TS Inter 1st Year Telugu Model Paper Set 5 with Solutions

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers Set 5 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Model Paper Set 5 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి. (1 × 6 = 6)

1. అని చెప్పిన న మ్మానిని ……….. దలంచి తన సతితోడన్.
జవాబు:
అని చెప్పిన న మ్మానిని
సునయోక్తుల కలరి భూమిసురుఁ డా కృష్ణుం
గున నేఁగుట యిహపర సా
ధన మగు నని మదిఁ దలంచి తన సతితోడన్.

భావం : భార్య మాటలకు కుచేలుడు సంతోషించాడు. శ్రీకృష్ణుని చూచుట ఇహలోక, పరలోక సుఖములకు సాధనమగునని భావించి, తన భార్యతో ఇట్లు పలికినాడని (తరువాతి పద్యముతో అన్వయము)

2. ఉరుకరుణాయుతుండు సమయోచిత ………… లెఱుంగ భాస్కరా
జవాబు:
ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా
క్పరుషతఁ జూఫినన్ ఫలముగల్గుట తథ్యముగాదె యంబుదం
బురిమిన యంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ
స్థిరతర పౌరుషంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా!

భావం : మేఘుడు ప్రాణానికి భయం కలిగేటట్లు ఉరిమినను వెంటనే జనులను రక్షించు పట్టుదలతో అందరికీ ఆనందం కల్గునట్లు వర్షించును. అటులనే గొప్పదయ కలవాడు. సమయానుకూలముగా కఠినవాక్యము మాట్లాడినను తరువాత తప్పక మేలు కలిగిస్తాడు.

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. ‘అచలం’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి ?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. ఈ పాఠ్యభాగం దున్న విశ్వనాథం. సంపాదకత్వంలో వెలువడిన శ్రీ దున్న ఇద్దాసుగారి తత్వాలు” నుండి గ్రహించబడింది. తెలంగాణ పద సంకీర్తన కవులలో ‘ఇద్దాసు’ కలికితురాయి.

ఇద్దాసు తత్వాలు ఆత్మపరంగ, తత్వపరంగ తెలంగాణ నుండి పుట్టిన మాణిక్యాలు, వేదాంత శాస్త్రజ్ఞాన సారాంశాన్ని సామాన్య ప్రజలకు ఈయన అందించాడు. వేదాంత తత్వాక అంశాలను పరిచయం చేయటం ఈ తత్వాల ఉద్దేశ్యం.

ఈ దేహం శాశ్వతం కాదు. కనుక ఈ దేహంపై మోహం విడచిపెట్టాలి. మంచి గురువును ఆశ్రయించి జీవన రాహిత్యాన్ని పొందటానికి ప్రయత్నించాలి. అపుడే మోక్షాన్ని పొందగలుగుతాము. భార్యాబిడ్డలు, ధనధాన్యాల పట్ల మోహాన్ని వదలిపెట్టాలి. ఏదో ఒకనాటికి కీలు వదలిన బొమ్మలా ఈ దేహం రాలిపోక తప్పదు.

ఓ నామః అని అక్షరాలు రాస్తున్నాం నేర్చుకుంటున్నాం కాని, మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేకపోతున్నాం. దాని అంతు తెలియక అల్లరిపాలు అవతున్నాం. మంచి చెడులను తెలుసుకొని మసలు కోవాలని ఇద్దాసు పలుకుతున్నారు.

ఈ లోకంలో గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, దీనిని మనం గమనించాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరసుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగి శక్తిని పొందితే, ఆ రహస్యం అంతుచిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అజ్ఞాచక్రంమును పొందండి, తరించండి.

ఈ లోకం అంతా శూన్యం. ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా ఏమీ కన్పించదు. మనం గమనించాలి. మన దేహంలో షటం చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగే శక్తిని పొందితే, ఆ రహస్యం అంత చిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆజ్ఞాచక్రంమును పొందండి తరించండి.

ఈ దాసు చెప్పిన మాటలు సత్యములు. అందరూ అనుసరింపదగినవి. వీరశైవ మత గుర్తువైన బసవని యొక్క భావాలను అర్థం చేసుకుని ప్రవర్తించండి. అపుడే జీవన సాఫల్యం జరుగుతుంది.

2. ‘విద్యాలక్ష్యం’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి ?
జవాబు:
ద్రోణుడు అగ్నివేశుడనే మహాముని వద్ద ధనుర్విద్యా పాఠంగతుడయ్యాడు. అనేక దివ్యాస్త్రాలు పొందాడు. తండ్రి ఆజ్ఞతో కృపాచార్యుని చెల్లెలైన కృపిని వివాహమాడాడు. అశ్వత్థామ అనే కుమారుడిని పొందాడు. ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళి వినయంతో తన్న తాను పరిచయం చేసుకుని ధనాన్ని ఆశించి మీ వద్దకు వచ్చాను అని అనగా పరశురాముడు తన వద్దనున్న ధనాన్నంతటినీ వేదజ్ఞానంగల బ్రాహ్మణులకు ఇచ్చివేసానని, తన దగ్గర శరీరం, శస్త్రాస్త్రాలు మాత్రమే ఉన్నాయి అన్నాడు. అప్పుడు ద్రోణుడు ధనాలలో మిక్కిలి శ్రేష్ఠమైనవి శస్త్రాస్త్రములు కాబట్టి వాటిని ప్రసాదించ మనగా పరశురాముడు అనేక దివ్యాస్త్రాలను బోధించాడు.

ఆ విధంగా పరశురాముని వద్ద నుండి యుద్ధవిద్యలు అభ్యసించి ధనాన్ని కోరి తన చిన్ననాటి మిత్రుడయిన ద్రుపదుని వద్దకు వెళ్ళగా ద్రుపదుడు ధన, అధికార గర్వంతో పేదవాడైన ద్రోణుని తీవ్రంగా అవమానపరచాడు. అవమాన భారంతో, కలత చెందిన మనసు కలవాడై, తన భార్య, కుమారుడు, అగ్రిహోత్రం, శిష్యసమేతంగా హస్తినాపురానికి బయలుదేరాడు. ఆ పట్టణం బయట కౌరవ, పాండవులు చెండాట ఆడుతుండగా వాళ్ళాడుతున్న బంగారు బంతి బావిలో పడింది.

ఆకాశంలోని నక్షత్రంలా మెరుస్తున్న ఆ బంతిని బయటకు తీయలేక రాకురులం అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో అటువచ్చిన ద్రోణుడు ఆ బంతిని తన బాణము లతో తాడులాగా చేసి బంతిని బయటకు లాగి ఇచ్చాడు. అది చూసిన రాజకుమారు లందరూ ఆశ్చర్యపడి ద్రోణుడిని తీసుకుని వెళ్ళి భీష్మునికి జరిగినదంతా చెప్పారు. భీష్ముడు ద్రోణుడి వివరములడుగగా ద్రోణుడు తన వివరాలన్నీ తెలిపి ద్రుపదుని వలన కలిగిన అవమానం, కుమారుని ఆకలి బాధలు అన్నీ తెలిపాడు.

అది విన్న భీష్ముడు వెదకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లు సంతోషించి ద్రోణుని గౌరవించి, ధనదానాలిచ్చి సంతోషపరచాడు. అంతేకాక తన మనమళ్ళ నందరినీ ద్రోణునికి చూపించి, వీరికి గురుత్వం వహించి వీరులుగా తీర్చిదిద్దుమని కోరాడు ద్రోణుడు వారందరినీ శిష్యులుగా స్వీకరించాడు.

అర్జునుడు శస్త్రాస్త్ర విద్యలలో అధికుడై వినయంతో ఎప్పుడూ గురుపూజ చేస్తూ ద్రోణుణ్ణి సంతోషపరచాడు. అస్త్రవిద్యలో అర్జునునికి’ గల పట్టుదలకి సంతోషించి అతనికంటే విలువిద్యలే అధికులు లేరు అన్నట్లుగా విద్య నేర్పిస్తానని వాగ్దానం చేసాడు. ద్రోణుడు కూడా అర్జునునికి అన్ని రకాల యుద్ధవ్యూహాలు, అస్త్ర, శస్త్రాలు సర్వము బోధించాడు. ఒకనాటి పరశురాముడు కూడా ఇంటివాడు కాదు అన్నట్లుగా అర్జునునికి విద్య నేర్పించాడు.

ద్రోణుని వలన శస్త్రాస్త్ర విద్యాబోధనను పొందటంలో రాజకుమారులు అంతా సమానమే అయినా అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వశ్రేష్ఠుడయ్యాడు. రాజకుమారుల నైపుణ్యం తెలుసుకోవటం కోసం చెట్టు చివరన పక్షిబొమ్మను ఉంచి విద్యార్ధుల ఏకాగ్రతను ద్రోణుడు పరీక్షించగా అందరూ విఫలమవ్వగా అర్జునుడు తన ఏకాగ్రతతో లక్ష్యాన్ని భేదించాడు.

తరువాత మరొకసారి ద్రోణుడు సరస్సులో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ద్రోణుని కాలును పట్టుకోగా తాను సమర్థుడై ఉండి కూడా శిష్యుల నైపుణ్యం పరీక్షించదలచి రాకుమారులను కాపాడమని కోరాడు. వారంతా విడిపించలేక దిక్కుతోచని స్థితిలో ఉండగా మహాపరాక్రమంతో ఐదు బాణాలతో మొసలిని సంహరించి గురువును కాపాడుకున్నాడు అర్జునుడు. సంతోషించిన ద్రోణుడు అర్జునునికి అనేక దివ్యాస్త్రాలు ప్రసాదించాడు అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు.

TS Inter 1st Year Telugu Model Paper Set 5 with Solutions

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
సోమన రచనలను తెలిపి, వాటిని సంక్షిప్తంగా వివరించండి ?
జవాబు:
పాల్కురికి సోమనాథుడను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మచే రచించబడిన “చైతన్యలహరీ” అను వ్యాససంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో పాల్కురికి జీవితం, రచనలు, కవితాగుణాలు వివరించబడ్డాయి.

పాల్కురికి సోమనాథుడు దాదాపు 21 రచనలు చేశాడు.

1. బసవపురాణం.
2. పండితారాధ్య చరిత్ర
3. అనుభవసారం
4. చతుర్వేద సారము
5. సోమనాథభాష్యం
6. రుద్రభాష్యం
7. బసవరగడ
8. గంగోత్పత్తి రగడ
9. శ్రీ బసవారాధ్య రగడ
10. సద్గురు రగడ
11. చెన్నముల్లు సీసములు
12. నమస్కార గద్య
13. వృషాధిప శతకము
14. అక్షరాంక గద్య అష్టకం
15. పంచప్రకార గద్య
16. పంచకము
17. ఉదాహరణ యుగములు మొదలగునవి వాటిలో ముఖ్యమైనవి.

1. అనుభవసారం : సోమనాథుని మొదటి రచన ఇది. దీనిలో 245 పద్యాలున్నాయి. ఈ కావ్యంలో భక్తి స్వరూపం, లక్షణాలు, పూజా విధానం, జంగమ సేవ మొదలగు వీరశైవ ధర్మములు చెప్పబడ్డాయి.

2. బసవపురాణం : సోమన శ్రీశైల క్షేత్రమును దర్శించి భక్తి పారవశ్యముతో వ్రాసిన గ్రంథము ఇది. దీనిలో నందికేశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు, బిజ్జలుడు ప్రతినాయకుడు. బసవేశ్వరుని చరిత్రతోపాటు దీనిలో 75 గురు భక్తుల కథలున్నాయి. ముగ్ధ సంగయ్య కథ, బెజ్జమహాదేవికథ, గొడగూడి కథ, ఉడుమూరి కన్నకప్ప కథ, మడిమేలు మాచయ్య కథలున్నాయి.

