AP Inter 2nd Year Botany Important Questions Chapter 2 ఖనిజ పోషణ

Students get through AP Inter 2nd Year Botany Important Questions 2nd Lesson ఖనిజ పోషణ which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Botany Important Questions 2nd Lesson ఖనిజ పోషణ

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
హైడ్రోపోనిక్స్ ను నిర్వచించండి. [TS MAR-18][MAR-14]
జవాబు:
హైడ్రోపోనిక్స్: మొక్కలను నిర్ధిష్ట మూలకాల ద్రావణంలో పెంచే సాంకేతిక పద్ధతిని హైడ్రోపోనిక్స్ అంటారు.

ప్రశ్న 2.
ఒక ఆవశ్యక మూలకాన్ని సూక్ష్మ లేదా స్థూల పోషకంగా ఎలా వర్గీకరించగలవు?
జవాబు:

  1. ‘ఆవశ్యక లభ్యత’ ఆధారంగా మూలకమును సూక్ష్మ లేదా స్థూల పోషకంగా వర్గీకరించవచ్చు.
  2. పెద్ద మొత్తంలో అవసరమయ్యే మూలకాలను ‘స్థూల పోషకాలు’ అంటారు.
  3. చిన్న మొత్తంలో అవసరమయ్యే మూలకాలను ‘సూక్ష్మ పోషకాలు’ అంటారు.

ప్రశ్న 3.
ఎన్జైమ్లకు ఉత్తేజితాలుగా పనిచేసే ఆవశ్యక మూలకాల్లో రెండు ఉదాహరణ లివ్వండి.
జవాబు:
మెగ్నీషియమ్, మాంగనీస్, పోటాషియమ్, ఇనుము మరియు కాల్షియమ్.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 2 ఖనిజ పోషణ

ప్రశ్న 4.
కాంతి జలవిచ్ఛేదనంలో ముఖ్యపాత్ర వహించే ఆవశ్యక ఖనిజ మూలకాలను తెలపండి.
జవాబు:
కాల్షియమ్.

ప్రశ్న 5.
17 ఆవశ్యక మూలకాల్లో ఖనిజాలు కాని ఆవశ్యక మూలకాలు ఏవి?
జవాబు:
కార్బన్, హైడ్రోజన్

ప్రశ్న 6.
సల్ఫర్ కలిగిన రెండు అమైన్ ఆమ్లాల పేర్లును తెలపండి?
జవాబు:
సిస్టైన్, మిథియోనిన్.

ప్రశ్న 7.
ఎప్పుడు ఒక ఆవశ్యక మూలకం లోపించిందని చెప్పగలవు? [TS M-19]
జవాబు:
మొక్కలో ఏదైన మూలకం యొక్క గాఢత సందిగ్ధ గాఢత కంటే తక్కువైనప్పుడు ఒక ఆవశ్యక మూలకం లోపించిందని, చెప్పవచ్చు.

ప్రశ్న 8.
లేత పత్రాల్లో లోహ లక్షణాలను ముందుగా చూపే రెండు మూలకాల పేర్లను తెలపండి.
జవాబు:
నత్రజని, పోటాషియమ్.

ప్రశ్న 9.
లెగ్యూమ్ మొక్కల వేర్లలో ఉండే పింక్ వర్ణపు వర్ణద్రవ్యం పాత్రను వివరించండి. దానినేమంటారు. [AP,TS M-15]
జవాబు:

  1. లెగ్యూమ్ మొక్కల వేర్లలో ఉండే పింక్ వర్ణపు వర్ణ-ద్రవ్యంను “లెగ్-హీమోగ్లోబిన్”అంటారు.
  2. బుడిపెలలో ఉండే అనురూప నైట్రోజన్ ఎంజైమ్ ఆక్సిజన్ పట్ల సున్నితత్వాన్ని కనబరుస్తుంది. కావున ఈ ఎంజైము రక్షించుటలో హీమోగ్లోబిన్ ముఖ్య పాత్రను పోషిస్తుంది.

ప్రశ్న 10.
మృత్తికలో Mn ఎక్కువగా ఉన్నపుడు Ca, Mg, Fe లోపానికి దారి తీస్తుంది. వివరించండి.
జవాబు:

  1. అధిక మాంగనీస్ ‘ఐరన్’, ‘మెగ్నిషియమ్’ మరియు ‘కాల్షియం’ ల శోషణలో పోటీ పడుతుంది.
  2. కాండాగ్రంలో ‘కాల్షియం స్థానచలనాన్ని’ నిరోధిస్తుంది.
  3. కావున మృత్తికలో ‘అధిక మాంగనీస్’ Mg, Fe మరియు Ca ల లోపాన్ని ప్రేరేపిస్తుంది.

