AP Inter 1st Year Botany Important Questions Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

Students get through AP Inter 1st Year Botany Important Questions 6th Lesson ప్రత్యుత్పత్తి విధానాలు which are most likely to be asked in the exam.

AP Inter 1st Year Botany Important Questions 6th Lesson ప్రత్యుత్పత్తి విధానాలు

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
అవృత బీజ మొక్కల జీవిత చక్రంలో బహిర్గత దశ (Dominant Phase) ఏది?
జవాబు:
అవృత బీజ మొక్కల జీవిత చక్రంలో బహిర్గత దశ ‘ద్వయస్థితిక సిద్ధ బీజద దశ’

ప్రశ్న 2.
భిన్నసిద్ధ బీజత అంటే ఏమిటి? ఆవృత బీజ మొక్క అభివృద్ధి చేసే రెండు రకాల సిద్ధ బీజాలను తెలపండి?
జవాబు:

  1. అవృత బీజ మొక్కలో రెండు రకాల సిద్ధబీజాలు ఏర్పడే స్థితిని ‘భిన్నసిద్ధబీజత’ అంటారు.
  2. రెండు రకాల సిద్ధ బీజాలు: సూక్ష్మ మరియు స్థూల సిద్ధబీజాలు.

AP Inter 1st Year Botany Important Questions Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు
ప్రశ్న 3.
శైవలాలు, శిలీంధ్రాలలోని ప్రత్యుత్పత్తి విధానాలను తెలపండి?
జవాబు:
1. శైవలాలలో శాకీయ ప్రత్యుత్పత్తి విధానం: ముక్కలవడం (స్పైరోగైరా)
అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం: గమన సిద్ధబీజాలు
లైంగిక ప్రత్యుత్పత్తి విధానం: సమసంయోగం (క్లాడోఫోరా).

2. శిలీంధ్రాలలో శాకీయ ప్రత్యుత్పత్తి విధానం: ముక్కలవడం
అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం: చలనరహిత సిద్ధబీజాలు
లైంగిక ప్రత్యుత్పత్తి విధానం: సంయోగబీజదాల కలయిక (రైజోఫస్) .

ప్రశ్న 4.
లివర్వర్డ్లు (Liver worts) ఏ విధంగా శాకీయ ప్రత్యుత్పత్తిని జరుపుతాయి?
జవాబు:
లివర్వర్ట్ శాకీయ ప్రత్యుత్పత్తి విధానం: ముక్కలవడం మరియు జెమ్మాలు ఏర్పడుట.

ప్రశ్న 5.
బ్యాక్టీరియమ్లు, ఈస్ట్లు, అలైంగిక ప్రత్యుత్పత్తి జరపటం కోసం చూపే రెండు లక్షణాలను తెలపండి?
జవాబు:

  1. బాక్టీరియమ్లలో అలైంగిక ప్రత్యుత్పత్తి ‘ద్విదావిచ్ఛిత్తి’ ద్వారా జరుగుతుంది. ఇందులో కణాలు వేగంగా ప్రౌడ కణాలుగా అభివృద్ధి చెందుతాయి.
  2. ఈస్ట్ కణాలలో అలైంగిక ప్రత్యుత్పత్తి ‘మొగ్గతొడగడం’ ద్వారా జరుగుతుంది. ఇందులో చిన్న మొగ్గలు పెఁన్దవై కొత్త ఈస్ట్ జీవులుగా మారుతాయి. ఇవన్నీ ఒకేలా ఉంటూ జనక కణాన్ని పోలి ఉంటాయి.

ప్రశ్న 6.
అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి ద్వారా ఏర్పడే సంతతిని ‘క్లోన్’ అని ఎందుకు మనం అంటాము?
జవాబు:

  1. అలైంగిక ప్రత్యుత్పత్తి లో రెండు జనకాలు పాల్గోనవు. పిల్లమొక్కలు జనక మొక్కలను పోలి ఉంటాయి.
  2. కావున వీటిని ‘క్లోన్’లు అని అంటారు.

