద్వంద్వ సమాసం

TS 7th Class Telugu Guide 12th Lesson రాణి శంకరమ్మ

ద్విగు సమాసం:

ఈ పదాలను పరిశీలించండి.

  • నవరసాలు
  • చతుర్వేదములు
  • షట్చక్రవర్తులు
  • దశ దిశలు
  • పంచపాండవులు
  • ఎనిమిది బొమ్మలు

ఈ పదాలలో మొదటి (పూర్వ)పదం సంఖ్యా వాచకంగా ఉండి, రెండవపదం (పర) నామవాచకంగా ఉంది. వీటికి విగ్రహవాక్యాలు ఇట్లా ఉంటాయి.

నవరసాలు – తొమ్మిది సంఖ్యగల రసాలు
చతుర్వేదములు – నాలుగు సంఖ్య గల వేదములు
షట్చక్రవర్తులు – ఆరు సంఖ్యగల చక్రవర్తులు
పంచపాండవులు – ఐదు సంఖ్యగల పాండవులు
దశదిశలు – పది సంఖ్యగల దిక్కులు
ఎనిమిది బొమ్మలు – ఎనిమిది సంఖ్యగల బొమ్మలు
మొదటి (పూర్వ) పదం సంఖ్య అయితే తర్వాత (ఫర) పదం ఆ సంఖ్యను సూచించే నామవాచకం అయివుంటుంది.
పూర్వపదం సంఖ్యావాచకమైతే అది ‘ద్విగు సమాసం’.

3. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.

ఉదా : వంద సంవత్సరాలు – వంద సంఖ్యగల సంవత్సరాలు – ద్విగు సమాసం

అ) ముక్కుచెవులు : ____________
జవాబు.
ముక్కుయును, చెవులును – ద్వంద్వ సమాసం

ఆ) ఏడేండ్ల : ____________
జవాబు.
ఏడు సంఖ్యగల ఏండ్లు – ద్విగు సమాసం

ఇ) ఆరువేల గుఱ్ఱాలు : ____________
జవాబు.
ఆరువేల సంఖ్యగల గుఱ్ఱాలు – ద్విగు సమాసం

ఈ) శౌర్యధైర్యాలు : ____________
జవాబు.
శౌర్యమును, ధైర్యమును – ద్వంద్వ సమాసం

TS 7th Class Telugu Guide 12th Lesson రాణి శంకరమ్మ

ప్రాజెక్టు పని:

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో బతుకమ్మ పాటలుగా పాడుకునే వీరగాథలను సేకరించండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు.
సమ్మక్క – సారక్క

శ్రీదేవి భూదేవి ఉయ్యాలో
కరుణించి మమ్మేలు ఉయ్యాలో
సతివి సమ్మక్కనే ఉయ్యాలో
మ్యాడారం సమ్మక్క ఉయ్యాలో
బైకం పేట పురం ఉయ్యాలో
వారింట పుట్టింది ఉయ్యాలో
తెలంగాణా. ప్రాంతాన ఉయ్యాలో
మాఘపున్నమినాడు ఉయ్యాలో
పుట్టింది సమ్మక్క ఉయ్యాలో
చిన్నతనం నుండి ఉయ్యాలో
చచ్చిపోయిన వాణ్ణి ఉయ్యాలో
వీరాధి వీరుడే ఉయ్యాలో
కొడుకు జంపన్న ఉయ్యాలో
అతివ ఆడబిడ్డ ఉయ్యాలో
సంకల్పవల్లిరో ఉయ్యాలో
అందరికి అందరూ ఉయ్యాలో
ధర్మ రక్షణకయ్య ఉయ్యాలో
కరువులొచ్చినపుడు ఉయ్యాలో
కప్పమేకట్టమని ఉయ్యాలో
కాకతీయరాజు ఉయ్యాలో
మంత్రి కాకతీయరాజు ఉయ్యాలో
వారినీ అడ్డుకొని ఉయ్యాలో
సమ్మక్క బలగము ఉయ్యాలో
ఇది తెలిసిన సమ్మక్క ఉయ్యాలో
కాశె బూసిందిరో ఉయ్యాలో
సైన్యాన్ని వెంటనే ఉయ్యాలో
నెత్తూరు మడుగులో ఉయ్యాలో
తనశక్తి మేరకు ఉయ్యాలో
మగని జేరినాది ఉయ్యాలో
దొంగదెబ్బగ ఒకడు ఉయ్యాలో
దద్దరిల్లె అడవి ఉయ్యాలో

