AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

Students get through AP Inter 1st Year Zoology Important Questions 7th Lesson పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) which are most likely to be asked in the exam.

AP Inter 1st Year Zoology Important Questions 7th Lesson పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
బొద్దింకను చీడపురుగు అని ఎందుకు అంటారు?
జవాబు:

  1. బొద్దింక ఇళ్ళలో నివసిస్తూ తన విసర్జకాలతో ఆహారమును కలుషితం చేస్తుంది. కావున దీనిని చీడపురుగు అని అంటారు.
  2. బొద్దింక అనేక బాక్టీరియ వ్యాధులను రవాణా చేస్తుంది. ఇది వ్యాధులను కలిగించే జీవులకు యాంత్రిక వాహనము,

ప్రశ్న 2.
బొద్దింకలో ఉరః ఖండితంలో ఉన్న పృష్ఠఫలకాలు తెలపండి?
జవాబు:
1. బొద్దింక యొక్క ఉరఃఖండితంలోని పృష్ఠఫలకాలు ‘బ్యాహస్థిపంజర ఫలకాలు’.

2. ఉరః పృష్ఠఫలకాలు

  1. ప్రోనోటమ్ – ప్రాగ్వక్షం పృష్ఠఫలకాలు
  2. మీసోనోటమ్ – మధ్యవక్షం పృష్ఠఫలకాలు
  3. మెటానోటమ్- అంత్యవక్షం పృష్ఠఫలకాలు

AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)
ప్రశ్న 3.
బొద్దింకల ఏయే నిర్మాణాలతో నునుపు, గరుకు తలాలపై నడుస్తుంది?
జవాబు:

  1. బొద్దింక నునుపు తలంపై ‘ప్లాంట్యులాల’ సహాయంతో నడుస్తుంది.
  2. బొద్దింక గరుకు తలంపై నభాలు, అరోలియాల సహాయంతో నడుస్తుంది.

ప్రశ్న 4.
బొద్దింక తల అమరికను హైపోగ్నాథస్ అని ఎందుకంటారు? [TS M-17]
జవాబు:

  1. బొద్దింక తల దేహనికి లంబ దిశలో ఉంటుంది. ముఖ నఖ భాగాలు క్రిందివైపుకి తిరిగి ఉంటాయి.
  2. కావున ఈ స్థితిని హైపోగ్నాధస్ అంటారు. (హైపో -క్రిందకు, గాథస్ -నఖాలు).

ప్రశ్న 5.
బొద్దింక గమనంలో త్రిపాది ఏ విధంగా ఏర్పడుతుంది?
జవాబు:

  1. బొద్దింక ఆరు కాళ్ళతో రెండు త్రిపాదులను ఏర్పరుచుకుంటుంది.
  2. నడిచేటపుడు ఒక్కొక్క త్రిపాది ఒకవైపునున్న పూర్వకాలు, పరకాలు మరోపక్కనున్న మధ్యకాలు వల్ల ఏర్పడుతుంది.

ప్రశ్న 6.
బొద్దింకలో రెక్కలు లేపడానికీ, కిందికి దించడానికీ ఉపయోగపడే కండరాలు ఏవి?
జవాబు:

  1. బొద్దింక ‘రెక్కలు లేపడం’ అనేది, ‘పృష్టోదర కండరాల సంకోచం’ వలన జరుగుతుంది.
  2. బొద్దింక ‘రెక్కలు కిందికి దించడం’ అనేది ‘పృష్ఠ ఆయుత కండరాల సంకోచం మరియు ఉదర కండరాల సడలిక’ వలన జరుగుతుంది.

ప్రశ్న 7.
బొద్దింకలోని వివిధ రక్త కోటరాలను పేర్కొనండి?
జవాబు:
బొద్దింకలో మూడు రక్త కోటరాలు ఉంటాయి. అవి.

  1. హృదయావరణ రక్తకుహరం లేదా పృష్ఠకోటరం
  2. పర్యాంతరాంగ రక్తకుహరం లేదా మధ్య కోటరం
  3. ఉదర ఫలక రక్తకుహరం లేదా ఉదర కోటరం ‘

ప్రశ్న 8.
‘కొవ్వు దేహాలు’ సకశేరుకాల కాలేయంతో ఏ విధంగా సమానం?
జవాబు:

  1. కొవ్వు దేహాలు నత్రజని వ్యర్ధాలను సేకరించి ‘యూరిక్ ఆమ్లం’ రూపంలో నిల్వ ఉంచుతాయి.
  2. ‘సకశేరుకాల కాలేయం’ అమ్మోనియాను సేకరించి ‘ఆర్నిథైన్’ చక్రం ద్వారా ‘యూరియా’ గా మారుస్తుంది.
  3. ఈ రెండు అవయవాలు ‘విసర్జన’ లో సహాయపడతాయి. ఈ విధాన పరంగా ఈ రెండూ సమానం.

ప్రశ్న 9.
బొద్దింక ఆహారనాళంలో ఏ భాగం పెరిట్రాఫిక్ త్వచాన్ని స్రవిస్తుంది?
జవాబు:
బొద్దింక యొక్క ‘ఆద్యముఖ కవాటం’ ‘పెరిట్రాఫిక్ త్వచం’ను స్రవిస్తుంది. ఇది ఆహారాన్ని ‘ఆహరపు ముద్ద’ గా చేస్తుంది.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 10.
బొద్దింక ఆహారనాళంలోని ఏ భాగం నీటిని పునః శోషణ చేస్తుంది?
జవాబు:

  1. బొద్దింక అంత్యాహరనాళంలోని ‘పురీషనాళం ‘ నీటిని పునః శోషణ చేస్తుంది.
  2. పురీషనాళం యొక్క లోపలి తలంలో ఆరు నిలువు కైటినస్ ముడతలు ఉంటాయి.
  3. అవి జీర్ణం కాని ఆహర పదార్ధం నుంచి నీటిని పునః శోషణ చేయుటలో సహాయపడతాయి.

ప్రశ్న 11.
బొద్దింకలో ఆహారం కొరకడానికీ, రుచి తెలుసుకోడానికీ ఉపయోగపడే నోటి భాగాలను తెలపండి.
జవాబు:

  1. బొద్దింకలోని ‘హనువులు’ ఆహారం నములటకు సహాయపడతాయి.
  2. ఆహరాన్ని పట్టుకోవడానికి మరియు రుచిని గుర్తించడానికి పైపెదవి లోపలి తలంలో ఉండే ‘స్వార పెన్సిర్లాలు’ సహాయపడతాయి.

ప్రశ్న 12.
పక్షాకార కండరాలు అంటే ఏవి?
జవాబు:

  1. బొద్దింక రక్త ప్రసరణకు తోడ్పడే కండరాలను పక్షాకార కండరాలు అంటారు.
  2. బొద్దింక శరీరకుహరంలోని పార్శ్వతలాల్లో ‘ఒకజత త్రిభుజాకార పక్షాకార కండరాలు’ ఉంటాయి.
  3. ప్రతీ ఖండితంలో ఒకజత పక్షాకార కండరాలు ఉంటాయి. ఇవి ఒకవైపు హృదయావరణ విభాజకానికి మరియు పృష్ఠఫలకానికి అతుక్కొని ఉంటాయి.

ప్రశ్న 13.
రక్తకుహరం అంటే ఏమిటి ?
జవాబు:

  1. రక్తం (వర్ణరహిత హీమోలింఫ్) తో నిండి ఉండే ఆర్థ్రోపోడాల శరీర కుహరాన్ని ‘రక్త కుహరం’ అంటారు.
  2. ఇది సంయుక్త బీజ కుహరిక మరియు నిజశరీర కుహరంలతో ఏర్పడుతుంది.

ప్రశ్న 14.
బొద్దింకలోని మూడు కోటరాలు పరిమాణంలో సమానంగా లేవు ఎందుకు?
జవాబు:

  1. మధ్యకోటరము చాలా పెద్దది. ఎందుకంటే ఇది అనేక అంతరాంగ అవయవాలను కప్పివుంచుతుంది.
  2. పృష్ఠకోటరం చిన్నది. ఎందుకంటే ఇది హృదయమును మాత్రమే కప్పి ఉంచుతుంది. కావున దీన్ని ‘హృదయా వరణ కోటరం’ అంటారు.
  3. ఉదర కోటరం చిన్నది. ఇది నాడీదండంను కప్పి ఉంచుతుంది. కావున దీన్ని ‘పరినాడీ కోటరం’ అంటారు.
  4. ఇవి అన్నీ ఒకే పరిమాణంలో ఉండవు. కారణం: అన్నీ వేర్వేరు పరిమాణంలో ఉండే అవయవాలను కప్పి ఉంచుతాయి.

ప్రశ్న 15.
పెరిప్లానెటా రక్తాన్ని హీమోలింఫ్ /రక్తశోషరసం అని ఎందుకంటారు?
జవాబు:

  1. పెరిప్లానేటా రక్తం వర్ణరహితంగా ఉంటుంది. కారణం అందులో శ్వాసవర్ణ వర్ణిక ఉండదు.
  2. ఇది స్వేచ్ఛగా హీమోసీల్ నందు ప్రవహిస్తుంది. ఇది రక్తము మరియు శోషరసం యొక్క రెండు విధులను నిర్వహిస్తుంది. కావున దీనిని రక్తశోషరసం అని అంటారు.

