AP Inter 2nd Year Botany Important Questions Chapter 12 జీవ సాంకేతిక శాస్త్రం – దాని అనువర్తనాలు

Students get through AP Inter 2nd Year Botany Important Questions 12th Lesson జీవ సాంకేతిక శాస్త్రం – దాని అనువర్తనాలు which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Botany Important Questions 12th Lesson జీవ సాంకేతిక శాస్త్రం – దాని అనువర్తనాలు

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
‘GMO’ ను విస్తరించండి. అది ఏవిధంగా సంకర మొక్కతో విభేదిస్తుంది?
జవాబు:

  1. GMO ఆల్ ఫ్రెడ్ అనగా జన్యుపరంగా రూపాంతరం చెందిన జీవులు.
  2. GMO లో ఒకటి లేదా కొన్ని జన్యువులు వేరే జాతికి చెందినవి ఉంటాయి.
  3. జన్యుపరంగా విభిన్న ప్రత్యేక లక్షణాలు ఉన్న రెండు జీవుల మధ్య సంకరణం జరపగా ఏర్పడిన జీవులే ‘సంకర జీవులు’
  4. GMO అనునది హస్త కౌశలం ద్వారా సహజ జన్యుపునః సంయోజనం ద్వారా ఏర్పడిన ‘సంకరణం’.

ప్రశ్న 2.
cry జన్యువులు, చీడల వివిధ రకాలను తెలిపి ఈ జన్యువులచే నియంత్రించబడే, ప్రోటీన్లను తెల్పండి. [ TS M-16]
జవాబు:

  1. Cry I Ac మరియు Cry II Ab అనే ప్రోటీన్లు ప్రత్తికాయ తొలిచే పురుగును నియంత్రిస్తుంది.
  2. Cry I Ab అనే ప్రోటీను ‘మొక్క జొన్న బోరర్’ను నియంత్రిస్తుంది.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 12 జీవ సాంకేతిక శాస్త్రం – దాని అనువర్తనాలు

ప్రశ్న 3.
రోగ లక్షణాలు బయటపడక ముందే ఒక రోగాన్ని నిర్ధారించగలరా? అందులో గల సూత్రాన్ని వివరించండి. [ TS M-19][AP MAR-17,19]
జవాబు:

  1. (i) PCR మరియు (ii) ఎలీసా సాంకేతికతో వ్యాధి లక్షణాలు తీవ్రం కాక ముందే రోగాన్ని గుర్తించవచ్చు.
  2. PCR యొక్క ప్రధాన సూత్రం జన్యు సంవర్ధన.
  3. ELISA యొక్క ప్రధాన సూత్రం ‘ప్రతి జనక – ప్రతి రక్షక’ అనుసంధానం.

ప్రశ్న 4.
సూక్ష్మ జీవుల వల్ల ఎన్నో టాక్సిన్లు వాటి నిష్క్రియ దశలో ఉత్పత్తి అవుతున్నాయి. టాక్సిన్ను ఉత్పత్తి చేసే జీవికి ఉపయోగపడి క్రియా విధానాన్ని వివరించండి?
జవాబు:

  1. సూక్ష్మజీవులలో టాక్సిన్లు ‘నిష్క్రియాత్మక ప్రోటాక్సిన్లు’గా ఉంటాయి.
  2. కాని ఈ నిష్క్రియాత్మక టాక్సిన్ స్ఫటికాలు కీటకం అన్నవాహికలోని pH వలన కరిగించబడి క్రియాశీలంగా మారతాయి.
  3. ఈ క్రియాశీలక టాక్సిన్లు అన్నవాహిక మిడ్రట్లోని మధ్యభాగంలోని ఉపరిస్థర కణాలకు అతుక్కొంటాయి. ఈ కణాలు వాచి రంధ్రాలు సృష్టించి, విచ్ఛిన్నమై చివరకు కీటకం మరణిస్తుంది.
  4. ఉదా: Bt ప్రత్తి. ఇది కీటకనాశకాలను తట్టుకుంటుంది.

