AP Inter 2nd Year Botany Important Questions Chapter 3 ఎన్జైమ్లు

Students get through AP Inter 2nd Year Botany Important Questions 3rd Lesson ఎన్జైమ్లు which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Botany Important Questions 3rd Lesson ఎన్జైమ్లు

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ప్రోస్థెటిక్ సముదాయాలు, సహాకారకాలతో ఏ విధంగా తేడాను చూపిస్తాయి?
జవాబు:

  1. ప్రోస్థెటిక్ సముదాయాలు అపోఎన్జైమన్ను ధృడంగా చుట్టుకుని ఉండే కర్బన పదార్థాలు.
  2. సహ-కారకం హాలోఎంజైమ్ యొక్క ప్రోటినేతర భాగం. ఇది లోహ అయాన్ లేదా కార్బన్ పదార్థం కావచ్చు.

ప్రశ్న 2.
ఫీడ్బాక్ నిరోధకత అంటే ఏమిటి?
జవాబు:

  1. ఫీడ్బాక్ నిరోధకత అనేది ఒక కణయుత నియంత్రణ విధానం.
  2. దీనియందు ఎంజైమ్ల చర్యలు ఎంజైమ్ల యొక్క అంత్య ఉత్పన్నం ద్వారా నిరోధించబడతాయి.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 3 ఎన్జైమ్లు

ప్రశ్న 3.
‘ఆక్సిడోరిడక్టేజ్’ లకు ఆ విధంగా ఎందుకు పేరు పెట్టారు? [TS MAR-20][MAR-14][TS MAY-17]
జవాబు:

  1. S మరియు S’ అనే రెండు అధస్థ పదార్థాల మధ్య జరిగే ఆక్సీకరణ చర్యలను ఎంజైమ్లు ఉత్తేజితం చేస్తాయి. కావున వీటిని ‘ఆక్సిడోరిడక్టేజ్’ లు అంటారు.
  2. ఉదా: S క్షయకరణం + S’ ఆక్సీకరణ IS ఆక్సీకరణ + S’ క్షయకరణ
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 3 ఎన్జైమ్లు 1

ప్రశ్న 4.
అపోఎన్జైమ్, సహకారకం మధ్య విభేదాన్ని తెలపండి.
జవాబు:

  1. అపోఎన్ఎజైమ్:హోలో ఎన్ఎమ్ యొక్క ప్రోటిన్ భాగాన్ని ‘అపోఎన్జైమ్’ అంటారు. ఇది రసాయనికంగా ప్రోటీన్ యుతమైనది.
  2. సహ-కారకం: హోలో ఎన్జైమ్ యొక్క ప్రోటీనేతర భాగాన్ని ‘సహకారకం’ అంటారు. ఇది ఎంజైమ్ను క్రియాశీలకంగా, ఉత్తేజంగా ఉండేలా చేస్తుంది.

ప్రశ్న 5.
పోటీపడే ఎన్ఎమ్ నిరోధకాలు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ తెలపండి.
జవాబు:

  1. నిరోధకం అధస్ధ పదార్ధంతో పోలిక ఉండి దీని పై పనిచేసే ఎన్జైమ్ ‘క్రియా శీలతను నిరోధిస్తే’ దానిని ‘పోటీ పడే నిరోధకం’ అంటారు.
  2. ఉదా: ‘మెలానిక్ ఆమ్లం’ అధస్థపదార్ధం సక్సినేట్ను పోలి ఉంటుంది మరియు అది సక్సినిక్ డీహైడ్రోజినేజ్ చర్యను నిరోధిస్తుంది.

ప్రశ్న 6.
పోటీపడని ఎన్ఎమ్ నిరోధకాలు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:

  1. కొన్ని నిరోధకాలు అధస్థ పదార్ధంతో నిర్మాణాత్మక పోలిక లేకుండా ఎన్జైమ్ క్రియాశీలస్థానం వద్ద కాకుండా వేరొక స్థానం వద్ద అతుక్కొని ఆ ఎన్జైమ్ యొక్క గొళాభ నిర్మాణమును మార్పు చేస్తాయి. వీటినే పోటీపడని ఎన్జైమ్ నిరోధకాలు అంటారు.
  2. ఉదా: లోహ అయాన్లు అయిన రాగి, మెర్క్యూరి.