ప్రశ్న 7.
ఏకవార్షిక, బహువార్షిక మొక్కల మధ్య దేనిలో తక్కువ శైశవ దశ (Juvenile phase) ఉంటుంది. ఒక కారణాన్ని తెలపండి.
జవాబు:

  1. ఏకవార్షిక మొక్క బహువార్షిక మొక్క కంటే తక్కువ శైశవ దశను కలిగి ఉంటుంది.
  2. కారణం: వీటి జీవిత కాలం బహువార్షిక మొక్కల జీవిత కాలం కంటే తక్కువ ఉండుట.
    ఏకవార్షిక మొక్కల జీవితకాలం ఒక సంవత్సరం (లేదా) ఒక ఋతువు మాత్రమే ఉంటుంది.

ప్రశ్న 8.
ఒక పుష్పించే మొక్కలో లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జరిగే విధానంలోని క్రింది సంభవాలను ఒక క్రమ పద్ధతిలో తిరిగి పొందు పరచండి.
పిండజననం, ఫలదీకరణ, సంయోగ జీజ జననం, పరాగ సంపర్కం.
జవాబు:
సంయోగబీజ జననము → పరాగసంపర్కం → ఫలదీకరణం → పిండజననం

ప్రశ్న 9.
ప్రత్యుత్పత్తి విధానాలు బహూకణయుత జీవులలో కణవిభజన అనేది ఒక రకమైన ప్రత్యుత్పత్తి అవునా లేక కాదా అనే దానికి సరియైన కారణాలు తెలపండి.
జవాబు:

  1. బహూకణయుత జీవులలో ప్రత్యుత్పత్తి శాకీయ లేదా అలైంగిక విధానాల ద్వారా జరుగుతుంది.
    కావున కణవిభజన ఒక రకమైన ప్రత్యుత్పత్తి విభజన కావచ్చు.
  2. సాధారణంగా బహూకణయుత జీవులలో కణవిభజన పెరుగుదల మరియు అభివృద్ధి కొరకు అవసరం కాని సరికొత్త సంతతి కొరకు కాదు. కావున కణవిభజన అనేది ప్రత్యుత్పత్తి కాకపోవచ్చు.

AP Inter 1st Year Botany Important Questions Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

ప్రశ్న 10.
ఈ క్రింది వాటిలో ద్విలింగాశ్రయ ఏకలింగాశ్రయ మొక్కలను గుర్తించండి.
a) ఖర్జూరం
b) కొబ్బరి
c) కారా
d) మార్కాంషియా (Marchantia)
జవాబు:
a. ఖర్జూరం – ఏకలింగాశ్రయ;
c. కారా – ‘ద్విలింగాశ్రయ
b. కొబ్బరి – ద్విలింగాశ్రయ
d. మార్కాంషియా – ఏకలింగాశ్రయ

ప్రశ్న 11.
ఈ పట్టికలో ‘A’ లోని మొక్కలతో వాటి శాకీయ భాగాలున్న పట్టిక ‘B’ తో జత చేయండి.
పట్టిక ‘A’ – పట్టిక ‘B’
i) బ్రయోఫిల్లమ్ – a) ఆఫ్సెట్
ii) అగేవ్ – b) కళ్లు
iii) బంగాళాదుంప – c) పత్ర మొగ్గలు
iv) గుఱ్ఱపుడెక్క – d) ముక్కలు కావడం
v) కారా – e) పిలక మొక్కలు
vi) మెంథా – f) లఘు లశునాలు
జవాబు:
i) c
ii) f
iii) b
iv) a
v) d
vi) e

ప్రశ్న 12.
ఈ క్రింది పుష్పభాగాలు ఫలదీకరణ తరువాత ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో తెలపండి?
a) అండాశయం
b) కేసరాలు
c) అండాలు
d) రక్షకపత్రావళి
జవాబు:
a. అండాశయం → ఫలంగా మారును;
b. కేసరాలు → రాలిపోతాయి,
c. అండాలు → విత్తనాలు
d. రక్షకపత్రావళి → రాలిపోతాయి లేదా కొన్ని మొక్కలలో ఫలాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి (వంగ, టమాటా)