ప్రశ్న 5.
మన దేశ పేటెంట్ బిల్లు రెండవ సవరణను భారత పార్లమెంటు ఎందుకు ఆమోదించింది?
జవాబు:

  1. అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాల మధ్య జరిగే అన్వయం, లాభ మరియు నష్టాల వలన కొన్ని దేశాలు అనధికారికంగా ఇతరుల జీవనవనరులను, సాంప్రదాయ పరిజ్ఞానాన్ని వాడకుండా ఉండేందుకు కొన్ని దేశాలలో చట్టాలను ప్రవేశపెడుతున్నారు.
  2. హక్కుల అత్యవసర స్థితిగతులు, పరిశోధన, అభివృద్ధి అంకురార్పణలు వంటి సమస్యలను పరిశీలించే మనదేశ ‘పేటెంట్ బిల్లు రెండవ సవరణను’ భారత పార్లమెంటు ఆమోదించింది.

ప్రశ్న 6.
బాస్మతి పేటెంట్ అమెరికన్ కంపెనీకి వెళ్ళకపోవడానికి గల రెండు కారణాలివ్వండి.
జవాబు:

  1. భారతదేశంలో పండించే బాస్మతి రకం వరి ఎన్నో శతాబ్దాల నుండి భారతదేశంలో పండుతుంది. ప్రాచీనంగా మరియు జానపదపరంగా ఇది భారతదేశంకు చెందినది.
  2. అమెరికన్ కంపెనీ పేర్కొన్న బాస్మతి వరి, మన బాస్మతి అర్ధవామన రకాల సంకరణ ద్వారా ఏర్పడినది.
  3. పై కారణాల వలన బాస్మతి పేటెంట్ అమెరికన్ కంపెనీకి వెళ్ళలేదు.

ప్రశ్న 7.
సంక్రామిక వ్యాధి తొలి నిర్ధారణకు ఉపయోగమయ్యే పరికరం PCRను విశదీకరించండి.
జవాబు:

  1. PCR అంటే ‘పాలిమరేజ్ చైన్ రియాక్షన్’. దీని ద్వారా వ్యాధి కారకం/ జనకం శరీరంతో అతి తక్కువ గాఢతలో (వ్యాధి లక్షణాలు కనబడకముందే ) ఉన్నా కనుక్కొగలం.
  2. జన్యు ఉత్పరివర్తనాలను మరియు అపక్రమతలను గుర్తించడానికి ఇది ఒక శక్తివంతమైన సాంకేతిక పద్ధతి.

ప్రశ్న 8.
GEAC అంటే ఏమిటి? దాని ఉద్దేశ్యమేమిటి? [TS MAY-22][AP MAY-17][AP MAR-15,18]
జవాబు:

  1. GEAC అనగా జన్యు సాంకేతికతను నిర్ధారించే ‘జెనిటిక్ ఇంజనీరింగ్ నిర్ధారణ కమిటి’.
  2. ఉద్దేశ్యం: ప్రజల సేవకై ప్రవేశపెట్టిన GM జీవుల భద్రతల సమ్మతానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం మరియు GM పరిశోధన నాణ్యతను తెలుసుకోవడం.

ప్రశ్న 9.
పొగాకు మొక్కల వేర్లను సంక్రమణ జరిపే నిమాటోడ్ పేరేమిటి? ఈ సంక్రమణాన్ని నిరోధించే పద్ధతిని తెలపండి. [AP MAY-19][TS MAR-18,20][AP MAR-16]
జవాబు:

  1. మెలోయిడిగైనీ ఇన్కాగ్నిషియా అనే నిమాటోడ్.
  2. RNA వ్యతికరణం అనే పద్ధతి ద్వారా ఈ పీడను నిరోధిస్తున్నారు.