3. లఘుకృతులు : సోమనాథుడు శివ స్తుతిపరమైన కొన్ని లఘుకృతులను రచించాడు. వాటిలో 4 గద్యాలు, 1. రగడ, 2. ఉదాహరణములు 11 పంచకములు 2 అష్టకములు 1 స్తవము ఉన్నాయి.

4. వృషాధిప శతకం : బసవేశ్వరుని శివస్వరూపునిగా భావించి ఆయనపై 108 చంపక ఉత్పలమాలలతో రచించిన శతకమిది. సోమనాథుని అష్టభాషా ప్రావీణ్యమునకు ఇది ఒక ఉదాహరణ.

5. చతుర్వేదసారం : దీనిలో ‘బసవలింగ’ మకుటము గల 357 సీసపద్యాలున్నాయి. శైవమునకు సంబంధించిన భక్తి విషయాలు ఇందులో ఉన్నాయి.

6. చెన్నమల్లు సీసములు : ఇది 32 సీసపద్యాలు గల చిన్న కృతి.

7. రుద్రభాష్యం : ఇది లభ్యం కాలేదు.

8. సోమనాథ భాష్యం : ఇది ఒక సంస్కృత గ్రంథం. 25 ప్రకరణములున్నాయి. దీనినే బసవరాజీయం అంటారు. వీరశైవమతం తాంత్రికం కాదని శుద్ధవైదికమని.. నిరూపించటానికి ఈ గ్రంథాన్ని రచించాడు.

9. పండితారాధ్య చరిత్రము : ఇది సోమనాథుని చివరికృతి, ద్విపద రచించబడిన ప్రౌఢ పురాణ కావ్యం. దీనిలో మల్లిఖార్జున పండితారాధ్యుని పుణ్యచరిత్రతోపాటుగా పలువురి శివ భక్తులు చరిత్రలు వ్రాయబడ్డాయి. ఇది 12 వేల ద్విపదలతో రాయబడిన కావ్యం. సోమన కావ్యకళా విశిష్టతను, బహుభాషా పాండిత్యమును, సంగీత, నాట్య రసవాద, వైద్యశాస్త్రాల పరిజ్ఞానమును లోకానుభవంతో వ్రాయబడ్డాయి.

భాషలో ద్విపద రచనలో పాల్కురికి తరువాత తరాల వారికి మార్గదర్శకుడయ్యాడు. పోత భక్తి పారవశ్యానికి శ్రీనాథుని నుడికారమునకు, కృష్ణదేవరాయల వర్ణనాపటిమకు ఇతరుల విశిష్ట రచనలకు సోమనాథుని ద్విపదలైన బసవపురాణం పండితారాధ్య చరిత్రలే మార్గదర్శకాలని పండితుల అభిప్రాయం.

ప్రశ్న 2.
రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి స్థాపించిన విద్యావ్యవస్థలను వివరించండి.
జవాబు:
‘రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి సేవా తత్పరత’ అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది.
వెంకట రామారెడ్డి అందరి మన్ననలను పొందిన వ్యక్తి. బహుభాషావేత్త. తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన వ్యక్తి. ఆయనకు విద్యపట్ల శ్రద్ధగలవారు. పలు విద్యాసంస్థలను స్థాపించి ప్రజాసేవ చేశారు.

1. బాలికల ఉన్నత పాఠశాల : మొత్తం హైదరాబాదు రాష్ట్రంలో మన బాలికలకు మాతృభాషా బోధనకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లేకపోవటం దురదృష్టకరమని రెడ్డిగారు భావించారు. ఉన్నత పాఠశాలల్లో కూడా ఉర్దూ, ఆంగ్ల మాధ్యమ బోధన జరుగుతుంది.

కావున హైదరాబాదులో ఒక మాతృభాషా పాఠశాలను బాలికల కోసం నిర్మించాలని తలచి స్త్రీ విద్యా ప్రోత్సాహకులు మాడపాటి హనుమంతరావు గారిని కలిసి బాలికల పాఠశాలను నిర్మించారు. ఇది బొంబాయిలో ‘కార్వే’ మహాశయులు స్థాపించిన మహిళా విద్యాపీఠంతో జత చేశారు. దీనికి అధ్యక్షులుగా రామారెడ్డి ఉన్నారు.

2. పరోపకారిణీ బాలికా పాఠశాల: హైదరాబాద్లో రామారెడ్డిగారు స్థాపించిన మరొక పాఠశాల పరోపకారిణీ బాలికా పాఠశాల. ఇది ప్రైమరీ తరగతి వరకు ఉన్నది. దీనికి అధ్యక్షులుగా రామారెడ్డి ఉన్నారు.

3. ఎక్సెల్ సియర్ మిడిల్ పాఠశాల : ఈ పాఠశాలను 1945లో స్థాపించారు. దీని పాలక వర్గ’ అధ్యక్షులు రామారెడ్డిగారే ! దీనిలో తెలుగు బాలురకే ప్రవేశముంది. ఇంగ్ల, ఉర్దూ మాధ్యమాలు లేకపోవటంతో అంతగా విద్యార్థులు ఆసక్తి చూపలేదు.

4. బాలికా పాఠశాల (గొల్లభిడ్కి): హైదరాబాదు గొల్లఖిడ్కిలో ఒక ఆంధ్రబాలికా పాఠశాలను ప్రజాసేవకులు కొందరు స్థాపించారు. దీని బాధ్యతను కూడా రెడ్డిగారే స్వీకరించారు.

5. పరోపకారిణీ బాలికా పాఠశాల : సికింద్రాబాదు నగరంలో కీ॥శే॥ సీతమ్మగారు కాలంలో ఉండేవారు. ఆమె తన జీవితాన్ని ధారపోసి ఒక మాధ్యమిక పాఠశాలను స్థాపించారు. ఆ పాఠశాల అభివృద్ధికి రెడ్డిగారు సహాయ పడ్డారు.

6. ఆంధ్రవిద్యాలయం : హైదరాబాదు నగరంలో తెలుగు పిల్లలకు మాతృభాష ద్వారా చదువు చెప్పుటకు ఒక్క మాధ్యమిక పాఠశాల కూడా లేదు. 1931లో దేవరకొండ సభలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి గారు ఆ సభకు అధ్యక్షత వహించారు. ఎలాగైనా ఒక పాఠశాలను నిర్మించాలని తీర్మానం చేశారు. అది చివరకు సెప్టెంబరు 1, 1944కు కానీ సానుకూలం కాలేదు. ఆ తరువాత ఇది 1947 నాటికి రెడ్డిగారి చలవతో ఉన్నత పాఠశాలగా ఎదిగింది.

ఇలా రాజాబహద్దూర్ రామారెడ్డిగారు విద్యపట్ల మిక్కిలి ఆసక్తిని కనపరచి, తెలుగు మాధ్యమంలో బాలికలు చదువుకోవటానికి పాఠశాలలను స్థాపించటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులయ్యారు.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

ప్రశ్న 1.
గొల్ల రామవ్వ ఉద్యమకారుని ఏ విధంగా రక్షించింది ?
జవాబు:
‘గొల్లరామవ్వ’ అను పాఠ్యభాగం మాజీ భారతదేశ ప్రధాని కీ॥శే॥ పాములపర్తి వేంకట నరసింహారావుచే రచించబడింది. శ్రీమతి సురభివాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన “గొల్లరామవ్వ – మరి కొన్ని రచనలు” కథా సంపుటి నుండి గ్రహించబడింది. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తిపోరాట కాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది.

నిజాం పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక స్టేట్ కాంగ్రెస్ ‘వాలంటీరును, విప్లవ కారుడిని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతివృత్తం గొల్లరామవ్వకథ. తెలంగాణపోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్ తెలంగాణలో అదో పల్లె. ఆ పల్లెలోకి ఉద్యమకారులు ప్రవేశించి రజాకార్లను, పోలీసులకు, నవాబులకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేస్తున్నారని నిజాం ప్రభుత్వవాదన. ఆ రోజు ఇద్దరు పోలీసుల్ని చంపినట్లు సమాచారం. అర్ధరాత్రి ప్రశాంత వాతావరణాన్ని చిన్నాభిన్నం చేస్తూ బాంబులమోత.

గొల్లరామవ్వ తన’ గుడిసెలో చీకటిలోనే కూర్చొని ఉంది. ఆమె వడిలో భయం భయంగా పదిహేనేండ్ల బాలిక తలదాచుకుని ఉంది.

“అవ్వా గిప్పుడిదేం చప్పుడే” అని ప్రశ్నించింది మనమరాలు. “నీకెందుకే మొద్దుముండ, గదేంది గిదేంది – ఎప్పటికి అడుగుడే” అని కసిరింది. ఇంతలో ఇంటికిటికీ చప్పుడు ఆ కిటికీ గుండా ఓ అగంతకుడి ప్రవేశం. అతడు అవ్వ దగ్గరకు వచ్చి “చప్పుడు చేయకు” నేను దొంగను కాను, రజాకార్నుకాను, పోలీసును కాను, మిమ్మల్ని ఏమీ అనను. లొల్లి చేయకండి” అన్నాడు.

నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీరును వారి నుండి మిమ్మల్ని రక్షించేవాడిని అన్నాడు. అతని శారీరక పరిస్థితిని తెలుసుకున్న అవ్వ మనఃస్థితిలో కాయకల్పమైంది. భావ పరివర్తన కలిగింది. “ఇదేం గతిరానీకు? గిట్లెందుకైనవు కొడకా? అని ప్రశ్నించింది.

“రాజోలిగెఉన్నవు కొడకా! నీ కెందుకు కొచ్చెరా ఈ కట్టం. పండు పండు గొంగల్ల పండు, బీరిపోతవేందిరా! పండు” అని అతన్ని ఓదార్చి సపర్యలు చేసింది. “కొడకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లలు పిసుక్కొచ్చిన గింత కడుపుల పడేసుకో” అంది. యువకుడు లేచాడు. అవ్వ ఇచ్చినది ప్రసాదంగా తీసుకున్నాడు.

పాలు పిండేవేళయింది. యువకుడు నిద్రపోతునే ఉన్నాడు. ఇంతలో “చస్తి సస్తి నీబాంచెన్… నాకెరుక లేదు, అయ్యో వావ్వో! వాయ్యో అన్న అరుపులు మిన్ను ముట్టే ఆక్రోశాలు” యువకుడు లేచాడు రివాల్వరు తోటాలతో నింపుకుని బయలుదేరాడు. వెనుక నుండి అతని భుజం మీద మరొక చేయబడ్డది”. యాడికి? అన్న ప్రశ్న. ముసల్వ మరేం మాట్లాడలేను. అతన్ని చెయ్యపట్టి వెనక్కి లాంగింది.

యువకునికి మనవరాలి చేత దుప్పటి కండువాను ఇప్పించింది. అతడిచే “గొల్లేశమేయిచింది. ఎవడన్నా మాట్లాడిత్తే గొల్లునోలె మాట్లాడాలె” అన్నది. ఈ లోపు పోలీసులు అవ్వ ఇంటికి రానేవస్తిరి. ఇంకేముంది గొల్ల వేసమంతా వ్యర్థమైనట్లే అనుకున్నాడు యువకుడు. అవ్వ మనవరాలితో “మల్లీ! ఆ మూలకు మంచం వాల్చి గొంగడయ్యె! పిల్లగా ఆండ్ల పండుకో. ఊ పండుకో” అంది. “పొల్లా పోరని మంచానికి నాగడంచే అడ్డం పెట్టు” “మల్లీ మాట్లాడక ఆ పోరని పక్కల పండు ఊనడూ అంది”. “చెయ్యసి పండుకో పోండా దానిమీద! చూసెటోని కనువాదం రావద్దు” అంది.

