AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 3 ఆశ ఖరీదు అణా

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed 3rd Lesson ఆశ ఖరీదు అణా Textbook Questions and Answers, Summary.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed 3rd Lesson ఆశ ఖరీదు అణా

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
‘ఆశ ఖరీదు అణా’ నాటిక పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు:
మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రదేశం అది. దాదాపు 22 కుటుంబాలున్న ఆ లోగిలిలో అందరికి సమస్యలు. ఎవరి సమస్యలు వారివి. ఉద్యోగ విరమణ చేసిన తాతగారు గంపెడు సంసారంతో బాధపడుతుంటాడు. కొత్తగా అద్దెకు దిగిన యువకుడు నిరుద్యోగి, అవివాహితుడు. ఏవో బొమ్మలు గీస్తూ తన మనోభావాలను వాటి ద్వారా బహిర్గతం చేస్తుంటాడు.

ఇందిర, ఆనందలక్ష్మి అక్కాచెల్లెళ్ళు. క్రింది వాటిలో ఉంటారు. జబ్బుతో మంచానపడిన తల్లి, అకారణంగా జైలుకెళ్ళిన తండ్రి, నిరుద్యోగి అయిన అన్నయ్య పైగా అమాయకంతో తల్లిదండ్రుల గూర్చి బాధపడుతుంటాడు. కృష్ణవేణి అనే అమ్మాయి ఉద్యోగం చేస్తూ తల్లినీ, అన్నయ్యను అభిమానంగా చూసుకుంటుంది. ఆత్మన్యూనతా భావంతో అన్నయ్య ఎప్పుడూ కృష్ణవేణితో గొడవపడుతుంటాడు. తనకు ఒక ఉద్యోగం వస్తే చెల్లెల్ని ఉద్యోగం మానిపించేయాలనుకుంటూ ఉంటాడు.

కృష్ణమూర్తి అనే ఆయన బ్యాంకు ఉద్యోగి. తనవరకు తాను అన్నట్లు చిన్న ప్రపంచంలో గిరిగీసుకుని బ్రతికేస్తూ ఉంటాడు. కొత్తగా వచ్చిన యువకునితో పరిచయం చేసుకుంటూ మీకు బ్యాంకు ఎకౌంటు ఉందా ? ఉంటే ఏ బ్యాంకు అని ఆరాలు తీస్తాడు. దానికి సమాధానంగా నా ఎకౌంటు నా జేబులోనే ఉంది అయినా ఖాళీగానే ఉందని అంటాడు. బహుశా బ్యాంకు ఎకౌంటు లేనివాళ్ళు నచ్చరేమో అని తనలో తాను అనుకుంటాడా యువకుడు.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 3 ఆశ ఖరీదు అణా

పైన ఉండే ఆడపిల్లలను చులకన చేసి మాట్లాడటం ఆ యువకునికి నచ్చలేదు. ఇందిరా, ఆనందలక్ష్మిలను గూర్చి ఆలోచిస్తాడు. పరిచయమైన అమ్మాయి పేరు ఏమిటో అని అనుకుంటాడు. ఇంతలో కృష్ణవేణి లక్ష్మీ దగ్గరకు వచ్చి తన అన్నయ్య గురించి తన బాధను చెప్తుంది. ఉద్యోగం కోసం వెళ్ళిన అన్నయ్య ఎప్పటికీ రాకపోయేసరికి ఇందిర, లక్ష్మీలు కంగారుపడతారు. ఆకలితో యువకునికి నిద్ర పట్టదు. సమస్యలతో తాతగారు పచార్లు చేస్తుంటాడు.

