AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

Students get through AP Inter 2nd Year Zoology Important Questions Lesson 3b నాడీ నియంత్రణ, సమన్వయం which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Zoology Important Questions Lesson 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మానవ మెదడును కప్పి ఉంచే రక్షణ పొరల పేర్లు తెలపండి. [AP MAY-22] [TS MAY-22]
జవాబు:
మానవుని మెదడును ఆవరించి దానిని రక్షిస్తూ మూడు కపాల పొరలు ఉంటాయి. వీటిని మెదడు యొక్క ‘మెనింజెస్’ అంటారు. అవి

  1. వరాశిక: ఇది మందమైన రెండు స్తరాల వెలుపలి పొర.
  2. లౌతికళ: ఇది పలుచని జాలం లాంటి పొర.
  3. మృద్వి: ఇది మెదడుకు సన్నిహితంగా అంటిపెట్టుకొని ఉండే పలుచని పొర .

ప్రశ్న 2.
కార్పస్ కెల్లోజమ్ అంటే ఏమిటి? [TS MAR-15] [AP MAR-17][TS MAY-17]
జవాబు:

  1. మస్తిష్క వల్కలం కు దగ్గరగా, రెండూ మస్తిష్కార్ధగోళాలను కలుపుతూ ఉన్న నిలువు బంధనాన్ని ‘కార్పస్ కెల్లోజమ్’ అంటారు.
  2. ఇది పెద్దగా మరియు బల్లపరుపుగా ఉన్న మయోలిన్ తంతువుల కట్టతో ఏర్పడింది.
  3. ఇది రెండు మస్తిష్కార్ధగోళాల విధులను సమన్వయపరుస్తుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం
ప్రశ్న 3.
ఆర్బోరి ్వటే గురించి మీరు తెలుసుకున్నదేమిటి? [AP,TS MAR-20][TS MAY-19]
జవాబు:
ఆర్బోరిటే: మస్తిష్కంలో అనేక శాఖలు కలిగిన చెట్టులాగా అమరి ఉండే తెలుపు వర్ణపదార్ధమును ఆర్బోరి విటే అంటారు. దీనిని ఆవిరించి బూడిద వర్ణ పదార్ధం పొరలాగా అమరి ఉంటుంది.

ప్రశ్న 4.
సహానుభూత వ్యవస్థను ఉరఃకటి విభాగం అంటారు, ఎందువల్ల? [AP MAR-16][TS MAR-17]
జవాబు:
సహానుభూత విభాగం నందు, పూర్వనాడీ సంధి తంతువులు వెన్నుపాము యొక్క ఉరఃకటి ప్రాంతాల నుంచి ఏర్పడతాయి. కావున దీనిని ‘ఉరస్కటి విభాగం’ అని అంటారు.

ప్రశ్న 5.
సహసహానుభూత వ్యవస్థను కపాలః – త్రికవిభాగం అంటారు. ఎందువల్ల?
జవాబు:
కపాలత్రిక విభాగంలో పూర్వ నాడీకణాల కణదేహలు మెదడు నుండి మరియు వెన్నపాము త్రికనాడీ ప్రాంతం నుండి వెలువడతాయి. కావున ఈ వ్యవస్థను కపాల త్రికవిభాగం అంటారు.

ప్రశ్న 6.
పరమ అనుద్రిక్తతా వ్యవధి, సాపేక్ష అనుద్రిక్తతా వ్యవధి మధ్య ఉండే భేదాలు రాయండి.
జవాబు:
రెండు వరుస సాధారణ త్రెషోల్డ్ లేదా దేహాళి ప్రేరణల మధ్య ఉన్న కాలాన్ని ‘అనుద్రిక్తతా వ్యవధి’ అంటారు.
పరమ అనుద్రిక్తతా వ్యవధి

  1. పరమ అనుద్రిక్తతా వ్యవధినందు ప్రేరణ బలం ఒక సెకను వ్యవధిలో ఎంత అధికంగా ప్రయోగించినా క్రియాశక్మం’ ఏర్పడదు.
  2. ఇది అపునఃధ్రువణం మరియు పునఃధ్రువణం రెండింటిని ఏకీభవిస్తుంది.

సాపేక్ష అనుద్రిక్తతా వ్యవధి

  1. సాపేక్ష అనుద్రిక్తతా వ్యవధి నందు ప్రేరణ బలం ఒక సెకను వ్యవధిలో త్రెషోల్డ్ కన్నా ఎక్కువగా ఉన్నా ‘క్రియా ‘శక్మం’ ఏర్పడుతుంది.
  2. ఇది అధి ధ్రువీకరణకు మాత్రమే ఏకీభవిస్తుంది.

ప్రశ్న 7.
పూర్ణ లేదా శూన్య అనుక్రియ అంటే ఏమిటి? [AP MAY-19]
జవాబు:

  1. పూర్ణ లేదా శూన్య అనుక్రియ: ప్రేరణ బలం త్రెషోల్డ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు నాడీకణంలో క్రియాశక్మం ఏర్పడదు (శూన్యక్రియ). ఒక వేళ క్రియాశక్మం ఏర్పడినా అది గమ్యస్థానం చేరేంత వరకు మధ్యలో ఆగదు.
  2. త్రెషోల్డ్ తగినంతగా ఉన్నపుడు లేదా ఎక్కువగా ఉన్నపుడు క్రియాశక్మం ఏర్పడుతుంది(పూర్ణక్రియ). నాడీ ప్రచోదనం అనేది పూర్తిగా వహనం చెందుతుంది లేదా చెందదు. దీనినే ‘పూర్ణ లేదా శూన్య అనుక్రియా సూత్రం’ అంటారు.