ప్రశ్న 10.
USA కంపెనీ భారతదేశ ఏ రకపు వరికి పేటెంట్ను దాఖలు చేసింది? [AP MAY-22]
జవాబు:
బాస్మతి బియ్యం.

ప్రశ్న 11.
ఆహార సంపాదనలకు మెరుగైన పోషక గుణాలకు సరిపడే పరివర్తిత మొక్కలకు ఒక్కొక్క ఉదాహరణనివ్వండి. [AP MAR-20]
జవాబు:

  1. ఆహార సంపాదన కు సరిపడే పరివర్తిత మొక్క: ఫ్లావర్ సేవర్ అనే టమాటో రకం.
  2. పోషక గుణాలకు సరిపడే పరివర్తిత మొక్క తైపి గోల్డెన్ వరి రకం. ఇది సహజంగా విటమిన్ ‘A’ను అధికంగా కలిగి ఉంటుంది.

ప్రశ్న 12.
హరితవిప్లవం అంటే ఏమిటి? ఎవరిని హరితవిప్లవ పితగా పరిగణిస్తారు? [TS MAR-15,17,20]
జవాబు:

  1. వ్యవసాయ రంగం నందు అధిక దిగుబడి నిచ్చే రకాల ఉత్పత్తి మరియు వినియోగం అనేది వ్యవసాయ దిగుబడిలో, గణనీయమైన మరియు అనూహ్యమైన ఉత్పత్తిని పెంచింది. దీనినే ‘హరిత విప్లవం’ అని అంటారు.
  2. నార్మన్ బోర్లాగ్ ను ‘హరిత విప్లవపితామహునిగా’ పరిగణిస్తారు.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 12 జీవ సాంకేతిక శాస్త్రం – దాని అనువర్తనాలు

ప్రశ్న 1.
జన్యుపరివర్తిత మొక్కల వల్ల ఉపయోగాల పట్టిక ఇవ్వండి. [AP MAR-19][AP MAY-17][TS MAR-17,22]
జవాబు:
జన్యుపరివర్తిత మొక్కల ఉపయోగాలు:
a) వ్యాధి కారకాల చీడల నిరోధకత కల్గిన పరివర్తిత పంట మొక్కలు:

  1. పరివర్తిత బొప్పాయి: ఈ మొక్క బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్కు నిరోధకతను కలిగి ఉంటుంది.
  2. Bt- ప్రత్తి: ఇది కీటకాల నిరోధకతను కల్గి ఉంటుంది.
  3. పరివర్తిత టమోటా మొక్కలు: ఇవి సూడోమోనాస్ అనే వ్యాధి జనక బాక్టీరియంకు నిరోధకతను కలిగి ఉంటాయి.
  4. పరివర్తిత బంగాళదుంప మొక్కలు: ఇవి ఫైటోఫ్తోరా అనే శిలీంధ్ర నిరోధకతను కల్గి ఉంటాయి.

b) ఆహరాన్ని ప్రత్యేక ప్రక్రియలకు లోను చేసే విధానంలో కూడా జన్యుపరివర్తిత మొక్కలు తోడ్పడుట:
జన్యుపరివర్తిత టమోటా, ‘ఫ్లావర్సేవర్’ గాయాలను తట్టుకునే విధంగా ఉండి, ఆలస్యంగా పరిపక్వానికి వచ్చేవిగా ఉంచడం వీలవుతుంది.

c) మెరుగైన పోషక విలువలు కల్గిన జన్యువు ద్వారా పరివర్తిత మొక్కలు:
‘తైపి’ నుంచి ఉత్పన్నమైన జన్యుపరివర్తిత ‘గోల్డెన్ వరిరకం, విటమిన్-A ని సమృద్ధిగా కలిగి అంధత్వాన్ని నివారిస్తుంది.

