AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 2 తెరచిన కళ్ళు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed 2nd Lesson తెరచిన కళ్ళు Textbook Questions and Answers, Summary.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed 2nd Lesson తెరచిన కళ్ళు

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
తెరచిన కళ్ళు నాటికలో డాక్టరు కళ్ళను సత్యం తెరిపించిన విధానం వివరించండి.
జవాబు:
డాక్టర్ సుదర్శన్ ప్రముఖ నేత్రవైద్యుడు. జయపురం రాజావారికి నేత్రవైద్యం చేయడానికి జయపురం బయలుదేరాడు సుదర్శన్. అసిస్టెంట్ డాక్టర్ సత్యం తోడుగా ప్రయాణ మయ్యాడు. తనకు కొంతవరకైనా విద్యను నేర్పితే సహాయంగా ఉండే వాడినని ఎంతగానో ప్రాధేయపడతాడు సత్యం. తన వారసులకు తప్ప ఇతరులకు ఆ వైద్య విద్యలో నైపుణ్యాన్ని తెలియజేయడానికి ఇష్టపడడు డాక్టర్ సుదర్శన్.

రైలులో ప్రయాణిస్తూ కిటికీ తీయమని సత్యానికి చెప్పాడు సుదర్శన్. కిటికీలో నుండి నిప్పురవ్వలు కంట్లో పడి ఏదో మంటగా ఉందని అరుస్తాడు సుదర్శన్. బ్యాగ్ లో చుక్కల మందు వెయ్యమంటాడు. ఆ మందు వేసినా కళ్ళ మంట తగ్గలేదు. గట్టిగా అరుస్తూ తనకేమీ కనబడటం లేదని అంటాడు సుదర్శన్. విద్యంతా తన సొత్తు అని అహంకారంతో అహంభావానికి లోనయ్యాను. భగవంతుడు తగిన శిక్ష వేసాడని బాధపడతాడు సుదర్శన్.

నా విద్యంతా ఎవరికి కావాలి ? నాకే ప్రయోజనం లేదు. శాశ్వతంగా గుడ్డివాడిని అయ్యాను అని బాధపడ్డాడు. జీవితాంతం కళ్ళులేని బ్రతుకేనా అని భార్య బాధపడింది.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 2 తెరచిన కళ్ళు

సత్యం డాక్టర్ గారిని క్షమించమని అడిగి, ఆపరేషన్ చేస్తానని అంటాడు. “నువ్వా నాకు ఆపరేషన్ ఎలా చేస్తావు ? మీకేం భయంలేదు నన్ను నమ్మండి. మీకు కళ్ళు బాగుచేస్తానని ఆపరేషన్ చేశాడు. సుదర్శన్ ఆశ్చర్యపోతూ సత్యం ఎలా నేర్చుకున్నావని అడుగుతాడు. ,తాను డాక్టర్ గారికి తెలియకుండా ఆయన వ్రాసుకున్న నోట్సులు చదివి తెలియకుండా చిన్న రంధ్రంలోంచి చూసి ఒకసారి; నర్సు వేషంలో ఒకసారి సుదర్శన్ చేసే ఆపరేషన్ చూసి నేర్చుకుంటాడు.

ఆ విధంగా తెలియకుండా నేర్చు కున్నందుకు క్షమించమని డాక్టరుని మన్నించమంటాడు. అలాగైనా నేర్చుకున్న విద్యతో తిరిగి డాక్టర్‌కు చూపునిచ్చినందుకు సత్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు సుదర్శన్. సత్యాన్ని ధన్యుడని ప్రజాసేవ సార్థకమవుతుందని కొనియాడతాడు. పోయిన కళ్ళతో పాటు అజ్ఞానంగా, స్వార్థంగా విద్యను దాచి పెట్టిన తనకు మనోనేత్రం కూడా తెరిపించాడు సత్యం అని సంతోషిస్తాడు.

ప్రశ్న 2.
‘తెరచిన కళ్ళు’ నాటికలో డాక్టర్ పాత్ర స్వభావాన్ని తెలియజేయండి.
జవాబు:
డాక్టర్ సుదర్శన్ ప్రఖ్యాత నేత్రవైద్యుడు. ఎంతోమంది కళ్ళు లేనివారికి చూపును ప్రసాదించిన ప్రముఖ వైద్యుడు. పుట్టుగుడ్డి అయిన పాపకు ఆపరేషన్ చేసి వెలుగును ప్రసాదించాడు. ప్రమాదవశాత్తు పెళ్ళిలో కళ్ళు పోగొట్టుకున్న వ్యక్తికి కళ్ళకు ఆపరేషన్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. తనవద్ద ఏళ్ళ తరబడి పనిచేస్తున్న డాక్టర్ సత్యం విద్య నేర్పించమని ప్రాధేయపడతాడు.

