विनयः विधेयता च Questions and Answers Summary Inter 1st Year Sanskrit

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Sanskrit Study Material उपवाचकम् 1st Lesson विनयः विधेयता च Questions and Answers Summary.

Inter 1st Year Sanskrit विनयः विधेयता च Questions and Answers

अभ्यासः

प्रश्नौ

प्रश्न 1.
आसनस्य स्पर्शात् का दर्शिता ?
जवाब:
आसनस्य स्पर्शात् देवहूतिः दर्शिता ।

प्रश्न 2.
नारदेन सूचितः योग्यः वरः कः ?
जवाब:
नारदेन सूचितः योग्यः वरः कर्दम महर्षिः ।

विनयः विधेयता च Summary in Telugu

श्री जनार्दन हेगडे

परिचय:-

“विनयः विधेयता” च इत्ययं पाठ्यभागः “बालकथा सप्ततिः” इत्यस्मात् ग्रन्थात् स्वीकृतः । ग्रन्थेऽस्मिन् बालानां कृते नैतिक जीवनं यापयितुम् उपयुक्ताः सप्ततिः कथाः विद्यन्ते । ग्रन्थस्यास्य रचयिता जनार्दन हेगडे महाभागः । अयं महोदयः संस्कृतभारत्याः आरम्भकेषु अन्यतमः । नैकानि पुस्तकानि रचितवान् अनेकाभिः संस्थाभिः पुरस्कृतः अयं विद्वान् । अधुना “सम्भाषणसन्देशः ” इति संस्कृतमासपत्रिकायाः सम्पादकः भूत्वा बेङ्गलूर नगरे वसति । राष्ट्रियसंस्कृत विद्यापीठेन वाचस्पति पुरस्कारेण सभाजितोऽयं महाभागः ।

“వినయః విధేయతా” చ అను పాఠ్యభాగం “బాల కథా సప్తతిః” అను గ్రంథం నుండి స్వీకరించబడినది. ఈ గ్రంథము నందు బాలుర కొఱకు (బాలురను) నైతికముతో కూడిన జీవనము నడుపుటకు సప్తతిః అను కథా గ్రంథము ఉపయోగపడును. ఈ గ్రంథ రచయిత జనార్థన్ హెగ్దే మహానుభావుడు.

ఈ మహోదయులు సంస్కృత భారతిని స్థాపించిన వారిలో ఒకరు. ఈయన అనేకమైన పుస్తకములను రచించెను. అనేక సంస్థలయందు విద్వాన్ అని పురస్కారములు పొందెను. ఇప్పుడు “సంభాషణ సన్దేశః” అను సంస్కృత మాసపత్రికకు సంపాదకులుగా బెంగళూరు నగరమునందు నివసించుచున్నారు. ఈయన రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠము నందు “వాచస్పతి” అని పురస్కారంచే సన్మానించబడిరి.

विनयः विधेयता च Questions and Answers Summary Inter 1st Year Sanskrit

पाठ्यांश:

चक्रवर्तिनः मनोः शतरूपायाः च पुत्री देवहूतिः । सा अनुपमसुन्दरी, सौम्यस्वभावा, सकलविद्यापारङ्गता च । ‘एतादृश्याः कृते योग्यः वरः क्व प्राप्येत ?’ इति मातापित्रोः चिन्ता । सामान्याय कस्मैचित् वराय पुत्रीं दातुं न इच्छतः तौ ।

कदाचित् तौ स्वसमस्यां नारदं निवेदितवन्तौ । नारदः क्षणकालं विचिन्त्य अवदत् – ”एतस्याः कृते योग्यः वरः कश्चन अस्ति । तस्य नाम कर्दमः इति । महर्षिः सः ज्ञानी, जनप्रियः ब्रह्मसाक्षात्कारं प्राप्तवान् च । किन्तु सः भवतोः पुत्र्याः परिणयम् अङ्गीकुर्यात् वा न वा इति तु न ज्ञायते ” इति ।

नारदस्य कथनं पुरस्कृत्य मनुः शतरूपा च पुत्र्या देवहूत्या सह कर्दममहर्षेः आश्रमं स्वयं गतवन्तौ । एतेषाम् आगमनम् आगमनोद्देश्यं च ज्ञात्वा कर्दममहर्षिः अचिन्तयत् – ‘देवहूत्याः रूपज्ञानादयः सर्वत्र ख्याताः । किन्तु स्वभावः कीदृशः इति न ज्ञायते । स तु परीक्ष्य ज्ञातव्यः’ इति ।

मनुः शतरूपा देवहूतिः च आश्रमम् आगताः । कर्दमऋषिः त्रीणि आसनानि आनीय स्थापयित्वा ‘कृपया उपविश्यताम्’ इति निवेदितवान् । मनुः शतरूपा च आसने उपविष्टवन्तौ ।

