AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

SCERT AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 4th Lesson Questions and Answers కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కొన్ని దారాలను మాత్రమే మనము కృత్రిమ దారాలు అని ఎందుకంటాం? వివరించండి. (AS1)
జవాబు:

  1. నైలాన్, రేయాన్, అక్టోలిక్ మరియు పాలిస్టర్ వంటి కొన్ని దారాలను కృత్రిమ దారాలు అంటారు.
  2. పెట్రో రసాయనాలను ఎన్నో రసాయనిక ప్రక్రియలకు గురిచేయడం ద్వారా ఏర్పడే దారాలను కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలు అంటారు. కృత్రిమ దారాలు అన్నీ పాలిమర్లు.
  3. నైలాన్ అనేది బొగ్గు, నీరు మరియు గాలి నుండి తయారు చేయబడిన కృత్రిమ దారం.
  4. రేయాన్ సెల్యులోజ్ తయారుచేయబడ్డ ఒక కృత్రిమ పట్టుదారం.
  5. అక్టోలిక్ అనేది నేలబొగ్గు, గాలి, నీరు, నూనె మరియు సున్నపురాయి నుండి తయారయ్యే కృత్రిమ ఉన్ని.

ప్రశ్న 2.
వివిధ పదార్థాలను నిలువ చేయడానికి ప్లాస్టిక్ పాత్రలను వాడడానికి గల కారణాలు చెప్పండి. (AS1)
(లేదా)
ప్లాస్టిక్ లను వాడటం వల్ల అనేక హానికర ప్రభావాలు ఉన్నప్పటికీ మనం ప్లాస్టిక్ లను వినియోగిస్తున్నాము. ఆ ప్లాస్టిక్స్ వలన లాభాలేమిటి ?
జవాబు:

  1. ప్లాస్టిక్ నీరు మరియు ఇతర రసాయనాలతో చర్య జరుపదు.
  2. పదార్థాలను క్షయం చేయదు.
  3. ప్లాస్టిక్ చాలా తేలికైనది, దృఢమైనది, మన్నికైనది.
  4. ప్లాస్టిక్ పరిమాణంలోను, విభిన్న రూపాలలోకి మలచగలిగేదిగా ఉంటుంది.
  5. ప్లాస్టిక్ వస్తువులు లోహాల కంటే తక్కువ ధరకు లభిస్తాయి.
  6. ప్లాస్టికు ఉష్ణబంధక మరియు విద్యుత్ బంధక పదార్థాలు.
  7. ప్లాస్టిక్ లను వివిధ రంగులలో తయారుచేసుకోవచ్చును.
    పై కారణాల వలన ప్లాస్టిక్ పాత్రలను వస్తువులను భద్రపరచుకొనేందుకు వాడుతారు.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 3.
ఈ క్రింది వానిలో ఏ ఏ పదార్థాలను రీసైక్లింగ్ చేయగలమో, వేటిని చేయలేమో వీడదీయండి. (AS1)
ప్లాస్టిక్ బొమ్మలు, విద్యుత్ స్విచ్లు, ప్లాస్టిక్ కుర్చీలు, బాల్‌ పాయింట్ పెన్నులు, టెలిఫోన్ వస్తువులు, ప్లాస్టిక్ పాత్రలు, కుక్కర్ పిడులు, ప్లాస్టిక్ సీసాలు, పాలిథీన్ సంచులు, పాత్రలు, పళ్ళుతోముకునే బ్రష్ లు, ప్లాస్టిక్ చెప్పులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ బకెట్లు మొదలగునవి.
జవాబు:

రీసైక్లింగ్ చేయగల పదార్థాలు రీసైక్లింగ్ చేయలేని పదార్థాలు
ప్లాస్టిక్ బొమ్మలు, ప్లాస్టిక్ కుర్చీలు, ప్లాస్టిక్ పాత్రలు, ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ చెప్పులు, ప్లాస్టిక్ బకెట్లు విద్యుత్ స్విచ్ లు, బాల్ పాయింట్ పెన్నులు, టెలిఫోన్ వస్తువులు, కుక్కర్ పిడులు, పళ్ళుతోముకునే  బ్రష్ లు, ప్లాస్టిక్ ప్లేట్లు, పాలిథీన్ సంచులు.

ప్రశ్న 4.
ఎలక్ట్రిక్ స్విచ్ లు థర్మోప్లాస్టిక్ తో తయారుచేస్తే ఏమి జరుగుతుంది? (AS1)
జవాబు:
విద్యుత్ ప్రవాహంలో హెచ్చుతగ్గుల వలన ఎలక్ట్రిక్ స్వి లో ఉష్ణం ఏర్పడుతుంది. థర్మోప్లాస్టిక్ తో తయారుచేసిన ఎలక్ట్రిక్ స్వి లు అయితే ఈ ఉష్ణానికి కరిగిపోతాయి.

ప్రశ్న 5.
థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ కన్నా “ధర్మోప్లాస్టిక్ కు ప్రకృతి నేస్తాలు”. నీవేమి చెబుతావు? ఎందుకు? (AS1)
జవాబు:
థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ ల కన్నా “థర్మోప్లాస్టికు ప్రకృతి నేస్తాలు” ఈ వాక్యాన్ని నేను సమర్థిస్తాను. ఎందుకంటే

  1. విరిగిపోయిన, వాడలేని, పాతబడిన థర్మోప్లాస్టిక్ ను వివిధ పద్ధతుల్లో శుభ్రపరచి, రీసైకిల్ చేసి తిరిగి కొత్త వస్తువులను తయారుచేయవచ్చును.
  2. థర్మోప్లాస్టిక్ వస్తువులను ప్రతి ఒక్కరూ మళ్లీ మళ్లీ (Reuse) వాడటం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారమవుతాం.
  3. పట్టణాలలోని ఘన వ్యర్థాలలో ఎక్కువ భాగం థర్మోప్లాస్టిక్ వస్తువులే ఉంటాయి. వాటినుండి సేకరించిన వ్యర్థాలను వివిధ పద్ధతుల ద్వారా విద్యుత్, ఉష్ణం, కంపోస్ట్, ఇంధనాల వంటి వివిధ రూపాలలోనికి మార్చి, ఈ వ్యర్థాలను తిరిగి వనరులుగా ఉపయోగిస్తాం.

ప్రశ్న 6.
కింది వాటిని వివరించండి. (AS1)
ఎ) మిశ్రణం
బి) జీవ విచ్ఛిన్నం చెందడం
సి) రీసైక్లింగ్
డి) వియోగం చెందడం
జవాబు:
ఎ) మిశ్రణం :

  1. ఏదైనా కృత్రిమ దారాన్ని రెండు లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపే ప్రక్రియను మిశ్రణం అంటారు.
  2. టెర్లిన్ ను, నూలుతో మిశ్రణం చేస్తే టెరికాట్ ఏర్పడుతుంది. ఇది సౌకర్యవంతంగా, నలిగిపోనిదిగా ఉంటుంది.
  3. టెర్లిన్, ఊన్నితో మిశ్రణం చెందితే టెరిడోల్ ఏర్పడుతుంది.
  4. టెర్లిన్, సిల్క్ తో మిశ్రణం చెందితే టెరిసిల్క్ ఏర్పడుతుంది.

బి) జీవ విచ్చిన్నం చెందడం :

  1. సహజ ప్రక్రియ ద్వారా పదార్థం సులువుగా వియోగం చెందితే ఆ పదార్థాన్ని జీవ విచ్ఛిన్నం చెందడం అంటారు.
  2. పండ్లు, కూరగాయలు, చనిపోయిన జీవులు జీవ విచ్ఛిన్నం చెందుతాయి.

సి) రీసైక్లింగ్ :

  1. విరిగిపోయి వాడలేని, పాతబడిన ప్లాస్టిక్ లను వివిధ పద్ధతుల్లో శుభ్రపరచి, తిరిగి ఉపయోగించడానికి అనుకూలంగా కొత్త వస్తువులను తయారుచేయుటను రీసైక్లింగ్ అంటారు.
  2. PET (కోడ్-1), PS (కోడ్-6) మరియు HDPE (కోడ్-B) లను రీసైకిల్ చేస్తారు.

డి) వియోగం చెందడం :

  1. కొన్ని పదార్థాలు నీరు, సూర్య కాంతి, ఆక్సిజన్ సమక్షంలో ఉంచినపుడు సూక్ష్మభాగాలుగా విడగొట్టబడతాయి. ఈ సూక్ష్మభాగాలు బ్యాక్టీరియా చేత మరల విభజింపబడే ప్రక్రియనే వియోగం చెందడం అంటారు.
  2. వియోగం చెందడానికి కావలసిన సమయాన్ని బట్టి ఆ పదార్థం జీవ విచ్ఛినం చెందిందా, చెందలేదా నిర్ణయించవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

7. జతపరచండి. (AS1)

1) పాలిస్టర్ ఎ) వంటసామాగ్రి
2) PET బి) కృత్రిమ పట్టు
3) రేయాన్ సి) ఎక్కువ సంఖ్యలో మోనోమర్లు
4) నైలాన్ డి) ఎలక్ట్రిక్ స్వి చు
5) మెలమిన్ ఇ) చిహ్నం
6) పాలిథీన్ ఎఫ్) ప్రసిద్ధిగాంచిన దుస్తుల సామాగ్రి
7) బేకలైట్ జి) అన్ని దారాలకన్నా దృఢమైనది

జవాబు:

1) పాలిస్టర్ ఎఫ్) ప్రసిద్ధిగాంచిన దుస్తుల సామాగ్రి
2) PET ఇ) చిహ్నం
3) రేయాన్ బి) కృత్రిమ పట్టు
4) నైలాన్ జి) అన్ని దారాలకన్నా దృఢమైనది
5) మెలమిన్ ఎ) వంటసామాగ్రి
6) పాలిథీన్ సి) ఎక్కువ సంఖ్యలో మోనోమర్లు
7) బేకలైట్ డి) ఎలక్ట్రిక్ స్వి చు

8. ఖాళీలను పూరించండి. (AS1)

i) కృత్రిమ దారాలను …………………….. అని కూడా పిలుస్తాం.
జవాబు:
మానవ నిర్మిత దారాలు

ii) కృత్రిమ దారాలను ………………… పదార్థాల నుండి సంశ్లేషిస్తారు.
జవాబు:
పెట్రోలియం ముడి

iii) కృత్రిమ దారం లాగే ప్లాస్టిక్ కూడా ………
జవాబు:
పాలిమర్

iv) బట్టలపై లేబిళ్లు ……….
ఎ) చట్ట ప్రకారం అవసరం
బి) దారము రకాన్ని గుర్తించడానికి
సి) ఎ, బి లు రెండూ
డి) పైవేవీ కావు
జవాబు:
సి) ఎ, బి లు రెండూ

v) రేయావ్ దీనితో తయారవుతుంది.
ఎ) నేలబొగ్గు
బి) ఆక్సిజన్
సి) నార
డి) సెల్యులోజ్
జవాబు:
డి) సెల్యులోజ్

vi) పట్టుదారము యొక్క నునుపైన తలము కాంతిని శోషిస్తుంది.
ఎ) అవును
బి) కాదు
సి) చెప్పలేము
జవాబు:
ఎ) అవును

ప్రశ్న 9.
రీసైక్లింగ్ ప్రక్రియను మనం ఎక్కడ ఉపయోగిస్తాం? ఇది ఎలా ఉపయోగకరమైనదో ఉదాహరణతో తెల్పండి. (AS1)
జవాబు:
రీసైక్లింగ్ ప్రక్రియను ప్లాస్టిక్ లో మరియు లోహాలలో ఉపయోగిస్తారు.

ఉదాహరణలు :

  1. (PET చిహ్నం-1 గలవి) వాడిన లేదా పాడయిన శీతలపానీయాలు, నీటి మరియు పండ్ల రసాల సీసాలు మరియు ట్రేలను రీసైక్లింగ్ చేసి వాహనాల పరికరాలను, ఫ్యూజ్ బాక్స్ లను, బంపరను, తలుపుల ఫ్రేములను, కుర్చీలను మరియు టేబులను తయారు చేస్తారు.
  2. HDPE చిహ్నం -2 గలవి) వాడిన లేదా పాడయిన బొమ్మలు, విద్యుత్ బంధక పరికరాలు, పాత్రలు, కుర్చీలు, సీసాలు మొదలగునవి రీసైక్లింగ్ చేసి పెన్నులు, పాటైల్స్, డ్రైనేజి పైపులు మొదలగునవి తయారు చేస్తారు.
  3. (PP చిహ్నం-6 గలవి) వాడినవి లేదా పాడయిపోయిన దువ్వెనలు, ఇంటికప్పులు, TV క్యారి కంటైనర్లు, CD కేసులు, డిస్పోజబుల్ ప్లేట్స్, కప్పులు, కోడిగ్రుడ్డు కేసులు మొదలగునవి రీసైక్లింగ్ చేసి విద్యుత్ బంధకాలు, ఎలక్ట్రికల్ స్విలు, గ్రుడ్ల పెట్టెలు, ఫాస్ట్ ఫుడ్ ప్యాకింగ్లు, ఫోమ్ ప్యాకింగ్ న్లు, క్యారి అవుట్ కంటైనర్లు మొదలగునవి తయారు చేస్తారు.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 10.
రకరకాల కృత్రిమ దారాలతో తయారుచేసే గృహోపకరణాలు వివరించేటట్లు ఒక పట్టిక తయారు చేయండి. (AS4)
జవాబు:

కృత్రిమ దారం కృత్రిమ దారాలతో తయారుచేసే గృహోపకరణాలు
1. నైలాన్ బ్రష్ యొక్క కుంచె, తాళ్ళు, చేపలవేటకు వాడే వలలు, గుడారాలు, చీరలు, స్త్రీల మేజోళ్ళు మరియు కాళ్ళకు వేసుకునే చిన్న మేజోళ్ళు (Socks), బెల్టులు, దిండ్లు (Sleeping bags), డోర్ కర్టన్స్, పారాచూట్లు, ఈతదుస్తులు, లో దుస్తులు (Sheer hosiery), తెరచాపలు, గొడుగులకు వాడే గుడ్డ, బట్టలు, కారు టైర్లు మొదలగునవి.
2. రేయాన్ దుస్తులు, దుప్పట్లు, తివాచీలు, లంగోటాలు (Diapers), బ్యాండేజీలు మొదలగునవి.
3. అక్రలిక్ స్వెటర్లు, శాలువాలు, దుప్పట్లు, రగ్గులు, కాళ్ళకు వేసుకొనే మేజోళ్ళు (Socks), క్రీడా దుస్తులు, ప్రయాణ సామగ్రి మరియు వాహనాల కవర్లు మొదలగునవి.
4. పాలిస్టర్ దుస్తులు, చీరలు, బెడ్ షీట్స్, కార్పెట్స్, జాడీలు, సీసాలు, ఫిల్మ్ లు, తీగలు, ప్లాస్టిక్ వస్తువులు, పరికరాలు మొదలగునవి.

ప్రశ్న 11.
థర్మోప్లాస్టిక్ లకు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లకు మోనోమర్ అమరిక విషయంలో ఉండే భేదాలను పట సహాయంతో వివరించండి. (AS5)
జవాబు:

థర్మో ప్లాస్టిక్లు థర్మోసెట్టింగ్ ప్లాస్టికు
1. వేడి చేసినప్పుడు మృదువుగాను, చల్లబరచినప్పుడు కఠినంగాను మారే ధర్మం గల ప్లాస్టికన్ను థర్మోప్లాస్టిక్ అంటారు. 1. ఒకసారి ఒక రూపంలోనికి మలచి, చల్లబరచిన తర్వాత దాని రూపాన్ని మరలా వేడిచేసినా సరే మార్చలేని ప్లాస్టిక్ ను థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటారు.
2. థర్మోప్లాస్టిక్ లోని మోనోమర్లు రేఖీయ అమరికను కలిగి ఉంటాయి.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 1
మోనోమర్ల రేఖీయ అమరిక
2. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లోని మోనోమర్లు అడ్డంగా అనుసంధా నించబడిన అమరిక కలిగి ఉంటాయి.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 2
మోనోమర్లు అడ్డంగా అనుసంధానించబడిన అమరిక
3. వీటిని వేడి చేసినపుడు ద్రవస్థితిలోనికి, తగినంత చల్లబరిస్తే గాజు స్థితిలోకి ఘనీభవిస్తుంది. 3. వీటిని వేడి చేసినపుడు నల్ల బొగ్గుగా మారుతుంది లేదా మండుతుంది.
4. వీటిని రీసైక్లింగ్ చేయవచ్చును. 4. వీటిని రీసైక్లింగ్ చేయలేము.

ప్రశ్న 12.
“వస్త్ర పరిశ్రమలో కృత్రిమ దారాల పరిచయం వస్త్రధారణ విషయంలో ప్రపంచమంతటా సంస్కృతి, సాంప్రదాయాలకు అతీతంగా విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది”. దీనిని మీరు ఎలా ప్రశంసిస్తారు? (AS6)
జవాబు:
వస్త్ర పరిశ్రమలో సహజ దారాలు సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజేసే విధంగా ఉండేవి. సహజ దారాల స్థానంలో వచ్చిన కృత్రిమ దారాలు సహజ దారాలకంటే మెరుగైన లక్షణాలు కలిగి ఉన్నాయి. పాలిస్టర్ అనే కృత్రిమ దారాన్ని కనుగొన్న తరువాత, పాలిస్టర్ దారాలు వస్త్ర పరిశ్రమలో మరియు దుస్తుల సంస్కృతిలో విప్లవాత్మక మార్పులను తెచ్చాయి. ఎందుకంటే ప్లాస్టిక్ వస్త్రము సులభంగా ముడుచుకుపోదు. ఇది ఎక్కువ మన్నికగాను, సులువుగా ఉతుక్కోవడానికి వీలుగాను మరియు తక్కువ ధరలో ఉంటుంది. అందుకే దుస్తులు తయారుచేయడానికి ఈ దారాలు సరిగ్గా సరిపోతాయి. పాలిస్టర్ మిగిలిన దారాల వలె నేయడానికి కూడా వాడవచ్చును. పాలిస్టర్ దారాన్ని సహజదారాలతో కలిపి మిశ్రణం చెందించడం వల్ల సహజ దారాల మరియు కృత్రిమ దారాల లక్షణాలు గల వస్త్రం తయారగును.

వివిధ వృత్తుల వారికి కావలసిన లక్షణాలు గల వస్త్రాలను కృత్రిమ మరియు మిశ్రణం చెందించగా ఏర్పడే వస్త్రాల నుండి పొందవచ్చును. ఈ వస్త్రాలు ప్రపంచమంతటా సంస్కృతి, సంప్రదాయాలకు అతీతంగా విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాయని చెప్పవచ్చును.

ప్రశ్న 13.
కృత్రిమ దారాలు మన రోజువారీ జీవితాన్ని ఏ విధంగా మార్చివేసినవి? (AS7)
జవాబు:

  1. కృత్రిమ దారాలతో తయారైన గృహోపకరణాల జాబితా చాలా పెద్దది. ఇవన్నీ మన రోజువారీ కృత్యాలతో ముడిపడి ఉంటాయి.
  2. కృత్రిమ దారాలు పట్టు వస్త్రాల కంటే ఎక్కువ మెరుపుగల దుస్తులు తయారు చేయడానికి సహాయపడతాయి.
  3. నైలాన్ దారం బలంగా ఉండి సాగే గుణాన్ని కలిగి ఉండటం వలన ఈ దుస్తులు త్వరగా చిరిగిపోవు.
  4. తక్కువ నీటిని ఉపయోగించి తేలికగా ఉతకవచ్చు.
  5. తివాచీలు తయారుచేయడానికి ప్రస్తుతం ఉన్నికి బదులు నైలాన్ వాడుతున్నారు.
  6. ఈత కొట్టేటప్పుడు ధరించే దుస్తులు, లోదుస్తులు, గొడుగులు, తెరచాపలు, చేపలు పట్టే వలలు, కార్ల టైర్లు వంటి ఉపయోగకరమైన వస్తువులెన్నో తయారుచేస్తున్నారు.
  7. కనుక మన జీవిత విధానం ఈ కృత్రిమ దారాల వినియోగం వలన పూర్తిగా మారిపోయింది.

ప్రశ్న 14.
సుజాత తన తల్లిదండ్రులకు శీతాకాలంలో వేసుకొనే దుస్తులు కొనాలని అనుకొంది. నీవు ఏ రకమైన బట్టలను కొనమని సలహా ఇస్తావు? కారణాలు చెప్పండి. (AS7, AS1))
జవాబు:

  1. సుజాత, తన తల్లిదండ్రులకు శీతాకాలంలో వేసుకొనే దుస్తులను కొనాలని అనుకుంది.
  2. నేనైతే నిభాకు ఈ క్రింది దుస్తులను కొనమని సలహా ఇస్తాను.
  3. సహజమైన ఉన్నితో తయారైన స్వెట్టర్లూ, శాలువాలూ, దుప్పట్లూ మొదలైనవి. కాని ఇవి చాలా ఖరీదైనవి.
  4. శీతాకాలంలో వేసుకొనే దుస్తులలో చాలా వాటిని ప్రస్తుతం అక్రలిక్ అనే కృత్రిమ దారంతో తయారుచేస్తున్నారు.
  5. ఈ అక్రలిక్ చూడటానికి సహజ ఉన్ని మాదిరిగానే ఉంటుంది.
  6. దీనిని కృత్రిమ ఉన్ని అనవచ్చు లేదా నకిలీ ఉన్ని అని కూడా అనవచ్చు.
  7. అక్టోలిక ను తడి లేదా పొడి స్పిన్నింగ్ పద్ధతిలో మెలి పెట్టి పురి పెడతారు.
  8. దారాలు బాష్పీభవనం ద్వారా ఘనస్థితిని పొందుతాయి.
  9. అజోలిక్ తో తయారైన బట్టలు సహజ ఉన్ని బట్టల కన్నా చౌకగా లభిస్తాయి.
  10. కనుక నిభా తన తల్లిదండ్రులకు అక్రలిక్ తో చేసిన దుస్తులను కొనడం మంచిది.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 15.
వాడిన ప్లాస్టిక్ ను తగిన రీతిలో త్యజించకపోతే (Dispose) వచ్చే అనర్థాలేమిటి? (AS7)
జవాబు:
ప్లాస్టిక్ ను తగిన రీతిలో త్యజించకపోతే వచ్చే అనర్థాలు :

  1. ప్లాస్టిక్ కు జీవ విచ్ఛిన్నం చెందనివి కావున ప్లాస్టిక్ వలన భూమి కలుషితం అవుతుంది.
  2. వాడి విసిరేసిన పాలిథీన్ సంచులు డ్రైనేజీ వ్యవస్థకు అడ్డుపడి, డ్రైనేజి నీరు రోడ్లపై ప్రవహించుట మరియు కాల్వలో డ్రైనేజి నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగి వివిధ రోగాలకు కారణమౌతాయి.
  3. ఆవులు, మేకలు మొదలగు జంతువులు పాలిథీన్ సంచుల్లోని ఆహార పదార్థాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ, శ్వాసక్రియలు చెడిపోవడం ద్వారా జంతువులు చనిపోతున్నాయి.
  4. ప్లాస్టిక్ వ్యర్థాలు చెరువులు, సరస్సులు, నదులు మరియు సముద్రాలలో చేరడం వలన జలచరాలు చనిపోవడం జరుగుతుంది.
  5. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో చేరడం వలన వర్షం నీరు భూమిలోకి చేరక భూ జలవనరులు క్రమంగా తగ్గిపోతాయి.
  6. ప్లాస్టిక్ వ్యర్థాలను మండిస్తే, వాతావరణంలో విషవాయువులు విడుదలవడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.

ప్రశ్న 16.
“ప్లాస్టిక్ విచక్షణారహిత వాడకం జీవ వైవిధ్యానికి ప్రమాదకర హెచ్చరిక” దీనికి సంబంధించి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు తీసుకొంటున్న చర్యలేమిటి? (AS7)
జవాబు:

  1. ప్లాస్టిక్ విచక్షణారహిత వాడకం వలన ప్రకృతిలో కాలుష్యం ఎక్కువైపోతుంది.
  2. ఈ వస్తువులు త్వరగా జీవ విచ్ఛిన్నం చెందవు.
  3. అందుచేత ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి “4R” సూత్రాన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు సుప్రీంకోర్టు ఆదేశాల
    మేరకు విధిగా పాటిస్తున్నాయి.
  4. ఈ “4R” లు ఏమంటే
    i) తగ్గించడం (Reduce) : మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ ను వీలైనంత తక్కువగా ఉపయోగించాలి.
    ii) మరల ఉపయోగించడం (Reuse) : ప్రతి సారి కొత్త క్యారీ బ్యాగులాంటి వాటిని కొనకుండా వీలైనన్ని ఎక్కువసార్లు మరల మరల తిరిగి వాడాలి.
    iii) తిరిగి ఉపయోగించడానికి అనుకూలంగా తయారు చేయడం (Recycle) : పనికిరాని ప్లాస్టిక్ వస్తువులను వదలివేయకుండ. పాత సామానులు కొనేవాడికి ఇవ్వాలి.
    iv) తిరిగి పొందడం (Recover) : సేకరించిన ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలను విద్యుత్, ఉష్ణం వంటి రూపాలలోకి మార్చే పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా అవగాహన కల్పించాలి.
  5. ప్రభుత్వ సంస్థలు, స్థానిక స్వపరిపాలనా సంస్థలు, “మేజిమెంట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్” కొరకు ఏర్పడిన స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నాయి.

పరికరాల జాబితా

పట్టుచీర, నూలు చీర, స్వెటర్, కార్పెట్, బ్రష్, నైలాన్ తాడు, పూసల దండ, పేపర్ క్లిట్ల దండ, వివిధ దారాలు, దారాల ‘మిశ్రణానికి సంబంధించిన లేబుల్స్, రీసైక్లింగ్ చిహ్నాలు గల వస్తువులు, ప్లాస్టిక్ వస్తువుల నమూనాలు, థర్మో ప్లాస్టిక్ వస్తువులు (పివిసి పైపు ముక్క పాలిథీన్ కవర్, బొమ్మలు, దువ్వెన) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ వస్తువులు (బేకలైట్ స్విచ్, వంటపాత్ర పిడి, మెలమిన్ (కీబోర్డు, ఫైబర్ ప్లేటు) టూత్ బ్రష్, ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ కప్పు, కూరగాయలు, పండ్ల తొక్కలు, తినగా మిగిలిన పదార్థాలు, కాగితం, నూలు బట్ట, ప్లాస్టిక్ సంచి, ఇనుప స్టాండ్, బరువులు వేయడానికి అనువైన పళ్లెములు, బరువులు, లాండ్రీ లేబుల్ కోడ్స్ చార్టు, పట్టుకారు, సారాయి దీపం, రీసైక్లింగ్ చిహ్నాలు చార్టు.

ప్రయత్నించండి

ప్రశ్న 17.
జుట్టు, ఉన్ని, పట్టు, నూలుదారం, ప్లాస్టిక్ ముక్క, స్వెటర్ దారం, తాడుముక్క మొదలగునవి తీసుకొని జాగ్రత్తగా జ్వాల పరీక్ష (Flame test) ను నిర్వహించండి. వాసన, కరిగే విధానాన్ని బట్టి వాటిని సహజ, కృత్రిమ దారాలుగా వర్గీకరించండి. (AS1)
జవాబు:
జ్వా ల పరీక్ష:
ఉద్దేశ్యము :
జ్వాల పరీక్ష ద్వారా నమూనాలను సహజ, కృత్రిమ దారాలుగా వర్గీకరించుట.

కావలసిన పరికరాలు :
పట్టుకారు, సారాయిదీపం, నమూనాలు (జుట్టు, ఉన్ని, పట్టు, కాగితం, నూలుదారం, ప్లాస్టిక్ ముక్క, స్వెటర్ దారం, తాడుముక్క)

పద్ధతి :

  1. సారాయి దీపమును తీసుకొని వెలిగించండి.
  2. పట్టుకారు సహాయంతో నమూనాలను పట్టుకోండి.
  3. సారాయి దీపపు మంటపై నమూనాను పెట్టండి. మండుతున్నప్పుడు వాసన, కరిగే మార్పులను గమనించండి.
  4. మిగిలిన నమూనాలతో ఇదే విధంగా మరలా చేయండి. ఫలితాలను పట్టికలో నమోదు చేయండి.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 3

ప్రశ్న 18.
ప్లాస్టిక్ రీసైక్లింగ్ చిహ్నాలు, వాటి పూర్తి పేరు, మరియు దాని సంక్షిప్త నామం, గృహ అవసరాలలో వాటి వినియోగం, రీసైక్లింగ్ అవుతుందా లేదా ఒకవేళ రీసైక్లింగ్ అయితే వాటి నుండి ఏమి తయారు అవుతాయో వీటన్నింటినీ వివరించే ఒక చార్టను తయారుచేయండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 4
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 5

8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 46

ప్రశ్న 1.
సహజ దారాలకు ప్రత్యామ్నాయాలను గూర్చి మానవులు అన్వేషించడానికి కారణమేమిటి?
జవాబు:

  1. సహజ దారాల ఉత్పత్తి ప్రస్తుతం సరిపోవకపోవడం.
  2. వీటికి మన్నిక తక్కువ.
  3. ఇవి అధిక ఉష్ణం మరియు పీడనాలకు తట్టుకోలేవు.
  4. ఇవి ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి.
  5. వీటితో తయారుచేయబడిన వస్త్రాలు త్వరగా ఆరవు.
  6. వీటిని ఎక్కువగా వాష్ చేస్తే పాడవుతాయి. కారణం సంపీడనాలను ఇవి తట్టుకోలేవు.
  7. ఇవి ఎక్కువ ధరను కలిగి ఉంటాయి.
  8. ఇవి ముడులుగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇస్త్రీ చేయాలి.
  9. ఇవి మెరుపును కలిగి ఉండవు.
  10. వీటికి గట్టితనం తక్కువ.
    పై కారణాల వల్ల మానవులు సహజదారాలకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 2.
ఏ దారపు వనరులు తరిగిపోకుండా ఉంటాయి? ఎందుకు?
జవాబు:
సహజ దారపు వనరులు తరిగిపోకుండా ఉంటాయి. ఎందుకంటే సహజ దారములు వృక్ష మరియు జంతువుల నుండి తయారవుతాయి.

8th Class Physical Science Textbook Page No. 47

ప్రశ్న 3.
ప్రస్తుత స్థానానికి కృత్రిమ దారాల పరిణామం ఎలా జరిగింది?
జవాబు:
సహజ దారాలు మానవ అవసరాల కన్నా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతున్నాయి. సహజ దారాలకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ దారాల కొరకు అన్వేషించవలసిన అవసరం ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మొట్టమొదట నైలాన్ అనే కృత్రిమ దారాన్ని కనుగొనడం జరిగింది. నైలాన్ దారం బలంగా ఉండి సాగే గుణమున్న తేలికైన పదార్థం. నైలాన్ తో తయారైన బట్టలు మంచి మెరుపును కలిగి ఉంటూ, తేలికగా ఉతుక్కోవడానికి వీలుగా ఉండడం మరియు త్వరగా ఆరే గుణం ఉండడం వల్ల కృత్రిమ దారాల వాడకం పెరిగింది.

8th Class Physical Science Textbook Page No. 49

ప్రశ్న 4.
పారాచూట్ తయారుచేయడానికి నూలుగుడ్డ, నూలు తాడులను వాడితే ఏం జరుగుతుంది?
జవాబు:
నూలుగుడ్డ, నూలు తాడులను పారాచూట్లో వాడితే కింద పడిపోవడం జరుగుతుంది.

కారణాలు :

  1. నూలు గుడ్డ, నూలు తాడులు అధిక పీడన, సంపీడనాలను తట్టుకోలేవు.
  2. నూలు గుడ్డలో సన్నని రంధ్రాలు ఉండడం వలన గాలి సన్నని రంధ్రాల గుండా సులభంగా ప్రయాణిస్తుంది.
  3. నూలు తాడు అధిక బరువులకు తెగిపోతుంది.

ప్రశ్న 5.
పూర్వకాలంలో చేపలు పట్టేవారు నూలు వలలను వాడేవారు. ప్రస్తుతం వారు నైలాన్ వలలను వాడుతున్నారు. నైలాన్ వలల వాడకం వలన లాభాలు ఏమిటి?
జవాబు:

  1. నైలాన్ దారాలు అధిక బరువులను తట్టుకోగలవు. కావున వలలు తెగిపోవు.
  2. ఇవి గట్టిగా, దృఢంగా ఉండడం వలన చేపలు కొరికినా తెగిపోవు.
  3. ఈ దారాలు తడిసినా పాడుకావు.
  4. ఇవి అధిక పీడనాన్ని తట్టుకోగలవు.
  5. ఇవి నీటిని ఎక్కువగా పీల్చుకోవు. నీటిలో వీటి బరువు ఎక్కువగా ఉండదు.

ప్రశ్న 6.
నైలాన్ చీరలు నూలు చీరల కంటే మెరుగైనవి. మీరు అంగీకరిస్తారా? ఎందుకు?
జవాబు:
నైలాన్ చీరలు నూలు చీరల కంటే మెరుగైనవి. ఎందుకంటే

  1. తేలికగా ఉంటాయి.
  2. మెరుపును కలిగి ఉంటాయి.
  3. ఎక్కువ కాలం మన్నికగా, ఉంటాయి.
  4. సులభంగా ఉతకవచ్చును.
  5. నీటిని ఎక్కువగా పీల్చవు.
  6. త్వరగా ఆరతాయి.
  7. ముడుతలు పడవు. ఇస్త్రీ చేయవలసిన అవసరం ఉండదు.
  8. కీటకాలు తినవు.
  9. పీడన, సంపీడనాలను తట్టుకుంటాయి.
  10. తక్కువ ఖరీదుకు లభిస్తాయి.

8th Class Physical Science Textbook Page No. 50

ప్రశ్న 7.
సహజ పట్టుకంటే కృత్రిమ రేయాన్ మెరుగైనదిగా తయారు కావడానికి ఏ లక్షణాలు తోడ్పడతాయి?
జవాబు:

  1. రేయాన్ సహజ పట్టు కన్నా చవకైనది.
    చెమటను పీల్చుకొనే స్వభావం ఉండడం.
    స్పర్శకు మృదువుగా మరియు సిల్కీగా ఉండడం.
    కాంతి మరియు మెరుపును కలిగి ఉండడం.
    పై లక్షణాలు సహజ పట్టుకంటే కృత్రిమ రేయాన్ మెరుగైనది అనడానికి తోడ్పడుతున్నాయి.

ప్రశ్న 8.
కృత్రిమ దారముతో తయారైన ఇంటి గడప ముందు కాళ్లు తుడుచుకునే గుడ్డ (Door mat) ను కొనాలని భావిస్తే ఎలాంటి దానితో తయారైన కృత్రిమ దారంను ఎన్నుకుంటావు? ఎందుకు?
జవాబు:
రేయాన్ దారముతో తయారైన కాళ్లు తుడుచుకొను (Door mat) గుడ్డను ఎన్నుకుంటాను. ఎందుకంటే రేయాన్ కి నీరు, తేమను పీల్చుకునే స్వభావం ఉన్నది కనుక.

ప్రశ్న 9.
ఆరోగ్య రక్షణకై వాడే లంగోటీలు (Diapers) మరియు బ్యాండేజ్ లను నైలాన్ తో తయారుచేస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:
ఆరోగ్య రక్షణకై వాడే లంగోటీలు మరియు బ్యాండేజ్ లను నైలాన్ తో తయారుచేస్తే నీటిని, చెమటను పీల్చుకొనదు.

8th Class Physical Science Textbook Page No. 51

ప్రశ్న 10.
శీతాకాలంలో ఏ రకపు మిశ్రణం దుస్తులు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి? ఎందుకు?
జవాబు:
శీతాకాలంలో టెర్లిన్, ఉన్నితో మిశ్రణం చేసిన టెరిడోల్ దుస్తులు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఇది సహజదారాలు మరియు కృత్రిమ దారాల ధర్మాలను కలిగి ఉంటుంది.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 11.
సహజ, కృత్రిమ, మిశ్రణం దుస్తులు మనకు లభ్యమవుతున్నాయి కదా! శుభకార్యాలు, పండుగల సమయంలో ఏ దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు? ఎందుకు?
జవాబు:
శుభకార్యాలు, పండుగల సమయంలో సహజ దారాలతో తయారైన పట్టు దుస్తులను ధరించడానికి ఇష్టపడతాను. ఎందుకంటే

  1. శరీరానికి ఎక్కువ గాలిని తగిలేటట్లు చేస్తాయి.
  2. చెమటను పీల్చుకుంటాయి.
  3. శరీరానికి చిరాకును కలిగించే రసాయనాలు ఉండవు.
  4. వేడికి కరగవు కావున శరీరానికి అంటుకుపోవు.
  5. సహజ దారాలు శరీరానికి సౌకర్యంగా ఉంటాయి.

8th Class Physical Science Textbook Page No. 52

ప్రశ్న 12.
సహజ లేదా కృత్రిమ దుస్తులలో వేటిని మీరు ఇష్టపడతారు? ఎందుకు? ఈ రెండింటి మధ్య భేదాలను వ్రాయండి.
జవాబు:
కృత్రిమ దుస్తులు ఇష్టపడతాను. ఎందుకంటే కృత్రిమ దుస్తులు మన్నికైనవి, కాంతిని, మెరుపును కలిగి ఉంటాయి. అన్ని కాలాలకు అణుగుణమైన కృత్రిమ దుస్తులు లభిస్తాయి.

సహజ దుస్తులు కృత్రిమ దుస్తులు
1) సహజ దారాలు ఎక్కువ ఖరీదైనవి. 1) కృత్రిమ దారాలు చౌకైనవి.
2) సహజ దుస్తులు ముడతలు పడతాయి. 2) కృత్రిమ దుస్తులు ముడతలు పడవు.
3) ఇవి ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. 3) ఇవి తక్కువ నీటిని పీల్చుకుంటాయి.
4) ఇవి త్వరగా ఆరవు. 4) ఇవి త్వరగా ఆరుతాయి.
5) ఇవి మన్నికైనవి కావు. 5) ఇవి మన్నికైనవి.
6) ఇవి కాంతిని, మెరుపును కలిగి ఉండవు. 6) ఇవి కాంతిని, మెరుపును కలిగి ఉంటాయి.

ప్రశ్న 13.
మన దుస్తులను ఇంట్లో ఉతకడానికి, లాండీల్లో డ్రైక్లీనింగ్ చేయడానికి తేడా ఏమిటి?
జవాబు:

ఇంట్లో ఉతకడం డ్రైక్లీనింగ్
1. దుస్తులను ఉతకడానికి డిటర్జెంట్లు, వాషింగ్ పౌడర్లను ఉపయోగిస్తారు. డ్రైక్లీనింగ్ లో కర్బన ద్రావణులను ఉపయోగిస్తారు.
2. దుస్తులు అధిక ఉష్ణోగ్రత మరియు ఒత్తిడికి లోనౌతాయి. 2. దుస్తులు అధిక ఒత్తిడికి లోను కావు.
3. రక్తం, గ్రీజు, నూనె, , పెయింట్ల వంటి మరకలు పోవు. 3. రక్తం, గ్రీజు, నూనె, పెయింట్ల వంటి మరకలు పోతాయి.

8th Class Physical Science Textbook Page No. 57

ప్రశ్న 14.
కొన్ని వేపుడు పెనాలకు (Fry Pans) ఆహార పదార్థాలు అంటుకోవు ఎందుకు?
జవాబు:
కొన్ని వేపుడు పెనాలకు ఆహార పదార్థాలు అంటుకోవు. ఎందుకంటే టెఫ్లాతో వేపుడు పెనాలపై పూత పూయబడి ఉంటుంది.

ప్రశ్న 15.
అగ్నిమాపకదళ సిబ్బంది ధరించే దుస్తులు మంటలకు అంటుకోవు. ఎందుకు?
జవాబు:
అగ్నిమాపక దళ సిబ్బంది ధరించే దుస్తులు మంటలకు అంటుకోవు, ఎందుకంటే అవి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ తో తయారు చేసిన దుస్తులు కాబట్టి.

8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
మీ ఇంటిలో సహజ మరియు కృత్రిమ దారాలతో తయారైన వస్తువులను గుర్తించండి. మీ పాఠశాల, ఇల్లు మరియు మీ పరిసరాలలో ఉన్న వివిధ వస్తువులను, గృహోపకరణాలను గుర్తించి ఆ జాబితాను పట్టికలోని సరియైన గడిలో పొందుపరచండి.
జవాబు:

వనరు గృహోపకరణాలు
మొక్కల నుండి వచ్చే సహజ దారాలతో తయారయ్యేవి. నూలు చీర, ఖాదీ బట్టలు, దుప్పట్లు, డోర్ కర్టన్లు, బ్యాండేజీలు మొదలగునవి.
జంతువుల నుండి వచ్చే సహజ దారాలతో తయారయ్యేవి. పట్టు చీర, స్వెటర్లు, శాలువాలు, డోర్ కర్టన్లు, రగ్గులు మొదలగునవి.
కృత్రిమ దారాలతో తయారయ్యేవి. బ్రష్ యొక్క కుంచె, తాళ్లు, చేపల వలలు, గుడారాలు, మేజోళ్లు, బెల్ట్ లు, దిండ్లు, తివాచీలు, ఈత దుస్తులు, గొడుగుకు వాడే గుడ్డ, బ్యాండేజీలు, లంగోటీలు మొదలగునవి.

కృత్యం – 2 పూసలు మరియు పేపర్ క్లిక్స్ అమరిక :

ప్రశ్న 2.
కొన్ని పేపర్ క్లిప్ ను తీసుకొని వాటిని పటంలో చూపినట్లు ఒకదానితో ఒకటి కలపండి. క్లిక్స్ అమరిక పద్ధతిని గమనించండి. పూసల దండకు, పేపర్ క్లిక్స్ గొలుసుకు మధ్య ఏమైనా పోలికలు గుర్తు పట్టగలరా?
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 6
జవాబు:
పూసల దండలోనూ, పేపర్ క్లిప్ ల గొలుసులోనూ ఒక్కొక్క పేపర్ క్లిప్ పేపర్ క్లి గొలుసు పూస లేక ఒక్కొక్క పేపర్ క్లిప్ రెండవ దానితో కలిసి ఒక పెద్ద గొలుసులాగా ఏర్పడినాయి.

కృత్యం – 3 దారాలను గుర్తించడం – మండించే పరీక్ష :

ప్రశ్న 3.
వివిధ సహజ, కృత్రిమ దారాలను మండించి వాటి లక్షణాలను ఒక పట్టికలో నమోదు చేయండి.
(లేదా)
వివిధ రకాల దారాలను కాల్చినపుడు జరిగే మార్పుల ఆధారంగా దారాలను గుర్తించి పట్టికలో నింపుము.
జవాబు:
పరీక్షించవలసిన వివిధ సహజ, కృత్రిమ దారాలను ఒక్కొక్కటిగా తీసుకొని దాని పురిని, ముడులను విప్పి సారాయి దీపముపై మండించితిని. మండినపుడు పరిశీలించి వాటి లక్షణాలను పట్టికలో వ్రాసితిని.

దారం లక్షణాలు (మండించినపుడు)
1. నూలు (పత్తి) వేగంగా మండింది. కాగితం కాలిన వాసన వచ్చింది.
2. ఉన్ని నెమ్మదిగా మండింది. వెంట్రుకలు కాలిన వాసన వచ్చింది.
3. పట్టు నెమ్మదిగా మండింది. వెంట్రుకలు కాలిన వాసన వచ్చింది.
4. రేయాన్ వేగంగా మండింది. కాగితం కాలిన వాసన వచ్చింది.
5. నైలాన్ నెమ్మదిగా మండింది. దారము జ్వాలలో కరిగింది.
6. అక్రలిక్ నెమ్మదిగా మండింది. దారము జ్వాలలో కరిగింది.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

కృత్యం – 4

ప్రశ్న 4.
నైలాన్ ఎంత బలమైనది ? వివిధ దారాల బలాలను తెలుసుకొను కృత్యమును వివరించండి.
జవాబు:
క్లాంపుతో ఉన్న ఒక ఇనుపస్టాండును తీసుకోండి. 50 సెం. మీ. పొడవున్న నూలు, ఉన్ని, నైలాన్ మరియు పట్టుదారాలను తీసుకోండి. కింది పటంలో చూపిన విధంగా నూలు దారాన్ని కట్టండి. దారం మరొక చివర బరువులు వేయడానికి వీలుగా ఉండే పళ్లెమును వేలాడదీయండి. ఆ పళ్లెములో మొదట 10గ్రా.ల బరువుతో ప్రారంభించి బరువును దారం తెగేంత వరకు పెంచండి. దారం తెగగానే దాని బరువును పట్టికలో నమోదు చేయండి. ఈ విధంగా వివిధ దారాలతో చేసి బరువులను పట్టికలో నమోదు చేయండి. తీసుకున్న అన్ని దారాలు ఒకే పొడవు, దాదాపు ఒకే మందము ఉండేటట్లు చూడండి.

దారపు రకం దారం తెగిపోవడానికి అవసరమైన భారం సంఖ్య  (గ్రాములలో)
1. నూలు 250
2. ఉన్ని 500
3. పట్టు 550
4. నైలాన్ 1200

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 7

పై కృత్యంలో దారాల బలాలు పెరిగే క్రమం : నూలు < ఉన్ని < పట్టు < నైలాన్

కృత్యం – 6

ప్రశ్న 5.
ఇచ్చిన సీసా (Bottle) PET సీసా అని ఎలా చెప్పగలవు?

మీ తరగతి స్నేహితుల నుండి వేర్వేరు నీటి సీసాలను సేకరించి వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. సీసాల అడుగున త్రిభుజాకారములో ఏదైనా గుర్తు ఉన్నదా? లేదా బ్రాండ్ లేబుల్ స్టిక్కర్ (brand label sticker) పైన ఆ గుర్తు ఉందా? ఆ త్రిభుజంలో ఏ అంకె ఉన్నది? కింది పటంను పరిశీలించండి. చాలా బాటిళ్లకు త్రిభుజాకోరం మధ్యలో 1 అనే అంకె ఉండడం గమనిస్తావు. ఇలా ‘1’ ఉన్నట్లైతే అది PET బాటిల్ అవుతుంది.
రెసినను గుర్తించేందుకు చిహ్నములు :
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 8

చిహ్నముల సంఖ్యలు (Code Numbers)

  1. పాలీఎథిలీన్ టెరిఫాల్ట్ (PET, PETE)
  2. అధిక సాంద్రత గల పాలీ ఎథిలీన్ (HDPE)
  3. పాలీవినైల్ క్లోరైడ్ (PVC)
  4. అల్ప సాంద్రత గల పాలీ ఎథిలీన్ (LDPE)
  5. పాలీ ప్రొపిలీన్ (PP)
  6. పాలీ స్టెరీన్ (PS)
  7. ఇతరము (1, 2, 3, 4, 5 లేక 6 అని స్పష్టంగా లేని వాటిని లేదా ఒకటి కంటే ఎక్కువ రెసిన్ కలయిక ద్వారా ఏర్పడిన వాటిని ఈ కోడ్తో సూచిస్తారు.)

కృత్యం – 7

ప్రశ్న 6.
వివిధ రకాల వస్తువులను వాటికి గల రీసైక్లింగ్ చిహ్నం ద్వారా గుర్తించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 9

కృత్యం – 8

ప్రశ్న 7.
ప్లాస్టిక్ రకాలు :
ప్లాస్టిక్ తో తయారైన ఒక PP బాటిల్, మరొక సాధారణమైన బాటిల్ (PET)ను తీసుకొని వేడి నీటిని రెండింటిలో పోయండి.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 10

a) ఏమి మార్పులను గమనించారు?
జవాబు:
సాధారణమైన బాటిల్ ముడుచుకొనిపోయింది. తద్వారా దాని ఆకృతి మారినది.

b) రూపం మారిన సీసా యొక్క చిహ్నము (Code) ను చూడండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 11

c) టప్పర్ వేర్ ప్లాస్టిక్ ఏ రకమైనదో నీవు చెప్పగలవా?
జవాబు:
థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రయోగశాల కృత్యం

ప్రశ్న 8.
మీకు ఇచ్చిన ప్లాస్టిక్ థర్మో ప్లాస్టిక్లు మరియు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లను గుర్తించండి.
(లేదా)
ప్లాస్టిక్ దువ్వెన, పళ్ళుతోముకునే బ్రష్, ప్లాస్టిక్ బకెట్, కుక్కర్ పిడిలు, ఎలక్ట్రిక్ స్విచ్, ప్లాస్టిక్ ప్లేటు, కాఫీ మగ్లను నీకు ఇచ్చినపుడు ఏ కృత్యం చేయడం ద్వారా ఏది థర్మోప్లాస్టిక్, ఏది థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అని గుర్తించగలవో ఆ కృత్యమును వివరింపుము.
ఉద్దేశము :
జ్వాల పరీక్షను ఉపయోగించి థర్మోప్లాస్టికు మరియు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లను గుర్తించుట.

కావలసిన పరికరాలు :
పట్టుకారు, సారాయి దీపం, ఇచ్చిన ప్లాస్టిక్ నమూనాలు.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 12

పద్ధతి :

  1. సారాయి దీపమును తీసుకొని దానిని వెలిగించండి.
  2. పట్టుకారు సహాయంతో ప్లాస్టిక్ నమూనాను పట్టుకోండి.
  3. సారాయి దీపపు మంటపై ఈ నమూనాను పెట్టండి. మండుతున్నప్పుడు జరుగుతున్న మార్పులను గమనించండి.
  4. ఈ విధంగా అన్ని నమూనాలను పరీక్షించండి. మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.
  5. వేడిచేసినప్పుడు ముడుచుకుపోయే, వంచడానికి వీలయ్యే వాటిని థర్మోప్లాస్టిక్ అంటారు.
  6. ఒకసారి మలచిన తర్వాత వేడిచేయుట ద్వారా మృదువుగా మార్చలేకపోతే అటువంటి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అని అంటారు.
ప్లాస్టిక్ నమూనా మెత్తబడడం/కాలిన వాసనతో మండడం/తర్వాత గట్టిపడడం థర్మోప్లాస్టిక్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
1. టూత్ బ్రష్ కుంచె నెమ్మదిగా మండి మెత్తబడడం, కాలిన వాసనతో మండడం థర్మోప్లాస్టిక్
2. దువ్వెన మెత్తబడడం, కాలినవాసనతో మండడం థర్మోప్లాస్టిక్
3. బకెట్ చిన్నముక్క మెత్తబడడం, కాలిన వాసనతో మండడం థర్మోప్లాస్టిక్
4. వంటపాత్ర పిడి తర్వాత గట్టిపడడం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
5. విద్యుత్ స్విచ్ తర్వాత గట్టిపడడం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
6. పళ్లెం తర్వాత గట్టిపడడం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
7. కాఫీకప్పు తర్వాత గట్టిపడడం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

కృత్యం – 9 జీవ విచ్ఛిన్నం చెందేవి, జీవ విచ్ఛిన్నం చెందనివి :

ప్రశ్న 9.
ఇచ్చిన పదార్థాలలో జీవ విచ్ఛిన్నం చెందేవి, జీవ విచ్ఛిన్నం చెందనివి గుర్తించి, జీవ విచ్ఛిన్నం చెందుటకు పట్టేకాలాన్ని కనుగొనండి.
జవాబు:
ఒక గుంతను తవ్వి, ఇచ్చిన పదార్థాలను గుంతలో వేయండి. కొన్ని రోజుల తర్వాత గుంతను మరల తవ్వి ఏ పదార్థాలు భూమిలో కలిసిపోయాయో, ఏవి మిగిలిపోయాయో పరిశీలించండి. వివరాలను పట్టికలో వ్రాయండి.

వ్యర్థం పేరు భూమిలో కలిసిపోవడానికి పట్టేకాలం మార్పు
1. కూరగాయలు, పండ్ల తొక్కలు 10 – 20 రోజులు జీవ విచ్ఛిన్నం చెందును.
2. తినగా మిగిలిన పదార్థాలు 10-20 రోజులు జీవ విచ్ఛిన్నం చెందును.
3. కాగితం 10-30 రోజులు జీవ విచ్ఛిన్నం చెందును.
4. నూలు బట్ట 2-6 నెలలు జీవ విచ్ఛిన్నం చెందును.
5. ప్లాస్టిక్ సంచి 100 సం||ల కన్నా ఎక్కువ జీవ విచ్ఛిన్నం చెందదు.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

SCERT AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 3rd Lesson Questions and Answers మన చుట్టూ ఉన్న పదార్థం

8th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కింది వాటిని వివరించే కృత్యాలను తెలపండి. (AS1)
(అ) కణాల చలనం (ఆ) కణాల మధ్య ఆకర్షణ , (ఇ) కణాల మధ్య స్థలం
జవాబు:
(అ) కణాల చలనాన్ని వివరించే కృత్యం :

  1. రెండు ‘250 మి.లీ. బీకర్లు తీసుకొని వాటిలో కొద్దిగా నీరు నింపండి.
  2. ఒక డ్రాపర్ సహాయముతో ఎరుపు / నీలం ఇంకును ఒక బీకరు గోడల వెంబడి నీటిలో కలపండి.
  3. రెండవ బీకరులోని నీటికి పొటాషియం పర్మాంగనేటు (KMNO4) ద్రావణాన్ని కలపండి.
  4. మొదటి బేకరులో ఇంకు కణాలు నెమ్మదిగా నీటిలో వ్యాపనం చెందడాన్ని గమనిస్తాము.
  5. రెండవ బీకరులో పొటాషియం పర్మాంగనేటు కణాలు నీటిలో త్వరగా వ్యాపనం చెందడాన్ని గమనిస్తాము.
  6. ఈ కృత్యం ద్వారా పదార్థంలోని కణాలు చలిస్తాయని తెలుస్తుంది.

(ఆ) కణాల మధ్య ఆకర్షణను వివరించే కృత్యం : (కృత్యం – 9 )
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 1

  1. ఒక కుళాయి (నల్లా)ను విడిచి నీరు ధారగా వచ్చునట్లు చేయండి.
  2. నీటి ధారను మధ్యగా మీ చేతి వేలితో విడగొట్టే ప్రయత్నం చేయండి.
  3. నీటి ధారను పాక్షికంగా విడగొట్టగలిగాముగాని, శాశ్వతంగా విడగొట్టలేము.
  4. నీటి అణువుల మధ్య గల ఆకర్షణ బలమే నీటి ధార విడిపోకుండా నిరంతరంగా కలిసి ఉండడానికి కారణము.
  5. ఇప్పుడు ఒక మేకును మీ చేతితో విరగగొట్టడానికి ప్రయత్నం చేయండి.
  6. మేకులోని కణాల మధ్యగల ఆకర్షణ బలం చాలా ఎక్కువగా ఉండడం వల్ల మేకును విరగగొట్టలేము.
  7. ఇదే విధంగా సుద్దముక్కను విరవడానికి ప్రయత్నించినపుడు సులభంగా విరవగలము.
  8. దీనికి కారణం, సుద్దముక్కలోని కణాల మధ్య గల బలహీన ఆకర్షణ బలాలే.
  9. పై పరిశీలనల ద్వారా పదార్థపు కణాల మధ్య ఆకర్షణ బలం ఉంటుందని, ఆ బలం పదార్థ కణాలను కలిపి ఉండేలా చేస్తుందని చెప్పవచ్చు.
  10. కణాల మధ్య ఉండే ఈ ఆకర్షణ బలం పదార్థం యొక్క అన్ని స్థితులలో ఒకేలా ఉండదు.

(ఇ) కణాల మధ్య స్థలాన్ని వివరించే కృత్యం : (కృత్యం – 8)
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 2

  1. ఒక బీకరులో కొంత నీటిని తీసుకొని దాని మట్టాన్ని గుర్తించండి.
  2. దానికి కొద్దిగా ఉప్పును కలిపి, అది కరిగే వరకు గాజు కడ్డీతో తిప్పండి.
  3. నీటి మట్టంలో ఏమైనా తేడా ఉందేమో గమనించండి. ఎటువంటి ఆ తేడాను గమనించము.
  4. మరికొంత ఉప్పును కలిపి చూడండి.
  5. మరల నీటి మట్టాన్ని గుర్తించండి. ఇప్పుడు కూడా ఎటువంటి తేడాను గమనించము.
  6. బీకరులోని నీటిలో కొంత ఉప్పు కరగకుండా ఉండే వరకు ఈ ప్రక్రియను కొనసాగించండి.
  7. ఈ కృత్యము నుండి ఘన, ద్రవ పదార్థాలలోని కణాల మధ్య కొంత ఖాళీస్థలం ఉంటుందని తెలుస్తుంది.
  8. ఘన పదార్థాలను ద్రవ పదార్థాలలో కరిగించినపుడు ఘన పదార్థాలలోని కణాలు ద్రవాల మధ్య గల ఈ ఖాళీ స్థలంలోకి చేరతాయి.
  9. ఈ విధంగా కణాలు ఖాళీ స్థలాన్ని ఆక్రమించిన తరువాత ఘన పదార్థంలోని కణాలను, ఆక్రమించుకోవడానికి ఖాళీ స్థలం లేకపోవడం వల్ల కరగకుండా ఉండిపోతాయి.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 2.
వ్యాపన ధర్మం ఆధారంగా పదార్థ లక్షణాలను వివరించండి. (AS1)
జవాబు:
వ్యాపన ధర్మం ఆధారంగా పదార్థ లక్షణాలు కింది విధంగా ఉన్నాయి. అవి :

  1. పదార్థం అతి సూక్ష్మమైన కణాలచే నిర్మింపబడి ఉంటుంది.
  2. పదార్థంలోని కణాల మధ్య ఖాళీ స్థలం ఉంటుంది.
  3. ఘన మరియు ద్రవ పదార్థ కణాలు ద్రవాలలోకి వ్యాపనం చెందుతాయి.
  4. వాయు కణాలు వాయు పదార్థంలోకి వ్యాపనం చెందుతాయి.
  5. వ్యాపన రేటు వాయు పదార్థాలకు అధికంగాను, ఘన పదార్థాలకు అత్యల్పంగాను, ద్రవ పదార్థాలకు మధ్యస్థంగాను ఉంటుంది.
  6. ఘన పదార్థాలను ద్రవ పదార్థాలలో కరిగించినపుడు, ఘన పదార్థాలలోని కణాలు ద్రవకణాల మధ్య గల ఖాళీ స్థలంలోకి చేరతాయి.
  7. పదార్థం యొక్క కణాలు ద్రవ మరియు వాయు పదార్థాలలో నిరంతరం చలిస్తుంటాయి.

ప్రశ్న 3.
“నీటిలో చక్కెర కలిపినపుడు ద్రావణం ఘనపరిమాణం పెరగదు.” ఈ వాక్యం సరైనదా? కాదా? కారణాన్ని తెలపండి. చక్కెర, నీటి పరిమాణాలను దృష్టిలో పెట్టుకుని పై వాక్యాన్ని గురించి వ్యాఖ్యానించండి. (AS1)
ఈ వాక్యం సరైనదే.
కారణం :
చక్కెరను నీటిలో కలిపినపుడు చక్కెర కణాలు నీటి అణువుల మధ్యనున్న ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తాయి. కావున నీటి ఘనపరిమాణములో ఎటువంటి మార్పూ ఉండదు.

ప్రశ్న 4.
పదార్థ స్థితిలో మార్పు జరిగినపుడు దాని ద్రవ్యరాశిలో మార్పు ఉంటుందా? ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:

  1. ఒక బీకరును తీసుకొని దానిని మంచు ముక్కలతో నింపండి.
  2. స్ప్రింగు బాలెన్స్ ద్వారా మంచు ముక్కలతో సహా బీకరు ద్రవ్యరాశిని (m1) కనుగొనండి.
  3. బీకరును కొంత సేపు నిలకడగా ఉంచి మంచు ముక్కలు కరగనివ్వండి.
  4. ఇప్పుడు మరల స్ప్రింగు బాలెన్స్ సహాయంతో బీకరు ద్రవ్యరాశిని (m2) కనుగొనండి.
  5. m1 = m2 అని మనము గమనిస్తాము.
  6. దీని ద్వారా పదార్థ స్థితిలో మార్పు జరిగినపుడు దాని ద్రవ్యరాశిలో మార్పు ఉండదని తెలుస్తుంది.

ప్రశ్న 5.
అన్ని పదార్థాలు వేడిచేసినపుడు ఘనస్థితి నుండి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుతాయా? వివరించండి. (AS1)
జవాబు:
అన్ని పదార్థాలు వేడిచేసినపుడు ఘనస్థితి నుండి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారవు.
ఉదా :

  1. చెక్కను వేడిచేసినపుడు అది ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారదు. కానీ దాని రూపంలో మార్పు వస్తుంది.
  2. రక్తాన్ని వేడిచేసినపుడు ద్రవస్థితి నుండి ‘ఘనస్థితికి మారును.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 6.
కింది వానిని నిర్వచించండి. (AS1)
అ) ద్రవీభవన స్థానం – ఆ) మరుగుస్థానం ఇ) ఇగురుట
జవాబు:
అ) ద్రవీభవన స్థానం :
ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనపదార్థం కరిగి ద్రవ పదార్థంగా మారుతుందో, ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటారు.

ఆ) మరుగుస్థానం :
వాతావరణ పీడనం వద్ద ద్రవాలు బాష్పంగా మారే ఉష్ణోగ్రతను ‘మరుగుస్థానం’ అంటారు.

ఇ) ఇగురుట :
మరుగు స్థానం కన్నా దిగువున ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవాలు బాష్పంగా మారగలిగే దృగ్విషయాన్ని ‘ఇగురుట’ అంటారు.

ప్రశ్న 7.
కింద ఇవ్వబడిన వాక్యాలను సరిచేయండి. (AS1)
అ) వాతావరణ పీడనంలో 100°C.వద్ద నీరు మరుగును.
జవాబు:
ఈ వాక్యము సరియైనది.

ఆ) ద్రవం ఉష్ణోగ్రత మరుగుస్థానం దాటిన తరువాత మాత్రమే ద్రవం ఇగురుతుంది.
జవాబు:
ఈ వాక్యము సరియైనది కాదు.
కారణం :
మరుగు స్థానం దిగువన ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవం ఇగురుతుంది.

ఇ) ఘన పదార్థాలలో కణాల మధ్య ఎక్కువ స్థలం ఉంటుంది.
జవాబు:
ఈ వాక్యం సరియైనది కాదు.

కారణం :

  1. ఘన పదార్థాలలో కణాల మధ్య ఖాళీ స్థలం చాలా తక్కువ.
  2. దీనివల్ల కణాల మధ్య ఆకర్షణ బలం అధికంగా ఉంటుంది.
  3. అందువల్లనే ఘనపదార్థాలు నిర్దిష్ట ఆకారాన్ని, స్థిరమైన ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయి.

ఈ) వాయు పదార్థాలలో కణాల మధ్య బలమైన ఆకర్షణ బలం ఉంటుంది.
జవాబు:
ఈ వాక్యము సరియైనది కాదు.

సరైన వాక్యం :
వాయు పదార్థాల కణాల మధ్య బలహీనమైన ఆకర్షణ బలం ఉంటుంది.

వివరణ :

  1. వాయువులలో కణాల మధ్య ఖాళీ స్థలం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కణాల మధ్య ఆకర్షణ బలాలు చాలా బలహీనంగా ఉంటాయి.
  2. దీనివల్ల వాయు పదార్థాలు స్థిరమైన ఆకారాన్ని గాని, నిర్దిష్టమైన ఘనపరిమాణాన్ని గాని కలిగి ఉండవు.
  3. వాయు పదార్థాలను మూయబడిన సిలిండర్లలో మాత్రమే నిలువ చేస్తారు.

ప్రశ్న 8.
వేడిగా ఉన్న ‘టీ’ ని కప్పుతో పోల్చినపుడు సాసర్ తో త్వరగా త్రాగవచ్చు. ఎందుకు? (AS1)
జవాబు:

  1. సాసర్ యొక్క ఉపరితల వైశాల్యము కప్పు యొక్క ఉపరితల వైశాల్యము కన్న ఎక్కువ.
  2. ఉపరితల వైశాల్యం పెరిగినపుడు వేగంగా ఇగరడం మనకు తెలుసు.
  3. దీనివల్ల వేడి ‘టీ’ లోని కణాలు కప్పుకన్నా సాసర్ నుండి త్వరగా తప్పించుకొనిపోగలవు.
  4. అందువల్ల కప్పుకన్నా సాసరులో టీ త్వరగా చల్లారును.

ప్రశ్న 9.
నీరు ఘనీభవించి మంచుగా మారుతుంది. ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రత ………. (AS1)
అ) కోల్పోతుంది ఆ) గ్రహిస్తుంది ఇ) మార్పు ఉండదు
ఈ) ఆయా పరిస్థితులననుసరించి గ్రహించడం కాని, కోల్పోవడం కాని జరుగుతుంది.
జవాబు:
అ) కోల్పోతుంది.

ప్రశ్న 10.
కింద ఇవ్వబడిన ఉష్ణోగ్రతలను సెల్సియస్ డిగ్రీలలోకి మార్చండి. (AS1)
అ) 283K
ఆ) 570K
జవాబు:
అ) 283K
283K = 283 – 273 = 10
∴ 283K = 10°C

ఆ) 570K
570K = 570 – 273 = 297
∴ 570K = 297°C

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 11.
కింద ఇవ్వబడిన ఉష్ణోగ్రతలను కెల్విన్ డిగ్రీలలోనికి మార్చండి. (AS1)
అ) 27°C
ఆ) 367°C
జవాబు:
అ) 27°C
0°C = 273K
27°C = 273 + 27 = 300
∴ 27°C = 300K

ఆ) 367°C
0°C = 273K
367° = 273 + 367 = 640
∴ 367°C = 640K

ప్రశ్న 12.
ఖాళీలను పూర్తి చేయండి. (AS1)
అ) పదార్థాన్ని ఒక స్థితి నుండి మరొక స్థితిలోకి మార్చడానికి ………. ను తగ్గించాలి, లేదా ……. ను పెంచాలి.
జవాబు:
ఉష్ణోగ్రత, పీడనము

ఆ) ఘన పదార్థం ద్రవస్థితిలోకి మారకుండానే నేరుగా వాయు స్థితిలోకి మారడాన్ని ……… అంటారు.
జవాబు:
ఉత్పతనం

ప్రశ్న 13.
కింది వాటిని జతపరచండి. (AS1)

1. ద్రవస్థితి నుండి వాయు స్థితికి మార్పు A. వాయువు
2. సంపీడ్యము కాకపోవటం B. ఘనస్థితి
3. వీలైనంత విస్తరించటం C. కణం
4. పదార్థంలో భాగం D. ఇగురుట

జవాబు:

1. ద్రవస్థితి నుండి వాయు స్థితికి మార్పు D. ఇగురుట
2. సంపీడ్యము కాకపోవటం B. ఘనస్థితి
3. వీలైనంత విస్తరించటం A. వాయువు
4. పదార్థంలో భాగం C. కణం

ప్రశ్న 14.
అత్తరు ఉంచిన స్థానం నుండి కొన్ని మీటర్ల దూరం వరకు వాసనను గుర్తించగలం. ఎందుకు? (AS2, AS1)
జవాబు:

  1. వాయు కణాలు, గాలిలో వేగంగా చలిస్తాయని మనకు తెలుసు.
  2. అదే విధంగా అత్తరు కణాలు కూడా గాలిలో కొన్ని .మీటర్ల దూరం వరకు చలిస్తాయి.
  3. అందువల్ల అత్తరు ఉంచిన స్థానం నుండి కొన్ని మీటర్ల దూరం వరకు వాసనను గుర్తించగలం.

ప్రశ్న 15.
శరీరంపై వేడి నీరు కన్నా నీటి ఆవిరి (steam) ఎక్కువ గాయం కలుగజేస్తుంది. ఎందుకు? (AS2, AS1)
జవాబు:

  1. వేడి నీటి కణాలకన్నా నీటి ఆవిరి కణాలకు ఎక్కువ శక్తి ఉంటుంది.
  2. బాష్పీభవన గుప్తోష్ణం రూపంలో నీటి ఆవిరి కణాలు అధిక శక్తిని గ్రహించడం వల్ల వీటి శక్తి అధికంగా ఉంటుంది.
  3. అందువల్ల శరీరంపై వేడి నీరు కన్నా నీటి ఆవిరి ఎక్కువ గాయం కలుగజేస్తుంది.

ప్రశ్న 16.
ఘన, ద్రవ, వాయుస్థితులలో కణాల అమరికను చూపే నమూనాను రూపొందించండి. (AS5)
జవాబు:
విద్యార్థులు జాగ్రత్తగా ఆలోచించి తమ సొంత నమూనాలు ఉపాధ్యాయుని సహకారంతో తయారు చేసుకోవాలి.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 17.
శరీరంలోని చెమట ద్వారా మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే ప్రక్రియను నీవు ఎలా ప్రశంసిస్తావు? (AS6)
జవాబు:

  1. మనం ఏదైనా భౌతిక వ్యాయామం చేసినపుడు కానీ, ఎండలో కష్టపడి పనిచేసినప్పుడు గాని మన శరీరంపై చెమట ఏర్పడుటను గమనిస్తాము.
  2. మన శరీరంలోని వేడిని సంగ్రహించిన చెమట శరీర ఉపరితలం నుండి ఇగురును.
  3. అనగా ద్రవరూపంలోని చెమట బిందువులు, మన శరీరం నుండి వేడిని సంగ్రహించి పరిసరాలలోనికి ఇగిరిపోవును.
  4. దీనివల్ల మనము చల్లదనాన్ని అనుభవిస్తాము.

