Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material పద్య భాగం 6th Poem ఈ దారి ఎక్కడికి పోతుంది? Textbook Questions and Answers, Summary.
AP Inter 2nd Year Telugu Study Material 6th Poem ఈ దారి ఎక్కడికి పోతుంది?
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
సమాజంలో వచ్చిన మార్పుపట్ల అద్దేపల్లికి కలిగిన ఆవేదనను తెల్పండి ?
జవాబు:
ఈ దారి ఎక్కడికి పోతుంది’ అన్న పాఠ్యభాగం డా||అద్దేపల్లి రామమోహనరావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. అద్దేపల్లి అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని సామ్రాజ్యవాద ప్రపంచీకరణ పై విరుచుకు పడ్డాడు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నీరాజనం పట్టాడు.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలు భాష ఎలా నిరాదరణకు లోనవుతు న్నాయోనని అద్దేపల్లి ఆవేదనకు గురిఅయ్యాడు. మేథావులు, సినిమాతారలు, చివరకు తెలుగు అధ్యాపకులు కూడా బియ్యంలో రాళ్ళలా తెలుగు ఇంగ్లీషు పదాలను కలగలిపి మాట్లాడుతున్నారు. జాతికి భాష ప్రాణం. ఆ ప్రాణాన్ని మేధావులు నమిలి మింగేస్తున్నారు. విద్యాలయాల ద్వారా వ్యాపారం సాగిస్తూ విద్యను వ్యాపార వస్తువుగా మారుస్తున్నాయి. ఇంగ్లీషు కాన్వెంట్లు పిల్లలకు రైమ్ లను నేర్పుతూ సాంస్కృతిక పరమైన గేయాలను, పాటలను మ్రింగేస్తున్నాయి. చెవులు పగిలేలా శబ్దాలు చేస్తున్న పాప్ పాటలు డాన్సులు శాస్త్రీయతకు ముప్పు తెస్తున్నాయి.
సంప్రదాయం, ఆధునికత సంస్కారం అనే మూడింటిని నాశనం చేస్తూ పంచ కోళ్ళ రసాయనం తాగుతున్న కొత్త మనిషి తన అస్తిత్వాన్ని కోల్పోయి కన్నీటితో దర్శన మిస్తున్నాడు. అంతర్జాతీయ వ్యాపారంలో సొంతముద్రను చెరిపేసుకొని విదేశీ వస్తువులను వాడుతూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాడు. చివరకు తనకు తానే ప్రాపంచీకరణ మత్తులో అమ్ముడు పోతున్నాడు. నేటి మానవుడు అనుభూతులను వదిలి పెట్టి ప్రకృతి చెట్టును పెంచి, కంప్యూటర్ లోకి ప్రకృతిని తీసుకువచ్చి ఆకుల కంటే ఇంకా పచ్చని హైకూలను సృష్టిస్తున్నాడు.
మన సంస్కృతీపరమైన ఆటలైన కత్తిపడవలు, నెమలికన్నులు, ఇసుక గూళ్ళు, బు – “టలు, కొమ్మ ఉయ్యాలలు, కోతి కొమ్మచ్చులు వంటి ఆటలను వీడియో” మార్చుకొని కాలు కదపకుండా లోకం చుట్టివస్తున్నాడు. నేటి మానవుడు ఎక్కడికి పోతున్నాడు వాస్తవాన్ని వదలి కృత్రిమ జీవితంలో బ్రతుకుతున్నాడన్న అద్దేపల్లి ఆవేదనను, “ఈ దారి ఎక్కడికి పోతుంది” అన్న కవిత ద్వారా తెలియజేశాడు.
ప్రశ్న 2.
మనిషిలో ఏ విధంగా చైతన్యం వస్తుందని అద్దేపల్లి చెప్పారు ?
జవాబు:
ఈ దారి ఎక్కడికి పోతుందన్న’ పాఠ్యభాగం డా|| అద్దేపల్లి రామమోహనరావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. మన సమాజంలో చైతన్యం రావాలంటే ప్రతి మనిషి ప్రపంచీకరణ విషబీల ప్రభావం నుండి ముందుగా బయటపడాలి. తూర్పుదేశాలపై పడమర దేశాల నీడ పడకుండా చూసుకోవాలి. బహుళజాతి జనులతో వ్యాపార లావాదేవీలు తగ్గించు కోవాలి. విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను కొనాలి. స్వదేశీ హస్త కళలను ఆదరించాలి. నిన్నమొన్న స్వాతంత్ర్యం సాధించిన మనం మన పసిపాపవంటి దేశాన్ని కాపాడుకోవాలంటే స్వదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించుకోవాలి. లేకపోతే స్వాతంత్ర్యం సాధించి విదేశీయులకు మనలను మనం అమ్ముకున్నట్లు అవుతుంది.
