AP Inter 1st Year English Study Material Poem 5 To a Student

Andhra Pradesh BIEAP AP Inter 1st Year English Study Material Poetry 5th Poem To a Student Textbook Questions and Answers, Summary.

AP Inter 1st Year English Study Material 5th Poem To a Student

Questions & Answers

Question 1.
Why does the poet, Kamala Wijeratne want us to make a medicine with herbs to cure mass lunacy?
Answer:
Kamala Wijeratne a poet from ceylon wrote her views on peace and harmony. She is a noted poet giving powerful message1, through this poem “To A Student”. According to the poet, this world is filled with hatred and bloodshed. Everywhere we find ethnic scenes. Pieces of human flesh, splinters2 of bones, bursts of landmines and other frightening3 spots appear on the streets. These ills should be rooted out. The student is afraid of the circumstances and so he is not in a position, at least to look at the face of his teacher or he cannot listen to the peace message. So this sort4 of disease has to be cured. The poet wants to have a herbal5 medicine to cure this lunatic6 atmosphere. The medicine of herbs is a traditional one but it roots7 out the disease. So, powerful measures to curb8 this ethnic event should be taken. They should think about the experiences of Ilion. Carthage and Hiroshima. This Is a message for peaceful living.

1. సందేశము
2. ముక్కలు
3. భయోత్పాతమైన
4. ఈ విధమైన
5. మందులు
6. పిచ్చియైన
7. మూలం లేకుండా చేయుట
8. అణచుట

శాంతి మరియు సమగ్రతల మీద కమలా విజేరత్నే అనే సింహళదేశపు కవి తన అభిప్రాయాలను వ్రాశారు. ‘TO A Student’ అను ఈ పద్యం ద్వారా ఆమె ఒక బలమైన సందేశం ఇచ్చారు. ఎక్కడ చూసినా రక్తపాతం కనబడుతోంది. మనిషి మాంసం ముక్కలు, . ఎముకల ముక్కలు, మందుపాతరల ప్రేలుళ్ళు, ఇంకా ఇతర భయాన్ని గొలిపే పరిస్థితులున్నాయి. ఈ చెడులు రూపుమాయాలి. విద్యార్థి ఈ పరిస్థితులంటే భయపడుతున్నాడు మరియు తన ఉపాధ్యాయుని ముఖంలోకి చూడలేకపోతున్నాడు. సందేశాన్ని వినలేకపోతున్నాడు. కనుక ఈ విధమైన రోగం కుదరాలి. దాని కొరకు అనగా ఈ పిచ్చి పోవుట కొరకు మూలికా వైద్యము చేయించాలి. మూలికా వైద్యము అనునది సంప్రదాయ వైద్యము కానీ పూర్తిగా రోగం నయమవుతుంది. ఈ రక్తపాతానికి సంబంధించిన బలమైన కార్యక్రమం చేపట్టాలి. ఇలియాన్, కార్తీజ్ అను రెండు స్థలాల అనుభవాన్ని తీసుకుంటున్నారు. ఇది శాంతియుత జీవనానికి ఒక సందేశము వంటిది.

AP Inter 1st Year English Study Material Poem 5 To a Student

Question 2.
Briefly explain the theme of the poem “To a Student”.
Answer:
Kamala Wijeratne a poet from Ceylon wrote her views on peace and harmony1. She is a noted poet giving powerful message through this poem “To A Student”. According to the poet, this world is filled with hatred2 and bloodshed3. According to the poet, the student is not able to look at her face. He cannot listen to the advice. It happens become the students mind is filled with fear and anxiety4. There we find bloodshed, splinters of bones, bursts of land mines and other frightening things everywhere. Only the news of war and hatred is heard. The student is tired5 of this heavy atmosphere. The poet advices the student to think for a while. She asks him to look at the bright future, if all this ethnic6 atmosphere is destroyed. A peaceful atmosphere will exist. The dreadening7 circumstances after the wars of Ilion, Carthage or Hiroshima should not be repeated. So, the student should be treated properly from the contagions8 disease of unrest9 and war. Thus the poem suggests a valuable idea to the future generations10.