ప్రశ్న 7.
ఎన్ఎమ్ సంకేతంలోని నాలుగు అంకెలు వేటిని సూచిస్తాయి?
జవాబు:

  1. ఎన్ఎమ్ సంకేతంలోని నాలుగు అంకెలు ఒక్కొక్క ఎన్జైమ్ను గుర్తించుటకు సహాయపడతాయి.
  2. ఉదా: గ్లూకోజ్-6- ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ సంకేతం (E.C) 2.7.1.2
  3. మొదటి సంఖ్య ఎన్ఎమ్ యొక్క ‘విభాగాన్ని’ సూచిస్తుంది.
  4. రెండవ సంఖ్య ఎన్ఎమ్ యొక్క ‘ఉప విభాగాన్ని’ సూచిస్తుంది.
  5. మూడవ సంఖ్య ఎన్జైమ్ యొక్క ‘ఉప-ఉప విభాగాన్ని’ సూచిస్తుంది.
  6. నాల్గవ సంఖ్య ఎన్జైమ్ యొక్క ‘వరుస సంఖ్య’ ను సూచిస్తుంది.

ప్రశ్న 8.
“తాళం కప్ప, తాళం చెవి” పరికల్పనను, “ఇండ్యూస్డ్-ఫిట్” సిద్ధాంతాలను ఎవరు ప్రతిపాదించారు?
జవాబు:

  1. ‘తాళంకప్ప మరియు తాళం చెవి పరికల్పన’ను ఇమిల్ ఫిషర్ ప్రతిపాదించాడు.
  2. ‘ఇండ్యూస్డ్-ఫిట్ పరికల్పన’ను డానియల్ ఇ. కోషాండ్ ప్రతిపాదించాడు.

ప్రశ్న 9.
మైఖెలిస్ స్థిరాంకం అంటే ఏమిటి? [TS MAY-22]
జవాబు:
మైఖెలిస్ స్థిరాంకం (km): గరిష్ట చర్యావేగంలో సగం జరగడానికి కావలసిన అధస్థ పదార్ధ గాఢతను ‘మైఖైలిస్ స్ధిరాంకం’ అని అంటారు.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 3 ఎన్జైమ్లు

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
రేఖా చిత్ర నిరూపణ (వర్ణన) సహాయంతో ఎన్జైమ్ క్రియాశీలతను pH ఏవిధంగా ప్రభావితం చేస్తుందో వివరించండి.
జవాబు:

  1. ఎన్జైమ్ క్రియాశీలతపై pH ప్రభావితం రేఖా చిత్రం గీయగా ‘పరావలయం’ ఆకారం ఏర్పడింది.
  2. ప్రతి ఎన్ఎమ్లు ఒక నిర్ధిష్ట pH వద్ద అతి ఎక్కువ క్రియాశీలతను చూపిస్తాయి. దీనినే ‘యుక్తతమ pH’ అంటారు.
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 3 ఎన్జైమ్లు 2
  3. pH యుక్తతమ విలువ కన్నా, ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా క్రియాశీలత తగ్గిపోతుంది.
  4. ఎక్కువగా ఎన్జైమ్లు అన్ని pH తటస్థంగా ఉన్నప్పుడు వాటి విధులను సక్రమంగా నిర్వర్తిస్తాయి.

ప్రశ్న 2.
ES సంక్లిష్టం తయారీ ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
ES సంక్లిష్టం ఏర్పడే విధానం:

  1. ప్రతి ఎన్ఎమ్ ఒక ఉత్తేజ స్థానాన్ని కలిగి ఉంటుంది.
  2. అధస్థపదార్ధం ఆ ఉత్తేజస్థానంలో బంధింపబడి ఎన్జైమ్ ‘అధస్థ పదార్థా సంక్లిష్టాన్ని’ ఏర్పరుస్తుంది.
  3. ఇది స్వల్పకాలికంగా ఉండి ఉత్పాదితంగా వియోజనం చెందుతుంది.
  4. ఈ ఎన్జైమ్ ఎటువంటి మార్పు చెందదు.
  5. ‘ఎన్ఎమ్ ఉత్పాదిత సంక్లిష్టం (ES) ఏర్పడుతుంది.
  6. ఎన్జైమ్ ఈ చర్యలోని ఉత్పాదితాలను విడుదల చేసి స్వేచ్ఛగా మారుతుంది.
  7. ఎన్జైమ్ వేరొక అధస్థపదార్ధంతో బంధనం కొరకు చూస్తుంది.
  8. ఎన్జైమ్ల శక్తి అవరోధాన్ని తగ్గించి, అధస్థ పదార్థం (S) నుండి ఉత్పాదితం(P) గా క్రమపరివర్తన చెందుటకు ES సంక్లిష్టం ఉపయోగపడుతుంది.

