TS 7th Class Telugu Grammar పదవిజ్ఞానం

Telangana SCERT 7th Class Telugu Study Material Telangana Pdf పదవిజ్ఞానం Questions and Answers.

TS 7th Class Telugu Grammar పదవిజ్ఞానం

పదాలు – అర్థాలు:

అ:

అంబరం = వస్త్రం / బట్ట
అంబలి = రాగులు(తైదలు) పిండితో వండిన ద్రవాహారం
అంతరిక్షం = ఆకాశం
అంతరించిపోవు = నశించిపోవు
అతిశయోక్తి = ఎక్కువ చేసి చెప్పడం
అతివేల = చాలా
అదృశ్యం = కనిపించకుండ వున్నది/ కనిపించనిది
అద్భుతం = ఆశ్చర్యం కలిగించేది
అద్దకం = వస్త్రానికి రంగువేసే విధానం
అనిశం = ఎల్లప్పుడు

ఆ:

ఆంగికం = అవయవ సంబంధమైనది
ఆకర్షించు = ఆకట్టుకొను
ఆకాంక్ష = కోరిక
ఆత్మజుడు = పుత్రుడు, కొడుకు
ఆదరణీయం = ఆదరించదగిన, గౌరవించదగిన
ఆపాదమస్తకం = పాదం నుండి తలదాకా
ఆవాసం = ఇల్లు / నివాసం

ఈ:

ఈర్ష్య = అసూయ, ఓర్వలేనితనం, కండ్లమంటతనం

ఉ:

ఉపేక్ష = అశ్రద్ధ, లెక్కచేయక పోవడం
ఉభయతారకం = ఇరువురికి మేలు జరగడం
ఉవ్విళ్ళూరు = తహతహలాడు
ఉషస్సు = తెల్లవారుజామున

TS 7th Class Telugu Grammar పదవిజ్ఞానం

ఏ:

ఏకాగ్రత = విషయంపై మనస్సు నిల్పడం
ఏరి = ఎవరి

ఒ:

ఒండె = కాని, అటుకాని పక్షాన
ఒరులు = ఇతరుల

ఔ:

ఔషధం = మందు

క:

కంఠీరవం = సింగం, సింహం
కబుర్లు = ముచ్చట్లు, మాటలు
కరి = ఏనుగు
కలిమి = సంపద, సొమ్ము
కల్ల = అబద్ధం
కలకాలం = ఎల్లప్పుడు, ఎల్లకాలం
కాలుష్యం = మలినం
కూడు = బువ్వ
కెరటాలు = అలలు
కొలిమి = కమ్మరివారు ఇనుమును కాల్చే స్థలం (జాగా)
కొట్టం = పశువుల పాక, చపారం
కొండ్ర = దున్నిన సాలు
కోలాటం = కోలలు పట్టుకొని ఆడే ఆట

గ:

గణించి = ఎంచి, లెక్కపెట్టి
గహ్వరం = గుహ
గోదలు = ఎడ్లు

TS 7th Class Telugu Grammar పదవిజ్ఞానం

ఘ:

ఘటించు = కలుగు

చ:

చిద్విలాసం = జ్ఞానప్రకాశం
చిల్వ (చిలువ) = పాముz
చెలిమి = సోపతి, స్నేహం
చేటు = ముప్పు, ఆపద
చేవ = శక్తి

జ:

జడాశయుడు = జడమైన మనస్సు కలవాడు
జపమాల = జపం చేస్తున్నప్పుడు లెక్కపెట్టే పూలదండ
జమీందార్లు = భూస్వాములు, కొన్ని గ్రామాలకు ఏలికలు
జిజ్ఞాస = తెలుసుకోవాలనే కోరిక
జీవగడ్డ = చైతన్యంతో తొణికిసలాడుతున్న భూమి

డ:

డొక్క = కడుపు

త:

తస్కరులు = దొంగలు
తావి = సువాసన
తృణం = గడ్డి
తృష్ణ = కోరిక
తెలిఱాతి = తెల్లరాతి
తేటి = తేనెటీగ
త్యజించు = వదిలిపెట్టు / విడిచిపెట్టు

TS 7th Class Telugu Grammar పదవిజ్ఞానం

ద:

దానవుడు = రాక్షసుడు
దాస్యం = బానిసత్వం
దీప్తి = కాంతి
దేవస్థలాలు = దేవాలయాలు
దేహం = శరీరం, పెయ్యి
ద్విజుడు = బ్రాహ్మణుడు

ధ:

ధరణి = భూమి
ధ్యానం = ఏకాగ్రత

న:

నిందించు = తిట్టు
నిర్మితి = నిర్మాణం
నెలవంక = చంద్రవంక
నేర్పరులు = నైపుణ్యంగలవారు
నేర్పు = నైపుణ్యం

ప:

పడి = జలుబు, సర్ది
పయోనిధి = సముద్రం
పరోపకారం = ఇతరులకు మేలు చేయడం
పసవు = పసుపు (రంగు)
పాషాణం = బండ
పెండ్యూలం = లోలకం
ప్రతిమ = బొమ్మ
ప్రతిష్ఠ = కీర్తి
ప్రసిద్ధి = ఖ్యాతి
ప్రాంగణం = ముంగిలి (వాకిలి)

TS 7th Class Telugu Grammar పదవిజ్ఞానం

బ:

బాదరాయణుడు = వ్యాసుడు

భ:

భంగాలు = అలలు
భయద = భయాన్ని కల్గించేది

మ:

మత్స్యకారులు = చేపలు పట్టేవారు
మధువు = తేనె
మనోరంజసం = మనస్సును సంతోషపెట్టేది
మనోహరం = ఇంపైనది, సక్కనైనది
మాగాణం = తరిపొలం
మావులు = మామిడితోటలు
మీను = చేప
ముట్టె = పందిముక్కు, పొత్రం
ముప్పు = ప్రమాదం
మేలుకొలుపు = నిద్రలేపు
మైనస = మేని దురద

ల:

లుప్తం = లోపించింది
ల్యాగ = దూడ

TS 7th Class Telugu Grammar పదవిజ్ఞానం

వ:

వలగొను = అల్లుకొను
వసుధ = భూమి, నేల
వక్త్రం = మొగం, ముఖం
వాచవి = నోటిరుచి
వాలం = తోక
వాగ్దానం = మాట ఇవ్వడం
విపినం = అడవి
వీనులవిందు = వినడానికి నచ్చిన
వెరుగు = భయం, బుగులు
వేడుక = పండుగ
వ్యాఖ్యానించు = వివరించు, చెప్పు

శ:

శిరం = తల, నెత్తి
శృంగ = కొమ్ము
శోభ = కాంతి, వెలుగు
శౌర్యం = శూరత్వం
శ్రేష్ఠం = ఉత్తమం, గొప్పది

స:

సంజ్ఞ = పేరు, గురుతు
సమరం = ఓర్పు
సాదృశ్యం = పోలిక
సాంగత్యం = సోపతి, స్నేహం
సున్నితనం = మెత్తని, సుకుమారం
సృజన = సృష్టి
సైన్యపాలి = సైన్యపాలకుడు, సేనాని
సౌజన్యం = మంచితనం
స్పందన = కదలిక
స్వప్నం = కల

హ:

హరిత్తు = సింహం

TS 7th Class Telugu Grammar పదవిజ్ఞానం

పర్యాయ పదాలు:

అల = కెరటం, తరంగం
అంగడి = దుకాణం, విపణి, మడిగె
అమ్మ = తల్లి, మాత, జనని
ఆత్మజుడు = కుమారుడు, కొడుకు, పుత్రుడు, తనయుడు, సుతుడు
ఆనందం = సంతోషం, హాయి, సుఖం
ఆశ = కోరిక, కాంక్ష
ఆసక్తి = అపేక్ష, అనురక్తి, శ్రద్ధ
ఇల్లు = గృహం, సదనం, నివాసం, ఆవాసం
ఈర్ష్య = అసూయ, ఈసు, మత్సరం
ఏనుగు = కరి, హస్తి, ఇభం, గజం
కంచు = కంచం, కాంస్యం
కిరణం = రశ్మి, వెలుగు, శిఖ
కుందేలు = చెవులపిల్లి, శశం, శరభం
గోవు = ఆవు, ధేనువు
చెట్టు = తరువు, భూరుహం, వృక్షం
చెఱువు = గుంట, తటాకం, సరస్సు
చేప = మీనం, మత్స్యం
దాత = త్యాగి, వితరణశీలి, ఉదారుడు
దూడ = లేగ, క్రేపు, పెయ్య
నీరు = జలం, సలిలం, ఉదకం
పల్లె = గ్రామం, ఊరు, జనపదం
పసిడి = కాంచనం, పుత్తడి, బంగారం, హేమం, కనకం
పక్షి = పులుగు, విహంగం, ఖగం
పిల్లి = బిడాలము, మార్జాలం
పులి = శార్దూలం, వ్యాఘ్రం
పూజ = అర్చన, సపర్య
భార్య = పతి, నాథుడు, మగడు, మొగుడు, పెనిమిటి
భార్య = పత్ని, ఆలు, ఇల్లాలు, పెండ్లం
మైత్రి = స్నేహం, నెయ్యం, సాంగత్యం, సోపతి
రణం = యుద్ధం, సమరం
రథము = తేరు, స్యందనం
రైతు = కర్షకుడు, కృషీవలుడు
వసుధ = భూమి, ధరణి, ధరిత్రి, అవని, నేల
వ్యవసాయం = కృషి, సేద్యం, కాపుదనం
విగ్రహం = ప్రతిమ, ప్రతిబింబం, ప్రతికృతి, ప్రతినిధి
శరీరము = దేహం, తనువు, పెయ్యి
సన్యాసి = భిక్షువు, జడధారి, యతి, ముని
సూక్తి = మంచిమాట, సుభాషితం

