TS 7th Class Telugu Grammar లేఖలు

Telangana SCERT 7th Class Telugu Study Material Telangana Pdf లేఖలు Questions and Answers.

TS 7th Class Telugu Grammar లేఖలు

లేఖారచనలో పాటించాల్సిన నియమాలు :

  1. ఉత్తరం రాసేవారు లేఖ కుడివైపు పైభాగంలో తమ చిరునామా, తేదీని రాయాలి. ఇలా రాసేటప్పుడు పేరు తర్వాత కామా, ఊరి పేరు తర్వాత కామా పెట్టి, తేదీ తర్వాత ఫుల్స్టాప్ పెట్టాలి.
  2. ఉద్యోగాలకోసం పెట్టే దరఖాస్తులు, ఆఫీసులకు రాసే ఉత్తరాలు మొదలైనవాటిలో ఉత్తరం రాసేవారి పేరు, చిరునామాను ఉత్తరం ఎడమవైపు పైభాగంలో రాస్తారు.
  3. వ్యవహార లేఖల్లో ఊరిపేరు, తేదీ ఉత్తరం ఎడమవైపు కింది భాగంలో రాస్తారు. కొందరు ఉత్తరం పైభాగాన కుడివైపు రాస్తారు. ఇలా ఏదో ఒక చోట రాస్తే చాలు.
  4. ఎవరికీ రాస్తున్నామో వారి సంబోధన వాచకం (అమ్మా, అయ్యా, ప్రియమైన మొ||నవి) తరువాత కామా పెట్టాలి.
  5. రాయదలచిన విషయాన్ని సంగ్రహంగా, స్పష్టంగా రాయాలి. విషయం ఎక్కువగా ఉంటే పేరాల విభజన అవసరం.
  6. లేఖ చివరి భాగంలో కుడివైపున సంబంధ వాచకం రాసి కామా పెట్టి, దాని కింద సంతకం చేసి ఫుల్స్టాప్ పెట్టాలి.
  7. చిరునామా : వ్యక్తిగత లేఖల్లో ఈ చిరునామా ఉత్తరం కింది భాగాన ఎడమవైపు ఉంటుంది. వ్యాపార, వ్యవహార లేఖల్లో ఉత్తరం పైభాగాన ఎడమవైపు ఉంటుంది.

మనం ఎవరికి ఉత్తరం రాస్తున్నామో వారి పూర్తి పేరు, చిరునామా ఉత్తరంలోపల కూడా రాయడం అవసరం. చిరునామాలో పేరు, ఇంటినెంబరు, వీధి, ఊరు, జిల్లా, పిన్కోడ్ తప్పక రాయాలి.

TS 7th Class Telugu Grammar లేఖలు

లేఖలు:

రైతుల అగచాట్లు

ప్రశ్న 1.
మీ ఊరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గూర్చి వ్యవసాయాధికారికి లేఖ రాయండి.
జవాబు.

నల్గొండ,
తేది : XXXX

వ్యవసాయశాఖ అధికారిగారికి,

అయ్యా!

మా ఊళ్ళోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మీ దృష్టికి తేవడానికి ఈ లేఖ రాస్తున్నాను.

మా ఊరిలో సగంపైగా జనులు రైతులు. వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నవారే. సకాలంలో వర్షాలు లేని కారణంగా ఎండిపోయిన భూమిని తడపడానికి బోర్లు వేయించుకున్నారు. కాని విద్యుత్తు ఏది ? రోజు మొత్తం మీద ఒకటి రెండు గంటల కంటే కరెంటు ఉండదు. పొలానికి నీళ్ళు అందవు.

విత్తనాలు ఎరువులు నకిలీవి అమ్ముతున్నారు. కల్తీ ఎరువులు, కల్తీ పురుగుల మందులు, కరెంటుకోత, పక్షులదాడి ఇలా అన్ని పక్కల నుంచీ సమస్యలతో సతమతమౌతు రైతులు పండించగల దాంట్లో సగం కూడా ఉత్పత్తి చెయ్యలేకపోతున్నారు. అంతలోకే దళారులు మీదబడి గిట్టుబాటు ధర దక్కనీయకుండా కొనుక్కుపోయి ఎక్కువ ధరలకు అమ్ముకొని వాళ్ళు లాభపడుతున్నారు.

చేసిన అప్పులు తీర్చలేక ఆకలిబాధకు తాళలేక రైతులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. దయచేసి తమరు తగిన చర్యలు తీసుకొని రైతుల క్షేమం చూడాలని ప్రార్థిస్తున్నాము.

ఇట్లు
శ్రీనివాసులు
(రైతు సంఘం కార్యదర్శి)

చిరునామా :
జిల్లా వ్యవసాయశాఖాధికారి,
నల్గొండ,
నల్గొండ జిల్లా.

TS 7th Class Telugu Grammar లేఖలు

బాలికల చదువు

ప్రశ్న 2.
బాలికలు చదువుకోవలసిన అవసరం గూర్చి వివరిస్తూ మీ స్నేహితురాలికి లేఖ రాయండి.
జవాబు.

వనపర్తి,
తేది : XXXX

ప్రియమైన అంజలి!