d) సంకర జాతి విత్తనాల ఉత్పత్తికి ఉపయోగపడే జన్యు పరివర్తిత మొక్కలు:
పురుష వ్యంధ్యత్వం కల్గిన మొక్కలైన బ్రాసికానాపస్ ను ఉత్పత్తి చేయడం వల్ల, విపుంసీకరణ సమస్యను తొలగించి, సంకర విత్తనాలను తక్కువ ఖర్చుతో పొందే విధంగా రూపొందించారు.

e) రసాయనాలు, చలి, నీటి ఎద్దడి, ఉప్పు, ఉష్ణం మొదలైన నిర్జీవ ప్రతిబలాలను తట్టుకునే జన్యు పరివర్తిత మొక్కలు:
బాస్మతి రకం వరిలో జీవ మరియు నిర్జీవ ప్రతిబలాలను తట్టుకునే నిరోధకతను కల్పించారు.
‘రౌండ్ అప్ రెడీ సోయాబీన్’ అనే రకం గుల్మనాశకతను తట్టుకునేదిగా ఉంటుంది.

ప్రశ్న 2.
జన్యుపరంగా రూపాంతరం చెందిన మొక్కల వల్ల కలిగే కొన్ని జీవ భద్రతా సమస్యలు ఏవి? [AP MAY-22] [AP MAY-19][AP MAR-17][AP,TS MAR-16]
జవాబు:
జన్యుపరంగా రూపాంతరం చెందిన మొక్కల వల్ల కలిగే కొన్ని జీవభద్రతా సమస్యలు:

  1. మానవుల్లోనూ మరియు జంతువుల్లోనూ అలర్జీలు (లేదా) టాక్సిన్స్ బదిలీ అయి ఇతర సమస్యలు ఏర్పడే అవకాశం.
  2. కూరగాయల మౌలికమైన సహజత్వంలో మార్పు జరిగే ప్రమాదం.
  3. జీవవైవిధ్యానికి హానికరమైన ప్రభావాన్ని చూపి వాతావరణం మీద కూడా ప్రతికూల పరిస్థితులను కలుగచేసే
    అవకాశముండుట.
  4. సహజ పరిణామ క్రమంలో మార్పులు తీసుకురావచ్చు.
  5. సంబంధిత వన్యరకాలలో సహజమైన బహిస్సంకరణం ద్వారా కొత్త జన్యువుల బదిలీ జరిగినపుడు జన్యుకాలుష్యం కలిగే అవకాశముంది. దీని వలన అతి వేగంగా కలుపు వృద్ధిచెంది, అవి కలుపునాశకాలకు నిరోధకత చూపుతూ పంట మొక్కల కంటే త్వరగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది.

ప్రశ్న 3.
వీటికి సంక్షిప్త వివరణ ఇవ్వండి. [TS MAY-22][TS MAR-18,20][TS MAY-17][AP,TS MAR-15] [TS M-19]
a) Bt ప్రత్తి b) చీడ నిరోధక మొక్కలు
జవాబు:

  1. Bt ప్రత్తి ‘జన్యుపరంగా రూపాంతరం చెందిన జీవులు కలిగిన’ ప్రత్తి రకం.
  2. Bt -ప్రత్తి రకం కొన్ని రకాల బాక్టీరియమ్ల ప్రతిరంజకాలను ‘బాసిల్లస్ ధురంజియన్సిస్’ లాంటివి వినియోగించి తయారు చేసినది.
  3. ఈ బాక్టీరియమ్ ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొన్ని కీటకాలైన లెపిడాప్పిరాన్స్ (పోగాకు బడ్డ వార్మ్, ఆర్మి వార్మ్), కోలియోప్టిరాన్స్ (బీటిల్స్) మరియు డిఫ్టిరాన్స్ (ఈగలు, దోమలు) లను చంపుతుంది.
  4. Bt – ఒక ప్రత్యేక పెరుగుదల దశలో ప్రోటీన్ స్ఫటికాలను ఏర్పరుస్తుంది. ఈ స్ఫటికాలు విషపూరితమైన కీటక నాశక ప్రోటిను కల్గిఉంటాయి.
  5. Bt – టాక్సిన్ ప్రోటీన్లు ఒక నిష్క్రియాత్మక టాక్సిన్. కీటకాలు భుజించినపుడు దాని అన్నవాహికలోని క్షారగుణం గల pHలో స్ఫటికాలను కరిగించి క్రియాశీలతను సంతరించుకుంటుంది.
  6. ఈ క్రియాశీల టాక్సిన్ అన్నవాహిక మిడ్రట్లోని ఉపరిస్థర కణాలను అతుక్కుని ఉంటుంది. తరువాత ఆ కణాలు వాచి, రంధ్రాలను ఏర్పరుస్తాయి. చివరకు ఇవి విచ్ఛిన్నమై కీటకం మరణిస్తుంది.
  7. విశిష్టమైన Bt టాక్సిన్ జన్యువును బాసిల్లస్ ధురంజియన్సిస్ నుంచి వేరుపరిచి ప్రతివంటి ఎన్నో పంట మొక్కల్లో చొప్పించడం జరిగింది.
  8. అనేక Bt టాక్సీన్లు ‘కీటక సమూహ విశిష్టత’ ను కల్గి ఉంటాయి. అవి టాక్సిన్ ‘Cry’ అనే జన్యువుతో సంకేతింపబడివుంటాయి. ఉదా: Cry I Ac మరియు Cry II Ab అనే జన్యువుల ద్వారా ప్రోటీన్లు సంకేతింపబడి ప్రత్తి కాయతొలిచే పురుగులను నియంత్రిస్తాయి. Cry I Ab అనేది కార్న్ బోరర్ ను నియంత్రిస్తుంది.

b) చీడ నిరోధక మొక్కలు:

  1. జీవసాంకేతిక విధానం ద్వారా చీడల నిరోధకత కల్గిన మొక్కలను తయారు చేయవచ్చును.
  2. నెమటోడా పరాన్న జీవియైన ‘మెలోయిడిగైనీ ఇన్కాగ్నిషియా’ పొగాకు మొక్కల వేర్లలో సంక్రమించి దిగుబడిని బాగా తగ్గిస్తుంది.
  3. ఈ పీడను నివారించేందుకు గాను, ‘ RNA వ్యతికరణం’ (RNAi) అనే పద్ధతిని అవలంబించారు.
  4. RNAi పద్ధతి అనేది ఒక కణ రక్షణ పద్ధతి. దీనిలో అనువాదాన్ని నిరోధించే విశిష్ట సంపూరక mRNA అణువుల నిశబ్దం(silencing) జరుగుతుంది.
  5. అగ్రోబాక్టీరియమ్ వాహకాలనుపయోగించి, నెమటోడా విశష్ట జన్యువులను అతిధేయి (పొగాకు) మొక్కలోకి ప్రవేశపెడతారు.
  6. ఇపుడు, ఈ అతిధేయి మొక్క ఒక పరివర్తిత మొక్కగా మారుతుంది.
  7. అతిధేయి కణాల్లోకి DNAను ప్రవేశపెట్టడం వలన ‘సెన్స్’ మరియు ‘యాంటిసెన్స్’ RNA లను ఉత్పత్తి చేస్తుంది.
  8. ఈ రెండు RNAలు సంపూరకాలై ద్విసర్పిల RNA ను ఏర్పరుస్తాయి.
  9. ఇది RNAi ను ప్రారంభించి విశిష్ట mRNA ని నిష్క్రియపరిచి అనువాదం జరుపుతుంది.
  10. ఇటువంటి పరిస్ధితులలో పరాన్న జీవి పరివర్తిత మొక్కల యందు మనుగడను సాగించలేదు.
  11. ఈ విధంగా పరివర్తిత మొక్క, పరాన్నజీవి నుండి రక్షింపబడుతుంది.