ప్రశ్న 13.
‘వివిపారి’ (శిశుఉత్పాదన) (vivipary) అనే దానిని ఒక ఉదాహరణతో నిర్వచించండి.
జవాబు:

  • శిశుఉత్పాదన (వివిపారి):- కొన్ని మొక్కలలో విత్తనాలు తల్లి మొక్కలను అంటిపెట్టుకుని ఉండగానే అంకురిస్తాయి.
  • దీనినే వివిపారి (శిశుఉత్పాదన) అంటారు. ఉదా: రైజోఫోరా.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ఉదాహరణలతో సంయోగ బీజజనం గురించి క్లుప్తంగా రాయండి. [TS M-16]
జవాబు:

  1. రెండు రకాల సంయోగ బీజాలు అనగా పురుష, స్త్రీ సంయోగ బీజాలు ఏర్పడే విధానాన్ని ‘సంయోగబీజ జననం’ అంటారు.
  2. సంయోగ బీజాలు ఏకస్థితిక కణాలు
  3. కొన్ని శైవలాల్లో పురుష, స్త్రీ సంయోగ బీజాలు రెండూ గుర్తించలేనంతగా ఒకే విధంగా ఉండటంతో వీటిని ‘సమసంయోగ బీజాలు’ అంటారు. ఉదా: క్లాడోఫోరా
  4. అయితే లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే అనేక జీవులలో ఏర్పడే సంయోగ బీజాలు రెండూ స్వరూపంలో భిన్నంగా ఉంటాయి. వీటినే ‘భిన్న సంయోగ బీజాలు’ అని అంటారు. ఉదా: ప్యునేరియా, టెరిస్, సైకస్.
  5. ఈ జీవులలో ఏర్పడే పురుష సంయోగ బీజాన్ని ‘చలన పురుష బీజం’ (ఆంథరోజాయిడ్)అని, స్త్రీ సంయోగ బీజాన్ని ‘స్త్రీ బీజ కణం’ అని అంటారు.

AP Inter 1st Year Botany Important Questions Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

ప్రశ్న 2.
జీవులలో లైంగికత్వం గురించి తెలపండి.
జవాబు:

  1. జీవులలో లైంగిక ప్రత్యుత్పత్తి రెండు భిన్న జీవుల సంయోగబీజాల కలయిక ద్వారా జరుగుతుంది.
  2. కొన్ని సందర్భాలలో ఒకేజీవి సంయోగబీజాలు సంయోగం చెందుతాయి. దీనిని ‘స్వయం ఫలదీకరణం’ అంటారు.
  3. ఒక మొక్క పురుష మరియు స్త్రీ రెండు లైంగిక నిర్మాణాలను కలిగి ఉంటే దానిని ‘ద్విలింగాశ్రయ మొక్క’ అంటారు.
  4. ఒక మొక్క ఏదైన ఒక లింగాన్ని మాత్రమే కలిగి ఉంటే అటువంటి మొక్క ‘ఏకలింగాశ్రయ మొక్క’ అంటారు.
  5. శిలీంధ్రాలలో ద్విలింగక స్థితిని తెలుపుటకు ద్విలింగాశ్రయ అను పదమును ఉపయోగిస్తారు.
  6. పుష్పించే మొక్కలలో ద్విలింగక స్థితిని తెలుపుటకు ‘ద్విలింగాశ్రయ స్థితి’ అను పదమును ఉపయోగిస్తారు.
  7. శిలీంధ్రాలలో ఒకే లింగం ఉండే స్థితిని ‘ఏకలింగాశ్రయ’ అంటారు.
  8. పుష్పించే మొక్కలలో ఒకే లింగం ఉండే స్థితిని ‘ఏకలింగాశ్రయ స్థితి’ అంటారు.
  9. ఒకే మొక్కపై పురుష,స్త్రీ పుష్పాలు ఉంటే ఆ మొక్క ద్విలింగాశ్రయ స్థితిని కలిగి ఉంటుంది.
    ఉదా: కొబ్బరి
  10. పురుష, స్త్రీ పుష్పాలు వేరు వేరు మొక్కలపై ఉంటే ఆ మొక్కలు ఏకలింగాశ్రయస్థితిని కలిగి ఉంటాయి. ఉదా: బొప్పాయి, ఖర్జూరం

