TS Inter 1st Year Telugu Model Paper Set 2 with Solutions

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers Set 2 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Model Paper Set 2 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
ఎప్పటికిని ……….. చెదరిపోతున్నాదయా !
జవాబు:
ఎప్పటికిని ముప్పులేదని
మెప్పగను మురిసేరయా!
చెప్పకను కనురెప్పపాటున చెదరిపోతున్నాదయా!

భావం : సంతోషంగా ఉన్నంతకాలం ఏ బాధలు బందీలు లేనంతకాలం మనకేం ప్రమాదం లేదని భావిస్తున్నాం. ఒకసారిగా కనురెప్పపాటున ఈ దేహాన్ని వదలివేయవలసి వస్తుందని ఇందలి భావం.

ప్రశ్న 2.
బాంబులలో బలం ………. దుమికే శక్తి ఉంది
జవాబు:
బాంబులలో బలం చచ్చి
పాములలో విషం చచ్చి
ప్రేమములో బలం హెచ్చి
స్నేహములో శక్తి హెచ్చి
చిన్నపాటి అంకుశమున
గున్నయేనుగును వంచే
కొత్తరకం పద్ధతికను
గొన్నానండో రండో!
భరతభూమి నేర్చినదో
ప్రజాకోటి నేర్పినదో నిజం ఏమిటోగాని
వట్టి చేతితో శత్రువు
పై దుమికే శక్తి ఉంది.

భావం : మారణాయుధాలలో బలం నశించి పాములలో విషం పోయి, ప్రేమ భావంలో బలం పెరిగి స్నేహానికున్న శక్తి పెరిగి చిన్న పాటి అంకుశముతో గున్న ఏనుగును దారికి తెచ్చుకునే కొత్త పద్ధతిని కనుగొన్నాను. నా భారతభూమి నేర్చినదో, ప్రజాసమూహాలు నేర్పాయో వట్టి చేతులతో అహింస భావనతో శత్రువుపై దూకే శక్తి
నాకు లభించింది.

TS Inter 1st Year Telugu Model Paper Set 2 with Solutions

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
‘మహైక’ కవితలో కవి ఆశయాన్ని విశ్లేషించండి ?
జవాబు:
‘మహైక’ అను పాఠ్యభాగం కవిరాజుమూర్తి చే రచించబడిన ‘మహైక’ దీర్ఘ కవిత నుండి గ్రహించబడింది. ఈ కవితలో అభ్యుదయ భావాలే కాదు. ఆధునికతను అడుగడుగునా కవి చూపించాడు. సంక్షిప్తత సాంద్రత ఈ రచనా ప్రధాన లక్షణం.

‘మహైక’ దీర్ఘకవిత సామాన్య మానవుడు, కవి,కార్మికుడు పతితల పాత్రల పరస్పర సంభాషణలతో నడుస్తుంది. నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పులతో నివేదించటం ఈ రచనలోని విశేషం. ఈ రచనలోని ప్రధానాంశం. సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఓదారుస్తూ మనిషి తనపై తాను విశ్వాసాన్ని కోల్పోకుండా ఒక విముక్తిని విప్లవాత్మక ధోరణిలో చూపించాడు మూర్తి. భవిష్యత్తుపై ఆశలను పెంచుతూ, మానవీయ విలువల ప్రాధాన్యతను ఈ కవిత ద్వారా తెలియచేశాడు.

మనిషి శ్రమిస్తేనే జీవితంలో విజయాలను అందుకోగలడు. ఐకమత్యంతో మెలగితేనే అభివృద్ధి సాధించగలుగుతాడు.

“చరిత్రలు మన ఉనికికి కావు ప్రమాణం
ధరిత్రిని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం” అంటాడు.

రంగులు, వర్ణాలు మానవులను విడదీయకూడదు. ప్రతి ఒక్కరూ చేయీ, చేయీ కలిపి నడిస్తేనే విజయం అన్నాడు. మనిషి ఎప్పుడూ సోమరి పోతుగా మారకూడదు. నిత్య చైతన్యంతో బతకాలి.
“మనలో మన చీలిక
మన పతనానికి ఏలిక
మలోమన చీలిక
మత్యుదేవతకు నాలిక”
కాబట్టి నూతన భావాలతో ఐకమత్యంగా జీవించి జగత్తును శాసిద్ధాం అఅని ‘మహైక’ కవిత ద్వారా మూర్తి తన ఆశయాలను వివరించాడు.

ప్రశ్న 2.
శ్రీకృష్ణుడు కుచేలుడిని ఎలా గౌరవించాడో వివరించండి.
జవాబు:
కుచేలుడును, శ్రీకృష్ణుడును బాల్య స్నేహితులు. నిరంతర దరిద్ర పీడితుడైన కుచేలుడు భార్య ఆప్తమైన ఉపదేశముచే శ్రీకృష్ణుని దర్శించుటకై ద్వారకానగరమునకు బయలుదేరెను. కక్ష్యాంతరములు దాటి మణిమయ సౌధములో – అంతఃపురములో హంసతూలికా తల్పముపై కూర్చుండి ప్రియురాలితో కలసి వినోద క్రీడలలో మునిగియున్న శ్రీకృష్ణుని గాంచి బ్రహ్మాయనందమును పొందెను.

శ్యామల కోమలాకారుడును, ఇంద్రాది దేవతలచే స్తుతింపబడు వాడును, కౌస్తుభముడిన అలంకారముగా ధరించినవాడును, సమస్తలోకములచే ఆరాధింపబడు వాడును, పాల సముద్రము నందు విహరించువాడును ఐన శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని చూచెను. అట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు నిరంతర దారిద్ర్యము చేత పీడింపబడువాడు, బక్కచిక్కిన శరీరముతో, చినిగిపోయిన వస్త్రములతో పరిహాసమునకు స్థానమైన ఆ పేద విప్రుని గాంచి గబగబ తన పాన్పు మీది నుండి క్రిందికి దిగి, ఆదరముతో ఎదురుగా వచ్చి బాల్యమిత్రుడైన ఆ కుచేలుని కౌగిలించుకొనెను. తీసుకొని వచ్చి, తన పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. ప్రేమతో బంగారు కలశము నందలి నీటితో వాని కాళ్ళు కడిగెను. కాళ్ళు కడిగిన ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొనెను.

‘తరువాత కుచేలుని శరీరమునకు మంచి గంధము నలదెను. ప్రయాణ ప్రయాస పోవుటకై వింజామరలతో వీచెను. సువాసనా భరితమైన ధూపముల నొసగెను. మణిమయం దీపములతో ఆరతి పట్టెను. సిగలో పూలమాలలు అలంకరించెను. కర్పూర తాంబూలము నొసంగెను. గోవును దానముగా సమర్పించెను. ఈ విధముగా శ్రీకృష్ణుడు చేసిన సేవలను గాంచి, కుచేలుని శరీరము పులకించిపోయెను.

గగుర్పాటుతో ఆయన వెంట్రుకలు నిక్కపొడుచుకొనెను. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పములను స్రవించెను. అంతేకాదు శ్రీకృష్ణుని భార్యామణియగు రుక్మిణీ దేవి స్వయముగా చామరములు వీచుచుండెను. ఈ విధముగా రుక్మిణీ కృష్ణులు చేయు సపర్యలను అందుకొనుచున్న ఆ కుచేలుని భాగ్యమునకు ఆశ్చర్యపోయి అంతఃపుర కాంతలు ఇట్లు ప్రశంసించిరి.

ఈ బ్రాహ్మణుడు పూర్వ జన్మమునందు ఎటువంటి తపస్సు చేసెనో గదా ! యోగులచే ఉపాసింపబడు జగత్ప్రభువు, లక్ష్మీదేవి ప్రియుడైన శ్రీకృష్ణుని తల్పముపై కూర్చుండినాడు ఎటువంటి మునీశ్వరులైనను ఈ మహనీయమూర్తికి సాటియగునా ?

“తన భార్యమణియైన రుక్మిణీదేవి ఏమనుకొనునోయని కూడ భావింపక, యదువంశేఖరుడైన శ్రీకృష్ణుడు ఎదురుగా వెళ్ళి, ఆలింగనము కావించుకొని, వివిధములైన సేవలచే ఆయనను సంతృప్తుని కావించినాడు. ఈ బ్రాహ్మణోత్తముడెంత అదృష్టశాలియో గదా !” ఆ అంతఃపురకాంతలు కుచేలుని భాగ్యమున కచ్చెరువందినారు.

ఇట్లు కుచేలుడు కృష్ణుని దర్శించి, ఆయన అనుగ్రహమునకు పాత్రుడై, సాక్షాత్తు భగవంతుని చేతనే సేవలు చేయించుకొనినాడు. మధురమైన స్నేహమునకు కుచేలోపాఖ్యానము ఉజ్జ్వలమైన ఉదాహరణము.

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
పాల్కురికి సోమన జీవిత విశేషాలు, కవితా గుణాలను పేర్కొనండి?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మ కవిచే రచించబడిన “చైతన్యలహరి” వ్యాస సంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో పాల్కురికి సోమనాథుని జీవిత విశేషాలు, కవితా గుణాలు వివరించబడ్డాయి.

పాల్కురికి సోమన కాకతీయ చక్రవర్తులలో చివరివాడైన ప్రతాపరుద్రుని కాలంవాడు. 13వ శతాబ్ధమునకు చెందినకవి. సోమన ఓరుగంటికి సమీపంలోని జనగామ తాలూకా పాలకుర్తి గ్రామానికి చెందినవాడు. ఈ గ్రామానికి దగ్గరలో సోమేశ్వరాలయం ఉంది. ఈ దేవునిపేరే తమ కుమారునికి పెట్టుకున్నారు. సోమన తల్లిదండ్రులు శ్రియాదేవి విష్ణురామిదేవుడు. సోమనకు గురువులు నలుగురు. వీరమాహేశ్వర దీక్షనిచ్చిన గురువు. గురులింగార్యుడు. శిక్షాగురువు కట్టకూరి పోతిదేవర, జ్ఞానగురువు బెలిదేవి వేమనారాధ్యుని మనుమడు. సాహితీగురువు కరస్థలి విశ్వనాధయ్య.

సోమన వ్యక్తిత్వము, విశిష్టమైనది. వీరశైవలోకానికి మూలపురుషుడు, వీరశైవవాఙ్మయమంతా ఇతని రచనలపైనే ఆధారపడిఉన్నది. వీరశైవ మతాన్ని బసవేశ్వరుడు స్థాపించగా, పండితారాధ్యుడు ప్రచారం చేయగా, పాల్కురికి సోమనాధుడు వీరశైవసాహిత్యాన్ని సృష్టించాడు. ఇతని తరువాతి సోమనాధుని భృంగీశ్వరుని అవతారంగా భావించారు. సంస్కృత భాషను కాదని ఆంధ్రభాషను అందలం ఎక్కించాడు. వెలుగు భాష భావరూపాలలో నూతనత్వాన్ని తీసుకువచ్చాడు. బ్రాహ్మణమతానికి ధీటుగా వీరశైవమతాన్ని నిలబెట్టాలని భావించి శైవంలో శ్రుతి, స్మృతి, పురాణ, ఇతిహాస, కావ్య స్తుత్యాదులను ప్రవేశపెట్టాడు.

