AP Inter 2nd Year Telugu Grammar భాషాభాగాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material Intermediate 2nd Year Telugu Grammar భాషాభాగాలు Questions and Answers.

AP Intermediate 2nd Year Telugu Grammar భాషాభాగాలు

భాషలోని భాగాలనే భాషాభాగాలు అంటారు. తెలుగు భాషలో భాషాభాగాలు ప్రధానంగా ఐదు రకాలు.

  1. నామవాచకం
  2. సర్వనామం
  3. విశేషణం
  4. క్రియ
  5. అవ్యయం.

1. నామవాచకం :
నామవాచకం అంటే పేర్లను తెలియజేసేది అని అర్థం. అది వ్యక్తి పేరు, ఊరు పేరు, పర్వతం పేరు, దేశం పేరు ……… ఇలా ఏ పేరైనా సూచిస్తే దాన్ని నామవాచకం అంటాం.

ఉదా : రవి, లత, అమరావతి, విశాఖపట్టణం, హిమాలయాలు, భారతదేశం మొదలైనవి.

వాక్యాల్లో నామవాచకాన్ని గుర్తించడం :
ఉదా :

  1. సునీత పాటలు పాడుతుంది. (సునీత – నామవాచకం)
  2. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. (అమరావతి – నామవాచకం)
  3. ఎవరెస్ట్ ప్రపంచంలో కెల్లా ఎత్తైన శిఖరం. (ఎవరెస్ట్ – నామవాచకం)
  4. వేదభూమి భారతదేశం. (భారతదేశం – నామవాచకం)
  5. నైలునది ప్రపంచంలో పొడవైన నది. (నైలు నది – నామవాచకం)

AP Inter 2nd Year Telugu Grammar భాషాభాగాలు

2. సర్వనామం :
నామవాచకానికి బదులుగా వాడే పదాన్ని సర్వనామం అంటారు. అంటే పేర్లకు బదులుగా వాడే పదాలు.
అతడు – ఆమె
ఇతడు – ఈమె
వీడు – వీరు
వాడు – వారు
మేము – మనం మొదలగునవి.

వాక్యాల్లో సర్వనామాన్ని గుర్తించడం :

  1. ఆయనే మా తెలుగు మాస్టారు. (ఆయనే – సర్వనామం)
  2. వాళ్ళందరూ డిగ్రీ పూర్తి చేశారు. (వాళ్ళందరూ – సర్వనామం)
  3. మీరు మంచి విద్యార్థులు. (మీరు – సర్వనామం)
  4. మా అమ్మ దేవత. (మా – సర్వనామం )
  5. ఆమె భారతదేశ ప్రధానమంత్రి (ఆమె – సర్వనామం)

3. విశేషణం : నామవాచకం లేదా సర్వనామం యొక్క గుణాలను తెలిపే పదాన్ని విశేషణం అంటారు.
తెలుపు, అందమైన, పొట్టి, తియ్యని, తెలివితక్కువ, పేదవాడు మొదలైనవి.

వాక్యాలలో విశేషణాన్ని గుర్తించడం :

  1. ఆ పెళ్ళికొడుకు తెల్లగా ఉన్నాడు.
  2. గులాబీ అందమైన పువ్వు.
  3. పద్మావతి మా తరగతిలో సమర్థవంతమైన నాయకురాలు.
  4. తిరుపతి గొప్ప యాత్రాస్థలం.
  5. రాణి మంచి తెలివిగల అమ్మాయి.

AP Inter 2nd Year Telugu Grammar భాషాభాగాలు

4. క్రియ :
ఏ కాలంలోనైనా జరిగిన పనిని సూచించేది క్రియ.
చదువుకొను, నిద్రించు, వచ్చు, పరుగెత్తు, వండు మొదలైనవి.

వాక్యాలలో క్రియను గుర్తించడం :

  1. నేను బాగా చదువుతాను.
  2. ఎవరైనా ప్రశాంతంగా నిద్రపోవాలి.
  3. పోలీసును చూసి దొంగ పరుగెత్తాడు.
  4. భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపాలి.
  5. దేవదత్తుడు వంటచేశాడు.