ప్రశ్న 3.
“కొన్ని మొక్కలలో ఫలాలు ఏర్పడడానికి ఫలదీకరణ అనేది ఆవశ్యకర్తవ్యమైన (obligatory) సంఘటన కాదు”? ఈ వాక్యాన్ని వివరించండి?
జవాబు:

  1. కొన్ని సందర్భాలలో పుష్పంలో ఫలదీకరణం జరగకుండానే ఫలాలు ఏర్పడతాయి. అటువంటి ప్రక్రియను ‘అనిషేక జననం’ అంటారు.
  2. ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడిన ఫలాలను ‘అనిషేక ఫలాలు’ అంటారు. అనిషేక ఫలనము సహజంగా లేదా ప్రేరితంగా ఉంటుంది.
  3. కావున ఫలాలు ఏర్పడటానికి ఫలదీకరణం అనేది ఆవశ్యకర్తవ్యమైన అంశం కాదు.
    ఉదా: అరటి, జామ, అనాస.
  4. ఫలాలనిచ్చు పంటలలో అనిషేకజననం చాలా ముఖ్యమైన ప్రక్రియ.

ప్రశ్న 4.
ఆవృత బీజ పుష్పంలో పరాగసంపర్కం, ఫలదీకరణ తరువాత ఏర్పడే మార్పులను తెలపండి? [AP M-16,17] [IPE- 14,13][TS May-17]
జవాబు:
A. పరాగసంపర్కం తరువాత సంఘటనలు:

  1. పరాగసంపర్కం అయిన తరువాత పుప్పోడి రేణువులు కీలాగ్రాన్ని చేరి పరాగనాళంను ఏర్పరుస్తాయి.
  2. ‘పరాగనాళం’ కీలాగ్రం మరియు కీలం యొక్క కణజాలం ద్వారా అండాశయంను చేరుతుంది.
  3. ‘పరాగనాళం’ అండంను రంధ్రసంయోగం లేదా చలాజ సంయోగం లేదా మధ్యసంయోగం ద్వారా చేరుతుంది.
  4. పరాగనాళం పిండకోశంను చేరిన వెంటనే పగిలి, రెండు పురుషసంయోగబీజాలను జీవద్రవంలోనికి విడుదల చేస్తుంది.
  5. రెండు పురుష సంయోగబీజాలు ద్విఫలదీకరణలో పాల్గొంటాయి.

B. ఫలదీకరణ తరువాత జరిగే సంఘటనలు:

  1. ఫలదీకరణం జరిగిన తరువాత రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, కీలం మరియు కీలాగ్రం వడలి రాలిపోతాయి.
  2. ఫలదీకరణ చెందిన అండాశయం ‘ఫలం’గా మారుతుంది.
  3. ఫలదీకరణ తరువాత అండాలు ‘విత్తనాలు’గా మారతాయి.
  4. సంయుక్త బీజం ‘పిండం’గా అభివృద్ధి చెందుతుంది.
  5. ప్రతిపాద కణాలు నశిస్తాయి.
  6. ప్రాధమిక అంకురచ్చేద కేంద్రకం ‘అంకురచ్చదంగా’ మారుతుంది.
  7. అండకవచాలు ‘బీజకణాలు’గా మారతాయి,
  8. అండం యొక్క అండద్వారం, ‘విత్తన బీజ ద్వారం’గా మారుతుంది.

