TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson ఎలుకమ్మ పెళ్ళి

Telangana SCERT 6th Class Telugu Study Material Telangana ఉపవాచకం 3rd Lesson ఎలుకమ్మ పెళ్ళి Textbook Questions and Answers.

TS 6th Class Telugu Guide Upavachakam 3rd Lesson ఎలుకమ్మ పెళ్ళి

ప్రశ్నలు – జవాబులు:

ప్రశ్న 1.
ఈ కథ (ఎలుకమ్మ పెళ్ళి) మీకు నచ్చిందా ? ఎందుకో రాయండి.
జవాబు.
ఈ కథ నాకు నచ్చింది. ఎలుక పిల్ల ‘మూషిక బాల’గా మారినప్పటికి తన సహజ లక్షణాలను విడిచిపెట్టలేదు. శివాలయంలో వినాయకుడి విగ్రహం దగ్గరే సమయమంతా గడిపేది. శివుడి కంటే గొప్పగా వినాయకుడికే పూజలు చేసేది. అతనికి సమర్పించిన నైవేద్యమే తినేది.

‘గీత’ అనే అమ్మాయి ప్రమాదవశాత్తు వేటగాడి వలలో ఇరుక్కున్నది. ఎంతమంది ప్రయత్నించినా ఆ వల నుంచి గీతను తప్పించలేకపోయారు. అప్పుడు మూషిక బాల తన పదునైన దంతాలతో ఆ వల తాళ్ళను కొరికి గీతను కాపాడింది.
మూషిక బాల తన వివాహ విషయంలో స్వతంత్రమైన నిర్ణయం తీసుకున్నది. సూర్యుడు, మేఘుడు, వాయుదేవుడు, మేరుపర్వతుడు వరులుగా వచ్చినప్పటికీ వారిని తిరస్కరించి, తనకు నచ్చిన మూషికరావునే వివాహమాడింది. ఈ విధంగా ఈ కథలో ‘మూషిక బాల’ సహజ స్వభావాన్ని చక్కగా వివరించడం జరిగింది. అందువల్ల ఈ కథ నాకు నచ్చింది.

ప్రశ్న 2.
“ఎవరి బుద్ధి వారిది అది మారనే మారదు” అనే విషయం ఎలుక విషయంలో నిజమైందా ? లేదా ? మనుషులు కూడా అలాగే ఉంటారా ? మారతారా ? మీ అభిప్రాయం రాయండి.
జవాబు.
“ఎవరి బుద్ధి వారిది అది మారనే మారదు” అనే విషయం ఎలుక విషయంలో నిజమైంది. బ్రహ్మయ్య తన మంత్రశక్తిచే ఎలుకను ‘మూషిక బాల’గా మార్చినా దాని సహజ లక్షణాలు అది వదలుకోలేదు. కనిపించిన వస్తువులన్నీ కొరకడం, చిరు తిండ్ల కోసం వెతకడం, పచ్చి కూరగాయలు తినడం, పప్పుడబ్బాలు వెతకడం, రంధ్రాలున్న చోట ఆటాడుకోవడం వంటివి చేస్తూనే ఉంది. అలాగే పెళ్ళి విషయంలో కూడా ‘మూషికరావు’ మాత్రమే నచ్చాడు. మనుషులు కూడా అలాగే ఉంటారు. కానీ మారరు.

మానవులలో కొందరు అవినీతికి పాల్పడుతూ ఉంటారు. లంచగొండులుగా తయారవుతారు. వాళ్ళ వద్దకు వెళ్ళి ఎన్ని నీతివాక్యాలు చెప్పినా వాళ్ళ బుద్ధి మారదు. అలాగే బాల్య వివాహాలు, వరకట్నం, మద్యపానం, జంతు బలి మొదలైన దురాచారాల నిర్మూలనకు సంఘ సంస్కర్తలు అడుగడుగునా కృషి చేస్తున్నారు. వాళ్ళ మాటలను వినిపించుకొనే నాథుడే లేడు. కాబట్టి ఎవరి బుద్ధి వారిది – అది మారనే మారదు.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson ఎలుకమ్మ పెళ్ళి