కాని తన వారసులకు మాత్రమే తన విజ్ఞానం అందాలనుకునే సంకుచిత మనస్కుడు సుదర్శన్. తనకు వారసుడు రాబోతున్నాడు అని తన విద్యను తన వారసునికే అందిస్తానని నిర్మొహమాటంగా సత్యానికి తెలియ జేస్తాడు. జయపురంలో రాజావారి దర్బారులో రాజుగారికి ఆపరేషన్ చేయాలని సత్యంతో సహా రైలులో బయలుదేరాడు. గాలికోసం కిటికీలు తెరిచాడు. అంతలో నిప్పురవ్వలు ఎగిరి కంట్లో పడి కళ్ళు పోగొట్టుకుంటాడు సుదర్శన్.

తన విద్యను ఇంకొకరికి నేర్పించి ఉంటే ఎంత బాగుండేదో అని చింతిస్తాడు సుదర్శన్. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన తనకే బ్రతుకు చీకటి అయినందుకు డాక్టర్ డాక్టర్ భార్య విచారిస్తుండగా సత్యం ఆపరేషన్ చేస్తానని ధైర్యం చెప్తాడు. సత్యం నీకిది ఎలా సాధ్యం అని డాక్టర్ అడుగుతాడు. డాక్టర్ కి తెలియకుండా ఆయన వ్రాసుకున్న నోట్సు దొంగతనంగా చదివినట్లు అదే విధంగా ఆపరేషన్ సమయంలో నర్సు వేషంలో ఒకసారి కిటికీ రంధ్రం ద్వారా మరొకసారి మీరు నిర్వహించే ఆపరేషన్ చూశాను. ఈ విధంగా మీ వద్ద విద్యను దొంగిలించినందుకు క్షమించమని అంటాడు సత్యం.

విద్య నా ఒక్కడి సొత్తు అని విర్రవీగాను. ఎంత ప్రాధేయపడినా నీకు నేర్పించడానికి నిరాకరించాను. అహంభావం, అహంకారంతో నా వారసులకే నా విద్య దక్కాలనుకున్నాను. భగవంతుడు నాకు తగిన శిక్ష వేసాడు. సత్యం నీవు ధన్యుడవు. ప్రజల కొరకు సేవ చేయాలనే తపన గలవాడివి. నాకు ఈ నేత్ర చికిత్స చేసి చూపును ప్రసాదించడమే కాదు. అజ్ఞానంతో మూసుకుపోయిన నా మనోనేత్రాన్ని తెరిపించావు. నీ సంస్కారానికి కృతజ్ఞతలు అని అభినందించాడు సత్యాన్ని సుదర్శన్.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 2 తెరచిన కళ్ళు

ప్రశ్న 3.
‘తెరచిన కళ్ళు’ నాటిక ద్వారా రచయిత అందించిన సందేశాన్ని వివరించండి.
జవాబు:
‘తెరచిన కళ్ళు’ నాటిక విద్య, జ్ఞానం వంటి విషయాలను తెలియజేసే రచన. అందరి కళ్ళను తెరిపించే రచన, విద్య, జ్ఞానం బంగారంతో సమానము. మెరుగుపెట్టే కొద్దీ వాటి ప్రకాశం, కాంతి అధికమౌతుంది. పదిమందికి పంచి పెట్టాల్సిన జ్ఞానం, విద్య దాచుకోకూడదు. సమయానికి అవి పంచలేకపోతే కళావిహీనం అవుతాయి. ఈ సత్యాన్ని రచయిత ఈ నాటిక ద్వారా చక్కని సందేశాన్ని ఇచ్చారు.

విద్యారంగంలో నేడు కార్పొరేటీకరణ అధికమయిపోయి వికసించవలసిన విద్యార్థి మనసు కుంచించుకుపోతోంది. స్వార్థచింతన పెరిగిపోతూ ఉంది. నేటి బాలలే రేపటి పౌరులన్నట్లు నేటి విద్యార్థులే భావితరాలకు పట్టుగొమ్మలు. అటువంటి విద్యార్థులు భవిష్యత్తులో మానవీయ విలువలు కలిగి సమాజ శ్రేయస్సుకు దోహదపడాలన్న సందేశాన్ని అందించారు ఆత్రేయ.