ప్రశ్న 8.
రసాయనికంగా, క్రియాత్మకంగా కంటిలోని దండకణాలు, శంఖుకణాలు మధ్య భేదం ఏమిటి? [TS MAR-19]
జవాబు:
‘దండకణాలు’ మరియు ‘శంఖుకణాలు’ అనేవి రెండు ‘కాంతి గ్రాహకాలు’
1) దండకణాలు: ఇవి ఎర్రని – వంగపురంగు ప్రోటీన్ అయిన ‘రోడాప్సిన్’ లేడా విజువల్ పర్పుల్ను కలిగి ఉంటాయి. ‘రోడాప్సిన్’ ప్రోటీన్ ఏర్పడుటకు విటమిన్ – A అవసరం మరియు దీని తయారికి ‘ఓప్సిన్’ ఉపయోగపడుతుంది. ఇవి మసక చీకటి(నిశాచరదృష్టి) లోని దృష్టికి అవసరమవుతాయి.

2) శంఖుకణాలు: ఇవి ‘అయోడాప్సిన్’ దృశ్యవర్ణ ద్రవ్యంను కలిగి ఉంటాయి. ఇది ‘పగటి పూట దృష్టికి’ మరియు ‘రంగులు గుర్తించడానికి’ ఆవశ్యకమైనది. ఎరుపు, నీలం మరియు ఆకుపచ్చ వర్ణాలు గుర్తించుటకు మూడు రకాలైన శంఖుకణాలు కలవు. తెలుపువర్ణమునకు కూడా సమానమైన ప్రేరణను ఉత్పత్తి చేస్తాయి. వివిధ రంగుల వద్ద వివిధ రకాల ప్రేరణలు ఉత్పత్తి చేయబడతాయి. శంఖుకణాలు ‘ఫోటాప్సిన్’ అనే ప్రోటీన్ ను కలిగి ఉంటాయి.

ప్రశ్న 9.
అంధచుక్క, పసుపు చుక్క మధ్య భేదం ఏమిటి? [AP MAY-19]
జవాబు:
అంధచుక్క

  1. నేత్ర పటలం, నేత్రనాడి కలిసే (కాంతి గ్రాహకాలు లేని) ప్రాంతాన్ని ‘అంధచుక్క’ అంటారు.
  2. ఇది ఎలాంటి కాంతి గ్రాహక కణాలను కలిగి ఉండదు. ఈ ప్రాంతంలో ఎలాంటి దృశ్యాలు ఏర్పడవు.

పసుపు చుక్క

  1. నేత్రపటలం యొక్క పరాంత మధ్యభాగాన్ని ‘మాక్యులా ల్యూటియా’ లేదా ‘పసుపు చుక్క అంటారు.
  2. ఈ ప్రాంతం శంఖుకణాలను మాత్రమే కలిగి ఉంటుంది. కావున ఇది ‘తీక్షణ దృష్టి’ని ఏర్పరుస్తుంది.

ప్రశ్న 10.
కోర్టి అంగం అంటే ఏమిటి? [AP MAR-15,17,19]
జవాబు:

  1. బాసిల్లరి త్వచం పై, కాక్లియార్ శాఖ కర్ణావర్తనంలో ఏర్పడిన అంగాన్ని ‘కోర్టి అంగం’ అంటారు.
  2. దీనియందు శ్రవణ గ్రాహకాలుగా పనిచేసే ‘రోమకణాలు’ ఉంటాయి.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మానవ వెన్నుపాము అడ్డుకోత చక్కని పటం గీచి, భాగాలు గర్తించండి. [TS MAY-19, 22]
జవాబు:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం 1

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

ప్రశ్న 2.
దైహిక నాడీవ్యవస్థ, స్వయంచోదిత నాడీవ్యవస్థల మధ్య తేడాలు రాయండి?
జవాబు:
దైహిక నాడీవ్యవస్థ

  1. ఈ వ్యవస్థ యందు జ్ఞాన మరియు చాలక నాడీ కణాలు అనే రెండు రకాల కణాలు ఉంటాయి.
  2. జ్ఞానకణాలు వివిధ బాహ్యగ్రాహకాల నుంచి ప్రచోదనాలను సేకరించి, కేంద్ర నాడీ వ్యవస్థ కు చేరవేస్తాయి.
  3. ఈ వ్యవస్థ యందు సంచలనాలు అనేవి స్మారకంగా అవగతమవుతాయి.
  4. దైహిక చాలక కణాలు, అస్థి కండర కణాలను ప్రేరేపించి నియంత్రిత కదలికలను ఉత్పత్తి చేస్తాయి. దీని యొక్క ప్రభావం ఉత్తేజంగా ఉంటుంది.