తొమ్మిదిమంది సంతానం. వచ్చే పింఛను చాలీచాలదు. పెళ్ళి చేసిన ఇద్దరి కొడుకులకు ఉద్యోగాలు లేవు. పెద్ద కోడలి ప్రసవం. ఇన్ని సమస్యలతో నిద్రరాక బయట తిరుగుతుంటాడు. యువకుడు ఒంటరిగా తిండిలేక తిరుగుతుంటాడు. వాళ్ళిద్దరూ ఏవో కబుర్లలో పడి మాట్లాడుకుంటూ ఉండగా బ్యాంకు ఉద్యోగి తన భార్యకు తుమ్ములు ఆగటం లేదని మందుల దుకాణం తెరిచి ఉంటుందా అని కంగారుగా వస్తాడు.

అన్నయ్య మాటలు పడలేక కృష్ణవేణి ఇందిర, లక్ష్మిల దగ్గరకు వస్తుంది. బ్రతుకంటే విరక్తి చెందిన వ్యక్తి కృష్ణవేణి. ఉద్యోగ వేటలో ఎక్కడో తిరుగుతున్న ఇందిర, లక్ష్మీల అన్నయ్య ఇంకా రాలేదని కంగారుపడతారు. ఎవరూ లేని ఒంటరి జీవితం ఎందుకనుకొని యువకుడు ప్రాణత్యాగం చేయాలనుకుంటూ రోడ్డుమీదకు వస్తాడు. ఇంతలో కారుప్రక్కగా పడిన నీడలా కనిపించిన వ్యక్తిని చూస్తారు లక్ష్మీ, ఇందిరలు. అన్నయ్యా అంటూ అరుస్తారు.

తాతగారు దగ్గరగా వెళ్ళి చూసి లేవదీస్తాడు. కారుక్రింద పడి చనిపోదాం అనుకున్నది అంతా చెడిపోయిందని బాధపడతాడు. వెంటనే తాతగారు మీరంతా దగాపడ్డ తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూను చావడానికి లక్ష కారణాలుంటే, బ్రతకటానికి కోటి కారణాలుంటాయి. నా సమస్యల ముందు మీ సమస్యలేమాత్రం. బ్రతకటంలో ఉండే మాధుర్యం మీకు తెలియదు. ముందు మీరందరూ ధైర్యంతో బ్రతకండి. ఏ కుటుంబం తీసుకున్నా నికృష్టంగానే ఉంది. అంతమాత్రాన మనల్ని మనమే అసహ్యించుకోకూడదు. జీవితంలో ఆనందాన్ని పోల్చుకోండి. దేనికి భయపడకండి.

మీకందరికి బ్రతకడం నేర్పిస్తానని అంటాడు తాతగారు. ఇంతలో లాంతరు వెలుగులో కాఫీ తలా ఓ గ్లాసు తాగమంటాడు తాతగారు. వారందరికి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది. గ్లాసు కాఫీ అణా. అలాగే వారందరిలో ఆశ ఖరీదు అణాగా పాత జ్ఞాపకాలు, ఆశలు చిగురిస్తాయి. అందరూ తాతగారి గొప్పతనానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.

ప్రశ్న 2.
ఆశ ఖరీదు అణా’ లో తాత పాత్ర స్వభావం.
జవాబు:
ఆశ ఖరీదు అణాలో తాత ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తి. 33 సంవత్సరాలు సర్కారీ నౌకరీ చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఏదో చాలీచాలని పింఛను వస్తుంది. సంసారం చూస్తే గంపెడు. తొమ్మిదిమంది పిల్లలు. వారిలో ఇద్దరి అబ్బాయిలకు వివాహాలు అయినా నిరుద్యోగులుగా ఉంటారు. నలుగురు వివాహానికి సిద్ధంగా ఉంటారు. చిన్న పిల్లల చదువులకు స్తోమత లేదు. కాలక్షేపంగా కొత్తగా వచ్చిన యువకునితో బాతాఖానీ వేస్తాడు.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 3 ఆశ ఖరీదు అణా

తాతగార్ని చూస్తే ఒక రకంగా హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయినా ఏవో సమస్యలు ఉంటాయి. సమస్యలతో నిద్రరాక మేడపైకి వెడతాడు. ఇంకా నిద్రపోలేదా తాతగారు అని అడగ్గానే నువ్వు ఎందుకు నిద్రపోలేదు నిద్రలో హాయిగా ఉంటుంది మెలకువలోనే భయాలు, బెంగలూ అని తనకున్న దిగుళ్ళను తెలియజేస్తాడు. యువకుని ఉద్యోగ వివరాలు అడిగి ఉద్యోగం చేయకపోవడమే మంచిదని తెలియజేస్తాడు. ఈ మాయాలోకంలో ఉద్యోగం లేకుండా ఉంటేనే నయం.

