AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material పద్య భాగం 2nd Poem తిన్నని ముగ్ధ భక్తి Textbook Questions and Answers, Summary.

AP Inter 1st Year Telugu Study Material 2nd Poem తిన్నని ముగ్ధ భక్తి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
తిన్నడు శివుణ్ణి తన ఊరికి రమ్మని పిలిచిన తీరును తెలపండి.
జవాబు:
తిన్నడు శివలింగాన్ని చూచి గగుర్పాటు అనెడి కవచంతో కూడిన శరీరం కలవాడై ఆనందం వలన కలిగిన కన్నీరు హెచ్చగా, ఆ శివలింగమునకు సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి సమీపించాడు.

ఓ సామీ యిటువంటి కొండపై గుహలో ఒంటరిగా పులులు, సింహములు బాధపెట్టు భయంకరమైన అరణ్యమధ్యంలో రావిచెట్టు నీడన, నది ఒడ్డున ఏ కోరికతో గుడి నిర్మించావు ? నీకు ఆకలి అయినచో ఏ బంధువులు అన్నపానీయములు తెచ్చియిస్తారు. నువ్వు ఇక్కడ ఎందుకుండాలి లింగమా !

కొండలలో, అడవులలో సంచరించి బలిసిన అడవి పందులు, లేడులు, జింకలను ముక్కలుగా చేసి పలు విధములుగా చిన్నక్క పెద్దక్క రుచికరంగా వండుతారు. పిట్టలను కూడా వండుతారు. ఈ అరణ్యంలో నివసించుట ఎందుకు ? ఓ శివ లింగమా ! నాకు మరొకమాట ఎదురుచెప్పక ఉడుమూరుకి రమ్ము.

ఓ శివలింగమా ! ఆలకించు అక్కడ (ఉడుమూరులో) నీకు పరమాన్నమునకై నివ్వరి బియ్యము, బడిపిళ్ళు, గునుకు బియ్యము, వెదురు బియ్యం, చమరీ మృగం పాలు ఉన్నాయి. పుట్టతేనె, పెరతేనె, పుట్టజున్ను (జుంటి తేనె), తొట్టితేనె కలవు. వాటితో మాటిమాటికి ముంచుకొని తినుటకు కాలుటచే పొడిగా మారి, పొడుములాగా రాలే నింజెట్లు అనే జాతి దుంపలు కలవు.

నేరేడు పండ్లు, నెలయుటి పండ్లు, కొండమామిడి, దొండ, పాల, నెమ్మిబరివేంక, చిటముటి, తొడివెంద, తుమ్మికి, జాన, గంగరేను, వెలఁగ, పుల్లవెలఁగ, మోవి, అంకెన, బలుసు బీర, పిచ్చుక బీర, కొమ్మి, ఈత, గొంజి, మేడి మొదలైన ఫలములు మా
చెంచుజాతి స్త్రీలు కలిసి మెలసి తీసుకువస్తారు. నీకు వాటిని ఇస్తాను. దయచేసి రావయ్య.

ఇల్లా ? వాకిలా ? ఇష్టమయిన స్నేహితులా ? వయసులో ఉన్నా బంధువులా ? యిల్లాలా ? కొడుకా ? ఎవరున్నారు ? (ఎవరు లేరు) , ఏ సుఖ సాధనములు లేకుండా జీవితం గడుపుట సాధ్యమా ? (కాదు) ; మా బోయపల్లెలో నీకు కావలసిన వన్నీ ఉన్నాయి. నీకు సమృద్ధిగా ఇస్తాను. అయ్యో ! ఒంటరిగా ఉండక ఓ శివలింగమా మా బోయపల్లెకు విచ్చేయుమా.

శివుని మూడవ కంటిచూపుకు దగ్ధమయిన మన్మథుడిని తమ చూపుల ప్రసారంతో జనింపచేయగల సుందరమైన ఎఱుక కాంతలను నీ సేవకు ఇస్తాను. నన్ను అనుగ్రహిస్తే ఇప్పుడు నాతో రమ్ము. రాకున్న నిన్ను విడచి నేను వెళ్ళను. ఇక్కడే నీతోడిదే లోకంగా ఉంటాను. నీ దయను పొందుతాను. నీ మౌనాన్ని నీకిష్టమై నపుడు విడుము. నిన్నిపుడు కష్టపెట్టెను అని తిన్నడు శివునితో పలికి శివభక్తి పారవశ్యంలో మునిగిపోయాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 2.
తిన్నని చూసి బోయలు ఏ విధంగా దు:ఖించారు ?
జవాబు:
శివుని తన ఊరికి రమ్మని పిలిచి, శివలింగం ప్రత్యుత్తరం ఇవ్వకపోవడంతో శివలింగంపై భక్తిలో లీనమై సంపెంగ వాసనకు మత్తెక్కిన తుమ్మెద వలె తిన్నాడున్నాడు. ఆ సమయంలో తిన్నడిని వెతుకుతూ బోయలు వచ్చారు. వచ్చి ఇలా పలికారు.

నిన్ను అలసిపోయేలా చేసి, ఇక్కడ వరకు వచ్చేలా చేసినా ఆ అడవిపంది ఎక్కడకు పోయింది. మమ్ములను చూసి కూడా ఆదరంతో ఎందుకు చూడవు. వేగంగా కన్నీరు కారుతుంది. మేము ఏమి పలికిననూ, ఏమి కారణమో తిరిగి పలుకవు. అయ్యో ! వేటాడటానికి వచ్చి ఇలా ఉంటే నీ తల్లిదండ్రులు మనస్సులో ఎంతో దు:ఖిస్తారు.

వేటకుక్కలు నీ మీద నుండి వచ్చే గాలి వాసన చూచి, నీజాడ గుర్తించి, శరీరాన్ని విరుచుకుని, మెడతాళ్ళతో గట్టిగా పట్టుకున్నప్పటికి స్థిమిత పడక, ఆగలేక, ఇక్కడికి వచ్చి నీ చుట్టూ మూగి, నీవు ప్రేమగా చూడటం లేదని, కుయ్ కుయ్ మని అంటున్నాయి. వాటినెందుకు చూడవు.

ఉచ్చులను వేటాడటానికి వాడే జవనికలు, ప్రోగుతాళ్ళు చుట్టగా చుట్టలేదు. జంతువులను పొడిచిన పోటుగోలలు (శూలాలు) వాటి శరీరాలనుండి పీకలేదు. చచ్చిన మృగాలను తీసుకురాలేదు. డేగవేటకు వాడే పక్షులకు మేత పెట్టలేదు. మన చెంచులెవ్వరికీ అలసట తీరలేదు. చచ్చిన జంతువులను కుళ్ళకుండా కాల్చలేదు. వేటకుక్కలు, జింకలు, సివంగులు నీవు లేకుండటచే మేతముట్టడం లేదు. మృగాన్ని బలిచ్చి కాట్రేనిని పూజించలేదు.

అయ్యో ! వేట వినోదాన్ని నీ తండ్రికి తెలుపుటకు వార్త పంపలేదు. శరీరాన్ని మరచి కొయ్యబారి ఉన్నావెందుకు ? ఎందుకు మాటలాడవు ? తెలియజేసి మా
దు:ఖాన్ని తొలిగించు. నిన్ను విడిచి వెళ్ళడానికి మా మనస్సు అంగీకరించడం లేదు.

మీ సోదరులు, తల్లిదండ్రులు, స్నేహితులు మమ్ములను జూచి మీరంతా తిరిగి రాగా, మా తిన్నడు ఇప్పుడు ఎక్కడికి పోయాడు, అని అడిగితే నీ విషయం చెప్పలేక మా ప్రాణములు పోవా ? గూడెములో మము తిట్టింపక మాతో రావయ్యా, కీర్తిని, గొప్ప దనాన్ని తీసుకురావయ్య అని అన్నారు.

ఎంత దు:ఖపడిన నీవు మమ్ములను ఎందుకు చూడుట లేదు. విషయాన్నంతటినీ ఎఱుకల రాజుకు తెలియజేయుటకు వెళ్ళెదము. అక్కడ చెప్పవలసిన మంచి మాటలను (సందేశాన్ని) చెప్పి పంపమని తిన్నడి కాళ్ళని పట్టుకున్నారు. శివలింగమునందు లగ్నమైన దృఢమైన హృదయాంతర్భాగము కలవాడైన శ్రేష్టుడైన తిన్నడు దయ కలిగిన చూపులతో దరహాసం చేసి ఆటవికులతో ఇలా అన్నాడు. ఈ శివలింగములో నా ప్రాణాన్ని మరణించే వరకు ఓడ నడుచుటకు కట్టిన దూలం వలె పెనవేసుకున్నట్లు చేశాను. బాధ పడకండి. మీరు గూడెమునకు తిరిగి వెళ్ళండి. నాతో శివుడు వస్తేనే మీతో కలిసి వస్తాను. లేనిచో శివుడు ఏ దిక్కులో ఉన్నాడో అక్కడే అతనితోడిదే లోకంగా జీవిస్తాను.

నాకు బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రభువు అన్నీ ఈ దైవమే. మీరు ఈ అడవిలో కష్టపడకుండా గూడేనికి వెళ్ళండి. చివరకు నా దేవునికై ప్రాణములు వదులుతాను. భక్తిలో లీనమైన తిన్నడిని చూసి ఆటవికులు దు:ఖిస్తూ గూడెమునకు ప్రయాణమయ్యారు.

సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ధూర్జటి కవి గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ధూర్జటి 16వ శతాబ్దంలో విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. “స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల గశానో
యతులిత మాధురీ మహిమ” అని రాయలు ప్రశంసించాడు. రాయల చేత అనేక గౌరవ సత్కారాలు పొందాడు. ధూర్జటి తల్లి సింగమ, తండ్రి జక్కయ నారాయణుడు.

ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రచించాడు. శ్రీకాళహస్తి మహాత్మ్యమనే నాలుగు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించాడు. ఇందులో శివభక్తుల కథలను మాధురీ మహిమతో
రచించాడు. తన రచనలను శ్రీకాళహస్తీశ్వరునకే అంకితమిచ్చాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 2.
తిన్నడు తెలిపిన పండ్ల రకాలను పేర్కొనండి.
జవాబు:
ధూర్జటి అడవులలో దొరికే అనేక రకాల ఫలాల వివరాలను మనకందించాడు. నేరేడు, నెలయూటి పండ్లు, కొండమామిడి, దొండ, పాల, నెమ్మి బరివెంక, చిటిముటి, తొడివెంద, తుమ్మికి, జాన, గంగరేను, వెలఁగ, పుల్లవెలఁగ, మోవి, అంకెన, బలుసు, బీర, పిచ్చుక బీర, కొమ్మి, ఈత, గొంజి, మేడి ఫలములను తిన్నడు శివునకిస్తానన్నాడు.