అనుభవసారం, రుద్రభాష్యం, బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, బసవరగడ, బసవోదాహరణలను రచించాడు. ఆయన రచనలు దేశీ ఛందస్సుకు పట్టం కట్టాయి. తెలుగుభాషలో ద్విపద ఛందస్సుకు ఆధ్యుడు పాల్కురికే! సోమనాధుడు శైవమత ప్రచారానికే సాహిత్యాన్ని సృష్టించాడు. భాష చందస్సులను గురించి సోమన
భాష:
“ఉ రుతర గద్య పద్యోక్తుల కంటె
సరనై బరగిన జాను తెనుంగు
చర్చింపగా సర్వసామాన్యమగుట
గూర్చెద ద్విపదలు గోర్కిదైవార”

అని అన్నాడు. జానుతెనుగు అంటే “లోక వ్యవహారములోని సుబోధకమైన తెనుగు అని అర్థం. ఈయన రచనలన్నీ నిత్య వ్యవహార భాషలోనే సాగాయి.
ఛందస్సు : సోమన అనుసరించిన ఛందస్సు కూడా నూతనమైంది. వృత్తపద్యాలు కొన్ని రాసినా జాతులు ఉపజాతులనే ఎంచుకున్నారు. ద్విపద ఛందస్సుకు ప్రాధాన్యమిచ్చాడు. ద్విపద ఛందస్సులోనే బసవపురాణం, పండితారాధ్య చరిత్ర అను వీరశైవమత గ్రంథాలను రచించాడు.
వర్ణన : సోమనాధుని ప్రకృతి వర్ణనలు స్వభావోక్తికి దగ్గరగా ఉంటాయి. తెల్లవారుజామున కోడికూత వర్ణనం దీనికో ఉదాహరణ. పండితారాధ్య చరిత్రలో
“తొలికోడి కనువిచ్చి నిలచి మైపెంచి
“జలజల రెక్కలు సడలించి నీలి
గ్రక్కున గాలార్చి కంఠంబు విచ్చి
ముక్కున నీకెలు చక్కొల్పి కడుపు
నిక్కించి మెడసాచి నిక్కిమిన్సూచి
కొక్కొరో కు అని కూయక మున్న………”
ఈ ద్విపద వాక్యాలలో కోడి కూతను అతి సహజ సిద్ధంగా సోమనాథుడు వర్ణించాడు. ఇలా సోమనాథుడు వీరశైవ సంప్రదాయ ప్రవర్తకునిగా, దేశీకవితా కవిగా కీర్తి నార్జించాడు.

ప్రశ్న 2.
ప్రాచీన సాహిత్యంలో జీవకారుణ్య భావాలను తెలపండి ?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవషావాదము అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన “సాహితీ నీరాజనం” అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. ఇందులో ప్రాచీన సాహిత్యంలో జీవకారుణ్య భావం చక్కగా వివరించబడింది.

జీవ కారుణ్యం అంటే సృష్టిలోని సకల జీవులపట్ల కరుణ, జాలి కలిగి ఉండటం. ఋగ్వేదంలో అన్నదానం గురించి వివరిస్తూ ఆకలితో బాధపడేరికి అన్నం పెట్టనాడు మృత ప్రాయుడని చెప్పబడింది.

రామాయణరచన జీవకారుణ్యాన్ని చెప్పడంతోనే ప్రారంభమయింది. “మానిషాద ప్రతిష్టాం”… అన్న శ్లోకం జీవకారుణ్యాన్ని చూపమని చెప్పింది. కఠిన మనస్సుగల బోయవాడు సుఖంగా కలిసి ఉన్న క్రౌంచ పక్షులలో మగపక్షిని కొట్టాడు.

ఆడపక్షి కరుణ స్వరాన్ని విన్న వాల్మీకి మనసులో కారుణ్యం చోటు చేసుకుంది. ప్రేమ భావాన్ని కరుణ భావాన్ని మానవులపైనే గాక పశుపక్ష్యాదులపైన కూడా చూపించడం భారతీయ సంస్కృతిలో కన్పించే ముఖ్యలక్షణం. దీనినే ప్రాచీన కావ్యాలు కూడా ప్రభోదించాయి. “ఆత్మవత్ సతతం పశ్యేదపికీటపిపీలికామ్” అంటే చీమ మొదలైన కీటకాలను కూడా తమలానే భావించాలి అని అష్టాంగ హృదయం చెప్తుంది.

మహాభారతంలోని దధీచి, శిబి, రంతి దేవుడు మొదలుగు కథలలో జీవకారుణ్యం గురించి వివరించబడింది. రంతిదేవుని కథలో “సత్యహంకామయే రాజ్యం అన్న శ్లోకంలో వ్యాసుడు రంతిదేవుని మనసులో ఉన్న జీవకారుణ్యాన్ని వివరించాడు. “నాకు రాజ్యము వద్దు, స్వర్గము వద్దు, మోక్షం అసలు వద్దు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తి తొలగటమే నాకు కావాలి” అంటాడు. దీనికి మించిన జీవకారుణ్యం ఏముంటుంది. ఇలా ప్రాచీనమైనన ప్రతి కావ్యంలో కూడా జీవ కారుణ్యాన్ని కవులు తెలియచేశారు.

TS Inter 1st Year Telugu Model Paper Set 2 with Solutions

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
గొల్ల రామవ్వ సంభాషల్లోని ఔన్నత్యాన్ని విశ్లేషించండి ?
జవాబు:
గొల్లరామవ్వ అను పాఠ్యభాగం మాజీ భారతదేశ ప్రధాని కీ॥శే॥ పాములపర్తి వేంకటనరసింహారావుచే రచించబడినది. శ్రీమతి సురభి వాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదనకత్వంలో వెలువడిన. “గొల్ల రామవ్వ – మరికొన్ని రచనలు” కథా సంపుటి నుండి గ్రహించబడింది. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాట కాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది.

పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక స్టేట్ కాంగ్రెస్, ‘వాలంటీరును, విప్లవకారుని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతి వృత్తం. ‘గొల్ల రామవ్వకథ. తెలంగాణ పోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్.

అదో తెలంగాణ పల్లె. అందులో గొల్ల రామవ్వ తన పదియేనేండ్ల, మనవరాలితో కలిసి ఉంటుంది. ఆమె ప్రతి సంభాషణ ఉన్నత విలువలను గలినదే! అర్థరాత్రి తనింటికి దొంగలా ప్రవేశించిన యువకుని రజోకారో పోలీసోడో అని భావించింది. “నేను పోలీసోన్ని కాను రజోకార్నుకాను” అన్నమాటలో నమ్మలేక “అబ్బా ఎంతకైనా తగుతారీ రాక్షసులు ! ఔను ముందుగా తీయని మాటలు అవి సాగకపోతే అన్యోపాయాలు – అదే కదా క్రమం అయింది. ఆ వ్యక్తి రెండు కాళ్ళు పట్టుకుని “బాంచెన్ ! చెప్పులు మోత్తా నా తలకాయైనా తీసుకో, పోర్ని మాత్రం ముట్టకు, అది నీకు చెల్లెలనుకో, నీ కాల్లు మొక్కుత! అంటుంది.

యువకుడు విప్లవకారుడని తెలుసుకుని ఉపచారాలు చేస్తుంది. ఆమె మనస్థితి కాయకల్పమైంది. “ఇదేం గతిరానీకు ! గిట్లెందుకైనవు కొడకా ! అంది. వెళ్ళిపోతానన్న యువకుని “ఆ మాపోతా ! మా పోతా… ఒక్కటే పోకడ ! చక్కంగ స్వర్గమే పోతా! హు పోయాడికో” అని నిలువరించింది.

రాజోలిగే ఉన్నవు కొడకా! నీవెందుకొచ్చెరా ఈకట్టం ? పండుపండు గొంగల్లపండు” అని అతనిపై గాఢనిద్రలోని వెళ్ళేట్లు ఓదార్చింది. మనవరాలిని పిలిచి దీపం వెలిగించి ఆ యువకుని శరీరంపై గుచ్చుకున్న ముళ్ళను తీసేయమని చెప్పింది. “మా చేత్తవులే సంసారం ! ఇక కూకోవాని పక్క, ముండ్లు తీసెయి ఉల్లుల్లుగ అయ్యో సిగ్గయితాందా వాని ముట్టుకుంటె, ఏం మానవతివి గదవే ! నీ సిగ్గు అగ్గిలబడ ! వాని పానం దీత్తవా యేం సిగ్గు సిగ్గను కుంట ! ఊ చెయ్యి చెప్పినపని. పాపం ఫీనుగోలె పడున్నడు గాదె! వాని జూత్తె జాలి పుడుతలేదె నీకు ! ఆ! గట్ల ! నొప్పించకు పాపం” అమ్మ సంభాషన తీరిది.

యువకుని లేసి “ఇగ లే కొడకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లల పిసుక్కచ్చిన గింత కడుపుల పడేసుకో! ఎన్నడన్న తాగినావు తాతా గట్క? వరి బువ్వ తినెటోనికి నీకే మెరుక? గొల్లరామి గల్కుంటే ఏమనుకున్నా? పోయేపానం మర్లుతది. చూడు మరి – కులం జెడిపోతవని భయపడుతున్నావా? నువ్వు యేకులమోడవైనా సరే – మొదలు పానం దక్కిచ్చుకో…. తాగి పారెయ్యి గటగట” అంటుంది.

రాత్రి ఇద్దరు పోలీసోల్లను మట్టుపెట్టిన అని యువకుడు అనగానే అవ్వ “ఇద్దర్నా! కాని ఇంకిద్దరు మిగిలిన్రు కొడకా! సగంపనే చేసినవు” అంటుంది. పోలీసులు ఇంట్లోకి వచ్చి యువకుని వైపు చూపిస్తూ “వాడు యెవడన్నావ్ చెప్పు! కాంగ్రెసోడాయేం”అంటే “వాడెవ్వడా? ఎవ్వడు పడితే వాడు మా పక్కల పండుటానికి మేమేం బోగమోల్ల మనుకున్నవా? నిన్నెవడన్న గట్లనె అడుగితే ఎట్లుంటది! ఈ మాటల్తోటి మనం దీసుడెందుకు పానం తియ్యరా దుండి! నా బుద్దెరిగిన కాన్నుంచి నీనై తగింతచే ఇజ్జతి మాట యెవ్వల్ల నోట్నుంచి యినలే! అంటుంది. రామవ్వ సంభాషచతురత అద్భుతమైంది అని ఈ సంభాషణ వలన తెలుస్తుంది.

ప్రశ్న 2.
‘బిచ్చగాడు కుటుంబానికి ఎదురైన కష్టాలను వివరించండి ?
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీన్చే రచించబడింది. అంపశయ్య నవీన్ అసలు పేరు దొంగరి మల్లయ్య ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది.

ప్రపంచంలో పలు రకాల దోపిడీలు మోసాలు జరుగుతుంటాయి. అందులో శ్రామికుల కార్మికుల జీవితాలలో జరిగే శ్రమదోపిడి అత్యంత భయంకరమైనది. రోజువారి కూలీ పనులు చేస్తూన్న వలన కార్మికులలో, సంచార జీవనం సాగించేవారిలో, రోజు అడుక్కుంటూ పొట్టపోసుకునే బతుకులలో ఈ శ్రమదోపిడి మానవతా విలువలకు తావులేకుండా చేస్తుంది. వారి దోపిడీకి నగ్న సత్యంగా నిలచిన కథే ఈ బిచ్చగాడి కథ. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీన మనస్తత్వానికి దోపిడీ స్వభావానికి ఇది ఒక ఉదాహరణం. ఈ కథ అమానవీయతను, నైతిక పతనాన్ని తెలియచేస్తుంది.

ఈ కథ ప్రయాణ సమయంలో విభిన్న మనస్తత్వాలు గల మానవ హృదయాలను – ఆవిష్కరిస్తుంది. రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహ వేడుకలకు అటెండయి తిరిగి వరంగల్లుకు వెళ్తున్న సందర్భంలో జరిగింది. రైలు చాల రద్దీగా ఉంది. కూర్చోటానికి జాగా ఎక్కడా కన్పించలేదు.

చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఓ సీటు మొత్తాన్ని ఒకామె బోల్డు లగేజీతో సీటు మొత్తాన్ని ఆక్రమించేసింది. ఆమె ఓ బిచ్చగత్తె: ఆమె భర్త టికెట్ తీసుకురావటానికి వెళ్ళాడు. కౌంటర్ దగ్గర చాలా రద్దీగా ఉంది. బండి కదలటానికి సిద్ధమవటంతో అతడు పరిగెత్తుకొచ్చాడు. వాడికి టికెట్ అందనేలేదు. ఎవడికో డబ్బులిచ్చి వచ్చాడు. కొందరు టికెట్ లేకపోతే టి.సి వచ్చి నానాయాగీ చేస్తాడన్నాడు.