ఏ పనైనా కష్టపడితే ఫలితం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో ఎదుగుదల లేని బ్రతుకు. చాలీచాలని జీతం అని తన అనుభవాలను తెలియజేస్తాడు. ఇప్పుడు విచారిస్తున్నారా ? అని యువకుడు అడిగితే తన జీవితంలో విచారం అనే పదం లేదని జరిగిన అనుభవాన్ని చెప్పానని అంటాడు తాత. లాటరీ వేశాం ఓడిపోయాం అని ఆలోచనతోనే ఉంటాడు తాత.

ఏదో ఒక సమస్యతో జీవితంపై ఆశలు పోగొట్టుకున్న కృష్ణవేణి, యువకుడు, ఇందిరా, లక్ష్మీల అన్నయ్యలను చూసి బ్రతుకులో ఉండే ఆనందాన్ని చూడమని ధైర్యం చెప్తాడు. లోకంలో ఉండే మంచినీ, మమతల్నీ చిత్రాలుగా గీయమంటాడు. బ్రతుకులో మాధుర్యాన్ని పొందమని వాళ్ళలో నూతన చైతన్యం కలిగిస్తాడు. ఎవరికి వారే జీవితాన్ని చాలించాలని రోడ్డుమీదకు వచ్చిన వారందరిలో ఆశలు కలిగించి నూతన జీవితాలను ప్రారంభించమని తన అనుభవాలను జతచేసిన వారిలో ధైర్యాన్ని కలిగిస్తాడు. అందరికి తలా ఓ గ్లాసు కాఫీ తాగించి వారిలో నూతనోత్సాహం కలిగిస్తాడు తాత.

ప్రశ్న 3.
ఆశ ఖరీదు అణాలో కృష్ణవేణి పాత్ర స్వభావాన్ని విశ్లేషించండి.
జవాబు:
కృష్ణవేణి ఈ నాటికలో మధ్యతరగతి అమ్మాయి. ఇంటిని పోషించడం కోసం ఉద్యోగం చేస్తుంటుంది. తల్లి, అన్నయ్యలను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది. తెల్లారి లేస్తూనే ఇంట్లో చాకిరీ, తరువాత ఆఫీసులో పని, తిరగి ఇంటికి వచ్చాక వంట మొదలైన పనులతో నిరంతరం విసుగు లేకుండా పనిచేస్తూ ఉంటుంది.

ధైర్య సాహసాలు గల వ్యక్తిగా కనబడినా ఎక్కడో ఆడపిల్లనని గుర్తుచేసే సందర్భాల వల్ల కొంత బెరుకుతనం గల స్త్రీమూర్తి.

మేడమీద అద్దెకు దిగిన వ్యక్తి మీరేనా అంటూ పరిచయం చేసుకుంటుంది. గోడకు మేకులు కొట్టి మాకు నిద్రాభంగం కలిగించారని నిర్మొహమాటంగా చెప్తుంది. ఇంటిగలాయన మేకులు కొడితే ఊరుకోడు. బంగారు గోడలు పాడయిపోతాయని బాధ పడతాడని అంటుంది. చల్లగాలికి ఆహ్లాదంగా సినిమాకు వెళ్ళితే బాగుంటుందని మనసులో మాట బయటకే అనేస్తుంది. పాటలంటే మీకు ఇష్టమా ?

అయితే మా ఇందిర బాగా పాడుతుందని యువకునితో అంటుంది. గల్లీలో ఎవరో పోయిన సందర్భంలో శవాలంటే భయం అంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పేరు అడగలేదని యువకుడు అనుకుంటూ అంత ధైర్యంలోనూ పిరికితనం ఇదే మానవ నైజం అని అనుకుంటాడు.