8th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 34

ప్రశ్న 1.
రబ్బర్ బాండ్ లాగండి, దాని ఆకారం మారిందా?
రబ్బర్ బాండ్ ఘన పదార్థమా లేక ద్రవ పదార్థమా? ,ఎందుకు? అలాగడం ఆపినపుడు ఏం జరుగుతుంది? అలాగే ఎక్కువగా లాగినపుడు ఏం జరుగుతుంది? ఆలోచించండి.)
జవాబు:

  1. రబ్బరు బ్యాండును లాగినపుడు దాని ఆకారం మారుతుంది.
  2. ఇది ఒక ఘనపదార్థం.
  3. లాగడం ఆపినపుడు తిరిగి పూర్వపు ఆకారాన్ని పొందుతుంది.
  4. అలాగే ఎక్కువగా లాగినపుడు అది తన ఆకారాన్ని శాశ్వతంగా కోల్పోతుంది. (తెగిపోతుంది)

కారణం :
రబ్బరు బాండ్ ఘనపదార్థమే అయినప్పటికీ, దానిని తయారుచేసిన పదార్థ కణాల స్వభావం వల్ల పై ఫలితాలు కనబడుతాయి.

ప్రశ్న 2.
సన్నని పొడిగా ఉన్న ఉప్పును కొంత పరిమాణంలో తీసుకుని రెండు వేర్వేరు గాజు గ్లాసులలో వేసినపుడు ఆ ఉప్పు ఏ ఆకారాన్ని పొందింది? ఆకారంలో వచ్చిన మార్పు కారణంగా ఉప్పు ద్రవస్థితిలో ఉందని చెప్పగలమా? సమర్థించండి.
జవాబు:

  1. పొడిగా ఉన్న ఉప్పు అది పోసిన పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతుంది.
  2. ఇది ఒక ఘనపదార్థము.

సమర్థన :

  1. స్థితి లేదా ఆకారంలోని మార్పు అనగా కణాల అమరికలో పూర్తి మార్పు.
  2. కానీ పొడిగానున్న ఉప్పు అతి సూక్ష్మ కణాల కలయిక. ఇవి తమ ఆకారాన్ని కోల్పోవు.

ప్రశ్న 3.
ఒక స్పాంజ్ ముక్కను తీసుకొని దాని ఆకారాన్ని పరిశీలించండి. స్పాంజ్ ను మీరు అదమగలరా? ఇది ఘన పదార్ధమేనా? ఎందుకు? (స్పాంజ్ ను అదిమినపుడు దాని నుండి ఏదైనా పదార్థం బయటకు వస్తుందా? ఆలోచించండి) మనం కర్రముక్కను ఎందుకు అదమలేం?
జవాబు:
స్పాంజ్ ని అదమగలము. ఇది ఒక ఘనపదార్థము.
సమర్థన:

  1. సాధారణ దృఢ వస్తువు కన్నా, స్పాంజ్ లోని కణాల మధ్య ఖాళీ స్థలం కొంచెం ఎక్కువగా ఉంటుంది.
  2. కావున దీనిని అదిమి, దాని ఆకారాన్ని మార్చగలము.
  3. చెక్కముక్కలో కణాల మధ్య ఖాళీ స్థలం చాలా తక్కువగా వుంటుంది.
  4. కావున కర్ర/ చెక్కను సాధారణ పరిస్థితులలో అదిమి, దాని ఆకారాన్ని మార్చలేము.

8th Class Physical Science Textbook Page No. 42

ప్రశ్న 4.
వేసవి కాలంలో నూలు దుస్తులు ఎందుకు ధరిస్తాము?
జవాబు:

  1. వేసవిలో బాహ్య వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత వల్ల మన శరీరం నుండి చెమట అధికంగా వెలువడుతుంది.
  2. చెమట బాష్పంగా మారినపుడు మన శరీరం చల్లగా ఉందనే అనుభూతి కలుగుతుంది.
  3. నూలు దుస్తులు చెమటను త్వరగా పీల్చుకుంటాయి. అందువల్ల చల్లదనం అనే అనుభూతి కలుగుతుంది.
  4. సిల్కు పాలిస్టర్ లాంటి సింథటిక్ వస్త్రాలు చెమటను పీల్చుకోవు.
  5. అందువల్ల వేసవిలో నూలు దుస్తులను మాత్రమే ధరిస్తాము.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 5.
మంచుముక్కలు గల గాజుపాత్ర వెలుపలి గోడలపై నీటి బిందువులు ఎందుకు ఏర్పడతాయి?
జవాబు:

  1. గ్లాసులోని మంచుముక్కలు గ్లాసు యొక్క ఉపరితలాన్ని చల్లబరుస్తాయి.
  2. గ్లాసు ఉపరితలం చుట్టుపక్కల గల గాలిలో నీటి బాష్పం ఉంటుంది. ఈ నీటి బాష్పం , గ్లాసు ఉపరితలం కన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది.
  3. చల్లని గ్లాసు ఉపరితలం, తన చుట్టుపక్కలనున్న నీటి బాష్పాన్ని చల్లబరుస్తుంది.
  4. ఈ నీటి బాష్పం మరల నీరుగా మారుతుంది.
  5. ఈ నీరు గ్లాసు ఉపరితలంపై నీటి బిందువులుగా ఏర్పడుతుంది.

ప్రశ్న 6.
వేడి ఎక్కువగా ఉన్న రోజులలో పందులు నీటి గుంటలలో ఎక్కువ సమయం గడుపుతాయి. ఎందుకు?
జవాబు:

  1. పందుల చర్మం పైనున్న స్వేదరంధ్రాలు మామూలు జంతువులు/ మనుషుల కన్నా కొంచెం పెద్దవిగా వుంటాయి.
  2. పెద్ద స్వేదరంధ్రాల ద్వారా శరీరంలోని నీరు అధికంగా చెమట రూపంలో బయటకు రావడంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది.
  3. దీనిని అరికట్టడానికై పందులు బురదలో పొర్లి తమ చర్మం పైనున్న పెద్ద స్వేద రంధ్రాలను బురదతో కప్పి ఉంచుతాయి.
  4. అందువల్ల చెమట ఇగురుట అనేది త్వరగా జరుగదు.

8th Class Physical Science Textbook Page No. 31

ప్రశ్న 7.
నీటి వలె మూడు స్థితులలో లభించే పదార్థాలేమైనా ఉన్నాయా?
జవాబు:
‘మైనం’ కూడా నీటి .వలె మూడు స్థితులలో లభిస్తుంది.

ప్రశ్న 8.
పెట్రోల్, పాలను ఏ ధర్మాల ఆధారంగా ద్రవాలుగా పరిగణిస్తాము?
జవాబు:
పెట్రోల్, పాలు వంటి వాటికి నిర్దిష్ట ఆకారం లేదు. ఇవి, వాటిని పోసిన పాత్రల ఆకారాన్ని పొందుతాయి. అందువల్ల వీటిని ద్రవాలుగా పరిగణించవచ్చు.

8th Class Physical Science Textbook Page No. 32

ప్రశ్న 9.
ఘన పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం, ఘనపరిమాణం ఉంటుందా?
జవాబు:
ఘన పదార్థాలు నిర్దిష్ట ఆకారాన్ని, స్థిరమైన ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయి.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 10.
నీటిని నేలపై పోస్తే ఏ ఆకారంలోకి మారుతుంది?
జవాబు:
నీటిని నేల పై జారవిడిస్తే అది నేలపై ప్రవహిస్తుంది.

ప్రశ్న 11.
ప్రవాహి అంటే ఏమిటో చెప్పగలరా?
జవాబు:
ప్రవహించే పదార్థాన్ని ‘ప్రవాహి’ అంటారు.

8th Class Physical Science Textbook Page No. 33

ప్రశ్న 12.
CNG కి నిర్దిష్టమైన ఘనపరిమాణం ఉంటుందా?
జవాబు:
CNG కి నిర్దిష్టమైన ఘనపరిమాణం ఉండదు.

ప్రశ్న 13.
CNG కి నిర్దిష్టమైన ఆకారం ఉంటుందా?
జవాబు:
CNG కి నిర్దిష్టమైన ఆకారం లేదు. అది దానిని నిల్వ ఉంచిన సిలిండర్ ఆకారాన్ని పొందుతుంది.

8th Class Physical Science Textbook Page No. 34

ప్రశ్న 14.
అగరబత్తి, అత్తరు వాసనలు ఒకే సమయంలో ఒక మూల నుండి మరొక మూలకు చేరతాయా?
జవాబు:
అత్తరు వాసన, అగరబత్తి వాసన కన్నా త్వరగా ఒక మూల నుండి మరొక మూలకు చేరుతుంది. వాయువుల వ్యాపన వేగంలో మార్పే దీనికి కారణము.

8th Class Physical Science Textbook Page No. 36

ప్రశ్న 15.
ఘన, ద్రవ పదార్థాల కన్నా వాయువులు ఎందుకు వేగంగా వ్యాపనం చెందుతాయి?
జవాబు:
వాయుకణాల మధ్య ఖాళీ స్థలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఖాళీ స్థలం ఘనపదార్థ కణాలు, ద్రవపదార్థ కణాల కన్నా అధికం. అందువల్ల వాయుకణాల మధ్య ఆకర్షణ బలం చాలా బలహీనంగా ఉంటుంది. కావున వాయువులు త్వరగా వ్యాపనం చెందుతాయి.

ప్రశ్న 16.
నీరు ఎప్పుడు మంచుగా మారుతుంది? ఎప్పుడు బాష్పంగా మారుతుంది?
జవాబు:

  1. నీటిని రిఫ్రిజిరేటరులో ఉంచి చల్లబరచినపుడు (ఉష్ణోగ్రతను తగ్గించినపుడు) మంచుగా మారును.
  2. నీటిని వేడిచేసినపుడు (ఉష్ణోగ్రతను పెంచినపుడు) భాష్పంగా మారును.

8th Class Physical Science Textbook Page No. 38

ప్రశ్న 17.
పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారేటప్పుడు ఆ పదార్థంలో అంతర్గతంగా ఏ ఏ మార్పులు సంభవిస్తాయి?
జవాబు:
పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారేటప్పుడు ఆ పదార్థంలో అంతర్గతంగా ఘనపరిమాణం పెరుగుట/ తగ్గుటను గమనిస్తాము.

8th Class Physical Science Textbook Page No. 39

ప్రశ్న 18.
పదార్థంలో స్థితి మార్పు ఎలా జరుగుతుంది?
జవాబు:
పదార్థ ఉష్ణోగ్రతలో మార్పు వల్ల స్థితి మార్పు జరుగుతుంది.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 19.
పదార్థ స్థితిలో మార్పు జరిగేటప్పుడు కణాలు ఎలాంటి మార్పుకు లోనవుతాయి?
జవాబు:
పదార్థ స్థితిలో మార్పు జరిగేటప్పుడు కణాల గతిశక్తిలో (పెరుగుదల/తగ్గుదల) మార్పు జరుగుతుంది. దీనివల్ల కణాల మధ్య ఆకర్షణ బలం (పెరుగుట / తగ్గుట)లో మార్పు జరుగుతుంది.

8th Class Physical Science Textbook Page No. 41

ప్రశ్న 20.
ఒక సిలిండర్ లో ఉన్న వాయువుపై పీడనాన్ని పెంచి సంపీడ్యం చెందిస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
ఒక సిలిండర్ లో ఉన్న వాయువుపై పీడనాన్ని పెంచి సంపీడ్యం చెందిస్తే దాని ఘనపరిమాణం తగ్గుతుంది (బాయిల్ నియమం).

ప్రశ్న 21.
సిలిండర్ లోని వాయు కణాలు దగ్గరగా వస్తాయా?
జవాబు:
వాయు కణాల మధ్య ఖాళీస్థలం బాగా తగ్గి, సిలిండర్ లోని వాయుకణాలన్నీ దగ్గరగా వస్తాయి.

ప్రశ్న 22.
పదార్థ పీడనంలో మార్పు కలిగిస్తే పదార్థపు స్థితిలో మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారా?
జవాబు:
పదార్థ పీడనంలో మార్పు కలిగిస్తే పదార్ధపు స్థితిలో మార్పు వస్తుంది.

ప్రశ్న 23.
పీడనాన్ని పెంచటం ద్వారా లేదా ఉష్ణోగ్రత తగ్గించడం ద్వారా వాయువును ద్రవస్థితిలోకి మార్చగలమా?
జవాబు:
వాయువును వాటి సంక్లిష్ట ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లబరచినపుడు ద్రవస్థితిలోకి మార్చవచ్చు. కావున – పీడనం, ఉష్ణోగ్రతలలో మార్పు ద్వారా వాయువును ద్రవస్థితిలోకి మార్చవచ్చు.

ప్రశ్న 24.
పదార్థ స్థితిని మార్చడానికి మనం ప్రతిసారి దానికి ఉష్ణాన్ని అందించడం లేక పీడనంలో మార్పు కలిగించడం చేయవలసిందేనా?
జవాబు:
సహజంగా నీరు ఇగిరే ప్రక్రియ వంటి కొన్ని సహజ దృగ్విషయాలకు మినహా మిగిలిన సందర్భాలలో స్థితిని మార్చడానికి దానికి ఉష్ణాన్ని అందించడం లేక పీడనంలో మార్పు కలిగించడం అవసరమే.

ప్రశ్న 25.
ద్రవాలు వాటి ఉష్ణోగ్రత బాష్పీభవన స్థానాన్ని చేరకుండానే ద్రవస్థితి నుండి బాష్పంగా మారడం సాధ్యమేనా?
జవాబు:
తడి బట్టలు పొడిగా మారే ప్రక్రియలో, నీరు దాని బాష్పీభవన స్థానాన్ని చేరకుండానే ద్రవస్థితి నుండి బాష్పంగా మారుతుంది. కావున ఇది సాధ్యమే.

ప్రశ్న 26.
స్థితి మార్పులకు మరికొన్ని ఉదాహరణలివ్వండి.
జవాబు:
అయొడిన్ ఉత్పతనము, తడిగావున్న శరీరం ఆరుట మొదలైనవి.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 27.
ఈ రకమైన స్థితిమార్పులకు కారణం ఏమై ఉంటుంది?
జవాబు:

  1. పదార్ధంలోని ప్రతికణం దాని స్థితులతో సంబంధం లేకుండా నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద ఎంతో కొంత శక్తిని కలిగి ఉంటుంది.
  2. ఉదాహరణకు ద్రవాల ఉపరితలంపై ఉండే కణాలు ద్రవం లోపలి భాగంలో ఉండే మిగతా కణాల కన్నా అధిక శక్తిని కలిగి ఉంటాయి.
  3. అందువల్ల ఈ కణాలు వాటి మధ్యగల ఆకర్షణ బలాన్ని సులువుగా అధిగమించి బాష్పంగా మారతాయి.

పరికరాల జాబితా

వివిధ ఆకారములలో ఉన్న పాత్రలు, బీకరు, కొలజాడీ, శాంకువకు ప్పె, గోళాకారపు గాజుకుప్పె, పరీక్ష నాళిక, పెద్ద సిరంజి, అగరుబత్తి, సెంటు సీసా, పొటాషియం పర్మాంగనేట్, కాపర్ సల్ఫేట్, గుర్తించబడిన స్కేలు గల గాజు గొట్టం, రెండు రబ్బరు కార్కులు, దూది, అమ్మోనియా, హైడ్రోక్లోరికామ్ల ద్రావణాలు, డ్రాపర్, నీరు, ఉప్పు, ధర్మామీటరు, సారాయి దీపం, పింగాణి పాత్ర.

8th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
ద్రవాల ఆకార, పరిమాణాలను గుర్తించటం :
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 3
a) ద్రవ పదార్థాలకు నిర్దిష్ట ఆకారం లేదని నిరూపించుము.
జవాబు:

  1. ఒక స్థూపాకార కొలజాడిని, వేరు వేరు ఆకారాలలో ఉన్న పారదర్శకమైన పాత్రలను కొన్నింటిని తీసుకోండి.
  2. కొలజాడిలో కొంత పరిమాణంలో నీటిని తీసుకోండి.
  3. ఈ నీటిని ఒక పాత్రలో పోసి ఆ నీటి ఆకారాన్ని గమనించండి.
  4. ఇదే నీటిని వేరు వేరు పాత్రలలో పోసి, నీరు పొందిన ఆకారాన్ని ఒకే ఘనపరిమాణం, వివిధ ఆకారం గల ద్రవం గమనించండి.
  5. నీరు (ద్రవపదార్థం) అది పోసిన పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతుందని గమనిస్తాము.
  6. ఈ కృత్యం ద్వారా ద్రవ పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం లేదని, అవి వాటిని పోసిన పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతాయని తెలుస్తుంది.

b) ద్రవ పదార్థాలు నిర్దిష్ట ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయని నిరూపించండి.
జవాబు:

  1. ఒక కొలజాడి సహాయంతో 50 మి.లీ. నీటిని తీసుకోండి.
  2. ఈ నీటిని ఒక గాజు బీకరులో పోయండి.
  3. ఈ బీకరులో నీటి మట్టాన్ని గుర్తించి, నీటిని పారపోయండి.
  4. ఇప్పుడు కొలజాడితో 50 మి.లీ. పాలను కొలిచి అదే బీకరులో పోయండి.
  5. పాల మట్టాన్ని గ్లాసుపై గుర్తించండి. ఫాలను బీకరు నుండి తొలగించండి.
  6. పాలు మరియు నీరు ఒకే మట్టంలో ఉన్నట్లు గుర్తిస్తాము.
  7. ఇప్పుడు కొంత నూనెను తీసుకొని, దానిని గాజు బీకరులో నీటి మట్టం గుర్తించినంత వరకు పోయండి.
  8. ఈ నూనె ఘనపరిమాణాన్ని కొలజాడి సహాయంతో కొలవండి. అది 50 మి.లీ. ఉండడం గమనిస్తాము.
  9. ఈ కృత్యం ద్వారా ద్రవాలను వివిధ ఆకారాలు గల పాత్రలలోనికి మార్చినపుడు అవి వేర్వేరు ఆకారాలు పొందినప్పటికి వాటి ఘనపరిమాణంలో ఎలాంటి మార్పూ ఉండదు అని తెలుస్తుంది.

కృత్యం – 2 వాయువులకు నిర్దిష్ట ఆకారం, ఘనపరిమాణాలను పరిశీలించడం :

ప్రశ్న 2.
వాయువులకు నిర్దిష్టమైన ఘనపరిమాణంకాని, ఆకారంగాని ఉండదని ఒక కృత్యం ద్వారా నిరూపించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 4 AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 5

  1. CNG అనగా సంపీడత సహజ వాయువు (Compressed Natural Gas).
  2. ఈ వాయువును ఫిల్లింగ్ స్టేషన్లలో ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువును తక్కువ పరిమాణంలో నిల్వ చేస్తారు.
  3. అదే విధంగా ఫిల్లింగ్ స్టేషన్ నుండి వాహనాలలోనికి ఎక్కువ పరిమాణ వాయువును తక్కువ పరిమాణంలో ఎక్కిస్తారు.
  4. కనుక CNG కి నిర్దిష్టమైన ఘనపరిమాణం, నిర్దిష్టమైన ఆకారం ఉండదు.
  5. పై పరిశీలనల ఆధారంగా CNG మరియు ఇతర అన్ని వాయువులు నిర్దిష్టమైన ఘనపరిమాణాన్ని కాని, ఆకారాన్ని కాని కలిగి ఉండవని నిర్ధారించవచ్చు.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

కృత్యం – 3 వివిధ పదార్థాల సంపీడ్యతా ధర్మాన్ని పరిశీలించడం :

ప్రశ్న 3.
ఘన, ద్రవ పదార్థాలతో పోల్చినపుడు వాయు పదార్థాలు అధిక సంపీడ్యతను కలిగి ఉంటాయని చూపండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 6

  1. 50 మి.లీ.ల సిరంజిని తీసుకోండి.
  2. సిరంజిలోకి గాలి వెళ్ళేలా పిస్టన్ ను వెనుకకు లాగండి.
  3. నాజిల్ నుండి గాలి బయటకు రాకుండా మీ వేలును అడ్డంగా ఉంచి పిస్టనన్ను ముందుకు వత్తండి.
  4. సిరంజిలోనికి పిస్టన్ ఎంత దూరం నెట్టబడిందో గమనించి, గాలి స్తంభం ఎత్తును గుర్తించండి.
  5. గాలి స్తంభం కొంత ఎత్తును చేరుకున్న తరువాత పిస్టనను నెట్టడం కష్టమవడాన్ని గమనిస్తాము.
  6. ఇక్కడ సిరంజిలోని గాలి సంపీడ్యం చెందబడింది.
  7. ఇప్పుడు సిరంజిని నీటితో నింపి ఇదే ప్రయోగాన్ని చేయండి.
  8. సిరంజిలోని పిస్టనను నొక్కడం కష్టమనిపించినపుడు నీటి స్తంభం ఎత్తును కొలవండి.
  9. నీటి, స్తంభం ఎత్తు, గాలిస్తంభం ఎత్తుకన్న ఎక్కువగా ఉండడాన్ని గమనిస్తాము.
  10. ఇప్పుడు ఒక చెక్కముక్కను తీసుకొని నీ బొటనవేలితో నొక్కి చూడండి.
  11. చెక్క ఘనపరిమాణంలో ఎటువంటి గమనించదగ్గ మార్పూ కనబడదు.
  12. పై పరిశీలనల నుండి వాయు పదార్థాలు, ఘన, ద్రవపదార్థాల కంటే అధికంగా సంపీడ్యత చెందుతాయని తెలుస్తుంది.

కృత్యం – 4 వాయువుల వ్యాపనంను పరిశీలించుట :

ప్రశ్న 4.
వాయువుల వ్యాపనాన్ని పరిశీలించడానికి ఒక కృత్యాన్ని వివరింపుము.
జవాబు:

  1. మీ స్నేహితుడిని ఒక అగర్ బత్తి పట్టుకొని గదిలోని ఒక మూల నిలుచోమని చెప్పండి.
  2. మీరు గదిలో ఇంకో మూలలో నిలబడండి.
  3. గదిలో వాసనలో ఎటువంటి మార్పును గమనించము. (కొన్ని రకాల అగర్బత్తిలకు ఇది వర్తించదు)
  4. ఇప్పుడు అగర్బత్తిని వెలిగించమని మీ స్నేహితుడికి చెప్పండి.
  5. కొన్ని సెకనుల తరువాత గదిలో అగరబత్తి వాసనను గమనిస్తాము.
  6. అగర్ బత్తి వెలిగించగానే దానిలోని సుగంద ద్రవ్యం ఆవిరిగా మారి అగరబత్తి పొగతో బాటు గాలిలో కలిసి, గది అన్ని వైపులా వ్యాపించి మన ముక్కును చేరుతుంది.
  7. ఈ కృత్యం ద్వారా వాయువులు వ్యాపనం చెందుతాయని తెలుస్తుంది.

కృత్యం – 5 ద్రవాలలో వ్యాపనాన్ని పరిశీలించుట :

ప్రశ్న 5.
ద్రవాలలో వ్యాపనాన్ని పరిశీలించుట :
జవాబు:
250 మి.లీ. గోళాకార గాజుకుప్పెను తీసుకొని దానిలో కొద్దిగా నీరు నింపండి. డ్రాపర్ సహాయంతో రెండు లేదా మూడు చుక్కల నీలం లేదా ఎరుపు సిరాను లేదా పొటాషియం పర్మాంగనేట్ (KMnO4) ద్రావణాన్ని బీకరు గోడల వెంట నెమ్మదిగా నీటిలో వేయండి.

పరిశీలన :
వాయువులలో వ్యాపనం జరిగినట్లుగానే ద్రావాలలోనూ వ్యాపనం జరుగుతుందని మీరు గుర్తించవచ్చు.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

కృత్యం – 6 ద్రవాలలో ఘనపదార్థ కణాల వ్యాపనం పరిశీలించుట :

ప్రశ్న 6.
ద్రవాలలో ఘనపదార్థాల కణాలు వ్యాపనం చెందుతాయని ఒక కృత్యం ద్వారా చూపండి.
జవాబు:

  1. ఒక బీకరును తీసుకొని దానిని పూర్తిగా నీటితో నింపండి.
  2. అందులో కొద్దిగా పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలను కలిపి మార్పులను గమనించండి.
  3. పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలు నీటిలో వ్యాపనం చెంది నీటి రంగును మార్చుటను గమనిస్తాము.
  4. ఇదే ప్రయోగాన్ని కాపర్ సల్ఫేట్ స్ఫటికంతో చేయండి.
  5. ఇక్కడ కూడా కాపర్ సల్ఫేట్ స్ఫటికం నీటిలో వ్యాపనం చెంది నీటి రంగును మార్చుటను గమనిస్తాము.
  6. పై ప్రయోగాల నుండి, ఘనపదార్థ కణాలు ద్రవాలలో వ్యాపనం చెందుతాయని తెలుస్తుంది.

ప్రయోగశాల కృత్యం రెండు వాయువుల మధ్య వ్యాపనం :

ప్రశ్న 7.
రెండు వాయువుల మధ్య వ్యాపన వేగం కనుగొనుటకు ఒక ప్రయోగాన్ని వివరించండి.
జవాబు:
లక్ష్యం : రెండు వాయువుల వ్యాపన వేగం పరిశీలించుట.

కావలసిన పదార్థాలు :
గుర్తించబడిన స్కేలు గల గాజు గొట్టం, అమ్మోనియం ద్రావణం(NH3), హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCl), దూది, రెండు రబ్బరు బిరడాలు, టాంగ్స్.
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 7

విధానం :

  1. 1 మీటరు పొడవైన, గుర్తించబడిన స్కేలు గల సన్నని గాజు గొట్టం తీసుకోండి.
  2. రెండు దూది ఉండలు తీసుకొని టాంగ్స్ సహాయంతో ఒకదానిని అమ్మోనియం ద్రావణంలో, రెండవ దానిని హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ముంచండి.
  3. వాటిని గాజు గొట్టం రెండు చివర్లలో ఉంచి బిరడాలతో రెండు చివరలను మూయండి. ఇప్పుడు గొట్టాన్ని పరిశీలించండి.
  4. హైడ్రోక్లోరిక్ ఆమ్లం హైడ్రోజన్ క్లోరైడ్ వాయువును, అమ్మోనియా ద్రావణం అమ్మోనియా వాయువును వెలువరిస్తాయి.
  5. రెండు వాయువులు పరస్పరం చర్య జరుపుకొని అమ్మోనియం క్లోరైడ్ అనే తెల్లని పదార్థాన్ని ఏర్పరుస్తాయి.
  6. గొట్టం రెండు చివరల నుండి, తెల్లని అవక్షేపం ఎంత దూరంలో ఉందో కొలవండి.
  7. అమ్మోనియా ద్రావణం ఉన్న చివరి నుండి ఎక్కువ దూరంలో అవక్షేపం ఏర్పడినది.
  8. ఈ ప్రయోగం ద్వారా అమ్మోనియా వాయువు ఎక్కువ వేగంతోనూ, హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు తక్కువ వేగంతోనూ వ్యాపనం చెందాయని తెలుస్తుంది.

కృత్యం – 7 పదార్థంలో ఉండే కణాలు ఎంత చిన్నవి?

ప్రశ్న 8.
పదార్థంలోని కణాలు ఎంతో చిన్నవని ఒక ప్రయోగం ద్వారా చూపుము.
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 8
జవాబు:

  1. ఒక బీకరులో నీరు తీసుకొని, దానిపై నీటి మట్టాన్ని గుర్తించండి.
  2. దానికి 1 లేదా 2 పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలను కలపండి.
  3. నీరు, ఊదారంగులోకి మారడాన్ని గమనిస్తాము.
  4. ఇప్పుడు ఆ ద్రావణాన్ని సుమారు 10 మి.లీ. తీసుకొని, వేరొక బీకరులోని 90 మి.లీ. నీటికి కలపండి.
  5. ఇప్పుడు నీటి యొక్క ఊదారంగు ఇంతకు మునుపు కంటే కొంచెం తక్కువగా ఉండడాన్ని గమనిస్తాము.
  6. మరల దీని నుండి 10 మి.లీ. ద్రావణాన్ని తీసుకొని మరొక బీకరులోని 90 మి.లీ. నీటికి కలపండి.
  7. ఈ ప్రక్రియను 4, 5 సార్లు చేసి ద్రావణం యొక్క రంగులోని మార్పును గమనించండి.
  8. చివరి బీకరులోని నీరు కూడా కొంచెం ఊదారంగు కలిగి ఉండుటను గమనిస్తాము.
  9. ఈ కృత్యం ద్వారా ఘన, ద్రవ పదార్థాలు అతి సూక్ష్మ కణాలను కలిగి ఉంటాయని తెలుస్తుంది.

కృత్యం – 10 పదార్థ స్థితి మార్పుపై ఉష్ణోగ్రత ప్రభావం :

ప్రశ్న 9.
ఒక పదార్థం యొక్క స్థితిలో జరుగు మార్పుపై ఉష్ణోగ్రత ప్రభావంను తెల్పు కృత్యంను వ్రాయుము.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 9

  1. పటంలో చూపిన విధముగా ఒక బీకరులో సుమారు 100 గ్రా||ల మంచు ముక్కలను తీసుకొనుము.
  2. ప్రయోగశాలలో ఉపయోగించు థర్మామీటరును తీసుకొనుము.
  3. దాని బల్బ్ ను మంచు ముక్కలకు తాకు విధముగా అమర్చుము. ఉష్ణోగ్రతను గుర్తించుము.
  4. బీకరును నెమ్మదిగా సారాయి) దీపంతో వేడి చేయుము.
  5. గాజు కడ్డీతో మంచు ముక్కలను కలుపుతూ ప్రతి 30 సెకన్లకు ఉష్ణోగ్రతలో వచ్చు’ మార్పులను పరిశీలించుము.
  6. పదార్థం ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారుటకు ఉష్ణోగ్రతలో పెరుగుదల కారణమైనది.
  7. ఒక గాజు కడ్డీని బీకరులో ఉంచి వేడి చేయుము.
  8. నీరు క్రమముగా మరగడం ప్రారంభమై కొంత సమయం తర్వాత బాష్పంగా మారును.
  9. ఇక్కడ పదార్థం ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుటకు ఉష్ణోగ్రతలో పెరుగుదల కారణమైనది.
  10. దీనిని బట్టి పదార్థ స్థితిలో మార్పునకు ఉష్ణోగ్రత ప్రభావం కారణమని అవగాహన చేసుకొనవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

కృత్యం – 11

ప్రశ్న 10.
బాష్పీభవనంపై పదార్థ ఉపరితల వైశాల్యం, గాలి వేగం, ఆర్థతల ప్రభావం :
ఎ) బాష్పీభవనంపై ఉపరితల వైశాల్యం యొక్క ప్రభావమును వివరింపుము.
జవాబు:
ఉపరితల వైశాల్యం పెరిగినపుడు ఇగిరే వేగం పెరుగుతుంది.

వివరణ :

  1. ఇగిరే ప్రక్రియలో, ద్రవ ఉపరితల కణాలు బాష్పంగా మారతాయి.
  2. ఉపరితల వైశాల్యం పెరగడం వల్ల ఉపరితలంలోని ఎక్కువ కణాలు బాష్పంగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది.
  3. అందువల్ల ఇగిరే వేగం పెరుగుతుంది.
    ఉదా : పింగాణి పాత్రలోని నీరు, పరీక్షనాళికలోని నీటి కన్నా వేగంగా ఇగురుతుంది.

బి) బాష్పీభవనంపై ఆర్థత యొక్క ప్రభావాన్ని వివరింపుము.
జవాబు:
గాలిలో ఆర్ధత అధికంగా ఉంటే ఇగిరే వేగం తగ్గుతుంది.

వివరణ :

  1. గాలిలో గల తేమ శాతాన్ని ఆర్ధత అంటారు.
  2. మన పరిసరాలలో ఉన్న గాలి ఒక నిర్దిష్ట పరిమాణం వరకు మాత్రమే నీటి బాష్పంను నిలిపి ఉంచగలుగుతుంది.
  3. గాలిలో నీటి బాష్పం అధికంగా ఉంటే ఇగిరే వేగం తగ్గుతుంది.
    ఉదా : సాధారణ రోజు కన్నా వర్షమున్న రోజున బట్టలు నెమ్మదిగా ఆరతాయి.

సి) బాష్పీభవనంపై గాలి వేగం యొక్క ప్రభావాన్ని వివరింపుము.
జవాబు:
గాలి వేగం పెరిగినపుడు ఇగిరే వేగం పెరుగుతుంది.

వివరణ :

  1. గాలి వేగంగా వీయడం వల్ల అందులోని నీటి బాష్పం గాలితో పాటు దూరంగా వెళుతుంది.
  2. తద్వారా పరిసరాలలోని గాలిలో నీటి బాష్పం కూడా తగ్గుతుంది.
  3. ఇది ఇగిరే వేగాన్ని పెంచుతుంది.
    ఉదా : గాలి బలంగా వీచే రోజున కాని, ఫ్యాను కింద కాని బట్టలు సాధారణంగా కన్నా త్వరగా ఆరతాయి.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

SCERT AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 2nd Lesson Questions and Answers ఘర్షణ

8th Class Physical Science 2nd Lesson ఘర్షణ Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
“ఘర్షణ మానవాళికి మిత్రుడు మరియు విరోధి” ఈ వాక్యాన్ని నీవు సమర్థిస్తావా? ఉదాహరణలతో వివరింపుము. (AS1)
జవాబు:
“ఘర్షణ మానవాళికి మిత్రుడు మరియు విరోధి” ఈ వాక్యాన్ని నేను సమర్థిస్తాను.

ఘర్షణ మానవాళికి మిత్రుడు అనుటకు ఉదాహరణలు :

  1. ఘర్షణ వలన మనం నడవగలుగుతున్నాము మరియు పరుగెత్తగలుగుతున్నాము.
  2.  వాహనాలను నడుపగలుగుతున్నాము.
  3. వడ్రంగి చెక్క తలాలను నునుపు చేయగలుగుతున్నాడు.
  4. కాగితంపై పెన్నుతో మరియు బ్లాక్ బోర్డ్ పై చాక్ పీతో వ్రాయగలుగుతున్నాము.
  5. గోడకు మరియు చెక్కలకు మేకులను దించగలుగుతున్నాము.
  6. భవనాలను నిర్మించగలుగుతున్నాము.
  7. వస్తువులను పట్టుకోగలుగుతున్నాము.
  8. వివిధ ఆటలు ఆడగలుగుతున్నాము.
  9. బరువులను ఎత్తగలుగుతున్నాము.
  10. మట్టిని తవ్వగలుగుతున్నాము.

ఘర్షణ మానవాళికి విరోధి అనుటకు ఉదాహరణలు :

  1. ఘర్షణ వల్ల యంత్రభాగాలలో పగుళ్లు వస్తాయి.
  2. యంత్రభాగాలు అరిగిపోతాయి.
  3. యంత్రభాగాలు వేడెక్కి పాడవుతాయి.
  4. ఘర్షణ వలన శక్తి నష్టం జరుగుతుంది.
  5. వాహనాల వడి తగ్గుతుంది.
  6. యంత్రాల సామర్థ్యం తగ్గుతుంది.

ప్రశ్న 2.
ఆటగాళ్లు వేసుకొనే బూట్లకు అడుగు భాగంలో చిన్న, చిన్న బొడిపెలు ఎందుకుంటాయి? (AS1)
(లేదా)
అడుగున గాడులు ఉన్న బూట్లను క్రీడాకారులు ధరిస్తారు ఎందుకు?
జవాబు:
ఆటగాళ్లు వేసుకొనే బూట్లకు అడుగుభాగంలో చిన్న చిన్న బొడిపెలు ఉంటాయి. ఎందుకంటే

  1. బూట్ల అడుగుభాగాన గల చిన్న, చిన్న బొడిపెలు ఘర్షణను పెంచుతాయి.
  2. బొడిపెలు నేలను గట్టిగా పట్టి ఉంచి, సురక్షితంగా నడవడానికి, పరుగెత్తడానికి ఉపయోగపడతాయి.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

ప్రశ్న 3.
సబ్బు నీళ్లు పడిన పాలరాతి బండలపై (మార్బుల్) నడవటం సులభమా? కష్టమా? ఎందుకు? (AS1)
జవాబు:
సబ్బు నీళ్ళు పడిన పాలరాతి బండలపై నడవటం కష్టము. ఎందుకంటే

  1. సబ్బు నీళ్ళు పాలరాతి బండలపై ఘర్షణను తగ్గిస్తాయి. ఈ
  2. కాబట్టి సబ్బు నీళ్ళు పడిన పాలరాతి బండలపై నడచినపుడు జారిపడిపోతారు.

ప్రశ్న 4.
ఘర్షణ తగ్గించడానికి నీవిచ్చే సూచనలు ఏమిటి? (AS1)
జవాబు:

  1. స్పర్శలో ఉండే వస్తువు తలాలు నునుపుగా ఉండాలి.
  2. వస్తువులకు చక్రాలను ఉపయోగించాలి.
    ఉదా : సూట్ కేసులు, బ్యాగులు.
  3. యంత్ర భాగాల మధ్య ఘర్షణను తగ్గించడానికి కందెనలను వాడాలి.
  4. యంత్రాలలో భ్రమణంలో గల ఇనుప రాడ్ల మధ్య బాల్ బేరింగ్లను ఉపయోగించాలి.
  5. ప్రవాహి ఘర్షణను తగ్గించడానికి వాహనాలను తగిన ఆకృతిలో నిర్మించాలి.

ప్రశ్న 5.
స్థైతిక ఘర్షణ వస్తువుల మధ్య ఉండాలంటే కావలసిన షరతులు ఏమిటి? (AS1)
జవాబు:

  1. తలాలు గరుకుగా ఉండాలి.
  2. వస్తువు భారాలు (బరువు) ఎక్కువగా ఉండాలి.
  3. వస్తువుపై అభిలంబ బలం ఎక్కువగా ఉండాలి.
  4. వస్తువు ఉండే తలం క్షితిజ సమాంతరంగా ఉండాలి.
  5. వస్తువులు ఉండే తలాలు పొడిగా (తడి లేకుండా) ఉండాలి.

ప్రశ్న 6.
స్థైతిక ఘర్షణ మనకు సహాయపడే సందర్భాలకు కొన్ని ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:

  1. మనం కూర్చోవడానికి, పడుకోవడానికి మరియు నిలబడడానికి ఉపయోగపడుతుంది.
  2. భవన నిర్మాణంలో ఉపయోగపడుతుంది.
  3. టేబుల్ పై వివిధ వస్తువులను ఉంచడానికి ఉపయోగపడుతుంది.
    ఉదా : టి.వి., కంప్యూటర్.
  4. అల్మరాలో వస్తువులను ఉంచడానికి ఉపయోగపడుతుంది.
  5. లైబ్రరీలో రాక్స్ నందు పుస్తకాలను ఉంచుటకు ఉపయోగపడుతుంది.
  6. షాపులలో రాక్స్ నందు వివిధ రకాల వస్తువులను ఉంచడానికి ఉపయోగపడుతుంది.
  7. వాహనాలను నిలిపి ఉంచడానికి ఉపయోగపడుతున్నది.
  8. టేబుళ్ళను, కుర్చీలను, సోఫాలను మరియు ఇతర సామగ్రిని నేలపై ఉంచుటకు ఉపయోగపడుతుంది.
  9. నిశ్చలస్థితిలో ఉండే ప్రతి వస్తువూ సైతిక ఘర్షణను ఉపయోగించుకుంటుంది.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

ప్రశ్న 7.
జారుడు ఘర్షణ ఉండే సందర్భాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:

  1. కేరమ్ బోర్డుపై పౌడరు చల్లి ఆట ఆడుతున్నప్పుడు, కేరమ్ కాయిన్ సులభంగా కదులుట.
  2. తలుపు యొక్క మడత బందులు కదులుట.
  3. టేబుల్ యొక్క సొరుగులు కదులుట.
  4. పిండి మిల్లులో లేదా వడ్ల మిల్లులో ధాన్యం జారుట.
  5. పార్కులలో జారుడు బల్లపై పిల్లలు జారుట.
  6. బాల్ పాయింట్ పెన్నుతో కాగితంపై వ్రాయుట.
  7. సైకిల్ పెడల్ తొక్కినపుడు చక్రాలు వేగంగా తిరుగుట.
  8. బురదగా ఉన్న నేలపై నడుచుచున్నపుడు జారుట.
  9. అరటిపండు తొక్కపై కాలు వేసినపుడు జారుట.
  10. సబ్బు నీళ్ళు పడిన మార్బుల్ గచ్చు జారుట.

ప్రశ్న 8.
ఘర్షణ బలాన్ని ఎలా కొలుస్తారు? వివరించండి. (AS1)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 1

  1. ఒక సన్నని తాడుకు చెక్క దిమ్మెను కట్టి గచ్చు నేలపై ప్రక్క పటంలో చూపిన విధంగా స్ప్రింగ్ త్రాసుతో లాగండి.
  2. ఇక్కడ స్ప్రింగ్ త్రాసు చెక్క దిమ్మెపై ప్రయోగించిన బలాన్ని కొలుచుటకు ఉపయోగపడుతుంది.
  3. స్ప్రింగ్ త్రాసును బలంగా లాగినపుడు దానిలోని స్ప్రింగు సాగుతుంది. స్ప్రింగు త్రాసుపై అధిక బలాన్ని ప్రయోగించిన స్ప్రింగులో ఎక్కువ సాగుదలను గమనించవచ్చు. అనగా స్ప్రింగులో సాగుదల దానిపై ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
  4. స్ప్రింగ్ త్రాసును లాగి చెక్క దిమ్మెను కదిలించడానికి ఆ ప్రయత్నించండి.
  5. చెక్క దిమ్మె కదలటానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్పింగ్ త్రాసు రీడింగ్ ను నమోదు చేయండి.
  6. ఈ స్థితిలో చెక్క దిమ్మెపై క్షితిజ సమాంతర దిశలో రెండు బలాలు పనిచేస్తాయి.
    AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 2
  7. ఒకటి ఘర్షణ బలం (f), రెండవది ప్రయోగించిన బలం (F).
  8. ఈ రెండు బలాలు చెక్క దిమ్మె కదులుటకు సిద్ధంగా ఉన్నపుడు సమాన పరిమాణంలో ఉంటూ వ్యతిరేక దిశలో ఉంటాయి.
  9. కాబట్టి నమోదు చేసిన స్ప్రింగ్ త్రాసు రీడింగ్ ఘర్షణ బలానికి సమానం అవుతుంది.
  10. ఈ విధంగా స్ప్రింగ్ త్రాసు రీడింగ్ తో ఘర్షణ బలంను తెలుసుకొనవచ్చును.
  11. ఘర్షణ బలాన్ని “ట్రైబో మీటరు” (Tribometer) అను పరికరం ద్వారా కూడా తెలుసుకోవచ్చును.

ప్రశ్న 9.
కందెనలు ఏ విధంగా ఘర్షణను తగ్గిస్తాయి? వివరించండి. (AS1)
జవాబు:

  1. స్పర్శలో ఉండే కదిలే భాగాల మధ్య కందెనలను పూస్తారు.
  2. రెండు తలాల మధ్య కందెనలు పలుచని పొరలాగా మారి భాగాల మధ్య రాపిడిని తగ్గిస్తాయి.
  3. కందెనలు స్పర్శలో ఉన్న భాగాల మధ్య చేరి వాటి చిన్న చిన్న ఎత్తుపల్లాల మధ్య బంధాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి.
  4. కావున వాటి కదలిక సులభమై ఘర్షణ తగ్గుతుంది.

ప్రశ్న 10.
ఘర్షణ బలాలు ఎన్ని రకాలో తెల్పండి. (AS1)
జవాబు:
ఘర్షణ బలాలు 3 రకాలు. అవి :

  1. సైతిక ఘర్షణ బలం
  2. జారుడు ఘర్షణ బలం
  3. దొర్లుడు ఘర్షణ బలం

ప్రశ్న 11.
జారుడు ఘర్షణ, సైతిక ఘర్షణ కంటే ఎందుకు తక్కువ ఉంటుందో వివరించండి. (AS1)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 3

  1. చెక్క దిమ్మె యొక్క కొక్కానికి ప్రక్క పటంలో చూపిన విధంగా స్ప్రింగ్ త్రాసు కొక్కాన్ని తగిలించి టేబులుపై అమర్చండి.
  2. స్ప్రింగ్ త్రాసును బలంగా లాగినపుడు అది, దానిపై ప్రయోగించిన బలాన్ని న్యూటన్లలో తెలుపుతుంది.
  3. స్ప్రింగ్ త్రాసుపై బలాన్ని ఉపయోగించడం ద్వారా నిశ్చల స్థితిలో గల చెక్క దిమ్మెను కదల్చడానికి ప్రయత్నించండి.
  4. చెక్క దిమ్మె కదలడానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసులోని రీడింగ్ ను నమోదుచేయండి.
  5. ఈ రీడింగ్ చెక్క దిమ్మె యొక్క సైతిక ఘర్షణ బలాన్ని తెలియజేస్తుంది.
  6. ఈసారి స్ప్రింగ్ త్రాసుపై బలాన్ని ఉపయోగిస్తూ చెక్క దిమ్మెను సమవడితో కదిలేటట్లు చేయాలి.
  7. చెక్క దిమ్మె సమవడిలో ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసు రీడింగ్ ను నమోదు చేయాలి.
  8. ఇపుడు రీడింగ్ చెక్క దిమ్మె యొక్క జారుడు ఘర్షణ బలాన్ని తెలియజేస్తుంది.
  9. పైన వచ్చిన సైతిక ఘర్షణ బలం, “జారుడు ఘర్షణ బలాల విలువలను పరిశీలించిన జారుడు ఘర్షణ బలం తక్కువగా ఉన్నదని తెలుస్తుంది.
  10. పై ప్రయోగం ద్వారా జారుడు ఘర్షణ, స్టైతిక ఘర్షణ కంటే తక్కువగా ఉంటుంది అని నిరూపించబడినది.

ప్రశ్న 12.
శక్తి నష్టానికి ఘర్షణ ఎలా కారణమో ఉదాహరణలతో వివరించండి. ఘర్షణ ద్వారా జరిగే శక్తి నష్టాలను తగ్గించడానికి మీరు ఇచ్చే సలహాలు ఏమిటి? (AS1)
జవాబు:
1) శక్తి నష్టానికి ఘర్షణ కారణం :
స్పర్శలో ఉన్న రెండు వస్తువుల యొక్క తలాల మధ్య ఉండే ఘర్షణను అధిగమించడానికి ఎక్కువ శక్తి ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి శక్తి నష్టానికి ఘర్షణ కారణం.

2) ఉదాహరణలు :

  1. యంత్రాలలో భ్రమణంలో ఉండే స్పర్శ చక్రాల మధ్య ఘర్షణ వల్ల అవి వేడెక్కడం, అరిగిపోవడం మరియు పగిలిపోవడం వంటివి జరుగుతాయి.
  2. వాహన ఇంజన్లో స్పర్శలో ఉండే చక్రాల మధ్య ఘర్షణ వల్ల ఇంజన్ వేడెక్కడం, ఇంజన్లోని భాగాలు అరిగిపోవడం జరుగుతుంది.
  3. సైకిల్ చక్రాలు, గొలుసులకు కందెనలు పూయనట్లయితే ఎంత తొక్కినా ఘర్షణ బలం వల్ల సైకిల్ నెమ్మదిగానే కదులుతుంది.

3) ఘర్షణ ద్వారా జరిగే శక్తి నష్టాలను తగ్గించడం :

  1. స్పర్శలో ఉండే వస్తువుల తలాలు నునుపుగా ఉండాలి.
  2. స్పర్శలో ఉండే వస్తువుల తలాలకు కందెనలను పూయాలి.
  3. యంత్రాలలో ఘర్షణను తగ్గించుటకు బాల్ బేరింగ్ ను ఉపయోగించాలి.
  4. ప్రవాహి ఘర్షణను తగ్గించుటకు ప్రత్యేక ఆకృతిలో వాహనాల ఆకారాన్ని తయారుచేయవలెను.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

ప్రశ్న 13.
కదులుతున్న బస్సు పైభాగంలో గల సామాన్లను సీత గమనించింది. బస్సు మెల్లగా కదిలేటప్పుడు దానిపై సామాన్ల స్థితిలో కొద్దిగా మార్పు గమనించింది. కానీ బస్సు వడి పెరిగి వేగంగా కదలటం ప్రారంభించగానే బస్సుపై ఉన్న సామాన్లు వెనుకకు పడడం సీత గమనించింది. ఈ సంఘటన వల్ల ఆమె మదిలో బస్సుపై గల సామాన్లపై మరియు బస్సు టైర్లపై పనిచేసే ఘర్షణకు సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. వాటిని మీరు చెప్పగలరా? ఆ ప్రశ్నలను వ్రాయండి. (AS2)
జవాబు:

  1. బస్సు పైభాగంలో గల సామాన్లు వెనుకకు పడడంలో ఏ బలం పనిచేసింది?
  2. బస్సు ఉపరితలం ప్రయోగించే ఘర్షణ బలం ఏ దిశలో ఉంటుంది?
  3. బస్సు ఉపరితలం ప్రయోగించే ఘర్షణ బలం బస్సు ప్రయాణించే దిశలో ఎందుకు ఉంటుంది?
  4. బస్సుపై సామాన్లు వెనుకకు జరుగుటకు పనిచేసే బలం ఎక్కడి నుండి ఏర్పడినది?
  5. బస్సు టైర్లపై ఘర్షణ బలం ఏ దిశలో పనిచేస్తుంది?
  6. బస్సు టైర్లపై కలిగే ఘర్షణ బలం, బస్సుపై గల సామాన్లకు బస్సు ఉపరితలం కలిగించే ఘర్షణ బలం ఎందుకు వ్యతిరేక దిశలో ఉన్నాయి?

ప్రశ్న 14.
ఘర్షణ వల్ల కలిగే శక్తి నష్టాలను అధిగమించడానికి వాడే నూతన పద్ధతులను గురించి సమాచారాన్ని వివిధ పుస్తకాలు మరియు ఇంటర్నెట్ నుండి సేకరించండి. ఆ సమాచారాన్ని మీ మాటల్లో రాయండి. (AS4)
జవాబు:
ఘర్షణ వల్ల కలిగే శక్తి నష్టాలను అధిగమించడానికి, ఘర్షణను తగ్గించడానికి వాడే వివిధ పద్ధతులు :

1) కందెనలు (లూబ్రికెంట్స్) ఉపయోగించుట :

  1. యంత్రభాగాల మధ్య ఘర్షణను తగ్గించే పదార్థాలను కందెనలు (లూబ్రికెంట్స్) అంటారు.
  2. నూనెలను, గ్రీజులను కందెనలుగా ఉపయోగిస్తారు.
  3. సాధారణంగా యంత్రభాగాలలో ఘర్షణను తగ్గించుటకు మరియు శక్తి నష్టాలను అధిగమించడానికి కందెనలను ఉపయోగిస్తారు.
  4. స్పర్శలో ఉండే కదిలే యంత్రభాగాల మధ్య కందెనలు పూయడం వల్ల ఆ రెండు తలాల మధ్య పలుచని పొరగా మారి యంత్రభాగాల మధ్య రాపిడిని తగ్గిస్తాయి.
  5. కందెనలు స్పర్శలో ఉన్న భాగాల మధ్య చేరి వాటిలో గల చిన్న చిన్న ఎత్తుపల్లాల (గరుకుతలాల) మధ్య బంధాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి. కాబట్టి ఘర్షణ తగ్గి, శక్తి నష్టాలను అధిగమించవచ్చును.

2) తలాలను నునుపుగా (పాలిషింగ్) చేయుట :

  1. స్పర్శలో ఉండే యంత్రభాగాల తలాలపై గరుకుతనం తొలగిచడం వల్ల ఘర్షణకు తగ్గించి, శక్తి నష్టాలను అధిగమించవచ్చును
  2. కాబట్టి స్పర్శలో ఉండే యంత్రభాగాలను నునుపుగా (పాలిషింగ్) చేయడం వలన శక్తి నష్టాలను అధిగమించవచ్చును.

3) బాల్ బేరింగ్లు ఉపయోగించడం :

  1. బాల్ బేరింగ్లను ఉపయోగించడం వలన చాలా ఎక్కువగా శక్తి నష్టాలను తొలగించవచ్చును.
  2. యంత్రాలలో భ్రమణంలో గల ఇరుసు, చక్రాల మధ్య బాల్ బేరింగ్లను ఉపయోగించి శక్తి నష్టాలను తగ్గిస్తారు.
  3. యంత్రాలలో మరియు వాహనాలలో శక్తి నష్టాలను తగ్గించుటకు బాల్ బేరింగ్ లను ఉపయోగిస్తారు.
  4. శక్తి నష్టాలను తగ్గించడంలో ఇది ఉత్తమమైన పద్ధతి.

4) ప్రత్యేక ఆకారం ద్వారా :
వాహనాలలో ప్రవాహుల ఘర్షణను తగ్గించుటకు, శక్తి నష్టాలను తగ్గించుటకు ప్రత్యేక ఆకారాలలో వాహనాలను తయారుచేస్తారు.

5) చక్రాల ద్వారా :
బరువైన, పెద్ద పెద్ద కంటైనర్లను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడానికి చక్రాలు కలిగిన ట్రాలీలను ఉపయోగిస్తారు. చక్రాలు ఉపయోగించడం వలన ఘర్షణను తగ్గించి, శక్తి నష్టాలను అధిగమించవచ్చును.

ప్రశ్న 15.
వాలుతలంపై జారుతున్న వస్తువుపై పనిచేసే బలాలను తెలిపే స్వేచ్ఛా వస్తుపటం గీయండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 4

ప్రశ్న 16.
“యంత్రాల్లో గల వివిధ భాగాల మధ్య ఘర్షణను సాధ్యమయినంత తగ్గించడం ద్వారా శక్తి నష్టమును తగ్గించవచ్చు మరియు జీవ వైవిధ్యాన్ని కాపాడవచ్చు”. దీనిని మీరెలా సమర్థిస్తారు? వివరించండి. (AS7)
జవాబు:

  1. యంత్రాల్లో గల వివిధ భాగాల మధ్య ఘర్షణ వల్ల శక్తి ఉష్ణశక్తి రూపంలో వృధా అయిపోతుంది.
  2. దీనివలన విద్యుచ్ఛక్తి, ఇంధనశక్తి వంటి శక్తి వనరుల లోపం ఏర్పడుతుంది.
  3. దీనిని అరికట్టాలంటే మనం యంత్రాల్లో గల వివిధ భాగాల మధ్య ఘర్షణను సాధ్యమయినంత వరకు తగ్గించాలి.
  4. శక్తి నిత్యత్వ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రకృతిలో శక్తి పరిమాణం స్థిరం, దానిని సృష్టించలేము మరియు నశింప చేయజాలము కనుక శక్తి వనరులను వీలైనంత తక్కువగా వినియోగించాలి.
  5. వృధా అయ్యే శక్తిని అదుపుచేయడం ఒక మార్గం. కనుక వీలైనంతవరకు యంత్రాల్లో గల వివిధ భాగాల మధ్య ఘర్షణను తగ్గించి తద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడగలం.

8th Class Physical Science 2nd Lesson ఘర్షణ Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 22

ప్రశ్న 1.
ఘర్షణ చలనాన్ని వ్యతిరేకిస్తుందా? తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుందా?
జవాబు:
ఘర్షణ తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుంది.

ప్రశ్న 2.
ఘర్షణ ఉందని చూపుటకు ఏ పరిశీలనలు మరియు ప్రయోగాలు తెలుపుతావు?
ప్రయోగము :
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 1
ఉద్దేశం :
వస్తువులు ఘర్షణను కలుగజేస్తాయి అని తెలుపుట.

పరికరాలు :
సన్నని తాడు, చెక్క దిమ్మె, స్ప్రింగ్ త్రాసు.

విధానం :

  1. ఒక సన్నని తాడుకు చెక్క దిమ్మెను కట్టి ప్రక్క పటంలో చూపిన విధంగా అమర్చండి.
  2. నిశ్చల స్థితిలోని చెక్క దిమ్మెపై స్ప్రింగ్ త్రాసుపై బలాన్ని ఉపయోగించి స్ప్రింగ్ త్రాసులో రీడింగ్ ను పరిశీలించండి.
  3. చెక్క దిమ్మె కదులుటకు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రయోగించిన బలం, ఘర్షణ బలానికి సమానంగా ఉంటుంది.
  4. చెక్క దిమ్మె కదులుటకు సిద్ధంగా ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసు రీడింగ్ ను గుర్తించాలి. ఈ రీడింగ్ ఘర్షణ బలానికి సమానం అగును.
  5. దీనిని బట్టి వస్తువులకు ఘర్షణ బలం ఉంటుందని తెలుస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

ప్రశ్న 3.
‘జారుడు ఘర్షణ’ గురించి ఏ పరిస్థితుల్లో మాట్లాడతాం?
జవాబు:
ప్రయోగించిన బలము, స్టెతిక ఘర్షణ కంటే ఎక్కువుగా నున్నపుడు వస్తువు చలించటం మొదలవుతుంది. ఆ పరిస్థితుల్లో జారుడు ఘర్షణ’ గురించి మాట్లాడతాం.

8th Class Physical Science Textbook Page No. 25

ప్రశ్న 4.
నేలపై నిలకడగా ఉన్న బల్లపై ఘర్షణ బలం పనిచేస్తుందా?
జవాబు:

  1. నేలపై నిలకడగా ఉన్న బల్లపై ఘర్షణ బలం పనిచేస్తుంది.
  2. నేలపై నిలకడగా ఉన్న బల్లపై సైతిక ఘర్షణ బలం పనిచేస్తుంది.

ప్రశ్న 5.
అభిలంబ బలాన్ని రెండింతలు చేస్తే, ఘర్షణ బలం ఏమవుతుంది? చర్చించండి.
జవాబు:
1) ఘర్షణ బలం, అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
∴ ఘర్షణ బలం (Ff) ∝ అభిలంబ బలం (Fn).
ఘర్షణ బలం (Ff) = µsఅభిలంబ బలం (fn)
µs ను అనుపాత స్థిరాంకం అంటారు. దీనినే ఘర్షణ గుణకం అని కూడా అంటారు.
∴ Ff = µs . Fn ఇక్కడ Ff = ఘర్షణ బలం ; Fn = అభిలంబ బలం

సందర్భం – 1 : అభిలంబ బలం Fn = x అయినప్పుడు ఘర్షణబలం (Ff1 ) = µs × x
∴ Ff1 = µs x
∴ µs x = Ff1 …….. (1)

సందర్భం – II : అభిలంబ బలం Fn = 2x అయినపుడు ఘర్షణ బలం (Ff2 ) = µs × 2x
Ff2 = 2µs × x
Ff2 = 2µs × x ……. (B)
సమీకరణం (B) లో µs x విలువలను ప్రతిక్షేపించగా
∴ Ff2 = 2Ff1
∴ అభిలంబ బలాన్ని రెట్టింపు చేసినపుడు ఘర్షణ బలం రెట్టింపు అగును.

ప్రశ్న 6.
“ఘర్షణ వస్తువుల స్పర్శా వైశాల్యంపై ఆధారపడుతుంది” అని స్నేహితుడు అన్నాడు. ఏ ప్రయోగంతో నీ స్నేహితుడిని నీవు సరిచేస్తావు?
జవాబు:
ప్రయోగము :
ఉద్దేశం : “ఘర్షణ వస్తువుల స్పర్శా వైశాల్యంపై ఆధారపడదు” అని నిరూపించుట.

పరికరాలు :
చెక్క దిమ్మె, సన్నని త్రాడు, స్ప్రింగ్ త్రాసు.
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 5
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 6

విధానం :

  1. ఒక సన్నని తాడును చెక్క దిమ్మెకు కట్టి దానిని స్ప్రింగ్ త్రాసు యొక్క కొక్కేనికి తగిలించి, గచ్చుపై పటంలో చూపిన విధంగా అమర్చండి.
  2. చెక్క దిమ్మె యొక్క స్పర్శా వైశాల్యం ఎక్కువగా ఉండునట్లు గచ్చుపై అమర్చి స్ప్రింగ్ త్రాసుపై బలాన్ని క్రమంగా ప్రయోగించాలి.
  3. స్ప్రింగ్ త్రాసుపై ప్రయోగించిన బలము న్యూటన్లలో స్ప్రింగ్ త్రాసు తెలియచేస్తుంది.
  4. స్ప్రింగ్ త్రాసుపై బలాన్ని ప్రయోగిస్తున్నపుడు చెక్క దిమ్మె కదులుటకు సిద్ధంగా ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసు రీడింగ్ ను నమోదు చేయండి.
  5. ఈ రీడింగ్ చెక్క దిమ్మె స్పర్శా వైశాల్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఘర్షణ బలాన్ని తెలియజేస్తుంది.
  6. పై ప్రయోగాన్ని ఈసారి చెక్క దిమ్మె స్పర్శా వైశాల్యం తక్కువగా (చెక్క దిమ్మె నిలువుగా) ఉండేటట్లు గచ్చుపై ఉంచి చేసి ఘర్షణ బలాన్ని నమోదుచేయండి.
  7. రెండవసారి కనుగొన్న ఘర్షణ బలం స్పర్శా వైశాల్యం తక్కువ ఉన్నప్పుడు ఘర్షణ బలం అవుతుంది.
  8. పై ప్రయోగాలలో వచ్చిన ఘర్షణ బలాల విలువలు సమానంగా ఉంటాయి. కాబట్టి ఘర్షణ బలం వస్తువు యొక్క స్పర్శా వైశాల్యంపై ఆధారపడదు అని తెలియుచున్నది.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

ప్రశ్న 7.
ఘర్షణ భారంపై ఆధారపడదు కాని ఇది అభిలంబ బలంపై ఆధారపడుతుంది. దీనిని నీవు అంగీకరిస్తావా? వివరించుము.
జవాబు:

  1. ఘర్షణ బలం, వస్తువు భారంపై మరియు అభిలంబ బలంపై ఆధారపడుతుంది అని నేను అంగీకరిస్తాను.
  2. ఘర్షణ బలం, అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఘర్పణ బలం, అభిలంబ బలంపై ఆధారపడును.
  3. వస్తువు భారంపై అభిలంబ బలం ఆధారపడి ఉంటుంది. కాబట్టి వస్తువు భారంపై ఘర్షణ బలం ఆధారపడి ఉంటుంది.

8th Class Physical Science Textbook Page No. 26

ప్రశ్న 8.
మానవుల మరియు జంతువుల జీవితాల్లో ఘర్షణ ఎలాంటి పాత్రను పోషిస్తుంది? వివరించండి.
జవాబు:

  1. మానవులు మరియు జంతువులు పరుగెత్తడానికి, నడవడానికి ఉపయోగపడుతుంది.
  2. మానవులు మరియు జంతువులు కూర్చోగలుగుతున్నాయి, పడుకోగలుగుతున్నాయి.
  3. నీటి జంతువులు నీటిలో ఈదగలుగుతున్నాయి.
  4. పక్షులు గాలిలో ఎగరగలుగుతున్నాయి.
  5. జీవులలో జీవక్రియలకు ఉపయోగపడుతున్నది.
    ఉదా : శ్వాసక్రియ.
  6. జీవులు ఆహారము నమలగలుగుతున్నాయి.
  7. జీవులు పనులు చేయగలుగుతున్నాయి.
    ఉదా : పక్షులు గూళ్ళు కట్టుకోవడం.

ప్రశ్న 9.
రవాణాలో ఘర్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది?
జవాబు:

  1. రవాణాకు ఉపయోగపడే వాహనాలను నడపడానికి, ఆపడానికి ఉపయోగపడుతుంది.
  2. వస్తువులు రవాణా చేయుటకు, వాహనాలలో వస్తువులను ఉంచడానికి ఉపయోగపడుతుంది.
  3. నీటిలో వాహనాలు ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది.
    ఉదా : ఓడలు, పడవలు.
  4. గాలిలో ప్రయాణించే వాహనాలకు ఉపయోగపడుతుంది.
    ఉదా : విమానాలు, హెలికాప్టర్లు, రాకెట్లు.
  5. బరువైన పెద్ద పెద్ద వస్తువులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేయుటకు ట్రాలీలు ఉపయోగపడుతున్నాయి.

8th Class Physical Science Textbook Page No. 28

ప్రశ్న 10.
తలాల మధ్య ఘర్షణను పూర్తిగా తొలగించగలమా? వివరించండి.
జవాబు:

  1. తలాల మధ్య ఘర్షణను పూర్తిగా తొలగించలేము.
  2. తలాలు నునుపుగా ఉంచడం వలన ఘర్షణను కొంతమేరకు తగ్గించవచ్చును.
  3. కందెనలు, బాల్ – బేరింగ్లు ఉపయోగించడం వలన చాలామేరకు ఘర్షణను తగ్గించవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

ప్రశ్న 11.
యంత్రభాగాల్లో బాల్ – బేరింగ్ ను ఏ ఉద్దేశంతో వాడుతారు? నిజ జీవిత పరిస్థితులకు అన్వయించి వివరించండి.
జవాబు:
యంత్రభాగాల్లో బాల్ – బేరింగ్లను ఘర్షణను తగ్గించడానికి మరియు యంత్ర సామర్థ్యాన్ని పెంచుటకు ఉపయోగిస్తారు.

నిజ జీవిత పరిస్థితుల్లో బాల్ – బేరింగ్ల ఉపయోగం :

  1. వాహనాలలో బాల్ – బేరింగ్లను ఉపయోగిస్తారు. ఉదా : సైకిల్, మోటారు వాహనాలు.
  2. ఫ్యాన్లలో బాల్ – బేరింగ్లను ఉపయోగిస్తారు.
  3. మోటర్లలో బాల్ – బేరింగ్ లను ఉపయోగిస్తారు.
  4. డైనమోలలో బాల్ – బేరింగ్ య్ ను ఉపయోగిస్తారు.
  5. పిండిమిల్లులలో మరియు క్రైండర్లలో బాల్ – బేరింగ్ లను ఉపయోగిస్తారు.
  6. పరిశ్రమలలో, యంత్రాలలో బాల్ – బేరింగ్లను ఉపయోగిస్తారు.
  7. కుట్టుమిషన్లలో బాల్ – బేరింగ్ లను ఉపయోగిస్తారు.

పరికరాల జాబితా

పుస్తకము, పురిలేని దారము, గుడ్డ, కార్పెట్, అగ్గిపెట్టె, అంతరిక్ష నౌకలకు అమర్చే హీట్ షీల్డ్ చిత్రాలు, స్పూను, గ్రీజు, కొబ్బరి నూనె, షూ, టైరు, క్యారమ్ బోర్డు నమూనాలు, చక్రాలు గల సూట్ కేసు నమూనా, బాల్ బేరింగ్లు, గాజు గ్లాసు, పక్షి నమూనా, విమానం నమూనా, కారు నమూనా, ట్రాలీ, చెక్క దిమ్మ, బరువులు, బరువులు వేలాడదీసే కొక్కెం, కప్పీ, పొడవైన బల్ల, బరువైన పెట్టి, వాలుతలము, స్ప్రింగ్ త్రాసు, ఇటుక.

8th Class Physical Science 2nd Lesson ఘర్షణ Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

1. ఒక వస్తువుపై పనిచేసే వివిధ బలాలు మరియు ఘర్షణబల ప్రభావాన్ని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 7AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 8

  1. ఒక పుస్తకాన్ని క్షితిజసమాంతర తలం గచ్చుపై ఉంచి ప్రక్క పటంలో చూపిన విధంగా నెట్టండి.
  2. పుస్తకం దానిని నెట్టిన దిశలో వడి పొంది, ఆ వడి క్రమంగా తగ్గుతూ చివరకు నిశ్చలస్థితిలోకి వస్తుంది.
  3. క్షితిజ సమాంతర దిశలో పుస్తకం వడి తగ్గుతూ ఉంటుంది. అంటే చలన దిశకు వ్యతిరేక దిశలో గచ్చు, పుస్తకం పై బలాన్ని ప్రయోగిస్తుంది అని తెలుస్తున్నది.
  4. గచ్చు; పుస్తకంపై ప్రయోగించే ఈ క్షితిజ సమాంతర బలాన్నే ఘర్షణ బలం అంటారు.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 9
పుస్తకంపై పనిచేసే బలాలు :

  1. పుస్తకంపై కిందకు పనిచేసే భూమ్యాకర్షణ బలం (గురుత్వబలం)
    Fg = W (పుస్తకభారం)
  2. గచ్చుచేత పుస్తకంపై ప్రయోగింపబడే అభిలంబ బలం (in = N)
  3. క్షితిజ లంబదిశలో పుస్తకం చలనంలో ఎటువంటి మార్పు లేదు కనుక ఈ దిశలో ఫలిత బలం శూన్యం
    (Fnet = 0) అనగా Fg = Fn ; W = N = 10
  4. పుస్తకంపై ప్రయోగించిన బలం (F) క్షితిజ సమాంతరంగా బలం ప్రయోగించిన దిశలో ఉంటుంది.
  5. గచ్చు పుస్తకంపై ప్రయోగించిన ఘర్షణ బలం (F) క్షితిజ సమాంతరంగా పుస్తకం కదిలే దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది.

