SCERT AP 8th Class Biology Study Material Pdf 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Biology 7th Lesson Questions and Answers వివిధ ఆవరణ వ్యవస్థలు
8th Class Biology 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం
ప్రశ్న 1.
ఆవరణ వ్యవస్థను ఎలా నిర్వచిస్తావు ? సరైన ఉదాహరణతో వివరించండి.
జవాబు:
1. సజీవులు, నిర్జీవులు వాతావరణ కారకాలు పరస్పరం ప్రభావితం చేసుకుంటూ వున్న ప్రకృతి యొక్క మూల ప్రమాణం అని నేను నిర్వచిస్తాను.
2. ఎందుకంటే ‘ఆవరణ వ్యవస్థ’లో ఈ మూడు ముఖ్యమైనవి.
ఉదా : ఇల్లు ‘ఒక’ ఆవరణ వ్యవస్థగా తీసుకుంటే, ఇంటిలో మనుషులు, కీటకాలు, చీమలు, ఈగలు, బల్లులు, మొక్కలు, పక్షులు ఇవన్నీ సజీవులు. మట్టి, కుర్చీలు, కర్రలు, గ్యాస్, గ్యాస్ పొయ్యి, పాత్రలు, దుస్తులు, సైకిళ్ళు, కార్లు, పుస్తకాలు ఇవన్నీ నిర్జీవులు.
3. ఇంటిలోని వాతావరణం – గాలి, ఉష్ణోగ్రత, నీరు, గాలిలో తేమ ఇవన్నీ వాతావరణ కారకాలు. వీటి మధ్య బంధం ఉంటుంది. ఇది నిలకడగా కొనసాగుతుంది. అందువల్ల మన ఇంటిని ‘ఒక ఆవరణ వ్యవస్థగా’ చూడవచ్చు.
ప్రశ్న 2.
జీవవైవిధ్యం ఆవరణవ్యవస్థను బలోపేతం చేయడానికి ఎలా దోహదపడుతుందో వివరించండి.
జవాబు:
- అనేక జాతులు, లక్షణాలు, భేదాలు గల జీవుల అభివృద్ధినే ‘జీవవైవిధ్యం’ అంటారు.
- ‘ఆవరణ వ్యవస్థ’ బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే దీనిలో జీవవైవిధ్యం ఉండాలి.
- ఒక ‘పార్కును’ తీసుకోండి. దీనిలో ఒక్క ‘గడ్డి’ (పచ్చిక) ఉంటే సరిపోతుందా ?
- లేదు. పార్కులో అనేక రకాల మొక్కలు, పూల మొక్కలు, తీగలు, పొదలు, గుల్మాలు, అలంకార మొక్కలు, చెట్లు ఇవన్నీ ఉన్నాయనుకోండి. అది చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
- ఒకే జాతి కాకుండా, దీనిలోనే ఎన్నో ప్రజాతులు ఉండేలా చేస్తే ఎక్కువ జీవవైవిధ్యం ఉంటుంది.
- ఒక ఆవరణ వ్యవస్థలో జీవవైవిధ్యం ఎక్కువ ఉంటే అది మంచి ఆవరణ వ్యవస్థగా కొనసాగుతుంది.
ప్రశ్న 3.
ఆవరణ వ్యవస్థలో ఎలుకలు ఉన్నాయి. అందులో ఎక్కువ పిల్లులను ప్రవేశపెడితే ఏమవుతుంది ?
జవాబు:
- ఒక ఆవరణ వ్యవస్థలో ఎలుకలు ఉన్నాయి. వాటి సంఖ్య ఆ వ్యవస్థ శక్తి ప్రసరణకు అనుకూలంగా ఉంది.
- అక్కడి ఆహార గొలుసుకు అనుబంధంగా వాటి సంఖ్య ఉంది.
- మరి మనం కావాలని ఎక్కువ పిల్లులను ఈ ఆవరణ వ్యవస్థలోకి వదిలామనుకోండి.
- ఇవి (పిల్లులు) ఎక్కువ ఎలుకలను చంపివేస్తాయి. తద్వారా ఎలుకల సంఖ్య బాగా తగ్గి పిల్లుల సంఖ్య బాగా పెరిగి ఆవరణ వ్యవస్థ ‘సమతాస్థితి’ దెబ్బ తింటుంది.