ప్రశ్న 3.
ఇంటికి రమ్మని పిలిచిన బోయలకు తిన్నడిచ్చిన సమాధానాన్ని తెలపండి.
జవాబు:
ఈ శివలింగానికి నా ప్రాణాన్ని మరణించేవరకు ఓడ నడచుటకు కట్టిన దూలం వలె పెనవేశాను. మీరు బాధపడవద్దు. నాతో శివుడు వస్తేనే మీతో కలిసి ఇపుడు నేను వస్తాను. లేనిచో శివుడే దిక్కులో ఉన్నాడో ఆ స్థలంలోనే అనుక్షణం అతనిని అంటి పెట్టుకొని నివసిస్తాను. నాకు బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రభువు అన్నీ ఈ దేవుడే.

మీరు ఈ అడవిలో కష్టపడవలసిన అవసరం లేదు. మీరు ఒత్తిడి చేసినను ఇక్కడ నుండి లేచిరాను. చివరికి నా దేవునికై ప్రాణములు వదులుతాను. నేను అసత్యమాడను ఇది నిజం అని తిన్నడు పలికాడు.

ఏకవాక్య / పద రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ధూర్జటి అనగా అర్థమేమిటి ?
జవాబు:
శివుడు.

ప్రశ్న 2.
తిన్నని గ్రామం పేరేమిటి ?
జవాబు:
ఉడుమూరు.

ప్రశ్న 3.
ఈశ్వరుని మూడవ కంటికి దగ్ధమయింది ఎవరు ?
జవాబు:
మన్మథుడు.

ప్రశ్న 4.
ధూర్జటి రచించిన శతకం ఏమిటి ?
జవాబు:
శ్రీకాళహస్తీశ్వర శతకం.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 5.
శ్రీకాళహస్తి మహాత్మ్యము కావ్యానికి మూలమేది ?
జవాబు:
స్కంద పురాణం. .

ప్రశ్న 6.
కాళము అంటే ఏమిటి ?
జవాబు:
పాము.

సందర్భ సహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
మనమున నాశ్చర్య రస నిమగ్నుండగుచున్.
జవాబు:
కవిపరిచయం :
ఈ వాక్యం అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన తిన్నని ముగ్ధ భక్తి పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.

సందర్భం :
స్వప్నములో జంగమదేవర అదృశ్యమవగా అదిరిపడి మేల్కొన్న తిన్నడు ఆశ్చర్యానికి గురియైన సందర్భంలోనిది.

అర్థం :
మనసులో ఆశ్చర్యంలో మునిగితేలాడు.

భావము :
మాయా జంగముడైన శివుడు కలలో కేతకీ నది ఒడ్డునున్న శివుని పూజింపమని చెప్పి అదృశ్యమవగా, ఉలికిపడి నిద్ర నుండి లేచి నలుదిక్కులూ వెతుకుతూ ఆశ్యర్య భావనలో తిన్నడు మునిగిపోయాడని భావము.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 2.
కూడు నీళ్ళే సుట్టంబులు దెచ్చి పెట్టెదరు.
జవాబు:
కవిపరిచయం :
ఈ వాక్యం అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన తిన్నని ముగ్ధ భక్తి పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.

సందర్భం :
తిన్నడు శివునితో (శివలింగం) అడవిలో నివశించుట ఎందుకని, తనతో పాటు ఉడుమూరికి రమ్మని కోరుతూ పలికిన సందర్భంలోనిది.

అర్థం :
ఆహార, పానీయాలు ఏ బంధువులు తెచ్చియిస్తారు.

భావము :
ఓ స్వామీ ! యిటువంటి కొండపై గుహలో ఒంటరిగా పులులు, సింహములు బాధ పెట్టె భయంకరమైన నట్టడివిలో, రావిచెట్టు నీడన, నది ఒడ్డున, ఏ కోరికతో గుడి నిర్మించావు. నీకు ఆకలి అయినచో ఏ బంధువులు అన్న పానీయాలు తెచ్చి యిస్తారు ? (ఇవ్వరు అని భావం). నువ్వు ఇక్కడ ఎందుకుండాలి లింగమా అని తిన్నడు పలికాడని భావము.

ప్రశ్న 3.
తల్లియు దండ్రియున్మఱుగరే యుల్లంబులో.
జవాబు:
కవిపరిచయం :
ఈ వాక్యం అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన తిన్నని ముగ్ధ భక్తి పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.

సందర్భం :
శివలింగం వద్ద తన్మయుడై ఉన్న తిన్నడిని వెతుకుతూ వచ్చిన చెంచులు తిన్నడితో ఇంటికి తిరిగి రమ్మని కోరుతూ పలికిన సందర్భంలోనిది.

అర్థం :
తల్లి, తండ్రి మనసులో దు:ఖించరా !

భావము :
నాయనా నిన్ను అలసిపోయేలా చేసి ఇక్కడ వరకు వచ్చేలా చేసిన ఆ అడవి పంది ఎటుపోయింది. మమ్ములను చూసి కూడా ఆదరంతో ఎందుకు చూడవు. వేగంగా కన్నీరు కారుతుంటే మేము ఏమి పలికినను, ఏమి కారణమో తిరిగి పలుకవు. అయ్యో వేటాడుటకు వచ్చి ఇలా ఉంటే నీ తల్లిదండ్రులు మనసులో ఎంతో దు:ఖిస్తారు అని బోయలు పలికారని భావము.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 4.
ఓడగట్టిన దులంబై లంకెనుండ జేసితి
జవాబు:
కవిపరిచయం :
ఈ వాక్యం అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన తిన్నని ముగ్ధ భక్తి పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.

సందర్భం :
పల్లెకు తిరిగిరమ్మని బోయలు కోరినపుడు తిన్నడు వారితో రాలేనని చెప్పిన సందర్భంలోనిది.

అర్థం :
ఒడకు ఆధారంగా ఉండే దులంలా ముడివేసాను.

భావము :
ఈ శివలింగములో నా ప్రాణమును మరణించేవరకు, ఓడ నడుచుటకు కట్టిన దూలంవలె పెనవేసుకున్నట్లు చేశాను. బాధపడవద్దు. మీరు గూడెమునకు వెళ్ళండి అని తిన్నడు పలికాడు.

ప్రశ్న 5.
వనచరులు చనిరి వలసిన రీతిన్
జవాబు:
కవిపరిచయం :
ఈ వాక్యం అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన తిన్నని ముగ్ధ భక్తి పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.

సందర్భం :
తిన్నని విడిచి బోయలు పల్లెకు తిరిగి వెళ్ళచూ దు:ఖించే సందర్భంలోనిది.

అర్థం :
ఆ బోయలు బాధతో తమ ద్రోవను తాము వెళ్ళారు.

భావము :
సుఖులను గూడెమునకు పొమ్మని తిన్నడు మరలా శివుని మనసులో నిలుపుకొని శరీరాన్ని మరచిన స్థితిలో మునుపటివలె ఉండగా ఆటవికులు దు:ఖిస్తూ
వెళ్ళవలసిన దారిలో వెళ్ళారు.

సంధులు :

1. సవర్ణదీర్ఘ సంధి సూత్రం :
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాటి దీర్ఘములు ఏకాదేశముగా వచ్చును.

  1. వ్యాపకానంత ; = వ్యాపక . + అనంత = సవర్ణదీర్ఘ సంధి
  2. హిమాచలము : = హిమ + అచలము = సవర్ణదీర్ఘ సంధి
  3. హృదయాంతరంగుడు; = హృదయ + అంతరంగడు = సవర్ణదీర్ఘ సంధి
  4. అవిద్యాధ్వాంత : = అవిద్య + అధ్వాంత = సవర్ణదీర్ఘ సంధి.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

2. గుణ సంధి సూత్రం :
అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ అనునవి ఏకాదేశమగును.

  1. కంచుకోదంచిత : కంచుక + ఉదంచిత = గుణ సంధి.

3. వృద్ధి సంధి :
అకారమునకు ఏ, ఐ లు పరమైతే ఐ కారము ఓ, ఔ లు పరమైతే ఔ : కారము ఏకాదేశముగా వచ్చును.

  1. ఆత్మైక = ఆత్మ + ఏక = వృద్ధి సంధి.

4. అకార సంధి :
అత్తునకు సంధి బహుళముగానగు.

  1. వేడుకెల్ల = వేడుక + ఎల్ల = అకార సంధి.

5. ఉకార సంధి :
ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.

  1. ఒడలందెల్ల = ఒడలందు + ఎల్ల = ఉకార సంధి.
  2. ఇట్లనియె – ఇట్లు + అనియె = ఉకార సంధి.

6. ఇకార సంధి : క్రియాపదంబులందు ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.

  1. బలివెట్టి = బలి + పెట్టి = ఇకార సంధి.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

7. సరళాదేశ సంధి :

  1. ద్రుతము మీద పరుషములకు సరళములగు.
  2. ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగును.
    1.  చేరఁబోయి = చేరన్ + పోయి = సరళాదేశ సంధి.

సమాసాలు

1. నలుదిక్కులు – నాలుగైన దిక్కులు – ద్విగు సమాసం
2. శార్దూల క్రోఢములు – శార్దూలము మరియు క్రోఢము – ద్వంద్వ సమాసం
3. తల్లిదండ్రులు – తల్లి మరియు తండ్రి – ద్వంద్వ సమాసం
4. ఈకల్ఫీలు – ఈకలు మరియు పీకెలు – ద్వంద్వ సమాసం
5. పులుల సింగముల్ – పులులు మరియు సింహములు – విశేషణ పూర్వపద సమాసం
6. మహాలింగము – గొప్పదైన లింగము – విశేషణ పూర్వపద సమాసం
7. మాయా’ విలసనములు – మాయయైన విలసనములు – విశేషణ పూర్వపద సమాసం
8. వేటకుక్కలు – వేట కొరకు కుక్కలు – చతుర్థి తత్పురుష సమాసం
9. మృగశ్రేణి – మృగముల యొక్క శ్రేణి – షష్ఠీ తత్పురుష సమాసం
10. శైలసుతాపతి – శైలసుత యొక్క పతి – షష్ఠీ తత్పురుష సమాసం
11. పాలిండ్లు – పాల యొక్క ఇండ్లు – షష్ఠీ తత్పురుష సమాసం
12. ఆనందభాష్పములు – ఆనందముతో కూడిన భాష్పములు – తృతీయ తత్పురుష సమాసం
13. ఇగురుబోండ్లు – ఇగురు వంటి మేను కలది – బహుజొహి సమాసం
14. తోబుట్టువులు – తోడైన పుట్టుకన్ కలవారు – బహుప్రీహి సమాసం

పద్యాలు – ప్రతి పదార్థం – భావం

ప్రశ్న 1.
మ. ఒడలందెల్ల విభూతిపూత, పులితోలొడ్డాణ మల్లాడు కెం
జడ అల్మైక విచార నిశ్చలదృగబా తంబు, లచ్చెన క
చ్చడ మంసంబున, రుండమాల గళదేశస్థాణువుం గొలఁగా
నోడయం డొక్కరుఁ డక్కుమారుకలలో సుద్యత్కృపా మూర్తియై
జవాబు:
ప్రతిపదార్థం :
ఒడలందున్ + ఎల్లన్ = దేహమంతటా
విభూతిపూత్ర = విభూతి లేపనము (రాసుకొనగా)
పులితోలు = పులిచర్మం
ఒడ్డాణము = కటిసూత్రము (నడుముకు ధరించు పట్ట)
అల్లాడు = కదిలెడు (చలించెడు)
కెంజడలు = ఎర్రని జటలు కలవాడు
ఆత్మ = జీవుడు; బుద్ధి; బ్రహ్మము; మనసు
ఏకవిచార = ఒకే ఆలోచన చేత (ఏకాగ్రత)
నిశ్చల = స్థిరమయిన
దృక్ + అజ్ఞాతంబులు = పద్మముల వంటి కనులు గల
అచ్చు + ఐన = శరీరమునకు సరిపోయిన
కచ్చడము = ధోవతి (గోచి వలె)
అంసంబునన్ = మూపు; భుజశిరము
రుండమాల = పూర్రెల దండ; తెగిన తలల దండ
గళదేశస్థాణువు = కంఠ ప్రదేశములో శివలింగమును
కాలంగా = ఒప్పగా; ఉండగా
ఒడయండు = ప్రభువు (జంగమదొర)
ఒక్కరుఁడు = ఒకడు
ఉద్యత్ = ప్రకాశించే; ఉదయిస్తున్న; పైకివస్తున్న
కృపామూర్తియై = దయామూర్తి వలె
అక్కుమారు = ఆ బాలుని యొక్క (తిన్నడు)
కలలో = స్వప్నమునందు కనిపించాడు.