ప్రపంచీకరణ నేపథ్యంలో జరిగే వ్యాపారం వైకుంఠపాళీ లాంటిది. వైకుంఠ పాళీలో పెద్దపాము కరిస్తే ఎ పాతాళానికి పడిపోతామో విదేశీ వ్యాపారం వలన కూడా అలా నష్టపోతాము. భారతీయులు ఆత్మీయ అనుబంధాలను పెంపొందించు కోవాలి. లేకపోతే మన అనుబంధాలు ఆత్మీయతలు విమాన రెక్కల నుండి జారిపడి సముద్రంపాలౌతాయి. మన సంస్కృతీపరమైన అనుభవాలను పరిశ్రమలను ప్రోత్సహించు కోకపోతే మన అనుభవాలు యంత్రాల అద్దాల ముందు తమ బట్టతలలను డువ్వు కోవాల్సి వస్తుంది.
ఇప్పుడు మనమేమిటో మనం తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. అలా తెలుసుకోనివాడు చాలా నష్టపోవలసివస్తుంది. మన పురోభివృద్ధికి అడ్డుగా ఉన్న ముళ్ళను రాళ్ళను మనమే అడ్డు తొలగించుకొని కొత్త దారులను వేసుకోవాలి. అప్పుడే మనజాతి సగర్వంగా ప్రపంచం ముందు తల ఎత్తుకుని నిలబడగలుగుతుంది. మనదేశం చెయ్యి చాపితే సూర్యబింబం మన చేతిలోకి వచ్చి వాలుతుంది. దేశమే ఒక ఎజెండాలా మన గుప్పిట్లో నిలుస్తుంది. అప్పుడే మనం చైతన్యవంతం అయినట్లు ఆ చైతన్యం ద్వారా మనం కొత్త బాటలు వేసినట్లుగా భావించాలని అద్దేపల్లి వారి ఆకాంక్ష.
సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
అద్దేపల్లి దర్శించిన కొత్త మానవుడు ఎలా ఉన్నాడు ?
జవాబు:
ఈ దారి ఎక్కడకు పోతుంది’ అన్న పాఠ్యభాగం డా|| అద్దేపల్లి రామమోహనరావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
అద్దేపల్లి దర్శించిన కొత్త మానవుడు నేల విడిచి సాము చేస్తున్నట్లుగా ఉన్నాడు. బియ్యంలో రాళ్ళలాగా తెలుగు భాషకు ఆంగ్ల పదాలను జోడించి కొత్త కొత్తగా మాట్లాడు తున్నాడు. ముఖ్యంగా నాయకులు, మేధావులు, సినిమా తారలు, తెలుగు ఉపాధ్యాయులు ఇలా చేయటం సమర్థనీయం కాదంటారు అద్దేపల్లి. విద్యను వ్యాపారంగా భావించటం ధర్మం కాదన్నాడు.
కాన్వెంట్లలో రైతులు నేర్పుతూ మన సంస్కృతిని నాశనం చేయటం సరైన పని కాదంటారు. చెవులు పగిలేలా ధ్వనులు చేస్తూ కాబరే, పాప్ సాంగ్స్ మన గేయాలను గీతాలను మింగేస్తున్నాయని బాధపడ్డారు. సంప్రదాయం, ఆధునికత సంస్కారం అనే వాటిని కలిపి పంచకోళ్ళ రసాయనం తాగుతున్న మాటలతో మన అస్తిత్వాన్ని కోల్పోతున్న కొత్త వ్యక్తులను వ్యక్తిత్వాలను గల కొత్త మనుషులను అద్దేపల్లి వారు దర్శించారు.
ప్రశ్న 2.
మనిషి జీవితం వస్తువులా ఎలా మారిపోతుంది ?
జవాబు:
‘ఈ దారి ఎక్కడకు పోతుంది’ అన్న పాఠ్యభాగం డా||అద్దేపల్లి రామమోహనరావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. నేటి కాలంలో మనిషి జీవితం ఒక వస్తువులా మారిపోయిందని అద్దేపల్లి వారు ఆవేదన చెందారు.