ట్రైన్ కదలింది. టికెట్ తెస్తానన్నవాడు ఆ డబ్బులతో అటే పోయాడు. టి.సి రానే వచ్చాడు. ఆ బిచ్చగాడి పేరు బ్రహ్మయ్య. ఒరేయ్ టికెట్ తీయరా! అన్నాడు టి.సి. “అయ్యా! టికెట్ కోసమే పోయినయ్యా! ఇయ్యాళ కొత్తగూడెం టేషన్లో అంతా మందే…… టికెట్ తీసుకోమని మా అన్న కొడుకుని పంపిన.

ఆడు చెయ్యి బెడ్తుండగనే బండి కదిలింది. నేను వాణ్ణి వదిలేసి బండెక్కిన” “నోర్ముయిరా దొంగ వెధవ. ఎక్కడి వెళ్ళాలి” అన్నాడు. “నెక్కొండ” “బాంచెన్” అన్నాడువాడు. ఆ ఆడది నల్గురు పిల్లలు నీ వాళ్ళేనా” “అయ్యా మా వాళ్ళే’ అయితే 56 రూపాయలు తియ్” అతడు వెంటనే టి.సి రెండు కాళ్ళు పట్టుకున్నాడు.

“లే గాడిద కొడకా! నా కాళ్ళెందుకుకురా పట్టుకుంటావ్” పైసలిస్తవా పోలీసోళ్ళకు పట్టించనా అన్నాడు టి.సి “నన్ను కోసినా నా దగ్గర పైసల్లేవు బాంచనా” ఈ భాగోతం అంతా బండిలో ఉన్న వారికి వినోదంగా మారింది” వరేయ్ బ్రహ్మయ్య! డబ్బు తియ్యరా” అన్నాడు టి.సి “అయ్యా! నన్ను కోసినా నా వద్దపైసాలేదయ్యా! అంటూ బ్రహ్మయ్య మళ్ళీ కాళ్ళు పట్టుకోబోయాడు. “నన్నుంటుకున్నావంటే చంపేస్తా… బద్మాష్ లుచ్ఛ నీ దగ్గర డబ్బులేదురా. ఆరుమాలు తీయ్” అన్నాడు టి.సి “ఈ రూమాల్నేముందు బాంచెన్….మీ అసుంటి ఓ దొర దగ్గర అడుక్కున్నా నన్ను నమ్మండ్రి బాంచెన్ అని . మళ్ళీ కాళ్ళు పట్టుకోబోయాడు.

ఇద్దరి మధ్య పెనుగులాటలో రుమాలు చిరిగి పోయింది. దాన్లో నుండి 30 రూ॥ బయట పడ్డాయి. ఆ ముప్పై ఇదేనా అన్నాడు టి.సి “ఛట్ దొంగ రాస్కెల్. ఇంకా మోసం చేద్దామని చూస్తావురా! తీయ్ మిగతా 26రూ|| అన్నాడు. “మమ్ముల కొట్టుండి. సంపుండ్రి. ఈ బండ్ల నుంచి బయటకు ఇసిరి కొటుండ్రి మా వద్దిక పైసలే వ్ అంది బ్రహ్మయ్య భార్య.

“నోర్మూయ్యలే దొంగముండ. పైసల్ లేవంటే ఫైనెవ్వడు కడ్డడు. నీ నడుంకున్న ఆ సంచితియ్ అన్నాడు టి.సి. దాంట్లో ముంది నిన్న మొన్న అడుక్కున్న డబ్బులు. నిండు చూలాలు. నలుగురు పిల్లలలో ఉన్న ఆమెను చూస్తే ఎవరికి జాలి కలుగలేదు”ఈ పూటకు నూక మందమన్నా ఉంచుండ్రయ్యా! నిన్న మొన్న ఏమిటి నేను ఏమిటినేను. నా పోరగాండ్లను సూడుండ్రి ఆకలితో నకనక లాడిపోతండ్రు అని ఎంత కాళ్ళు పట్టుకున్నా ప్రతమ్నాయం లేకపోయింది. ఆ సంచిలోని డబ్బంతా క్రిందపోసి 26 రూ!! తీసుకుని ఒక రిసీట్ బుక్ తీసి ఏదో రాశాడు. నా దృష్టి ఆ కాగితం పై 22 రూ||లు డోర్నక్ టు నెక్కొండ” అని పడింది. ఇంతకూ ఎవరు పెద్ద బిచ్చగాడో మీరే అర్ధం చేసుకోండి. అని కవికథలు ముగించాడు.

ప్రశ్న 3.
స్నేహలతాదేవి ఆత్మ విశ్వాసాన్ని వివరించండి ?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగం డా॥ ముదిగంటి సుజాతారెడ్డిచే రచించ బడింది. ఆమె కథల సంపుటి “విసుర్రాయి”లోనికి ఈ కథ. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి, ఆర్థిక స్వావలంబనకు చాలా ప్రాధాన్యం ఉందన్న వాస్తవాన్ని వివరిస్తుంది. తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎంత బాధ్యతాయుతంగా ఆలోచించాలన్న మానవీయ విలువలను ఆధర్మాలను తెలుపుతుంది. యువత ప్రతి చిన్న విషయానికి అసంతృప్తికి గురి అవుతున్నారని, చిన్న ఓటమికే కృంగిపోయే మనస్తత్వంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిరసిస్తుంది.

స్నేహలతాదేవికి తనపై తనకు అంచంచల ఆత్మ విశ్వాసం ఉంది. ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలు తనకు నేర్పాయి. తన తనతల్లిదండ్రులకు ఒక్కగా నొక్క కుమార్తె. తల్లిదండ్రులు చక్కగా విద్యాబుద్ధులు నేర్పించారు. వివాహ విషయంలో తన తల్లిదండ్రుల బాధే స్నేహలతను కలిచివేసింది.

స్నేహలతకు వివాహం కావడం లేదని తల్లిదండ్రులు చింతిస్తున్నారు. వారి బాధను చూడలేక వారిని ఓదార్చుతూ తనపై తాను విశ్వాసాన్ని పెంచుకుంది స్నేహలత. పెళ్ళి చూపుల మీద పెళ్ళిచూపులు జరిగాయి. ఇది ఆడదానికి జరిగే అవమానాలలో ఒకటి. నాకేం తక్కువ? చదువుకుంది. సంస్కారం ఉంది.

మరీ అంత అందంగా లేకపోయినా వికారంగా మాత్రం లేను. నన్ను చూడటానికి వచ్చేవారికి వీటితో అస్సలు పనేలేదు. నేనిచ్చే కట్నంపైనే వారి దృష్టి. నేను ఇచ్చే కట్నాన్ని ఆశించి ఎవరూ నన్ను వివాహం చేసుకుంటానని అనటం లేదు. ఎందుకంటే అది వారికి నచ్చలేదు. ఈ దేశంలో స్వయం శక్తిపై విశ్వాసం లేనివాళ్ళు పెరిగిపోతున్నారు. పరాయిధనానికి ఆశకాదు అత్యాశ పడేవారే అధికమవుతున్నారు.

నా గురించి మీరు ఇల్లు అమ్ముకుని బజారును పడవలసిన పనిలేదు. నాకు చదువుంది. డిగ్రీ వుంది. ఆ డిగ్రీలో ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. భవిష్యత్తులో నా జీవన పథంలో నేనంటే ఇష్టపడేవాడు. వ్యక్తిగా నన్ను గౌరవించే వాడు డబ్బుకోసం కాక, వరకట్నం కోసం కాక నా సాహచర్యం కోసం నా వ్యక్తిత్వం చూసి నన్ను పెళ్ళాడే వాడు దొరికినపుడే వివాహం చేసుకుంటాను. అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. నా గురించి మీరు భయపడనవసరం లేదు. నన్ను నేను కాపాడుకోగలను. నాకా శక్తిని ఈ సమాజం ఇచ్చింది.

ఎక్కడున్నా నేను జాగ్రత్తగా క్షేమంగా ఉంటాను. ఉద్యోగం సాధించగానే మీకు ఉత్తరం రాస్తాను. మీరు కూడా నా దగ్గరికే వచ్చి ఉండవచ్చు. మీరు నా దగ్గర ఉండటానికి ఇష్టపడే వాడు దొరికినప్పుడే పెళ్ళి చేసుకుంటాను. ఈ సమాజంలో స్త్రీ శక్తి మేల్కొవాలి. ఎవరికి తగిన స్థాయిలో వారు ఆర్థిక స్వాలంబనను పొందటానికి కృషిచేసి వరకట్నం వంటి దురాచారాలను ఎదుర్కోవాలని కోరుకుంటున్నాని స్నేహలతాదేవి తనతోపాటు స్త్రీ జాతి కంతటికి ఆత్మ విశ్వాసాన్ని కల్గించింది.

ప్రశ్న 4.
ఈ కథ ఆధారంగా హిందూ ముస్లిం మతస్థుల మధ్య నెలకొన్న ఆత్మీయ అనుబంధాలను చర్చించండి ?
జవాబు:
‘ఇన్సానియత్’ అను పాఠ్యభాగం డా. దిలావర్ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఆత్మీయ మానవ సంబంధాలను తెలియ చేస్తుంది. కులాలు మతాలు అనే భేదం లేకుండా ప్రజలందరి మధ్య నెలకొన్న స్నేహాలు, వరుసలు, పరస్పర సహకారాలు, సహజీవన సంస్కృతిని తెలియపరస్తుంది.

కాలక్రమేణ నగరాల్లోని స్వార్థం, కులాభిమానం, మతోన్మాదం వికృతరూపం దాల్చి గ్రామీణ ప్రాంతాలలోకి వ్యాపించడం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో గ్రామీణ హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఉన్నతమైన మానవీయ అనుబంధాలను ఈ కథ వివరిస్తుంది. వర్తమాన సమాజంలో లుప్తమవుతున్న ఆదర్శాలను విలువలను తెలుపుతూ కులమత దురభిమానాలపై ఆత్మవిమర్శ చేసుకోమని తెలియచేస్తుంది.

పూర్వం గ్రామాలలోని ప్రజలంతా కుల మత భేదం లేకుండా అందరూ అంద న్న అత్తా, అక్కడ, బావా, అత్తా,మద్దీ, మామ అని పిలుచుకునేవారు. వారి మఖ్య ప్రేమాభిమానాలకు కుల మతాలు అడ్డు వచ్చేవికావు. ఎంతపెద్ద కులంలో పుట్టినా వారిలో కూడా మిగిలిన వారి పట్ల ఆత్మీయానురాగాలు ఉండేవి. ఒకరినొకరు చక్కగా గౌరవించుకునేవారు. దీనికి నిదర్శనం, ఈ కథలోని రాధమ్మత్త, సోందుబాబుల మధ్య జరిగిన సంభాషణలే!

ముస్లిం అయిన సోందుబాబు హిందువైన రాధమ్మను అత్తమ్మా అని పిలవడం ఇందుకు ఒక ఉదాహరణ.

“ఏం! రాధత్తమ్మా! అంత మంచేనా!” అని సోంధుబాబు అంటే
“బానే ఉన్న పోరగా! మీరంతా మంచేనా” అని రాధమ్మ అనటంలో వారి మధ్య ఉన్న ఆప్యాయత అను రాగాలు మనకు అర్థమౌతాయి.

అలాగే పాతిమా రాంరెడ్డిని “మర్టీ! సీమకు సుత అపకారం చెయ్యని నా కొడుకుని చూసి ఓర్వలేక అల్లా తీస్కపోతన్నడు” అనడం ముస్లిం హిందూ కుటుంబాల మధ్య ఉన్న ఆత్మీయతా, అనుబంధాలకు ఒక నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది”.