పై గదిలో అద్దెకు వచ్చిన అబ్బాయి పేరేమిటని అన్నయ్యను అడుగుతుంది. అందుకు అన్నయ్య విసుక్కుంటాడు. పనిపాట లేక వాళ్ళ పేరేమిటి ? వీళ్ళ పేరేమిటి అని ఇటువంటి ఆలోచనలు ఎందుకు. తనకే గనక ఉద్యోగం దొరికితే ముందు చెల్లెల్ని ఉద్యోగం మానిపించేస్తానని అంటాడు. అందుకు చాలా బాధపడుతుంది. నా ఉద్యోగం మానిపించేంత వరకు నీకు మనశ్శాంతి ఉండధా ? ఏం మనుషులో ఏ మాత్రం సంతృప్తిగా ఉన్నా సహించలేరు. అదంతా అభిమానమేననుకుంటారు.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 3 ఆశ ఖరీదు అణా

అంత ప్రేమలేక పోయినా కాస్త సుఖపడేదాన్ని అని బాధపడుతుంది కృష్ణవేణి. నిద్రపట్టక కృష్ణవేణి ఇందిర, ఆనందలక్ష్మిల ఇంటికి వస్తుంది. ఇంత రాత్రివేళ వచ్చావేంటి అంటుంది ఇందిర. పగలంతా ఆఫీసులో పని. ఇంట్లో మళ్ళీ వండి వార్చినా నీకు నిద్ర రాకపోవటం ఏమిటి అని లక్ష్మీ అడుగుతుంది. మా అన్నయ్య రెండు వందల ఏళ్ళ క్రిందట పుట్టవలసినవాడు. వాడికి ఉద్యోగం దొరకటం లేదన్న కసితో నా ఉద్యోగాన్ని మానిపించేయాలని అంటూ ఉంటాడు. నా జీతం మీద ప్రేమే మళ్ళీ.

ఎంత అభిమానంగా చేసినా ఈ మాటలు పడలేకపోతున్నాను. ఎంతకాలం మాటలు పడను చెప్పు. ఎవరి కోసం, ఎందుకోసం ఈ త్యాగం అని స్నేహితురాళ్ళతో తన బాధనంతటినీ చెప్పుకుంటుంది. జీవితంపై విరక్తిని పెంచుకొని నిరాశలో బ్రతుకుతుంది. చివరకు తాతగారి ఉపదేశం వల్ల మళ్లీ కొత్త ఆశలతో ధైర్యంగా తన పని ఏదో తాను చేసుకోగలుగుతుంది కృష్ణవేణి.

రచయిత పరిచయం

1. ఆశ ఖరీదు అణా పాఠ్యభాగ రచయిత గోరాశాస్త్రి.
2. గోరాశాస్త్రి పూర్తి పేరు గోవిందుని రామశాస్త్రి.
3. ఒరిస్సాలోని గంజాం జిల్లా గుణుపురం వీరి స్వస్థలం.
4. సుందరి, నరసింహం వీరి తల్లిదండ్రులు.
5. ఆంగ్ల స్వతంత్ర పత్రికలో సంపాదకునిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు.
6. తెలుగు స్వతంత్ర, ఆంధ్రభూమి, డక్కన్ క్రానికల్ మొదలైన పత్రికల్లో సంపాదకునిగా పనిచేసారు.
7. పత్రికా రచయిత కాకముందే శ్రవ్య నాటకకర్తగా గుర్తింపు పొందారు.
8. నూరుకు పైగా నాటికలు ప్రసిద్ధి పొందాయి. అనేక పోటీలలో బహుమతులు పొందారు.
9. వివిధ పార్శ్వాలను సున్నితంగా, శాస్త్రీయంగా వ్యాఖ్యానించడం గోరాశాస్త్రి నాటికల ప్రత్యేకత.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 3 ఆశ ఖరీదు అణా