ప్రశ్న 3.
బ్రహ్మయ్యకున్నట్లు, మీకే అలాంటి మంత్రశక్తి ఉంటే ఏమేం చేస్తారు ?
జవాబు.
బ్రహ్మయ్యకున్నట్లు, నాకే అటువంటి మంత్రశక్తి ఉంటే దాన్ని సద్వినియోగం చేస్తాను. ఆకలితో బాధపడే వారికి ఆహార వస్తువులు సృష్టిస్తాను. తాగడానికి గుక్కెడు నీళ్ళులేక తపించిపోయేవారికి నీళ్ళు సృష్టిస్తాను. అనారోగ్యంతో బాధపడే వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతాను. మంత్రశక్తితో గుడ్డివారికి చూపును, మూగవారికి మాటను, చెవిటి వారికి వినికిడి శక్తిని కలుగజేస్తాను. “ప్రత్యేకావసరాలున్న” వారిని గుర్తించి, అన్ని విధాల వారికి సహాయపడే పనులు చేస్తాను. నా మంత్రశక్తితో నేను ఎన్ని ఉపకారాలు చేయగలనో అన్నీ చేస్తాను.

ప్రశ్న 4.
బ్రహ్మయ్య తన మంత్రశక్తితో ఎలుక బదులు చిలుకను “చిలుక బాల”గా మార్చేస్తే ఏమి జరిగి ఉండేది. కథ రాయండి.
జవాబు.
బ్రహ్మయ్య తన మంత్రశక్తితో ఎలుక బదులు చిలుకను ‘చిలుక బాల’గా మార్చేస్తే దాన్నే అల్లారుముద్దుగా పెంచుకొనే వాళ్ళు. అది పెరిగి పెద్దదవుతుంటే మాటలు నేర్పేవాళ్ళు. అది బయటికి ఎగిరిపోతే రాబోయే ప్రమాదాన్ని గురించి తెలియజేసేవాళ్ళు. దానికి కావలసిన అవసరాలన్నీ తీర్చేవాళ్ళు.

చిలుకకు కాయలు, పండ్లు, గింజలు మొదలైనవి పెట్టి ఎంతో ప్రేమతో చూసేవాళ్ళు. దాన్ని పంజరంలో ఉంచి దేనివల్లా ప్రమాదం లేకుండా చూసేవాళ్ళు. తనకు స్వేచ్ఛ లేకుండా చేశారని బాధపడితే బ్రహ్మయ్య దంపతులే దాన్ని ఒళ్లో పెట్టుకుని లాలించేవారు.

చివరికి ‘చిలుక బాల’ బ్రహ్మయ్య దంపతులకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేదికాదు. వాళ్ళు చెప్పినట్లే విని వాళ్ళతోటే లోకంగా ఉండేది. వాళ్ళకు ఆనందాన్ని కలిగించేది.

పెళ్ళి విషయంలో ‘చిలుక బాల’ ముందుగానే తన అభిప్రాయాన్ని తెలియజేసేది. బ్రహ్మయ్య దంపతులు కూడా దాని అభిప్రాయానికి విలువనిచ్చేవారు. ‘చిలుక బాల’కు నచ్చిన ‘చిలుకరావు’తోనే పెళ్ళిచేసేవారు. అటు బ్రహ్మయ్య దంపతులు, ఇటు చిలుక దంపతులు కలిసిమెలిసి సుఖంగా జీవించేవారు.

ప్రశ్న 5.
ఎలుకకు ‘మూషిక బాల’ అనే పేరు ఎలా వచ్చిందో తెలపండి.
జవాబు.
తుంగభద్రానది ఒడ్డున ఒక ఊరుండేది. ఆ ఊరికి దూరంగా చిన్న కుటీరంలో బ్రహ్మయ్య దంపతులు నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకు సంతానం కలుగలేదు. ఎవరినైనా తెచ్చి పెంచుకోవాలనుకున్నారు. పెంచుకోవడానికి పాపను ఇచ్చేందుకు ఎవరూ ఇష్టపడలేదు.