ప్రశ్న 16.
పెరిప్లానెటా రక్తంలో వున్న హీమోసైట్ల విధి ఏమిటి?
జవాబు:

  1. ‘హీమోసైట్స్’ పెరిప్లానేటా యొక్క పెద్ద రక్తకణాలు. ఇవి ‘భక్షక లక్షణాన్ని’ కలిగి ఉంటాయి.
  2. ఈ హీమోసైట్స్ హానికరమైన బాక్టీరియాలను జీర్ణం చేసుకుని, ‘అంతర్గ్రహణం’ చేస్తాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 17.
పెరిప్లానెటా రక్తం శ్వాసక్రియలో ఎందుకు తోడ్పడదు?
జవాబు:

  1. పెరిప్లానేటా రక్తంలో శ్వాసవర్ణకం లేదు.
  2. కావున ఇది శ్వాసక్రియలో సహయపడదు.

ప్రశ్న 18.
పెరిప్లానెటా రక్తం యొక్క ముఖ్య విధులను తెలపండి?
జవాబు:
పెరిప్లానెటా రక్తం యొక్క విధులు:

  1. రక్తం ఆహర వాహికలో జీర్ణమైన ఆహారాన్ని శోషించుకుని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది.
  2. నత్రజని వ్యర్ధాలను వివిధ భాగాల నుంచి సేకరించి, విసర్జక అవయవాలకు చేర వేస్తుంది.
  3. ఇది బాక్టీరియాలను మరియు దెబ్బతిన్న కణజాలను స్వీకరించి దేహన్ని రక్షిస్తుంది.
  4. హర్మోను స్రావాకాలను గమ్యస్థానాలకు చేరవేస్తుంది.

ప్రశ్న 19.
బొద్దింకలో ఎన్ని శ్వాసరంధ్రాలు ఉన్నాయి? వాటి ప్రాంతాలను తెలపండి.
జవాబు:

  1. బొద్దింకలో ‘పదిజతల’ శ్వాసరంధ్రాలు ఉంటాయి.
  2. మొదటి రెండు జతలు ‘వక్ష ఖండితాల’లో, ఒకటి మధ్య వక్షంలో మరియు ఇంకొకటి ‘అంతవక్షం’లో ఉంటాయి.
  3. మిగిలిన 8 జతలు ‘ఉదరం మొదటి ఎనిమిది ఖండితాల’లో ఉంటాయి.

ప్రశ్న 20.
ట్రైకోమ్స్ అంటే ఏమిటి? వాటి విధులను తెలపండి.
జవాబు:

  1. శ్వాస రంధ్రాలపై కల చిన్నని రోమాల వంటి నిర్మాణాలను ట్రెకోమ్లు అంటారు.
  2. అవి శ్వాసక్రియలో ధూళి రేణువులులోనికి ప్రవేశించకుండా కాపాడతాయి.

ప్రశ్న 21.
బొద్దింక శ్వాసవ్యవస్థను పాలీన్యూస్టిక్, హోలోన్యూస్టిక్ వ్యవస్థ అని అంటారు. ఎందుకు? [TS M-18]
జవాబు:

  1. బొద్దింక శ్వాసవ్యవస్థలో 3 కంటే ఎక్కువ జతల శ్వాసరంధ్రాలు ఉంటాయి. కావున ఆ వ్యవస్థను పాలీన్యూస్టిక్
    అంటారు.
  2. బొద్దింకలో అన్ని శ్వాసరంధ్రాలు క్రియాత్మకంగా ఉంటాయి. కావున ఆ వ్యవస్థను హోలోన్యూస్టిక్ అని అంటారు.

ప్రశ్న 22.
ఇంటిమా అంటే ఏమిటి ?
జవాబు:
ఇంటిమా: బొద్దింక వాయునాళ కుడ్యం మూడు పొరలతో ఉంటుంది. వీటిలో లోపలి గరుకు పొరను ఇంటిమా అంటారు. ఇది వాయునాళాలలో ‘టినిడియా’ అనే సర్పిలాకార మందాన్ని ఏర్పరుస్తుంది.

ప్రశ్న 23.
బొద్దింక ఉచ్ఛ్వాస సమయంలో ఏ శ్వాసరంధ్రాలు తెరుచుకొంటాయి? ఏ శ్వాసరంధ్రాలు మూసుకొంటాయి?
జవాబు:
బొద్దింక ఉచ్ఛ్వాస సమయం నందు ‘ఉరః శ్వాసరంధ్రాలు తెరచుకొని’ మరియు ‘ఉదర శ్వాసరంధ్రాలు మూసుకుని ఉంటాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 24.
శ్వాసరంధ్రాలు తెరుచుకోవడాన్ని నియంత్రించగల కారకాలేవి?
జవాబు:
శ్వాసరంధ్రాలు మూసుకోవడం మరియు తెరచుకోవడం అనేది ‘హీమోలింఫో CO2 పీడనం’ మరియు ‘వాయు నాళాలలో O2 పీడనము’ల పై ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న 25.
బొద్దింకలో ఉచ్ఛ్వాస ప్రక్రియ నిష్క్రియాత్మకం, నిశ్వాస సక్రియాత్మకం అని నిరూపించండి?
జవాబు:

  1. బొద్దింక ఉచ్చ్వాసలో, కండరాల ‘సడలిక’ వలన గాలి తీసుకోవడం జరుగుతుంది. కావున ఉచ్చ్వాస అనేది నిష్క్రియాత్మక చర్య. ఇందులో ఎటువంటి శక్తి వినియోగించుకోబడదు.
  2. బొద్దింక నిశ్వాసలో, కండరాల ‘సంకోచం’ వలన గాలి బలంగా వదలడం జరుగుతుంది. కావున నిశ్వాస ఒక సక్రియాత్మక చర్య. ఇందులో శక్తి వినియోగించుకోబడుతుంది.

ప్రశ్న 26.
పెరిప్లానెటాలో ఆహారనాళం నత్రజని సంబంధ వ్యర్ధాలను తొలగిస్తుంది ఎందుకు?
జవాబు:

  1. బొద్దింకలో ‘నీటి సంరక్షణ’ కొరకు నత్రజని వ్యర్థాలు ఆహారనాళము ద్వారా విసర్జన చేయబడతాయి.
  2. ఈ ప్రక్రియ ‘నీటిని సంరక్షించుకొనే ఒక అనుకూలనం.

ప్రశ్న 27.
బొద్దింక అవభాసిని ఏ విధంగా విసర్జనక్రియలో తోడ్పడుతుంది?
జవాబు:
బొద్దింకలో అవభాసిని క్రమక్రమంగా విసర్జింపబడుతుంది. ఈ విధానాన్ని ‘కుబుస విసర్జన’ అంటారు. కొన్ని నత్రజని వ్యర్ధాలు అవభాసిని పై నిక్షేపం చెంది ‘నిర్మోచన’ సమయంలో తొలగించబడతాయి.

ప్రశ్న 28.
విసర్జనక్రియలో కొవ్వు దేహాలు ఏవిధంగా తోడ్పడతాయి?
జవాబు:
కొవ్వు దేహాలు ‘యూరేట్ కణాల’ను కలిగి ఉంటాయి. ఇవి ‘యూరిక్ ఆమ్లం’ ను శోషించి నిల్వచేస్తాయి. కావున కొవ్వుదేహాలు కూడా విసర్జనలో పాత్రను పోషిస్తాయి.

ప్రశ్న 29.
‘నిల్వ విసర్జనక్రియ’ అంటే ఏమిటి? [TS M-17,18]
జవాబు:
బొద్దింక యొక్క కొవ్వు దేహలలో ఉన్న యూరేట్ కణాలు, యూరిక్ ఆమ్లంను జీవితకాలం శోషిస్తాయి మరియు నిల్వచేస్తాయి. ఈ విధమైన నిల్వ పద్ధతిని ‘నిల్వ విసర్జన’ అంటారు.

ప్రశ్న 30.
బొద్దింకలో గల ఏ నిర్మాణం జ్ఞాన, వినాళ కేంద్రంగా పనిచేస్తుంది?
జవాబు:
బొద్దింక యొక్క మెదడు ‘జ్ఞాన మరియు అంతస్రావక కేంద్రము’గా పనిచేస్తుంది.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 31.
స్కోలోపీడియా, సెన్సిల్లే మధ్య భేదాలను తెలపండి?
జవాబు:
స్కోలోపీడియా

  1. స్కోలో పీడియా అనేవి కార్డేటోనల్ అవయవాల యొక్క యాంత్రిక గ్రాహకాల యొక్క అధో అవభాసీని ప్రమాణాలు
  2. ఇవి బాహ్యచర్మం దిగువున ఉంటాయి.

సెన్సిల్లే

  1. సెన్సిల్లే అనేవి అవభాసీనీ గ్రాహకాలు మరియు రసాయన గ్రాహకాల ప్రమాణాలు.
  2. ఇవి బాహ్యచర్మం ఎగువలో ఉంటాయి.

ప్రశ్న 32.
బొద్దింక నేత్రాంశం, దివాచర కీటకం కంటే ఏ విధంగా భిన్నమైంది?
జవాబు:
1. బొద్దింక ఒక నిశాచర కీటకం. దీనిలో నేత్రపటల కణాలు, శంకు కణాలు మరియు స్ఫటిక శంకువుకు బాగా దిగువన ఉంటాయి. నేత్ర పటల వర్ణకాచ్ఛాదం ఉండదు. ప్రక్క ప్రక్క నేత్రాంశాల కాంతి కిరణాలు ఒకదానిపై ఒకటి పడతాయి( overlap). కావున ఇవి సూపర్ పొజిషన్ ప్రతిబింబాన్ని (అస్పష్టప్రతిబింబం) ఏర్పరుస్తాయి.