మీ ఊరి పాఠశాలలో బాలురే తప్ప బాలికలు ఎక్కువ మంది లేరు అని నీ జాబులో రాశావు. అది చదివి నాకు చాలా బాధ కలిగింది. నా భావాలు నీతో పంచుకుందామని ఈ లేఖ రాస్తున్నాను.

మనదేశం ఎన్నో రంగాలలో ముందడుగు వేసింది. వేస్తున్నది. గొప్ప దేశాల ప్రక్కన స్థానం సంపాదించింది. కాని విద్యా రంగంలో మాత్రం బాలికలు చదువుకోక, ఆ లోటు లోటుగానే ఉండిపోతున్నది. ఆడపిల్లలు పనిపాట్లు చూసుకోవాలి. మగపిల్లలు బడికెళ్ళి చదువుకోవాలి అనే కొంతమంది తల్లిదండ్రుల ఉద్దేశం మారటం లేదు.

బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారు. నిర్బంధ విద్యా విధానం ప్రవేశపెట్టారు. ఉచితంగా పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉంది. పైస ఖర్చు లేకుండా చదువు చెబుతున్నా కొన్ని కుటుంబాల వారు ఆడపిల్లలను చదువుకోవడానికి ఒప్పుకోవడం లేదు.

బాలికలు చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది. దేశం బాగుపడుతుంది. చదువుకున్న ఆడపిల్లలు ఎంతో ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అన్ని రంగాల్లోనూ పురుషులను మించిపోయారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రతివారూ తమ ఆడపిల్లలను కూడా బడికి పంపించి చదివించాలి. దీనికి, మనవంతుగా ప్రజలను చైతన్యవంతులను చేద్దాం. బాలికలు నూరుశాతం అక్షరాస్యులయ్యేలా చేద్దాం. మన స్నేహితులను కూడగట్టుకుందాం. నేను చెప్పిన విషయం ఆలోచిస్తావుగా! ఉంటాను.

నీ స్నేహితురాలు,
దీప.

చిరునామా :
బొబ్బా అంజలి,
7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
వేముల,
మహబూబ్నగర్ జిల్లా.

TS 7th Class Telugu Grammar లేఖలు

బడి బాట

ప్రశ్న 3.
‘బడిబాట’ ఆవశ్యకతపై మీ మిత్రుడికి లేఖ రాయండి.
జవాబు.

పరిటాల,
తేది : XXXX

ప్రియమైన శంకర్!

మొన్న మా బడికి మునిసిపల్ కమీషనర్ వచ్చారు. మా బడిని మేము శుభ్రంగా, అందంగా ఉంచుకున్న తీరును చూసి చాలా మెచ్చుకున్నారు. విద్యార్థుల క్రమశిక్షణకు ఉత్సాహానికి పొంగిపోయారు. ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు.

ఇంకా ఏమన్నారో తెలుసా! “పిల్లలకు చదువు తప్పకుండా నేర్పించాలి ఇంకా ఇప్పటికీ పిల్లలను బడికి పంపకుండా పనికి పంపిస్తున్న వాళ్ళెంతో మంది ఉన్నారు. నిర్బంధ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినా కొంతమంది లెక్కజేయ్యట్లేదు. కూలినాలిచేసి నాలుగు డబ్బులు తెస్తారులే అంటూ పిల్లలను తల్లిదండ్రులు పనిలోకి తోలుతున్నారు.

హాయిగా బడికెళ్ళి చదువుకుంటూ, ఆడుకుంటూ ఆనందించాల్సిన బాలబాలికలు కూలిపనులు చేసుకుంటూ దీనస్థితిలో బతుకుతున్నారు. ఈ అన్యాయాన్ని ఆపటం, మనతోటి పిల్లలందరినీ బడిబాట పట్టించటం మనందరి బాధ్యత. మనమంతా మంచి ఉత్సాహవంతులం.

తలుచుకుంటే ఏమైనా సాధించగలం. కనుక దుకాణాల్లో, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న పిల్లలను తీసుకొచ్చి బడిలో చేర్పించాలి” అని చెప్పారు. అందుకే సాయంత్రం బడి అయిపోగానే ఒక గంట అలా తిరిగి పిల్లలను, వాళ్ళ పెద్దలను ఒప్పించి బడిలో చేరుస్తున్నాం. నువ్వుకూడా ఇలాంటి ప్రయత్నం చెయ్యి. మరి ఉంటాను.

నీ ప్రియమిత్రుడు,
రవిచంద్ర.

చిరునామా :
రవిశంకర్,
7వ తరగతి,
జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల,
జగద్గిరినగర్,
రంగారెడ్డి జిల్లా.

గ్రామ సౌభాగ్యం

ప్రశ్న 4.
గ్రామ సౌభాగ్యం గూర్చి వివరిస్తూ మీ స్నేహితురాలికి లేఖ రాయండి.
జవాబు.

వలివేరు,
తేది : XXXX

ప్రియమైన వాణీ!

బాగా చదువుతున్నావా ? నేను బాగానే చదువుతున్నాను. మా ఊళ్ళో బాగా వానలు పడుతున్నాయి. చాలా కాలం తరువాత సకాలంలో ఋతుపవనాలొచ్చాయి అనుకుంటున్నారు మా ఊళ్ళో వాళ్ళంతా. ఊరంతా పచ్చపచ్చగా బలే అందంగా ఉందిలే. రైతులంతా చకచకా పొలం పనుల్లో మునిగిపోయారు.

