Andhra Pradesh BIEAP AP Inter 1st Year Sanskrit Study Material उपवाचकम् 2nd Lesson मित्ररत्नम् Questions and Answers Summary.
Inter 1st Year Sanskrit मित्ररत्नम् Questions and Answers
अभ्यासः
प्रश्नौ
प्रश्न 1.
अवधेशः कस्यां कक्ष्यायां प्रथमश्रेण्याम् उत्तीर्णः ?
जवाब:
अवधेशः दशम कक्ष्यायां प्रथमश्रेण्यां उत्तीर्णः ।
प्रश्न 2.
अवधेशः कस्मै ईर्ष्यति ?
जवाब:
अवधेश: विनयाय ईर्ष्यति ।
मित्ररत्नम् Summary in Telugu
डा. पूजा उपाध्याया
परिचय:-
‘’मित्ररत्नम्” इत्ययं पाठ्यभागः “बालकथा” इत्यस्मात् ग्रन्थात् स्वीकृतः । अस्य ग्रन्थस्य रचयित्री डा. पूजा उपाध्याया । एषा महाभागा इन्दिरागान्धि राष्ट्रियसेवा परियोजना पुरस्कारेण सत्कृता । “बालकथा” इत्ययं ग्रन्थः बालानां व्यक्तित्वविकासाय, नैतिकविकासाय, आध्यात्मिकविकासाय च महदुपकरोति । भारतीयसंस्कृतेः सारभूतानि जीवनमूल्यानि ज्ञातुं ग्रन्थोऽयं उपयुक्तो भवति ।
పరిచయం :
మిత్రరత్నం అను ఈ పాఠ్యభాగం బాలకథా అను గ్రంథం నుండి స్వీకరించడినది. ఈ గ్రంథ రచయిత డా. పూజా ఉపధ్యాయా. ఈమె ఇందిరాగాంధి రాష్ట్రీయ సేవా పరియోజనా పురస్కారంచే సత్కరింపబడినది. “బాల కథా” అను గ్రంథము బాలుర యొక్క వ్యక్తిత్వ వికాసం కొఱకు, నైతిక వికాసం కొఱకు, ఆధ్యాత్మిక వికాసం కొఱకు చాలా ఉపయోగుపడుతున్నది. భారతీయ సంస్కృతి యొక్క సారభూతము జీవన విలువలు తెలుసుకొనుటకు ఈ గ్రంథం ఉపయుక్తమగుచున్నది.
पाठ्यांश:
अवधेशः बहु प्रसन्नो आसीत् । सः दशमीकक्ष्यायां प्रथमश्रेण्याम् उत्तीर्णः जातः आसीत् । सम्पूर्णग्वालियर् नगरे सः प्रथमस्थानं प्राप्नोत् । अद्य देहल्याः विशाल विद्यालये प्रवेश प्राप्तुं सः पित्रा सह रेलयानेन गच्छन् आसीत् ।
अवधेशः पठने उत्तमः आसीत्, किन्तु सः अत्यधिकप्रदर्शनप्रियः अहङ्कारी चासीत् । अतः तस्य पिता सर्वदा चिन्तितः भवति स्म । छात्रावासे कदाचित् अवधेशस्य व्यवहारे परिष्कारः भवेदिति अवधेशस्य पिता इदानीमपि चिन्तयन् आसीत् ।
रेलयानम् आगरारेलस्थानकं प्राप्नोत् । ततः एकः बालकः स्वपित्रा सह अवधेशस्य समीपम् आगत्य उपाविशत् । सः वेशभूषया ग्रामीणः दृश्यते स्म । किञ्चित्कालानन्तरं मन्दें हसन् सः बालकः अहं विनयः इत्युक्त्वा अवधेशेन सह परिचयं सम्पादयितुम् अयतत । किन्तु अवधेशः अहङ्कारवशात् स्वमुखं वातायनदिशि अकरोत् ।
केनापि ग्रामीणनिर्धनबालकेन सह वार्ता कर्तुम् अवधेशस्य काऽपि इच्छा नासीत् । अवधेशस्य प्रकृतिं जानन् तस्य पित्रा शीघ्रमेव ताभ्यां सहयात्रिभ्यां सह वार्ता आरब्धा । चर्चायां सः अजानात् यत् तौ अपि तस्मिन्नेव विद्यालये विनयस्य प्रवेशार्थं गच्छन्तौ स्तः ।