10. ఆనంద నిలయం, సెలవుల్లో దూరతీరాలు, ఆశ ఖరీదు అణా వంటివి పేర్కొనదగినవి.
11. ప్రస్తుత పాఠ్యభాగం ‘ఆశ ఖరీదు అణా’ అనే సంకలనం నుండి గ్రహించబడింది.
12. గోరాశాస్త్రి నాటికలు కొన్ని ‘ఆశ ఖరీదు అణా’, ‘గోరాశాస్త్రి నాటికలు’ అనే రెండు సంపుటాలుగా వెలువడ్డాయి.
13. ‘ప్రసిద్ధ తెలుగు నాటికలు’ అనే సంపుటంలో చోటు చేసుకుంది ఈ ఆశ ఖరీదు అణా నాటిక.
14. ఆకాశవాణిలో అత్యుత్తమ శ్రవ్య నాటికల్లో ఒకటిగా ప్రసారం చేయబడింది.
15. 1982 మే డే నాడు తెలుగు సాహిత్య రంగంలో సేవలందిస్తూ పరమపదించారు.

పాత్రల పరిచయం

1. యువకుడు :
నిరుద్యోగి, ఒంటరివాడు. 22 కుటుంబాలు ఉన్న దగ్గర మేడపై గదిలో అద్దెకు దిగుతాడు. అందరితో కలివిడిగా మాట్లాడతాడు. ఏవో చిత్రాలను గీస్తుంటాడు. ప్రపంచంలో ఎటుచూసినా బాధలే కనపడుతున్నట్లు ఆ యువకళాకారుని చిత్రాలు దుఃఖమయాలు. మనుషుల్లో మంచిని తన చిత్రాల్లో చూపించలేని అశక్తుడు.

2. తాత :
పదవీ విరమణ చేసిన సర్కారు ఉద్యోగి. ముప్పయి మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసి విశ్రాంతి తీసుకుందామనుకున్న వ్యక్తి. పెద్ద సంసార బాధ్యతను నెట్టుకొస్తున్న వ్యక్తి. తొమ్మిదిమంది సంతానం. ఏదో పెంక్షన్ ఇస్తున్నారు. పెళ్ళి చేసిన ఇద్దరు కొడుకులకు ఉద్యోగాలు లేవు. ఇంకా నలుగురు పిల్లలకు వివాహాలు చేయాలి. మిగిలిన పిల్లలకు చదువు చెప్పించలేని అశక్తుడను. ఏమీ తోచక పాటలు పాడుతుంటాడు. కొత్తగా మేడపై అద్దెకు వచ్చిన యువకునితో పిచ్చాపాటి మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుంటాడు. తన వయస్సు అనుభవంతో అందరికి తోచిన మంచి మాటలు చెప్పి అందరిలో ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తాడు.

3. ఇందిర, ఆనందలక్ష్మి :
అక్కా చెల్లెళ్ళు, తల్లికి ఆరోగ్యం బాగుండలేదని, అక్కా చెల్లెళ్ళు దగ్గరుండి పరిచర్యలు చేస్తుంటారు. తండ్రి ఏ కారణం చేతనో జైలు కెళ్ళాడు. నిరుద్యోగి అయిన అన్నయ్య మధ్యతరగతిలో ఉన్న ఇబ్బందులన్నింటిని ఎదుర్కొంటూ ఏదో బ్రతుకు బ్రతుకుతుంటారు.

