Students get through AP Inter 1st Year Botany Important Questions 8th Lesson ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం which are most likely to be asked in the exam.
AP Inter 1st Year Botany Important Questions 8th Lesson ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం
Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
ఓమేగా వర్గీకరణ శాస్త్రం అంటే ఏమిటి? [TS M-20,22] [AP M-15,18,19][IPE Mar- 13]
జవాబు:
ఓమేగా వర్గీకరణ శాస్త్రం: పుష్పించే మొక్కల స్వరూప లక్షణాలతోపాటు ఇతర వృక్షశాస్త్ర శాఖలు అయిన పిండోత్పత్తిశాస్త్రం, కణశాస్త్రం, వృక్ష రసాయన శాస్త్రం, పరాగరేణు శాస్త్రాల నుండి లభించే సమాచారం మీద ఆధారపడి ఉండే వర్గీకరణ శాస్త్రాన్ని ‘ఒమేగా వర్గీకరణ’ శాస్త్రం అని అంటారు.
ప్రశ్న 2.
మొక్కల సహజ వర్గీకరణ శాస్త్రం అంటే ఏమిటి? దీన్ని అనుసరించిన శాస్త్రవేత్తల పేర్లు తెల్పండి? [ TS M-19,22]
జవాబు:
- మొక్కలను ముఖ్యంగా వాటి స్వరూప లక్షణాలను మరియు వాటి మధ్య గల సహజ సంబంధాల ఆధారంగా వర్గీకరించే శాస్త్రాన్ని ‘మొక్కల సహజ వర్గీకరణ శాస్త్రం’ అంటారు.
- దీనిని అనుసరించిన శాస్త్రవేత్తలు ‘బెంథామ్ మరియు హుకర్’.
ప్రశ్న 3.
సాంఖ్యక వర్గీకరణశాస్త్ర (Numerical Taxonomy) పరిధిని, ప్రాముఖ్యతను వివరించండి. [ AP M-22]
జవాబు:
1. పరిధి: సాంఖ్యక వర్గీకరణశాస్త్రం, గణితశాస్త్ర పద్ధతులను ఉపయోగించి వర్గీకరణ సముదాయాల మధ్య ఉన్న భేదాలు మరియు సారూపత్యను లెక్కకడుతుంది. దీనికోసం కంప్యూటర్లను ఉపయోగిస్తారు.
2. ప్రాముఖ్యత : ఇందులో అన్ని లక్షణాలకు సంఖ్య మరియు సంకేతాలను నిర్ణయించి తద్వారా సమాచారాన్ని క్రమపద్ధతిలో విశ్లేషిస్తారు. ప్రతి లక్షణానికి సమాన ప్రాధాన్యతనిస్తూ ఒకే సమయంలో అనేక లక్షణాలను కంప్యూటర్ల సహాయంతో గణించవచ్చు.
ప్రశ్న 4.
భూఫలనం అంటే ఏమిటి? ఈ దృగ్విషయాన్ని ప్రదర్శించే మొక్క పేరు తెలపండి. [AP M- 16,17] [TS M-15,17]
జవాబు:
- మృత్తికలోపల ఫలాలు ఏర్పడడాన్ని ‘భూఫలనం’ అంటారు.
- భూఫలనం ప్రదర్శించే మొక్క అరాఖిస్ హైపొజియా (వేరుశనగ).
ప్రశ్న 5.
ఫాబేసికి చెందిన మొక్కలలో కనిపించే పరాగ సంపర్క యాంత్రిక రకం పేరు తెలపండి. [Mar- 14]
జవాబు:
ఫాబేసికి చెందిన మొక్కలలో కనిపించే పరాగ సంపర్క యాంత్రిక రకం పేరు ‘ఫిస్టన్ యాంత్రికం’.
ప్రశ్న 6.
సొలానమ్ మొక్క పుష్ప సంకేతం వ్రాయండి. [TSM-22] [ AP M-20]
జవాబు:
ప్రశ్న 7.
సొలానమ్ నైగ్రమ్ అండాశయం సాంకేతిక వర్ణన ఇవ్వండి.
జవాబు:
- ద్విఫలదళం, సంయుక్తం, ద్విబిలయుతం, ఊర్ధ్వ అండాశయం, ఉబ్బిన అండన్యాస స్థానంపై అనేక అండాలు స్తంభ అండన్యాసంలో అమరి ఉండుట.
- అగ్రకీలం, కీలాగ్రం శీర్షాకారం, ఫలదళాలు 45° కోణంలో ఏటవాలుగా అమరి ఉంటాయి.
ప్రశ్న 8.