TS 7th Class Telugu Grammar పదవిజ్ఞానం

నానార్థాలు:

అంగడి = సంత, మడిగె
కంఠీరవం = మదగజం, పావురం, సింహం
కులం = వంశం, జాతి, శరీరం, ఊరు, ఇల్లు, నేతిపొట్ల, దేశం, పిల్లి
కేసరి = సింహం, గుఱ్ఱం, శ్రేష్ఠుడు, పున్నాగం, హనుమంతుని తండ్రి, మాదీఫలం
చైతన్యం = జ్ఞానం, జీవం
తగవు = జగడం, వ్యాజ్యం, పద్ధతి, మేలు, యుక్తం, న్యాయం, తీర్పు
ధనం = విత్తం, ఆస్తి, ఆవులమంద, ధనియం, ధనిష్ఠా నక్షత్రం
ద్విజుడు = బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు
నేర్పు = నేర్పించుట, సామర్థ్యం
పద్మం = కమలం, పాము, ఒకనిధి, సంఖ్యావిశేషం
ప్రతిష్ఠ = కీర్తి, స్థాపన
పశువు = గొట్టె, బలికి యిచ్చు మృగం, మేడిచెట్టు, ప్రమథగణం
పాదము = పద్యపాదం, కాలిఅడుగు భాగం, కిరణం, పాతికభాగం, వేరు
బలి = బలిచక్రవర్తి, గంధకం, చర్మపు ముడతలు, దున్నపోతు, బలవంతుడు, అర్పణం, పన్ను
భంగము = ఆటంకము, అల
వాలం = తోక, తలవెంట్రుక, కత్తి, పులి
వెరవు = ఉపాయం, విధం, వశం
వ్యవసాయం = కృషి, పరిశ్రమ, ప్రయత్నం, పాటుపడుట, నిశ్చలబుద్ధి
శాఖ = కొమ్మ, వేదభాగం
శ్రీ = సాలెపురుగు, బుద్ధిబలం, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అలంకారం, ఒకరాగం, విషం, సంపద
హాస్యం = నవ్వు, ఒకరసం, పరిహాసం

TS 7th Class Telugu Grammar పదవిజ్ఞానం

ప్రకృతి – వికృతులు:

ప్రకృతి – వికృతి
ఆశ – ఆస
ఆకాశం – ఆకసం
ఆశ్చర్యం – అచ్చెరువు
ఆహారం – ఓగిరం
కథ – కత
కవిత – కైత
కార్యం – కర్జం
చరిత్ర – చరిత
చిత్రం – చిత్తారు(వు)
దిశ – దెస
నిద్ర – నిద్దుర
పర్వం – పబ్బం
పక్షి – పక్కి
పశువు – పసరం
పుణ్యం – పన్నెం
పుస్తకం – పొత్తం
పౌర్ణమి – పున్నమి
భక్తి – బత్తి, బగితి
భాగవతం – బాగోతం
ముఖం – మొగం
రాత్రి – రాతిరి
వర్ణం – వన్నె
శిఖ – సిగ / సెగ
సంతోషం – సంతసం
సంధ్య – సందె/సంజ
సింహం – సింగం
స్తంభం – కంబం
స్నానం – తానం

TS 7th Class Telugu Grammar పదవిజ్ఞానం

వ్యుత్పత్త్యర్థాలు:

కమలాకరం = కమలాలకు ఆకరమైనది (కొలను)
తటాకం = జలంచే (కొట్టబడినది) నిండినది (చెఱువు)
పద్మాకరం = పద్మాలకు నెలవైనది-కొలను (చెఱువు)
వసుధ = వసువును (బంగారం) ధరించునది (భూమి)
రమానాథుడు= రమ(లక్ష్మికి) భర్తఅయినవాడు (విష్ణువు)
పయోనిధి = నీటికి నిధివంటిది (సముద్రం)

Leave a Comment