5. అవ్యయం :
లింగ, వచన, విభక్తులు లేని పదాలను అవ్వయాలంటారు. వీటికి స్త్రీ, పురుష భేదం ఉండదు. ఏక బహువచనాలు ఉండవు. డు, ము, వు, లు, యొక్క చేత, కొఱకు, వలన మొదలైన విభక్తి ప్రత్యయాలు చేరవు. యథా, తథా, ఎక్కడ, మీద, క్రింద, ప్రక్కన, నుండి, మరియు, కూడా, ఓహో, అయ్యయ్యో మొదలైనవి.

వాక్యాల్లో అవ్యయాన్ని గుర్తించడం :

  1. ఆహా ! తెలుగు భాష ఎంత బాగుందో !
  2. ఎక్కడ పేదవారు ఉండరో అదే సంపన్న రాజ్యం .
  3. పొయ్యి మీద పిల్లి కూర్చుంది.
  4. అయ్యయ్యో ! ఆ సంబంధం తప్పి పోయిందా ?
  5. వాడు తెలివైనవాడే కానీ పొగరు ఎక్కువ.

అభ్యాసం

ఏక వాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు.

ప్రశ్న 1.
నైలు నది ప్రపంచంలో పొడవైన నది – దీనిలోని నామవాచకాన్ని గుర్తించండి.
జవాబు:
ఇందులో ‘నైలు నది’ అన్న పదం నామవాచకం.

AP Inter 2nd Year Telugu Grammar భాషాభాగాలు

ప్రశ్న 2.
సర్వనామం అంటే ఏమిటి ?
జవాబు:
నామవాచకానికి బదులుగా వాడబడు పదాన్ని సర్వనామమంటారు.

ప్రశ్న 3.
తిరుపతి గొప్ప యాత్రాస్థలం – విశేషణాన్ని గుర్తించండి ?
జవాబు:
ఇందులో విశేషణ పదం “గొప్ప”.

ప్రశ్న 4.
భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపాలి. – క్రియ ఏది ?
జవాబు:
ఇందులో క్రియా పదం “రూపుమాపాలి”.

ప్రశ్న 5.
అవ్యయం అంటే ఏమిటి ?
జవాబు:
లింగ, వచన, విభక్తులు లేని పదాలు అవ్యయాలు.

ప్రశ్న 6.
దేవదత్తుడు వంట చేశాడు. – దీనిలో క్రియ ఏది ?
జవాబు:
దీనిలో క్రియా పదం ‘చేశాడు’.

AP Inter 2nd Year Telugu Grammar భాషాభాగాలు

ప్రశ్న 7.
విశేషణానికి ఉదాహరణ రాయండి.
జవాబు:
మంచి, పొట్టి, నలుపు, తెలుపు.

ప్రశ్న 8.
తెలుగులో భాషాభాగాలు ఎన్ని రకాలు ?
జవాబు:
తెలుగులో భాషాభాగాలు 5 రకాలు. (నామవాచకం, సర్వనామం, విశేషణము, క్రియ, అవ్యయము).

ప్రశ్న 9.
నామవాచకం అంటే ఏమిటి ?
జవాబు:
పేర్లను తెలియజేసే పదాలను నామవాచకములంటారు.

ప్రశ్న 10.
క్రియ అంటే ఏమిటి ?
జవాబు:
పనిని సూచించే పదాన్ని క్రియ అంటారు.

ప్రశ్న 11.
విశేషణం అంటే ఏమిటి ?
జవాబు:
నామవాచక సర్వనామముల యొక్క గుణాలను తెలియజేసే వాటిని విశేషణం అంటారు.

ప్రశ్న 12.
అవ్యయానికి ఉదాహరణ రాయండి.
జవాబు:
ఓహో ! ఆహా ! అయ్యయ్యో !

ప్రశ్న 13.
‘గులాబి అందమైన పువ్వు’ – దీనిలో విశేషణమేది ?
జవాబు:
ఇందులోని విశేషణం ‘అందమైన’.

AP Inter 2nd Year Telugu Grammar భాషాభాగాలు

ప్రశ్న 14.
మీరు మంచి విద్యార్థులు. – దీనిలో సర్వనామమేది ?
జవాబు:
ఇందులో ‘మీరు’ అనే పదం సర్వనామము.

ప్రశ్న 15.
ఆహా ! తెలుగు భాష ఎంత బాగుందో ! – దీనిలో అవ్యయమేది ?
జవాబు:
ఇందులోని అవ్యయ పదం ‘ఆహా’.

Leave a Comment