భావము :
దేహమంతటా విభూతి పూసుకుని, పులిచర్మాన్ని ఒడ్డాణము వలే నడుముకు చుట్టుకొని, కదులుతున్న ఎర్రటి జటలు కలిగినవాడు, ఆత్మ (బ్రహ్మము) గురించి ఏకాగ్రతతో ఆలోచన చేసినట్టి స్థిరమయిన చూపులు’ గలవాడు, పద్మనయనముల వాడు, శరీరానికి సరిపోయిన గోచి ధరించినవాడు, భుజముల మీద పుర్రెల దండ కలవాడు, కంఠస్థానంలో శివలింగాన్ని కలిగిన ప్రకాశించే దయామూర్తి అయిన జంగమదేవుడు (శివుడు) ఆ తిన్నడికి కలలో కనిపించాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 2
క. బాలక ! యిచట శివావట
మూలంభిన్న, గొండదండ, మొగలేటి దరిన్
శైల సుతాపటి , భక్తుల
పాలిటి పెన్నిధి, వసించు భక్తిం గొలుమీ.
జవాబు:
ప్రతిపదార్థం :
బాలక = ఓ కుఱ్ఱవాడా
యిచట = ఈ ప్రదేశంలో
శిలావట = రావి చెట్టు యొక్క
మూలంబున = వేరు ప్రదేశంలో
కొండదండన్ = శ్రీకాళహస్తి పర్వత సమీపంలో
మొగలేటి = కేతకీ నది
దరి = ఒడ్డున
భక్తుల పాలిటి = భక్తుల పట్ల
పెన్నిది = పెద్దనిధి వంటి వాడయిన
శైలసుతాపతీ కల = పార్వతీదేవి భర్త అయిన శివుడు
వసించు = ఉన్నాడు
భక్తి = భక్తితో (భగవంతుని మీద ప్రేమ)
కొలుమీ = సేవించు.

భావం :
ఓ కుఱ్ఱవాడా ! ఈ ప్రదేశంలోని రావిచెట్టు యొక్క వేరు ప్రదేశంలో శ్రీకాళహస్తి, పర్వత సమీపంలో కేతకీ నది ఒడ్డున, భక్తులకు పెద్ద నిధి వంటివాడయిన , శివుడు . ఉన్నాడు. ఆ స్వామిని భక్తితో సేవించు.

విశేషం :
భక్తి – “శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవ, అర్చనము వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము” అని ఎనిమిది విధములు.

ప్రశ్న 3.
క. అని యంతరానము సే
సినఁ, దిన్నండదరి పడుచు, శీఘ్రంబున మే
లని, నలు దిక్కులు వెదకుచు .
మనమున నాశ్చర్య రస నిమగ్నం డగుచున్
జవాబు:
ప్రతిపదార్థం :
అని = అని చెప్పి
అంతర్థానము + చేసినన్ = అదృశ్యము కాగా
తిన్నండు = తిన్నడు
అదరి పడుచు = ఉలికిపడుచు
శీఘ్రంబున = వెంటనే
మేల్కని = నిద్రనుండి లేచి
నలుదిక్కులు = నాలుగువైపులా
వెదకుచు = అన్వేషిస్తూ
మనమున = మనస్సులో
ఆశ్చర్యరస = అద్భుత భావనలో
నిమగ్నుండు అగుచున్ = మునిగిన వాడయి.

భావం :
ఈ విధంగా మాయా జంగమ రూపుడయిన శివుడు కలలో బోధించి, అదృశ్యమవగా, తిన్నడు ఉలికి పడుతూ వెంటనే నిద్ర నుండి లేచి నాలుగు దిక్కులూ . వెతుకుతూ మనస్సులో ఆశ్చర్యభావనలో మునిగిపోయాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 4.
శా: ఈలల్పీఁకెలు దిక్కులం జెలఁగఁదామ్చో మృగ శ్రేణిపై
గాలిం బోవక సన్న దప్పుటయు, రొక్కారొక్కముల్ దిట్టి, శా
రూల క్రోడ మృగాదుల స్వలలకుం దోలంగఁ, దిన్నండు త
త్కేలీలోల రవంబు దన్నపుడు బోధింపంగ నేతెంచినన్
జవాబు:
ప్రతిపదార్థం :
ఈలల్ = వేటగాళ్ళు నోటితో చేసే ధ్వనులు పీఁకెలు
పీఁకెలు = నాగస్వరము వంటి వాద్యములలో పెట్టెపుల్ల (ఊదితే శబ్దాన్నిచ్చే పుల్లలు)
దిక్కులన్ = అన్ని వైపులా
జెలఁగఁ = వ్యాపించగా (ప్రతిధ్వనిస్తుండగా)
తాము = వేటగాళ్ళ సమూహము
ఎచ్చోన్ = ఏ ప్రదేశంలోని
మృగశ్రేణిపై = జంతు సమూహంపై నుండి వచ్చే
గాలింబోవక = జంతువుల యొక్క వాసనను బట్టి ఆ దిక్కున వెళ్ళి వెతకక
సన్న + తప్పుటయున్ = సంజ్ఞలు(కను సైగ) తప్పుటచే
రొక్కారొక్కముల్ = అనేకరకములైన
తిట్టి = దూషించి (బూతులు తిట్టుకొని)
శార్దూలము = పులి
క్రోఢము = అడవి పంది
మృగాదులు = జింక వంటి జంతువులను
వలలకున్ = ఉచ్చులో చిక్కుకునేట్లు
దోలంగన్ = తరమగా
తిన్నండు = తిన్నడు
తదే + కేళీ = ఆ వేట అనెడి ఆటలో
లోల రవంబు = వ్యాపించిన ధ్వని
తన్ను = తనను (తిన్నడిని)
అప్పుడు = ఆ సమయంలో
బోధింపంగ = ప్రేరేపించినట్లు
ఏతెంచినన్ = అనిపించగా.

భావం :
ఈలలు, అరుపులు అన్నివైపులా వ్యాపించగా, వేటగాళ్ళ సమూహం ఆయా ప్రదేశాలలోని జంతు సమూహం పైనుండి వచ్చే గాలి యొక్క దిశను బట్టి వెతకక, వేటసమయంలో చేసే కను సైగలు తప్పుటచే, అనేకరకములైన దుర్భాషలాడు కొని, పులి, అడవిపంది, జింక వంటి జంతువులను ఉచ్చులో చిక్కుకునేట్లు తరమగా, ఆ వేట అనెడి ఆటలో వ్యాపించిన ధ్వని తిన్నడికి ఆ సమయంలో ప్రేరణ కలిగించి నట్లు అనిపించింది.

విశేషం :
జంతువుల వాసనను బట్టి వెతికే శక్తి మానవులకన్నా వేటకుక్కలు ఇతర జంతువులకు ఎక్కువగా ఉంటుంది. వేటకు సంబంధించిన ఈ పద్యాన్ని ధూర్జటి వేటలో దిట్టయైన శార్దూల వృత్తంలో రాయుట ధూర్జటి కవితా చమత్కారాన్ని సూచిస్తున్నది.

ప్రశ్న 5.
మ. వలకుం జేరక, ప్రోగులుం దెరణ డ్రైవ్వంటిక్కి యా నేటక
స్థల ముల్లంఘన కేసి, లుకుల యుత్నంబెల్ల వారింది. ది.
క్కులు దదరు రఘుదుర ధ్వనులచే ఘర్జిల్లఁగా నొక్మ యే
కల మేగు గని, తిన్నండప్పుడు ధను:కాందోల్లస్పూడి
జవాబు:
ప్రతిపదార్ధము :
ఒక్క + ఏకలము = ఒక అడవి పంది.
వలకున్ = ఉచ్చులో
చేరక = చిక్కుకొనక
ప్రోగులున్ = పోగు డు (వేటాడే చోట చుట్టి ఏర్పరచే త్రాడు)
తెరలున్ = తెరచీరలనే వస్త్రాలు (వీటిలోకి జంతువులను తోలి వాటిని బంధిస్తారు లేదా వధిస్తారు. దీనిని తెరవేట అంటారు.) .
త్రెవ్వన్ = తెగిపోవునట్లు,
తొక్కి = కాళ్ళతో అదిమి
ఆఫీటక స్థలము = ఆ వేటాడే ప్రదేశమును
ఉల్లంఘన చేసి = దాటిపోయి
లుమికుల = బోయలయొక్క
యత్నంబు + ఎల్లన్ = ప్రయత్నమంతటిని
వారించి = నిరోధించి; ప్రతిఘటించి
తదే = దాని (అడవి పంది)
ఘర్షుర ఘర్షుర ధ్వనుంచేన్ = పంది అరుపులచే
దిక్కులు = అన్ని దెసలు
ఘార్జిల్లఁగా = ప్రతిధ్వనించగా
ఏగన్ + కని = పారిపోవుటకు ప్రయత్నించగా చూచిన
తిన్నడు = తిన్నడు
అప్పుడు = ఆ సమయంలో
ధనుస్ + కాండ = విల్లు, అమ్ములతో (బాణములు)
ఉల్లసత్ = మెరయుచున్న
పాణియై = చేతులు గలవాడై యున్నాడు.