ప్రయోగశాల కృత్యం

2. ఘర్షణ స్వభావాన్ని మరియు సైతిక ఘర్షణ భావనను ఒక కృత్యం ద్వారా వివరించండి.
ఉద్దేశ్యం :
ఘర్షణ స్వభావాన్ని మరియు సైతిక ఘర్షణ (static friction) భావనను అర్థం చేసుకోవటం.

కావలసిన పరికరాలు :
ట్రాలీ (Trolley), చెక్కదిమ్మ, పురిలేని సాగని తీగ, బరువులు, కప్పి (pulley), బరువు వ్రేలాడదీసే కొక్కెం (Weight hanger) మరియు పొడవైన బల్ల.
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 10

నిర్వహణ విధానం :
పటంలో చూపిన విధంగా ట్రాలీపై ఒక చెక్కదిమ్మను అమర్చండి.

ట్రాలీకి ఒక దారాన్ని కట్టి దానిని కప్పి ద్వారా పంపండి. దారం రెండవ చివర బరువు వ్రేలాడదీసే కొక్కెం (weight hanger) వ్రేలాడదీయండి.

అతిచిన్న బరువును వెయిట్ హేంగర్ పై ఉంచి, ట్రాలీ మరియు చెక్కదిమ్మ చలనాలలో మార్పులను గమనించండి.

a) ట్రాలీపై ఉంచిన చెక్కదిమ్మ స్థితిలో ఏం మార్పు గమనించారు?
జవాబు:
ట్రాలీపై ఉంచిన చెక్కదిమ్మ స్థితిలో ఏ మార్పు లేదు.

b) చెక్కదిమ్మ పడిపోతుందా లేదా ట్రాలీతోపాటు కదులుతుందా?
జవాబు:
చెక్కదిమ్మ ట్రాలీతోపాటు కదులుతుంది.

c) ట్రాలీ మరియు చెక్కదిమ్మ చలనాల్లో వచ్చే మార్పులేమిటి?
జవాబు:
ట్రాలీ మరియు చెక్కదిమ్మ రెండూ కలిసి ఎడమవైపుకు కదులుతున్నాయి.

d) ఇప్పుడు హేంగర్ పై కొద్ది కొద్దిగా బరువులను పెంచుతూ, ట్రాలీ మరియు చెక్కదిమ్మ చలనాలను పరిశీలించండి.
జవాబు:
ఈ విధంగా హేంగర్ పై బరువులను క్రమంగా పెంచుతుంటే ఒక నిర్దిష్ట బరువు వద్ద లేక నిర్దిష్ట త్వరణం వద్ద చెక్కదిమ్మ ట్రాలీ ఉపరితలం పరంగా వెనుకకు చలిస్తుంది.

e) చెక్కదిమ్మకు బదులు అంతే ద్రవ్యరాశి గల రాయి, ఇనుపదిమ్మలతోనూ, వేర్వేరు ద్రవ్యరాశులు గల రాయి, ఇనుప దిమ్మలతోనూ ప్రయోగం చేస్తే ఏం జరుగుతుంది?
జవాబు:

  1. చెక్కదిమ్మతో సమాన ద్రవ్యరాశి గల రాయి, ఇనుప దిమ్మలతో ఈ ప్రయోగాన్ని చేస్తే ఫలితంలో ఎటువంటి మార్పు ఉండదు.
    కాని వేర్వేరు ద్రవ్యరాశులు గల రాయి, ఇనుప దిమ్మలతో ఈ ప్రయోగం చేస్తే, ఫలితంలో మార్పు కలుగుతుంది. కారణం ద్రవ్యరాశిని బట్టి వస్తువు పై పనిచేసే ఘర్షణ బలం మారుతుంది.

f) రాయి, ఇనుప దిమ్మ మరియు ట్రాలీకి మధ్య సాపేక్ష చలనం కలిగించే గరిష్ఠ బరువు (limiting weight) లో ఏమైనా మార్పు వస్తుందా? లేదా? ఎందుకు?
జవాబు:
మార్పు వస్తుంది. కారణం ద్రవ్యరాశిని బట్టి వస్తువు పై పనిచేసే ఘర్షణ బలం మారుతుంది.

చెక్కదిమ్మ అడుగు’ తలానికి గ్రీజు పూసి, ట్రాలీ ఉపరితలంపై ఉంచి పై ప్రయోగం చేయండి.
g) గరిష్ఠ బరువు (limiting weight)లో ఏమైనా మార్పు వస్తుందా?
జవాబు:
గరిష్ఠ బరువు విలువ తగ్గుతుంది.

h) గరిష్ఠ బరువు విలువను పెంచాలంటే మనం ఏమి చేయాలి?
జవాబు:
గరిష్ఠ బరువు విలువను పెంచాలంటే వస్తువు చలించే ఉపరితలం మీద ఇసుక వేసి దాన్ని గరుకుగా చేయాలి లేదా చెక్కదిమ్మ ద్రవ్యరాశిని పెంచాలి.

i) ఈ ప్రయోగాల ఆధారంగా మీరేం గమనించారు?
జవాబు:
ఈ ప్రయోగాల ఆధారంగా నునుపుతలం కంటె గరుకుతలం చలించే వస్తువు పై ఎక్కువ ఘర్షణ బలాన్ని కలుగజేస్తుంది.

కృత్యం – 2

3. ఘర్షణలో వచ్చే మార్పును గమనించుట.
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 11
a) పటంలో చూపినట్లు నేలపై ఉంచిన బరువైన పెట్టెను తక్కువ బలంతో నెట్టండి. అది కదలదు (చలించదు). ఎందుకంటే మనం ప్రయోగించిన బలానికి వ్యతిరేకంగా, అంతే పరిమాణంలో గచ్చు పెట్టెపై ఘర్షణ బలాన్ని ప్రయోగిస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 12
b) ఇప్పుడు పెట్టెపై ప్రయోగించే బలాన్ని క్రమంగా పెంచుతూపొండి. అయినా కూడా పెట్టి చలించదు. ఇక్కడ ప్రయోగబలం, ఘర్షణ బలం రెండూ సమానంగా వుంటూ, వ్యతిరేకంగా ఉన్నవి. అనగా ప్రయోగించిన బలంతోపాటు ఘర్షణ బలం కూడా పెరిగింది అన్న మాట. అందుకే పెట్టెలో చలనం లేదు. కనుక సైతిక ఘర్షణ అనేది స్వయం సర్దుబాటు బలం (self adjusting force) అని అనవచ్చు.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 13
c) కాని ఈ సైతిక ఘర్షణకు ఒక గరిష్ఠ హద్దు వుంటుంది. మనం ప్రయోగించే బలాన్ని క్రమంగా పెంచుతూపోతే ఒకానొక సందర్భంలో అనగా ప్రయోగించిన బలం సైతిక ఘర్షణ యొక్క గరిష్ఠ హద్దు కంటే ఎక్కువైనప్పుడు పెట్టి కదులుతుంది. ఇది పటంలో చూపబడింది.

కృత్యం – 3

4. ఘర్షణ బలంపై గరుకుతల ప్రభావం :
ఘర్షణ బలంపై గరుకుతల ప్రభావంను ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 14

  1. క్షితిజ సమాంతరంగా ఉన్న గచ్చుపై చెక్కబోర్డు సహాయంతో ఒక వాలు తలాన్ని ప్రక్క పటంలో చూపిన విధంగా ఏర్పరచండి.
  2. వాలు తలంపై ఏదేని బిందువు “A” వద్ద ఒక గుర్తు పెట్టండి. వాలుతలంపై బంతి చలనం
  3. A నుండి బంతి లేదా పెన్సిల్ సెల్ ను విడిచి పెట్టండి.
  4. అవి వాలు తలం అడుగుభాగం నుండి ఎంత దూరం ప్రయాణించి నిశ్చలస్థితికి వచ్చాయో వాటి దూరాలను స్కేలుతో కొలిచి నమోదు చేయండి.
  5. వాలు తలం అడుగుభాగం నుండి కొద్ది దూరం వరకు ఎలాంటి మడతలు లేకుండా గుడ్డను పరచండి.
  6. మరల పై ప్రయోగాన్ని చేసి బంతి లేదా పెన్సిల్ సెల్ ప్రయాణించిన దూరాలను కనుగొనండి.
  7. ఈసారి ఒక గాజు ఉపరితలాన్ని వాలు తల అడుగుభాగాన ఉండేలా అమర్చండి.
  8. మరల పై ప్రయోగాన్ని బంతి లేదా పెన్సిల్ సెల్ తో చేసి, అవి కదిలిన దూరాలను కనుగొనండి.
  9. పై ప్రయోగాల వల్ల ఒకే వస్తువు వివిధ తలాలపై వేరు వేరు దూరాలు ప్రయాణించడం గమనించవచ్చును.
  10. వివిధ వస్తువులు ఒకే తలంపై వివిధ దూరాలు ప్రయాణించడం కూడా గమనించవచ్చును.
  11. ‘పై పరిశీలన ద్వారా వస్తువులు ప్రయాణించే దూరాలను వస్తువు, నేల తలాల గరుకుదనాలు ప్రభావితం చేస్తాయని తెలుస్తుంది.
  12. దీని ద్వారా “తలం గరుకుదనం పెరిగే కొద్దీ ఘర్షణ పెరుగుతుంది” అని తెలుస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

కృత్యం – 4

5. ఘర్షణ బలంపై స్పర్శావైశాల్య ప్రభావం :

ఘర్షణ బలం వస్తువు స్పర్శా వైశాల్యంపై ఆధారపడదు అని ఒక కృత్యం ద్వారా నిరూపించండి.
(లేదా)
ఘర్షణ స్పర్శాతల వైశాల్యంపై ఆధారపడదు. దీనిని నిరూపించుటకు నీవు ఏ విధమైన కృత్యాన్ని నిర్వహిస్తావు ? వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 1
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 6

  1. ఒక సన్నని తాడును చెక్క దిమ్మెకు కట్టి గచ్చుపై ప్రక్క పటంలో చూపిన విధంగా స్ప్రింగ్ త్రాసుతో లాగండి.
  2. ఇక్కడ చెక్క దిమ్మెను ఎక్కువ వైశాల్య భాగము గచ్చుతో స్పర్శలో ఉండునట్లు ఉంచండి.
  3. స్ప్రింగ్ త్రాసు చెక్క దిమ్మెపై ప్రయోగించిన బలాన్ని చెక్క దిమ్మెను స్ప్రింగ్ త్రాసుతో లాగుట న్యూటనలో తెలియజేస్తుంది.
  4. చెక్క దిమ్మె కదలటానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసులో రీడింగ్ ను గుర్తించి నమోదు చేయండి.
  5. ఈ రీడింగ్ ఘర్షణ బలాన్ని తెలియజేస్తుంది.
  6. చెక్క దిమ్మెను తక్కువ వైశాల్య భాగం గచ్చుతో స్పర్శలో ఉండునట్లు ఉంచండి.
  7. పైన తెలిపిన విధంగా మరల ప్రయోగాన్ని చేసి, ఘర్షణ దిమ్మెను లాగుట బలాన్ని కనుగొనండి.
  8. స్పర్శా వైశాల్యం మారటం వల్ల ఘర్షణ బలంలో ఎలాంటి మార్పు కనబడదు.
  9. స్పర్శా వైశాల్యముతో ఎటువంటి సంబంధం లేకుండా రెండు సందర్భాల్లోనూ ఒకే ఘర్షణ బలం ఉండటం గమనించవచ్చును.
  10. ఈ కృత్యం ద్వారా “ఘర్షణ బలం వస్తువు స్పర్శా వైశాల్యంపై ఆధారపడదు” అని తెలుస్తుంది.

కృత్యం – 5

6. ఘర్షణపై అభిలంబ బల ప్రభావం :
ఘర్షణపై అభిలంబ బల ప్రభావమును ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 1

  1. ఒక సన్నని తాడును చెక్క దిమ్మెకు కట్టి గచ్చుపై పటంలో చూపిన విధంగా స్ప్రింగ్ త్రాసుతో లాగండి.
  2. ఇక్కడ స్ప్రింగ్ త్రాసు చెక్క దిమ్మెపై ప్రయోగించిన బలాన్ని న్యూటనలో తెలియజేస్తుంది.
  3. చెక్క దిమ్మె కదలటానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసులో రీడింగ్ ను నమోదు చేయండి.
  4. ఈ రీడింగ్ ఘర్షణ బలాన్ని తెలియజేస్తుంది.
  5. ఈసారి చెక్క దిమ్మెపై మరొక చెక్క దిమ్మెను అమర్చి ప్రయోగాన్ని మరల చేయండి.
  6. రెండవసారి ఘర్షణ బలాన్ని కనుగొనండి.
  7. మొదటిసారి, రెండవసారి చేసిన ప్రయోగాలలో వచ్చిన ఘర్షణ బలం విలువల్లో రెండవసారి ‘ఘర్షణ బలం విలువ ఎక్కువగా ఉండుటను గమనించవచ్చును.
  8. రెండవ ప్రయోగంలో చెక్క దిమ్మెపై మరొక చెక్క దిమ్మెను ఉంచడం వల్ల అభిలంబ బలం (చెక్క దిమ్మెల భారం) పెరిగింది.
  9. కాబట్టి రెండవ ప్రయోగంలో ఘర్పణ బలం కూడా పెరిగినది.
  10. పై ప్రయోగం వలన ఘర్షణ బలం అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుందని తెలుస్తుంది.
    ∴ ఘర్షణ బలం ∝ అభిలంబ బలం= Ff ∝ fN.

కృత్యం – 6

7. ఘర్షణ ఉష్ణాన్ని జనింపచేస్తుంది.
ఘర్షణ వలన ఉష్ణం ఉత్పత్తి అవుతుందని ఒక కృత్యం ద్వారా వివరించండి.
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 15
జవాబు:

  1. అరచేతులను ఒకదానిపై మరొకటి ఉంచి కాసేపు రుద్దండి.
  2. రెండు చేతులు వేడెక్కిన అనుభూతిని పొందుతాము.
  3. ఘర్షణ వలన రెండు చేతుల ఉష్ణోగ్రత పెరుగుతుంది.
  4. కాబట్టి ఘర్షణ ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది అని తెలుస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

కృత్యం – 7

8. ఘర్షణను ఎలా తగ్గించాలి?
ఘర్షణను ఎలా తగ్గించవచ్చునో రెండు కృత్యాల ద్వారా వివరించండి.
జవాబు:
ఎ)

  1. కేరమ్ బోర్డుపై పౌడర్ చల్లకుండా ఆడితిని.
  2. కేరమ్ కాయిన్స్ సులభంగా కదలలేదు.
  3. ఎందుకంటే ఘర్షణబలం వల్ల కేరమ్ కాయిన్స్ సులభంగా కదలలేదు.
  4. ఈసారి కేరమ్ బోర్డుపై పౌడరు చల్లి ఆడితిని.
  5. కేరమ్ కాయిన్స్ సులభంగా కదిలినవి.
  6. ఎందుకంటే పౌడర్ వల్ల ఘర్షణ బలం తగ్గడంతో కేరమ్ కాయిన్స్ సులభంగా కదిలినవి.

బి)

  1. తలుపు యొక్క ఇనుప మడతబందులపై కొన్ని నూనె చుక్కలు వేయకుండా కదిపితిని.
  2. తలుపు సులభంగా కదలలేదు.
  3. తలుపు యొక్క ఇనుప మడతబందులపై కొన్ని నూనె చుక్కలు వేసి కదిపితిని.
  4. తలుపు సులభంగా కదిలినది.
  5. తలుపు యొక్క మడతబందులపై నూనె చుక్కలు వేయడం వలన ఘర్షణ తగ్గింది.
    పై కృత్యాల ద్వారా మనం కదిలే భాగాల మధ్య పౌడర్, కందెనలు పూయడం వల్ల ఘర్షణను తగ్గించవచ్చునని తెలియుచున్నది.

కృత్యం – 8

9. ఘర్షణపై చక్రాల ప్రభావం :
చక్రాల ద్వారా ఘర్షణను తగ్గించవచ్చునని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 16

  1. ఒక బల్లపై పుస్తకాన్ని ఉంచి నెట్టండి.
  2. పుస్తకం నెమ్మదిగా కదులుతుంది. కారణం ఘర్షణ బలం.
  3. ఈసారి బల్లపై రెండు లేదా మూడు పెన్సిళ్ళను లేదా మూతలేని పెన్లను ఉంచి, వాటిపై పుస్తకాన్ని ఉంచి నెట్టండి.
  4. ఈసారి పుస్తకం సులభంగా కదులుతుంది.
    పై కృత్యం ద్వారా ఒక వస్తువు, రెండవ తలంపై జారటం కంటే దొర్లటం సులభం అని తెలుస్తుంది. కాబట్టి చక్రాల ద్వారా ఘర్షణను తగ్గించవచ్చును.

కృత్యం – 9

10. బాల్ బేరింగ్ సూత్రం అవగాహన :
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 17
ఎ) రెండు డబ్బా మూతలను తీసుకోండి. ఒక మూతను ఎడమచేతిలో స్థిరంగా వుంచి, రెండవ మూతను మొదటి మూతపై వుంచి త్రిప్పండి. ఏమి గమనిస్తారు?
జవాబు:
అతి కష్టం మీద మూత నిదానంగా తిరిగినది.

బి) ఇప్పుడు నాలుగు లేదా ఐదు గోళీలను మొదటి మూతపై ఉంచి, రెండవ మూతను గోళీలపై ఉంచి త్రిప్పండి. ఏమిగమనిస్తారు?
జవాబు:
ఇప్పుడు పై మూత చాలా సులభంగాను, వేగంగాను తిరిగినది.

కృత్యం – 10

11. ప్రవాహి ఘర్షణను పరిశీలించడం :
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 18
ప్రవాహికి ఘర్షణ ఉంటుందని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:

  1. నీటితో ఉన్న గాజు గ్లాసులో చెంచాతో నీటిని తిప్పండి.
  2. నీరు ఒక అక్షం పరంగా శ్రమిస్తుంది.
  3. చెంచాతో తిప్పుట ఆపివేయండి.
  4. తిరుగుతున్న నీటి వడి క్రమంగా తగ్గుతూ కొంత సేపటికి నీరు నిశ్చలస్థితికి వస్తుంది.
  5. ద్రవంలోని పొరల మధ్య మరియు ద్రవతలానికి, గాజు గ్లాసు తలానికి మధ్య గల ఘర్షణ బలం వల్ల నీరు నిశ్చలస్థితికి వచ్చింది.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

కృత్యం – 11

12. ప్రవాహి ఘర్షణను ప్రభావితం చేసే అంశాలు :
ఒక టబ్ లో నీటిని తీసుకోండి. అరచేతి వేళ్ల దిశలో, చేతిని నిలువుగా నీటిలో పైకి కిందికి కదపండి. ఇపుడు అరచేతి తలానికి లంబదిశలో చేతిని కదపండి.
ఏ సందర్భంలో ఎక్కువ నిరోధ బలాన్ని అనుభవిస్తాం? ఎందుకు?
జవాబు:

  1. అరచేతి తలానికి లంబదిశలో చేతిని కదిపినపుడు ఎక్కువ నిరోధ బలాన్ని అనుభవిస్తాం.
  2. ఈ స్థితిలో అరచేతి తలాల యొక్క ఎక్కువ వైశాల్యం నీటి ఉపరితలంతో స్పర్శలో ఉండటం వలన నిరోధ బలం ఎక్కువైంది.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

SCERT AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 1st Lesson Questions and Answers బలం

8th Class Physical Science 1st Lesson బలం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
బలం అంటే ఏమిటి? బలం వల్ల తీసుకురాగలిగే మార్పులేమిటి?
జవాబు:
వస్తువుల నిశ్చల స్థితినిగాని, సమవేగంతో ఋజుమార్గంలో పోయే స్థితినిగాని మార్చేదీ లేక మార్చడానికి ప్రయత్నించే దానిని బలం అంటారు. బలం సదిశరాశి. బలానికి ప్రమాణాలు MKS పద్ధతిలో న్యూటన్లు, CGS పద్ధతిలో డైన్లు.

బలం వల్ల తీసుకురాగలిగే మార్పులు :

  1. నిశ్చల స్థితిలో గల వస్తువును బల ప్రయోగం వలన గమనంలోనికి మార్చవచ్చును.
  2. గమనంలో ఉన్న వస్తువును బల ప్రయోగం వలన వడిని మార్చవచ్చును.
  3. గమనంలో ఉన్న వస్తువును బలప్రయోగం వలన నిశ్చల స్థితిలోకి మార్చవచ్చును.
  4. గమనంలో ఉన్న వస్తువును బలప్రయోగం వలన గమన దిశను మార్చవచ్చును.
  5. బల ప్రయోగం వలన వస్తువు యొక్క ఆకృతిని మార్చవచ్చును.
  6. బల ప్రయోగం వలన వస్తువు యొక్క పరిమాణాన్ని మార్చవచ్చును.

ప్రశ్న 2.
బలాన్ని ప్రయోగించడం ద్వారా జరిగే కింది సందర్భాలకు ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
ఎ) వస్తువు వడిలో మార్పు బి) వస్తువు ఆకృతిలో మార్పు సి) వస్తువు కదిలే దిశలో మార్పు
జవాబు:
ఎ) వస్తువు వడిలో మార్పు :

  1. ఒక పిల్లవాడు రబ్బరు టైరును కర్రతో కొడుతూ ముందుకు పరిగెడుతున్నాడు.
  2. ఆ టైరు ఎక్కువ వడిగా వెళ్ళడానికి దానిని కర్రతో మళ్ళీ మళ్ళీ కొడుతూ (బలాన్ని ఇస్తూ) ఉన్నాడు. అనగా బలాన్ని పెంచితే వస్తువు వడి పెరుగుతుంది.

బి) వస్తువు ఆకృతిలో మార్పు :

  1. ఒక స్పాంజ్ డస్టర్‌ను బలం ప్రయోగించి పిండడం వలన ఆ స్పాంజ్ డస్టర్ యొక్క ఆకృతి మారును.
  2. రొట్టెలు తయారు చేయునప్పుడు పిండి ముద్దను రొట్టెలు తయారు చేయు కర్రతో బలం ప్రయోగించి పలుచని వృత్తాకార ఆకృతిలోకి మార్చినపుడు లేదా సాగదీసినపుడు పిండి ముద్దను కొద్దిగా మార్చవచ్చును.

సి) వస్తువు కదిలే దిశలో మార్పు :

  1. కేరమ్ కాయిన్ ను స్ట్రైకర్ తో కొట్టినప్పుడు కాయితో పాటు స్ట్రైకర్ కూడ దిశని మార్చుకుంటుంది.
  2. క్రికెట్ ఆటలో బౌలర్ వేసే బంతి యొక్క దిశను బ్యా ట్స్ మేన్ తన బ్యాట్ తో మార్చుతాడు.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

ప్రశ్న 3.
స్పర్శాబలం, క్షేత్రబలం మధ్యగల భేదాలను వివరించండి. (AS1)
(లేదా)
స్పర్శాబలం, క్షేత్రబలంతో ఏ విధంగా విభేదిస్తుంది?
జవాబు:

స్పర్శాబలం క్షేత్రబలం
1) రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శా సంబంధం ద్వారా పనిచేసే బలాలను స్పర్శా బలాలు అంటారు. 1) రెండు వస్తువులు ఒక దానితో ఒకటి ప్రత్యక్ష స్పర్శలో లేకుండా వాటి మధ్య బలం ఉన్నట్లయితే అటువంటి బలాన్ని క్షేత్రబలం అంటారు.
2) కండర బలం, ఘర్షణ బలం, అభిలంబ బలం మరియు తన్యతా బలాలు స్పర్శా బలానికి ఉదాహరణలు. 2) అయస్కాంత బలం, విద్యుత్ బలం మరియు గురుత్వాకర్షణ బలాలు క్షేత్ర బలానికి ఉదాహరణలు.
3) రెండు వస్తువుల మధ్య తాడనం వలన ఏర్పడుతుంది. 3) రెండు వస్తువులు క్షేత్రంలో ఉన్నపుడు ఏర్పడును.
4) దీనిలో క్షేత్ర ప్రాంతం ఉండదు. 4) దీనిలో క్షేత్రప్రాంతం ఉంటుంది.
5) స్పర్శాబలం చాలా వేగంగా పనిచేస్తుంది. 5) క్షేత్రబలం కొద్ది నెమ్మదిగా పనిచేస్తుంది.
6) ఇది సదిశ రాశి. 6) ఇది సదిశ క్షేత్రం.

ప్రశ్న 4.
స్పర్శాబలానికి, క్షేత్రబలానికి రెండేసి ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
స్పర్శాబలానికి ఉదాహరణలు :

  1. టూత్ పేస్ట్ ట్యూబ్ ను చేతి వేళ్ళతో నొక్కినపుడు టూత్ పేస్ట్ ట్యూబ్ నుండి టూత్ పేస్ట్ బయటకు రావడం.
  2. ఒక బంతిని నేలపై విసిరినపుడు కొంతదూరం వెళ్ళి ఆగిపోతుంది. నీరు, బంతి ఉపరితలాల మధ్య ఘర్షణ బలం స్పర్శాబలంగా పనిచేసింది.
  3. సైకిల్ తొక్కడం ఆపేస్తే క్రమంగా సైకిల్ వడి తగ్గిపోయి ఆగిపోతుంది. సైకిల్ టైర్లకు, నేలకు మధ్య ఘర్షణ బలం స్పర్శాబలంగా పనిచేసింది.

క్షేతబలానికి ఉదాహరణలు :

  1. రెండు అయస్కాంతాల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలాలు.
  2. ఒక బెలూనను ఒక కాగితంతో బాగా రుద్ది కాగితం ముక్కల వద్దకు తీసుకువస్తే ఆ కాగితం ముక్కలను బెలూను ఆకర్షిస్తుంది.
  3. పైకి విసిరిన రాయి తిరిగి భూమి మీద పడడం.

ప్రశ్న 5.
కింద ఇవ్వబడ్డ వాక్యంలో తప్పును సరిదిద్ది రాయండి. (AS1)
“కారు నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి దానిమీద ఎటువంటి బలాలు లేవు”
జవాబు:
“కారు నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి దాని మీద పనిచేసే బలాల ఫలిత బలం శూన్యం”.

ప్రశ్న 6.
కోయడానికి ఉపయోగించే పరికరాల అంచులు పదునుగా ఉంటాయి. ఎందుకు? (AS1)
జవాబు:

  1. కోయడానికి ఉపయోగించే పరికరాల అంచులు పదునుగా ఉంటాయి.
  2. ఎందుకంటే పదును ఉన్నవైపు స్పర్శా వైశాల్యం తక్కువగా ఉంటుంది.
  3. బలాన్ని ప్రయోగించినపుడు పదునైన భాగం వైపు ఉపరితల వైశాల్యం తక్కువ కాబట్టి అధిక పీడనాన్ని కలుగచేస్తుంది. కాబట్టి సులభంగా కోయవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

ప్రశ్న 7.
“ఫలిత బలం వల్ల వస్తువుల గమన స్థితిలో మార్పు వస్తుంది” ఈ వాక్యం ద్వారా మీరు ఏం అర్థం చేసుకున్నారో వివరించండి. (AS1)
(లేదా)
ఫలిత బలం వస్తువులపై ప్రయోగించబడడం వల్ల వాటి యొక్క చలనస్థితి మారుతుంది. సరైన ఉదాహరణలతో వివరించండి.
జవాబు:

  1. ఒక వస్తువు పై పనిచేసే అన్ని బలాల బీజీయ మొత్తాన్ని ఫలిత బలం అంటారు.
  2. ఫలిత బలం శూన్యమైతే ఆ వస్తువు నిశ్చలస్థితిలో ఉంటుంది.
  3. ఫలిత బలం శూన్యం కాకుండా ఉంటే ఆ వస్తువు గమనంలో ఉంటుంది.
  4. ఫలిత బలం విలువ మారుతూ ఉంటే వస్తువు గమన స్థితిలో మార్పు వస్తుంది.

ప్రశ్న 8.
“ఒక బరువైన వస్తువుని, నీవు ఎంత బలంగా నెట్టినా అది కదలదు” దీనికి గల కారణాన్ని “ఫలిత బలం” అనే భావనతో వివరించండి. (AS1)
జవాబు:

  1. ఒక బరువైన వస్తువుని నీవు ఎంత బలంగా నెట్టినా అది కదలదు దీనికి గల కారణం దాని ఫలిత బలం శూన్యం అగుట.
  2. ఒక వస్తువులో కదలిక దాని ఫలిత బలంపై ఆధారపడి ఉంటుంది.
  3. ఫలిత బలం శూన్యం అయితే ఆ వస్తువు కదలదు.
  4. ఫలిత బలం శూన్యం కానట్లైతే ఆ వస్తువు కదులుతుంది.

ప్రశ్న 9.
కింది పటాలలో ఫలిత బలాన్ని కనుక్కోండి. (AS5) (AS1)
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 1
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 2
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 3

ప్రశ్న 10.
భూమి మీద ఘర్షణ లేదని ఊహించండి. ఏం జరుగుతుందో వివరించండి. (AS2)
జవాబు:

  1. ఘర్షణ బలం లేకపోతే మనం నడవలేము.
  2. వాహనాలు జారిపడి పోయే ప్రమాదం గలదు.
  3. పెన్నుతో పేపరుపై వ్రాయలేము.
  4. అగ్గిపుల్లతో అగ్గి పెట్టె పై రుద్ది మంటను పుట్టించలేము.
  5. నల్లబల్లపై చాక్ పీతో వ్రాయలేము.
  6. బల్లపై ఉంచిన వస్తువులు జారిపడతాయి.
  7. రాక్స్ లేదా అల్మారాలో ఉంచిన వస్తువులు జారిపడిపోతాయి.
  8. గుర్రపు మరియు ఎద్దుల బండ్లను నడుపలేము.
  9. మేకులను గోడలో మరియు చెక్కలో దింపలేము.
  10. ఆహారాన్ని నమలలేము.
  11. ఏ వస్తువుకు నిశ్చలస్థితి ఉండదు.
  12. భవనాలు నిర్మించలేము.

ప్రశ్న 11.
కార్తీక్ టి.వి.లో “వన్డే క్రికెట్ మ్యాచ్” చూస్తున్నాడు. ఆట భోజన విరామంలో క్రికెట్ పిచ్ పై రోలర్‌ను దొర్లించడం గమనించాడు. ఆ రోలర్ దొర్లేటప్పుడు దానిపై పనిచేసే వివిధ బలాలు, ఫలిత బలం గురించి అతను ఆలోచించాడు. ఫలితబలం పనిచేసే దిశ గురించి అతని మదిలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆ ప్రశ్నలేవో మీరు ఊహించగలరా? (AS2)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 4

  1. బలం ప్రయోగించిన దిశలో రోలర్ ఎందుకు కదలలేదు?
  2. బలం ప్రయోగించిన దిశలో ఫలిత బలం ఎందుకు లేదు?
  3. బలం ప్రయోగించిన దిశకు కొంత కోణంలో ఫలిత బలం దిశ ఎందుకు ఉన్నది?
  4. ఫలిత బలం దిశలో రోలర్ కదిలితే పిచ్ ఎందుకు చదును అయినది?
  5. పిచ్ చదును అగుటకు ఏ బలం ఉపయోగపడినది?
  6. ఘర్షణ బలం ఏ దిశలో పని చేస్తుంది?

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

ప్రశ్న 12.
ఎ. ఒకే విధమైన స్త్రాలు రెండు తీసుకుని, అందులో ఒక దానిని స్వేచ్ఛగా వేలాడదీయండి. రెండవ దానిని కాగితంతో రుద్ది వేలాడదీసిన స్ట్రా వద్దకు తీసుకురండి. ఈ కృత్యం ద్వారా మీరు ఏం గమనించారు? ఇవి ఏ రకమైన బలం? (AS3)
జవాబు:

  1. కాగితంతో రుద్దిన స్ట్రాను స్వేచ్ఛగా వేలాడదీసిన స్ట్రా వద్దకు తీసుకొని వచ్చినపుడు మొదట ఆకర్షించుకున్నది. ఆ తర్వాత వికర్షించుకున్నది.
  2. కాగితంతో రుద్దిన స్ట్రా మరియు స్వేచ్ఛగా వేలాడదీసిన స్ట్రాల మధ్య వికర్షణ బలం, స్థావర విద్యుత్ బలం ఏర్పడ్డాయి.

బి. పొడి జుట్టుని దువ్వెనతో దువ్వి ఆ దువ్వెనను చిన్న చిన్న కాగితపు ముక్కల దగ్గరకు తీసుకురండి. ఏం గమనించారు? వివరించండి. (AS3)
జవాబు:

  1. పొడిజుట్టుని దువ్వెనతో దువ్వి ఆ దువ్వెనను చిన్న చిన్న కాగితపు ముక్కల దగ్గరకు తీసుకువస్తే అది కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది.
  2. పొడి జుట్టు దువ్వెనతో దువ్వడం వలన ఘర్షణ బలం వల్ల స్థావర విద్యుత్ ఆవేశాలు ఏర్పడ్డాయి.
  3. దువ్వెనకు గల స్థావర విద్యుత్ ఆవేశాలు కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది.

ప్రశ్న 13.
స్పర్శాబలాలను, క్షేత్రబలాలను వివరించే చిత్రాలను వార్తాపత్రికలు, అంతర్జాలం మొదలైన వాటి నుండి సేకరించి నోట్ బుక్ లో – అంటించి ప్రదర్శించండి. (AS4)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 5

ప్రశ్న 14.
పటంలో చూపిన విధంగా మెట్ల మీద ఒక కర్రని పెట్టారు . ఆ కర్ర మీద పనిచేసే అభిలంబ బలాలను గీయండి. (AS5)
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 6
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 7

ప్రశ్న 15.
చెట్టు ఊడని పట్టుకొని ఒక కోతి నిశ్చలంగా వేలాడుతూ ఉందనుకోండి. ఆ కోతిపై పనిచేసే బలాలు ఏవి? (AS7)
జవాబు:
కోతిపై పనిచేసే బలాలు :

  1. కోతిపై గురుత్వ బలం భూమి వైపు పనిచేస్తుంది.
  2. కోతి నుండి పైవైపు ఊడ తన్యతాబలం పనిచేస్తుంది.

ప్రశ్న 16.
నిశ్చలంగా ఉన్న ఒక బరువైన వస్తువును కదల్చాలంటే నువ్వు దానిపై కొంత బలాన్ని ప్రయోగించాలి. అయితే ఒకసారి కదిలిన తరువాత, దానిని అదే గమనస్థితిలో ఉంచడానికి కొద్ది బలం ప్రయోగిస్తున్నా సరిపోతుంది. ఎందుకు? (AS1)
జవాబు:

  1. నిశ్చలస్థితి గల ఒక బరువైన వస్తువును గమన స్థితిలోకి మార్చుతూ ఉంటే సైతిక ఘర్షణబలం వ్యతిరేకిస్తుంది.
  2. గమనంలో ఉన్న వస్తువును జారుడు ఘర్షణ బలం నిశ్చలస్థితిలోకి మారుస్తుంది.
  3. సైతిక ఘర్షణ బలం కంటే జారుడు ఘర్షణ బలం చాలా తక్కువగా ఉంటుంది.
  4. కాబట్టి వస్తువు ఒకసారి కదిలిన తరువాత, దానిని అదే గమన స్థితిలో ఉంచడానికి కొద్దిగా బలం (జారుడు ఘర్షణ బలానికి సరిపడు) ప్రయోగిస్తే సరిపోతుంది.

ప్రశ్న 17.
కింది రెండు సందర్భాలలో పీడనాన్ని ఎలా పెంచగలవు? (AS1)
ఎ) వైశ్యాలంలో మార్పు లేనపుడు బి) బలంలో మార్పు లేనపుడు
జవాబు:
ఎ) వైశాల్యంలో మార్పు లేనపుడు :

  1. వైశాల్యం మార్పు లేనపుడు పీడనాన్ని పెంచాలంటే దానిపై బలాన్ని పెంచాలి.
  2. పీడనం బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.

బి) బలంలో మార్పు లేనపుడు :

  1. బలం మార్పు లేనపుడు పీడనాన్ని పెంచాలంటే స్పర్శావైశాల్యాన్ని తగ్గించాలి.
  2. పీడనము, స్పర్శా వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

ప్రశ్న 18.
ఘర్షణని తగ్గించడానికి కొన్ని మార్గాలను సూచించి, వాటిని పరీక్షించడానికి ప్రయోగాన్ని రూపకల్పన చేసి నిర్వహించండి.
జవాబు:
ఘర్షణని తగ్గించడానికి కొన్ని మార్గాలు :

  1. ఘర్షణను తగ్గించడానికి స్పర్శించుకొనే తలాలను నునుపుగా ఉంచాలి.
  2. ఘర్షణను తగ్గించడానికి స్పర్శించుకొనే తలాలకు కందెనలను, నూనెలను పూయాలి.
  3. యంత్రాలలో, చక్రాలలో ఘర్షణను తగ్గించడానికి బాల్ బేరింగ్ ను ఉపయోగించాలి.

నునుపైన తలాలు ఘర్షణ బలాలు తగ్గిస్తాయి అని ప్రయోగపూర్వకంగా నిరూపించుట :
1) ఉద్దేశ్యము : నునుపైన తలంపై ఘర్షణ తక్కువగా ఉంటుంది.

2) పరికరాలు : 1) నునుపుగా ఉండే పొడవైన చెక్క, 2) గరుకుగా ఉండే పొడవైన చెక్క, 3) రెండు గోళీలు.

3) ప్రయోగము :

  1. నునుపైన మరియు గరుకుగా ఉండే చెక్కలను ఒకదాని ప్రక్కన ఒకటి క్షితిజ సమాంతరంగా అమర్చాలి.
  2. ఒక్కొక్క చెక్కపై ఒక్కొక్క గోళీని ఉంచి ఒకే బలంతో రెండింటిని కదల్చండి.
  3. ఏ గోళీ ఎక్కువ దూరం కదిలినదో కనుగొనండి.
  4. నునుపైన చెక్క తలంపై గోళీ ఎక్కువ దూరం కదిలినది. కావున నునుపైన తలంపై ఘర్షణ బలం తక్కువగా ఉండుట వలన గోళీ ఎక్కువ దూరం కదిలినది అని తెలుస్తుంది.
  5. గరుకైన చెక్క తలంపై గోళీ తక్కువ దూరం కదిలినది. కావున గరుకు తలంపై ఘర్షణ బలం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

పై ప్రయోగము వలన నునుపైన తలాలు తక్కువ ఘర్షణ బలాన్ని కల్గిస్తాయి అని తెలుస్తుంది.

ప్రశ్న 19.
క్రింది పటం పరిశీలించండి. అందులో ఘర్షణ బలం, అభిలంబ బలం ఏ దిశలో పనిచేస్తాయో తెలపండి. (AS5)
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 8
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 9

ప్రశ్న 20.
సమతలంపై స్థిరంగా నిలబడ్డ వ్యక్తిపై ఏయే బలాలు పని చేస్తుంటాయి? అతనిపై పనిచేసే బలాలన్నింటిని సూచించే స్వేచ్ఛావస్తుపటాన్ని (FBD) గీయండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 10

ప్రశ్న 21.
నిత్య జీవితంలో మనం వివిధ కృత్యాలు చేయడానికి ఉపయోగపడే ఘర్షణ యొక్క పాత్రని నీవు ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:

  1. నడవడం, పరుగెత్తడం అనే కృత్యాలలో ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  2. వాహనాలు నడపడానికి ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  3. మేకులను చెక్కలోకి మరియు గోడలోనికి దించడానికి ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  4. గుర్రపు బండ్లు మరియు ఎడ్ల బండ్లు నడపడానికి ఘర్షణబలం ఉపయోగపడుతుంది.
  5. కాగితంపై పెన్నుతో వ్రాయడానికి ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  6. బోర్డ్ పై చాపీ తో వ్రాయడానికి ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  7. భవన నిర్మాణములో ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  8. వస్తువులను చేతితో పట్టుకోవడంలో ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  9. వడ్రంగి చెక్క తలాలను నునుపు చేయుటకు ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.

నిత్య జీవితంలో మనం వివిధ పనులు చేయడానికి ఉపయోగపడే ఘర్షణ యొక్క పాత్రను ఎంతగానో అభినందించ వలసిన అవసరం ఉన్నది.

8th Class Physical Science 1st Lesson బలం Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 5

ప్రశ్న 1.
m ద్రవ్యరాశి గల క్రికెట్ బంతిని కొంత వేగంతో పైకి విసిరారనుకోండి. గాలి నిరోధాన్ని విస్మరిస్తే (ఎ) అది చేరుకునే గరిష్ఠ ఎత్తులో సగం ఎత్తు వద్ద (బి) గరిష్ఠ ఎత్తు వద్ద ఆ బంతిపై ఏ ఏ బలాలు పనిచేస్తుంటాయి?
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 11
(ఎ) గరిష్ఠ ఎత్తులో సగం ఎత్తు (h/2) వద్ద పనిచేసే బలాలు:

  1. గురుత్వ బలం (mg)
    విసిరిన బలంలో కొంత బలము.

(బి) గరిష్ఠ ఎత్తు (h) వద్ద పనిచేసే బలాలు:

  1. గురుత్వ బలం (mg)

8th Class Physical Science Textbook Page No. 6

ప్రశ్న 2.
ఒకే రంగు పూసిన రెండు లోహపు కడ్డీలు మీ వద్ద ఉన్నాయనుకోండి. అందులో ఒకటి ఉక్కుది, రెండవది అయస్కాంతం. అందులో ఏది అయస్కాంతమో, ఏది ఉక్కు కడ్డీయో మీరు ఏ విధంగా నిర్ణయిస్తారు? (నిబంధన : కడ్డీలను విరచరాదు)
జవాబు:
ఇనుప రజనును ఏ కడ్డీ ఆకర్షిస్తుందో ఆ కడ్డీ అయస్కాంతంగాను, ఇనుప రజనును ఆకర్షించని కడ్డీని ఉక్కు కడ్డీగా గుర్తించవచ్చును.

8th Class Physical Science Textbook Page No. 8

ప్రశ్న 3.
ఒక పుస్తకం బల్లపై నిశ్చలస్థితిలో ఉంది. ఆ పుస్తకంపై ఘర్షణ బలం పనిచేస్తున్నదా? లేదా? వివరించండి.
జవాబు:

  1. బల్లపై గల పుస్తకంపై ఘర్షణ బలం పనిచేస్తుంది.
  2. నిశ్చలస్థితిలో గల వస్తువులపై పనిచేసే ఘర్షణ బలాన్ని సైతిక ఘర్షణ బలం అంటారు.
  3. నిశ్చల స్థితిలో గల పుస్తకాన్ని చలన స్థితి పొందుటకు కావలసిన బలం కంటే తక్కువ బలం ప్రయోగించినపుడు పుస్తకం చలనంలో ఉండదు. కారణం ప్రయోగించిన బలాన్ని సైతిక ఘర్షణ బలం నిరోధిస్తుంది.

8th Class Physical Science Textbook Page No. 10

ప్రశ్న 4.
A మరియు B అనే వస్తువులతో కూడిన ఒక వ్యవస్థ ప్రక్క పటంలో చూపబడింది. A మరియు B వస్తువుల మీద ఏ ఏ బలాలు పనిచేస్తున్నాయో చెప్పండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 12
జవాబు:
A వస్తువుపై పనిచేసే బలాలు :

  1. గురుత్వ బలం
  2. అభిలంబ బలం
  3. B యొక్క భారం (B యొక్క గురుత్వబలం)

B వస్తువుపై పనిచేసే బలాలు :

  1. 1గురుత్వ బలం
  2. అభిలంబ బలం

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

ప్రశ్న 5.
స్పర్శా బలాలను ఘర్షణ బలం, అభిలంబ బలం అని వేరుపరచి చూడాల్సిన అవసరం ఏమిటో రెండు కారణాలతో వివరించండి.
జవాబు:

  1. ఘర్షణ బలం, అభిలంబ బలాలు వేరువేరు దిశలలో పని చేయడం.
  2. ఘర్షణ బలం చలన దిశకు వ్యతిరేక దిశలో ఉండి, వస్తువు చలనాన్ని నిరోధిస్తుంది. కాని అభిలంబ బలాన్ని గురుత్వ బలం సమతుల్యం చేస్తుంది.

8th Class Physical Science Textbook Page No. 13

ప్రశ్న 6.
మీ స్నేహితునితో మోచేతి కుస్తీ (arm wrestling) ఆట ఆడండి. ఆటలో గెలుపుని ‘ఫలితబలం’ భావనతో వివరించండి. ఈ ఆట ఆడేటపుడు మీ మోచేతిపై పనిచేసే బలాల పేర్లు, వాటి దిశలను తెల్పండి. ఈ సన్నివేశానికి స్వేచ్ఛా వస్తుపటం (FBD) ను గీయడానికి ప్రయత్నించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 13
పటం – 1 లో స్వేచ్చా వస్తుపటం FBD :

F1, F2 లు → అభిలంబ బలాలు
Fg → గురుత్వబలం
Fm1 → మొదటి వ్యక్తి కండర బలం
Fm2 → రెండవ వ్యక్తి కండర బలం
X – అక్షం వెంట ఫలితబలం Fnet = Fm2 – Fm1
X – అక్షం వెంట ఫలిత బలం = Fg – (F1+ F2)

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 14
పటం – 2 లో ఆటలో గెలుపును పొందిన భావనతో స్వేచ్ఛా వస్తుపటం

F1, F2 లు → అభిలంబ బలాలు
Fg → గురుత్వబలం
Fm1 → మొదటి వ్యక్తి కండర బలం
Fm2 → రెండవ వ్యక్తి కండర ,బలం
X – అక్షం వెంట ఫలిత బలం = (Fm1 + F1 + F2) – (Fg+ Fm1)

ప్రశ్న 7.
బలాలు ఏమి చేయగలవు?
జవాబు:

  1. నిశ్చలస్థితిలో గల వస్తువును గమన స్థితిలోకి మార్చగలవు.
  2. గమన స్థితిలో గల వస్తువుల వడిని పెంచగలవు.
  3. గమన స్థితిలో గల వస్తువుల వడిని తగ్గించగలవు.
  4. గమన స్థితిలో గల వస్తువులను నిశ్చలస్థితిలోకి మార్చగలవు.
  5. వస్తువుల ఆకృతిని మరియు ఆకారాన్ని మార్చగలవు.

8th Class Physical Science Textbook Page No. 16

ప్రశ్న 8.
పీడనానికి దిశ ఉంటుందా? వివరించండి.
జవాబు:

  1. పీడనం అదిశ రాశి. పీడనానికి పరిమాణం మాత్రమే ఉంటుంది. దిశ ఉండదు.
  2. మృదువైన పదార్థాలు మాత్రమే బలాన్ని ప్రయోగిస్తే పీడనాన్ని కలుగజేస్తాయి.
  3. దృఢమైన వస్తువులపై బలాన్ని ప్రయోగిస్తే బలం ప్రయోగించిన దిశలో వస్తువు కదులుతుంది.
  4. మృదువైన పదార్థాలపై బలాన్ని కలుగజేస్తే, ఆ పదార్థాలు అన్ని దిశలలో పీడనాన్ని కలుగజేస్తాయి.
    ఉదా : నీరు గల పాత్ర ; వాయువు గల వాయుపాత్ర మరియు గాలి గల బెలూను.

8th Class Physical Science Textbook Page No. 15

ప్రశ్న 9.
స్కూలు బ్యాగులు, షాపింగ్ బ్యాగులకు వెడల్పైన బెల్ట్ లు ఉండడానికి కారణమేమిటి?
జవాబు:
స్కూలు బ్యాగులు, షాపింగ్ బ్యాగులకు వెడల్పైన బెల్ట్ లు ఉండడానికి కారణము స్పర్శా బలం పెరిగి బల ప్రభావమును, పీడనమును తగ్గించుటకు.

ప్రశ్న 10.
అధిక బరువులు తీసుకువెళ్ళే లారీలకు ఎక్కువ సంఖ్యలో వెడల్పైన టైర్లు ఎందుకు ఉంటాయో తెల్పండి.
జవాబు:
అధిక బరువులు తీసుకువెళ్ళే లారీలకు ఎక్కువ సంఖ్యలో వెడల్పైన టైర్లు ఉంటాయి. ఎందుకంటే భూమిపైన పీడనమును తగ్గించుటకు.

పరికరాల జాబితా

స్ట్రా, డస్టరు, అయస్కాంతము, తాడు, టూత్ పేస్టు, మూతగల సీసా, కార్పెట్, గరుకు రోడ్డు, నున్నని గచ్చు, వివిధ దారాలు, సూది, థర్మోకోల్ బాల్స్, బెలూన్, కాగితపు ముక్కలు, డ్రాయింగ్ షీట్, టేబుల్, రబ్బరు బ్యాండ్, క్యారమ్ బోర్డు, స్పాంజ్, ప్లాస్టిక్ బాటిల్, అద్దము, పెన్సిల్, వాలుతలము, రూపాయి నాణెం, స్ప్రింగ్ త్రాసు, భారాలను తగిలించే కొక్కెం, భారాలు, దండాయస్కాంతం, ఇనుపరజను, పుట్ బాల్ (పెద్దబంతి), ప్లాస్టిక్ ట్రేలు, ఇటుకలు.

8th Class Physical Science 1st Lesson బలం Textbook Activities

కృత్యములు

కృత్యం -1

1. వివిధ పనులలో నెట్టడాన్ని, లాగడాన్ని గుర్తించడం :
ఈ క్రింది పట్టికలో వివిధ పనులు చేస్తున్న పటాలను పరిశీలించి నెట్టడాన్ని, లాగడాన్ని గుర్తించి పట్టికలో నమోదు చేయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 15
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 16

కృత్యం – 2

2. అయస్కాంత బలాన్ని పరిశీలించుట :
ఒక సూదిని తీసుకోండి. ఒక దండయస్కాంతాన్ని తీసుకుని దానిపై ఒకే దిశలో అనేకసార్లు రుద్దండి. ఆ సూది అయస్కాంతంగా మారడం మీరు గమనించవచ్చు. దిక్సూచి సహాయంతో ఆ సూది యొక్క ఉత్తర, దక్షిణ ధృవాలను గుర్తించవచ్చు. దక్షిణ ధృవం ఉన్న వైపు ఒక చిన్న ఎరుపు బెండు బంతిని గుచ్చండి. ఉత్తర ధృవం వైపు ఒక తెల్ల బెండు బంతిని గుచ్చండి. ఇదే విధంగా ఇంకొక సూదిని తీసుకొని తయారుచేయండి. ఈ క్రింది విధంగా చేయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 17

ఎ) ఒకే రంగు బంతులు కలిగిన సూదుల చివరలు ఎదురెదురుగా ఉండేలా ఆ సూదులను నీటిలో ఉంచండి. ఏం జరుగుతుంది?
జవాబు:
ఒకే రంగు బంతులు కలిగిన సూదుల చివరలు వికర్షించుకోవటం గమనించవచ్చును.

బి) వేర్వేరు రంగు బంతులు కలిగిన సూదుల చివరలు ఎదురెదురుగా ఉండేలా నీటిలో వదలండి. ఏం జరిగింది?
జవాబు:
వేరువేరు రంగు బంతులు కలిగిన సూదుల చివరలు ఆకర్షించుకోవడం గమనించవచ్చును.

సి) ఆ సూదులు ఒకదానికొకటి ఆకర్షించుకొంటే లేదా వికర్షించుకొంటే ఆ బలాన్ని ఏమంటారు?
జవాబు:
రెండు అయస్కాంతాల మధ్య కంటికి కనిపించకుండా పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని అయస్కాంత బలం అంటారు.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

కృత్యం – 3

3. స్థావర విద్యుత్ బలాలను పరిశీలించుట :

ఒక బెలూనను ఊది దాని చివర ముడి వేయండి. ఒక కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి గచ్చుపై వేయండి. ఇప్పుడు బెలూనను ఒక కాగితంతో బాగా రుద్ది కాగితం ముక్కల వద్దకు తీసుకురండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 18

ఎ) ఏం జరిగింది? చిన్న చిన్న కాగితపు ముక్కలు బెలూన్ వైపుకి లాగబడ్డాయా?
జవాబు:
చిన్న చిన్న కాగితపు ముక్కలు బెలూన్ వైపుకి లాగబడ్డాయి.

బి) కాగితపు ముక్కలను బెలూన్ ఎందుకు ఆకర్షించింది?
జవాబు:
బెలూనను రుద్దడం వల్ల దానిపై విద్యుత్ బలం ఏర్పడడం వలన కాగితం ముక్కలు ఆకర్షింపబడినవి.

సి) కాగితపు ముక్కలకు బదులు ఉప్పు, మిరియాల పొడిని ఉపయోగించి చూడండి. ఏం జరుగుతుందో గమనించండి.
జవాబు:
ఉప్పు, మిరియాల పొడి బెలూన్ చే ఆకర్షింపబడవు.

కృత్యం – 4

4. అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించుట :

ఒక దండయస్కాంతాన్ని టేబుల్ పై పెట్టి దానిపై మందంగా ఉండే ఒక తెల్లకాగితాన్ని ఉంచండి. ప్రక్క పటంలో చూపిన విధంగా కాగితంపై ఇనుప రజను వెదజల్లండి. ఇపుడు టేబుల్ ని గానీ, కాగితాన్ని గానీ మెల్లగా పెన్ / పెన్సిల్ తో తట్టండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 19

ఎ) ఏం గమనించారు? ఇనుప రజను ఏదైనా ఒక ప్రత్యేక ఆకృతిలో అమరిందా?
జవాబు:

  1. దండయస్కాంతం యొక్క అయస్కాంత బలం ప్రభావం వల్ల ఇనుపరజను ఆ అయస్కాంతం చుట్టూ కొంత ప్రాంతంలో వక్రరేఖలుగా తమకు తాము సర్దుకోవడం గమనించాను.
  2. ఇనుపరజను దండయస్కాంతం యొక్క ఉత్తర ధృవం నుండి దక్షిణ , ధృవం వరకు వరుసగా వక్రరేఖ వలె అనేక రేఖలు ఏర్పడ్డాయి. ఈ వక్రరేఖలు దండయస్కాంతంకు ఇరువైపుల ఏర్పడ్డాయి. ఈ రేఖలు అయస్కాంత క్షేత్రం ఏర్పడిన ప్రాంతాన్ని అయస్కాంత క్షేత్రం అంటారు.

కృత్యం – 5

5. కండర బలాన్ని ఉపయోగించే సందర్భాల జాబితా తయారు చేయడం :

కండర బలాన్ని ఉపయోగించి పనిచేసే సందర్భాలను వ్రాయండి.

  1. సైకిల్ తొక్కడం
  2. ఈత కొట్టడం
  3. పరుగెత్తడం
  4. బరువులు మోయడం
  5. త్రవ్వడం
  6. స్ట్రాతో పానీయాన్ని తాగడం
  7. డస్టరుతో నల్లబల్లపై అక్షరాలను చెరపడం
  8. ఇల్లు ఊడ్చటం
  9. కొండరాళ్ళు కొట్టడం
  10. స్నానం చేయడం
  11. ఆటలు ఆడడం

కృత్యం – 6

6. పనిచేసేటప్పుడు ఏదేని కండరంలోని మార్పును పరిశీలించుట :
బంతిని విసిరినపుడు కండరంలోని మార్పును పరిశీలించి వ్రాయండి.
జవాబు:
బంతిని విసురుతున్నపుడు ఛాతి, భుజం ముందు భాగంలోని కండరాలు వ్యాకోచించి మన చేతిని ముందుకు లాగితే, భుజం వెనుక భాగంలోని కండరాలు సంకోచించి మన కదలికని నియంత్రిస్తాయి.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

కృత్యం – 7

7. వివిధ తలాలపై బంతి గమనాన్ని పరిశీలించుట :

కార్పెట్, గరుకుతలం, నున్నటి తలాలపై బంతి గమనాన్ని పరిశీలించి, బంతి గమనాన్ని ఏ తలం ఎక్కువగా నిరోధించునో, ఏ తలం తక్కువగా నిరోధించునో పరిశీలించి తెల్పండి.
జవాబు:

  1. కార్పెట్, గరుకు తలం మరియు నున్నటి తలాలపై ఒకే బలం ఉపయోగించి ఒక బంతిని కదిలేటట్లు చేసినాను.
  2. కార్పెట్ తలంపై బంతి తక్కువ దూరం ప్రయాణించినది.
  3. కార్పెట్ కంటె గరుకు తలంపై బంతి ఎక్కువ దూరం ప్రయాణించినది.
  4. కార్పెట్, గరుకు తలాల కంటె నున్నటి తలంపై బంతి ఎక్కువ దూరం ప్రయాణించింది.
  5. బంతి చలనాన్ని నిరోధించే క్రమము : కార్పెట్ తలం > గరుకుతలం > నున్నటి తలం
  6. బంతి కదిలిన దూరాల క్రమం : కార్పెట్ తలం – గరుకు తలం < నున్నటి తలం.

కృత్యం – 8

8. వాలుతలంపై వస్తువుల చలనాన్ని పరిశీలించుట :

ఒక ట్రేని తీసుకోండి. దానిమీద ఒక చివర అంచు దగ్గర చిన్న మంచు ముక్కను, ఎరేజర్ (రబ్బరు)ను మరియు ఒక రూపాయి బిళ్ళను ఒకే వరుసలో పెట్టండి. ఇపుడు ప్రక్క పటంలో చూపిన విధంగా ట్రేను అదే చివర పట్టుకొని నెమ్మదిగా పైకి ఎత్తి పరిశీలించండి.

ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 20

ఎ) ఈ మూడు వస్తువులలో ఏది మొదట కిందికి జారడం ప్రారంభించింది?
జవాబు:
ఈ మూడు వస్తువులలో మొదట జారిన వస్తువు మంచు ముక్క.

బి) అన్ని వస్తువులకు ఒకే పరిమాణంలో ఘర్షణ పనిచేస్తుందా?
జవాబు:
అన్ని వస్తువులకు ఘర్షణ, పరిమాణం వేరువేరుగా ఉన్నాయి.

సి) ఏ వస్తువుపై ఘర్షణ బలం ఎక్కువ? ఏ వస్తువుపై ఘర్షణ బలం తక్కువ?
జవాబు:
ఎరేజరు ఘర్షణ బలం ఎక్కువ. మంచు ముక్కకు ఘర్షణ బలం తక్కువ.

డి) ఈ మూడు వస్తువుల ఘర్షణ బలాల క్రమాన్ని వ్రాయండి.
జవాబు:
ఈ మూడు వస్తువుల ఘర్షణ బలాల క్రమం : ఎరేజర్ > రూపాయి బిళ్ళ > మంచు ముక్క

ప్రయోగశాల కృత్యం

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 21
9. ఉద్దేశ్యం : దారం భరించగలిగే గరిష్ఠ బలాన్ని కనుగొనుట.
కావలసిన పరికరాలు : స్ప్రింగ్ త్రాసు, భారాలు, తేలిక దారాలు, భారాలు తగిలించే కొక్కెం (వెయిట్ హేంగర్)

నిర్వహణ పద్ధతి :
i) పరికరాలని పటంలో చూపిన విధంగా అమర్చండి.
ii) 50గ్రా.ల భారాన్ని వెయిట్ హేంగర్ కి వేలాడదీసి, స్ప్రింగ్ త్రాసులో రీడింగ్ గమనించండి.
iii) అలా దారం తెగిపోయేంత వరకు కొద్ది కొద్దిగా భారాలు పెంచుతూ స్ప్రింగ్ త్రాసులో రీడింగులు గమనిస్తూ ఉండండి.
iv) దారం తెగే దగ్గర రీడింగును గుర్తించండి.
v) వివిధ రకాల దారాలను ఉపయోగించి, అవి భరించగలిగే గరిష్టబలము యొక్క విలువలను క్రింది పట్టికలో నమోదు చేయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 22
vi) ఈ మొత్తం వ్యవస్థని (అమరికని) సీలింగ్ నుంచి వేరుపరచి, మరల దారానికి భారాన్ని తగిలించే కొక్కెంను అమర్చి హేంగర్ పై తక్కువ భారం ఉండేలా చూసుకుని, చేతితో నెమ్మదిగా పైకి లేపండి.
vii) అలా పైకి ఎత్తుతున్నప్పుడు స్ప్రింగ్ త్రాసు రీడింగును గమనించండి.

అలాగే మెల్లగా కిందికి దించుతూ స్ప్రింగ్ త్రాసు రీడింగును గమనించండి.

ఎ) పైకి ఎత్తేటప్పుడు, కిందికి దించేటప్పుడు మీరు గమనించిన స్ప్రింగ్ త్రాసు రీడింగులను బట్టి మీరు ఏం చెప్పగలరు?
జవాబు:
స్ప్రింగ్ త్రాసులోని రీడింగులను బట్టి వేరొక బల ప్రభావం ఈ వ్యవస్థపై ఉందని తెలుస్తోంది.

బి) ఒక్కసారిగా మొత్తం అమరికని వేగంగా పైకి లేపితే దారం తెగిపోయిందా?
జవాబు:
ఒక్కసారిగా మొత్తం అమరికని వేగంగా, పైకిలేపితే దారం ఒక్కొక్కసారి తెగవచ్చు లేదా తెగకపోవచ్చు.

కృత్యం – 9

10. టేబుల్ పై ఫలితబలం ప్రభావం :

ఒక టేబుల్ ను ఇద్దరు విద్యార్థులు కింద పటంలో చూపిన విధంగా నెట్టుచున్నారు. ఆ పటాలను పరిశీలించి పటాల కింద గల ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 23 AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 24 AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 25

ఎ) పటం -1 లో చూపిన విధంగా బరువైన టేబుల్ ను నెట్టడానికి ప్రయత్నించండి. కష్టంగా ఉంటుందా? సులభంగా ఉంటుందా?
జవాబు:
కష్టంగా ఉంటుంది.

బి) పటం – 3 లో టేబుల్ ఏ దిశలో కదిలింది?
జవాబు:
ఇద్దరు విద్యార్థుల బలం ప్రయోగించిన దిశలో కదిలింది.

సి) పటంలో – 3లో చూపిన విధంగా టేబుల్ ని ఇద్దరు విద్యార్థులు ఒకే వైపు నుండి నెట్టినారు. ఇపుడు సులభంగా ఉందా? ఉంటే ఏమిటి?
జవాబు:
సులభంగా కదిలింది. ఎందుకంటే ఇద్దరి బలాలు ఒకే దిశలో పనిచేయడం వల్ల, ఫలిత బలం పెరిగి ఆ టేబుల్ సులభంగా కదిలింది.

డి) పటం – 2లో చూపిన విధంగా విద్యార్థులు బలాన్ని ప్రయోగించినపుడు ఒకవేళ టేబులు కదలలేదు. ఎందుకు కదలలేదో వివరించండి.
జవాబు:
ఇద్దరు విద్యార్థులు రెండు వైపుల నుండి (వ్యతిరేక దిశలో) నెడుతున్నప్పుడు ఇద్దరి బలపరిమాణం సమానంగా ఉంటే ఫలితబలం శూన్యం అగును కాబట్టి,టేబులు కదలదు.

ఇ) పటం – 2 లో చూపిన విధంగా విద్యార్థులు బలాన్ని ప్రయోగించినపుడు ఒకవేళ టేబులు కదిలినది. ఎందుకు కదిలినదో వివరించండి. ఏ దిశలో కదులనో తెల్పుము.
జవాబు:
ఇద్దరు విద్యార్థులు రెండు వైపుల నుండి (వ్యతిరేక దిశలో) నెడుతున్నప్పుడు ఇద్దరి బలపరిమాణాలు సమానంగా లేకుంటే ఫలిత బలం శూన్యం కాదు కాబట్టి టేబులు కదులును. ఏ విద్యార్థి బలం పరిమాణం ఎక్కువ ఉన్నదో ఆ విద్యార్థి ప్రయోగించిన బలదిశలో టేబులు కదులుతుంది.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

కృత్యం – 10

11. చేతివేళ్ళపై సాగదీసిన రబ్బరుబ్యాండు ప్రభావం :

ఒక రబ్బరు బ్యాండుని తీసుకొని మీ చేతివేళ్ళతో సాగదీయండి. ఇలా సాగదీస్తున్నప్పుడు రబ్బరు బ్యాండు మీ వేళ్ళపై కలుగజేసే బలాన్ని మీరు అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. ఇప్పుడు అలాంటిదే ఇంకొక రబ్బరు బ్యాండుని తీసుకుని, రెండింటిని కలిపి ఒకే పొడవుకి సాగదీయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 26

ఎ) ఏం గమనించారు? ముందుకన్నా ఇప్పుడు మీ వేళ్ళపై కలుగజేయబడిన బలం అధికంగా ఉందా?
జవాబు:
ముందుకన్నా ఇప్పుడు వేళ్లపై కలుగజేయబడిన బలం అధికంగా ఉంది.

బి) ఇలాగే రబ్బరు బ్యాండ్ల సంఖ్య పెంచుతూ, అవి మీ వేళ్ళపై కలుగజేసే బలాన్ని పరిశీలించండి.
జవాబు:
రబ్బరు బ్యాండ్ల సంఖ్య పెరిగేకొలదీ అవి వేళ్ళపై కలుగజేసే బలం పెరుగుతుంది.

కృత్యం – 11

12. వస్తువు చలనదిశపై, స్థితిపై బల ప్రభావం : –
మీ పాఠశాలలో ఆటల పీరియడ్ నందు మైదానంలో ఫుట్ బాల్ ఆడినపుడు ఫుట్ బాల్ ను వివిధ రకాలుగా తన్నే ఉంటారు. ఫుట్ బాల్ ను తన్నినపుడు బాల్ గమనంలో జరిగే మార్పులను మీరు పరిశీలించిన వాటిని వ్రాయండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 27
నేను ఫుట్ బాల్ ఆట ఆడినపుడు బాల్ లో కనిపించిన మార్పులు

  1. ఫుట్ బాల్ ను తన్నినపుడు బలప్రయోగం వల్ల నిశ్చల స్థితిలోని బాల్ గమన స్థితిలోకి మారినది.
  2. గమనస్థితి గల బాల్ పై బలప్రయోగం వల్ల వడిని పెంచవచ్చును.
  3. గమనస్థితిలో గల బాల్ పై బల ప్రయోగం వల్ల వడిని తగ్గించవచ్చును.
  4. గమన స్థితిలో గల బాల్ పై బల ప్రయోగం వల్ల గమన దిశను మార్చవచ్చును.
  5. గమన స్థితిలో గల బాల్ ను బల ప్రయోగం వల్ల నిశ్చల స్థితికి తీసుకు రావచ్చును.

కృత్యం – 12

13. వస్తువు దిశని మార్చడంలో ఫలితబల ప్రభావం :

ఒక కేరమ్ బోర్డు కాయిన్ ను స్టైకర్ తో కొట్టండి. మీ స్నేహితులని కూడా అలాగే కొట్టమని చెప్పండి. మీరు కొట్టిన ప్రతీసారీ కాయిన్ ఒకే దిశలో కదులుతుందా? లేదా? ఎందుకు? ఈ ఆటలో మీరు పరిశీలించిన పరిశీలనలను వ్రాయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 28
జవాబు:

  1. ప్రతి సందర్భంలో కాయిన్ కదిలే దిశ మారుతుంది.
  2. కేరమ్ కాయినను స్టెతో కొట్టినప్పుడు కాయితో పాటు స్ట్రైకర్ కూడా దిశని మార్చుకుంటుంది.
  3. కాయిన్ లేదా స్ట్రైకర్ దిశ మారుతుంది. ఎందుకంటే ఫలిత బలం దిశలో కాయిన్ లేదా స్ట్రైకర్ కదులుట వలన.

కేరమ్ బోర్డ్ ఆటలో పరిశీలించిన పరిశీలనలు :

  1. ఫలిత బలం నిశ్చల స్థితిలో ఉండే కాయిన్లను గమనస్థితిలోకి మారుస్తుంది.
  2. ఫలిత బలం గమనస్థితిలో ఉండే స్ట్రైకర్ ను నిశ్చల స్థితిలోకి మారుస్తుంది.
  3. ఫలిత బలం స్ట్రైకర్ వడిని, దిశను మారుస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

కృత్యం – 13

14. వస్తువు ఆకారంపై బలం ప్రభావం :

ఈ క్రింది పట్టిక మొదటి వరుసలో ఇచ్చిన వివిధ సందర్భాలు వస్తువుపై బలం ప్రయోగించడానికి ముందు, బలం ప్రయోగించిన తర్వాత వస్తువు యొక్క ఆకారంలో మార్పు గమనించండి. ఆయా వస్తువు ఆకృతి తాత్కాలికంగా మారిందో, శాశ్వతంగా మారిందో గుర్తించి పట్టికలో నింపండి. తాత్కాలిక మార్పును “T’ తో, శాశ్వత మార్పును ‘P’తో సూచించండి.
జవాబు:

బలం ప్రయోగించు సందర్భం ఆకారంలో మార్పు (తాత్కాలికం (1), శాశ్వతం(P))
రబ్బరు బ్యాండును సాగదీయడం T
స్పాంజ్ ని పిండటం T
కాగితాన్ని చింపడం P
ప్లాస్టిక్ బాటిల్ ని / గ్లాసును నలిపివేయడం P
రొట్టె చేయడం P
అద్దాన్ని పగలగొట్టడం P

కృత్యం -14

15. స్పర్శాతల వైశాల్యాన్ని బట్టి బల ప్రభావంలో మార్పు :

ఒక పెన్సిల్ ను తీసుకుని, పెన్సిల్ యొక్క వెనుకవైపు గుండ్రని చివరతో మీ అరచేతిపై నొక్కండి. తరవాత పెన్సిల్ యొక్క ముందువైపు అంటే మొనదేలి ఉన్న వైపు నుంచి మీ అరచేతిపై గుచ్చండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 29

ఈ రెండు సందర్భాలలో మీరు పొందిన అనుభూతిలో తేడా ఏమైనా ఉందా? ఎందుకు?
జవాబు:

  1. ఈ రెండు సందర్భాలలో మనము పొందే అనుభూతి తేడాగా ఉంటుంది. మొనదేలి ఉన్నవైపున గుచ్చుకొన్నట్లుగా ఉంటుంది. ఎందుకనగా పెన్సిల్ వెనకవైపు వైశాల్యము ఎక్కువ కనుక చేతిపై పీడనము తక్కువగా ఉంటుంది.
  2. పెన్సిల్ మొనదేలి ఉన్నవైపు వైశాల్యము తక్కువగా ఉంటుంది కనుక పీడనము ఎక్కువగా ఉంటుంది.