ధనం లేకపోయినా బ్రహ్మయ్యకు కొన్ని అపూర్వశక్తులున్నాయి. ఒక రోజున బ్రహ్మయ్య తన కుటీరం ముందర కూర్చొని ఉన్నాడు. కాకి ఒకటి ఎలుక పిల్లను ముక్కున కరచుకొని వెళ్ళుతుండగా జారి ఆ బ్రహ్మయ్య ఇంటి ముందర పడింది. వెంటనే బ్రహ్మయ్య దంపతులు ఆ ఎలుకను పైకి తీసి ఒళ్ళంతా తుడిచి చక్కగా నిమిరారు. భార్య కోరికపై బ్రహ్మయ్య తన మంత్రశక్తిని ఉపయోగించి ఆ ఎలుకను పాపగా మార్చాడు. వాళ్ళిద్దరూ ఆ పాపకు ‘మూషిక బాల’ అని పేరు పెట్టారు.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson ఎలుకమ్మ పెళ్ళి

ప్రశ్న 6.
‘మూషిక బాల’ సహజ లక్షణాలు తెలపండి.
జవాబు.
‘మూషిక బాల’ పెరిగి పెద్దదయింది. ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండకుండా తిరగడం దానికి అలవాటైంది.

కనిపించిన వస్తువులన్నీ కొరకడం, చిరుతిండ్ల కోసం వెతకడం, పచ్చి కూరగాయలు తినడం, పప్పుడబ్బాలు వెతకడం, వడ్లబస్తాల దగ్గర, బియ్యం బస్తాల దగ్గర తిరగడం, రంధ్రాలున్న చోటే ఆటాడుకోవడం, పిల్లలు కనిపిస్తే భయంతో పరుగెత్తడం మూషిక బాలకు సహజ లక్షణాలుగా మారిపోయాయి.

ప్రశ్న 7.
‘మూషిక బాల’ కనిపించకుండా ఎక్కడికి వెళ్ళింది ? అక్కడ ఏమి చేసేది ?
జవాబు.
‘మూషిక బాల’ కనిపించకుండా శివాలయానికి వెళ్ళింది. అక్కడ ఆలయ ప్రాంగణంలో వినాయక నవరాత్రుల సందర్భంగా పెద్ద వినాయక విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు. ఆ అమ్మాయి అక్కడే ఉన్నది. అక్కడ మూషిక బాల పూజారి దగ్గరే కూర్చొని, పూజలో అతనికి సాయం చేసేది. భక్తులకు ప్రసాదాలు ఇచ్చేది. తదేకంగా వినాయకుణ్ణి చూస్తూ తన్మయమైపోయేది.

ప్రశ్న 8.
‘మూషిక బాల’ పెళ్ళి సంఘటన గురించి రాయండి.
జవాబు.
బ్రహ్మయ్య దంపతులు పెళ్ళీడు రాగానే మూషిక బాలకు పెళ్ళి చేయాలనుకున్నారు. సూర్యుడు తమ అల్లుడైతే బాగుంటుందనుకున్నారు. బ్రహ్మయ్య కళ్ళు మూసుకొని ధ్యానించగానే ‘సూర్యుడు’ ప్రత్యక్షమైనాడు. కానీ మూషిక బాల మిరుమిట్లు గొలిపే అతని కాంతిని భరించలేనంటూ తిరస్కరించింది. తరువాత ‘మేఘుడు’ వచ్చాడు. అతడు నల్లగా ఉన్నాడని మూషిక బాల తిరస్కరించింది. ఆ తరువాత ‘వాయుదేవుడు’ వచ్చాడు. అతడికి బొత్తిగా నిలకడ లేదని ఆమె అతనిని కూడా తిరస్కరించింది.

ఆ పైన ‘మేరుపర్వతుడు’ వచ్చాడు. అతనిలో మృదుత్వం లేదు, బండబారినట్లు ఉన్నాడని అతనిని తిరస్కరించింది. తరువాత ‘మూషికరావు’ వచ్చాడు. అతణ్ణి చూసి చూడగానే మూషిక బాల సిగ్గుతో తలవంచుకొని వినయంగా నమస్కరించింది. అతనిని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడి తన తల్లిదండ్రులకు ఆ విషయాన్ని తెలియజేసింది. వెంటనే ఆమె తల్లిదండ్రులు ‘మూషిక బాల’ను ‘మూషికరావు’కిచ్చి పెళ్ళి చేశారు.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson ఎలుకమ్మ పెళ్ళి

చదువడం – అవగాహన చేసుకోవడం:

I. కింది పేరాను చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ధనం లేకపోయినా బ్రహ్మయ్యకు కొన్ని అపూర్వ శక్తులున్నాయి. ఒకరోజున బ్రహ్మయ్య కుటీరం ముందర కూర్చొని ఉన్నాడు. కాకి ఒకటి ఎలుక పిల్లను ముక్కున కరుచుకొని వెళ్ళుతుండగా జారి బ్రహ్మయ్య ఇంటిముందర పడింది. వెంటనే బ్రహ్మయ్య, అతని భార్య దాన్ని పైకి తీసి ఒళ్ళంతా తుడిచి చక్కగా నిమిరారు. భార్య భర్తను చూసి, “మనకు పిల్లలు లేరు కదా ! మీ మంత్రశక్తిని ఉపయోగించి ఈ ఎలుకను పాపగా మార్చండి” అన్నది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
ధనం లేకపోయినా బ్రహ్మయ్యకు ఏమి ఉన్నాయి ?
జవాబు.
ధనం లేకపోయినా బ్రహ్మయ్యకు కొన్ని అపూర్వ శక్తులున్నాయి.

ప్రశ్న 2.
బ్రహ్మయ్య ఎక్కడ కూర్చొని ఉన్నాడు ?
జవాబు.
బ్రహ్మయ్య కుటీరం ముందర కూర్చొని ఉన్నాడు.

ప్రశ్న 3.
బ్రహ్మయ్య ఇంటిముందర ఏమి పడింది ?
జవాబు.
బ్రహ్మయ్య ఇంటిముందర ఎలుక పిల్ల పడింది.

ప్రశ్న 4.
భార్య భర్తను చూసి ఏమన్నది ?
జవాబు.
భార్య భర్తను చూసి “మనకు పిల్లలు లేరు కదా ! మీ మంత్రశక్తిని ఉపయోగించి ఈ ఎలుకను పాపగా మార్చండి” అన్నది.

ప్రశ్న 5.
ఎలుక పిల్లను ముక్కున కరుచుకొని పోతున్నదెవరు ?
జవాబు.
కాకి ఒకటి ఎలుక పిల్లను ముక్కున కరుచుకొని పోతున్నది.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson ఎలుకమ్మ పెళ్ళి

II. కింది పేరాను చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

మూషికబాల నాలుగో తరగతిలో ఉండగా ఒక సంఘటన జరిగింది. బడిపిల్లలను తీసుకొని వాళ్ళ టీచర్ అడవిలోని చెరువు దగ్గరికి పిక్నిక్కు పోయారు. దారిలో గీత అనే ఒక బాలిక ప్రమాదవశాత్తూ, ఆ అడవిలో వేటగాడు పన్నిన వలలో ఇరుక్కున్నది. ఎంతమంది ప్రయత్నించినా ఆ వలనుంచి గీతను తప్పించలేకపోయారు. అప్పుడు మూషికబాల తన పదునైన పండ్లతో ఆ వల తాళ్ళను క్షణాల్లో కొరికి, గీతను కాపాడింది. దాంతో పిల్లలందరికీ మూషికబాలపట్ల ప్రత్యేక అభిమానం ఏర్పడింది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
మూషికబాల ఏ తరగతిలో ఉండగా సంఘటన జరిగింది ?
జవాబు.
మూషికబాల నాలుగో తరగతిలో ఉండగా సంఘటన జరిగింది.

ప్రశ్న 2.
టీచర్ బడిపిల్లలను తీసుకొని ఎక్కడికి పోయింది ?
జవాబు.
టీచర్ బడిపిల్లలను తీసుకొని అడవిలోని చెరువు దగ్గరికి పిక్నిక్కు పోయింది.

ప్రశ్న 3.
వేటగాడు పన్నిన వలలో ఇరుక్కున్నది ఎవరు ?
జవాబు.
గీత అనే బాలిక వేటగాడు పన్నిన వలలో ఇరుక్కున్నది.

ప్రశ్న 4.
మూషికబాల గీతను ఎలా కాపాడింది ?
జవాబు.
మూషికబాల తన పదునైన దంతాలతో వల తాళ్ళను కొరికి గీతను కాపాడింది.