భావం :
ఒక అడవి పంది ఉచ్చులో చిక్కుకొనక వేటాడటానికి ఏర్పరచిన పోగుతాడు, తెరచీరలనే వస్త్రాలు తెగిపోవునట్లుగా కాళ్ళతో అదిమి, ఆ వేటాడే ప్రదేశాన్ని దాటి పోయి బోయల యొక్క ప్రయత్నమంతటినీ నిరోధించింది. దాని అరుపులు అన్ని దిక్కులు ప్రతిధ్వనించగా పారిపోవుటకు ప్రయత్నించగా, తిన్నడు ఆ సమయంలో విల్లమ్ములు చేతబట్టి మెరయుచున్నాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 6.
మ. ఇవమొప్ప న్వెనువెంట నంటి తఱమ స్పంవర్ధిత శాంతి ను
ద్దవిడిం బాఱఁగలేని చందమునఁ జెంతం జేరఁగా నిల్చి యే
య విచారించిన, దూఁటి దాఁటుకొని, తన్నాశాశలం ద్రిప్పి పా
శ విముక్తుందగు యోగిభావన యదృచ్ఛావృత్తి వర్తించుచున్
జవాబు:
ప్రతిపదార్థం :
జవము = వేగము
ఒప్పన్ = ఎక్కువగుచుండగా
వెనువెంట = వెంటబడి
తఱుమన్ = పరుగెత్తింపగా
సంవర్థిత = ఎక్కువయిన
శ్రాంతిన్ = అలసటతో
ఉద్దవిడిన్ = వేగంగా
పాఱఁగలేని = పరుగెత్తలేని
చందమున = విధముగా
చెంతన్ + చేరగా = దగ్గరకు చేరితే
నిల్చి = నిలబడి
ఏయ = బాణము వేయుటకు
విచారించినన్ = ఆలోచింపగా
దూఁటి = లంఘించి
దాటుకొని = పరుగెత్తి
తన్నున్ = తనను (తిన్నడిని)
ఆశాశలం (ఆశలన్ + ఆశలన్) = మిక్కిలి కోరిక కలుగునట్లు
త్రిప్పి = వెంటబడేటట్లు చేసి
పాశ = మోహం వంటి బంధాల నుండి
విముక్తుండగు = విడుదల పొందిన
యోగిభావన = యోగివలె
యదృచ్ఛావృత్తిన్ = ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా
వర్తించుచున్ = వర్తించుచూ (తిరుగుచూ).

భావము:
వేగము ఎక్కువగుచుండగా అడవిపంది వెంటబడి పరుగెత్తింపగా (తరమగా), అలసట ఎక్కువయి పరుగెత్తలేనట్లు దగ్గరకు చేరినప్పుడు, నిలబడి బాణ ప్రయోగము చేయబోగా, లంఘించి పరుగెత్తి, తిన్నడికి చిక్కుకున్న ఆశను విపరీతంగా కలిగించి వెంటబడేటట్లు చేసి; మోహబంధాల నుండి విముక్తుడైన యోగివలె ఇష్టం వచ్చినట్లు “స్వేచ్ఛగా సంచరించింది.

ప్రశ్న 7.
క. అలయించుచుఁ, దిన్నండు దన
కల లోపలఁగన్న శివునిఁ గనుఁగొనుదాఁకన్
జలమునఁ గొని చనెనయ్యే
కల మప్పు డదృశ్యమైనఁ గడుంజోద్యమునన్.
జవాబు:
ప్రతిపదార్థం :
అలయించుచు = విసిగించుతూ
తిన్నడు = తిన్నడు అనువాడు
తన = తనయొక్క
కలలోపల = స్వప్నములో
కన్న = చూసిన / దర్శించిన
శివునిన్ = ఈశ్వరుని
కనుఁగొనుదాఁకన్ = చూసేవరకు
చలమునన్ = పట్టుదలతో
కొనిచనిన = తీసుకొని పోయిన
ఆ + ఏకలము = ఆ అడవి పంది
అప్పుడు = ఆ సమయంలో
కడున్ = మిక్కిలి
చోద్యమున్ = ఆశ్చర్యకరంగా
అదృశ్యము + ఐనన్ = మాయమయింది

భావం :
తిన్నడికి చిక్కకుండా విసిగించుతూ, తిన్నడు స్వప్నములో చూసిన ఈశ్వరుని చూసేవరకు, పట్టుదలతో తీసుకొనిపోయిన అడవిపంది ఆ సమయంలో అదృశ్యమవగా మిక్కిలి ఆశ్చర్యపడెను.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 8.
క. కలలోఁ జెప్పిన యొడయ
డెలయించుక వచ్చినట్టి యేకలము, హిమా
చల తనయాధిప మాయా
విలసనములు గాఁగ నపుడు వివరించి మదిన్
జవాబు:
ప్రతిపదార్థం :
కలలో = స్వప్నములో
చెప్పి న = పలికిన (కేతకీనది ఒడ్డునున్న శివలింగాన్ని కొలువ మని చెప్పుట)
ఒడయుండు = జంగమదేవర;
ఎలయించుక = తాను అక్కడకు చేరునట్లు
వచ్చినట్టి = తీసుకువచ్చిన.
ఏకలము = అడవిపంది
హిమచలతనయ = పర్వతరాజపుత్రి (పార్వతి)
అధిప = భర్త (శివుడు)
మాయా విలసనములు = మయాలీలలు
కాగా = కాగా
అపుడు = ఆ సమయంలో
మదిన్ = మనసులో
వివరించి = జరిగిన విషయాన్ని ఆలోచించాడు.

భావము :
కేతకీనది ఒడ్డునున్న లింగాన్ని కొలవమని చెప్పిన జంగమదొర, తనను అక్కడకు చేర్చిన అడవిపంది ఇవన్నీ శివుని మాయాలీలలుగా తిన్నడు భావించాడు.

ప్రశ్న 9.
శా. సంతోషంబునఁ గాంచెఁ దిన్నడు, సమస్త వ్యాపకానంత వే
దాంత స్థాపిత చిన్నయాంగము నవిద్యాధ్వాంత సంతాన సం
క్రాంత స్వాంత నిశాంత జంతు సుఖమార్గ ప్రాపకాభంగ రు
క్కాంతాపాంగము దివ్యలింగము వివిక్తధ్యేయ నిర్లింగమున్
జవాబు:
ప్రతిపదార్థం :
తిన్నఁడు = తిన్నడు
సమస్త = సర్వము నందు
వ్యాపక = నిండినది/ వ్యాపించినది
అనంత = అంతం లేని (తుది లేని)
వేదాంత = ఉపనిషత్తుల చేత
స్థాపిత = ప్రమాణీకరించబడిన / నిశ్చయించబడిన
చిత్ + మయ + అంగము = జ్ఞానమయమైన దేహం గలది (జ్ఞానంతో నిండినది)
అవిధ్యా = అజ్ఞానము (మాయ)
ధ్వాంత సంతాన = చీకటి. సమూహం చేత
సంక్రాంత = కప్పబడిన
స్వాంత = మనసు అనే
నిశాంత = గృహము నందలి
జంతు = ప్రాణులకు
సుఖమార్గ = మేలైన దారిని
ప్రాపక = కలగజేయునది
అభంగ = నశించనిది
రుచ్ + కాంత = తరగని కాంతి గల కోమలి
అపాంగము = క్రీగంటి చూపు
వివిక్త = భిన్నమైన / ఏకాంతము
ధ్యేయ = ధ్యానింపదగిన
నిర్లింగమున్ = నిరాకార స్వరూపమైన
సంతోషంబున్ = ఆనందంతో
కాంచెన్ = కనుగొనెను; చూచెను.

భావము :
తిన్నడు సర్వము నందు వ్యాపించినది, అంతములేనిది, ఉపనిషత్తులచే ప్రమాణీకరించబడినది, జ్ఞానమయ రూపం కలది, అజ్ఞానం (మాయ) అనే చీకటి సమూహం చే కప్పబడిన మనస్సు అనే గృహం కల జంతువులకు సుఖమార్గాన్ని పొందించు, తరుగని కాంతిగల కోమలి క్రీగంటి చూపువంటింది, ఏకాంతము నందు
ధ్యానింపదగిన నిరాకార స్వరూపమయిన దివ్యలింగమును ఆనందంతో చూచెను.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 10.
తే. కాంచి, రోమాంచకంచుకోడంచితాంగు
డగుచు, సానంద బాష్పంబు లతిశయిల్లా
నమ్మహా లింగమునకు సాష్టాంగనతులు
సేసి, ముకుళిత హస్తుఁడై చేరంబోయి
జవాబు:
ప్రతిపదార్థం :
కాంచి = శివలింగాన్ని చూచి
రోమాంచక = గగుర్పాటు అనే
కంచున్ = కవచం చే
ఉదంచిత = ఒప్పుచున్న
అంగుడు = శరీరం కలవాడు.
అగుచు = అగుచు
ఆనంద భాష్పంబులు = ఆనందం వలన కలిగిన కన్నీరు
అతిశయిల్ల = ఎక్కువవగా
ఆ + మహలింగమునకు = గొప్పదైన శివలింగమునకు
సాష్టాంగ (స + అష్ట + అంగ) నతుల = ఎనిమిది అంగములతో కూడిన నమస్కారము (రెండు చేతులు, రెండు పాదములు, రొమ్ము, నుదురు, రెండు భుజములు, నేలకు తాకించి చేసిన నమస్కారం)
సేసి = చేసి
ముకుళితహస్తుడై = చేతులు జోడించి
చేరఁబోయి = సమీపించాడు.

భావము :
తిన్నడు శివలింగాన్ని చూచి గగుర్పాటు అనే కవచంతో కూడిన శరీరం కలవాడై, ఆనందం వలన కలిగిన కన్నీరు హెచ్చగా, ఆ శివలింగమునకు సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి సమీపించెను.

ప్రశ్న 11.
శా. ‘ఓపామీ ! యిటువంటి కొండ దరిలో నొంటిం జులుల్ సింగవ
గాసింబెట్టెడి కుట్ర నట్టడవిలోఁ, గట్టువ్వీ క్రీనీడ, నే ,
యాసంగట్టితి వేడిగడ్డ నిలు ? నీ వాలకొన్నచో కూడు నీ
చేసుట్టంబులు దెచ్చి పెట్టెదరు ? వీకిందేటికే లింగమా !
జవాబు:
ప్రతిపదార్థం :
ఓసామీ = ఓస్వామీ
ఇటువంటి = ఇట్టి
కొండదరి = కొండగుహలో
ఒంటన్ = ఒంటరిగా ఉంటూ
పులుల్ = పులులు
సింగముల్ = సింహములు
గాసింబెట్టెడు = బాధపెట్టు
కుట్ర = భయంకరమైన
వట్టడవిలో = అరణ్యమధ్యములో
కలువ్వి = రావిచెట్టు
క్రీవీడ = క్రింది నీడలో
ఏటిగడ్డన్ = నది ఒడ్డున (సువర్ణముఖి నది)
ఆసన్ = ఏ కోరికతో
ఇలు = గృహము, దేవాలయము
కట్టితివి = నిర్మించావు
నీవు = నీకు
ఆకొన్నచో = ఆకలిచెందితే
కూడునీళ్ళు = ఆహారం, నీరు
ఏ చుట్టంబులు = ఏబంధువులు
తెచ్చి = తీసుకొచ్చి
పెట్టెదరు = ఇస్తారు
నీకున్ = నీకు (శివుడు)
ఇందు = ఈ ప్రదేశంలో
ఏటికే = ఎందుకుండుట
లింగమా = ఓ శివలింగమా.