ప్రశ్న 11.
మొక్కలలో ఏది ఆవశ్యక మూలకాలను నిల్వ ఉంచుతుంది? పద్ధతి వలన ఇది ఏర్పడుతుంది?
జవాబు:

  1. ‘మృత్తిక లేదా నేల’ మొక్కల ఆవశ్యక మూలకాలను నిల్వ ఉంచుతుంది.
  2. ఇది పెద్ద రాళ్ళ ‘విచ్ఛిన్నం’ లేదా ‘ముక్కలవడం’ ద్వారా ఏర్పడుతుంది.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 2 ఖనిజ పోషణ

ప్రశ్న 12.
ఏ ఖనిజ లవణాన్ని 17వ ఆవశ్యక లవణంగా గుర్తించారు? దాని లోపం వల్ల కలిగే వ్యాధిని తెలపండి?
జవాబు:

  1. నికెల్ను 17వ ఆవశ్యక లవణంగా గుర్తించారు.
  2. పెకాన్లో “మౌస్ ఇయర్” అనే వ్యాధి దీని లోపం వల్ల వస్తుంది.

ప్రశ్న 13.
నత్రజని స్థాపనను కేంద్రక పూర్వజీవులే చూపిస్తాయి. నిజ కేంద్రక జీవులెందుకు చూపవు?
జవాబు:

  1. కేంద్రక పూర్వజీవులు, నైట్రోజినేజ్ ఎన్ఎమ్ Mo-Fe ప్రోటీన్ ను కలిగి ఉంటాయి. ఇది నత్రజని క్షయకరణను జరుపుతుంది.
  2. ఈ ప్రోటీన్ నిజకేంద్రక జీవులలో ఉండదు. కావున ఇవి నత్రజనిస్థాపన చెయ్యలేవు.

ప్రశ్న 14.
వాయు సహిత, వాయురహిత, నత్రజని స్థాపన జరిపే కేంద్రక పూర్వ జీవులకు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:

  1. వాయుసహిత నత్రజని స్థాపన జరిపే కేంద్రక పూర్వ జీవులకు ఉదాహరణ అజటోబాక్టర్, నీలి -ఆకుపచ్చ శైవలాలు మరియు బైజరింకియా
  2. వాయురహిత నత్రజని స్థాపన జరిపే కేంద్రక పూర్వ జీవులకు ఉదాహరణ బాసిల్లస్ మరియు రోడోస్పైరిల్లమ్.

ప్రశ్న 15.
లెగ్యూమ్ కాని మొక్కలు కూడా వేరు బుడిపెలను ఏర్పరుస్తాయి. వివరించండి?
జవాబు:

  1. ఫ్రాంకియా అనే సూక్ష్మజీవి లెగ్యూమ్యేతర మొక్కల వేర్లపై నత్రజని స్థాపన బుడిపెలను ఏర్పరుస్తుంది.
  2. ఉదా: అల్నస్ ‘లెగ్యూమ్ యేతర మొక్క

ప్రశ్న 16.
నైట్రోజినేజ్ ఎన్జైమ్లో గల ఆవశ్యక మూలకాల పేర్లను తెలపండి. అవి ఏ రకపు ఆవశ్యక మూలకాలు?
జవాబు:

  1. నైట్రోజినేజ్ ఎన్ఎమ్లో గల ఆవశ్యక మూలకాలు Mo, Fe.
  2. ఇవి సూక్ష్మ పోషకాలు.

ప్రశ్న 17.
నత్రజని స్థాపన సమతుల్య సమీకరణాన్ని రాయండి? [TS MAR-16]
జవాబు:
N2 + 8H+ + 8e + 16ATP → 2NH3 + H2 + 16ADP + 16Pi

ప్రశ్న 18.
జీవ నత్రజని స్థాపనలో ఒక అణువు వాతావరణ నత్రజని స్థాపన జరుపుటకు ఎన్ని ATPల శక్తి అవసరం? ఆ శక్తి ఎక్కడ నుంచి లభిస్తుంది?
జవాబు:

  1. జీవనత్రజని స్థాపన ప్రక్రియలో ఒక అణువు వాతావరణ నత్రజని స్థాపన జరిపి ఒక అణువు అమ్మోనియాను ఏర్పరచుటకు 8ATP ల శక్తి అవసరం.
  2. అతిధేయి కణంలో జరిగే శ్వాసక్రియ నుండి ఆ శక్తి లభిస్తుంది.