ఆలియమ్ సెపా పరాగకోశాల సాంకేతిక వర్ణనను ఇవ్వండి. [TS M-16]
జవాబు:
పరాగ కోశాలు ద్వికక్షికం, పీఠసంయోజితం, అంతర్ముఖం మరియు నిలువు విస్ఫోటనం.
Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
ఒక పుష్పించే మొక్క నమూనాను పాక్షిక సాంకేతిక వర్ణనతో క్లుప్తంగా వ్రాయండి. [AP M-19]
జవాబు:
1. పుష్పించే మొక్క సాంకేతిక వర్ణనలోని అంశాలు: వర్ణన ఆకృతి, ఆవాసం, శాకీయ లక్షణాలు (వేరు, కాండం, పత్రాలు) పుష్పలక్షణాలు (పుష్పవిన్యాసం, పుష్పం దాని భాగాలు) మరియు ఫలం అనే అంశాల ద్వారా ప్రారంభమవుతుంది.
2. పుష్పం యొక్క వివిధ భాగాలను వివరించిన తరువాత ‘పుష్పచిత్రం’ మరియు ‘పుష్పసంకేతం’ ఇవ్వబడతాయి.
3. ‘పుష్పచిత్రం’ పుష్పం లోని భాగాలు, వాటి అమరిక వంటి వాటి వివరాలను తెలియజేస్తుంది.
4. ‘పుష్పసంకేతం’ వివిధ పుష్పభాగాల వివరాలను సంకేతాల రూపంలో తెలియజేస్తుంది.
5. పుష్పసంకేతం:
ప్రశ్న 2.
ఫాబేసికి చెందిన మొక్కల అనావశ్యక పుష్ప అంగాలను వివరించండి. [IPE Mar- 14][TS M-18]
జవాబు:
- ఫాబేసికి చెందిన మొక్కల అనావశ్యక పుష్ప అంగాలు: ‘రక్షక పత్రావళి’ మరియు ‘ఆకర్షక పత్రావళి’.
- రక్షక పత్రావళి:రక్షక పత్రాలు 5, సంయుక్తం, కవాటయుత లేదా చిక్కైన పుష్పరచన,పూర్వాంతంలో బేసి రక్షక పత్రం.
- ఆకర్షక పత్రావళి:ఆకర్షణ పత్రాలు 5, అసంయుక్తం, పాపిలియోనేసియస్. పరాంతంలో పెద్దగా ఉన్న ఆకర్షణ పత్రాన్ని ధ్వజపత్రం అంటారు. పార్శ్వంగా ఉండే రెండు ఆకర్షక పత్రాలను బాహువులు అంటారు. పూర్వాంతంలోని రెండు ఆకర్షక పత్రాలు ద్రోణి పత్రాలు అంటారు. ఇవి సంయుక్తంగా ఉండి కేసరావళి మరియు అండకోశాన్ని కప్పి ఉంచుతాయి.
- దీని పుష్పరచన వెక్సిల్లరి లేదా అవరోహక చిక్కైన.
ప్రశ్న 3.
పుష్పచిత్రాన్ని గురించి వ్రాయండి. [TS M-22]
జవాబు:
- పుష్పచిత్రం అనునది పుష్పం లోని భాగాలు వాటి అమరిక మరియు వాటి మధ్య వాటికున్న సంబంధాన్ని తెలియజేస్తుంది.
- ‘ప్రధాన అక్షం’ పుష్పం యొక్క పరాంత భాగాన్ని సూచిస్తుంది. దీనిని ఒక చుక్క లేదా చిన్న వలయం ద్వారా పుష్ప చిత్రం పైన సూచిస్తారు.
- రక్షకపత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి మరియు అండకోశాలను ఏక కేంద్రక వలయాలుగా గీసి, రక్షక పత్రావళిని బాహ్యవలయంలో మరియు అండకోశంను పుష్పచిత్రం మధ్యలో అండాశయం అడ్డుకోతపటం ద్వారా చూపుతారు.
- పుష్పం యొక్క పూర్వాంతంలో ‘పుచ్ఛం’ను పుష్ప చిత్రం దిగువ భాగంలో సూచిస్తారు
ప్రశ్న 4.
లిలియేసికి చెందిన మొక్కల పుష్పభాగాలలోని ఆవశ్యక అంగాలను వివరించండి. [AP M-15,17,18,20]
జవాబు:
- లిలియేసి మొక్కల ఆవశ్యక అంగాలు: కేసరావళి మరియు అండకోశం .