ప్రఖ్యాతి చెందిన డాక్టర్ సుదర్శన్ ఎంతో పేరు ప్రసిద్ధి పొందినవాడు. తన వద్దకు వచ్చిన ఎంతోమందికి చూపును ప్రసాదించిన ప్రత్యక్ష దైవం. తన దగ్గర పనిచేస్తూ ఎంతో సహకారాన్ని అందించిన వ్యక్తి సత్యం. అసిస్టెంట్ డాక్టర్. సత్యం డాక్టర్ సుదర్శన్ తో తనకు వైద్యంలో మెళకువలు, నైపుణ్యాన్ని నేర్పమని ఎంతగానో ప్రాధేయ పడతాడు. డాక్టర్ సుదర్శన్ అందులకు అంగీకరించడు. తన విద్య తన వారసులకే అందాలనుకుంటాడు.

ఎన్నిసార్లు అడిగినా విద్యను నేర్పించడానికి నిరాకరిస్తాడు. ఈ విద్య నేర్పితే వచ్చేది కాదని స్వయం ప్రతిభ ఉండాలని ఉద్దేశపడతాడు. ఈ విద్యను మీతోనే అంతరించకుండా చూడమని బాధపడతాడు. ఇంతలో డాక్టర్ భార్య తల్లి కాబోతున్నట్లు తెలుసుకొని ఆనందపడతాడు. ఇంతలో జయపురం రాజావారికి ఆపరేషన్ అని ప్రయాణమౌతాడు. రైలులో ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు పడి కళ్ళు పోతాయి డాక్టర్ సుదర్శన్ కి.

విద్యంతా నా సొత్తే అని విర్రవీగాను. అహంకారం, అహంభావంతో కళ్ళుండీ గుడ్డివాడినయ్యాను. ఇప్పుడు కళ్ళులేని ఈ జీవితాన్ని ఎలా జీవించాలో అని దుఃఖిస్తాడు.

చీకట్లో ఉన్నవారికి చూపునిచ్చిన డాక్టర్ కి ఇలా జరిగిందని తెలుసుకుని అందరూ వచ్చి తమ కళ్ళను ఇచ్చి తిరిగి చూపును పొందమని అంటారు. దానికి ప్రతిగా డాక్టర్ ఇదంతా నా స్వయం కృతం. విద్యను దాచాను. ఇతరులకు ఇవ్వటానికి నిరాకరించాను. ఫలితం అనుభవిస్తున్నాను. ఎన్నో ఏళ్ళుగా ప్రాధేయపడిన సత్యానికి విద్య నేర్పి ఉంటే నాకీ అవస్థ వచ్చేది కాదని తన అజ్ఞానానికి క్షమించమంటాడు డాక్టర్.

భయపడకండి డాక్టర్ గారు భగవంతుడున్నాడని తానే డాక్టర్ కి ఆపరేషన్ చేస్తానని అంటాడు. సరేనంటాడు డాక్టర్. కట్లు విప్పుతూ ఆశీర్వదించమంటాడు. చూపు వచ్చిన తరువాత డాక్టర్ సత్యాన్ని అభినందించి ఎలా నేర్చుకున్నావని అడుగుతాడు సుదర్శన్. తాను ముందుగా డాక్టర్ గారిని క్షమాపణ అడిగి తాను ఎలా నేర్చుకున్నాడో వివరిస్తాడు. మిమ్మల్ని మోసం చేసి మీకు తెలియకుండా నేర్చుకున్నందుకు మన్నించమంటాడు.

డాక్టర్ సత్యం లాంటి వాళ్ళుంటే ప్రజాసేవకు విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని మెచ్చుకుంటాడు సుదర్శన్. కళ్ళతో పాటు తనకు మనోనేత్రాన్ని తెరిపించావని సత్యాన్ని ఆశీర్వదిస్తాడు సుదర్శన్.