స్వయంచోదిత నాడీవ్యవస్థ

  1. ఈ వ్యవస్థ యందు పూర్వనాడీసంధీ మరియు పరనాడీ సంధినాడీ కణాలు అనే రెండు రకాల కణాలు ఉంటాయి.
  2. స్వయంచోదిత నాడీ కణాలు అంతర గ్రాహకాలతో అనుసంధానమై ఉంటాయి.
  3. ఈ వ్యవస్థ యందు సంచలనాలు అనేవి అపస్మారకంగా అవగతమవుతాయి.
  4. చాలక నాడీ కణాలు హృదయ కండరాలు మరియు గ్రంధుల యొక్క అనియంత్రిత చర్యలను క్రమబద్దీకరిస్తాయి.

ప్రశ్న 3.
మానవుడి కంటిలోని కేత్రపటలం (రెటీనా) గురించి రాయండి. [ TS MAR-18]
జవాబు:

  1. రెటీనా నేత్రగోళం యొక్క లోపలి మూడవ పొర.
  2. దీనియందు వర్ణయుత ఉపకళ మరియు నాడీ ప్రాంతం అనే రెండ గాలు ఉంటాయి.
  3. వర్ణయుత ఉపకళ – ‘మెలనిన్’ ఆచ్ఛాదనాన్ని కలిగి ఉంటుంది.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం 2
  4. ఇది రక్తపటలం మరియు రెటీనా యొక్క నాడీ ప్రాంతం మధ్యలో ఉంటుంది.
  5. నాడీ ప్రాంతంలో మూడు రకాల నాడీకణాల పొరలు ఉంటాయి.
    (i) బాహ్య కాంతి గ్రాహక స్తరం కాంతినేత్రపటలం పై పడటం
    (ii) మధ్యలో ద్విధ్రువ కణ స్తరం
    (iii) అంతర నాడీ సంధి కణ స్తరం
  6. కాంతి తరంగాలు అంతర నాడీ సంధికణ స్తరం గుండా ప్రసరిస్తాయి..
  7. కాంతి గ్రహక స్తరం: ఇది రెండు రకాల కణాలను కలిగి ఉంటుంది.

(i) దండకణాలు: ఇవి ఎర్రని – వంగపురంగు ప్రోటీన్ అయిన ‘రోడాప్సిన్’ లేదా విజువల్ పర్పుల్ను కలిగి ఉంటాయి. ‘రోడాప్పిన్’ ప్రోటీన్ ఏర్పడటకు విటమిన్ – A అవసరం మరియు దీని తయారికి ‘ఓప్సిన్’ ఉపయోగపడుతుంది. ఇవి మసక చీకటిలోని దృష్టికి (నిశాచరదృష్టి) అవసరమవుతాయి. .

(ii) శంఖుకణాలు: ఇవి ‘అయోడాప్సిన్’ దృశ్యవర్ణ ద్రవ్యంను కలిగి ఉంటాయి. ఇది ‘పగటి పూట దృష్టికి’ మరియు ‘రంగులు గుర్తించడానికి ఆవశ్యకమైనది. ఎరుపు, నీలం మరియు ఆకుపచ్చ వర్ణాలు గుర్తించుటకు మూడు రకాలైన శంఖుకణాలు కలవు. తెలుపువర్ణంనకు కూడా సమానమైన ప్రేరణను ఉత్పత్తి చేస్తాయి. వివిధ రంగుల వద్ద వివిధ రకాల ప్రేరణలు ఉత్పత్తి చేయబడతాయి. శంఖుకణాలు ‘ఫోటాప్సిన్’ అనే ప్రోటీన్ ను కలిగి ఉంటాయి. 8) పసుపు చుక్క మధ్య భాగంలో ఉండే లోతైన ప్రదేశాన్ని ‘ఫోవియా సెంట్రాలిస్’ అని అంటారు. ‘ఫోవియా’ నడిచేటప్పుడు అవసరమైన తీక్షణ దృష్టికి తోడ్పడుతుంది.

9) నేత్ర నాడీ తంతువులు నాడీసంధి కణాల పరాంతం వరకు విస్తరించి నేత్రనాడిగా ఏర్పడి నేత్రగోళం నుంచి అంధచుక్క లేదా నేత్రగాడి ద్వారా వెలుపలకు వస్తుంది.

10) అంధచుక్క ఎటువంటి కాంతి గ్రాహకాలను కల్గి ఉండదు. కావున ఈ ప్రాంతంలో ప్రతిబింబాలు ఏర్పడవు.

ప్రశ్న 4.
నాడీకణ సంధీయ అభివహనాన్ని విశదీకరించండి. [ AP MAR-16,18,22][ TS MAR-17]
జవాబు:
నాడీకణ సంధీయ అభివహనం:

  1. నాడీకణ సంధి అనే రెండు వరుస నాడీకణాల మధ్య ఉన్న జంక్షన్.
  2. ఇది ప్రచోదనాలను ఒక నాడీకణం నుంచి మరొక నాడీ కణానికి అందజేస్తుంది.
  3. ‘నాడీకణసంధులు’ రెండు రకాలు అవి: ‘విద్యుత్ నాడీకణ సంధి’ మరియు ‘రసాయన నాడీకణ సంధి’.
    (i) ‘విద్యుత్ నాడీకణ సంధి’ యందు నాడీకణ సంధి పూర్వ మరియు పరత్వచాలు సన్నిహితంగా దగ్గరగా ఉంటాయి. ఈ నాడీకణ సంధి, రెండు నాడీకణాల మధ్య విద్యుత్ ప్రచోదనాల ద్వారా అనుసంధానంగా పనిచేస్తుంది.
    (ii) రసాయన నాడీకణసంధి’ యందు నాడీ కణసంధి పూర్వ మరియు పరత్వచాలు ద్రవంతో నిండిన “కణసంధి చీలిక” ద్వారా వేరుచేయబడతాయి.
  4. ‘నాడీ అభివాహకాలు’ అనే ఈ రసాయన వాహకాలు నాడీ కణసంధులుకు ప్రచోదనాలను అందజేయుటలో పాల్గోంటాయి.
  5. ‘నాడీ అభివాహకాలు’ తంత్రికాక్షపు అంత్యాలు యొక్క నాడీకణసంధి ఆశయాల నుంచి ప్రారంభమవుతాయి.
  6. నాడీ ప్రచోదనం (క్రియాశక్మం) తంత్రికాక్షపు అంత్యాన్ని చేరివెంటనే విధ్రువణం చెందుతుంది, ఫలితంగా ‘కాల్షియం వోల్టేజ్ గేటెడ్ ఛానళ్లు’ తెరచుకొంటాయి.
  7. కాల్షియం అయాన్లు నాడీకణసంధి ఆశయాలలో ప్రేరణను కలిగించి త్వచం వైపు కదిలేలా చేస్తాయి. ఇక్కడ నాడీ కణసంధి అయాన్లు ప్లాస్మాత్వచంతో కలిసిపోయి నాడీ అభివాహకాన్ని ‘కణబహిష్కరణ’ అనే చర్య ద్వారా చీలిక లోనికి విడుదల చేస్తాయి.
  8. విడుదలైన నాడీ అభివాహకాలు (అధికంగా ఎసిటైల్ కోలిన్) పరనాడీ కణసంధి త్వచంలో ఉండే నిర్ధిష్ట గ్రాహకాలతో బంధితమవుతాయి.
  9. నాడీ కణసంధి పరత్వచంలో ‘లైగాండ్ గేటెడ్ ఛానళ్లు’ ఉంటాయి.
  10. ఈ అయాన్ల ప్రవేశం అనేది పరసంధి నాడీకణం యందు కొత్త ‘క్రియాశక్మాన్ని’ ఉత్పత్తి చేస్తుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

ప్రశ్న 5.
అంతరాంగాల పై సహానుభూత నాడీవ్యవస్థ, సహసహానుభూత నాడీవ్యవస్థల ప్రభావంలో గల భేదాలు పేర్కొనండి.
జవాబు:
క్రియాపరంగా సహానుభూత, సహసహానుభూత నాడీ వ్యవస్థల మధ్యగల భేదాలు:
సహనుభూత మరియు సహసహనుభూత నాడీ వ్యవస్థలు రెండూ స్వయంచోదిత నాడీవ్యవస్థ యొక్క శాఖలు.
సహానుభూత వ్యవస్థ(SNS)

  1. ఈ వ్యవస్థ వెన్నుపాము యొక్క ఉరః మరియు కటి ప్రాంతాల నుంచి ఏర్పడుతుంది.
  2. నాడీ సంధులన్నీ కలిసి రెండు గొలుసుల లాగా వెన్నుపాము రెండు వైపులా ఏర్పడతాయి.
  3. నాడీ సంధి పూర్వ తంత్రికాక్షాలు పొట్టివిగా ఉంటాయి.
  4. నాడీసంధి పర తంత్రికాక్షాల అంత్యాల నుంచి నార్ ఎపినెఫ్రిన్ ఉత్పత్తి అవుతుంది. కావునా వీటిని ‘అడ్రినర్జిక్ నాడులు’ అంటారు.
  5. ఈ వ్యవస్ధ ఒత్తిడి సమయంలో ఉత్తేజంగా ఉండి దేహన్ని ఉత్తేజ పరుస్తుంది.
  6. మొత్తంగా ఈ వ్యవస్థ యొక్క ముఖ్య విధి ఉత్తేజ పరచడం

సహసహాను భూత వ్యవస్థ(PNS)

  1. ఈ వ్యవస్థ మెదడు కపాల ప్రాంతం మరియు వెన్నుపాము త్రిక ప్రాంతాల నుంచి ఏర్పడుతుంది.
  2. నాడీసంధులు గొలుసులను ఏర్పరచవు. అవి విడిగానే ఉంటాయి.
  3. నాడీసంధి పూర్వ తంత్రికాక్షాలు పొడవుగా ఉంటాయి.
  4. నాడీసంధి పరతంత్రికాక్షాల అంత్యాల నుంచి ఎసిటైల్ కోలిన్ ఉత్పత్తి అవుతుంది. కావున వీటిని ‘కొలెనర్జిక్ నాడులు’ అంటారు.
  5. ఈ వ్యవస్ధ విరామ సమయంలో చైతన్యంగా ఉంటుంది.
  6. ఈ వ్యవస్థ యొక్క ప్రభావం నిరోధించడం.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం 3

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మానవుడి మెదడు నిర్మాణం, విధులను గురించి సంక్షిప్త వివరణ రాయండి. [TS MAY-22]
జవాబు:
మెదడు కపాల కుహరంలో అమరి ఉంటుంది. మెదడు అర్ధికపాలం మరియు మూడు కపాల పొరల ద్వారా సంరక్షించబడుతుంది. అవి వరాశిక, లౌతికళ మరియు మృద్వి.

లౌతికళ మరియు మృద్వి రెండు పొరల మధ్య ‘మస్తిష్కమేరుద్రవం’ ఉంటుంది. మెదడు మూడు ముఖ్య భాగాలుగా విభజించబడింది.
(A) పూర్వ మెదడు లేదా పూర్వగోర్ధం
(B) మధ్య మెదడు లేదా మధ్యగోర్ధం
(C) అంత్య మెదడు లేదా పశ్చిమగోర్ధం

A) పూర్వమెదడు (పూర్వగోర్ధం): పూర్వ మెదడు ఘ్రాణలశునం, మస్తిష్కం మరియు ద్వారా గోర్ధం అనే భాగాలను కలిగి ఉంటుంది. ఘ్రాణలశునాలు ఘ్రాణ ఉపకళ నుంచి వాసనకు సంబంధించిన ప్రచోదనాలను గ్రహిస్తాయి. మస్తిష్కం మెదడు యొక్క అతి పెద్ద భాగం. ఇది కుడి మరియు ఎడమ మస్తిష్కార్ధ గోళాలుగా ‘ఆయత విదరం’ ద్వారా విభజించబడుతుంది.

‘కార్పస్ కెల్లోసమ్’ ఈ రెండూ గోళాలను కలిపి రెండింటి మధ్య సమన్వయాన్ని చేకూర్చుతుంది.
మస్తిష్కం ఉపరితలం బూడిద వర్ణపదార్థాన్ని కలిగి ఉంటుంది. దీన్ని ‘మస్తిష్క వల్కలం’ అంటారు.

ఈ మస్తిష్క వల్కలం ఉపరితలం అనేక మడతలు ఉంటాయి. వీటిని ‘గైరి’ అని అంటారు. మడతల మధ్యగల లోతైన గాడులను ‘సల్సి’ అని అంటారు.

మస్తిష్క వల్కలం జ్ఞాన ప్రచోదనాలను, నియంత్రిత కదలికలను మరియు అనేక సంయుక్త విధులైన జ్ఞాపక శక్తి మరియు సమాచారాలను నియంత్రిస్తుంది.

మస్తిష్కార్ధ గోళాలు 4 లంబికలుగా విభజింపబడినాయి. అవి పూర్వలంబిక, పార్శ్వలంబిక, శంఖులంబిక మరియు అనుకపాల లంబిక.

ద్వారగోర్ధం (థాలామోన్ సెఫలాన్): దీనిలో ఊర్ధ్వ పర్యంకం, పర్యంకం మరియు అధోపర్యంకం అనే భాగాలు కలవు. ఊర్ధ్వపర్యంకం: ఇది ద్వారగోర్ధం యొక్క పైకప్పు. ఇది నాడీ రహితం, వరాశికతో కలిసి ‘పూర్వరక్త ప్లక్షంను’ ఏర్పరుస్తుంది. పూర్వరక్త ప్లక్షం యొక్క వెనుక భాగంలో ‘పీనియల్ వృంతం’ మరియు ‘పీనియల్ దేహం ఉంటాయి.

పర్యంకం:ఇది మెదడు పై స్థానంలో ఉండి, జ్ఞాన మరియు చాలక ప్రచోదనాల సమన్వయ కేంద్రంగా పని చేస్తుంది. అధోపర్యంకం: ఇది గరాటు వంటి ఆకారంతో ఉండి ‘కాలాంబిక’ పీయూష గ్రంధి చివరలో అంటిపెట్టుకుని ఉంటుంది. ఇది హర్మోనులను స్రవిస్తుంది. ఇది స్వయంచోదిత నాడీ వ్యవస్థ యొక్క క్రియలను నియంత్రణ మరియు సమన్వయం చేస్తూ, ద్రవాభిసరణ, ఉష్ణనియంత్రణ, దప్పిక మరియు ఆకలి వంటి చర్యలను సమన్వయం చేస్తుంది.

లింబిక్ వ్యవస్థ: మస్తిష్కార్ధ గోళాల లోపలి తలంలోని అమిగ్డాలా మరియు హిప్పోకేంపస్లు కలిసి ‘లింబిక్ వ్యవస్థ’ను ఏర్పరుస్తాయి. ఇది లైంగిక ప్రవర్తన మరియు భావోద్వేగ చర్యలను నియంత్రిస్తాయి.

B) మధ్యమెదడు లేదా మధ్యగోర్ధం: మధ్యమెదడు పృష్ఠభాగంలో నాలుగు లంబికలుండే ‘కార్పోరా క్వాడ్రిజమైనా’ అనే నిర్మాణం ఉంటుంది. పూర్వాంతంలోని పెద్ద లంబికలు ‘సుపీరియర్ కాలిక్యులి’ దృష్టి విధులను నియంత్రిస్తాయి. పరాంతంలోని చిన్న లంబికలు ‘ఇన్ ఫీరియర్ కాలిక్యులి’ శ్రవణ విధులను నియంత్రిస్తాయి.
ఉదరతలం ఒకజత ‘క్రూరా సెరిబ్రి’ అనే ఆయత నాడీ తంతువుల పట్టీలను కలిగి ఉంటుంది. ఇవి మస్తిష్కార్ధగోళాలను ఫాన్వరోలితో కలుపుతాయి.

C) అంత్య లేదా పశ్చిమగోర్ధం: దీని యందు పాన్స్ వరోలి మరియు మజ్జాముఖం అనే రెండు మస్తిష్కార్ధ గోళాలు ఉంటాయి. అనుమస్తిష్కం మెదడు యొక్క రెండవ అతిపెద్ద భాగం. దీని యందు తెలుపు వర్ణపదార్థం అనేక శాఖలు కలిగి చెట్టు లాగా ఉంటుంది. ఆ తెలుపు పదార్థాన్ని ‘ఆర్బోర్విటే’ అంటారు. దీని చుట్టూ బూడిద వర్ణపదార్థం అమరి ఉంటుంది. అనుమస్తిష్కం గమనాంగాల కదలికలను నియంత్రించి సమన్వయపరుస్తుంది. దేహం సమతాస్థితిని క్రమపరుస్తుంది.

పాన్స్వరోలి: ఇది అనుమస్తిష్కం క్రిందగా అమరి ఉంటుంది. ఇది రెండు అనుమస్తిష్కార్ధగోళాల భాగాలను కలుపుతుంది. ఇది అనుమస్తిష్కానికీ మరియు వెన్నుపాముకు మధ్య ‘పునఃప్రసార కేంద్రం’ (లేదా) ‘రిలేకేంద్రంగా’ పనిచేస్తుంది. ఇది శ్వాసకండరాల కదలికలను నియంత్రించే ‘న్యూమోటాక్సిక్ కేంద్రంగా’ పనిచేస్తుంది.

మజ్జాముఖం: ఇది మెదడు యొక్క పరాంత భాగం ఇది పృష్ఠభాగంలో ‘పరాంత రక్తప్లక్షం’ ను కలిగి ఉంటుంది. హృదయ స్పందన, శ్వాసక్రియ, మింగడం, వాంతి, దగ్గు, తుమ్ము, వెక్కిళ్ళు మొదలైనవాటి నియంత్రణ కేంద్రాలు దీని యందు ఉంటాయి.

మెదడు మూలం: మధ్యమెదడు, పాన్స్వరోలి మరియు మజ్ఞాముఖాలను కలిపి ‘మెదడు మూలం’ అంటారు.

మెదడు కోష్ఠకాలు: మెదడు యొక్క కుహరాలను ‘కోష్ఠకాలు’ అంటారు. మొదటి కోష్ఠకం కుడి మస్తిష్కార్ధగోళంలో ఉంటుంది. రెండవ కోష్ఠకం ఎడమ మస్తిష్కార్ధగోళంలో ఉంటుంది. మొదటి మరియు రెండవ కోష్టకాలను ‘పారసీల్ (లేదా) పార్శ్యకోష్ఠకాలు’ అంటారు. మూడవ కోష్ఠకం ‘డయోసీల్’ ద్వారగోర్ధంలో ఉంటుంది. పారసీల్లు ‘మన్రోరంధ్రం’ ద్వారా డయోసీల్తో కలుస్తాయి. నాలుగవ కోష్ఠకం అనుమస్తిష్కంలో ఉంటుంది. మూడవ మరియు నాల్గవ కోష్ఠకాలు సన్నని ‘ఐటర్’ లేదా ‘ఆక్విడక్ట్ ఆఫ్ సిల్వియస్’ ద్వారా కలుపబడతాయి నాల్గవ కోష్ఠకం వెన్నుపాములో ‘కేంద్రనాళంగా’ కొనసాగుతుంది. ‘మెదడు కోష్ఠకాలు’ మరియు ‘ఉప లౌతికళాకుహరం’ రెండూ ‘మస్తిష్కమేరుద్రవం’ చే నిండి ఉంటాయి.

నాడీ ప్రచోదనం స్వభావాన్ని, వహన విధానాన్ని సరైన చిత్రపటాల సహాయంతో వివరించండి.

నాడీ ప్రచోదనం అభివహనం: నాడీ కణాలు విద్యుత్ పరంగా ఉద్రేకం చెందుతాయి. నాడీ తంతువు ద్వారా ప్రయాణించే సమాచారం ‘విద్యుత్ ప్రచోదనం’ రూపంలో ఉంటుంది. నాడీ కణత్వచం (ఆక్సోలెమ్మా) ఇరువైపులా Na +మరియు K+ అయాన్లు ఉంటాయి.ఇవి రెండు రకాలుగా అనగా కణబాహ్యద్రవం నుంచి ఆక్సోప్లాజమ్ మరియు ఆక్సోప్లాజమ్ నుంచి కణ బాహ్యద్రవంకు రవాణా చెందుతాయి.

ఈ అయాన్ల కదలికకు సంబంధించి 3 ఛానళ్ళు కలవు . అవి
1) లీకేజి ఛానళ్ళు: దీని యందు Na మరియు K లీకేజి ఛానళ్ళు కలవు. ‘K’ ఛానళ్ళు’ Na ఛానళ్ళు కంటే ఎక్కువగా ఉంటాయి. .కావున ‘ఆక్సోలెమ్మా’ K+ అయాన్లకు ఎక్కువ పారగమ్యతను ప్రదర్శిస్తుంది.

2) లైగాండ్ గేటెడ్ ఛానళ్ళు: ఇవి నాడీ కణసంధి పరత్వచంలో ఉంటాయి. రసాయన ప్రేరణకు ఎక్కువగా స్పందిస్తాయి.

3) వోల్టేజ్ గేటెడ్ ఛానళ్ళు: త్వచశక్మంలోని మార్పుకు అనుగుణంగా తెరచుకొనే ఛానళ్ళును ‘వోల్టేజ్ గేటెడ్ ఛానళ్ళు’ అంటారు. సోడియం వోల్టేజ్ గేటెడ్ ఛానళ్ళు రెండు రకాలు, అని క్రియాత్మక మరియు నిష్క్రియాత్మక గేట్లు. పొటాషియంకు మాత్రం క్రియాత్మక గేటెడ్ ఛానళ్ళు మాత్రమే ఉంటాయి.

విరామ త్వచ శక్మం: సాధారణ స్థితిలో కణబాహ్య ద్రవం నందు ఆక్సోప్లాజ్మ్ రుణావేశాన్ని మరియు నాడీ త్వచం (ఆక్సోలెమ్మో) ధనావేశాన్ని ప్రదర్శిస్తాయి. సాధారణంగా ఇది ఆక్సోప్లాజమ్ నందు 40 నుంచి -90 మి. వోల్ట్ ఉంటుంది. ఒక క్లిష్ట విరామ శక్మం -70 మి. వోల్ట్ ఉంటుంది.

విరామ దశలో ఆక్సోలెమ్మా ‘ధ్రువణం’ చెందుతుంది.
విరామ దశ యందు Na యొక్క క్రియాశక్మ గేట్లు మూసివేసి ఉంటాయి.

ఇనాక్టివేషన్ గేటు తెరచుకొని మరియు పొటాషియం యొక్క ఆక్టివేషన్ గేటు మూసుకొని ఉంటాయి. సోడియం-పోటాషియం పంప్: Nat మరియు K+అయాన్లు రెండూ రెండు దిశలలో ప్రయాణిస్తున్నపుడు ఈ కదలికలు విరామశక్మంను అంతరాయపరుస్తాయి. ఈ ప్రసరణమ ఆక్సోలెమ్మా యందు ఉన్న Na-K పంప్ నియంత్రిస్తుంది. ఈ పంప్ 3 Na అయాన్లను మరియు 2K అయాన్లను రవాణా చేస్తు,–70 మి. వోల్ట్ల ‘విరామశక్మం’ ను నిర్వర్తిస్తుంది.

విధ్రువణం (ఎదిగే దశ): ‘నాడీ తంతువు’ ప్రేరేపించబడినపుడు ఆక్సోలెమ్మా K+ అయాన్లు కంటే Na+ అయాన్ల కు అధిక పారగమ్యతను చూపిస్తుంది. ఎందుకంటే Na అయాన్ల గేట్ తెరచి ఉంటుంది మరియు K అయాన్ల గేట్ మూసి ఉంటుంది. ఆక్సోలెమ్మా లోపలి వైపుకు ధనావేశంను మరియు వెలుపలి వైపుకు ఋణావేశంను కలిగి ఉంటుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

ఈ విధమైన విలోమ విద్యుదావేశంను ‘విధ్రువణం’ అంటారు.
క్రియాశక్మం: విధ్రువణ తలానికి ప్రక్కగా ఉన్న తలం ఎప్పుడూ బయటివైపుకి ధనావేశంను కలిగి ఉంటుంది. ఈ రెండు.తలాల మధ్య ఉన్న విద్యుదావేశాల మార్పునే క్రియా శక్మం అని అంటారు.

త్రెషోల్డ్(లేదా) దేహళి శక్మం: విధ్రువణం అనేది త్రెషోల్డ్ శక్మంను అనగా – 55 మి. వోల్ట్లను చేరినపుడు క్రియాశక్మం ఏర్పడుతుంది.
పూర్ణ లేదా శూన్య అనుక్రియ: త్రెషోల్డ్ తగినంతగా ఉన్నప్పుడు లేదా ఎక్కువగా ఉన్నపుడు క్రియాశక్మం ఏర్పడుతుంది, త్రెషోల్డ్ లేదా ప్రేరణ తక్కువగా ఉన్నపుడు క్రియాశక్మం ఏర్పడదు. నాడీప్రచోదనం అనేది పూర్తిగా లేదా అసలు ఏర్పడకపోవచ్చును. దీనినే పూర్ణ లేదా శూన్య అనుక్రియ అంటారు.

కీలికా శక్మం: ఆక్సోలెమ్మా యందు Na అయన్లు అధికంగా వచ్చి చేరటం వలన +45 మి. వోల్ట్ వరకు పెరుగుతుంది. దీనినే ‘కీలికా శక్మం’ అంటారు.

పునఃధ్రువణం: విధ్రువణం యొక్క తరంగాలు అవి ఏర్పడిన చోటు నుంచి దూరంగా పోతాయి. Na యొక్క క్రియాశక్మ గేట్లు మూసి ఉంటాయి. మిగతా రెండు Na మరియు K+ అయాన్లు వెలపలికి చేరుకొని విరామశక్మాన్ని పునరుద్ధరిస్తాయి. ఈ స్థితినే పునఃధ్రువణం అంటారు.

అధిధ్రువీకరణం: Na+ యొక్క క్రియాత్మక మరియు నిష్క్రియాత్మయక గేట్లు మూసుకుని ఉంటాయి. K+ గేట్లు తెరచుకుని ఉంటాయి. K+ అయాన్లు బయటకు పోవటం వలన ఋణాత్మక అంటే సుమారు 90 మి. వోల్ట్ల వరకు పోలారిటి తగ్గిపోతుంది. దీనినే ‘అధిధ్రువీకరణం’ అంటారు. K+ అయాన్ల గేట్లు చాలా నెమ్మదిగా (బద్దకపు గేట్లు) మూసుకుంటాయి. K+ అయాన్ల గేట్లు పూర్తిగా మూసుకోగానే పొలారిటీ విరామశక్మం కు చేరుకుంటుంది. అనుద్రిక్తతా వ్యవధి: రెండు సాధికా క్రియాశక్మాల మధ్య ఉన్న కాల వ్యవధినే ‘అనుద్రిక్తతా వ్యవధి’ అంటారు. ఇది రెండు రకాలు.
1. పరమ అనుద్రిక్తతా వ్యవధి: ఇందులో ప్రేరణ బలం ఎంత అధికంగా ప్రయోగించినా క్రియాశక్మం ఏర్పడదు. ఇది విధ్రువణం మరియు పునఃధ్రువణం కు దగ్గరగా ఉంటుంది.

2. సాపేక్ష అనుద్రిక్తతా వ్యవధి: ఇందులో ప్రేరణ బలం సాధారణ ప్రేరణ కంటే ఎక్కువగా ఉంటే క్రియాశక్మం ఏర్పడుతుంది. ఇది అధిధ్రువీకరణకు దగ్గరగా ఉంటుంది.
వహన వేగం: ఇది తంత్రికాక్షవ్యాసం మరియు మయలిన్ ఆచ్ఛాదం పై ఆధారపడి ఉంటుంది. వ్యాసం ఎంత ఎక్కువగా ఉంటే అంతే వేగంగా వహనం ఉంటుంది. మయలిన్ ఆచ్ఛాదం ఉన్న నాడీ కణాలలో Na మరియు K అయాన్ల గేట్ల యొక్క ఓల్టేజ్ రాన్వియర్ కణుపులపై ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కావున ప్రచోదనం ఒక కణుపు నుంచి వేరొక కణుపు వైపు దూకుతూ ప్రసరిస్తుంది. దీనినే ‘లంఘన వహనం’ అంటారు. ఇది మయలిన్ రహిత తంతువులలో జరిగే వహనం కంటే అధిక రెట్లు వేగంగా ఉంటుంది.

నాడీకణ సంధీయ అభివహనం: నాడీకణ సంధి రెండు వరుస నాడీకణాల మధ్య జంక్షన్. దీనియందు పూర్వసంధి నాడీకణ త్వచం యొక్క ఆశయాలు నాడీ కణసంధి చీలిక మరియు పరసంధి నాడీ కణం యొక్క అక్షాలు ఉంటాయి. నాడీ ప్రచోదనం పూర్వసంధి నాడీ కణం త్వచంను చేరగానే ‘నాడీ అభివాహకాలు’ నాడీ కణసంధి చీలికలోకి విడుదలవుతాయి. పరసంధి నాడీకణం యొక్క లైగాండ్ గేటెడ్ ఛానళ్ళు రసాయన ప్రేరణలను గ్రహించి, విద్యుత్ ప్రేరణలుగా మారుస్తాయి.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

ఎసిటైల్ కోలీస్, ఎఫినెఫ్రిన్, నార్ ఎఫినెఫ్రిన్, డోపమైన్, సెరటోనిన్, గ్లైసిన్ మరియు GABA (గామా అమైనో బ్యూటరిక్ ఆమ్లం) మొదలైనవి అన్ని ‘నాడీ అభివాహాకాలుగా’ పని చేస్తాయి. కొన్ని నాడీ కణసంధులలో నాడీ కణ సంధి చీలిక చాలా సన్నగా ఉండి, అంతర సంధులను ఏర్పరుస్తుంది. ఇటువంటి నాడీ కణసంధులలో ప్రచోదనాల అభివహనం వేగం చాలా అధికంగా ఉంటుంది.
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం 4
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం 5

Leave a Comment