కూరగాయల తోటలు, పళ్ళ తోటలు కళకళలాడి పోతున్నాయి. పూలచెట్లన్నీ విరగ బూస్తున్నాయి. ఇలా గనుక వాతావరణం ఉంటే రైతులకు రోజూ పండగే. గ్రామాలు సమృద్ధంగా ఉంటాయి. కరువులు తీరి అందరికీ కడుపులు నిండుతాయి. ఇదే కదా గ్రామ సౌభాగ్యం!

గ్రామాలు సమృద్ధంగా ఉంటే దేశం సమృద్ధంగా ఉన్నట్లే. ప్రజలంతా సంతోషంగా జీవిస్తారు. ఇంతకంటె ఎక్కువగా ఎవరైనా ఏం కోరతారు ? నువ్వు తీరిక జేసుకుని మా ఊరికిరా. ఈ ప్రశాంతమైన వాతావరణంలో కొన్ని రోజులు కలిసి గడుపుదాం. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

ఇట్లు
నీ స్నేహితురాలు,
కళ్యాణి.

చిరునామా :
జి. సత్యవాణి,
7వ తరగతి,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
సీతాఫల్ మండి,
హైదరాబాదు.

TS 7th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 5.
పుస్తకాలు కొనడానికి రు. 300/- పంపమని కోరుతూ మీ తండ్రిగారికి లేఖ రాయండి.
జవాబు.

భద్రాచలం,
తేదీ : XXXX

నాన్నగారికి,

నమస్కారాలు. మీరు, అమ్మ కులాసా అని తలుస్తాను. నేను ఇక్కడ బాగానే చదువుతున్నాను. నాకు అట్లాసు, ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకాలు కావాలి. దయయుంచి వెంటనే రు. 300/- మనియార్డరు ద్వారా పంపవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
మీ కుమారుడు,
రమణ.

చిరునామా :
సాకేటి రామకృష్ణ గారు,
డోర్. నెం. 10 – 8 31,
మూడు బొమ్మల సెంటర్,
పరకాల,
వరంగల్ జిల్లా.

ప్రశ్న 6.
మీ పాఠశాలలో జరిగిన రిపబ్లిక్ దినోత్సవ (గణతంత్ర దినోత్సవం) వేడుకలపై మీ స్నేహితురాలికి లేఖ రాయండి.
జవాబు.

నకిరేకల్,
తేదీ : XXXX

స్నేహితురాలు హైమకు,

గడచిన జనవరి 26న మా పాఠశాలలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకొన్నాం. నాటి సమావేశానికి మా కలెక్టర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆయన భారత రిపబ్లిక్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో చక్కగా చెప్పారు. సభా ప్రారంభానికి ముందు జాతీయ జెండాను ఎగురవేసి జెండాగీతాన్ని పాడాం. ‘జనగణమన’తో సభాకార్యక్రమం ముగిసింది. చివరిలో అందరికీ మిఠాయిలు పంచి పెట్టారు.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
అంజలి.

చిరునామా :
పారేపల్లి హైమకుమారి,
శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ స్కూల్,
మెయిన్ రోడ్,
చిట్యాల.

TS 7th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 7.
మీరు చదివిన మంచి పుస్తకం గురించి మీ తల్లి గారికి లేఖ రాయండి.
జవాబు.

చెన్నూరు,
తేదీ : XXXX

అమ్మకు,

నమస్కారాలు. మీరంతా అక్కడ కులాసాగా ఉన్నారని తలుస్తాను. ఇక్కడ నేను బాగా చదువుకుంటున్నాను. ఈ మధ్యే మా పాఠశాల గ్రంథాలయం నుండి బొమ్మల పంచతంత్రం తీసుకొని చదివాను. అందులోని కథలన్నీ జంతువుల మధ్య జరిగినట్లు ఉంటాయి. కానీ ఆ కథల నిండా ఎన్నెన్నో నీతులు, మంచి విషయాలు చెప్పారు. తమ్ముడితో కూడా ఈ పుస్తకం చదివించండి.

నీ కుమార్తె,
మల్లేశ్వరి.

చిరునామా :
శ్రీ జంజనం లక్ష్మీ,
డోర్ నెం. 10-17,
రత్నాల చెరువు సెంటర్,
ఆదిలాబాద్.

యాత్రా విశేషాలు

ప్రశ్న 8.
మీ యాత్రా విశేషాలను వివరిస్తూ స్నేహితురాలికి లేఖ రాయండి.
జవాబు.

