AP Inter 2nd Year Botany Important Questions Chapter 1 మొక్కలలో రవాణా

Students get through AP Inter 2nd Year Botany Important Questions 1st Lesson మొక్కలలో రవాణా which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Botany Important Questions 1st Lesson మొక్కలలో రవాణా

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
పోరిన్లు అంటే ఏమిటి? విసరణ చర్యలో వాటి పాత్ర ఏమిటి? [APMAY-19] [AP MAR-18]
జవాబు:

  1. పోరిన్లు ఒక రకమైన ప్రోటీన్ల తూములు.
  2. ఇవి ప్లాస్టిడ్లు, మైటోకాండ్రియా మరియు కొన్ని బాక్టీరీయాల వెలుపలి త్వచంలో పెద్ద రంధ్రాలను ఏర్పరుస్తాయి.
  3. ఇవి చిన్న సైజు ప్రోటీన్ అణువులను ‘విసరణ ద్వారా’ తమ గుండా ప్రయాణం చేయనిస్తాయి.
  4. ఈ విధంగా పోరిన్లు ‘సులభతర విసరణ’ ను జరుపుతాయి.

ప్రశ్న 2.
నీటి శక్మంను నిర్వచించండి. శుద్ధమైన నీటికి గల నీటి శక్మం విలువ ఎంత? [TS MAR-20]
జవాబు:

  1. నీటి శక్మం (yw): నీరు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంకు ప్రయాణించే సామర్ధ్యాన్ని కొలిచే ప్రమాణాన్ని నీటి శక్మం అంటారు.
  2. స్వచ్ఛమైన నీటియొక్క నీటి శక్మం విలువ సున్నా’0′ .

AP Inter 2nd Year Botany Important Questions Chapter 1 మొక్కలలో రవాణా

ప్రశ్న 3.
ద్రవాభిసరణ,విసరణల మధ్య భేదమేమిటి?
జవాబు:
ద్రవాభిసరణ

  1. ద్రవాభిసరణలో ద్రావిత (నీటి) అణువులు తక్కువ గాఢత నుంచి అధిక గాఢత వైపుకు ప్రయాణిస్తాయి.
  2. ఇది అర్ధ పారగమ్య త్వచం ద్వారా జరుగుతుంది.
  3. ఇది ద్రావణాలలో మాత్రమే జరుగుతుంది.
  4. ఉదా:మొక్క కణాలలో జరిగే నీటి ద్రవాభిసరణ

విసరణ

  1. విసరణలో ద్రావణంలోని అణువులు అధిక గాఢత నుంచి, తక్కువ గాఢత వైపుకు ప్రయాణిస్తాయి.
  2. దీనికి ఎటువంటి త్వచం అవసరం ఉండదు.
  3. ఇది ఎక్కువగా ద్రావణాలు మరియు వాయువులలో జరుగుతుంది.
  4. ఉదా: కిరణజన్య సంయోగ క్రియలో (CO2 మరియు O2) వాయువుల విసరణ

ప్రశ్న 4.
బాష్పోత్సేకంను, బాష్పీభవనంతో పోల్చండి. [APMAR, MAY-17]
జవాబు:
బాష్పోత్సేకం

  1. బాష్పోత్సేకం ప్రక్రియలో మొక్కల వాయుగతభాగాలలోని సజీవకణజాలాల నుంచి నీరు ‘ఆవిరి రూపం’లో వాతావరణంలోకి చేరుతుంది.
  2. ఇది మొక్కల లోపల జరుగుతుంది.
  3. ఇది వృక్షశరీరధర్మ ప్రక్రియ.
  4. ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ.

బాష్పీభవనం

  1. బాష్పీభవనం ప్రక్రియలో జీవ లేదా నిర్జీవ భాగాలు యొక్క ఉపరితల భాగాల నుంచి నీరు కోల్పోవడం జరుగుతుంది.
  2. ఇది ఉపరితలంపై జరుగుతుంది.
  3. ఇది భౌతిక ప్రక్రియ.
  4. ఇది వేగంగా జరిగే ప్రక్రియ.

ప్రశ్న 5.
అపోప్లాస్ట్, సింప్లాస్ట్ అంటే ఏమిటి? [AP MAR-19,22][TS MAR-17,15]
జవాబు:
అపోప్లాస్ట్

  1. ఎటువంటి త్వచం లేకుండా మొక్కలలో నీటి రవాణా జరిగే మార్గమును ‘అపోప్లాస్ట్’ అంటారు.
  2. ఇది వేగవంతమైన విధానం

సింప్లా

  1. కొన్ని త్వచాలను దాటడం ద్వారా మొక్కలలో నీటి రవాణా జరిగే మార్గమును ‘సింప్లాస్ట్’ అంటారు.
  2. ఇది నెమ్మదైన విధానం

ప్రశ్న 6.
బిందు స్రావానికి, బాష్పోత్సేకానికి మధ్య భేదమేమిటి?
జవాబు:
బిందు స్రావం

  1. బిందు స్రావం నందు, మొక్కల పత్రాల నుంచి నీరు ‘బిందువుల’ రూపంలో కోల్పోతుంది.
  2. సాధారణంగా ఇది రాత్రివేళల్లో జరుగుతుంది.
  3. ఇది అనియంత్రణా విధానం.