ప్రశ్న 5.
ఈ క్రింది పదాలను వివరించండి.
a) శైశవ దశ
b) ప్రత్యుత్పత్తి దశ
జవాబు:
(a) శైశవ దశ: అన్నీ జీవులు కొంత కాలం పెరిగి తరువాత పక్వస్థితిలో ప్రత్యుత్పత్తి దశ చేరుకొనే ముందు వరకు గల దశను శైశవ దశ అంటారు. దీనినే శాకీయ దశ అని కూడా అంటారు.

(b) ప్రత్యుత్పత్తి దశ: మొక్కలు పుష్పాలను ఉత్పత్తి చేసే దశను ప్రత్యుత్పత్తి దశ అంటారు. ఇది శైశవదశకు ముగింపు దశ అని చెప్పవచ్చు.

AP Inter 1st Year Botany Important Questions Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

ప్రశ్న 6.
అలైంగిక, లైంగిక ప్రత్యుత్పత్తుల మధ్య తేడాలను గుర్తించండి. శాకీయ ప్రత్యుత్పత్తిని కూడా ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి రకంగా ఎందుకు పరిగణిస్తారు? [AP M-20]
జవాబు:
అలైంగిక ప్రత్యుత్పత్తి

  1. ఇందులో ఒకే ఒక జనకం పాల్గొంటుంది.
  2. సంయోగబీజాలు ఏర్పడవు.
  3. సంయోగ బీజాల కలయిక ఉండదు.
  4. ఫలదీకరణం జరగదు.
  5. సంతతి ఒక దానితో ఒకటి పోలి ఉంటాయి. మరియు జనకానికి నకలుగా ఉంటాయి.

లైంగిక ప్రత్యుత్పత్తి

  1. ఇందులో రెండు జనకులు పాల్గొంటాయి.
  2. పురుష మరియు స్త్రీ సంయోగబీజాలు ఏర్పడతాయి.
  3. సంయోగబీజాల కలయిక జరుగుతుంది.
  4. ఫలదీకరణం జరుగుతుంది.
  5. సంతతిలో వైవిధ్యాలు ఉంటాయి.

శాకీయప్రత్యుత్పత్తిలో ఒకే జనకం పాల్గొంటుంది. రెండు జనకాలు పాల్గొనవు.
కావున శాకీయ ప్రత్యుత్పత్తిని ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి రకంగా పరిగణించవచ్చు.

ప్రశ్న 7.
ఈ క్రింది పుష్పించే మొక్క భాగాలను గుర్తించి, అవి ఏకస్థితికాలా (n) లేక ద్వయ స్థితికాలా(2n) అనేది రాయండి. [TS M-17]
a) అండాశయం
b) పరాగకోశం
c) స్త్రీ బీజకణం
d) పరాగరేణువు
e) పురుష సంయోగబీజం
f) సంయుక్తబీజం
g) ప్రతిపాదకణం
h) స్థూలసిద్ధబీజ మాతృక కణం
జవాబు:
(a) అండాశయం – ద్వయస్ధితికం (2n)
(b) పరాగకోశం – ద్వయస్ధితికం (2n)
(c) స్త్రీ బీజకణం – ఏకస్థితికం (n)
(d) పరాగరేణువు – ఏకస్థితికం (n)
(e) పురుష సంయోగబీజం- ఏకస్థితికం (n)
(f) సంయుక్తబీజం- ద్వయస్థితికం (2n)
(g) ప్రతిపాదకణం- ఏకస్థితికం (n)
(h) స్థూలసిద్ధబీజ మాతృక కణం- ద్వయస్ధితికం (2n)

ప్రశ్న 8.
ఆవృత బీజ మొక్క జీవిత చక్రంలోని దశల గూర్చి క్లుప్తంగా వ్రాయండి. [AP M-19]
జవాబు:
ఆవృత బీజ మొక్క జీవిత చక్రం:

  1. ఆవృత బీజ మొక్క జీవిత చక్రంలో ప్రధానంగా రెండు దశలు (తరాలు) ఉంటాయి.
  2. ఒకటి ద్వయస్థితిక ‘సిద్ధబీజదశ’ మరియు రెండవది ‘ఏకస్థితిక సంయోగబీజదశ’.
  3. వీటిలో ద్వయస్థితిక సిద్ధబీజ దశ ప్రధానమైన దశ.
  4. పుష్పంలోని కేసరావళిలో సూక్ష్మసిద్ధబీజాశయం ‘సూక్ష్మసిద్ధబీజ మాతృకణాలను’ కల్గి ఉంటుంది.
  5. ఆ మాతృకణాలు క్షయకరణం విభజన చెంది సూక్ష్మసిద్ధబీజాలను (పరాగరేణువులను) ఏర్పరుస్తాయి.
  6. అండకోశం లేదా ఫలదళాలలోని అండాశయంలో ‘స్థూలసిద్ధబీజమాతృకణాలు’ ఉంటాయి.
  7. స్థూలసిద్ధబీజమాతృకణాల క్షయకరణ విభజన వల్ల స్థూలసిద్ధబీజాలు ఏర్పడతాయి.
  8. సూక్ష్మ సిద్ధబీజాలు, స్థూల సిద్ధబీజాలు ఏర్పడిన తరువాత ‘సిద్ధబీజదశ’ తరం అయిపోతుంది.
  9. సూక్ష్మ మరియు స్థూల సిద్ధబీజాలు పురుష, స్త్రీ సంయోగ బీజాలుగా మారుతాయి
  10. పురుష, స్త్రీ సంయోగ బీజాలు సంయుక్తం చెంది ‘సంయుక్త బీజాన్ని’ ఏర్పరుస్తాయి.
  11. సంయుక్త బీజం అనేది సిద్ధబీజదం యొక్క మొదటి కణం.
  12. సంయుక్త బీజం అనేక సమవిభజనలను జరిపి విత్తనంలో పిండాన్ని ఏర్పరుస్తుంది.
  13. ఆ విత్తనం మొలకెత్తి సిద్ధబీజదపు మొక్కను ఏర్పరుస్తుంది.
    AP Inter 1st Year Botany Important Questions Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు 1

AP Inter 1st Year Botany Important Questions Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
అలైంగిక, లైంగిక ప్రత్యుత్పత్తుల మధ్య తేడాలను గూర్చి రాయండి. ఏకకణ జీవులు చూపే అలైంగిక ప్రత్యుత్పత్తి
జవాబు:
రకాలను వివరించండి?
అలైంగిక ప్రత్యుత్పత్తి

  1. ఇందులో ఒక జీవి మాత్రమే పాల్గొంటుంది.
  2. సంయోగబీజాల ఉత్పత్తి ఉండదు.
  3. సంయోగబీజాల కలయిక ఉండదు.
  4. క్షయకరణ విభజన మాత్రమే జరుగుతుంది.
  5. ఈ విధానంలో ఏర్పడిన సంతతి జనకులను పోలి ఉంటాయి.
  6. జన్యు వైవిధ్యం అనేది యాధృచ్ఛిక ఉత్పరివర్తనాల ద్వారా జరుగుతుంది.
  7. ప్రకృతి వరణం మరియు జాతుల పరిణామంలో ఇది అంతగా ఉపయోగపడదు.
  8. సిద్ధబీజాలు ఏర్పడుట, ముక్కలవడం ద్వారా ఇది జరుగుతుంది.
    ఉదా: శిలీంధ్రాలు, శైవలాలు, బాక్టీరియా.

లైంగిక ప్రత్యుత్పత్తి

  1. ఇందులో ఒకటి లేదా రెండు జీవులు పాల్గొంటాయి.
  2. పురుష మరియు స్త్రీ సంయోగబీజాలు ఏర్పడతాయి.
  3. సంయోగబీజాల కలయిక జరుగుతుంది.
  4. క్షయకరణ మరియు సమవిభజన రెండూ జరుగుతాయి.
  5. ఈ విధానంలో ఏర్పడిన సంతతి కొన్ని లక్షణాలను తండ్రి నుండి మరికొన్ని తల్లి జనకం నుండి పొందుతాయి.
  6. జన్యువైవిధ్యంకు అధిక అవకాశం కలదు.
  7. ప్రకృతివరణం మరియు జాతుల పరిణామంలో ఇది ఎక్కువగా సహాయపడుతుంది.
  8. ఇది పరాగసంపర్కం మరియు ఫలదీకరణం ద్వారా జరుగుతుంది.
    ఉదా: మానవులు, కీటకాలు.