1. సమగ్రత
2. ఏవగింపు
3. రక్తపాతము
4. ఆతురత
5. విసిగిపోయెను.
6. రక్తపాతమైన
7. భయోత్పాతమును కలిగించు
8. అంటువ్యాధి
9. అల్లరి మరియు యుద్ధము
10. భవిష్యత్ తరాలు

కమలా విజేరత్నే అనే కవి శాంతి సమగ్రతల గురించి తన భావనలను చెప్పుచున్నారు. “TO A Student” అనబడే ఈ పద్యం ద్వారా బలమైన సందేశం పంపుతున్నారు. కవి ఉద్దేశ్యంలో ఈ ప్రపంచం ఏవగింపు మరియు రక్తపాతంతో నిండియుంది. కవి ఉద్దేశం – ప్రకారం విద్యార్థి తన ముఖము చూడలేకపోతున్నాడు. ఆమె సలహాను వినలేకపోతున్నారు. ఎక్కడ చూచినా విద్యార్థి మనసు భయంతో, ఆందోళనలతో నిండి యున్నది. రక్తపాతము, ఎముకల ముక్కలు, మందుపాతరలు మరియు ఇతర భయంకర సంగతులు జరుగుతున్నాయి. ఎక్కడ చూచినా ఏహ్యభావము, యుద్ధము మాత్రమే వినబడుతున్నాయి. విద్యార్థిని ఆలోచించమని సలహా ఇస్తున్నారు. ఈ భయంకర పరిస్థితి మారిన తరువాత వచ్చే మంచి భవిష్యత్తును గురించి ఆలోచించాలి. విద్యార్థి ఈ భారమైన సంగతులతో విసిగిపోయాడు. ఒక క్షణం ఆలోచించమంటున్నారు. భవిష్యత్తులో నుండి మంచిని గురించి ఊహించమంటున్నారు కవిగారు. ఒక ప్రశాంత వాతావరణం కనబడుతుంది. ఇలియాన్, కార్తీజ్ మరియు హిరోషిమా పరిస్థితులు పునరావృతం కాకూడదు. ఈ ‘అశాంతి మరియు యుద్ధము’ అనే రోగం నుండి విడుదల కావాలి. భావి తరాలకు ఒక మంచి భావము తెలుపబడినది.

Annotations

Question 1.
I know why your eyes leap away
When they meet mine,
Why they quickly stray
From their quiet contact.
Answer:
Context: These lines are taken from the poem To A Student’ written by Kamala Wijeratne. In this poem the poet gives a message to the youth. This world is filled with hatred and bloodshed. A student should understand the real atmosphere and try to pursue peace and hormony.

Explanation : In these lines, the poet expresses her worry at the students attitude. He could not look straightly into the eyes of the teacher. His ears have been filled with the news of bloodshed and hatred. So the student is afraid of the statement of the teacher. News of dangerous incidents, ethnic conditions, landmines, explosions, splinters of bones is heard by the student. So, the poet thinks it correct for the student to turn away his eyes and ears to the advice of the teacher. The poet fights against the day to day cruel events.

General relevance : The poet’s view that it is correct for the student to be a verse to any of the advice given by a teacher, seems to be correct. The anguish in the mind of the poet about the pitiable condition of the students is clearly shown in these lines.

సందర్భము : కమలా విజేరత్నే వ్రాసిన To A Student’ అనబడే పద్యము నుండి ఈ వాక్యములు తీసుకొనబడినవి. ఈ – పద్యంలో ఆ కవి యువతకు మంచి ఉపదేశము ఇస్తున్నారు. ప్రపంచమంతా ఏహ్యభావము మరియు యుద్ధము అనే వాటితో నిండిపోయి ఉన్నవి. విద్యార్థి నిజమైన వాతావరణమును గ్రహించి శాంతి, సమగ్రతలను సాధించడానికి ఉద్యుక్తుడు కావాలి.