కృత్యం – 15

16. బలం ప్రభావాన్ని గుర్తించుట :

రెండు ట్రేలు తీసుకుని వాటిని పొడి సున్నంతో లేదా మెత్తని ఇసుకతో నింపండి. ఒకే ఆకారం, ఒకే ద్రవ్యరాశి గల రెండు ఇటుకలు తీసుకోండి. ప్రక్కపటంలో చూపిన విధంగా ఒక ఇటుకని మొదటి ట్రేలో నిలువుగా, రెండవ దానిని వేరొక ట్రేలో అడ్డంగా పెట్టండి. రెండు ఇటుకలు సున్నంలోకి ఒకే లోతుకి దిగాయా పరిశీలించి ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 30

ఎ) ఏ ట్రేలోని ఇటుక ఎక్కువ లోతు సున్నంలోకి దిగినది? కారణం ఏమిటి?
జవాబు:
మొదటి ట్రే (ఎ) లోని ఇటుక ఎక్కువ లోతు సున్నంలోకి దిగినది. కారణం, మొదటి ట్రేలో సున్నంపై తాకే నిలువుగా పెట్టిన ఇటుక యొక్క స్పర్శా వైశాల్యం తక్కువగా ఉండుట.

బి) ఏ ట్రేలోని ఇటుక తక్కువ లోతు సున్నంలోకి దిగినది? కారణం ఏమిటి?
జవాబు:
రెండవ ట్రే (బి) లోని ఇటుక తక్కువ లోతు సున్నంలోకి దిగినది. కారణం, రెండవ ట్రేలో సున్నంపై తాకే అడ్డంగా పెట్టిన ఇటుక యొక్క స్పర్శా వైశాల్యం ఎక్కువగా ఉండుట.

సి) ఈ కృత్యం వల్ల నీవు పరిశీలించినది ఏమిటి?
జవాబు:
ప్రయోగించిన బలం ఒకటే అయినప్పుడు తక్కువ స్పర్శా వైశాల్యం గల వస్తువు ఎక్కువ పీడనాన్ని కలుగజేస్తుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

SCERT AP 8th Class Biology Study Material Pdf 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 11th Lesson Questions and Answers మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

8th Class Biology 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
మీరు గత సంవత్సరం ఎన్నిసార్లు అస్వస్థతకు లోనైనారు ? మీరు ఏ ఏ వ్యాధులతో బాధపడ్డారు ?
(ఎ) పై వ్యాధులను నివారించడానికి మీరు రోజువారీగా ఏదైనా అలవాటును మార్చుకోగలరా ఆలోచించి రాయండి.
(బి) పై వ్యాధులు రాకుండా నివారించడానికి మీ పరిసరాలలో ఎటువంటి మార్పు తీసుకొని రావాలనుకుంటున్నారు ?
జవాబు:
నేను గత సంవత్సరం చాలాసార్లు అస్వస్థతకు లోనై విరేచనాలు, టైఫాయిడ్ జ్వరంతో బాధపడ్డాను.
(ఎ) ఆ వ్యాధులను నివారించడానికి నేను రోజూ ఒక గుడ్డు, ఆకుకూరలు తినుటకు అలవాటుపడ్డాను. అంతేకాక కాచి చల్లార్చిన నీటిని తాగుతున్నాను.
(బి) ఆ వ్యాధులు రాకుండా నివారించడానికి మా పరిసరాలలో ఈ కింది మార్పులు తీసుకురావాలని అనుకుంటున్నాను.
అవి :

  1. పరిసరాలు శుభ్రంగా ఉంచుట.
  2. ఆహార పదార్థాలపై ఎల్లప్పుడూ మూతలు ఉంచుట.
  3. వ్యర్థ పదార్థాలను చెత్తబుట్టలో వేయుట.
  4. రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేయుట.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 2.
డాక్టర్/నర్స్ / ఆరోగ్య కార్యకర్తలు అస్వస్థతతో ఉన్న రోగులతో ఎక్కువగా గడుపుతుంటారు. అయినా వారు అస్వస్థతకు ” గురికారు ఎందుకు ? ఆలోచించి రాయండి.
జవాబు:
డాక్టర్ / నర్స్ / ఆరోగ్య కార్యకర్తలు అస్వస్థతతో ఉన్న రోగులతో ఎక్కువగా గడుపుతుంటారు. అయినా అస్వస్థతకు గురికారు. ఎందుకంటే వారు ఆరోగ్య నియమాలు చక్కగా పాటిస్తారు. దీనివలన వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.

డాక్టర్ / నర్స్ / ఆరోగ్య కార్యకర్తలకు వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో తెలుసు కాబట్టి వారు కచ్చితంగా పరిశుభ్రత నియమాలు పాటిస్తారు. అంతేకాక అంటువ్యాధులకు చికిత్స చేసేటప్పుడు సరైన ఆరోగ్య రక్షణ సూత్రాలు పాటిస్తారు. పోషక ఆహారం ఎక్కువగా తీసుకుంటారు.

ప్రశ్న 3.
సాంక్రమిక (అంటువ్యాధులు), అసాంక్రమిక వ్యాధులకు మధ్య గల భేదాలను రాయండి.
జవాబు:

సాంక్రమిక వ్యాధులు అసాంక్రమిక వ్యాధులు
1. సూక్ష్మజీవుల వలన వచ్చే వ్యాధులను సాంక్రమిక వ్యాధులు అంటారు. 1. శరీర అంతర్భాగాలలో మార్పు వలన వచ్చే వ్యాధులను అసాంక్రమిక వ్యాధులు అంటారు.
2. ఈ వ్యాధులు గుర్తించటం తేలిక. 2. ఈ వ్యాధులు గుర్తించటం అంత తేలిక కాదు
3. శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి పై ఈ వ్యాధులు ఆధారపడును. 3. తీసుకొనే ఆహారం, ఒత్తిడి మొదలైన అంశాలు ప్రభావంపై ఆధారపడును.
4. మలేరియా, టైఫాయిడ్, గవదబిళ్ళలు మొదలైన వ్యాధులు. 4. అధిక రక్తపీడనం, స్థూలకాయత్వం, గుండెపోటు మొదలైన వ్యాధులు.

ప్రశ్న 4.
స్వల్పకాలిక వ్యాధులు ఎందుకు దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి ?
జవాబు:
స్వల్పకాలిక వ్యాధులకు తరచు గురి అవుతూ ఉన్నప్పుడు, స్వల్పకాలిక వ్యాధులను సరిగా గుర్తించలేనప్పుడు, స్వల్పకాలిక వ్యాధులను నిర్లక్ష్యం చేసినపుడు, స్వల్పకాలికంగా ఉన్నప్పుడు సరిగా చికిత్స చేయకపోయినప్పుడు దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి. ఉదా : ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 5.
ఒక బాలుడికి నెలక్రితం మశూచి వచ్చింది. ఇప్పుడు తగ్గింది. అతను మశూచి వచ్చిన పిల్లలతో కలసి ఉంటున్నాడు. అతనికి మశూచి మరలా వస్తుందా ! రాదా ! ఎందుకు ?
జవాబు:
ఒక బాలుడికి నెలక్రితం మశూచి వచ్చింది. ఇప్పుడు తగ్గింది. అతను మశూచి వచ్చిన పిల్లలతో ‘కలిసి ఉన్నా అతనికి మశూచి మరలా రాదు. ఎందుకు అంటే మన శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి వ్యాధి జనక జీవితో మొదటగా ప్రవేశించినప్పుడు ప్రత్యేకంగా పోరాడే శక్తిని కలిగి ఉంటుంది.

అది మొదటిగా వ్యాధి జనక క్రిములను గుర్తిస్తుంది. వాటిపై ప్రతిస్పందించి, జీవితాంతం వాటిని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటుంది. రెండవసారి అదే వ్యాధి జనక జీవి లేదా దానికి సంబంధించిన మరొక వ్యాధి జనక జీవి శరీరంలో ప్రవేశించినప్పుడు మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి చాలా బలంగా పోరాడి మొదటిసారి కంటే తొందరగా వ్యాధి జనక జీవులను శరీరం నుంచి తొలగిస్తుంది.

ప్రశ్న 6.
వ్యాధికి సంబంధించి సత్వర కారకాలు, దోహదపడే కారకాలు అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
ఏదైనా వ్యాధిని ఒక సూక్ష్మజీవి కలుగచేయును. అది ఆ వ్యాధి కలుగజేయుటకు కారణం కాబట్టి దానిని సత్వర కారకం అంటారు. ఆ సూక్ష్మజీవి ఆ వ్యక్తి శరీరంలో వ్యాధి పెంచుటకు కొన్ని కారకాలు అనగా అతనికి ఉన్న ఇతర శారీరక సమస్యలు కారణం అవుతాయి. వీటిని వ్యాధి దోహద కారకాలు అంటారు.

ఉదా : ఒక వ్యక్తికి శరీరంలో వ్యాధి జనక జీవుల వలన అతనికి పుండ్లు వచ్చినాయి. కానీ అతనికి చక్కెర వ్యాధి ఉంది. అప్పుడు పుండ్లు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. పుండ్లు రావడానికి కారణమైన వ్యాధి జనకజీవులు సత్వర కారకాలు అయితే, చక్కెర వ్యాధి పుండ్లు పెరుగుటకు దోహద కారకాలు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 7.
ఆరోగ్య కార్యకర్తను అడిగి వ్యాధి వ్యాప్తి గురించి తెలుసుకొనుటకు ప్రశ్నావళిని తయారుచేయండి.
జవాబు:
1. వ్యాధి వ్యాప్తి ఎన్ని రకాలుగా జరుగును ?
AP Board 8th Class Biology Solutions Chapter 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది 1
2. గజ్జి అనేది ప్రత్యక్ష తాకిడి వలన వ్యాపించును. అవును / కాదు
3. కలరా వ్యాధిని ఈగలు వ్యాప్తి చేస్తాయి. అవును / కాదు
4. గాలి ద్వారా కొన్ని వ్యాధులు వ్యాప్తి చెందును. అవును / కాదు
5. నీటి ద్వారా కొన్ని వ్యాధులు వ్యాప్తి చెందును. అవును / కాదు
6. వ్యా ధి వ్యాప్తి తెలుసుకొంటే నివారణ తేలిక. అవును / కాదు.

ప్రశ్న 8.
లీష్మేనియా, ట్రిపానోజోమా బొమ్మలు గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది 2

ప్రశ్న 9.
రాము మశూచి వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతరులకు వ్యాధి సోకకుండా ఉండటానికి రాముకు నీవిచ్చే సలహాలు ఏమిటి ?
జవాబు:
రాము మశూచి వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతరులకు ఆ వ్యాధి సోకకుండా ఉండటానికి రాముకు నేను ఇచ్చే సలహాలు :
1. ఇతరులకు రామును ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరంగా ఉంచుతాను. కారణం ఆరు అడుగుల లోపు ముఖాముఖిగా ఉంటే ఈ వ్యాధి వ్యాపించును.
2. శరీరం నుంచి విడుదల అయ్యే ద్రవాలు ఇతరులపై పడకుండా జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తాను.
3. అతను ఉపయోగించిన వస్తువులను, బట్టలను, మంచాన్ని ఇతరులతో కలవకుండా జాగ్రత్తగా ఉంచాలి.
4. మొదటి వారం రోజులు ఎక్కువగా వ్యాపించును కాబట్టి. అతనిని చాలా దూరంగా ఉంచాలి.
గమనిక : భారతదేశంలో ఉన్న రాము మశూచి వ్యాధితో బాధపడడు. కాబట్టి అతనికి నేను ఇచ్చే సలహాలు ఏమి ఉండవు. కారణం ప్రపంచం నుంచి ఈ వ్యాధి ఎప్పుడో సంపూర్ణంగా నిర్మూలించారు.

ప్రశ్న 10.
వ్యాధులను నిరోధించడంలో టీకాల పాత్రను ఎలా ప్రశంసిస్తావు ?
జవాబు:
వ్యాధులను నిరోధించడంలో టీకాల పాత్ర చాలా ఉంది. టీకాల వలన భారతదేశం నుండి మశూచి వ్యాధి పూర్తిగా నిర్మూలించాము. అదే విధంగా పిల్లలలో మరో భయంకరమైన వ్యాధి అయిన పోలియో వ్యాధి పూర్తిగా నిర్మూలించుటకు చర్యలు జరుగుతున్నాయి.

టీకాల వలన మాతా-శిశు రక్షణ జరుగుతున్నది. ఇటువంటి టీకాలను కనిపెట్టిన శాస్త్రవేత్త, జీవశాస్త్రం సాధించిన అభివృద్ధిని చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. దీని గురించి ‘టీకాల డే’ అని ఒక రోజు నేను సెలబ్రేట్ చేసి జీవశాస్త్రమునకు కృతజ్ఞత తెలుపుకొంటాను.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 11.
మీ ప్రాంతంలో సాధారణంగా ఉండే వ్యాధులను తెలుసుకోవడానికి సర్వే నిర్వహించండి. ఈ వ్యాధులు ప్రబలడానికి గల కారణాలను తెలుసుకుని మీ గ్రామపంచాయతీ / మున్సిపాలిటి వారికి వ్యాధులను నివారించటానికి మీరు ఏ సూచనలు చేస్తారు?
జవాబు:
మా ప్రాంతంలో సాధారణంగా ఉండే వ్యాధులను తెలుసుకోవడానికి సర్వే నిర్వహించాను. సర్వేలో ఎక్కువ వచ్చే వ్యాధులు డయేరియా, మలేరియా, డెంగ్యూ.

ఈ వ్యాధులు నివారించటానికి మా మున్సిపాలిటీకి ఇచ్చే సూచనలు :

  1. రక్షిత మంచినీటి సరఫరా చేయాలి.
  2. ఆరోగ్య కార్యకర్తల ద్వారా వ్యాధులు వచ్చే కాలం గురించి ముందుగా వివరించాలి.
  3. ఆ వ్యాధులు రావడానికి గల కారణాలు వివరించాలి.
  4. కాచి చల్లార్చిన నీటిని త్రాగమని మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలి.
  5. కలుషిత ఆహార పదార్థాలు తినవద్దని ప్రజలకు చెప్పాలి.
  6. చెత్తాచెదారాలను రోడ్డుపై వేయకుండా జాగ్రత్తగా వారు తీసుకువెళ్ళే బండిలో వేయాలని, దాని వలన కలుగు లాభాలు ముందుగా ప్రజలకు తెలియచేయాలి.
  7. దోమలు పెరగకుండా ఉండుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాలి.
  8. దోమకాటు నుండి కాపాడుకొనుటకు దోమతెరలను ఉపయోగించమని తెలియచేయాలి.
  9. వ్యాధి వచ్చిన వెంటనే చికిత్స చేయుటకు వీలుగా ఆసుపత్రిలో సిబ్బంది మరియు మందులు ఏర్పాటుచేయాలి.
  10. పరిసరాలు శుభ్రంగా ఉంచాలి.
    గమనిక : గ్రామపంచాయతి అయితే ఆ పేరు రాయాలి.

8th Class Biology 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? InText Questions and Answers

కృత్యములు

1. పరిశుభ్రమైన త్రాగే మంచినీటి సరఫరా కొరకు మీ ప్రాంతంలో (గ్రామ పంచాయతీ పరిధిలో కాని / పురపాలక సంఘాలు, కార్పొరేషన్ కాని) కల్పించబడిన సౌకర్యాలను తెలుసుకోండి.
జవాబు:
పరిశుభ్రమైన. తాగే మంచినీటి సరఫరా కొరకు మా ప్రాంతంలో గ్రామ పంచాయతీ పరిధిలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి వాటిని శుద్ధి చేసి రక్షిత మంచినీటిని పంపుల ద్వారా అన్ని ఇళ్లకు పంపులైన్ కనెక్షన్ల ద్వారా పంపిస్తారు. ఇంకా పంపు కనెక్షన్లు తీసుకోని వారి కొరకు గ్రామ పంచాయతి వీధి పంపులు ఏర్పాటుచేసింది.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

2. మీ ప్రాంతంలోని ప్రజలందరికీ ఈ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా ? ఎందుకు లేవో చర్చించండి.
జవాబు:
మా ప్రాంతంలోని ప్రజలందరికి ఈ సౌకర్యాలు అందుబాటులో లేవు. కారణాలు :
1. ప్రజలకు రక్షిత మంచినీటి పై సరైన అవగాహన లేకపోవటం.
2. కొత్తగా ఏర్పడిన ఇళ్లకు ప్రభుత్వం వారు వెంటనే పంపులైన్ కనెక్షన్ ఇవ్వకపోవటం. ప్రజలు ఇంకా నదులు, చెరువులపై మంచినీటి కోసం ఆధారపడి ఉండటం వలన.

3. (a) మీ పరిసరాలలో ఏర్పడే ఘనరూప వ్యర్థ పదార్థాలను మీ గ్రామపంచాయతి / మున్సిపాలిటీవారు ఎలా నిర్వహిస్తారో, తెలుసుకోండి.
జవాబు:
మా గ్రామ పంచాయతివారు మా పరిసరాలలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను సేకరించుటకు కొంతమంది ఉద్యోగులను ఏర్పాటుచేసుకున్నారు. వారు ప్రతిరోజూ బండిలో ఘనరూప వ్యర్థ పదార్థాలను ఇంటికి వచ్చి తీసుకువెళ్తారు. రోడ్లపై చెత్త – కుండీలను ఏర్పాటుచేశారు.

(b) వారు తీసుకొనే చర్యలు సరిపోతాయా ?
జవాబు:
వారు తీసుకొనే చర్యలు సరిపోవు.

(c) వాటిని మెరుగుపరచటానికి మీరిచ్చే సూచనలేవి ?
జవాబు:
1. వాటిని మెరుగుపరచటానికి ప్రతిరోజూ ఇళ్లకు రెండుసార్లు వచ్చి చెత్తను తీసుకువెళ్లే ఏర్పాటుచేయాలి.
2. ప్రతిరోజూ చెత్త కుండీలలోని చెత్త తీసివేయాలి.
3. ఘనరూపంలో ఉన్న పొడి, తడి చెత్తను వేరు వేరుగా సేకరించే ఏర్పాటుచేయాలి.

(d) ఒక వారంలో ఏర్పడే ఘనరూప చెత్తను తగ్గించడానికి మీ కుటుంబ సభ్యులు ఎటువంటి కింది చర్యలు తీసుకుంటారు?
జవాబు:
ఒక వారంలో ఏర్పడే ఘనరూప చెత్తను తగ్గించడానికి మా కుటుంబ సభ్యులు ఈ కింది చర్యలు తీసుకుంటారు.

  1. పాలిథీన్ కవర్ల వాడకం తగ్గిస్తారు.
  2. కూరగాయలు, వాటి తొక్కులు, మినప పొట్టు మొ||నవి దగ్గరలో ఉన్న పశువులకు వేస్తారు.
  3. ఆహార పదార్థాలు ఎక్కువ వృథా చేయరు.
  4. పునర్వినియోగించే పదార్థాలను ప్రోత్సహిస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

4. ఐదుమంది చొప్పున జట్లుగా ఏర్పడండి. మీకు తెలిసిన వ్యాధుల జాబితా రాయండి. ఏ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో జట్లలో చర్చించి రాయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది 3

5. మీ చుట్టుప్రక్కల ఉన్న కొన్ని కుటుంబాలను సర్వే చేసి ఈ కింది విషయాలను కనుక్కోండి.

(a) గత మూడు నెలల్లో ఎంతమంది స్వల్పకాలిక వ్యాధులకు లోనయ్యారు ?
జవాబు:
6 నుంచి 10 మంది.

(b) అదే కాలంలో ఎంతమంది దీర్ఘకాలిక వ్యాధికి గురయ్యారు ?
జవాబు:
ఒకరిద్దరు.

(c) మొత్తంగా ఎంతమంది ఈ వ్యాధులకు గురైనారు ?
జవాబు:
7 నుంచి 12 మంది వరకు

(d) aవ ప్రశ్న మరియు 6వ ప్రశ్న యొక్క జవాబులు ఒకేలా ఉన్నాయా ?
జవాబు:
లేవు.

(e) bవ ప్రశ్న మరియు Cవ ప్రశ్న యొక్క జవాబులు ఏ విధంగా వేరుగా ఉన్నాయి ?
జవాబు:
b ప్రశ్నకు జవాబు దీర్ఘకాలిక వ్యాధికి గురి అయిన వారి సంఖ్యను తెలియచేయును. c ప్రశ్నకు జవాబు స్వల్ప మరియు దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారి సంఖ్యను తెలియచేయును.

(f) జవాబులు వేరు వేరుగా ఎందుకున్నాయి ? ఈ విధమైన వ్యాధులు సాధారణ మానవునిపై ఎటువంటి ప్రభావం చూపుతాయి?
జవాబు:
కారణం ఇవ ప్రశ్న స్వల్పకాలిక వ్యాధులు, bవ ప్రశ్న దీర్ఘకాలిక వ్యాధులు. స్వల్పకాలిక వ్యాధుల వలన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినదు. తిరిగి కోలుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధుల వలన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

6.

(a) మీ తరగతిలో ఎంతమంది జలుబు / దగ్గు / జ్వరంతో బాధపడుతున్నారో తెలుసుకోండి.
జవాబు:
20 నుంచి 30 మంది

(b) ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు.?
జవాబు:
3 నుంచి 4 రోజులు

(c) యాంటీబయోటిక్స్ ఎంతమంది తీసుకుంటున్నారు ? (మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి.)
జవాబు:
ఒక 20 మంది.

(d) యాంటీబయోటిక్స్ తీసుకొన్న తరువాత కూడా ఎన్ని రోజులు అస్వస్థులుగా ఉన్నారు ?
జవాబు:
2 నుంచి 3 రోజులు.

(e) యాంటీబయోటిక్స్ తీసుకోని వారు ఎన్ని రోజులు జలుబుతో బాధపడ్డారు ?
జవాబు:
4 నుంచి 7 రోజులు.

(f) రెండు గ్రూక్స్ మధ్య తేడా ఏమిటి ?
జవాబు:
రెండు గ్రూప్ ల మధ్య తేడా లేదు.

(g) తేడా ఉంటే ఎందుకు ? లేకపోతే ఎందుకో చెప్పండి.
జవాబు:
జలుబు అనేది వైరసకు సంబంధించిన వ్యాధి. వైరస్ వ్యాధులకు యాంటీబయోటిక్స్ వేసుకున్నప్పటికీ అవి వ్యాధి. తీవ్రతను కాని, వ్యాధి వ్యవధిని కాని తగ్గించవు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

7. మీ పరిసరాలలో ఆర్థికంగా బాగా ఉన్న పది కుటుంబాలు మరియు ఆర్థికంగా వెనుకబడిన పది కుటుంబాలపై సర్వే నిర్వహించండి.
జవాబు:
ప్రతి కుటుంబంలో 5 సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉండేలా చూడండి. ఈ పిల్లల ఎత్తును కొలవండి. వయస్సుకు తగిన ఎత్తును సూచించే గ్రాఫ్ గీయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది 4

(a) రెండు గ్రూపులలో ఏమైనా తేడా ఉందా ? ఉంటే ఎందుకుంది ?
జవాబు:
రెండు గ్రూపులలో తేడా ఉంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలో పిల్లలు వయస్సుకు తగిన ఎత్తు లేరు. కారణం వారికి పోషకాహార లోపం, వ్యాధులు ఎక్కువగా రావటం, పరిశుభ్రత లోపం మొదలైనవి.

(b) తేడాలు ఏమీ లేవా ? దీనిని బట్టి ఆర్థికంగా బాగా ఉన్నవాళ్లకి, బీదవాళ్లకి ఆరోగ్యంలో వ్యత్యాసం లేదనుకుంటున్నారా?
జవాబు:
ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళకి, బీదవాళ్లకి ఆరోగ్యంలో వ్యత్యాసం పోషకాహార లోపం వలన ఉంటుంది.

8. పిచ్చి కుక్క లేదా ఇతర వ్యాధిగ్రస్థ జంతువులు కాటేసినప్పుడు ‘ర్యాబిస్’ వైరస్ వ్యాప్తి చెందుతుంది. జంతువులకు, మానవులకు యాంటి ర్యాబిస్ వ్యాక్సిన్ మందు అందుబాటులో ఉంది. మీ పరిసరాలలో ‘ర్యాబిస్’ వ్యాధిని నివారించడానికి గ్రామ పంచాయతి / మున్సిపాలిటీ వారు తీసుకున్న చర్యలు మరియు కార్యాచరణ ప్రణాళిక ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ చర్యలు సరిపోతాయా ? సరిపోకపోతే మెరుగుపరచే చర్యలకు మీరిచ్చే సూచనలేమిటి ?
జవాబు:
మా పరిసరాలలో ర్యాబిస్ వ్యాధిని నివారించడానికి మున్సిపాలిటీవారు తీసుకున్న చర్యలు మరియు కార్యాచరణ ప్రణాళిక.

  1. ఏ కుక్క కరిచినా ర్యాబిస్ వ్యాధి టీకాను వెంటనే తీసుకోమని ప్రచారం చేయుట.
  2. ర్యాబిస్ వ్యాధి వ్యాక్సిన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంచుట.
  3. వీధి కుక్కల జనాభాను తగ్గించుట.
  4. కుక్కలకు ముందుగా ఇంజక్షన్లు చేయుట. పైన చెప్పిన చర్యలు సరిపోవు.

మెరుగుపరుచుటకు సూచనలు :

  1. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయుట.
  2. వీధి కుక్కలు అన్నింటికీ టీకాలు వేయించుట.
  3. పిచ్చి వచ్చిన కుక్కలను వెంటనే ప్రత్యేకమైన ప్రదేశాలలో ఉంచి మిగతా వాటికి వ్యాధి రాకుండా చూచుట.
  4. వ్యాధి వచ్చిన కుక్కలను దూరంగా ఉంచి చికిత్స చేయుట.
  5. వ్యాధితో చనిపోయిన కుక్కలను జాగ్రత్తగా ఎవరూ వెళ్లని ప్రదేశాలలో పాతి పెట్టుట.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

పాఠ్యాంశములోని ప్రశ్నలు

1. మీ గ్రామపంచాయితీ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ గోడల మీద రాసిన ఆరోగ్య సూత్రాలు తెలపండి. (పేజీ.నెం. 177)
జవాబు:

  1. కాచి చల్లార్చిన నీటిని త్రాగండి.
  2. ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా గిన్నెలపైన మూతలు పెట్టండి.
  3. దోమకాటు నుండి కాపాడుకోవడానికి దోమతెరలను ఉపయోగించండి.
  4. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి.
  5. చుట్టు ప్రక్కల నీరు నిల్వ ఉండకుండా చూడండి.
  6. వండే ముందు కూరగాయలను శుభ్రంగా కడగండి.
  7. ఆరుబయట మలవిసర్జన చేయకండి. టాయిలెట్లు ఉపయోగించండి.
  8. వేడిగా ఉన్న ఆహారం మాత్రమే తినండి.
  9. భోజనం మరియు టాయిలెట్‌కు ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోండి.

2. ఆరోగ్య అలవాట్లు, జాగ్రత్తల సూచనల వలన మనకేమి తెలుస్తుంది ? (పేజీ.నెం. 177)
జవాబు:
ఆరోగ్య అలవాట్లు, జాగ్రత్తల సూచనల వలన మనం ఆరోగ్య నియమాలు, జాగ్రత్తలు పాటించాలని తెలుస్తుంది.

3. ఈ సూచనలు పాటించని వాళ్లకు ఏమవుతుంది ? (పేజీ.నెం. 177)
జవాబు:
అనారోగ్యం కలుగును.

4. మనకు దోమలు ఏ కాలంలో ఎక్కువగా కనబడతాయి ? మనపై అవి ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి ? (పేజీ.నెం. 177)
జవాబు:
మనకు దోమలు ఎక్కువగా వర్షాకాలం, శీతాకాలంలో కనబడును. అవి మనపై చాలా రకాల వ్యాధులు కలుగచేయును.
ఉదా : మలేరియా, చికున్ గున్యా, డెంగ్యూ, ఫైలేరియా.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

5. కాచి చల్లార్చిన నీరు త్రాగడం వలన, ఈగలు ఆహార పదార్థాల మీద వాలకుండా చూడటం, దోమకాటు బారిన పడకుండా నివారించగలిగితే మనము ఆరోగ్యంగా ఉంటాం. అసలు ఆరోగ్యం అంటే ఏమిటి ? మనమెందుకు అనారోగ్యం పాలవుతాం? (పేజీ.నెం. 177)
జవాబు:
శారీరకంగా, మానసికంగా, సామాజికంగా బాగా పనిచేయడమే ఆరోగ్యం అంటారు. మనమెందుకు అనారోగ్యం పాలవుతామంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోవటం వలన, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవటం వలన, ఆరోగ్య నియమాలు పాటించకపోవటం వలన, వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వలన, ఒత్తిడి, మానసిక ఆందోళనల వలన.

6. మంచి ఆరోగ్యానికి కావల్సిన పరిస్థితులు, వ్యాధి రహితంగా ఉండటానికి కావల్సిన పరిస్థితులు ఒకే రకంగా సమాధానాలు . ఉంటాయా ? వేరు వేరుగా ఉంటాయా ? ఎందుకు ? (పేజీ.నెం. 179)
జవాబు:
మంచి ఆరోగ్యానికి కావల్సిన పరిస్థితులు, వ్యాధి రహితంగా ఉండటానికి కావల్సిన పరిస్థితులు వేరు వేరుగా ఉంటాయి. కారణం ఆరోగ్యం, వ్యాధి రహితం వేరు వేరు కాబట్టి.

ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు సమాజం గురించి, ప్రజల గురించి కూడా మాట్లాడతాం. వ్యాధి గురించి మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా బాధపడే వ్యక్తులను గురించి మాత్రమే మాట్లాడతాం.

7. వ్యాధి రహితంగా ఉండటానికి కావల్సిన రెండు పరిస్థితులను వివరించండి. (పేజీ.నెం. 179)
జవాబు:
వ్యాధి రహితంగా ఉండటానికి కావల్సిన రెండు పరిస్థితులు :
1. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం : దీని వలన ఎటువంటి వ్యాధి జనక జీవులు పరిసరాలలో పెరగవు. అందువలన అందరూ వ్యాధి రహితంగా ఉంటారు.
2. వ్యాధిని సరిగా గుర్తించుట : వ్యాధిని సరిగా గుర్తించుట వలన సరైన చికిత్స చేసి వ్యాధి రహితంగా చేయవచ్చు మరియు టీకాలు వేసి వ్యాధిని నివారించవచ్చు.

8. అస్వస్థతకు గురైన వ్యక్తి నుండి అన్ని రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయా ? ఇలా వ్యాప్తి చెందని వ్యాధులేమైనా ఉన్నాయా ? అవి ఏమిటి ? (పేజీ.నెం. 181)
జవాబు:
అస్వస్థతకు గురైన వ్యక్తి నుండి అన్ని రకాలుగా వ్యాధులు వ్యాప్తి చెందవు. అస్వస్థతకు గురైన వ్యక్తి నుండి వ్యాప్తి చెందని వ్యాధులు ఉన్నాయి. అవి అసాంక్రమిక వ్యాధులు.
ఉదా : బి.పి., డయాబెటిస్, గుండెపోటు.

9. అస్వస్థతకు గురైన వ్యక్తిని తాకకున్నా కూడా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి ? (పేజీ.నెం. 181)
జవాబు:
అస్వస్థతకు గురైన వ్యక్తిని తాకకున్నా కూడా వ్యాప్తి చెందే వ్యాధులు : కలరా, టైఫాయిడ్, ధనుర్వాతం, క్షయ, మలేరియా.

10. సాంక్రమిక జీవుల నుండి వ్యాప్తి చెందని వ్యాధులు ఏవి ? (పేజీ.నెం. 181)
జవాబు:
సాంక్రమిక జీవుల నుండి వ్యాప్తి చెందని వ్యాధులు అసాంక్రమిక వ్యాధులు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

11. నీకు అస్వస్థతగా అనిపించి డాక్టర్ దగ్గరకు వెళ్ళాలనుకునే ఏవైనా-3 కారణాలు తెలపండి. నీవు తెలిపిన మూడు కారణాలలో ఏదో ఒక లక్షణం మాత్రమే నీలో కన్పిస్తే నీవు డాక్టరు వద్దకు వెళ్లాలనుకుంటావా ? ఎందుకు ? (పేజీ.నెం. 182)
జవాబు:
నాకు అస్వస్థతగా అనిపించి డాక్టరు దగ్గరకు వెళ్ళాలనుకునే 3 కారణాలు : (1) జలుబు (2) దగ్గు (3) జ్వరం వీటిలో ఏ ఒక్క కారణం కనిపించినా డాక్టరు వద్దకు వెళ్తాను. ఎందుకంటే – మందుల్ని మన ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే స్వల్పకాలిక వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి.

12. ఈ క్రింది వానిలో ఏ సందర్భం నీ ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశముంది ?
1. కామెర్ల వ్యాధి సోకిన సందర్భంగా
2. నీ తలలో పేలు ఎక్కువగా ఉన్నప్పుడు
3. నీ ముఖంపై మచ్చలు ఏర్పడినపుడు (పేజీ.నెం.184)
జవాబు:
కామెర్ల వ్యాధి సోకిన సందర్భంగా ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశముంది. ఈ వ్యాధిలో కాలేయం దెబ్బతినుట వలన జీర్ణశక్తి మందగించి, రోగి నీరసపడతాడు. కాలేయ, జీర్ణ వ్యవస్థలు పునరుద్ధరించబడటానికి సమయం పడుతుంది. ఒక్కొక్క మార్పు ఇది ప్రాణాంతకంగా కూడ పరిణమించవచ్చు.

13. వ్యాధి ఎలా వ్యాప్తి చెందును ? (పేజీ.నెం. 184)
జవాబు:
వ్యాధి జనక జీవులు వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి నుండి ఇతర వ్యక్తులకు వివిధ మార్గాల ద్వారా వ్యాప్తి చెందును. అవి :

  1. ప్రత్యక్ష తాకిడి
  2. గాలి ద్వారా
  3. నీరు, ఆహారం ద్వారా
  4. జంతువుల ద్వారా

14. వాహకాలు అనగానేమి ? (పేజీ.నెం. 184)
జవాబు:
వ్యాధి జనక జీవులు ఉన్నప్పటికి వ్యాధికి గురికాని జీవులను వాహకాలు అంటారు. వ్యాధులను ఒకరి నుండి మరొకరి
వ్యాప్తి చేయు జీవులు.

15. వ్యాధులను నివారించే విధానాల గురించి వ్రాయుము. (పేజీ.నెం. 184)
జవాబు:
వ్యాధులను నివారించే విధానాలు రెండు.
1. సర్వసాధారణమైనది
2. ప్రతి వ్యాధికి ప్రత్యేకమైనది.
సాధారణ నివారణ సూత్రాన్ని పాటించి వ్యాధి వ్యాప్తిని నిరోధించడం సర్వసాధారణమైన అంశం.

దానికి ఈ కింది నియమాలు పాటించాలి.

  1. గాలి వలన వ్యాప్తి చెందే వ్యాధి జనకాల వ్యాప్తిని నిరోధించడానికి ఎక్కువ జనాభా లేని ప్రదేశాలలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశాలలో నివసించే ఏర్పాటు చేయటం.
  2. నీటి ద్వారా వ్యాధులను నివారించుటకు రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు.
  3. పరిశుభ్రమైన వాతావరణం కల్పించినట్లయితే వ్యాధి వాహకాల నుండి విముక్తి.
  4. వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుకొనుట. ప్రత్యేకమైన నివారణ పద్ధతిలో వ్యాధి జనక జీవులతో పోరాడే వ్యాధి నిరోధక లక్షణాన్ని కలిగి ఉండటమే.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

16. మనం అస్వస్టులుగా ఉన్నప్పుడు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు ఎందుకు తీసుకుంటారు ? (పేజీ.నెం. 189)
జవాబు:
వ్యాధి నిరోధక శక్తి పెరుగుటకు.

17. వివిధ పద్ధతుల ద్వారా వ్యాధి వ్యాప్తి ఎలా జరుగుతుంది ? (పేజీ.నెం. 189)
జవాబు:
వ్యాధి జనక జీవులు వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి నుండి ఇతర వ్యక్తులకు వివిధ మార్గాల ద్వారా వ్యాప్తి చెందును. అవి :

  1. ప్రత్యక్ష తాకిడి
  2. గాలి ద్వారా
  3. నీరు, ఆహారం ద్వారా
  4. జంతువుల ద్వారా

18. సాంక్రమిక వ్యాధులు ప్రబలకుండా మీ పాఠశాలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ? (పేజీ.నెం. 189)
జవాబు:

  1. వ్యాధులు వచ్చిన పిల్లలను ఇంటివద్ద ఉండిపో అని చెబుతారు.
  2. తరగతి గదిలోకి గాలి, వెలుతురు వచ్చే ఏర్పాటు చేస్తారు.
  3. ఆరోగ్య నియమాల గురించి వివరిస్తారు.
  4. టీకాలు వేయించుకోమని చెబుతారు.
  5. పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచటం.
  6. బోరింగ్ వద్ద నీరు నిల్వకుండా చూడటం.
  7. పరిసరాలలో మొక్కలు పెంచటం.
  8. ఆహార వ్యర్థాలను కంపోస్ట్ పిట్ కు చేర్చటం.
  9. కాగితాలు, కాయల వ్యర్థాలను కుళ్లబెట్టి మట్టిలో కలపడం ద్వారా పాఠశాలలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడతాం.

19. అసంక్రామ్యత అంటే ఏమిటి ? (పేజీ.నెం. 189)
జవాబు:
ఒక వ్యక్తి ఒక వ్యాధికి పలుసార్లు గురి అయినప్పుడు ఆ వ్యాధిని ఎదురుకొనే శక్తి అతనికి వస్తుంది. దీనిని అసంక్రామ్యత అంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

20. మీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి నిరోధకత కార్యక్రమాలేవి ? మీ ప్రాంతంలో తరుచు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలేవి ? (పేజీ.నెం. 189)
జవాబు:
మా థమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి నిరోధకతకు ఈ కింది కార్యక్రమాలు ఉన్నాయి.

  1. పోషకాహారం యొక్క ఆవశ్యకతను తెలియచేయుట
  2. చిన్న చిన్న వ్యాధులకు చికిత్స
  3. రక్షిత మంచినీటి ఆవశ్యకత
  4. పరిసరాల శుభ్రత గురించి తెలియచేయుట
  5. వ్యాధి రాకుండా తల్లి పిల్లలకు టీకాలు వేయుట.
  6. ఏ కాలంలో ఏ వ్యాధులు వస్తాయో వాటిని ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు తెలియచేయుట.
    మా ప్రాంతంలో తరుచూ ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు డయేరియా, మలేరియా, డెంగ్యూ మొదలైనవి.

21. ఈ పాఠం మీద వ్యాఖ్యానం రాయడానికి పై ప్రశ్నల గురించి మీ తరగతిలో చర్చించండి. మీ నోటు పుస్తకంలో వ్యాసంగా రాయండి. (పేజీ.నెం. 189)
జవాబు:
ఒక వ్యక్తి శారీరకంగాను, మానసికంగా, సామాజికంగా బాగా ఉంటే దానిని ఆరోగ్యం అంటారు. వ్యాధి జనక జీవులు శరీరంలోనికి ప్రవేశించటం వలన శరీర జీవక్రియలు సరిగా జరగవు. దీనిని వ్యాధి అంటాము. ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధి రహిత స్థితికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వ్యాధిని కలుగచేయు కారకాలను వ్యాధి కారకాలు అంటారు. అవి సజీవ కారకాలు, నిర్జీవ కారకాలు.

వ్యాధులు రెండు రకాలుగా ఉంటాయి. అవి తీసుకొనే సమయాన్ని బట్టి (1) స్వల్పకాలిక వ్యాధులు (2) దీర్ఘకాలిక వ్యాధులు. స్వల్పకాలిక వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే అవి దీర్ఘకాలిక వ్యాధులుగా మారే అవకాశం ఉంది. , వ్యాధి కలిగే విధానాన్ని బట్టి వ్యాధులు రెండు రకాలు. సాంక్రమిక వ్యాధులు, అసాంక్రమిక వ్యాధులు.

ముఖ్యంగా మానవునిలో వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, కొన్ని క్రిమికీటకాలు వ్యాధి జనకాలుగా, వాహకాలుగా గుర్తించారు. వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుటను వ్యాధి వ్యాప్తి అంటారు. వ్యాధి వ్యాప్తి .

  1. గాలి ద్వారా
  2. నీరు, ఆహారం ద్వారా
  3. ప్రత్యక్ష తాకిడి ద్వారా
  4. జంతువుల ద్వారా జరుగును.

వ్యాధులను నయం చేసే సూత్రాలు అమలు చేయాలి. అవసరమైన యాంటీబయోటిక్స్, ఇతర మందులు వాడాలి. వ్యాధి వచ్చిన తరువాత మందులు వాడటం కంటే నివారించుట మంచిది. వ్యాధి నివారణకు ఈ కింది నియమాలు పాటించాలి.

  1. ఇంట్లోకి, పాఠశాలలోకి గాలి, వెలుతురు ఉండే విధంగా చేయుట.
  2. రక్షిత మంచి నీటిని తాగుట.
  3. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొనుట
  4. పోషకాహారం తీసుకొనుట
  5. వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండటం
  6. సాంక్రమిక వ్యాధులు వచ్చిన పిల్లలను ఇంటి దగ్గర ఉంచుట
  7. పిల్లలకు టీకాలు ఇప్పించుట.
  8. వ్యాధి నిరోధక శక్తి అవసరం గురించి చెప్పుట

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము – తాగలేము

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

SCERT AP 8th Class Biology Study Material Pdf 10th Lesson పీల్చలేము – తాగలేము Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 10th Lesson Questions and Answers పీల్చలేము – తాగలేము

8th Class Biology 10th Lesson పీల్చలేము – తాగలేము Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
గాలి కాలుష్యం నీటి కాలుష్యానికి ఏ విధంగా దారితీస్తుంది ?
జవాబు:
గాలికాలుష్యం నీటి కాలుష్యానికి ఈ క్రింది విధంగా దారితీయును.
1. గాలిలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సెడ్ నీటి ఆవిరిలో కరిగి ఆమ్లాలుగా మారి వర్షం పడినపుడు నీటిలో ఆమ్లం 2. గుణం తెచ్చును.
2. గాలిలో ఉన్న CO2 గ్లోబల్ వార్మింగ్ వలన నీటి ఉష్ణోగ్రత పెరిగి నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గి నీటి కాలుష్యం జరుగును.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

ప్రశ్న 2.
“పారదర్శకంగా మరియు స్వచ్ఛంగా కనిపించే నీరు త్రాగుటకు అన్నివిధాలా సరిపోతుంది” దానిపై మీ అభిప్రాయంను తెలియచేయండి.
జవాబు:

  1. పారదర్శకంగా మరియు స్వచ్చంగా కనిపించే నీరు త్రాగుటకు అన్నివిధాలా సరిపోదు.
  2. కారణం దానిలో కంటికి కనిపించని సూక్ష్మజీవులు అయిన వైరస్లు, బాక్టీరియాలు, ప్రోటోజోవాలు ఉండవచ్చు.
  3. అంతేకాక నీటి కలుషితాలు కూడా ఉండవచ్చు.

ప్రశ్న 3.
తాజ్ మహల్ వంటి చారిత్రక కట్టడం గాలి కాలుష్య ప్రభావానికి లోనవుతుంది. దానిని రక్షించటానికి నీవు ఇచ్చే సలహాలు ఏమిటి ?
జవాబు:
తాజ్ మహల్ వంటి చారిత్రక కట్టడం గాలి కాలుష్యం నుండి రక్షించడానికి నేను ఇచ్చే సలహాలు :

  1. మోటారు సైకిలు, కార్లు బదులు ఆ ప్రాంతంలో సైకిళ్ళు, గుర్రపు బండ్లు వాడాలి.
  2. వాహనాలలో కాలుష్యం తక్కువ వెదజల్లే CNG, LPG ల వంటి ఇంధనాలు వాడాలి.
  3. సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చి దానితో నడిచే వాహనాలను ప్రోత్సహించాలి.
  4. తాజ్ మహల్ పరిసరాలలో సీసం లేని పెట్రోల్ ఉపయోగించే వాహనాలనే వాడాలి.
  5. కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలను ఆగ్రా నగరానికి దూరంగా తరలించాలి
  6. ఆగ్రా నగర చుట్టుప్రక్కల చెట్లు బాగా పెంచాలి.

ప్రశ్న 4.
గాలి కాలుష్యం, నీటి కాలుష్యం నియంత్రించుటకు తీసుకోదగిన చర్యలు ఏవి ?
జవాబు:

  1. గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ఫ్యాక్టరీల మీద పొడవైన చిమ్నీలు ఏర్పాటుచేయాలి.
  2. ఇంటిలో గాని, పరిశ్రమలోగాని ఇంధనాలను పూర్తిగా మండించే పరికరాలను ఉపయోగించాలి.
  3. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ (Electrostatic precipitaters) పరిశ్రమల చిమ్నీలలో ఏర్పాటుచేయాలి.
  4. వాహనాల నుండి వెలువడే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సి.ఎన్.జి (Compressed Natural Gas) ని వాడాలి.
  5. ఇంటిలో వంటకు ఎల్.పి.జి (Liquid Petroleum Gas) ఉపయోగించాలి.
  6. వాహనాలలో వాడే ఇంధనాలు నాణ్యత కలిగి ఉండాలి.
  7. పునరుద్దరింపదగిన శక్తి వనరులైన సౌరశక్తి, పవన శక్తి, అలల శక్తి, జలవిద్యుత్ ను ఉపయోగించాలి.
  8. కాలుష్య నియంత్రణ నియమాల ప్రకారం అన్ని వాహనాలు తప్పకుండా క్రమపద్ధతిలో నిర్వహించాలి.
  9. సీసం లేని పెట్రోల్‌ను ఉపయోగించాలి.
  10. మీ చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాలలో వీలైనన్ని ఎక్కువ చెట్లను పెంచాలి.

నీటి కాలుష్యం నియంత్రించుటకు తీసుకోదగిన చర్యలు :

  1. పరిశ్రమల నుండి విడుదల అయ్యే వ్యర్థ పదార్థములను రసాయనికంగా శుద్ధి చేయడం లేదా హానికరమైన దార్థములను లేకుండా చేసి నదులలోనికి, సరస్సులలోనికి విడుదల చేయడం.
  2. మురుగునీరు ప్రత్యక్షంగా నదులలోనికి విడుదల చేయకూడదు. ముందుగా శుద్ధి చేసే ప్లాంట్ లో శుద్ధిచేసి వాటిలో ఉండే ఆర్గానిక్ పదార్థాలను తీసివేయాలి.
  3. ఎరువులను, పురుగులను చంపే మందులను ఎక్కువ ఉపయోగించడం తగ్గించాలి.
  4. సింథటిక్ డిటర్జెంట్ల వినియోగం తగ్గించాలి. నీటిలో, నేలలో కలిసిపోయే డిటర్జెంట్లు ఉపయోగించాలి.
  5. చనిపోయిన మానవుల శవాలను మరియు జంతు కళేబరాలను నదులలోనికి విసిరివేయరాదు.
  6. వ్యర్థ పదార్థాలను, జంతువుల విసర్జితాలను బయోగ్యాస్ ప్లాంట్ లో ఇంధనం కోసం ఉపయోగించిన తర్వాత ఎరువుగా వాడుకోవాలి.
  7. నదులు, చెరువులు, కుంటలు, సరస్సులలోని నీరు తప్పకుండా శుభ్రం చేయాలి. ఈ విధానాన్ని పరిశ్రమల యాజమాన్యాలు మరియు ప్రభుత్వం వారు తప్పకుండా చేపట్టాలి. ఉదాహరణకు భారత ప్రభుత్వం వారిచే నిర్వహించబడిన గంగానది ప్రక్షాళన పథకం.
  8. నదుల తీరం వెంబడి చెట్లు, పొదలు తప్పకుండా పెంచాలి.
  9. నీరు కాలుష్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం నీటి కాలుష్యం వల్ల కలిగే నష్టాల పట్ల అవగాహన కార్యక్రమాలు తప్పకుండా చేపట్టాలి. ముఖ్యంగా ప్లాస్టిక్, వ్యర్థాలు, కాగితాలు, వ్యర్థ ఆహారపదార్థాలు, మురిగిపోయిన ఆహారపదార్థాలు, . కూరగాయలు మొదలైన వాటిని వీధిలోకి విసిరివేయకుండా చూడాలి.
  10. కాలుష్యాన్ని తగ్గించుటకు 4R (Recycle, Reuse, Recover, Reduce) నియమాలను అమలుపరచి వనరులను పునరుద్ధరించాలి.
  11. తరిగిపోయే ఇంధనాలను ఉపయోగించడం చాలావరకు తగ్గించాలి. ప్రత్యామ్నాయ శక్తి వనరులను వాతావరణానికి హానికరం కాకుండా ఉపయోగించాలి.
  12. ప్రాథమిక ఉద్దేశంతో పదార్థాలను ఉపయోగించినపుడు వాటిలో కొన్నింటిని రెండవసారి కూడా ఉపయోగించాలి (తిరిగివాడుకోవడం).
  13. ఉదా : తెల్ల కాగితానికి ఒకవైపు ప్రింట్ తీసుకోవడం, ఒకే వైపు రాయడం కాకుండా రెండవవైపును కూడా ఉపయోగించినట్లయితే ఎక్కువ కాగితాలు వృథాకాకుండా చూడవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే కాగితం కోసం ఎక్కువ చెట్లు నరకడం తగ్గిపోతుంది.
  14. వీలైనన్ని ఎక్కువ పదార్థాలు తిరిగి వినియోగించుకోవడానికి వీలుగా నష్టం జరగనంత వరకు చేస్తూనే ఉండాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

ప్రశ్న 5.
నీటిలో పోషకాల స్థాయి పెరగటం వలన నీటి జీవుల మనుగడపై ఏవిధంగా ప్రభావం చూపుతుంది ?
జవాబు:
నీటిలో పోషకాల స్థాయి పెరగడం వలన శైవలాలు, కలుపు మొక్కలు మరియు బాక్టీరియాలు విస్తరించును. నీరు చివరకు ఆకుపచ్చగా, మురికిగా వాసనపట్టిన పెట్టుగా తయారవుతుంది. నీటిలో కుళ్లుతున్న మొక్కలు ఆక్సిజనన్ను ఉపయోగించు కొంటాయి. నీటి జీవులకు సరిపడు ఆక్సిజన్ అందక చివరకు అవి మరణించును. జీవవైవిధ్యం తగ్గును.

ప్రశ్న 6.
రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు సక్రమంగా పెరగవు. కారణాలు కనుగొని, మీ వాదనను వివరించండి.
జవాబు:

  1. ఎక్కువ వాహనాలు రోడ్డుపై తిరుగుతాయి. వాహనాల నుండి విడుదలగు కాలుష్య పదార్థాలు మొక్కల పెరుగుదల తగ్గిస్తాయి.
  2. జనం ఎక్కువగా ఉండటం వలన పచ్చిగా ఉన్నప్పుడే చెట్లను తుంపుతారు.
  3. మొక్కల ఆకులపై కాలుష్య పదార్థాలు చేరి కిరణజన్య సంయోగక్రియ జరుగుటకు ఆటంకము ఏర్పడును మరియు బాష్పోత్సేకపు రేటు తగ్గును.
  4. హైడ్రోకార్బనులు ఆకులు రాలుటకు సహాయపడును మరియు మొక్కల అనేక భాగాల రంగును కోల్పోయేలా చేయును.
  5. రాత్రిపూట రోడ్లపై ఉన్న ప్రదేశాలలో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉండును. మొక్కలకు రాత్రి సమయంలో సరిపడు ఆక్సిజన్ కూడా అందక పెరుగుదల తక్కువగా ఉండును.
  6. వాటికి నీటి సదుపాయం కూడా సరిగా ఉండకపోవడం వల్ల పెరుగుదల సక్రమంగా ఉండదు.

ప్రశ్న 7.
రసాయనిక పరిశ్రమలో నీవు జనరల్ మేనేజర్ గా ఉంటే నీవు గాలి మరియు నీరు కాలుష్యం కాకుండా తీసుకొను చర్యలు మరియు ముందు జాగ్రత్తలు ఏమి ?
జవాబు:
గాలి మరియు నీరు కాలుష్యం కాకుండా తీసుకొను చర్యలు:

  1. గాలిలో తేలియాడే రేణువులను తొలగించుట స్థిర విద్యుత్ అవక్షేపాలను ఉపయోగించటం చేస్తాను.
  2. లెడ్ లేని పెట్రోల్ ను వాహనాలకు ఉపయోగిస్తాను.
  3. చెట్లను బాగా పెంచుతాను.
  4. మురుగు నీరు నదులలోకి, చెరువులలోకి కలవకుండా చూస్తాను.
  5. ఒకవేళ కలిసే పరిస్థితి వస్తే దానిలోని హానికారక పదార్థాలు తొలగిస్తాను.
  6. పరిశ్రమ నుంచి వచ్చే వేడినీటిని కూలింగ్ టవర్స్ లో చల్లబరచి విడుదల చేస్తాను.

గాలి మరియు నీరు కలుషితం కాకుండా ముందు జాగ్రత్తలు :

  1. విద్యుత్ దుర్వినియోగం లేకుండా ఉంచుతాను. దీని వలన విద్యుత్ ఆదా అగును. అందువలన థర్మల్, అణు విద్యుత్ తయారీ వలన వచ్చే కాలుష్యం తగ్గించవచ్చును.
  2. అందరూ పబ్లిక్ ట్రాన్స్పర్ట్ ఉపయోగించేలా చేస్తాను. దీని వలన చాలా కార్లు మరియు బైకులు ఇతర వాహనాల వినియోగం తగ్గి వాయు కాలుష్యం తగ్గును.
  3. పరిశ్రమలో ఉన్న అంతా సామగ్రి చక్కని నిర్వహణలో ఉంచుతాను. దీని వలన అన్ని యంత్రాలు చక్కగా పనిచేయును. అందువలన కాలుష్య పదార్థాలు గాలిలోకి, నీటిలోకి విడుదల అవ్వవు.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

ప్రశ్న 8.
కింది అంశంపై చర్చించండి. కార్బన్ డయాక్సెడ్ కాలుష్యకారకమా ? కాదా ?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలో 0.03% ఉంటే కాలుష్య కారకము కాదు. కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలో 0.03% కంటే ఎక్కువ ఉంటే కాలుష్య కారకం అంటారు. కారణం కారకం చేరిక వలన వాతావరణంలో సజీవ, నిర్జీవ అంశాలలో వచ్చే మార్పులను కాలుష్యం అంటారు. కాలుష్యం కలుగజేయు కారకాలను కలుషితాలు అంటారు. CO2 వాతావరణంలో 0.03% కంటే ఎక్కువ ఉంటే భూమి ఉష్ణోగ్రత పెరుగును.

అప్పుడు గ్లోబల్ వార్మింగ్ వచ్చును. CO2 వలన మానవులకు అలసట, చికాకు కలుగును. గ్లోబల్ వార్మింగ్ వలన ధృవ ప్రాంతాలలో మంచు కరిగి భూమిపై పల్లపు ప్రాంతాలను ముంచును. వాతావరణంలో ఏ వాయువు కాని, పదార్థము కాని ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటే అది కాలుష్య కారకమే.

ప్రశ్న 9.
గాలి, నీరు కాలుష్యంపై క్విజ్ ప్రోగ్రామ్ ను నిర్వహించటానికి ఆలోచన రేకెత్తించే 5 ప్రశ్నలు తయారుచేయండి.
జవాబు:

  1. హీమోగ్లోబిన్ ఆక్సిజన్ కంటే దేనిని తొందరగా అంటిపెట్టుకొనును ?
  2. C.N.G అనగా నేమి?
  3. యూట్రాఫికేషన్ అనేది ఏ కాలుష్యంలో వింటాము ?
  4. ఆమ్ల వర్షమునకు కారణమైన వాయువులు ఏవి ?
  5. భారత పురావస్తుశాఖ ‘నో డ్రైవ్ జోన్”గా ఎక్కడ ప్రకటించినది ?
    గమనిక : ఇంకా చాలా ప్రశ్నలు టీచర్స్ పిల్లల చేత తయారు చేయించవచ్చును.

ప్రశ్న 10.
నీకు దగ్గరలో ఉన్న కాలుష్య నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి, వాహనాల కాలుష్యం నిర్ధారించే విధానాన్ని పరిశీలించండి. దిగువ చూపబడిన అంశాలను నమోదు చేయండి. నిర్ణీత సమయములో పరిశీలించిన సరాసరి వాహనాల సంఖ్య, ప్రతి వాహనం తనిఖీ చేయడానికి పట్టు సమయం, ఏయే కాలుష్య కారకాలు తనిఖీ చేశారు ? పరీక్ష పద్ధతి ఏ విధంగా ఉన్నది ?, వివిధ కాలుష్య కారకాలు విడుదల అయ్యే వాటిలో అనుమతించబడిన వాటి పరిధి ఎంత ? విడుదల అయ్యే వాయువుల పరిధి దాటితే తీసుకోవలసిన జాగ్రత్తలు ఏవి ?
జవాబు:

  1. నిర్ణీత సమయంలో. పరిశీలించిన సరాసరి వాహనాల సంఖ్య – 5 లేదా 6 – గంటకు.
  2. ప్రతి వాహనం తనిఖీ చేయటానికి పట్టిన సమయం – 10 నిమిషాలు
  3. ఏయే కాలుష్య కారకాలు తనిఖీ చేశారు – కార్బన్ మోనాక్సైడ్ (CO), హైడ్రోకార్బన్స్ (HC) & CO2
  4. పరీక్ష పద్ధతి – Computer Analysis
  5. వివిధ కాలుష్య కారకాలు విడుదల అయ్యే వాటిలో అనుమతించబడిన వాటి పరిధి – కార్బన్ మోనాక్సైడ్ 2000 సంవత్సరం ముందు వాహనం అయితే 4.5%, 2000 సంవత్సరం తర్వాత అయితే 3.5% ఉండాలి.

హైడ్రోకార్బన్లు 2000 సంవత్సరం ముందు వాహనం అయితే 9,000, 2000 సంవత్సరం దాటిన తర్వాత అయితే 4,500 వరకు ఉండవచ్చు. విడుదల అయ్యే వాయువుల పరిధి దాటితే తీసుకోవలసిన జాగ్రత్తలు :
1. ఇంజన్ సరిగా పనిచేసే విధంగా చూడాలి. దీని వలన ఇంధనం పూర్తిగా మండి CO2 విడుదల అవుతుంది.
2. వాయువులు విడుదల చేసే గొట్టంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి.

ప్రశ్న 11.
మీ గ్రామానికి దగ్గరలో ఉన్న చెరువు / సరస్సు /నది దగ్గరకి మీ టీచరుతో కలసి వెళ్ళండి. కింది అంశాలు పరిశీలించి చర్చించండి. చెరువు / సరస్సు / నది గతచరిత్ర, నది / చెరువు / సరస్సు. కాకుండా వేరే నీటి వనరులు ఉన్నాయా ! సాంస్కృతిక అంశాలు, కాలుష్యానికి కారణాలు, కాలుష్యం జరగటానికి మూలం, నది దగ్గరలో మరియు దూరంగా నివసిస్తున్న వారిపై కాలుష్య ప్రభావం ఎంత వరకు ఉన్నది ?
జవాబు:
1. మా గ్రామానికి దగ్గరగా ఉన్నది కృష్ణానది. ఈ నది అంతా నల్లరేగడి నేలలో ప్రవహించుట వలన కృష్ణానది అని పేరు వచ్చినది (కృష్ణా – నలుపు).
2. వేరే నీటి వనరులు ఉన్నాయి. బావులు, కాలువలు.
3. సాంస్కృతిక అంశాలు : ఈ నదిలో స్నానం చేయుట వలన పుణ్యం వస్తుందని భావిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు మరియు ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలలో కృష్ణానదిలో కనకదుర్గ అమ్మవారి తెప్పోత్సవం జరుగును.

కాలుష్యానికి కారణాలు : కృష్ణానదిలో పరిశ్రమల కాలుష్యాలు కలవడం, పట్టణ జనాభా వలన కొన్ని కలుషితాలు కృష్ణా నదిలోనికి విడుదలవడం, బట్టలు ఉతకడం, మలమూత్రాల విసర్జన, దహన సంస్కారాలు చేయుట, నదిలో పుణ్య స్నానాలు ఆచరించడం, థర్మల్ పవర్ స్టేషన్లోని కలుషితాలు చేరడం.

కాలుష్యం జరగటానికి మూలం : నది దగ్గరలో పరిశ్రమలు ఉంటే అక్కడి వారిపై కాలుష్య ప్రభావం ఎక్కువగాను, నది ప్రవహించుట వలన దూరంగా నివసిస్తున్న వారిపై కాలుష్య ప్రభావం తక్కువగాను ఉండును.
గమనిక : వారి గ్రామంలో / దగ్గరలో ఉన్న దానిపై పై అంశాలు పరిశీలించి చర్చించండి.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

ప్రశ్న 12.
గాలి కాలుష్యం అనగానేమి ? గాలి కాలుష్యానికి కారణాలు దానివల్ల తలెత్తే సమస్యలను, చార్ట్ ను తయారుచేయండి.
జవాబు:
మానవ చర్యల వలన గాని, ప్రకృతిలో జరిగే మార్పుల వలన గాని వాతావరణ సమతుల్యతలో మార్పు సంభవిస్తే దానిని గాలి కాలుష్యం (Air pollution) అంటారు . గాలి కాలుష్యానికి కారణాలు మరియు ప్రభావములతో కూడిన ఫ్లోచార్ట్:
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 1

ప్రశ్న 13.
సుధీర్ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఇతను ఆరోగ్యవంతంగా ఉండటానికి నీవు ఏమి సూచనలు ఇస్తావు ? ఇతని విధి నిర్వహణలో ఆరోగ్య రక్షణకు నీవు ఇచ్చే సలహాలు ఏమిటి ?
జవాబు:
ఇతను ఆరోగ్యవంతంగా ఉండడానికి నేను ఇచ్చే సూచనలు :
1. ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే దుమ్ము, ధూళి ఉన్న బట్టలు మార్చుకోవాలి.
2. ఎండలో ఎక్కువసేపు ఉంటాడు కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవాలి.
3. ఎక్కువ సేపు నుంచొని ఉండాలి కాబట్టి శక్తిని ఇచ్చే పదార్థాలు తీసుకోవాలి.

ఇతని విధి నిర్వహణలో ఆరోగ్య రక్షణకు నేను ఇచ్చే సలహాలు :
1. దుమ్ము, ధూళి, కాలుష్య పదార్థాలు శరీరంలోనికి ప్రవేశించకుండా మ్కాలు వేసుకోవాలి.
2. తలకు ఉష్ణవాహక పదార్థాలతో తయారుచేయబడిన హెల్మెట్ వాడాలి.
3. ఎండ, వాన నుంచి రక్షణకు అతనికి ఇచ్చిన కాబిలో ఉండాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

ప్రశ్న 14.
“బైకులు, కార్లు వద్దు సైకిలే ముద్దు” ఈ నినాదాన్ని శ్రీవాణి తయారుచేసినది. మీరు కూడా కాలుష్యం నియంత్రణపై కొన్ని నినాదాలు తయారుచేయండి.
జవాబు:
బైకులు, కార్లు వద్దు సైకిలే ముద్దు ఈ నినాదాన్ని శ్రీవాణి తయారుచేసింది. నేను కూడా కాలుష్య నియంత్రణపై కొన్ని నినాదాలు తయారుచేశాను. అవి

  1. చెట్లు పెంచు-కాలుష్యాన్ని తగ్గించు.
  2. కాలుష్యాన్ని తగ్గించు-మంచి ఫలితాన్ని పొందు.
  3. మనిషి స్వార్థమే-కాలుష్యానికి మూలం.
  4. గాలి కాలుష్యం తగ్గించు-ప్రకృతిని కాపాడు.
  5. చెట్లు పెంచు-కాలుష్యాన్ని పారద్రోలు.
  6. ఫ్రిజ్ లు తగ్గించు-కుండలు పెంచు.
  7. కాలుష్యాన్ని తగ్గించు-జీవితకాలం పెంచు.
  8. కాలుష్య నివారణకు-అందరూ కృషి చేయాలి.

ప్రశ్న 15.
రేష్మ నేల కాలుష్యంపై వక్తృత్వ పోటీలో పాల్గొనదలచింది. ఆమె కోసం ఒక వ్యాసం రూపొందించండి.
జవాబు:
నేల మనతోపాటు వందలాది జీవులకు జీవనాధారం. కానీ మానవుని విచక్షణా రహిత చర్యల వలన నేల కాలుష్యకోరలలో చిక్కుకొనిపోయింది. నేల తన సహజ స్వభావాన్ని కోల్పోవుట వలన నేలలోని సూక్ష్మజీవుల నుండి, నేలపైన నివసించే వేలాది జీవుల వరకు ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారాలు, గుల్మనాశకాలు, పరిశ్రమవ్యర్థాలు, భూమిని పాడుచేస్తున్నాయి. ప్లాస్టిక్ వస్తువులు, పాలిథీన్ కవర్లు భూమాత గర్భంలో జీర్ణంకాని పదార్థాలుగా మిగులుతున్నాయి.

పరిస్థితి ఇలాగే కొనసాగితే, నేల తన సహజగుణాన్ని కోల్పోయి నిర్జీవ ఆవాసంగా మారుతుంది. ఇది మనం కూర్చున్న కొమ్మను నరుక్కొన్న రీతి అవుతుంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా నేలకాలుష్యం గురించి తీవ్రంగా ఆలోచిద్దాం. కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేద్దాం. ప్లాస్టిక్స్, పాలిథిన్ కవర్లను నిషేధిద్దాం. మన భూమాతను రక్షించుకుందాం.

ప్రశ్న 16.
కవిత తన మిత్రుడు కౌశిక్ తో “ప్లాస్టర్ ఆఫ్ పారితో తయారుచేసిన వినాయకుని కన్నా మట్టితో చేసిన వినాయకుని పూజించటం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చు” అని చెప్పింది. నీవు ఆమెను ఎలా ప్రశంసిస్తావు ?
జవాబు:
మట్టితో చేసిన వినాయకుడు నీటిలో వెంటనే కలిసిపోవును. అందువలన నీటి కాలుష్యం జరగదు. దీని వలన పర్యావరణానికి హాని జరగదు. ప్లాస్టర్ ఆఫ్ పారితో తయారుచేసిన వినాయకుని వలన అనేక నష్టాలు ఉన్నాయి. అవి నీటిలో కరగవు. అంతేకాక వాటిలో ఆస్ బెస్టాస్, ఆంటిమొని, పాదరసం, లెడ్ వంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి. దీని వలన ఆ నీరు మరియు ఆ నీటిలో నివసించు జీవులకు హాని కలిగి కొన్నిసార్లు చాలా జీవులు చనిపోవును.

మట్టి వినాయకుని వలన పై నష్టాలు జరుగవు. కాబట్టి కవిత తన మిత్రుడు కౌశిక్ తో “ప్లాస్టర్ ఆఫ్ పారితో తయారుచేసిన వినాయకుని కన్నా మట్టితో చేసిన వినాయకుని పూజించటం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చు” అని చెప్పింది.

పై విషయాలు తెలుసుకొని తన మిత్రుడితో చెప్పినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. అంతేకాకుండా టీచర్ కి చెప్పి స్కూల్లో పిల్లలు అందరికి మట్టి వినాయకుని వలన కలిగే లాభాలు కవిత చేత వివరించి మరియు అసెంబ్లీలో హెడ్ మాష్టారుకి చెప్పి స్కూలు పిల్లల చేత చప్పట్లు కొట్టిస్తాను. 8వ తరగతిలోనే పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కలిగి ఉండుట మాత్రమేకాక దాన్ని నిజజీవిత పరిస్థితులకు అన్వయించినందుకు కవితను నేను మెచ్చుకుంటాను.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

ప్రశ్న 17.
మీ గ్రామంలోని లేదా దగ్గరలో ఉన్న చెరువు ఏవిధంగా కాలుష్యానికి గురి అవుతుందో తెలుసుకొని, కాలుష్యానికి గురి కాకుండా నీవేమి చేస్తావు?
జవాబు:

  1. పశువులను చెరువులో కడుగుట వలన
  2. చెరువులలో మనుషులు స్నానాలు చేయుట వలన , చెరువులో బట్టలు ఉతుకుట వలన
  3. చెరువులో మలమూత్రాలు విసర్జించుట వలన
  4. చెరువులోనికి ఇంట్లో నుంచి వచ్చిన చెత్తా చెదారములను వేయుట వలన
  5. వ్యవసాయదారులు మొక్కలకు ఉపయోగించిన ఎరువులు మరియు శిలీంధ్రనాశకాలను, డబ్బాలను చెరువులలో కడుగుట వలన, చెరువు గట్టుపై నివసించువారు అంట్లు చెరువులో కడుగుట వలన
  6. చెరువు దగ్గరగా పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాస్టు పారవేయుట వలన
  7. చెరువులలో ఇష్టానుసారంగా నీటి మొక్కలు (గుర్రపు డెక్క) పెరుగుట వలన.
    పై కారణాల వలన మా ఊరిలో చెరువు కాలుష్యం అగును.