एतत् श्रुत्वा अवधेशस्य पिता तु अहृष्यत् किन्तु अवधेशः हीनभावनया विनयम् अपश्यत् । विनयस्य पित्राउक्तंयत्, ‘वयं तु निर्धनकृषकाः स्मः । मम पुत्रोऽपि मम साहाय्यं कुर्वन् परिश्रमेण पठति । सर्वकारस्य विशिष्टछात्रवृत्तियोजनायाम् एतस्य चयनं देहल्याः विद्यालये प्रवेशार्थं जातं वर्तते ।” अवधेशस्य पिता विनयात् प्रभावितो भूत्वा तस्य प्रशंसाम् अकारोत् । स्वपितुः मुखात् विनयस्य प्रशंसां श्रुत्वा अवधेशः बहु क्रुध्यन् आसीत् ।
देहलीं प्राप्य ते सर्वे सहैव विद्यालयम् अगच्छन् । प्रवेशपूर्वपरीक्षायाम् अवधेशविनयौ उत्तीर्णी जातौ । द्वयोः बालकयोः विद्यालये प्रवेशः सञ्जातः । छात्रावासेऽपि एकस्मिन् प्रकोष्ठे एवं तयोः प्रवेशः जातः । द्वयोः जनको प्रसन्नौ भूत्वा प्रत्यागतवन्तौ, किन्तु अवधेशः खिन्नः आसीत् । अवधेशः न केवलं विनयाय ईर्ष्यति स्म, अपि तु सर्वदा विनयस्य अपमानं करोति स्म । विनयः अवधेशस्य दुर्व्यवहारस्य कारणं ज्ञातुं न अशक्नोत् किन्तु सः सर्वदा अवधेशेन सह प्रेम्णा व्यवहरति स्म ।
यद्यपि विनयः अवधेशस्य प्रकोष्ठसहभागी आसीत् तथापि अवधेशः स्वमित्रेषु तस्य गणनां न करोति स्म । केचन धनिकपुत्राः अवधेशस्य मित्राणि आसन् । कदाचित् निर्धनतायाः कारणात् अवधेशः मया सह वार्ता न करोति इत्येव विचिन्त्य विनयः शान्त या पठने रतः भवति स्म ।
शनैः-शनैः कतिचन मासाः अतीताः । विजयदशम्यां विद्यालये दशदिनानाम् अवकाशः घोषितः । सर्वेऽपि बालकाः स्वगृहं गन्तुं सिद्धाः आसन् । शनैः शनैः छात्रावासः रिक्तः जायमानः आसीत् । विनयोऽपि स्ववस्तूनि यानपेटिकायां स्थापयन् आसीत्, तदा सः अवधेशम् अपश्यत् स तु आच्छाद्या स्वपर्यङ्के शयानः आसीत् ।
विनयेन समीपं गत्वा दृष्टं यत् अवधेश : अत्यधिकज्वरपीडितः आसीत् तदा सः अनुक्षणं धावित्वा औषधम् आनीय तस्मै अददात् । अवधेशः विनयम् अवदत् यत् “भवान् स्वगृहं गच्छतु । अहमपि श्वः स्वस्थ भूत्वा गमिष्यामि इति” । तदा विनयेनोक्तं यत् “अहं भवन्तम् एतस्यां स्थितौ त्यक्त्वा नैव गमिष्यामि, यतो हि सम्पूर्ण छात्रावासे मां विहाय अन्यः छात्रः नास्ति ।”
अवधेशस्य सर्वाण्यपि मित्राणि तम् अदृष्ट्वा एव स्वगृहम् अगच्छन् इति ज्ञात्वा अवधेशः व्यथते स्म । सम्पूर्णरात्रौ विनयः अवधेशस्य परिचर्याम् अकरोत् । विनयः प्रभाते अवधेशस्य वस्तूनि स्वीकृत्य तमपि रेलस्थानकम् अनयत् । यद्यपि विनयस्य गृहं तु आगरानगरस्य समीपे एकस्मिन् ग्रामे आसीत् तथापि सः स्वस्य अस्वस्थं मित्रं प्रापयितुं ग्वालियर् नगरम् अगच्छत् । अवधेशस्य गृहजनाः विनयं प्रति बहुत्कृतज्ञाः आसन् । तेन सह मिलित्वा सर्वेऽपि प्रसन्नाः जाताः । सायङ्काले विनयः स्वग्रामम् अयात् ।
सम्पूर्णरात्रौ अवधेशः विनयस्य विषये चिन्तयन् आसीत् । विनयं प्रति स्वव्यवहारं विचिन्त्य तस्य मनसि ग्लानिः भवति स्म । प्रभाते अवधेशस्य पिता तम् अपृच्छत् यत्, “विजयदशम्याः अवसरे भवते किम् उपहारम् आवश्यकम् ?”