“మర్దీ! కడుపుకోత ఎట్ల అగులు బుగులుగ ఉంటదో అనుబగిత్తన్నా! నా కొడుకును మట్టిల గల్పుకుంటున్నా. నా కొడుకు పానం వంటిదే నీ కొడుకుపానం” నా కొడుకు హయత్ సుత బోస్కొని నీ కొడుకు నిండు నూరేళ్ళు బత్కాలే” అనటం “మనిషికి కావల్సింది. ఇన్సానియత్ గాని కులము మతము కాదన్న మానవతను, ఆత్మీయ అనుబంధాలను తెలియచెప్తుంది.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6).

ప్రశ్న 1.
కీలువదలిన బొమ్మవలెను నేలబడి పోతున్నది.
జవాబు:
పరిచయం : ఈ వాక్యము దున్న ఇద్దాసుచే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు అను గ్రంథం నుండి గ్రహించబడినది.
భావము : భార్యా, బిడ్డలు, ధనధాన్యాలు నావి నావారున భ్రమలో మానవులు ఉంటున్నారు. ఆ భ్రమ సత్యంకాదు. ఆ భ్రమలో ఉండగనే కీలువదలిన బొమ్మలాగా రాలిపోతున్నామని ఇందలి భావం.

ప్రశ్న 2.
వట్టిచేతితో శత్రువుపై దుమికే శక్తి ఉంది.
జవాబు:
పరిచయము : ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “నాపేరు ప్రజాకోటి” అని పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. “పునర్నవం” అన్న కవితాఖండికలోనిది.
సందర్భము : కవి “అహింసా” శక్తిని గురించి వివరించే సందర్భములోనిది.
భావము : చిన్నపాటి అంకుశంతో గున్నఏనుగు బంధించే కొత్త శక్తిని కనుగొన్నాను. అలగే వట్టి చేతులతో ‘అహింస’నే ఆయుధంగా చేసుకుని శత్రువుపై దూకే శక్తిని తెలుసుకున్నాని ఇందలి భావం.

ప్రశ్న 3.
నారాజ్యభోగంబులు నీవు ననుభవింపనర్హుండ
జవాబు:
పరిచయం : ఈ వాక్యం నన్నయభట్టు చే రచింపబడిన శ్రీమదాంధ్ర మహా భారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.
సందర్భం: ఎక్కడ నుంచి వస్తున్నారు అని భీష్ముడు అడిగినప్పుడు ద్రోణుడు తన వఋత్తాంతాన్ని తెలియచేసిన సందర్భంలోనిది
భావం : నా పేరు ద్రోణుడు, భరద్వాజుని కుమారుడను. అగ్నివేశ్యుడనే గొప్ప మునిశ్రేష్ఠుని దగ్గర బ్రహ్మచర్య దశలో వేదాద్యయనం చేసి, ధనుర్వేదం నేర్చుకుంటున్న కాలంలో, పాంచాలరాజైన పృషతుని కుమారుడు ద్రుపదుడనేవాడు నాకు ప్రియమిత్రుడై అన్ని విద్యలూ గురువు దగ్గర నేర్చి, నేను పాంచాల దేశానికి రాజైనప్పుడు నీవు నా దగ్గరికి రావాలి సుమా! నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించడానికి అర్హుడవని నన్ను ప్రార్ధించి వెళ్ళాడు. పృషతుని తర్వాత ద్రుపదుడు ఆ దేశానికి రాజయ్యాడు నేను తండ్రి ఆజ్ఞచేత కృషిని వివాహమాడి, తేజశ్శాలి అయిన బాలుడు అశ్వత్థామను కొడుకుగా పొంది, ధనం లేమి చేత సంసారాన్ని భరించలేని వాడై ఉండి కూడా.

ప్రశ్న 4.
గర్వము మానుటొప్పగున్
జవాబు:
పరిచయం : ఈ వాక్యము ఏనుగు లక్ష్మణకవిచే రచింపబడిన సుభాషిత రత్నావళి నుండి గ్రహించిన పద్యంలోనిది.
సందర్భము : విద్యను ఆర్జించిన పండితులతో ఎలా ప్రవర్తించాలో రాజులకు, డబ్బున్నవారికి కవి తెలియచేస్తున్న సందర్భంలోనిది.
భావము : విద్యాధనాన్ని దొంగలు హరించలేరు. అది ఎల్లప్పుడూ సుఖమునే కలుగ జేయును. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చిననూ మరింత వృద్ధి చెందును. ప్రళయ కాలంలో కూడా నశించదు. ఇట్టి విద్యాధనము గలవారితో సామాన్యధనము గల రాజులు తమ గర్వాన్ని తగ్గించుకుని ఉండుట ఉత్తమము.

VI. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఆగం కాకుండా జీవించాలంటే ఏమీ చేయాలి ? (2 × 3 = 6)
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగము ‘దున్న ఇద్దాసు’ చేరచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు” గ్రంథం నుండి గ్రహించబడింది.

‘ఓనామః శ్రీవాయుః’ అన్న అక్షరాలు రాస్తున్నాం. నేర్చుకుంటున్నాం, మన జీవిత ఆనవాళ్ళను మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. మన జీవితం యొక్క ఆనవాళ్ళను తెలుసుకోలేకపోవటం వలననే అల్లరిపాలు అవుతున్నాం. మంచి చెడులను, పూర్వాపరాలను, మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేక పోవటం వలననే మనం ఆగమవుతున్నామని ఇద్దాసు ‘అచలం’ అను తత్వాల ద్వారా మనకు తెలియచేశాడు.

TS Inter 1st Year Telugu Model Paper Set 2 with Solutions

ప్రశ్న 2.
యుద్ధానికి సంబంధించి దాశరథి అభిప్రాయాలను తెలపండి ?
జవాబు:
‘నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులుచే రచించబడిన “పునర్నవం” కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన దాశరథి తాడిత పీడితుల కోసం తన కవితను ‘మైక్’గా అమర్చాడు. ఒకరినొకరు ద్వేషించటం తగదని రాక్షస స్వభావం గల వారితో కూడా మైత్రిని చేయాలని అంటారు దాశరథి. ఆయన దృష్టిలో యుద్ధం రాక్షసక్రీడ. నవ సమాజానికి పనికిరానిది.
“అందరికంటే ముందే
అణ్వస్త్రము గొనిపోయి
అఖాతాన పడవేసితి
సుఖపడగా ప్రజాకోటి”
అని అణ్వస్త్ర ప్రయోగాన్ని నిరసించాడు.
కత్తి పట్టి గెలిచినట్టి
ఘనుడగు వీరుండెవ్వడు
మెత్తని హృదయం దాటికి
తుత్తునియలు కానిదెవరు?
ఘర్షణలో ఏనాటికి
హర్షం లభియింపబోదు”
అని నవసమాజానికి యుద్ధం పనికిరాదని మెత్తని హృదయంతో అహింసా యుతంగా విజయాలను పొందాలని దాశరథి భావన.

ప్రశ్న 3.
కల్పిత పక్షిని ఛేదించే సమయంలో కురుకుమారుల ప్రతిభను తెలుండి ?
జవాబు:
ఆ కురుకుమారుల విలువిద్యా నైపుణ్యాన్ని తెలిసికొనగోరి ఒకనాడు ద్రోణుడు భాసమనే పక్షిని రూపొందించి, ఒక చెట్టు కొమ్మ చివరన కట్టి దానిని అందరికీ చూపి నేను చెప్పినప్పుడు, మీమీ ధనువులు ఎక్కుపెట్టి, ఆ పక్షితలను తెగకొట్టండి. నేను ఒక్కొక్కరినే ఆజ్ఞాపిస్తాను అని, ముందుగా ధర్మరాజును పిలిచి ఈ చెట్టు కొమ్మ కొసన ఉండే పక్షిని చక్కగా చూచి, నేను చెప్పినప్పుడు బాణంతో కొట్టుము అనగా అతడు సర్ అని గురువు మాట ప్రకారం సిద్ధంగా ఉండగా, ద్రోణుడు ఇట్లా అన్నాడు.

ఓ ధర్మరాజా! చెట్టుకొమ్మ చివర ఉన్న పక్షితలను స్పష్టంగా చూచావా అని అడుగగా, చక్కగా చూచానని అతడు చెప్పగా, మరల ద్రోణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. జనులచేత పొగడబడే ఓ ధర్మరాజా! ఆ మానును, నన్ను, నీ తమ్ముళ్ళను చూశావా? అని ద్రోణుడు అడుగగానే పుణ్యాత్మ! చెట్టు మీదనున్న ఆ పక్షితో పాటు అన్నిటినీ చూచానని ధర్మరాజు అన్నాడు.

అనగా విని ద్రోణుడు ధర్మరాజును మందలించి నీ దృష్టి చెదిరింది, నీవుదానిని కొట్టలేవు. పక్కకు తప్పుకొమ్ము అన్నాడు. అదే విధంగా దుర్యోధనుడు మొదలైన కౌరవులను, భీమునకుల, సహదేవులను వివిధ దేశాల నుండి వచ్చిన రాకుమారలను వరుసగా అడుగగా వాళ్ళంతా ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చారు. ద్రోణుడు అందరినీ మందలించి తరువాత అర్జునుని పిలిచి వాళ్ళను అడిగినట్లే అడుగగా అతడిట్లా అన్నాడు. పక్షితలను చక్కగా చూచాను. ఇంకేదీ నాకు కనిపించడం లేదు అని అర్జునుని అనగా ద్రోణుడు గురిచూసి కొట్టుము అని సూక్ష్మదృష్టిగల అర్జునుని ఆజ్ఞాపించాడు. గురువు చెప్పిన తర్వాత అర్జునుడు బాణాన్ని వదిలాడు. ఆ పక్షితల తత్క్షణమే తెగి చెట్టుకొమ్మ నుండి నేలమీద పడింది.

ప్రశ్న 4.
శ్రీకృష్ణుడిని దర్శించేందుకు కుచేలుడు భార్యకు చెప్పిన కారణమేమిటి ?
జవాబు:
శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుట మిక్కిలి శుభదాయకమే. కాని ఆయనకు తీసుకొని వెళ్లుటకై మన దగ్గర ఏదైన కానుక ఉన్నదా ?” అని కుచేలుడు భార్యనడిగెను. అప్పుడు కుచేలుని భార్య ‘సరే’ యని కొన్ని అటుకులను భర్త యొక్క చినిగిన వస్త్రము చివర ముడివేసి ప్రయాణమునకు సిద్ధము చేసినది – శ్రీకృష్ణ సందర్శనోత్సాహంతో కుచేలుడు ద్వారకకు బయలుదేరెను. నేనెట్లు ద్వారకా నగరమును చేరగలను ? దివ్వ దీప్తితో ప్రకాశించు అంతఃపురము నేనెట్టు ప్రవేశింపగలను ? సర్వేశ్వరుడైన ఆ కృష్ణుని ఎట్లు దర్శింపగలను ? నీవెవ్వడవు ? ఎక్కడినుండి, ఎందులకు వచ్చితివి ? అని ప్రశ్నించి ద్వారపాలకులు అడ్డు పెట్టినచో – వారికేమైన బహుమానమిచ్చి వెళ్ళవచ్చునన్నచో, నేను డబ్బు లేనివాడును. అయినను ఆయన దయ – నా భాగ్యము. ఆలోచింపగా మరేమి యున్నది ? ఐనను బాలమిత్రుడైన ఆ కృష్ణుడు నన్నేల అశ్రద్ధ చేయును ?” అని తలచుచు కుచేలుడు ద్వారకా నగరములో, ప్రవేశించెను.

VII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
అష్టాంగ హృదయం ఏమని ప్రబోధిస్తుంది ?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం ‘అన్నపాఠ్యభాగ్యం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది.

