Students get through AP Inter 1st Year Botany Important Questions 5th Lesson పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం which are most likely to be asked in the exam.
AP Inter 1st Year Botany Important Questions 5th Lesson పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం
Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
పీచువేర్లకు, అబ్బురపు వేర్లకు గల భేదాలు వ్రాయండి. [AP M-20]
జవాబు:
పీచువేర్లు
- కాండం దిగువ భాగం నుంచి ఏర్పడే వేర్లను పీచువేర్లు అంటారు.
- ఉదా: ఏకదళ బీజాలైన మొక్కజొన్న
అబ్బురపు వేర్లు
- ప్రథమ మూలం నుంచి గాక మొక్క ఇతర భాగాలను నుంచి వేర్లు ఏర్పడితే వాటిని అబ్బురపు వేర్లు అంటారు.
- ఉదా: వాండాలోని వెలామిన్ వేర్లు
ప్రశ్న 2.
‘రూపాంతరం’ను నిర్వచించండి. మర్రి వృక్షం, మాంగ్రూప్ మొక్కలలో వేరు ఏ విధంగా రూపాంతరం చెందిందో తెలపండి.
జవాబు:
- రూపాంతరం: కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించడానికిగాను మొక్కల అంగాలలో ఏర్పడే నిర్మాణాత్మకమైన శాశ్వత మార్పుని రూపాంతరం అంటారు.
- మర్రి వృక్షంలో వేర్లు పెద్దశాఖల నుండి ఊడవేర్లుగా రూపాంతరం చెందుతాయి. ఇవి నేలలోనికి పెరిగి స్థంభాలవలె పెరిగి వృక్షానికి అదనపు ఆధారాన్ని ఇస్తాయి.
- మాంగ్రూవ్ మొక్కలలో వేర్లు శ్వాసమూలాలుగా రూపాంతరం చెందాయి. ఇవి బురదనుండి భూమిపైకి నిటారుగా పెరుగుతాయి.
ప్రశ్న 3.
వృక్షోపజీవుల మొక్కలలో ఏ రకం ప్రత్యేకమైన వేర్లు ఏర్పడతాయి? వాటి విధిని తెలపండి.
జవాబు:
- వృక్షోపజీవ మొక్కలలో ‘వెలమిన్ వేర్లు’ అనే ప్రత్యేకమైన అబ్బురపు వేర్లు ఏర్పడతాయి.
- ఇవి వాతావరణం నుండి తేమను గ్రహించి మొక్కకు అందిస్తాయి.
ప్రశ్న 4.
క్రిసాంథిమమ్ (చామంతి)లో గల పిలక మొక్క జాస్మిన్ (మల్లె) లోగల స్టోలను ఏ విధంగా విభేదిస్తుంది?
జవాబు:
- క్రిసాంథిమమ్లోని పిలక మొక్కలు భూగర్భకాండ భాగాల నుంచి ఏర్పడతాయి.
- జాస్మిన్లోగల స్టోలాన్ అనే శాఖలు వాయుగతంగా పెరుగుతాయి. ఈ రెండు కూడా శాఖీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి.
ప్రశ్న 5.
తల్పం వంటి పత్రపీఠం అంటే ఏమిటి? ఏ ఆవృత బీజపు కుటుంబ మొక్కలలో అవి కనిపిస్తాయి?
జవాబు:
- ఉబ్బి ఉండే పత్ర పీఠమును ‘తల్పం వంటి పత్ర పీఠం ‘ అంటారు. [TS M-20] [ AP M-17] [IPE Mar 14]
- ఇది లెగ్యుమెనోసి కుటుంబపు మొక్కలలో కన్పిస్తుంది.
ప్రశ్న 6.
‘ఈనెల వ్యాపనం’ను నిర్వచించండి. ద్విదళ బీజాలు, ఏకదళబీజాలు నుంచి ఈనెల వ్యాపనంలో ఏ విధంగా విభేదిస్తాయి? [TS-18] [ APM-15]
జవాబు:
1. ఈనెల వ్యాపనం:పత్రదళంలో ఈనెలు, పిల్ల ఈనెలు అమరి ఉండే విధానాన్ని ‘ఈనెల వ్యాపనం’ అంటారు. 2. ద్విదళ బీజాలు ‘జాలాకార ఈనెల వ్యాపనాన్ని, ఏకదళబీజాలు ‘సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి.
ప్రశ్న 7.
పిచ్ఛాకార సంయుక్త పత్రం, హస్తాకార సంయుక్త పత్రాన్ని ఏ విధంగా విభేదిస్తుంది? ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
పిచ్ఛాకార సంయుక్త పత్రం
- పిచ్ఛాకార సంయుక్త పత్రంలో పత్రకాలు ఒకే విన్యాసాక్షం పై ఇరువైపులా అమరి ఉంటాయి.
ఉదా: వేప, కరివేపాకు
హస్తాకార సంయుక్త పత్రం
- హస్తాకార సంయుక్త పత్రంలో పత్రకాలు, పత్రవృంతం ‘కొన భాగంలో అమరి ఉంటాయి.
- ఉదా: చిక్కుడు, బూరుగ
ప్రశ్న 8.
కీటకాహారి మొక్కలలో కీటకాన్ని బంధించడానికి ఏ అంగం రూపాంతరం చెందింది? రెండు ఉదాహరణలు ఇవ్వండి. [APM-19]
జవాబు:
- కీటకాహారి మొక్కలలో కీటకాలను బంధించడానికి పత్రాలు ‘బోను పత్రాలు’గా రూపాంతరం చెందుతాయి.
- ఉదా: నెప్టెంథిస్, డయోనియా.
ప్రశ్న 9.
మధ్యాభిసార, నిశ్చిత పుష్ప విన్యాసాల మధ్యగల భేదాన్ని తెలపండి. [TS M-15] [AP M-22]
జవాబు:
మధ్యాభిసార పుష్పవిన్యాసము
- పుష్పవిన్యాస అక్షం అనిశ్చితంగా పెరుగుతుంది.
- పుష్పాలు అభిసార క్రమంలో అమరి ఉంటాయి.
నిశ్చిత పుష్పవిన్యాసము
- పుష్పవిన్యాస అక్షం నిశ్చితంగా పెరుగుతుంది.
- పుష్పాలు ఆధారభిసార క్రమంలో అమరి ఉంటాయి.