- కేసరావళి: 6 కేసరాలు, రెండు వలయాల్లో (3+3) గా ఉంటాయి, అసంయుక్తం, పరిపత్రో పరిస్థితం, పరాగ కోశాలు ద్వికక్షికం, పీఠ సంయోజితం, అంతర్ముఖం, నిలువు స్ఫోటనం.
- అండకోశం: త్రిఫలదళ, సంయుక్త, ఊర్ధ్వ అండాశయం, త్రిబిలయుతం, అనేక అండాలు స్తంభ అండన్యాసంపై అమరి ఉంటాయి, అగ్రకీలం, కీలాగ్రం త్రిశాఖాయుతం శీర్షాకారం.
ప్రశ్న 5.
బెంథమ్ అండ్ హుకర్ల వర్గీకరణలో ద్విదళ బీజ (డైకాటిలిడనే) తరగతి మీద లఘుటీక వ్రాయండి. [AP M-22][TS M-17]
జవాబు:
‘బెంథమ్ మరియు హుకర్త వర్గీకరణ’ ఆధారంగా ద్విదళబీజ తరగతిని మూడు ఉపతరగతులుగా విభజించారు. అవి పాలిపెటాలే, గామోపెటాలే మరియు మోనోక్లామిడే
1. పాలిపెటాలే ఉపతరగతి మరల మూడు శ్రేణులుగా విభజించబడింది.
అవి ధలామిఫ్లోరే(6 కోహర్ట్లు), డిస్కిఫ్లోరే (4 కోహర్ట్లు) మరియు కాలిసిస్లోరే (5 కోహర్ట్లు)
2. గామోపెటాలే ఉపతరగతి మరల మూడుగా విభజించబడింది.
అవి ఇన్ఫెరె(3 కోహర్ట్లు), హెటిరోమిరే (3 కోహర్ట్లు) మరియు బైకార్పెల్లేటె (4 కోహర్టు)
3. మోనోక్లామిడే ఉపతరగతి 8 శ్రేణులుగా విభజించబడింది. కోహర్ట్లు లేవు.
అన్ని కోహార్ట్లు సహజ క్రమాలైన కుటుంబాలుగా విభజించబడినాయి.
డైకాటిలిడనే తరగతి 165 కుటుంబాలను కలిగి ఉంటుంది.
ప్రశ్న 6.
సొలనేసిలోని ఆవశ్యకాంగాలను వర్ణించండి. [TS M-15,19,22]
జవాబు:
1. సొలనేసిలోని ఆవశ్యకాంగాలు: కేసరావళి మరియు అండకోశం.
2. కేసరావళి: కేసరాలు 5, మకుట దళం పరిస్థితం, ఆకర్షణ పత్రాలు ఏకాంతరంగా ఉంటాయి. పరాగకోశాలు ద్వికక్షికం, పీఠ సంయోజితం, అంతర్ముఖం.
3. అండకోశం: ఊర్థ్వ అండాశయం, ద్విఫలదళ, సంయుక్తం, ద్విబిలయుతం, అరుదుగా ఏకబిలయుతం. ఫలదళాలు 45° కోణంలో ఏటవాలుగా అమరి ఉంటాయి. ఉబ్బిన అండన్యాస స్థానంపై అనేక అండాలు స్తంభ అండన్యాసంలో అమరి ఉంటాయి. అగ్రకీలం, కీలాగ్రం శీర్షాకారం.
ప్రశ్న 7.
ఫాబేసికి చెందిన మొక్కల ఆర్థిక ప్రాముఖ్యతను తెలపండి. [AP M-16][IPE M-13][AP, TS May-17]
జవాబు:
ఫాబేసి మొక్కల ఆర్థిక ప్రాముఖ్యతను తెలియజేయు ఉత్పత్తుల వివరాలు:
- ప్రోటీన్లు: కందులు, మినుములు, పెసలు, శనగలు వంటి పప్పుధాన్యాలు.
- వంటనూనెలు: సోయాబీన్ (గ్లైసిన్మాక్స్), వేరుశనగ (అరాస్ హైపోజియా)
- కూరగాయలు: చిక్కుడు (డాలికస్), సోయాబీన్ (గ్లైసిన్మాక్స్), మెంతి ఆకులు
- కలప: ఎర్రచందనం, ఇండియన్ రోజుడ్
- నారలు: సన్హె హెంప్ (క్రోటలేరియా)
- నీలిమందు: ఇండిగోఫెరా టింక్టోరియా
- పసుపు రంగు: బ్యూటియా మోనోస్పెర్మా
- పశుగ్రాశం: క్రోటలేరియా, ఫెసియాలస్
- హరిత ఎరువు: సెబ్బానియా (ఆవిశ), టెప్రోషియా (వెంపలి)
Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
ఫాబేసికి చెందిన మొక్కల లక్షణాల్ని వివరించండి. [TS M-20]
జవాబు:
I. ఫాబేసి మొక్కల శాకీయ లక్షణాలు:
- ఆకృతి: ఇవి ఏకవార్షిక గుల్మాలు. కొన్ని పొదలు, వృక్షాలు, బలహీన కాండం ఉన్న నులితీగలు సహాయంతో ఎగబాకేవి.