ప్రశ్న 4.
ఈ క్రింది వాటిలో ఉత్పత్తిదారుడు ఏది ? ఎందుకు?
ఎ) నక్క
బి) శిలీంధ్రం
సి) కోడి
డి) గడ్డి
జవాబు:
పైన పేర్కొన్న నాలుగింటిలో ‘గడ్డి’ని ‘ఉత్పత్తిదారు’గా నేను భావిస్తాను. ఎందుకంటే
ఎ) నక్క – ఇది మాంసాహారి. తృతీయ వినియోగదారుని హోదాలో ఆహార జాలకంలో వుంది.
బి) శిలీంధ్రం – ఇది విచ్ఛిన్నకారి. కుళ్ళిన పదార్థాలపై నివసిస్తూ శక్తిని తీసుకుని, జీవిస్తూ ఆ పదార్థాలలో ఉన్న పోషకాలను తిరిగి మృత్తిక (భూమిపై పొర) లోనికి పంపుతుంది.
సి) కోడి – ఇది సర్వ భక్షకాహారి. ద్వితీయ వినియోగదారు హోదాలో ఉంది. పై మూడూ కాదు.
డి) గడ్డి – పచ్చిక – ఇది సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిపి ఆహారాన్ని తయారు చేస్తుంది. కాబట్టి ఇది ‘ఉత్పత్తిదారుడు’.
ప్రశ్న 5.
ఆవాసానికి, ఆవరణవ్యవస్థకు మధ్య తేడా ఏమిటి ?
జవాబు:
ఆవాసము | ఆవరణ వ్యవస్థ |
1. ఇది నివసించే ప్రదేశాన్ని తెలియచెప్పే పదం.
2. మొక్కలు, జంతువులు పెరిగే చోటు. 3. దీనిలో నిర్జీవ అంశాల ప్రస్తావన ఉండదు. 4. వాతావరణ కారకాలు, వాటి ప్రభావం ఇక్కడ పట్టించుకోరు. |
1. ఇది ఆ ప్రదేశంలోని సజీవ, నిర్జీవ, వాతావరణ కారకాల మధ్య సంబంధాన్ని వివరించే పదం.
2. మొక్కలు, జంతువుల మధ్య సంబంధాన్ని కొనసాగించే ఒక మూల ప్రమాణం. 3. నిర్జీవ అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి. 4. ఇక్కడ వాతావరణ కారకాల ప్రభావం కీలకం అని భావిస్తారు. |
6. నేనెవరిని ?
ప్రశ్న (అ)
నేను ఆహారపు గొలుసులో ప్రధాన మూలం.
జవాబు:
గడ్డి – ఉత్పత్తిదారులు
ప్రశ్న (ఆ)
నేను ఆహారం కోసం ఇతరులపై ఆధారపడతాను.
జవాబు:
వినియోగదారులు – జంతువులు, క్షీరదాలు, మానవులు.
ప్రశ్న (ఇ)
నేను చనిపోయిన మొక్కల, జంతువుల శరీరాలను కుళ్ళింపచేస్తాను.
జవాబు:
విచ్ఛిన్నకారులు – బాక్టీరియా, శిలీంధ్రాలు.
ప్రశ్న 7.
మొక్క పులి, కుందేలు, నక్క, గ్రద్ద.
పై వాటిలో ఏదైనా సంబంధాన్ని తెలుసుకోగలరా ? పై జాబితా నుండి కుందేలును తీసివేస్తే ఏమి జరుగుతుంది ?
జవాబు:
- ఈ జంతువులు, మొక్కలు ఒక ఆహార జాలకంలో భాగమై ఉన్నాయి.
- వేరు, వేరు ఆహార గొలుసులలో ఉన్నా ఒకే జాలకంలో ఉన్నాయి కాబట్టి వీటి మధ్య పరస్పర ‘సంబంధం’ ఉంది.
- ఇవి ఒక దానిపై మరొకటి ప్రభావం చూపుతాయి.
- మొక్క – ఉత్పత్తిదారు; కుందేలు – ప్రాథమిక వినియోగదారు. నక్క, పులి, గద్ద – తృతీయ వినియోగదారులు.