ప్రశ్న 10.
సయాథియమ్లోని గిన్నె వంటి నిర్మాణం స్వరూపాన్ని తెలపండి. ఏ కుటుంబంలో అది కనిపిస్తుంది. [TS M-17,22][ AP M-15,18]
జవాబు:
- సయాథియంలో గిన్నె వంటి నిర్మాణం స్వరూపం ‘పరిచక్ర పుచ్ఛావళి’ .
- ఇది ‘యూఫోర్బియేసి’ కుటుంబంలో కన్పిస్తుంది.
ప్రశ్న 11.
ఫిగ్ (మర్రి జాతి) వృక్షాలలో ఏ పుష్ప విన్యాసం కనిపిస్తుంది? బ్లాస్టోఫాగా కీటకం ఆ వృక్షంలోని పుష్ప విన్యాసాన్ని ఎందుకు చేరుతుంది?
జవాబు:
- ఫిగ్ (మర్రిజాతి) వృక్షంలో ‘హైపన్ థోడియమ్’ పుష్పవిన్యాసము కనిపిస్తుంది. [AP M-16]
- బ్లాస్టోఫాగా అను కీటకము ఆ పుష్పవిన్యాసంలోని గాల్ పుష్పాలలో తన గుడ్లను పొదుగుతుంది.
ప్రశ్న 12.
సౌష్ఠవయుత పుష్పానికీ, పాక్షికసౌష్టవయుత పుష్పానికి గల భేదాన్ని తెలపండి. [ TS May-17, 19,22][ AP M-16]
జవాబు:
సౌష్టవయుత
- ఇందులో పుష్పాన్ని మధ్య నుంచి ఏ వ్యాసార్ధపు తలం నుంచైనా రెండు సమ భాగాలుగా విభజించవచ్చు.
- ఉదా: మందార, దతూర
పాక్షిక సౌష్టవయుతం
- ఇందులో పుష్పాన్ని మధ్య నుంచి ఏదో ఒక తలం నుంచి మాత్రమే నిలువునా రెండు సమ భాగాలుగా విభజించవచ్చు
- ఉదా: బఠాణి, చిక్కుడు
ప్రశ్న 13.
బఠానీ మొక్కలో ఆకర్షణ పత్రాలు ఏ విధంగా అమరి ఉంటాయి? అటువంటి అమరికను ఏమంటారు?
జవాబు:
- బఠానీ పుష్పంలో ఐదు ఆకర్షణ పత్రాలు ఉంటాయి. అతిపెద్ద ఆకర్షణపత్రము రెండు పార్శ్వ ఆకర్షణపత్రాలను కప్పి ఉంచుతుంది. ఈ పార్శ్వ పత్రాలు పూర్వాంతంలో ఉన్న రెండు అతి చిన్నవైన ఆకర్షణ పత్రాలు కప్పి ఉంచుతాయి.
- ఈ రకపు అమరికను ‘వెక్సిల్లరీ’ లేదా ‘పాపిలియోనేషియస్’ పుష్పరచన అంటారు.
ప్రశ్న 14.
మకుటదళోపరిస్థితం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి. [TS M-22][ AP March, May-17,22]
జవాబు:
- ఒక పుష్పంలోని కేసరాలు ఆకర్షణ పత్రాలతో సంయుక్తమైతే దానిని ‘మకుటదళో పరిస్థితం’ అని అంటారు.
- ఉదా: దతూర, వంగ
ప్రశ్న 15.
అసంయుక్త, సంయుక్త అండాశయాల మద్య భేదాలు తెలపండి.
జవాబు:
అసంయుక్త అండాశయం
- అండాశయంలో ఉన్న ఫలదళాలు పుష్పాసనం పై విడి విడిగా ఉంటే దానిని అసంయుక్త అండాశయం అంటారు.
- ఉదా: తామర
సంయుక్త అండాశయం
- అండాశయంలో ఉన్న ఫలదళాలు కలిసి వుంటే దానిని సంయుక్త అండాశయం అంటారు.
- ఉదా: టమాటా
ప్రశ్న 16.
‘అండన్యాసం’ ను నిర్వచించండి. డయాంథస్ లో ఏ రకం అండన్యాసం కనిపిస్తుంది? [AP M-20][TS M-15,18,20]
జవాబు:
- అండన్యాసం: అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసం అంటారు.
- డయాంథస్లో ‘స్వేచ్ఛాకేంద్ర అండన్యాసం’ ఉంటుంది.
ప్రశ్న 17.
అనిషేక ఫలం అంటే ఏమిటి? అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? [AP M-17]
జవాబు:
- ఫలదీకరణ చెందని అండాశయం నుండి ఏర్పడే ఫలమును ‘అనిషేక ఫలం’ అని అంటారు. ఉదా: అరటి.
- అనిషేకఫలాలు విత్తన రహితంగా ఉంటాయి కావున అవి తినడానికి తేలికగా ఉంటాయి.
వీటిని రసాల తయారీ పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
ప్రశ్న 18.
మామిడిలో ఏ రకం ఫలం ఉంది? అది కొబ్బరి ఫలాన్ని ఏ విధంగా విభేదిస్తుంది?
జవాబు:
- మామిడిలో గల ఫలాన్ని ‘టెంకగల ఫలం’ (డ్రూప్) అంటారు.
- మామిడిలో మధ్య ఫలకవచం తినగలిగే విధంగా కండకల్గి ఉంటుంది.
- కొబ్బరిలో మధ్యఫలకవచం తినటానికి వీలు లేని పీచులాగా ఉంటుంది.
ప్రశ్న 19.
కొన్ని ఫలాలను అవృత ఫలాలు అని ఎందుకు అంటారు? రెండు ఉదాహరణలను ఇవ్వండి. [AP M-19]
జవాబు:
- అండాశయం నుంచి మాత్రమే అభివృద్ధి చెందే ఫలాలను ‘నిజఫలాలు’ అంటారు.
- కొన్ని మొక్కలలో ఫలాలు అండాశయేతర పుష్పాసనం నుండి ఏర్పడుతాయి. కావున వీటిని అవృత ఫలాలు అంటారు. ఉదా: ఆపిల్, జీడిమామిడి.
ప్రశ్న 20.