భావం :
ఓ స్వామీ యిటువంటి కొండపై గుహలో ఒంటరిగా పులులు, సింహములు బాధపెట్టు భయంకరమైన అరణ్యమధ్యంలో రావిచెట్టు నీడన నది ఒడ్డున, ఏ కోరికతో గుడి నిర్మించావు ? నీకు ఆకలి అయినచో ఏ బంధువులు అన్న పానీయములు తెచ్చి యిస్తారు. నువ్వు ఇక్కడ ఎందుకుండాలి లింగమా అని భావం. తిన్నడి ప్రశ్నలలో అతనిలోని నిర్మలత్వం, అమాయకత్వం అతనిలోని ముగ్ధ భక్తిని తెలియజేస్తున్నాయి.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 12.
ఉ. కొండల గానలం దిరిగి, క్రొవ్విన పందుల లేళ్ళ దుప్పులన్
జెండినఁ బెక్కుచందములఁ జిన్నక పెద్దక గారు కమ్మఁగా
అని వండుదు రట్ల పిట్టలను వండుదు ‘రిచ్చటనుండ నేల ? నా
కొండొకటానతీక యుడుమూరికి రాఁగదవయ్య ! లింగమా !
జవాబు:
ప్రతిపదార్థం :
కొండలన్ = పర్వతాలలో
కానలన్ = అడవులలో
తిరిగి = సంచరించి
క్రొవ్విన = మదించిన/ బలిసిన
పందులన్ = వరాహములు (అడవిపంది)
లేళ్ళు = లేళ్ళు
దుప్పులన్ = జింకలను
చెండినన్ = ముక్కలుగా చేసి
పెక్కుచందములన్ = పలువిధములుగా
చిన్నక = అక్కలలో చిన్నది
పెద్దక = అక్కలలో పెద్దది
కమ్మగా = రుచికరంగా
వండుదురు = వండుతారు
అట్ల = అదేవిధంగా
పిట్టలను = పక్షులను
వండుదురు = వండుతారు
ఇచ్చట = ఈ అరణ్యంలో
ఉండనేల = ఎందుకు నివసించుట
లింగమా ! = ఓ శివలింగమా
నాకు = నాకు (తిన్నడికి)
ఒండొకటి = వేరొక మాట
ఆనతి + ఈయన్ = చెప్పక
ఉడుమూరికి = ఉడుమూరు (తిన్నడి ఊరు)
రాఁగదవయ్య = రావయ్యా.

భావం :
కొండలలో, అడవులలో సంచరించి బలిసిన అడవిపందులు, లేడులు, జింకలను ముక్కలుగా చేసి పలువిధములుగా చిన్నక్క పెద్దక్క రుచికరంగా వండుతారు. అలాగే పిట్టలను కూడా వండుతారు. ఈ అరణ్యంలో ఎందుకు నివసించుట, ఓ శివ లింగమా నాకు మరోమాట ఎదురు చెప్పక ఉడుమూరుకి రమ్ము అని తిన్నడు పలికాడు.

ప్రశ్న 13.
క. ఓ లింగమ ! విను నివ్వరి
పాలును, నొడిపిళ్ళు, గునుకుఁబ్రాలును, వెదురుం
బ్రాలును, సవరపు మెకముల
పాలును, గల వచట నీకుఁ బాయసమునకున్
జవాబు:
ప్రతిపదార్థం :
ఓ లింగమా = ఓ శివలింగమా
విను = ఆలకించు
అచట = అక్కడ
నీకున్ = నీకు
పాయసమునకు = పరమాన్నమునకు
నివ్వరిపాలు = నివ్వరి బియ్యము
నొడిపిళ్ళు = ఒక రకపు బియ్యము
గునుకుబ్రాలు = గునుకు బియ్యము
వెదురుఁబ్రాలు = వెదురు. బియ్యము
సవరపు మెకములపాలు = చమర మృగముల పాలు
కలవు = ఉన్నవి.

భావము :
ఓ శివలింగమా ! ఆలకించు, అక్కడ (ఉడుమూరులో) నీకు పరమాన్నమునక నివ్వరి బియ్యము, ఒడిపిళ్ళు, గునుకు బియ్యము, వెదురు బియ్యం, చమరీ మృగము పాలు ఉన్నాయి.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 14.
తే. పుట్టతేనియ పెరతేనే పుట్టజున్ను
తొట్టతేనియ గల మందుఁ దోంచి తోఁచి
కాలిదులదులనై పిండిపోలె రాలు
నట్టి నింజెట్లు గలవు నీకారగింప
జవాబు:
ప్రతిపదార్థం :
పుట్టతేనియ = పుట్టమధ్యలో పెట్టిన. తేనెపట్టు నుండి తీసినది
పెరతేనే = తేనెపట్టు నుండి తీసిన తేనె
పుట్టజున్ను = పుట్టలో జుంటీగలు పట్టిన తేనెపుట్ట నుండి తీసిన తేనె
తొట్టతేనియు = చెట్టు తొట్టెలో పట్టిన తేనె పుట్ట నుండి తీసిన తేనె
కలవు = ఉన్నవి
అందున్ = వానిలో
తోఁచితోఁచి, = ముంచి ముంచి
నీకున్ = నీవు
ఆరగింప = తినుటకు
కాలి = కాల్చి (కాలుటచే)
దులదులనై = పొడియై
పిండి పోలె = పొడుము లాగా
రాలునట్టి = రాలే
నింజెట్లు = నింజెట్లు అనెడి ఒక రకం దుంప.

భావము :
పుట్టతేనె, పెరతేనె, పుట్టజున్ను, తొట్ట తేనె కలవు. వానిలో మాటిమాటికి ముంచుకొని తినుటకు, కాలుటచే పొడిగా మారి పొడుములాగా రాలే నింజెట్లు అనెడి ఒక జాతి దుంపలు కలవు.

ప్రశ్న 15.
సీ. నేరేడు పండులు నెలయూటి పందులు
గొండమామిడి పండ్లు దొండ పండ్లు
బాలపండులు నెమ్మిపండులు జరివంక
పందులుఁ జిటి ముడిపండ్లుఁ గలివే
పండులుఁ దొడివెందపండ్లు దుమ్మికి పండ్ల
జాన పందులు గంగరేను పండ్లు
వెలఁగ పండులు పుల్ల తెలంగ పండులు మోని
పండ్లు సంకెన పండ్లు బలుపు పండ్లు

తే. బీర పండ్లును బిచ్చుకబీర పండ్లు
గొమ్మి పండ్లీత పండ్లును గొంజి పండ్లు
మేడి పండ్లును మొదలుగాఁ గూడిమాడి
చెంచెతలు దెత్తు రిత్తు విచ్చేయుమయ్య !
జవాబు:
ప్రతిపదార్థం :
నేరేడు పండులు = నేరేడు పండ్లు (జంబూ ఫలములు)
నెలయూటి పండులు = నేలయూటి పండులు అనే ఒక జాతి ఫలములు
కొండమామిడి పండ్లు = కొండలపై పెరిగి మామిడి చెట్టు ఫలములు (కోశామ్రము)
దొండపండ్లు = దొండ ఫలములు
పాలపండులు = పాలచెట్టు ఫలములు
నెమ్మి పండులు = నెమి చెట్టు ఫలములు
బరివెంక పండులు = పిచుల వృక్ష ఫలములు
చిటిముటి పండ్లు = చిటిముటి వృక్ష ఫలములు
కలివె పండులున్ = కృష్ణ పాక ఫలము
తోడివెంద పండ్లు = తోడివెంద చెట్టు ఫలములు
తుమ్మికి పండ్లు = తిలుదుక ఫలములు
జానపండులు = జాన చెట్టు పండ్లు
గంగరేను పండులు = పెద్దరేగు పండ్లు
వెలఁగ పండులు = వెలగ పండ్లు
పుల్లవెలఁగ పండులు = పుల్లని వెలగపండ్లు
మోవి పండ్లు = మోవి చెట్టు పండ్లు
అంకెన పండ్లు = అంకెన వృక్ష ఫలములు
బలుసు పండ్లు = బలుసు ఫలములు
పిచ్చుక బీర పండులు = పిచ్చుక బీర అనే జాతి చెట్టు ఫలములు
కొమ్మి పండ్లు = ఖర్జూరీ ఫలములు
ఈత పండ్లు = ఈత చెట్టు ఫలములు
గొంటి పండ్లు = గొంజిచెట్టు ఫలములు
కుకు యత ఆంధ్రప్రదేశ్ ఆరుదయము
మేడి పండ్లు = మేడి కాయలు
మొదలుగానే = మొదలైనవి
చెంచెతలు = మా చెంచు జాతి స్త్రీలు
కూడిమాడి = కలసిమెలసి
తెత్తురు = తీసుకువస్తారు
ఇత్తురు = నీకు వాటిని ఇస్తారు
నిచ్చేయుమయ్య = దయచేసి రావయ్య.

భావము :
నేరేడు పండ్లు, నెలయుటి పండ్లు, కొండమామిడి, దొండ, పాల, నెమ్మి బరివెంక, చిటిముటి, తొడివెంద, తుమ్మికి, జాన, గంగరేను, వెలఁగ, పుల్లవెలఁగ, మోవి, అంకెన, బలుసు, బీర, పిచ్చుక బీర కొమ్మి, ఈత, గొంజి, మేడి మొదలైన ఫలములు మా చెంచుజాతి స్త్రీలు కలసిమెలసి తీసుకువస్తారు. నీకు వాటిని ఇస్తాను. దయచేసి రావయ్య అని తిన్నడు అన్నాడు.

విశేషం :
ఈ పద్యములో పేర్కొన్న పండ్లన్నీ అడవులలో లభించునవి.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 16.
శా. ఇల్లో, ముంగిలియో, యనుంగుఁజెలులో, యీడైన చుట్టంబులో,
యిల్లాలో, కొడుకో, ధరింప వశమే, యే పోఁడుముల్లేక? మా
పల్లెంగోరిన వెల్లనుం గలవు తెప్పల్లాంగ, నీకిచ్చెదన్
జెల్లంబో ! యిట నొంటి నుండ, కటువిచ్చేయంగదే లింగమా !
జవాబు:
ప్రతిపదార్థం :
ఇల్లో = గృహమో
ముంగిలియో = వాకిలి
అనుండుజెలులో = ఇష్టమయిన స్నేహితులలో
ఈడు + ఐన = వయసులో ఉన్న
చుట్టంబులు = బంధువులు
ఇల్లాలో = గృహిణి (భార్య)
కొడుకో = కుమారుడో (ఎవరున్నారు నీకు?)
ఏఁడుముల్ = ఏ సుఖ సాధనములు (అనుకూల సాధనములు)
లేక = లేకుండా
ధరింపవశమా = జీవితము సాగించుట సాధ్యమా (కాదు)
ఆంధ్రప్రదేశ్ తయారు
మా పల్లెనే = మా పల్లెలో
కోరిన వెల్లనుం = కోరినవన్నీ
కలవు = ఉన్నవి
నీకున్ = నీకు (శివునికి)
తెప్పల్ + కాఁగన్ = రాసులుగా (సమృద్ధిగా)
ఇచ్చెదన్ = ఇస్తాను
చెల్లంబో = ఇక్కడ (ఈ అడవిలో)
ఒంటిన్ + ఉండక = బంటరిగానుండక
లింగమా = శివలింగమా
అట = అక్కడికి (పల్లెకు)
విచ్చేయంగదే = రావలసింది. (విచ్చేయుమా)

భావము :
ఇల్లా ? వాకిలా ? ఇష్టమైన స్నేహితులా ? వయసులో ఉన్నా బంధువులా ? యిల్లాలా ? కొడుకా ఎవరున్నారు (ఎవరు లేరు), ఏ.సుఖ సాధనములు లేకుండా జీవితం గడుపుట సాధ్యమా (కాదు అనుట) ? మా బోయ పల్లెలో నీకు కావలసినవన్నీ ఉన్నాయి. నీకు సమృద్ధిగా ఇస్తాను. అయ్యో ! ఒంటరిగా ఉండక ఓ శివలింగమా ! మా బోయపల్లెకు విచ్చేయుమా అని తిన్నడు కోరాడు.