- వేరువ్యవస్థ: తల్లి వేరు వ్యవస్థ, వేర్లు పై బుడిపెలు కల్గి నత్రజని స్థాపన కోసం రైజోబియమ్ తో సహజీవనం
- కాండం: వాయుగతం, నిటారుగా లేదా సాగిలపడి, గుల్మాకార లేదా చేవదేరిన తీగలు
- పత్రాలు: ప్రకాండ సంబంధం, ఏకాంతరం, పుచ్ఛసహితం, తల్పం లాంటి పత్రపీఠం, వృంతసహితం, సరళ లేదా పిచ్ఛాకారకసంయుక్త పత్రం మరియు జాలాకార ఈనెల వ్యాపనం.
II. పుష్పలక్షణాలు:
- పుష్పవిన్యాసం: ఎక్కువగా అనిశ్చిత పుష్పవిన్యాసం
- పుష్పం: పుచ్ఛసహితం, లఘుపుచ్ఛసహితం లేదా లఘు పుచ్చరహితం, వృంతసహితం, పాక్షిక సౌష్ఠవయుతం, సంపూర్ణం ద్విలింగకాలు, పంచభాగయుతం, పర్యండకోశ గిన్నెవంటి పుష్పాసనం
- రక్షక పత్రావళి: రక్షక పత్రాలు 5, సంయుక్తం, కవాటయుత లేదా చిక్కైన పుష్పరచనం, బేసి రక్షక పత్రం పూర్వాంతం.
- ఆకర్షక పత్రావళి: ఆకర్షణ పత్రాలు 5, అసంయుక్తం, పాపిలియోనేసియస్. పరాంతంలో పెద్దగా ఉన్న ఆకర్షణ పత్రాన్ని ధ్వజపత్రం అంటారు. పార్శ్వంగా ఉండే రెండు ఆకర్షక పత్రాలను బాహువులు అంటారు. పూర్వాంతంలోని రెండు ఆకర్షక పత్రాలు ద్రోణి పత్రాలు అంటారు. ఇవి సంయుక్తంగా ఉండి కేసరావళి మరియు అండకోశాన్ని కప్పి ఉంచుతాయి. దీని పుష్పరచన వెక్సిల్లరి లేదా అవరోహక చిక్కైన.
- కేసరావళి: 10కేసరాలు, పైసమ్లో ద్విబంధకం ((9)+1], అరాఖిస్ మరియు క్రోటలేరియా ఏకబంధకం, పరాగకోశాలు ద్వికక్షికం.
- అండకోశం: ఏకఫలదళయుతం, ఏకబిలయుత అర్ధ ఊర్ధ్వ అండాశయం, అనేక అండాలు ఉపాంత అండన్యాసంలో ఉంటాయి, కీలాగ్రం సామాన్యం, కీలం పొడవుగా ఉండే శీర్షం వద్ద వంపు తిరిగి ఉంటుంది.
- పరాగసంపర్కం: పుష్పాలు పుంభాగ ప్రథమోత్పన్నాలు, కీటక పరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం, పిస్టన్ యాంత్రికం ద్వారా జరుగుతుంది, లాధిరస్ మరియు పైసమ్లలో ఆత్మ పరాగ సంపర్కం
- ఫలం: ఎక్కువగా ద్వివిదారక ఫలం, భూఫలనం మరియు అవిదారాకం.
- విత్తనం: ఒకటి నుండి అనేక విత్తనాలు, అంకురచ్ఛద రహితం, బీజదళలు, అరాఖిస్ లో నూనె కూడా ఉంటుంది.
ప్రశ్న 2.
సోలనేసీకి చెందిన ముఖ్య లక్షణాల్ని వ్రాయండి.
జవాబు:
I. శాకీయ లక్షణాలు:
- ఆకృతి ఎక్కువగా ఏకవార్షిక లేదా బహువార్షిక గుల్మాలు, కొన్ని పొదలు (సెస్ట్రమ్) వేరువ్యవస్థ: తల్లి వేరు వ్యవస్థ
- కాండం: వాయుగతం,నిటారు, గుల్మాకారం. సొలానమ్లో భూగర్భంగా పెరిగే దుంపకాండం (బంగాళదుంప) ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు ఉంటాయి.