వివరణ : ఆ విద్యార్థి యొక్క పరిస్థితిని బట్టి కవి, తన యొక్క ఆందోళన తెలుపుచున్నారు. ఆ ఉపాధ్యాయుని కళ్ళల్లోనికి అతడు సూటిగా చూడలేకపోతున్నాడు. రక్తపాతము మరియు ఏహ్యభావమునకు సంబంధించిన వార్తలతో అతని చెవులు నిండిపోయి ఉన్నది. అందుచేత ఆ విద్యార్థి ఉపాధ్యాయుని ప్రకటన పట్ల భయపడుతున్నాడు. ప్రమాదకరకమైన సంఘటనలు రక్తపాతము గల స్థితులు, మందుపాతరల పేల్చివేతలు, ఎముకల ముక్కలు చెల్లాచెదురగుట మొదలైన వారి వార్తలు అతనికి వినబడుతున్నాయి. అందుచేత ఆ విద్యార్థి తన ముఖమును త్రిప్పుకొని, తన చెవులతో వినకుండా ఉండడం సమంజసమే అని ఉపాధ్యాయుడనుకొంటున్నారు. రోజురోజుకు జరుగుతున్న క్రూరమైన సంఘటనలకు వ్యతిరేకంగా కవి పోరాడుతున్నారు.

సాధారణ భావన : ఒక ఉపాధ్యాయుని నుండి వచ్చే ఏ విధమైన సలహాలనైనను వినకుండా విద్యార్థి వ్యతిరేక భావన చూపడం అనేది సరియైనదే అని కవి అనుకొంటున్నారు. కవిగారి మనసులోని ఆందోళన అనగా ఆ విద్యార్థి యొక్క దీనస్థితిని బట్టి కలిగిన దయనీయమైన భావన ఈ వాక్యములలో కనబడుతున్నది.

AP Inter 1st Year English Study Material Poem 5 To a Student

Question 2.
Fragments of splintered bones,
Shreds of olive green;
The roads spewing human blood.
My ears echo bursts of landmines.
(I tremble for men of kindred blood)
Answer:
Context: These lines are taken from the poem “To A Student’ written by Kamala Wijeratne. In this poem the poet gives a message to the youth. This world is filled with hatred and bloodshed. A student should understand the real atmosphere and should try to pursue peace and hormony.

Explanation : In these lines the cause for the anguish of the poet is explained. Everywhere in the world hatred and bloodshed are seen. There are wars and hateful quarrels. The roads are with blood everywhere. Splinters of bones are spread at every place. Landmines are burst and lives of innocent people are at a stake. Pieces of human flesh are seen spread over the roads. Racial war is experienced. Thus the serious incidents make the youth frightened at every moment. The student is awefully afraid of the things and so he cannot concentrate on education.

General relevance : The ethnic experience at each level in the day to day life, has made the student quite disturbed. He hears the news of bomb explosions, deaths, bloodshed, so he cannot listen to the teacher peacefully. The poet hates the situation.

1. కోరుకొనును
2. నమ్మకము
3. ఉన్నతోన్నతమైన
4. విశాలదృష్టి

సందర్భము : కమలా విజేరత్నే వ్రాసిన ‘To A Student’ అనబడే పద్యము నుండి ఈ వాక్యములు తీసుకొనబడినవి. ఈ పద్యంలో ఆ కవి యువతకు మంచి ఉపదేశము ఇస్తున్నారు. ప్రపంచమంతా ఏహ్యభావము మరియు యుద్ధము అనే వాటితో నిండిపోయి ఉన్నవి. విద్యార్థి నిజమైన వాతావరణమును గ్రహించి శాంతి, సమగ్రతలను సాధించడానికి ఉద్యుక్తుడు కావాలి.