కోదాడ,
తేది : XXXX

ప్రియమైన స్నేహితురాలు సాయిశృతికి,

నీ మిత్రురాలు రాయునది. నేను క్షేమం. ఈ మధ్య మా పాఠశాల విద్యార్థులను మా సార్లు భద్రాచలం తీసుకువెళ్ళారు. భద్రాచలం ఖమ్మం జిల్లాలో ఉన్నది. గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడి రామాలయం చాలా ప్రసిద్ధి పొందింది. 17వ శతాబ్దంలో కంచెర్ల గోపన్న దీనిని నిర్మించాడు. చుట్టూ దండకారణ్యం ఉన్నది. ఇక్కడకు దగ్గరలో పర్ణశాల ఉన్నది. భద్రగిరిపై నిర్మించబడిన దేవాలయం ఇది. జటాయువుపాక, దమ్ముగూడెం, శబరిగిరి మొదలైనవి దర్శనీయ స్థలాలు. ఇక్కడ శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణోత్సవం అద్భుతంగా జరుగుతుంది. మేమందరం గోదావరిలో స్నానం చేసి, అన్నీ చూసి వచ్చాము. అక్కడి వాతావరణం ఎంతో బాగుంది.

ఇట్లు,
నీ ప్రియమిత్రురాలు,
బి. శ్రావ్య,
కోదాడ.

చిరునామా :
వి. సాయిశృతి,
7వ తరగతి,
రంగాపురం,
మంచాల మండలం,
రంగారెడ్డి జిల్లా,
తెలంగాణ.

TS 7th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 9.
మీరు చూసిన లేదా మీకు తెలిసిన ఒక మంచి కుటుంబాన్ని గురించి మీ భావనలను తెలుపుతూ మీ స్నేహితుడికి ఉత్తరం రాయండి.
జవాబు.

మిర్యాలగూడ,
తేదీ : XXXX

ప్రియమైన స్నేహితుడు రమేష్కు,

నేను బాగానే చదువుతున్నాను. ఈ మధ్య ఒక సెలవు రోజున మా స్నేహితుడు బళ్ళా మహేష్ ఇంటికి వెళ్ళాను. వారిది ఉమ్మడి కుటుంబం. అమ్మ, నాన్న, తాతయ్య, నాన్నమ్మలతో ఆ ఇల్లు కళకళలాడుతూ వుంది. పిల్లలకు పెద్దలంటే భక్తి. తాతయ్య దగ్గర, నాన్నమ్మ దగ్గర నా స్నేహితుడు అనేక కథలను తెలుసుకొంటాడు. వాడంటే వారిద్దరికి చాలా అనురాగం. వాళ్ళ అమ్మ, నాన్న పెద్దలను ఎంతో గౌరవంగా, ప్రేమగా చూసుకుంటారు. ఆ మంచి కుటుంబాన్ని చూశాక నాకు కూడా పెద్దలపై గౌరవం పెరిగింది. నీవు కూడా మీ కుటుంబం గురించి గాని, తెలిసిన మంచి కుటుంబం గురించి గాని లేఖ వ్రాయి. మీ అమ్మ గారికి, నాన్న గారికి నమస్కారములు.

ఇట్లు
నీ మిత్రుడు,
ఈశ్వర్.

చిరునామా :
పి. రమేష్,
7వ తరగతి ‘ఏ’ విభాగం,
భారతీ విద్యాలయం, నాగార్జునసాగర్,
నల్గొండ జిల్లా.

ప్రశ్న 10.
చదువు ప్రాధాన్యతను తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

మెదక్,
X X X X X.

ప్రియమైన మిత్రుడు రామారావుకు,

శుభాకాంక్షలు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఎంతోమంది పిల్లలు బడికి దూరంగా ఉంటున్నారు. వివిధ పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. చదువుకోవలసిన వయస్సులో పనులు చేస్తున్నారు. నేను ఈ విషయాన్ని గుర్తించి బాలకార్మికులుగా ఉన్నవారిని బడిలో చేర్పించాను. చదువు అవసరాన్ని వివరించి చెప్పాను. చదువు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాను. నీవు కూడా బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించు. వారందరికి చదువు ప్రాధాన్యతను వివరించు. పెద్దలకు నమస్కారాలు తెలుపు.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి.చంద్రశేఖర్.

చిరునామా :
కె. రామారావు,
7వ తరగతి,
ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల,
పాల్వంచ, ఖమ్మం జిల్లా.

TS 7th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 11.
వృద్ధులపట్ల పిల్లలు ఆదరాభిమానాలు చూపాలనే ఆలోచనను కల్గించే విధంగా చైతన్యాన్ని పెంపొందించాలని కోరుతూ పత్రికా సంపాదకునికి లేఖ రాయండి.
జవాబు.

కరీంనగర్,
X X X X X.

గౌరవనీయులైన
ప్రతికా సంపాదకునికి,
నవతెలంగాణ పత్రికా కార్యాలయం,
హైదరాబాద్.

అయ్యా,

ఈనాటి సమాజంలో ఎంతోమంది వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు. వివిధ కారణాలతో వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. ఇది విచారింపదగిన విషయం. పిల్లలు తమ తల్లిదండ్రులపట్ల, తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మలపట్ల ఆధారం చూపాలి. వారికి అవసరమైన సపర్యలు చేయాలి. మానవీయ విలువలను కాపాడాలి. ఈతరం విద్యార్థుల్లో వృద్ధులపట్ల ఆదరం చూపించాల్సిన బాధ్యతను పెంపొందిచాల్సి ఉంది. ఉపాధ్యాయులు, పెద్దలు విద్యార్థుల్లో పరివర్తనను సాధించాలి. మీ పత్రిక ద్వారా నేటి యువతలో వృద్ధులపట్ల సేవాదృక్పధం అలవడే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను.

