AP Inter 2nd Year Zoology Notes Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes Lesson 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

→ కండరాలు అనేవి ‘కదలిక’ కోసం తయారైనవి.

→ కదలికల రకాలు:

  1. అంతర్గత (peristalsis)
  2. వివిధభాగాల కదలికలు అనగా తల, కళ్ళు మరియు చేతులు మొదలైనవాటి కదలికలు.
  3. గమనకదలికలు (ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి నడవడం, పరిగెత్తడంవంటివి)

→ ‘అస్ధిపంజరం’ దేహానికి నిర్మాణాన్ని మరియు ఆధారాన్ని ఇస్తుంది.

→ ‘ప్రతిరేఖిత కండరం’ అనేక కండర కట్టలు (ఫాసికిల్స్) తో నిర్మితమై ఉంటుంది.

→ కండరాలు అనేవి అస్ధికి (టెన్డెన్స్) స్నాయువులతో అతకబడి ఉంటాయి.

→ కదలికల ఆధారంగా కండరాల వర్గీకరణ: అస్థి, జ్ఞాన, హృదయ మొదలైనవి.

→ ఎముకలు మరియు కండరాలు రెండూ కలిసి ధృడమైన గమన అవయవాలను ఏర్పరుస్తాయి.

→ ఎముకల మధ్య అమరి ఉండే కీలు వంటి నిర్మాణం, దేహంలోని వివిధ భాగాల యొక్క స్వేచ్ఛాకదలికలను సులభతరం చేస్తుంది.

→ ఒక T – నాళిక మరియు దానికి సన్నిహితంగా ఉన్న రెండు సిస్టర్నేలను కలిపి ‘త్రయావ్యవస్థ’ అంటారు. [IPE]

→ ఏక్టిన్ పలుచగా ఉండే సంకోచశీల ప్రోటీన్, అదే మయోసిన్ మందంగా ఉండే సంకోచశీల ప్రోటీన్. [IPE]

→ కర్ణాస్థిఖండాలు

  1. కూటకం
  2. దాగిలి
  3. కర్ణాంతరాస్థి [IPE]

→ ‘సైనోవియల్ కీళ్లు’ స్వేచ్ఛా కదలికలను చూపే కీళ్ళు. [IPE]

→ సైనోవియల్ కీళ్లయందు ఉన్న ద్రవం కీళ్ల వద్ద ‘కందెనగా’ పనిచేస్తుంది. [IPE]

→ సైనోవియల్ కీళ్లు :బంతిగిన్నెకీలు, మడత బందుకీలు, బొంగరపు కీలు, జారెడు కీలు, కాండైలాయిడ్కీలు, మరియు శాడిల్ కీలు.

Leave a Comment