అంతలోనే ఇట్లకొచ్చిన పోలీసోళ్ళు ఆ యువకుని చూసి “వాడు యెవడన్నావ్ చెప్పు! కాంగ్రెసోడా యేం” అని అవ్వను గద్దించాడు వాడెవ్వడా! ఎవ్వడు పడితేవాడు మా పక్కలల్ల పండుటానికి మేమేం బోగమోల్ల మనుకున్నావా? నిన్నెవడన్నా గట్లనే అడుగుతే ఎట్లంటది అని బొంకింది. అవ్వ మంచంమీద కూర్చుంది. ఒక వైపు యువకుడు మరో వైపు మల్లి. అపూర్వ సమ్మేళనం. అవ్వా నీవు సామాన్యరాలువుకావు. సాక్షాత్తు భారతమాతవే” అన్నాడు.

ప్రశ్న 2.
స్నేహలతాదేవి ఆత్మ విశ్వాసాన్ని వివరించండి ?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగం డా॥ ముదిగంటి సుజాతారెడ్డిచే రచించ బడింది. ఆమె కథల సంపుటి “విసుర్రాయి”లోనికి ఈ కథ. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి, ఆర్థిక స్వావలంబనకు చాలా ప్రాధాన్యం ఉందన్న వాస్తవాన్ని వివరిస్తుంది.

తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎంత బాధ్యతాయుతంగా ఆలోచించాలన్న మానవీయ విలువలను ఆధర్మాలను తెలుపుతుంది. యువత ప్రతి చిన్న విషయానికి అసంతృప్తికి గురి అవుతున్నారని, చిన్న ఓటమికే కృంగిపోయే మనస్తత్వంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిరసిస్తుంది.

స్నేహలతాదేవికి తనపై తనకు అంచంచల ఆత్మ విశ్వాసం ఉంది. ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలు తనకు నేర్పాయి. తన తనతల్లిదండ్రులకు ఒక్కగా నొక్క కుమార్తె. తల్లిదండ్రులు చక్కగా విద్యాబుద్ధులు నేర్పించారు. వివాహ విషయంలో తన తల్లిదండ్రుల బాధే స్నేహలతను కలిచివేసింది.

స్నేహలతకు వివాహం కావడం లేదని తల్లిదండ్రులు చింతిస్తున్నారు. వారి బాధను చూడలేక వారిని ఓదార్చుతూ తనపై తాను విశ్వాసాన్ని పెంచుకుంది స్నేహలత. పెళ్ళి చూపుల మీద పెళ్ళిచూపులు జరిగాయి. ఇది ఆడదానికి జరిగే అవమానాలలో ఒకటి. నాకేం తక్కువ? చదువుకుంది. సంస్కారం ఉంది.

మరీ అంత అందంగా లేకపోయినా వికారంగా మాత్రం లేను. నన్ను చూడటానికి వచ్చేవారికి వీటితో అస్సలు పనేలేదు. నేనిచ్చే కట్నంపైనే వారి దృష్టి. నేను ఇచ్చే కట్నాన్ని ఆశించి ఎవరూ నన్ను వివాహం చేసుకుంటానని అనటం లేదు. ఎందుకంటే అది వారికి నచ్చలేదు. ఈ దేశంలో స్వయం శక్తిపై విశ్వాసం లేనివాళ్ళు పెరిగిపోతున్నారు. పరాయిధనానికి ఆశకాదు అత్యాశ పడేవారే అధికమవుతున్నారు.

నా గురించి మీరు ఇల్లు అమ్ముకుని బజారును పడవలసిన పనిలేదు. నాకు చదువుంది. డిగ్రీ వుంది. ఆ డిగ్రీలో ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. భవిష్యత్తులో నా జీవన పథంలో నేనంటే ఇష్టపడేవాడు. వ్యక్తిగా నన్ను గౌరవించే వాడు డబ్బుకోసం కాక, ‘వరకట్నం కోసం కాక నా సాహచర్యం కోసం నా వ్యక్తిత్వం చూసి నన్ను పెళ్ళాడే వాడు దొరికినపుడే వివాహం చేసుకుంటాను. అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. నా గురించి మీరు భయపడనవసరం లేదు. నన్ను నేను కాపాడుకో గలను. నాకా శక్తిని ఈ సమాజం ఇచ్చింది.

ఎక్కడున్నా నేను జాగ్రత్తగా క్షేమంగా ఉంటాను. ఉద్యోగం సాధించగానే మీకు ఉత్తరం రాస్తాను. మీరు కూడా నా దగ్గరికే వచ్చి ఉండవచ్చు. మీరు నా దగ్గర ఉండటానికి ఇష్టపడే వాడు దొరికినప్పుడే పెళ్ళి చేసుకుంటాను. ఈ సమాజంలో స్త్రీ శక్తి మేల్కొవాలి. ఎవరికి తగిన స్థాయిలో వారు ఆర్థిక స్వాలంబనను పొందటానికి కృషిచేసి వరకట్నం వంటి దురాచారాలను ఎదుర్కోవాలని కోరుకుంటున్నాని స్నేహలతాదేవి తనతోపాటు స్త్రీ జాతి కంతటికి ఆత్మ విశ్వాసాన్ని కల్గించింది.

ప్రశ్న 3.
ఈ కథ ఆధారంగా హిందూ ముస్లిం మతస్థుల మధ్య నెలకొన్న ఆత్మీయ అనుబంధాలను చర్చించండి ?
జవాబు:
‘ఇన్సానియత్’ అను పాఠ్యభాగం డా. దిలావర్ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఆత్మీయ మానవ సంబంధాలను తెలియ చేస్తుంది. కులాలు మతాలు అనే భేదం లేకుండా ప్రజలందరి మధ్య నెలకొన్న స్నేహాలు, వరుసలు, పరస్పర సహకారాలు, సహజీవన సంస్కృతిని తెలియపరస్తుంది.

కాలక్రమేణ నగరాల్లోని. స్వార్థం, కులాభిమానం, మతోన్మాదం వికృతరూపం దాల్చి గ్రామీణ ప్రాంతాలలోకి వ్యాపించడం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో గ్రామీణ హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఉన్నతమైన మానవీయ అనుబంధాలను ఈ కథ వివరిస్తుంది. వర్తమాన సమాజంలో లుప్తమవుతున్న ఆదర్శాలను విలువలను తెలుపుతూ కులమత దురభిమానాలపై ఆత్మవిమర్శ చేసుకోమని తెలియచేస్తుంది.

పూర్వం గ్రామాలలోని ప్రజలంతా కుల మత భేదం లేకుండా అందరూ అందర్నీ అత్తా, అక్కడ, బావా, అత్తా,మద్దీ, మామ అని పిలుచుకునేవారు. వారి మధ్య ప్రేమాభిమానాలకు కుల మతాలు అడ్డు వచ్చేవికావు. ఎంతపెద్ద కులంలో పుట్టినా వారిలో కూడా మిగిలిన వారి పట్ల ఆత్మీయానురాగాలు ఉండేవి. ఒకరినొకరు చక్కగా గౌరవించుకునేవారు. దీనికి నిదర్శనం, ఈ కథలోని రాధమ్మత్త, సోందుబాబుల మధ్య జరిగిన సంభాషణలే !

ముస్లిం అయిన సోందుబాబు హిందువైన రాధమ్మను అత్తమ్మా అని పిలవడం ఇందుకు ఒక ఉదాహరణ.

“ఏం! రాధత్తమ్మా! అంత మంచేనా!” అని సోందుబాబు అంటే “బానే ఉన్న పోరగా! మీరంతా మంచేనా” అని రాధమ్మ అనటంలో వారి మధ్య ఉన్న ఆప్యాయత అను రాగాలు మనకు అర్థమౌతాయి.

అలాగే పాతిమా రాంరెడ్డిని “మర్దీ! సీమకు సుత అపకారం చెయ్యని నా కొడుకుని చూసి ఓర్వలేక అల్లా తీస్కపోతన్నడు” అనడం ముస్లిం హిందూ కుటుంబాల మధ్య ఉన్న ఆత్మీయతా, అనుబంధాలకు ఒక నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది”.

“మర్దీ! కడుపుకోత ఎట్ల అగులు బుగులుగ ఉంటదో అనుబగిత్తన్నా! నా కొడుకును మట్టిల గల్పుకుంటున్నా. నా కొడుకు పానం వంటిదే నీ కొడుకుపానం” నా కొడుకు హయత్ సుత బోస్కొని నీ కొడుకు నిండు నూరేళ్ళు బత్కాలే” అనటం “మనిషికి కావల్సింది. ఇన్సానియత్ గాని కులము మతము కాదన్న మానవతను, ఆత్మీయ అనుబంధాలను తెలియచెప్తుంది.

TS Inter 1st Year Telugu Model Paper Set 5 with Solutions

ప్రశ్న 4.
బిచ్చగాడు కథలోని ప్రయాణీకుల మనస్తత్వాన్ని విశ్లేషించండి ?
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీన్ చే రచించబడింది. ఈయన అసలుపేరు దొంగరి మల్లయ్య. ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీనమనసత్వాలను చక్కగా వివరించాడు. సమాజంలోని మనుషుల స్పందనా రాహిత్యాన్ని అమానవీయతను నైతిక పతనాన్ని ఈ కథ వివరిస్తుంది.

రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహానికి వెళ్ళి తిరిగి వరంగల్కు ప్రయాణం చేసే సందర్భంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన కథ ఇది. ఆ రోజు స్టేషన్ చాల రద్దీగా ఉంది. టికెట్ దొరికే అవకాశం ఏ మాత్రం కన్పించలేదు. అంతలో ఒకప్పటి తన విద్యార్థి భాస్కర్ సి. ఐగా పని చేస్తాడు. అతని పుణ్యమా అని టికెట్ సంపాదించి ట్రైన్లోకి ప్రవేశించాడు. కూర్చోటానికి సీటు ఎక్కడా ఖాళీ లేదు.

చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఒక సీటు మొత్తాన్ని ఒక స్త్రీ తన సామానులతో ఆక్రమించింది. ఆ సామానంతా అటూ ఇటూ జరిపితే ఐదుగురు కూర్చోవచ్చు. ఆ స్త్రీ చాలపేదరాలుగా ఉంది. బిచ్చగత్తెలా ఉంది. నలుగురు సంతానంతో చినిగిపోయిన గుడ్డపీలికలు కట్టుకునుండి. మురికిగా అసహ్యంగా ఉన్నారు. ఎలాగోలా అక్కడ కూర్చోవాలని “ఇదిగో ఇటుచూడు…. ఆ సామానంతా క్రిందపెట్టేస్తే ఇక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చుగా అన్నాడు. ఆ స్త్రీ “గదంతేం లేదు మేము సామాను తియ్యం. ఇంకో డబ్బాలోకి పోయికూకో”చాలా మొరటుగా సమాధానం చెప్పింది.

ఇంతలో అక్కడ కూర్చున్న పెద్ద మనిషి. “అధునా భిచ్చముండవు. – నీ కింత పొగరుండీ మాకెంతుండాల్నే? ఆ సారెంత మర్యాదగా అడిగిండు- ఈ రైలు మీ తాతదనుకన్నావా” అని గద్దించాడు. చివరికి అక్కడ కూర్చున్నారు కవిగారు.

ఇంతలో గార్డువిజిల్ విన్పించింది. ఆ బిచ్చగత్తె గొంతులో ఆందోళన. “మీ అయ్యేడిరా! ఎక్కడ సచ్చిండు? రైలు పోతాంది” అంది ఇంతలో టికెట్ కోసం వెళ్ళిన వాడు వచ్చాడు. “టికెట్ దొరకనేలేదు బండిపోతాంది. సామానునంతా కిందకి దించి మీరు దిగుండే” అన్నాడు.