ప్రశ్న 19.
అమైడ్లు ఎందుకు దారువు గుండా రవాణా చెందుతాయి?
జవాబు:

  1. ‘అమైడ్లు’ అమైనో ఆమ్లాలు కంటే అధిక నత్రజనిని కల్గి ఉంటాయి.
  2. కావున అమైడ్లు దారువు గుండా రవాణా చెందుతాయి.

ప్రశ్న 20.
ఏవైనా రెండు ఆవశ్యక మూలకాల పేర్లను, వాటి లోపం వల్ల కలిగే వ్యాధులను తెలపండి.
జవాబు:

  1. ఆవశ్యక మూలకాలు నైట్రోజన్ N మరియు పొటాషియం K.
  2. N మరియు K లోపం వల్ల మొక్కలలో “నిర్హరితం” కలుగుతుంది.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 2 ఖనిజ పోషణ

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ఒక మొక్కలో ఉండే మూలకాలన్నీ అది జీవించడానికి అవసరం కాకపోవచ్చును. వివరించండి.
జవాబు:
1) మృత్తిక నుండి 60 కంటే ఎక్కువగా ఖనిజాలు వేర్ల ద్వారా మొక్కలను చేరతాయి. వీటిన్నింటిలో కొన్ని ఆవశ్యకాలు మరికొన్ని అనావశ్యకాలు.

2) కొన్ని ముఖ్యమైన ఆవశ్యక ఖనిజాలు నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియమ్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఇనుము, మాంగనీస్, జింక్, కాపర్, బోరాన్, క్లోరిన్, నికెల్ మరియు మాలిబ్దినమ్.

3) ఆవశ్యకా నియమాలు:

  1. మూలకం సాధారణ పెరుగుదలను సమర్ధించుటకు మరియు ప్రత్యుత్పత్తికి ముఖ్యా అవసరం.
  2. మూలకం ఆవశ్యకత విశిష్టంగా ఉండాలి, దానికి మరొక మూలకం ప్రత్యామ్నాయం కాదు.
  3. మూలకం ప్రత్యక్షంగా మొక్క జీవక్రియలో పాల్గొనాలి.

4) అయోడిన్, కోబాల్ట్ మరియు సోడియంల వంటి మూలకాలను ఆహార ప్రత్యామ్నాయాలుగా వినియోగిస్తారు. కాని ఇవి ఆవశ్యక మూలకాలు కాదు.

5) లిథియమ్, రేడియం మరియు పాదరసం లాంటివి ఆవశ్యక మూలకాలు కాదు. కాని అవి పెరుగుదలను నియంత్రిస్తాయి.

ప్రశ్న 2.
మొక్కల్లో ఏవైనా ఐదు భిన్న లోపాల లక్షణాలను తెలపండి. వాటిని వివరించి, అవి ఏ మూలకాల లోపం వల్ల కలుగుతాయో తెలపండి.
జవాబు:
1) నిర్హరితం: పత్రాలు పత్రహరితాన్ని కోల్పోయి పసుపు వర్ణంలోకి మారతాయి.
ఈ లక్షణం N, K, Mg, S, Fe, Mn, Zn మరియు Mo మూలకాల లోపం వలన కలుగుతుంది.

2) నెక్రోసిస్: పత్రాలలోని పత్రకణజాలాలు చనిపోవడం దీని లక్షణం.
ఇది Ca, Mg, K మూలకాల లోపం వల్ల కలుగుతుంది.

3) కణవిభజన నిరోధనం: మొక్కలలో కొన్ని మూలకాలు తక్కువ పరిమాణంలో ఉండటం లేదా లోపించడం వల్ల కణ విభజన నిరోధించబడుతుంది.
N, K,S మరియు Mo మూలకాల లోపం వలన ఇది జరుగుతుంది.

4) గిడసబారటం: మొక్కలలో తక్కువ పెరుగుదల లేదా గిడసబారటం జరుగుతుంది.
దీనికి కారణం మెగ్నిషియం, పోటాషియం, కాపర్ మరియు సల్ఫర్ల లోపం.