8th Class Biology 10th Lesson పీల్చలేము – తాగలేము InText Questions and Answers

కృత్యములు

1. ప్రకృతి వైపరీత్యాలు – కాలుష్యం :
మీరు పాఠశాల గ్రంథాలయానికి వెళ్ళి ఈ దశాబ్దంలో ఇప్పటి వరకు ప్రపంచంలో జరిగిన ఈ కింది ప్రకృతి వైపరీత్యాల సమాచారాన్ని జాబితా రాయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 2

2. నూనె కాగిత ప్రయోగం:
5 × 5 సెం.మీ. కొలతలు గలిగిన చతురస్రాకారపు తెల్లకాగితాలను మూడింటిని తీసుకొని నూనెలో ముంచండి. వీటిని మూడు వేర్వేరు ప్రాంతాలలో వ్రేలాడదీయండి. ఒకదానిని మీ ఇంటి దగ్గర, రెండవదానిని పాఠశాలలో, మూడవదానిని ఉద్యానవనం దగ్గర కాని వాహనాలు నిలిపే స్థలంలో గాని వ్రేలాడదీయండి. వాటిని 30 ని||లు వరకు ఉంచి పరిశీలించండి.

ఎ) నూనెలో ముంచిన తెల్ల కాగితాల మీద మీరు ఏమి గమనించారు ?
జవాబు:
నూనెలో ముంచిన తెల్ల కాగితాల మీద మేము దుమ్ము, ధూళి గమనించాము.

బి) ఈ మూడు ప్రాంతాలలో ఉంచిన కాగితాలపై ఏమైనా మార్పులు ఉన్నాయా ?
జవాబు:
ఈ మూడు ప్రాంతాలలో ఉంచిన కాగితాలపై మార్పులు ఉన్నాయి.

సి) వీటికి జవాబులు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వాటి కారణాలు తెలుసుకోండి.
జవాబు:
1. మా ఇంటి దగ్గర ఉంచిన కాగితంపై దుమ్ము, ధూళి కొంచెం తక్కువగా ఉన్నాయి.
2. పాఠశాలలో ఉంచిన కాగితంపై దుమ్ము, ధూళి కొంచెం ఎక్కువగా ఏర్పడినది. కారణం మా పాఠశాల జనం రద్దీ ఉన్నచోట ఉంటుంది.
3. మూడవదానిని నేను వాహనాలు నిలిపిన స్థలంలో ఉంచాను. కాబట్టి కాగితంపై చాలా ఎక్కువ దుమ్ము, ధూళితో పాటు కొంచెము మసి కూడా గమనించాను. కారణం వాహనాల నుండి పొగ ఎక్కువ వస్తుంది కాబట్టి.

3. విద్యుత్ ఉత్పాదక కేంద్రాల సమాచారము :
విద్యుత్ ఉత్పాదక కేంద్రాల సమాచారం : మీరు పాఠశాల గ్రంథాలయాన్ని సందర్శించి వివిధ రకాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సమాచారంతో పట్టికను తయారుచేయండి. ఇంతే కాకుండా మన దేశంలో అనేక తక్కువ స్థాయి విద్యుదుత్పత్తి కేంద్రాలు కూడా కాలుష్య కారకాలను గాలిలోనికి విడుదల చేసి కాలుష్యాన్ని పెంచుతున్నాయి. వాటిపై చర్చించండి.
జవాబు:
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి.
1. జలవిద్యుచ్ఛక్తి కేంద్రాలు
2. థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రాలు
3. అణువిద్యుచ్ఛక్తి కేంద్రాలు.
జలవిద్యుత్ శక్తి కేంద్రాలు :
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 3
థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రాలు :
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 4

అణు విద్యుత్ శక్తి కేంద్రాలు :
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 5
తక్కువ స్థాయి విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి (ముఖ్యంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు) బూడిద, ధూళి, సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ వంటి పదార్థాలు, ఇతర వ్యర్థ పదార్థాల ద్వారా గాలి, నీరు, నేల కాలుష్యం అవుతున్నాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

4. క్షేత్రపర్యటన :
క్షేత్రపర్యటన : దగ్గరలో ఉన్న పరిశ్రమను (ఇటుకల తయారీ, బియ్యం మిల్లు, ఆయిల్ మిల్లు, ఆహారపదార్థాలను తయారుచేసేవి మొదలగునవి) సందర్శించి దిగువ పేర్కొన్న అంశాలను పరిశీలించండి.

అ) ఇవి గాలి, నీటిని ఏ విధముగా కలుషితం చేస్తున్నాయి ?
జవాబు:
గాలిలోకి బియ్యపు ఊక విడుదల అవుతుంది. ఊక గాలిలో కలిసి కాలుష్యం చేస్తుంది. ఉప్పుడు బియ్యం తయారుచేయుట, నీటిని ఎక్కువగా ఉపయోగించుట వలన కర్బనిక పదార్థాలు నీటిలోకి చేరి నీటిని పాడు (కాలుష్యం) చేస్తాయి.

ఆ) ఫ్యాక్టరీల చుట్టూ పచ్చదనం ఉందా ? ఉంటే వాటి పేర్లను రాయండి.
జవాబు:
ఫ్యాక్టరీల చుట్టూ పచ్చదనం ఉంది. వాటి పేర్లు : అశోక చెట్లు, తురాయి పూలచెట్లు.

ఇ) కాలుష్యం నివారించడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ?
జవాబు:

  1. ఊక నిల్వ చేయు గది నిర్మించాలి. దీని వలన ఊక పరిసరాలలోనికి రాదు.
  2. మిల్లు యొక్క వెంట్లు పైకి ఉండాలి.
  3. మిల్లు యొక్క గదులకు రంధ్రాలు లేకుండా చూసుకోవాలి.
  4. ఉప్పుడు బియ్యం నుంచి వచ్చే నీటి కాలుష్యం నివారించుట, అవాయుగత బాక్టీరియాను ఉపయోగించి బయోగ్యాస్ తయారుచేయాలి.
  5. సరైన పరికరాలు ఉపయోగించి దుమ్ము, ధూళి నివారించాలి.
    గమనిక : ఎవరి దగ్గరలో ఉన్న పరిశ్రమ గురించి వాళ్లు వ్రాయాలి.

5. ప్రయోగశాల కృత్యం :
స్థానిక నీటి నమూనాలలో కాలుష్య కారకాలను పరిశీలించు ఒక ప్రయోగశాల కృత్యం చేయండి.
జవాబు:
ఉద్దేశం : స్థానికంగా నీటి నమూనాలలో కాలుష్య కారకాలను పరిశీలించుట
కావలసిన పరికరాలు : గాజు బీకర్లు, కుళాయి, బావి, సరస్సు, నది నుండి సేకరించిన నీటి నమూనాలు, నీలం, ఎరుపు లిట్మస్ పేపర్, సబ్బు.
పద్ధతి : వేరు వేరు గాజు బీకరులలో కుళాయి, నది, బావి, సరస్సుల నుండి నీటి నమూనాలను సేకరించాలి. వాటి మధ్య వాసన, రంగు, ఉదజని సూచిక pH మరియు కఠినత్వమును పోల్చాలి.

pH కనుగొనుట : లిట్మస్ పేపరుతో నీటి నమూనాలలో ఉదజని సూచిక pH ను కనుగొనవచ్చును. నీలం రంగు లిట్మస్ పేపరు నీటి నమూనాలో ముంచినప్పుడు ఆ పేపరు ఎరుపుగా మారితే ఆ నీటికి ఆమ్లత్వం కలిగి ఉన్నట్లు ! ఎరుపు లిట్మస్ పేపరు నీలం రంగుగా మారితే ఆ నీటికి క్షారత్వం ఉందని భావించాలి.
కఠినత్వం కనుగొనుట : నీటి కఠినత్వమును సబ్బును ఉపయోగించి కనుగొనవచ్చును. ఆ నీరు ఎక్కువ నురగ వస్తే మంచినీరు, తక్కువ నురగ వస్తే ఆ నీటికి కఠినత్వం ఉందని తెలుసుకోవచ్చును.
పరిశీలనలు : మీ పరిశీలనలు దిగువ పట్టికలో నమోదు చేయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 6

ప్రయోగం నిర్వహించేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :

  1. లిట్మస్ పేపరు రంగు మారడాన్ని జాగ్రత్తగా గమనించాలి.
  2. ప్రతిసారి చేతులను శుభ్రం చేసుకోవాలి.
  3. ఏ నీటి నమూనాను రుచి చూడడానికి ప్రయత్నించవద్దు.
  4. ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నారా ? మీ నోట్స్ లో రాయండి. .

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

6. మీ దగ్గరలో ఉన్న చెరువు లేదా నదిని సందర్శించి, అక్కడ చేరుతున్న కాలుష్య పదార్థాలను మరియు దాని వలన కలిగే పరిణామాలను పరిశీలించి ఒక ప్రాజెక్ట్ తయారుచేయండి. దాని ఆత్మకథను రాయండి. పాఠశాల ‘థియేటర్ డే’ లో ప్రదర్శించండి.
జవాబు:
పిల్లలూ బాగున్నారా ? నన్ను గుర్తుపట్టలేదా ? అవునులే నేను ఇప్పుడు పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతూ ముసలిదానినై పోయాను. నాలో గతం నాటి ఉత్సాహం లేదు. ఆనందం లేదు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఎన్నో విధాలుగా మీకు ఉపయోగపడిన నన్ను మీరే అనారోగ్యం పాలుచేశారు. నేను మీకు జీవనాధారమైన నీరు ఇచ్చాను. తాగటానికి మంచినీరు ఇచ్చాను. పంటపొలాలకు నీరు అందించాను. మీ గ్రామ అవసరాలన్నింటినీ తీర్చాను.

కానీ మీరు మాత్రం, నాలోనికి రకరకాల వ్యర్థాలను వదిలి, నన్ను కలుషితం చేసి పాడుచేశారు. ఇప్పుడు నేను ఎవరికీ పనికిరాని వ్యర్థంగా, మురికి కూపంగా మీకు కనిపిస్తున్నాను. నన్ను ఇంత ఇబ్బంది పెట్టి మీరు సుఖంగా ఉన్నది ఏది ? మీరు నాకన్నా ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారు. తాగునీటికి – మైళ్ళదూరం వెళుతున్నారు. పంటలకు నీరు లేక ఎండబెట్టుకొంటున్నారు. మేత లేక పశువులను అమ్ముకొంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి నా గట్టు వద్దకు వచ్చి ఆలోచించండి. కారణం మీకే తెలుస్తుంది. చేసిన తప్పును సరిదిద్దుకోండి. మీ కష్టాలకు మీరే కారణం అని తెలుసుకోండి. సరేనా, ఇంతకూ నన్ను గుర్తుపట్టారా, నేను మీ గ్రామ చెరువును !

7. మీరు కింద ఇచ్చిన కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ నమూనాను చూడండి. సర్టిఫికేట్ ను పరిశీలించి దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నించండి. (పేజీ.నెం.158)
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 7
ఎ) కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ ఏ డిపార్ట్ మెంట్ పారు జారీచేస్తారు ?
జవాబు:
ట్రాన్స్ పోర్ట్ డిపార్టుమెంట్ ఆంధ్రప్రదేశ్ వారు కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ జారీ చేస్తారు.

బి) ఈ సర్టిఫికెట్ కాలపరిమితి ఎంత ?
జవాబు:
ఈ సర్టిఫికెట్ కాలపరిమితి ఆరు నెలలు.

సి) ఏ రకమైన వాహనానికి ఈ సర్టిఫికెట్ జారీచేస్తారు ?
జవాబు:
అన్ని డీజిల్, పెట్రోల్ తో నడిచే వాహనాలకు ఈ సర్టిఫికెట్ జారీ చేస్తారు.

డి) కాలుష్య తనిఖీ కేంద్రాలలో ఏయే వాయువులు పరీక్షిస్తారు ?
జవాబు:
కాలుష్య తనిఖీ కేంద్రాలలో హైడ్రోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్ వాయువులు పరీక్షిస్తారు.

ఇ) కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్స్ అనుమతించబడ్డ పరిమితి కంటే రీడింగ్ ఎక్కువగా ఉంటే ఏమి జరుగుతుంది ?
జవాబు:
కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోకార్బన్స్ అనుమతించబడ్డ పరిమితి కంటే రీడింగ్ ఎక్కువ ఉంటే ఆ వాహనానికి అపరాధ రుసుము విధిస్తారు.

ఎఫ్) పై విషయాలపై తరగతి గదిలో చర్చించండి. కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ ఎందుకు ? ఆలోచించండి. చెప్పండి.
జవాబు:
కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ ఎందుకు అంటే వాహనాల నుంచి పరిమితికి మించి కాలుష్య పదార్థాలు వాతావరణంలోకి విడుదల కాకుండా ఉండుటకు.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

8. కింద ఇచ్చిన వార్తను చదవండి. మీరు అవగాహన చేసుకొన్న దానిని బట్టి వాటి దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. (పేజీ.నెం. 167)
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 8
ఎ) వార్తాపత్రిక క్లిప్పింగ్ చదివిన తరువాత మీకు అర్థమైన విషయం ఏమిటి ? (పేజీ.నెం. 168)
జవాబు:
కొన్ని పరిశ్రమల వలన భూగర్భజలం విషతుల్యంగా మారుతోంది.

బి) వార్తాపత్రికలో ఏ విషయం గురించి చర్చించారు ?
జవాబు:
రసాయన పరిశ్రమల కాలుష్యంతో భూగర్భజలం విషతుల్యంగా మారి తాగుటకు, వ్యవసాయానికి ఏ విధంగా పనికిరాదో, ఆ కాలుష్య నియంత్రణకు తీసుకొన్న చర్య గురించి చర్చించినారు.

సి) దానికి కారణం ఏమిటి ? దాని ప్రభావం ఏమిటి ?
జవాబు:
దానికి కారణం రసాయనిక పరిశ్రమలు. దాని ప్రభావం మునుషుల పైనేగాక జీవరాశులు అన్నింటిపైనా ఉంది.

డి) సమస్య ఏ విధంగా ఉత్పన్నమైనది ?
జవాబు:
ఇష్టానుసారంగా రసాయనిక పరిశ్రమలు స్థాపించుటకు అనుమతి ఇవ్వడం, వాటి కాలుష్యాలను శుద్ధి చేయకుండా నేల, గాలి, నీటిలోకి విడుదల చేయడం వలన ఈ సమస్య ఉత్పన్నమైనది.

ఇ) మీ ప్రాంతంలో ఈ రకమైన సమస్యను ఎప్పుడైనా ఎదుర్కొన్నారా ? దీనికి వెనుక ఉన్న కారణాలు చెప్పగలరా ?
జవాబు:
ఎదుర్కొనలేదు.
గమనిక : ఎవరికి వారు తమ ప్రాంతంలోని కాలుష్యాలకు గల కారణాలను తెలుసుకొని రాయాలి.

ఆలోచించండి – చర్చించండి

1. టైర్లను, ఎండిపోయిన ఆకులను కాలిస్తే దాని వలన వచ్చే పొగ, బూడిద మొదలైనవన్నీ ఎక్కడికి పోతాయి ? ఏమవుతాయి? (పేజీ.నెం. 160)
జవాబు:
టైర్లను, ఎండిపోయిన ఆకులను కాలిస్తే దాని వలన వచ్చే పొగ, బూడిద మొదలైనవన్నీ వాతావరణం (గాలిలోకి) లో చేరి కాలుష్యం కలుగజేయును.

2. మనం రద్దీగా ఉన్న రోడ్డు పైన సాయంత్రం వేళ పోతున్నప్పుడు చుట్టూ పొగ దట్టంగా ఉంటుంది. మనం రుమాలుతో ముక్కు మూసుకున్నప్పటికీ దగ్గు, చికాకు కలుగుతుంది. ఈ లక్షణాలు ఎందుకు కలుగుతాయో ఆలోచించండి – చర్చించండి. (పేజీ.నెం. 166)
జవాబు:
మనం రద్దీగా ఉన్న రోడ్డు పైన సాయంత్రం వేళ పోతున్నప్పుడు చుట్టూ పొగ దట్టంగా ఉంటుంది. మనం రుమాలుతో ముక్కు మూసుకున్నప్పటికీ దగ్గు, చికాకు కలుగును. కారణం ఆ పొగలో ఉన్న అతి చిన్న కణాలు రుమాలు ద్వారా ముక్కు లోపలికి వెళ్ళి అక్కడ మనకు. ఎలర్జీ కలుగజేయును. దీనినే మనం డస్ట్ ఎలర్జీ అంటాము.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

3. ఈ రకమైన లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే ఏమి జరుగుతుంది ? (పేజీ.నెం. 166)
జవాబు:
ఈ రకమైన లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే శ్వాసవ్యవస్థలో ముఖ్యంగా ఊపిరితిత్తులు పాడవుతాయి. ఆస్తమా వంటి వ్యాధులు వస్తాయి.

4. నీటిలో ఉదజని సూచిక pH మరియు కఠినత్వముల మధ్య ఏదైనా సంబంధాన్ని గుర్తించారా ? (పేజీ.నెం. 169)
జవాబు:
నీటిలో ఉదజని సూచిక pH మరియు కఠినత్వముల మధ్య సంబంధాన్ని గుర్తించాను. క్షారత్వం పెరిగేకొలదీ నీటి కఠినత్వం పెరుగును.

5. ఏ నీటి నమూనా రంగు లేకుండా ఉంది ? (పేజీ.నెం. 169)
జవాబు:
కుళాయి నీరు రంగు లేకుండా ఉంది.

6. త్రాగడానికి ఏ నీరు పనికి వస్తుంది ? ఎందుకు ? (పేజీ.నెం. 169)
జవాబు:
తాగడానికి కుళాయి నీరు పనికి వస్తుంది. కారణం కుళాయిలో ఉన్న నీటిని వివిధ దశలలో శుభ్రపరచి పంపిస్తారు. స్వచ్ఛమైన నీటికి రంగు, వాసన ఉండదు.

7. కొన్ని నీటి నమూనాల్లో రంగు, వాసనలో మార్పు రావడానికి గల కారణాలు ఏమిటి ? (పేజీ.నెం. 169)
జవాబు:
కొన్ని నీటి నమూనాల్లో రంగు, వాసనలో మార్పు రావడానికి కారణాలు :
1. నీటిలో ఉన్న బాక్టీరియాలు, శైవలాలు ఇతర సూక్ష్మజీవులు చేరుట వలన
2. నీటిలో కలుషితాలు చేరినప్పుడు కూడా నీటికి రంగు, వాసనలో మార్పు వచ్చును.

8. నీటి నమూనాలో కంటికి కనిపించే కాలుష్య కారకాలు ఏమైనా ఉన్నాయా ? (పేజీ.నెం. 169)
జవాబు:
నీటి నమూనాలో కంటికి కనిపించే కాలుష్య కారకాలు ఏమీ లేవు.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

పాఠ్యాంశములోని ప్రశ్నలు

1. హానికరమైన జీవులు లేదా పదార్థాలు మన శరీరంలో ప్రవేశిస్తే ఏమి జరుగుతుంది ? వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ? (పేజీ.నెం. 159)
జవాబు:
హానికరమైన జీవులు లేదా పదార్థాలు మన శరీరంలో ప్రవేశిస్తే మనకు అనారోగ్యం కలుగును.
వాటి ఫలితాలు :
1. చాలామంది ప్రజలు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడతారు.
2. ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగును.
3. హానికరమైన జీవుల వలన రోగాలు (సూక్ష్మజీవ సంబంధ) వచ్చును.

2. గాలిలోని వివిధ వాయువుల జాబితాను తయారుచేయండి. (పేజీ. నెం. 159)
జవాబు:
గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, ఆర్గాన్, నీటి ఆవిరి మరియు ఇతర జడవాయువులు ఉంటాయి.
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 9

3. కాలుష్య కారకాలు ఎన్ని రకాలు ? అవి ఏవి ? (పేజీ.నెం. 151)
జవాబు:
కాలుష్య కారకాలు ముఖ్యంగా రెండు రకాలు అవి :
1. ప్రాథమిక కాలుష్య కారకాలు
2. ద్వితీయ కాలుష్య కారకాలు

4. సహజ కారణాల వల్ల ఏర్పడే కాలుష్యం వివరింపుము. (పేజీ.నెం.151)
జవాబు:
సహజ కారణాల వల్ల ఏర్పడే కాలుష్యం :
1. అడవుల దహనం వల్ల కర్బన పదార్థాలు (బూడిద) గాలిలో కలిసి కాలుష్య కారకంగా మారుతున్నాయి.
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 10
2. అగ్ని పర్వతములు బద్దలై CO2, SO2 వంటి చాలా రకాలైన విషవాయువులు మరియు బూడిద వాతావరణంలో కలిసి కాలుష్యానికి దారితీస్తోంది.
3. కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి అమ్మోనియా వాయువు విడుదల అయి గాలి కాలుష్యానికి కారణమవుతున్నది.
4. నీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి మీథేన్ వాయువు విడుదలై కాలుష్య కారకంగా మారుతున్నది.
5. మొక్కల పుష్పాల నుండి విడుదల అయ్యే పుప్పొడి రేణువులు కూడా గాలి కాలుష్య కారకాలుగా మారుతున్నాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

5. మానవ చర్యల వల్ల ఏర్పడే కాలుష్యం గురించి వివరింపుము. (పేజీ.నెం. 162)
జవాబు:
1. ఇంధనాలు : వీటిని మండించడం ద్వారా కార్బన్‌ మోనాక్సైడ్ (CO), SO2 పొగ, ధూళి మరియు బూడిద వెలువడును.
2. వాహనాలు : మోటారు వాహనాల నుంచి విడుదలయ్యే పొగలో SO2, NO2, CO పూర్తిగా మండని హైడ్రోకార్బన్లు మరియు సీసం సంయోగ పదార్థాలు, మసి ఉంటాయి.
3. పరిశ్రమల నుంచి ముఖ్యంగా గ్రానైట్, సున్నపురాయి, సిమెంట్ పరిశ్రమల నుండి విడుదలయ్యే పొగలో నైట్రస్ ఆక్సెడ్, SO2 క్లోరిన్ బూడిద మరియు దుమ్ము ఉంటాయి.
4. అణుశక్తి విద్యుత్ కేంద్రాలు కాలుష్యానికి కారణం.
5. ఎరువులు – పురుగుల మందులు గాలి, నీరు, నేల కాలుష్యానికి కారణం.
6. అడవుల నరికివేత కూడా కాలుష్యానికి ప్రధాన కారణం.
7. క్లోరోఫ్లోరో కార్బనులు, గనుల నుంచి విడుదలైన పదార్థాలు కాలుష్యానికి కారణం.
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 11

6. గ్రామాల్లో, పట్టణాల్లో సాధారణంగా మండించే ఇంధనాల జాబితా రాయండి. (పేజీ.నెం. 162)
జవాబు:
గ్రామాల్లో సాధారణంగా మండించే ఇంధనాలు : కట్టెలు, కిరోసిన్, బయోగ్యాస్, పొట్టు, కంది కంప మొదలైనవి.
పట్టణాల్లో సాధారణంగా మండించే ఇంధనాలు : గ్యాస్, కిరోసిన్.

7. సి.ఎఫ్.సి ల గురించి వ్రాయండి. (పేజీ.నెం. 163)
జవాబు:
రిఫ్రిజిరేటర్స్, ఎ.సి.లు, విమానాల నుండి వెలువడే వ్యర్థ రసాయనాలను సి.ఎఫ్.సి (క్లోరోఫ్లోరో కార్బన్) లు అంటారు. ఇవి గాలిలోకి విడుదలై వాతావరణంలో ఓజోన్ పొరను దెబ్బతీయును. దీని వలన ఓజోన్ పొరలో అక్కడక్కడ రంధ్రాలు ఏర్పడును. దీని వలన అతి ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలు భూమి మీద పడును. ఈ విధంగా జరుగుట వలన భూమి పైన జీవకోటికి ప్రమాదం జరుగును.

8. అతినీలలోహిత కిరణాలు మనపై పడటం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? (పేజీ.నెం. 163)
జవాబు:
అతినీలలోహిత కిరణాలు శక్తివంతమైనవి. ఇవి మన శరీరంపై పడటం వలన
1. చర్మ కణాలు దెబ్బతింటాయి.
2. చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
3. జన్యు ఉత్పరివర్తనాలను కలిగిస్తాయి.

9. వాయు కాలుష్యం వల్ల జరిగే దుష్ఫలితాలు రాయండి. (పేజీ.నెం. 166) (లేదా) ప్రపంచ ఆరోగ్య సంస్థ నూతన నివేదిక ఆధారంగా ఏడాదికి 4.3 మిలియన్ల మంది గృహం లోపల వాయు కాలుష్యం వలన, 3.7 మిలియన్ల మంది వాయు కాలుష్యం వలన ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే జరిగే పర్యవసానాలను నాలిగింటిని రాయండి.
జవాబు:
వాయు కాలుష్యం వల్ల జరిగే దుష్ఫలితాలు :
1. వాయుకాలుష్యం వల్ల శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు, గొంతు నొప్పి, ఛాతి నొప్పి, ముక్కు దిబ్బడ, ఆస్తమా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు కలుగును.
2. వాయు కాలుష్యం వలన హృదయ సంబంధ వ్యాధులు, అధిక రక్త పీడనం లాంటి వ్యాధులకు గురి అగును.
3. దుమ్ము మరియు పొగ ఆకుల మీద పేరుకున్నప్పుడు మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ, బాష్పోత్సేకం మొదలైన జీవక్రియలు ప్రభావితం అగును.
4. హైడ్రోజన్ సల్ఫైడ్ పీల్చడం వలన మానవులకు విపరీతమైన తలనొప్పి వచ్చును.
5. విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ మన రక్తంలోని హీమోగ్లోబిన్ తో కలవడం వలన స్థిరమైన కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఏర్పడి ఆక్సిజన్ శరీర భాగాలకు అందక చనిపోయే ప్రమాదం ఉంది.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

10. నీటి కాలుష్యానికి దారితీసే కారణాల జాబితా రాయండి. మీ ప్రాంతంలో జరిగే నీటి కాలుష్యం పోల్చి చూడండి. (పేజీ.నెం. 170)
జవాబు:

  1. పరిశ్రమల వలన జల కాలుష్యం జరుగును.
  2. పరిశ్రమల వలన జలాలలో ఉష్ణ కాలుష్యం.
  3. కబేళా, కోళ్ళ, డెయిరీఫారమ్ ల వలన జల కాలుష్యం జరుగును.
  4. ఎరువులు, క్రిమి సంహారక రసాయనాల వలన జల కాలుష్యం జరుగును.
  5. ముడి చమురు వల్ల సముద్ర జల కాలుష్యం జరుగును.
  6. మానవుని అపరిశుభ్ర అలవాట్ల వల్ల జల కాలుష్యం జరుగును.
    మా ప్రాంతంలో కూడా ఇంచుమించు ఇదే రకంగా జరుగును.

11. మూసీ నది కాలుష్య నియంత్రణకు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి ? (పేజీ. నెం. 170)
జవాబు:

  1. ఘనరూప వ్యర్థాల నియంత్రణ.
  2. మురికినీరు శుద్ధిచేయు ప్లాంట్ ను నెలకొల్పడం.
  3. తక్కువ ఖర్చుతో మురుగునీటి వ్యవస్థ కల్పించడం.
  4. నదీ తీరాన్ని అభివృద్ధి పరచడం.
  5. ప్రజలలో అవగాహన కలిగించుటకు కృషిచేయడం.

12. మీ టీచర్ ను అడిగి వాయుసహిత (ఏరోబిక్) బాక్టీరియాల గురించిన సమాచారాన్ని ఉదాహరణలతో రాయండి. (పేజీ.నెం. 171)
జవాబు:
ఆక్సిజన్ కలిగిన వాతావరణంలో నివసించు బాక్టీరియాలు. ఇవి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను ఎక్కువ మోతాదులో వినియోగించుకొంటాయి. అందువలన మిగతా జీవులకు ఆక్సిజన్ అందక మరణిస్తాయి. ఏరోబిక్ బాక్టీరియాలకు
ఉదాహరణ :
1. స్టెఫైలో కోకస్ జాతి
2. స్ట్రెప్టో కోకస్
3. ఎంటరో బాక్టీరియాకాక్
4. మైక్రో బాక్టీరియమ్ ట్యూబర్కోలస్
5. బాసిల్లస్
6. సూడోమోనాస్

13. ఓడ ప్రమాదాల వలన సముద్రం నీటిపై ఏర్పడే నూనెతెట్టు ఏ రకమైన ప్రమాదాన్ని ‘జీవులకు కలుగజేస్తుందో మీకు , తెలుసా ? (పేజీ.నెం. 172)
జవాబు:
ఓడ ప్రమాదాల వలన సముద్రం నీటిపై ఏర్పడిన నూనె తెట్టు వలన నీటి లోపలకు ఆక్సిజన్ వెళ్ళదు. దీని వలన జలచర జీవుల మనుగడ కష్టమై నీటిలో ఉన్న ఆవరణ వ్యవస్థ దెబ్బతినును.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

14. వాతావరణంలో కాలుష్య కారకాలు – వాటి మూలాలు తెలుపు ఒక పట్టిక తయారు చేయండి. (పేజీ.నెం. 164)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 12

15. మీ ఉపాధ్యాయుడిని అడిగి ద్వితీయ కాలుష్య కారకాలు అని వేటిని, ఎందుకు అంటారో తెలుసుకోండి. (పేజీ.నెం. 164)
జవాబు:
ప్రాథమిక కాలుష్య కారకాలు వాతావరణంలోనికి ప్రవేశించి వాతావరణంలోని మూలకాలతో చర్య జరపడం వల్ల ఏర్పడిన పదార్థాలను ద్వితీయ కాలుష్య కారకాలు అంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

SCERT AP 8th Class Biology Study Material Pdf 9th Lesson జంతువుల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 9th Lesson Questions and Answers జంతువుల నుండి ఆహారోత్పత్తి

8th Class Biology 9th Lesson జంతువుల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers

ప్రశ్న 1.
ఒక తేనెపట్టులో వివిధ రకాల తేనెటీగలు ఉంటాయి ? అవి ఏవి ? అవి ఒకదానికంటే మరొకటి ఎలా భిన్నంగా ఉంటాయి ?
జవాబు:
ఒక తేనెపట్టులో 3 రకాల తేనెటీగలు ఉంటాయి. అవి ఒకదాని కంటే మరొకటి ఎలా భిన్నంగా ఉంటాయి. అంటే
కూలీ ఈగలు : కొన్ని తేనెటీగలు వేల సంఖ్యలో ఉంటాయి. ఇవి కూలీ ఈగలు. తేనెపట్టు పెట్టి, తేనెటీగల పిల్లలను పోషించి, తేనెను సేకరించును. రాణి ఈగ : తేనెటీగల సమూహంలో ఒక్క రాణి ఈగ ఉంటుంది. ఇది ప్రతిరోజు 800-1200 గుడ్లను పెడుతుంది.
డ్రోన్ ఈగలు : ఇవి కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. వీటిని మగ ఈగలు అంటారు. ఇవి సోమరులు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 2.
మీ గ్రామంలో అధిక పాలనిచ్చే గేదెల లక్షణాలను రాయండి.
జవాబు:
మా గ్రామంలో అధిక పాలనిచ్చే గేదెల లక్షణాలు :

  1. చక్కని శరీర నిర్మాణం కలిగి ఉంటాయి.
  2. శరీర బరువు ఎక్కువగా ఉంటుంది.
  3. అధికంగా ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటాయి.
  4. మంచి ఆరోగ్యం కలిగి ఉంటాయి.
  5. శారీరక రోగాలు కలిగి ఉండవు.
  6. గేదెల చూపు చక్కగా ఉంటుంది.
  7. గేదెలు చక్కని పొదుగు నిర్మాణం ఉండి మరియు పాలు తీయుటకు తేలికగా ఉండును.
  8. ఆహారం (మేత) ఎక్కువగా తీసుకొనును.
  9. సన్నని మెడ కలిగి ఉంటాయి.

ప్రశ్న 3.
గ్రామీణ ప్రాంతాలలో గుడ్లను పొదిగే విధానాన్ని వివరించండి.
జవాబు:
గ్రామాలలో గుడ్లను పొదిగించడం ఆసక్తికరమైన పని. గ్రామాలలో కోళ్ళకు పొదిగే కాలం రాగానే ఒక పెద్ద గంపలో గడ్డి పరచి దానిమీద గుడ్లు ఉంచితే కోళ్ళు గుడ్లపై కూర్చొని గుడ్లను పొదుగుతాయి.

ప్రశ్న 4.
పశువుల పెంపకంలో అనుబంధ ఉత్పత్తులు, పరిశ్రమల గురించి రాయండి.
జవాబు:
పశువుల పెంపకంలో అనుబంధ ఉత్పత్తులు :
మాంసం, పేడ, తోళ్ళు, ఎముకలు, చర్మం, వాటి కొమ్ములు.
పరిశ్రమలు :

  1. డైరీ పరిశ్రమ : దీనిలో పాలు, పాల ఉత్పత్తులు చేస్తారు.
  2. కబేల (పశువధశాల) : ఎద్దు మాంసం ఇక్కడ తయారుచేస్తారు.
  3. తోళ్ళ పరిశ్రమ : ఇక్కడ తోళ్లను శుభ్రపరిచి పర్సులు, బెల్ట్ లు, చెప్పులు తయారుచేస్తారు.
  4. ఎరువుల పరిశ్రమ : పేడను ఉపయోగించి బయోగ్యాస్ తయారుచేస్తారు.
  5. బయోగ్యాస్ పరిశ్రమ : పశువుల ఎముకలను ఎరువుల కర్మాగారాలలో వాడతారు.
  6. వస్తువులు తయారుచేసే పరిశ్రమ : పశువుల చర్మం, కొమ్ములను ఉపయోగించి వివిధ రకాల ఆట మరియు అలంకార వస్తువులు తయారుచేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 5.
మీ గ్రామంలో ఎక్కడైనా కోళ్ళ ఫారం ఉందా ? గ్రుడ్లను ఎలా మార్కెట్ కి ఎగుమతి చేస్తారు ? ప్యాకింగ్ కు ఏ రకమైన పదార్థాలను వాడతారు ?
జవాబు:
మా గ్రామంలో కోళ్ళ ఫారం ఉంది. గ్రుడ్లు, మార్కెట్ కి ఎగుమతి చేయుటకు 30 గ్రుడ్లు పట్టే ట్రేలో ఉంచుతారు. ఇలాంటి 10 ట్రేలను ఒక అట్టపెట్టిలో పెట్టి దూరంను బట్టి లారీ కాని, ఆటో కాని లేదా రిక్షాలో కాని పెడతారు. ఈ ట్రేలో గ్రుడ్లు ఆకారంలో గుంటలు ఉంటాయి. ప్యాకింగ్ కు కాగితం, వేస్ట్ ప్లాస్టిక్, అట్టలు (మొక్కజొన్న ఆకుల నుండి తయారు చేస్తారు) వంటివి వాడతారు.

ప్రశ్న 6.
నదీముఖ ద్వారాలు అనగానేమి ? అవి సముద్రపు మరియు నీటి చేపలు నివసించటానికి ఎలా అనువుగా ఉంటాయి ?
జవాబు:
నదీముఖ ద్వారాలు అనగా నదులు సముద్రంలో కలిసే చోటు. నదీముఖ ద్వారాలలో సముద్రపు మరియు మంచినీటి చేపలు నివసించటానికి ఎలా అనువుగా ఉంటుంది అంటే ఈ ప్రాంతాలలో నివసించే చేపలు లవణీయత వ్యత్యాసాన్ని తట్టుకొనే శక్తిని కలిగి ఉంటాయి.

ప్రశ్న 7.
అక్టోబర్, నవంబర్ మాసాలలో చికెన్ మరియు గుడ్ల రేట్లు తగ్గుతాయి ? ఎందుకు ? కారణాలను చర్చించి రాయండి.
జవాబు:
1. ఈ నెలలందు తయారు అయిన గుడ్లు పొదగటానికి ఉపయోగించరు. కారణం ఉష్ణోగ్రత 38.39°C ఉండదు.
2. వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువ కాబట్టి గ్రుడ్లు చెడిపోవు.
3. అంతేకాక అక్టోబర్ లో సాధారణంగా దసరా మరియు దీపావళి పండుగలు వచ్చును. నవంబర్ కార్తీకమాసం ప్రభావం వలన ఎక్కువమంది మాంసాహారాన్ని తినరు. పై కారణాల వలన అక్టోబర్, నవంబర్ మాసాలలో చికెన్ మరియు గుడ్ల రేట్లు తగ్గుతాయి.

ప్రశ్న 8.
ఈ క్రింది పదాలను గురించి రాయండి.
శ్వేత విప్లవం, నీలి విప్లవం, ఎపిస్ టింక్చర్, హాల్ స్టీన్.
జవాబు:
శ్వేత విప్లవం : పాల ఉత్పత్తిని పెంచటం. పాల నుండి లభించే ఇతర పదార్థాల నాణ్యతని, పరిమాణాన్ని పెంచి, సాధ్యమైనంత తక్కువ ధరలో అందరికీ అందించటానికి జరిగిన ప్రయత్నమే శ్వేత విప్లవం అంటారు.
నీలి విప్లవం : చేపల పెంపకం. దిగుబడి పెంచటానికి, నాణ్యత అధికం చేయుటకు జరిగిన ప్రయత్నమే నీలి విప్లవం అంటారు. ఎపిస్ టింక్చర్ : తేనెటీగల విషంతో తయారుచేయబడిన హోమియో మందుని ఎపిస్ టింక్చర్ అంటారు.
హాల్ స్టీన్ : ప్రతిరోజు 25 లీటర్ల పాలు ఇచ్చే డెన్మార్క్ దేశానికి చెందిన ఆవు జాతి పేరు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 9.
చేపలను నిలవ చేయడంలో పాటించే పద్ధతులను వివరించండి.
జవాబు:
చేపలు నిలువ చేయడంలో పాటించే పద్ధతులు

  1. ఎండలో ఎండబెట్టడం
  2. పాక్షికంగా ఎండబెట్టడం
  3. పొగ బెట్టడం
  4. ఉప్పులో ఊరబెట్టడం

ప్రశ్న 10.
పాలశీతలీకరణ కేంద్రాన్ని పరిశీలించినప్పుడు నీవు ఏ రకమైన అనుమానాలు నివృత్తి చేసుకుంటావు ? వాటి జాబితా తయారుచేయండి.
జవాబు:
పాలశీతలీకరణ కేంద్రాన్ని పరిశీలించినప్పుడు నేను ఈ అనుమానాలు నివృత్తి చేసుకొనుటకు తయారుచేసిన జాబితా.
అవి:

  1. పాలశీతలీకరణ కేంద్రాలలో ఉన్న పాలు ఎందుకు తొందరగా పాడు అవ్వవు?
  2. పాశ్చరైజేషన్ ఎలా చేస్తారు ?
  3. పాల కేంద్రాలలో పాల శుద్ధితో పాటు ఇతర పదార్థాలు ఏవైనా తయారుచేస్తారా ?
  4. శీతాకాలంలో అధికంగా వచ్చిన పాలను ఏమి చేస్తారు ?
  5. పాలపొడి ఎలా చేస్తారు?
  6. పాలను, పాల పొడిని ఎందుకు సూక్ష్మజీవ రహిత ప్లాస్టిక్ కవరులలోను, డబ్బాలలో నిల్వచేస్తారు ?

ప్రశ్న 11.
కోళ్ళ/ఈము/చేపల/పశువుల/తేనెటీగల పెంపకంలో ఏదో ఒకదానిని సందర్శించి, అక్కడి రైతులనడిగి యాజమాన్య పద్ధతులపై ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
నేను మాకు దగ్గరలో ఉన్న కోళ్ళ పరిశ్రమను సందర్శించాను. కోళ్ళ పెంపక విధానంలో యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవటం గమనించాను.

  1. నేల క్రింది భాగంలో తడి, తేమను నివారించటానికి, నేలను పొట్టుతో కప్పారు.
  2. నేల సహజత్వాన్ని కాపాడటానికి సున్నం చల్లుతున్నారు. ఇది వ్యర్థాల వలన ఏర్పడే ఆమ్లత్వాన్ని నివారించటానికి తోడ్పడుతుంది.
  3. నీరు, ఆహారం వృధా కాకుండా తొట్టెలను ఎత్తులో అమర్చారు.
  4. రాత్రివేళలో సరైన ఉష్ణోగ్రతను నెలకొల్పటానికి విద్యుత్ దీపాలను ఉంచారు.
  5. కోడిపిల్లలు పొడుచుకోకుండా, డీబికింగ్ (ముక్కు కత్తిరించటం) చేస్తున్నారు.
  6. రోజు ఆహారాన్ని నిర్ణీత మోతాదులో నిర్ణీత వేళకు అందిస్తున్నారు.
  7. వేడిని నివారించటానికి, కోళ్ళ షెడ్ ను కొబ్బరి మట్టలతో కప్పారు. పరిసరాలలో చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చారు.
  8. కోడి వయస్సును బట్టి ఆహార మోతాదు మార్చి అందిస్తున్నారు. మూడు నెలల వయస్సు నుండి కోళ్ళ పెరుగుదల అధికంగా ఉంటుంది కావున పౌష్ఠిక ఆహారం అందిస్తున్నారు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 12.
వార్తాపత్రికల నుండి పాల ఉత్పత్తికి, పాలలో కలుషితాలకు సంబంధించిన వార్తను సేకరించి నివేదికను తయారుచేసి గోడపత్రికపై ప్రదర్శించండి.
జవాబు:
పాల ఉత్పత్తికి తీసుకోవలసిన చర్యలు :

  1. రైతులు ముందుగా మంచి పాలు ఇచ్చే పశువులను ఎంచుకోవాలి.
  2. పచ్చిమేత 20 కేజీల వరకు రోజూ పెట్టాలి.
  3. ఆ పశువులు పాలిచ్చే దానిని బట్టి దాణా పెట్టాలి. సుమారుగా ప్రతి పది లీటర్ల పాలకు నాలుగు కిలోల మిశ్రమ దాణా పెట్టాలి.
  4. పశువులు నివసించే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి.
  5. కాలం బట్టి వచ్చే వ్యాధులు నివారించుటకు టీకాలు ఇప్పించాలి.

పాలలో కలుషితాలకు సంబంధించిన నివేదిక :

  1. పాలలో ఈ క్రింది పేర్కొన్న కలుషితాలు కలుపుతున్నారు.
  2. సోడియం బై కార్బొనేట్, గంజిపిండి, సబ్బునీళ్ళు, యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, మెలనిన్.
  3. కొన్ని ప్రాంతాలలో కలుషితమైన ఆహారము పశువులకు పెట్టుట వలన పాలు కలుషితం అవుతున్నాయి.
    ఉదా : మెలనిన్ ఉన్న పాలు త్రాగుట వలన పిల్లలు చనిపోవుదురు. కొందరిలో మూత్రపిండాలు చెడిపోవును.

ప్రశ్న 13.
సముద్రపు కలుపుమొక్కలకు సంబంధించిన సమాచారాన్ని మీ పాఠశాల గ్రంథాలయం నుంచి సేకరించండి. ఉదాహరణలతో వివరించండి.
జవాబు:

  1. సముద్రపు కలుపు మొక్కలు గోధుమవర్ణ శైవలాలకు చెందినవి.
  2. సముద్రంలో ఇవి అతిపెద్ద పరిమాణంలో తుట్టలు తుట్టలుగా, సమూహంగా పెరుగుతాయి.
  3. వీటిని కెర్బ్స్ అంటారు. వీటివలనే అనేక ఉపయోగాలు ఉన్నాయి.
    • పశువుల మేతగా ఉపయోగపడును (సముద్రపు కలుపుమొక్క)
    • బయోగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగపడును (సముద్రపు కలుపు మొక్క)
    • పైకో కొల్లాయిడ్ ఉపయోగపడును (సముద్రపు కలుపు మొక్క అగార్ – అగార్)
      పొగ పెట్టించి ఈగలను ప్రక్కకు మళ్ళించి తేనెపట్టును జాగ్రత్తగా కత్తిరించి తేనె తీస్తారు.

ప్రశ్న 14.
సాధారణంగా ఏ కాలంలో తేనెపట్టునుండి తేనెను సేకరిస్తారు. తేనెను సేకరించడానికి తియ్యడానికి అనుసరించే విధానాన్ని రాయండి.
జవాబు:
సాధారణంగా మా గ్రామంలో తేనెపట్టును పువ్వులు బాగా పూసే కాలమైన అక్టోబరు / నవంబరు మరియు ఫిబ్రవరి / జూన్ సీజన్లో చూస్తాము. తేనెపట్టు నుంచి తేనెను తీయడానికి అనుసరించే విధానము :
పొగ పెట్టించి ఈగలను ప్రక్కకు మళ్ళించి తేనెపట్టును జాగ్రత్తగా కత్తిరించి తేనె తీస్తారు.

ప్రశ్న 15.
ఎండిన తేనెపట్టును పరిశీలించండి. అది ఎలా నిర్మితమైనదో పరిశీలించి, బొమ్మను గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి 1
ఎండిన తేనెపట్టును పరిశీలించితిని. అది అనేక చిన్న చిన్న గదులతో విభజింపబడి ఉండును. తేనెపట్టు మైనపు పధార్థం వలన చిన్నచిన్న గదులు ఏర్పడుటకు సహాయపడును. ఈ మైనం కూలీ ఈగలు స్రవించి తయారుచేస్తాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 16.
పశువులు మన ఆహారం కొరకే కాదు. వాటి విసర్జితాలు (వ్యర్థ పదార్థాలు) కూడా మనకు ఉపయోగపడతాయి. ఈ వినూత్న విషయాన్ని ఎలా అభినందిస్తారు ?
జవాబు:
పశువులు మన ఆహారం కొరకే కాదు. వాటి విసర్జితాలు పేడ మనకు బాగా ఉపయోగపడును. దీనిని ఎరువుగా పొలంలో వేయవచ్చు. పూర్వపు రోజులలో పిడకల కోసం పేడను ఉపయోగించేవారు. ఇప్పుడు ఆ పేడను కుళ్ళబెట్టి బయోగ్యాస్ తయారుచేస్తున్నారు. దానితో ఇంధన కొరత కొంత వరకు అధిగమించవచ్చు మరియు కాలుష్యం కొంతవరకు తగ్గుతుంది. అంతేకాక విద్యుత్ శక్తి కూడా ఉత్పత్తి చేయవచ్చు.

ఆహారంతో పాటు కాలుష్యాన్ని, ఇంధన కొరతలను తగ్గించిన పశువులను చూస్తే నాకు చాలా ఆనందంగా, కొంత ఆశ్చర్యంగాను ఉంది. అందుకే కొంతమంది వాటికి ప్రేమతో పేర్లు కూడా పెట్టి పిలుస్తారు.

ప్రశ్న 17.
రాజు పశుపోషణకు, వ్యవసాయానికి సంబంధం ఉంది అని తెలిపాడు. నీవు అతడిని ఎలా సమర్థిస్తావు?
జవాబు:

  1. పశుపోషణకు, వ్యవసాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది.
  2. ఈ రెండూ పరస్పరం ఆధారనీయమైనవే గాక, ఒకే నాణేనికి బొమ్మా బొరుసూ వంటివి.
  3. వ్యవసాయ ఉత్పత్తులైన గడ్డి, ధాన్యం వంటి పదార్థాలు పశుపోషణలో ఆహారంగా ఉపయోగపడతాయి.
  4. జంతువుల వ్యర్థాలైన పేడ, మూత్రం వ్యవసాయ రంగంలో ఎరువులుగా వాడతారు.
  5. ఎద్దులు, దున్నల వంటి జంతువుల ఆధారంగా చాలా వ్యవసాయపనులు జరుగుతుంటాయి.
  6. దుక్కిదున్నటం, చదునుచేయటం, రవాణా వంటి వ్యవసాయ పనులకు నేడు ఇంకా జంతువులను ఉపయోగిస్తున్నారు.
  7. తేనెటీగల పరిశ్రమ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. మొక్కలు బాగా పుష్పించినపుడే తేనెటీగలు తేనెను బాగా ఉత్పత్తి చేయగలవు.
  8. తేనెటీగలు మొక్కలలో ఫలదీకరణ రేటును పెంచి పంట దిగుబడిని పెంచుతాయి. కావున వ్యవసాయానికి, పశుపోషణకు చాలా దగ్గర సంబంధం ఉంది.

ప్రశ్న 18.
వ్యవసాయం, పశుపోషణ నాణానికి ఇరువైపులా ఉన్న అంశాలు. దీనిని నీవు ఎలా సమర్థిస్తావు ?
జవాబు:
వ్యవసాయం, పశుపోషణ నాణానికి ఇరువైపులా ఉన్న అంశాలు. ఎందుకంటే వ్యవసాయంలోని పచ్చగడ్డి, ఎండిన పశు గ్రాసం, ధాన్యం ఇంకా ఇతర ఉత్పత్తులు పశువుల దాణాగా ఉపయోగిస్తారు. అదే విధంగా పశువులను ముఖ్యంగా ఎద్దులను నేల దున్నుటకు, నూర్పిడిలోను, పశువుల పేడను ఎరువుగాను, పండిన పంటను కూడా ఇంటికి చేర్చుటకు ఎద్దులను ఉపయోగిస్తారు. ఈ రెండింటిలో ఏ ఒకటి లేకపోయిన రెండోది లేదు. కాబట్టి వ్యవసాయం, పశుపోషణ నాణానికి ఇరువైపులా ఉన్న అంశాలు.

ప్రశ్న 19.
పంట పొలాలను చేపకుంటలుగా మార్చటం వలన పర్యావరణం చెడిపోతుంది. ఆహారపు కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది? ఈ సమస్యపై చర్చలో పాల్గొనటానికి మీ అభిప్రాయాలను తెల్పండి.
జవాబు:
పంట పొలాలను చేపకుంటలుగా మార్చటం వలన పర్యావరణం చెడిపోతుంది మరియు ఆహారపు కొరతను ఎదుర్కొంటాము. అందుకు నా అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి.
1. పొలంలో వరి మొక్కలు ఉంటే కిరణజన్య సంయోగక్రియ జరిగి వాతావరణంలోనికి ఆక్సిజన్ విడుదల అవుతుంది. కాని చేపకుంట వలన ఆ విధంగా జరగదు.
2. చేపలు కూడా నీటిలోకి CO2 విడుదల చేస్తాయి. దాని వలన వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరుగును.
3. చేప కుంటలో ఎక్కువగా చేపల కోసం వేసిన ఆహారం వలన, వాటి రక్షణకు ఉపయోగించే రసాయనాల వలన నీటి కాలుష్యం, భూకాలుష్యం వచ్చును.
4. చేపల కుంటలుగా మార్చుట వలన ముఖ్యంగా వరి పంట దెబ్బతిని ఆహారపు కొరత వచ్చును.

8th Class Biology 9th Lesson జంతువుల నుండి ఆహారోత్పత్తి InText Questions and Answers

కృత్యములు

1. పశువుల పెంపకం :

(a) తరగతిలో ఐదుగురు విద్యార్థుల చొప్పున కొన్ని జట్లుగా ఏర్పడండి. రైతులు పశువులను ఎందుకు పెంచుతారో, కారణాలు చర్చించి రాయండి. మీరు పరిశీలించిన అంశాలను నోటు పుస్తకంలో రాయండి.
జవాబు:
రైతులు పశువులను పెంచుటకు కారణాలు :
1. వారికి పశువులను పెంచుట వలన కొంత ఆదాయం వచ్చును.
2. వారికి వ్యవసాయంలో సహాయపడును. (దున్నుటకు, నూర్పిడులకు)
3. వ్యవసాయంలో లభించిన పశుగ్రాసం తిరిగి పశువుల మేతగా వాడుటకు.

(b) మీ గ్రామంలో పశువులను ఎక్కడికి తోలుకుపోతారు. పశువులను పెంచే వ్యక్తితో మాట్లాడి పశువుల పెంపకానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించండి. ఈ క్రింది ప్రశ్నల సహాయంతో

(ఎ) ఇక్కడ ఏ ఏ రకాల పశువులను పెంచుతారు ?
జవాబు:
ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మొదలైన పశువులు పెంచుతారు.

(బి) పశుగ్రాసం ఉన్న ప్రాంతాలు. ఎక్కడ ఉన్నాయి ?
జవాబు:
ఊరికి చివర ఉన్న పొలాలు, పచ్చిక బయళ్ళ దగ్గర ఉన్న ప్రాంతాలలో ఉన్నాయి.

(సి) నీరు ఉన్న ప్రాంతం ఎక్కడ ఉన్నది ?
జవాబు:
పొలాలకు దగ్గరగా.

(డి) ఆవు, గేదెలు, మేక, గొర్రెల పెంపకంలో ఏమైనా తేడాలున్నాయా ?
జవాబు:
ఆవు, గేదెలు, ఎండిన గడ్డితో పాటు పచ్చిగడ్డి తింటాయి. మేకలు చెట్ల ఆకులను, పచ్చిగడ్డిని ఆహారంగా తీసుకొంటాయి. గొర్రెలు పచ్చిగడ్డిని, నూకలను ఆహారంగా తీసుకుంటాయి.

(ఇ) పశువులను పెంచేవారు సాధారణంగా ఎదుర్కొనే సమస్యలేవి ?
జవాబు:
అనావృష్టి పరిస్థితులలో పశుగ్రాసం కొరత పశువులు పెంచేవారు సాధారణంగా ఎదుర్కొనే సమస్య.

(c) పశువైద్యుని దగ్గరకు వెళ్ళి పశువులకు వచ్చే సాధారణ వ్యాధుల సమాచారాన్ని తెలుసుకుని ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి 2

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

పాఠ్యాంశములోని ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆదిమానవుడు కొన్ని జంతువులను మాత్రమే ఎందుకు మచ్చిక చేసుకున్నాడు ? (పేజి.నెం. 141)
జవాబు:
ఆదిమానవుడు కొన్ని జంతువులు (ఉదా : కుక్క, పిల్లి, పశువులు, పక్షులు, కోళ్ళు, చిలుక మొదలైన) వాటివలన తనకు కలుగు ఉపయోగాలు గ్రహించి వాటిని మచ్చిక చేసుకున్నాడు. అందువలన ఆదిమానవుడు కొన్ని జంతువులనే మచ్చిక చేసుకున్నాడు.

ప్రశ్న 2.
ఏనుగు, పులి, సింహం వంటి జంతువులను గ్రద్ధ, గుడ్లగూబ వంటి పక్షులను ఎందుకు మచ్చిక చేసుకోలేకపోయాడు ? (పేజి.నెం.141)
జవాబు:
ఏనుగు, పులి, సింహం వంటి జంతువులను గ్ర, గుడ్లగూబ వంటి పక్షులను ఆదిమానవుడు ఎందుకు మచ్చిక చేసుకోలేకపోయాడు అంటే ఏనుగు, పులి, సింహం క్రూరజంతువులు మరియు ఆ పక్షుల వలన లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి.

ప్రశ్న 3.
జంతువులను మచ్చిక చేసుకోవడానికి ఆనాటి మానవుడు ఏ ఏ విధానాలను పాటించి ఉంటాడో జట్లలో చర్చించి రాయండి. (పేజి.నెం. 142)
జవాబు:

  1. జంతువులు మచ్చికకు అలవాటు పడతాయి.
  2. మచ్చిక చేసుకొనుటకు పట్టుకాలం
  3. మచ్చిక వలన ఆ జంతువుకు అయ్యే ఖర్చు
  4. మచ్చిక చేసుకున్నాక అతనికి వచ్చే లాభం మొదలైన అంశాలను ఆనాటి మానవుడు జంతువులను మచ్చిక చేసుకొనేటపుడు పాటించిన పద్దతులు.

ప్రశ్న 4.
వ్యవసాయం చేసే వాళ్ళందరూ పశువులను పెంచుతారా ? (పేజి.నెం. 142)
జవాబు:
ఇంచుమించు వ్యవసాయం చేసే వాళ్ళందరూ పశువులను పెంచుతారు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 5.
వ్యవసాయానికి, పశుపోషణకు ఏమైనా సంబంధం ఉందా ? (పేజి.నెం. 142)
జవాబు:
వ్యవసాయానికి, పశుపోషణకు చాలా దగ్గర సంబంధం ఉంది.

ప్రశ్న 6.
ఎద్దులను, దున్నపోతులను ఉపయోగించి ఏమేమి వ్యవసాయ పనులు చేస్తారో రాయండి. (పేజి.నెం. 143)
జవాబు:
1. ఎద్దులను ఉపయోగించి పొలం, దుక్కి దున్నుతారు. పంట నూర్పిడి సమయంలో కూడా ఎద్దులను ఉపయోగిస్తారు.
2. దున్నపోతులను ప్రాచీన పద్ధతులలో నీటి పారుదలకు, పంట నూర్పిడి యందు ఉపయోగిస్తారు.

ప్రశ్న 7.
మీ ప్రాంతంలో పశువైద్యశాల ఎక్కడ ఉంది ? (పేజి.నెం. 143)
జవాబు:
మా ప్రాంతంలో పంచాయతీ రాజ్ ఆఫీసుకు దగ్గరగా ఉంది.
గమనిక : ఎవరి ప్రాంతంలో ఎక్కడ ఉంటే అక్కడే పేరు వ్రాసుకోవాలి.

ప్రశ్న 8.
అక్కడ (పశు వైద్యశాలలో) ఎవరు పనిచేస్తున్నారు ? ఏ పని చేస్తారు ? (పేజి.నెం. 143)
జవాబు:
అక్కడ (పశు వైద్యశాలలో) పశువైద్యులు పనిచేస్తారు. పశువుల వైద్యం, ఆరోగ్యం గురించి చూస్తారు.

ప్రశ్న 9.
మనకు పాల ఉత్పత్తి ఎక్కువగా ఎక్కడి నుండి వస్తుంది ? (పేజి.నెం. 144)
AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి 3
జవాబు:
మనకు పాల ఉత్పత్తి ఎక్కువగా గ్రామాల నుండి వస్తుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 10.
ఒంటె పాలను ఏ ప్రాంతంవారు ఉపయోగిస్తారు ? (పేజి.నెం. 144)
జవాబు:
ఎడారి ప్రాంతంవారు ఒంటె పాలను ఉపయోగిస్తారు.

ప్రశ్న 11.
గాడిద పాలను ఉపయోగించటం చూశారా ? (పేజి.నెం. 144)
జవాబు:
గాడిద పాలను ఉపయోగించటం చూడలేదు.
గమనిక : ఈ మధ్య గాడిద పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటాము అని పుకార్లు బాగా వచ్చినాయి. పుకార్లు అని ఎందుకు అన్నాము అంటే శాస్త్రవేత్తలు ఎవరూ అవి మంచివి అని చెప్పలేదు కాబట్టి.

ప్రశ్న 12.
మీ గ్రామంలో రైతులు ఏ రకమైన పశుగ్రాసాన్ని వాడతారు ? (పేజి.నెం. 144)
జవాబు:
మా గ్రామంలో రైతులు వరిగడ్డి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, ఉలవలు మొదలైనవి పశుగ్రాసంగా వాడతారు.

ప్రశ్న 13.
పంటకోత కోసిన తరువాత పశుగ్రాసాన్ని ఎలా భద్రపరుస్తారు ? (పేజి.నెం. 144)
జవాబు:
పంటకోత కోసిన తరువాత దానిని రెండు లేక మూడు రోజులు ఎండలో ఆరబెట్టి ధాన్యాన్ని నూర్పిడి చేసి వచ్చిన గడ్డి కట్టలు క్రింద కట్టి ఇంటికి తీసుకువచ్చి గడ్డివాముగా వేసి భద్రపరుస్తారు.

ప్రశ్న 14.
క్రింది గ్రాఫ్ ను పరిశీలించండి. ఇది వివిధ దేశాలలో పాల ఉత్పత్తిని సూచిస్తుంది. మనదేశంలో పాల ఉత్పత్తిని పరిశీలించండి. మిగతా దేశాలతో పోల్చినప్పుడు పాల ఉత్పత్తిలో మనము ఎందుకు వెనుకబడి ఉన్నామో జట్లలో చర్చించండి. (పేజి.నెం. 144)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి 4
1. పాల ఉత్పత్తిలో ఇజ్రాయిల్ అగ్రస్థానంలో ఉంది.
2. మన ఇండియా అన్నింటికన్నా దిగువస్థానంలో ఉంది.
కారణాలు :

  1. మనదేశంలో పాడిపరిశ్రమ ఇంకా గ్రామీణ కుటీర పరిశ్రమగానే ఉంది.
  2. పాడి పరిశ్రమను ఒక వ్యాపారాత్మకంగా లాభసాటిగా భావించటం లేదు.
  3. కేవలం వ్యవసాయంలో అంతర్భాగంగానే, పాడిపరిశ్రమ నడుస్తుంది.
  4. దేశీయ గేదెలనే ఎక్కువ ప్రాంతాలలో మేపుతున్నారు.
  5. పశువుల పెంపకంలో మెలకువలకు, పోషణ విధానంపై సరైన అవగాహన లేదు.
  6. వ్యాధుల విషయంలో రైతులకు పరిజ్ఞానం లేదు.

ప్రశ్న 15.
మీ గ్రామంలో పాల సేకరణ కేంద్రం ఉందా ? (పేజి.నెం. 145)
జవాబు:
మా గ్రామంలో పాల సేకరణ కేంద్రం ఉంది.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 16.
పాలను సేకరించి ఎలా ఎగుమతి చేస్తారు ? (పేజి.నెం. 145)
జవాబు:
పాలను పాలు సేకరించు కేంద్రం నుంచి 40 లీటర్ల క్యాన్ నింపి వాటిని పాల శీతలీకరణ కేంద్రంనకు ఎగుమతి చేస్తారు.

ప్రశ్న 17.
పాలధరను ఎలా నిర్ణయిస్తారు ? (పేజి.నెం. 145)
జవాబు:
పాలధరను పాల శీతలీకరణ కేంద్రం యొక్క చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు పాలలో గల వెన్న శాతాన్ని బట్టి పాల ధరను నిర్ణయిస్తారు.

ప్రశ్న 18.
మీ ప్రాంతంలో పాల శీతలీకరణ కేంద్రం ఎక్కడ ఉంది ? (పేజి.నెం.145)
జవాబు:
మా ప్రాంతంలో పాల శీతలీకరణ కేంద్రం విజయవాడలో ఉంది :
గమనిక : మీ ప్రాంతంలో ఇంకా దగ్గరలో ఏది, ఉంటే అది వ్రాయాలి.

ప్రశ్న 19.
పాల ఉత్పత్తి ఏ నెలలో అధికంగా ఉంటుందో చెప్పగలరా ? (పేజి.నెం. 145)
జవాబు:
పాల ఉత్పత్తి నవంబరు నెలలో అధికంగా ఉంటుంది.

ప్రశ్న 20.
ఏ నెలల్లో పాల ఉత్పత్తి ఎందుకు అధికంగా ఉంటుందో కారణాలను మీ తరగతిలో చర్చించండి. (పేజి.నెం. 145)
జవాబు:
అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. ఈ నెలల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉండుటకు కారణాలు :
1. గేదెలు జులై నుంచి సెప్టెంబరు మధ్య ఎక్కువగా ఈనుతాయి. ఈనిన మొదటి మూడు నెలల్లో పాలు ఎక్కువ ఇస్తాయి.
2. పచ్చిమేత ఎక్కువగా అందుబాటులో ఉండును.
3. వాతావరణం కూడా పశువుల పెరుగుదలకు, ఈనుటకు, మేతను ఎక్కువగా తీసుకొనుటకు చాలా అనుకూలంగా ఉండును.

ప్రశ్న 21.
పౌల్టీలలో పెంచే కోళ్ళు, గ్రామాలలో పెంచే దేశీయ కోళ్ళు ఒకే రకంగా ఉంటాయా ? (పేజి.నెం. 148)
జవాబు:
పౌల్టీలలో పెంచే కోళ్ళు, గ్రామాలలో పెంచే దేశీయ కోళ్ళు ఒకే రకంగా ఉండవు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 22.
జన్యుపరంగా మార్పు చెందిన ఆహారం వాడటం మంచిదా ? కాదా ? ఆలోచించండి. (పేజి.నెం. 148)
జవాబు:
జన్యుపరంగా మార్పు చెందిన ఆహారం వాడటం మంచిది కాదు.

ప్రశ్న 23.
చికెన్-65 అంటే ఏమిటో తెలుసా ? అలా ఎందుకు అంటారు ? (పేజి.నెం. 148)
జవాబు:
చికెన్ – 65 అంటే అదో వంటకం పేరు. అలా ఎందుకు అంటారు అంటే దీనిని 1965వ సంవత్సరంలో చెన్నైలోని బుహారి హోటల్ లో మొదటగా తయారుచేస్తారు.

ప్రశ్న 24.
కోడిగుడ్లు పొదగటానికి పట్టేకాలం ఎంతో మీకు తెలుసా ? (పేజి. నెం. 149)
జవాబు:
కోడిగుడ్లు పొదగటానికి పట్టేకాలం 21 రోజులు అని నాకు తెలుసు.

ప్రశ్న 25.
మీ గ్రామాలలో గుడ్లను పొదిగే విధానంపై నివేదిక తయారుచేయండి. బొమ్మలు కూడా గీయండి. (పేజి.నెం. 149)
జవాబు:
మా గ్రామాలలో పొదిగే కాలం రాగానే గంపలో గడ్డిపరచి దానిమీద గుడ్లు ఉంచితే కోళ్ళు గుడ్లపై కూర్చొని గుడ్లన పొదుగుతాయి. . విద్యార్థి స్వయంకృత్యం

ప్రశ్న 26.
పరాగ సంపర్కానికి తేనెటీగలు ఎలా తోడ్పడతాయి ? (పేజి.నెం. 150)
జవాబు:
తేనెటీగలు మకరందం కోసం ఒక పువ్వుపై వాలుతాయి. అప్పుడు దాని శరీరానికి పరాగరేణువులు అంటుకొని ఉంటాయి. అది తర్వాత వేరే పుష్పంపై మకరందం కోసం వెళితే ఆ పరాగరేణువులు ఆ పుష్పంలోని కీలాగ్రంపై చేరును.
ఈ విధంగా తేనెటీగలు పరాగసంపర్కానికి సహాయపడును.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 27.
మీ పరిసరాలలో తేనెపట్టును ఎక్కడ గమనించారు ? (పేజి.నెం. 152)
జవాబు:
మా పరిసరాల్లో పెద్ద పెద్ద చెట్లకు మరియు పెద్ద పెద్ద భవనాలకు తేనెపట్టు ఉండటం గమనించాం.

ప్రశ్న 28.
తేనెపట్టును ఏ కాలంలో ఎక్కువగా చూడవచ్చు ? (పేజి.నెం. 152)
జవాబు:
తేనెపట్టు ఏ కాలంలో అయితే ఎక్కువగా మొక్కలకు పూలు పూస్తాయో ఆ కాలంలో చూస్తాము. అది వర్షాకాలం, ఎండకాలానికి ముందు (శిశిర ఋతువు) పూలు బాగా పూస్తాయి.

ప్రశ్న 29.
తేనెపట్టు నుంచి తేనె సేకరించడం జాగ్రత్తగా చేసే పని. తేనెపట్టు నుంచి తేనె ఎలా సేకరిస్తారో, సేకరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో రాయండి. (పేజి.నెం. 152)
జవాబు:
తేనెపట్టు ఉన్న చోట పొగ పెట్టించి ఈగలను ప్రక్కకు మళ్లించి తేనె తీయడం “జరుగును. ఈగలు ప్రక్కకు వెళ్ళిన ఆ తరువాత తేనెపట్టును జాగ్రత్తగా కత్తిరించి తేనెను తీస్తారు. తేనె తీసే మనిషి గోనె సంచి ఒంటినిండా కప్పుకుంటారు.