వివరణ : కవి యొక్క మానసిక ఆందోళనకు కారణము చెప్పబడుతున్నది. ప్రపంచంలో ఎక్కడ చూచినా ఏహ్యభావము, రక్తపాతము వార్తలు చూస్తున్నారు. యుద్ధాలు, ఏహ్యమైన పోట్లాటలు కనబడుతున్నాయి. రోడ్ల మీద ఎక్కడ చూచినా రక్తపాతమే. ప్రతి స్థలంలో ఎముకల ముక్కలు వ్యాపించి ఉంటున్నాయి. మందుపాతరలు పేలుస్తున్నారు. అమాయకుల ప్రాణాలు అపాయంలో ఉంటున్నాయి. మనిషి మాంసఖండాలు రోడ్లమీద ఎక్కడంటే అక్కడ కనబడుతున్నాయి. జాతి వివక్షతకు సంబంధించిన యుద్ధం ఉంటోంది. ఈ విధమైన సంఘటనలు ప్రతి క్షణం .. యువతను భయపెడుతున్నాయి. ఈ పరిస్థితులను బట్టి విద్యార్థి చాలా భయపడ్డాడు కనుక చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు.

సాధారణ భావన : ఈ భయంకరమైన రక్తపాతానికి సంబంధించిన జీవన విధానం నిత్య జీవితంలో ఎక్కడబడితే అక్కడ కనబడి విద్యార్థిని నాశనం చేస్తోంది. అతడు బాంబుల విస్ఫోటనం గురించిన వార్తలు, చావులు, రక్తపాతం వింటున్నాడు. కనుక టీచరు యొక్క ఉపదేశం ప్రశాంతంగా వినలేకపోతున్నాడు. కవికి ఈ పరిస్థితిని చూస్తే ఏహ్యత కలుగుతోంది.

Question 3.
But why can’t your irises lock with mine?’
Our ears stop all unkind sound ?
Let us shake off these brand names
And search for a herb that heals,
Make a poultice to cure mass lunacy
Answer:
Context: These lines are taken from the poem ‘To A Student’ written by Kamala Wijeratne. In this poem the poet gives a message to the youth. This word is filled with hatred and bloodshed. A student should understand the real atmosphere and should try to pursue peace and hormony.

Explanation : After explaining all the practical things available in the society, the poet turns to the student and asks these questions. The iris of the teacher and that of the student should unite, as the lesson is being given. The ears have to listen carefully to the words spoken by the teacher. There should be no disturbance. To achieve this supreme status, the student should forget all the ethnic2 atmosphere around. He should forget all about hatred and bloodshed. He should have a healing3 for the illness. The disease is the news of war, bomb explosions4, killings and others. It could be healed5 with the herbal medicine of peaceful life. The lunacy of fights, struggles and wars should be cured6 with the right medicine.

General relevance : When youth understands the real circumstances, it would advance7 to set them right. The disease of selfishness and egoism8 should go and peace and harmony should cure the lunacy.

1. నష్టములు
2. రక్తపాత సంబంధమైన
3. బాగుపడుట, స్వస్థత
4. ప్రేల్చివేతలు
5. బాగుచేయుట
6. స్వస్థపరచెను

సందర్భము : కమలా విజేరత్నే వ్రాసిన To A Student’ అనబడే పద్యము నుండి ఈ వాక్యములు తీసుకొనబడినవి. ఈ – పద్యంలో ఆ కవి యువతకు మంచి ఉపదేశము ఇస్తున్నారు. ప్రపంచమంతా ఏహ్యభావము మరియు యుద్ధము అనే వాటితో నిండిపోయి ఉన్నవి. విద్యార్థి నిజమైన వాతావరణమును గ్రహించి శాంతి, సమగ్రతలను సాధించడానికి ఉద్యుక్తుడు కావాలి.

వివరణ : ఉన్న వాస్తవ పరిస్థితులన్ని తెలియజేసిన తరువాత, కవి విద్యార్థి వైపుకు తిరిగి ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. పాఠము జరుగుతున్నప్పుడు teacher యొక్క కనుగుడ్డు, ఆ విద్యార్థి యొక్క కనుగుడ్డు కలసిపోవాలి. Teacher చెబుతున్న మాటలు విద్యార్థి జాగ్రత్తగా వినాలి. ఎట్టి ఇబ్బంది ఉండరాదు. ఈ మేలైన స్థితి కొరకు, విద్యార్థి చుట్టూరా ఉన్న రక్తపాత విషయాలన్నీ మరచిపోవాలి. ఏహ్యత మరియు రక్తపాతము గుర్తులో ఉండరాదు. ఈ రోగానికి ఒక స్వస్థత కావాలి. ఆ రోగము యుద్ధవార్తలు, మందుపాతరలు, చంపుకోవడాలు ఇతరములు. ప్రశాంతమైన జీవితము అనే మూలికా వైద్యంతో అది సాధ్యము. యుద్ధాలకై యుండు పిచ్చి పోట్లాటలు మరియు యుద్ధాలు సరియైన మందుతో బాగుచేయబడాలి.