ఇట్లు,
మీ విధేయుడు,
పి. మల్లికార్జునరావు.

చిరునామా :
గౌ॥ పత్రికా సంపాదకుడు,
నవతెలంగాణ పత్రికా కార్యాలయం’,
హైదరాబాద్.

ప్రశ్న 12.
శతక పద్యాలు మానవీయ విలువలను పెంచుతాయి. దీన్ని సమర్థిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

బాసర,
X X X X X.

ప్రియమైన మిత్రుడు సతీష్ చంద్రకు,

శుభాకాంక్షలు. నేను బాగానే ఉన్నాను. నీవు కూడా బాగానే ఉన్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది మొదట, సాహిత్యంలో శతక పద్యాలకు ప్రాధాన్యత ఉంది. ఈ శతక పద్యాలు విద్యార్థుల్లో సత్ప్రవర్తనను కలిగిస్తాయి. మానవీయ సంబంధాలను పరిపుష్టం చేస్తాయి. సమాజం పట్ల గౌరవాన్ని, సేవాదృక్పధాన్ని కలిగిస్తాయి. అందువల్ల శతక పద్యాలను అందరు చదువాలి. ఆదర్శవంతులుగా తయారవ్వాలి. నీవు కూడా శతక పద్యాలను చదివి అందరికి ఆదర్శంగా నిలిచే గుణాలను పెంపొందించుకుంటావని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
వి. మనోజ్ఞ.

చిరునామా :
వి.సతీష్,
7వ తరగతి,
నిర్మలా హైస్కూల్,
కొత్తపేట,
భద్రాచలం,
ఖమ్మం జిల్లా.

TS 7th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 13.
బంగారు తెలంగాణ సాధించడానికి అందరు ఒక్కటిగా కలసిరావాలని తెలియజేస్తూ మీ తమ్మునికి లేఖ రాయండి.
జవాబు.

మధిర,
X X X X X.

ప్రియమైన తమ్మునికి,

శుభాకాంక్షలు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేసిన ఫలితంగా మనం తెలంగాణ సాధించుకున్నాం. ఈ విషయం అందరికీ తెలుసు. మనం సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లోను ముందుకు వెళ్ళాలి. బంగారు తెలంగాణ సాధించాలి. స్వయం సమృద్ధిని పొందాలి. దీనికి మనమంతా ప్రభుత్వానికి సహకరించాలి. అప్పుడే మన ముఖ్యమంత్రి కలలు కంటున్న బంగారు తెలంగాణ సాధించగలుగుతాము. అమ్మానాన్నలకు నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియసోదరుడు,
పి.శ్రీనివాసరావు.

చిరునామా :
పి. సుందరరావు,
7వ తరగతి,
నేతాజీ ఉన్నత పాఠశాల,
నెహ్రూబొమ్మ సెంటర్,
కరీంనగర్, కరీంనగర్ జిల్లా.

ప్రశ్న 14.
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలియజేస్తూ పత్రికా సంపాదకునికి లేఖ రాయండి.
జవాబు.

ముస్తాబాదు,
X X X X X.

గౌరవనీయులైన
పత్రికా సంపాదకులు,
ఆంధ్రప్రభ పత్రికా కార్యాలయం,
కరీంనగర్.
అయ్యా,

మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే వాతావరణం ప్రశాంతంగాను, ఆరోగ్యకరంగాను ఉంటుంది. ఈ ఉద్దేశ్యంతోనే భారత ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ స్థాయిల్లో విజయవంతంగా అమలు చేస్తున్నది. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అవసరం. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి. ముందుగా ప్రజలు తమ ఇంటిని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే నిర్మలమైన వాయువును మనం పీల్చగలుగుతాము. స్వచ్ఛభారత్ కార్యక్రమ లక్ష్యాలపై మా పత్రిక ద్వారా ప్రజల్లో అవగాహన పెంచవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
మీ విధేయుడు,
పి. ప్రభాకర్.

చిరునామా :
గౌ॥ పత్రికా సంపాదకులు,
‘ఆంధ్రప్రభ’ పత్రికా కార్యాలయం,
‘కరీంనగర్,
కరీంనగర్ జిల్లా.

TS 7th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 15.
గ్రామీణ వాతావరణ మాధుర్యాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ.
జవాబు.

ధర్మపురి,
X X X X X.

ప్రియమైన మిత్రుడు రవిచంద్రకు,

శుభాకాంక్షలు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన దేశానికి గ్రామాలు పట్టుగొమ్మలు. గ్రామీణాభివృద్ధితోనే సమాజాభివృద్ధి సాగుతుంది. పల్లెలు ప్రకృతికి వన్నె తెస్తాయి. ఇక్కడి వాతావరణం ప్రశాంతంగాను, మనోహరంగాను ఉంటుంది. కాలుష్య రహిత వాతావరణం పల్లెల్లో ఉంటుంది. ప్రజల మధ్య ఐక్యత ఉంటుంది. ఆత్మీయ పలకరింపులు ఉంటాయి. ఇక్కడి వాతావరణం నాకు బాగా నచ్చింది. నీవు ఒకసారి మా పల్లెకు వచ్చి స్వయంగా ఇక్కడి వాతావరణాన్ని చూడు. పెద్దలకు నమస్కారం తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. శివప్రసాద్.