“ఓరిపిచ్చిగాడిద కొడకా సామానునంతా దించే వరకు బండి ఆగుతుందా ఏమిటి? టి.సి. గారితోని చెప్పి బండిలో కూర్చో అన్నాడు ఆ పెద్దమనిషి. అప్పటికే ఆ బిచ్చగాడు బండిదిగి టికెట్ తీయమని డబ్బులిచ్చిన వాడి దగ్గరకు పరిగెత్తాడు. ఆడురాక పోతే

టి.సీకి కట్టడానికి నీ దగ్గర డబ్బులున్నాయా అన్నారొకరు. “ఒక్కపైసాలేదు. లేదు బాంచెను “అందామె ఏడుస్తూ “నువ్వట్లనే అంటావు. ఇయ్యాళేపు బిచ్చగాళ్ళ దగ్గరున్నన్ని డబ్బులు మా అసంట్లోళ్ళ దగ్గర కూడా లేవు. మీకేందే పెట్టుబడి లేని వ్యాపారం” అన్నాడు ఎగతాళిగా. అక్కడ ఉన్నవారందరూ చులకనగా నవ్వారు.

మీ పనే బాగుందిరా. ఎక్కడా బిచ్చమే… కానీ ఖర్చులేని బతక్కు అన్నాడకొడు. ఊళ్ళన్నీ వాళ్ళవే ! దేశాలన్నీ వాళ్ళవే దొరికింది తింటారు. లేకుంటే పస్తులుంటారు. ఏ బాదరాబందీ లేదు. మనకంటే వాళ్ళేనయం అన్నాడో ప్రయాణీకుడు. టి.సి రావడం ఆ బిచ్చగాణ్ణి బెదిరించడం జరిగాయి. ఆ బిచ్చగాడి రుమాలులో డబ్బులు కిందపడ్డాయి. అక్కడి ప్రయాణీకులలో బిచ్చగాడిపట్ల అప్పటి వరకు ఉన్న సానుభూతి ఎరిగిపోయింది.

“దొంగముండా కొడుకులు. వీళ్ళను చచ్చినా నమ్మోద్దు. టి.టి గారికి వీళ్ళ సంగతి బాగా తెలుసు. మంచిపని చేసుండు” అన్నాడు ఆ ఖద్దరు బట్టల నాయకుడు. నిండుచూలాలు వీళ్ళకు ఇలా జరుగుతుంటే వారిపై ప్రయాణీకులెవరికి జాలికలుగలేదు. అదే విషయం సినిమాలో చూస్తే కళ్ళ వెంట నీళ్ళు కారుస్తారు.

మేమంతా, టికెట్లు కొన్నాం. వీళ్ళు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. మనకు లేని ప్రివిలేజ్ వీళ్ళకెందుకు పొందాలి అన్న ఈర్ష్య వారిలో కన్పించింది. టీ.సి ఆ గర్భిణి నుండి ‘సంచిని లాక్కొని డబ్బంతా కింద బోర్లించాడు. ఫైనుతో టికెట్కు సరిపడా డబ్బులు తీసుకుని మిగిలినవి ఆమెకివ్వబోయాడు. “వాటిని కూడా వార్నేతీసుకోమనురి” అంది ఆమె.

“చెప్పుతీసుకుని తంతాను దొంగముండా” అని ఇష్టమొచ్చినట్లు తిట్టి ఒక కాగితం ముక్క ఆ బిచ్చగాడి చేతిలో పెట్టాడు. ఆ చీటిలో 22 రూపాయలే రాసి ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఎవరు బిచ్చగాడో కవిగారికి అర్థం కాలేదు. భిన్నమనస్తత్వాలు గల వ్యక్తులు వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారని కవి బాధపడ్డాడు.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
సజ్జనుల జేయులేడెంత చతురుడైన
జవాబు:
పరిచయం : శేషప్ప కవిచే రచింపబడిన నృసింహశతకం నుండి గ్రహించిన పద్యభాగం.
సందర్భము : క్రూరజీవులనైన అదుపు చేయవచ్చుగానీ, దుర్మార్గుల మనసును ఎంతటితెలివిగల వాడైనను, మార్చలేడని కవి చెబుతున్న సందర్భంలోనిది.
భావము : భుజముల శక్తిచే పెద్దపులులు చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్టవచ్చును. బ్రహ్మరాక్షసులు ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్పవచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును. కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించ వచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.

ప్రశ్న 2.
దారిద్ర్యంబున కంటెఁగష్టంబొండెద్దియులేదు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం నన్నయభట్టుచే రచింపబడిన శ్రీమదాంధ్ర మహా భారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.
సందర్భం : తనకుమారుని ఆకలి బాధను ద్రోణుడు భీష్మునికి చెప్పిన సందర్భంలోనిది.
భావం : ధనవంతుల బిడ్డలు ప్రతిదినం సంతోషంతో పాలు తాగుతుండగా నా కుమారుడు వీడు బాల్యంలో నాకు కూడా పాలు పోయడని ఏడ్చాడు. దానిని చూచి. దారిద్య్రం కంటే కష్టం మరొకటి లేదని భావించి ఈ దారిద్ర్యాన్ని నా బాల్యమిత్రుడైన పాంచాలరాజు ద్రుపదుని దగ్గరకు పోయి తొలగించుకుంటాను. అతడు తన దేశానికి రాజు కావటానికి వెళ్తూ నన్ను ఆహ్వానించి వెళ్ళాడు.

ప్రశ్న 3.
రంగులు వేరైనా నరజాతి నరంగు మానవత్వమే.
జవాబు:
పరిచయము : ఈ వాక్యము కవిరాజుమూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘ కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
సందర్భము : కవి మానవతను గూర్చి వివరించిన సందర్భంలోనిది.
భావము : ఏడురంగుల సమ్మేళనం ఇంద్రధనస్సు. కాని దాని ఛాయ ఒకటే. ఏడు రంగుల సమ్మేళం అయినా చంద్రుని కాంతి తెలుపే. ఎన్ని వర్ణాలవారున్నా మానవులు నందరిని నడిపించే సరంగు మానవత్వమే అని ఇందలి భావము.

ప్రశ్న 4.
ఘర్షణలో ఏనాటికి హర్షం లభియింపబోదు.
జవాబు:
పరిచయం : ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన, ‘నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అన్న కవితా. ఖండికలోనిది.
సందర్భము : మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని అసలు విషయాన్ని తెలుసుకోమని చెప్పిన సందర్భంలోనిది.
భావము : కత్తిపట్టి గెలిచిన వీరుడెవ్వరూ లేడు. కాని మెత్తని హృదయంతో లొంగనివారు ఉండరు. హింస అనే అజ్ఞానాన్ని వదలి అహింస మార్గాన్ని ఎంచుకోవాలి. హింస ద్వారా సంతోషం ఏనాటికి లభించదని ఇందలి భావం.

VI. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
కుచేలుడి దారిద్ర్యాన్ని వర్ణించండి.
జవాబు:
కుచేలుడు అతని భార్యాపిల్లలు ఆకలి బాధతో కృశించిపోయారు. కుచేలుడు పేదరికంలో చిక్కి శల్యమైన శరీర అవయవములు కలిగి ఉన్నాడు. చినిగిన బట్టలు ధరించాడు. మనసులో శ్రీకృష్ణుడు సహాయం చేస్తాడనే గొప్ప ఆశతో ఉండి, చూడగానే నవ్వు పుట్టించే వాడుగా ఉన్నాడు. చినిగిన వస్త్రాన్ని ధరించి తన మిత్రుడైన శ్రీకృష్ణుని చూసి తొట్రుపాటుతో దూరంగా నిలబడ్డాడు అని కుచేలుని దారిద్ర్య స్థితిని వర్ణించాడు.

ప్రశ్న 2.
దేహ తత్త్వాన్ని గురించి ఇద్దాసు ఏమి చెప్తున్నాడు ?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’చే రచించబడింది. ‘దున్న విశ్వనాథం’ సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

ఏడ చూసినా ఏమీ లేదు. అంతామిథ్య. ఎక్కడ వెదకినా ఏమీ కన్పించదు. అంతా శూన్యం. అజ్ఞానంలో ఉన్నంత కాలం చీకటే కన్పిస్తుంది. అజ్ఞానాన్ని వదలి గురుని నమ్మి ఆయనను అనుసరిస్తే ఫలితం ఉంటుంది. మానవులు జీడికంటి వంటి నేత్రాలను తెరచుకోవాలి. ఆ జ్ఞాన నేత్రాలు, ఆ అగ్నినేత్రాలు మన దేహం తత్వాన్ని తెలియచేస్తాయి. అపుడు గురుని ద్వారా ముక్తి మూలాలను తెలుసుకోగలమని దున్న ఇద్దాసు వివరించాడు.

ప్రశ్న 3.
బలిష్టునికే బంధుసహాయం అందుతుందని ఎలా చెప్పవచ్చు ?
జవాబు:
అగ్నిహోత్రుడు నిండు బలము కలవాడై అడవిని కాల్చే సమయంలో వాయుదేవుడు అతినికి స్నేహం చూపుచూ తోడ్పడును. ఆ అగ్నిచిన్నదీపమై ఉన్న సమయంలో ఆ వాయుదేవుడే విరోధియై ఆర్పును. అదే విధంగా మానవుడు శక్తివంతుడై ఉన్న సమయంలో తన బంధువులే తోడ్పడును. బలము లేనపుడు ఆ చుట్టమే తనకు పగవాడై కీడు చేయును.

ప్రశ్న 4.
ద్రుపదుని చేతిలో ద్రోణుడు ఏ విధంగా భంగపడ్డాడు ?
జవాబు:
ఆ విధంగా పరశురాముని వద్ద నుండి దివ్యాస్త్రాలను మంత్ర, ప్రయోగ రహస్యాలతో – సహాపొంది, విలువిద్యను అభ్యసించి, ధనాన్ని కోరి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని వద్దకు వెళ్ళి, నేను నీ బాల్యమిత్రుడిని, నీతో కలిసి చదువుకున్న వాడిని, తెలుసుకదా అని స్నేహపూర్వకంగా మాట్లాడగా, ద్రుపదుడా మాటలను సహించలేక కోపంతో ఇలా అన్నాడు. ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు.

VII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ధనవంతులు తమ అధికార బలాన్ని దేనికి ఉపయోగించాలి ?
జవాబు:
రాజాబహద్దూర్ వెంటకరామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన “వేంకట రామారెడ్డి జీవిత చరిత్ర” నుండి గ్రహించబడింది.

భారతదేశంలోను, మన రాష్ట్రంలోను అధికారులు, గొప్ప గొప్ప ఉద్యోగులు ఎందరో …. ఉన్నారు. వారందరూ ధనమును బాగా సంపాదించినవారే ! గొప్ప గొప్ప బిరుదులను పొందినవారే ! కాని వారిని లోకం గుర్తించలేదు. దానికి కారణం వారిలో సామాజిక సంఘసేవా తత్పరత లేకపోవటమే! ఎంతటి గొప్పవారైనా ఎంతటి ధనికులైనా సంఘ సేవ చేయని ఎడల గుర్తింపు పొందరు.

తాము సంపాదించిన ధనములో ఎంతోకొంత సమాజ శ్రేయస్సుకు వినియోగించాలి. దేశాభివృద్ధికి ప్రజలలో మంచిని ప్రబోధించటానికి తప్పక వినియోగించాలి. అలా చేయనిఎడల గుర్తింపును కోల్పోతారు. రామారెడ్డిగారు ఇతరుల వలే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా మంచిపలుకుబడిని ప్రజానురాగాన్ని పొందారు. దానికి కారణం ఆయన తన ధనాన్ని శక్తిని, పలుకుబడిని ప్రజాభ్యుదయానికి ఉపయోగించారు.

కాబట్టి ధనవంతులు అధికారులు తమ అధికారాన్ని ధనాన్ని ఇతరుల కోసం, సమాజాభివృద్ధికి ఉపయోగించాలి.

ప్రశ్న 2.
సోమన లఘుకృతులను గురించి క్లుప్తంగా రాయండి ?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణశర్మచే రచించనబడిన ‘చైతన్యలహరి’ అను వ్యాససంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో సోమనాథుని రచనలలోని భాష ఛందస్సులలో నూతనత్వాన్ని ఎలా తీసుకువచ్చాడో వివరించబడింది. సోమనాథుని రచనలను, వర్ణనానైపుణ్యాన్ని ఇందులో వివరించాడు. పాల్కురికి రాసిన 21 రచనలను పేర్కొంటూ వాటిలో లఘు కృతులను తెలియజేశాడు.