రచయిత పరిచయం

1. తెరచిన కళ్ళు పాఠ్యభాగ రచయిత ఆచార్య ఆత్రేయ.
2. మనసు కవిగా ప్రసిద్ధుడు ఆత్రేయ.
3. 7.5. 1921వ తేదీన నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట దగ్గర మంగళంపాడులో జన్మించారు ఆత్రేయ.
4. సీతమ్మ, కృష్ణమాచార్యులు ఇతని తల్లిదండ్రులు.
5. ఆచార్య ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు.
6. ఆత్రేయ గోత్రం తన పేరులో కలుపుకొని ఆచార్య ఆత్రేయగా స్థిరపడ్డారు. కలం పేరు ఆత్రేయ.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 2 తెరచిన కళ్ళు

7. చిత్తూరులో పాఠశాల విద్యాభ్యాసం ముగించి రాయవేలూరు కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించారు.
8. ఆత్రేయకు చిన్ననాటి నుండి నాటకాలపై మక్కువ ఎక్కువ.
9. మున్సఫ్ కోర్టులోను, తిరుత్తణి సెటిల్ మెంటు ఆఫీసులోను క్లర్క్ గా పనిచేశారు.
10. ‘జమీన్ రైతు’ పత్రికకు సహాయ సంపాదకులుగా పనిచేసారు.
11. ఆంధ్ర నాటక కళాపరిషత్తు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
12. సమాజ ప్రభావం వల్ల ఆత్రేయ నటుడుగానే కాక రచయితగా ఎదిగాడు.
13. పద్యకావ్యాలు, వచన కవితలు, గేయాలు, నాటికలు వంటి అనేక ప్రక్రియల్లో తన రచనలు చేశాడు.
14. ఆత్రేయ నాటకాలు ఎన్.జి.ఓ పరివర్తన వంటివి. నాటకకళా పరిషత్తు బహుమతులు పొందాయి. ‘కప్పలు’ అనే నాటకం వందలసార్లు ప్రదర్శింపబడింది.
15. ఆత్రేయ మాటలు, పాటలు చలనచిత్ర రంగంలో ప్రేక్షకులను కేరింతలు కొట్టించాయి.
16. తెలుగు సాహిత్యంలోను, చలనచిత్ర రంగంలోను తనదైన ముద్రవేసి 9.9.1989న భౌతికంగా దూరమయ్యారు.

పాత్రల పరిచయం

1. డాక్టర్ :
డాక్టర్ సుదర్శన్ ప్రముఖ నేత్ర వైద్యుడు. వచ్చిన పేషెంట్ల బాధలను అడిగి తెలుసుకునే స్వభావం గలవాడు. డాక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు గలవాడు. కళ్ళులేక వచ్చిన వారిని నిరాశపరచకుండా ఓదార్చే సహనశీలి. తన వద్దకు వచ్చిన వారందరికి చూపునిచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపగలిగే సమర్థుడు. పుట్టుగ్రుడ్డి అయిన పిల్లవాడికి, పెళ్ళిలో బాణాసంచా మందు పడి చూపును కోల్పోయిన పెళ్ళికొడుక్కి తన నైపుణ్యంతో ఆపరేషన్ చేసి చూపును తిరిగి ఇచ్చిన దైవ సమానుడు.

ప్రపంచ విఖ్యాతి పొందిన వైద్యశాస్త్రాన్ని తన వారసులకే దక్కాలనే ఆలోచన గలవాడు. ఎన్నో ఏళ్ళుగా తన వద్ద పనిచేస్తున్న సత్యం నోరు తెరిచి తనకు విద్యను నేర్పించమని అర్థించినా విద్య నేర్పించడానికి అంగీకరించలేదు. జయపురం రాజావారికి ఆపరేషన్ చేయడానికి బయలుదేరిన డాక్టర్ రైలుబండిలో ప్రమాదవశాత్తు కళ్ళల్లో నిప్పురవ్వలు పడి అంధుడైపోయాడు. అతనివద్ద పనిచేసే సత్యం ఆపరేషన్ చేసి చూపునిస్తాడు.

డాక్టర్ కి తెలియకుండా విద్యను నేర్చి చూపునిచ్చిన సత్యాన్ని క్షమించమని పశ్చాత్తాప పడతాడు డాక్టర్. సత్యం లాంటి వ్యక్తులు ప్రజా సేవకు ఎంతో అవసరమని అంటాడు. తనకు చూపునే కాదు మూర్ఖంగా ఆలోచించే నా మనోనేత్రాన్ని కూడా సరిచేసావంటాడు డాక్టర్.