देवहूतिः अचिन्तयत् – ‘मम मातापितरौ वयसा ज्येष्ठौ । तयोः उपवेशनं शिष्टाचारसम्मतम् एव । किन्तु ज्ञानेन तपसा वयसा च ज्येष्ठे महर्षी कर्दमवर्ये तिष्ठति सति, मम उपवेशनम् अविनयद्योतकं स्यात् । किन्तु ‘उपविश्यताम्’ इति उक्त्वा दत्तस्य आसनस्य तिरस्कारः अविधेयतायै भवेत्’ इति । ततः सा आसनस्य पार्श्वे भूमौ उपविश्य आसनम् अस्पृशत् ।

भूमौ उपवेशनात् तया विनयः द्योतितः आसनस्य स्पर्शात् विधेयता अपि दर्शिता । एतस्मात् सन्तुष्टः कर्दममहर्षिः तस्याः स्वभावोत्कृष्टताम् अवगतवान् । रूपज्ञानादयः तु तस्याः आसन् एव । अतः मनोः प्रस्तावं सः सहर्षम् अङ्गीकृतवान् । अचिरात् एव देवहूतिकर्दमयोः विवाहः यथाविधि सम्पन्नः ।

పాఠ్యాంశం :

చక్రవర్తి అయిన మనువు అతని భార్య శతరూపా. వీరి కుమార్తె దేవహూతి. దేవహూతి ఎవరితోను పోల్చలేని సుందరి. సౌమ్య స్వభావురాలు, సకల విద్యలను అభ్యసించెను. అటువంటి కన్యకు యోగ్యుడైన వరుని పొందుట ఎట్లు ? అని తల్లి తండ్రులు ఆలోచించుచుండిరి. సామాన్యుడైన వరునకు ఆమెను ఇచ్చుటకు మనువునకు, శతరూపకు ఇష్టం లేదు.

ఒకనాడు ఈ సమస్యను నారదునకు నివేదించిరి. నారదుడు క్షణ కాలం ఆలోచించి పలికెను “ఈమెకు తగిన వరుడు ఉన్నాడు అతని పేరు కర్దముడు. ఆ మహర్షి జ్ఞాని జనులకు ప్రియమైన వాడు, బ్రహ్మ సాక్షాత్కారమును పొందినవాడు కాని నీ కుమార్తెతో వివాహం అంగీకరించునో లేదో తెలియదు అని” పలికెను.

నారదుని మాటను అనుసరించి మనువు, శతరూపా కుమార్తెతో సహా కర్దమ మహర్షి యొక్క ఆశ్రమమునకు స్వయంగా వెళ్ళిరి. వారి యొక్క ఆగమన ఉద్దేశ్యము తెలుసుకొన్న కర్దమ మహర్షి ఆలోచించెను. దేవహూతి యొక్క రూప జ్ఞానములు అన్ని చోట్ల ప్రసిద్ధి చెందెను. కాని స్వభావం ఎట్టిదో తెలియదు కనుక ఆమెను పరీక్షించి తెలుసుకొనవలెను అని.

మనువు, శతరూపా, దేవహూతి ఆశ్రమమునకు వచ్చిరి. కర్దమ ఋషి మూడు ఆసనములను వేయించెను. దయతో కూర్చుండమని పలికెను. మనువు, శతరూపా ఆసనమున కూర్చుండెను.

దేవహూతి ఆలోచించెను. “నా తల్లి తండ్రి వయసులో పెద్దవారు. వారిద్దరి వద్ద ఆసనంపై కూర్చొనుట చిన్నవారికి సమ్మతము. కాని జ్ఞానంచే తపస్సుచే వయస్సుచే పెద్దవారైన మహర్షి అయిన కర్దముల వద్ద ఆసనం పై కూర్చొనచో నేను వినయం లేని దానిని అగుదును.

కాని కూర్చొనమని ఇచ్చిన ఆసనమును తిరస్కరించిన అవిధేయత కలుగును అని భావించెను. అటు పిమ్మట ఆమె ఆసనము ప్రక్కన భూమియందు కూర్చొని ఆసనమును తాకెను.

భూమి యందు కూర్చొనుట వలన ఆమె వినయం మరింత ప్రకటితమయ్యెను. ఆసనమును స్పృశించుటచే విధేయత కూడా దర్శింపబడెను. ఈ క్రియ వలన సంతోషించిన కర్దమ మహర్షి ఆమె యొక్క గొప్పదైన స్వభావమును తెలుసుకొనెను. ఆమెకు రూపజ్ఞానములే కాక వినయ, విధేయతలు కూడా కలవు. అందువలన మనువు యొక్క వివాహ ప్రస్తావనకు మహర్షి అంగీకరించెను. కొద్దికాలమునకు దేవహూతి, కర్దములకు యథావిధిగా వివాహం జరిగెను. సంతానం పొందెను.

Leave a Comment