4. కృష్ణమూర్తి :
బ్యాంకు ఉద్యోగి. సైకిలు పైన ఇంటికి వచ్చి కొత్తగా వచ్చిన యువకుని తప్పుకోమని చెప్పి తన ఇంటికి వెళతాడు. యువకునితో పరిచయం చేసుకుంటాడు. పైన ఉంటున్న అమ్మాయిల గురించి చులకనగా మాట్లాడతాడు.
రాత్రిపూట హడావిడిగా వచ్చి తన సైకిలు క్రొత్తగా కొన్నాను. దుకాణాలు ఉంటే సైకిలు అమ్మి మందులు తేవాల్సిన పరిస్థితి. భార్యకు ఉన్నట్టుండి తుమ్ములు. ఊపిరాడక అవస్థ పడుతోందని కంగారుపడతాడు.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 3 ఆశ ఖరీదు అణా

5. కృష్ణవేణి :
ఉద్యోగం చేస్తున్న మధ్యతరగతి మహిళ. ఆనందలక్ష్మి, ఇందిరకు స్నేహితురాలు. నిరుద్యోగి అయిన అన్నయ్య కృష్ణవేణి సంపాదనపై ఆధారపడి తింటున్నందుకు బాధపడతాడు. స్త్రీ సంపాదన ఆర్థిక స్వేచ్ఛని సహించలేడు. తనకి ఉద్యోగం రాగానే కృష్ణవేణిని ఉద్యోగం మానిపించేయాలని ఆలోచిస్తుంటాడు. అది కృష్ణవేణికి నచ్చదు. ఇంట్లో పనంతా చేసి, ఆఫీసులో చాకిరీ, తిరిగి ఇంటికొచ్చి వంట చాకిరీ. ఇదే దినచర్యతో సతమతమై పోతుంటుంది కృష్ణవేణి.

6. కృష్ణవేణి అన్న :

కృష్ణవేణి అన్న నిరుద్యోగి. చెల్లెలు సంపాదిస్తే తినలేడు, అలాగని ఉద్యోగం దొరకదు. అమ్మ మంచంలో ఉండడం వల్ల తన నిస్సహాయ స్థితికి దుఃఖిస్తూ ఉంటాడు. తనకు ఉద్యోగం రాగానే చెల్లెల్ని ఇంట్లో కూర్చోబెట్టాలన్న తపన అధికం. అది ప్రేమ అనుకోవాలో, పురుషాధిక్యం అనుకోవాలో తెలియదు. ఎప్పుడూ చెల్లెలుతో గొడవపడుతుంటాడు.

పాఠ్యభాగ సారాంశం

అంతా మధ్యతరగతి కుటుంబాలే. ఆ లోగిల్లో 22 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందరిలోను ఏదో ఒక సమస్య ఉంటూ బ్రతుకుతున్నవారే. ఆ మేడలో పైవాటాలోకి ఒక యువకుడు అద్దెకు వచ్చాడు. నిరుద్యోగి, అవివాహితుడు క్రింద ఒక తాతగారు ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి తీసుకోవాలన్నా తీసుకోలేని స్థితిలో తొమ్మిదిమంది పిల్లలతో కాపురముంటున్నాడు.

ఒక బ్యాంకు ఉద్యోగి తన లోకమేదో తనది. కృష్ణవేణి అనే అమ్మాయి ఉద్యోగం చేస్తూ అమ్మనీ, అన్నయ్యనూ పోషిస్తూ ఉంటుంది. నిరుద్యోగి అయిన అన్నయ్య చెల్లెలు ఉద్యోగాన్ని ఎప్పుడు మానిపించేద్దామా అని ఆలోచించే పురాతన ఛాందస స్వభావుడు. ఇందిర, ఆనందలక్ష్మి అమాయకుడైన అన్నయ్య, జైలుకెళ్ళిన తండ్రి జబ్బుతో బాధపడే తల్లీ ఒక కాపురం. వారందరిలో ఏవేవో ఆశలు తీరని ఆశలు.

కొత్తగా వచ్చిన యువకుడు చిత్రకారుడు. కాని తాను రచించే చిత్రాలన్నీ సమస్యలమయం. ఉద్యోగం లేని ఒంటరి జీవితం. ఇంటి అద్దెకు ఉంగరం అమ్మి . డబ్బు చెల్లించాడు. కడుపునిండా తిని ఎన్నో రోజులై నిద్రపట్టక బాధపడుతుంటాడు. తాతగారితో బాతాఖానీ వేస్తాడు. కృష్ణవేణికి తనను పరిచయం చేసుకుని మరీ మాట్లాడుతుంది. గోడకు మేకులు కొట్టి తాను వేసిన చిత్రాలను గోడలకు తగిలిస్తాడు.