2. దివాచర కీటకాలైన ఈగలలో, నేత్రపటలకణాలు శయ కణాలు మరియు స్ఫటిక శంకువుకు దగ్గరలో ఉంటాయి. నేత్రపటల వర్ణకాచ్ఛాదం నేత్రపటాల కణాలను ఆవరించి ఉంటుంది. ప్రక్క ప్రక్క నేత్రాంశాల కాంతి కిరణాలు ఒకదానిపై ఒకటి పడవు. కావున ఇవి స్పష్టమైన ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి .

ప్రశ్న 33.
ఏ ఉదర నాడీసంధి అతిపెద్దది? ఎందుకు?
జవాబు:

  1. బొద్దింకలో ఆఖరిదైన 6వ ఉదర నాడీసంధి అతి పెద్దది.
  2. ఎందుకనగా ఇది 7వ, 8వ, 9వ మరియు 10వ ఉదర నాడీ సంధుల కలయిక వలన ఏర్పడినది.

ప్రశ్న 34.
బొద్దింక సంయుక్త నేత్రం నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం పేరు తెలపండి. ఒక సంయుక్త నేత్రంలో అలాంటి ప్రమాణాలు ఎన్ని ?
జవాబు:

  1. బొద్దింక సంయుక్త నేత్రం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం ‘నేత్రాంశము’.
  2. ప్రతి సంయుక్త నేత్రంలో 2000 నేత్రాంశాలుంటాయి.

ప్రశ్న 35.
బొద్దింక మెడడును ప్రధాన జ్ఞానకేంద్రం అని ఎందుకంటారు?
జవాబు:
బొద్దింక మెదడులో మూడు లంబికలు ఉంటాయి.

  1. ‘ప్రోటోసెరిబ్రం’ నేత్రాల నుండి జ్ఞాన ప్రచోదనాలను గ్రహించును.
  2. ‘డ్యుటే సెరిబ్రం’ స్పర్శశృంగాల నుండి జ్ఞాన ప్రచోదనాలను గ్రహించును.
  3. ‘ట్రైటోసెరిబ్రం’ పై పెదవి నుండి జ్ఞాన ప్రచోదనాలను గ్రహించును. కనుక బొద్దింక మెదడును ప్రధాన జ్ఞానకేంద్రము అంటారు.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 36.
ఎప్పొజిషన్, సూపర్ పొజిషన్ ప్రతిబింబాల మధ్య భేదం తెలపండి.
జవాబు:
ఎప్పొజిషన్ ప్రతిబింబము

  1. దివాచర కీటకాలైన ఈగలలో ఎప్పొజిషన్ ప్రతిబింబాలు ఏర్పడతాయి.
  2. పూర్తి ప్రతిబింబము అనేక సూక్ష్మ మొజాయిక్ ప్రతిబింబాల కలయికతో ఏర్పడుతుంది.
  3. ఇది స్పష్టమైన ప్రతిబింబము.

సూపర్ పొజిషన్ ప్రతిబింబము

  1. నిశాచర కీటకాలైన బొద్దింకలలో సూపర్ పొజిషన్ ప్రతిబింబాలు ఏర్పడుతాయి.
  2. అనేక ప్రతిబింబాల చేరిక వలన ఇది ఏర్పడుతుంది.
  3. ఇది అస్పష్ట ప్రతిబింబము

ప్రశ్న 37.
మగ, ఆడ బొద్దింకల మధ్య భేదాలను తెలిపే లక్షణాలను పేర్కొనండి.
జవాబు:

  1. మగ బొద్దింకలలో అండనిక్షేపకం ఉండదు, కాని ఆడబొద్దింకలలో ఉంటుంది.
  2. మగ బొద్దింకలలో పాయుశుకాలు ఉంటాయి, కాని ఆడబొద్దింకలలో ఇవి ఉండవు.
  3. మగబొద్దింకకు ఉదరం సన్నగా మరియు పొడవుగా వుంటుంది. కాని ఆడబొద్దింకకు ఉదరము పొట్టిగా మరియు వెడల్పుగా ఉంటుంది.

ప్రశ్న 38.
బొద్దింకలో గల మష్రూమ్ (పుట్టగొడుగు) గ్రంథి విధి ఏమిటి?
జవాబు:

  1. మష్రూమ్ గ్రంథి అదనపు ప్రత్యుత్పత్తి గ్రంధిలాగా పనిచేస్తుంది.
  2. శుక్రగుళిక లోపలి పొర ఏర్పాటులో సహాయం చేస్తుంది. ఇది శుక్రకణాలకు పోషణనిస్తుంది.

ప్రశ్న 39.
మష్రూమ్ గ్రంథి యొక్క యుట్రిక్యులై మేజోర్స్, యుట్రికులై బ్రివోర్స్ విధులను పోల్చండి.
జవాబు:

  1. యుట్రికులై మేజోర్స్ పొడవైన సన్నటి పరిధీయ నాళికలు. ఇవి శుక్రగుళిక యొక్క లోపలి పొరను ఏర్పరుస్తాయి.
  2. యుట్రికులై బ్రివోర్స్ పొట్టిగా వున్న కేంద్రక నాళికలు, ఇవి శుక్రకణాలకు పోషణనిస్తాయి.

ప్రశ్న 40.
ఫెలోమియర్లు అంటే ఏమిటి?
జవాబు:

  1. ఫెలోమియర్లు మగ బొద్దింక యొక్క బాహ్యజననాంగాలు. ఇవి పురుష జనన రంధ్రం చుట్టూ ఆవరించి ఉంటాయి.
  2. ఫెలోమియర్లు సంపర్కంలో సహాయపడతాయి.
  3. ఇవి మూడు రకాలు. అవి: కుడి, ఎడమ మరియు ఉదర ఫెలోమియర్లు.

ప్రశ్న 41.
గొనాపోఫైసిస్ అంటే ఏమిటి?
జవాబు:

  1. గొనాఫోఫైసిస్ అనేవి ఆడ మరియు మగ బొద్దింకలు రెండింటిలోనూ ఉండే సంపర్క అంగాలు.
  2. మగ బొద్దింకలలో ఇవి ఫెలోమియర్లు.
  3. ఆడ బొద్దింకలో జనన రంధ్రము చుట్టూ కల 3 జతల కైటినయత నిర్మాణాలే గోనాఫోఫైసిస్.
  4. ఇవి అండాలను గుడ్లకోశములోనికి పంపే అండ విక్షేపకాలు గా పనిచేస్తాయి.

ప్రశ్న 42.
పెరిప్లానెటా ప్రత్యుత్పత్తిలో కొల్లాటీరియల్ గ్రంథి ఏ విధంగా తోడ్పడుతుంది?
జవాబు:

  1. ఆడ బొద్దింక జననాశయలోనికి ఒకజత కొల్లాటీరియల్ గ్రంధులు తెరచుకుని ఉంటాయి.
  2. వీటి స్రావాలు అండాల చుట్టూ గట్టి గుడ్ల కోశమును ఏర్పాటు చేస్తాయి. దీనినే గుడ్లుచుట్టూ ఉండే ‘ఊధీకా ’ అంటారు.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 43.
పారోమెటాబోలస్ అభివృద్ధి అంటే ఏమిటి?
జవాబు:

  1. బొద్దింకలలో, సరూపశాబకం వరుసగా 13 నిర్మోచనాలు జరుపుకోవడం వలన క్రమంగా ‘రూపవిక్రియం’ జరుగుతుంది.
  2. ఈ విధంగా సరూపశాబకం ప్రౌఢజీవులుగా వృద్ధిచెందడాన్ని పారా మెటా బోలస్ అభివృద్ధి (రూపవిక్రియ ) అంటారు.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
బొద్దింక నోటి భాగాలకు చక్కని పటాన్ని గీసి, భాగాలను గుర్తించండి? [TS M-19][AP, TS M-16] [AP-18]
జవాబు:
AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 1

ప్రశ్న 2.
బొద్దింకలో జీర్ణక్రియా విధానాన్ని వివరించండి
జవాబు:
బొద్దింకలో జీర్ణక్రియా విధానం:
1. ఆహారసేకరణ:

  • బొద్దింక ఆహారమును స్పర్శశృంగాలు, అధర స్పర్శాంగాలు మరియు జంభిక స్పర్శాంగాల మీద కల ఘ్రాణ సెన్సిల్లాల సహాయంతో సేకరిస్తుంది.
  • ముందు కాళ్ల జత, ఆధారం మరియు ఓష్ఠం ద్వారా ఆహారము చిన్న ముక్కలుగా చేయబడుతుంది.
  • ఆహరాన్ని నమిలేటప్పుడు లెసీనింకు, గేలింకు, గ్లోసే మరియు పారాగ్లోసేలు సహయపడతాయి.
  • ఓష్ఠం మరియు అధరం ఆహరాన్ని కిందపడకుండా నివారిస్తాయి.
  • హనువుల ద్వారా ఆహరం నమలబడేటపుడు లాలా జలంతో కలుస్తుంది.

2. జీర్ణక్రియ:

  • నమలబడిన ఆహరం లాలాజలంతో కలిసి గ్రసని మరియు ఆహర వాహికల గుండా అన్నాశయమును చేరుతుంది.
  • అన్నాశయములో ఆహరము జీర్ణరసాలతో కలుపబడి మధ్యాంత్రములో వడపోయబడుతుంది.
  • అన్నాశయములో జీర్ణగ్రంధులు ఉండవు.
  • అన్నాశయములో ఆహరం అధికభాగం జీర్ణమవుతుంది.
  • పాక్షికంగా జీర్ణమైన ఆహరము ఆద్యముఖ కవాటము ద్వారా మధ్యాంత్రములోనికి చేరుతుంది.