బాష్పోత్సేకం

  1. బాష్పోత్సేకం నందు, మొక్కల పత్రాల నుంచి నీరు ‘నీటి ఆవిరి’ రూపంలో కోల్పోతుంది.
  2. సాధారణంగా ఇది పగటి వేళల్లో జరుగుతుంది.
  3. ఇది నియంత్రణా విధానం.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 1 మొక్కలలో రవాణా

ప్రశ్న 7.
ద్రావణానికి గాని, శుద్ధజలానికి గాని వాతావరణ పీడనం కంటే అధిక పీడనాన్ని అనువర్తింపజేస్తే ఏం జరుగుతుంది?
జవాబు:

  1. శుద్ధజలానికి సాధారణ వాతావరణ పీడనంలో నీటి శక్మం ‘సున్నా’ (0) ఉంటుంది.
  2. ద్రావణానికి గాని, శుద్ధజలానికి గాని వాతావరణ పీడనం కంటే అధిక పీడనాన్ని అనువర్తింపజేస్తే వాటి ‘నీటిశక్మం’ పెరుగుతుంది.

ప్రశ్న 8.
వృక్ష కణాన్ని అధిక నీటి శక్మం గల ద్రావణంలో ఉంచినపుడు ఏం జరుగుతుందో వివరించండి.
జవాబు:

  1. వృక్ష కణాన్ని అధిక నీటి శక్మం గల ద్రావణంలో ఉంచినపుడు, కణం నీటిని పీల్చుకొని ‘స్ఫీతం’ చెందుతుంది.
  2. దాని వలన కణాల ‘నీటి శక్మం’ పెరుగుతుంది.

ప్రశ్న 9.
మొక్కల దారువు ద్వారా జరిగే ద్రవ్యోద్గమానికి కారణమయ్యే భౌతిక కారకాలు ఏవి?
జవాబు:
ద్రవ్యోర్గమానికి కారణమయ్యే భౌతిక కారకాలు :

  1. సంసంజనం: ఇది నీటి అణువుల మధ్య పరస్పర ఆకర్షణ.
  2. అసంజనం: ఇది నీటి అణవులకు మరియు దారుకణాల ఉపరితలాల మధ్య ఆకర్షణ.
  3. బాష్పోత్సేకకర్షణ: ఇది నీటిని పైకి తోయగల తోపుడు బలం.

ప్రశ్న 10.
దారు రవాణా ఏకదిశా గమనంతోనూ, పోషక కణజాల రవాణా ద్విదిశా గమనంలో జరగడానికి గల కారణమేమి?
జవాబు:
1) దారువు నీటిని మరియు ఖనిజ లవణాలను వేర్ల నుండి పత్రాలకు ఊర్ధ్వ ముఖంగా రవాణా చేస్తుంది. దీనికి కారణం ‘బాష్పోత్సేకకర్షణ’. కావున వీటి రవాణా ఏకదిశాగమనంలో జరుగుతుంది.

2) సాధారణంగా పోషక కణజాలం పత్రాలలో (ఉత్పత్తి కేంద్రం) సంశ్లేషణం చెందిన ఆహారంను వాడుకునే లేదా నిల్వ చేసుకునే భాగాలకు (వినియోగపు కేంద్రం) రవాణా చేస్తుంది.

3) వసంత ఋతువులో ఈ ప్రక్రియ విరుద్ధంగా జరుగుతుంది. వినియోగ కేంద్రం ఉత్పత్తి కేంద్రంగా మారి నిల్వ ఉన్న ఆహారాన్ని లేత మొగ్గలకు సరఫరా చేస్తుంది. కావున పోషక కణజాలంలో రవాణా ‘స్థానాంతరణం’ చెందడం వలన ద్విదిశాగమనంలో ఊర్ధ్వముఖం మరియు అధోముఖంగా (ఎగువ మరియు దిగువ) జరుగుతుంది.

ప్రశ్న 11.
మొక్కలలో జరిగే ఆహార రవాణా సంబంధించి వినియోగ కేంద్రం, ఉత్పత్తి కేంద్రంగా పనిచేసేవి ఏవి? [TS MAR-19]
జవాబు:

  1. ఉత్పత్తి కేంద్రం: మొక్కలలో ‘ఆహారం తయారగు’ ప్రాంతాన్ని ఉత్పత్తి కేంద్రం అంటారు.
    ఉదా: పత్రాలు.
  2. వినియోగ కేంద్రం: మొక్కలో ‘ఆహారం నిల్వ ఉండు’ ప్రాంతాన్ని వినియోగ కేంద్రం అంటారు.
    ఉదా: ఫలాలు, మొగ్గలు.