ప్రపంచదేశాల మధ్య అంతర్జాతీయ వ్యాపారం తుఫానులా వ్యాపిస్తుంది. ప్రతి రోజూ ఎన్నో వస్తువులు విదేశాల నుండి మన దేశానికి దిగుమతి అవుతున్నాయి. వీటి వలన మన సంస్కృతి సంపద, సొంతముద్రలు చెరిగిపోతున్నాయి. మనం స్వదేశీ ఉత్పత్తులను వదిలేసి విదేశీ వస్తువుల మోజులో టి.వి., ఏ.సి. మొదలగు వస్తువులపై శ్రద్ధ పెడుతున్నాము. విదేశీ వస్తువులను ఆదరించినట్లుగా స్వదేశీ వస్తువులను ఆదరించటం లేదు.
పూర్వం మన వారు అవసరమైన వస్తువులనే కొనేవారు. ఇప్పుడు తన స్థాయిని సంఘంలో పెంచుకోవాలన్న తాపత్రయంతో విదేశీ వస్తువులను అవసరం ఉన్నా లేకపోయినా హోదా కోసం కొంటున్నారు. ఆ వస్తువులు తమ ఇంట్లో లేకపోతే పరువుపోతుందన్న భావనతో నేటి మనిషి ఉంటున్నాడు. ఇలా మనిషి జీవితం వస్తువులా మారిపోయే ప్రమాదం ఉందని అద్దేపల్లి వారు భావించారు.
ప్రశ్న 3.
మనిషి జీవితం గురించి అద్దేపల్లి భావనను తెలియజేయండి ?
జవాబు:
‘ఈ దారి ఎక్కడికి పోతుంది’ అన్న పాఠ్యభాగం డా॥ అద్దేపల్లి రామమోహన్ రావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
సాహిత్య సంచార యోధుడిగా ముద్ర వేసుకున్న అద్దేపల్లి సాటి మనిషి జీవితాన్ని గురించి మదనపడ్డాడు. నేటి మానవుడు సంప్రదాయం, ఆధునికత, సంస్కారమనే వాటిని కలగలపుకొని పంచకోల కషాయాన్ని తాగుతున్నాడు. తన అస్తిత్వాన్ని సంప్రదాయాన్ని వదులుతూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. అంతర్జాతీయ వ్యాపారంలో తన సొంత ముద్రను పోగొట్టుకొని కృత్రిమ జీవితాన్ని గడుపుతున్నాడు. తనకు అవసరం ఉన్నా లేకపోయినా హోదాకోసం, తన స్థాయిని పెంచుకోవటం కోసం విదేశీ వస్తువులను కొనుగోలు చేస్తున్నాడు. ఇలా వస్తువుల కోసం తన జీవితాన్నే తాకట్టు పెడుతున్నాడు.
అద్దేపల్లి మనిషి జీవితం ఎటు వెళ్తుందోనని ఆవేదన పడుతున్నాడు. భవిష్యత్తులో ప్రకృతిని కంప్యూటర్ లోకి తీసుకువచ్చి ప్రపంచం మీదకు. దాడికి పంపిస్తాడేమో! కాలు కదపకుండా ప్రపంచమంతా తిరిగివస్తాడు కాని మానవత్వం పరిస్థితి ఏమిటని కవి ప్రశ్నించాడు.
ప్రశ్న 4.
మనుషుల అనుబంధాలు ఎందుకు నాశనమౌతున్నాయి ?
జవాబు:
‘ఈ దారి ఎక్కడికి పోతుంది’ అను పాఠ్యభాగం డా అద్దేపల్లి రామమోహనరావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
మనుషుల అనుబంధాలు ప్రపంచీకరణం వలన నాశనమౌతున్నాయి. . భారతదేశంపై ప్రపంచీకరణ ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. తూర్పున ఉన్న భారతదేశంపై పశ్చిమ దేశాల నీడ పడుతున్నది. అది మన అనుబంధాలకు విఘాతం కల్గిస్తుంది. బహుళ జాతి సంస్థల రాజ్యాల సంబంధాల వలన మన ఉనికిని మనం కోల్పోతున్నాం. సంస్కృతిపరమైన మన హస్తకళలు కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించాయి.
ప్రపంచీకరణ వ్యాపార లావాదేవీల వలన మన వ్యాపారం వైకుంఠ పాళీలో పెద్ద పాము కరచిన విధంగా నాశనమౌతుంది. ఇటువంటి వికృత స్థితిగతుల వలన మనుషుల మధ్య అనుబంధాలు విమాన రెక్కల మీద నుండి సముద్రంలోకి జారిపోతున్నాయి. ఇక అనుభవాలు, యంత్రాలనే అద్దాల ముందు నిలబడి బట్టతలను
దువ్వుకోవలసిందేనని. కవి ఆవేదనను వ్యక్తం చేశాడు.
ప్రశ్న 5.