ప్రశ్న 5.
పిల్లలందరికీ ఎవరి పట్ల ప్రత్యేక అభిమానం ఏర్పడింది ?
జవాబు.
పిల్లలందరికీ మూషికబాల పట్ల ప్రత్యేక అభిమానం ఏర్పడింది.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson ఎలుకమ్మ పెళ్ళి

III. కింది పేరాను చదువండి. అయిదు ప్రశ్నలు తయారుచేయండి.

పెళ్ళీడు రాగానే అమ్మాయికి పెళ్ళి చేయాలనుకున్నారు బ్రహ్మయ్య దంపతులు. “మీ మంత్రశక్తిని మరోసారి ఉపయోగించి అమ్మాయికి యోగ్యుడైన భర్తను తీసుకొనిరండి” అన్నది అతని భార్య.

“నా కూతురు పెళ్ళి చేసుకుంటానంటే సూర్యుడినైనా తెచ్చి చేస్తా” అన్నాడు బ్రహ్మయ్య. “మీకు అంత శక్తి ఉందని నాకు తెలుసు. సూర్యుడే మన అల్లుడౌతాడంటే ఇంకేం కావాలి ! నిజం చేయండి,” అన్నది.

బ్రహ్మయ్య సరేనని కళ్ళు మూసుకొని ధ్యానం చేయగా వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. తన కూతుర్ని పెండ్లిచేసుకోమని సూర్యున్ని అడిగాడు.
“మీ అమ్మాయిని పెళ్ళిచేసుకోవడం నాకిష్టమే! కాని ఆమెకు నేను నచ్చానో లేదో అడుగండి,” అన్నాడు సూర్యుడు.

జవాబు.

ప్రశ్నలు తయారుచేయుట :
1. బ్రహ్మయ్య దంపతులు ఏమనుకున్నారు ?
2. బ్రహ్మయ్యతో అతని భార్య ఏమన్నది ?
3. అపుడు బ్రహ్మయ్య తన భార్యతో ఏమన్నాడు?
4. బ్రహ్మయ్య ధ్యానం చేస్తే ఎవరు ప్రత్యక్షమయ్యారు ?
5. “ఆమెకు నేను నచ్చానో లేదో అడుగండి” అని ఎవరు ఎవరితో అన్నారు?

TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson ఎలుకమ్మ పెళ్ళి

IV. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

కొంత కాలం గడిచింది. పాప పెరిగి పెద్దదయింది. ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండకుండా తిరుగడం. అలవాటయింది. కనిపించిన వస్తువులన్నీ కొరుకడం, చిరుతిండ్ల కోసం వెతుకడం, పచ్చి కూరగాయలు తినడం, పప్పుడబ్బాలు వెతకడం, వడ్ల బస్తాల దగ్గర, బియ్యం బస్తాల దగ్గర తిరుగడం, రంధ్రాలున్న చోటనే ఆటలాడుకోవడం, పిల్లులు కనిపిస్తే భయంతో ఉరుకడం, మూషిక బాలకు సహజ లక్షణాలుగా మారిపోయాయి.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఈ పేరాలోని పాప పేరు ?
జవాబు.
మూషికబాల

ప్రశ్న 2.
దేన్ని చూస్తే భయంతో ఉరుకుతోంది ?
జవాబు.
పిల్లల్ని

ప్రశ్న 3.
దేనికోసం వెతుకుతోంది ?
జవాబు.
చిరుతిండ్లు, పప్పుడబ్బాలు

ప్రశ్న 4.
ఎక్కడ ఆటలాడుతోంది ?
జవాబు.
రంధ్రాలున్న చోట

ప్రశ్న 5.
వేటిని తింటోంది ?
జవాబు.
పచ్చికూరగాయలు

TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson ఎలుకమ్మ పెళ్ళి

V. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

బ్రహ్మయ్య అన్ని దిక్కులా చూశాడు. వెంటనే వాయుదేవుడు, “మీరేం బాధ పడకండి. నా కంటే విధాలా బలవంతుడైన “మేరుపర్వతుడు” ఉన్నాడు. నేను నా బలంతోని పెద్ద వృక్షాలను, ఇండ్లను కూడా ధ్వంసం చేయగలను. కాని నాకెంత బలమున్నా ఆ పర్వతాన్ని మాత్రం కదిలించలేకపోతున్నా. నీ కూతుర్ని ఆయనకిచ్చి పెండ్లిచేస్తే సంతోషిస్తుందన్న నమ్మకం ఉన్నది” అని వాయుదేవుడు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి పోగానే మేరు పర్వతుడు ప్రత్యక్షమయ్యాడు.