దుఃఖితులపట్ల మానవులు ఎలా ప్రవర్తించాలో అష్టాంగ హృదయకర్త చక్కగా వివరించాడు. ఏ జీవనాధారము లేనివాణ్ణి, వ్యాధితో బాధపడుతున్నవాణ్ణి, దుఃఖంలో ఉన్నవాణ్ణి వారి వారి శక్తిని బట్టి ఆదుకోవాలని అష్టాంగ హృదయం చెప్తుంది. మానవుని సంక్షేమాన్ని, మానవ ప్రగతిని లక్ష్యంగా పెట్టుకుని ఏ జీవనాధారం లేనివారికి వ్యాధిగ్రస్తులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అదే మానవత్వం ‘ అనిపించుకుంటుందని అష్టాంగ హృదయంబోధించింది.

ప్రశ్న 2.
బతుకమ్మను పేర్చే విధానాన్ని వర్ణించండి ?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.

తెలంగాణా జానపదస్త్రీల ఆచార సాంప్రదాయాలతో ఆనందోత్సాహాలతో వెల్లివిరిసేది- బతుకమ్మ పండుగ అదే పూలపండుగ. బతుకమ్మ పండుగనాటికి ప్రకృతి పూలమయంగా ఉంటుంది. బతుకమ్మను ఆ పూలతో అందంగా అలంకరిస్తారు. ముందుగా ఇత్తడి పళ్ళెంలో మొదట గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలనుపరుస్తారు. పొడవైన గునుగు పూలను చివర కత్తిరించి వాటికి పలురంగులు పూస్తారు. ఆ తరువాత ముత్యాల పువ్వులను గుత్తులు గుత్తులుగా అమరుస్తారు. ఇళ్ళలో ఉండే గన్నేరు, రుద్రాక్ష, గోరింట, బీర పూలను గూడా గుండ్రంగా శిఖరాలలో పేరుస్తారు. శిఖరంపై గుమ్మడి పూలను అలంకరిస్తారు.

పసుపుతో త్రికోణాకృతిలో బతుకమ్మను పెట్టడంతో బతుకమ్మను పేర్చే కార్యక్రమం పూర్తి అవుతుంది. బతుకమ్మ ప్రక్కనే పిల్ల బతుకమ్మలను ఉంచుతారు. బతుకమ్మలను కూరాటికుండ వద్దగాని, దేవుడి వద్దగాని పెట్టి నువ్వులు, సెనగపప్పు, పెసరపప్పు, పొడులతో చద్దుల పులిహోర దద్యోన్నంను నైవేద్యంగా అమర్చుతారు. పూలు ఎక్కువగా లభిస్తే మనిషంత ఎత్తు బతుకమ్మలను అమర్చుతారు. త్రికోణం స్త్రీకి సంకేతం. త్రికోణాకారంలో పసుపు ముద్దనుంచటం గౌరీదేవిని ప్రతిష్టించటంగా భావిస్తారు.

ప్రశ్న 3.
‘తాత జాగీరు’ జాతీయంలోని చారిత్రక విశేషాలను తెలపండి ?
జవాబు:
కష్టార్జితం కాని సంపద, అనువంశికంగా సంక్రమించిన ఆస్తి, నైజాం ప్రభువులు తమ రాజరికాన్ని కాపాడుకోవటానికి జీతం లేని కొలువులు ఎన్నో ఏర్పాటు చేశారు. పటీలు, మావిపటీలు, పట్వారీ, కొత్వాలి వంటివి అనువంశికంగా సంక్రమించేవి. ఈ పనికి జీతం లేకపోయినా ప్రజలను వీళ్ళు ఎంత దోచుకున్నా తమ సొమ్ము ముట్టచెపితే చాలు. ఆ విధంగా జమీందారులు, జాగీరుదారులు, ముక్తాదారులు, దేశాయిలు, సర్దేశాయిలుండేవారు. జమీందారుకు కొన్ని గ్రామాల్లో వేలాది ఎకరాల భూములు ఉండేవి. ముక్తాదారులంటే ఆ గ్రామమంతా ఆయనదే! ప్రజల వద్ద ఎంత దోచుకున్నా ప్రభుత్వం పట్టించుకోదు. కప్పం చెల్లిస్తే చాలు. తాత గారి జాగీరును మనమడు అనుభవిస్తున్నట్లు” ఇదేమన్నా నీ తాతగారి జాగీరనుకున్నావా” అన్న జాతీయాలు ప్రయోగించడం జరుగుతుంది

ప్రశ్న 4.
‘గోల్కొండ’ పత్రిక అభివృద్ధికి రాజాబహద్దూర్ ఎలా తోడ్పడ్డారు ?
జవాబు:
రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది.
సురవరం ప్రతాపరెడ్డి గారు 1926లో తెలంగాణలో గోల్కొండ పత్రికను స్థాపించారు. అప్పటి వరకు తెలంగాణలో పత్రికలకు పాత్రినిద్యంలేదు. ఆయనే 20స||లపాటు దానికి ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. పత్రికారంగంలో ఒక నూతన ఒరవడిని గోల్కొండ పత్రిక సృష్టించింది. సురవరం వారిలో రాజా బహద్దార్ రామారెడ్డి గారికి అనుబంధం ఏర్పడింది. అది గోల్కొండ పత్రికతో వారిద్దరికి ఉన్న అనుబంధం.

గోల్కొండ పత్రిక తొలుత హైదరాబాద్ నుండి వెలువడుటకు కావలసిన ముద్రణా లయము స్థాపించటానికి యంత్రాలకు కావలసిన ధన సహాయం. రూ.7,300 రాజా రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి గారే సమకూర్చారు. గోల్కొండ పత్రిక ఒకటి తెలంగాణా నుండి రావటానికి ప్రధాన కారకుడిగా రాజాబహద్దూర్ గారు నిలిచారు.

VIII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు / రచయితలు)

ప్రశ్న 1.
నన్నయభట్టు గురించి తెలపండి?
జవాబు:
నన్నయ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి. ఉభయభాషా కావ్యరచనా శోభితుడు. ఆదికవి, శబ్దశాసనుడు అనే బిరుదులు కలిగినవాడు. రాజరాజు కోరికపై వ్యాస భారతాన్ని తెలుగులోకి అనువదించాడు. రెండున్నర పర్వముల వరకే నన్నయ్య భారతరచన సాగింది. ఆంధ్రశబ్ధ చింతామణి, ఇంద్రవిజయం, లక్షణసార వంటి ఇతర గ్రంథాలు రచించాడు.

ప్రశ్న 2.
పోతన గురించి తెలుపండి.
జవాబు:
భక్తకవిగా ప్రసిద్ధి చెందిన బమ్మెర పోతన 15వ శతాబ్దపు కవి. కేసన, లక్కమాంబ తల్లిదండ్రులు. వ్యాస భాగవతాన్ని రసరమ్యంగా తెలుగువారికి అందించాడు. పోతనకు సహజపండితుడు అనే బిరుదు ఉంది. పోతన వీరభద్ర విజయం, భోగినీ దండకం కూడా రచించాడు.

ప్రశ్న 3.
సామల సదాశివ రచనలను సంగ్రహంగా తెలుపండి ?
జవాబు:
సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలంలోని తెలుగు పల్లెలో మే .11, 1928న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు, సదాశివ విభిన్న భాషా సంస్కృతులు కళావారధి, వీరు సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ తెలుగు భాషలలో పండితుడు. వీరి తొలి రచనలలో ప్రభాతము అనే లఘు కావ్యం, సాంబశివ శతకం, నిరీక్షణము, అంబపాలి, సర్వస్య దానము, విశ్వామిత్ర మొదలగునవి ఉన్నాయి.

హిందుస్థానీ సంగీత కళాకారుల ప్రతిభపై, ‘మలయమారుతాలు. ప్రముఖుల జ్ఞాపకాలు, ఉర్దూ, భాషా కవిత్వ సౌదర్య ఉర్దూకవుల కవితా సామాగ్రి మొదలగునవి ప్రసిద్ధ గ్రంథాలు.

అన్జద్ రుబాయిలు తెలుగు అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద పురస్కారాన్ని ఇచ్చింది. వీరి ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు వీరిని గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. వీరి రచనలపై విశ్వవిద్యాలయాలలో పలు పరిశోధనలు జరిగాయి.

ప్రశ్న 4.
రావిప్రేమలత రచనలను తెలుపండి ?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం రావిప్రేమలతచే రచించబడిన, జానపదవిజ్ఞానం పరిశీలనం అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.

రావిప్రేమలత సిద్ధాంత వ్యాసం తెలుగు జానపదసాహిత్యం – పురాణగాథలు తొలిరచన. జానపద విజ్ఞానంలో స్త్రీ ప్రేమలత వ్యాససంపుటి. తెలుగు స్త్రీల ముగ్గుల పై పరిశోధన చేసి ‘తెలుగు స్త్రీల చిత్రలిపి’ అనే వైవిధ్య భరితమైన గ్రంథాన్ని రాశారు. ఇది బిరుదురాజు రామరాజు జానపదవిజ్ఞాన బహుమతిని, తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని అందుకున్నది. ఈమె రాసిన ‘వ్యాసలతిక’ తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ విమర్శ గ్రంథంగా బహుమతినందుకున్నది. డా. కురుగంటి శ్రీలక్ష్మితో కలిసి ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న వ్యాస సంపుటిని వెలువరించారు. Folk Tales of South India – Andhra Pradesh అన్న కథా సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఈమె రచనలన్నీ జానపద సాహిత్యంతోనే ముడిపడి ఉండటం ముదావహం.

IX. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి.
(పద్యభాగం నుండి)

ప్రశ్న 1.
దాశరథి తల్లిదండ్రులెవరు ?
జవాబు:
దాశరథి తల్లిదండ్రులు వేంకటమ్మ, వేంకటచార్యులు

ప్రశ్న 2.
సంస్కృత భాగవతాన్ని ఎవరు రచించారు ?
జవాబు:
వేదవ్యాసుడు.

ప్రశ్న 3.
సజ్జనుడి పలుకులు ఎలాంటివి?
జవాబు:
మంచి మాటలు

ప్రశ్న 4.
దున్న ఇద్దాసు ఏఏ కోణాల్లో కన్పిస్తాడు?
జవాబు:
తత్త్వవేత్తగా, అచలునిగా, వీరశైవతత్త్వజ్ఞానిగా పలుకోణాల్లో కన్పిస్తాడు.

ప్రశ్న 5.
మనిషి ఏవిధంగా బ్రతకాలి ?
జవాబు:
మనిషి మనిషిగా మానవత్వంతో బ్రతకాలి.

ప్రశ్న 6.
అశ్వత్థామ ఎవరి కుమారుడు?
జవాబు:
ద్రోణుడు

ప్రశ్న 7.
భక్తితో సమర్పిస్తే శ్రీకృష్ణుడు ఏం స్వీకరిస్తాడు ?
జవాబు:
ప్రీతితో దాన్ని మధురాన్నంగా భావించి ఆరగిస్తాను అన్నాడు.

ప్రశ్న 8.
దాశరథి ఏ గ్రామంలో జన్మించాడు ?
జవాబు:
వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా చిన గూడూరు గ్రామంలో జన్మించాడు.

TS Inter 1st Year Telugu Model Paper Set 2 with Solutions

X. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (5 × 1 = 5)
(గద్యభాగం నుండి)

ప్రశ్న 1.
సోమన జన్మస్థలం ఏది ?
జవాబు:
ఓరుగల్లుకు 12 మైళ్ళ దూరంలోని జనగామ తాలూకా పాలకుర్తి గ్రామం.

ప్రశ్న 2.
ఆచార్య రవ్వా శ్రీహరికి ‘మహా మహాపాధ్యాయ’ బిరుదును ప్రదానం చేసిన సంస్థ ఏది ?
జవాబు:
తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం వీరికి ‘మహా మహూపాధ్యాయ బిరుదును ఇచ్చింది.

ప్రశ్న 3.
“రామచక్కని” అనే జాతీయాన్ని ఉపయోగించి ఒక వాక్యం తయారుచేయండి.
జవాబు:
శ్రీరాముడు రామచక్కనోడు.