అద్దేపల్లి రామమోహనరావును గురించి రాయండి.
జవాబు:
‘ఈ దారి ఎక్కడికి పోతుంది’ అను పాఠ్యభాగం డా||అద్దేపల్లి రామమోహనరావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
అద్దేపల్లి సెప్టెంబరు 9, 1936న కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రాజరాజేశ్వరి, సుందరరావు దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య మచిలీపట్నంలోను, తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పూర్తి చేసి , “అభ్యుదయ విప్లవ కవిత్వాల సిద్ధాంతాలు – శిల్పరీతులు” అనే అంశంపై పిహెచ్.డి. చేశారు. బందరు హిందూ కళాశాలలో ట్యూటర్ గాను, నందిగామ ఎన్.టి.ఆర్. కళాశాలలో, కాకినాడ ఎం.ఎస్.ఎస్. ఛారిటబుల్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు.
అక్షరాన్ని ఆయుధంగా మలచి సామ్రాజ్యవాద ప్రపంచీకరణ పై ధ్వజమెత్తారు. సాహిత్య సంచార యోధునిగా కీర్తి పొందారు. వీరి తొలి రచన ‘మధుజ్వాల’ అనే పేరుగల పద్యకావ్యం. అంతర్జాల, రక్తసంధ్య, గోదావరి నా ప్రతిబింబం, మెరుపు పువ్వు, సంఘం శరణం గచ్ఛామి, అయినా ధైర్యంగానే, పొగచూరిన ఆకాశం, మొదలగు 11 కవితా సంకలనాలు వ్రాశారు. ‘శ్రీశ్రీ కవితా ప్రస్థానం’ వీరి తొలి విమర్శనా గ్రంథం. ఇది శ్రీశ్రీ మహాప్రస్థానంపై వచ్చిన తొలి విమర్శనా గ్రంథం. విమర్శవేదిక, కుందుర్తి కవితా వైభవం, మహాకవి జాషువ కవితా సమీక్ష, దృష్టిపథం, గీటురాయి వంటి విమర్శనా గ్రంథాలు రచించారు. వీరు జనవరి 13, 2016న కాలం చేశారు.
ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఈ దారి ఎక్కడికి పోతుంది. పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
అద్దేపల్లి రామమోహనరావు.
ప్రశ్న 2.
అద్దేపల్లి ఎక్కడ ఎప్పుడు జన్మించాడు ?
జవాబు:
అద్దేపల్లి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సెప్టెంబరు 6, 1936న జన్మించారు.
ప్రశ్న 3.
అద్దేపల్లి తల్లిదండ్రులెవరు ?
జవాబు:
రాజరాజేశ్వరి, సుందరావులు.
ప్రశ్న 4.
అద్దేపల్లి విద్యార్హతలేవి ?
జవాబు:
ఎం.ఏ. పిహెచ్.డి.
ప్రశ్న 5.
‘అద్దేపల్లి పిహెచ్.డి.’ సిద్ధాంత వ్యాసం ఏది ?
జవాబు:
అభ్యుదయ విప్లవ కవిత్వాల సిద్ధాంతాలు – శిల్పరీతులు.
ప్రశ్న 6.
అద్దేపల్లి రచించిన తొలిపద్య కావ్యం ఏది ?
జవాబు:
మధుజ్వాల.
ప్రశ్న 7.
అద్దేపల్లి కవితా సంపుటాలు రెండింటిని రాయండి ?
జవాబు:
- సంఘం శరణం గచ్ఛామి
- పొగచూరిన ఆకాశం.
ప్రశ్న 8.
శ్రీశ్రీ మహాప్రస్థానంపై అద్దేపల్లి వారి విమర్శనా గ్రంథం ఏది ?
జవాబు:
శ్రీశ్రీ కవితా ప్రస్థానము.
ప్రశ్న 9.
అద్దేపల్లి వారి రెండు విమర్శనా గ్రంథాలను రాయండి ?
జవాబు:
- కుందుర్తి కవితా వైభవం.
- మహాకవి జాషువ కవితా సమీక్ష.
ప్రశ్న 10.
ప్రపంచీకరణపై అక్షర ఆయుధాన్ని సంధించిందెవరు ?
జవాబు:
అద్దేపల్లి రామమోహనరావు.
ప్రశ్న 11.
సాహితీ సంచార యోధునిగా పేరు పొందిన వాడెవరు ?
జవాబు:
అద్దేపల్లి రామమోహనరావు.
ప్రశ్న 12.
అద్దేపల్లి ఎన్ని కవితా సంపుటాలకు సమీక్షలు, పీఠికలు రాశారు.