3. ఎంజైముల చర్య:

  • లాలాజలంలోని అమైలేస్ ‘పిండి పదార్థాలను డైసాకరైడ్లు’గా మారుస్తుంది.
  • మధ్యాంత్రములోని ‘ఇన్వర్టేస్’ సూక్రోస్ ను గ్లూకోజ్ మరియు ఫ్రక్టోస్ గా విచ్ఛిన్నం చేస్తుంది.
  • మాల్టేస్, మాల్టోస్ను గ్లూకోస్ గా మారుస్తుంది.
  • లైపేజ్ లిపిడ్లను కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిసరాల్ గా మారుస్తుంది.
  • ప్రోటియేజ్, ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా జీర్ణంచేస్తుంది.
  • అంత్యాహరనాళంలో ఉన్న సూక్ష్మ జీవులు సెల్యులోస్ను స్రవిస్తాయి. ఇది సెల్యులోస్ను గ్లూకోజ్ మారుస్తుంది.
  • జీర్ణమైన ఆహరాన్ని ‘మధ్యంత్రం’ శోషణ చేసుకుంటుంది. జీర్ణంకాని ఆహరం పెద్ద ప్రేగును చేరుతుంది.
  • ఇక్కడ నీరు పునఃశోషణ జరుగుతుంది. మిగిలిన జీర్ణంకాని ఆహరం పొడిగా ఉండే పెంటకల (విసర్జన పదార్ధం) రూపంలో విసర్జింపబడుతుంది.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 3.
బొద్దింక లాలాజల పరికరపు చక్కని పటాన్ని గీసి భాగాలను గుర్తించండి. [APM-19,20] [AP,TS M-17]
జవాబు:
AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 2

ప్రశ్న 4.
పెరిప్లానెటా హృదయ నిర్మాణం, విధిని వివరించండి.
జవాబు:
పెరిప్లానెటా హృదయ నిర్మాణం, విధి:
AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 3

  • బొద్దింక హృదయం పృష్ఠకోటరంలో, వక్షం మరియు ఉదర పృష్ఠపలకాల దిగువన ఉంటుంది.
  • ఇది పొడవాటి, కండరయుత, సంకోచశీల నాళంగా 13 గదులను కలిగి ఉంటుంది.
  • ‘మూడు గదులు’ వక్షం నందు మరియు మిగిలిన ‘పది గదులు’ ఉదర ప్రాంతము నందు ఉంటాయి.
  • ఈ గదులకు మధ్యలో కవాటాలుంటాయి. ఇవి రక్తాన్ని పూర్వాంతము వైపుకు ప్రవహింప చేస్తాయి.
  • పరాంతము వైపు హృదయము మూసుకొని ఉంటుంది.
  • మొదటి గది పూర్వ మహధమనిగా కొనసాగుతుంది.
  • చివరిగది తప్ప, ప్రతి గదీ పరాంతపు అంచులో రెండు వైపులా రంధ్రాలుంటాయి. వీటినే ‘ఆస్టియా’ అంటారు.
  • ఈ ‘ఆస్టియా’ లకు కవాటాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని హృదయంలోకి మాత్రమే ప్రసరించేలా చేస్తాయి.

ప్రశ్న 5.
పెరిప్లానెటాలో రక్తప్రసరణ ప్రక్రియను వర్ణించండి.
జవాబు:
బొద్దింకలో రక్త ప్రసరణ విధానం:·
AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 4

  • బొద్దింకలో ప్రసరణ వ్యవస్థ అనేది ‘వివృత రకం’ వీటిలో రక్తనాళాలు ఉండవు.
  • కాని రక్త ప్రవాహలు లేదా కోటరాలు ఉంటాయి. శరీర కుహరం రక్తంలో నిండి వుంటుంది. కావున
  • శరీరకుహరాన్ని రక్తకుహరం అని మరియు రక్తాన్ని రక్తశోషరసం అని అంటారు.
  • 13 గదుల హృదయము పృష్టభాగంలో పార్శ్వఆస్ట్రియాలు మరియు కవాటాలతో ఉంటుంది.
  • హృదయము సంకోచయుతంగా మరియు కండరయుతంగా ఉంటుంది.
  • హృదయ సంకోచము వలన రక్తము ముందుకు మహధమనిలోకి అక్కడి నుంచి తల కోటరంలోకి ప్రవహిస్తుంది. రక్తం తలకోటరం నుంచి పర్యాంతరాంగ కోటరాలకు మరియు ఉదరఫలక కోటరాలకు ప్రవహిస్తుంది. పక్షాకార కండరాలు సంకోచం చెంది, హృదయావరణ విభాజికాన్ని క్రిందికి నెట్టుతాయి.
    అప్పుడు హృదయావరణ కోటర ఘనపరిమాణం పెరుగుతుంది.
  • దీని వలన ‘రక్తం’ పర్యాంతరాంగ కోటరం నుంచి హృదయావరణ కోటరంలోకి ‘హృదయావరణ విభాజకం రంధ్రాల’ ద్వారా ప్రవహిస్తుంది.
  • పక్షాకాక కండరాలు సడలించబడతాయి. హృదయావరణ కోటరం ఘనపరిమాణం తగ్గుతుంది.
  • వెంటనే రక్తం హృదయం వైపుకు ప్రవహిస్తుంది. ఇలా గుండె సంకోచనలు, ప్రసరణాలను నిరంతరంగా జరుగుతాయి.
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 5

ప్రశ్న 6.
పక్షాకార కండరాల సంకోచ సడలికలు ఏ విధంగా రక్తప్రసరణలో తోడ్పడతాయి?
జవాబు:
పక్షాకార కండరాలు మరియు రక్తప్రసరణ : బొద్దింకలో ఒక జత పక్షాకార కండరాలు త్రిభుజాకారంలో ఉంటాయి. ఇవి వెడల్పైన ఆధారంతో హృదయావరణ విభాజకానికి అంటుకొని ఉంటాయి.

  • మొనదేలిన సన్నని అంచుతో స్పష్ఠ ఫలకాలను అతుక్కొని వుంటాయి. ప్రతి ఖండితం ఒక జత ఈ కండరాలను కలిగి వుంటుంది.
  • ‘పక్షాకార కండరాల సంకోచం’ హృదయావరణ విభాజకాన్ని క్రిందకు నెట్టుతుంది.
  • ఇది హృదయావరణ కోటర ఘనపరిమాణాన్ని పెంచుతుంది.
  • రక్తం పర్యాంతరాంగ కోటరం నుంచి హృదయావరణ కోటరంలోనికి ‘హృదయావరణ విభాజక రంధ్రాల ద్వారా ప్రవహిస్తుంది.
  • పక్షాకార కండరాల ‘సడలిక’ హృదయావరణ విభాజకాన్ని మాములు స్థితికి తీసుకువస్తుంది.
    గుండె సంకోచం వల్ల రక్తం గుండెకు మహధమని ద్వారా చేరుతుంది. అక్కడి నుంచి తల కోటరానికి, పర్యాంతరంగా కోటరం మరియు ఉదర ఫలక కోటరాలకు ప్రవహిస్తుంది.

ప్రశ్న 7.
పెరిప్లానెటాలో గల వివిధ విసర్జక అవయవాలు ఏవి? విసర్జసక్రియను వివరంగా వర్ణించండి.
జవాబు:
బొద్దింక యారికోటెలిక్ జీవి. విసర్జక పదార్ధం యూరిక్ ఆమ్లం.
పెరిప్లానెటా యొక్క విసర్జక అవయవాలు:

  1. మాల్ఫీజియన్ నాళికలు
  2. కొవ్వు దేహలు
  3. యూరికోజ్ గ్రంధులు
  4. వృక్కకణాలు
  5. అవభాసిని

1. మాల్ఫీజియన్ నాళికలు: ఇవి పొడవుగా, పసుపు రంగులో శాఖారహితంగా ఉండే నాళికలు. అంత్యాహరనాళానికి పూర్వపు అంచులో అతికి ఉంటాయి. శోషరసంలోని తెరుచుకోవు కాని స్వేచ్ఛగా కదులుతుంటాయి. ఇవి 6 నుండి 8 కట్టల నాళికలు. ఒక్కొక్క కట్టయందు 15 నుండి 25 నాళికలు ఉంటాయి.

ఒక్కొక్క నాళిక ఏకస్తర గ్రంధీయ ఉపకళ లోపలి తలం ‘కంచె అంచల’ ను కలిగి ఉంటుంది. నాళిక ‘దురాగ్రభాగం’ (మూసిన అంచు) స్రావక గుణాన్ని మరియు ‘సమీపాగ్ర ప్రాంతం’ శోషణ గుణాన్ని కలిగి ఉంటాయి.

గ్రంధి కణాలు నీటిని, లవణాలను, CO2 మరియు నత్రజని వ్యర్థాలను రక్తశోషరసం నుంచి శోషణం చేసి నాళికల కుహరంలోకి స్రవిస్తాయి.
నాళికల కుహరం నుంచి సమీపాగ్ర ప్రాంత కణాలు నీటిని, కొన్ని రకాల లవణాలను పునః శోషణ చేస్తాయి.

నాళికల సంకోచం వల్ల మూత్రం శేషాంత్రికంలోనికి నెట్టబడి అధిక శాతం నీరు పునఃశోషణ చేయబడుతుంది మరియు ఘన యూరిక్ విసర్జింపబడతుంది.
ఆహారనాళం నుంచి నత్రజని వ్యర్థాలను తొలగించే ప్రక్రియ ‘నీటిని సంరక్షించుకొనే’ ఒక అనుకూలనం.

2. కొవ్వుదేహలు: కార్పోరా ఎడిపోజ్ అనేది తెల్లటి లంబికలు మరియు యూరేట్ కణాల ఉన్న దేహలు. ఇవి జీవితాంతం యూరిక్ ఆమ్లాన్ని శోషించి నిల్వ చేస్తాయి. దీనినే ‘నిల్వ విసర్జన’ అని అంటారు.