ఒకే విత్తనం గల శుష్క ఫలాలను ఏర్పరచే రెండు మొక్కల పేర్లను తెలపండి. [ TS M-19]
జవాబు:
- జీడి మామిడి (పెంకుగలఫలం)
- వరి (కవచ బీజకం)
- గడ్డిచేమంతి (సిప్సెలా)
ప్రశ్న 21.
షైజోకార్పిక్ శుష్క ఫలాలను నిర్వచించండి. ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
- షైజోకార్పిక్ శుష్క ఫలాలు: ఒకే విత్తనం కలిగి ఫలాంశాలు గా విడిపోయే ఫలాలను షైజోకార్పిక్ శుష్కఫలాలు అంటారు.
- ఉదా: అకేసియా, ఆముదం
ప్రశ్న 22.
‘ఫలాంశం’ ను నిర్వచించండి. ఏ మొక్కలో అది ఏర్పడుతుంది? [TS M-16]
జవాబు:
- ఫలాంశం: షైజోకార్పిక్ ఫలం విడిపోగా ఏర్పడే ఒక విత్తనం గల ప్రతి భాగాన్ని ఫలాంశం (మెరికార్ప్) అంటారు.
- అది అకేసియా, ఆముదం మొక్కలలో ఏర్పడుతుంది.
ప్రశ్న 23.
సంకలిత ఫలాలు అని వేటిని అంటారు? రెండు ఉదాహరణలు తెలపండి.
జవాబు:
- ఒక పుష్పంలోని అనేక ఫల దళాలు స్వేచ్ఛగాను, అసంయుక్తంగాను ఉండి. ప్రతి ఫలదళం ఒక చిరు ఫలంగా అభివృద్ధి చెంది, అవి గుమిగుడి ఒక ఫలాన్ని ఏర్పరిస్తే దానిని సంకలిత ఫలం అని అంటారు.
- ఉదా: అనోనా, తామర
ప్రశ్న 24.
పుష్పవిన్యాసం అంతా ఒక ఫలంగా ఏర్పరచే మొక్కను తెలపండి. అటువంటి ఫలాన్ని ఏమంటారు?
జవాబు:
- పుష్పవిన్యాసం అంతా ఒక ఫలంగా ఏర్పరచే మొక్కలు అనాస, పనస.
- అటువంటి ఫలాన్ని సంయోగ ఫలం అని అంటారు.
Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
వేరులోని వివిధ మండలాలను పటం సహాయంతో వివరించండి.
జవాబు:
సాధారణ ప్రాధమిక వేరు నాలుగు భాగాలను కలిగి ఉంటుంది.:
- వేరు తొడుగు
- విభజన జరిగే మండలము
- పొడవు పెరిగే మండలము
- ముదిరిన మండలము
1. వేరు తొడుగు:
- వేరు కొనభాగములను కప్పుతూ ఒక టోపి వంటి నిర్మాణముగా వేరు తొడుగు ఉంటుంది.
- ఇది వేరు మృత్తికలోకి చొచ్చుకుపోయేటప్పుడు వేరు కొనను రక్షిస్తుంది.
2. విభజన జరిగే మండలము:
- ఈ మండలం లోని కణాలు చిన్నగా, పలుచని కణకవచాలను కలిగి చిక్కని కణద్రవ్యం తో ఉంటాయి.
- ఇవి అనేక సార్లు విభజన చెంది కొత్త కణాలను తొడుగు ఏర్పరుస్తాయి.
3. పొడవు పెరిగే మండలము:
- ఈ ప్రాంతంలోని కణాలు బాగా పొడవుగా సాగుతాయి.
- ఇవి వేరు పొడవు పెరుగుటకు తోడ్పడతాయి.
4. ముదిరిన మండలము:
- ఈ ప్రాంతంలోని కణాలు క్రమేణా విభజన చెంది పక్వమవుతాయి.
- కావున దీనిని ముదిరిన మండలము అంటారు.
- ఈ ప్రాంతంలో కొన్ని బాహ్యచర్మ కణాల నుండి చాలా సన్నని, సున్నితమైన దారాల వంటి మూలకేశాలు ఏర్పడతాయి.
- మూలకేశాలు నేలనుండి నీరు మరియు ఖనిజలవణాలను శోషిస్తాయి.
ప్రశ్న 2.
“మొక్కలోని భూగర్భ భాగాలన్నీ వేర్లు కావు”. ఈ వాక్యాన్ని బలపరచండి.
జవాబు:
- మొక్కలోని భూగర్భ భాగం సాధారణంగా వేరు, కాని ప్రతిసారి అది వేరే కానవసరం లేదు.
- కొన్ని సందర్భాలలో కాండాలు కూడా నేలలో ఉంటాయి.
- అటువంటి కాండాలను ‘భూగర్భ కాండాలు’ అంటారు.
- సాధారణ కాండం యొక్క లక్షణాలు వీటిలోను ఉంటాయి.
- కణుపు, కణుపు మాధ్యమాలు, పొలుసాకులు, గ్రీవ మరియు కొన మొగ్గలు వీటి యందు స్పష్టంగా కనిపిస్తాయి.
- కావున మొక్కలోని భూగర్భ భాగాలు అన్ని కూడా వేర్లు కావు.
ఉదా: బంగాళదుంపలు, ఉల్లిపాయలు, అల్లం కొమ్ము.
ప్రశ్న 3.
పత్రవిన్యాసంలోని వివిధ రకాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
కాండంపై పత్రాలు అమరి ఉండే విధానాన్ని ‘పత్రవిన్యాసం’ అంటారు. ఇది మూడు రకాలు
- ఏకాంతర పత్ర విన్యాసము
- అభిముఖ పత్ర విన్యాసము
- చక్రీయ పత్ర విన్యాసము
1. ఏకాంతర పత్ర విన్యాసము: ఈ విన్యాసంలో ప్రతి కణుపు నుండి ఒకే పత్రం ఏకాంతరంగా ఏర్పడుతుంది. ఉదా: మందార, పొద్దు తిరుగుడు
2. అభిముఖ పత్ర విన్యాసము: ఈ విన్యాసంలో ప్రతి కణుపు నుండి రెండు పత్రాలు ఏర్పడి, ఎదురెదురుగా అమరి ఉంటాయి. ఉదా:జామ, జిల్లేడు
3. చక్రియ పత్ర విన్యాసము: ఈ విన్యాసంలో ప్రతి కణుపు నుండి రెండు కంటే ఎక్కువ పత్రాలు ఏర్పడి, వర్తులంగా అమరి ఉంటాయి. ఉదా: గన్నేరు, ఆల్ స్టోనియ
ప్రశ్న 4.
పత్ర రూపాంతరాలు మొక్కలకు ఏ విధంగా తోడ్పడతాయి?
జవాబు:
పత్రాల యొక్క సాధారణ విధులు కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ మరియు రవాణా. కొన్ని సందర్భాలలో పత్రాలు అదనంగా మరికొన్ని విధులను నిర్వర్తించుటకు రూపాంతరం చెందుతాయి. దీనినే ‘పత్రరూపాంతరం’ అంటారు.
- నులితీగలు
- కంటకాలు
- నిల్వపత్రాలు
- ప్రభాసము
- బోను పత్రాలు
- ప్రత్యుత్పత్తి పత్రాలు
1. నులితీగలు: బలహీనకాండం ఉన్న మొక్కలలో పూర్తి పత్రం లేదా ఏదైన పత్రభాగం ‘నులితీగలు’ గా మారి మొక్క ఎగబాకుటకు మరియు సూర్యరశ్మి గ్రహించుటకు తోడ్పడుతుంది. ఉదా: బఠాణి
2. కంటకాలు: కంటకాలు సూదిగా, మెనదేలి ఉంటాయి. ఇవి వేటినైనా తాకినపుడు ధృడంగా మారి, ఆధారం పై ప్రాకుటకు సహాయపడతాయి. ఎడారి మొక్కలలో భాష్పోత్సేకమును తగ్గించుటకు మరియు రక్షణకు తోడ్పడతాయి. ఉదా: బోగన్ విల్లా, కాక్టై.
3. నిల్వపత్రాలు: కొన్ని రసయుత పత్రాలు ఆహారాన్ని నిల్వ చేస్తాయి. ఉదా: ఉల్లి, వెల్లుల్లి
4. ప్రభాసము: కిరణజన్య సంయోగక్రియను జరిపే ఆకుపచ్చని పత్రవృంతాన్ని ప్రభాసనము అంటారు. కొన్ని ఎడారి మొక్కలలో సాధారణ పత్రాలు కంటకాలుగా రూపాంతరం చెంది ‘భాష్పోత్సేక రేటు’ ను తగ్గిస్తాయి. ఉదా: అకేసియా, మొలనోజైలాన్, పార్కిన్సోనియా
5. బోను పత్రాలు: కొన్ని మొక్కలు నత్రజని లోపం ఉన్న ప్రాంతాలలో నివశిస్తాయి. ఇవి కీటకాలను బంధించి వాటి నుండి నత్రజని సంబంధిత పదార్థాలను గ్రహిస్తాయి. ఉదా: నెపంధిస్, డ్రోసిరా
6. ప్రత్యుత్పత్తి పత్రాలు: బ్రయోఫిల్లమ్లో పత్రపు అంచులలో ఉన్న గుంటలలో పత్రోపరిస్థిత మొగ్గలు ఏర్పడి ఉంటాయి. ఆ మొగ్గలు నేలను తాకినపుడు వేర్లను ఏర్పరుచుకుని, స్వతంత్ర మొక్కలుగా వృద్ధి చెందుతాయి. ఉదా: బ్రయోఫిల్లమ్
ప్రశ్న 5.
ఏవైనా రెండు రకాల ప్రత్యేక పుష్పవిన్యాసాలను వివరించండి. [TS M-22]
జవాబు:
ప్రత్యేక పుష్పవిన్యాసాలు: 1) సయాథియం 2) హైపనోడియం
1. సయాథియం:
- ఇది ఒక గిన్నె వంటి పుష్పవిన్యాసం.
- ఈ గిన్నెవంటి నిర్మాణం పరిచక్రపుచ్చావళి సంయోగంతో ఏర్పడుతుంది.
- గిన్నెలోపల ఒక ద్విఫలదళ స్త్రీ పుష్పం చుట్టూ కొన్ని పురుష పుష్పాలు నిశ్చిత పద్ధతిలో అమరి ఉంటాయి.
- గిన్నె మధ్య భాగంలో పొడవైన వృంతంతో త్రిఫలదళ సంయుక్త అండకోశం ఉంటుంది.
- స్త్రీ పుష్పం చుట్టూ అనేక పురుషపుష్పాలు ఏకశాఖీయ పద్ధతిలో అమరి ఉంటాయి. ఉదా:యుఫోర్బియేసి
2. హైపన్ థోడియం:
- ఇది ఒక ఫలాన్ని పోలిన పుష్పవిన్యాసం పుష్పవిన్యాసాక్షంసంక్షిప్తమై, రసభరితమైన గిన్నె వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.
- పురుష పుష్పాలు అగ్రరంధ్రానికి దగ్గరగా, స్త్రీ పుష్పాలు క్రింది భాగంలో మరియు వంధ్య (గాల్) స్త్రీపుష్పాలు మధ్యలో అమరి ఉంటాయి ఉదా: ఫైకస్
ప్రశ్న 6.
పుష్పభాగాలు పుష్పాసనం మీద అమరి ఉన్న విధానాన్ని బట్టి వర్ణించండి. [TS M-22]
జవాబు:
పుష్పాసనం పై పుష్పభాగాల అమరిక మరియు స్థానం ఆధారంగా పుష్పాలను మూడు రకాలుగా వర్గీకరించారు.
- అండకోశాథస్థితి పుష్పం
- పర్యండకోశ పుష్పం
- అండకోశోపరిక పుష్పం
1. అండోశాథ స్థితి పుష్పం: ఈ రకం పుష్పంలో పుష్పాసనం యొక్క అగ్రభాగంలో అండకోశం ఉంటుంది. మిగిలిన భాగాలు క్రిందగా అమరి ఉంటాయి. ఈ అండాశయాన్ని ఊర్థ్వం అంటారు.
ఉదా: మందార, ఆవాలు, వంగ
2. పర్యండకోశ పుష్పం: ఈ రకం పుష్పంలో పుష్పాసనం మధ్యలో అండకోశం అమరి ఉండి, మిగిలిన పుష్ప భాగాలు పుష్పాసనం అంచున ఒకే ఎత్తులో అమరి ఉంటాయి. ఈ అండాశయాన్ని అర్థ నిమ్నం (లేదా) అర్ధ ఊర్థ్వం
అంటారు. ఉదా: గులాబి, బఠాణి.