- పై జాబితా నుండి కుందేలును తీసివేస్తే, నక్కకు ఆహారం అందదు – నక్కల సంఖ్య తగ్గుతుంది.
- అలాగే గడ్డి తినే కుందేలు లేకపోవటం వల్ల ఆవరణ వ్యవస్థలో గడ్డి ఎక్కువ పెరుగుతుంది. దాంతో కీటకాల సంఖ్య, పురుగుల సంఖ్య పెరిగి ఆవరణ వ్యవస్థ ‘సమతాస్థితి’ లయ తప్పుతుంది.
ప్రశ్న 8.
మీ దగ్గరలోని పార్ము/తోటను సందర్శించి అక్కడ మీరు పరిశీలించిన మొక్కల, జంతువుల వివరాలు సేకరించి పేజీ. నంబరు 110 లోని పట్టిక నింపి నివేదిక తయారుచేయండి.
జవాబు:
అడవి పేరు : నల్లమల
నివేదిక :
- నేను శ్రీశైలంలోని నల్లమల అటవీ ప్రాంతాన్ని సందర్శించాను. అది అనేక వృక్ష, జంతు జాతులను కలిగి ఉంది.
- మద్ది, టేకు, వేప, రావి, మర్రి వంటి పెద్ద పెద్ద వృక్షాలు ఉండి అనేక పక్షులకు, జంతువులకు ఆవాసంగా ఉంటున్నాయి.
- రాగి, బలుసు, వెంపలి వంటి చిన్న మొక్కలు పొదలుగా ఏర్పడ్డాయి. వీటిలో కుందేలు వంటి చిన్న జంతువులు నివసిస్తున్నాయి.
- అడవిలో కుందేలు, జింకలు, దుప్పులు వంటి శాకాహార జంతువులు ఉన్నాయి.
- వీటిని ఆహారంగా తీసుకొంటూ, పులులు, సింహాలు, నక్కలు వంటి మాంసాహారులు ఉన్నాయి.
- పక్షులలో నెమలి, చిలుకలు, పిచ్చుకలు వంటి విభిన్న జీవులు ఉన్నాయి.
- అడవి మంచి జీవవైవిధ్యాన్ని కలిగి ఉంది.
ప్రశ్న 9.
మీ పొలంలో లేదా పాఠశాల తోటలో పరిశీలించి ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు విచ్ఛిన్నకారుల జాబితాను తయారుచేయండి.
జవాబు:
మా పాఠశాల ఆవరణను పరిశీలించి ఈ కింది జాబితాను తయారు చేశాను.
1. ఉత్పత్తిదారులు : మొక్కలు, పచ్చిక, అశోక చెట్లు, బంతి చెట్లు, క్రోటన్లు, కాగితపు పూల చెట్లు, విప్ప చెట్టు, వేప చెట్టు, పాల చెట్టు, సపోటా చెట్టు, కొబ్బరి మొక్కలు.
2. వినియోగదారులు : విద్యార్థులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు (మానవులు), కప్పలు, వాన కోయిలలు, కీటకాలు, మేకలు, పశువులు, బల్లులు, తొండలు, పక్షులు, గబ్బిలం.
3. విచ్ఛిన్నకారులు : పుట్ట గొడుగులు, లైచెన్లు (కర్రలపై పెరిగే తెల్ల పెచ్చుల్లాంటి జీవులు).
ప్రశ్న 10.
ఎడారి జంతువులు ఏ ఏ అనుకూలనాలను పొందినాయో మీ పాఠశాల గ్రంథాలయంలో పరిశీలించి పట్టిక తయారు చేయండి.
జవాబు:
- సగటు వర్షపాతం అతి తక్కువగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాన్ని ‘ఎడారి’ అంటారు.
- ఇక్కడ పెరిగే మొక్కలు, జంతువులు తమకు తాము కొన్ని మార్పులు చేసుకుని అనుకూలనాలు పొంది జీవించటానికి పాటుపడుతుంటాయి.
- జంతువులలో కింది అనుకూలనాలను మనం గమనించవచ్చు.
- ఎడారిలో జంతువుల సంఖ్య తక్కువ.
- నీటి కొరత తట్టుకునే జాతులు ఇక్కడ పెరుగుతాయి.
- శరీరంపై పొలుసులు గల పాములు (సరీసృపాలు) ఎక్కువ.