3. యూరికోజ్ గ్రంధి: ఇది మష్రూమ్ గ్రంధి యొక్క యుట్రిక్యులై మేజోర్స్. వీటిలో యూరిక్ ఆమ్లం నిల్వ ఉంటుంది. అది సంపర్క సమయంలో విసర్జింపబడుతుంది.

4. అవభాసిని: నత్రజని వ్యర్థాలు అవభాసినిపై నిక్షిప్తమై ‘నిర్మోచన సమయం’ లో తొలగించబడతాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 8.
పెరిప్లానెటా నీటిని ఏవిధంగా సంరక్షిస్తుంది? దీన్ని విసర్జసక్రియ ఆధారంగా తెలపండి.
జవాబు:
1. బొద్దింక యందు నీటి సంరక్షణ: భూచర జీవియైన బొద్దింకకు నీటి సంరక్షణ చాలా అవసరం. నీరు దేహం నుంచి పోకుండా అవభాసిని, పురీషనాళ సూక్ష్మాంకురాలు మరియు మాల్ఫీజియన్ నాళికలు నిరోధిస్తాయి. అవభాసిని ధృడంగా మరియు మైనపుయుతమై ఉంటుంది. ఇది నీరు ఆవిరి రూపంలో పోకుండా చేస్తుంది. పురీషనాళం పై ఆరు నిలువు మడతలలో పురీషనాళ సూక్ష్మాంకురాలు అమరి వుంటాయి. ఇవి జీర్ణంకాని ఆహరం నుంచి నీటిని శోషిస్తాయి.

2. మాల్ఫీజియన్ నాళికలు: ఈ నాళికలు పరీక్ష నాళిక మాదిరిగా ఉండి శేషాంత్రిక పూర్వాంతంలోనికి తెరచుకుంటాయి. మూసివున్న అంచులు రక్తశోషరసంలో తేలియాడుతుంటాయి. శేషాంత్రికంను అతికివున్న నాళిక సమీపాగ్ర భాగం నీటిని మరియు లవణాలను మూత్రం నుంచి శోషించు కుంటుంది. మిగిలిన ఘన యూరిక్ ఆమ్లం శేషాంత్రికం నుంచి విడుదల చేయబడుతుంది.

ప్రశ్న 9.
నేత్రాంశాన్ని చక్కని పటం గీసి భాగాలతో వివరించండి. [TS M-20][TS May-17][AP, TS M-15]
జవాబు:
AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 6

ప్రశ్న 10.
మగ, ఆడ బొద్దింకలను ఏ విధంగా గుర్తిస్తారు? వాటి బాహ్య అంతర జననాంగాలను, లక్షణాలను వివరించండి.
జవాబు:
1. బొద్దింక లైంగిక ద్విరూపకతను కలిగి ఉంటుంది.

  • మగ బొద్దింకలలో అండనిక్షేపకం ఉండదు, కాని ఆడబొద్దింకలలో ఉంటుంది.
  • మగ బొద్దింకలలో పాయుశుకాలు ఉంటాయి, కాని ఆడబొద్దింకలలో ఇవి ఉండవు.
  • మగబొద్దింకకు ఉదరం సన్నగా మరియు పొడవుగా వుంటుంది. కాని ఆడబొద్దింకకు ఉదరము పొట్టిగా మరియు వెడల్పుగా ఉంటుంది.

2. పురుష జననాశయం: పురుషజననరంధ్రం పరాంత ఫెలోమియర్పై ఉంటుంది. పురుష జనన రంధ్రం చుట్టూ ఉండే అసౌష్ఠవ నిర్మాణాలను గొనాపోఫైసిస్లు (లేదా) ఫెలోమియేర్లు అంటారు. ఇవి సంపర్కంలో సహయపడతాయి. ఎడమ ఫెలీమియర్ మిధ్యా మేహనం మరియు టిటిల్లేటర్లను కలిగి ఉంటుంది.

3. స్త్రీ జననాశయం: స్త్రీజీవిలో జనన కోష్టకం ఉంటుంది ఇది 7, 8 మరియు 9 ఉదరఖండితాల ఉరః ఫలకాలతో ఏర్పడుతుంది. ఏడో ఖండిత ఉరఃఫలకం పడవ ఆకారంలో ఉండి జననాశయం అడుగు మరియు పక్క భాగంలో గోడలను ఏర్పరుస్తుంది.

  • 8వ ఖండిత ఉరః ఫలకోణం జననాశయం పూర్వాంతపు గోడను ఏర్పరుస్తుంది. తొమ్మిదవ ఖండిత ఉరః ఫలకం జననాశయం పై కప్పును ఏర్పరుస్తుంది.
  • గదియొక్క వెలుపలి భాగం గైనాట్రియం మరియు పరాంతపు భాగం ‘వెస్టిబ్యులమ్’
  • స్త్రీ జనన రంధ్రం చుట్టూ మూడుజతల కైటిన్ ఫలకాలు ఉంటాయి.
  • ఇవి అండనిక్షేపకాలు మరియు అండాలకు గుడ్లుకోశంలోకి మార్గాన్ని చూపుతాయి మరియు సంపర్కంలోనూ సహకరిస్తాయి.

ప్రశ్న 11.
బొద్దింక పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను వర్ణించండి.
జవాబు:
పురుషప్రత్యుత్పత్తి వ్యవస్థ:పురుష బొద్దింకలో ఒక జత ముష్కాలు, ఒకజత శుక్రవాహికలు, మధ్యస్ధస్కలన నాళం, పుట్టగొడుగు ఆకారపు గ్రంధి, శుక్రనాళికలు, ఫేలిక్ గ్రంధి, గొనాపోఫైనిన్లుతో ఆవరించి పురుషజనన రంధ్రం ఉంటాయి.

  • ముష్కాల జత, పొడవుగా లంబిక యుతంగా 4, 5 మరియు 6 ఉదర ఖండితాలలో ఉంటాయి.
  • శుక్రవాహిక, ముష్కం నుంచి ఏర్పడిన సన్నటి గొట్టం వంటి నిర్మాణం రెండు శుక్రవాహికలు వెనక వైపుగా ప్రయాణించి ఏడో ఖండితంలోని వెడల్పైన మధ్యస్కలన నాళంలోకి తెరచుకుంటాయి.
  • పుట్టగొడుగు ఆకారపు గ్రంధి 6 మరియు 7 ఖండితాలలో ఉంటుంది. దీనియందు రెండు రకాల నాళికలు కలవు.

(a) యుట్రికులై మేజోర్స్: ఈ పొడవైన, సన్నని నాళికల పరిధీయంగా ఉంటాయి. వీటి స్రావకాలు శుక్రగుళిక యొక్క లోపలి త్వచంను ఏర్పరుస్తాయి.

(b) యుట్రికులైబ్రివోర్స్: ఇవి పొట్టిగా మధ్యభాగంలో ఉంటాయి. వీటి స్రావకాలు శుక్రకణాలకు పోషణనిస్తాయి. ఈ నాళికలు స్కలననాళిక పూర్వభాగంలోకి తెరచుకుంటాయి.
AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 7

శుక్ర నాళికల జత: ఇవి స్కలన నాళిక ఉదర తలంలో ఉంటాయి. ఇవి శుక్రకణాలను, శుక్రగుళికల రూపంలో నిల్వ ఉంచుతాయి.

పురుషజననరంధ్రం: ఇది ఉదర ఫెలోమియర్ పై ఉంటుంది.

ఫేలిక్ గ్రంది: దీని విధి తెలియదు. కాని ఇది పురుష జననరంధ్రం దగ్గర తెరచుకుంటుంది.

ఫెలోమియర్లు (గొనాఫోఫైసిన్) : మూడు అసౌష్ఠవ, కైటినస్ నిర్మాణాలు పురుష జనన రంధ్రం చుట్టూ ఉంటాయి. ఇవి సంపర్కంలో సహకరిస్తాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 12.
బొద్దింక స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్ధను వర్ణించండి
జవాబు:
1. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ: ఇది ఒక జత స్త్రీ బీజకోశాలు, బీజవాహికలు, యోని, శుక్రగ్రాహికలు, కొల్లాటీరియల్ గ్రంధులు మరియు జననాశయంను కలిగి ఉంటుంది.

2. స్త్రీ బీజకోశాలు: ఒక జత పెద్దవైన స్త్రీ బీజకోశాలు 2,3,4,5,6 ఉదర పార్శ్వఖండితాలలో కొవ్వుదేహలతో చుట్టుబడి ఉంటాయి. ప్రతి బీజకోశానికి ఎనిమిది ఒవేరియోల్స్ (లేదా) స్త్రీ బీజకోశనాళికలు ఉంటాయి. ప్రతి ఒవేరియాలు మొనదేలిఉన్న పూర్వాంత పోగు జర్మేరియమ్ మరియు వెడల్పైన పరాంత విటలేరియం ఉంటాయి. జర్మేరియమ్లో అభివృద్ధి చెందుతున్న అనేక అండదశలుంటాయి.
విటలేరియమ్లో సొనతో పాటు పరిపక్వ అండాలు ఉంటాయి.
AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 8

3. స్త్రీ బీజ వాహిక: ఒవేరియోల్లు అన్ని కలిసి పొట్టిగా, వెడల్పుగా కల స్త్రీ బీజ వాహికను ఏర్పరుస్తాయి. స్త్రీ బీజవాహికలు మధ్యలో అతిచిన్న యోనిలోకి తెరచుకుంటాయి.
యోని నిలువు రంధ్రాన్ని స్త్రీ జనరంధ్రం అంటారు.