ప్రశ్న 4.
స్త్రీల క్లబ్ భవన నిర్మాణానికి ఎవరు సాయం చేశారు ?
జవాబు:
స్త్రీల క్లబ్ భవన నిర్మాణానికి సాయం చేసింది సర్ బన్సీలాల్గారు 15,000 రూ॥ ఇచ్చారు.

ప్రశ్న 5.
ఉర్దూ భాషను పూర్వం ఏ పేర్లతో పిలిచేవారు ?
జవాబు:
ఉర్దూ భాషను పూర్వం హిందుయి-జబానె-హిందుస్థాన్ అనే పేర్లతో 18వ శతాబ్దం వరకు పిలిచేవారు.

ప్రశ్న 6.
బతుకమ్మ పాటలోని పల్లవులేవి ?
జవాబు:
ఉయ్యాలో, వలలో, చందమామ అనునవి బతుకమ్మ పాటలలో పల్లవులు.

ప్రశ్న 7.
రాజా బహద్దూర్ కాలంలో వృద్ధాశ్రమాలు ఎక్కడక్కడ కలవు ?
జవాబు:
హైదరాబాద్లో ఒకటి, సికిందరాబాద్లో ఒకటి కలవు.

ప్రశ్న 8.
జానపదుల నోటి నుండి వెలువడ్డ జాతీయం సామెత ఎలాంటిది ?
జవాబు:
గంగలో రాయి వంటిది.

XI. ఈ కింది వానిలో ఒకదానికి సమాధానం రాయండి. (1 × 5 = 5)

ప్రశ్న 1.
పోగొట్టుకున్న సైకిల్ కోసం పోలీస్ స్టేషన్కి లేఖ రాయండి.
జవాబు:

దిలావర్పర్,
10.01.2023.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు,
పోలీస్ స్టేషన్,
దిలావర్పూర్.

విషయము : నా సైకిల్ దొంగిలింపబడిన విషయం గురించి.

ఆర్యా!
నమస్కారములు.

నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల, దిలావర్పర్ నందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నేను నిన్న కళాశాలకు అట్లాస్ కంపెనీకి చెందిన ఎరుపు ‘రంగు సైకిల్ పై వెళ్ళి, కళాశాల ముందర తాళం వేసి పెట్టి, తరగతులకు హాజరు అయ్యాను. సాయంత్రం వచ్చి చూసేసరికి నా సైకిల్ కనిపించలేదు. దొంగిలించబడినదని నిర్ధారణ అయ్యింది.

దయచేసి నా సైకిల్ గురించి విచారణ చేసి తిరిగి నాకు అప్పగించవలసినదిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
కృతజ్ఞతలతో,

ఇట్లు,
మీ విశ్వసనీయుడు
పి. ఆదిత్య
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం
ప్రభుత్వ జూనియర్ కళాశాల
దిలావర్పూర్

ప్రశ్న 2.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాయండి.
జవాబు:

నల్లగొండ,
27.01.2023.

శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి,
నల్లగొండ,
నమస్కారములు.
విషయము : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు దరఖాస్తు
నిర్దేశము : నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రకటన, తేది: 20.01.2023.

ఆర్యా,

ఈ నెల తేది 20.01.2023 నాటి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ఉద్యోగ ప్రకటనను చూసాను. మీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికపై నింపుతున్నట్లు, అర్హులైన వారు దరఖాస్తు చేసుకొమ్మని ప్రకటించారు. తమ ప్రకటన ప్రకారం ఆ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు అన్నీ నాకు ఉన్నాయి. అలాగే, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కావున, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను.

ఈ ఉద్యోగమును క్రమశిక్షణతో, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని మనవి చేసుకుంటున్నాను. కావున, నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ భవదీయుడు
XXXX

దరఖాస్తుతో జత చేసిన పత్రాలు :

  1. ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం
  2. జనన ధ్రువీకరణ పత్రం
  3. స్థానిక ధ్రువీకరణ పత్రం
  4. ఉద్యోగానుభవ ధ్రువీకరణ పత్రం

XII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1) తెగనేసిన
జవాబు:
తెగనేసిన = తెగన్ + ఏసిన = ద్రుఁత ప్రకృతిక సంధి
సూత్రం : ఇకాదులకు దక్క ద్రుత ప్రకృతిందికంబులకు సంధిలేదు

2) జీవితాశ
జవాబు:
జీవితాశ : జీవిత + ఆశ = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

TS Inter 1st Year Telugu Model Paper Set 2 with Solutions

3) ముత్యమట్లు
జవాబు:
ముత్యమట్లు = ముత్యము + అట్లు = ఉకారసంధి
సూత్రము : అత్తునకు సంధి బహుళమగును.

4) రాసేరుగాని
జవాబు:
రాసేరుగాని = రాసేరు + కాని – గసడదవాదేశ సంధి
సూత్రము : ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు.
ప్రథమావిభక్తి ప్రత్యయములనగా డు ము వు లు పరుషము లనగా క, చ, ట, త, ప, లు డుము వు ల కు, క చ ట త ప లు వస్తే అవి గ స డ ద వ లు గా మారతాయని భావం.

5) భానోదయము
జవాబు:
భానోదయము = భాను+ఉదయము = సవర్ణదీర్ఘసంధి
సూత్రము : అ, ఇ, ఉ, ఋ వర్ణములకు సవర్ణములైన అచ్చులు పరమైనచో వానికి దీర్ఘములు ఏకాదేశమగును.

6) అణ్వస్త్రము
జవాబు:
అణ్వస్త్రము = అణు + అస్త్రము = అణ్వస్త్రము – యణాదేశ సంధి
సూత్రము : ఇ.డి.ఋ అనువానికి అసవర్ణములైన అచ్చులు పరమైనచో క్రమముగా య,వ,ర,ల అనునవి ఆదేశముగా వచ్చును.

7) సూకరంబునకేల
జవాబు:
సూకరంబునకేల సూకరంబునకు + ఏల = ఉకార సంధి
సూత్రము : అత్తునకు సంధి బహుళమగును.

8) భ్రమజెందేరయా
జవాబు:
భ్రమజెందేరయా = భ్రమజెందేరు + అయా – ఉత్వసంధి / ఉకారసంధి
సూత్రము : ఉత్తునకు అచ్చుపరంబగునపుడు సంధియగు

XIII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.

1) భానుకాంతి
జవాబు:
భానుకాంతి – భానుని యొక్క కాంతి – షష్ఠీ తత్పురుష సమాసం

2) గురునిపాదము
జవాబు:
గురునిపాదము – గురునియొక్క పాదము – షష్ఠితత్పురుషసమాసం

3) గున్నయేనుగు
జవాబు:
గున్నయేనుగు – గున్నదైన ఏనుగు – విశేషణ పూర్వపద కర్మధారయము

4) అనామకం
జవాబు:
అనామకం – పేరులేనిది – నత్ + తత్పురుష సమాసం

5) కనురెప్ప
జవాబు:
కనురెప్ప – కనుయొక్కరెప్ప – షష్ఠీతత్పురుష సమాసం

6) దయార్ధ దృష్టి
జవాబు:
దయార్ద్ర దృష్టి – దయార్ద్రమైన దృష్టి – విశేష పూర్వపద కర్మధారయ సమాసము

7) విపులతేజుడు
జవాబు:
విపులతేజుడు – విపులమైన తేజం కలవాడు – బహువ్రీహిసమాసం

8) రాజీవనేత్రుడు
జవాబు:
రాజీవనేత్రుడు – రాజీవము వంటి నేత్రములు కలవాడు – బహువ్రీహి సమాసము

XIV. ఈ క్రింది అంశాలలో ఒకదానిని గురించి వ్యాసం రాయండి. (1 × 5 = 5)

ప్రశ్న 1.
తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వైభవం
జవాబు:
ప్రతీ సమాజానికి తనదైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. అది ఆ ప్రాంత ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆలోచనాపరుడైన మనిషికి తన ఉనికి గురించి, తన ప్రాంత చరిత్ర గురించి, తన భాషాసంస్కృతుల విశిష్టతల గురించి తెలుసుకోవాలనే కోరిక. ఉంటుంది. చరిత్రను, సంస్కృతిని అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం ద్వారా ఉత్తేజాన్ని, ప్రేరణను పొందవచ్చు.

చరిత్రను తెలుసుకోకుండా చరిత్రను నిర్మించలేమని పెద్దలు చెబుతుంటారు. అలాగే, సంస్కృతి కూడా నిత్యజీవితంలోని అనేక సందర్భాలను ఉత్సాహభరితం చేస్తుంది. చరిత్ర, సంస్కృతి రెండూ సమాజాన్ని ఒక రీతిగా తీర్చిదిద్దుతాయి. తెలంగాణ ప్రాంతవాసులుగా మన చరిత్ర, సంస్కృతుల పైన మనం కనీస అవగాహనను కలిగి ఉండడం, వాటిని పరిరక్షించుకోవడం అవసరం.

తెలంగాణలో ఆదిమానవ సమాజానికి సంబంధించిన క్రీ.పూ. రెండువేల ఏళ్ల నాటి బృహత్ శిలాసమాధులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. నవీన శిలాయుగానికి సంబంధించిన రేఖాచిత్రాలు అనేక గుహలలో చిత్రించబడినాయి. తెలంగాణ ప్రాంతానికి ప్రాచీన గ్రంథాలలో క్రీ.పూ ఆరవ శతాబ్దం నాటికి అశ్మక (అస్సక), ములక, మహిషక, మంజీరక, తెలింగ అనే పేర్లున్నాయి. గోదావరీ పరీవాహక ప్రాంతాలలో తొలినాటి ఆవాసాలకు సంబంధించిన ఆధారాలున్నాయి. తెలంగాణను పాలించిన తొలి రాజవంశం శాతవాహన వంశం. వీరు కోటిలింగాల, పైఠాన్, పాలనాకేంద్రాలుగా కొండాపురం టంకశాలగా క్రీ.పూ.

మూడవ శతాబ్దం నుండి క్రీ. శ. మూడవ శతాబ్దం వరకు పరిపాలించారు. వీరి కాలంలోనే శాతవాహన రాజైన హాలుడు సంకలనం చేసిన ప్రాకృత గాథాసప్తశతిలో అత్త, పత్తి, పడ్డ, పాడి, పిల్ల, పొట్ట మొదలైన తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. శాతవాహన కాలపు మట్టికోటల ఆనవాళ్ళు, అవశేషాలు కోటిలింగాల, ధూళికట్ట, పెద్ద బొంకూరు, ఫణిగిరి, గాజుల బండ, కొండాపురం లాంటి ప్రాంతాల్లో లభించాయి. అట్లాగే, శాతవాహ నులు వేయించిన నాణాలు తెలంగాణలో లోహపరిశ్రమ ఉండేదనడానికి సాక్ష్యాలుగా ఉన్నాయి.

తర్వాత విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, వాకాటకులు పరిపాలించారు. తదనంతరం కాకతీయుల సామ్రాజ్యం క్రీ.శ. 950 నుండి 1323 వరకు విస్తరిల్లింది. ముసునూరు నాయకులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, బహమనీలు (క్రీ.శ. 1518 – 1686) అసఫ్ జాహీలు (క్రీ.శ. 1724- 1948) తెలంగాణ నేలను పరిపాలించారు.

క్రీస్తుపూర్వం వేలసంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న గోండులు ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకుంటూ ‘ టేకం, మార్కం, పూసం, తెలింగం’ అనే నలుగురు మూలపురుషుల్ని దేవతలుగా పేర్కొంటారు. ఈ ‘తెలింగ’ శబ్దమే ‘తెలుంగు’ శబ్దానికి మూలంగా భావించవచ్చు. మెదక్ జిల్లా తెల్లాపూర్ లో బయట పడిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో ‘తెలుంగణ’ పదం, 1510 వెలిచర్ల శాసనంలో ‘తెలంగాణ’ పదం ప్రయోగించబడింది. అనంతర కాలంలో, వ్యవహారాల్లో ‘తెలంగాణ’ పదం విస్తృత ప్రచారంలోకి వచ్చింది.