జవాబు:
దాదాపు 600ల కవితా సంపుటాలకు పీఠికలు వ్రాశారు.
ప్రశ్న 13.
బియ్యంలో రాళ్ళలా కన్పించేవి ఏవి ?
జవాబు:
తెలుగు భాషలో కలిసిన ఆంగ్లపదాలు.
ప్రశ్న 14.
నిషిద్ధమైన కాబరే. డాన్సులు ఏ పేరుతో చట్టబద్ధమయ్యాయి.
జవాబు:
పాప్ డాన్స్ పేరుతో చట్టబద్ధమయ్యాయి.
ప్రశ్న 15.
సగటు మనిషి దేని కోసం వస్తువులు కొంటున్నాడు ?
జవాబు:
తన స్థాయి హోదా కోసం వస్తువులు కొంటున్నాడు.
ప్రశ్న 16.
అమ్మతనం ముందు ఏది ఓడిపోతుంది ?
జవాబు:
అమ్మతనం ముందు అమ్మకం తనం ఓడిపోతుంది.
ప్రశ్న 17.
పంచకోళ్ళ కషాయం అంటే ఏమిటి ?
జవాబు:
చిత్రమూలము, పిప్పలి, పిప్పలి మూలము, చవ్యము, సొంటి అను ఐదు పదార్థాలతో చేసే కషాయాన్ని పంచకోళ్ళ కషాయం అంటారు.
ప్రశ్న 18.
ప్రపంచవ్యాపారం ఎలాంటిది ?
జవాబు:
వైకుంఠ పాళి ఆటలాంటిది.
ప్రశ్న 19.
ప్రపంచీకరణం వలన ఏం కోల్పోతున్నాం ?
జవాబు:
సర్వస్వం కోల్పోతున్నాం.
ప్రశ్న 20.
మన సాంస్కృతిక ఆటలను రెండింటిని పేర్కోండి ?
జవాబు:
ఇసుకగూళ్ళు, కోతి కొమ్మచ్చులు.
ప్రశ్న 21.
వేటిని మనం వీడియో గేమ్స్ లా మార్చుకుంటున్నారు ?
జవాబు:
సంప్రదాయ ఆటలను.
సందర్భ సహిత వ్యాఖ్యలు
ప్రశ్న 1.
తెలుగు పాటల ఊపిరి తొక్కుతున్న వ్యాపార విద్యాలయాలు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము డా|| అద్దేపల్లి రామమోహనరావుగారిచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ దారి ఎక్కడికి పోతుంది. అను పాఠ్యభాగంలోనిది.
సందర్భం : మన తెలుగు భాషను, సంస్కృతీ సంప్రదాయాలను ఇంగ్లీషు కాన్వెంటులు ఎలా నాశనం చేస్తున్నాయో కవి ఆవేదనతో చెప్పిన సందర్భంలోనిది.
భావము : విద్యను వ్యాపారంగా మార్చిన కాన్వెంట్లలో ఆంగ్ల రైములు నేర్పుతూ, తెలుగు పాటలను, గేయాలను’ కనుమరుగయ్యేలా చేస్తున్నాయని దాని వలన మన . సంస్కృతి సంప్రదాయాలకు పిల్లలను దూరం చేస్తున్నారని ఇందలి భావము.
ప్రశ్న 2.
నా ముందు నిలబడ్డాడు కొత్త మానవుడు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము డా|| అద్దేపల్లి రామమోహనరావుగారిచే రచించబడిన . “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ దారి ఎక్కడికి పోతుంది అను పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగుదనం యొక్క నిలకడ కోసం సముద్రమంత కన్నీటితో వున్న ఆధునిక మానవుని స్థితిని కవి చెప్పిన సందర్భంలోనిది.
భావము : .తెలుగు నేలపై సంప్రదాయము, ఆధునికత, సంస్కారము అనే మూడింటిని . కలగలిపిన కషాయాన్ని జీర్ణించుకోలేక చక్కని తెలుగుదనాన్ని ఆస్వాదించలేక సముద్రమంత కన్నీటితో నా ముందు కొత్త మానవుడు నిలబడ్డాడని ఇందలి భావం.
ప్రశ్న 3.
నేడు నేను నా స్థాయికోసం వస్తువులు కొంటున్నాను.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము డా|| అద్దేపల్లి రామమోహనరావుగారిచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ దారి ఎక్కడికి పోతుంది అను పాఠ్యభాగంలోనిది.