3. అండకోశోపరిక పుష్పం: ఈ రకం పుష్పం నందు పుష్పాసనం అంచుపైకి పెరిగి అండాశయాన్ని పూర్తిగా ఆవరించి, సంయుక్తమై వుంటుంది. మిగిలిన పుష్ప భాగాలు అండాశయం పై ఏర్పడి ఉంటాయి.
ఈ అండాశయాన్ని ‘నిమ్నం’ అని అంటారు ఉదా: చామంతి, జామ
ప్రశ్న 7.
“రక్షకపత్రాలు, ఆకర్షణ పత్రాలు కలిగిన ఆవృత బీజ మొక్కల పుష్పాలు రక్షక, ఆకర్షణపత్రాలు వాటి వలయాల్లోని అమరికలో విభేదిస్తాయి” వివరించండి. [TS M-22]
జవాబు:
పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షక పత్రావళి లేదా ఆకర్షణ పత్రావళి అమరి ఉన్న విధానాన్ని పుష్పరచన అంటారు.
పుష్పరచన రకాలు:
- కవాటయుత పుష్పరచన
- మెలితిరిగిన పుష్పరచన
- చిక్కైన పుష్పరచన
- వెక్సిల్లరీ లేదా పాపిలియోనేసియస్ పుష్పరచన
1. కవాటయుత పుష్పరచనఃఇందులో రక్షక లేదా ఆకర్షణ పత్రాలు ఒకే వలయంలో అంచుల వద్ద తాకుతూ ఒకదానినొకటి అతివ్యాప్తం కాకుండా అమరి ఉంటాయి ఉదా: జిల్లేడు.
2. మెలితిరిగిన పుష్పరచన: రక్షక మరియు ఆకర్షక పత్రాలలో ఒక భాగం అంచు, దాని పక్కనే ఉండే భాగపు అంచును కప్పుతూ అతి వ్యాప్తంగా మెలి తిరిగి ఉంటుంది. ఉదా: మందార, బెండ
3. చిక్కైన (ఇంబ్రికేట్) పుష్పరచన: రక్షక మరియు ఆకర్షణ పత్రాల అంచులు ఏదో ఒక దిశలో గాకుండా ఒకదానికొకటి అతి వ్యాప్తమై ఉంటాయి. ఉదా: కాసియా (కసింత), గుల్ మొహర్.
4. వెక్సిల్లరీ లేదా పాపిలియోనేసియస్: దీనిలోఐదు ఆకర్షణ పత్రాలు ఉంటాయి. అతి పెద్ద ఆకర్షణ పత్రం (ధ్వజం) రెండుపార్శ్వ ఆకర్షణ పత్రాలు (బాహువులు)ను కప్పి ఉంచుతుంది. ఈ రెండు బాహువులు పూర్వాంతంలో ఉన్న రెండు చిన్నవైన పత్రాలు (ద్రోణులు) ను కప్పి ఉంచుతాయి. ఉదా:బఠాణి, చిక్కుడు.
ప్రశ్న 8.
పుష్పించే మొక్కలలోని నాలుగు అండన్యాస రకాలను వర్ణించండి.
జవాబు:
అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసం అంటారు. ఇవి ఐదు రకాలు
- ఉపాంత అండన్యాసం
- అక్షీయ అండన్యాసం
- కుడ్య అండన్యాసము
- స్వేచ్ఛాకేంద్ర అండన్యాసం
- పీఠ అండన్యాసం
1. ఉపాంత అండన్యాసం: ఇది ఏకబిళయుతం. అండన్యాసస్థానము అండాశయపు ఉదరపు అంచు వెంట గట్టు లాంటి నిర్మాణాన్ని ఏర్పరిచి దానిపై రెండు వరుసలలో అండాలను కలిగి ఉంటుంది. ఉదా: బఠాణి
2. అక్షీయ అండన్యాసం: ఇది బహుబిళయుతం అండన్యాసస్థానం అక్షీయంగా ఉండి, దానిపై అండాలు అతుక్కొని ఉంటాయి. ఉదా: మందార, నిమ్మ, టమాట
3. కుడ్య అండన్యాసము: ఇది ఏకబిళయుతం. ఇందులో అండాలు అండాశయం లోపలి గోడల పై గాని లేదా పరిథీయ భాగం పై గాని అభివృద్ధి చెందుతాయి. అనృతకుడ్యం ఏర్పడుట వలన ఇది ద్విబిళయుతంగా ఉంటుంది. ఉదా: ఆవ
4. స్వేచ్ఛా కేంద్ర అండన్యాసము: బిలం లేకుండా పటరహితంగా కేంద్రీయ అక్షం మీద అండాలు ఏర్పడతాయి. ఉదా: డయాంథస్, ప్రైమ్జ్.
5. పీఠ అండన్యాసం: ఇది ఏకఫలదళ, ఊర్ధ్య అండాశయము నుంచి ఏర్పడి ఒక విత్తనాన్ని కలిగి ఉంటుంది. ఉదా: పొద్దుతిరుగుడు, బంతి
ప్రశ్న 9.
మీరు అధ్యయనం చేసిన కండగల ఫలాలను క్లుప్తంగా వర్ణించండి.
జవాబు:
అభివృద్ధి చెందిన తర్వాత పరిపక్వమయ్యే ఫలాలను కండగల ఫలాలు అంటారు. వీటి ఫలకవచం మూడు భాగాలను కలిగి ఉంటుంది. అవి బాహ్యఫలకవచం, మధ్యఫలకవచం మరియు అంతః ఫలకవచం.
ఫలకవచ స్వభావం ఆధారంగా ఇవి ఐదు రకాలు.
- టెంకగల ఫలం
- మృదు ఫలం
- పెపో
- హెస్పిరీడియమ్
- పోమ్
1. టెంకగల ఫలం: ఇది ఏకఫలదళ ఫలం. ఇది అండాశయము నుంచి ఏర్పడి ఒక విత్తనాన్ని కలిగి ఉంటుంది. ఉదా: మామిడి, కొబ్బరి
మామిడిలో మధ్య ఫలకవచం కండకల్గి ఉంటుంది. కొబ్బరిలో మధ్యఫలకవచం పీచులాగా ఉంటుంది.