ధరణిలో సమ్మక్క ఉయ్యాలో
కంకవనమూలోన ఉయ్యాలో
మమ్ము కాపాడవే ఉయ్యాలో
ముదితరో సమ్మక్క ఉయ్యాలో
ధర చందపాపయ్య ఉయ్యాలో
వనితరో సమ్మక్క ఉయ్యాలో
కోయప్రాంతమందు ఉయ్యాలో
పుబ్బా నక్షత్రాన ఉయ్యాలో
పుడమెల్లమెరియంగ ఉయ్యాలో
చిత్రవిచిత్రాలు చూపె ఉయ్యాలో
చిటికెలో లేపింది ఉయ్యాలో
మగడుపైడిరాజు ఉయ్యాలో
జగజట్టివాడు ఉయ్యాలో
కోడూరు లక్ష్మమ్మ ఉయ్యాలో
బిడ్డరో సారమ్మ ఉయ్యాలో
వీరులూ శూరులూ ఉయ్యాలో
త్యాగాల సిరులయ్య ఉయ్యాలో
కాపాడనీ ప్రభువుకు ఉయ్యాలో
మ్యాడారమే మాదనిది ఉయ్యాలో
ప్రతాపరుద్రుడే ఉయ్యాలో
యుద్ధానికే పంపె ఉయ్యాలో
(హెూరా హెూరి) పోరాడె ఉయ్యాలో
వీరమరణము పొందె ఉయ్యాలో
రుద్రకాళిగ మారె ఉయ్యాలో
యుద్ధాన దూకింది ఉయ్యాలో
చీల్చి చెండాడింది ఉయ్యాలో
మగని జూసినది ఉయ్యాలో
మగని లేవుకొనగ ఉయ్యాలో
మైకమే కమ్మింది ఉయ్యాలో
వెన్ను బల్లెము గుచ్చె ఉయ్యాలో
పులులు ఘీంకరించె ఉయ్యాలో

TS 7th Class Telugu Guide 12th Lesson రాణి శంకరమ్మ

రక్తమదుముకోని ఉయ్యాలో
యద్ధభూమిని విడిచి ఉయ్యాలో
బాటలేని చోట ఉయ్యాలో
తల్లికోసమయ్యొ ఉయ్యాలో
చిలుకల గట్టుకాడ ఉయ్యాలో
పుట్టకాడ దొరికే ఉయ్యాలో
మ్యాడారంలోని ఉయ్యాలో
ఏడువిడిచిఏడు ఉయ్యాలో
తల్లిపేరు చెప్పి ఉయ్యాలో
ఆభరిణెను తెచ్చి ఉయ్యాలో
దేశమంతా వచ్చి ఉయ్యాలో
తల్లిని వేడుకొని ఉయ్యాలో
నిత్యకల్యాణము ఉయ్యాలో
జగతిలో జనులెల్ల ఉయ్యాలో
దయ్యాలమడుగులో ఉయ్యాలో
అక్కడినుంచియే ఉయ్యాలో
తోవలో దేవుళ్ళ ఉయ్యాలో
జంపన్న వాగులో ఉయ్యాలో
నిలువెత్తు బెల్లము ఉయ్యాలో
బండారి పెట్టిన ఉయ్యాలో
కోరినకోరికలు ఉయ్యాలో
బుధగురువారాలు ఉయ్యాలో
శుక్రవారంనాడు ఉయ్యాలో
తరలివత్తురు జనం ఉయ్యాలో

మగని ఎత్తుకోని ఉయ్యాలో
కొండచరియలు దాటె ఉయ్యాలో
తల్లి మాయమయ్యే ఉయ్యాలో
కోయరాజు వెతికె ఉయ్యాలో
నెమలినార చెట్టు ఉయ్యాలో
కుంకుమ భరణిలో ఉయ్యాలో
కోయరాజులంత ఉయ్యాలో
మాఘపున్నమినాడు ఉయ్యాలో
జాతర జరిపేరు ఉయ్యాలో
పూజచేసిరి ఉయ్యాలో
చెతులెత్తి మొక్కి, ఉయ్యాలో
దీవెనలు అందుకొని ఉయ్యాలో
పచ్చతోరణము ఉయ్యాలో
జాతరజరిపేరు ఉయ్యాలో
స్నానాలు చేయాలే ఉయ్యాలో
యాత్రమొదలయ్యేను ఉయ్యాలో
దేవెనలు పొందాలె ఉయ్యాలో
చేయాలె స్నానాలు ఉయ్యాలో
పసుపు కుంకుమబెట్టి ఉయ్యాలో
బంగారమెల్ల ఉయ్యాలో
కొంగుబంగారం ఉయ్యాలో
తల్లిబిడ్డలు గొల్చి ఉయ్యాలో
తల్లిసెలవు పొంది ఉయ్యాలో
తీర్థాలు జరుపుకొని ఉయ్యాలో