- పత్రాలు: పత్రపుచ్ఛ రహితం, వృంతసహితం, ఏకాంతర పత్రవిన్యాసం. సరళ(లేదా) అరుదుగా పిచ్చాకార సంయుక్త పత్రం, జాలాకార ఈనెల వ్యాపనం.
II. పుష్పలక్షణాలు:
- పుష్పవిన్యాసం: నిశ్చిత పుష్పవిన్యాసం గ్రీవస్థం (సోలానమ్) లేదా శిఖరస్థం (దత్తూర) మరియు పానికిల్ (పొగాకు)
- పుష్పం: పుచ్ఛసహితం (లేదా) పుచ్ఛరహితం, లఘుపుచ్ఛరహితం, వృంతసహితం, సౌష్ఠవయుతం, సంపూర్ణం, ద్విలింగకం, పంచభాగయుతం, అండకోశాధస్ధితం
- రక్షక పత్రావళి: 5 రక్షకపత్రాలు, సంయుక్తం మరియు దీర్ఘకాలికం (కాప్సికమ్, సోలానమ్).
- ఆకర్షక పత్రావళి: 5 ఆకర్షకపత్రాలు, సంయుక్తం కవాటయుత (లేదా) మెలితిరిగిన పుష్పరచన.
- కేసరావళి: మకుటదళోపరస్థిత కేసరాలు 5 ఆకర్షక పత్రాలతో ఏకాంతరంగా ఉంటాయి. పరాగకోశాలు ద్వికక్షికం.
- అండకోశం: ఊర్ధ్వ అండాశయం, ద్విఫలదళ ఫలదళాలు 45° కోణంలో ఏటవాలుగా అమరి ఉంటాయి.
- కీలం అగ్రం పరాగసంపర్కం: పుష్పాలుపుంభాగ ప్రధమోత్పత్తిని చూపిస్తాయి. కాని కొన్ని జాతులైన సొలానమ్లో స్త్రీ భాగ ప్రధమోత్పత్తి కనిపిస్తుంది. కీటకాల ద్వారా పరపరాగ సంపర్కం (ఎంటమోఫిల్లి) జరుగుతుంది.
- ఫలం: ఫలాలు మృదుఫలం (కాప్సికమ్, సోలానమ్, లైకోపెర్సికాన్, పైసామ్ మొదలైనవి), కొన్ని గుళిక (దతూర మరియు నికోటియనా)
- విత్తనం: విత్తనాలు అంకురచ్ఛదయుతం మరియు ద్విదళాలు
ప్రశ్న 3.
లిలియేసి కుటుంబం గురించి తెలపండి.
జవాబు:
లిలియేసి కుటుంబాన్ని సాధారణంగా ‘తల్లి’ కుటుంబం అని పిలుస్తారు. ఇది ఏకదళబీజ తరగతి మరియు కారోనరీ శ్రేణికి చెందినది.
శాకీయ లక్షణాలు:
- ఆకృతి: ఎక్కువగా బహువార్షిక గుల్మాలు, లశునాలు, కందాలు కొమ్ము లాంటి భూగర్భకాండాలు. కొన్ని పొదలు, కొన్ని వృక్షాలు (యుక్కా, డ్రసీనా, అగేవ్) మరియు కొన్ని లతలు (గ్లోరియోసా, స్మైయలాక్స్)
- వేరువ్యవస్థ: అబ్బురపు వేర్లు, గుత్తులుగా దుంపవేర్లు (ఆస్పరాగస్)
- కాండం: భూగర్భం, బహువార్షికాలు, లశునం (అలియమ్), కందం (కాల్చికమ్),కొమ్ము (గ్లోరియోసా) కొన్ని వాయుగతం, బలహీనం, నులితీగయుత లతలు (గ్లోరియోసా, స్మెలాక్స్), శాఖలు క్లాడోఫిల్లుగా (రస్కస్, ఆస్పరాగస్)
- పత్రాలు: ఎక్కువగా మూల సంబంధం (ఆలియమ్) లేదా ప్రకాండ సంబంధం (స్మైలాక్స్), సరళ పత్రాలు, ఏకాంతరం, రేఖాకారం, పుచ్చరహితం, సమాంతర ఈనెల వ్యాపనం, స్మైలాక్స్ జాలాకార ఈనెల వ్యాపనం.