సోమనాథుడు శివభక్తి తత్పరుడైన బసవేశ్వరుని పై భక్తి తన్మయత్వంతో కొన్ని లఘుకృతులను రచించాడు. అవి 1. రగడ 4 గద్యలు, 2 ఉదాహరణలు 11 పంచకములు 2 అష్టకములు, 1 స్తవము ఉన్నాయి. ఇవన్నీ వైరశైవయుత సంబంధ రచనలే.

ప్రశ్న 3.
రంతిదేవుని ద్వారా వ్యాసుడు పలికించిన ధర్మం ఏమిటి ?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అన్న ‘పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అను వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది.

మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించే అంశాలు కోకొల్లలు. వేదముల నుండి పురాణాల వరకు అన్నింటిలోనూ ఈ ప్రస్తావన ఉంది. మహాభారతంలో దధీచి, శిబి, రంతిదేవుని పాత్రల ద్వారా ఈ విషయాన్ని వ్యాసుల వారు వివరించారు. మానవతావాది, త్యాగశీలి, దయాశీలి రంతిదేవుని మాటల్లో “నత్వహం కామయే రాజ్యం”…..

అన్న శ్లోకం ద్వారా “నాకు రాజ్యము వద్దు, నాకు స్వర్గమూ వద్దు, నాకు మోక్షము వద్దు దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తి తొలగి పోవటమేకావాలి” అని చెప్పబడింది. భాగవతంలో కూడా “న కామయే హం గతి మీశ్వరాత్. .” అన్న శ్లోకంలో కూడా దుఃఖపీడితుల హృదయాల్లో తానుడంటూ బాధలను తాను అనుభవించైనా వారి దుఃఖాలను పోగొట్టాలి అని రంతిదేవుడు చెప్పిన మాటలు నిజంగా మానవతకు సంబంధించినది.

ప్రశ్న 4.
బతుకమ్మ పాటలోని విశేషాలు ఏమిటి ?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అను గ్రంథం నుండి గ్రహించబడింది. బతుకమ్మ పండుగ ఆట పాటల మేలు కలయిక. స్త్రీల పాటలన్నీ ఒడిదుడుకులు లేక క్రమగతిలో ఒకే స్వరంలో సాగిపోతాయి. కంఠస్వరంనాళాలకు, గర్భాశయానికి హానికలుగని మధ్యమస్థాయిలో స్త్రీలు పాటలు పాడుతుంటారు. సహజ సంగీతంతో సాగిపోయే బతుకమ్మ పాటలను సంగీత శాస్త్ర నియమాలు, లక్షణాలతో పనిలేదు.

వీరి పాట నాట్యాన్ని అనుసరించి ఉంటుంది. బతుకమ్మ ఆటకు అనుగుణంగా ఉంటాయి. వీరి పాటలు పౌరాణిక గీతాలుగా, నీతి బోధకాలుగా, కథాగేయాలుగా ఉంటాయి. వారి పాటలలో ఉయ్యాలో, వలలో, చందమామ అన్న పల్లవులు ఆవృతాలవుతుంటాయి. సూర్యాస్త సమయంలో బతుకమ్మ పాటలు పాడతారు కాబట్టి చందమామ” అని, గౌరమ్మను నీటిలో ఓలలాడిస్తారు కావున వలలో” అని ‘ఊయలవలె’ ఊగుతూ పాడతారు కావున ఊయాలో” అన్న పదాలుంటాయి.

బతుకమ్మకు వీడ్కోలు చెప్తున్న ఈ పాటలో
“నిద్రపో గౌరమ్మ నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు…..”

ఈ పాటలో జగజ్జననికి జనని జానపదయువతి. స్త్రీది మాతృ హృదయం. చిన్నారి పాపను జో కొడుతూ పాడే పాటలను బతుకమ్మ పాటగా పాడుతుంది. బతుకమ్మ పాటలలో స్త్రీల మనోభాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.
ఉదాహరణకు.
“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో – గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో – వచ్చేరిసతిగూడి ఉయ్యాలో”
పనులలో అలుపు సొలుపు తెలియకుండా పాడే ఈ పాటలు పరమాత్మ స్వరూపాలు.

TS Inter 1st Year Telugu Model Paper Set 5 with Solutions

VIII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.
(పాఠ్యాంశ కవులు / రచయితలు)

ప్రశ్న 1.
నన్నయ గురించి తెలపండి.
జవాబు:
నన్నయ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజనరేంద్రుని ఆస్థానకవి. ఉభయభాషా కావ్యరచనాభి శోభితుడు, లోకజ్ఞుడు, ఉచితజ్ఞుడు, రసజ్ఞుడు అయిన నన్నయ సాగించిన భారతానువాదం అనన్య సామాన్యం. వేదవ్యాస విరచితమై పంచమ వేదంగా చెప్పుకొనే సంస్కృత మహాభారతాన్ని రాజరాజు కోరిక మేరకు తెలుగులోకి అను వాదం చేసాడు. నన్నయ ‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ’ అంటూ సంస్కృత శ్లోకంతో మహా భారతాన్ని మొదలుపెట్టి ఆనాటి ప్రాచీన విద్వాంసుల మెప్పు పొందాడు.

బహుభాషా విజ్ఞుడు, ఉద్దండపండితుడు అయిన నన్నయ మహాభారతంలో ఆది, సభా, అరణ్యపర్వంలోని నాల్గవ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు రచించాడు. వాటితోపాటు ఆంధ్ర శబ్దచింతామణి, చాముండికా విలాసం, ఇంద్రవిజయం, లక్షణసారం అనే గ్రంథాలు రచించాడు. మిత్రుడైన నారాయణభట్టు సహాయంతో నన్నయ భారతాను వాదానికి ఉపక్రమించాడు. మహాభారతాన్ని చంపూ పద్ధతిలో అనువదించిన నన్నయ భారత రచన ఒక స్వతంత్ర రచనలాగా సాగింది. నన్నయ తదనంతర కవులెందరికో మార్గదర్శకుడై “ఆదికవి” అనిపించుకున్నాడు.

ప్రశ్న 2.
ఏనుగు లక్ష్మణకవిని గురించి తెలపండి.
జవాబు:
భర్తృహరి సుభాషిత త్రిశలు అనే పేరుతో సంస్కృతం వంటి మూడు శతకాలు రచించాడు. అవి నీతి, వైరాగ్య శృంగార శతకాలు. ఈ సుభాషిత త్రిశతిని తెలుగులో ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణకవి, పుష్పగిరి తిమ్మనలు తెలుగులోకి అనువదించారు. వీటిలో ఏనుగు లక్ష్మణకవి రచన ప్రాచుర్యం పొందింది.

ప్రశ్న 3.
గడియారం రామకృష్ణ శర్మ రచయిత గురించి తెలపండి.
జవాబు:
గడియారం రామకృష్ణశర్మ మార్చి 6. 1919న అనంతపురం జిల్లాలో సుబ్బమ్మ జ్వాలాపతి దంపతులకు జన్మించాడు. ఆయన పుట్టింది అనంతపురం జిల్లాలో అయినా స్థిరపడింది ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా అలంపురం లోనే! ఆయన తన జీవిషాన్నంతటిని తెలంగాణ సంస్కృతి వారసత్వ పరిరక్షణకు ధారపోశారు. ఈయన గురువు తిరుపతి వేంకటకవుల శిష్యుడైన వేలూరి శివరామశాస్త్రి. ఈయన సంస్కృతం, తెలుగు, కన్నడ, ఆంగ్ల భాషలలో పండితుడు.

తెలుగు భాషపట్ల ‘నిజాం ప్రభువు చిన్నచూపు చూడటం సహించలేక ఆంధ్ర మహాసభల ఏర్పాటుకు కృషి చేసి కార్యదర్శిగా పనిచేశారు. ‘ఆంధ్ర సారస్వత్ పరిషత్’ స్థాపనలో కీలక పాత్ర వహించారు. నిజాం ప్రభుత్వ రేడియోకి వ్యతిరేకంగా ‘భాగ్యనగర్ రేడియో’ను అజ్ఞాతంగా నడిపారు.

గడియారం వారు మంచి సంఘసంస్కర్త. సంస్కరణను తనతోనే ప్రారంభించి వితంతు వివాహం చేసుకున్నారు. పలు వితంతు వివాహాలను గూడా జరిపించారు. 1972 ఆగిపోయిన సుజాత పత్రికను పునరుద్ధరించారు.

మెకంజీ కైఫీయత్తులను పరిశీలించి వాయించారు. ‘తెలంగాణ శాసనాలు’ గ్రంథం రెండవ సంపుటిని ప్రచురించారు. కన్నడ సాహిత్య చరిత్రను పరిశోధనాత్మకంగా వ్రాశాడు. కన్నడకవి ‘రన్నడు’ వ్రాసిన గదాయుద్ధాన్ని’ తెలుగునకు అనువదించాడు. అలంపురం చరిత్ర, విద్యారణ్యస్వామి చరిత్రలను ప్రామాణిక ‘శతపత్రం’, 2006లో ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 2006 జులైలో గడియారం వారు తుదిశ్వాస విడిచారు.

ప్రశ్న 4.
డా॥ సామల సదాశివ కవిని గురించి తెలపండి.
జవాబు:
డా॥ సామల సదాశివ భిన్న భాషా సంస్కృతులకు వారధి ఈయన మే 11, 1928 న ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలం తెలుగు పల్లె గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు, అధ్యాపక వృత్తిని చేపట్టి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా రిటైరయ్యారు. సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ, తెలుగు భాషలలో పాండిత్యాన్ని సంపాదించారు. ప్రభాతము అనే లఘు క్యాన్ని సాంబశివ శతకం, నిరీక్షణ, అంబపాలి, సర్వస్వదానం, విశ్వామిత్రము వీరి తొలి రచనలు.

హిందూస్థానీ సంగీత కళాకారులపై మలయ మారుషాలు ప్రముఖులు జ్ఞాపకాలు, అనుభవాలు గల ‘యాది’ సంగీత శిఖరాలు, వీరి రచనలే. అమాన్ రుబాయిలు’ అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2011లో లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సన్మానించాయి. ఈయన రచనలపై పరిశోధనలు జరిగాయి. ఆగస్టు 7, 2012న పరమపదించారు.
ప్రస్తుత పాఠ్యభాగ్యం డా|| సి. నారాయణరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ‘వ్యాసగు ళచ్ఛం’ రెండవ భాగం నుండి గ్రహించబడింది.

IX. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (5 × 1 = 5)
(పద్యభాగం నుండి).

ప్రశ్న 1.
మనిషికి శత్రువు ఎవరు ?
జవాబు:
కోపము

ప్రశ్న 2.
‘మహైక’ కావ్యాన్ని ఎవరు అంకితంగా స్వీకరించారు ?
జవాబు:
తెలంగాణ యోధుడు ‘సర్దార్ జమలాపురం కేశవరావుకు అంకితమిచ్చాడు.

ప్రశ్న 3.
ద్రోణుడి మిత్రుడి పేరేమిటి ?
జవాబు:
ద్రుపదుడు

ప్రశ్న 4.
అజ్ఞానాన్ని కవి దేనితో పోల్చాడు.
జవాబు:
అజ్ఞానాన్ని “అడుసు”తో పోల్చాడు.

ప్రశ్న 5.
తెలంగాణలో గొప్ప ‘అచల’ గురువు
జవాబు:
దున్న ఇద్దాసు

ప్రశ్న 6.
శ్రీకృష్ణుడు కుచేలుడికి ఏమి ప్రసాదించాడు ?
జవాబు:
ఇంద్రాది దేవతలకు సాధ్యంకాని అనేక సంపదలిచ్చాడు.