సాధారణ భావన : యువత వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకొన్నప్పుడు అది వారిని బాగుచేస్తుంది. స్వార్థపరత మరియు అహంభావము అను రోగము పోవాలి. శాంతి మరియు సమగ్రత ఈ పిచ్చిని కుదర్చాలి.

AP Inter 1st Year English Study Material Poem 5 To a Student

Question 4.
Leave behind Ilion and Carthage to antiquee dealers,
And plan fresh method to stop Hiroshimas.
Answer:
Context: These lines are taken from the poem ‘To A Student’ written by Kamala Wijeratne. In this poem the poet gives a message to the youth. This word is filled with hatred and bloodshed. A student should understand the real atmosphere and should try to purşue peace and hormony.

Explanation : In the concluding lines the poet points out the destruction experienced at the wars of Ilion and Carthage. The awesome1 killings of Hiroshima are also remembered. It is the great desire of the poet, to stop this destruction. The hatred and war experienced in the world was because of the lunatic2 dealings of the people. One race rises against the other. One warrior fights against the other warrior to show his supremacy3 over him. The people of Hiroshima were at a stake for the worst ambition of the enemy. So the poet shows a way out. We should think of new ways and means to get peace in the world.

General relevance : History teaches lessons. Sometimes it repeats4 to hit the people in a worst way. So people should learn lesson from the previous incidents of history and try to establish peaceful terms for the good of the society.

1. భయంకరమైన
2. పిచ్చియైన
3. ఆధిపత్యము
4. మరల మరల వచ్చును

సందర్భము : కమలా విజేరత్నే వ్రాసిన ‘To A Student’ అనబడే పద్యము నుండి ఈ వాక్యములు తీసుకొనబడినవి. ఈ పద్యంలో ఆ కవి యువతకు మంచి ఉపదేశము ఇస్తున్నారు. ప్రపంచమంతా ఏహ్యభావము మరియు యుద్ధము అనే వాటితో, నిండిపోయి ఉన్నవి. విద్యార్థి నిజమైన వాతావరణమును గ్రహించి శాంతి, సమగ్రతలను సాధించడానికి ఉద్యుక్తుడు కావాలి.

వివరణ : పద్యము ముగింపు లైనులలో కవి, ఇలియన్ మరియు కార్తెజి అను స్థలాలలో జరిగిన యుద్ధాల వల్ల జరిగిన నష్టాన్ని గురించి మాట్లాడారు. హిరోషిమాలో జరిగిన భయంకరమైన చావులు కూడా గుర్తుచేసుకున్నారు. ఈ నాశనాన్ని ఆపడం ఆ కవి యొక్క ఉద్దేశము. ప్రజల యొక్క పిచ్చి భావనల మూలంగా ప్రపంచంలో ఏహ్యత మరియు యుద్ధము జరిగినది. ఒక జాతి మరియొక జాతి మీదకి లేస్తుంది. తన ఆధిక్యతను చూపుటకు ఒక సైనికుడు మరొకని మీదకి లేస్తాడు. హిరోషిమా ప్రజలు ప్రమాదంలో పడ్డారు ఎందుకంటే శత్రువు యొక్క కాంక్ష వలన. కనుక కవి ఒక మార్గం చూపుతున్నాడు. క్రొత్తపుంతలు తొక్కి ప్రపంచ శాంతిని స్థాపించాలి.