సందర్భం : నేటి సమాజంలో మనుషులు తోటి మనిషిని గౌరవించటం మాని వస్తువులను గౌరవిస్తున్నారు. పూర్వం అవసరాల కోసం వస్తువులను కొనేవారు ఇప్పుడు గొప్పతనం చూపించటానికి వస్తువులు కొంటున్నారని కవి ఆవేదనను వెల్లడించిన సందర్భంలోనిది.
భావము : ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ వ్యాపారం తుఫానులా వ్యాపిస్తుంది. మనుషులు అవసరం ఉన్నా లేకపోయినా డాబు కోసం, దర్జా కోసం సాటిమనిషి గౌరవం ఇవ్వటం మాని వస్తువులకు గౌరవం ఇస్తున్నారని ఇది చాలా బాధాకరమైన విషయమని ఇందలి భావం.
ప్రశ్న 4.
అన్నీ నేను వీడియో గేమ్స్ గా మార్చుకుంటాను.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము డా|| అద్దేపల్లి రామమోహనరావుగారిచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ దారి ఎక్కడికి పోతుంది అను పాఠ్యభాగంలోనిది.
సందర్భం : తెలుగు సంస్కృతి సంప్రదాయాలలో ఒక భాగమైన ఆటలు కనుమరుగయి వీడియో గేములుగా మారిపోతున్నాయని కవి వివరించిన సందర్భంలోనిది.
భావము : తెలుగు సంప్రదాయ బాలబాలికల ఆటలైన కత్తిపడవలు నెమలికన్నులు, ఇసుక గూళ్ళు, బువ్వాలు, కోతికొమ్మచ్చులు వంటివి వాటి వాస్తవికతను ఉనికిని కోల్పోయి వీడియో గేమ్ లుగా దర్శనమిస్తున్నాయని దీనికంతటికి కారణం ప్రపంచీకరణ అని ఇందలి భావం.
ప్రశ్న 5.
అమ్మతనం ముందు అమ్మకం తనం ఓడిపోతుంది.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము డా|| అద్దేపల్లి రామమోహనరావుగారిచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ దారి ఎక్కడికి పోతుంది అను పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ప్రపంచీకరణ విషబీజాలు మన సంస్కృతీ సంప్రదాయాలపై ఎలా ప్రభావం చూపిస్తున్నదో కవి తెలియజేసిన సందర్భంలోనిది.
భావము : ప్రపంచీకరణ ప్రభావం నుండి మనల్ని మనం కాపాడుకోవలసిన సమయం వచ్చింది. మన ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలను మనం నిలబెట్టుకోవాలి. అప్పుడే అమ్మతనం ముందు, అమ్మకం తనం ఓడిపోతుందని ఇందలి భావం.
రచయిత పరిచయం
రచయిత : డా|| అద్దేపల్లి రామమోహనరావు.
పుట్టిన తేదీ : సెప్టెంబరు 6, 1936.
పుట్టిన వూరు : కృష్ణా జిల్లా, మచిలీపట్నం.
తల్లిదండ్రులు : రాజరాజేశ్వరి, సుందరరావు.
విద్యాభ్యాసం : ఎం.ఏ. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి).
ఉద్యోగం : బందరు హిందూ కళాశాలలో ట్యూటర్‌గా, ఎన్.టి.ఆర్ కళాశాల నందిగామలోను, కాకినాడ ఎం.ఎస్.ఎస్ ఛారిటీస్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు.
రచనలు :
- పదకావ్యం :- మధుజ్వాల
- వచన కవితా సంపుటాలు :
- అంతర్జ్వాల,
- రక్తసంధ్య,
- గోదావరి .నా ప్రతిబింబం,
- మెరుపు పువ్వు,
- సంఘం శరణం గచ్చామి,
- అయినా ధైర్యంగానే,
- పొగచూరిన ఆకాశం మొదలగునవి.
- విమర్శనా గ్రంధాలు :
- శ్రీశ్రీ కవితా ప్రస్థానం. (శ్రీశ్రీ మహాప్రస్థానంపై వచ్చిన – తొలి విమర్శనం)
- విమర్శ వేదిక
- కుందుర్తి కవితా వైభవం
- మహాకవి జాషువా కవితా సమీక్ష .
- దృష్టి పథం
- గీటురాయి.
అద్దేపల్లి పిహెచ్.డి సిద్ధాంత వ్యాసం :
‘అభ్యుదయ విప్లవ కవిత్వాల సిద్ధాంతాలు – శిల్పరీతులు.”
మరణం : జనవరి 13, 2016.