5) పత్రాలు, మొగ్గలు లేత దశలో రాలిపోవడం: ఫాస్ఫరస్ మరియు మాలిబ్దినమ్ లోపం వలన పత్రాలు మరియు మొగ్గలు లేతదశలో రాలిపోతాయి.

6) పుష్పాలు ఆలస్యంగా వికసించుట: N, S, Mo ల లోపం వలన మొక్కలలో పుష్పాలు ఆలస్యంగా వికసిస్తాయి.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 2 ఖనిజ పోషణ

ప్రశ్న 3.
వేరు బుడిపెలు ఏర్పడే విధానంలోని వివిధ దశలను వివరించండి. [AP MAR-17,18,19][TS MAY-17] [TS MAR-16,20]
జవాబు:

  1. ‘లెగ్యూమ్’ అనే అతిధేయి వేర్ల నుంచి ‘చక్కెరలను మరియు అమైన్ ఆమ్లాలను’ విడుదల చేస్తుంది.
  2. వాటిలో చక్కెరలు ‘ రైజోబియాను’ ఆకర్షిస్తాయి.
  3. అవి విభజన చెంది, ‘సమూహాలుగా ఏర్పడి మూలకేశకణాల బాహ్యచర్మంనకు అతుక్కొంటాయి.
  4. ఇవి వంకర తిరిగి ఉండే మూలకేశాల వేరు వల్కలం వరకు విస్తరిస్తాయి.
  5. అప్పుడు ఒక సంక్రమణ పోగు ఏర్పడుతుంది.
  6. ఇది బాక్టీరియము వల్కలం వరకు తీసుకుపోతుంది.
  7. ఇది వేరు వల్కలంలో బాక్టీరియా బుడిపె ఏర్పడటాన్ని ప్రేరేపిస్తుంది.
  8. వల్కల కణంలో వున్న బాక్టీరియా, అతిధేయి కణాల విభజనను ప్రేరేపిస్తుంది.
  9. ఇది ప్రత్యేక నత్రజని స్థాపన కణాలు విభేదన చెందడానికి దారి తీస్తుంది. ఇలా అవి వేరు బుడిపెను ఏర్పరుస్తాయి.
  10. ఇలా ఏర్పడిన బుడిపై, పోషకాల పరస్పర మార్పిడి కొరకు అతిధేయి నాళికా పుంజాలతో నేరుగా సంబంధాన్ని ఏర్పరుచుకుంటుంది.
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 2 ఖనిజ పోషణ 1

ప్రశ్న 4.
కొన్ని ఆవృత బీజ మొక్కలు వాతావరణంలోని నత్రజనిని శోషించడానికి అనుకూలనాలను కలిగి ఉంటాయి. రెండు ఉదాహరణలనిచ్చి వివరించండి.
జవాబు:
1) మొక్కలు వాతావరణ నత్రజనిని ప్రత్యక్షంగా వినియోగించుకోలేవు. కాని కొన్ని ఆవృతబీజ మొక్కలు ప్రత్యేక నత్రజని స్థాపన బాక్టీరియాలను వేరు బుడిపైలలో కలిగి ఉంటాయి. వీటి ద్వారా వాతావరణ నత్రజనిని గ్రహించి స్థాపన చేయగల్గుతాయి.

2) రైజోబియం బాక్టీరియా ఒక ప్రత్యేక గులాబి వర్ణ పదార్థాన్ని కలిగి ఉంటుంది. దీనినే ‘లెగ్-హీమోగ్లోబిన్’ అంటారు. ఇది వాతావరణ నత్రజని శోషించి నైట్రైట్గా మార్చి మొక్కలను అందిస్తుంది.

3) దీనికి ఫలితంగా బాక్టీరియా, మొక్క నుండి ఆహారం మరియు ఆవాసాన్ని పొందుతుంది.

4) లెగ్యూమ్ మొక్కల వేర్లు మరియు రైజోబియా బాక్టీరియాల మధ్య ఉన్న సహవాసాన్ని ‘సహజీవనం’ అంటారు.

5) ఉదా: లెగ్యూమ్ మొక్కలు (ఆల్ఫాఆల్ఫా, తీపి బఠానీ) రైజోబియం బాక్టీరియాను వాటి యొక్క వేర్లలో బుడిపె కలిగి ఉంటాయి.