ప్రశ్న 17.
చుటకుఁ జాపన గాలిన కొంత నుఱుకు
నుణకుఁ జూపులఁ బట్టించు నెఱుకువారి
యిజుకు వలిగుబృపాలిండ్ల యిగురుంచోండ్ల
సేవకిచ్చెద నీకు విచ్చేయుమయ్య !
జవాబు:
ప్రతిపదార్థం :
చుఱుకుఁ + చూపునన్ = వేడియైన చూపుతో (శివుని తీక్షణ దృష్టితో)
కాలిన= దగ్ధమైపోయిన (కాలిపోయిన)
కొఱత నుఱుకున్ = అకార్యము చేయువాడు (కానిపని) ; శూలము నందు దూకువాడు (మన్మథుడు)
ఉఱుకు + చూపులన్ = ప్రసరించే చూపుల చేత
పుట్టించు = జనింపచేయు
ఎఱుకు వారి = ఎరుకు. జాతి వారి
ఇఱుకు = బింకమైన
వలిగుబ్బ = గుండ్రనిని
పాలిండ్ల = స్తనములు గల
ఇగురు బోండ్లన్ = కోమలాంగులు (స్త్రీలు)
నీకున్ = నీకు
సేవకున్ = సేవలకై
ఇచ్చెదన్ = ఇస్తాను
విచ్చేయుమయ్య = దయచేసి రమ్ము.

భావము :
శివుని మూడవ కంటితో చూసిన తీక్షణదృష్టికి దగ్ధమయిన మన్మథుడిని తమ చూపుల ప్రసారంలో జనింపచేయగల సుందరమైన ఎఱుక కాంతలను నీ సేవకు ఇస్తాను అని తిన్నడు పలికాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 18.
మ. నను మన్నించెదవేని, వీవిపుడు రా నా వెంట, రాకుండినన్
నిను నేఁబాసి చనంగ నోప, నిచటన్నీతోడిదే లోకమై
మనువాడం; గనువాడ నీకరుణ; నీ మౌనంబు చిత్తంబు న
చ్చినచో మానెదుఁగాక, నిన్నిపుడు కసింబెట్ట నాకేటికిన్
జవాబు:
ప్రతిపదార్థం :
నను = నన్ను
మన్నించెదవేని = అనుగ్రహిస్తే
ఇపుడు = ఇప్పుడు
నీవు = నీవు (శివుడు)
నావెంట = నాతో
రా= రమ్ము
రాక + ఉండినన్ = రాకుంటే
నినున్ = నిన్ను (శివుడు)
పాసి = విడిచి
ఏన్ = నేను
చనంగ + ఓప = వెళ్ళను
ఇచటన్ = ఇక్కడ
నీతోడిదే లోకము = తక్కిన లోకంతో సంబంధం లేకుండా
మనువాడన్ = నడుచుకుంటాను
నీ కరుణన్ = నీ దయను
కనువాడన్ = పొందేవాడిని
నీ మౌనంబు = నీవు మాట్లాడకపోవుట
చిత్తంబు + వచ్చినచో = మనసుకి నచ్చినపుడు
మానెదుఁగాక = విడుతువు గాని
నాకున్ = నాకు
నిన్నున్ = నిన్ను
ఇప్పుడు = ఇప్పుడు
కసిన్ పెట్టన్ = కష్టపెట్టను.

భావం :
నన్ను అనుగ్రహిస్తే ఇప్పుడు నాతో రమ్ము. రాకున్న నిన్ను విడిచి నేను వెళ్ళను. ఇక్కడే నీతోడిదే లోకంగా ఉంటాను. నీ దయను పొందుతాను. నీ మౌనాన్ని నీకిష్టమైనపుడు విడుము. నిన్నిపుడు కష్టపెట్టెను అని తిన్నడు పలికెను.

ప్రశ్న 19.
వ. అని యమ్మహాదేవు నుడుమూరికి రమ్మనుచుం బ్రార్థించినం బలుక కుండినం, దదీయ
భక్తి పరవశుండై, సంపెంగతావి బ్రుంగుడైన భృంగంబు తెఱంగుననున్న యమసరంబునం,
దిన్నండొంటి పంది వెంటందగిలి యొంటి నెక్కడం బోయెనో? యని బోయలు
చొప్పురోయం దివిరి యడుగుల వెంబడింబడి తప్పక చనుదెంచి, కాంచి యిట్టనిరి.
జవాబు:
ప్రతిపదార్థం :
అని = అని పలికి
అమ్మహాదేవుని = ఆ శివుని
ఉడుమూరికిన్ = ఉడుమూరికి
రమ్ము + అనుచున్ = రమ్మని
ప్రార్థించినన్ = వేడుకొనగా
పలుకక + ఉండినన్ = దానికి సమాధానమీయకుండగా
తదీయ = దానికి (శివలింగమునకు)
భక్తి పరవశుండై = భక్తిలో లీనమై
సంపెంగ తావిన్ = సంపెంగపూవు సువాసన
బ్రుంగుడైన = ఆవరించబడిన
భృంగంబు = తుమ్మెద
తెఱుంగునన్ = వలె
ఉన్న = ఉన్న
అవసరంబున = ఆ సమయంలో
తిన్నండు = తిన్నడు
ఒంటి పంది = ఒంటరి వరాహాన్ని
వెంటందగిలి = వెంబడించిపోయి
ఒంటిన్ = ఒంటరిగా
ఎక్కడబోయెనో = ఏ ప్రదేశానికి వెళ్ళాడో
అని = అని
బోయలు = కిరాతులు
చొప్పురోయన్ = తిన్నడు పోయిన జాడ వెదుకుటకు
తివిరి = పూనుకుని
అడుగుల వెంబడింబడి = పాద చిహ్నములను అనుసరించి
తప్పక = దారితప్పకుండా
చనుదెంచి = వచ్చి
కాంచి = తిన్నడిని చూసి
యిట్లనిరి = ఇలా అన్నారు.

భావము :
ఈ ప్రకారముగా శివుని తమ ఊరికి రమ్మని పలికి, శివలింగము ప్రత్యుత్తరము ఇవ్వకుండగా, శివలింగముపై భక్తిలో లీనమై పరవశుడై, సంపెంగ పూవు సువాసన మసరుకొని దిమ్మెక్కిన తుమ్మెద వలె తిన్నడున్నాడు. ఆ సమయంలో ఒంటరి పంది వెంటపడి తిన్నడు ఎక్కడకి వెళ్ళాడో అని బోయలు అతనిని వెతకపూని, తిన్నడి పాద జాడల వెంబడి దారి తప్పకుండా వచ్చి అతనిని చూసి యిట్లనిరి.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 20.
శా. అన్నా 1 నిన్నలయించి తెచ్చిన వరాహంబెందుఁబోయె ? న్మము.
న్న న్మన్ననఁ జూడవేటికి ? వడిష్ గన్నీరు. గాణంగ నే
మన్నన్బల్కవదేమి కారణమొ ? వేటాడంగ వేతెంచి, యిట్లు
న్నం దల్లియుఁ దండ్రియు మణుఁగరే యుల్లంబులో నక్కటా !
జవాబు:
ప్రతిపదార్థం :
అన్నా = నాయనా
నిన్నున్ = నిన్ను
అలయించి = అలసిపోయేలా చేసి
తెచ్చిన = ఇక్కడకు తెచ్చిన (వచ్చేలా చేసిన)
వరాహం = అడవి పంది
ఎందుఁబోయె = ఎక్కడికి పోయిం
మమున్ = మమ్ములను
కన్నన్ = చూసినను
మన్ననన్ = ఆదరణతో
ఏటికిన్ = ఎందుకు
చూడవు = చూచుట లేదు
వడిన్ = వేగంగా
కన్నీరుగాఱంగ = కన్నీరు కారుతుంటే
ఏమన్నన్ = ఏమి పలికినను
అది + ఏమి = అదేమి
కారణమొ = కారణమో (హేతువో)
పల్కవు = తిరిగి మాట్లాడవు
అక్కటా = అయ్యో !
వేటాడంగ = వేటాడాలని
ఏతెంచి = వచ్చి
ఇట్లు + ఉన్నాన్ = ఇలా ఉంటే
తల్లియు = నీ మాతృమూర్తి
తండ్రియు = జనకుడు
ఉల్లంబులోన్ = మనసులో
మఱుఁగరే = దు:ఖిస్తారు.

భావము :
నాయనా ! నిన్ను అలసిపోయేలా చేసి, ఇక్కడ వరకు వచ్చేలా చేసిన ఆ అడవిపంది ఎక్కడకు పోయింది. మమ్ములను చూసి కూడా ఆదరణతో ఎందుకు చూచుట లేదు. వేగంగా కన్నీరు కారుతుంటే, మేము ఏమి పలికినను, ఏమి కారణమో తిరిగి పలుకవు. అయ్యో ! వేటాడుటకు వచ్చి ఇలా ఉంటే నీ తల్లిదండ్రులు మనస్సులో ఎంతో దు:ఖిస్తారు అని బోయలు పలికిరి.

ప్రశ్న 21.
తే. నీదుగాలికిఁ బసివట్టి, నిజ్జనీల్లి,
పట్టెడల బిగఁబట్టిన మట్టువడక,
నిలువకేతెంచి, వేఁట కుక్కలు కుమార !
చుట్టుక గునిసి యాడంగఁ జూడవేమి ?
జవాబు:
ప్రతిపదార్థం :
కుమార = బాలకా
వేటకుక్కలు = జాగిలాలు
నీదుగాలికిన్ = నీ మీద నుండి వచ్చేగాలి
పసివట్టి = వాసన చూచి, జాడ గుర్తించి
నిజ్జెనీల్గి = శరీరాన్ని విరుచుకుని
పట్టెడలన్ = మెడ త్రాళ్ళతో
బిగబట్టినన్ = గట్టిగా పట్టుకొన్నప్పటికి
మట్టువడక = స్థిమిత పడక
నిలువక = ఆగలేక
ఏతెంచి = వచ్చి
చుట్టుక = చుట్టూమూగి
గునిసి ఆడంగ = చిన్నగా కుయ్ కుయ్ మనుట
చూడవేమి = ఎందుకు చూడవు.