శుక్రగ్రాహిక ఎడమవైపుతిత్తితో మరియు కుడివైపున పోగులాంటి అంధనాళాన్ని కలిగి 6వ ఖండితం నుంచి జననాశయంలోకి రంధ్రం ద్వారా తెరచుకుంటుంది.

4. కొల్లాటీరియల్ గ్రంధులు: ఒకజత కొలాటీరియల్ గ్రంథులు స్త్రీ బీజకోశాల వెనుక ఉంటాయి. ఇవి స్త్రీ జననాశయంలోకి తెరచుకుంటాయి. ఈ గ్రంధుల స్రావకాలు గుడ్లచుట్టూ ఊధీకా లేదా ధృడమైన గుడ్లపెట్టెను ఏర్పరుస్తాయి.

  • జననాశయం 7వ, 8వ మరియు 9వ ఉదరఖండితాల ఉరః ఫలకాలతో ఏర్పడుతుంది.
  • 7వ ఉరఃఫలకం జనాశయం అడుగుభాగాన్ని ఏర్పరుస్తుంది.
  • 8 వ ఉరఃఫలకం పూర్వాంతపు గోడను ఏర్పరుస్తుంది.
  • 9 వ ఉరఃఫలకం పూర్వాంతపు పైకప్పును ఏర్పరుస్తుంది.

జననాశయ పూర్వాంతము గైనాట్రియం లేదా జననకోశం పరాతము ‘వెస్టిబ్యులమ్’ లేదా గుడ్లకోశం అంటారు. గొనాపోఫెసిస్లు మూడు జతల కైటిన్ నిర్మిత ఫలకాలు, స్త్రీజనన రంధ్రం చుట్టూ ఆవరించి ఉంటాయి. అండ నిక్షేపకంగా ఉండి సంపర్కంలో సహకరిస్తాయి.

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
బొద్దింక జీర్ణవ్యవస్థను భాగాలు గుర్తించిన చక్కని పటం సహాయంతో వర్ణించండి. [AP -16, 17,20] [TS-17,18,19]
జవాబు:
బొద్దింక జీర్ణవ్యవస్థ:
AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 9
బొద్దింక జీర్ణవ్యవస్థ నందు I. ఆహార నాళం II. జీర్ణగ్రంధులు ఉంటాయి.
I. ఆహార నాళం: ఆహారనాళం నోరు, పాయువుల వరకు విస్తరించి ఉంటుంది. ఇది మూడు ప్రాంతాలుగా విభజించబడింది. అవి
(a) పూర్వాహార నాళం
(b) మధ్యాహరనాళం
(c) అంత్యాహరనాళం

(a) పూర్వాహార నాళం (ఆద్యముఖం):

  • పూర్వాహరనాళంలో గ్రసని, ఆహరవాహిక, అన్నాశయం మరియు అంతర జఠరం ఉంటాయి.
  • గ్రసని చిన్న గొట్టం వంటిది. ఇది సన్నని గొట్టం లాంటి ఆహరవాహికలోకి తెరుచుకుంటుంది.
  • ఆహారవాహిక సంచిలాంటి అన్నాశయం లోనికి తెరుచుకుంటుంది. ఇది జీర్ణం కొరకు ఆహారాన్ని నిల్వ ఉంచుతుంది. దీని వెలుపలి తలం ‘వాయు నాళాల జాలకం’ తో ఆవరించబడి ఉంటుంది.
  • అన్నాశయానికి పరభాగంలో కండరాలతో కూడిన మందమైన గోడలు గల అంతర జఠరం ఉంటుంది.
  • అంతరజఠరం లోపలి కైటిన్ పొర ‘ఆరు శక్తివంతమైన దంతాలను’ కలిగి ఉంటుంది.
  • ఈ దంతాలు ప్రభావవంతమైన ‘నమిలే పరికరం’గా ఏర్పడతాయి.
  • కావున అంతర జఠరం ‘పిండిమర’లాగా మరియు జల్లెడగా పని చేస్తుంది.
  • అంతర జఠరం నుంచి ఏర్పడిన త్వచ నిర్మాణం, మధ్యాంత్రం వరకు ఒక గరాటులా ఏర్పడుతుంది. దీనినే ఆద్యముఖ కవాటం అంటారు.
  • మధ్యాంత్రం చేరిన ఆహారం తిరిగి అంతర జఠరంలోకి ప్రవేశించకుండా కవాటం నివారిస్తుంది.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

(b) మధ్యాహరనాళం (మధ్యాంత్రం):

  • ఇది ఒక్క సన్నటి కురచ గొట్టం.
  • మధ్యాహర నాళం పరాంతంలో 6 నుంచి 8 వేళ్ళలాంటి అంధభాహువులు కలవు. వీటిని కాలేయాంధ నాళాలు అంటారు.
  • ఈ నాళాలు జీర్ణమైన ఆహరపదార్థాల నుంచి ‘జీర్ణం మరియు శోషణ’ చేయుటకు సహాయపడతాయి.
  • మధ్యాహరనాళం పరాంతం శోషణ మరియు ‘పూర్వాంతం స్రావకం’ చేస్తుంది.
  • స్రావక భాగం ఎంజైమ్లను స్రవిస్తుంది.
  • మధ్యాహారనాళం స్రవించిన రంధ్రయుతమైన కైటిన్ పొర మరియు పెరిట్రాఫిక్ త్వచం ‘ఆహారపు ముద్దను’ ఆవరించి ఉంటాయి.
  • గట్టిగా ఉన్న ఆహార రేణువుల వల్ల మధ్యాంత్ర కూడ్యం దెబ్బతినకుండా పెరిట్రాఫిక్ త్వచం రక్షిస్తుంది.

(c) అంత్యాహరనాళం (పాయుపధం):

  • ఇది పొడవైన మెలికలు తిరిగిన నాళం.
  • అంత్యాహరా నాళం ‘శేషాంత్రికం, పెద్దపేగు మరియు పురుష నాళం’గా విభజించబడి ఉంటుంది.
  • మధ్యాంతం మరియు అంత్యాహారనాళానికి మధ్య ఉన్న రంధ్రాన్ని ‘సంవరణి కండరం’ అంటారు.
  • ఈ సంవరణి కండం జీర్ణం కాని ఆహారాన్ని మరియు యూరిక్ ఆమ్లాన్ని అంత్యాహరనాళం నుంచి
  • మధ్యాంత్రంలోకి ప్రవేశించకుండా నివారిస్తుంది.
  • ‘శేషాంత్రికం’ దాని యొక్క పరాంతంలో అమరి ఉన్న మాల్ఫీజీయన్ నాళికల నుంచి యూరిక్ ఆమ్లాన్ని గ్రహిస్తుంది. కోలాన్ లేదా పెద్ద పేగు పొడవైన మెలికలు తిరిగిన నాళం. ఇది పొట్టిగా మరియు వెడల్పుగా ఉన్న పురీషనాళంలోకి తెరుచుకుని, పాయువు ద్వారా బయటకి తెరుచుకుంటుంది.
  • పురీషనాళం ఆరు నిలువు మడతలను కల్గి ఉంటుంది. వీటిని పురీషనాళ సూక్ష్మాంకరాలు అంటారు. ఇవి
  • జీర్ణం కాని ఆహారపదార్ధం నుంచి నీటిని శోషించుకుంటాయి.
  • అంత్యాహరనాళ లోపలితలాన్ని ఆవరించి అవభాసిని ఉంటుంది.

II. బొద్దింక యొక్క జీర్ణగ్రంధులు:
(a) లాలాజల గ్రంధులు
(b) కాలేయాంధ నాళాలు
(c) మధ్యాంత్రంలోని గ్రంధికణాలను కల్గి ఉంటాయి.

(a) లాలాజల గ్రంధులు:

  • ఒక జత లాలజల గ్రంధులు ‘అన్నాశయానికి’ ఇరువైపులా అమరి ఉంటాయి.
  • ఒక్కొక్క లాలాజల గ్రంధిలో రెండు లంబికాలు ఉంటాయి.
  • ఒక్కొక్క లంబికలో ‘ఎసినై’ అనబడే అనేక సూక్ష్మ లంబికలు ఉంటాయి.
  • ప్రతి ‘ఎసినస్’ స్రావక కణాలైన ‘జైమోజన్ కణాలను’ కలిగి ఉంటుంది.
  • అన్ని జైమోజన్ కణాలు నాళికలతో కలుపబడి ఉంటాయి.
  • ఈ నాళికలు అన్ని కలిసి ఐక్యలాలాజల నాళంలోనికి తెరుచుకుంటాయి.
  • రెండు ఐక్య లాలాజల నాళాలు కలిసి మధ్య లాలాజల నాళంగా ఏర్పడతాయి.
  • లాలాజలాన్ని నిలువ కొరకు ఒక జత లాలాజలాశయం ఉంటుంది.
  • లాలాజలాశయ నాళాలు రెండూ కలిసి ఐక్య లాలాజలాశయనాళంగా ఏర్పడతాయి.
  • మధ్య లాలాజలనాళం, ఐక్య లాలాజలనాళాంతో కలిసి అపవాహి లాలాజనాళంగా ఏర్పడతాయి.
  • అపవాహి లాలాజలనాళం ‘అధోగ్రసని పీఠభాగం’ వద్ద తెరచుకుంటుంది.
  • జైమోజన్ కణాలు స్రవించే లాలాజలంలో పిండి పదార్థాలను జీర్ణం చేసే ‘అమైలోస్ ఎంజైమ్’ ఉంటుంది.