చిరునామా :
పి. రవిచంద్ర,
7వ తరగతి,
మాంటిసోరి ఇంగ్లీషుమీడియం స్కూల్,
దిల్సుఖ్నగర్, కోణార్క్ థియేటర్ వద్ద,
హైదరాబాద్.

ప్రశ్న 16.
నీకు నచ్చిన ఒక జానపద కళను గురించి సోదరికి లేఖ రాయండి.
జవాబు.

అంకుశాపురం,
X X X X X.

ప్రియమైన సోదరి లక్ష్మికి,

శుభాకాంక్షలు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన తెలంగాణ రాష్ట్రం ప్రాచీన జానపదకళలకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో ఎన్నో జానపదకళలు జీవం పోసుకున్నాయి. నాకు నచ్చిన జానపదకళ బుర్రకథ. ఇది చాలా ఆసక్తిగా ఉంటుంది. కథకులు ప్రేక్షకుల్లో, ఉత్తేజాన్ని నింపుతారు. మధ్యలో హాస్యం కూడా బాగుంటుంది. కథాకథనం ఆసక్తికరంగా ఉంటుంది. అందుకు నాకు బుర్రకథ అంటే చాలా ఇష్టం. నీకు నచ్చిన జానపదకళ గురించి నాకు వివరంగా లేఖ రాయుము.

ఇట్లు,
నీ. ప్రియసోదరుడు,
పి. శరచ్చంద్ర.

చిరునామా :
పి.లక్ష్మి
7వ తరగతి,
శ్రీహర్ష పబ్లిక్ స్కూల్,
గౌతమీనగర్,
నిజామాబాద.

TS 7th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 17.
రామప్పగుడి శిల్పకళా చాతుర్యానికి ప్రతీక అని వివరిస్తూ తండ్రికి లేఖ రాయండి.
జవాబు.

చేవెళ్ళ,
X X X X X.

పూజ్యులైన తండ్రిగార్కి,

నమస్కారములు. నేను బాగా చదువుతున్నాను. ఇటీవల మా పాఠశాల విద్యార్థులం విహారయాత్ర కోసం వరంగల్ జిల్లాకు వెళ్ళాము. ఒకప్పుడు వరంగల్ ప్రాంతాన్ని కాకతీయులు పాలించారు. కాకతీయులు శిల్పకళను చక్కగా పోషించారు. ముఖ్యంగా వరంగల్కు 7 కి. మీ. దూరంలో ఉన్న రామప్పగుడి ఎంతో బాగుంది. ఒక శిల్పి పేరుతో దేవాలయానికి ఆ పేరు వచ్చిందని తెలుసుకున్నాను. నక్షత్రాకారంలోని ఒక పెద్దబండపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ శిల్పకళా సంపద చూపరులను కట్టిపడవేస్తుంది. ఈ గుడి మన తెలంగాణకు మణిరత్నం అని చెప్పవచ్చు. అమ్మకు నమస్కారాలు తెలుపగలరు.

ఇట్లు,
మీ ప్రియపుత్రుడు,
టి. రవీంద్ర.

చిరునామా :
టి. చంద్రశేఖర్,
ఉపాధ్యాయుడు,
రాష్ట్ర గురుకుల పాఠశాల,
ఉట్నూరు,
అదిలాబాద్ జిల్లా.

ప్రశ్న 18.
బతుకమ్మ పండుగ విశేషాలను పొరుగు రాష్ట్రంలోని మిత్రునికి తెలియజేస్తూ లేఖ రాయండి.
జవాబు.

వరంగల్,
X X X X X.

ప్రియమైన మిత్రుడు రాఘవకు,

శుభాకాంక్షలు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మా రాష్ట్రంలో బతుకమ్మపండుగ అద్భుతంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను అధికార పండుగగా గుర్తించింది. ఎంతోమంది మహిళలు, ఉద్యోగులు బతుకమ్మలను రకరకాల పూలతో తయారుచేశారు. ఆటపాటలతో నృత్యాలు చేశారు. బతుకమ్మ పాటలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు. చివరి రోజున బతుకమ్మలను చెరువులలో నిమజ్జనం చేశారు. ఈ పండుగ ప్రజల మధ్య సోదరభావాన్ని, సమైక్యతను కలిగించింది. మీ ప్రాంతంలో జరిగిన దసరా వేడుకలను గూర్చి వివరంగా తెలియజేయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. పార్థసారధి.

చిరునామా :
పి. రాఘవ,
7వ తరగతి,
గాంధీ ఉన్నత పాఠశాల,
ఈడుపుగల్లు,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్.

TS 7th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 19.
నేత్రదానం చేయవలసిందిగా అందరిని ప్రోత్సహిస్తూ పత్రికలో ప్రచురించవలసిందిగా సంపాదకునికి లేఖ రాయండి.
జవాబు.

కొత్తగూడెం,
X X X X X.