భావము :
బాలకా ! వేటకుక్కలు నీ మీద నుండి వచ్చే గాలి వాసన చూచి, జాడ గుర్తించి శరీరాన్ని విరుచుకుని, మెడతాళ్ళతో గట్టిగా పట్టుకున్నప్పటికీ, స్థిమిత పడక, ఆగలేక ఇక్కడికి వచ్చి నీ చుట్టూ మూగి, నీవు ప్రేమగా చూడలేదని కుయ్ కుయ్ మని అంటున్నాయి. వాటినెందుకు చూడవు అని బోయలు పలికారు.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 22.
సీ. ‘వలలును దెరలుఁ బ్రోగులఁ జుట్టఁగా లేదు,
పోటుకోలొకటియుఁ బుచ్చ లేదు,
తెగిన మెకంబులఁ దేలేదు, విడివేఁట,
పిట్టలకును మేఁతపెట్టలేదు,
చెంచులేరికినేమి సేదదేఱఁగ లేదు,
చెడకుండ మెకములఁ జేయలేదు,
కుక్క లిజ్జులు సివంగులు మేపుగొనలేదు,
బలిపెట్టి కాట్రేనిఁ గొలువలేదు

తే. వేఁటలాడంగ వచ్చిన వేడుకెల్ల
నక్కటా ! తండ్రికెఱిఁగింప నంపలేదు,
మ్రానుపడియుండ నేఁటికి మేనుమఱచిఁ
యేల మాజాలి మాన్పవే; యెఱుక పఱచి ?
జవాబు:
ప్రతిపదార్థం :
వలలను = ఉచ్చులను
తెరల = వేటాడటానికి వాడే జవనికలు
ప్రోఁగులన్ = వేటలో తెరకట్టడానికి వాడే తాళ్ళు
చుట్టగా లేదు = చుట్టగా కట్టలేదు
పోటుకలు + ఒకటియున్ = జంతువులను పొడుచుటకు వాడిన సాధనము
పుచ్చలేదు = జంతువుల శరీరం నుండి పీకలేదు
తెగిన మెకంబుల = చనిపోయిన జంతువులను
తేలేదు = తీసుకొని రాలేదు
విడివేట = డేగవేటకు సంబంధించిన
పిట్టలకును = పక్షులకు (పలు జాతుల డేగలు)
మేత = ఆహారం
పెట్టలేదు = ఈయలేదు
చెంచులేరికి (చెంచులు + ఏరికిన్) = చెంచులెవ్వరికి
ఏమిన్ = ఏమియు (కొంచెమైన)
సేద = అలసట
తేఱఁగ లేదు = తీరలేదు
మెకములన్ = జంతువులను
చెడకుండ = కుళ్ళకుండా
చేయలేదు = చేయలేదు
కుక్కలు = వేటకుక్కలు
ಇಟ್ಟುಲು = జింకలు
సివంగులు = ఒక జాతి కుక్కలు
మేపుగొనలేదు = ఆహారాన్ని తీసుకోలేదు. (తిన్నడు పెడితేనే తింటాయి)
బలిపెట్టి = మృగాన్ని బలిచ్చి
కాట్రేనివ్ = కిరాతులు పూజించే దేవతామూర్తిని
కొలువలేదు = పూజించలేదు
అక్కడ = అయ్యో
వేటలు + ఆడంగ = అడవిలో జంతువులను చంపగా
వచ్చిన = కలిగిన
వేడుక + ఎల్లన్ = వినోదమంతా (ఆనందమంతా)
తండ్రికి = జనకునకు
ఎటిగింప = తెలుపుటకు
అంపలేదు = వార్త పంపలేదు
మేనుమఱచి = శరీరాన్ని మరచి
మ్రానుపడి + ఉండన్ = కొయ్యబారి ఉండుట
ఏటికిన్ = ఎందులకు
ఏల = ఎందుకు
ఎఱుకపఱచి = కారణాన్ని తెలియజేసి
మాజాలి = మా దు:ఖాన్ని
మాన్పవే = తొలగించు.

భావము :
ఉచ్చులను, వేటాడటానికి వాడే జవనికలు, ప్రోగుతాళ్ళతో చుట్టగా కట్టలేదు. జంతువులను పొడుచుటకు వాడిన పోటుగోలలను వాటి శరీరాల నుండి పీకలేదు. చచ్చిన మృగాలను తీసుకురాలేదు. డేగవేటకు వాడే పక్షులకు మేత పెట్టలేదు. మన చెంచువారికి ఎవ్వరికీ ఇంతవరకు బడలిక తీరలేదు. చచ్చిన జంతువులను కుళ్ళకుండా కాల్చలేదు. వేట కుక్కలు, జింకలు, సివంగులు, నీవు లేకుండుటచే మేత ముట్టలేదు. మృగాన్ని బలిచ్చి కాట్రేనిని పూజించలేదు.

అయ్యో వేట వినోదాన్ని నీ తండ్రికి తెలుపుటకు వార్త పంపలేదు. శరీరాన్ని మరచి కొయ్యబారి యుండుట ఎందులకు ? ఎందుకు మాటాడకుండుట, తెలియజేసి మా దు:ఖాన్ని తొలగించు అని కిరాతులు పలికిరి.

ప్రశ్న 23.
శా. ఓ తండ్రీ ! నిను డించిపో మనసు మాకొక్కింతగా నేర్చునే ?
మీతోఁబుట్టులుఁ దల్లిదండ్రులు చెలుఁల్మీరెల్ల ‘నేతేరఁగా
మా తిన్నం డిపుడెందుఁబోయె ? ననిన నా ప్రాణముల్పోవే’ ? రా
వే తిట్టింపక, పల్లెలోన మముఁదేవే వన్నెయు న్వాసియున్ ?
జవాబు:
ప్రతిపదార్థం :
ఓ తండ్రీ = ఓ నాయనా
నినున్ = నిన్ను
డించిపోన్ = విడిచివెళ్ళుటకు
మీకు = మీకు
ఒక్కింతగా = కొంచమైన
మనసు = హృదయము
నేర్చునే = సమ్మతించదు
మీతోఁబుట్టులు = మీ తోడ పుట్టినవారు
తల్లిదండ్రులు = జనన జనకులు
చెలుల్ = స్నేహితులు
మీరెల్ల = మీరంతా
ఏతేరఁగాన్ = తిరిగి రాగా మా
తిన్నండు = మా తిన్నడు
ఇపుడు = ఇప్పుడు
ఎందుఁబోయె = ఎక్కడికి పోయాడు
అనినన్ = అన్నచో
మా ప్రాణముల్ పోవె = మా శరీరంలో ప్రాణం నిలుచునా
పల్లెలో = మన గూడెం లోపల
మమున్ = మమ్ములను
తిట్టింపక = దూషింపజేయక
రావే = రావయ్యా
వన్నె = కీర్తిని
వాసియున్ = గొప్పతనాన్ని
తేవే = తీసుకురావయ్య Jr.తెలుగు

భావము :
నాయనా నిన్ను విడిచిపెట్టి వెళ్ళుటకు మా మనస్సు అంగీకరించుట లేదు. మీ సోదరులు, తల్లిదండ్రులు, స్నేహితులు మమ్ములను జూచి మీరంతా తిరిగి రాగా మా తిన్నడు ఇప్పుడు ఎక్కడికి పోయాడు అని అడిగితే, నీ విషయం చెప్పలేక మా ప్రాణములు పోవా ? గూడెములో మమ్ము తిట్టింపక, మాతో రావయ్యా ! కీర్తిని, . గొప్పదనాన్ని తీసుకురావయ్యా అని చెంచులు పలికిరి.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 24.
తే. ఎంత యలమటఁబడిన మమ్మేలచూడ ?
వింతయు నెఱుకు తేనికి నెఱుక పఱుపఁ
బోయెదము; చెప్పవలసిన బుద్ధి చెప్పి
యనుపు; మని పాదములు పట్టుకోనిన, నతఁడు
జవాబు:
ప్రతిపదార్థం :
ఎంత = ఎంత
అలమట = దు: ఖము
పడిన = పొందినను
మమ్మేల = మమ్ము ఎందుకు
చూడవు = చూచుట లేదు
ఇంతయున్ = విషయాన్నంతటనీ
ఎఱుకు + పనికి = ఎఱుకల రాజుకు
ఎఱుక పఱుపన్ = తెలియజేయుటకు
పోయెదము = వెళ్ళెదము
చెప్పవలసిన = అక్కడ చెప్పవలసిన
బుద్ధి = మంచి మాటలను (సందేశాన్ని)
చెప్పి = చెప్పి
అనుపుము + అని = పంపమని
పాదములు = కాళ్ళను
పట్టుకొనినన్ = పట్టుకొంటే
అతడు = ఆ తిన్నడు.

భావం :
ఎంత దు:ఖపడిన నీవు మమ్ములను ఎందుకు చూడుటలేదు. విషయా న్నంతటినీ ఎఱుకలరాజుకు తెలియజేయుటకు వెళ్ళెదము. అక్కడ చెప్పవలసిన మంచి మాటలను (సందేశాన్ని) చెప్పి పంపమని తిన్నడి కాళ్ళను పట్టుకొన్నారు.

ప్రశ్న 25.
వ. ఎట్టకేలకు శివలింగ సంగతాభంగుర హృదయాంతరంగుఁడగు శబర పుంగవుండు
కృపాపాంగుండై చిఱునవ్వు నవ్వి యవ్వనచరుల కిట్లనియె.
జవాబు:
ప్రతిపదార్థం :
ఎట్టకేలకు = చాలాసేపటికి
శివలింగ = శివలింగమున
సంగత = లగ్నమయిన
అభంగుర = చలింపని/ స్థిరంగా
హృదయాంతరము = మనసులోపల
శబరపుంగవుడు = శ్రేష్టుడైన బోయవాడు (తిన్నడు)
కృపాపాంగుడై = దయతో కూడిన క్రీగంటి చూపు కలవాడై
చిఱునవ్వు నవ్వి = దరహాసం చేసి
ఆ + వనచరులు = అడవిలో తిరిగే వారితో
ఇట్లనియె = ఇలా పలికెను.

భావము :
శివలింగమునందు లగ్నమయిన ధృఢమైన హృదయాంతర్భాగము కలవాడగు బోయశ్రేష్టుడైన తిన్నడు, దయతో కూడిన క్రీగంటి చూపు కలవాడై, దరహాసం చేసి ఆ ఆటవికులతో ఇలా అన్నాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 26.
క. ఈ లింగములోఁ బ్రాణముఁ
గాలము గడదాఁక నోడగట్టిన దూలం
బై లంకెనుండఁ జేసితి;
నేలా తుందుడుకు ? పల్లె కేఁగుడు మీరల్.
జవాబు:
ప్రతిపదార్థం :
ఈ లింగములో : ఈ శివలింగములో
ప్రాణము = ప్రాణము
కాలము కడదాఁకన్ = ఆయుము నిలుచు వరకు (మరణించే వరకు)
ఓడగట్టిన దూలంబై = ఓడ నడుచుటకు కట్టిన దూలము వంటిదై (ఓడకు కట్టిన కొయ్య ఓడ ఉన్నంత వరకు ఓడతో పెసవేసుకు ఉండును)
లంకెనుండన్ = పెనవేసుకున్నట్లు చేశాను .
తుందుడుకు = సంతాపం
ఏలా = ఎందులకు
మీరల్ = మీరు
పల్లెకున్ = పల్లెకు (గూడెమునకు)
ఏగుఁడు = వెళ్ళండి.