ప్రశ్న 7.
నన్నయ ఎవరి ఆస్థానకవి ?
జవాబు:
రాజరాజ నరేంద్రుడు

ప్రశ్న 8.
భాస్కర శతకకర్త ఎవరు ?
జవాబు:
మారద వెంకయ్య.

X. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి)

ప్రశ్న 1.
ఆచార్య రవ్వా శ్రీహరి రచనలు తెలియచేయండి ?
జవాబు:
తెలుగు కవుల సంస్కృతానుకరణలు, తెలంగాణ మాండలికాలు కావ్యప్రయోగాలు, అన్నమయ్య భాషా వైభవం వంటి 40 గ్రంథాలను రచించారు.

ప్రశ్న 2.
‘పాల్కురికి సోమనాథుడు’ పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
గడియారం రామకృష్ణ శర్మ

ప్రశ్న 3.
రావి ప్రేమలత “వ్యాసలతిక”కు లభించిన పురస్కారం ఏది ?
జవాబు:
ఉత్తమ విమర్శన గ్రంథంగా తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది.

ప్రశ్న 4.
సోమన తల్లిదండ్రులెవరు ?
జవాబు:
తల్లి శ్రియాదేవి, తండ్రి విష్ణురామిదేవుడు

ప్రశ్న 5.
‘సంచ్’ ఎవరు ?
జవాబు:
‘సర్ంచ్’ ఆ కాలంలో ఉన్న పోలీసు శాఖామంత్రి.

TS Inter 1st Year Telugu Model Paper Set 5 with Solutions

ప్రశ్న 6.
“లొల్లిలో లొల్లి” జాతీయం ఆధారంగా ఒక వాక్యం రాయండి.
జవాబు:
రాజకీయ పార్టీలు అవినీతిని గురించి ఇప్పుడు లొల్లిలో లొల్లి చేస్తున్నాయి.

ప్రశ్న 7.
‘ముహుబాణీ’ అనే ఉర్దూపదానికి అర్థం ?
జవాబు:
‘ముహ్ జుబాణీ అనే ఉర్దూపదానికి’ ‘నోటితో’ అని అర్థం.

ప్రశ్న 8.
మానవతా దృక్పధానికి మూలమేమి ?
జవాబు:
మానవతా దృక్పధానికి మూలం ‘ప్రేమ’.

XI. ఈ కింది వానిలో ఒకదానికి సమాధానం రాయండి. (1 × 5 = 5)

ప్రశ్న 1.
బదిలీ పత్రము (టి.సి) కొరకు కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ వ్రాయండి.
జవాబు:

కరీంనగర్,
15-06-2023.

గౌరవనీయులైన ప్రధానాచార్యులు గారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
కరీంనగర్, నమస్కారాలు.

విషయము : టి.సి. (బదిలీ పత్రము) ఇప్పించుటకు విజ్ఞప్తి.

నేను మీ కళాశాలలో యం.పి.సి. గ్రూపు ద్వారా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసాను. ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ప్రస్తుతం నేను పై తరగతులు చదువుటకై డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ‘దోస్త్’ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసాను. ‘దోస్త్’ వెబ్ `సైట్ వారు విడుదల చేసిన మొదటి జాబితాయందు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి అనుమతి లభించినది. ప్రవేశం పొందుటకు గాను నాకు బదిలీ పత్రము అవసరం ఉంది.
కావున, నాకు బదిలీ పత్రము ఇప్పించగలరని విజ్ఞప్తి.
కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ విద్యార్థి
XXXX

ప్రశ్న 2.
ఇటీవల మీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరం గురించి వివరిస్తూ మీ స్నేహితునికి లేఖ రాయండి.
జవాబు:

మెదక్
09-08-2023.

ప్రియమైన సౌమ్యకి,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు ఎలా ఉన్నావు? నేను బాగా చదువుతున్నాను. నీవు ఎలా చదువుతున్నావో ఉత్తరం ద్వారా తెలియజేయగలవు.

ఇటీవల మా కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ (N.S.S) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రమాదాలు జరిగినపుడు గాని, శస్త్రచికిత్సలు చేసినపుడు గాని మనిషి ప్రాణాన్ని కాపాడడానికి కొన్నిసార్లు రక్తం అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేసి సాటివారి ప్రాణాలు కాపాడాలని తెలియజేసారు. ఈ మాటలు విన్న వింటనే నేను రక్తదానం చేశాను. నీవు కూడా రక్తదానం చేస్తావని భావిస్తున్నాను.

మన స్నేహితులు సమత, సంధ్య, ప్రవళిక ఎలా ఉన్నారు ? వారిని అడిగానని చెప్పు. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు తెలియజేయగలవు. వచ్చే దసరా సెలవులలో మనం కలుసుకుందాం. నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

ఇట్లు
నీ ప్రియమైన స్నేహితురాలు
XXXXX

చిరునామా:
ఎ. సౌమ్య
ఇంటి నంబర్ 21-12/68,
సుచిత్ర, సికింద్రాబాద్,
పిన్. నం. – 500067.

XII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి.

1) పాలికిఁబోవ
జవాబు:
పాలికిఁబోవ = పాలికిన్ + పోవన్ = సరళాదేశ సంధి
సూత్రం : ద్రుతము మీది పరుషములకు సరళములాదేశమును ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషం విభాషనగు.

2) కురియకుండునే
జవాబు:
కురియకుండునే = కురియక + ఉండునే = ఉకారసంధి’
సూత్రము : అత్తునకు సంధి బహుళమగును.

3) పేదరికమిట్లు
జవాబు:
పేదరికమిట్లు = పేదరికము + ఇట్లు = ఉకార సంధి
సూత్రం : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.

4) పోతుందయా
జవాబు:
పోతుందయా = పోతుంది + అయ = ఇత్వసంధి
సూత్రము : ఏమ్యాదుల యిత్తునకు సంధివైకల్పికముగానను ఏమ్యాదులు అనగా ఏమి, మది,కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి ఏది ఏవి మొదలగునవి.

5) అణువంత
జవాబు:
అణువంత = అణువు + అంత = అణువంత = ఉకారసంధి/ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు

6) లేదెన్నటికి
జవాబు:
లేదెన్నటికి = లేదు + ఎన్నటికి – లేదెన్నటికి = ఉకార సంధి/ఉత్వసంధి
సూత్రము : ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు

7) భ్రమలన్నీ
జవాబు:
భ్రమలన్నీ = భ్రమలు + అన్ని = ఉకార సంధి
సూత్రము : ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగును.

8) అప్పద్మనేత్రం
జవాబు:
అప్పద్మనేత్రం = ఆ + పద్మనేత్రు = త్రిక సంధి

సూత్రము:

  1. ఆ, ఈ, ఏ – అను సర్వనామములు త్రికమనబడును.
  2. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
  3. ద్విరుక్తంబగు హల్లు స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమగును.

XIII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.

1) కనురెప్ప
జవాబు:
కనురెప్ప – కనుయొక్కరెప్ప – షష్ఠీతత్పురుష సమాసం

2) ఉదధి నీరు
జవాబు:
ఉదధి నీరు – ఉదధి యందలి నీరు – సప్తమీ తత్పురుష సమాసం

3) ఇష్టసఖుడు
జవాబు:
ఇష్టసఖుడు – ఇష్టమైన సఖుడు – విశేషణ పూర్వపద కర్మధాయసమాసం

4) ఎర్రజెండా
జవాబు:
ఎర్రజెండా – ఎర్రనైన జెండా – విశేషణపూర్వపద కర్మధారయము.

5) వేయేండ్లు
జవాబు:
వేయేండ్లు – వేయి సంఖ్యల గల సంవత్సరాలు – ద్విగు సమాసం

6) మురసంహరుడు
జవాబు:
మురసంహరుడు – ముర అనే రాక్షసుని సంహరించినవాడు – బహువ్రీహి సమాసము

7) ధనపతీ
జవాబు:
ధనపతి – ధనమునకు మతి – షష్ఠీతత్పురుష సమాసం

8) అజ్ఞానం
జవాబు:
అజ్ఞానం – జ్ఞానము కానిది – నైత్పురుష సమాసము

XIV. ఈ క్రింది అంశాలలో ఒకదానిని గురించి వ్యాసం రాయండి. (1 × 5 = 5)

1. జాతీయ విపత్తులు
జవాబు:
అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.
విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది.

విపత్తు లక్షణాలు

  • ఆకస్మికంగా సంభవించడం
  • అతివేగంగా విస్తరించడం
  • ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం
  • ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.

సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి.

  1. సహజమైనవి
  2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.

భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.

ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.

భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని. అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణా యుతమైన ప్రయత్నం.

విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు

  • సంసిద్ధత
  • ఉపశమన చర్యలు
  • సహాయక చర్యలు
  • పునరావాసం.

విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం కలదు.

అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు. విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి.

విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.

విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. దీనికి ఉదాహరణ కోవిడ్ 19 వ్యాధి.

దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.

విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి. విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.

TS Inter 1st Year Telugu Model Paper Set 5 with Solutions

2. తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వైభవం
జవాబు:
ప్రతీ సమాజానికి తనదైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. అది ఆ ప్రాంత ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆలోచనాపరుడైన మనిషికి తన ఉనికి గురించి, తన ప్రాంత చరిత్ర గురించి, తన భాషాసంస్కృతుల విశిష్టతల గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. చరిత్రను, సంస్కృతిని అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం ద్వారా ఉత్తేజాన్ని, ప్రేరణను పొందవచ్చు.

చరిత్రను తెలుసుకోకుండా చరిత్రను నిర్మించలేమని పెద్దలు చెబుతుంటారు. అలాగే, సంస్కృతి కూడా నిత్యజీవితంలోని అనేక సందర్భాలను ఉత్సాహభరితం చేస్తుంది. చరిత్ర, సంస్కృతి రెండూ సమాజాన్ని ఒక రీతిగా తీర్చిదిద్దుతాయి. తెలంగాణ ప్రాంతవాసులుగా మన చరిత్ర, సంస్కృతుల పైన మనం కనీస అవగాహనను కలిగి ఉండడం, వాటిని పరిరక్షించుకోవడం అవసరం.

తెలంగాణలో ఆదిమానవ సమాజానికి సంబంధించిన క్రీ.పూ. రెండువేల ఏళ్ల నాటి బృహత్ శిలాసమాధులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. నవీన శిలాయుగానికి సంబంధించిన రేఖాచిత్రాలు అనేక గుహలలో చిత్రించబడినాయి. తెలంగాణ ప్రాంతానికి ప్రాచీన గ్రంథాలలో క్రీ.పూ ఆరవ శతాబ్దం నాటికి అశ్మక (అస్సక), ములక, మహిషక, మంజీరక, తెలింగ అనే పేర్లున్నాయి. గోదావరీ పరీవాహక ప్రాంతాలలో తొలినాటి ఆవాసాలకు సంబంధించిన ఆధారాలున్నాయి. తెలంగాణను పాలించిన తొలి రాజవంశం శాతవాహన వంశం.

వీరు కోటిలింగాల, పైఠాన్, పాలనాకేంద్రాలుగా కొండాపురం టంకశాలగా క్రీ.పూ. మూడవ శతాబ్దం నుండి క్రీ. శ. మూడవ శతాబ్దం వరకు పరిపాలించారు. వీరి కాలంలోనే శాతవాహన రాజైన హాలుడు సంకలనం చేసిన ప్రాకృత గాథాసప్తశతిలో అత్త, పత్తి, పడ్డ, పాడి, పిల్ల, పొట్ట మొదలైన తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. శాతవాహన కాలపు మట్టికోటల ఆనవాళ్ళు, అవశేషాలు కోటిలింగాల, ధూళికట్ట, పెద్ద బొంకూరు, ఫణిగిరి, గాజుల బండ, కొండాపురం లాంటి ప్రాంతాల్లో లభించాయి. అట్లాగే, శాతవాహనులు వేయించిన నాణాలు తెలంగాణలో లోహపరిశ్రమ ఉండేదనడానికి సాక్ష్యాలుగా ఉన్నాయి.