వెంటనే మూషికబాల అతడిని చూసి, “ఈయనేమంత ఇంతకంటే గొప్పవరుడు లేడా ?” అని ప్రశ్నించింది. వెంటనే మేరుపర్వతుడు, “మూషికరాజు ఉన్నాడు. బలమైన, కఠినమైన బండలా ఉన్న నా పర్వతశరీరాన్ని కూడా కొరికి తూట్లు చేస్తాడు. ఆ శక్తి అతనికొక్కడికే ఉన్నది. నీ కూతురికి అతనే సరియైన వరుడు,” అని చెప్పి వెళ్ళిపోయాడు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
పెద్ద వృక్షాలను, ఇండ్లను ధ్వంసం చేయగల వాడెవరు ?
జవాబు.
వాయుదేవుడు

ప్రశ్న 2.
బండబారినట్లున్నదెవరు ?
జవాబు.
మేరుపర్వతుడు

ప్రశ్న 3.
ఇక్కడ బాధ పడుతున్న దెవరు ?
జవాబు.
బ్రహ్మయ్య

ప్రశ్న 4.
పై పేరాలో ‘కూతురు’ పేరు ఏమిటి ?
జవాబు.
మూషికబాల

ప్రశ్న 5.
పర్వతాన్ని కొరికి తూట్లు చేసినది ?
జవాబు.
మూషికరాజు

TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson ఎలుకమ్మ పెళ్ళి

సారాంశం:

ఒక ఊళ్ళో బ్రహ్మయ్య దంపతులు నివసిస్తున్నారు. వాళ్ళకు సంతానం లేదు. ఎవరినైనా తీసుకొని వచ్చి పెంచుకోవాలనుకున్నారు. కానీ వాళ్ళకు పాపనిచ్చేందుకు ఎవరూ ఇష్టపడలేదు.

ధనం లేకపోయినా బ్రహ్మయ్యకు కొన్ని అపూర్వ శక్తులున్నాయి. ఒకసారి బ్రహ్మయ్య ఇంటి ముందు ఒక ఎలుక పిల్ల కాకి ముక్కు నుండి జారిపడింది. బ్రహ్మయ్య తన మంత్రశక్తితో ఆ ఎలుకను పాపగా మార్చాడు. దానికి ‘మూషిక బాల’ అని పేరు పెట్టాడు. ‘మూషిక బాల’ లో వెనుకటి మూషిక లక్షణాలు పోలేదు. ఒకసారి ఆ అమ్మాయి కనిపించకుండా శివాలయంలోని వినాయకుని వద్దకు చేరింది. బ్రహ్మయ్య దంపతులు వెతుక్కుంటూ వెళ్ళి ఆ ‘మూషిక బాల’ను చూడగలిగారు.

కూతురి ధోరణి బ్రహ్మయ్యకు నచ్చలేదు. బడిలో వేస్తే మార్పు వస్తుందని ఆశించి, కూతురిని బడిలో చేర్పించాడు బ్రహ్మయ్య. బడిలో కూడా బాగా అల్లరి చేసేది. పుస్తకాలన్నీ కొరికేది. కానీ మూషిక బాలకు చదువునందు ఆసక్తి పెరిగి కళాశాల విద్య కూడా పూర్తి చేసింది.

మూషిక బాలకు పెళ్ళి చేయాలనుకున్నారు బ్రహ్మయ్య దంపతులు. వరులుగా వచ్చిన సూర్యుడు, మేఘుడు, వాయుదేవుడు, మేరు పర్వతుడు ఎవరూ నచ్చలేదు మూషిక బాలకు. చివరికి తనకు నచ్చిన ‘మూషికరావు’ను తండ్రి అనుమతితో పెండ్లాడింది. మూషిక బాల పెళ్ళి కాగానే తల్లిదండ్రులను వదిలి భర్తతో వెళ్ళిపోయింది. బ్రహ్మయ్య దంపతులు ఆశ్చర్యపోయి “విధిని ఎవరూ తప్పించలేరనుకున్నారు. ఎలుకగా పుట్టింది, ఎలుకనే పెళ్ళాడింది. “ఏమిటో ఈ మాయ” అని బాధపడ్డారు.

Leave a Comment