వీళ్ళంతా ఉండే వీధి చాలా కోలాహలంగా ఉంటుంది. ఇంతలో సైకిల్ మీద ఒకాయన దారి ఇమ్మని తాను లోపలకు వెళ్ళాలంటాడు. బ్యాంకులో ఉద్యోగం చేసే వ్యక్తి. మీకు బ్యాంకు ఎకౌంటు ఉందా ? ఏ బ్యాంకులో ఉంది ? అంటూ ఆరాలు తీస్తాడు. బ్యాంకు ఎకౌంటు లేనివాళ్ళు అతనికి నచ్చరు. యువకుడు తన ఎకౌంటు జేబులోనే ఉంది. పైగా ఖాళీగా ఉందంటాడు. పైన, ఉన్న వాళ్ళను గురించి బ్యాంకు ఉద్యోగి తక్కువగా మాట్లాడతాడు. అయినా వాళ్ళ బాధలేమిటో అని వాళ్ళను పరిచయం చేసుకుంటాడు యువకుడు.

అందరిది ఒకటే మురా. వారంతా పరిచయం అయినా ఒకరి పేర్లు ఒకరు తెలుసుకోవాలనే కుతూహలపడతారు. కృష్ణవేణి అన్నయ్య చెల్లెలి ఆర్జన పై ఆధారపడటం ఇష్టం లేక సూటిపోటి మాటలతో ఉద్యోగం మానిపించేస్తానని అంటూ ఉంటాడు. ఆ మాటలకు కృష్ణవేణి బాధపడుతుంది. ఇందిర, ఆనందలక్ష్మిలతో చెప్పుకుని బాధపడుతుంది. ఇందిర, ఆనందలక్ష్మిలు కృష్ణవేణి స్నేహితురాళ్ళు.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 3 ఆశ ఖరీదు అణా

అమాయకపు అన్నయ్య, జైలు కెళ్ళిన తండ్రి, మంచాన జబ్బుతో బాధపడే తల్లి. ఈ విధంగా వారి కుటుంబం అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. వీళ్ళలో నిరాశ వారిని బ్రతకనివ్వదు. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం వలన చావే మేలనుకుంటారు. వీళ్ళందరికీ ధైర్యం చెప్పి ఆశ కల్పించి బ్రతుకుని ఆనందమయం చేసుకోమని తాతగారు తన అనుభవాలతో వాళ్ళకు మార్గం చూపిస్తారు. అప్పటికే తెల్లవారుతుండగా లాంతరు వెలుగులో కాఫీ తాగుతారు. కాఫీ ఖరీదు అణా. ఆశ ఖరీదు అణా అని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కొత్త సుప్రభాతంలోకి అడుగులు వేస్తారు.

కఠిన పదాలకు అర్థాలు

గల్లీ = చిన్న సందు
ధ్వని = శబ్దం
బాతాఖానీ = కాలక్షేపం
సర్కారు నౌకరీ = ప్రభుత్వ ఉద్యోగం
జంత్ర సమ్మేళనం = విరామ సంగీతం
యోధుడు = వీరుడు
మగత = మత్తు
ఆర్జన = సంపాదన
పచార్లు = ఇటు, అటు తిరుగుట
అర్భకురాలు = శక్తిలేని తనం
రభస = గొడవ
ఏకరువు = పూర్వాపరాలు అన్నీ
సహగమనం = చనిపోయిన భర్తతో పాటు భార్యని చితిలో పెట్టి కాల్చడం
నిబ్బరం = ధైర్యంగా
వెంట్రుకవాసిలో = కాస్తలో; తృటిలో
దగా = మోసం
నిస్సహాయత = సహాయం లేకపోవు
అణా = ఆరు పైసలు
ప్రభాతం = వెలుగు

Leave a Comment