2. సత్యం :
డాక్టర్ సుదర్శన్ దగ్గర జూనియర్ డాక్టర్. ఎన్నో ఏళ్ళు సుదర్శన్ దగ్గర అసిస్టెంటుగా పనిచేస్తూ ఉంటాడు. సుదర్శన్ ఎన్నో ఆపరేషన్లు చేస్తాడు. వాటిని గమనిస్తూ ఉండేవాడు. తనకు ఆ విద్యను నేర్పుమని ప్రాధేయపడతాడు. కాని డాక్టర్ సుదర్శన్ అందుకు ససేమిరా అంటాడు. కాని అనుకోకుండా కళ్ళు పోయిన సుదర్శన్ కి సత్యం ఆపరేషన్ చేసి చూపునిస్తాడు. డాక్టర్ సత్యాన్ని ఎలా నేర్చుకున్నావని అడుగుతాడు. సత్యం డాక్టర్.సుదర్శన్ ని క్షమాపణ కోరి తాను ఎలా నేర్చుకున్నది వివరిస్తాడు.

3. పిల్లవాడు :
1వ రోగి. పుట్టి పుట్టగానే నేత్రాలు పోయినవాడు. పుట్టు గుడ్డివాడు.

4. తల్లి :
గుడ్డి పిల్లాడిని ప్రసవించి బాధపడుతుంది. పిల్లవాడికి చూపు రావాలని డాక్టర్ సుదర్శన్ కి చూపిస్తుంది. సుదర్శన్ దైవం మీద భారం వేసి పిల్లవాడికి చూపు తెప్పించగానే డాక్టర్ ని దైవంగా భావించి కాళ్ళకు నమస్కరిస్తుంది. చూపే లేని బిడ్డకు వెలుగులు చూసే భాగ్యాన్ని ప్రసాదించిన ప్రత్యక్ష దైవం అని నమస్కరిస్తుంది.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 2 తెరచిన కళ్ళు

5. భర్త :
రెండవ రోగి అందమైన కలలతో వివాహపు వేడుకలు చేసుకుంటాడు. పెళ్ళి ఊరేగింపులో బాణాసంచా కాలుస్తుంటారు. ఆ మందుగుండులో సూరేకారం కంట్లో పడి చూపును కోల్పోతాడు. పెళ్ళికి ముందే జరిగిన దానికి బాధపడి తాను వివాహం చేసుకోబోయే అమ్మాయిని మరొక వివాహం చేసుకోమని అంటాడు.

నిశ్చయమైన పెళ్ళికి ఈ విధంగా అవాంతరం కలిగింది కాని పెళ్ళి తర్వాత ఏం జరిగితే ఏం చేయగలం ? అని ఆ. గుడ్డి వ్యక్తినే వివాహం చేసుకుంటానని చెప్పిన సంస్కారి ఆమె. తరువాత డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకుంటాడు. ఆపరేషన్ అనంతరం చూపును . పొందుతాడు.

6. భార్య :
రెండవ రోగి భార్య. ప్రమాదంలో కళ్ళుపోయినా ఆ గుడ్డి వ్యక్తినే వివాహం చేసుకున్న సహనశీలి. డాక్టర్ దగ్గర వైద్యం చేయించి తిరిగి చూపు వచ్చేలా ఆపరేషన్ చేయించిన స్త్రీ మూర్తి. వివాహానికి ముందే కళ్ళు పోయినా గ్రుడ్డివాడినే వివాహం చేసుకున్న ఆదర్శ స్త్రీమూర్తి.

7. నర్సు :
ప్రసవించే ఆసుపత్రిలో పనిచేసే అమ్మాయి. స్త్రీ ప్రసవించగానే మగపిల్లాడమ్మా వరాల కృష్ణయ్య అంటూ కానీ పుట్టు గుడ్డివాడనే సంగతి చెప్తుంది. బాధపడిన తల్లిని ఓదారుస్తుంది.

8. బిచ్చగాడు :
కళ్ళు లేనివాడు. బిచ్చమెత్తుకుంటూ చూపులేని జీవితం ఎంత దయనీయమో, ఎంత నికృష్టమో అని పాడుకుంటూ కళ్ళులేక కబోదులు కొందరు, కళ్ళుండీ చూడలేని వారు మరికొందరు. లోపల జ్ఞానమే సమస్తం. లేకపోతే బ్రతుకే వ్యర్థం అని పాడుకుంటూ బిచ్చమెత్తుకుంటాడు.