TS 7th Class Telugu Guide 12th Lesson రాణి శంకరమ్మ

TS 7th Class Telugu 12th Lesson Important Questions రాణి శంకరమ్మ

II. స్వీయరచన.

అ) క్రింది ప్రశ్నకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)

ప్రశ్న 1.
రాణి శంకరమ్మకు ‘రాయబాగిన్’ బిరుదు ఎవరు, ఎందుకిచ్చారు ?
జవాబు.
మెదక్ జిల్లా ఆదోలు రాజు నారసింహారెడ్డి భార్య శంకరమ్మ. నైజాం రాజు మీదకు మరాఠీలు యుద్ధానికి వచ్చారు. వారిని ఎదిరించలేక నైజాం రాజు శంకరమ్మను మరాఠీల మీదకు యుద్ధానికి పంపాడు. ఎక్కువ సైన్యం గల మరాఠీలపై కొద్ది సైన్యంతో ఎత్తుకు పై ఎత్తులతో విజయం సాధించింది శంకరమ్మ. విజయం తర్వాత నైజాం నవాబు శంకరమ్మకు ‘రాయబాగిన్’ అనే బిరుదునిచ్చాడు.

IV. భాషాంశాలు:

పదజాలం:

పర్యాయపదాలు:

ప్రశ్న 1.
వనిత = ____________
జవాబు.
పడతి, యువతి, ముదిత, మహిళ

ప్రశ్న 2.
శత్రువు = ____________
జవాబు.
వైరి, రిపు, అరి

ప్రశ్న 3.
సమరం = ____________
జవాబు.
యుద్ధం, రణం, సంగ్రామం

ప్రశ్న 4.
సువర్ణం = ____________
జవాబు.
బంగారం, హేమం, కనకం

ప్రశ్న 5.
పల్లె = ____________
జవాబు.
గ్రామం, ఊరు, జనపదం

ప్రశ్న 6.
పులి = ____________
జవాబు.
వ్యాఘ్రం, శార్దూలం

ప్రశ్న 7.
గుర్రము = ____________
జవాబు.
అశ్వం, హయం

ప్రశ్న 8.
పెండ్లి = ____________
జవాబు.
పరిణయం, వివాహం, పెళ్ళి, పాణిగ్రహణం

ప్రశ్న 9.
అమృతం = ____________
జవాబు.
సుధ, పీయూషం

ప్రశ్న 10.
ఊయల = ____________
జవాబు.
ఉయ్యాల, ఉయ్యెల, డోల, తొట్టె

ప్రశ్న 11.
ఉంగరం = ____________
జవాబు.
అంగుళీయం, ఊర్మిక, బటువు

ప్రశ్న 12.
సంతోషం = ____________
జవాబు.
ముదము, మోదం, ఆనందం

ప్రశ్న 13.
రక్తం = ____________
జవాబు.
రుధిరం, నెత్తురు, నెత్రు

ప్రశ్న 14.
భర్త = ____________
జవాబు.
పతి, నాథుడు, మగడు, మొగుడు

ప్రశ్న 15.
చీకటి = ____________
జవాబు.
అంధకారం, తమస్స, తిమిరం

TS 7th Class Telugu Guide 12th Lesson రాణి శంకరమ్మ

నానార్థాలు:

ప్రశ్న 1.
కాళి = ____________
జవాబు.
పార్వతి, నల్లనైన, స్త్రీ, నల్ల జీలకఱ్ఱ

ప్రశ్న 2.
సిగ = ____________
జవాబు.
కొప్పు, నెమలి జుట్టు, పిల్ల జుట్టు

ప్రశ్న 3.
గుణము = ____________
జవాబు.
స్వభావం, అల్లెత్రాడు, విద్య, దయ

ప్రశ్న 4.
అమృతం = ____________
జవాబు.
సుధ, పాలు, నెయ్యి, స్వర్గం

ప్రశ్న 5.
రక్తము = ____________
జవాబు.
నెత్తురు, ఎఱుపు, కుంకుమ

ప్రశ్న 6.
యాత్ర = ____________
జవాబు.
జాతర, ఉత్సవం, పోవుట

ప్రశ్న 7.
తీర్థం = ____________
జవాబు.
పుణ్యాదకం, పుణ్యక్షేత్రం, పుణ్యనది

ప్రకృతి – వికృతులు

ప్రకృతి – వికృతి
రాజీ – రాణి
కీర్తి – కిరితి
ప్రజా – ప్రజ
స్త్రీ – ఇంతి
హృదయం – ఎద, ఎడద
శిఖా – సిగ
సూక్తులు – సుద్దులు
గుణము – గొనయము
రోషం – రోసం
లక్ష్మి – లచ్చి
ధర్మం – దమ్మం
హితం – ఇతం
పణ – పన్ను
సముద్రం – సంద్రం
యాత్ర – జాతర
విష్ణు – వెన్నుడు
చంద్రుడు – చందురుడు, చందమామ

TS 7th Class Telugu Guide 12th Lesson రాణి శంకరమ్మ

వ్యాకరణాంశాలు:

సంక్లిష్ట వాక్యంగా రాయండి.

ప్రశ్న 1.
శక్తి సామర్థ్యాలను పదును పెట్టుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి.
జవాబు.
శక్తి సామర్థ్యాలను పదును పెట్టుకొని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి.

ప్రశ్న 2.
యుద్ధ రంగంలో ప్రతిభ చూపింది. విజయం సాధించింది.
జవాబు.
యుద్ధ రంగంలో ప్రతిభ చూపి, విజయం సాధించింది.

కఠిన పదాలకు అర్థాలు:

రీతి = విధము
కుతంత్రాలు = మోసాలు
హితము = మేలు
సమరము = సువర్ణాక్షరాలు
యుద్ధము బంగారపు అక్షరాలు

TS 7th Class Telugu Guide 12th Lesson రాణి శంకరమ్మ

పాఠం నేపథ్యం:

తెలంగాణలో వీరనారీమణులకు కొదువ లేదు. అటువంటి నారీమణులలో అందోలు సంస్థానాన్ని పాలించి, శత్రువులను గడగడలాడించిన రాణి శంకరమ్మ ధైర్యసాహసాలు కలిగిన వీరవనిత. ఈమె సంగారెడ్డి సమీపంలోని గౌడిచర్లలో 1702లో పుట్టింది. రాజమ్మ, సంగారెడ్డి దంపతులకు జన్మించిన శంకరమ్మ బాల్యం నుంచి నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నది.

ప్రజలను కన్నబిడ్డలుగా పరిపాలించిన రాణి శంకరమ్మ శత్రువుల పాలిట అపరకాళికవలె ధైర్యసాహసాలు ప్రదర్శించింది. చరిత్రలో తనకంటూ చెరగని స్థానం సంపాదించుకున్నది. మెదక్ ప్రాంతాన్ని చరితార్థం చేసిన రాణి శంకరమ్మ గురించి తెలపటమే ఈ పాఠం నేపథ్యం.

పాఠ్యభాగ వివరాలు:

గేయకథ ప్రక్రియ కథతో కూడి, గేయరూపంలో ఉంటుంది. లయాత్మకత, ప్రాసలతో కూడి, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. సరళమైన భాషలో అలవోకగా సాగుతుంది.
సంగారెడ్డి జిల్లాకు చెందిన కీ॥శే॥ సంపన్ముడుంబై రంగకృష్ణమాచార్యులు రచించిన “మెదక్ జిల్లాంతర్గత అందవోలు శౌర్య వీర్యరెడ్డి త్రయం” (వీరుల గాథలు) పుస్తకం ఆధారంగా రూపొందించిన పాఠ్యాంశమిది.

ప్రవేశిక:

అవకాశం లభిస్తే మహిళలు ఏ పనినైనా సాధించగలరు. తమ శక్తిసామర్థ్యాలను పదును పెట్టుకొని, ఆత్మ విశ్వాసముతో ముందడుగు వేస్తారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారు. అటువంటి కోవకు చెందిన మహిళ శంకరమ్మ. ఆమె యుద్ధరంగంలో చూపిన ప్రతిభను, ఆమె జీవిత చరిత్రను ప్రజలు పాటలుగా పాడుకుంటారు. ఇంత కీర్తిపొందిన రాణి శంకరమ్మ చరిత్రను బతుకమ్మ పాట రూపంలో తెలుసుకోవాలి.

TS 7th Class Telugu Guide 12th Lesson రాణి శంకరమ్మ

నేనివి చేయగలనా?

TS 7th Class Telugu Guide 12th Lesson రాణి శంకరమ్మ 2

Leave a Comment