ఏకకణ యుతజీవులలో అలైంగిక ప్రత్యుత్పత్తి రకాలు:
a. ద్విదావిచ్ఛిత్తి
b. మొగ్గతొడగడం మరియు
c. సిద్ద బీజాలు

a. ద్విదావిచ్ఛిత్తి: ఈ విధానంలో జనక కణం రెండు సమభాగాలుగా క్షయకరణవిభజన ద్వారా విభజన చెంది ఒక్కొక్కభాగం ఒక కొత్త జీవిగా ఏర్పడుతుంది. ఉదా: బాక్టీరియా, అమీబా మొదలైనవి.

b. మొగ్గ తొడగుట లేదా ప్రరోహోత్పత్తి: ఈ విధానంలో చిన్న ప్రరోహాలు ఏర్పడటంతో, అవి మొదట జనక కణాన్ని అంటిపెట్టుకొని ఉంటూ తరువాత విడిపోయి, అభివృద్ధి చెంది, పక్వదశకు చేరుకొని కొత్త జీవులు (కణాలు ) ఏర్పడతాయి. ఇందులో విభజన అసమానంగా జరుగుతుంది. ఉదా: ఈస్ట్

c. సిద్ధబీజాలు ఏర్పడుట:అనేక ఏకకణ శిలీంధ్రాలు మరియు శైవలాలు సిద్ధబీజాలు అనే ప్రత్యేక నిర్మాణాలు ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తిని ఏర్పరుస్తాయి. వీటిని గమన సిద్ధబీజాలు అంటారు.
ఉదా: క్లామిడో మోనాస్
AP Inter 1st Year Botany Important Questions Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు 2

ప్రశ్న 2.
పుష్పంలోని ఫలదీకరణాంతర మార్పుల గూర్చి వివరించండి.
జవాబు:
ఫలదీకరణం తరువాత పుష్పంలో వచ్చే మార్పులు:

  1. రక్షక, ఆకర్షక పత్రాలు, కేసరాలు, కీలం మరియు కీలాగ్రాలు వడలి, రాలిపోతాయి.
  2. అండాశయం- ఫలంగా మారుతుంది.
  3. అండాలు-విత్తనాలుగా మారతాయి.
  4. అండాశయ కవచం – ఫలకవచంగా మారుతుంది.
  5. అండవృంతం – విత్తన వృంతంగా మారుతుంది.
  6. అండం యొక్క బాహ్యకవచం – బాహ్య బీజకవచం (టెస్టా) గా మారుతుంది.
  7. అండం యొక్క అంతర కవచం – అంతర బీజ కవచం (టెగ్మా)గా మారుతుంది.
  8. అండం యొక్క అండ ద్వారం – విత్తనం యొక్క విత్తన ద్వారంగా మారుతుంది.
  9. సంయుక్త బీజం – పిండంగా మారుతుంది.
  10. సహాయకణాలు – అంతరించిపోతాయి
  11. ప్రతిపాదిత సహయకణాలు – అంతరించిపోతాయి
  12. అండం యొక్క కాడ (రాఫె) – హైలమ్ (విత్తనాచార)గా మారుతుంది.
  13. అంకురచ్ఛదం -పిండం యొక్క పోషక కణజాలం గా మారుతుంది. ఉదా: మొక్కజొన్న, కోకా.
  14. సోలానమ్లో రక్షకపత్రాలు శాశ్వతం.
  15. ట్రైడాక్స్లో రక్షకపత్రాలు
  16. అండం యొక్క అండాంతఃకణజాలం నింఫియా మరియు పైపర్ మొక్కలలో పోషకకణజాలంగా మారుతుంది.

Leave a Comment