- కొన్ని రకాల కీటకాలు పైన ఉన్న కైటిన్ పొరను మందంగా అభివృద్ధి చేసుకున్నాయి.
- ఒంటె నీటిని తనలో దాచుకోవటానికి మొక్కల లేత కాండాలు తింటుంది. నీటిని జీర్ణాశయంలో నిల్వచేసుకుంటుంది. అందుకే దీనిని ‘ఎడారి ఓడ’ అన్నారు.
- వీటి శరీరం భూమి ఉపరితలానికి తగలకుండా ఇవి మార్పులు చేసుకున్నాయి.
- పగటి పూట జంతువులు బయట తిరగవు. రాళ్ళ క్రింద, పొదలలో, చెట్ల పైకి ఎక్కి రాత్రిపూట ఆహార వేటకు ఉపక్రమిస్తాయి. అందుకే వీటిని ‘నిశాచరులు’ అంటారు.
ప్రశ్న 11.
‘ఆహార జాలకం’ అంటే మీరేమి అవగాహన చేసుకున్నారు ? ఆహార జాలకాన్ని మీ సొంత మాటలతో వర్ణించండి. రేఖాచిత్రం ద్వారా ఆహారజాలకం గురించి నీకేం అవగాహన అయింది. మీ సొంత ఆహారజాలకం చిత్రాన్ని గీయండి.
జవాబు:
1. ఉత్పత్తిదారుడు, ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు ఉన్న గొలుసు లాంటి జంతువుల శక్తి మార్పిడి వ్యవస్థను ‘ఆహారపు గొలుసు’ అంటారు.
2. అనేక ‘ఆహారపు గొలుసులు’ ఒక దానిలో ఒకటి కలిసిపోయి ఒక సమూహంగా, ఆవరణ వ్యవస్థలో కొనసాగే క్రియాత్మక వ్యవస్థను ‘ఆహార జాలకం’ అంటారు.
3. దీనిలో నీటిలో మొక్కలు, నేలపై మొక్కలు, నీటిలో కీటకాలు, నేలపై కీటకాలు, జలచరాలు, ఉభయచరాలు, సరీసృపాలు, క్షీరదాలు, పక్షులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు ఉంటాయి.
4. చివరగా అతిశక్తివంతమైన తృతీయ వినియోగదారు (సింహం, పులి, గద్ద మొదలగునవి) ఉంటుంది.
ప్రశ్న 12.
మొక్కలు, జంతువుల మధ్య పరస్పర సంబంధాలపై మీ అవగాహన ఏమిటి ? దీనిని మీరు ఎలా అభినందిస్తారు ?
జవాబు:
- మొక్కలు స్వయం పోషకాలు మరియు ఉత్పత్తిదారులు.
- ఇవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. వివిధ భాగాలలో నిల్వ చేస్తాయి.
- జంతువులు వినియోగదారులు. ఇవి మొక్కల నుండి శక్తి బదలాయింపు జరుపుకుంటాయి.
- తద్వారా ఇవి ఆవరణ వ్యవస్థలో పరస్పరం ఆధారపడి జీవిస్తాయి అని పరిశీలించినపుడు – వీటిని అభినందించాల్సిన అవసరం ఉంది.
- జంతువుల నుండి వివిధ రూపాలలో పోషకాలు నేలకు చేరి మరలా వాటిని మొక్కలు ఉపయోగించుకునేలా మారతాయి.
- మొక్కల జనాభా పెరుగుదలను జంతువులు నియంత్రిస్తాయి. ఎలా అంటే మొక్కలు వాటి ఆహారం కనుక.
- జంతువుల సంఖ్య తగ్గించాలంటే మొక్కల సంఖ్య తగ్గిపోతుంది. తద్వారా ఆహార లభ్యత లేక జంతువుల సంఖ్య తగ్గుతుంది. ఇలాంటి విషయాలు ప్రకృతిలో సర్వ సామాన్యం. కాబట్టి నేను అభినందిస్తాను.
ప్రశ్న 13.
గడ్డి – మొక్కలు – మిడత – కప్పు – పాము – గ్రద్ద – మేక – నక్క – పులి – తోడేలు – కుందేలు – వీటి సహాయంతో ఆహారజాలకం పటం గీయండి.