పుష్పలక్షణాలు:
- పుష్పవిన్యాసం: ఏకాంతర నిశ్చితం (లేదా) గుచ్ఛం (లేదా) అనిశ్చిత విన్యాసం
- పుష్పం: పుచ్ఛ సహితం, లఘుపుచ్ఛరహితం, వృంతసహితం, సంపూర్ణం, ద్విలింగకం లేదా అసాధారణంగా ఏకలింగకం (స్మైలాక్స్, రస్కస్), సౌష్ఠవయుతం, త్రిభాగయుతం, అండకోశాధస్ధితం, సమపరిపత్రయుతం.
- పరిపత్రావళి: పరిప్రతాలు ఆరు, రెండు వలయాలలో (3+3) గా ఉంటాయి. వెలుపలి వలయంలోని బేసి పరిపత్రం పూర్వాంతంలో మరియు లోపలి వలయంలో బేసి పరిపత్రం పరాంతంలో ఉంటాయి. కవాటయుత పుష్పరచన.
- కేసరావళి: ఆరు కేసరాలు, రెండు వలయాలలో (3+3) గా ఉంటాయి. అసంయుక్తం (లేదా) పరిపత్రో పరిస్థితం, పరాగకోశాలు ద్వికక్షికం, పీఠ సంయోజితం, అంతర్ముఖం మరియు నిలువు విస్ఫోటనం.
- అండకోశం: త్రిఫలదళం, సంయుక్తం, ఊర్ధ్వ అండాశయం, త్రిబిలయుతం అనేక అండాలు స్తంభ అండన్యాసంపై అమరి ఉంటాయి. కీలం అగ్రం, కీలాగ్రం త్రిశాఖాయుతం మరియు శీర్షాకారం.
- పరాగసంపర్కం: పుష్పాలు పుంభాగ ప్రథమోత్పత్తి (ఆలియమ్) (లేదా) స్త్రీ భాగ ప్రథమోత్పతిని (కాల్చికమ్) చూపుతాయి. కీటకాల ద్వారా పరపరాగ పంపర్కం జరుగుతుంది.
- ఫలం: సాధారణంగా గుళిక, అరుదుగా మృదుఫలం (ఆస్పరాగస్) జాతులలో బహుపిండత ఉంటుంది.
- విత్తనం: అంకురచ్ఛదయుతం, ఏకబీజదళయుతం, కొన్ని ఆలియమ్ జాతులలో బహుపిండత ఉంటుంది.
- ఆర్ధిక ప్రాముఖ్యత:
అలంకరణ మొక్కలు: ట్యూలిప్, లిలియమ్, ఆస్పరాగస్, గ్లోరియోసా
ఔషధమొక్కలు: అలో, స్మైలాక్స్, గ్లోరియోసా, సిల్లా
కూరగాయలు: అలియమ్, ఆస్పరాగస్
కాల్చిసిన్: కాల్చికమ్ ఆటోమ్నేల్ (రంజకం)
ప్రశ్న 4.
మొక్కలను వర్గీకరించడానికి అవసరమైన లక్షణాలను వ్రాయండి. వాటిని క్లుప్తంగా వివరించండి.
జవాబు:
పుష్పాల ఆధారంగా మొక్కలు రెండు రకాలు.
పుష్పించని మొక్కలు (క్రిప్టోగామ్స్) మరియు పుష్పించే మొక్కలు (ఫానిరోగామ్స్)
I. ఉపరాజ్యం క్రిప్టోగామ్స్ : ఇవి పుష్పించని మొక్కలు, పుష్పాలను ఫలాలను మరియు విత్తనాలను ఏర్పరచలేవు.
మొక్క దేహం ఆధారంగా ఇవి 3 రకాలు: ధాలోఫైటా, బ్రయోఫైటా మరియు టెరిడోఫైటా.
- విభాగం-ధాలోఫైటా: మొక్క దేహం ధాలస్ వంటి నిర్మాణాన్ని కలిగి, వేర్లు, కాండం మరియు పత్రాలు అనే
విభేదనాన్ని చూపించదు. ఇది మరల శైవలాలు మరియు శిలీంధ్రాలుగా విభజించబడింది. - ఉప విభాగం శైవలాలు: ఇవి ఆకుపచ్చని, కాంతియుత స్వయం పోషితాలు మరియు జలచర థాలోఫైట్లు.
ఉప విభాగం శిలీంధ్రాలు: ఇవి పత్రరహిత పరపోషిత ధాలో ఫైట్లు. - విభాగం బ్రయోఫైటా: ఇవి వృక్షరాజ్యం యొక్క ఉభయచరాలు. ఇవి పత్రయుత, స్వయం పోషితాలు, అంకురచ్ఛదయుతం, మరియు నాళిక కణజాల రహిత క్రిప్టోగామ్స్.