సాధారణ భావన : చరిత్ర పాఠాలు నేర్పుతుంది. కొన్నిసార్లు అది మరల వచ్చి ఎంతో చెడ్డ రీతిలో ప్రజలను ఇబ్బంది పెడుతుంది. కనుక చరిత్ర నుండి పాఠాలు నేర్చుకొని, సంఘానికి మంచి జరగడం కొరకు, శాంతియుత మార్గాలు వెదకాలి.

Comprehension
I. Read the following passage given below and answer the questions.

Betrand Russell appeals to all concerned as a human being, a member of the species man, whose continued existence is in doubt. A war with the hydrogen bombs put an end to the human race. In his view, it seems that the ‘general public’ have not realised the real impact of a war with atomic bombs. A hydrogen bomb is 25,000 times as powerful as that which destroyed Hiroshima. So the stark, dreadful and inescapable problem before us is whether we shall put an end to the human race or if we shall give up wars. He explains in great detail the role of ordinary people in the peace process and requests the ‘general public’ to be remove aware and assertive so that the fate of the nations need not be decided by despotic leaders alone.

Questions & Answers

Question 1.
According to Bertrand Russel, What puts an end to the human race ?
Answer:
The hydrogen bomb.

Question 2.
Who have not realised the real impact of a war with atomic bombs ?
Answer:
The General public.

Question 3.
Who does Bertrand request to be move aware and assertive ?
Answer:
Ordinary people, the general public.

AP Inter 1st Year English Study Material Poem 5 To a Student

Question 4.
Antonym for ‘despotic’ is _____
Answer:
Democratic.

Question 5.
How many times is Hydrogen bomb as powerful as that which destroyed Hiroshima ?
Answer:
25,000 times.

II. Read the following passage and answer the following questions.

Throughout the 1700’s and 1800’s continual rebellion occurred as the Indian people tried to drive the British out. The British government took control of the East India Company after a large rebellion in 1857. Conditions for the sepoys, Indian soldiers in the British army, caused unrest among them. They had lower pay than the Indians of the upper caste and saw discrimination in matters of privilege and promotion by the British officers. The situation which finally pushed the soldiers to rebel was that tallow from cows and lard from pigs were put into the gun cartridges. The soldiers had to bite off the tallow or wax before putting them into their rifles. This offended both Muslims and Hindus for religious reasons. Mangal Pandy, a 29-year-old sepoy played a key role in Sepoy mutiny. He urged the other sepoys to revolt against the British. Most of these rebels were defeated by spring, 1859 However, the revolt brought about great changes in relations between India and Britain.

Questions & Answers

Question 1.
Who took control of East India Company after the rebellion in 1857 ?
Answer:
The British Government.

Question 2.
According to the passage, what does the word ‘sepoy’ mean ?
Answer:
Sepoy means Indian soldiers in the British Army.

Question 3.
Who played a key role in sepoy mutiny ?
Answer:
Mangal Pandy, a 29 year old sepoy.

Question 4.
Which brought changes in relationship between India and British ?
Answer:
The revolt against the British.

AP Inter 1st Year English Study Material Poem 5 To a Student

Question 5.
What is the antonym for the word, ‘rebel’ ?
Answer:
accept.

To a Student Poem Summary in English

‘Kamala Wijeratne’ is a poet of Sri Lanka. She produced a lot of literature pertaining1 to peace and harmony. Her pathetic2 voice about the victims3 of war and conflicts is heart rendering. She hates the racial4 war between the Simhalese and the Tamils. Here in this poem she talks about the fateful consequences of these struggles and wars.

In the beginning the poet addresses the students to think about the happenings in the society. The student is afraid of the events. He cannot look at the real experience. He cannot hear the message. He cannot look at the teacher’s eyes because his mind is filled with the pathetic situations. There is the sound of the guns in the battlefield, resounding5. The boy can see only the ethnic scenes. Bloodshed, pieces of human flesh, splinters of bones, bursts of landmines and other frightening spots, appear in his eyes. So, the student world is not ready to look at the teacher, straightly8.