జవాబు:
ప్రశ్న 14.
గట్టి నేల ఆవరణ వ్యవస్థలో కుందేలు మొక్కలను మాత్రమే తింటుంది. మొక్కలు పెరిగే లోపలనే అవి మొక్కలను తొందరగా తింటాయి. అలాంటప్పుడు ఆవరణ వ్యవస్థను సమతాస్థితికి తీసుకునిరావడానికి ఏమి జరగాల్సిన అవసరముంది?
జవాబు:
- కుందేలు మొక్కలను పెరిగే లోపల తినేస్తుంది.
- ఎక్కువ సంఖ్యలో మొక్కల సంఖ్య ఆవరణ వ్యవస్థలో ఉంటాయి. కాబట్టి కుందేలు పెరిగే లోపల మొక్కలను తిన్నా – పెద్దగా ప్రభావం ఉండదు. కానీ
- ఒక వేళ కుందేళ్ళ సంఖ్య, మొక్కలు కుందేళ్ళ నిష్పత్తి కన్నా ఎక్కువ ఉన్నట్లైతే ఆ ప్రభావం మొక్కలపై పడుతుంది.
- మొక్కల సంఖ్య తగ్గి, కుందేళ్ళ సంఖ్య పెరుగుతుంది.
- అప్పుడు వీటిపై ఆధారపడి జీవించే నక్కలు, కుక్కలు, తోడేళ్ళకు ఇవి అందుబాటులోకి వస్తాయి.
- లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల, వాతావరణ కారకాల వల్ల, తప్పనిసరిగా కుందేళ్ళ సంఖ్య మొక్కల నిష్పత్తికి తగినట్లుగా తగ్గించబడి, సమతాస్థితిని కొనసాగించటానికి వీలవుతుంది.
ప్రశ్న 15.
ఒకేరకమైన అలవాట్లు కలిగిన రెండు . జంతువులు ఒకే ఆవరణవ్యవస్థను ఎంచుకున్నప్పుడు ఏమి జరుగుతుంది ? ఈ వైవిధ్యాన్ని కాపాడటానికి నీవు ఏమి చేస్తావు ?
జవాబు:
- ఒకేరకమైన అలవాట్లు కలిగిన రెండు జంతువులు ఒకే ఆవరణ వ్యవస్థను ఎంచుకున్నప్పుడు వాటి మధ్య పోటీ ఏర్పడుతుంది.
- సాధారణంగా ఈ పోటీలో తట్టుకొన్న జీవులు మనుగడను సాగిస్తాయి. మిగిలిన జీవులు నశిస్తాయి.
- ఉదాహరణకు ఆవు, గుర్రం ఒకే ఆహారపు అలవాట్లు కలిగి ఉంటాయి. ఈ రెండు ఒకే ప్రదేశంలో ఉన్నప్పుడు – ఆహారం కొరకు వాటి మధ్య పోటీ ఏర్పడుతుంది. తగినంత ఆహారం లభించనపుడు బలమైన జీవి మాత్రమే ఆహారం సంపాదించుకొని జీవిస్తుంది.
- ప్రకృతి ధర్మాలలో జీవవైవిధ్యం ఒకటి. జీవవైవిధ్యం కాపాడటానికి ఆవాసంలోని జీవుల అవసరాలను తీర్చే మార్గాలను అన్వేషించాలి.
- ఎక్కువ ఆహార వసతి, ఆవాసాలు ఏర్పాటు చేయటం వలన జీవవైవిధ్యం కాపాడవచ్చును.
- పిల్ల జీవులను సంరక్షణ చర్యలు తీసుకోవటం వలన జీవవైవిధ్యాన్ని పెంచవచ్చు.
8th Class Biology 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి InText Questions and Answers
కృత్యములు
ప్రశ్న 1.
ఆవరణ వ్యవస్థను అర్ధం చేసుకోవటానికి నీవు నిర్వహించే ప్రాజెక్ట్ వివరాలు తెలపండి. ( లేదా)
ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని తెలుసుకొనుటకు చేయు ప్రయోగంలో మీరు ఉపయోగించిన పరికరాలను పేర్కొని, ప్రయోగ విధానాన్ని రాయండి.