ఈనాడు పత్రికా సంపాదకునకు, అయ్యా,

మన దేశంలో గ్రుడ్డితనంతో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువ. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు పెద్దలు. అలాంటప్పుడు కళ్ళు లేనివారి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. వారి జీవితాలలో వెలుగు ప్రసాదింపజేయటం సాటి మానవులుగా మన కర్తవ్యం. అందుకు నేత్రదానం చేయడం ఎంతైనా అవసరం. మనిషి తాను మరణించిన తరువాత తన నేత్రాలను దానం చేయడం ద్వారా మరొకరికి చూపు ప్రసాదించిన వాడవుతాడు. కాబట్టి అన్ని దానాలలోకి నేత్రదానం చాలా గొప్పది. దీన్ని ప్రోత్సహిస్తూ మీ పత్రికలో ప్రచురించి ప్రజలు చైతన్యవంతులగునట్లు చేయవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
ఐ. గణేష్ కుమార్.

చిరునామా :
పత్రికా సంపాదకుడు,
‘ఈనాడు’ కార్యాలయం,
కరీంనగర్.

ప్రశ్న 20.
నీ మాతృదేశాన్ని (భారతదేశం) గురించి పరిచయం చేస్తూ విదేశంలోని కలం స్నేహితునికి లేఖ రాయండి.
జవాబు.

జగిత్యాల,
X X X X X.

ప్రియ కలం స్నేహితుడు జాన్ డేవిడ్ పాల్కు,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు కూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను. నేను ఈ లేఖలో మా భారతదేశ విశేషాలు తెలియజేస్తున్నాను.

ఆసియా ఖండంలోగల పెద్ద దేశాలలో భారతదేశం ఒకటి. దీనినే ‘ఇండియా’ అని పిలుస్తారు. మా భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం ఎల్లలుగా ఉన్నాయి. మా దేశంలో సింధు, గంగ, యమున, కృష్ణ, గోదావరి వంటి జీవనదులెన్నో ఉన్నాయి.

భారతదేశంలో వివిధ జాతులవారు, మతాలవారు ఉన్నారు. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనటానికి మా దేశాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సత్యం, అహింసయే ఆయుధాలుగా భావించెడి దేశం మాది. సర్వమానవులను సౌభ్రాతృత్వ దృష్టితో చూస్తూ అందరి సుఖశాంతులను కాంక్షించేదే మా భారతదేశం.

ఇట్లు,
నీ కలం స్నేహితుడు,
డి. వి. శ్యామసుందర్.

చిరునామా : జాన్ డేవిడ్ పాల్,
డోర్ నెం. 4/159, -కెనడీ రోడ్,
వాషింగ్టన్,
అమెరికా.

TS 7th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 21.
విహారయాత్రను గూర్చి స్నేహితునికి / స్నేహితురాలికి లేఖ రాయండి.
జవాబు.

రంగాపురం,
X X X X X.

ప్రియమైన విరజకు,

శుభాకాంక్షలతో కల్పన వ్రాయునది.

నేను వేసవి సెలవులలో హైదరాబాదు విహారయాత్రచేసి వచ్చాను. అక్కడ చూడాల్సిన వింతలు, విశేషాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సాలార్జంగ్ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్స్, నెహ్రూ జంతుప్రదర్శనశాల (జూ), చార్మినార్, బిర్లామందిర్, అసెంబ్లీహాల్, గోలకొండ మొదలైనవి చూసి నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.

హైదరాబాదు సికిందరాబాదు జంటనగరాల సౌందర్యాన్ని అందరూ తప్పక చూడవలసిందే. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యపట్టణమైన హైదరాబాదును నీవు కూడా దర్శించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు
నీ ప్రియ స్నేహితురాలు,
జి. కల్పన.

చిరునామా :
కె. విరజ,
6వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
చౌటుప్పల్,
నల్లగొండ జిల్లా.

ప్రశ్న 22.
సెలవు కోరుతూ ప్రధానోపాధ్యాయునికి లేఖ రాయండి.
జవాబు.

నల్లగొండ,
X X X X X.

ప్రధానోపాధ్యాయుడు,
జి.ప. పాఠశాల,
కుర్మేడు,
నల్లగొండ.

అయ్యా,

వినయపూర్వక నమస్కారం. రామ్కుమార్ అనే నేను తమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాను. నాకు గత నాల్గు రోజులుగా ఆరోగ్యం బాగా ఉండటం లేదు. డాక్టరుగారు మద్రాసు వెళ్ళి వైద్యం చేయించుకోవలసిందిగా సలహాయిచ్చారు. అందువల్ల నేను పాఠశాలకు హాజరుకాలేకపోవుచుంటిని. తమరు దయతో నేటి నుంచి వారం రోజులు సెలవును మంజూరుచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తిరిగి రాగానే డాక్టరు సర్టిఫికెట్ జతపరచగలవాడను.

ఇట్లు,
తమ విధేయుడు,
రామ్కుమార్,
6వ తరగతి.

TS 7th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 23.
పండుగను గురించి స్నేహితురాలికి లేఖ రాయండి.
జవాబు.

రంగారెడ్డి,
X X X X X.