ప్రశ్న 4.
హరిత విప్లవం, జన్యు విప్లవం గురించి వివరించండి.
జవాబు:
హరిత విప్లవం: వ్యవసాయ రంగం నందు అధిక దిగుబడి నిచ్చే రకాల ఉత్పత్తి మరియు వినియోగం అనేది వ్యవసాయ దిగుబడిలో గణనీయమైన మరియు అనూహ్యమైన ఉత్పత్తిని పెంచింది. దీనిని ‘హరిత విప్లవం’ అని అంటారు. నార్మన్ బోర్లాగ్ ను ‘హరిత విప్లవపితామహునిగా’ పరిగణిస్తారు.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 12 జీవ సాంకేతిక శాస్త్రం – దాని అనువర్తనాలు

Dr. M.S.స్వామినాధన్ ను భారతదేశంలో హరితవిప్లవ పితామహుడు గా పరిగణిస్తారు.
జన్యు విప్లవం: జీవ సాంకేతిక శాస్త్ర విధానమైన జన్యు ఇంజనీరింగ్ ద్వారా ఆహారోత్పత్తిని పెంచడం మరియు రసాయన ఎరువుల వాడకం తగ్గించడం సాధ్యమైనవి. దీనినే ‘జన్యువిప్లవం’ అంటారు.

  1. హరితవిప్లవం మరియు జన్యువిప్లవం రెండూ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నాయి.
  2. వ్యాధినిరోధకత, బాహ్యకారకాలు (వేడి, చలి, నీటి ఎద్దడి) ఒత్తిడిని తట్టుకునే రకాలను తయారు చేసుకోవచ్చు.
  3. జంతు వ్యాధులను నియంత్రిచుటకు పరికరాలు మరియు వ్యాక్సిన్లను తయారు చేయుట.
  4. పంటదిగుబడిని పెంచి, కోత తర్వాత జరిగేనష్టాలను తగ్గించుటకు మరియు రసాయన చీడల నాశకాల వాడకాన్ని తగ్గిస్తూ మెరుగైన పోషకాహార విలువలను అభివృద్ధి చేసే పంటలను వృద్ధి చేశారు.

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
వ్యవసాయ, ఇతర రంగాల్లో జీవసాంకేతిక శాస్త్ర అనువర్తనాల గురించి తెలపండి.
జవాబు:
వ్యవసాయ మరియు ఇతర రంగాల్లో జీవసాంకేతిక శాస్త్రం ఈ క్రింది అనువర్థనాలను ప్రదర్శిస్తుంది..

  1. వ్యవసాయ -రసాయనాలపై ఆధారపడిన వ్యవసాయం.
  2. సేంద్రియ వ్యవసాయం
  3. జన్యు ఇంజనీరింగ్ పంటల ఆధారంగా వ్యవసాయం.

GMO:

  1. GMO ఆల్ ఫ్రెడ్ అనగా జన్యుపరంగా రూపాంతరం చెందిన జీవులు.
  2. GMO లో ఒకటి లేదా కొన్ని జన్యువులు వేరే జాతికి చెందినవి ఉంటాయి.
  3. జన్యుపరంగా విభిన్న ప్రత్యేక లక్షణాలు ఉన్న రెండు జీవుల మధ్య సంకరణం జరపగా ఏర్పడిన జీవులే ‘సంకర జీవులు’
  4. GMO, హస్త కౌశలం ద్వారా సహజ జన్యు పునః సంయోజనం ద్వారా ఏర్పడిన సంకరణం.