ప్రశ్న 3.
ఎన్ఎమ్ నిరోధకాల గురించి క్లుప్తంగా వ్రాయండి? [AP MAY-17][AP,TS MAR-17] [AP MAR-15,18,19]
జవాబు:
ఎన్ఎమ్ నిరోధకం: ఏ రసాయనాలు ఎన్ఎమ్ల యొక్క క్రియా శీలతను నిలుపుదల చేస్తాయో వాటిని ‘నిరోధకాలు’ అంటారు మరియు ఆ విధానాన్ని ‘నిరోధకత’ అంటారు. నిరోధకాలు మూడు రకాలు, అవి
a) పోటీపడే నిరోధకాలు
b) పోటీపడని నిరోధకాలు
c) ఫీడ్-బాక్ నిరోధకాలు

a) పోటీపడే నిరోధకాలు: ఏ రసాయనం అధస్థపదార్ధంతో దగ్గర పోలికను కలిగి, ఎన్ఎమ్ యొక్క క్రియా శీలతను తగ్గిస్తుందో దానినే ‘పోటిపడే నిరోధకం’ అంటారు.
ఉదా:మెలోనేట్, సక్సినేట్ అధస్ధపదార్ధాన్ని పోలి, సక్సినిక్ డీహైడ్రోజినేజ్ చర్యను నిరోధిస్తుంది.

b) పోటీపడని నిరోధకాలు: ఈ నిరోధకం నిర్మాణంలో అధస్ధపదార్ధాన్ని పోలి ఉండదు, కాని ఎన్ఎమ్ పై క్రియాశీలస్థానం వద్ద కాకుండా వేరొకస్ధానం వద్ద అతుక్కొని, ఎన్జైమ్ యొక్క గోళాభ నిర్మాణాన్ని మారుస్తుంది. ఇటువంటి నిరోధకాలను పోటిపడని నిరోధకాలు అంటారు.
ఉదా: లోహ అయాన్లైన కాపర్, మెర్క్యురీ.

c) ఫీడ్-బాక్ నిరోధకత: ఇది ఒక కణయుత నియంత్రిత చర్యలు, ఎన్జైమ్ క్రియాశీలత, ఎన్జైమ్ యొక్క అంత్య ఉత్పన్నం వలన నిరోధించబడుతుంది. ఇది జీవక్రియలోని హోమియోస్టాటిక్ నియంత్రణ భాగం.

ప్రశ్న 4.
వివిధ రకాల సహకారకాలను వివరించండి. [TS MAY-22] [AP MAY-22] [TS M-19][AP MAR-16]
జవాబు:
సంపూర్ణ ఎన్జైమ్ యొక్క ప్రోటీనేతర భాగాన్ని ‘సహ-కారకం’ అంటారు.
సహ – కారకాలు మూడు రకాలు.
a) ప్రోస్ధటిక్ సముదాయం
b) సహ ఎన్ఎమ్లు
c) లోహ అయాన్లు.

a) ప్రోస్థటిక్ సముదాయం: ఇవి అపోఎన్జైమ్కు ధృడంగా బంధించబడి ఉండే కర్బన పదార్ధాలు.
ఉదా: హైడ్రోజన్ పెరాక్సైడ్ను నీరు మరియు ఆక్సిజన్ గా విచ్ఛిన్నం చేసే పెరాక్సిడేజ్
AP Inter 2nd Year Botany Important Questions Chapter 3 ఎన్జైమ్లు 3
దీనియందు ‘హీమ్’ అనే ప్రోస్థటిక్ సముదాయం పెరాక్సిడేజ్ ఎన్జైమ్ను ధృడంగా అంటిపెట్టుకుని ఉంటుంది.

