Students can go through AP Inter 1st Year Botany Notes 6th Lesson ప్రత్యుత్పత్తి విధానాలు will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Botany Notes 6th Lesson ప్రత్యుత్పత్తి విధానాలు
1. ‘ప్రత్యుత్పత్తి ప్రక్రియ’ ఒక జాతి మనుగడను తరతరాలుగా కొనసాగేందుకు తోడ్పడుతుంది.
2. జీవులలో ప్రత్యుత్పత్తి రకాలు: (i) అలైంగిక ప్రత్యుత్పుత్తి (ii) లైంగిక ప్రత్యుత్పత్తి
3. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒకే జనకం పాల్గొంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు జనకాలు (పురుష మరియు స్త్రీ) పాల్గొంటాయి. [IPE]
4. అలైం గిక ప్రత్యుత్పత్తి లో సంయోగబీజాల కలయిక జరగదు. లైంగిక ప్రత్యుత్పత్తి యందు సంయోగబీజాల కలయిక జరుగుతుంది. [IPE]
5. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఫలదీకరణ జరగదు. లైంగిక ప్రత్యుత్పత్తి లో ఫలదీకరణ జరుగుతుంది. [IPE]
6. అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంతతి తల్లిదండ్రులను పోలి ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తిలో సంతతి తల్లిదండ్రుల పోలికలలో భేదాలను చూపుతాయి. [IPE]
7. అలైంగిక ప్రత్యుత్పత్తి శైవలాలు, శిలీంధ్రాలలో సాధారణం. ఇది గమన సిద్ద బీజాలు మరియు సిద్ధ బీజాల జరుగుతుంది.
8. ఆసృతబీజాలలోని అలైంగిక ప్రత్యుత్పత్తిని శాకీయ వ్యాప్తి లేదా శాకీయ ప్రత్యుత్పత్తి అంటారు.
9. ఆ వృతబీజాలలోని శాకీయ వ్యాప్తి రన్నర్స్, రైజోమ్స్, సక్కర్స్, ట్యూబర్స్, ఆఫ్సెట్స్ ద్వారా జరుగుతుంది. [IPE]
10. రెండు రకాల సంయోగ బీజాలు అనగా పురుష, స్త్రీ సంయోగ బీజాలు ఏర్పడే విధానాన్ని సంయోగబీజ జననం’అంటారు.
11. లైంగిక ప్రత్యుత్పత్తిలోని మూడు సంఘటనలు: ఫలదీకరణ పూర్వ సంఘటనలు, ఫలదీకరణ, ఫలదీకరణ అనంతర సంఘటనలు
12. ఫలదీకరణ పూర్వ సంఘటనలు: సంయోగబీజ జననం మరియు సంయోగబీజాల రవాణా
13. ఫలదీకరణ అనంతర సంఘటనలు: సంయుక్త బీజం ఏర్పడుట మరియు పిండ జననం
14. మొక్కలు ఏకలింగశ్రయాలు మరియు ద్విలింగశ్రయాలు. శిలీంధ్రాలు ఏకలింగక మరియు ద్విలింగకంగా ఉంటాయి.
15. ఆవృత బీజాలలో పురుష సంయోగబీజాల రవాణా ‘పరాగసంపర్కం’ ద్వారా జరుగుతుంది.
16. సమసంయోగం (సింగమి) పురుష మరియు స్త్రీ సంయోగబీజాలలో జరుగుతుంది. ఇది బాహ్య లేదా అంతరంగా జరగవచ్చు.
17. సంయుక్త బీజం నుండి పిండం ఏర్పడే విధానాన్ని ‘పిండ జననం’ అంటారు. [IPE]
18. పుష్పించే మొక్కలలో ఫలదీకరణం తరువాత అండాశయం ఫలంగా మరియు అండాలు విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి.