AP Inter 2nd Year Zoology Notes Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

Students can go through AP Inter 2nd Year Zoology Notes 8th Lesson అనువర్తిత జీవశాస్త్రం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes 8th Lesson అనువర్తిత జీవశాస్త్రం

→ ‘అనువర్తిత జీవశాస్త్రం’ అనేది మానవుడి ఆరోగ్యం, సంక్షేమం మరియు అవసరాల కోసం అనువర్తించడానికి ఉపయోగపడేశాస్త్రం.

→ అనువర్తిత జీవశాస్త్రంలో అధ్యయనం చేసే అంశాలు : పశుసంవర్ధనం, జలసంవర్ధనం, వ్యవసాయం, కాలుష్య యాజమాన్యం, కృత్రిమహార్మోన్ సామ్యాల సంశ్లేషణ, వ్యాక్సీన్లు, జన్యు చిక్సిత మరియు అనేక మానవ రుగ్మతల జీవ అణువుల నిర్ధారణ .

→ ఈ శాస్త్రంలో వివిధ రకాల వైద్య పరికరాలు, వైద్య పరీక్షలు మరియు వాటి అభివృద్ధి గురించి అధ్యయనం చేస్తారు. ECG, EEG, MRI స్కాన్, CT స్కాన్ మొదలగువాటి గురించి తెలియజేస్తుంది.

→ గుడ్లకోసం మాత్రమే పెంచే పక్షులను ‘లేయర్’ పక్షులు అంటారు. [IPE]

→ మాంసం కోసం పెంచే పక్షులను ‘బ్రాయిలర్’ పక్షులు అంటారు. [IPE]

→ ‘హైపోఫైజేషన్’ అనే ప్రేరిత ప్రజననంలో పీట్యుటరీ గ్రంధిని ప్రయోగిస్తారు. [IPE]

→ వ్యాక్సిన్: ఇది ఒక ప్రత్యేక వ్యాధికి ‘వ్యాధి నిరోధక శక్తిని’ పెంచే జీవ సంబంధిత తయారీ.

→ P53 జన్యువును ‘కణ జీనోమ్’ యొక్క ‘సంరక్షణ దేవత’ గా పేర్కొంటారు. [IPE]

→ PCR అనగా‘పాలిమరేజ్ చైన్ రియాక్షన్’. ఇది కొన్ని వ్యాధులను ప్రాధమిక దశలోనే గుర్తించుటకు సహాయపడుతుంది. [IPE]

→ CT స్కాన్ (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) లో X-కిరణాల ద్వారా దేహాన్ని చర్మం నుంచి కేంద్రభాగం వరకు [IPE] కోతల రూపంలో చూడటానికి ఉపయోగిస్తారు

→ MRI స్కాన్: MRI అనగా అయస్కాంత అనునాద చిత్రీకరణ. ఇందులో అయనీకరణ రేడియో ధార్మికతను ఉపయోగిస్తారు.

→ ECG (ఎలక్ట్రోకార్డియో గ్రాఫ్) ను గుండెలో కలిగే విద్యుత్ మార్పులను నమోదు చేయడానికి ఉపయోగిస్తారు. [IPE]

→ EEG (ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ) అనేది మెదడు యొక్క విద్యుత్ క్రియాశీలతను నమోదు చేసే పద్ధతి. [IPE]

→ ప్రత్యక్ష ELISA ను ప్రతిజనకాలను గుర్తించుటకు వినియోగిస్తారు. [IPE]

→ అప్రత్యక్ష ELISA ను ప్రతిదేహాలను గుర్తించుటకు వినియోగిస్తారు. [IPE]

→ ఇన్సులిన్ అనేది ఒక ప్రోటీన్ ఆధారిత హార్మోన్. దీనిని క్లోమ గ్రంధులు యొక్క B కణాలు స్రవిస్తాయి. [IPE]

Leave a Comment