భావము :
ఈ శివలింగములో నా ప్రాణమును మరణించేవరకు, ఓడ నడుచుటకు కట్టిన దూలంవలె పెనవేసుకున్నట్లు చేశాను. బాధపడవద్దు. మీరు గూడెమునకు వెళ్ళండి అని తిన్నడు పలికాడు.

ప్రశ్న 27.
క. నా వెంట నితఁడు వచ్చిన,
నే వచ్చెద మిమ్ముఁగూడి యిప్పుడు, లేదా,
యేవంక నభవుఁబుండిన,
నావంకనె, తోడునీడయై వసియింతున్.
జవాబు:
ప్రతిపదార్ధము :
నావెంట = నాతో
ఇతడు = ఇతడు (శివుడు)
వచ్చిన = వస్తేనే
మిమ్ముఁగూడి = మీతో కలసి
ఇప్పుడు = ఇప్పుడు
నే వచ్చెద = నేను వస్తాను
లేదా = లేనిచో
ఏవంకన్ = ఏ దిక్కులో
అభవుఁడు = శివుడు
ఉండినన్ = ఉన్నాడో
ఆ వంకనె = ఆ స్థలమునందే
తోడునీడయై = అనుక్షణం అంటి పెట్టుకొని
వసియింతున్ = నివసిస్తాను.

భావము :
నాతో శివుడు వస్తేనే, మీతో కలిసి ఇప్పుడు నేను వస్తాను. లేనిచో ఏ దిక్కులో శివుడున్నాడో, ఆ స్థలమునందే అనుక్షణం అతని అంటి పెట్టుకొని నివసిస్తాను అని తిన్నడు పలికాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

ప్రశ్న 28.
శా. నాకుం జుట్టము తల్లిదండ్రులు జెలు ధుల్నాథుండు నీ దైవమే,
మీ కిచ్చోఁ బనిలేదు కస్తీపడఁగా మీ పల్లెకుం బొందు; కా
రా కూరంబులు చేసినం, గదలి నే రా; నిచ్చటం బ్రాణముల్
పోకార్తుందుది నాదు వేలుపునకై; బొంకన్నిజం బింతయున్.
జవాబు:
ప్రతిపదార్థం :
నాకున్ = నాకు (తిన్నడు)
చుట్టము = బంధువులు
తల్లిదండ్రులు = మతాపితలు
చెలులు = స్నేహితులు
నాథుండున్ – = అధిపతి
ఈ దైవమే = ఈ దేవుడే (శివుడు)
మీకు = మీకు
ఇచ్చోక = ఈ అడవిలో
కష్టపడఁగా = కష్టపడే
పనిలేదు = అవసరం లేదు
మీ పల్లెకున్ = మీ గూడేనికి
పొండు = వెళ్ళండి
కారాకూరంబులు = ఒత్తిడి
చేసినన్ = కలిగించినను
ఇచ్చటం = ఇక్కడ నుండి
కదలినేరాన్ = లేచిరాను
తుదిన్ = చివరికి
నాదు వేలుపునకై = నా యొక్క దేవునికై
ప్రాణముల్ = అసువులు
పోకారున్ = వదలేదను
బొంకన్ = అసత్యమాడను
ఇంతయున్ = ఇదంతా
నిజంబు = వాస్తవం

భావము :
నాకు బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, అధిపతి ఈ దేవుడే. మీరు ఈ అడవిలో కష్టపడే అవసరం లేదు. మీరు గూడేనికి వెళ్ళండి. మీరు ఒత్తిడి కలిగించినను ఇక్కడ నుండి లేచిరాను. చివరికి నా దేవునికై ప్రాణములు వదులుతాను. నేను అసత్యమాడను, ఇదంతా నిజం అని తిన్నడు పలికెను.

ప్రశ్న 29.
క. అని శివుఁ గ్రమ్మఱఁ దిన్నఁడు .
మనమున నిలుపుకొని, తనువు మఱచిన బుద్దిన్
మునుపటి తెఱఁగున నుండిన
వనరుచు, వనచరులు చనిరి వలసిన రీతిన్.
జవాబు:
ప్రతిపదార్థం :
అని = ఇట్లు పలికిన
తిన్నడు = తిన్నడు
శివుని = మహాదేవుని
క్రమ్మల = మరలా
మనమున = మనసులో
నిలుపుకొని = నెలకొల్పి
తనువు = శరీరం
మఱచిన = విస్మరించిన
బుద్ధిన్ = పద్ధతిలో
మునుపటి = పూర్వము వలె ఇంతకు ముందు
తెఱఁగున = రీతిలో
ఉండినన్ = ఉండగా
వనచరులు = ఆటవికులు
వనరుచు = దు:ఖిస్తూ
వలసిన రీతిన్ = వెళ్ళవలసిన దారిలో
చనిరి = వెళ్ళారు

భావము :
సుఖులను గూడేనికి పొమ్మని తిన్నడు మరలా శివుని మనసులో నిలుపుకొని శరీరాన్ని మరచిన స్థితిలో మనుపటివలె ఉండగా ఆటవికులు దు:ఖిస్తూ వెళ్ళవలసిన దారిలో వెళ్ళారు.

కవి పరిచయం

కవికాలాదులు : ఈ పాఠ్యభాగం రచించిన ధూర్జటి 16వ శతాబ్దంలో విజయనగరాన్ని . పాలించిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవియని, అష్టదిగ్గజ కవులలో ప్రముఖులని, అతని మనుమడు కుమార ధూర్జటి రచనల వలన తెలుస్తోంది. ధూర్జటి పాకనాటికి చెందిన ఆర్వేల నియోగి బ్రాహ్మణుడు.

దూర్జటి తలి సింగమ తంగిడి జక్కయ నారాయణుడు. గురువు మహాదేశిక సార్వభౌముడు. ధూర్జటి అంటే ‘శివుడు’ అని అర్థం. కవి ధూర్జటి పరమ శివ భక్తుడు. “స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్లెనో యతులిత మాధురీ మహిమ” అని శ్రీకృష్ణ దేవరాయలచే ప్రశంసనొందాడు. ధూర్జటి కవిత్వంలో సహజముగా మాధుర్యమేర్పడి ఉంది. దానికి కారణం, అతని హృదయంలో నెలకొన్న పరమశివుని పట్ల భక్తి భావన.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

రాయలచేత ధూర్జటి అనేక గౌరవాలు పొందాడు. సంసార సుఖాలు అను భవించిన తరువాత భౌతిక సుఖాలపై విరక్తి చెందినట్లు తెలుస్తోంది. ధూర్జటి శ్రీకాళహస్తి మాహాత్మ్యము కాక శ్రీకాళహస్తీశ్వర శతాకాన్ని రచించాడు. ఈ శతకంలో పద్యములన్ని ఆత్మాశ్రయంగా సాగుతూ, ధూర్జటి యొక్క వైరాగ్య మనఃస్థితిని తెలియ జేస్తున్నాయి.

శ్రీకాళహస్తి మహాత్మ్యం క్షేత్రమహాత్మ్య కావ్యం. ఇది 756 గద్య, పద్యాలతో కూడిన నాలుగు ఆశ్వాసాల చంపు ప్రబంధం. మూలకథ స్కంధ పురాణం నుండి గ్రహించ బడింది. ఈ ప్రబంధంలో శ్రీ (సాలె పురుగు), పాము (కళము), ఏనుగు (హస్తి) ల వృత్తాంతంతో పాటు, వశిష్టుని వృత్తాంతం, బ్రహ్మవృత్తాంతం, నత్కరుని కథ, వేశ్యాపుత్రికల కథ మొదలైన ఉపాఖ్యానాలున్నాయి. ఇవన్నీ శ్రీకాళహస్తీశ్వరుడైన శివుని యొక్క మహిమలను తెలియజేసేవి. ధూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యమును శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికే అంకితమిచ్చాడు.

పాఠ్యభాగ సందర్భం

బాహుదా నది ఒడ్డున పూర్వం ‘పొత్తపినాడు’ అనే ప్రాంతంలో ఉడుమూరు అనే – బోయపల్లి ఉండేది. దానికి అధిపతి నాథనాథుడు. అతని భార్య తందె. వీరి సంతానమే తిన్నడు. యవ్వనస్తుడైన తిన్నడు ఒకనాడు తన సహచరులతో కలిసి వేటకు వెళ్ళాడు. వేటాడి, అలసిపోయి ఒక పొగడ పూలచెట్టు కింద నిద్రపోయాడు. అతనికి కలలో శివుడు సాక్షాత్కరించాడు. ఈ సందర్భంలో ఈ పాఠ్యాంశం మొదలవుతుంది.

పొత్తపినాడు కడప జిల్లాలో రాజంపేట దగ్గర గల టంగటూరు గ్రామానికి మూడు మైళ్ళ దూరంలో ఉంది.

ఉడుమూరు : దీనిని ఇపుడు ఉడుముల పాడు అంటున్నారని పెద్దల ఉవాచ.

పాఠ్యభాగ సారాంశం

అడవిలో వేటాడి అలసి నిద్రించిన తిన్నడికి జంగమ రూపంలో శివుడు కనిపించాడు. కేతకీ నది ఒడ్డున ఉన్న శివలింగాన్ని సేవించమని కోరాడు. తిన్నడు శివలింగాన్ని వెతుక్కుంటూ వెళ్ళి, దట్టమైన అరణ్యంలో ఒంటరిగా ఎందుకున్నావని శివుణ్ణి ప్రశ్నించాడు. తన బోయపల్లెలో అన్ని రకాల ఆహార పదార్థాలున్నాయని, కావలసినంత మంది సేవకులున్నారని, తన పల్లెకు రమ్మని శివుణ్ణి బ్రతిమలాడు.

అయినా శివుడు తన ఊరికి రాలేదని అలిగిన తిన్నడు తాను అక్కడే ఉండి పోయాడు. చాలా సేపటి తర్వాత తిన్నడి ఊరి బోయలు తిన్నడిని వెతుకుతూ వచ్చి అక్కడికి చేరారు. తిన్నడి స్థితిని గమనించి ‘మాట్లాడకుండా ఎందుకున్నావని, ఇంటి దగ్గర తల్లిదండ్రులు వేచి చూస్తున్నారని, ఇంటికి రమ్మని ప్రాధేయపడ్డారు. తిన్నడు వారితో “నాకు తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు అందరూ ఈ దేవుడే” అంటూ తాను ఇక్కడే ఉంటానని వారితో గట్టిగా చెప్పాడు. వారు చేసేది లేక ఇంటిదారి పట్టారు.

AP Inter 1st Year Telugu Study Material Poem 2 తిన్నని ముగ్ధ భక్తి

తిన్నడు శివలింగాన్ని నిజమైన దేవుడిగా భావించడం, ఒక మనిషితో సంభాషించి నట్లుగా శివలింగంతో మాట్లాడడం; శివలింగం ఎటువంటి బదులు ఇవ్వకపోవడంతో ఇల్లు, ఊరు, తల్లిదండ్రులను వదిలి అక్కడే శివుని సేవలో గడపడం తిన్నడి ముగ్ధభక్తినీ, నిశ్చలబుద్ధినీ, అతని చిత్తశుద్ధినీ తెలియజేస్తుంది.

Leave a Comment