9. డాక్టర్ భార్య :
ఆసుపత్రిలో ఆపరేషన్లు అంటూ సమయంలేని డాక్టర్ భార్య. 24 గంటలూ ఆసుపత్రే నా ఇంట్లో ఎదురు చూసే భార్య ఉందని గ్రహించండి అని అంటుంది. ఎదురుచూసి కళ్ళు కాయలు కాచాయని అంటుంది.

పాఠ్యభాగ సారాంశం

కళ్ళులేని బిచ్చగాడు పాట పాడుకుంటూ బిచ్చమెత్తుకుంటూ ఉంటాడు. ఆసుపత్రిలో ఒక స్త్రీ బిడ్డను ప్రసవిస్తుంది. మగపిల్లాడు బాగున్నాడు కాని కళ్ళు లేవని నర్సు చెప్తుంది. పుట్టుకతోనే అంధుడైన బిడ్డ పుట్టాడని తెలిసి తల్లి దుఃఖిస్తుంది. కళ్ళారా నన్ను చూసి అమ్మా అని పిలిచే భాగ్యం లేకుండా చేసాడు ఆ భగవంతుడని తల్లి తల్లడిల్లిపోయింది.

కాదు విద్యే శాశ్వతం. ఈ విద్య మీ తోనే అందరించకూడదని ఎంతగా ప్రాధేయపడినా అంగీకరించలేకపోతాడు సుదర్శన్. ఇంతలో జయపురం రాజావారికి వారి దర్బారులోనే ఆపరేషన్ చేయాలని కబురు వచ్చింది. సత్యాన్ని తీసుకుని బయలుదేరాడు సుదర్శన్. రైలులో కిటికీలు తీసి కూర్చున్న సుదర్శనం కళ్ళలో నిప్పురవ్వలు పడి కళ్ళు పోతాయి. సత్యం డాక్టర్ కి ధైర్యం చెప్పి ఆపరేషన్ చేస్తాడు. తర్వాత సత్యాన్ని అడగగా తాను సుదర్శన్ కి తెలియకుండా ఆపరేషన్ విద్యను నేర్చుకున్నట్లు అలా చేసినందుకు మన్నించమని క్షమాపణ కోరుతాడు.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 2 తెరచిన కళ్ళు

డాక్టర్ సుదర్శన్ “నా అహంభావానికి, అహంకారానికి భగవంతుడు నన్ను ఇలా శిక్షించాడు. విద్య నా సొత్తు అని విర్రవీగాను. కళ్ళుండీ గుడ్డివాడినయ్యాను. జాకు కళ్ళు తెరిపించావు సత్యం” అంటూ ఆనందించాడు. “నా పేరు నిలబెట్టావు. ప్రపంచానికి చూపునిచ్చిన డాక్టర్ కే చూపునిచ్చావు. ఆ గౌరవం నీదే సత్యం” అంటూ సత్యాన్ని మెచ్చుకున్నాడు.

కఠిన పదాలకు అర్థాలు

కబోది = చూపులేనితనం
సూరేకారం = బాణాసంచా తయారీలో వాడే పదార్థం
అడవి గాచిన వెన్నెల = వ్యర్థం
విధి = తలరాత
వైరం = శత్రుత్వం
అంధకారం = చీకటి
పుట్టుగ్రుడ్డి = పుట్టుకతోనే చూపు కోల్పోవడం
పూర్ణదృష్టి = పూర్తిగా చూపు కలిగి ఉండడం
దృష్టి = చూపు
గొడ్రాలు = పిల్లలు లేని తల్లి
నిర్భాగ్యం = అదృష్టం లేకపోవుట
బాణాసంచా = టపాకాయలు
కళ్ళు కాయలుకాయు = ఎదురు చూచుట

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 2 తెరచిన కళ్ళు

తీరిక = సమయం
పాప = కనుగుడ్డు
ఆజన్మాంతం = జన్మంతా
శాశ్వతం = చిరకాలం ఉండటం
అంతరించు = కనుమరుగైపోవు
ప్రాధేయపడు = పాకులాడటం
క్షణభంగురం = క్షణకాలంలో నశించుట
స్వయంకృతం = తనకు తాను చేసుకున్న (పాపం) తప్పిదం
నిరాకరించు = అంగీకరించకపోవుట
అవస్థ =కష్టం
గుత్తకు = మొత్తంగా
అవివేకం = వివేకం లేకపోవుట
కంత = కన్నం, రంధ్రం
సార్థకం = ఉపయోగం
మనోనేత్రం = జ్ఞాననేత్రం

Leave a Comment