ప్రియ స్నేహితురాలు శైలజకు,

నేను బాగా చదువుతున్నాను. నీ చదువు ఎలా సాగుతున్నది ? నేను ఈ లేఖలో నాకు బాగా నచ్చిన దీపావళి పండుగను గురించి వ్రాస్తున్నాను. దీపావళి పండుగకు మా నాన్నగారు రకరకాల మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు ఎన్నో తీసుకువస్తారు. నేను, మా అన్నయ్య, మా తమ్ముడు ముగ్గురం కలిసి సరదాగా కాలుస్తాం. మేము – పువ్వొత్తులు కాలుస్తుంటే మా తల్లిదండ్రులు చూసి ఎంతో ఆనందిస్తారు. కాంతులను విరజిమ్మే ఈ పండుగ అంటే నాకెందుకో చెప్పరానంత ఇష్టం.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
ఆర్. అన్విత.

చిరునామా:
జి. శైలజ,
6వ తరగతి,
బాలికల పాఠశాల,
మోర్తాడ్, నిజామాబాద్.

ప్రశ్న 24.
పుస్తకాలు కొనడానికి రూ.500/- పంపమని కోరుతూ నాన్నగారికి లేఖ రాయండి.
జవాబు.

హైదరాబాద్,
X X X X X.

పూజనీయులైన నాన్నగారికి,

నమస్కారాలు. నేను ఇక్కడ బాగానే చదువుతున్నాను. వచ్చే నెలలో మా సాంవత్సరిక పరీక్షలు జరుగుతాయి. పరీక్షఫీజు ఈ నెలాఖరులోపు కట్టాలి. పరీక్షకు సంబంధించిన కొన్ని పుస్తకాలు కూడా కొనాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయయుంచి వెంటనే ఔ 500/- మనియార్డరు ద్వారా పంపవలసినదిగా ప్రార్థిస్తున్నాను. తమ్ముళ్ళను, చెల్లాయిని అడిగినట్లు చెప్పగలరు. అమ్మగారికి నా నమస్కారాలు.

ఇట్లు,
మీ కుమారుడు,
గణేష్.

చిరునామా :
ఎస్. విశ్వనాథ్ గారు,
8. 30. 6-8-13,
చౌటుప్పల్,
నల్లగొండ జిల్లా.

TS 7th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 25.
గురుపూజోత్సవం (ఉపాధ్యాయ దినోత్సవం) గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

జగద్గిరినగర్,
X X X X X.

ప్రియమిత్రుడు పుష్పరాజ్కు,

గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురుపూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవం దినంగా ప్రకటించింది కదా ! మేము మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరిని ఆ రోజున ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాం. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇట్లు
నీ మిత్రుడు,
జయరాజ్.

చిరునామా :
ఎస్. పుష్పరాజ్,
6వ తరగతి,
ప్రజా ఉన్నత పాఠశాల,
సీతాఫల్మండి,
హైదరాబాద్.

ప్రశ్న 26.
రిపబ్లిక్ దినోత్సవం (గణతంత్ర దినోత్సవం) గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

రంగాపురం,
X X X X X.

ప్రియ స్నేహితుడు క్రాంతికుమార్కు,

గడచిన జనవరి 26న మా పాఠశాలలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకొన్నాం. నాటి సమావేశానికి మా జిల్లా విద్యాశాఖాధికారి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆయన భారత రిపబ్లిక్ దినోత్సవ ప్రాముఖ్యాన్ని గూర్చి చక్కగా ఉపన్యసించారు. సభా ప్రారంభానికి ముందు జాతీయ జెండాను ఎగురవేసి జెండాగీతాన్ని పాడాం. ‘జనగణమన’తో సభాకార్యక్రమం ముగిసింది. చివరిలో అందరికి స్వీట్సు పంచిపెట్టబడ్డాయి.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితుడు,
జి. సంపత్.

చిరునామా:
బి. క్రాంతికుమార్,
6వ తరగతి,
విజ్ఞానభారతి హైస్కూల్,
చౌటుప్పల్,
నల్గొండ జిల్లా.

TS 7th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 27.
ఎన్. ఎస్. ఎస్. సేవా కార్యక్రమాలను వివరిస్తూ మిత్రుడికి లేఖ.
జవాబు.

జగిత్యాల,
X X X X X.

ప్రియ మిత్రుడు శ్రీహర్షకు,

నేను బాగానే చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. ఈ లేఖలో మేము ఇటీవల జరిపిన ఎన్.ఎస్.ఎస్. సేవా కార్యక్రమాలను తెలియజేస్తున్నాను.
మా పాఠశాల విద్యార్థులం పరిసర గ్రామాన్ని ఒకదానిని దత్తత తీసుకొని ఆ గ్రామంలో రోడ్లు వేశాం. మురికివాడలను శుభ్రపరచాం. నిరక్షరాస్యులకు విద్య బోధించాం. అక్కడి ప్రజలకు ఆరోగ్య సూత్రాలను, వయోజన విద్యావశ్యకతను, జనాభా సమస్య నివారణను గురించి తెలియపరచాం. ఇంకా పొదుపు ఆవశ్యకతను గురించి కూడా ప్రచారం చేశాం. మీ పాఠశాల విద్యార్థులు కావించిన సేవా కార్యక్రమాలను గురించి తెలియపరచగలవని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
దిలీప్ కుమార్.

చిరునామా :
అగ్గిరాజు శ్రీహర్ష,
10వ తరగతి,
ఉట్నూరు,
అదిలాబాదు జిల్లా.

Leave a Comment