- విభాగం టెరిడోఫైటా: ఇవి నిజ భూచర మొక్కలు, ఆకుపచ్చగా ఉన్న స్వయంపోషితాలు, అంకురచ్ఛదయుతం, నాళికణజాల యుత క్రిప్టోగామ్స్
1. పాలిపెటాలే ఉపతరగతి: ఆకర్షక పత్రాలు అసంయుక్తం పరిపత్రావళి రెండు వలయాలలో ఉంటుంది. ఈ తరగతిని మరల మూడు శ్రేణులుగా విభజించారు.
a. ధాలిమిఫ్లోరే శ్రేణి : (ధలామస్) పుష్పాసనం శంఖు లేదా నిటారుగా ఉంటుంది. పుష్పాలు అండకోశాథస్థిత శ్రేణి యందు5 కోహర్ట్లు లేదా క్రమాలు కలవు
b. డిస్కిష్గారే శ్రేణి: పుష్పాసనం అర్ధ చంద్రాకారంలో ఉంటుంది. పుష్పాలు పర్యాండోశాథస్థితాలు. ఈ శ్రేణి యందు 4 కోహర్ట్లు లేదా క్రమాలు కలవు.
c. కాలిసిఫ్లోరే శ్రేణి: పుష్పాసనం ‘కప్’ ఆకారంలో ఉంటుంది. పుష్పాలు ‘అండకోశాపరిస్థిత’ లో ఉంటాయి ఈ శ్రేణిలో 5 కోహర్ట్లు లేదా క్రమాలు ఉంటాయి.
కుటుంబం: ఫాబేసి కుటుంబం ‘రోజేల్స్’ క్రమానికి చెందినది.
2. గామోపెటాలే ఉపతరగతి: ఆకర్షక పత్రాలు సంయుక్తం. పరిపత్రావళి రెండు వలయాలలో అమరి ఉంటుంది. కేసరావళి మకుటదళో పరిస్థితం. అండాశయ స్వభావం మరియు పుష్ప భాగాల సంఖ్య (మిరోసిటి) ఆధారంగా ఉపతరగతిని 3 శ్రేణులుగా విభజించారు.
- శ్రేణి-ఇన్ఫిరేయే: నిమ్న అండాశయం. దీని యందు 3 కోహర్ట్లు కలవు.
- శ్రేణి- హెటిరోమిరేయే: ఊర్ధ్వ అండాశయం మరియు ఒకటి లేదా అనేక ఫలదళాలను కలిగి ఉంటాయి. కోహర్ట్లు ఉంటాయి.
- శ్రేణి-కార్పల్లేటె: ఊర్ధ్వఅండాశయం మరియు రెండు ఫలదళాలను కలిగి ఉంటుంది. 4 కోహర్ట్లు ఉంటాయి. సోలనేసి కుటుంబం పొలిమోనియేల్స్ క్రమానికి చెందినది.
3. మోనోక్లామిడే ఉపతరగతి: పరిపత్రావళి రక్షక పత్రాలు లేదా ఆకర్షక పత్రాలుగా విభజించబడలేదు. దీనియందు 8 శ్రేణులు ఉంటాయి. కోహర్ట్లు ఉండవు.
II. వివృత బీజాల తరగతి:ఇవి నగ్న విత్తనాలు ఉన్న మొక్కలలో చేర్చబడినవి. ఇది 3 కుటుంబాలుగా విభజించబడినది. అవి సైకాడెసియే, కోనిఫెర్లు మరియు నీటేసియే.
III. మోనోకాటిలిడనే తరగతి : విత్తనాలు ఒక బీజదళాన్ని కలిగి ఉంటాయి. అబ్బురపు వేరు వ్యవస్థ, సమాంతర ఈనెల వ్యాపనం, త్రిభాగయుత పుష్పాలు. 7 శ్రేణులు కలవు. కోహర్ట్స్ లేవు. కుటుంబాలు శ్రేణులలోకి ప్రత్యక్షంగా చేర్చబడినవి. లిలియేసే కుటుంబం. ఇవి కరోనరే శ్రేణిలోకి చేర్చబడినవి.
ప్రశ్న 7.
వర్గీకరణశాస్త్రం అంటే ఏమిటి? మొక్కల వివిధ వర్గీకరణ రకాలను గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
మొక్కలు వాటి మధ్యగల సారూప్యతలు మరియు విభేదాలు ఆధారంగా సముదాయాలను వర్గీకరించడాన్ని ‘వర్గీకరణ’ అంటారు. మొక్కల వర్గీకరణను ‘ వృక్ష వర్గీకరణ శాస్త్రం’ అంటారు. దీనియందు నాలుగు ప్రధాన అంశాలు కలవు. అది లక్ష్యీకరణ, గుర్తింపు, నామీకరణ మరియు వర్గీకరణ. మూడు రకాల వర్గీకరణ వ్యవస్థలు కలవు.
1. కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ: బాహ్యంగా కనిపించే బాహ్యస్వరూప లక్షణాలైన ఆకృతి, రంగు, సంఖ్య, మరియు పత్రాకారం మొదలైనటువంటి అంశాల ఆధారంగా మాత్రమే చేసిన వర్గీకరణను ‘కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థలో కొన్ని లక్షణాలను మాత్రమే ఎంపిక చేసుకొని మొక్కలను సముదాయాలుగా విభజించారు.ధియోఫ్రాస్టస్ గ్రంథంలో మొక్కలను మూడు సముదాయాలుగా (i) గుల్మాలు (ii) పొదలు మరియు (iii) వృక్షాలు అని వాటి ఆకృతి ఆధారంగా వర్గీకరించారు. లిన్నియస్ అనే శాస్త్రవేత్త కేసరాలు మరియు ఫలదళాలు సంఖ్య, పొడవు మరియు అవి సంయుక్తం కావడం అనే లైంగిక లక్షణాల ఆధారంగా మొక్కలను 24 సముదాయాలుగా వర్గీకరించాడు.
2. సహజ వర్గీకరణ వ్యవస్థ: అన్ని ముఖ్యమైన స్వరూప లక్షణాలు మరియు వాటి మధ్య సంబంధాలను పరిగణనలోకి తీసుకొని మొక్కలను సముదాయాలుగా వర్గీకరించారు.
ఉదా: బెంధామ్ మరియు హుకర్ వర్గీకరణ వ్యవస్థ, డీ కండోల్ వర్గీకరణ
3. వర్గవికాస వర్గీకరణ వ్యవస్థ: ఇది డార్విన్ పూర్వ కాలం తరువాత వచ్చిన వర్గీకరణ. వర్గవికాస వర్గీకరణ మొక్కల పరిణామక్రమంలోని ప్రవృత్తులను పరిగణనలోకి తీసుకొని చేసినవి. మొక్కల ఆదిమ లక్షణాలు మరియు పరిణితితో చెందిన లక్షణాలను ఈ వ్యవస్థలో పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. పరిణామం అనేది పురోగామి (లేదా) తిరోగామిగా ఉండవచ్చు. ఒక ట్రాక్సన్ స్థాయిని పరిగణించేటపుడు అన్ని లక్షణాలకు సంబంధించిన సమగ్రచిత్రాన్ని పరిగణలోకి తీసుకొంటారు. “ది నేచురలిఖెన్ ఫ్లాంజన్ ఫెమిలియన్” అనే గ్రంధం తో ఎంగ్లర్ మరియు ప్రాంటల్ ఒక వ్యవస్థను ప్రతిపాదించారు. హబిసన్ ‘ఫ్యామిలిస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్’ అనే పుస్తకంలో వేరొక వ్యవస్థను ప్రతిపాదించారు. APG (ఆంజియోస్పెర్మిక్ ఫైలోజెనిటిక్ గ్రూపు) అనే వ్యవస్థ ఆధునికమైన వర్గవికాస వర్గీకరణ.
4. సాంఖ్యక వర్గీకరణశాస్త్రం: సాంఖ్యక వర్గీకరణశాస్త్రం, గణితశాస్త్ర పద్ధతులను ఉపయోగించి వర్గీకరణ సముదాయాల మధ్య ఉన్న భేదాలు మరియు సారూపత్యను లెక్కకడుతుంది. కంప్యూటర్ల ద్వారా ఈ విధానం చాలా సులువుగా వినియోగించుకోవచ్చును. అన్ని లక్షణాలకు సంఖ్య మరియు సంకేతాలను ఇవ్వడం ద్వారా సమచారాన్ని విశ్లేషించడం జరుగుతుంది.
5. కణాధార వర్గీకరణశాస్త్రం: ఇది కణ ఆధార లక్షణాలైన క్రోమోజోమ్ల సంఖ్య నిర్మాణం వంటి వాటిలో వర్గీకరణ సమస్యలను పరిష్కరించే శాస్త్రం.
6. రసాయనిక వర్గీకరణ శాస్త్రం: ఇది మొక్కలలో ఉండే రసాయన పదార్థాల సమాచారాన్ని ఉపయోగించి, వర్గీకరణలోని సమస్యలను పరిష్కరించే శాస్త్రం.