तदा अवधेशः पितरम् अवदत् यत् “एतस्मिन् पर्वणि अहम् अमूल्यम् उपहारम् अलभे मित्ररत्नमिति ।” पिता अपि अजानात् यत् एतस्यां विजयदशम्यां पुनरेकवारं सद्व्यवहारात् अहङ्कारः पराजितः इति । उक्तमपि वर्तते-
“आपत्काले तु सम्प्राप्ते, यन्मित्रं मित्रमेव तत् ।
वृद्धिकाले तु सम्प्राप्ते, दुर्जनोऽपि सुहृद् भवेत् ॥”
![]()
పాఠ్యాంశం :
అవధేశుడు చాలా ప్రసన్నుడు. అతడు పదవ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అయ్యెను. గ్వాలియర్ నగరము నంతటికి మొదటి స్థానమును పొందెను. ఇప్పుడు ఢిల్లీ విశాల విద్యాలయము నందు ప్రవేశము కొఱకు తండ్రితో రైలునందు ప్రయాణం చేసెను.
అవధేశుడు చదువుట యందు ఉత్తముడే (చక్కగా చదువును) కాని అతడు అత్యధికంగా ప్రదర్శించు అహంకారీ. అందువలన అతని తండ్రి ఎల్లప్పుడు విచారించేవాడు. తండ్రి ఇతనిని వసతి గృహమునందుంచిన (hostel) అవధేశునిలో మార్పు రాగలదని ఆలోచించెను.
రైలు ఆగ్రా రైల్వేస్టేషన్కు వచ్చెను. అక్కడ ఒక బాలుడు తండ్రితో సహా అవధేశుని సమీపమునకు వచ్చి కూర్చొనెను. అతడి వేషధారణ గ్రామీణునివలే ఉన్నది. కొంత సమయము తరువాత ఆ బాలకుడు చిరునవ్వు నవ్వుచు “నేను వినయుడను”. అని పలికి అవధేశునితో పరిచయము చేసుకొనుటకు ప్రయత్నించెను. కాని అవధేశుడు అహంకారం వలన అతడు ముఖమును తిప్పుకొనెను.
నిర్ధనుడైన ఒక బాలకునితో మాట్లాడుట అవధేశకునకు కొంచెం కూడా ఇష్టం లేదు. అవధేశకునకు లోకం తెలియదు. అతని తండ్రి సహయాత్రికుడైన వినయుని తండ్రితో మాట్లాడుట ప్రారంభించెను. మాటల సందర్భమున వినయునికి విద్యాలయ ప్రవేశము కొఱకు వారు వచ్చుచున్నారని తెలుసుకొనెను.
ఈ మాటలు విన్న అవధేశుని తండ్రి సంతోషించెను. కాని అవధేశుడు హీనభావముతోనే వినయుని చూచెను. వినయుని తండ్రి ఈ విధంగా పలికెను. మేము పేదరైతులము. మా కుమారుడు మాకు సహాయం చేయుచూ కష్టపడి చదువుచున్నాడు. ప్రభుత్వం యొక్క విశిష్ట ఛాత్ర వృత్తి యోజన యందు (merrit) ఇతనికి ఢిల్లీ విద్యాలయము నందు ప్రవేశం లభించెను.
అవధేశుని తండ్రి వినయుని యొక్క ప్రతిభను తెలుసుకొని ప్రశంసించెను. అతని తండ్రి నుండి వినయుని యొక్క ప్రశంసను విన్న అవధేశుడు చాలా కోపమును పొందెను.
వారు అందరు ఢిల్లీ విద్యాలయమునకు వెళ్ళిరి. ప్రవేశ పరీక్షయందు అవధేశుడు, వినయుడు ఉత్తీర్ణులైరి. వారిద్దరు బాలురు విద్యాలయమునందు చేరిరి. వీరిద్దరు వసతి గృహమునందున్న ఒకే గదిలో బసకు ఏర్పాటైనది. వారిద్దరి తండ్రులు ప్రసన్నులై వెళ్ళిపోయిరి. కాని అవధేశుడు భిన్నుడయ్యెను. (అవమానమును పొందెను) అవధేశుడు వినయుని యందు ఈర్ష్యనేకాక అవమానించుచుండెను. వినయుడు అవధేశుని యొక్క దుష్ట ప్రవర్తనకు కారణం తెలుసుకొనలేకపోయెను.