ప్రశ్న 30.
కృత్రిమ మరియు సహజ తేనెపట్టుల మధ్య గల వ్యత్యాసాలను గురించి చర్చించండి. (పేజి.నెం. 152)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి 5

ప్రశ్న 31.
తేనెటీగల మైనం యొక్క ఉపయోగాలు వ్రాయండి. (పేజి.నెం. 152)
జవాబు:
తేనెటీగల మైనంతో అలంకరణ సామగ్రి, గోళ్ళ రంగు, కొవ్వొత్తులు, చెప్పుల పాలిష్ మొదలైనవి తయారుచేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 32.
మీ చుట్టుపక్కల దొరికే వివిధ రకాల చేపల జాబితాను తయారుచేయండి. స్థానిక పేర్లను మాత్రమే రాయండి. (పేజి.నెం. 153)
జవాబు:
మా చుట్టుపక్కల దొరికే వివిధ రకాల చేపల స్థానిక పేర్లు :

  1. బొచ్చె
  2. రాహు, ఎర్రగండు
  3. రాగండి
  4. ఎర్రమోసు
  5. పెద్ద బొచ్చె
  6. వాలుగ
  7. మట్ట గిడస
  8. పులస
  9. సొర

ప్రశ్న 33.
మీకు కొలనులో చేపలను ఎలా పట్టాలో తెలుసా ? (పేజి.నెం. 153)
జవాబు:
తెలుసు, మేము కొలనులో చేపలను పట్టుటకు ఫిషింగ్ నెట్స్, ఫిషింగ్ రాడ్స్ ఉపయోగిస్తాము.

ప్రశ్న 34.
అధిక మొత్తంలో చేపలను పట్టడానికి ఏం చేస్తారు ? (పేజి.నెం. 153)
జవాబు:
అధిక మొత్తంలో చేపలు పట్టడానికి ఈ క్రింది విధంగా చేస్తాము.
1. అధిక మొత్తంలో చేపలు పట్టుకొనుటకు నైలాన్ వలలు ఉపయోగిస్తారు. .
2. పెద్ద వలలను, మోటార్ పడవలను ఉపయోగిస్తారు.

ప్రశ్న 35.
మర పడవలు ఉపయోగించి చేపలు పట్టడాన్ని నిరంతరంగా కొనసాగిస్తే ఏం జరుగుతుంది ? (పేజి.నెం. 153)
జవాబు:
మర పడవలు ఉపయోగించి చేపలు పట్టడాన్ని నిరంతరం కొనసాగిస్తే

  1. సహజ వనరుల దుర్వినియోగం జరుగును.
  2. కొన్ని చేపల జాతులు అంతరించును.
  3. చేపలను ఆహారంగా తినే ఇతర జీవులకు హాని కలుగును.
  4. ఆహారపు గొలుసు, ఆవరణ వ్యవస్థ అస్తవ్యస్థం అగును.

ప్రశ్న 36.
ఆలుచిప్పలు వలన కలిగే ఉపయోగాలను మీ ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకోండి. (పేజి.నెం.153)
జవాబు:

  1. ఆలుచిప్పలు విటమిన్ – డి, కాల్షియం, విటమిన్ – బి, ప్రొటీన్లు, మంచి కొలెస్ట్రాల్, ఇనుమును కలిగి ఉంటాయి.
  2. నీటిని వడకట్టి శుభ్రపరుస్తాయి.
  3. ఆలుచిప్పలు తినుటవలన లైంగిక సామర్థ్యం పెరుగును.
  4. కొన్ని ఆలుచిప్పలు ముత్యాల తయారీలో ఉపయోగపడును.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 37.
మన సముద్ర జలాలలో “టూనా” అనే ముఖ్యమైన చేప లభిస్తుంది. టూనా చేపకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి గోడ పత్రికలో ప్రదర్శించండి. (పేజి.నెం. 153).
జవాబు:
టూనా చేప 1 నుంచి 10 అడుగుల వరకు పెరుగును. 600 కేజీల బరువు ఉండును. 70 కి.మీ. వేగంతో ఈదును. 26°C ఉష్ణోగ్రత వద్ద నివసించును. దీనిలో ముఖ్యంగా 3 ఓమెగో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అసలు ఉండవు. క్రొవ్వులు కూడా తక్కువగా (8 గ్రాములు) ఉండును. ప్రొటీన్స్ ఎక్కువగా ఉండును.
ఈ “టూనా” చేపల ఉపయోగాలు :

  1. గుండెపోటు రాకుండా చేయును.
  2. పిల్లలలోను ఆస్మా తగ్గించును.
  3. మానసిక ఒత్తిడులను తగ్గించును.
  4. కీళ్ళ నొప్పులను తగ్గించును.
  5. పక్షవాతం నుంచి వ్యక్తి తొందరగా కోలుకొనుటకు సహాయపడును.

ప్రశ్న 38.
నీలి విప్లవం అనగానేమి ? దాని ప్రభావాన్ని తరగతి గదిలో ఉపాధ్యాయునితో చర్చించండి. (పేజి.నెం. 154)
జవాబు:
చేపల పెంపకం, దిగుబడి పెంచటానికి, నాణ్యత అధికం చేయుటకు జరిగిన ప్రయత్నమే నీలి విప్లవం అంటారు.
నీలి విప్లవం ప్రభావం :

  1. పెరుగుతున్న జనాభా అవసరానికి సరిపోవును.
  2. ఎగుమతులకు సరిపోయినన్ని చేపలు లభించును.
  3. సముద్రాలలో ఆవరణ వ్యవస్థ అంతగా పాడవదు.
  4. వ్యవసాయదారులకు రెండవ పంటగా ఉపయోగపడును.

ప్రశ్న 39.
మీ ప్రాంతంలో చేపలను నిల్వచేసే పద్ధతుల జాబితా రాయండి. (పేజి.నెం. 155)
జవాబు:
మా ప్రాంతంలో చేపలను క్రింది పద్ధతుల్లో నిల్వ చేస్తారు.

  1. ఎండలో ఎండబెట్టడం
  2. పాక్షికంగా ఎండబెట్టడం
  3. ఉప్పులో ఊరబెట్టడం
  4. పొగబెట్టడం

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

SCERT AP 8th Class Biology Study Material Pdf 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 8th Lesson Questions and Answers మొక్కల నుండి ఆహారోత్పత్తి

8th Class Biology 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
గోధుమ పంటను రబీలోనే ఎందుకు పండిస్తారో కారణాలు చెప్పండి.
జవాబు:

  1. చాలా మొక్కలు పుష్పించుటకు, రాత్రి సమయానికి దగ్గర సంబంధం ఉంటుంది.
  2. గోధుమ మొక్కలు పుష్పించుటకు రాత్రి సమయం సుమారుగా 12 గంటలు కావాలి.
  3. గోధుమపంట సాగు రబీలో అనగా (అక్టోబర్, నవంబర్ మధ్య) మొదలు పెడితే అవి పుష్పించుటకు 8-10 వారాలు పట్టును.
  4. జనవరి చివరి నుంచి ఫిబ్రవరి వరకు రాత్రి సమయం సుమారుగా 12 – గంటలు ఉంటుంది.
  5. కాబట్టి గోధుమపంటను రబీలోనే సాగుచేస్తారు.

ప్రశ్న 2.
రామయ్య తన పొలాన్ని చదునుగా దున్నాడు. సోమయ్య పొలం హెచ్చుతగ్గులు ఉంది. ఎవరు అధిక దిగుబడి సాధిస్తారు? ఎందుకు ?
జవాబు:
రామయ్య ఎక్కువ దిగుబడి సాధిస్తాడు. కారణం నేలను చదును చేయడం వలన పొలంలో నీరు అన్నివైపులకు సమానంగా ప్రసరించును. పొలంలో వేసిన పశువుల ఎరువు కూడా సమానంగా నేలలో కలిసి అన్ని మొక్కలకు అందును. విత్తనాలు వేయుటకు లేదా నారు మొక్కలు నాటడానికి వీలుగా ఉండును.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 3.
పొలాన్ని దున్నడం వల్ల ప్రయోజనాలేమిటి ?
జవాబు:
పొలాన్ని దున్నడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి :

  1. మట్టి మృదువుగా మారడం వల్ల నేల లోపల నీరు చాలాకాలం నిల్వ ఉంటుంది.
  2. వేళ్ళు నేలలోకి సులభంగా చొచ్చుకొని పోవడానికి వీలు అగును.
  3. వేళ్ళకు శోషించడానికి అవసరమైన గాలి, నీరు నేలలోకి సులభంగా చేరును.
  4. రైతులకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, వానపాములు వంటివి మెత్తటి మృదువైన మట్టిలో బాగా పెరుగుతాయి.
  5. నేలను దున్నడం వల్ల నేల లోపల ఉన్న కొన్ని రకాల అపాయకరమైన సూక్ష్మజీవులు, క్రిమికీటకాల గ్రుడ్లు బయటికి వచ్చి సూర్యుని వేడికి నశించును.

ప్రశ్న 4.
నేనొక మొక్కను, నేను పంటపొలాల్లో పెరుగుతాను. రైతులు నన్ను చూస్తేనే పీకేస్తారు. కారణం ఎందుకో నాకు తెలియదు. నీవు చెప్పగలవా ? నేనెవరిని ?
జవాబు:
నీవు పొలాల్లో సాగు మొక్కలతో బాటు పెరిగే కలుపుమొక్కవి. రైతులు నిన్ను చూస్తేనే పీకేస్తారు. కారణం సాగు మొక్కలతో ఆశ్రయం కోసం, ఆహారం కోసం పోటీపడతావు. వాటికి చేరవలసిన పోషక పదార్థాలు నీవు గ్రహిస్తావు. అంతేకాకుండా వ్యాధుల వ్యాప్తిలో కూడా పాత్ర పోషిస్తావు.

ప్రశ్న 5.
రైతులు వరిపంటను కోసిన తర్వాత ఎండలో ఎందుకు ఆరబెడతారు. ఎందుకు ?
జవాబు:
రైతులు వరిపంటను కోసిన తర్వాత ఎండలో ఎందుకు ఆరబెడతారంటే దాని కాండంలోను, ఆకులలోను, కంకులలోను ఉన్న తేమ పోవటం కోసం. కాండంలోను, ఆకులలోను తేమ పోకపోతే కుప్పగా వేసిన తర్వాత వాటినుండి ఆవిరి వచ్చి కంకులలో ఉండే ధాన్యం రంగు మారుతుంది.
కంకులలో ఉండే తేమ పోకపోతే కంకులకు బూజు (శిలీంధ్రాలు) పడుతుంది.

ప్రశ్న 6.
వేసవి దుక్కులు అంటే ఏమిటి ? ఇవి పర్యావరణానికి ఏ విధంగా మేలుచేస్తాయో రాయండి.
జవాబు:
రైతులు వేసవికాలంలోనే తమ పొలాలను దున్నుతారు. వీటిని వేసవి దుక్కులు అంటారు. వాటివలన గాలి మట్టి రేణువుల మధ్య చేరును. అందువలన నేల గుల్లబడును. అంతేకాకుండా నేలలో క్రిములు, సూక్ష్మజీవులు కూడా నశించును. కాబట్టి పంటలు వేసినప్పుడు వ్యాధులు తక్కువగా వచ్చును. దీనివలన క్రిమిసంహారక మందులు తక్కువగా వాడుట జరుగును. ఈ విధంగా వేసవి దుక్కులు పర్యావరణానికి మేలు చేస్తున్నాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 7.
గ్రామంలో రైతులందరూ ఒకే రకమైన పంట వేశారు. దీని వలన కలిగిన నష్టాలు ఏమిటో వివరించండి.
జవాబు:
గ్రామంలో రైతులందరూ ఒకే రకమైన పంటలు వేయడం వలన చాలా నష్టాలు కలుగుతాయి. అవి :

  1. అందరూ ఒకే పంటవేస్తే విత్తన కొరత వచ్చును.
  2. అందరూ వరి వేస్తే నీటి సమస్య వచ్చి జీవరాసులపై ప్రభావం చూపును.
  3. అందరికీ ఒకే ఎరువులు కావాలి. కాబట్టి వాటి ధర కూడా పెరుగును.
  4. ఒక పొలంలో వ్యాధులు సోకితే మిగతా పొలాలకు కూడా చాలా తొందరగా వ్యాధులు వ్యాపించును. దీనివలన జీవవైవిధ్యానికి ఆటంకం వచ్చును.
  5. ఒకవేళ, అందరికీ పొలాలు బాగా పండి పంట దిగుబడి ఎక్కువ వస్తే అమ్మకపు ధర పడిపోవును.
  6. అమ్మకపు ధర తగ్గితే రైతు నష్టపోవును.

ప్రశ్న 8.
రాత్రి కాలానికి, పంట దిగుబడికి సంబంధం ఏమిటి ?
జవాబు:
రాత్రి కాలానికి, పంట దిగుబడికి చాలా దగ్గర సంబంధం గలదు. మొక్క పుష్పించడం రాత్రికాల సమయం పై ఆధారపడి ఉంది. ఉదా : కొన్ని మొక్కలు రాత్రికాల సమయం 12 1/2 గంటలు ఉన్నప్పుడు మాత్రమే అధికంగా పుష్పించును. ఉదా: గోధుమ.
మరికొన్ని మొక్కలు రాత్రికాల సమయం 12 1/2 గంటలు కన్నా ఎక్కువ ఉన్నప్పుడే బాగా పుష్పిస్తాయి. ఉదా : జొన్న, ప్రత్తి.
పుష్పించిన తర్వాత పరాగ సంపర్కం జరుగును. పరాగ సంపర్కం జరిగిన తర్వాత ఫలదీకరణ జరుగును. ఫలదీకరణ తర్వాత పుష్పాలు కాయలుగా మారును. కాసిన దానిని బట్టే పంట దిగుబడి ఉండును.

ప్రశ్న 9.
విత్తనాలు నేలలో విత్తే ముందర శిలీంధ్ర నాశకాల వంటి రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు. ఎందుకు ?
జవాబు:
విత్తనాలు నేలలో విత్తే ముందర శిలీంధ్ర నాశకాల వంటి రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు. ఎందుకంటే నేలలో ఉన్న ఏవైనా శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవుల నుండి విత్తనాలను రక్షించుకొనుటకు రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు.

ప్రశ్న 10.
నారు పోసి పెంచి వాటిని తిరిగి పొలాల్లో నాటే పద్ధతిలో పెంచే పంటలకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
1. వ్యవసాయంలో కొన్ని పంటలను నారు పోసి పెంచి తిరిగి పంట పొలాల్లో నాట్లు వేస్తారు.
2. ఈ పద్ధతిని ప్రధానంగా వరి పంటలో పాటిస్తారు.
3. వరితో పాటుగా, మిరప, వంగ, టమోటా, పొగాకు వంటి పంటలలోనూ నాట్లు వేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 11.
సత్యనారాయణ తన పొలంలో ప్రత్తి పంట పండించాడు. అతనికి సరైన దిగుబడి రాలేదు. పంట దిగుబడి సరిగా రాకపోవడానికి గల కారణాలు ఊహించి చెప్పగలరా ? (లేదా) ఒక రైతు తన పొలంలో పత్తి పంట పండించాడు. పత్తి దిగుబడి సరిగా రాలేదు. దీనికి ఏవైనా నాలుగు కారణాలు ఊహించి రాయండి.
జవాబు:

  1. అతను వేసిన నేల ప్రత్తి పంటకు అంత అనుకూలంగా లేకపోవచ్చు.
  2. అతను పంటను రబీ సీజన్లో వేసి ఉండవచ్చు. దీనివలన అది పుష్పించుటకు కావలసిన రాత్రి సమయం (12 1/2 గంటల కంటే ఎక్కువ) ఉండదు.
  3. పొలాన్ని సరిగా దున్ని, చదును చేయకపోవచ్చు.
  4. ప్రత్తి పంటకు సరైన నీటి పారుదల వసతి కల్పించకపోవచ్చు.
  5. ప్రత్తి విత్తనాల ఎంపిక సరిగా చేయకపోవచ్చు.
  6. కలుపు మొక్కలను పత్తి పంట నుంచి తొలగించకపోవచ్చు.
  7. ప్రత్తి పంటకు. వ్యాధులు సోకిన గమనించక పోవచ్చు.
  8. ప్రత్తి పంటకు సరైన కాలంలో శిలీంధ్ర నాశకాలు ఉపయోగించటం జరగకపోవచ్చు.

ప్రశ్న 12.
రహీం తన పంట పొలంలో కలుపు మొక్కలను తొలగించాడు. కాని డేవిడ్ కలుపు తీయలేదు. ఎవరు అధిక దిగుబడి సాధిస్తారో ఊహించండి ? ఎందుకు ?
జవాబు:
డేవిడ్ ఎక్కువ దిగుబడి సాధిస్తాడు. కారణం కలుపు మొక్కలను పొలంలో కలియదున్నాడు. అవి మడి ఉన్న నీటిలో కుళ్లి పోతాయి. అప్పుడు వాటిలోని పోషక పదార్థాలు నేలలోకి చేరతాయి. అది జీవ ఎరువు వలె పని చేయును.

ప్రశ్న 13.
పిడికెడు శెనగలను నీళ్ళలో వేయండి. మీరేమి పరిశీలించారో కింది ప్రశ్నల ఆధారంగా విశ్లేషించండి.
ఎ) రెండు రకాల విత్తనాల్లో మీరేమి తేడాను గమనించారు ?
బి) ఏ విత్తనాలు తక్కువ బరువు కలిగి ఉన్నాయి ? ఎందుకు ?
సి) ఏ విత్తనాలు బాగా మొలకెత్తాయి? ఎందుకు ?
డి) ఏ విత్తనాలు సరిగా మొలకెత్తవు ? ఎందుకు ?
జవాబు:
ఎ) కొన్ని విత్తనాలు నీటిపై తేలుతున్నాయి. కొన్ని విత్తనాలు నీటిలో మునిగిపోయాయి.
బి) కీటకాలు విత్తనం లోపల గల ఆహార పదార్థాలు తినుట వలన పుచ్చులు ఏర్పడి తక్కువ బరువు కలిగి ఉన్నాయి.
సి) నీటిలో మునిగి నీటిని బాగా పీల్చుకున్న విత్తనాలు బాగా మొలకెత్తాయి. కారణం పోషక పదార్థాలలో ఉన్న షుప్తావస్థ మేలుకోవడం వలన.
డి) నీటిపై తేలిన విత్తనాల లోపల పోషక పదార్థాలు తక్కువగా ఉండబట్టి సరిగా మొలకెత్తవు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 14.
వరి (వడ్ల గింజలు) విత్తనాలు తీసుకొని ఒక రోజంతా నానబెట్టండి. వాటిని వాచ్ గ్లాస్ లో తీసుకొన్న మట్టిలో నాటండి. మొలకెత్తిన తర్వాత భూతద్దంలో పరిశీలించి ప్రథమమూలం, ప్రథమ కొండం మొదలైన భాగాలు గుర్తించి, పటం గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 1

ప్రశ్న 15.
మీ దగ్గరలోని ఎరువుల దుకాణానికి వెళ్ళి రసాయనిక ఎరువుల వివరాలు సేకరించి కింది పట్టికలో నింపండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 2
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 3

ప్రశ్న 16.
వరి పంటలో నాటడం నుండి దాచడం వరకు ఉన్న వివిధ దశలను వివరించే ఫ్లోచార్టును తయారు చేయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 4
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 5

ప్రశ్న 17.
తక్కువ నీటి లభ్యత గల ప్రాంతాలలో అనుసరించే నీటిపారుదల పద్ధతులను నీవెలా ప్రశంసిస్తావు?
జవాబు:

  1. తక్కువ నీటి లభ్యత గల ప్రాంతాలలో నీటిని పొదుపుగా వాడుకోవటానికి బిందు సేద్యం, స్ప్రింక్లర్స్ వంటి పరికరాలు ఉపయోగిస్తారు.
  2. వీటి వలన చాలా తక్కువ నీటితో వ్యవసాయం చేయవచ్చును.
  3. శాస్త్ర విజ్ఞానం అందించిన ఈ పద్దతులు నాకు బాగా నచ్చాయి.
  4. ఈ పద్దతుల వినియోగం వలన నీటికొరత ప్రాంతాలు ఆర్థికంగా బలపడ్డాయి.
  5. వీటి వినియోగం వలన సహజవనరు అయిన నీరు ఆదా చేయబడుతుంది.
  6. ప్రజల జీవన విధానాన్ని మెరుగుపర్చే ఇటువంటి పద్ధతులు అభినందనీయమైనవి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 18.
నరేంద్ర ప్రత్తిపంటపై అధిక మోతాదులో క్రిమిసంహారక మందులు చల్లాడు. ఇది జీవవైవిధ్యానికి, పంట దిగుబడికి ఎంతో హానికరం అని రమేష్ అన్నాడు. నీవు రమేష్ చెప్పిన దానితో ఏకీభవిస్తున్నావా ? ఎందుకు ?
జవాబు:
నేను రమేష్ చెప్పిన దానితో ఏకీభవిస్తాను. ఇది జీవవైవిధ్యానికి, పంట దిగుబడికి ఎంతో హానికరం. అధిక మొత్తంలో క్రిమిసంహారక మందుల వలన హానికరమైన కీటకాలతో బాటు పరాగ సంపర్కానికి సహాయపడు కీటకాలు మరణించును. పరాగ సంపర్కం జరగకపోతే ఫలదీకరణం జరగదు.

అప్పుడు పంట దిగుబడి తగ్గును. క్రిమిసంహారక మందుల వలన కొన్ని కీటక జాతులు అంతరించిపోవును. అప్పుడు ఆ కీటకాలను తిని బ్రతికే జీవులు అంతరించిపోవును. ఆ విధంగా జరిగితే ఆహారపు గొలుసు అస్తవ్యస్తం అగును. ఇది జీవవైవిధ్యంపై ప్రభావం చూపును.

ప్రశ్న 19.
వెంకటేష్ వరిపంటకు నీళ్లను పెట్టే పద్ధతిని చూశాడు. తాను కూడా మొక్కజొన్న పంటకు ఇలాగే నీళ్లను పెట్టాలనుకున్నాడు. నీవు అతనికి ఏ సూచనలు, సలహాలు ఇస్తావు ?
జవాబు:
వెంకటేష్ కు మొక్కజొన్న పంటకు, వరిపంటకు నీళ్ళు పెట్టే విధంగా పెట్టవద్దు అని నేను సూచన చేస్తాను. ఇంకా అతనికి మొక్కజొన్న అనేది. మెట్ట పంట మరియు వర్షాధారపు పంట అని, వరిపంటకు అవసరమైనంత నీళ్ళు మొక్కజొన్నకు అవసరం లేదు అని సలహా ఇస్తాను.

8th Class Biology 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి InText Questions and Answers

కృత్యములు

ప్రశ్న 1.
భారతదేశ పటం చూడండి. మన దేశంలో ఏ ఏ పంటలు ఎక్కడెక్కడ పండిస్తున్నారో పరిశీలించి రాయండి. (అవసరమైతే అట్లాసును కూడా ఉపయోగించుకోండి.)
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 6
జవాబు:
వరి : అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్, హర్యానా, కాశ్మీర్
గోధుమ : ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర
మొక్కజొన్న : రాజస్థాన్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, కర్ణాటక, గుజరాత్
జొన్న : రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్
పప్పుధాన్యాలు: మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్
చెరకు : ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్
జనపనార : పశ్చిమబెంగాల్, బీహార్, ఒడిశా, అసోం
కొబ్బరి : కేరళ
ప్రత్తి : కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్
టీ : కర్ణాటక, అసోం, మణిపూర్

1. మన దేశంలోని అన్ని ప్రాంతాలలో పండే పంటలు ఏవి ?
జవాబు:
వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, ప్రత్తి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

2. కొన్ని పంటలను అన్ని ప్రాంతాలలోనూ ఎందుకని పండించగలుగుతున్నారు ?
జవాబు:
సారవంతమైన భూమి, నీరు లభ్యత వలన.

3. పై పట్టికలో మీ ఊళ్ళో పండే పంటలు ఏవో గుర్తించి రాయండి.
జవాబు:
వరి, చెరకు, మొక్కజొన్న, పెసలు.

4. మీ సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకాన్ని గాని, గ్రంథాలయంలోని పుస్తకాలను గాని చూసి వివిధ ప్రదేశాలలో ప్రధానంగా పండే పంటలు జాబితా తయారుచేయండి.
జవాబు:
దేశం : వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న.
రాష్ట్రం : వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ప్రత్తి, చెరకు, జనపనార జిల్లా : వరి, చెరకు, మామిడి, అరటిపండు
మీ గ్రామం : వరి, చెరకు (గమనిక : ఏ గ్రామ విద్యార్థులు అక్కడ పండే పంటలు సేకరించి రాసుకోవాలి.)

ప్రశ్న 2.
మీ గ్రామంలోని రైతులను అడిగి ఏ పంటలు పండడానికి ఎంతకాలం పడుతుందో వివరాలు సేకరించండి. కింది పట్టికలో రాయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 7

1. పంటలు పండుటకు ఎంత కాలం పడుతుంది ?
జవాబు:
సుమారుగా 100 రోజుల లోపు నుంచి దాదాపుగా 365 రోజులు పడుతుంది.

2. అన్ని పంటలు పండడానికి పట్టేకాలం ఒక్కటేనా ?
జవాబు:
కాదు.

3. మీకు తెలిసిన పంటలలో ఏ పంట పండడానికి ఎక్కువ సమయం పడుతుంది ?
జవాబు:
చెరకు

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

3. పంటలను ఎప్పుడు పండిస్తారు ?

ప్రశ్న 1.
మనం రకరకాల పండ్లు, కూరగాయలు తింటుంటాం. సంవత్సరం పొడవునా అన్ని రకాల పండ్లు, కూరగాయలు మనకు లభిస్తాయా ? కొన్ని కాలాల్లో అధికంగాను, కొన్ని కాలాల్లో తక్కువగాను లభిస్తాయి. కొన్ని ఒక ప్రత్యేక రుతువులో తప్ప మిగిలిన సమయాల్లో అసలు లభించవు. జట్టులో చర్చించి ఏ కాలంలో ఏవి లభిస్తాయో కింది పట్టికలో రాయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 8

1. ఏ కాలంలో ఎక్కువ రకాల కూరగాయలు మనకు మార్కెట్లలో లభిస్తాయి ? ఎందుకు ?
జవాబు:
వర్షాకాలంలో వర్షపు నీరు వలన.

సాధారణంగా రైతులు వర్షాకాలంలోనే వివిధ రకాల కూరగాయలు పండిస్తారు. కారణమేమిటో ఊహించి చెప్పగలరా ?
జవాబు:
కావలసినంత నీరు లభిస్తుంది. కాబట్టి.

ప్రశ్న 4.
కింది ఫోను చూడండి. ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 9

1. రబీ సీజన్లోనే గోధుమ పంటను ఎందుకు సాగుచేస్తారు ?
జవాబు:
ఫిబ్రవరి నెలలో వాతావరణం వేడిగా ఉంటుంది. గింజ అభివృద్ధి చెందడానికి ఇది సరైన సమయం. గోధుమ పుష్పించడానికి రాత్రి కాల సమయం తక్కువగా ఉండటంతో పాటు విత్తనాలు ఏర్పడటానికి తగినంత వేడి కూడా వాతావరణంలో ఉండటం అవసరము. అందుకే గోధుమపంటను రబీ సీజన్ లోనే సాగుచేస్తారు.

2. సెప్టెంబరు నెలలో సాగుచేస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:
సెప్టెంబరులో సాగుచేస్తే అవి పుష్పించుటకు 8 నుండి 10 వారాలు పట్టును. అనగా జనవరిలో పుష్పించుట జరుగును. రాత్రి సమయం ఎక్కువగా అనగా 12 1/2 గంటలు ఉంటుంది. కాబట్టి పుష్పాలు సరిగా రావు. పంట దిగుబడి తగ్గుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

3. ఎందుకు ఖరీఫ్ సీజన్లో గోధుమపంట సాగు చేయరు ?
జవాబు:
అవి పుష్పించుటకు కావల్సినంత రాత్రి సమయం ఉండదు కాబట్టి.

4. గోధుమ పంటను నవంబర్ లో సాగుచేస్తే ఏమవుతుంది ?
జవాబు:
గోధుమ పంటను నవంబర్ లో సాగుచేస్తే పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. కారణం ఫిబ్రవరిలో రాత్రి కాల సమయం తక్కువగా ఉండి, విత్తనాలు ఏర్పడటానికి తగినంత వేడి కూడ వాతావరణంలో ఉండును.

5. గింజలు బలంగా పెరగడానికి తగినంత ఉష్ణోగ్రత అవసరం. మరి మనకు ఎప్పుడు వేడి అధికంగా ఉంటుంది ?
జవాబు:
రబీ సీజన్లో వేడిమి ఎక్కువగా ఉంటుంది.

5. వరిసాగు

ప్రశ్న 5.
మీ దగ్గరలోని రైతులను అడిగి వివరాలు సేకరించి కింది పట్టిక నింపండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 10

1. ఏ కాలంలో రైతులు అధిక ఫలసాయం, ఆదాయం పొందుతున్నారు ?
జవాబు:
ఖరీఫ్ కాలంలో.

2. మంచి పరిమాణంలో ఉండే గింజలు ఏ కాలంలో వస్తాయి ? రబీలోనా ? ఖరీఫ్ లోనా ?
జవాబు:
ఖరీఫ్ లో.

3. మూడవ పంట గురించి తెలుసా ? మన రాష్ట్రంలో మూడవ పంటగా వేటిని పండిస్తారు ?
జవాబు:
తెలుసు. అపరాలను మన రా” లో 3వ పంటగా పండిస్తారు.

4. ఖరీఫ్, రబీ రెండు కాలాలలోనూ పండే పంటలు ఏమిటి ?
జవాబు:
వరి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

5. రబీ సీజన్ కంటే ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని మీరు అంగీకరిస్తారా ? అయితే కారణాలు చెప్పండి.
జవాబు:
అంగీకరిస్తాను. కారణాలు ఖరీఫ్ సీజన్ లో వరి మొక్కల పెరుగుదలకు అవసరమైనంత నీరు లభించును. వేడిమి తక్కువగా ఉండును

6. మంచి విత్తనాలను వేరు చేయడం, ఎంపిక చేయడం ఎలాగో మీకు తెలుసా ?

ప్రశ్న 6.
గుప్పెడు శనగ విత్తనాలను తీసుకొని బక్కెట్లోని నీళ్లలో వేయండి. కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలుతాయి. నీళ్ళపై తేలిన విత్తనాలన్నింటిని తీసివేయండి. నీళ్ళలో మునిగిన వాటిని అలాగే ఒక రోజంతా ఉంచండి. మరుసటి రోజు వీటిని ఆరబెట్టి గిన్నెలోగాని, పాత్రలోగాని వేసి మూత పెట్టి తగినంత వేడిగా ఉండే చీకటి గదిలో ఉంచండి. 2 లేక 3 రోజుల తర్వాత విత్తనాలను పరిశీలించండి. ఏం జరిగినది ? నీవెప్పుడైనా మొలకెత్తిన గింజల్ని తిన్నావా ?
జవాబు:
శనగ విత్తనాల నుంచి మొలకలు రావడం జరిగినది. నేను చాలాసార్లు మొలకెత్తిన గింజలు తిన్నాను.

1. ఎందుకు కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలాయి ?
జవాబు:
కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలుతాయి. కారణం అవి పుచ్చు విత్తనాలు అయి ఉండటం వలన విత్తనం లోపల ఖాళీగా ఉండి నీటికన్న తక్కువ సాంద్రత ఉంటాయి. అందుకని నీటిపై తేలుతాయి.

2. తేలిన విత్తనాలను ఎందుకు తీసి వేయాలి ?
జవాబు:
తేలిన విత్తనాలకు మొలకెత్తే సామర్థ్యం ఉండదు కాబట్టి వాటిని తీసివేయాలి.

3. విత్తనాలను ఒక రోజంతా నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి ?
జవాబు:
విత్తనాలను ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టడం వలన విత్తనం తేమగా అయ్యి విత్తనాలకు అంకురించే శక్తి వస్తుంది.

7. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోండి. ఒక పిడికెడు గింజల్ని నీళ్ళలో వేయండి. కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలుతాయి. వాటిని వేరుచేసి భూతద్దంలో పరిశీలించండి. నీటమునిగిన గింజలకు, తేలిన గింజలకు గల పోలికలు, భేదాలను గుర్తించి మీ పరిశీలనలను కింది పట్టికలో ‘✓’ గుర్తు పెట్టండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 11

1. పై రెండు రకాల గింజల్లో ఏవైనా తేడాలను మీరు గుర్తించారా ?
జవాబు:
పై రెండు రకాల గింజల్లో తేడాలను మేము గమనించాము.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

2. నీళ్ళపై తేలిన విత్తనాలు తక్కువ బరువు ఎందుకున్నాయో చెప్పగలరా ?
జవాబు:
లోపల పోషక పదార్థాలు లేక ఖాళీగా ఉండడం వలన.

8. ఎంపిక మరియు మొలకెత్తుట

నీళ్ళలో తేలిన విత్తనాలను, మునిగిన విత్తనాలను వేరువేరుగా కుండీల్లో నాటండి. రెండు కుండీల్లోనూ సమానంగా నీరు పోయండి. రెండు కుండీల్లోని మొక్కల పెరుగుదలను పరిశీలించండి. నివేదిక తయారుచేయండి.
తేలిన విత్తనాలు : ఇవి వేసిన కుండీలో మొక్కలు సరిగా రాలేదు. పెరుగుదల తక్కువగా ఉంది.
మునిగిన విత్తనాలు : ఇవి వేసిన కుండీలో మొక్కలు బాగా వచ్చాయి. పెరుగుదల కూడా చాలా బాగుంది.

1. ఏ గింజలు బాగా మొలకెత్తినాయి ? ఎందుకు ?
జవాబు:
నీటిలో మునిగిన విత్తనాలు. కారణం లోపల ఉన్న పోషక పదార్థాలు ఉత్తేజితం అయి విత్తనాలు మొలకెత్తుటకు కావలసిన
శక్తిని ఇస్తుంది.

2. ఏ గింజలు సరిగా మొలకెత్తలేదు ? ఎందుకు ?
జవాబు:
నీటిపై తేలిన గింజలు. కారణం పోషక పదార్థాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి విత్తనాలు మొలకెత్తుటకు కావలసిన శక్తి సరిగా రాదు.

3. అన్ని రకాల పంట గింజలను ఇలాగే పరీక్ష చేస్తారా ?
జవాబు:
అవును, ఇలాగే పరీక్ష చేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

9. ఏ విత్తనాలను ఏ ఏ పద్ధతుల్లో నాటుతారో రైతుల నుండి వివరాలు సేకరించి కింది పట్టికలో నింపండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 12

1. ఒక ఎకరా వరి పంట పండించడానికి ఎన్ని కిలోల వరి గింజలు అవసరమో నీకు తెలుసా ?
జవాబు:
సుమారు 25 కేజీలు.

2. అన్ని రకాల వరి పంటలకు ఇదే పరిమాణంలో అవసరమవుతాయా ?
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 13
జవాబు:
అన్ని రకాల వరి పంటలకు ఇదే పరిమాణంలో అవసరమవ్వవు.
ఉదా : నాటే పద్ధతి – 20 – 25 కేజీలు,
వెదజల్లటానికి – 24 – 30 కేజీలు
శ్రీ పద్ధతి – 2 కేజీలు

3. తక్కువ వితనాలు ఉపయోగించి వరిసాగు చేసే పదతులు ఏమైనా ఉన్నాయా ? విత్తనాలు చెత చల్లటం
జవాబు:
ఉన్నది. ఆ పద్ధతి శ్రీ పద్ధతి.

4. విత్తనాలను నేలలో విత్తిన తరువాత మట్టితో ఎందుకు కప్పుతారు ?
జవాబు:
విత్తనాలను నేలలో విత్తిన తరువాత మట్టితో కప్పుటకు కారణాలు మట్టి నుండి వాటికి కావలసిన తేమను, వేడిమిని పొందుటకు మరియు గుల్లగా ఉన్న నేల నుండి గాలిని తీసుకొనుటకు. మట్టిలో విత్తిన తర్వాత కప్పకపోతే పక్షులు, ఇతర జంతువులు ఆ విత్తనాలను తినేస్తాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

10. నలుగురైదుగురు విద్యార్థులతో జట్లుగా ఏర్పడండి. మీ దగ్గరలోని పొలంలో మందులు ‘చల్లుతున్న రైతులను అడిగి ఏ ఏ పంటలకు ఏ ఏ వ్యాధులు ఎలా వస్తాయి ? వాటిని ఎలా అదుపు చేస్తారు ? ఏ మందులు చల్లుతారు ? వంటి వివరాలు సేకరించి కింది పట్టికలో నింపండి. వ్యాధి పేరు తెలియకపోతే దానిని స్థానికంగా ఏమంటారో రాయండి.
పంటలకు (వరి, వేరుశనగ, చెరకు, మినుము) ముఖ్యంగా అగ్గితెగులు, టిక్కా, ఆకుపచ్చ తెగులు, తుప్పు తెగులు బూడిద తెగులు.
ముఖ్యంగా వ్యాధులు బాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు కొన్ని రకాల కీటకాల వలన వచ్చును.
పంట పేరు, పరిశీలించిన వ్యాధులు, ఉపయోగించిన క్రిమిసంహారక మందులు, ఫలితాలు క్రింది పట్టికలో ఉన్నాయి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 14

1. అందరు రైతులు ఒకే రకమైన పంటపైన ఒకే రకమైన మందులే చల్లుతున్నారా ?
జవాబు:
చల్లరు. అది వాళ్ళ ఇష్టం. ఉదాహరణకు వరి అగ్గి తెగులుకు ట్రైసైక్లోజన్ 75% లేదా ఎడిఫెన్ పాస్ 1 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తారు.

2. అన్ని రకాల పంటల్లో సాధారణంగా కనిపించే వ్యాధి ఏదో గుర్తించావా ?
జవాబు:
రసంపీల్చే పురుగు వ్యాధి.

3. రైతులు క్రిమి సంహారక మందులను ఎక్కడ కొనుక్కుంటారు ?
జవాబు:
ఎరువులు మరియు క్రిమి సంహారక మందులు అమ్మే కొట్టులో కొనుక్కుంటారు.

4. మందులు చల్లడానికి వారు ఎలాంటి పనిముట్లను వాడుతున్నారు ?
జవాబు:
నాక సాక్ స్ప్లేయర్, గటార్ ప్రేయర్, తైవాన్ ప్రేయర్, పవర్ స్ప్లేయర్, రోటరీ డస్టర్.

5. క్రిమి సంహారక మందులు చల్లినప్పుడు క్రిమికీటకాలతో పాటు ఇంకా ఏవైనా చనిపోయినట్లు నీవు గుర్తించావా ? అయితే అవి ఏమిటి ?
జవాబు:
క్రిమిసంహారక మందులు చల్లినప్పుడు క్రిమికీటకాలతో పాటు పరాగ సంపర్కంకు సహాయపడు జీవులు చనిపోయినట్లు నేను గుర్తించితిని. అవి తూనీగలు, సీతాకోక చిలుకలు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

11. మీ పాఠశాల తోటలోని మొక్కలను పరిశీలించండి. మొక్కల ఆకులు, కాండాలను జాగ్రత్తగా పరిశీలించి కింది వివరాలు సేకరించండి. లక్షణం ఉంటే “✓” లేకపోతే “×” పెట్టండి. లక్షణం
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 15
పంటపేరు /మొక్క పేరు : వేరుశనగ స్థలం : మొక్కలలోని ఆకులపైన

1. మొక్కలోని అన్ని ఆకులపైనా మచ్చలున్నాయా ?
జవాబు:
ఉన్నాయి.

2. మచ్చలతో ఉన్న ఆకు బొమ్మను మీ నోటు పుస్తకంలో గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 16

3. ఆకుల అంచులు కత్తిరించబడినట్లుగా ఉండడానికి కారణమేమి ?
జవాబు:
చీడల వలన ఆకులు అంచులు కత్తిరించబడినట్లు ఉండును.

4. కాండంపై ఉండే చారలు, ఆకులపై ఉండే మచ్చలు ఒకేలా ఉన్నాయా ?
జవాబు:
ఒకేలా ఉన్నాయి.

5. ముడుచుకొనిపోయిన ఆకుల్లో ఏవైనా కీటకాలను గుర్తించావా ? అయితే అవి ఏమిటి ?
జవాబు:
కీటకాలు ఉన్నాయి అవి రసం పీల్చే పురుగులు, రెక్కల పురుగులు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

6. ఆకుల మచ్చలపై ఉన్న పొడిలాంటి పదార్థాన్ని సేకరించండి. దాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించండి. మీరేం గమనించారో మీ నోటుపుస్తకంలో రాయండి.
జవాబు:
ఆకుల మచ్చలపై ఉన్న పొడిలాంటి పదార్థాన్ని సేకరించితిని. దాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించితిని. అప్పుడు ఆ పొడిలో శిలీంధ్రం యొక్క తంతువులు, స్పోర్సు కనిపించాయి.

12. చీడ పీడల్ని నియంత్రించే పద్ధతులు

ప్రశ్న 1.
మీ గ్రామంలోని రైతులు వివిధ పంటల్లో వచ్చే క్రిమి కీటకాలను అదుపు చేయడానికి వివిధ రకాల కీటక నాశనులు ఉపయోగిస్తుంటారు. ఇందుకోసం రకరకాల పద్ధతులను ఉపయోగిస్తారు. మీ పెద్దలను కాని), రైతులను కాని అడిగి ఏ ఏ పురుగు మందులను కింది పద్ధతుల్లో ఉపయోగిస్తారో తెలుసుకొని రాయండి.
జవాబు:
1. స్పేయర్ తో చల్లడం : మోనోక్రోటోపాస్, ప్రొఫేనోపాస్, నూవాన్, స్పైనోఫాడ్
2. పొడి మందులు చల్లడం : మిథైల్ థెరాఫియాన్, ఫాలిడాల్
3. నేలలోపల ఉంచడం : కార్బొప్యూరాన్, కార్టాక్ హైడ్రోక్లోరైడ్
4. కాల్చడం, పీకివేయడం : వైరల్ కి సంబంధించిన వ్యాధులలో పొలాల నుంచి ,రోగకారక మొక్కలను కాల్చడం, పీకివేయడం చేస్తారు.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 17

13. రైతులు పంటలకు నీళ్ళెప్పుడు పెడతారు ?

ప్రశ్న 1.
మీ దగ్గరలోని రైతులను అడిగి ఏ ఏ పంటలకు నీళ్ళను ఎప్పుడెప్పుడు పెడతారో తెలుసుకొని కింది పట్టిక నింపండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 18

ప్రశ్న 2.
అన్ని పంటలకు నీళ్ళు ఒకేసారి అందిస్తారా ?
జవాబు:
లేదు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

14. మీ దగ్గరలోని తోటకు వెళ్ళి స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను పరిశీలించండి. ఈ పద్ధతిలో ఉపయోగించే పరికరాలు పనిముట్లు వాటిని అమర్చిన విధానం, నీటిని పంపిణీ చేసే విధానం, ఈ పద్ధతి వల్ల కలిగే లాభాలు, నష్టాలు మొదలగు వివరాలతో నివేదిక తయారుచేయండి. ఇందుకోసం అక్కడి రైతులను కలిసి మాట్లాడండి. వివరాలు సేకరించండి.
జవాబు:
స్ప్రింక్లర్ పద్ధతి :
ఎ) పరికరాలు & పనిముట్లు : మోటారు, గొట్టాలు, గుండ్రంగా తిరిగే స్ప్రింక్లర్స్, కవాటాలు, నాజిల్స్.
బి) వాటిని అమర్చిన విధానం మరియు నీటిని పంపిణీ చేయు విధానం : నీరు ఉన్న ప్రాంతాలలో గొట్టాలు అమర్చి ఒక మోటారు సహాయంతో నీరు బయటకు తెచ్చి పొలంలో లంబంగా అమర్చబడిన గొట్టాలకు గుండ్రంగా తిరిగే స్ప్రింక్లిల్స్ ద్వారా నీటిని పొలంలో వెదజల్లుతారు.
డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) : నీరు ఉన్న ప్రాంతాలలో గొట్టాలు అమర్చి ఒక మోటారు సహాయంతో నీరు బయటకు తెచ్చి పొలంలో సమాంతరంగా నిర్ణీత ప్రదేశాలలో రంధ్రాలు (మొక్క వేరుకు దగ్గరగా) చేయబడిన గొట్టాలు అమర్చి నీటి బిందువుల రూపంలో మొక్క వేరుకు సరఫరా చేస్తారు.
లాభాలు :
1. నీరు ఎక్కువగా అందుబాటులేని చోట
2. ఎత్తు పల్లాలుగా ఉన్న భూమిలో
3. ఇసుక నేలలకు ఈ పద్దతి బాగా ఉపయోగపడును.

నష్టాలు :
1. ఖర్చుతో కూడి ఉన్నది.
2. అన్ని రకాల పంటలకు అనుకూలం కాదు.

15. కలుపు మొక్కల సమాచారం :

ప్రశ్న 1.
మీ దగ్గరలోని రైతులను అడిగి ఏ ఏ పంటలలో ఏ ఏ కలుపు మొక్కలు పెరుగుతాయో తెలుసుకుని ఒక నివేదిక తయారు చేయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 19

16. మీ గ్రామంలోని చుట్టుప్రక్కల గాని, వివిధ పంటలకు పంట నూర్పిడి చేసే పద్ధతుల వివరాలు సేకరించి పట్టిక నింపండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 20

ఆలోచించండి – చర్చించండి

ప్రశ్న 1.
జపాన్లో అధిక దిగుబడి సాధించడానికి గల కారణాలేవి ? (పేజీ.నెం.118)
జవాబు:
జపాన్ వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు ఉపయోగించటం. జపాన్ అత్యధిక దిగుబడి వచ్చే వరి విత్తనాలు ఉపయోగించటం.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 2.
భారతదేశంలో తక్కువ దిగుబడి సాధించడానికి గల కారణాలేవి ? (పేజీ.నెం. 118)
జవాబు:
భారతదేశం వ్యవసాయ రంగంలో ప్రాచీన పద్ధతులు ఉపయోగించుట. వ్యవసాయంలోనికి చదువుకున్న వాళ్ళు రాకపోవటం.

ప్రశ్న 3.
నాగలి కర్రు పొడవుకి, విత్తటానికి ఏమైనా సంబంధం ఉందా ? (పేజీ.నెం. 119)
జవాబు:
లేదు.

ప్రశ్న 4.
మెట్ట పొలాల్లో కూడా నేలను ఇలాగే తయారు చేస్తారా ? (పేజీ.నెం. 119)
జవాబు:
మెట్ట పొలాల్లో కూడా నేలను ఇలాగే తయారు చేస్తారు.

ప్రశ్న 5.
నేలను దున్నడం వల్ల కలిగే ప్రయోజనాలేవి ? (పేజీ.నెం. 119)
జవాబు:
నేలను దున్నడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి :
1) మట్టి మృదువుగా మారడం వల్ల నేల లోపల నీరు చాలా కాలం నిల్వ ఉంటుంది.
2) వేళ్ళు నేలలోకి సులభంగా చొచ్చుకొనిపోవడానికి వీలు అగును.
3) వేళ్ళకు శోషించడానికి అవసరమైన గాలి, నీరు నేలలోకి సులభంగా చేరును.
4) రైతులకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, వానపాములు వంటివి మెత్తటి మృదువైన మట్టిలో బాగా పెరుగుతాయి.
5) నేలను దున్నడం వల్ల నేల లోపల ఉన్న కొన్ని రకాల అపాయకరమైన సూక్ష్మజీవులు, క్రిమికీటకాల గుడ్లు బయటికి వచ్చి సూర్యుని వేడికి నశించును.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 6.
ఎందుకు ఈ చాళ్లు “v” ఆకారంలో ఏర్పడతాయి? నేలలో “V” ఆకారంలో చాళ్లు ఏర్పడటం వల్ల చాళ్ల వెంట నీళ్ళను పాగించడమే కాక ఇంకా ఏ ఏ రకాలుగా ఉపయోగపడుతుందో చెప్పండి. (పేజీ.నెం. 120)
జవాబు:
నాగలి చివర పదునైన ఇనుపబద్ధ (కర్ర) ఉంటుంది. నాగలితో చాళ్ళను చేయునపుడు ఈ కర్ర నేలలోనికి చొచ్చుకొని పోతుంది. అందువలన ఆ ప్రదేశంలో ఉన్న మట్టి కర్రుకు ఇరువైపులా గట్టురూపంలో ఏర్పడుతుంది. కనుక వాళ్ళు v ఆకారంలో ఏర్పడతాయి.

v ఆకారం చాళ్ళు వల్ల ఉపయోగములు :

1) ఈ చాళ్ళ వలన గాలి నీరు లోపలి మట్టి కణాల మధ్యకు సులభంగా చేరతాయి.
2) విత్తనాలను ఒక వరుస తరువాత ఒక వరుస విత్తుతుంటారు. ఆ సమయంలో మొదటి వరుస మట్టితో రెండవ వరుస మూసుకొనుటకు ఈ v ఆకారపు చాళ్ళు ఉపయోగపడును.

ప్రశ్న 7.
ఎరువుల కోసం రైతులు పోట్లాడుకోవడం, ఉద్యమాలు చేయడం మీరెప్పుడైనా చూశారా లేదా పత్రికల్లో చదివారా ? ఎందుకు ఇలా జరుగుతోంది ? ఎందుకు రైతులు ఎక్కువ ఎరువుల బస్తాలు కావాలని కోరుకుంటారు ? దీనికి సంబంధించిన మీ ఆలోచనలు చార్టు మీద రాసి గోడ పత్రికలో ప్రదర్శించండి. (పేజీ.నెం. 130)
జవాబు:
చూశాను మరియు పత్రికల్లో చదివాను. ఇలా జరుగుటకు కారణం ఎరువుల కొరత. రైతులు ఎక్కువ ఎరువుల బస్తాలు కావాలని ఎందుకు కోరుకుంటారు అంటే పంట దిగుబడి పెంచుటకు. దానికి సంబంధించిన నా ఆలోచనలు
1. రసాయనిక (కృత్రిమ) ఎరువులు తక్కువగా వాడటం.
2. జీవ (సహజ) ఎరువుల వాడకాన్ని పెంచటం.

పాఠ్యాంశంలోని ప్రశ్నలు

ప్రశ్న 1.
మూడవ పంట అన్ని ప్రాంతాలలో పండించకపోవడానికి కారణాలు ఏమిటో మీ ఉపాధ్యాయుడితో చర్చించండి. (పేజీ.నెం. 117)
జవాబు:
నీటి పారుదల వసతి లేకపోవడం. నేల సారాన్ని కోల్పోవడం.

ప్రశ్న 2.
వరి పండించే పొలాన్ని చిన్న చిన్న మడులుగా ఎందుకు చేస్తారు ? (పేజీ.నెం. 118)
జవాబు:
పంటకు నీరు అందించుట సులభంగా ఉంటుంది. కాబట్టి వరి పండించే పొలాన్ని చిన్న చిన్న మడుగులుగా చేస్తారు.

ప్రశ్న 3.
వరిని ఎలా పండిస్తారు ? (పేజీ.నెం. 121)
జవాబు:
వరిని నారుపోసి, నాట్లు వేసి చిన్న చిన్న మడులలో పండిస్తారు.

ప్రశ్న 4.
మీ పెద్దలను గాని, రైతులను గాని అడిగి విత్తనాలు ఎక్కడ కొంటారో తెలుసుకోండి. (పేజీ.నెం. 121)
జవాబు:
విత్తనాలను అమ్ముటకు ధ్రువీకరించిన దుకాణాలలో కొంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 5.
ప్రస్తుతం సంప్రదాయంగా సాగుచేస్తున్న విత్తనాలు కనుమరుగవుతున్నాయి ? ఇలా ఎందుకు జరుగుతోంది ఆలోచించండి. (పేజీ.నెం. 122)
జవాబు:
ప్రస్తుతం సంప్రదాయంగా సాగుచేస్తున్న విత్తనాలు కనుమరుగవుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే వాటి స్థానాన్ని సంకరణ జాతి విత్తనాలు ఆక్రమించటం వలన.

ప్రశ్న 6.
మొక్కలో ఏ భాగం వేరుగా మారుతుంది ? (పేజీ.నెం. 122)
జవాబు:
ప్రథమ మూలం మొక్కలో వేరు భాగంగా మారును.

ప్రశ్న 7.
ఏ భాగం కాండంగా మారుతుందో చెప్పగలరా ? (పేజీ.నెం. 122)
జవాబు:
ప్రథమ కాండం కాండంగా మారుతుంది.

ప్రశ్న 8.
ఏ ఏ పదార్థాలు ఉపయోగించి విత్తనశుద్ధి చేస్తారో జాబితా రాయండి. అదే విధంగా విత్తనాలు నాటే ముందు మీ ఊళ్ళో ఇంకా ఏ ఏ రకమైన పద్ధతులు అవలంభిస్తారో తెలుసుకొని మీ నోటు పుస్తకంలో రాయండి. (పేజీ.నెం. 123)
జవాబు:
విత్తనాలను ఈ కింది రసాయనిక పదార్థాలు ఉపయోగించి శుద్ధి చేస్తారు. అవి :
1. కార్బడిజ
2. మాంకో జాజ్
3. ఇమడోకోట్రిడ్

ప్రశ్న 9.
నారు నాటడం ద్వారా ఇంకా ఏ ఏ పంటలు పండిస్తారో మీ స్నేహితులతో చర్చించి రాయండి. (పేజీ.నెం. 123)
జవాబు:
మిరప, వంగ, టమోటా మొదలైనవి నారు నాటడం ద్వారా పంటలు పండిస్తారు.

ప్రశ్న 10.
ఎందుకు నారు మొక్కలను దూరం దూరంగా నాటుతారు ? (పేజీ.నెం. 125)
జవాబు:
నారు మొక్కలు దూరం దూరంగా నాటుటకు కారణం అవి పెరిగి పెద్దగా అయిన తర్వాత స్థలం కోసం, నీటి కోసం, ” ఆహార పదార్థాల కోసం పోటీ లేకుండా ఉండుటకు.

ప్రశ్న 11.
అన్ని రకాల పంటలను నారు మొక్కల్లాగానే పీకి మళ్ళీ నాటుతారా ? అలా ఎందుకు చేయరు ? (పేజీ.నెం. 125)
జవాబు:
అన్ని రకాల పంటలను నారు మొక్కల్లాగా మళ్ళీ పీకి నాటరు. కారణం వాటి విత్తనాలు పెద్దవిగా ఉండటం.

ప్రశ్న 12.
వ్యాధి సోకిన పంటలోని మొక్కలను రైతు ఏం చేస్తాడు ? (పేజీ.నెం. 127)
జవాబు:
వ్యాధి సోకిన పంటలోని మొక్కల ఆకులు, అవసరం అనుకొంటే మొక్కలను రైతు తొలగిస్తాడు. అవి అన్నీ ఒకచోట వేసి కాలుస్తాడు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 13.
రామయ్య, అనే రైతు వ్యాధి సోకిన మొక్కలను పొలం నుండి పీకి కాల్చి వేశాడు. ఇది మంచిదా ? నీ స్నేహితులతో – చర్చించండి. (పేజీ.నెం. 127)
జవాబు:
రామయ్య అనే రైతు వ్యాధి సోకిన మొక్కలను పొలం నుండి పీకి కాల్చి వేశాడు. ఇది చాలా మంచిది. కారణం ఇతర , మొక్కలకు వ్యాధి కొంతమేర సోకదు.

ప్రశ్న 14.
రెండు రకాల కీటక నాశకాలను ఉపయోగిస్తే కీటక సంఖ్య మొదటి సంవత్సరం తగ్గింది కాని మరునాటి సంవత్సరం వాటి సంఖ్య పెరిగింది. కారణాలు తెలపండి. (పేజీ.నెం. 127)
జవాబు:
రెండు రకాల కీటక నాశకాలను ఒక్కసారి ఉపయోగించినపుడు మొదటి సంవత్సరం కీటకాల సంఖ్య తగ్గినది. రెండవ సంవత్సరం పెరిగాయి. కారణం ఆ మందులకు కీటకాలు నిరోధకతను ఏర్పరచుకున్నాయి.

ప్రశ్న 15.
రైతులు ఎరువులను ఎలా వేస్తారు ? (పేజీ.నెం.130)
జవాబు:
రైతులు ఎరువులను చేతితోగాని, కొన్ని పనిముట్లతో గాని వేస్తారు.

ప్రశ్న 16.
మీ పాఠశాలలో కంపోస్టు గుంత ఉందా ? అందులో ఏమేమి వేస్తుంటారు ? (పేజీ.నెం.130)
జవాబు:
మా పాఠశాలలో కంపోస్టు గుంత ఉంది. అందులో కూరగాయల తొక్కలు, మిగిలిన అన్నం, ఎండిన ఆకులు వేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 17.
కింది చిత్రాన్ని చూడండి. దీనిలో ఏ మూలకం ఏ పరిమాణంలో ఉందో చెప్పండి. (పేజీ.నెం. 130)
జవాబు:
నైట్రోజన్ 20%
ఫాస్ఫరస్ 5%
పొటాషియం 10%
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 21

ప్రశ్న 18.
ఏది మంచి ఎరువు ? రసాయనిక ఎరువులకు, సహజ ఎరువులకు మధ్యగల తేడాలు ఏవి (పేజీ.నెం. 131)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 22
(i) పై రెండింటిని పోల్చి ఏది మనకు ప్రయోజనకరమో చెప్పండి.
జవాబు:
సహజ ఎరువు.

(ii) పై పట్టికను జాగ్రత్తగా పరిశీలించండి. ఏ ఎరువులు వాడితే రైతులకు ప్రయోజనమో మీ ఉపాధ్యాయునితో చర్చించి రాయండి.
జవాబు:
సహజ ఎరువులు వాడితే రైతులకు ప్రయోజనం. ఇవి వేస్తే నేలలో హ్యూమస్ చేరుతుంది. అదే విధంగా నేల ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి.

ప్రశ్న 19.
రైతులు వరి పొలాలకు నీళ్ళు ఎప్పుడు అందిస్తారు ? (పేజీ.నెం. 132)
జవాబు:
నాట్లు వేసేటప్పుడు, మూన తిరిగిన రోజు నుండి పైరు దబ్బు చేయుటకు 2-3 రోజులకు ఒక్కసారి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 20.
మీ గ్రామంలో నీటి వనరులను వ్రాయండి. (పేజీ.నెం. 132)
జవాబు:
కాలువలు, చెరువులు, బావులు.

ప్రశ్న 21.
ఆ నీటి వనరులు రైతులకు ఉపయోగపడుతున్నాయా ? (పేజీ.నెం. 132)
జవాబు:
ఆ నీటి వనరులు రైతులకు ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 22.
మీ గ్రామంలో రైతులు ఏ రకంగా పొలాలకు నీళ్ళు పెడుతున్నారు ? (పేజీ.నెం. 132)
జవాబు:
మా గ్రామంలో రైతులు ఎక్కువమంది ఆధునిక పద్ధతుల ద్వారా, కొంతమంది పురాతన పద్ధతుల ద్వారా పొలాలకు నీళ్ళు పెడుతున్నారు.

ప్రశ్న 23.
కలుపు మొక్కలను ఎందుకు తొలగించాలి ? (పేజీ.నెం. 134)
జవాబు:
కలుపు మొక్కలు పోషక పదార్థాలు, నీరు, వెలుతురు కోసం పంట మొక్కలతో పోటీపడతాయి. దీనివల్ల సాగు మొక్కలు పెరగవు. అందుకే కలుపు మొక్కలు తొలగించాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

SCERT AP 8th Class Biology Study Material Pdf 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 7th Lesson Questions and Answers వివిధ ఆవరణ వ్యవస్థలు

8th Class Biology 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
ఆవరణ వ్యవస్థను ఎలా నిర్వచిస్తావు ? సరైన ఉదాహరణతో వివరించండి.
జవాబు:
1. సజీవులు, నిర్జీవులు వాతావరణ కారకాలు పరస్పరం ప్రభావితం చేసుకుంటూ వున్న ప్రకృతి యొక్క మూల ప్రమాణం అని నేను నిర్వచిస్తాను.
2. ఎందుకంటే ‘ఆవరణ వ్యవస్థ’లో ఈ మూడు ముఖ్యమైనవి.
ఉదా : ఇల్లు ‘ఒక’ ఆవరణ వ్యవస్థగా తీసుకుంటే, ఇంటిలో మనుషులు, కీటకాలు, చీమలు, ఈగలు, బల్లులు, మొక్కలు, పక్షులు ఇవన్నీ సజీవులు. మట్టి, కుర్చీలు, కర్రలు, గ్యాస్, గ్యాస్ పొయ్యి, పాత్రలు, దుస్తులు, సైకిళ్ళు, కార్లు, పుస్తకాలు ఇవన్నీ నిర్జీవులు.
3. ఇంటిలోని వాతావరణం – గాలి, ఉష్ణోగ్రత, నీరు, గాలిలో తేమ ఇవన్నీ వాతావరణ కారకాలు. వీటి మధ్య బంధం ఉంటుంది. ఇది నిలకడగా కొనసాగుతుంది. అందువల్ల మన ఇంటిని ‘ఒక ఆవరణ వ్యవస్థగా’ చూడవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 2.
జీవవైవిధ్యం ఆవరణవ్యవస్థను బలోపేతం చేయడానికి ఎలా దోహదపడుతుందో వివరించండి.
జవాబు:

  1. అనేక జాతులు, లక్షణాలు, భేదాలు గల జీవుల అభివృద్ధినే ‘జీవవైవిధ్యం’ అంటారు.
  2. ‘ఆవరణ వ్యవస్థ’ బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే దీనిలో జీవవైవిధ్యం ఉండాలి.
  3. ఒక ‘పార్కును’ తీసుకోండి. దీనిలో ఒక్క ‘గడ్డి’ (పచ్చిక) ఉంటే సరిపోతుందా ?
  4. లేదు. పార్కులో అనేక రకాల మొక్కలు, పూల మొక్కలు, తీగలు, పొదలు, గుల్మాలు, అలంకార మొక్కలు, చెట్లు ఇవన్నీ ఉన్నాయనుకోండి. అది చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
  5. ఒకే జాతి కాకుండా, దీనిలోనే ఎన్నో ప్రజాతులు ఉండేలా చేస్తే ఎక్కువ జీవవైవిధ్యం ఉంటుంది.
  6. ఒక ఆవరణ వ్యవస్థలో జీవవైవిధ్యం ఎక్కువ ఉంటే అది మంచి ఆవరణ వ్యవస్థగా కొనసాగుతుంది.

ప్రశ్న 3.
ఆవరణ వ్యవస్థలో ఎలుకలు ఉన్నాయి. అందులో ఎక్కువ పిల్లులను ప్రవేశపెడితే ఏమవుతుంది ?
జవాబు:

  1. ఒక ఆవరణ వ్యవస్థలో ఎలుకలు ఉన్నాయి. వాటి సంఖ్య ఆ వ్యవస్థ శక్తి ప్రసరణకు అనుకూలంగా ఉంది.
  2. అక్కడి ఆహార గొలుసుకు అనుబంధంగా వాటి సంఖ్య ఉంది.
  3. మరి మనం కావాలని ఎక్కువ పిల్లులను ఈ ఆవరణ వ్యవస్థలోకి వదిలామనుకోండి.
  4. ఇవి (పిల్లులు) ఎక్కువ ఎలుకలను చంపివేస్తాయి. తద్వారా ఎలుకల సంఖ్య బాగా తగ్గి పిల్లుల సంఖ్య బాగా పెరిగి ఆవరణ వ్యవస్థ ‘సమతాస్థితి’ దెబ్బ తింటుంది.

ప్రశ్న 4.
ఈ క్రింది వాటిలో ఉత్పత్తిదారుడు ఏది ? ఎందుకు?
ఎ) నక్క
బి) శిలీంధ్రం
సి) కోడి
డి) గడ్డి
జవాబు:
పైన పేర్కొన్న నాలుగింటిలో ‘గడ్డి’ని ‘ఉత్పత్తిదారు’గా నేను భావిస్తాను. ఎందుకంటే
ఎ) నక్క – ఇది మాంసాహారి. తృతీయ వినియోగదారుని హోదాలో ఆహార జాలకంలో వుంది.
బి) శిలీంధ్రం – ఇది విచ్ఛిన్నకారి. కుళ్ళిన పదార్థాలపై నివసిస్తూ శక్తిని తీసుకుని, జీవిస్తూ ఆ పదార్థాలలో ఉన్న పోషకాలను తిరిగి మృత్తిక (భూమిపై పొర) లోనికి పంపుతుంది.
సి) కోడి – ఇది సర్వ భక్షకాహారి. ద్వితీయ వినియోగదారు హోదాలో ఉంది. పై మూడూ కాదు.
డి) గడ్డి – పచ్చిక – ఇది సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిపి ఆహారాన్ని తయారు చేస్తుంది. కాబట్టి ఇది ‘ఉత్పత్తిదారుడు’.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 5.
ఆవాసానికి, ఆవరణవ్యవస్థకు మధ్య తేడా ఏమిటి ?
జవాబు:

ఆవాసము ఆవరణ వ్యవస్థ
1. ఇది నివసించే ప్రదేశాన్ని తెలియచెప్పే పదం.

2. మొక్కలు, జంతువులు పెరిగే చోటు.

3. దీనిలో నిర్జీవ అంశాల ప్రస్తావన ఉండదు.

4. వాతావరణ కారకాలు, వాటి ప్రభావం ఇక్కడ పట్టించుకోరు.

1. ఇది ఆ ప్రదేశంలోని సజీవ, నిర్జీవ, వాతావరణ కారకాల మధ్య సంబంధాన్ని వివరించే పదం.

2. మొక్కలు, జంతువుల మధ్య సంబంధాన్ని కొనసాగించే ఒక మూల ప్రమాణం.

3. నిర్జీవ అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి.

4. ఇక్కడ వాతావరణ కారకాల ప్రభావం కీలకం అని భావిస్తారు.

6. నేనెవరిని ?

ప్రశ్న (అ)
నేను ఆహారపు గొలుసులో ప్రధాన మూలం.
జవాబు:
గడ్డి – ఉత్పత్తిదారులు

ప్రశ్న (ఆ)
నేను ఆహారం కోసం ఇతరులపై ఆధారపడతాను.
జవాబు:
వినియోగదారులు – జంతువులు, క్షీరదాలు, మానవులు.

ప్రశ్న (ఇ)
నేను చనిపోయిన మొక్కల, జంతువుల శరీరాలను కుళ్ళింపచేస్తాను.
జవాబు:
విచ్ఛిన్నకారులు – బాక్టీరియా, శిలీంధ్రాలు.

ప్రశ్న 7.
మొక్క పులి, కుందేలు, నక్క, గ్రద్ద.
పై వాటిలో ఏదైనా సంబంధాన్ని తెలుసుకోగలరా ? పై జాబితా నుండి కుందేలును తీసివేస్తే ఏమి జరుగుతుంది ?
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 1

  1. ఈ జంతువులు, మొక్కలు ఒక ఆహార జాలకంలో భాగమై ఉన్నాయి.
  2. వేరు, వేరు ఆహార గొలుసులలో ఉన్నా ఒకే జాలకంలో ఉన్నాయి కాబట్టి వీటి మధ్య పరస్పర ‘సంబంధం’ ఉంది.
  3. ఇవి ఒక దానిపై మరొకటి ప్రభావం చూపుతాయి.
  4. మొక్క – ఉత్పత్తిదారు; కుందేలు – ప్రాథమిక వినియోగదారు. నక్క, పులి, గద్ద – తృతీయ వినియోగదారులు.
  5. పై జాబితా నుండి కుందేలును తీసివేస్తే, నక్కకు ఆహారం అందదు – నక్కల సంఖ్య తగ్గుతుంది.
  6. అలాగే గడ్డి తినే కుందేలు లేకపోవటం వల్ల ఆవరణ వ్యవస్థలో గడ్డి ఎక్కువ పెరుగుతుంది. దాంతో కీటకాల సంఖ్య, పురుగుల సంఖ్య పెరిగి ఆవరణ వ్యవస్థ ‘సమతాస్థితి’ లయ తప్పుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 8.
మీ దగ్గరలోని పార్ము/తోటను సందర్శించి అక్కడ మీరు పరిశీలించిన మొక్కల, జంతువుల వివరాలు సేకరించి పేజీ. నంబరు 110 లోని పట్టిక నింపి నివేదిక తయారుచేయండి.
జవాబు:
అడవి పేరు : నల్లమల
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 2
నివేదిక :

  1. నేను శ్రీశైలంలోని నల్లమల అటవీ ప్రాంతాన్ని సందర్శించాను. అది అనేక వృక్ష, జంతు జాతులను కలిగి ఉంది.
  2. మద్ది, టేకు, వేప, రావి, మర్రి వంటి పెద్ద పెద్ద వృక్షాలు ఉండి అనేక పక్షులకు, జంతువులకు ఆవాసంగా ఉంటున్నాయి.
  3. రాగి, బలుసు, వెంపలి వంటి చిన్న మొక్కలు పొదలుగా ఏర్పడ్డాయి. వీటిలో కుందేలు వంటి చిన్న జంతువులు నివసిస్తున్నాయి.
  4. అడవిలో కుందేలు, జింకలు, దుప్పులు వంటి శాకాహార జంతువులు ఉన్నాయి.
  5. వీటిని ఆహారంగా తీసుకొంటూ, పులులు, సింహాలు, నక్కలు వంటి మాంసాహారులు ఉన్నాయి.
  6. పక్షులలో నెమలి, చిలుకలు, పిచ్చుకలు వంటి విభిన్న జీవులు ఉన్నాయి.
  7. అడవి మంచి జీవవైవిధ్యాన్ని కలిగి ఉంది.