b) సహ-ఎన్ఎమ్లు:ఇవి అపోఎన్జైమ్కు వదులుగా అంటిపెట్టుకొని ఉండే కర్బన పదార్థాలు. ఈ సహ-ఎన్జైమ్లు నీటిలో కరిగే విటమిన్ల నుంచి లభిస్తాయి.
ఉదా: సహ – ఎన్జైమ్ NAD మరియు NADP రెండూ నియాసిన్ విటమిన్ న్నూ కలిగి ఉంటాయి.

c) లోహ-అయాన్లు: అనేక ఎన్ఎమ్ల క్రియాశీలతకు లోహ అయాన్లు అవసరం. ఇవి క్రియాశీల స్థానాల వద్ద పక్క శృంఖాలతో సమన్వయ బంధాలను ఏర్పరుస్తాయి.
ఉదా: ప్రోటీయోలైటిక్ ఎన్లైమ్ అయిన కార్బాక్సి పెప్టిడేజ్కు జింక్ ఒక సహకారకం.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 3 ఎన్జైమ్లు

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ఎన్ఎమ్ల వర్గీకరణ గురించి వ్రాయండి.
జవాబు:
ఎన్ఎమ్లను 6 విభాగాలుగా వర్గీకరించారు. అవి:
సీనియర్ వృక్షశాస్త్రం S-మెటీరియల్
1) ఆక్సిడోరిడక్టేజ్లు/డీహైడ్రోజినేజ్లు: S, S’ అనే రెండు అధస్థపదార్థాల మధ్య జరిగే ఆక్సీకరణ, క్షయకరణ ఉత్ప్రేరిత చర్యల్లో పాల్గొనే ఎన్జైమ్లు.
S క్షయకరణం చెందుట + S’ ఆక్సీకరణం చెందుట S ఆక్సీకరణం చెందింది + S’ క్షయకరణం చెందింది. మాలేట్ డీహైడ్రోజినేజ్
ఉదా:
AP Inter 2nd Year Botany Important Questions Chapter 3 ఎన్జైమ్లు 4

2) ట్రాన్స్ఫరేజ్లు(Transferases): G (హైడ్రోజన్ కాకుండా వేరొకటి) సముదాయాన్ని S,S’ అనే రెండు అధస్థపదార్థాల మధ్య రవాణా చేసే ఎన్ఎమ్లు.
ఉదా:
AP Inter 2nd Year Botany Important Questions Chapter 3 ఎన్జైమ్లు 5

3) హైడ్రోలేజ్లు(Hydrolases): ఎస్టర్ (ester), ఈథర్ (ether), పెప్టైడ్ (peptide), గ్లైకోసైడిక్ (glycosidic), C-C, C-హెలైడ్ లేదా P-N బంధాలను జలవిశ్లేషణ చేసే ఎన్ఎమ్లు.
ఉదా:
AP Inter 2nd Year Botany Important Questions Chapter 3 ఎన్జైమ్లు 6

4) లయేజ్లు(Lyases) :నీటి సమక్షంలో కాకుండా ఇతర యాంత్రికాల ద్వారా అధస్థపదార్థాల నుంచి సముదాయాలను తొలగించి ద్విబంధాలు ఏర్పరిచే ఎన్ఎమ్లు.
ఉదా:
AP Inter 2nd Year Botany Important Questions Chapter 3 ఎన్జైమ్లు 11

5) ఐసోమరేజ్లు (Isomerases): ధ్రువణ, జ్యామితీయ లేదా స్థాన సాదృశ్యాల అంతర బదిలీలలో పాల్గొనే ఎన్ఎమ్లు.
ఉదా:
AP Inter 2nd Year Botany Important Questions Chapter 3 ఎన్జైమ్లు 7