కాని అతడు ఎల్లప్పుడు అవధేశుని యందు ప్రేమతోనే వ్యవహరించెడి వాడు. ఎందుకనగా అవధేశుడు తన గదియందు భాగస్తుడు (room mate). అందువలన తన మిత్రుని యందు తప్పులు వెతికేవాడు కాదు. కొంతమంది ధనిక పుత్రులు అవధేశునికి మిత్రులు అయిరి. ధనము లేని కారణము వలన అవధేశుడు నాతో మాట్లాడుటలేదు అని తెలుసుకొని వినయుడు శాంతంచే చదువుయందు ఆసక్తుడు అయ్యెను.
మెల్లమెల్లగ కొన్ని మాసములు గడిచెను. విజయదశమి యందు విద్యాలయమునకు పది రోజులు సెలవులు ప్రకటించిరి. అందరు బాలురు వారి ఇళ్ళకు వెళ్ళుటకు సిద్ధపడిరి. ఒక్కొక్కరుగా విద్యార్థుల వలన వసతి గృహము కాళీ అగుచుండెను. వినయుడు అతని వస్తువులను పెట్టెయందు సద్దుకొనెను. అప్పుడు అతడు అవధేశుని చూచెను. అతడు తన మంచంపై పడుకొనెను.
వినయముతో అతని సమీపమునకు వెళ్ళి అవధేశుని చూచెను. అతడు ‘మిక్కిలి జ్వరంచే పీడింపబడుచుండెను. అప్పుడు అతడు (వినయుడు) ప్రతి క్షణము పరుగిడి వెళ్ళుచూ ఔషధము తీసుకొని వచ్చి అవధేశునకు ఇచ్చెను. అవధేశుడు వినయముతో పలికెను. “నీవు గృహమునకు వెళ్ళుము” నేను కూడా రేపె ఆరోగ్యమును పొంది వెళతాను అనీ” అప్పుడు వినయుడు ఈ విధంగా పలికెను. నేను ఈ స్థితిలో నిన్ను ఒంటరిగా విడచి వెళ్ళగలనా.
అవధేశునకు అర్థమైనది. మిత్రులందరు తనని చూడకుండా వారు ఇళ్ళకు వెళ్ళిరి అని బాధపడెను. రాత్రంతా వినయుడు అవధేశునకు పరిచర్య చేసెను. వినయుడు ఉదయమున అవధేశుని యొక్క వస్తువులను స్వీకరించి రైల్వేస్టేషన్కు తీసుకువచ్చెను.
ఎందుకనగా వినయుని యొక్క గృహము ఆగ్రా నగరమునకు సమీపమున ఒక గ్రామము. అందువలన అతడు అనారోగ్యం గల మిత్రుని స్వయముగా గ్వాలియర్ నగరమునకు తీసుకువచ్చెను. అవధేశుని యొక్క గృహములోని వారు వినయునకు విశేషంగా కృతజ్ఞతలను తెలిపిరి. అతనితో కలసి అందరూ ప్రసన్నులైరి. సాయంకాలమున వినయుడు తన గ్రామమునకు వచ్చెను.
రాత్రంతా అవధేశుడు వినయుని యొక్క విషయమును ఆలోచించుచూ గడిపెను. వినయుని గూర్చి, అతని ప్రవర్తన గూర్చి అతని మనస్సుయందు సిగ్గును చెందెను. ఉదయమున అవధేశుని తండ్రి అతని గూర్చి ఈ విధంగా అడిగెను. విజయదశమి రోజు నీకు ఏమి పదార్థము కావలెను ?
అప్పుడు అవధేశుడు తండ్రిని గూర్చి ఈ విధంగా పలికెను. ఈ పర్వదినమున నేను అమూల్యమైన పదార్థమును పొందాను. అది మిత్రరత్నము (నీ రత్నం వంటి మిత్రుని) తండ్రికి కూడా అర్ధమయ్యెను. ఈ విజయదశమి యందు మరల అహంకారం నీ మంచి ప్రవర్తన వలన జయింపబడినది” అని పలికెను..
“आपत्काले तु सम्प्राप्ते, यन्मित्रं मित्रमेव तत् ।
वृद्धिकाले तु सम्प्राप्ते, दुर्जनोऽपि सुहृद् भवेत् ॥”
శ్లోఖం భావం : ఆపదలు సంభవించినపుడు ఎవరైతే సహాయం చేస్తారో అటువంటి మిత్రుడే మిత్రుడనబడును. ధనములు సంపాదించునపుడు దుర్మార్గుడు కూడా మిత్రుడే అగును.