‘ఈ దారి ఎక్కడికి పోతుంది’ అన్న ఈ పాఠ్యభాగం అద్దేపల్లి రామమోహనరావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
అద్దేపల్లి రామమోహనరావు అక్షరాన్ని ఆయుధంగా మలచి సామ్రాజ్యవాద ప్రపంచీకరణపై ఎక్కుపెట్టిన అభ్యుదయ వాది. వీరు సెప్టెంబరు 6, 1936న మచిలీపట్నం లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రాజరాజేశ్వరి సుందరరావులు. ప్రాథమిక విద్య నుండి కళాశాల విద్య వరకు మచిలీపట్నంలోను, ఎం.ఏ. ‘శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలోను పూర్తిచేశారు. వీరు “అభ్యుదయ విప్లవ కవిత్వాల సిద్ధాంతాలు – శిల్పరీతులు” అన్న అంశంపై పి. హెచ్.డి. చేశారు. బందరు హిందూ- కళాశాలలో, ఎన్.టి.ఆర్ కళాశాల నందిగామలో, ఎం.ఎస్.ఎస్ ఛారిటీస్ డిగ్రీ కళాశాల కాకినాడలో అధ్యాపకునిగా పనిచేశారు. కాలంతో పాటు అభ్యుదయ భావాలను అందిపుచ్చుకున్న కలం యోధుడు.
‘మధుజ్వాల’ అనే పద్యకావ్యం, 11 కవితా సంపుటాలు, దాదాపు ‘B’ విమర్శన గ్రంథాలు రచించారు. విమర్శన గ్రంథాలలో ‘శ్రీశ్రీ కవితా ప్రస్థానం’ అన్న విమర్శన గ్రంథం వీరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇది శ్రీశ్రీ మహా ప్రస్థానంపై వచ్చిన తొలి విమర్శన గ్రంథం. వీరు పలువురు యువ కవులను ప్రోత్సహిస్తూ సుమారు 600 లకు పైగా కవితా సంపుటాలకు పీఠికలు, సమీక్షలు వ్రాశారు. ‘కదిలే సాహిత్య యోధునిగా’ ముద్రవేసుకున్నారు. అద్దేపల్లి వారు జనవరి 13, 2016న లోకాన్ని వీడిపోయారు.
పాఠ్యభాగ సారాంశం
ఈ దారి ఎక్కడికి పోతుంది అను పాఠ్యభాగం డా|| అద్దేపల్లి రామమోహనరావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
ఇది ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన కవిత. ఏవో తెలియని శక్తులు నన్ను ఈ ప్రపంచీకరణ అనే దారిలోకి విసిరివేశాయి. తప్పనిసరై నాకు ఇష్టం లేని ఈ ఇరుకు దారిలో నడచిపోతున్నాను. ఆకాశంలో వేగుచుక్క ఉదయించినప్పటినుండి గమ్యాన్ని చేరుకోవటానికి మట్టిలో కాళ్ళను తడుముకుంటూ నడచిపోతూనే ఉన్నాను. నేను నడిచే దారిలో ‘తలల మీద పూర్వపు కిరీటాలను ధరించి, కళ్ళ నిండా అభ్యుదయ దీపాలను ఆశిస్తూ ఒంటి కాలం కాల్చిన మచ్చలతో సమూహాలు సమూహాలుగా నాతో నడుస్తున్నారు.
బియ్యంలో రాళ్ళు కలిపినట్లు కమ్మని తెలుగు భాషలో ఆంగ్ల పదాలను ఇరికించి మన నాయకులు, మేధావులూ, సినిమా తారలు తెలుగు ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారు. తెలుగు భాషకు ద్రోహం చేస్తున్నారు. కార్పోరేట్ బడులలో ఇంగ్లీషు రైమ్ లను పిల్లలకు నేర్పుతూ చక్కని తెలుగు పద్యాల, గేయాల, పాటల గొంతు నులిమి వేస్తున్నారు. ధనిక స్వామిక ప్రపంచంగా మన దేశాన్ని మారుస్తూ సంప్రదాయ నృత్యాల వేదికలపై కాబరేలు పాప్ డాన్సులు ఆడిస్తున్నారు. సంప్రదాయం . ఆధునికత, సంస్కారం అనే మూడింటిని కషాయంగా మార్చి సంస్కృతికి మచ్చను తెస్తున్నాము. మన సంస్కృతి సంప్రదాయాల అస్తిత్వం, రక్షణ కోసం సామాన్యులు . కార్చిన కన్నీళ్ళు సముద్రాలుగా తయారయ్యాయి.