6) ఉదా: అల్నస్ మొక్క ఫ్రాంకియా అనే సూక్ష్మజీవిని వేరు బుడిపెల యందు కలిగి ఉంటుంది. ఇది లెగ్యూమ్యేతర మొక్కలలో నత్రజనిని స్థాపన చేసి నైట్రోజినేజ్ ఎన్జైము ఆక్సిజన్ నుంచి రక్షిస్తుంది.

ప్రశ్న 5.
మొక్కలు ఏ విధంగా అమైనో ఆమ్లాల సంశ్లేషణ జరుపుతాయో క్లుప్తంగా రాయండి. [TS MAR-17] [AP MAR-16][AP MAY-17]
జవాబు:
మొక్కలలోని అమైనో ఆమ్లాల సంశ్లేషణ రెండు విధాలుగా జరుగుతుంది:
1) క్షయీకరణ అమైనేషన్: ఈ చర్యలో అమ్మోనియా α – కీటో గ్లూటారిక్ ఆమ్లంతో చర్యజరిపి గ్లూటామిక్ అనే అమైనో ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది.
AP Inter 2nd Year Botany Important Questions Chapter 2 ఖనిజ పోషణ 2

AP Inter 2nd Year Botany Important Questions Chapter 2 ఖనిజ పోషణ

2) ట్రాన్స్ అమైనేషన్: ఈ చర్యలో అమైనో ఆమ్లం నుంచి అమైనో సముదాయం కీటో ఆమ్లం యొక్క కీటో సముదాయానికి మారుతుంది. గ్లుటామిక్ ఆమ్లం అనే ప్రధాన అమైనోఆమ్లం నుంచి NH21 అమైనో సముదాయం బదిలీ జరుగుతుంది. ట్రాన్స్ అమైనేషన్ చర్య ద్వారా ఇతర అమైనో ఆమ్లాలు ట్రాన్స్ అమైనేజ్ సమక్షంలో ఏర్పడతాయి.
AP Inter 2nd Year Botany Important Questions Chapter 2 ఖనిజ పోషణ 3

ప్రశ్న 6.
ఒక ఆరోగ్యవంత మొక్కకు ఎక్కువగా ఆవశ్యక మూలకాల నందించితే ఏమి జరుగుతుంది? వివరించండి.
జవాబు:

  1. ఒక ఆరోగ్యవంత మొక్కకు ఎక్కువగా ఆవశ్యక మూలకాలను అందించితే అది విషపూరితంగా మారుతుంది.
  2. కణజాలాల్లో ఏదైనా మూలకం గాఢత పొడి బరువుకు 10% తగ్గించినట్లయితే అది విషపూరితంగా మారుతుంది.
  3. కావున ఎక్కువ లేదా తక్కువ గాఢతల మధ్య తేడా అతి తక్కువగా ఉంటుంది. అటువంటి నిర్ధిష్ట గాఢతలు భిన్న సూక్ష్మ పోషకాల మధ్య భిన్నంగా ఉంటాయి.
  4. అనేకసార్లు ఒక మూలకం ఆధిక్యత మరొక మూలకం శోషణను నిరోధిస్తుంది.
  5. ఉదా: Mn కాండాగ్రంలో ‘కాల్షియం’ స్థానచలనాన్ని నిరోధిస్తుంది. నిర్హరిత ఈనెలతో కూడిన గోధుమరంగు మచ్చలు మాంగనీస్ విషలక్షణానికి ముఖ్యమైన గుర్తింపు లక్షణం.

ప్రశ్న 7.
మొక్కలు ఆవశ్యక మూలకాలను ఏ విధంగా శోషిస్తాయో క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:

  1. ఆవశ్యక మూలకాల శోషణ రెండు ప్రధాన దశలలో జరుగుతుంది. a) అపోప్లాస్ట్ b) సింప్లాస్ట్
  2. a) అపోప్లాస్ట్ : ‘స్వేచ్ఛా ప్రదేశం’ లేదా ‘కణాల బాహ్య ప్రదేశంలోకి’ అయాన్లు వేగవంతంగా శోషించబడతాయి.
  3. b) సింప్లాస్ట్: అయాన్ల శోషణ అనేది నెమ్మదిగా కణాల అంతర ప్రదేశంలోనికి జరుగుతుంది.
    సింప్లాస్ట్ నుంచి గాఢతా ప్రవణతకు వ్యతిరేకంగా అయాన్లు బయటకు లేదా లోపలకు చలించడం శక్తి వినియోగంతో జరిగే పక్రియ ‘శోషణ’.
  4. అయాన్ల చలనాన్ని ‘అభివాహం’ అంటారు. కణాల లోనికి అయాన్లు చలించడాన్ని ‘అంతరాభివాహం’ అని మరియు బయటకు చలించడాన్ని ‘బాహ్యభివాహం’ అని అంటారు.