జవాబు:
ఉద్దేశం : ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని అవగాహన చేసుకోవడానికి పాఠశాల లేదా ఇంటి తోటను అధ్యయనం చేయడం.
కావల్సిన పదార్థాలు : కొలిచే టేపు, దారం, చిన్న చిన్న కట్టెపుల్లలు, భూతద్దం, గడ్డపార (hand towel).
విధానం : ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని తెలుసుకోడానికి ఈ కింది విధానాన్ని అనుసరించాలి.
1. నలుగురు విద్యార్థుల చొప్పున జట్లుగా ఏర్పడండి. మీరు ఎంపిక చేసుకున్న ప్రదేశంలో టేపుతో కొలిచి ఒక మీటరు పొడవు, ఒక మీటరు వెడల్పు ఉండే చతురస్రాకారపు ప్రాంతాన్ని నిర్ణయించుకోండి. ఈ ప్రాంతంలో గడ్డి ఉండవచ్చు లేదా గడ్డి ఉండకపోవచ్చు (baredirt) లేదా కాలిబాట (side walk) కావచ్చు.
2. ఆ ప్రాంతానికి నాలుగు వైపులా చిన్న కర్ర ముక్కలు పాతి దారంతో చతురస్రం ఒక చదరపు మీటరు ప్రాంతం యొక్క అంచులను పటంలో చూపిన విధంగా గుర్తించండి. ఇదే మనం పరిశీలించవలసిన ప్రదేశం.
3. అధ్యయనం చేసే ప్రాంతాన్ని పరిశీలించండి. ఆ ప్రాంతంలో నివసించే మొక్కలు, జంతువులను అవసరమైతే భూతద్దంతో నిశితంగా పరిశీలించండి.
4. మీరు పరిశీలించిన జీవులన్నింటినీ మీ నోటు పుస్తకంలో నమోదు చేయండి. మీరు ఆ ప్రాంతంలోని మట్టిని తవ్వి అందులోని జీవులన్నింటిని కూడా పరిశీలించాలి. దేనినీ వదిలివేయకుండా జాగ్రత్తగా పరిశీలించాలి.
2. ప్రక్కపటంలోని ఆహార జాలకాన్ని పరిశీలించండి. ఈ కింది ప్రశ్నలకు జవాబులివ్వండి.
ప్రశ్న (i)
ఆహార జాలకంలో ఉత్పత్తిదారులేవి ?
జవాబు:
నీటి మొక్కలు, నాచు, శైవలాలు, గడ్డి, మొక్కలు.
ప్రశ్న (ii)
వినియోగదారులేవి ?
జవాబు:
కీటకాలు, ఎలుకలు, సాలె పురుగులు, కుందేలు, జింక, పిల్లి, నక్క, కప్ప, చేప, పాము, తోడేలు, నెమలి, గుడ్లగూబ, రాబందు, గద్ద, కొంగ, పులి, సింహం.
ప్రశ్న (iii)
ఆహార జాలకం ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది ?
జవాబు:
ఆహార జాలకం ఉత్పత్తిదారుల నుంచి ప్రారంభమవుతుంది.
ప్రశ్న (iv)
ఆహార జాలకం ఎక్కడ ముగుస్తోంది ?
జవాబు:
నాల్గవ స్థాయి వినియోగదారు అయిన సింహం దగ్గర ముగుస్తోంది.
ప్రశ్న (v)
ఆహార జాలకంలోని మొక్కలు చనిపోతే ఏమవుతుంది ?
జవాబు:
- ఆహార జాలకంలో మొక్కలు చనిపోతే శక్తి ఉత్పత్తిచేసే అవకాశం పోతుంది.
- దీనితో సూర్యరశ్మి నుంచి శక్తి బదలాయింపు ఆగిపోతుంది.
- కొంత కాలం తర్వాత నెమ్మదిగా క్రింది స్థాయి నుంచి ఉన్నతస్థాయి జీవులన్నీ అంతరించిపోతాయి.
3. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ రకాల మొక్కలు, జంతు జాతుల పేర్లను పట్టికలో నింపి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
జవాబు:
అడవి పేరు : నల్లమల
ప్రదేశం : శ్రీశైలం
ప్రశ్న (i)
అన్ని రకాల అడవులలో ఒకే రకమైన వృక్ష సంపద ఉందా ! (పేజీ నెం. 110)
జవాబు:
1. ఉండదు. ఎందుకంటే ఆవరణ వ్యవస్థ ప్రదేశం మారే కొద్దీ అక్కడ వాతావరణ కారకాలు మారతాయి.