6) లైగేజ్లు (Ligases): 2 సంయోగికాలను కలిపే చర్యల్లో పాల్గొనే ఎన్జైమ్లు
ఉదా: C-O, C-S, C-N, P-O బంధాలను కలిపే ఎన్జైమ్లు.
ఉదా:
AP Inter 2nd Year Botany Important Questions Chapter 3 ఎన్జైమ్లు 8
ఈ పై వర్గీకరణ విధానం ద్వారా ఒక్కొక్క ఎన్జైమిని నాలుగు అంకెల సంఖ్యల ద్వారా గుర్తిస్తారు.
ఉదా: గ్లూకోస్-6-ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్కు ఎన్ఎమ్ సంఖ్య 2.7.1.2
మొదటి సంఖ్య (2) – ఎన్జైమ్ విభాగం.
రెండో సంఖ్య (7)– ఎన్జైమ్ ఉప విభాగం.
మూడవ సంఖ్య (1)– ఎన్జైమ్ ఉప ఉప విభాగం.
నాలుగో సంఖ్య (2)– ఎన్జైమ్ ఉప ఉప విభాగంలో వరుస సంఖ్య.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 3 ఎన్జైమ్లు

ప్రశ్న 2.
ఎన్ఎమ్ల చర్యా యాంత్రికాన్ని వివరించండి.
జవాబు:
ఎన్జైమ్ల చర్యా యాంత్రికాన్ని వివరించండి.

  1. ప్రతి ఎన్జైమ్ (E) అర్ధస్ధ పదార్ధాన్ని (S) బంధించే స్థానాన్ని తన అణువులో కలిగి ఉంటుంది.
  2. అక్కడ అధిక చర్యాపూరిత ఎన్జైమ్ – అధస్థ పదార్థ సంక్లిష్టం (ES) ఉత్పత్తి అవుతుంది.
  3. ఇది స్వల్పకాలికం.
  4. ఇది వియోగం చెంది ఎన్జైమ్-ఉత్పాదిత సంక్లిష్టంగా(EP)ఏర్పడుతుంది.
  5. అధస్ధ పదార్ధం ఒక ఉత్పాదితంగా మార్పుచెందడానికి శక్తి అవసరమవుతుంది. ఆ శక్తిని ‘ఉత్తేజిత శక్తి’ అంటారు.
  6. ‘ఉత్తేజితశక్తి’ వివిధ రూపాలలో అనగా, ఉష్ణం, ATP మొదలైన రూపాలలో వ్యక్తమవుతుంది.
  7. ఉత్ప్రేరక చర్యలో అధస్ధపదార్ధ సంక్లిష్టం ఏర్పడటం అనేది ఆవశ్యకం.
    E+S → ES → EP→ E+P
  8. చిత్రాత్మక రేఖా చిత్రం ద్వారా, Y- అక్షంపై స్థితిజశక్తిని మరియు X-అక్షంపై చర్యాపురోగతి తీసుకున్నప్పుడు S మరియు P ల మధ్య ఉండే శక్తి స్థాయిల బేధాన్ని గమనించవచ్చు.
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 3 ఎన్జైమ్లు 9
  9. S కంటే P తక్కువ స్థాయిలో ఉంటే, అది ఉష్ణమోచక చర్య. ఉత్పాదితం కొరకు శక్తిని అందజేయాల్సిన అవసరం లేదు.
  10. S కంటే P ఎక్కువ స్థాయిలో ఉంటే, అది శక్తి అవసరమయ్యే చర్య ఉత్పాదితం కొరకు శక్తిని అందించాలి.
  11. కావున S ఇంకా ఎక్కువ ‘అధిక శక్తి స్థితి’ లేదా ‘క్రమపరివర్తన స్థితి’ ద్వారా చర్యలో పాల్గొనాలి.
  12. ES సంక్లిష్టం ఏర్పడే విధానాన్ని ‘ఇమిల్ ఫిషర్’ ‘తాళంకప్ప మరియు తాళం చెవి పరికల్పన’ ద్వారా వివరించగా, తరువాత డానియల్ ఇ.కోషాండ్ ‘ఇండ్యూస్డ్-ఫిట్’ పరికల్పనతో వివరించారు.
  13. ఈ పరికల్పన ఆధారంగా ప్రతి ఎన్జైమ్కు ఒక “ఉత్తేజితస్థానం”ఉంటుంది.
  14. అధస్ధపదార్ధం, ఉత్తేజితస్థానాన్ని అతుక్కొని, ES సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది.
  15. అధస్ధపదార్ధ విచ్ఛిన్నం చెంది ఉత్పాదితంగా ఏర్పడే సందర్భంలో ఎన్జైమ్లు మార్చబడవు.
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 3 ఎన్జైమ్లు 10

Leave a Comment