ప్రశ్న 8.
జీవ పద్ధతిలోనే కాకుండా మృత్తికలో కూడా నత్రజని స్థాపన జరుగుతుంది. వివరించండి.
జవాబు:
1) పరిశ్రమలలో జరిగే దహన చర్యలు, అడవుల్లో ఏర్పడే మంటలు, మోటార్ వాహనాల నుంచి వెలువడే పదార్థాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వాయునైట్రోజన్ ఆక్సైడ్లకు మూలం.

2) ప్రకృతిలోని మెరుపులు, అతినీలలోహిత కిరణాలు, రేడియో ధార్మికత నత్రజనిని నైట్రోజన్ఆక్సైడ్లుగా మార్చటానికి అవసరమయ్యే శక్తిని అందిస్తాయి.

3) గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్లు వర్షం కురిసినపడు నేలను చేరి అక్కడ ఉన్న క్షార మూలకాలతో చర్యలను జరిపి నైట్రైట్లను ఏర్పరుస్తాయి.
N2 + O2 → 2NO
2NO + O2 → 2NO2
2NO2 + H2O → HNO2 (లేదా) HNO3

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
నత్రజని వలయాన్ని సోదాహరణంగా వివరించండి. [AP MAR-20]
జవాబు:
నత్రజని వలయం: వాతావరణం నుంచి ‘నత్రజని’, భూమిలోకి మరల తిరిగి భూమినుంచి వాతావరణంలోనికి, మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవుల ద్వారా ‘చక్రీయ విధానం’లో ప్రయాణిస్తుంది. దీనినే నత్రజని వలయం
అంటారు. ఇది 5 దశలను కలిగి ఉంటుంది.

  1. నత్రజని స్ధాపన
  2. నత్రజని స్వాంగీకరణ
  3. అమ్మోనిఫికేషన్
  4. నత్రీకరణ
  5. వినత్రీకరణ

1) నత్రజని స్థాపన: అణురూప నత్రజని, అమ్మోనియా (లేదా) నైట్రైట్లు (లేదా) నైట్రేట్స్ గా మారే పద్ధతిని నత్రజనిస్ధాపన అంటారు.
a) జీవ నత్రజని స్థాపన: అణురూప నత్రజని, అమ్మోనియాగా కేంద్రక పూర్వజీవులు ద్వారా మారే పద్ధతిని ‘జీవనత్రజని స్ధాపన’ అంటారు.
AP Inter 2nd Year Botany Important Questions Chapter 2 ఖనిజ పోషణ 4
ఉదా: స్వేచ్ఛజీవన నత్రజని స్థాపక వాయు రహిత సూక్ష్మజీవి – రోడోస్పైరిల్లమ్

b) భౌతికనత్రజని స్థాపన:ప్రకృతిలోని ‘మెరుపులు మరియు అతినీలలోహిత రేడియోధార్మికత’ నత్రజనిని నైట్రోజన్ ఆక్సైడ్లుగా మార్చడానికి సరిపోయే శక్తిని అందిస్తాయి. పరిశ్రమల్లో దహన చర్యలు, అడవుల్లో మంటలు, మోటారు వాహనాల వ్యర్థాలు మరియు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వంటివి నైట్రోజన్ ఆక్సైడ్ కు వనరులు.
N2 + O2 → 2NO;
2NO + O2 → 2NO2

2) నత్రజనిస్వాంగీకరణ:మొక్కలు శోషించిన నైట్రేట్లు మరియు అమ్మోనియా వాటి దేహంలో అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, ఎంజైమ్లు, కేంద్రకామ్లాలు మరియు హర్మోనులు గా మార్చబడతాయి. ఈ కర్బన పదార్థాలు జంతువులు ద్వారా భక్షించబడతాయి.