తర్వాత విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, వాకాటకులు పరిపాలించారు. తదనంతరం కాకతీయుల సామ్రాజ్యం క్రీ.శ. 950 నుండి 1323 వరకు విస్తరిల్లింది. ముసునూరు నాయకులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, బహమనీలు (క్రీ.శ. 1518 1686) అసఫ్ జాహీలు (క్రీ.శ. 1724- 1948) తెలంగాణ నేలను పరిపాలించారు.

క్రీస్తుపూర్వం వేలసంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న గోండులు ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకుంటూ ‘టేకం, మార్కం, పూసం, తెలింగం’ అనే నలుగురు మూలపురుషుల్ని దేవతలుగా పేర్కొంటారు. ఈ ‘తెలింగ’ శబ్దమే ‘తెలుంగు’ శబ్దానికి మూలంగా భావించవచ్చు. మెదక్ జిల్లా తెల్లాపూర్ లో బయట పడిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో. ‘తెలుంగణ’ పదం, 1510 వెలిచర్ల శాసనంలో ‘తెలంగాణ’ పదం ప్రయోగించబడింది. అనంతర కాలంలో, వ్యవహారాల్లో ‘తెలంగాణ’ పదం విస్తృత ప్రచారంలోకి వచ్చింది.

కాకతీయ రాజులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల నీటి పారుదల కోసమే చెరువుల నిర్మాణం అధికంగా జరిగింది. పెద్ద చెరువులు, గొలుసు చెరువులు, చెరువులవ్యవస్థ ప్రత్యేకంగా కనిపించటం వల్ల అప్పట్లో ఈ ప్రదేశాన్ని ‘చెరువులదేశం’గా పిలిచేవారు. వరి, గోధుమ, నువ్వులు, పత్తి వంటి తృణధాన్యాలతో పాటు తోటల పెంపకం కూడా కొనసాగింది. ఆ క్రమంలో ‘బాగ్’ల విస్తరణ ‘బాగ్’ (తోటలు)కు నెలవైన నగరం కనుకనే హైదరబాద్ కు ‘బాగ నగర్’ అనే పేరొచ్చింది.

వ్యవసాయం చుట్టూ అనేక వృత్తులు ఏర్పడ్డాయి. పనిముట్లు చేసేవారు. అవసరాలు చూసేవారు, పనులు చేసేవారు వివిధ వృత్తులుగా మార్పు చెందుతూ వచ్చినారు. పురోహితులు, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, పద్మశాలి, గొల్ల, బెస్త, గౌండ్ల, గాండ్ల, చర్మకార, వడ్డెర వంటి ఎన్నో వృత్తులు కొనసాగుతూ వచ్చినాయి. శాతవాహనుల కాలం నాటికే నిర్మల్ కత్తులు ప్రసిద్ధి పొందాయి. పట్టువస్త్రాలకు పోచంపల్లి, గద్వాల, ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వ్యవసాయం, కుటీర పరిశ్రమల ఉత్పత్తులతో గ్రామాలచుట్టూ ఎన్నో పండుగలు, జాతరలు తెలంగాణ సంస్కృతిలో వర్థిల్లినాయి.

తెలంగాణ ప్రజలు వ్యవహరించే తెలుగు విశేషమైంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. గ్రాంథికానికి, జాను తెలుగుకు దగ్గరగా, వ్యాకరణ ప్రమాణాలతో కూడి ఉంటుంది. తెలుగులో తొలి ప్రాచీన కందపద్యాలు బొమ్మలమ్మగుట్ట శాసనంలో లభించి, క్రీ.శ. 9 శతాబ్ది నాటికే ఛందోబద్ధ సాహిత్యమున్నదని నిరూపిస్తున్నాయి. కన్నడంలో, తెలుగులో పద్యాలు రాసిన పంపమహాకవి చరిత్ర తెలంగాణకు గర్వకారణం.

మల్లియరేచన రచించిన ‘కవిజనాశ్రయం ‘ తెలుగులో తొలిఛందోగ్రంథం. ‘వృషాధిప ‘శతకం’ పేరుతో తొలిశతకాన్ని పాల్కురికి సోమన రచించాడు. సామాజిక చైతన్యానికి, దేశీరచనలకు బీజం వేసిన పాల్కురికి సోమన తెలంగాణ ఆదికవి. తెలుగులో తొలి స్వతంత్ర రచన చేసిన కవి. జానపద, సంప్రదాయిక, ప్రజాస్వామిక సాహిత్యాలు తెలంగాణాలో విస్తృతంగా వర్ధిల్లినాయి.

ఆదిమ సమాజ జీవనవిధానానికి ఆనవాళ్లు గిరిజనులు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవితల్లినే దేవతగా కొలిచే వీరి కళలన్నీ ప్రకృతి అనుకరణ రూపాలే. మన తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఇత్యాది జిల్లాల్లో కోయ, గోండు, కొండరెడ్డి, లంబాడ, గుత్తికోయల, చెంచులు మొదలైన గిరిజన తెగలవారు జీవిస్తున్నారు.

రుంజలు, బైండ్లు, ఒగ్గుకథ, శారద కథ, హరికథ, చిందు భాగోతం, బాలసంతులు, బుడిగె జంగాలు, గంగిరెద్దులు, సాధనాశూరులు, బహురూపులు, పెద్దమ్మలు, గుస్సాడీ నృత్యం, చెంచు, కోయ, బంజారా ప్రదర్శనలు కళకళలాడినాయి. బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వనభోజనాలు, పీరీలు, దసరా, రంజాన్, కాట్రావులు, కొత్తలు, సంక్రాంతి, ఉగాది పండుగులు ఎన్నో కొనసాగు తున్నాయి. పేరిణి శివతాండవం, లాస్యం, భజనలు, చిరుతలు, శిల్పకళ, పెంబర్తి జ్ఞాపికలు, నిర్మల్ బొమ్మలు, నకాశి చిత్రాలు, కరీంనగర్ వెండిపనులు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాయి.

సమ్మక్క సారక్క, బల్మూరి కొండలరాయుడు, సర్వాయి పాపన్న, రాణి శంకరమ్మ, సోమనాద్రి, సదాశివరెడ్డి, రాంజీగోండు, కొమురంభీం, బండిసాయన్న, ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బందగీ, రేణుకుంటరామిరెడ్డి మొదలగు ఎందరో వీరుల సాహసగాథలు కళారూపాలు సంతరించుకొని వీరగాధలుగా విస్తరిస్తున్నాయి. తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన చుక్క సత్తయ్య ‘ఒగ్గు’ కథకు జాతీయస్థాయి గౌరవాన్ని కలిగించారు. అదేవిధంగా మిద్దె రాములు ఎల్లమ్మకథకు తెచ్చిన ప్రాచుర్యం కూడా అలాంటిదే. చిందు ఎల్లమ్మ, గడ్డం సమ్మయ్యలాంటి కళాకారులు చిందు యక్షగానానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు.

చరిత్రలో ఆయా రాజులకాలంలో నిర్మితమైన గోల్కొండ, ఓరుగల్లు, దేవరకొండ, రాచకొండ, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, ఎలగందల, జగిత్యాల, రామగిరి వంటి కోటలు ప్రసిద్ధి చెందాయి. వివిధ మతాలకు చెందిన రామప్ప, భద్రాచలం, పాకాల, జోగులాంబ, మక్కా మసీదు, మెదక్ చర్చి, వేములవాడ, కాళేశ్వరం, బాసర, యాదాద్రి, ప్రార్థనా స్థలాలుగా అలరారుతున్నాయి.

వేయిస్తంభాల గుడి, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, కొలనుపాక, నేలకొండపల్లి, పైగా, కుతుబ్ షాహీ సమాధుల వంటి చారిత్రక పర్యాటక ప్రదేశాలున్నాయి. కుంటాల, బొగత, పొచ్చర అలీసాగర్, నిజాంసాగర్, హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్, కాళేశ్వరం వంటి రమణీయ జలపాతాలు. ప్రాజెక్టులున్నాయి. నెహ్రూ జంతు ప్రదర్శనశాల, కవ్వాల్, పిల్లలమట్టి, పోచారం, శివ్వారం, ఏటూరునాగారం వంటి వన్యప్రాణి సందర్శన స్థలాలు తెలంగాణలో ఉన్నాయి.

తెలంగాణలో భాషా ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, రైతాంగ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, విప్లవోద్యమం, మద్యపాన వ్యతిరేకోద్యమం, జలసాధనోద్యమం, హరితహారం లాంటి అనేక ప్రజా ఉద్యమాలు వర్ధిల్లి ప్రజాసమూహాలను చైతన్య పరుస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఎంతో గొప్ప చరిత్రకు, సంస్కృతికి, ఎన్నో కళలకు పుట్టినిల్లు మనందరి తెలంగాణ. ఆడుదాం… పాడుదాం… అభివృద్ధిలో పోటీపడదాం. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం.

3. యువత – జీవన నైపుణ్యాలు
జవాబు:
ఒకదేశ అభివృద్ధి ఆ దేశ యువత శక్తిసామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతీయువకులే కీలక పాత్ర పోషిస్తారు. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే చీకటి మాసిపోతుందని, లోకం మారిపోతుందని కవులు ఉపదేశించారు. ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన పదిమంది యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మించ వచ్చునని స్వామి వివేకానంద గొప్పభరోసాను అందించాడు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువతీయువకులు కలిగిన దేశం భారతదేశం.

ఉత్తుంగ తరంగాలతో పొటెత్తే నదికి ఆనకట్ట కట్టి, ఆ నదీజలాలతో బంగారు పంటలు పండించినట్లు, నెత్తురుమండే శక్తులు నిండే యువతీయువకులను సమర్థ మానవ వనరులుగా తీర్చిదిద్ది ప్రగతి సిరులను పండించవచ్చు. యువతీయువకులు సునిశితమైన జీవన నైపుణ్యాలను సమకూర్చుకుంటే దేశ భావినిర్ణేతలుగా రాణిస్తారు. “We cannot always build the future for our youth, but we can build our youth for the future” అని ఫ్రాంక్ లిన్ డి. రూజ్ వెల్ట్ అన్నట్లుగా సమున్నతమైన భవితకోసం సమర్థవంతమైన యువతరం రూపొందాలి.

జ్ఞానసముపార్జనతోపాటు ఆ జ్ఞానసంపదను సద్వినియోగ పరుచుకోవటానికి జీవన నైపుణ్యాలను పెంపొందింపజేసుకోవాలి. విద్యార్థులు, యువకులు పోటీ ప్రపంచంలో విజేతలుగా ఎదగడానికి, ఉత్తమ పౌరులుగా, నవ సమాజనిర్మాతలుగా రూపొందటానికి తగిన జీవన నైపుణ్యాలను విధిగా అలవర్చుకోవాలి.

పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటమే ప్రధానం కాదు, అవరోధాలను అధిగమించి, ఉపద్రవాలను సాహసోపేతంగా ఎదుర్కొని జీవితాన్ని గెలిచే నైపుణ్యాలను కూడా నేటి యువత సొంతం చేసుకోవాలి. జీవన నైపుణ్యాల తీరుతెన్నుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చర్చించారు. బాల్యం నుండి విద్యార్థులు సమకూర్చుకోవలసిన కింది జీవన నైపుణ్యాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యంగా ప్రస్తావించింది.

1. స్వీయ అవగాహన (Self Awareness) : ప్రతి మనిషికి తనపైన తనకు అవగాహన ఉండాలి. తన సామర్థ్యంపట్ల సరైన అంచనా ఉండాలి. ‘స్వీయ లోపమ్ము లెరుగుట పెద్ద విద్య అన్నాడు దాశరథి. తనను తాను తెలుసుకోవడమే అసలైన విద్య. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, ఉన్నత గుణాలను సమకూర్చు కుంటూ యువత ముందడుగు వేయాలి. తమ బలాలను, బలహీనతలను సహేతుకంగా సమీక్షించుకొని, అందుకనుగుణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ లక్ష్యసాధనకు అకుంఠిత దీక్షతో యువత కృషిచేయాలి.