2. మృదు ఫలం: ఇది కండకల ఒకటి (లేదా) అనేక విత్తనాలను కలిగి ఉండే ఫలం. ఇవి ద్విఫలదళ (లేదా) బహుఫలదళ. దీని అంతఃఫలకవచం సంయుక్తమై గుజ్జును ఏర్పరుస్తుంది. విత్తనాలు గట్టిగా ఉండి గుజ్జులో చల్లినట్లు ఉంటాయి. ఉదా: టోమాటా, ద్రాక్ష, జామ
3. పెపో:ఇది త్రిఫలదళ, ఏకబిల, నిమ్న అండాశయం నుండి ఏర్పడుతుంది. దీని మధ్య ఫలకవచం కండ కలిగి మరియు అంతః ఫలకవచం మెత్తగా ఉంటుంది. ఉదా: దోస
4. హెస్పిరీడియమ్:ఇది బహుఫలదళ, సంయుక్త, బహుబిళ ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడుతుంది. బాహ్య ఫలకవచం చర్మిలంగా తైలగ్రంధులతో, మధ్యఫలకవచం కాగితంలా పలుచగా, మరియు అంతః ఫలకవచం కుడ్యం పై రస భరిత కేశాలుతో ఉంటాయి. ఉదా: నిమ్మ, కమల
5. పోమ్: ఇది ద్విఫలదళ లేదా బహుఫలదళ నిమ్న అండకోశం నుంచి ఏర్పడి కండగల పుష్పాసనంలో ఆవరించబడి ఉంటాయి. అంతః ఫలకవచం గట్టిగా సాగేలా ఉంటుంది. ఉదా: ఆపిల్
ప్రశ్న 10.
మీరు అధ్యయనం చేసిన వివిధ రకాల శుష్కఫలాలను ఉదాహరణలతో వర్ణించండి.
జవాబు:
పక్వదశలో ఫలకవచం వాడిపోయి లేదా కండరహితంగా ఉంటే అటువంటి ఫలాలను ‘శుష్కఫలాలు'(Dry Fruits) అంటారు. ఇవి మూడు రకాలు .
1. శుష్కవిదారక ఫలాలు: ఈ ఫలాలు పగిలి, తెరుచుకొని విత్తనాలను విడుదల చేస్తాయి.
a. ద్వి విదారక ఫలాలు (లెగ్యూమ్): దీని ఫలం పృష్టోదరతలాలలో రెండు భాగాలుగా చీలిపోయి విత్తనాలను విడుదల చేస్తుంది. ఉదా: చిక్కుడు
b. గుళిక: గుళిక అనేక విధాలుగా పగిలి విత్తనాలను విడుదల చేస్తుంది. ఉదా: పత్తి, దతూర
2. శుష్క అవిదారక ఫలాలు: ఇవి ఒక విత్తనంను మాత్రమే కలిగి ఉంటాయి. దీని ఫలకవచం క్షీణించిన తర్వాత విత్తనాన్ని విడుదల చేస్తుంది. అవి ఈ క్రింది విధంగా ఉంటాయి.
a. కవచబీజకం: దీనిలో బీజకవచం మరియు ఫలకవచం కలిసిపోయి ఉంటాయి. ఇది ‘పోయేసి’ కుటుంబ లక్షణం. ఉదా: వరి, గడ్డిజాతులు
b. పెంకుగల ఫలం: ఇది బహు ఫలదళ, సంయుక్త, ఏకబిల అండాశయం నుంచి ఏర్పడిన ఫలం. ఇది పెంకు గల ఫలకవచం కలిగి ఉంటుంది. ఉదా: జీడిమామిడి
c. సిప్సెలా: ఇది ఒకే విత్తనం ఉన్న ఫలం. ‘దీర్ఘకాలిక కేశగుచ్ఛం’ దీని యొక్క లక్షణం
ఉదా: అకేసియా (తుమ్మ), కాస్టర్ (ఆముదం)
3. షైజోకార్పిక్ శుష్క ఫలాలు: ఒకే విత్తనం కలిగి ఫలాంశాలు గా విడిపోయే ఫలాలను షైజోకార్పిక్ శుష్కఫలాలు అంటారు ఉదా: అకేసియా, ఆముదం
Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
వేరు రూపాంతరాన్ని నిర్వచించండి. వివిధ విధులను నిర్వర్తించడానికి వేరు ఏ విధంగా రూపాంతరం చెందిందో వివరించండి. [TS M-20][ AP, TS M-15,17,18][IPE- 13]
జవాబు:
వేరు: పుష్పించే మొక్కల భూగర్భ భాగాన్ని ‘వేరు’ అని అంటారు.
- వేరు యొక్క సాధారణ విధులు: నీరు, ఖనిజముల శోషణ మరియు ప్రసరణ.
- వేరు రూపాంతరం:వేరు తన సాధారణ విధులు కంటే మరికొన్ని ఇతర విధులను నిర్వర్తించడం కోసం తన ఆకారాన్ని,
- నిర్మాణాన్ని మార్చుకోవడాన్నే “వేరు రూపాంతరం” అంటారు.
వేరు రూపాంతర రకాలు-విధులు:
1. నిల్వ వేర్లు:
- కొన్ని మొక్కలు ఆహారాన్ని వేర్లలో నిల్వ చేసుకుంటాయి.
- దీని వలన వేర్లు ఉబ్బి ఉంటాయి.
- ఇలా రూపాంతరం చెందిన వేర్లనే నిల్వ వేర్లు అంటారు.
- ఉదా: క్యారేట్లో తల్లివేరు, చిలకడదుంపలో అబ్బురపు వేర్లు, అస్పరాగస్లో పీచువేర్లు.
2. ఊడ వేర్లు:
- మర్రి చెట్టులో పొడవుగా, లావుగా ఉండే శాఖల నుండి ఊడలు వేలాడుతూ ఉంటాయి.
- అవి గాలిలో వ్రేలాడుతూ నేలలోకి చొచ్చుకొని ఉంటాయి.
- అవి చెట్టుకు స్తంభం వలె ఆధారాన్ని ఇస్తాయి.
- ఇలా రూపాంతరం చెందిన ఊడలనే ఊడవేర్లు అంటారు.
- ఉదా: మర్రిచెట్టు
3. ఊత వేర్లు:
- కొన్ని మొక్కలలో కాండాల క్రింది కణుపుల నుంచి వేర్లు ఉద్భవిస్తాయి.
- అవి మొక్కకు యాంత్రిక ఆధారాన్ని(ఊతాన్ని) కలుగచేస్తాయి.