Now, the poet wants to advise the student to understand the things. This fearful atmosphere should vanish9. There should be some sort of cure for this dangerous disease. The experience of Ilion or carthage should not be repeated. We should learn a lesson from the Hiroshima Bomb explosion. A new world of peace has to emerge. The eyes of the teacher and those the student should unite and look forward for a world which respects humanity. Violence10 should be hated. Thus, the world could become a place of peace.

1. గురించి
2. దయనీయమైన
3. బాధితులు
4. జాతి సంబంధమైన
5. మారుమ్రోగుట
6. ముక్కలు
7. పగిలిన మోతలు
8. తిన్నగా
9. మాయమగుట
10. హింస

To a Student Poem Summary in Telugu

కమలా విజేరత్నే అనువారు శ్రీలంక కవియై ఉన్నారు. ఆమె శాంతి, సమగ్రతల గురించి చాలా సాహిత్యము వ్రాశారు. ఆమె దయనీయమైన గొంతు యుద్ధము మరియు కలహముల వలన ఇబ్బందిపడిన వారిని గూర్చి వ్రాసినది. చాలా హృదయవిదారకంగా ఉంటుంది. సింహళీయులకు, తమిళులకు మధ్య జరిగిన జాతీ వైవమును ఆమె ఏవగించుకొంటున్నారు. ఈ కొట్లాటలు మరియు యుద్దాల వలన జరిగే పరిణామాల గురించి ఈ పద్యములో ఆమె మాట్లాడుతున్నారు.

మొదట్లో, ఆమె సంఘంలో జరుగుతున్న పరిస్థితులను గురించి ఆలోచించవలసినదిగా కోరారు. విద్యార్థికి జరుగుతున్న సంఘటనల పట్ల భయంగా ఉంది. అతడు వాస్తవ పరిస్థితిని చూడలేకున్నారు. ఆ సందేశాన్ని వినలేకపోతున్నాడు. అతని మనస్సంతా భయంకరమైన విషయాలతో నిండి ఉంది కనుక అతడు ఆ ఉపాధ్యాయుని ముఖాన్ని సూటిగా చూడలేకపోతున్నాడు. యుద్ధరంగంలో మారుమ్రోగుతున్న తుపాకుల శబ్దాలున్నాయి. అబ్బాయికి కేవలం రక్తపాతానికి సంబంధించిన దృశ్యాలు కనబడుతున్నాయి. రక్తపాతము, మనుష్య మాంసఖండాలు, ఎముకల ముక్కలు, మందుపాతరలు విచ్ఛిన్నమగుట వంటి భయంకరమైన స్థానములు ఆతని కళ్ళముందు కనబడుతున్నాయి. అందుచేత విద్యార్థి లోకము ఆ ఉపాధ్యాయునివైపు తిన్నగా చూడడానికి సిద్ధంగా లేదు.

ఇప్పుడు కవి, విద్యార్థి జరుగుతున్న విషయాలను అర్థం చేసుకొమ్మని చెబుతున్నారు. ఈ భయంకరమైన పరిస్థితి మాయం కావాలి. ఈ భయంకరమైన వ్యాధికి ఏదో ఒక మందు ఉండాలి. ఇలియాన్, కాల్తేజిలలోని అనుభవం పునరావృతం కాకూడదు. హీరోషిమా బాంబు ప్రేలుడు నుండి ఒక పాఠం నేర్చుకొనాలి. ఒక క్రొత్త శాంతి ప్రపంచం రావాలి. ఆ ఉపాధ్యాయుని కళ్ళు ఆ విద్యార్థి కళ్ళు కలవాలి. వారు ఒక నూతన ప్రపంచం వైపుకు అనగా మానవత్వాన్ని గౌరవించే ప్రపంచానికై ఎదురు చూడాలి. హింస ఏవగించుకొనబడాలి. ఈ విధంగా ప్రపంచం శాంతి స్థలంగా మారాలి.

To a Student Poem Glossary

Textual Glossary

1. stray (v) : /streı/
: move away aimlessly from a group or from the right course or place; తోవ విడిచిపోవు.
e.g. : Dog owners are urged not to allow their dogs to stray.