జన్యుపరివర్తిత మొక్కల యొక్క ఉపయోగాలు:
a) వ్యాధి కారకాల చీడల నిరోధకత కల్గిన పరివర్తిత పంట మొక్కలు:

  • పరివర్తిత బొప్పాయి: ఈ మొక్క బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్కు నిరోధకతను కలిగి ఉంటుంది.
  • Bt— ప్రత్తి: ఇది కీటకాల నిరోధకతను కల్గి ఉంటుంది.
  • పరివర్తిత టమోటా మొక్కలు: ఇవి సూడోమోనాస్ అనే వ్యాధి జనక బాక్టీరియంకు నిరోధకతను కలిగి ఉంటాయి.
  • పరివర్తిత బంగాళదుంప మొక్కలు: ఇవి ఫైటోష్ణోరా అనే శిలీంధ్ర నిరోధకతను కల్గి ఉంటాయి.

b) ఆహరాన్ని ప్రత్యేక ప్రక్రియలకు గురి చేసే విధానంలో కూడా జన్యుపరివర్తిత మొక్కలు తోడ్పడుట:
జన్యుపరివర్తిత టమోటా ‘ఫ్లావర్సేవర్’ గాయాలను తట్టుకునే విధంగా ఉండి, ఆలస్యంగా పరిపక్వానికి వచ్చేవిగా ఉంచడం వీలవుతుంది.

c) మెరుగైన పోషక విలువలు కల్గిన జన్యువు ద్వారా పరివర్తిత మొక్కలు:
‘తాయిపే’ నుంచి ఉత్పన్నమైన జన్యుపరివర్తిత ‘గోల్డెన్ వరిరకం, విటమిన్-A ని సమృద్ధిగా కలిగి అంధత్వాన్ని నివారిస్తుంది.

d) సంకర జాతి విత్తనాల ఉత్పత్తికి ఉపయోగపడే జన్యు పరివర్తిత మొక్కలు:
పురుష వంధ్యత్వం కల్గిన బ్రాసికానాపస్ మొక్కలను ఉత్పత్తి చేయడం వల్ల, విపుంసీకరణ సమస్యను తొలగించి, సంకర విత్తనాలను తక్కువ ఖర్చుతో పొందే విధంగా రూపొందించారు.

e) రసాయనాలు, చలి, నీటి ఎద్దడి, ఉప్పు, ఉష్ణం మొదలైన నిర్జీవ ప్రతిబలాలను తట్టుకునే జన్యు పరివర్తిత మొక్కలు:
బాస్మతి రకం వరిలో జీవ మరియు నిర్జీవ ప్రతిబలాలను తట్టుకునే నిరోధకతను కల్పించారు.
‘రౌండ్ అప్ రెడీ సోయాబీన్’ అనే రకం గుల్మనాశకతను తట్టుకునేదిగా ఉంటుంది.

Bt ప్రత్తి

  1. Bt ప్రత్తి ‘జన్యుపరంగా రూపాంతరం చెందిన జీవులు కలిగిన’ ప్రత్తి రకం.
  2. Bt -ప్రత్తి రకం కొన్ని రకాల బాక్టీరియమ్ల ప్రతిరంజకాలను ‘బాసిల్లస్ ధురంజియన్సిస్’ లాంటివి వినియోగించి తయారు చేసినది.
  3. ఈ బాక్టీరియమ్ ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొన్ని కీటకాలైన లెపిడాప్టిరాన్స్ (పొగాకు బడ్ వార్మ్, ఆర్మి వార్మ్), కోలియోప్టిరాన్స్ (బీటిల్స్) మరియు డిప్టిరాన్స్ (ఈగలు, దోమలు) లను చంపుతుంది.
  4. Bt – ఒక ప్రత్యేక పెరుగుదల దశలో ప్రోటీన్ స్ఫటికాలను ఏర్పరుస్తుంది. ఈ స్ఫటికాలు విషపూరితమైన కీటక నాశ ప్రోటిన్ ను కల్గిఉంటాయి.
  5. Bt – టాక్సిన్ ప్రోటీన్లు ఒక నిష్క్రియాత్మక టాక్సిన్ ని భుజిస్తాయి. దాని అన్నవాహికలోని క్షారగుణం గల pHలో స్ఫటికాలను కరిగించి క్రియాశీలతను సంతరించుకుంటుంది.
  6. ఈ క్రియాశీల టాక్సిన్ అన్నవాహిక మిడ్గాట్లోని ఉపరిస్థర కణాలను అతుక్కుని ఉంటుంది. ఆ తరువాత ఆ కణాలు వాచి, రంధ్రాలను ఏర్పరుస్తాయి. చివరకు అవి విచ్ఛిన్నమై కీటకం మరణిస్తుంది.