- కావున వీటిని ఊతవేర్లు అంటారు
- ఉదా: చెరుకు, మొక్కజొన్న
4. శ్వాసించే వేర్లు:
- కొన్ని మొక్కల వేర్లు బురద ప్రదేశంలో ఉంటాయి.
- అవి గాలిలోకి పైకి నిటారుగా పెరుగుతాయి.
- వాటి ఉపరితలంపై ఉండే రంధ్రాలతో శ్వాసక్రియలో పాల్గొంటాయి. కావున వీటిని శ్వాస వేర్లు అంటారు.
- ఉదా: అవిసీనియా, రైజోఫోరా
5. వెలమిన్ వేర్లు:
- కొన్ని మొక్కలు ఇతర పెద్ద మొక్కల శాఖలపై ఉంటాయి. ఇవి ప్రత్యేక అబ్బురపు వేళ్లను ఉత్పత్తి చేస్తాయి.
- వీటిని వెలమిన్ వేర్లు అంటారు.
- ఈ వేర్లు గాలిలో వ్రేలాడుతూ, వాతావరణంలోని తేమను గ్రహిస్తాయి.
- ఉదా: ‘వాండా’.
6. పరాన్న జీవ వేర్లు / హాస్టోరియల్ వేర్లు:
- ఇతర మొక్కలపై ఆహారం, నీరు కొరకు ఆధారపడే మొక్కల వేర్లను ‘పరాన్న జీవ వేర్లు’ అంటారు.
- ఇవి రెండు రకాలు.
(a) సంపూర్ణ పరాన్న జీవ వేర్లు: కస్కూట
(b) అసంపూర్ణ పరాన్న జీవ వేర్లు: విస్కమ్, స్ట్రెయిగా
7. బుడిపె వేర్లు:
- బుడిపెలను కల్గి ఉండే వేర్లను బుడిపె వేర్లు అంటారు.
- ‘రైజోబియం బాక్టీరియా’ వాతావరణంలో నత్రజనిని స్థాపించుటకు ఈ బుడిపెలను ఏర్పరుస్తాయి.
- ఇవి ఫాబేసి కుటుంబంలో కన్పిస్తాయి.
- ఉదా: వేరుశనగ
8. కిరణజన్య సంయోగ క్రియ జరిపే వేర్లు:
- కొన్ని మొక్కలలో ఆకుపచ్చని పత్రాలు క్షీణించి ఉంటాయి.
- కాని వాటి వేర్లు హరితయుతంగా (ఆకుపచ్చగా) మారి ఉంటాయి.
- అవి కిరణజన్యసంయోగక్రియ ను జరుపుతాయి.
- కావున వీటిని కిరణజన్యసంయోగక్రియ జరిపే వేర్లు టీనియోఫిల్లం అంటారు.
- ఉదా: టినియోఫిల్లమ్
ప్రశ్న 2.
వివిధ విధులను నిర్వర్తించడం కోసం కాండం ఏ విధంగా అనేక రకాలుగా రూపాంతరం చెందిందో వివరించండి. [AP Mar-19,20][AP May-17,22][TS M-16, IPE-14]
జవాబు:
కాండం: పుష్పించే మొక్కల వాయుగత భాగాన్ని ‘కాండం’ అని అంటారు.
కాండ రూపాంతరాలు: పరిసరాలకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి కొన్ని మొక్కల కాండాలలో ఏర్పడే శాశ్వత నిర్మాణాత్మక మార్పులనే ‘కాండ రూపాంతరాలు’ అంటారు.
కాండ రూపాంతరాలు 3 రకాలు:
I. భూగర్భ కాండ రూపాంతరాలు: కొన్ని మొక్కలలో కాండాలు భూమి లోపలికి పెరుగుతాయి.
అవి ప్రతికూల పరిస్థితులను తట్టుకొని దీర్ఘకాలితను చూపుతాయి. ఇవి శాకీయ వ్యాప్తిలో పాల్గొంటాయి మరియు ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి. వీటినే భూగర్భ కాండ రూపాంతరాలు అంటారు.
ఉదా:
- అల్లంలో కొమ్ము
- నీరుల్లిలో లశునం
- కొలకేసియాలో కందాలు
- బంగాళదుంపలో దుంపకాండం
II. వాయుగత కాండ రూపాంతరాలు:ఇవి నాలుగు రకాలు
A. కాండ నులి తీగలు:
- ఇవి సున్నితమైన, చుట్టుకుని ఉండే నిర్మాణాలు.
- ఇవి మొక్కలు ఎగబ్రాకడానికి సహాయపడే రూపాంతరాలు.
ఉదా1: దోసలో ‘గ్రీవపు మొగ్గలు’ నులితీగల వలె రూపాంతరం చెందుతాయి.
ఉదా 2: ద్రాక్షలో ‘కొన మొగ్గలు’ నులి తీగలుగా రూపాంతరం చెందుతాయి.
B. ముళ్లు:
- వీటి కాండపు మొగ్గలు రూపాంతరం చెంది చేవదేరిన, నిటారు, మొనదేలిన నిర్మాణాలైన ‘ముళ్లు’ గా మారుతాయి.
- ఈ ముళ్లు మొక్కలను ‘మేసే జంతువుల నుండి రక్షణ’ కల్పిస్తాయి. ఉదా: బోగన్ విల్లియా, సిట్రస్
C. పత్రాభ కాండాలు:
- కొన్ని ఎడారి మొక్కలలో భాషోత్సేకం నివారించడం కోసం, పత్రాలు రూపాంతరం చెంది కంటకాలుగా ఏర్పడతాయి.
- వాటి కాండాలు ఆకుపచ్చగా, బల్లపరుపుగా మారి కిరణజన్యసంయోగక్రియను నిర్వర్తిస్తాయి.
ఉదా: బ్రహ్మజెముడు, యుపర్బియా, కాజురైనా
D. లఘు లశునాలు(బల్బిల్స్):
- కొన్ని మొక్కలు తల్లి మొక్క నుండి విడిపోయి అబ్బురపు వేర్లను ఏర్పరుచుకొని ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి.
- అటువంటి మొగ్గలను బల్బిల్స్ అంటారు.
- అవి శాకీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి.