ప్రశ్న 9.
మీ పొలంలో లేదా పాఠశాల తోటలో పరిశీలించి ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు విచ్ఛిన్నకారుల జాబితాను తయారుచేయండి.
జవాబు:
మా పాఠశాల ఆవరణను పరిశీలించి ఈ కింది జాబితాను తయారు చేశాను.
1. ఉత్పత్తిదారులు : మొక్కలు, పచ్చిక, అశోక చెట్లు, బంతి చెట్లు, క్రోటన్లు, కాగితపు పూల చెట్లు, విప్ప చెట్టు, వేప చెట్టు, పాల చెట్టు, సపోటా చెట్టు, కొబ్బరి మొక్కలు.
2. వినియోగదారులు : విద్యార్థులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు (మానవులు), కప్పలు, వాన కోయిలలు, కీటకాలు, మేకలు, పశువులు, బల్లులు, తొండలు, పక్షులు, గబ్బిలం.
3. విచ్ఛిన్నకారులు : పుట్ట గొడుగులు, లైచెన్లు (కర్రలపై పెరిగే తెల్ల పెచ్చుల్లాంటి జీవులు).

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 10.
ఎడారి జంతువులు ఏ ఏ అనుకూలనాలను పొందినాయో మీ పాఠశాల గ్రంథాలయంలో పరిశీలించి పట్టిక తయారు చేయండి.
జవాబు:

  1. సగటు వర్షపాతం అతి తక్కువగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాన్ని ‘ఎడారి’ అంటారు.
  2. ఇక్కడ పెరిగే మొక్కలు, జంతువులు తమకు తాము కొన్ని మార్పులు చేసుకుని అనుకూలనాలు పొంది జీవించటానికి పాటుపడుతుంటాయి.
  3. జంతువులలో కింది అనుకూలనాలను మనం గమనించవచ్చు.
    1. ఎడారిలో జంతువుల సంఖ్య తక్కువ.
    2. నీటి కొరత తట్టుకునే జాతులు ఇక్కడ పెరుగుతాయి.
    3. శరీరంపై పొలుసులు గల పాములు (సరీసృపాలు) ఎక్కువ.
    4. కొన్ని రకాల కీటకాలు పైన ఉన్న కైటిన్ పొరను మందంగా అభివృద్ధి చేసుకున్నాయి.
    5. ఒంటె నీటిని తనలో దాచుకోవటానికి మొక్కల లేత కాండాలు తింటుంది. నీటిని జీర్ణాశయంలో నిల్వచేసుకుంటుంది. అందుకే దీనిని ‘ఎడారి ఓడ’ అన్నారు.
    6. వీటి శరీరం భూమి ఉపరితలానికి తగలకుండా ఇవి మార్పులు చేసుకున్నాయి.
    7. పగటి పూట జంతువులు బయట తిరగవు. రాళ్ళ క్రింద, పొదలలో, చెట్ల పైకి ఎక్కి రాత్రిపూట ఆహార వేటకు ఉపక్రమిస్తాయి. అందుకే వీటిని ‘నిశాచరులు’ అంటారు.

ప్రశ్న 11.
‘ఆహార జాలకం’ అంటే మీరేమి అవగాహన చేసుకున్నారు ? ఆహార జాలకాన్ని మీ సొంత మాటలతో వర్ణించండి. రేఖాచిత్రం ద్వారా ఆహారజాలకం గురించి నీకేం అవగాహన అయింది. మీ సొంత ఆహారజాలకం చిత్రాన్ని గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 3
1. ఉత్పత్తిదారుడు, ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు ఉన్న గొలుసు లాంటి జంతువుల శక్తి మార్పిడి వ్యవస్థను ‘ఆహారపు గొలుసు’ అంటారు.
2. అనేక ‘ఆహారపు గొలుసులు’ ఒక దానిలో ఒకటి కలిసిపోయి ఒక సమూహంగా, ఆవరణ వ్యవస్థలో కొనసాగే క్రియాత్మక వ్యవస్థను ‘ఆహార జాలకం’ అంటారు.
3. దీనిలో నీటిలో మొక్కలు, నేలపై మొక్కలు, నీటిలో కీటకాలు, నేలపై కీటకాలు, జలచరాలు, ఉభయచరాలు, సరీసృపాలు, క్షీరదాలు, పక్షులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు ఉంటాయి.
4. చివరగా అతిశక్తివంతమైన తృతీయ వినియోగదారు (సింహం, పులి, గద్ద మొదలగునవి) ఉంటుంది.

ప్రశ్న 12.
మొక్కలు, జంతువుల మధ్య పరస్పర సంబంధాలపై మీ అవగాహన ఏమిటి ? దీనిని మీరు ఎలా అభినందిస్తారు ?
జవాబు:

  1. మొక్కలు స్వయం పోషకాలు మరియు ఉత్పత్తిదారులు.
  2. ఇవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. వివిధ భాగాలలో నిల్వ చేస్తాయి.
  3. జంతువులు వినియోగదారులు. ఇవి మొక్కల నుండి శక్తి బదలాయింపు జరుపుకుంటాయి.
  4. తద్వారా ఇవి ఆవరణ వ్యవస్థలో పరస్పరం ఆధారపడి జీవిస్తాయి అని పరిశీలించినపుడు – వీటిని అభినందించాల్సిన అవసరం ఉంది.
  5. జంతువుల నుండి వివిధ రూపాలలో పోషకాలు నేలకు చేరి మరలా వాటిని మొక్కలు ఉపయోగించుకునేలా మారతాయి.
  6. మొక్కల జనాభా పెరుగుదలను జంతువులు నియంత్రిస్తాయి. ఎలా అంటే మొక్కలు వాటి ఆహారం కనుక.
  7. జంతువుల సంఖ్య తగ్గించాలంటే మొక్కల సంఖ్య తగ్గిపోతుంది. తద్వారా ఆహార లభ్యత లేక జంతువుల సంఖ్య తగ్గుతుంది. ఇలాంటి విషయాలు ప్రకృతిలో సర్వ సామాన్యం. కాబట్టి నేను అభినందిస్తాను.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 13.
గడ్డి – మొక్కలు – మిడత – కప్పు – పాము – గ్రద్ద – మేక – నక్క – పులి – తోడేలు – కుందేలు – వీటి సహాయంతో ఆహారజాలకం పటం గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 4

ప్రశ్న 14.
గట్టి నేల ఆవరణ వ్యవస్థలో కుందేలు మొక్కలను మాత్రమే తింటుంది. మొక్కలు పెరిగే లోపలనే అవి మొక్కలను తొందరగా తింటాయి. అలాంటప్పుడు ఆవరణ వ్యవస్థను సమతాస్థితికి తీసుకునిరావడానికి ఏమి జరగాల్సిన అవసరముంది?
జవాబు:

  1. కుందేలు మొక్కలను పెరిగే లోపల తినేస్తుంది.
  2. ఎక్కువ సంఖ్యలో మొక్కల సంఖ్య ఆవరణ వ్యవస్థలో ఉంటాయి. కాబట్టి కుందేలు పెరిగే లోపల మొక్కలను తిన్నా – పెద్దగా ప్రభావం ఉండదు. కానీ
  3. ఒక వేళ కుందేళ్ళ సంఖ్య, మొక్కలు కుందేళ్ళ నిష్పత్తి కన్నా ఎక్కువ ఉన్నట్లైతే ఆ ప్రభావం మొక్కలపై పడుతుంది.
  4. మొక్కల సంఖ్య తగ్గి, కుందేళ్ళ సంఖ్య పెరుగుతుంది.
  5. అప్పుడు వీటిపై ఆధారపడి జీవించే నక్కలు, కుక్కలు, తోడేళ్ళకు ఇవి అందుబాటులోకి వస్తాయి.
  6. లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల, వాతావరణ కారకాల వల్ల, తప్పనిసరిగా కుందేళ్ళ సంఖ్య మొక్కల నిష్పత్తికి తగినట్లుగా తగ్గించబడి, సమతాస్థితిని కొనసాగించటానికి వీలవుతుంది.

ప్రశ్న 15.
ఒకేరకమైన అలవాట్లు కలిగిన రెండు . జంతువులు ఒకే ఆవరణవ్యవస్థను ఎంచుకున్నప్పుడు ఏమి జరుగుతుంది ? ఈ వైవిధ్యాన్ని కాపాడటానికి నీవు ఏమి చేస్తావు ?
జవాబు:

  1. ఒకేరకమైన అలవాట్లు కలిగిన రెండు జంతువులు ఒకే ఆవరణ వ్యవస్థను ఎంచుకున్నప్పుడు వాటి మధ్య పోటీ ఏర్పడుతుంది.
  2. సాధారణంగా ఈ పోటీలో తట్టుకొన్న జీవులు మనుగడను సాగిస్తాయి. మిగిలిన జీవులు నశిస్తాయి.
  3. ఉదాహరణకు ఆవు, గుర్రం ఒకే ఆహారపు అలవాట్లు కలిగి ఉంటాయి. ఈ రెండు ఒకే ప్రదేశంలో ఉన్నప్పుడు – ఆహారం కొరకు వాటి మధ్య పోటీ ఏర్పడుతుంది. తగినంత ఆహారం లభించనపుడు బలమైన జీవి మాత్రమే ఆహారం సంపాదించుకొని జీవిస్తుంది.
  4. ప్రకృతి ధర్మాలలో జీవవైవిధ్యం ఒకటి. జీవవైవిధ్యం కాపాడటానికి ఆవాసంలోని జీవుల అవసరాలను తీర్చే మార్గాలను అన్వేషించాలి.
  5. ఎక్కువ ఆహార వసతి, ఆవాసాలు ఏర్పాటు చేయటం వలన జీవవైవిధ్యం కాపాడవచ్చును.
  6. పిల్ల జీవులను సంరక్షణ చర్యలు తీసుకోవటం వలన జీవవైవిధ్యాన్ని పెంచవచ్చు.

8th Class Biology 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి InText Questions and Answers

కృత్యములు

ప్రశ్న 1.
ఆవరణ వ్యవస్థను అర్ధం చేసుకోవటానికి నీవు నిర్వహించే ప్రాజెక్ట్ వివరాలు తెలపండి. ( లేదా)
ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని తెలుసుకొనుటకు చేయు ప్రయోగంలో మీరు ఉపయోగించిన పరికరాలను పేర్కొని, ప్రయోగ విధానాన్ని రాయండి.
జవాబు:
ఉద్దేశం : ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని అవగాహన చేసుకోవడానికి పాఠశాల లేదా ఇంటి తోటను అధ్యయనం చేయడం.
కావల్సిన పదార్థాలు : కొలిచే టేపు, దారం, చిన్న చిన్న కట్టెపుల్లలు, భూతద్దం, గడ్డపార (hand towel).
విధానం : ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని తెలుసుకోడానికి ఈ కింది విధానాన్ని అనుసరించాలి.
1. నలుగురు విద్యార్థుల చొప్పున జట్లుగా ఏర్పడండి. మీరు ఎంపిక చేసుకున్న ప్రదేశంలో టేపుతో కొలిచి ఒక మీటరు పొడవు, ఒక మీటరు వెడల్పు ఉండే చతురస్రాకారపు ప్రాంతాన్ని నిర్ణయించుకోండి. ఈ ప్రాంతంలో గడ్డి ఉండవచ్చు లేదా గడ్డి ఉండకపోవచ్చు (baredirt) లేదా కాలిబాట (side walk) కావచ్చు.
2. ఆ ప్రాంతానికి నాలుగు వైపులా చిన్న కర్ర ముక్కలు పాతి దారంతో చతురస్రం ఒక చదరపు మీటరు ప్రాంతం యొక్క అంచులను పటంలో చూపిన విధంగా గుర్తించండి. ఇదే మనం పరిశీలించవలసిన ప్రదేశం.
3. అధ్యయనం చేసే ప్రాంతాన్ని పరిశీలించండి. ఆ ప్రాంతంలో నివసించే మొక్కలు, జంతువులను అవసరమైతే భూతద్దంతో నిశితంగా పరిశీలించండి.
4. మీరు పరిశీలించిన జీవులన్నింటినీ మీ నోటు పుస్తకంలో నమోదు చేయండి. మీరు ఆ ప్రాంతంలోని మట్టిని తవ్వి అందులోని జీవులన్నింటిని కూడా పరిశీలించాలి. దేనినీ వదిలివేయకుండా జాగ్రత్తగా పరిశీలించాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

2. ప్రక్కపటంలోని ఆహార జాలకాన్ని పరిశీలించండి. ఈ కింది ప్రశ్నలకు జవాబులివ్వండి.
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 5

ప్రశ్న (i)
ఆహార జాలకంలో ఉత్పత్తిదారులేవి ?
జవాబు:
నీటి మొక్కలు, నాచు, శైవలాలు, గడ్డి, మొక్కలు.

ప్రశ్న (ii)
వినియోగదారులేవి ?
జవాబు:
కీటకాలు, ఎలుకలు, సాలె పురుగులు, కుందేలు, జింక, పిల్లి, నక్క, కప్ప, చేప, పాము, తోడేలు, నెమలి, గుడ్లగూబ, రాబందు, గద్ద, కొంగ, పులి, సింహం.

ప్రశ్న (iii)
ఆహార జాలకం ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది ?
జవాబు:
ఆహార జాలకం ఉత్పత్తిదారుల నుంచి ప్రారంభమవుతుంది.

ప్రశ్న (iv)
ఆహార జాలకం ఎక్కడ ముగుస్తోంది ?
జవాబు:
నాల్గవ స్థాయి వినియోగదారు అయిన సింహం దగ్గర ముగుస్తోంది.

ప్రశ్న (v)
ఆహార జాలకంలోని మొక్కలు చనిపోతే ఏమవుతుంది ?
జవాబు:

  1. ఆహార జాలకంలో మొక్కలు చనిపోతే శక్తి ఉత్పత్తిచేసే అవకాశం పోతుంది.
  2. దీనితో సూర్యరశ్మి నుంచి శక్తి బదలాయింపు ఆగిపోతుంది.
  3. కొంత కాలం తర్వాత నెమ్మదిగా క్రింది స్థాయి నుంచి ఉన్నతస్థాయి జీవులన్నీ అంతరించిపోతాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

3. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ రకాల మొక్కలు, జంతు జాతుల పేర్లను పట్టికలో నింపి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
జవాబు:
అడవి పేరు : నల్లమల
ప్రదేశం : శ్రీశైలం
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 6

ప్రశ్న (i)
అన్ని రకాల అడవులలో ఒకే రకమైన వృక్ష సంపద ఉందా ! (పేజీ నెం. 110)
జవాబు:
1. ఉండదు. ఎందుకంటే ఆవరణ వ్యవస్థ ప్రదేశం మారే కొద్దీ అక్కడ వాతావరణ కారకాలు మారతాయి.
2. సూక్ష్మ, స్థూల పోషకాల లభ్యత వేరుగా ఉంటుంది.
3. కాబట్టి వైవిధ్యం ఎక్కువ మార్పుతో ఉంటుంది.
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 7

ప్రశ్న (ii)
అడవి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు వినియోగదారుల కంటే ఎక్కువగా ఉన్నాయా ? ఎందుకు ?
జవాబు:
1. ఉత్పత్తిదారుల సంఖ్య ఎక్కువ ఉంది.
2. కారణం వినియోగదారులు తమ ఆహారం కోసం ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తిదారులను వినియోగించుకుని శక్తిని పొందుతాయి.
3. సుమారుగా 1 : 20 గా వినియోగదారు ఉత్పత్తిదారు నిష్పత్తి ఉంటుంది.
ఇవి కొన్ని సార్లు పెరగవచ్చు. తగ్గవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న (iii)
అన్ని రకాల అడవులలో ఒకే రకమైన జంతువులు ఉన్నాయా ? ప్రత్యేకమైనవి ఏమైనా ఉన్నాయా ?
జవాబు:
1. అన్ని రకాల అడవులలో ఒకే రకమైన జంతువులు ఉండవు.
2. కొన్నిచోట్ల ప్రత్యేకమైన జంతువులు ఉంటాయి.
ఉదా : శ్రీశైలం, నల్లమల అడవులలో పులులుంటాయి. చిత్తూరు, శేషాచలం అడవులలో ఔషధ మొక్కలు ఎక్కువగా ఉంటాయి.

పాఠ్యాంశములోని ప్రశ్నలు

1. ఈ పటాన్ని పరిశీలించి ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (పేజీ. నెం. 105)

ప్రశ్న (ఎ)
బొమ్మలో బాణం గుర్తు ఏం సూచిస్తుంది ?
జవాబు:
బొమ్మలో బాణం గుర్తు జీవుల మధ్య ఆహార సంబంధాలను సూచిస్తున్నది.

ప్రశ్న (బి)
గడ్డి నుండి పులి వరకు ఉన్న మార్గాన్ని గుర్తించండి.
జవాబు:
గడ్డి → కుందేలు → పులి.

ప్రశ్న (సి)
కుందేలు ఎన్ని రకాల ఆహారాలపైన ఆధారపడుతుంది ? వాటి పేర్లు రాయండి.
జవాబు:
కుందేలు మూడు రకాల పదార్థాలపై ఆధారపడింది. అవి 1. క్యారెట్ 2. గడ్డి 3. గింజలు.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న (డి)
కుందేలుపై ఆధారపడ్డ జీవులు ఎన్ని ? వాటి పేర్లు రాయండి.
జవాబు:
కుందేలుపై నాలుగు రకాల జీవులు ఆధారపడ్డాయి. అవి 1. కొండచిలువ 2. నక్క 3. గుడ్లగూబ 4. పులి.

ప్రశ్న 2.
మొక్కలు ఆహారాన్ని ఎక్కడ నుండి గ్రహిస్తాయి ? (పేజీ.నెం. 105)
జవాబు:
1. మొక్కలు స్వయం పోషకాలు.
2. ఇవి తమ ఆహారాన్ని తామే తయారుచేసుకొంటాయి.
3. సూర్యరశ్మి, కార్బన్ డై ఆక్సైడ్, నీరులతో పత్రాలు ఆహారం తయారుచేసే ఈ ప్రక్రియను ‘కిరణజన్య సంయోగక్రియ’ అంటారు.

ప్రశ్న 3.
ఆహారం ఒక్కటే కాకుండా జంతువులు బ్రతకటానికి కావల్సిన ఇతర అంశాలు ఏమిటి ? (పేజీ.నెం. 105)
జవాబు:
జంతువులకు ఆహారంతో పాటు,

  1. నీరు
  2. గాలి
  3. ఆవాసం బతకటానికి కావాల్సి ఉంటుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం – సంరక్షణ

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

SCERT AP 8th Class Biology Study Material Pdf 6th Lesson జీవ వైవిధ్యం – సంరక్షణ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 6th Lesson Questions and Answers జీవ వైవిధ్యం – సంరక్షణ

8th Class Biology 6th Lesson జీవ వైవిధ్యం – సంరక్షణ Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
దీనిని చదివి కింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
జీవవైవిధ్యం – 2050 :
జవాబు:
అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు COP-2012 Hyd (Conference of Parties) తీర్మానాల ప్రకారం వచ్చే 4 దశాబ్దాలలో భూమిపై గల సహజవనరులు గడ్డిమైదానాలు, కొండలు, మంచు మరియు శీతోష్ణ. సమశీతోష్ణ మైదానాలకు మాత్రమే పరిమితం అవుతాయి. 2050 నాటికి జీవవైవిధ్య నష్టం అంచనాలకు మించిపోతుంది. శీతోష్ణస్థితి మార్పు దీనికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. దాదాపు 1.3 మిలియన్ల సహజ ఆవరణ వ్యవస్థలలో ఎలాంటి సహజ జీవజాతులు ఉండవు. (దిగువ రంగు ప్రాంతాలు జీవవైవిధ్య నష్ట సూచికలు. నీలిరంగు ప్రాంతాలు గరిష్ఠ జీవవైవిధ్య నష్టాన్ని సూచిస్తుంది).
AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 1
ఎ. సూచిక రంగు ప్రాంతం (కలర్ కోడ్) ఏమి సూచిస్తుంది ?
బి. ఏ ప్రాంతం గరిష్ఠ జీవవైవిధ్య నష్టాన్ని సూచిస్తుంది ?
సి. ఏయే ప్రాంతాలు కనిష్ఠ జీవవైవిధ్య నష్టాన్ని సూచిస్తున్నాయి ?
డి. 2010 నుండి 2050 వరకు జీవవైవిధ్య పరిస్థితిలో గమనించిన మార్పులేవి ?
ఇ. జీవవైవిధ్యాన్ని సంరక్షించేందుకు ఏం చర్యలు సూచించగలవు ?
(సి.ఒ.పి. – 2012 జీవవైవిధ్యం, హైదరాబాద్ వారి సౌజన్యంతో)
జవాబు:
ఎ. జీవవైవిధ్య నష్ట సూచికలను చూపిస్తుంది.
బి. 1) కెనడా పై ప్రాంతం.
2) ఐరోపా ఖండంపై ప్రాంతాలు.
3) దక్షిణాఫ్రికాలో … జీవవైవిధ్య నష్టం ఎక్కువ ఉంది.

సి. 1) దక్షిణ అమెరికా పై భాగం.
2) ఆస్ట్రేలియా ఖండం.
డి. దాదాపు 1.3 మిలియన్ల ప్రదేశాలలో ఎలాంటి జీవజాతులూ ఉండవు.
ఇ. ప్రకృతిని గౌరవించి, అన్ని జీవుల ప్రాముఖ్యతను గుర్తించి, వాటి సంరక్షించాలి.
1. జీవ వైవిధ్యంపై ప్రజలలో, పిల్లల్లో అవగాహన కల్పించాలి.
2. ప్రభుత్వాలు దీనిపై కృతనిశ్చయంతో కార్యక్రమాలను రూపకల్పన చేయాలి.
3. ఇది ఒక సామాజిక బాధ్యతగా అందరూ భావించాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 2.
అడవులు జీవావరణ నిల్వలని ఎలా చెప్పగలవు ? తగిన కారణాలు రాయండి.
జవాబు:

  1. అడవులలో వృక్ష, జంతు జాతులు, క్రిమికీటకాలు అనేకం ఉంటాయి.
  2. ఒకే జీవిలో ‘వైవిధ్యం ఉన్న జాతులను, ప్రజాతులను అడవులలో మనం చూడవచ్చు.
  3. అడవులలో ఉన్న సజీవ, నిర్జీవ వనరులు పరిసరాలు ఈ జీవరాశులకు వైవిధ్యం ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నాయి.
  4. ఇక్కడ జీవరాశులు తమ సహజ ప్రత్యుత్పత్తి పద్ధతుల ద్వారా, పరాగ సంపర్కం ద్వారా, విత్తన వ్యాప్తి ద్వారా, ఒక దానిపై ఒకటి ఆధారపడి, ఒకదానితో ఒకటి సహజీవనం చేస్తూ తమ మనుగడ కొనసాగిస్తాయి.
  5. కాబట్టి అడవులను జీవావరణ నిల్వలని మనం చెప్పవచ్చు.

ప్రశ్న 3.
జీవవైవిధ్యం అంటే ఏమిటి ? జీవుల్లో వైవిధ్యాలు ఉంటాయని ఎలా చెప్పగలవు ?
జవాబు:
జీవవైవిధ్యం :
1. మొక్కలు, జంతువుల్లో కనపడే వైవిధ్యాలను జీవవైవిధ్యం అంటారు.
2. ఉదాహరణకు 1. ‘మందార’ మొక్కను తీసుకుందాం. 100 ఎర్రమందార మొక్కలు ఒక్కచోటే ఉన్నాయనుకోండి. అది జీవవైవిధ్యం కాదు.
3. కానీ అదే ప్రదేశంలో (ఆవరణ వ్యవస్థలో)
30 ఎర్ర మందారాలు, 10 తెల్ల మందారాలు, 10 ముద్ద మందరాలు, 10 రేక మందారాలు, 20 గులాబి రంగు మందారాలు, 20 వివిధ రంగు రేకులు గల మందారాలు ఉన్నాయనుకోండి. ఈ ప్రదేశం జీవవైవిధ్యం ఆరోగ్యంగా ఉన్న ఆవరణ వ్యవస్థ అని గుర్తించబడుతుంది. 4. ఒక ఆవరణ వ్యవస్థలో గడ్డి మాత్రమే ఉండకూడదు. దానితో పాటు ఇంకా రకరకాల మొక్కలు, జంతువులు, కీటకాలు ఉండాలి.
5. కోడిలో అడవి కోడి, నీటి కోడి, నాటు కోడి లాంటి వైవిధ్య జాతులు ఉండాలి.
6. ‘జాతి’ ఒకటే అయినా వాటి బాహ్య, అంతర నిర్మాణంలో వివిధ లక్షణాలు ఉంటే ఇది వైవిధ్యంగా గుర్తించబడుతుంది.
7. సూక్ష్మ జీవ ప్రపంచంలో కూడా వైవిధ్యం బాగా కనపడుతుంది.
8. మానవులలో కూడా ప్రదేశాన్ని, ఖండాన్ని బట్టి వైవిధ్యం ఉంటుంది.
ఉదా : వెస్టిండియన్లు – ఇండియన్లు – అమెరికన్లు.

ప్రశ్న 4.
ఈ పదాలను మీరు ఎలా అర్థం చేసుకున్నారు ? వివరించండి.
ఎ. అంతరించిన జాతులు
బి. ఆపదలో ఉన్న జాతులు
సి. ఎండమిక్ జాతులు
జవాబు:
ఎ) అంతరించిన జాతులు : భూమిపై నున్న ఆవరణ వ్యవస్థలలో పూర్తిగా కనబడకుండా అంతరించిపోయిన జాతులను అంతరించిన జాతులు అంటారు.
ఉదా : డైనోసార్లు, హంసల్లాంటి తెల్ల కొంగలు మొ॥. ఇక ఇలాంటి జీవులను మనం తిరిగి భూమిపై చూడలేము.
బి) ఆపదలో ఉన్న జాతులు : భూమిపై నున్న ఆవరణ వ్యవస్థలలో సంఖ్యాపరంగా బాగా తక్కువగా ఉన్న జాతులను ఆపదలో ఉన్న జాతులు అంటారు. 1) అవి నివసించే ప్రాంతాలు మానవుని వల్ల నాశనం చేయబడటం వల్ల అవి నివాసం కోల్పోయి ఆపదలో పడతాయి.
సి) ఎండమిక్ జాతులు : భూమిపై ఒక ప్రత్యేక ఆవాసానికి పరిమితమైన జాతులను ఎండమిక్ జాతులు అంటారు.
ఉదా : (1) కంగారూలు ఆస్ట్రేలియాలోనే ఉంటాయి. (2) కోపిష్టి మదపుటేనుగులు ఆఫ్రికా అడవులలోనే ఉంటాయి. (3) ఒంగోలు జాతి గిత్తలు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటాయి. (కానీ ఈ మధ్య వీటిని కృత్రిమ గర్భధారణ ద్వారా బ్రెజిల్ లో పెంచుతున్నాం)

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 5.
పులిని సంరక్షించడానికి చర్యలు చేపట్టినప్పుడు పులితో పాటు సంరక్షించాల్సిన అంశాలు ఏవి ?
జవాబు:
1. పులిని సంరక్షించాలని అనుకున్నప్పుడు మొదట అడవులను సంరక్షించాలి.
2. వాటి ఆహారమైన చిన్న జంతువుల సంరక్షణ చేపట్టాలి.
3. పులులలో జనాభా లెక్కించేటప్పుడు ఆడ, మగ పులుల కచ్చితమైన సంఖ్యను తీసుకోవాలి.
4. వాటి ప్రజననానికి తగిన ఏర్పాటు అడవిలో చేయాలి. (లేదా కృత్రిమ ప్రజననమునకు ఏర్పాటు చేయాలి) (ప్రజననము అంటే ప్రత్యుత్పత్తి)
5. పులులు నీటి గుంటలు, వాగుల వద్దకు దాహం తీర్చుకోవటానికి వస్తాయి. వీటిలో నీటి ప్రవాహం వుండేలా చూడాలి. (వాగులపై లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చిన్న (చెక్ డామ్ లు) ఆనకట్టలు కడుతున్నారు. వేసవిలో నీటిని అడవిలోని దిగువ ప్రాంతానికి వదిలేలా చర్యలు తీసుకోవాలి.)
6. పులుల వేటను పూర్తిగా నిషేధించాలి.
7. ఇవి ఎక్కువ రాత్రిపూట అడవిలో సంచరిస్తాయి. అందువల్ల రాత్రిపూట స్వేచ్ఛగా అడవిలో తిరిగే అవకాశం కల్పించాలి. (శ్రీశైలం అడవులలో రాత్రి 10 గం|| తరువాత వాహనాలను అడవిలోకి అనుమతించరు. పులులు స్వేచ్ఛగా ఒక చోట నుండి మరోచోటకు వెళ్ళాలి. అప్పుడే వాటి ప్రజననం సులువవుతుంది).

ప్రశ్న 6.
మానవ కార్యకలాపాలు ఏ విధంగా జీవ వైవిధ్యానికి నష్టం కలిగిస్తున్నాయి ? జీవవైవిధ్య ఆవశ్యకతను ప్రజలు గుర్తించటానికి చేపట్టవలసిన చర్యలు ఏమిటి ?
జవాబు:
జీవవైవిధ్యానికి నష్టం కలిగిస్తున్న మానవ కార్యకలాపాలు :

  1. అడవులను నరికి, వ్యవసాయానికి, నివాసానికి వినియోగించటం.
  2. కాలుష్యాన్ని పెంచటం.
  3. ఇళ్ళన్నీ కాంక్రీటుతో నిర్మించటం. పిచ్చుకల లాంటి వాటికి నష్టం కలుగుతోంది.
  4. సెల్ టవర్ నుండి వచ్చే రేడియేషన్.
  5. ఇంటిలో, ‘పెరడు’ లేకుండా అంతా రాళ్ళు సిమెంటుతో నేలను కప్పటం.
  6. విదేశీ ఆక్రమణ జాతులను ఎక్కువగా పెంచటం (హైదరాబాద్ పావురాళ్ళు).
  7. జంతువుల, మొక్కల సహజ నివాసాన్ని ధ్వంసం చేయటం.

చేపట్టవలసిన చర్యలు :

  1. అడవుల నరికివేతను తగ్గించాలి.
  2. సామాజిక అడవుల పెంపకాన్ని ప్రోత్సహించాలి.
  3. ఇంటిలో కనీసం కొద్ది స్థలంలోనైనా ‘పెరడు’ ఉంచి మొక్కలు పెంచాలి.
  4. పక్షులకు ప్రత్యేక సంరక్షణ కల్పించాలి. (పాలపిట్ట కొన్ని జిల్లాల్లో, కొన్ని మండలాల్లో కనిపించకుండా పోతోంది)
  5. సెల్ టవర్ల నిర్మాణాలను నియంత్రించాలి.
  6. స్థానిక జాతులను, ప్రజాతులను పెంచటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
  7. ప్రకృతిలో ప్రతి జీవి ముఖ్యమైనది. దాని పాత్ర దానికి నిర్దేశించబడివుంది అన్న సత్యం గమనించాలి. ‘జీవించు – జీవించనివ్వు’ (Live – Let Live)
  8. జీవుల పట్ల భూత దయ చూపాలి.
  9. పిల్లలకు అవగాహన (NGC), (WWF) ల ద్వారా కల్పించాలి.
  10. అందమైన ఒకే జాతి జీవుల పట్ల ఆకర్షితమవకుండా, వేరు వేరు రకాలకు, జాతులకు సంబంధించిన మొక్కలను, జంతువులను అభివృద్ధి చేయాలి.

ప్రశ్న 7.
ఈ కింది వాటిలో ఆపదలో వున్న, ఎండమిక్ జీవులను గుర్తించి పటాల కింద పేరు రాయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 2
జవాబు:
1. ఎండమిక్ జీవులు :
AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 3
2. ఆపదలో వున్న జీవులు :
AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 4

ప్రశ్న 8.
పక్షుల వలస వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటి ?
జవాబు:
1. వాతావరణ ప్రతికూలతల వల్ల ప్రత్యుత్పత్తి జరుపుకొనటానికి పక్షులు వాటి సహజ నివాసం వీడి మరొక చోటుకు (మారటాన్ని) వెళ్ళటాన్ని ‘వలస’ అంటారు.
2. దీని వెనకున్న శాస్త్రీయ కారణాలు :
(i) ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటే అతివేడి, అతిశీతల పరిస్థితులు పక్షుల ప్రజననానికి (ప్రత్యుత్పత్తికి) ఆటంకం అవుతుంది.
(ii) ఈ ప్రతికూల పరిస్థితులలో పిల్ల పక్షులు తట్టుకోలేక చనిపోయే అవకాశం ఉంటుంది.
(iii) మంచు గడ్డకట్టే ప్రాంతాలలో, మంచు ధారాళంగా కురిసే శీతాకాలంలో పక్షులు గుడ్లు పెట్టి పొదగటం, ఆహార సేకరణ, పెద్ద పక్షుల జీవనం దుర్లభమవుతుంది.
(iv) ఇలా పక్షులు నివాసం కోసం, ఆహారం కోసం, సురక్షితంగా ప్రత్యుత్పత్తి జరుపుకొనటానికి ‘వలస’ వస్తాయి. వీటిని ‘వలస పక్షులు’ అంటారు.
మనం వీటికి తగిన చెట్లు, పొదలు, తావులను సంరక్షిస్తూ అవి వచ్చి వెళ్లటానికి సాయం చేయాలి.

ప్రశ్న 9.
ఈ రోజుల్లో చిరుతలు, ఎలుగుబంట్లు మన నివాసాల్లో చొరబడుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది ? కొన్ని కారణాలు తెలుసుకోవడానికి నీవు ఏమేమి ప్రశ్నలడుగుతావు ?
జవాబు:

  1. చిరుతలు అడవిలో ఉండాలి. మరి జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయి ?
  2. వాటి నివాసయోగ్యమైన అడవి ప్రాంతం తగ్గిందా ?
  3. అడవిలో వాటికి ఆహారం, నీరు దొరకటం లేదా ?
  4. అవి స్వేచ్ఛగా తిరుగుతూ నివసించే ప్రాంతంలోకి మనం వెళ్ళామా ? వాటి నివాసాలలో మన ఆవాసాలు నిర్మించామా?
  5. ఎలుగుబంట్లు ఇష్టంగా తినే పుట్టతేనె పురుగులు, చెద పురుగులు అడవిలో లభిస్తున్నాయా ? లేదా ?
  6. వాటి సంఖ్య తగ్గిపోతున్నది ? ఎందుకు ?
  7. పాములు మన ఇళ్ళల్లోకి ఎందుకు చొరబడుతున్నాయి ?
  8. చీమల పుట్టలు అరుదుగా కనిపిస్తున్నాయి. ఎందుకు ?

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 10.
మీ పరిసరాలలో ఒక ప్రాంతాన్ని ఎంచుకోండి. అక్కడ జంతువులను ఒక రోజంతా గమనించండి. ఒక జాబితా తయారుచేయండి. ఏమి గమనించారో రాయండి.
జవాబు:
మా ఊరిలో మా వీధిని ఎంచుకుని, అక్కడ ఉన్న జంతువుల జాబితాను సేకరించాను.

  1. ఆవులు
  2. గేదెలు
  3. మేకలు
  4. కోళ్ళు
  5. కొంగలు
  6. బల్లులు.
  7. తొండలు
  8. గొల్లభామలు
  9. తూనీగలు
  10. పిల్లులు
  11. కుక్కలు
  12. పందులు
  13. కాకులు
  14. గబ్బిలాలు
  15. ఎలుకలు
  16. పాములు
  17. పావురాలు (పెంపుడు)
  18. గిన్నె కోళ్ళు
  19. ఈము పక్షులు
  20. పిచ్చుకలు (విదేశీ ఆక్రమణ జాతి)

కింది విషయాలు గమనించాను :

  1. కొంగలు ప్రత్యేక సమయంలోనే వచ్చి వెళ్ళే వలస పక్షులు.
  2. గబ్బిలాల సంఖ్య తక్కువ ఉంది. (రేడియేషన్ వల్ల)
  3. పాముల సంఖ్య తక్కువయిందని మా నాన్న అన్నారు. (వీటిని విషపూరితమైనవని చంపటం ఒక కారణం.)
  4. పావురాలు పెంచుకుంటున్నారు.
  5. 5 నుండి 10 వరకు ఏమేరిన్ కుక్క పిల్లలు ఉన్నాయి.
  6. పిచ్చుకల సంఖ్య బాగా తక్కువగా ఉంది.
  7. పాలపిట్ట అసలు కనిపించలేదు.

ప్రశ్న 11.
ఇప్పుడు మరియు 30 ఏళ్ళ క్రితం ఉండే జంతువులు/పక్షుల జాబితాను తయారుచేయండి. ఇందుకోసం పెద్దల సహాయం తీసుకోండి. కొన్ని జంతువులు ప్రస్తుతం కనిపించక పోవటానికి గల కారణాలేమిటో రాయండి.
జవాబు:
మా తాతయ్య, ఆయన మిత్రుల సాయంతో నేను ఈ క్రింది జాబితా తయారుచేశాను.
(i) జంతువులు : 1. హైనాలు 2. అడవి పిల్లి 3. నీటి పిల్లి (ఫిషింగ్ పిల్లి). 4. చిరుత పులులు 5. ఉడుములు 6. ముంగిసలు 7. ముళ్ళ పందులు 8. జడల బర్రె 9. తోడేళ్ళు 10. అడవి తాబేళ్ళు
(ii) పక్షులు : 1. రాబందులు 2. గ్రద్దలు 3. నెమళ్ళు . 4. పిచ్చుకలు (సంఖ్య తగ్గింది) 5. నీటి కోళ్ళు 6. పాలపిట్టలు (సంఖ్య తగ్గింది) 7. కౌజు పిట్టలు (కనుజు) 8. ఎర్ర కాకులు 9. ఊర పిచ్చుకలు.

కారణాలు :

  1. అడవులను నరికివేయటం.
  2. హానికర క్రిమిసంహార మందులు పంటలపై, వాడటం.
  3. గాలిలో రేడియేషన్ ప్రభావం ఎక్కువ అవటం. (ఇది సెల్ ఫోన్లు, సెల్ టవర్ల నుండి వచ్చే రేడియేషన్)
  4. ప్రజననానికి ఆటంకం ఏర్పడటం.
  5. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల మనుగడ కొనసాగించటం కష్టమవుతున్నది.
  6. ఆధునిక వ్యవసాయ పద్ధతులు. (వరి గూళ్ళు, గాదెలు ప్రస్తుతం తగ్గి, గోడౌన్లలోనే ఎక్కువగా నిల్వ చేస్తున్నారు.) (వరికోత యంత్రాల వల్ల వరికుప్ప (గూళ్ళు) వేసే అవసరమే వుండటంలేదు.)

ప్రశ్న 12.
ఒక వృక్షాన్ని ఆవరణ వ్యవస్థగా తీసుకుని దానితో సంబంధం ఉన్న మొక్కలు, జంతువులను నమోదు చేయండి.
జవాబు:

  1. ఒక వృక్షాన్ని ఒక ఆవరణ వ్యవస్థగా పరిగణించినప్పుడు దీనితో అనేక మొక్కలు, జంతువులు సంబంధం కలిగి ఉంటాయి.
  2. దీనిపై పరాన్నజీవులైన చిన్న మొక్కలు చెట్టు కాండం, శాఖలపై పెరుగుతాయి.
  3. చెట్టుపై అనేక కీటకాలు, తుమ్మెదలు వచ్చి వెళ్ళుతూ ఉంటాయి.
  4. అనేక పక్షులు, చిలుకలు, కాకులు, పిచ్చుకలు నివాసం ఏర్పర్చుకుంటాయి.
  5. వలస పక్షులలాంటి కొంగలు వచ్చి వాటి గూడులను ఏర్పర్చుకుంటాయి.
  6. కొంత కాలం తరువాత అవి వెళ్ళిపోతాయి.
  7. చెట్టు బెరడు కింద చెద పురుగులు ఉంటాయి.
  8. వీటిని తినడానికి వడ్రంగి పిట్టలు వస్తాయి.
  9. తేనెటీగలు తేనెతెట్టును పెట్టి నివశిస్తాయి.
  10. ఉడతలు చెట్టుపై తిరుగుతూ ఉంటాయి.
  11. కుక్కలు, గేదెలు, ఆవులు చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటాయి.
  12. పసిరిక పాములు చెట్టుపై నివాసముంటాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 13.
ఇంటర్నెట్ లేదా గ్రంథాలయం పుస్తకాల సహాయంతో భారతదేశంలోని పక్షి సంరక్షణ కేంద్రాల సమాచారం సేకరించి జాబితా తయారుచేయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 5

ప్రశ్న 14.
భారతదేశానికి వలస వచ్చే పక్షుల జాబితాను తయారుచేయండి.
జవాబు:
శీతాకాలం వలస వచ్చే పక్షులు :

  1. సైబీరియన్ కొంగలు
  2. గ్రేటర్ ఫ్లెమింగో పక్షులు
  3. రఫ్ పక్షులు
  4. నల్లరెక్క కొంగలు
  5. కామన్ టీల్
  6. యెల్లో వ్యాగ్ టేల్
  7. వైట్ వ్యాగ్ టేల్
  8. రోసీ పెలికాన్
  9. వుడ్ శాండ్ పైపర్
  10. స్పాటెడ్ శాండ్ పైపర్

వేసవికాలం వలస వచ్చే పక్షులు :

  1. ఏసియన్ కోయల్
  2. కుకూస్
  3. కోంచ్ డక్
  4. యురేషియం గోల్డెన్ ఓరియల్ .
  5. బ్లూ చీక్ డ్ బీ ఈటర్
  6. బ్లూ టైల్డ్ బీ ఈటర్
  7. బ్లాక్ క్రోడ్ నైట్ హెరోన్.

ప్రశ్న 15.
సమీపంలో గల అటవీశాఖ కార్యాలయాన్ని సందర్శించి అచ్చటి స్థానిక మొక్కలు, జంతువుల సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
మా పాఠశాల దగ్గరలో ఉన్న అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్టర్ గార్ని, కలసి ఈ కింది సమాచారం సేకరించాము.
మా ప్రాంత సమీప అడవిలో ఉన్న మొక్కలు :

  1. టేకు చెట్లు
  2. మద్ది చెట్లు
  3. విప్ప చెట్లు
  4. తునికి చెట్లు
  5. వాక్కాయల చెట్లు
  6. బుడంకాయల తీగ
  7. రేగు చెట్లు
  8. నక్కేరుకాయల చెట్లు
  9. పల్లేరు కాయల తీగ
  10. పరిక్కాయ చెట్టు
  11. పాలచెట్టు
  12. వెదురు పొదలు
  13. తుమ్మచెట్లు
  14. జిట్రేగు చెట్లు
  15. నార వేప
  16. బూరుగు దూది చెట్లు
  17. దేవదారు
  18. అడవి నారింజ
  19. గిన్నె చెట్టు
  20. దాల్చిన చెక్క, లవంగ చెట్టు (చింతపల్లి అడవులు)

జంతువులు :

  1. పాల పిట్ట
  2. మొసలి
  3. ఎలుగుబంట్లు
  4. లేడి
  5. కొండచిలువలు
  6. పాములు (గోధుమ త్రాచు)
  7. రక్తపింజర
  8. కుందేళ్ళు
  9. నక్కలు
  10. అడవి కుక్కలు
  11. నీటి కోళ్ళు
  12. గువ్వ పిట్టలు (చిన్నపొదలో ఉంటాయి)
  13. గోరింకలు
  14. ఉడుము (అతితక్కువ ఉన్నాయట)
  15. అడవిదున్న
  16. మనుబోతులు
  17. అడవి పందులు
  18. నెమళ్ళు (మా ప్రాంతంలో అతితక్కువ)
  19. దుప్పి
  20. చిరుతపులి (ఒక్కటే ఉందని రేంజర్ గారు చెప్పారు)

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 16.
జీవవైవిధ్యంపై సమావేశాలు నిర్వహించాల్సిన అవసరమేమిటి ? ఈ సమావేశాలపై సమాచారం సేకరించి అవి ఎక్కడ – ఎప్పుడు ఏ ఉద్దేశంతో నిర్వహించారో రాయండి.
జవాబు:
1. జీవవైవిధ్యంపై అవగాహన కోసం, అన్ని దేశాల ప్రజలు సమష్టిగా ఈ భూమిని ఎక్కువ జాతులతో నిలకడగా, సమతుల్యంగా ఉంచే ఉద్దేశ్యంతో ఈ జీవ వైవిధ్య సమావేశాలు జరుగుతాయి.
2. వీటివల్ల పూర్తిగా అంతరించిపోయే జాతుల సంరక్షణ, పరిరక్షణ జరపటానికి అవకాశం ఉంటుంది.
3. ఈ సమావేశాలలో ప్రపంచ దేశాలకు దిశా నిర్దేశం చేయబడుతుంది.
4. అందువల్ల జీవవైవిధ్య సదస్సులు జరపటం అవసరం.

సదస్సుల వివరాలు :
1. ప్రపంచ జీవవైవిధ్య సదస్సు – 2012 – హైదరాబాద్ – ఆంధ్రప్రదేశ్ – ఇండియా
2. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘ సమావేశం – జేజూ – దక్షిణ కొరియా

ప్రశ్న 17.
భూమిపై అధిక జీవవైవిధ్యం ఎక్కడ కనిపిస్తుంది ? ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో అత్యధిక జీవవైవిధ్యం గల ప్రాంతాలు గుర్తించండి.
జవాబు:

  1. భూమిపై అధిక జీవవైవిధ్యం అడవులలో మాత్రమే కనిపిస్తున్నది.
  2. అడవులలో ఒకే జాతి మొక్కలు, జంతువుల మధ్య వైవిధ్యం కనబడుతుంది.
  3. అడవిని కాపాడుకోవటం మన కర్తవ్యం.
  4. ‘అడవి’ జీవావరణాన్ని నిల్వ చేసే ఒక ప్రదేశంగా చెప్పవచ్చు.
  5. కానీ దురదృష్టవశాత్తు మనుషులే అడవులను నాశనం చేస్తూ, జీవవైవిధ్యాన్ని దెబ్బ తీస్తున్నారు.

ప్రశ్న 18.
మానవ క్రియల వల్ల మన జీవవైవిధ్యానికి ఎక్కువ నష్టం చేకూరింది. వీటిని రక్షించే కొన్ని మార్గాలను సూచించండి.
జవాబు:
మానవ క్రియల వల్ల జీవవైవిధ్యానికి నష్టం జరిగింది. దీనిని రక్షించే కొన్ని మార్గాలు.

  1. అడవులను సంరక్షించాలి.
  2. జంతువుల, మొక్కల సహజ ఆవాసాలు ధ్వంసం చేయకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలి.
  3. వంట చెరకు సేకరణను ఆపి కిరోసిన్, గ్యా స్లతో వంట చేసుకోవాలి.
  4. పేపర్ వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించాలి.
  5. పేపర్ రీ సైక్లింగ్ ప్రక్రియను ప్రోత్సహించాలి.
  6. వన్య ప్రాణులను అమ్మటం, చంపటం చేయకుండా విదేశాలకు ఎగుమతి చేయకుండా చట్టాన్ని కఠినం చేసి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
  7. పొలాలలో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగంపై నియంత్రణ వుండాలి.
  8. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి.
  9. పిల్లలకు జీవవైవిధ్యం పై అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించి ప్రోత్సహించాలి.
  10. పారిశ్రామిక అవసరాలకు ప్రకృతి. వనరుల వినియోగం సున్నితమైన అంశం. దీనిపై ప్రజల, ప్రజాసంఘాల పర్యావరణ కార్యకర్తల అభిప్రాయాలు గౌరవించాలి.
  11. మనం అభివృద్ధి కోసం ఎంతైతే అడవులను నాశనం చేశామో, అదే విస్తీర్ణంలో వేరే బీడు, మైదాన ప్రాంతాల్లో అడవుల పెంపకం చేపట్టాలి.

ప్రశ్న 19.
పలు రకాల మొక్కలు, జంతువులతో కూడిన పార్కు వన్యసంరక్షణ కేంద్రం లేదా జంతు ప్రదర్శనశాల చూసినప్పుడు మీ సంతోషాన్ని ఎలా వ్యక్తపరుస్తారు ? కొన్ని వాక్యాలలో తెలపండి.
జవాబు:
1. వన్య సంరక్షణ కేంద్రంలో సంరక్షింపబడుతున్న పక్షులను చూసినపుడు చాలా ఆనందం, గొప్ప అనుభూతి కలుగుతుంది.
2. వాటిని నేను మునుపెన్నడూ చూడలేదు. వాటిని చూస్తే ఎంతో ఆనందంగా అనిపించింది.
3. రంగు, రంగు పూలమొక్కలు, వాటి ఉపయోగాలు అక్కడ తెలుసుకుని ఆశ్చర్యపడ్డాను.
4. రకరకాల మందు మొక్కలు, వాటి నుండి తయారయ్యే మందుల పేర్ల గురించి నాకు మునుపెన్నడూ తెలియదు. తెలుసుకున్న తర్వాత సంబరం అనిపించి వాటి ఉపయోగాన్ని నా స్నేహితులతో పంచుకుని మరింత ఆనందించాను.
5. అడవిలో పెరిగి సంచరించే పులి, సింహాలను చూసి మొదట భయపడ్డాను. కానీ తరువాత వాటిని ఇంకా ఇంకా చూడాలనిపించింది.
6. కోతులు, కొండముచ్చులు చేసే చిలిపి చేష్టలు నవ్వు తెప్పించాయి.

ప్రశ్న 20.
జీవవైవిధ్య సంరక్షణ పై మాట్లాడుకు ఒక ఉపన్యాస వ్యాసం తయారుచేయండి.
జవాబు:
ఉపయోగపడేదీ, ఉపయోగపడనిదీ ఏదైనప్పటికీ ప్రతి చెట్టుకు, జంతువుకు భూమిపై జీవించే హక్కు ఉందని గ్రహించడమే జీవవైవిధ్య సారాంశం. ప్రతిజీవి ఆవరణ వ్యవస్థలోని భాగమే. ఏ జీవి నశించినా (అది ఎండమిక్ కావచ్చు లేదా ఇతర ఆవాసాలలో ఉండవచ్చు) ఆవరణ వ్యవస్థలోని ఆహార గొలుసులు, ఆహార జాలకంపై దాని ప్రభావం ఉంటుంది.

దీని మూలంగా ప్రపంచ జీవవైవిధ్యం ప్రభావితం అవుతుంది. కాబట్టి భూమిపైన జీవవైవిధ్యాన్ని రక్షించాలంటే ముందుగా మనం ప్రకృతి పరిరక్షణలో భాగస్థులం కావాలి. తరువాత ఇతరులకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. ఈ రోజు కొన్ని జాతులు అంతరించిపోతే, రేపు అంతరించిపోయే జాబితాలో మనం ఉంటాం.

జీవవైవిధ్యాన్ని సంరక్షించుకోవడం అంటే అటవీ వనరులను అతిగా కాకుండా మితంగా వినియోగిస్తూ ఆవరణ వ్యవస్థలపై ఎలాంటి దుష్ప్రభావం చూపకుండా జాగ్రత్త వహించడం. ఇలా చేయటం వలన అడవులు నిరంతరం అభివృద్ధి చెందుతూ ముందు తరాలకు జీవ వైవిధ్యాన్ని అందించగలుగుతాయి.

ప్రకృతి మానవ అవసరాలకే గాని మానవ అత్యాశలకు కాదు. మానవులుగా మనం ఎప్పుడూ ప్రకృతిని మన అవసరాలకు ఎలా వినియోగించాలి అనే కోణంలో ఆలోచించాం కాని ! ప్రకృతిని ఎలా సంరక్షించుకోవాలి అనే కోణంలో ఆలోచించలేదు. మానవుడు ప్రకృతిలోని ఒక భాగం మాత్రమే. యావత్ ప్రకృతి కాదు. ప్రకృతిని సంరక్షిస్తే అది మనలను రక్షిస్తుంది.

ప్రశ్న 21.
జీవవైవిధ్య సంరక్షణ మన ఇంటి నుండే మొదలు అవుతుందని రాణి చెప్పింది. ఇది సరైనదేనా ? ఆమెను నీవు ఎలా సమర్థిస్తావు ?
జవాబు:
అవును. రాణి అన్నది నిజమే. నేను రాణిని సమర్థిస్తాను. ఎందుకంటే

  1. జీవుల సంరక్షణ మన ఇంటి నుండి ప్రారంభమవ్వాలి.
  2. మన ఇల్లు ‘ప్రకృతి’ అనే పెద్ద ఆవరణలో ప్రాథమిక ఆవాసం.
  3. దీనిలో జీవవైవిధ్యం ఉంటే, అది మన బజారుకి, అక్కడ నుండి గ్రామానికి, పట్టణాలకి, నగరాలకి, రాష్ట్రాలకి, దేశానికి, దేశ దేశాలకు విస్తరిస్తుంది.
  4. ఇది ఎవరో ఒక్కరే చేసే పనికాదు.
  5. ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఇది అందమైన కలసికట్టుగా, సామాజిక బాధ్యతగా భూతదయ ఉన్న మానవులుగా మనందరం చేయవలసిన ముఖ్యమైన పని.

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 22.
ప్రజల్లో జీవవైవిధ్యంపై అవగాహన కలిగించుటకు కొన్ని నినాదాలు లేదా ఒక కరపత్రం చేయండి.
జవాబు:
నినాదాలు :
1. జీవవైవిధ్యాన్ని కాపాడుదాం. మనల్ని మనం కాపాడుకుందాం.
2. జీవించు – జీవించనివ్వు.
3. జీవుల మనుగడే – జీవవైవిధ్యం నిలకడ.
4. జీవించే హక్కు – ప్రకృతిలో ప్రతి జీవి హక్కు.

8th Class Biology 6th Lesson జీవ వైవిధ్యం – సంరక్షణ InText Questions and Answers

కృత్యములు

1. ‘పరిసరాల నమూనా’ నువ్వు తయారుచేయగలవా ? (పేజీ నెం. 84)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 6
నేను చేయగలను. ఉదాహరణకు మా ఇంటి చుట్టూ ఉన్న పరిసరాల పటంలో వివిధ మొక్కలు, జంతువులు మొ|| వాటిని గుర్తించి నమూనా చిత్రం గీస్తాను.
ఇది మా ఇల్లు రంగు సూచిక (Colour Code)
1. మొక్కల – మొ – లేత ఆకుపచ్చ (మొక్కలు)
2. మొక్కలు – మొ – ముదురు ఆకుపచ్చ (చెట్లు)
3. జంతువులు – జ – ఎరుపు
4. మనుషులు – మ – ముదురు నీలిరంగు
5. పక్షులు – ప – గులాబి రంగు
6. కీటకాలు – కీ – గోధుమరంగు
7. చేపలు – చే – లేత నీలిరంగు

(a) చార్టులో ఎన్ని రంగులు గుర్తించావు ?
జవాబు:
చార్టులో ఏడు రంగులు గుర్తించాను.

(b) అది ఏమి తెలుపుతుంది ?
జవాబు:
ఆ ప్రాంతంలో విభిన్న రకాల మొక్కలు, జంతువులు గురించి తెలుపుతుంది.

(c) రంగు సూచికలోని మొత్తం సంఖ్య దేనిని తెలియచేస్తుంది ?
జవాబు:
రంగు సూచికలోని మొత్తం సంఖ్య జీవవైవిధ్యాన్ని సూచిస్తుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

2. ప్రకృతి పరిశీలన (పేజీ నెం. 85)
జవాబు:
సమీపంలోని అడవులలో (సాధ్యమైతే) ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు లేదా పొలాలు, తోటలు సందర్శించినపుడు ఇలాంటి అధ్యయనాన్ని (సర్వే) నిర్వహించండి.

మీ పరిశీలనలో ఏవీ తప్పిపోకుండా, మరచిపోకుండా జాగ్రత్త పడండి. పక్షుల గూళ్ళు, సాలీడు గూళ్ళు, పురుగులు, కీటకాలు, నాచుమొక్కలు, శిలీంధ్రాలు మొదలైనవన్/నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

అలాగే అధ్యయనం చేస్తున్నప్పుడు పక్షుల గూళ్ళు మొదలైన ఆవాసాలను కదిలించరాదు. ఇది వరకు వాడిన రంగుసూచికలనే వినియోగిస్తూ నమూనా చిత్రం తయారు చేయండి. అడవుల్లో ఉండే వన్యజీవులలోని వైవిధ్యం మనలను ఆశ్చర్యపరుస్తుంది. ఇలా చేద్దాం

(a) ప్రకృతిలో మిమ్మల్ని అధికంగా ఆకర్షించినదేది ?
జవాబు:
ప్రకృతిలో మా ఊరి చెరువు, దాని ప్రక్కన ఉన్న దేవాలయం నన్ను అధికంగా ఆకర్షించాయి. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, అందంగా, హాయిగా ఉంటుంది.

(b) వీటిని పరిశీలించినపుడు మీ పరిసరాల గురించి ఎన్నో ఆలోచనలు స్ఫురించి ఉంటాయి. ఆలస్యం చేయకుండా సంకోచించకుండా మీ ఆలోచనలు రాయండి.
జవాబు:

  1. ప్రకృతి చాలా అందమైనది, మనోహరమైనది.
  2. ఇది ఎన్నో జీవులకు ఆశ్రయం కల్పిస్తుంది. జీవితాన్ని ప్రసాదిస్తుంది.
  3. మనం కూడా ప్రకృతిలో ఒక ప్రాణిగా జీవించాలి.
  4. ప్రకృతిని మనం పాడుచేయకూడదు.
  5. మన అవసరాలకు ప్రకృతి స్వభావాన్ని నాశనం చేయరాదు.
  6. జీవించు – జీవించనివ్వు అనేది అందరికి ఆదర్శం కావాలి.

(c) రెండు నమూనా చిత్రాలను పోలుస్తూ మీ పరిశీలనలు రాయండి.
జవాబు:
పాఠ్యపుస్తకంలోని పటంతో పోల్చితే నేను గీచిన పటాలలో పచ్చదనం తక్కువగా ఉంది. అంటే మా ప్రాంతంలో చెట్లు తక్కువగా ఉన్నాయి. కావున జీవవైవిధ్యం కూడా తగ్గుతుంది. జీవవైవిధ్యం పెంచటానికి చెట్ల సంఖ్యను పెంచాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

3(a) మొక్కలలో వైవిధ్యం ఉందని నువ్వు ఎలా చెప్పగలవు ? (పేజీ నెం. 85)
జవాబు:
ఏవైనా రెండు మొక్కలను (ఉదా : మందార, మల్లె) గమనిస్తే
AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 7
దీని ద్వారా మొక్కలలో వైవిధ్యం ఉందని మనకు తెలుస్తుంది.

(b) జంతువులన్నీ ఒకేలా ఉంటాయా ? నీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు:
జంతువులన్నీ ఒకేలా ఉండవు. వైవిధ్యాలు (తేడాలు, భేదాలు, అనేక వేరు వేరు లక్షణాలు) ఉంటాయి.
ఉదా : గేదె, ఆవు (రెండూ క్షీరదాలే అయినా)

గేదెలు ఆవులు
1. ఇవి నల్లగా ఉంటాయి. 1. ఇవి నల్లగా, ఎర్రగా, తెల్లగా, మచ్చలుగా, కూడా ఉంటాయి.
2. ఇవి ఎండను తట్టుకోలేవు. 2. ఎండను భరిస్తాయి.
3. వర్షానికి బెదరవు. 3. వర్షంలో గడపటానికి అంతగా ఇష్టపడవు.
4. పాలు చిక్కగా ఉంటాయి. 4. పాలు పలుచగా ఉంటాయి.
5. పనిచేసే సామర్థ్యం తక్కువ. 5. కష్టమైన పనులు కూడా చేస్తాయి.
6. చలాకీతనం తక్కువ. 6. చలాకీగా, హుషారుగా ఉంటాయి.

4(a) నీకు తెలిసిన క్రికెట్ ఆటగాళ్ళ ఫోటోలు సేకరించి వారి మధ్య తేడాలు రాయగలవా ? (పేజీ నెం. 86)
జవాబు:

వెస్టిండియన్లు ఆస్ట్రేలియన్లు
1. జుట్టు రింగులుగా, నల్లగా ఉంది.

2. శరీరం నలుపు రంగులో ఉండి మెరుస్తోంది.

3. ముక్కు చివర్లు ఉబ్బినట్లు వున్నాయి.

4. పెదవులు పెద్దగా వున్నాయి.

5. కంటిపాప నల్లగా వుంది.

6. శారీరక దారుఢ్యం సాధన చేస్తే వచ్చినట్లుగా కనపడుతుంది.

1. జుట్టు తిన్నగా, రాగి రంగులో ఉంది.

2. శరీరం తెల్లగా, పాలినట్లుగా ఉంది.

3. ముక్కులు ఆకర్షణీయంగా వున్నాయి.

4. పెదవులు ఆకర్షణీయంగా వున్నాయి.

5. కంటిపాప పిల్లి కళ్ళలా వున్నాయి.

6. శారీరక దారుఢ్యం పుట్టుకతో వచ్చినట్లు వుంటుంది.

(b) కింది ప్రశ్నలు చర్చించండి. సారాంశాన్ని కింద రాయండి.

ప్రశ్న (i)
పూర్తిగా ఒక దానిదానితో మరొకటి పోలిన జీవులు ఉన్నాయా ?
జవాబు:
లేవు.

ప్రశ్న (ii)
వాటి మధ్యలో భేదాలు ఎందుకు ఉన్నాయి ?
జవాబు:
ఏ జీవి మరో జీవిలా ఉండదు. దాని ప్రత్యేకత ఉంటుంది. ఇది దాని నిర్మాణంపై, దాని ఆహార అలవాట్లు, నివాస ఆ ప్రాంత ప్రభావం ఉంటుంది.

ప్రశ్న (iii)
మొక్కలన్నీ తీగల మాదిరిగా పాకేవి అయితే ఏమవుతుంది ?
జవాబు:
1. మొక్కలన్నీ తీగలైతే నడవటానికి చోటుండదు.
2. జంతువులకు నీడ ఉండదు.
3. భూమిలో నీరు ఇంకదు.
4. విత్తన వ్యాప్తికి ఆటంకం కలుగుతుందని చర్చలో పాల్గొన్న నా మిత్రులు చెప్పారు.

ప్రశ్న (iv)
కోడికి, మేకకు కాళ్ళలో భేదం ఉందా ? లేదా ?
జవాబు:
ఉంది. కోడి కాళ్ళు చిన్నవి ; వీటి వేళ్ళ మధ్య చర్మం వుంది.
మేక కాళ్ళు పెద్దవి, వీటి వేళ్ళు గోర్లు గిట్టలుగా మారాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న (v)
పక్షుల గూళ్ళు ఒకే రకంగా ఉన్నాయా ?
జవాబు:
ఉండవు. కారణం ఒక్కొక్క పక్షి ఆకారం, దాని సౌకర్యాల మీద ఆధారపడి గూడు ఉంటుంది.
కాకి – పెద్ద పుల్లలతో గూడుకడతే – గిజిగాడు సన్నని తీగలు, కొబ్బరి ఆకు ఈనెలతో చిత్రంగా గూడు కడుతుంది.

5. మానవుడు కూడా ప్రకృతిలో ఒక భాగమేనా ? మీరేమంటారు ? (పేజీ నెం. 92)
జవాబు:
అవును. మానవుడు కూడా పక్షులు, జంతువులు మాదిరిగానే ప్రకృతిలో ఒక భాగమే !

  1. ఎందుకంటే వాటితో పాటే మనం. వాటి మీద ఆధారపడి మనం ఇన్ని లక్షల సంవత్సరాలు జీవించాం.
  2. కానీ ఇప్పుడు మన కార్యకలాపాల వల్ల ప్రకృతి నాశనం అవుతుంది.
  3. దీని వల్ల జీవవైవిధ్యం నాశనమవుతుంది.
  4. ప్రకృతి లేకపోతే మానవ మనుగడే ఉండదు.
  5. అన్ని జీవులలాగా మానవుడు కూడా ప్రకృతిలో ఒక భాగం అని నా అభిప్రాయం.

పాఠ్యాంశములోని ప్రశ్నలు

ప్రశ్న 1.
రంపచోడవరం పులులు ఎందుకు అంతరించాయి ? (పేజీ నెం. 87)
జవాబు:
1. రంపచోడవరంలో రంగు మట్టితవ్వకాలు వలన వందల ఎకరాల అటవీ భూమి తగ్గిపోయింది.
2. అందుకే పులుల సంఖ్య తగ్గింది.

ప్రశ్న 2.
మన దేశంలో పులులు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ?
జవాబు:
అవును. శ్రీశైలం అడవులలో కనిపిస్తున్నాయి.

ప్రశ్న 3.
రంపచోడవరం నెమళ్ళ సంఖ్య పెరిగింది. కారణం ఏమిటి ?
జవాబు:

  1. రంపచోడవరంలో రంగు మట్టి కోసం తవ్వకాలు చేసారు.
  2. అందువల్ల అడవి పలుచబడింది.
  3. ఆవాసం లేక పాములు బయట సంచరించాయి.
  4. అవి నెమళ్ళ కంటపడ్డాయి.
  5. పాములు నెమళ్ళకు ఇష్టమైన ఆహారం కాబట్టి అవి ఎక్కువ పాముల్ని తిన్నాయి.
  6. ఆహారం పుష్టిగా ఉంది. కాబట్టి ప్రత్యుత్పత్తిలో ఎక్కువ సఫలత వచ్చి నెమళ్ళ సంఖ్య పెరిగింది.

ప్రశ్న 4.
అడవిని, అడవి జీవులను కాపాడటంలో టైగర్ ప్రాజెక్ట్ ఎలా ఉపయోగపడింది ? అసలు అలు (పేజీ నెం. 92)
జవాబు:
1. పులిని కాపాడాలంటే అడవిని కాపాడాలి.
2. అడవిని కాపాడితే అది జీవవైవిధ్యపు నిల్వగా మారి ఎన్నో రకాల మొక్కలు, జంతువులు, పక్షులకు ఆవాసంగా మారుతుంది.
3. ఇలా అడవిని సంరక్షించటం అంటే పులుల సంరక్షణే !

ప్రశ్న 5.
ఇదివరకు పులులు ఉండి, ఇప్పుడు తగ్గితే అది జింకలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ?
జవాబు:
1. పులుల ఆహారం ఎక్కువగా జింకలే !
2. పులులు తగ్గితే జింకల జనాభా పెరుగుతుంది కదా !

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 6.
జింకల సంఖ్య పెరిగితే మొక్కల పరిస్థితి ఏమిటి ?
జవాబు:
1. జింకలు గడ్డిని, మొక్కలను, వేరుశనగ, కందిచెట్లను తింటాయి.
2. పులులు తగ్గి, జింకల సంఖ్య పెరగటం వల్ల, అవి మొక్కలను తింటాయి కాబట్టి మొక్కల సంఖ్య బాగా తగ్గుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

SCERT AP 8th Class Biology Study Material Pdf 5th Lesson కౌమార దశ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 5th Lesson Questions and Answers కౌమార దశ

8th Class Biology 5th Lesson కౌమార దశ Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
బాల్యావస్థ కౌమార దశ కంటే ఏ విధంగా భిన్నమైనది ?
జవాబు:

  1. బాల్యావస్థలో శరీర అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది.
  2. కానీ కౌమార దశలో ఇది అత్యంత ఎక్కువ స్థాయికి వెళ్తుంది.
  3. అంతేకాక మానసిక ఎదుగుదల, భావోద్వేగాలు ఎక్కువగా వ్యక్తమవుతాయి.
  4. బాల్యావస్థలో ఉన్న ఆధారపడే మనస్తత్వం (తల్లి, తండ్రి, అక్క, అన్నల మీద) కౌమార దశలో తగ్గుతుంది.
  5. కౌమార దశలో వ్యక్తిగత శ్రద్ధ, స్వయంగా నా పనులు నేను చూసుకోగలననే అభిప్రాయం పిల్లలలో వ్యక్తమవుతుంది.
  6. ఇలా శారీరక, మానసిక, భావోద్వేగాల వ్యక్తీకరణలో బాల్యావస్థ కౌమార దశ కన్నా భిన్నమైనదని చెప్పవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 2.
క్లుప్తంగా రాయండి.
(i) ద్వితీయ లైంగిక లక్షణాలు
(ii) ఆడమ్స్ యాపిల్
జవాబు:
(i) ద్వితీయ లైంగిక లక్షణాలు:

  1. కౌమార దశలో, హార్మోనుల ప్రభావం వల్ల శరీరంలో వచ్చే ముఖ్య లక్షణాలను ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు.
  2. మగపిల్లలలో నూనుగు మీసాలు, గడ్డం రావటం, గొంతు బొంగురుగా మారటం.
  3. ఆడపిల్లలలో నాజూకుతనం మొదలైనవి.
  4. లైంగిక అవయవ వ్యవస్థలో పరిపక్వతకు వస్తాయి.
  5. బాహు మూలాల్లో వెంట్రుకలు పెరుగుతాయి.

(ii) ఆడమ్స్ యాపిల్ :

  1. గొంతు దగ్గర ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా ఉన్న థైరాయిడ్ మృదులాస్థి ఎముకను ‘ఆడమ్స్ యాపిల్’ అంటారు.
  2. ఈ ‘ఆడమ్స్ యాపిల్’ మన స్వరపేటిక (Larynx) యొక్క పాక్షిక పెరుగుదల వలన పెరుగుతుంది.
  3. కౌమారదశలో థైరాయిడ్ మృదులాస్థి పెరగటం వల్ల ‘ఆడమ్స్ యాపిల్’ ఏర్పడుతుంది.
  4. ఇది మగపిల్లలలో ఒకానొక ద్వితీయ లైంగిక లక్షణం.