(b) కాలేయాంధనాళాలు: 6 నుండి 8 వేళ్ళ లాంటి అంధబాహువులను కాలేయంధనాళాలు అంటారు. ఇవి స్రావక మరియు శోషణ కణాలను కల్గి ఉంటాయి.

(c) మధ్యాంత్ర గ్రంధికణాలు: మధ్యాంత్ర గ్రంధికణాలు ‘మాల్టోస్, ఇన్వర్టేస్, ప్రోటిమేజెస్ మరియు లైపేస్ ఎంజైము’లను స్రవిస్తాయి.
AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 10

ప్రశ్న 2.
పెరిప్లానెటా రక్తప్రసరణవ్యవస్థను వివరంగా వర్ణించి, చక్కని పటాన్ని గీసి భాగాలను గుర్తించండి. [AP May-17,18] [ TS M-16,20] [AP M-15,18]
జవాబు:
పెరిప్లానెటా యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ:
AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 11

రక్త ప్రసరణ వ్యవస్థ జీర్ణమైన ఆహారాన్ని, హార్మోనులను దేహంలోని ఒక భాగం నుంచి మరొక భాగానికి రవాణా చేస్తుంది.

‘రక్తం’ రక్తకుహరంలోని ఖాళీలో స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. ఇటువంటి రక్త ప్రసరణ వ్యవస్థను వివృత రకం అంటారు. రక్త ప్రసరణ వ్యవస్థలోని మూడు ముఖ్యమైన భాగాలు
(a) రక్తకుహరం
(b) గుండె
(c) రక్తం

AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

(a) రక్తకుహరం:
ఇది ‘రెండు కండరయుత అడ్డు త్వచాలతో పృష్ఠవిభాజక పటలం’ మరియు ఉదర విభాజకం అనే మూడు
కోటరాలుగా విభజించబడింది.

  • రెండు విభాజక పటలాలకు ‘కవాటయుత రంధ్రాలు’ ఉంటాయి.
  • ఒక జత త్రిభుజాకార కండరాలు ఒక శ్రేణిలో అమరి ఉంటాయి. వీటినే పక్షాకార కండరాలు అంటారు.
  • ఇవి దేహంలోని ప్రతి ఖండితానికి పార్శ్వతలాల్లో అమరి ఉంటాయి.
  • పృష్ఠ విభాజక పటలం, హృదయావరణ కోటరం మరియు పర్యాంతరాంగ కోటరం మధ్య విస్తరించి ఉంటుంది. ఉదర విభాజక పటలం పర్యాంతరాంగ కోటరం మరియు పరినాడీ కోటరం మధ్య విస్తరించి ఉంటుంది.
  • గుండెను ఆవరించి హృదయావరణ కోటరం ఉంటుంది.
  • పర్యాంతరాంగ కోటరం, అంతరాంగ అవయవాలను ఆవరించి ఉంటుంది.
  • పరినాడీ కోటరం, ఉదరనాడీ దండంను ఆవరించి ఉంటుంది.
  • పర్యాంతరాంగ కోటరం పెద్దది మరియు మిగిలిన రెండు కోటరాలు చిన్నవి.

(b) హృదయం:
హృదయం పృష్ఠయుత భాగంలో ఉంటుంది. ఇది పృష్ఠకోటరంతో ఆవరించి ఉన్న పృష్ఠఫలకాల దిగువన ఉంటుంది. ఇది పొడవాటి, కండరయుత, సంకోచశాల 13 గదుల నాళం.

  • ప్రతీ గది దాని పరాంతర గదిలోకి కవాటయుత రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది.
  • హృదయం యొక్క పూర్వాంతం మూసుకొని ఉంటుంది.
  • చివరి గది తప్ప ప్రతి గది పరాంతపు అంచులో ‘ఆస్టియా’ అనే ఒక జత చిన్న కవాటయుత రంధ్రాలుంటాయి. ఇవి రెండు వైపులా ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి.
  • కవాటాలు పృష్ఠకోటరం నుంచి హృదయంలోకి మాత్రమే రక్తం ప్రసరించేలా అనుమతిస్తాయి.

(c) రక్తం (రక్తశోషరసం):

  • పెరిప్లానెటా రక్తం వర్ణరహితం మరియు దీనిని రక్త శోషరసం అంటారు.
  • ఇది జీవద్రవ్యం మరియు ‘భక్షక లక్షణాన్ని’ కలిగిన హీమోసైట్లను కల్గి ఉంటుంది.
  • రక్తంలో ఎటువంటి శ్వాసవర్ణకం ఉండదు. కావున ఇది శ్వాసక్రియలో ఎటువంటి ముఖ్య పాత్రను పోషించదు.

రక్తం యొక్క ముఖ్యమైన విధులు:

  • రక్తం జీర్ణమైన ఆహారంను శోషిస్తుంది మరియు సరఫరా చేస్తుంది.
  • ఇది నత్రజని సంబంధిత వ్యర్థాలను దేహంలో ఉండే అన్ని భాగాల నుండి విసర్జక అవయవాలకు తీసుకొస్తుంది. రక్షక భక్షకకణాలను వ్యాధి సాంక్రమిక ప్రదేశాలకు చేరవేస్తుంది.
  • ఇది హార్మోనులను వాటి లక్ష్య అవయవాలకు రవాణా చేస్తుంది.

రక్త ప్రసరణ:
హృదయ గదుల సంకోచం వల్ల రక్తం గుండె నుండి మహధమనిలోకి ప్రవహించి అక్కడి నుండి తలకోటరానికి ప్రవహిస్తుంది. తలకోటరం నుంచి పర్యాంతరాంగ కోటరం మరియు పరినాడీ కోటరంకు రక్తం ప్రవహిస్తుంది. పక్షాకార కండరాల సంకోచంతో హృదయావరణ విభాజకం కిందికి నెట్టబడుతుంది. రక్తం హృదయావరణ కోటరంలోకి ప్రవహిస్తుంది.
పక్షాకార కండరాల సడలిక వల్ల, హృదయావరణ విభాజకం పైకి కదిలి రక్తాన్ని గుండెకు నెడుతుంది మరియు ప్రసరణ నిరంతరంగా కొనసాగుతుంది.

ప్రశ్న 3.
బొద్దింకల శ్వాసవ్యవస్థను భాగాలు గుర్తించిన చక్కని పటం సహాయంతో వర్ణించండి. [AP M-19][AP-18]
జవాబు:
బొద్ధంక యొక్క శ్వాసవ్యవస్థ:
AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 12
బొద్దింక శ్వాసవ్యవస్థను, శ్వాసనాళ వ్యవస్థ అని అంటారు.
ఇందులో భాగాలు (a) శ్వాసరంధ్రాలు (b) వాయునాళాలు (c) వాయునాళికలు

(a) శ్వాసరంధ్రాలు:

  • శ్వాసనాళ వ్యవస్థ యొక్క బాహ్యరంధ్రాలను శ్వాసరంధ్రాలు అంటారు.
  • బొద్దింకలో 10 జతల శ్వాసరంధ్రాలు ఉంటాయి.
  • మొదటి రెండు జతల శ్వాసరంధ్రాలు వక్షఖండితాలలో ఉంటాయి.
  • మిగిలిన 8 జతలు ఉదరఖండితాలలో ఉంటాయి.
  • ఈ రంధ్రాలు పార్శ్వవలకాలలో ఉంటాయి.
  • బొద్దింక యొక్క శ్వాసవ్యవస్థను పాలీన్యూస్ట్రిక్ (మూడు జతల శ్వాసరంధ్రాల కంటే ఎక్కువ కలిగి ఉండటం) మరియు హాలోన్యూస్టిక్(శ్వాసరంధ్రాలన్నీ క్రియాత్మకం)గా నిర్వచించవచ్చును.
  • అన్ని శ్వాసరంధ్రాలు కవాటయుతం. ప్రతి రంధ్రానికి బట్టి కైటిన్తో తయారైన పెరిట్రీమ్ ఊతంగా ఉంటుంది.
    గాలిలోని ధూళి రేణువులు నివారించేందుకు శ్వాసరంధ్రాలకు చిన్న రోమాలు (ట్రైకోమ్లు) ఉంటాయి.

(b) వాయునాశాలు:

  • ప్రతిశ్వాసరంధ్రం లోపలివైపుకి ‘ఏట్రియమ్’ అనే గదులు ద్వారా తెరుచుకుంటుంది. వక్షభాగంలోని ‘ఏట్రియా’ నుంచి అనేక క్షితిజ సమాంతర నాళాలు ఏర్పడతాయి.
  • ఇవి అన్ని కలుసుకుంటూ పృష్ఠశిరోనాళాలు మరియు ఉదర శిరోనాళాలను ఏర్పరుస్తాయి.
  • ఈ నాళాల శాఖలన్ని తలలోని వివిధ అవయవాలను చేరుతాయి. పార్శ్వఆయత శ్వాసనాళాలు కూడా ఉంటాయి.
  • ప్రతి ఉదర ఏట్రియమ్ నుంచి మూడు వాయునాళాలు ఉత్పన్నమవుతాయి.
  • ఈ నాళాలన్నీ మూడు ఆయత నాళాల్లోకి అనగా పృష్ఠ, పార్శ్వ మరియు ఉదర ఆయత నాళాల్లోకి తెరుచుకుంటాయి.
  • రెండు వైపులా ఉన్న ప్రధాన ఆయత నాళాలను కలుపుతూ సంధాయక నాళాలుంటాయి.
    వాయునాళ్ళకుడ్యం మూడు పొరలను కలిగి ఉంటుంది. అవి:
    (i) వెలుపలి ఆధార త్వచం
    (ii) మధ్య ఉపకళ
    (iii) లోపలి ఇంటిమా అనే అవభాసినిస్తరం.
  • ‘ఇంటి’, నీడియా అనే సర్పిలాకారా మందాలను ఏర్పరుస్తుంది.
  • గాలిలేని సమయంలో వాయునాళాలలో ముకుశించపోకుండా ‘టినీడియా’ కాపాడుతుంది.