ఉదా: పుష్ప కోరకాలు(అగేవ్), శాకీయ కోరకాలు (డయాస్కోరియా)
III. ఉపవాయుగత కాండ రూపాంతరాలు: బలహీన కాండం కల్గిన కొన్ని మొక్కలలో, కాండము కొంతభాగం వాయుగతంగా, కొంతభాగం భూగర్భంగా ఉంటాయి. ఈ రకమైన కాండాలు ప్రధానంగా శాకీయ వ్యాప్తికి తోడ్పడును.అవి 4 రకాలు.
A. రన్నర్స్:
- కొన్ని మొక్కలు,కొత్త ప్రదేశాలకు విస్తరించి, కణుపు మధ్యమాలు, ద్వారా వృద్ధభాగాలు నశించినప్పుడు కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి.
- ఈ మొక్కలనే రన్నర్లు అని అంటారు.
- ఉదా:స్ట్రాబెర్రి, ఆక్సాలిస్ కాండాలు
B. స్టోలన్స్:
- కొన్ని మొక్కలలో సున్నితమైన ‘పార్శ్వపు శాఖ’ వాయుగతంగా పెరుగుతుంది.
- కొంతకాలం తరువాత అవి వంగి భూమిని తాకి అబ్బురపు వేళ్లను ఏర్పరుస్తాయి.
- ఈ శాఖలనే స్టోలన్ అని అంటారు.
- ఈ శాఖలు తల్లి మొక్క నుండి విడిపోయినపుడు స్వతంత్ర జీవనాన్ని కొనసాగిస్తాయి.
- ఉదా:మల్లి, గన్నేరు.
C. ఆఫ్సెట్స్:
- నీటిపై తేలే మొక్కలలో పార్శ్వపు శాఖలోని ఒక కణుపు మధ్యమం పొడవును ‘ఆఫ్సెట్’ అంటారు. ii) ఆ మొక్కలలో ప్రతి కణుపు వద్ద, రొజెట్ క్రమంలో ఉండే పత్రాలు నీటిపైన మరియు చక్రాభకాండ పీఠభాగం నుండి ఏర్పడి ‘సంతులనం’ (బ్యాలెన్స్) జరిపే వేర్లు నీటిలోనూ ఉంటాయి.
- ఉదా: పిస్టియా, ఐకార్నియా
D. సక్కర్స్ పిలక మొక్కలు:
- కొన్ని మొక్కలలో కాండంలో కొంత భాగం నేలలో ఉంటుంది.
- నేలలోనే ప్రధాన కాండం నుండి కొన్ని పార్శ్వపు శాఖలు ఏర్పడుతాయి.
- అవి ఏటవాలుగా పెరిగి భూమిపైకి వచ్చి పత్రయుత శాఖలను ఏర్పరుస్తాయి.
- ఆ శాఖలను సక్కర్స్ (పిలక మొక్కలు) అని అంటారు. ఉదా:అరటి,అనాస, క్రైసాంథిమమ్.
ప్రశ్న 3.
వివిధ రకాల మధ్యాభిసార పుష్పవిన్యాసాలను వివరించండి. [TS M-19][AP M-18]
జవాబు:
మధ్యాభిసార రకంలో ప్రధాన అక్షం నిశ్చితంగా పెరుగుతూ, పుష్ప విన్యాసవృంతం మీద పుష్పాలు పార్శ్వంగా, అగ్రాభిసార క్రమంలో ఏర్పడును.
- సామాన్య మధ్యాభిసార పుష్పవిన్యాసంలో పుష్పాలు ప్రధాన అక్షం మీదే .పెరుగుతాయి.
- సంయుక్త మధ్యాభిసార పుష్పవిన్యాసంలో పుష్పాలు మొక్కల శాఖల మీద పెరుగుతాయి.
మధ్యాభిసార పుష్పవిన్యాస రకాలు:
1. మధ్యాభిసార:
- పుష్పవిన్యాసాక్షం అనిశ్చితంగా పెరుగుతుంది.
- దానిపైన పుష్పాలు వృంత సహితంగా, పుచ్ఛసహితంగా, అగ్రాభిసార క్రమంలో అమరి ఉంటాయి.
- ఉదా: క్రోటలేరియా, మాంజిఫెరా
2. సమశిఖి:
- వీటి పుష్పవిన్యాసాక్షము పొడవుగా ఉంటుంది. ఇది అనేక పుష్పాలను అగ్రభిసార క్రమంలో కలిగి ఉంటుంది.
- పుష్పాలు వివిధ కణుపుల వద్ద నుండి ఏర్పడినప్పటికీ, అన్ని పుష్పాలు సమానమైన ఎత్తుకి పెరుగుతాయి.
- ఉదా: కాసియా, కాలిఫ్లవర్.
3. గుచ్ఛము:
- ఇందులో పుష్పవిన్యాస అక్షం కుదించబడి ఉంటుంది.
- పుష్పవిన్యాసాక్షం కొన భాగం నుండి అనేక పుష్పాలు ఉద్భవించినట్లు కనిపిస్తాయి.
- ఆ పుష్పాల ఆధారభాగం ‘పరిచక్రపూచ్ఛావళి’ అనే పుచ్ఛాల వలయంతో కప్పబడి ఉంటుంది.
- ఉదా: నీరుల్లి, కారట్
4. శీర్షవత్:
- ఇందులో కుదించబడిన పుష్ప విన్యాస వృంతం మీద ఏకలింగ మరియు ద్విలింగక, వృంతరహిత పుష్పాలు
కేంద్రాభిసారంగా వృద్ధి చెందుతాయి. - అటువంటి పుష్పాల అమరికను శీర్షపుష్ప విన్యాసం అంటారు.
- ఉదా: ప్రొద్దుతిరుగుడు మరియు చామంతి.
5. కంకి:
- కంకుల పుష్పవిన్యాసాక్షం చాలా పొడవుగా ఉంటుంది.
- ఉదా: అభిరాంధస్ (ఉత్తరేణి)
6. స్పాడిక్స్:
- ఇందులో పుష్ప విన్యాసాక్షం శాఖారహితం. ఇది అనేక వృంతరహిత, ఏకలింగక పుష్పాలను అభిసార క్రమంలో కల్గి ఉంటుంది.
- ఈ పుష్ప విన్యాసం ‘మట్ట’ అని పిలవబడే రూపాంతరం చెందిన పుష్పపుచ్ఛంతో రక్షించబడుతుంది.
- ఉదా:మ్యూస, కోకస్