ప్రశ్న 3.
కౌమార దశలో మానవ శరీరంలో జరిగే మార్పుల జాబితా రాయండి.
జవాబు:
1. ‘కౌమార దశ’ ప్రతి మానవునిలో 13-19 సం||ల మధ్య వచ్చే ముఖ్యమైన దశ.
2. దీని వల్ల మానవ శరీరంలో
ఎ) కండరాలు, ఎముకల అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది.
బి) దీనివల్ల ఎత్తు, బరువు పెరుగుతారు.
సి) శరీరంలో జీవనక్రియ రేటు పెరుగుతుంది. దీనివల్ల శక్తి ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. (దీనిని + ‘tive గా మార్చుకోవాలి)
డి) ‘ఆడమ్స్ యాపిల్’ మగపిల్లలలో పెరుగుతుంది.
ఇ) ఆడపిల్లలలో స్థనాల పరిమాణం పెరుగుతుంది.
ఎఫ్) బాహు మూలాల్లో, ప్రత్యుత్పత్తి అంగాల దగ్గర వెంట్రుకలు పెరుగుతాయి.
జి) బాలికలలో ఋతుచక్రం మొదలవుతుంది.
హెచ్) మగపిల్లలలో వీర్యకణాల ఉత్పత్తి మొదలవుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 4.
జతపరచండి.
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 1
జవాబు:
1) C
2) B
3) D
4) A

ప్రశ్న 5.
కౌమార దశలో మొటిమలు, మచ్చలు ఎందుకు వస్తాయి ? వాటి పట్ల ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ?
జవాబు:
1. కౌమార దశలో శరీరంలో అభివృద్ధి ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. ఈ
2. దీనివల్ల శరీరంలోని తైల గ్రంథులు, స్వేద గ్రంథులు కూడా ఎక్కువ స్థాయిలో స్పందించి తైలాన్ని, స్వేదాన్ని ఉత్పత్తి చేస్తాయి.
3. దీనివల్ల ముఖం జిడ్డుగా ఉండటం, తైల గ్రంథుల నాళాలలో బాక్టీరియా చేరి ఉబ్బుగా ఉండే బుడిపెలు (మొటిమలు) రావటం సాధారణ విషయం.
4. కొన్నిసార్లు చీము పట్టి ఇవి నొప్పిని కలుగచేస్తాయి.
5. వీటిని గిల్లినా, గోరు తగిలినా అది మచ్చగా మారుతుంది.
6. చెమట వల్ల శరీరం నుంచి ఒక రకమైన వాసన కూడా వస్తుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు :
ఎ) ముఖాన్ని చల్లని నీటితో రోజుకు 3, 4 సార్లు శుభ్రం చేసుకోవాలి.
బి) మాటిమాటికీ సబ్బుతో ముఖాన్ని కడగకూడదు.
సి) మొటిమలను గిల్లకూడదు. ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడాలి.
డి) వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
ఇ) ఒత్తిడి, ఆందోళన లేకుండా మానసిక ఉల్లాసానికి సాధన చేయాలి.

ప్రశ్న 6.
కౌమారదశలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించటానికి నువ్వు మీ స్నేహితుడికి ఏం సలహాలు ఇస్తావు?
జవాబు:
కౌమారదశలో వ్యక్తిగత పరిశుభ్రతకు, నా స్నేహితునికి కింది సలహాలు ఇస్తాను.

  1. ప్రతిరోజు రెండు పూటలా స్నానం చేయాలి.
  2. మర్మావయవాల శుభ్రత పట్ల శ్రద్ధ వహించాలి.
  3. ముఖాన్ని ఎక్కువసార్లు చల్లని నీటితో కడగాలి.
  4. మొటిమలను గిల్లటం కాని, వత్తటం కాని చేయరాదు.
  5. ముఖానికి లేపనాలు రాయరాదు.
  6. అవాంఛిత రోమాలను తొలగించుకోవాలి.
  7. నూనె, నెయ్యి తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
  8. తగినంత శారీరక శ్రమ కొరకు వ్యాయామం చేయాలి. ఆటలు ఆడాలి.

ప్రశ్న 7.
మీకు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులపై కోపం వచ్చిందా ? మీ తల్లిదండ్రులు ఎలా ఉండాలని మీరు భావిస్తారు ?
జవాబు:
1. నాకు చిన్నప్పటి నుండి ఎప్పుడూ నా తల్లిదండ్రులపై కోపం రాలేదు.
2. కానీ ఈ మధ్య వారిచ్చే సూచనల పట్ల విసుగు వస్తోంది.
3. నాకు తెలిసిన విషయాలు కూడా వారు పదే పదే చిన్నపిల్లవాడికి చెప్పినట్లు చెప్పటం విసుగనిపిస్తోంది.
4. నా వయస్సు ఇప్పుడు 14 సం||లు.
5. ఎండలో స్నేహితులతో ఆటలకు వెళ్ళేద్దంటారు.
6. స్నేహితులను ఇంటికి రానివ్వరు. వచ్చినా బయట మాట్లాడమంటారు. కానీ నాకు వారితో గడపటం ఇష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడు కోపం వస్తుంది.
7. ఎక్కువగా ఈ మధ్య ఇది చెయ్యి. అది చేయకూడదు అన్న సలహాల ప్రక్రియ మొదలయ్యింది. ఇది నాకిష్టం లేదు.
8. నా తల్లిదండ్రులు
ఎ) నేను పెద్దవాణ్ణి అయ్యాను అని గుర్తించాలని కోరుకుంటాను.
బి) నాకు నచ్చిన, నాకిష్టమైన పనులు చేయవద్దని అనకుండా ఉంటే బాగుంటుంది.
సి) నేను పెద్దవాణ్ణి అని వారు గుర్తించాలనిపిస్తుంది.
డి) నేను కూడా స్వతంత్రంగా పనులు చేయగలనని వారు విశ్వసించాలని భావిస్తాము.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 8.
మీరు మీ తల్లిదండ్రుల కంటే స్నేహితులతో ఏ ఏ సమస్యలు, అభిప్రాయాలు పంచుకుంటారు ?
జవాబు:
నేను నా స్నేహితులతో ఈ కింది అభిప్రాయాలు పంచుకుంటాను.
1. నా శరీరంలో జరిగే మార్పులు – ఎత్తు, బరువు, మొటిమల గురించి వారి అనుభవాలను తెలుసుకోవాలని అనుకుంటాను.
2. చదువు విషయంలో ప్రగతి విషయమై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులిచ్చిన సూచనలపై వారి అభిప్రాయాలు తీసుకొని, వారి సలహాలను నిర్లక్ష్యం చేస్తాను. (చాలా కొద్దిమంది మాత్రమే ఈ విషయంలో వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తారు. )
3. సినిమాలు, హీరో, హీరోయిన్ల విషయాలు ‘స్నేహితులతో ఎక్కువగా పంచుకుంటాను.
4. వీడియో గేమ్ లు, సాంఘిక అంతర్జాల పట్టికల గురించి వారి సలహాలు, అనుభవాలు తెలుసుకోవటానికి ఉత్సాహం చూపుతాను.
5. భిన్నలింగ వర్గీయుల గురించి, కబుర్లు ఎక్కువగా స్నేహితులతో చర్చిస్తాను.
6. లైంగిక అవయవాల అభివృద్ధి గురించి కంగారు పడి స్నేహితుల సలహాల కోసం ఆత్రుతగా చూస్తాను. (ఇది కూడా 99% ఋణాత్మక ఫలితాన్ని ఇస్తుంది. సమ వయస్కులు కాబట్టి ఈ విషయంపై వారికి శాస్త్రీయ పరిజ్ఞానం ఉండదు. )

ప్రశ్న 9.
ఒకవేళ నీకు వైద్యుడ్ని సంప్రదించే అవకాశం వస్తే, కౌమార దశలో ఉద్వేగాల గురించి నీవు అడిగే ప్రశ్నలు ఏమిటి ?
జవాబు:
నాకు వైద్యుడ్ని కలిసి కౌమార దశలో నేను ఎదుర్కొనే ఉద్వేగాల గురించి ఈ కింది ప్రశ్నలు అడుగుతాను.

  1. నేను నా సౌందర్యంపై మునుపెన్నడూ లేనంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాను. ఎందుకని ?
  2. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలు సలహాలు నచ్చక వారితో విభేదిస్తున్నాను. కారణం ఏమిటి ?
  3. అందరి దృష్టిలో నేను ఎందుకు అగుపడాలి అని భావిస్తున్నాను.
  4. ఈ మధ్య నా ప్రవర్తనలో దూకుడు, దుందుడుకు మనస్తత్వం ఎందుకు వస్తున్నది ?
  5. ఎందుకు నాకు అవకాశమెచ్చినప్పుడు గట్టిగా అరచి గోల చేయాలనిపిస్తున్నది ?
  6. భిన్న లైంగిక వర్గీయుల పట్ల నేను ఎందుకు ఆకర్షణకు లోనవుతున్నాను ?
  7. నా లైంగిక అవయవాల దగ్గర, బాహు మూలాల్లో వెంట్రుకలు ఎందుకు పెరుగుతున్నాయి ? చెమట ఎక్కువ పోస్తున్నది. ఎందుకు ?
  8. ఋతుచక్రం, రజస్వల అవటం ఆడపిల్లలలో జరిగే మార్పులు. మరి మగవారిలో ఎలాంటి మార్పులు వస్తాయి ?
  9. అనవసరమైన సిగ్గు, అసహనం, అరచి గోల చేయాలనిపించటం – గొంతు బొంగురు పోవటం ఎందువల్ల నాలో కలుగుతున్నాయి ?
  10. ‘వ్యక్తిగత పరిశుభ్రత’ అంటే ఏమిటి ? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

ప్రశ్న 10.
కొన్ని మొబైల్ ఫోన్లలో ఉండే ఆడియో మీటరును ఉపయోగించి 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న కొందరి విద్యార్థుల స్వరాల పౌనఃపున్యాన్ని నమోదు చేసి మీ పరిశీలనలు రాయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 2
పరిశీలనలు :
1. 6వ తరగతి పిల్లలలో స్వర పౌనఃపున్యం దాదాపు ఆడ, మగపిల్లల్లో ఒకే విధంగా ఉందని గమనించాను.
2. 7వ తరగతిలో కూడా స్వర పౌనఃపున్యం ఆడ, మగపిల్లల్లో ఒకే విధంగా ఉంది.
3. 8వ తరగతిలో మగపిల్లలలో పౌనఃపున్యం తగ్గింది. అంటే వారి స్వరం బొంగురుగా ఉంది. ఆడపిల్లల్లో మాత్రం సన్నగా ఉండి పౌనఃపున్యం 6, 7వ తరగతుల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. (కౌమార దశ ప్రారంభమైనదని సూచన)
4. 9,10 తరగతుల మగపిల్లల్లో బొంగురు గొంతు ఉంది. సాధారణంగా పురుషులలో ఉండాల్సిన పౌనఃపున్యం 120 Htz కు దగ్గరగా ఉన్నది. అమ్మాయిలలో సన్నని గొంతు ఇంకా సున్నితత్వంతో ఉందని మా పరిశీలనలో తేలింది.
5. టెస్టోస్టిరాన్, అడ్రినలిన్ల ప్రభావం వల్ల 13 నుండి 15 సం|| వయస్సుకు వచ్చిన పిల్లల గొంతు బొంగురుగా వుంటుంది.
6. ఈస్ట్రోజన్ ప్రభావం వల్ల ఆడపిల్లల గొంతులో సున్నితత్వం మొదలయిందని గమనించాము.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 11.
బాల్యవివాహాలు, బాలికల ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి సమాచారం సేకరించి నివేదిక తయారుచేయండి.
జవాబు:
బాల్యవివాహాలు ఒక సాంఘిక దురాచారం. చిన్న వయస్సులోనే వివాహం చేయటం వలన వారిలో గర్భధారణకు
కావలసిన శారీరక పరిణితి ఉండదు. అందువలన ప్రసవ సమయంలో తల్లి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. వీరికి కలిగే సంతానం కూడా సరైన ఎదుగుదల లేకపోవటం వంటి సమస్యలతో బాధపడతారు.

అంతేగాక వివాహ బంధాన్ని కొనసాగించటానికి కావలసిన మానసిక పరిణితి లోపించి వివాహాలు విఫలమవుతాయి. చిన్న వయస్సులోనే తల్లి కావటం వలన వారి గర్భాశయం సరిగా ఎదగక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువలన భారత ప్రభుత్వం వివాహానికి కనీస వయస్సు పురుషులకు 21 సంవత్సరాలుగాను, స్త్రీలకు 18 సంవత్సరాలుగాను నిర్ణయించింది. బాధ్యత గల పౌరునిగా మనం వీటిని పాటించాలి.

ప్రశ్న 12.
పటంను పరిశీలించండి. మానవ శరీరంలో ఉండే అంతఃస్రావ గ్రంథులు, అవి ఉండే చోటును తెలిపే పటం గీయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 3
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 10

ప్రశ్న 13.
ఆడమ్స్ యాపిల్ పటం గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 4

ప్రశ్న 14.
కౌమార దశలో జరిగే మార్పులు, తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తూ ఒక ఉపన్యాస వ్యాసం తయారుచేయండి. (లేదా) ఏ లక్షణాలను బట్టి బాలబాలికలు కౌమారదశను చేరుకున్నారని తెలుసుకోవచ్చు.
జవాబు:
1. 13-19 సం|| మధ్య వయస్సు గల పిల్లలలో కనిపించే అతి సున్నితమైన, ముఖ్యమైన దశను కౌమార దశ అంటారు.
2. దీనినే టీనేజ్ అంటారు. ఇది శారీరక, మానసిక భావోద్వేగాల అభివృద్ధిని వేగవంతం చేసే వయస్సు.

మార్పులు :

(1) శారీరక మార్పులు :

  1. ఈ దశలో శరీరంలో అభివృద్ధి బాగా ఎక్కువ జరుగుతుంది.
  2. BMR (Basal Metabolic Rate) ఎక్కువగా ఉంటుంది.
  3. కండరాల అభివృద్ధి, ఎముకల పెరుగుదల ఎక్కువవటం వల్ల ఎత్తు, బరువు పెరుగుతారు.
  4. మగపిల్లల్లో గొంతు బొంగురుపోవటం, మీసాలు, గెడ్డాలు రావటం, జననాంగాల వద్ద వెంట్రుకలు రావటం ప్రారంభమవుతుంది.
  5. బాహు మూలాల్లో వెంట్రుకలు పెరిగి, శరీరంలో చెమట ఎక్కువ పోస్తుంది.
  6. ఆడపిల్లల్లో రజస్వల అయ్యి, ఋతుచక్రం ప్రారంభమవుతుంది.
  7. ముఖంపై మొటిమలు, మచ్చలు వస్తాయి.

(2) మానసిక మార్పులు :

  1. వీరిలో దేనిపైనా సరైనా ఆసక్తి ఉండదు.
  2. విసుగు ఎక్కువ.
  3. నిర్లక్ష్యంగా ఉంటూ, ఎక్కువ సార్లు అసహనం వ్యక్తపరుస్తారు.
  4. అరచి గోల చేయాలనిపిస్తుంది.
  5. అందరి దృష్టి తన పైనే ఉండాలని, తాను పెద్దవాడ్ని అయ్యాను కాబట్టి తన నిర్ణయాల పట్ల అందరూ సానుకూలంగా స్పందించాలని కోరుకుంటారు.
  6. భావోద్వేగాల స్థాయి ఎక్కువగా ఉంటుంది.
  7. ఎక్కువ సేపు అద్దం ముందు గడుపుతూ తమ సౌందర్యంపై ఎక్కువ మక్కువ చూపిస్తారు.
  8. సమ వయస్కులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు.
  9. కలల ప్రపంచంలో విహరిస్తూ, ఆ స్వప్నంలో తమ కోరికలు నెరవేరినట్లు హిస్తూ గడపటానికి ప్రాధాన్యం ఇస్తారు.
  10. భిన్న లింగ వర్గీయుల పట్ల ఆకర్షణకు లోనవుతారు.

తీసుకోవలసిన జాగ్రత్తలు :

  1. ఈ భావోద్వేగ మార్పులను తనలో సహజంగా హార్మోనుల వల్ల వచ్చే మార్పులని ముందుగా తనకు తాను చెప్పుకోవాలి.
  2. స్నేహితుల ప్రోదల్బంతో చెడు అలవాట్లకు దగ్గరవకుండా స్వీయ క్రమశిక్షణ పాటించాలి.
  3. తనలో జరిగే ఈ ‘సంక్లిష్ట సంఘర్షణ’ నుండి బయటపడడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సాయం, అవసరమైతే డాక్టర్ల సాయం తీసుకోవాలి.
  4. మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయాలి.
  5. ‘వ్యక్తిగత పరిశుభ్రత’ పాటిస్తూ వ్యాధుల నుండి కాపాడుకోవాలి.
  6. ‘తేలికపాటి వ్యాయామం’ ఆటల ద్వారా శరీరాన్ని అలసట చెందించటం ద్వారా మంచి నిద్రను ఆహ్వానించవచ్చు.
  7. టివిల ముందు వీడియో గేమ్ ల ముందు, చాటింగ్ (చరవాణి ద్వారా SMS) లను నివారించి, స్థూలకాయత్వం రాకుండా చూసుకొనవచ్చు.
  8. భిన్నలింగ వర్గీయుల పట్ల గౌరవ భావాన్ని పెంచుకోవాలి.
  9. ఇది ఇప్పటి సమాజ శ్రేయస్సుకు ఎంతో ముఖ్యమైనది.
  10. తల్లిదండ్రులు పిల్లల్ని ఈ దశలో నిశిత పరిశీలన చేస్తూ వారికి మానసికంగా కావలసిన అండదండలను అందించాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 15.
ప్రత్యుత్పత్తిపరంగా మరొక తరం సంతతిని ఉత్పత్తి చేసే విధంగా ప్రకృతి మానవ శరీరాన్ని తయారుచేసింది. దీన్ని నువ్వెట్లా అభినందిస్తావు ?
జవాబు:

  1. ప్రత్యుత్పత్తిపరంగా మరొక తరం సంతతిని ఉత్పత్తి చేసే విధంగా ప్రకృతి మానవ శరీరంలో లింగ భేదం ఉన్న ప్రత్యుత్పత్తి వ్యవస్థలను తయారుచేసింది.
  2. పురుషులలో ఒక జత ముష్కాలతో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను, స్త్రీలలో ఒక జత స్త్రీ బీజకోశాలతో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను, ప్రకృతి అభివృద్ధి చేసింది.
  3. పురుషుల నుండి శుక్రకణం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో విడుదలైన అండంతో కలిసి సంయోగం చెంది సంయుక్త – బీజంగా అభివృద్ధి చెందుతుంది.
  4. దీనిని అంతర ఫలదీకరణ అంటారు.
  5. ఇది స్త్రీలలోని ఫాలోపియన్ నాళాలలో జరుగుతుంది.
  6. తరువాత పిండం ఏర్పడి గర్భాశయ గోడలకు అంటిపెట్టుకుని ‘భ్రూణం’గా అభివృద్ధి చెందుతుంది.
  7. ఈ భ్రూణం ‘గర్భావధి కాలం 270-280 రోజుల మధ్య ఉంటుంది. పూర్తిగా అభివృద్ధి చెంది శిశువుగా మారిన తరువాత తల్లి బిడ్డకు జన్మనిస్తుంది.
  8. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ. దీనికి అవసరమైన ఏర్పాట్లు గర్భాశయంలోనే ప్రకృతి అభివృద్ధి చేసింది.
  9. ఇది ఎంతో అభినందించవలసిన విషయం.
  10. ఈ ఏర్పాట్ల వల్ల మానవ సంతతి తరం తర్వాత తరంలో అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడింది.

ప్రశ్న 16.
బాల్యవివాహం ఒక సామాజిక దురాచారం అని మీకు తెలుసు. దీని నివారణకై కొన్ని నినాదాలు తయారుచేయండి.
జవాబు:
1. వివాహం మరొక తరాన్ని సృష్టించటంలో కీలకపాత్ర పోషించే ఒక సామాజిక, సాంస్కృతిక ప్రక్రియ.
2. దీనికి పురుషులలో 21 సంవత్సరాలు. స్త్రీలలో 18 సంవత్సరాల కనిష్ఠ వయస్సును మన దేశ రాజ్యాంగం చట్టంగా చేసింది. దీనిని మనందరం గౌరవించాలి.
నినాదాలు :

  1. బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకం.
  2. బాల్య వివాహాలు నేరం.
  3. పిల్లల్ని ఎదగనీయండి. తరువాత వివాహం చేయండి. ఆరోగ్యమైన సంతతిని పొందండి.
  4. ఆడపిల్లల చదువు – ఆ ఇంటికి వెలుగు.
  5. బాల్య వివాహం – తల్లీ బిడ్డల ఆరోగ్యానికి హానికరం.
  6. బాల్య వివాహాలు – వారి జీవితాల్లో ఆటుపోటులకు ఆనవాలు.
  7. బాల్య వివాహాలు ఆపుదాం – ముందు తరాలను కాపాడదాం.
  8. బాల్య వివాహం – ఒక సామాజిక దురాచారం.

ప్రశ్న 17.
13 ఏళ్ళ స్వరూప్ తన ఎత్తు గురించి కలవరపడుతున్నాడు. అతడు ఎత్తు పెరుగుతాడా ? తనకి నువ్వు ఇచ్చే సలహా ఏమిటి ?
జవాబు:
1. స్వరూప్ ప్రస్తుత వయస్సు 13 సంవత్సరాలే.
2. పిల్లలు సాధారణంగా కౌమార దశ చివరి వరకు ఎత్తు బాగా పెరుగుతారు.
3. కౌమార దశ 13-19 సం|| వరకు, కాబట్టి స్వరూప్ ఇంకా కౌమార దశ మొదట్లోనే ఉన్నాడు. ఇంకా అతను 6 సం||ల వరకు ఎత్తు ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
4. 19 సం|| దాటిన తర్వాత కూడా 25 నుండి 30 సం|| వరకూ స్వల్పంగా ఎత్తు పెరిగే అవకాశం ఉన్నది.
5. కాబట్టి స్వరూప్ తన ఎత్తు గురించి కలవరపడే అవసరం లేదని నేను అతనికి సలహా .(శాస్త్రీయంగా) ఇస్తాను.

ప్రశ్న 18.
మీ పాఠశాలలో ఉన్న రెడ్ రిబ్బన్ క్లబ్ నిర్వహించే కార్యక్రమాలు మెరుగుపరచుకోవడానికి ఏవైనా ఐదు సలహాలు సూచించండి.
జవాబు:
1. మా పాఠశాలలో ‘కౌమార విద్య’ పై అవగాహన కల్పిస్తూ వాటి కార్యక్రమాల రూపకల్పన మరియు నిర్వహణ కోసం రూపొందించబడిన వాలంటరీ జట్టునే ‘రెడ్ రిబ్బన్ క్లబ్’ అంటారు.
2. చాలామంది దీనిని HIV / AIDS కార్యక్రమ ప్రచారం కోసమే అని భావిస్తారు. కానీ అది తప్పు.
3. ఇది కౌమార దశలో ఉన్న టీనేజర్లు చేసే తప్పులను చేయకూడదని చెప్తూ వారిని చైతన్యపరచి వారి భావోద్వేగాల నియంత్రణకు అవసరమైన కార్యక్రమాలను రూపకల్పన చేస్తుంది.

ఈ క్లబ్ నిర్వహణ మెరుగుపడడానికి కొన్ని సూచనలు :

  1. క్లబ్ నిర్మాణం పారదర్శకంగా ఉండాలి.
  2. సమూహాన్ని జట్లుగా విభజించి ప్రతి జట్టుకు నిర్దిష్టమైన బాధ్యతలను, విధులను కేటాయించాలి.
  3. వీరందరినీ సమన్వయపరచటానికి ఒక ఉపాధ్యాయినీ (బాలికలకు), ఒక ఉపాధ్యాయుడు (బాలురకు) విడిగా ఉండాలి.
  4. చేసిన కార్యక్రమ వివరాలు విధిగా ‘ఒక రిజిస్టరు నందు నమోదు చేయాలి.
  5. ఈ క్లబ్ నిర్వహణ ‘ఒక సామాజిక బాధ్యత’గా పాఠశాల ఉపాధ్యాయులు స్వీకరించాలి.

8th Class Biology 5th Lesson కౌమార దశ InText Questions and Answers

కృత్యములు

1. పట్టికను గమనించండి. క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
జవాబు:
బాల బాలికల వయస్సు ఆధారంగా ఉండవలసిన సగటు ఎత్తు.
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 5
(a) ఏ వయస్సుకు చేరుకున్న తర్వాత అబ్బాయిలలో ఎత్తు పెరుగుదల దాదాపుగా ఆగిపోయింది?
జవాబు:
18 సం|| వయస్సు నాటికి అబ్బాయిలలో పెరుగుదల 100% పూర్తి అవుతుంది.

(b) అమ్మాయిలలో పెరుగుదల ఏ వయస్సులో వేగంగా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు ?
జవాబు:
అమ్మాయిలలో పెరుగుదల 8 సంవత్సరాల నుండి వేగంగా ప్రారంభమై 16 సం|| పూర్తి అవుతుంది.

(c) అమ్మాయిల్లో పెరుగుదల ఏ వయసులో ఎక్కువగా జరుగుతుంది ?
జవాబు:
అమ్మాయిల్లో పెరుగుదల ప్రధానంగా 11 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల మధ్య ఎక్కువగా (4%) జరుగుతుంది.

(d) అబ్బాయి, అమ్మాయిలలో ఎవరు వేగంగా పెరుగుతారు ? ఎట్లా చెప్పగలవు ?
జవాబు:
1. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలలో పెరుగుదల రేటు అధికం అనిపిస్తుంది.
2. మొదట అమ్మాయిలు వేగంగా పెరిగినప్పటికీ 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇరువురిలో పెరుగుదల సమానంగా ఉంటుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

(b) మీ సంపూర్ణ ఎత్తు ఎంతో ఎలా లెక్కకట్టగలవు ? (పేజీ నెం. 70)
జవాబు:
1. దీనికి నా ప్రస్తుత వయస్సు ఎంతో కావాలి.
2. తరువాత ఈ వయస్సులో ఎంత ఎత్తు ఉన్నానో తెలియాలి.
3. చివరగా ఎత్తు పెరుగుదల శాతం, ఈ వయస్సుకు ఎంతో తెలియాలి.
అంటే నా ప్రస్తుత వయస్సు = 14 సం||
నా ప్రస్తుత ఎత్తు = 130 సెం.మీ.
ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం = 92
ఈ విషయాలను కింది సూత్రంలో ప్రతిక్షేపించాలి.
నా సంపూర్ణ ఎత్తు = ప్రస్తుత ఎత్తు / ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం × 100 = \(\frac {130}{92}\) × 100 = 141.3 సెం.మీ.
నేను టీనేజ్ పూర్తయ్యే నాటికి 141.3 సెం.మీ. ఎత్తు పెరుగుతాను. అంటే ఇంకా 11.3 సెం.మీ. ఎత్తు పెరుగుతానన్న మాట!
(దీనికి అనుబంధంగా వయస్సు, పెరుగుదల శాతం గల పట్టిక సహాయం తీసుకోవాలి)

ఎత్తు అంచనావేద్దాం.

ప్రశ్న 2.
నీ స్నేహితులు ఆరుగురిని ఎంపిక చేసి వారి ప్రస్తుత ఎత్తు, భవిష్యత్ ఎత్తు ఎలాప్రశ్న అంచనా వేస్తావో చెప్పు. (పేజీ నెం. 71)
జవాబు:
సూత్రం : మీ సంపూర్ణ ఎత్తు = ప్రస్తుత ఎత్తు (సెం.మీ.లలో) / ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం × 100
(పట్టిక – 1లోని సమాచారం ఉపయోగించుకున్నాను.)
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 6

మీ శరీరంలో మార్పులు పరిశీలిద్దాం.

3. మీ పాఠశాలలోని లేదా మీ తరగతిలోని స్నేహితుల ఆరోగ్య కార్డులను గమనించి కింది పట్టిక పూరించండి. మీ పరిశీలనలు రాయండి. (పేజీ నెం. 71)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 7
పరిశీలనలు :
1. కౌమార దశలో శారీరక మార్పులు వేగంగా జరుగుతాయి.
2. అమ్మాయిల కంటే అబ్బాయిల భుజాలు వెడల్పుగా మారాయి.
3. అమ్మాయిలలో నడుం కింద భాగం వెడల్పుగా మారడం గమనించాము. (ఈ మార్పు ముందు ముందు బిడ్డకు జన్మ నివ్వడంలో తోడ్పడుతుంది.)

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

4. మీ స్నేహితుని ప్రవర్తన మీ ప్రవర్తనలు కింది చెక్ లిస్ట్ తో సరిపోతాయో లేదో సరిచూసుకోండి. దానిని బట్టి నువ్వు ఏ ఏ విషయాలు గమనించావో తెలపండి.
జవాబు:
చెక్ లిస్ట్ :
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 8
పై చెక్ లిస్టు ఆధారంగా చేసుకుని ఈ కింది విషయాలు అర్థం చేసుకున్నాను.

  1. బాల్యంలో చేసే పనులకు, కౌమార దశలో చేసే పనులకు తేడా ఉంటుంది.
  2. ఈ దశలో బాలబాలికలు స్వతంత్రంగా వ్యవహరిస్తారు.
  3. శారీరక, మానసిక మార్పులు వస్తాయి.
  4. ఉద్వేగానికి, అయోమయానికి లోనయ్యే దశలో మేమున్నాం అని గుర్తించాం.
  5. కొత్త ఆలోచనల వెల్లువ మనసులో ఏర్పడుతుంది.
  6. కొత్త విషయాలు అన్నీ తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది.
  7. మానసిక ఒత్తిడి ఉంటుంది.
  8. అనుమానాలు, సంశయాలు తీర్చే ఉపాధ్యాయులన్నా, పెద్దలన్నా చాలా గౌరవభావం ఏర్పడుతుంది. (కౌమార దశలో ప్రకృతి సహజంగా ఉన్న రహస్యాల గురించి దాచి పెట్టకుండా అన్నింటినీ నివృత్తి చేయాలి.)

పాఠ్యాంశములోని ప్రశ్నలు

ప్రశ్న 1.
చిన్న పిల్లలు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు గొంతును బట్టి అమ్మాయా, అబ్బాయో చెప్పగలమా ? (పేజి నెం. 72)
జవాబు:
చిన్న పిల్లల గొంతును బట్టి అబ్బాయో, అమ్మాయో చెప్పలేము. ఇద్దరి గొంతు ఒకే విధంగా ఉంటుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 2.
మాట్లాడేవారు అబ్బాయో, అమ్మాయో ఎప్పుడు ఎలా చెప్పగలుగుతాం ? (పేజి నెం. 72)
జవాబు:
యుక్త వయస్సు వచ్చిన తర్వాత అబ్బాయిల గొంతు గంభీరంగా మారి అమ్మాయిల కంటే విభిన్నంగా ఉంటుంది. అప్పుడు గొంతు ఆధారంగా అబ్బాయో, అమ్మాయో చెప్పలేము.

ప్రశ్న 3.
కౌమార దశలో సాధారణంగా మగపిల్లల కంఠస్వరంలో మార్పు ఎందుకు వస్తుంది ? (పేజి నెం. 72)
జవాబు:
కౌమార దశలో మగపిల్లల స్వరకోశం పరిమాణంలో పెద్దదిగా పెరుగుతుంది. దీనినే ఆడమ్స్ యాపిల్ అంటారు. దీని పరిమాణం పెరగటం వలన గొంతు గంభీరంగా ఏర్పడి ఆడవారి నుండి విభేదిస్తుంది.

ప్రశ్న 4.
ప్రత్యుత్పత్తి దశలను, ప్రత్యుత్పత్తి దశల క్రమాన్ని ఫ్లోచార్టు రూపంలో రాయండి. ఫ్లోచార్టు ఆధారంగా ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (పేజి నెం. 74)
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 9

(a) స్త్రీలలో అండం విడుదల చాలా రోజుల వరకు కొనసాగుతుందా ?
జవాబు:
స్త్రీలలో అండం విడుదల దాదాపు 50 నుండి 55 సంవత్సరాలపాటు కొనసాగుతుంది.

(b) ఒక వేళ అండం విడుదల ఆగిపోతే ఏం జరుగుతుంది ?
జవాబు:
1. అండం విడుదల కాకపోతే, ఫలదీకరణ జరగదు.
2. కావున కొత్త జీవులు ఏర్పడవు.

(c) ఫలదీకరణ చెందిన అండాలు ఏమవుతాయి ?
జవాబు:
1. ఫలదీకరణ చెందిన అండాలు సంయుక్త బీజంగా మారతాయి.
2. సంయుక్త బీజం గర్భాశయంలో జీవిగా ఎదుగుతుంది.

(d) ఫలదీకరణ జరగకపోతే ఏమౌతుంది ?
జవాబు:
1. ఫలదీకరణ జరగకపోతే జీవులు ఏర్పడవు.
2. జాతి అంతరించి పోతుంది.

(e) అసలు అండమే విడుదల కాకపోతే ఏమౌతుంది ?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తికి అండము తప్పనిసరి. అసలు అండము విడుదల కాకపోతే లైంగిక ప్రత్యుత్పత్తి జరగదు. దానివలన కొత్త జీవులు రూపొందవు.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 5.
NPEGEL కార్యక్రమం ద్వారా పాఠశాలలో అమ్మాయిలకు నాప్ కిన్లు అందజేస్తున్నారు. మీ పాఠశాలలో ఈ పథకంలో భాగంగా ఏ ఏ కార్యక్రమాలు చేస్తారో రాయండి. (పేజీ నెం. 79)
జవాబు:
NPEGEL కార్యక్రమం మా పాఠశాలలో

  1. ఆరోగ్య విద్య మీద చర్చ నిర్వహిస్తారు.
  2. కౌమార దశలో శారీరక శుభ్రత ప్రాధాన్యత వివరిస్తారు.
  3. ఉద్వేగ నియంత్రణ అంశంపై క్లాసులు నిర్వహిస్తాడు.
  4. మంచిగా ఆలోచించటం, కలిసి జీవించటం వంటి అంశాలపై అవగాహన ఏర్పరుస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

SCERT AP 8th Class Biology Study Material Pdf 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 4th Lesson Questions and Answers జంతువులలో ప్రత్యుత్పత్తి

8th Class Biology 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
ప్రకృతిలో అన్ని జీవులు ప్రత్యుత్పత్తిని ఆపివేస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:

  • ప్రత్యుత్పత్తి అనేది సజీవులలో ఒక ముఖ్యమైన జీవనక్రియ.
  • దీనివల్ల ప్రౌఢ జీవులు, పిల్ల జీవులను ఉత్పత్తి చేసి తమ తమ జాతులను, వాటి జనాభాను పెంచుకుంటూ ఈ జీవావరణంలో తమ ప్రభావం కోల్పోకుండా చూసుకుంటాయి.
  • దీనివల్ల పాత తరం స్థానంలో కొత్త తరం వచ్చి ఆవరణ వ్యవస్థలో వాటి పాత్రను పూర్తిచేసి ప్రకృతి సమతుల్యతను కాపాడతాయి.
  • ప్రత్యుత్పత్తిని జీవులు ఆపివేస్తే, ఉన్న జీవులు ముసలివై కొంతకాలం తర్వాత చనిపోతాయి. తరువాత వాటి స్థానాన్ని భర్తీచేసే కొత్తతరం ఉండదు.
  • కాబట్టి ‘ప్రకృతిలో సమతుల్యత’ దెబ్బతిని సృష్టి అంతానికి కారణమవుతుంది.

ప్రశ్న 2.
ఈ కింది వాటిలో తేడాలను తెలపండి.
ఎ) లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి
జవాబు:

లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి
1. ఒక జీవి లేదా స్త్రీ పురుష జీవులు అవసరం. 1. ఒక జీవి మాత్రమే అవసరమవుతుంది.
2. స్త్రీ పురుష బీజకణాలు ఏర్పడతాయి. 2. బీజ కణాలు ఏర్పడవు.
3. సంయుక్త బీజం ఏర్పడుతుంది. 3. సంయుక్తబీజం ఏర్పడదు.
4. సగం తల్లి లక్షణాలు, సగం తండ్రి లక్షణాలు వస్తాయి. 4. ఇవి తల్లి జీవి నకలు (జిరాక్స్) గా ఉంటాయి.

బి) సంయోగ బీజం, సంయుక్త బీజం
జవాబు:

సంయోగ బీజం సంయుక్త బీజం
1. ఇది స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల నుండి తయారవుతుంది. 1. ఇది స్త్రీ, పురుష బీజకణాల కలయిక వల్ల ఏర్పడుతుంది.
2. ఇది ఏకస్థితికం. 2. ఇది ద్వయ స్థితికం.
3. ఇది ఫలదీకరణలో పాల్గొంటుంది. 3. ఫలదీకరణ తరువాత మాత్రమే ఇది ఏర్పడుతుంది. తద్వారా జీవి పెరుగుదల మొదలవుతుంది.

సి) బాహ్య ఫలదీకరణం, అంతర ఫలదీకరణ
జవాబు:

బాహ్య ఫలదీకరణ అంతర ఫలదీకరణ
1. శరీరం బయట జరుగు ఫలదీకరణను బాహ్య ఫలదీకరణ అంటారు. 1. శరీరం లోపల (స్త్రీ జీవిలో) జరిగే ఫలదీకరణను అంతర ఫలదీకరణ అంటారు.
2. సంయుక్తబీజం బయట (గాలి, నీరు, నేల) అభివృద్ధి చెందుతుంది. ఉదా : కప్ప, చేప 2. సంయుక్త బీజం స్త్రీ జీవి శరీరంలోపల అభివృద్ధి చెందుతుంది. ఉదా : క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు మొ॥నవి.

డి) అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు
జవాబు:

అండోత్పాదకాలు శిశోత్పాదకాలు
1. గుడ్లు పెట్టి పిల్లతరాన్ని అభివృద్ధి చేసే జీవులను అండోత్పాదకాలు అంటారు. 1. పిల్లల్ని కని, పెంచి తరువాతి తరాన్ని అభివృద్ధి చేసే వాటిని శిశోత్పాదకాలు అంటారు.
2. వీటిలో అంతర ఫలదీకరణ జరుగును.
ఉదా : పక్షులు, సరీసృపాలు
2. వీటిలో కూడా అంతర ఫలదీకరణ జరుగును.
ఉదా : క్షీరదాలు, గబ్బిలం (ఎగిరే క్షీరదం)

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 3.
హైడ్రా, అమీబాల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియను పోల్చండి.
జవాబు:

హైడ్రా ప్రత్యుత్పత్తి అమీబాలో ప్రత్యుత్పత్తి
1. ఇది బహుకణ జీవి. 1. ఇది ఏకకణ జీవి.
2. దీనిలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. 2. దీనిలో కూడా అలైంగిక పద్ధతిలోనే ప్రత్యుత్పత్తి జరుగుతుంది.
3. ఈ పద్ధతిని మొగ్గ తొడగడం లేదా ‘కోరకీ భవనం’ అంటారు. 3. ఇది ద్విధావిచ్ఛిత్తి లేదా బహుధా విచ్ఛిత్తిల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది.
4. ప్రత్యుత్పత్తి తరువాత తల్లిజీవి అంతరించిపోదు. 4. కానీ దీనిలో మాత్రం ద్విధా లేదా బహుధా విచ్ఛిత్తి తల్లిజీవి, పిల్లజీవి రెండూ జీవనం కొనసాగిస్తాయి. తరువాత తల్లి కణం అంతర్ధానమయ్యి పిల్ల కణాలను ఏర్పరుస్తుంది.

ప్రశ్న 4.
సంయుక్తబీజం ఏర్పరచకుండానే జంతువులు వాటి సంతతిని ఉత్పత్తి చేయగలవా ? ఉదాహరణతో వివరించండి.
జవాబు:

  • లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయుక్తబీజం ఏర్పడి, దాని నుండి జీవులు ఏర్పడతాయి.
  • కాని అన్ని జంతువులు లైంగిక ప్రత్యుత్పత్తిని అనుసరించవు.
  • కొన్ని జీవులు అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంయుక్తబీజం ఏర్పడకుండానే సంతతిని ఉత్పత్తి చేస్తాయి.
  • ఉదా : అమీబా – ద్విదావిచ్ఛిత్తి
    హైడ్రా – మొగ్గతొడగటం

ప్రశ్న 5.
బాహ్య లక్షణాలు పరిశీలించి ఒక జీవి అండోత్పాదకమో, శిశోత్పాదకమో ఎలా గుర్తించగలవు ?
జవాబు:
1) అండోత్పాదక జీవిలో

  • చెవులు బయటకు కనిపించవు.
  • చర్మంపై రోమాలు ఉండవు. ఇలాంటి బాహ్య లక్షణాలు ఉన్న జీవులు గుడ్లు పెడతాయి.
  • ఉదా : పక్షులు, మొసలి,తాబేలు, పాము.

2) శిశోత్పాదక జీవిలో

  • చెవులు బయటకు కనిపిస్తాయి.
  • చర్మంపై రోమాలు ఉంటాయి. ఇలాంటి బాహ్య లక్షణాలు ఉన్న జీవులు పిల్లల్ని కని పెంచుతాయి.
  • ఉదా : క్షీరదాలు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 6.
నేను ఎవరిని ?
i) నేను పురుష, స్త్రీ సంయోగ బీజాల కలయిక వల్ల ఏర్పడతాను.
జవాబు:
సంయుక్త బీజము అంటారు.

ii) నాకు తోక ఉంటుంది. అండంతో సంయోగం చెందుతాను.
జవాబు:
శుక్రకణం అంటారు.

iii) తల్లి గర్భాశయంలో పూర్తిగా ఎదిగిన పిండాన్ని నేను.
జవాబు:
భ్రూణం అంటారు.

ప్రశ్న 7.
అనేక భూచరాలలో అంతర ఫలదీకరణ జరుగుటకు కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:

  • బాహ్య ఫలదీకరణలో నీరు మాధ్యమంగా పనిచేస్తుంది.
  • అందువలన సంయోగబీజాలు ఎండిపోయి చనిపోవటం జరగదు.
  • వీటి చలనానికి నీరు దోహదపడుతుంది.
  • భూచర జీవులు భూమిమీద నివశిస్తాయి.
  • నేలమీద సంయోగబీజాలు చలించలేవు.
  • వేడికి, గాలికి సంయోగబీజాలు చనిపోతాయి.
  • అందువలన భూచరజీవులు అంతర ఫలదీకరణను అవలంబిస్తాయి.

ప్రశ్న 8.
కింది పటం సహాయంతో అందులోని జీవి యొక్క జీవిత చరిత్రలో వివిధ దశలను గుర్తించండి. ఈ జీవిలో రూపవిక్రియ ఎలా జరుగుతుందో వివరించండి.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 1
జవాబు:

  • ఈ పటంలో ఉన్నది ‘పట్టు పురుగు’ జీవిత చక్రంనకు సంబంధించినది.
  • దీనిలో ఎ) ప్రౌఢజీవి b) గుడ్ల దశ c) లార్వా దశ d) ప్యూపా దశలు ఉన్నాయి.
  • పట్టు పురుగు నందు అంతర ఫలదీకరణ జరిగి సంయుక్త బీలు – స్త్రీ జీవిలో ఏర్పడతాయి.
  • ఇది మల్బరీ ఆకుల వెనుకభాగాన గుడ్లు దశలు దశలుగా, గుంపులుగా పెడుతుంది.
  • ఇవి ‘సూర్యరశ్మి’ సమక్షంలో పొదగబడి లార్వా దశకు చేరుకుంటాయి.
  • ఇది ‘గొంగళి పురుగు’ మాదిరిగా ఉండి మల్బరీ ఆకులను తింటూ జీవిస్తుంది.
  • తరువాత ‘ప్యూపాదశ’లో ఈ డింభకం ఒక సంచి వంటి కోశాన్ని నిర్మించి దానిలో సుప్తావస్థలోకి వెళ్తుంది.
  • తరువాత అది కోశం నుండి ‘ప్రౌఢజీవి’ గా అభివృద్ధి చెందుతుంది.
  • ప్రౌఢజీవి లక్షణాలు లార్వా, ప్యూపా దశలలో లేనప్పటికీ చివరికి మరలా తల్లి లక్షణాలతో జీవి అభివృద్ధి చెందింది. దీనిని రూపవిక్రియ అంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 9.
జతపరచండి.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 2
జవాబు:
ఎ) 2
బి) 1
సి) 4
డి) 3

ప్రశ్న 10.
ఈ కింది ఖాళీలను పూరింపుము.
ఎ) పిల్లలను కనే జంతువులను ……………….. అంటాం.
బి) మానవులలో శిశువు పెరుగుదల …………………. లో జరుగుతుంది.
సి) అండాలు ……………………… నుండి విడుదలవుతాయి.
డి) టాడ్ పోల్ అనేది ……………………… యొక్క ప్రాథమిక రూపం.
ఇ) కోరకీభవనం, ద్విధా విచ్ఛిత్తి …………………… ప్రత్యుత్పత్తి విధానాలు.
జవాబు:
ఎ) శిశోత్పాదక జీవులు
బి) స్త్రీ జీవి గర్భాశయం
సి) స్త్రీ జీవి బీజకోశం
డి) కప్ప
ఇ) అలైంగిక

ప్రశ్న 11.
అమీర్ ఒక చెరువులో టాడ్ పోల్ ను చేపగా భావించి జాగ్రత్తగా అక్వేరియంలో ఉంచాడు. కొన్ని రోజుల తరువాత అమీర్ దానిలో ఏమేమి మార్పులు గమనిస్తాడో రాయండి.
జవాబు:

  • ‘టాడ్పేల్’ అచ్చం చేపపిల్ల లక్షణాలు కలిగిన ‘కప్ప డింభకం’.
  • పిల్లలు (అమీర్) దానిని చెరువులో చూసి చేపపిల్ల అనుకుని ఆక్వేరియంలో ఉంచాడు.
  • ముందు దీనికి జిగురు ముద్ద లాంటి మూతి ఉండటం గమనించాడు.
  • అది నీళ్ళలో నాచును, అక్వేరియంలో గోడలను అంటిపెట్టుకోవటానికి పనికి వస్తుందని గమనించాడు.
  • దీనికి ఉన్న తోక సాయంతో ఈదగలుగుతుందని గమనించాడు.
  • ఇది బాహ్య మొప్పల ద్వారా ‘జల శ్వాసక్రియ’ జరుపుతుందని తెలుసుకున్నాడు.
  • నెమ్మదిగా ముందున్న శ్లేష్మస్థర ముద్ద నోరుగా పై క్రింది పెదవులుగా విడిపోవటం చూసాడు.
  • తరువాత మొప్పలపై ఉపరికుల ఏర్పడింది.
  • తరువాత దీని తోక కొంచెం కొంచెం పొడవు తగ్గటాన్ని గమనించాడు.
  • ఉపరికుల, బాహ్య మొప్పల స్థానంలో ముందు కాళ్లు ఆవిర్భవిస్తున్నాయి.
  • తరువాత తోక మొదలైన స్థానం నుంచి ఇరుపక్కల వెనుక కాళ్లు ఆవిర్భవిస్తున్నాయి.
  • తల కింది భాగంలో ఇరువైపులా ఉన్న బాహ్య మొప్పలు అంతరించిపోయాయి.
  • తోక పూర్తిగా కుంచించుకుపోయింది.
  • ముందు, వెనుక కాళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందాయి.
  • ఊపిరితిత్తులు ఏర్పడి ఇది నీటి పైకి మూతి పెట్టి బాహ్య నాసికా రంధ్రాల ద్వారా గాలి పీల్చుకోవటం గమనించాడు.
  • ఇది ఇప్పుడు పూర్తిగా రూపాంతరం చెంది కప్ప పిల్లగా మారిపోవడాన్ని పరిశీలించి ఆశ్చర్యపోయాడు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 12.
చేపలు, కప్పలు అధిక సంఖ్యలో అండాలను ఎందుకు విడుదల చేస్తాయి ? మానవుని వంటి క్షీరదాలు అధిక సంఖ్యలో అండాలు విడుదల చేయకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయో ఉపాధ్యాయునితో చర్చించి రాయండి.
జవాబు:

  • చేపలు, కప్పలలో బాహ్య ఫలదీకరణ జరుగుతుంది.
  • కావున ఇవి అండాలు, శుక్రకణాలను నీటిలోనికి విడుదల చేస్తాయి.
  • నీటి ప్రవాహానికి వర్షాలకు ఇతర జీవుల ఆహారంగా కొన్ని అండాలు నశిస్తాయి.
  • అందువలన అండాలలో ఫలదీకరణ అవకాశాలు తగ్గుతాయి. కావున ఈ జీవులు అధిక సంఖ్యలో అండాలను ఉత్పత్తి చేస్తాయి.
  • మానవుని వంటి క్షీరదాలలో అంతర ఫలదీకరణ జరుగుతుంది.
  • అండాలు నశించటం ఉండదు. ఫలదీకరణ అవకాశాలు అధికం.
  • కావున క్షీరదాలలో అండాలు తక్కువ సంఖ్యలో విడుదల అవుతాయి.

ప్రశ్న 13.
మీ గ్రంథాలయము నుండి గాని, ఇతర వనరుల నుండి గానీ తేనెటీగ యొక్క జీవిత చరిత్రను సేకరించి, పాఠశాల సింపోసియంలో ఆ అంశాలను చర్చించండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 3

  • తేనెటీగ ‘ఆర్థోపొడ’ వర్గానికి చెందిన జీవి.
  • ఇవి చాలా కష్టజీవులు. పువ్వుల నుండి మకరందం సేకరించి ‘తేనె’ తయారు చేస్తాయి.
  • క్రమ శిక్షణకు, నాయకత్వ విధేయతకు, మాతృసామ్య వ్యవస్థ మూలాలకు ఈ తేనెటీగలు మంచి ఉదాహరణ.
  • వీని జీవిత చరిత్రలో 4 దశలు ఉన్నాయి. a) గుడ్లు b) లార్వా c) ప్యూపా d) ప్రౌఢజీవి.
  • ఆడ ఈగలు ప్రత్యుత్పత్తి తర్వాత గుడ్లు పెడతాయి.
  • ఇవి పొదగబడిన తరువాత వాటి నుండి లార్వాలు వస్తాయి.
  • ఈ లార్వాలు తేనెటీగలు ఏర్పరచుకున్న తెట్టులోగానీ, పుట్టలోగానీ ఉంచబడతాయి.
  • ఇవి తరువాత పొదగబడి పౌడజీవులుగా ఏర్పడతాయని తెలుసుకున్నాను.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 14.
కింది పటాలను గమనించి బొమ్మలు గీయండి. వాటి విధులు రాయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 4
జవాబు:
ముష్కము విధులు :
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 5

  • ముష్కము పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్య భాగం.
  • ఇది శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది.
  • పురుష లైంగిక హార్మోన్ టెస్టోస్టిరాన్ ను ఉత్పత్తి చేస్తుంది.
  • మగ పిల్లలలో యుక్తవయస్సుకు రాగానే “ద్వితీయ లైంగిక” లక్షణాలను అభివృద్ధి చేస్తుంది. ముష్కము
  • ఇది పీయూష గ్రంథి ఆజ్ఞల ప్రకారం పని చేస్తుంది.

స్త్రీ బీజకోశాలు-విధులు :
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 6

  • స్త్రీ బీజకోశాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్య భాగాలు.
  • వీటిలో ‘అండ పుటికలు’ ఉంటాయి.
  • ఇవి యుక్త వయసు వచ్చిన తర్వాత నుండీ మోనోపాజ్ దశ వరకు ప్రతి 28 రోజులకొకసారి ఒక పుటిక పక్వానికి వచ్చి అండాన్ని విడుదల చేస్తుంది.
  • పగిలిన పుటిక స్త్రీ లైంగిక హార్మోన్లయిన 1) ఈస్ట్రోజన్ 2) ప్రొజెస్టిరాన్లను ఉత్పత్తి చేస్తుంది.

ఫాలోపియన్ నాళాలు-విధులు :

  • ఇవి ఆడపిల్లలలో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని జరిపిస్తాయి.
  • తల్లుల ఆరోగ్యానికి, గర్భం దాల్చినప్పుడు మార్పులకు, బిడ్డకు పాలివ్వటానికి ప్రొజెస్టిరాన్ సహకరిస్తుంది.
  • అండం గర్భాశయానికి చేరటానికి సహకరిస్తాయి.
  • ఫలదీకరణకు అవకాశమిస్తాయి.

మానవ శుక్రకణం-విధులు :
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 7

  • ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్న ‘ముష్కము’ నుండి విడుదల అవుతుంది.
  • ఇది ఏక స్థితికం.
  • కదలగలిగి ఉంటుంది. (దీని తోక సాయంతో)
  • అండాన్ని గర్భాశయంలో కనుగొని ఫలదీకరణ చెందించేందుకు పనిచేస్తుంది.
  • దీని జీవితకాలం 24-72 గంటలు.

అండం-విధులు :
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 8

  • ఇది స్త్రీ బీజకణం.
  • స్త్రీ బీజకోశాలలోని అండ పుటికలు దీనిని ఉత్పత్తి చేస్తాయి.
  • ఇది ఫాలోపియల్ నాళం గుండా ప్రయాణించే సమయంలోనే ఫలదీకరణ చెందేందుకు అవకాశం ఉంటుంది.
  • దీని జీవిత కాలం 24 గం॥ మాత్రమే.

ప్రశ్న 15.
మానవ పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటాన్ని గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 9

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 16.
కప్ప జీవిత చరిత్ర పటం గీచి దానిలో ఏవి శాఖాహార దశలో గుర్తించండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 10

  • కప్ప లార్వాను చిరుకప్ప లేదా టాడ్ పోల్ అంటారు.
  • ఈ దశలో కప్ప చేపను పోలి ఉండి శాకాహారిగా ఉంటుంది.

8th Class Biology 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి InText Questions and Answers

8th Class Biology Textbook Page No. 54

ప్రశ్న 1.
కింద కొన్ని జంతువుల పేర్లు ఇవ్వబడ్డాయి. వాటిని పరిశీలించి జ్ఞాపకం తెచ్చుకుని పట్టిక నింపండి.
(లేడి, చిరుత, పంది, చేప, గేదె, జిరాఫీ, కప్ప, బల్లి, కాకి, పాము, ఏనుగు, పిల్లి)
జవాబు:

క్ర.సం. చెవి బయటకు కనిపించే జీవులు చెవులు బయటకు కనిపించని జీవులు
1. లేడి చేప
2. చిరుత కప్ప
3. పంది బల్లి
4. గేదె కాకి
5. జిరాఫీ పాము
6. ఏనుగు
7. పిల్లి
ఇవన్నీ శిశోత్పాదక జీవులు ఇవన్నీ అండోత్పాదక జీవులు

a) చెవులు బయటకు కనిపించకపోయినా ఈ జీవులు ఎట్లా వినగల్గుతున్నాయి ?
జవాబు:

  • చెవి నిర్మాణంలో, వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి అనే మూడు నిర్మాణాలు ఉంటాయి.
  • వినటంలో కీలక పాత్ర వహించేది లోపలి చెవి.
  • గుడ్లు పెట్టే జంతువులలో బాహ్య చెవి మాత్రమే ఉండదు. మధ్య చెవి, లోపలి చెవి ఉంటుంది.
  • అందువలన ఇవి ధ్వని వినగల్గుతాయి.

8th Class Biology Textbook Page No. 54

ప్రశ్న 2.
కింద కొన్ని జంతువుల పేర్లు ఇవ్వబడ్డాయి. వాటిని జ్ఞాపకం చేసుకుని ఈ పట్టికను నింపండి.
(ఆవు, ఎలుక, కాకి, పంది, నక్క కోడి, ఒంటె, బాతు, కప్ప, ఏనుగు, గేదె, పావురం, పిల్లి, నెమలి, బల్లి )
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 11

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

8th Class Biology Textbook Page No. 57

ప్రశ్న 3.
ఈ క్రింది దానిమ్మ పుష్పాలు పరిశీలించి వాటి ప్రత్యుత్పత్తి భాగాలు రాయండి. (పేజీ నెం. 57)
ఎ) మొక్కలలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 12
1) ………………….
2) ………………….
3) ………………….
4) ………………….
5) ………………….
6) ………………….
జవాబు:
వాటి భాగాలు
1) కేసరము
2) కేసర దండము
3) పరాగ కోశము
4) పరాగ రేణువులు
5) సంయోజకము
6) కేసరావళి

బి) మొక్కలలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ వాటి భాగాలు
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 13
1) ………………….
2) ………………….
3) ………………….
4) ………………….
5) ………………….
6) ………………….
జవాబు:
వాటి భాగాలు
1) అండకోశము
2) అండాశయము
3) కీలము
4) కీలాగ్రము
5) అండన్యాస స్థానము
6) అండాలు

8th Class Biology Textbook Page No. 59

ప్రశ్న 4.
ఈ క్రింది స్లో చార్టును పూరించండి.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 14
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 15

a) శుక్రకణం అండంతో ఫలదీకరణ చెందకపోతే ఏమవుతుందో చెప్పగలరా ?
జవాబు:
శుక్రకణం అండంతో ఫలదీకరణ చెందకపోతే లైంగిక ప్రత్యుత్పత్తి జరగదు. వైవిధ్యం గల జీవులు ఏర్పడవు. క్రొత్త జాతులు అవతరించవు.

b) కొన్ని జంతువులు మాత్రమే పిల్లలకు ఎందుకు జన్మనిస్తాయో చెప్పగలరా ?
జవాబు:
పిల్లల్ని కనే స్త్రీ జంతువుల్లో గర్భాశయము, పిండాభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అందువలన పిండాలు గర్భాశయంలో ఎదిగి పిల్ల జీవులుగా పుడతాయి. గుడ్లు పెట్టే జంతువులలో ఈ అమరిక ఉండదు.

c) జంతువులన్నీ పిల్లలకు జన్మనివ్వడం ఆపివేస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:
జంతువులన్నీ పిల్లలకు జన్మనివ్వడం ఆపివేస్తే, తదుపరి తరం జీవులు ఉత్పత్తికావు. ఉన్న జీవులు కొంత కాలానికి మరణిస్తాయి. కావున భూమి మీద జీవరాశి అంతరించిపోతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

8th Class Biology Textbook Page No. 61

ప్రశ్న 5.
టాడ్ పోల్ లార్వాలు ఏ ఏ ఋతువులలో కనిపిస్తాయో చెప్పండి.
జవాబు:

  • టాడ్ పోల్ లార్వాలు వర్షాకాలంలో బాగా కనిపిస్తాయి.
  • వర్షాకాలంలో కప్ప వర్షపు నీటిలో ప్రత్యుత్పత్తి జరుపుతుంది.
  • అందువలన కప్ప అండాలు బాహ్యఫలదీకరణం చెందుతాయి.
  • ఇవి సూర్యరశ్శికి పొదిగి టాడ్ పోల్ లార్వాలను ఉత్పత్తి చేస్తాయి..
  • ఇవి చేపల వలె నీటిలో ఈదుతూ రూపవిక్రియ చెంది కప్పలుగా మారతాయి.

ప్రశ్న 6.
వర్షాకాలంలో కప్పలు ఎందుకు బెక బెకమని శబ్దాలు చేస్తాయి ?
జవాబు:

  • వర్షాకాలం కప్పల ప్రత్యుత్పత్తికి అనుకూల సమయం.
  • ఈ కాలంలో మగకప్ప బెక బెకమని శబ్దాలు చేసి ఆడకప్పను ఆకర్షిస్తుంది.
  • ఆడ, మగ, కప్పలు కలిసి వర్షపు నీటిలో శుక్రకణాలు, అండాలను విడుదల చేస్తాయి.

8th Class Biology Textbook Page No. 62

ప్రశ్న 7.
కప్ప జీవిత చక్రాన్ని పరిశీలించటానికి నీవు చేయు ప్రాజెక్ట్ వివరాలు తెలపండి.
జవాబు:
ఉద్దేశం : కప్ప జీవిత చక్రం పరిశీలించుట.
పరికరాలు : వెడల్పు మూతిగల తొట్టి లేదా గాజుసీసా, పారదర్శక గ్లాసు, డ్రాపర్, పెట్రెడిష్, గులకరాళ్ళు, భూతద్దం, బీకరు.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 16
విధానము :

  • వర్షాకాలంలో దగ్గర ఉన్న చెరువు వద్దకు వెళ్ళి నురగ వంటి కప్ప గుడ్లను పరిశీలించాను.
  • దానిని జాగ్రత్తగా వెడల్పు మూతిగల సీసాలోనికి తీసుకున్నాను.
  • ఇలా సేకరించిన అండాలను 15 సెం.మీ. లోతు, 8 – 10 సెం.మీ. వ్యాసార్ధం కలిగిన తొట్టిలోకి మార్చాను.
  • భూతద్దం సహాయంతో అండాలను పరిశీలించాను.
  • అండం మధ్య భాగంలో చుక్కవంటి నిర్మాణం గమనించాను. అదే కప్ప పిండం.
  • గుడ్లు పొదిగి కొన్ని రోజులకు, టాడ్ పోల్ లార్వాలు బయటకు వచ్చాయి.
  • ఈ లార్వాలు చేపను పోలి ఉన్నాయి.
  • వీటి తల భాగంలో మొప్పలు ఉన్నాయి.
  • ఇవి క్రమేణా అనేక శారీరక మార్పులు చెందాయి.
  • పరిమాణంలో పెరిగి కాళ్ళు, చేతులు ఏర్పరచుకున్నాయి.
  • తోక అంతరించిపోయింది.
  • మొప్పలు అదృశ్యమైపోయాయి. ఊపిరితిత్తులు ఏర్పడ్డాయి.
  • చివరికి అది తోక కలిగిన కప్ప ఆకారం నుండి కప్పగా మార్పు చెందింది.
  • ఈ ప్రక్రియనే రూపవిక్రియ అంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 17

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 8.
a) గుడ్లు పొదగటానికి ఎన్ని రోజులు పట్టింది ?
జవాబు:
గుడ్లు పొదగటానికి వారం రోజులు పట్టింది. (7 నుండి 9 రోజులు)

b) టాడ్పల్ ఏ ఆకారాన్ని పోలి ఉంది ?
జవాబు:
టాడ్ పోల్ చేప ఆకారాన్ని పోలి ఉంది.

c) ఏ దశలో టాడ్ పోల్ లో మొప్పలు కనిపిస్తాయి ?
జవాబు:
గుడ్డు నుండి వచ్చిన టాడ్పేల్ బాహ్య మొప్పలు కల్గి ఉంది. మొదటి దశలో టాడ్ పోల్ లార్వా బాహ్య మొప్పలు కల్గి ఉంది.

d) సేకరించిన ఎన్ని రోజులకు టాడ్ పోల్ కు కింది అవయవాలు కనిపించాయి ?
జవాబు:
గుండె – 2వ వారము (14 రోజులు తరువాత)
ప్రేగులు – 3వ వారము (21 రోజులు)
ఎముకలు – 4వ వారము (28 రోజులు)
పురీషనాళం – 3వ వారము (21 రోజులు)
ముందు కాళ్ళు – 9వ వారము (63 రోజులు)
వెనుక కాళ్ళు – 10వ వారము (70 రోజులు)

e) టాడ్ పోల్ లార్వాలో మొప్ప చీలికలు ఎన్నవ రోజు నుండి కనిపించకుండాపోయాయి ?
జవాబు:
28 రోజులు (నాలుగు వారాలు) తరువాత మొప్ప చీలికలు అదృశ్యమైనాయి.

f) ఎన్నవ రోజు తోక పూర్తిగా కనిపించకుండా పోయింది ?
జవాబు:
84 రోజులు (12 వారాలు) తరువాత తోక కనిపించకుండా పోతుంది.

g) టాడ్ పోల్ లార్వా కప్పగా మారుటకు ఎన్ని రోజులు పట్టింది ?
జవాబు:
టాడిపోల్ లార్వా కప్పగా మారుటకు 48 రోజులు పట్టింది.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ఆలోచించండి – చర్చించండి

ప్రశ్న 1.
అన్ని జంతువులు గుడ్లు పెడతాయా ?
జవాబు:
లేదు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మాత్రమే గుడ్లు పెడతాయి. క్షీరదాలు గుడ్లు పెట్టవు. పిల్లల్ని కంటాయి.

ప్రశ్న 2.
ఏ ఏ జంతువులు పిల్లల్నికంటాయి ?
జవాబు:
క్షీరదాలు అన్ని పిల్లల్ని కంటాయి. ఉదా : ఆవు, గేదె, గుర్రం, ఎలుక, పిల్లి, ఏనుగు, మనిషి.

ప్రశ్న 3.
ఏ ఏ జంతువులు గ్రుడ్లు పెడతాయో, ఏవి పిల్లల్ని కంటాయో తెలుసుకోవటం ఎలా ?
జవాబు:
పిల్లల్ని కనే జంతువులలో కొన్ని బాహ్య లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. వీటి ఆధారంగా పిల్లల్ని కనే జంతువులను గుడ్లు పెట్టే వాటి నుండి వేరుగా తెలుసుకోవచ్చు.

ప్రశ్న 4.
అలా తెలుసుకోవడానికి పద్ధతులేమైనా ఉన్నాయా ?
జవాబు:
పిల్లల్ని కనే జంతువులు బాహ్య చెవులను, చర్మం మీద రోమాలను కలిగి ఉంటాయి. వీటి ఆధారంగా పిల్లల్ని కనే జంతువులను గుర్తించవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
మీ ప్రయోగశాలలో ఉన్న హైడ్రా సైడ్ ను చూస్తే, దానిపై ఉబ్బెత్తు బుడిపెలు కనపడ్డాయా ? అవి ఏమిటి ? మీ పరిశీలన ఆ రాయండి.
జవాబు:
1) హైడ్రా సైడ్ ను పరిశీలిస్తున్నప్పుడు ఈ ఉబ్బెత్తు భాగాలను పరిశీలించాను.
2) మా టీచరు వాటిని ‘మొగ్గలు’ (కోరకాలు) అన్నారు.
3) అవి ఎలా ఏర్పడతాయి ?
4) లైబ్రరీ నందున్న జీవశాస్త్ర పుస్తకంలో ఈ కింది విధానం ఉంది. గమనించండి.

  • ముందుగా హైడ్రా శరీరంపై ఉన్న ఒక భాగం జీవ పదార్థ పీడనం వల్ల బయటకు నెట్టబడుతుంది.
  • తరువాత దీని లోపలి గోడలపై కొత్త కణాలు, కణ ద్రవ్యం ఏర్పడి దాని పరిమాణం పెరుగుతుంది.
  • తరువాత ఈ ఉబ్బెత్తు భాగం చివర కళాభాలు మొలుస్తాయి.
  • దానిని సంపూర్ణ పిల్ల హైడ్రాగా మనం చూడవచ్చు.
  • ఇది తల్లి నుండి వేరై, స్వతంత్రంగా జీవనం సాగిస్తుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 18

కృత్యం – 2

ప్రశ్న 2.
అమీబాలో ‘ద్విధావిచ్ఛిత్తి’ జరుగుతుందని చెప్పే బొమ్మలను పరిశీలించి మార్పులు పొందుపరచండి. (లేదా) అమీబాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏమిటి ? దానిని పటం ద్వారా చూపుము.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 19
జవాబు:
పటం – 1
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 20

  • అమీబా కేంద్రకం మామూలుగా ఉంది.
  • శరీరం (అంటే కణకవచం) సాధారణంగా ఉంది.

పటం – 2
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 21

  • అమీబా శరీరం గుండ్రని ఆకృతి పొందింది.
  • మిద్యాపాదాలు చాలా వరకు లేవు.
  • కేంద్రకం సాగి, మధ్యలో నొక్కు ఏర్పడింది.

పటం – 3
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 22

  • కేంద్రకం రెండుగా విడిపోయింది.
  • శరీరం మధ్యలో నొక్కు ఏర్పడి అది కణం మధ్య వైపునకు పెరుగుతుంది.
  • పెరుగుదల రెండు పక్కలా అంటే కింది నుంచి, పై నుంచి కూడా ఉంది.

పటం – 4
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 23

  • కణం మధ్యలో నొక్కు బాగా దగ్గర వచ్చింది.

పటం – 5
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 24

  • నొక్కు ఇంకా దగ్గరకు వచ్చింది.
  • అటు పక్క, ఇటు పక్క మిద్యాపాదాలు ఏర్పడటం గమనించాను.

పటం – 6
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 25

  • రెండుగా విడిపోయాయి.
  • తద్వారా తల్లి కణం అంతరించి రెండు పిల్లకణాలు ఉద్భవించాయి.

ఇలా అమీబాలో ద్విధావిచ్ఛిత్తి జరగటం నేను గమనించాను.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

కృత్యం – 3

ప్రశ్న 3.
ఐదారుగురు విద్యార్థులతో జట్టుగా ఏర్పడండి. మీ జట్టు సభ్యుల తల్లిదండ్రుల ఫోటోలను సేకరించండి. ఆ ఫోటోలతో వారిని పోల్చండి. ఏ ఏ భాగాలు / అవయవాలు, తల్లి లేదా తండ్రిని పోలిఉన్నాయో పరిశీలించి, పట్టికలో నమోదు చేయండి. (పాఠ్యాంశంలోని ప్రశ్న పేజీ నెం. 60)
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 26
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 27