2. echo (v) : /’ekaυ/
: a sound or sounds caused by the reflection of sound waves from a surface back to the listener; ప్రతిధ్వని, మారుమ్రోత.
e.g. : The avenue echoed the screeches of motor vehicles.

3. extraneous (adj) : /ik’streınıəs/
: irrelevant or unrelated to the subject being dealt with; అన్యమైన, భిన్నమైన.
e.g. : Do not allow extraneous considerations to influence your judgement.

AP Inter 1st Year English Study Material Poem 5 To a Student

4. grenade (n) : /grə’neıd/
: a small bomb thrown by hand or launched mechanically; చేతితో విసరు, చిన్న ప్రేలుడు గుండు (బాంబు).
e.g. : Blast of grenades have cracked the eardrums of old men.

5. suspend (v) : /sə’spend/ : hang (something) from somewhere; వేలాడగట్టు.
e.g. : The lamp was suspended from the ceiling.

6. fragments (n) : /fragm (ə) nts/ : a small part of broken off or separated from some thing; ఖండము, తునక.
e.g. : small fragments of pottery is found at the excavation site.

7. splintered (v) : /’splıntərd/
break or cause to break into small sharp fragments; చీలిపోయిన, చీలిపోయి చిన్న ముక్కలుగా అగుట.
e.g. : The looking glass fell down accidentally and splintered into pieces.

8. shreds (n) : /\(\int\)reds/
: strip of material, such as paper, cloth or food that has been torn, cut, or scraped from something larger; చీలిక, చింపిన ముక్క
e.g. : Her dress was torn to shreds.

9. spew : (V) : /spjυ/
: be poured or forced out in large quantities; వయనం చేయు
e.g. : During war the roads were spewed with human blood.

10. kindred (adj.) : /’kındrıd/
: related, connected; సంబంధం గల
e.g. : They are working on industrial and kindred subjects.

11. irises (n) : /’\(\Lambda\)ırıses/
: a flat, coloured, ring-shaped membrane behind the cornea of theeye, with an adjustable circular opening (pupil) in the centre; చదునైన, సమమైన, సమభూమి
e.g. : The irises of the people are captured for Aadhaar Card.

12. herb (n) : /hə:b/
: any plant with leaves, seeds, or flowers used for flavouring, food, medicine; ఔషధి, వం టలకు వాడు మొక్క
e.g. : God has created many medicated herbs for us.

13. poultice (n) : /’pəυltıs/
: a soft, moist mass of material, typically consisting of bran, flour, herbs etc., applied to the body to relieve soreness and inflammation and kept in place with a cloth; పుండుకు కట్టే ఉడకబెట్టిన పిండి, పిండికట్టు.
e.g. : Poultice made of herbs will be applied to the body to relieve soreness and pain.

14. lunacy (n) : /’lu:nəsi/ : the state of being a lunatic; madness; పిచ్చి, వెర్రి
e.g. : Lunacy can be cured by using some herbs.

15. Ilion (n) : /’ıllən/
: an ancient city in Asia Minor that was the site of the Trojan War; పురాతనమైన.

AP Inter 1st Year English Study Material Poem 5 To a Student

16. carthage (n) : /ka:ốıdz/ : an ancient city on the coast of North Africa near present day Tunis. Founded by the Phoenicians c.814 BC, Carthage became a major force in the Mediterranean and came into conflict with Rome in the Public Wars. It was finally destroyed by the Romans in 146 BC; బండిలో వేసుకొనిపోవుట, బండి కూలి

17. antique (n) /an’ti:k/ : a collectable object such as a piece of furniture or work of art that has a high value because of its age and quality; విచిత్రమైన, చాలాకాలం క్రిందట తయారైన.
e.g. : In the museum we find beautiful antique pieces.

Additional Glossary

18. frightening : terrify, to make somebody make feel fear; భయ పెట్టు, బెదిరించు.

19. hatred : abhorrence; పగ, ద్వేషం.

20. healing : curing; మాన్పెడు, స్వస్థపరచెడు.

Leave a Comment