(c) వాయునాళికలు:

  • వాయునాళం చివరి కణాన్ని ట్రాకియోబ్లాస్ట్ అంటారు. దీనిలో చాలా కణాంతస్థ వాయునాళ అంత్యాలు ఉంటాయి.
  • ఇంటిమా మరియు టినీడియా వాయు నాళికలకు ఇంటిమా, టినీడియా ఉండవు. వీటిని లోపల పొరలు ట్రేకిన్ అనే ప్రోటిన్తో కప్పబడి ఉంటాయి.
  • వాయునాళికలు, వాయునాళికా ద్రవంతో నిండి ఉంటాయి.
  • విధానం: శ్వాసక్రియలో రెండు ప్రక్రియలు ఉంటాయి అవి: ఉచ్ఛ్వాసం మరియు నిశ్వాసం
  • ‘పృష్టోదర మరియు ఉదర ఆయతకండరాలు’ శ్వాసక్రియలో తోడ్పడతాయి.
  • ఉచ్ఛ్వాసం: గాలి లోపలికి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు.
  • పృష్టోదర కండరాల సడలిక వల్ల శరీర ఘనపరిమాణం పెరుగుతుంది. అప్పుడు గాలి వాయునాళాలను చేరి మరియు కండరాలను చేరుతుంది.
  • ఉచ్ఛ్వాస సమయంలో వక్షంలోని శ్వాసరంధ్రాలు తెరచుకొని, ఉదరంలోని శ్వాస రంధ్రాలు మూసుకొని ఉంటాయి. ఉచ్ఛ్వాస ఒక నిష్క్రియ చర్య (శక్తి అవసరం లేదు)
  • నిశ్వాసం: గాలిని బయటికి పంపడాన్ని నిశ్వాసం అంటారు.
  • నిశ్వాసం సమయంలో వక్షంలోని శ్వాసరంధ్రాలు మూసుకొని ఉంటాయి మరియు ఉదర శ్వాసరంధ్రాలు తెరుచుకొంటాయి.
  • నిశ్వాస ఒక సక్రియాత్మక చర్య. ఇది శక్తిని వినియోగించుకుంటుంది.
  • శ్వాసరంధ్రాలు తెరచుకోవడం మరియు మూసుకోవడం అనేది ‘హీమోలింఫ్ లోని CO2 పీడనం మరియు వాయునాళంలోని O2 పీడనం’ పై ఆధారపడి ఉంటుంది.
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 14

AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 4.
పెరిప్లానెటా ప్రత్యుత్పత్తి వ్యవస్థ వివరించి, చక్కని పటాన్ని గీసి భాగాలను గుర్తించండి.
జవాబు:
బొద్దింక ప్రత్యుత్పత్తి వ్యవస్థ: బొద్దింక ఏకలింగజీవి. ఇది లైంగిక ద్విరూపకతను ప్రదర్శిస్తుంది. మగజీవులకు ఒకజత పాయుశూకాలు ఉంటాయి. ఇవి ఆడజీవిలో ఉండవు. మగజీవికి సన్నని ఉదరం, ఆడజీవికి వెడల్పైన ఉదరం ఉంటాయి.
ఆడజీవికి జననకోష్ఠకం ఉంటుంది. కాని మగజీవిలో ఉండదు.

1. పురుషప్రత్యుత్పత్తి వ్యవస్థ: పురుష బొద్దింకలో ఒక జత ముష్కాలు, ఒకజత శుక్రవాహికలు, మధ్యస్ధస్కలన నాళం, పుట్టగొడుగు ఆకారపు గ్రంధి, శుక్రనాళికలు, ఫేలిక్ గ్రంధి, గొనాపోఫైనిన్లుతో ఆవరించి పురుషజనన రంధ్రం ఉంటాయి.

ముష్కాల జత, పొడవుగా లంబిక యుతంగా 4, 5 మరియు 6 ఉదర ఖండితాలలో ఉంటాయి.

శుక్రవాహిక, ముష్కం నుంచి ఏర్పడిన సన్నటి గొట్టం వంటి నిర్మాణం రెండు శుక్రవాహికలు వెనక వైపుగా ప్రయాణించి ఏడో ఖండితంలోని వైడల్పైన మధ్యస్కలన నాళంలోకి తెరచుకుంటాయి.

పుట్టగొడుగు ఆకారపు గ్రంధి 6 మరియు 7 ఖండితాలలో ఉంటుంది. దీనియందు రెండు రకాల నాళికలు కలవు.

(a) యుట్రికులై మేజోర్స్: ఈ పొడవైన, సన్నని నాళికల పరిధీయంగా ఉంటాయి. వీటి స్రావకాలు శుక్రగుళిక యొక్క లోపలి త్వచంను ఏర్పరుస్తాయి.

(b) యుట్రికులైబ్రివోర్స్: ఇవి పొట్టిగా మధ్యభాగంలో ఉంటాయి. వీటి స్రావకాలు శుక్రకణాలకు పోషణనిస్తాయి. ఈ నాళికలు స్కలననాళిక పూర్వభాగంలోకి తెరచుకుంటాయి.

శుక్ర నాళికల జత: ఇవి స్కలన నాళిక ఉదర తలంలో ఉంటాయి. ఇవి శుక్రకణాలను, శుక్రగుళికల రూపంలో నిల్వ ఉంచుతాయి.

పురుషజననరంధ్రం: ఇది ఉదర ఫెలోమియర్ పై ఉంటుంది.

ఫేలిక్ గ్రంది: దీని విధి తెలియదు. కాని ఇది పురుష జననరంధ్రం దగ్గర తెరచుకుంటుంది.

ఫెలోమియర్లు (గొనాఫోఫైసిన్) : మూడు అసౌష్ఠవ, కైటినస్ నిర్మాణాలు పురుష జనన రంధ్రం చుట్టూ ఉంటాయి. ఇవి సంపర్కంలో సహకరిస్తాయి.
AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 15

1. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ: ఇది ఒక జత స్త్రీ బీజకోశాలు, బీజవాహికలు, యోని, శుక్రగ్రాహికలు, కొల్లాటీరియల్ గ్రంధులు మరియు జననాశయంను కలిగి ఉంటుంది.

2. స్త్రీ బీజకోశాలు: ఒక జత పెద్దవైన స్త్రీ బీజకోశాలు 2,3,4,5,6 ఉదర పార్శ్వఖండితాలలో కొవ్వుదేహలతో చుట్టుబడి ఉంటాయి. ప్రతి బీజకోశానికి ఎనిమిది ఒవేరియోల్స్ (లేదా) స్త్రీ బీజకోశనాళికలు ఉంటాయి. ప్రతి ఒవేరియాలు మొనదేలిఉన్న పూర్వాంత పోగు జర్మేరియమ్ మరియు వెడల్పైన పరాంత విట లేరయా ఉంటాయి. జర్మేరియమ్ అభివృద్ధి చెందుతున్న అనేక అండదశలుంటాయి.
విటలేరియమ్లో సొనతో పాటు పరిపక్వ అండాలు ఉంటాయి.

3. స్త్రీ బీజ వాహిక: ఒవేరియోల్లు అన్ని కలిసి పొట్టిగా, వెడల్పుగా కల స్త్రీ బీజ వాహికను ఏర్పరుస్తాయి.

  • స్త్రీ బీజవాహికలు మధ్యలో అతిచిన్న యోనిలోకి తెరచుకుంటాయి.
  • యోని నిలువు రంధ్రాన్ని స్త్రీ జనరంధ్రం అంటారు.
  • శుక్రగ్రాహిక ఎడమవైపుతిత్తితో మరియు కుడివైపున పోగులాంటి అంధనాళాన్ని కలిగి 6వ ఖండితం నుంచి జననాశయంలోకి రంధ్రం ద్వారా తెరచుకుంటుంది.

4. కొల్లాటీరియల్ గ్రంధులు: ఒకజత కొలాటీరియల్ గ్రంథులు స్త్రీ బీజకోశాల వెనుక ఉంటాయి. ఇవి జననాశయంలోకి తెరచుకుంటాయి. ఈ గ్రంధుల స్రావకాలు గుడ్లచుట్టూ ఊధీకా లేదా ధృడమైన గుడ్లపెట్టెను ఏర్పరుస్తాయి.

  • జననాశయం 7వ, 8వ మరియు 9వ ఉదరఖండితాల ఉరః ఫలకాలతో ఏర్పడుతుంది.
  • 7వ ఉరఃఫలకం జనాశయం అడుగుభాగాన్ని ఏర్పరుస్తుంది.
  • 8 వ ఉరఃఫలకం పూర్వాంతపు గోడను ఏర్పరుస్తుంది.
  • 9 వ ఉరఃఫలకం పూర్వాంతపు పైకప్పును ఏర్పరుస్తుంది.
  • జననాశయ పూర్వాంతము గైనాట్రియం (లేదా) జననకోశం పరాతము ‘వెస్టిబ్యులమ్’ (లేదా) గుడ్లకోశం అంటారు.
  • గొనాపోఫెసిస్లు మూడు జతల కైటిన్ నిర్మిత ఫలకాలు, స్త్రీజనన రంధ్రం చుట్టూ ఆవరించి ఉంటాయి. అండ నిక్షేపకంగా ఉండి సంపర్కంలో సహకరిస్తాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 16

Leave a Comment