2. సహానుభూతి (Empathy) : పరస్పరం సహాయమర్థిస్తూ జీవించే మానవుల సమూహమే సమాజం. కావున, సాటి మనిషి కష్టసుఖాల పట్ల సహానుభూతి ఉండాలి. ఇతరుల సమస్యలకు తక్షణం స్పందించగలిగే మానవీయస్పృహను యువత అందిపుచ్చు కోవాలి. తద్వారా మానవ సంబంధాలు బలోపేతమవుతాయి.

3. భావవ్యక్తీకరణ నైపుణ్యం (Communication skill) : మాటే మనిషికి శాశ్వత ఆభరణం. మంచిమాట తీరువల్ల మహాకార్యాలను కూడా చక్కబెట్టుకోవచ్చు. సమయ స్ఫూర్తితో కూడిన, నైపుణ్యవంతమైన భావవ్యక్తీకరణ మనకు అనేక విధాలుగా మేలు చేస్తుంది.

విద్యావిషయక స్ఫూర్తిని ఇనుమడింపజేసుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందటానికి, వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, రోజువారి వ్యవహారాలను త్వరితగతిని సాధించు కొనటానికి భావవ్యక్తీకరణ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ఉద్వేగరహితంగా, ప్రభావశీలంగా, ప్రియంగా, హితంగా, సత్యసమ్మతంగా, అంగీకారయోగ్యంగా మాట్లాడే సామర్థ్యాలను యువత సంపాదించుకోవాలి.

4. భావోద్వేగాల నియంత్రణ (Management of emotions) : యువతీయువకుల హృదయాల్లో ఎన్నోరకాల భావోద్వేగాలు అనునిత్యం సుడులు తిరుగుతుంటాయి. ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆగ్రహావేశాలను సంయమనంతో నియంత్రించుకోవాలి. సమయ, సందర్భాలను అనుసరించి ఓపికతో వ్యవహరించాలి. యువత భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోతే అనేక అనర్థాలు సంభవిస్తాయి.

5. సమస్యనధిగమించే నైపుణ్యం (Problem solving skill) : సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, సానుకూల దృష్టితో సావధానంగా ఆలోచించి తగిన పరిష్కారాన్ని కనుగొనాలి. నిరాశ చెందకూడదు. చిన్నసమస్యను అతి పెద్దగా ఊహించుకొని ఒత్తిడికి గురి కాకూడదు. ప్రతికూల ఆలోచనతో సమస్యనుండి పారిపోకూడదు. మనచుట్టూ ఉన్నదారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏమాత్రం భయపడకూడదు. ఇక లాభం లేదని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడకూడదు.

ఎక్కడో మరొకదారి మన కోసం తెరిచే వుంటుందన్న నమ్మకంతో, ఆశావహదృక్పథంతో నలుమూలలా అన్వేషించాలి. సమస్య గురించి స్నేహితులతో, శ్రేయోభిలాషులతో నిర్భయంగా చర్చించాలి. సానుకూల అవగాహనతో ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ఆపదనుండి బయటపడాలి. గెలుపు ఓటములను, కష్టసుఖాలను సమతౌల్యంతో స్వీకరించే స్థితప్రజ్ఞతను యువత అలవాటు చేసుకోవాలి.

6. నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision making) : సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వల్ల సత్వర ఫలితాలను పొందవచ్చు. ఒక అంశం గురించి అన్ని కోణాలలో ఆలోచించి, అనంతర పర్యవసానాలను గ్రహించి, లాభనష్టాలను అంచనావేసి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమాత్రం కాలయాపన చేయకూడదు. ఆ నిర్ణయం బహుళ ప్రయోజనదాయకంగా ఉండాలి.

7. విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యం (Critical thinking) : ప్రతివిషయాన్ని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాలి. స్వీయదృక్కోణంలో నుండి మాత్రమే కాకుండా బహుముఖీన కోణాల నుండి ఆలోచించాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎవరో పెద్దలు చెప్పారనో, ఇంకెవరో సెలవిచ్చారనో ప్రతివిషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. స్వీయాను భవాల ఆధారంగా, ప్రమాణబద్ధంగా నిర్ధారించుకున్న తరువాత సంబంధిత విషయాన్ని ఆమోదించాలి. తార్కిక అవగాహనతో ఆలోచించాలి.

8. సృజనాత్మక ఆలోచనా నైపుణ్యం (Creative thinking) : యువతలో అనుకరణ ధోరణి బాగా పెరిగిపోతుంది. ఆయా రంగాలలో ప్రసిద్ధులైన వారి ఆలోచనాధోరణితో వేలం వెర్రిగా ముందుకుపోతున్నారు. వారిని స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలిగాని అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిక్షణం కొత్తగా ఆలోచించాలి. కాలానుగుణంగా స్వతంత్రంగా ఆలోచించడం మూలంగా అందరికీ మార్గదర్శకంగా ఉండవచ్చు.

ఈ విధమైన జీవననైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలను, పరోపకారదృష్టిని, సామాజిక స్పృహను, పర్యావరణ ఎరుకను, దేశభక్తిని సమకూర్చుకుంటే యువతీ యువకులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ‘పావన నవజీవన బృందావన నిర్మాత’లుగా జాతిపునర్నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.

XV. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి.

1. Imagination rules the world.
జవాబు:
ఊహాశక్తి ప్రపంచాన్ని శాసిస్తుంది.

2. There is no substitute for hard work.
జవాబు:
కృషికి ప్రత్యామ్నాయం లేదు.

3. Don’t judge book by its cover.
జవాబు:
ముఖ చిత్రాన్ని చూసి పుస్తకాన్ని అంచనా వెయ్యద్దు.

4. Don’t stop when you’re tired stop when you are done.
జవాబు:
అలసిపోయినప్పుడు కాదు, పనిపూర్తయినప్పుడే విశ్రమించాలి.

5. Reading is to the mind what exercise is to the body.
జవాబు:
శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకి పుస్తక పఠనం అలాంటిది.

TS Inter 1st Year Telugu Model Paper Set 5 with Solutions

XVI. ఈ క్రింది వ్యాసాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

వచనకవిత్వ వికాసంలో భాగంగా వచనకవిత విభిన్న లఘురూపాలుగా వైవిధ్యాన్ని సంతరించుకుంది. ఈ క్రమంలో కవిత్వచరిత్రలో ప్రాచుర్యం పొందిన మినీకవిత, హైకూ, నానీల ప్రక్రియలను స్థూలంగా తెలుసుకుందాం. 1970వ దశకం నుండి మినీకవిత వెలుగులోకి వచ్చింది.

పదీపంక్తులు మించకుండా సంక్షిప్తంగా సూటిగా కొసమెరుపుతో చెప్పగలగడం మినీకవిత ప్రధాన లక్షణం. మినీకవితలో ధ్వని, వ్యంగ్యం ప్రాధాన్యం వహిస్తాయి. మినీకవితలపై 1977లో నండూరి రామమోహనరావు మొదలుపెట్టిన చర్చ మినీకవిత్వోద్యమంగా మారింది. అలిశెట్టి ప్రభాకర్ ‘సిటీలైఫ్’ శీర్షికతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన మినీకవితలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.

‘మినీకవిత ఆయుష్షు మెరుపంత, కాని అది ప్రసరిస్తుంది కాలమంత’ అని డా॥ సి. నారాయణ రెడ్డి మినీకవితా ప్రక్రియను నిర్వచనాత్మకంగా ప్రశంసించాడు. జపాన్ కవి బషో సృష్టించిన కవితా ప్రక్రియ ‘హైకూ’. హైకూలో మూడుపాదాలు ఉంటాయి. మొదటిపాదంలో ఐదు, రెండోపాదంలో ఏడు, మూడోపాదంలో ఐదు అక్షరాల నియమంతో మొత్తం పదిహేడు అక్షరాలతో హైకూ కవిత రూపొందింది.

హైకూ జైన, బౌద్ధ తాత్త్వికతను, ప్రకృతి సౌందర్యాన్ని, మార్మిక అంశాలను ధ్యాన ఛాయలతో ఆవిష్కరిస్తుంది. తెలుగులో హైకూ ప్రక్రియను గాలి నాసరరెడ్డి రేఖామాత్రంగా పరిచయం చేసాడు. ఇస్మాయిల్ హైకూ ప్రక్రియను విస్తృత పరిచాడు. తెలుగులో పదిహేడు అక్షరాల నియమం పాటించకుండా మూడు పొడుగు పాదాలతో హైకూలు రాసినవారే ఎక్కువ.

నానీల ప్రక్రియ రూపకర్త డా॥ ఎన్. గోపి. 1997లో వార్త దినపత్రిక ఎడిట్ పేజీలో నానీలు తొలిసారిగా సీరియల్గా వెలువడినాయి. నానీలు అంటే ‘చిన్నపిల్లలు’, ‘చిట్టి పద్యాలు అని అర్థం. నావీ, నీవీ వెరసి మన భావాల సమాహారమే నానీలు, నాలుగు పాదాల్లో ఇరవై అక్షరాలకు తగ్గకుండా, ఇరవై ఐదు అక్షరాలకు మించకుండా నానీ నడుస్తుంది. ఈ నాలుగు పాదాల నానీలో మొదటి, రెండు పాదాల్లో ఒక భావాంశం,

చివరి రెండుపాదాల్లో మరొక భావాంశం ఉంటాయి. మొదటి దానికి రెండోది సమర్థకంగా ఉంటుంది. కొన్ని వ్యాఖ్యానా త్మకం గాను, వ్యంగ్యాత్మకంగాను ఉంటాయి. ఇప్పటివరకు నానీలను ప్రముఖ, వర్ధమాన కవులు రాయడం విశేషం. ఈ ఇరవైమూడు సంవత్సరాల్లో నానీలు మూడువందల యాభై సంపుటాలు రాగా, వందలాది కవులు నానీలు రాయడం నానీ ప్రక్రియకున్న శక్తికి, ఆదరణకు నిదర్శనం. భారతీయ సాహిత్య చరిత్రలో లఘు ప్రక్రియను అనుసరిస్తూ ఇన్ని గ్రంథాలు వెలువడడం అద్భుతమైన విషయం .

ప్రశ్నలు :

ప్రశ్న 1.
‘సిటీ లైఫ్’ పేరుతో మినీకవితల్ని రాసిన కవి ఎవరు ?
జవాబు:
అలిశెట్టి ప్రభాకర్

ప్రశ్న 2.
మినీ కవితను నిర్వచనాత్మకంగా ప్రశంసించిన కవి ఎవరు ?
జవాబు:
డా॥ సి. నారాయణ రెడ్డి

ప్రశ్న 3.
హైకూలోని పాదాలు, అక్షరాల నియమాలను తెలుపండి.
జవాబు:
హైకూలో మూడు పాదాలు ఉంటాయి. మొదటిపాదంలో ఐదు, రెండోపాదంలో ఏడు, మూడో పాదంలో ఐదు అక్షరాల నియమంతో మొత్తం పదిహేడు అక్షరాలతో హైకూ కవిత రూపొందింది.

ప్రశ్న 4.
నానీల్లోని పాదాలు, అక్షరాల నియమాలను వివరించండి.
జవాబు:
నానీలో నాలుగు పాదాలు ఉంటాయి. నాలుగు పాదాల్లో ఇరవై అక్షరాలకు తగ్గకుండా, ఇరవై ఐదు అక్షరాలకు మించకుండా నానీ నడుస్తుంది.

ప్రశ్న 5.
నానీలు తొలిసారిగా ఎప్పుడు, ఎక్కడ ప్రచురితమైనాయి ?
జవాబు:
1977లో వార్తా దినపత్రిక ఎడిట్ పేజీలో, సీరియల్గా ప్రచురితమైనాయి.

Leave a Comment