2. సూక్ష్మ, స్థూల పోషకాల లభ్యత వేరుగా ఉంటుంది.
3. కాబట్టి వైవిధ్యం ఎక్కువ మార్పుతో ఉంటుంది.
ప్రశ్న (ii)
అడవి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు వినియోగదారుల కంటే ఎక్కువగా ఉన్నాయా ? ఎందుకు ?
జవాబు:
1. ఉత్పత్తిదారుల సంఖ్య ఎక్కువ ఉంది.
2. కారణం వినియోగదారులు తమ ఆహారం కోసం ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తిదారులను వినియోగించుకుని శక్తిని పొందుతాయి.
3. సుమారుగా 1 : 20 గా వినియోగదారు ఉత్పత్తిదారు నిష్పత్తి ఉంటుంది.
ఇవి కొన్ని సార్లు పెరగవచ్చు. తగ్గవచ్చు.
ప్రశ్న (iii)
అన్ని రకాల అడవులలో ఒకే రకమైన జంతువులు ఉన్నాయా ? ప్రత్యేకమైనవి ఏమైనా ఉన్నాయా ?
జవాబు:
1. అన్ని రకాల అడవులలో ఒకే రకమైన జంతువులు ఉండవు.
2. కొన్నిచోట్ల ప్రత్యేకమైన జంతువులు ఉంటాయి.
ఉదా : శ్రీశైలం, నల్లమల అడవులలో పులులుంటాయి. చిత్తూరు, శేషాచలం అడవులలో ఔషధ మొక్కలు ఎక్కువగా ఉంటాయి.
పాఠ్యాంశములోని ప్రశ్నలు
1. ఈ పటాన్ని పరిశీలించి ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (పేజీ. నెం. 105)
ప్రశ్న (ఎ)
బొమ్మలో బాణం గుర్తు ఏం సూచిస్తుంది ?
జవాబు:
బొమ్మలో బాణం గుర్తు జీవుల మధ్య ఆహార సంబంధాలను సూచిస్తున్నది.
ప్రశ్న (బి)
గడ్డి నుండి పులి వరకు ఉన్న మార్గాన్ని గుర్తించండి.
జవాబు:
గడ్డి → కుందేలు → పులి.
ప్రశ్న (సి)
కుందేలు ఎన్ని రకాల ఆహారాలపైన ఆధారపడుతుంది ? వాటి పేర్లు రాయండి.
జవాబు:
కుందేలు మూడు రకాల పదార్థాలపై ఆధారపడింది. అవి 1. క్యారెట్ 2. గడ్డి 3. గింజలు.
ప్రశ్న (డి)
కుందేలుపై ఆధారపడ్డ జీవులు ఎన్ని ? వాటి పేర్లు రాయండి.
జవాబు:
కుందేలుపై నాలుగు రకాల జీవులు ఆధారపడ్డాయి. అవి 1. కొండచిలువ 2. నక్క 3. గుడ్లగూబ 4. పులి.
ప్రశ్న 2.
మొక్కలు ఆహారాన్ని ఎక్కడ నుండి గ్రహిస్తాయి ? (పేజీ.నెం. 105)
జవాబు:
1. మొక్కలు స్వయం పోషకాలు.
2. ఇవి తమ ఆహారాన్ని తామే తయారుచేసుకొంటాయి.
3. సూర్యరశ్మి, కార్బన్ డై ఆక్సైడ్, నీరులతో పత్రాలు ఆహారం తయారుచేసే ఈ ప్రక్రియను ‘కిరణజన్య సంయోగక్రియ’ అంటారు.
ప్రశ్న 3.
ఆహారం ఒక్కటే కాకుండా జంతువులు బ్రతకటానికి కావల్సిన ఇతర అంశాలు ఏమిటి ? (పేజీ.నెం. 105)
జవాబు:
జంతువులకు ఆహారంతో పాటు,
- నీరు
- గాలి
- ఆవాసం బతకటానికి కావాల్సి ఉంటుంది.