నేను అంతర్జాతీయ వ్యాపార తుఫానులో సొంత ముద్ర చెరిగిపోయిన వింత వస్తువును. (కుటీర పరిశ్రమలు, స్వదేశీ వస్తువుల వాడకం మూలనపడిందన్న ఆవేదన) నేను తోటి మనిషిని గౌరవించటం మాని విదేశీ వస్తువులను ప్రేమతో కొంటున్నాను. రేపటి రోజు నేనొక వస్తువును అవటానికి నేడు అమ్ముడుపోతున్నాను.
ఈ రోజు నేను నా అనుభూతులను వదిలివేసి, ప్రకృతి అనే వృక్షాన్ని పెంచి “హైకూల’ పచ్చని పత్రాన్నై ఊగిపోతున్నాను. రేపటి రోజు నాకు అనుభూతుల ప్రమేయం అవసరం లేదు. నా గదిలో కంప్యూటర్ లోకి ప్రకృతిని లాక్కొచ్చి సహజమైన ఆకుల కంటే ఆకర్షణీయమైన పచ్చని హైకూలను లోకంలో వెదజల్లుతాను. మన సాంస్కృతికపరమైన ఆటలు నెమలికన్నులు, ఇసుక గూళ్ళు, బువ్వాటలు, కొమ్మలపై ఉయ్యాలలు, కోతికొమ్మచ్చి ఆటలను వీడియో గేమ్స్ గా మార్చివేసి కాలు కదలకుండా ప్రపంచమంతా చుట్టబెడతాను. ‘బహుళజాతి జనుల స్నేహం వలన మన సంస్కృతి చేజారి పోయింది. విదేశీ వస్తు కొనుగోలు అందుకు ప్రథమ కారణం. ప్రపంచ వ్యాపారం వైకుంఠపాళీ ఆట వంటిది. వైకుంఠపాళిలోని పెద్దపాము కాటేస్తే ఎలా పాతాళానికి వెళ్తామో విదేశీ వ్యాపారం కాటుతో మనదేశం విలువలు నాశనం అయిపోతున్నాయి.
ప్రపంచీకరణతో, విదేశీ వ్యాపారాలతో దేశంలోని ప్రజల మధ్య అనుబంధాలు విమాన రెక్కల మీద నుండి సముద్రజలాలలోకి జారిపోతున్నాయి. అనుభవాలు, యంత్రాలనే అద్దాల ముందు నిల్చొని బట్టతలను దువ్వుకుంటున్నాయి. ‘ప్రేమ’ భావం కామదేవత ముందు శిరసును ఖండించుకుంటుంది. ప్రపంచీకరణ వలన జరుగు నష్టాలను తలచుకుంటుంటే అమ్మతనం అమ్మకతనం ముందు ఓడిపోక తప్పదని పిస్తుంది. కాని నా మనసులోని ప్రేమభావం అలా జరగనీయదన్న నమ్మకమిస్తుంది.
మనం మనదారిలో అడ్డుగా నిలచిన రాళ్ళను ముళ్ళను మనమే తొలగించుకోవాల్సి ఉంది. మనం ‘వేసుకునే కొత్త దారులు దేశం తల ఎత్తుకునేలా ఉండాలి. దేశం చేయిచాస్తే సూర్యుడు వచ్చి అరచేతిలో నిలవాలి. అపుడు మనదేశం ఆకాశమంత ఎత్తులో నిలబడుతుంది. అపుడే నీ గమ్యస్థానం నీ గుప్పిట్లో ఉంటుందని ఈ పాఠ్యభాగ సారాంశం.
కఠిన పదాలకు అర్థాలు
కుప్పిగంతులు = పిచ్చి చేష్టలు
కిక్కిరిసిన = ఖాళీ లేకుండా ఉన్న
నిషిద్ధమైన = నిషేదించబడిన
మిక్సీ = రుబ్బుయంత్రం
పంచకోళ్ళ కషాయం = ఐదు పదార్థాలతో కలిపి చేయు చేదుమందు చిత్ర మూలము, పిప్పిలి, పిప్పిలీ మూలము చర్యము సొంటి వంటి మూలికలతో చేయు కషాయం.
అస్తిత్వం = ఉనికి
స్థాయి కోసం = హోదా కోసం
ధారపోసి = వదలి పెట్టి
హరితపత్రాలు = పచ్చని ఆకులు
హైకూ = ఆధునిక కవితాప్రక్రియ
రక్తసంధ్య = ఎర్రటి సంధ్య
అరుణారుణ = మిక్కిలి ఎర్రనైన
కరచాలనం = చేతులు కలుపుట
పెల్లుబికి = ఒక్కసారిగా పైకి వచ్చి
విద్యుద్రాగం = విద్యుత్ ప్రవాహం
మట్టితనం = మన నేల అన్న భావం