కాకతీయ రాజులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల నీటి పారుదల కోసమే చెరువుల నిర్మాణం అధికంగా జరిగింది. పెద్ద చెరువులు, గొలుసు చెరువులు, చెరువులవ్యవస్థ ప్రత్యేకంగా కనిపించటం వల్ల అప్పట్లో ఈ ప్రదేశాన్ని ‘చెరువులదేశం’గా పిలిచేవారు. వరి, గోధుమ, నువ్వులు, పత్తి వంటి తృణధాన్యాలతో పాటు తోటల పెంపకం కూడా కొనసాగింది. ఆ క్రమంలో ‘బాగ్ ‘ల విస్తరణ ‘బాగ్’ (తోటలు)కు నెలవైన నగరం కనుకనే హైదరబాద్ కు ‘బాగ నగర్’ అనే పేరొచ్చింది. వ్యవసాయం చుట్టూ అనేక వృత్తులు ఏర్పడ్డాయి.

పనిముట్లు చేసేవారు. అవసరాలు చూసేవారు, పనులు చేసేవారు వివిధ వృత్తులుగా మార్పు చెందుతూ వచ్చినారు. పురోహితులు, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, పద్మశాలి, గొల్ల, బెస్త, గౌండ్ల, గాండ్ల, చర్మకార వడ్డెర వంటి ఎన్నో వృత్తులు కొనసాగుతూ వచ్చినాయి. శాతవాహనుల కాలం నాటికే నిర్మల్ కత్తులు ప్రసిద్ధి పొందాయి. పట్టువస్త్రాలకు పోచంపల్లి, గద్వాల, ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వ్యవసాయం, కుటీర పరిశ్రమల ఉత్పత్తులతో గ్రామాలచుట్టూ ఎన్నో పండుగలు, జాతరలు తెలంగాణ సంస్కృతిలో వర్థిల్లినాయి.

తెలంగాణ ప్రజలు వ్యవహరించే తెలుగు విశేషమైంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. గ్రాంథికానికి, జాను తెలుగుకు దగ్గరగా, వ్యాకరణ ప్రమాణాలతో కూడి ఉంటుంది. తెలుగులో తొలి ప్రాచీన కందపద్యాలు బొమ్మలమ్మగుట్ట శాసనంలో లభించి, క్రీ.శ. 9 శతాబ్ది నాటికే ఛందోబద్ధ సాహిత్యమున్నదని నిరూపిస్తున్నాయి. కన్నడంలో, తెలుగులో పద్యాలు రాసిన పంపమహాకవి చరిత్ర తెలంగాణకు గర్వకారణం.

మల్లియరేచన రచించిన ‘కవిజనాశ్రయం ‘ తెలుగులో తొలిఛందోగ్రంథం. ‘వృషాధిప శతకం’ పేరుతో తొలిశతకాన్ని పాల్కురికి సోమన రచించాడు. సామాజిక చైతన్యానికి, దేశీరచనలకు బీజం వేసిన పాల్కురికి సోమన తెలంగాణ ఆదికవి. తెలుగులో తొలి స్వతంత్ర రచన చేసిన కవి. జానపద, సంప్రదాయిక, ప్రజాస్వామిక సాహిత్యాలు తెలంగాణాలో విస్తృతంగా వర్ధిల్లినాయి.

ఆదిమ సమాజ జీవనవిధానానికి ఆనవాళ్లు గిరిజనులు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవితల్లినే దేవతగా కొలిచే వీరి కళలన్నీ ప్రకృతి అనుకరణ రూపాలే. మన తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఇత్యాది జిల్లాల్లో కోయ, గోండు, కొండరెడ్డి, లంబాడ, గుత్తికోయల, చెంచులు మొదలైన గిరిజన తెగలవారు జీవిస్తున్నారు.

రుంజలు, బైండ్లు, ఒగ్గుకథ, శారదకథ, హరికథ, చిందు భాగోతం, బాలసంతులు, బుడిగె జంగాలు, గంగిరెద్దులు, సాధనాశూరులు, బహురూపులు, పెద్దమ్మలు, గుస్సాడీ నృత్యం, చెంచు, కోయ, బంజారా ప్రదర్శనలు కళకళలాడినాయి. బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వనభోజనాలు, పీరీలు, దసరా, రంజాన్, కాట్రావులు, కొత్తలు, సంక్రాంతి, ఉగాది పండుగులు ఎన్నో కొనసాగుతున్నాయి. పేరిణి శివతాండవం, లాస్యం, భజనలు, చిరుతలు, శిల్పకళ, పెంబర్తి జ్ఞాపికలు, నిర్మల్ బొమ్మలు, నకాశి చిత్రాలు, కరీంనగర్ వెండిపనులు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాయి.

సమ్మక్క సారక్క, బల్మూరి కొండలరాయుడు, సర్వాయి పాపన్న, రాణి శంకరమ్మ, సోమనాద్రి, సదాశివరెడ్డి, రాంజీగోండు, కొమురంభీం, బండిసాయన్న, ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బందగీ, రేణుకుంటరామిరెడ్డి మొదలగు ఎందరో వీరుల సాహసగాథలు కళారూపాలు సంతరించుకొని వీరగాధలుగా విస్తరిస్తున్నాయి.

తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన చుక్క సత్తయ్య ‘ఒగ్గు’ కథకు జాతీయస్థాయి గౌరవాన్ని కలిగించారు. అదేవిధంగా మిద్దె రాములు ఎల్లమ్మకథకు తెచ్చిన ప్రాచుర్యం కూడా అలాంటిదే. చిందు ఎల్లమ్మ, గడ్డం సమ్మయ్యలాంటి కళాకారులు చిందు యక్షగానానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు.

చరిత్రలో ఆయా రాజులకాలంలో నిర్మితమైన గోల్కొండ, ఓరుగల్లు, దేవరకొండ, రాచకొండ, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, ఎలగందల, జగిత్యాల, రామగిరి వంటి కోటలు ప్రసిద్ధి చెందాయి. వివిధ మతాలకు చెందిన రామప్ప, భద్రాచలం, పాకాల, జోగులాంబ, మక్కా మసీదు, మెదక్ చర్చి, వేములవాడ, కాళేశ్వరం, బాసర, యాదాద్రి, ప్రార్థనా స్థలాలుగా అలరారుతున్నాయి.

వేయిస్తంభాల గుడి, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, కొలనుపాక, నేలకొండపల్లి, పైగా, కుతుబ్ షాహీ సమాధుల వంటి చారిత్రక పర్యాటక ప్రదేశాలున్నాయి. కుంటాల, బొగత, పొచ్చర అలీసాగర్, నిజాంసాగర్, హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్, కాళేశ్వరం వంటి రమణీయ జలపాతాలు. ప్రాజెక్టులున్నాయి. నెహ్రూ జంతు ప్రదర్శనశాల, కవ్వాల్, పిల్లలమట్టి, పోచారం, శివ్వారం, ఏటూరునాగారం వంటి వన్యప్రాణి సందర్శన స్థలాలు తెలంగాణలో ఉన్నాయి.

తెలంగాణలో భాషా ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, రైతాంగ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, విప్లవోద్యమం, మద్యపాన వ్యతిరేకోద్యమం, జలసాధనోద్యమం, హరితహారం లాంటి అనేక ప్రజా ఉద్యమాలు వర్ధిల్లి ప్రజాసమూహాలను చైతన్య పరుస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఎంతో గొప్ప చరిత్రకు, సంస్కృతికి, ఎన్నో కళలకు పుట్టినిల్లు మనందరి తెలంగాణ. ఆడుదాం… పాడుదాం… అభివృద్ధిలో పోటీపడదాం. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం.

TS Inter 1st Year Telugu Model Paper Set 2 with Solutions

ప్రశ్న 2.
యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం
జవాబు:
శ్రీకృష్ణుడు ఒకప్పుడు తన నోట్లో విశ్వరూప సందర్శనం చేయిస్తే ఇప్పుడు నట్టింట్లో ‘నెట్’ తిష్ఠ వేసుక్కూచున్నది. ‘ఇంటర్ నెట్ ఇవాళ మనుషుల పనిలో భారాన్ని తగ్గించి మనసుల మధ్య దూరాన్ని పెంచుతున్నది. ఒకప్పుడు ‘లేఖ’లు, టెలిగ్రామ్ లు, టెలిఫోన్లు మనుషుల మధ్య ఇంత సమాచార వేగాన్ని పెంచకపోయినా ఒత్తిడి లేని జీవనం ఉండేది. ఇప్పుడు ‘సెల్ ఫోన్’ శరీరభాగాల్లో ఒకటిగా మారిపోగా, టీవీ ఇంట్లోని వస్తువుల్లో ఒకటిగా మారింది. ఫోను సంభాషణలు, వీడియోకాల్స్ మనిషికి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు ఆత్మీయతానుబంధాలను మాయం చేశాయి.

వేగవంతమైన ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలు ఆత్మీయత, అనుబంధాలను పెంచుతున్నాయో, తుంచుతున్నాయో అర్థం కానంత సంఘర్షణలో సమాజం జీవిస్తున్నది. మనలాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఆధునిక సమాచార వ్యవస్థ వల్ల లాభనష్టాలు రెండూ కలగలిసి ఉన్నాయి. పూర్వం ప్రతివారూ బాల్యంలో రెండు అగ్గిపెట్టెల్లోని బాక్స్ లకు దారం కట్టి ఒకరు చెవికి పెట్టుకొంటే ఇంకొకరు మాట్లాడేవారు.

ఇదే పెద్ద ఆనందం..! మరిప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి మాధ్యమాలు, అనేక ‘యాప్స్’ అపరిమిత జ్ఞానంతో పాటు అనవసర విషయాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాయి. ‘అరచేతిలో వైకుంఠం’ లాగా ఇప్పుడు అన్నీ మనచేతి ఫోన్ లో తెలుసుకొనే సౌకర్యం కలిగింది. ‘అన్నీ’ ఉన్నప్పుడు అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.

1857లో స్కాట్లాండ్ దేశానికి చెందిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనే శాస్త్రవేత్త ఫోన్ ను కనుగొని 1892లో ప్రథమంగా న్యూయార్క్ నుండి షికాగో మాట్లాడాడు. దాని అంచెలంచెల పరిణామాల అవతారాలు ఈ రోజు మన చేతిలో విన్యాసం చేస్తున్న కర్ణపిశాచి అవతారం వరకు రూపాంతరం చెందింది.

1973లో మార్టిన్ కూపర్ అనే అమెరికా దేశస్తుడు ‘మొబైల్ ఫోను’ అందుబాటులోకి తెచ్చారు. అలాగే 1857లో చార్లెస్ బాబేజ్ కంప్యూటరకు రూపకల్పన చేయగా 1936లో దానికి ఓ సాంకేతిక రూపం వచ్చింది. పర్సనల్ కంప్యూటర్ను 1977లో రూపొందిస్తే 1983లో ఐ.బి.ఎం. అనే సంస్థ అందరికి అందుబాటులోకి వచ్చేట్లు చేసింది.

ఇది మనదేశంలోకి ఇంకో రూపంలో ప్రవేశించేసరికి మరో ఇరవై ఏళ్లు పట్టింది. పాటలు వినడం, అలారం, సమాచారం, సమయం మాత్రమే తెలుసుకొనే అవకాశం ఉన్న ఈ మొబైల్ ఫోన్లు 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టగానే అనేక కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చాయి.

ఈ ఇరవై ఏళ్లలో మొబైల్ ఫోను నేటి నిత్యావసర సరుకుగా మారిపోయింది. ఈ ఫోన్లకు ఇప్పుడు ఇంటర్నెట్ తోడవడంతో ప్రపంచం ఫోన్లోకి వచ్చి కూర్చొంది. సినిమాలు, డిక్షనరీలు, ఆటలు, లైవ్ ప్రోగ్రాంలు, టైపింగ్, విజ్ఞానం, సౌందర్యం వంటి మార్పులు, మత విజ్ఞానం, భాషలు, సైన్సు, విస్తృత సమాచారం, లలితకళలు, యోగవిజ్ఞానం, 24 గంటలు వార్తలు, ఇలా సమస్త ప్రపంచం ఇందులోకి చేరి ‘ఇందులో లేనిది ప్రపంచంలో లేదు. ప్రపంచంలో లేనిది ఇందులో లేదు’ అన్న స్థితికి చేరాం.

ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అవసరమైన అనవసరమైన సమాచారం ఒకచోట కలగాపులగంగా ఉండడం వలన సమాజంలో దుష్ప్రభావాలకు దారి సులభంగా ఏర్పడింది. ప్రతాపరుద్రుడు, స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి స్ఫూర్తిమూర్తుల చరిత్రలుకూడా నెట్లో దొరుకుతున్నాయి.

మనుషులు ఎప్పుడైనా చెడువైపు త్వరగా ఆకర్షితులవుతారు. సమాచారం ఉప్పెనలా మనమీద పడిన తర్వాత మనుషులు సెల్ ఫోన్ లోని సోషల్ మీడియా అనే అష్టదిగ్బంధనంలో చిక్కుకపోయారు. తనతోపాటు తన చుట్టుప్రక్కల వ్యక్తులతో, ప్రకృతితో సంబంధం కోల్పోయారు. ఇటీవల కాలంలో మనం రైలు, బస్సు ఎక్కి కూర్చొంటే ప్రక్కనున్న సీట్లోని మనిషి ఎక్కడికి వెళ్తున్నారని వారి యోగక్షేమాలను పూర్వంలా ఎవరూ అడగడం లేదు.

ఎవరి ఫోన్లో వారు తలదూర్చే దృశ్యం చూస్తున్నాం. మానవసంబంధాల యాంత్రికతకు ఇదో నిదర్శనం. అలాగే కొందరు ఇళ్లలో అస్తమానం కంప్యూటర్ లోనో, ఫోన్లోనో తలపెట్టి పక్కకు చూడడం లేదు. సుదీర్ఘంగా ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల మెడ, వెన్ను నొప్పి వంటి దేహబాధలు తప్పడం లేదు.

అలాగే కదలకుండా కూర్చొని ఊబకాయం, చక్కెర వ్యాధి వంటి వ్యాధులు కొని తెచ్చుకొంటున్నారు. మైదానాల్లో ఆడాల్సిన కబడ్డీ, క్రికెట్ వంటి ఆటలు ఫోన్లోనే ఆడడం వల్ల శారీరక వ్యాయామం జరగడం లేదు. కాలాన్ని ఎక్కువగా వాటిలోనే దుర్వినియోగం చేస్తున్నారు.

తోటివారితోనే కాకుండా తనకుతానే సంబంధం కోల్పోతున్నాడు. తననుతానే వదిలి పెట్టినవాడు సమాజంతో ఎలా సంబంధం నెరపగలడు! అందుకే ఇటీవల ‘వర్చువల్ మీటింగ్స్’ తో పెళ్లిళ్లు, ఆఖరుకు అంత్యక్రియలు కూడా ఇంటర్నెట్లో చూసే దుస్థితికి దిగజారాయి. అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తో, అప్లోడ్ డౌన్లోడ్ లతో జీవితం దుర్భరం చేసుకొంటు న్నారు. అనవసరమైన ‘చెత్త సమాచారం’ ఫార్వార్డ్ చేస్తూ అనవసర భారం ఇతరుల తలల్లోకి చొప్పిస్తున్నారు.

కొన్నిసార్లు విశ్వసనీయత లేని సమాచారం ఫార్వార్డ్ చేసి సామాజిక అశాంతికి కారణం అవుతున్నారు. అసత్యాలతో కథనాలు, వీడియోలు రూపొందించి సంచలనం చేసే సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు ఎక్కువైపోయి సోషల్ మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్నది. అసత్య కథనాలతో సంచలనాలతో డబ్బు సంపాదించే వ్యక్తులు సోషల్ మీడియాలో ఉండటం వల్ల భావోద్వేగాలకు సంబంధించిన కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొట్టే సమాచారం ఇతరులకు పంపించి వాళ్లలో లేనిపోని ఉద్రిక్తతలు కలిగిస్తున్నారు.

ఒకప్పుడు గొప్ప అవధానంతో ఎన్నో శ్లోకాలు, పద్యాలు మనవాళ్లు ధారణ చేసేవారు. పల్లెటూళ్లలో జానపదులు సైతం ఎన్నో సామెతలు, జానపద గీతాలు, కథలు నోటికి చెప్పేంత ధారణ ఉండేది, విద్యార్థులు ఎక్కాలు’ శతక పద్యాలు వల్లెవేసి ఎక్కడ అవసరం వస్తే అక్కడ ధారాళంగా చదివేవారు.

ఇప్పుడు ప్రతీది ‘ఇంటర్నెట్ సమాచారం తప్ప ‘స్వీయశక్తి’తో జ్ఞాపకాన్ని జ్ఞానంగా మార్చుకోవడం లేదు. తమ తమ స్వీయ జ్ఞానాన్ని’ వీడియోలుగా మార్చి సమాజానికి అందిస్తున్నారు. ఇందులో గుణదోషాలు రెండూ ఉన్నాయి. అలాగే అశ్లీల వెబ్ సైట్లు సమాజంలో అత్యాచారాలకు ప్రధాన కారణం అవుతున్నాయి.

ఆటల్లో గడపాల్సిన యువత ఎక్కువగా ఫోన్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి, అనవసర మానసికఒత్తిడి పెరిగి మెదడు మొద్దుబారే స్థితి వచ్చింది. చదువుకోసం విస్తృత సమాచారం ఇవాళ నెట్టింట్లో దొరుకుతుంది. అంతవరకు యువత స్వీకరిస్తే వారి జీవితం పూలబాటగా మారుతుంది. బియ్యంలోని రాళ్లు తొలగించుకొన్నట్లు అనవసర సమాచారం తొలగించి సదసద్వివేకంతో ఈ మాధ్యమాలను తమ జ్ఞానానికి అనుకూలంగా మార్చుకోవడమే నేటి యువతరానికి ఉండవలసిన వివేకం.

అదేవిధంగా ‘పిచ్చోడిచేతి’లో రాయిగా మారిన ‘సామాజిక మాధ్యమాలు’ ఇపుడు కొందరికి వ్యాపారవనరుగా మారడం మరో కోణం. యువతరం మాదకద్రవ్యాల మత్తులో పడకుండా ఎంత జాగ్రత్తగా మెలగాలో అలాగే ఈ మాధ్యమాల వలలో పడకుండా చైతన్యంతో ఉత్తమ భవిష్యత్తుకోసం ఆదర్శమార్గంలో నడవాలి.

ప్రశ్న 3.
జాతీయ విపత్తులు
జవాబు:
అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.
విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది.

విపత్తు లక్షణాలు

  • ఆకస్మికంగా సంభవించడం
  • అతివేగంగా విస్తరించడం.
  • ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం
  • ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.

సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి.

  1. సహజమైనవి
  2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.

భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.

ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.

భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని. -అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం.

విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు

  • సంసిద్ధత
  • ఉపశమన చర్యలు
  • సహాయక చర్యలు
  • పునరావాసం.

విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం కలదు. అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు.

విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు.

విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.

విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు.

దీనికి ఉదాహరణ కోవిడ్-19 వ్యాధి. దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.

విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి.

విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.

TS Inter 1st Year Telugu Model Paper Set 2 with Solutions

XV. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

ప్రశ్న 1.
A journey of thousand miles begins with a single step.
జవాబు:
వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది.

ప్రశ్న 2.
There is no substitute for hard work.
జవాబు:
కృషికి ప్రత్యామ్నాయం లేదు.

ప్రశ్న 3.
The best way to predict the future is to create it.
జవాబు:
భవిష్యత్తును అంచనావేయటానికి ఉత్తమ మార్గం, దానిని సృష్టించటమే.

ప్రశ్న 4.
Education is the most powerful weapon which can change the world.
జవాబు:
ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన సాధనం విద్య మాత్రమే.

ప్రశ్న 5.
Ours is a joint family.
జవాబు:
మాది ఉమ్మడి కుటుంబం.

XVI. ఈ క్రింది వ్యాసాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

ఆధునిక వచన సాహిత్యంలో కథానిక ప్రక్రియ ప్రత్యేక స్థానాన్ని పొందింది. ప్రాచీన సాహిత్యంలో వినిపించే కథలు నేటి కథానిక సాహిత్య పరిధిలోకి రావు. కథానిక ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆధునిక లక్షణాలతో విభిన్న ప్రయోగధోరణులతో వర్తమాన పరిణామాలకు అనుగుణంగా నడుస్తుంది. ఆంగ్లంలో ‘short story’ అనే పదానికి సమానార్థకంగా తెలుగులో కథ, కథానిక అనే పర్యాయపదాలను వాడుతున్నాం.

ఈ కథానిక పదం ‘కథ’ ధాతువునుంచి పుట్టింది. దీనికి మాట్లాడుట, చెప్పుట, సంభాషించుట అనే భేదాలున్నాయి. కథానిక ప్రస్తావన ‘అగ్నిపురాణం’లో కనిపిస్తుంది. క్లుప్తతతో బిగువైన కథనంతో ఉదాత్త అంశాలతో భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ కరుణ, అద్భుత రసపోషణతో ఆనందాన్ని అందించడమే కథానిక లక్షణంగా చెప్పబడింది.

ఆధునిక కాలానికి చెందిన కథారచన యూరోపియన్ సామాజిక, రాజకీయ పరిణామాల ప్రభావంతో ఆవిర్భవించింది. తొలి కథా రచయితగా భావించబడుతున్న ‘ఎడ్గార్ ఎలన్ పో “ఒకే సంఘటనను అది యథార్థమైనా, కల్పనాత్మకమైనా తక్కువ సమయంలో చదువగలిగే సాహిత్య ప్రక్రియ” కథానిక అని నిర్వచించాడు. తెలుగు కథానికపై తొలి సిద్ధాంత గ్రంథం రచించిన డా॥ పోరంకి దక్షిణామూర్తి కథానికను నిర్వచిస్తూ “ఏకాంశవ్యగ్రమై, స్వయం సమగ్రమైన కథాత్మక వచన రచనా ప్రక్రియ” అని తన ‘తెలుగు కథానిక స్వరూప స్వభావం’లో వివరించాడు.

కథానిక నిర్వచనాలన్నింటిని క్రోడీకరిస్తే సంక్షిప్తత, ఏకాంశవస్తువు, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, ప్రతిపాద్య ప్రవీణత, సంవాద చాతుర్యం, నిర్మాణ సౌష్ఠవాలు కథానికకు ప్రధాన లక్షణాలుగా స్థిరపడ్డాయి. సామాజిక వాస్తవికతను అందిస్తూ మనోవికాసాన్ని కలిగించడంలో కథానిక ప్రక్రియ శక్తివంతమైనదిగా విమర్శకులు పరిగణించారు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
‘కథానిక’ పదం ఎలా పుట్టింది?
జవాబు:
‘కథ్’ ధాతువు నుంచి పుట్టింది.

ప్రశ్న 2.
‘కథానిక’ ప్రస్తావన ఏ పురాణంలో ఉంది?
జవాబు:
అగ్నిపురాణంలో

ప్రశ్న 3.
తొలి కథారచయితగా ఎవరిని భావిస్తున్నాం ?
జవాబు:
విఙ్గర్ విలన్పో

ప్రశ్న 4.
కథానిక ప్రక్రియ ఏ కాలానికి సంబంధించినది?
జవాబు:
ఆధునిక కాలానికి

ప్రశ్న 5.
తెలుగు కథానికపై తొలి సిద్ధాంత గ్రంథం రచించినదెవరు?
జవాబు:
పోరంకి దక్షిణామూర్తి

Leave a Comment