3) అమ్మోనిఫికేషన్:చనిపోయిన మొక్కలు మరియు జంతువుల దేహలలోని కర్బన నత్రజని అమ్మోనియాగా విచ్ఛిన్నం చేయు విధానమే ‘అమ్మోనిఫికేషన్’. ఇది అమ్మోనిఫైయింగ్ బాక్టీరియా ద్వారా జరుగుతుంది.

4) నత్రీకరణ: అమ్మోనీయాను నైట్రైట్ మరియు నైట్రేట్లుగా మార్చుటను నత్రీకరణ అంటారు. ఇది 2 దశలలో జరుగుతుంది.
దశ 1: నైట్రోసోమోనాస్ మరియు నైట్రోకోకస్ బాక్టీరియాల ద్వారా అమ్మోనియా ఆక్సీకరణ చెంది నైట్రైట్గా మార్చబడుతుంది.
2NH3 + 3O2 → 2NO2 + 2H+ + 2H2O

AP Inter 2nd Year Botany Important Questions Chapter 2 ఖనిజ పోషణ

దశ 2: నైట్రైట్ మరల నైట్రోబాక్టర్ ద్వారా ఆక్సీకరణం చెంది నైట్రేట్గా మార్చబడుతుంది.
2NO2 + O2 → 2NO3
నైట్రేట్లు మొక్కల ద్వారా శోషించబడి పత్రాలకు రవాణా చెందుతాయి.
అవి అమ్మోనియాగా క్షయకరణం చెంది చివరగా అమైనో ఆమ్లాలుగా మారతాయి.

5) వినత్రీకరణ: కొద్ది మొత్తంలో ‘నైట్రేట్లు మరియు అమ్మోనియా’ స్వేచ్ఛా నత్రజనిగా సూడోమోనాస్ మరియు ధయో బాసిల్లస్ వంటి బాక్టీరియాలచే మార్చబడుతుంది. ఈ విధానాన్ని ‘వినత్రీకరణ’ అంటారు.
AP Inter 2nd Year Botany Important Questions Chapter 2 ఖనిజ పోషణ 5

ప్రశ్న 2.
లెగ్యూమ్ వేళ్లతో రైజోబియమ్ సంబంధం ఏర్పరచుకున్నప్పటి నుంచి వేరు బుడిపె ఏర్పడే వరకుగల సంఘటనలను చూపండి. లెగ్ హీమోగ్లోబిన్ ప్రాముఖ్యతను తెలపండి.
జవాబు:

  1. ‘లెగ్యూమ్’ అనే అతిధేయి, వేర్ల నుంచి ‘చక్కెరలను మరియు అమైన్ ఆమ్లాలను’ విడుదల చేస్తుంది.
  2. వాటిలో చక్కెరలు ‘ రైజోబియా బాక్టీరియాను’ ఆకర్షిస్తాయి.
  3. అవి విభజన చెంది, సమూహాలుగా ఏర్పడి మూలకేశకణాల బాహ్యచర్మంనకు అతుక్కొంటాయి.
  4. అవి వంకర తిరిగి ఉండే మూలకేశాల వేరు వల్కలం వరకు విస్తరిస్తాయి.
  5. అప్పుడు ఒక సంక్రమణ పోగు ఏర్పడుతుంది.
  6. ఇది బాక్టీరియమ్ను వల్కలం వరకు తీసుకుపోతుంది.
  7. ఇది వేరు వల్కలంలో బాక్టీరియా బుడిపె ఏర్పడటాన్ని ప్రేరేపిస్తుంది.
  8. వల్కల కణంలో ఉన్న బాక్టీరియా, అతిధేయి కణాల విభజనను ప్రేరేపిస్తుంది.
  9. ఇది ప్రత్యేక నత్రజని స్థాపన కణాలుగా విభేదన చెందడానికి దారి తీస్తుంది. ఇలా అవి వేరు బుడిపెను ఏర్పరుస్తాయి.
  10. ఇలా ఏర్పడిన బుడిపె, పోషకాల పరస్పర మార్పిడి కొరకు అతిధేయి నాళికా పుంజాలతో నేరుగా సంబంధాన్ని ఏర్పరుచుకుంటుంది.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 2 ఖనిజ పోషణ 6

లెగ్ హీమోగ్లోబిన్ ప్రాముఖ్యత:

  1. నత్రజని స్థాపన బాక్టీరియాకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది.
  2. నైట్రోజినేజ్ ఎన్జైమ్ను ఆక్సిజన్ నుంచి రక్షిస్తుంది.

Leave a Comment