హరిత విప్లవం: వ్యవసాయ రంగం నందు అధిక దిగుబడి నిచ్చే రకాల ఉత్పత్తి మరియు వినియోగం అనేది వ్యవసాయ దిగుబడిలో గణనీయమైన మరియు అనూహ్యమైన ఉత్పత్తిని పెంచింది. దీనిని ‘హరిత విప్లవం’ అని అంటారు. నార్మన్ బోర్లాగ్ ను ప్రపంచ ‘హరిత విప్లవపితామహునిగా’ పరిగణిస్తారు.

Dr. M.S.స్వామినాధన్ భారతదేశంలో హరితవిప్లవ పితామహుడు.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 12 జీవ సాంకేతిక శాస్త్రం – దాని అనువర్తనాలు

జన్యు విప్లవం: జీవ సాంకేతిక శాస్త్ర విధానమైన జన్యు ఇంజనీరింగ్ ద్వారా ఆహారోత్పత్తిని పెంచడం మరియు రసాయన ఎరువుల వాడకం తగ్గించడం సాధ్యమైనవి. దీనినే ‘జన్యు విప్లవం’ అంటారు.

  1. హరితవిప్లవం మరియు జన్యువిప్లవం రెండూ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నాయి.
  2. వ్యాధినిరోధకత, బాహ్యకారకాలు (వేడి, చలి, నీటి ఎద్దడి) ఒత్తిడిని తట్టుకునే రకాలను తయారు చేసుకోవచ్చు.
  3. జంతు వ్యాధులను నియంత్రిచుటకు పరికరాల మరియు వ్యాక్సిన్లను తయారు చేస్తున్నారు.
  4. పంటదిగుబడిని పెంచి, కోత తర్వాత జరిగేనష్టాలను తగ్గించుటకు మరియు రసాయన చీడల నాశకాల వాడకాన్ని తగ్గిస్తూ మెరుగైన పోషకాహార విలువలను అభివృద్ధి చేసే పంటలను వృద్ధి చేశారు.

ఇతర రంగాలు: మానవ ఇన్సులిన్ ను జీవసాంకేతిక విధానంలో పశువులు మరియు పందుల ‘క్లోమం’ నుండి ఆవిష్కరించారు. ఇన్సులిన్ నిరంతర సరఫరా మరియు సుస్థిర మార్కెట్ ధర ఈ పద్ధతి ద్వారా సాధ్యమైంది. జన్యు చికిత్స: జన్యు చికిత్సను అనువంశికంగా సంక్రమించే వ్యాధుల నివారణకు వినియోగిస్తారు. ఈ చికిత్సలో జన్యువులను కణం లేదా కణజాలంలోనికి పంపి వ్యాధిని సరి చేస్తారు.

అణునిర్ధారణ:

  1. ఒక వ్యాధిని ప్రభావాత్మకంగా గుర్తించడం నిర్ధారణ చేయడం మరియు నయం చేయడం దీని యొక్క ముఖ్య లక్ష్యం.
  2. సీరం, సాంప్రదాయ పద్ధతుల (సీరం మరియు మూత్రం మొదలైన విశ్లేషణలు) ద్వారా వ్యాధి నిర్ధారణ సాధ్యం కాదు.
  3. PCR (పాలిమరేజ్ చైన్ రియాక్షన్) ను AIDS రోగులలో HIV ని గుర్తించుటకు వినియోగిస్తారు.
  4. ELISA ఎన్ఎమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెట్ ఎసే సూత్రం ప్రకారం ప్రతిజనకం ప్రతిదేహాలను గుర్తిస్తుంది.

Leave a Comment