ప్రశ్న 12.
బాష్పోత్సేకం రాత్రి వేళల్లో జరుగుతుందా? ఉదాహరణ నివ్వండి?
జవాబు:

  1. అవును, బాష్పోత్సేకం రాత్రి వేళల్లో జరుగుతుంది.
  2. ఉదా: బ్రయోఫిల్లమ్, కాక్టస్.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 1 మొక్కలలో రవాణా

ప్రశ్న 13.
పత్రరంధ్రాలు తెరుచుకునే, మూసుకునే సమయాలలో రక్షక కణాల pH లను పోల్చండి.
జవాబు:

  1. పత్రరంధ్రాలు తెరుచుకొనే సమయంలో రక్షక కణాల pH పెరుగుతుంది.
  2. పత్రరంధ్రాలు మూసుకునే సమయంలో రక్షక కణాల pH తగ్గుతుంది.

ప్రశ్న 14.
బాష్పోత్సేకం వల్ల జరిగే నష్టంకు సంబంధించి C3 కంటే C4 మొక్కలు ఎక్కువ సామర్ధ్యం కలిగి ఉంటాయి ఎందుకు?
జవాబు:

  1. C4 మొక్కలు నీటిని కోల్పోవడం తగ్గించుకొని C3 మొక్కల కన్నా అధికంగా CO2 స్ధాపన చేస్తాయి.
  2. C4 మొక్క అనేది C3 మొక్క లో నిర్ధిష్ట కర్బన స్థాపన చేసినప్పుడు కోల్పోయే నీటిలో సగం మాత్రమే కోల్పోతుంది.

ప్రశ్న 15.
రవాణా సంతృప్తత అంటే ఏమిటి? ఇది సులభతర విసరణను ఎలా ప్రభావితం చేస్తుంది?
జవాబు:

  1. రవాణా వ్యవస్థలో ఒక దశలో ప్రోటీన్ వాహకాలన్నీ వినియోగింపబడి, రవాణా చర్య వేగం ఒక సంతృప్త స్ధాయికి (గరిష్టస్థాయికి) చేరుతుంది. దీనినే ‘రవాణా సంతృప్తత’ అంటారు. ఈ దశలో రవాణా అనేది మధ్యస్థాయిలో ఉంటుంది.
  2. ‘రవాణా సంతృప్తత’ అనునది సులభతర విసరణను పెంచుతుంది.

ప్రశ్న 16.
మొక్కల వ్యవస్థలలో పీడనశక్మం రుణాత్మకంగా ఉండవచ్చు. విశదీకరించండి.
జవాబు:

  1. స్ఫీతం చెందిన మొక్క కణంలో సాధారణంగా పీడనశక్మం ‘ధనాత్మకంగా’ ఉంటుంది.
  2. దారువులో బాష్పోత్సేకం వలన పీడన శక్మం ‘రుణాత్మకంగా’ ఉంటుంది.
  3. శ్రధం చెందిన కణంలో ప్లాస్మాత్వచం కణం కవచం నుండి దూరంగా జరుగుతుంది. కావున పీడన శక్మం ‘రుణాత్మకంగా’ ఉంటుంది.

ప్రశ్న 17.
నీటి ఎద్దడి ఉన్న పరిస్థితులలో ABA అనునది పత్రరంధ్రాల మూసివేతను ఎలా కలిగిస్తుంది? [ AP M-20]
జవాబు:
నీటి కొరత ఏర్పడిన పరిస్థితులలో ABA( అబ్సైసిక్ ఆమ్లం) రక్షక కణాల నుంచి K+ అయాన్లను బయటికి పంపి అవి ముడుచుకొనేలా చేస్తుంది.

ప్రశ్న 18.
బఠానీ గింజలు మరియు గోధుమ గింజల మధ్య ఉన్న నిపానం సామర్ధ్యతను పోల్చండి? [TS M-16]
జవాబు:

  1. ప్రోటీన్ సమృద్ధంగా ఉండే బఠానీ గింజలు, ఎక్కువ నీటిని నిపానం చేయడం ద్వారా, పిండి ఎక్కువగా ఉన్న గోధుమ గింజల కంటే ఎక్కువగా ఉబ్బుతాయి.
  2. కారణం: ప్రోటీన్ల నిపాన సామర్ధ్యం, కార్బోహైడ్రేట్ల నిపాన సామర్ధ్యం కంటే ఎక్కువగా ఉండుట.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 1 మొక్కలలో రవాణా

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
నీటి శక్మంను నిర్వచించి, వివరించండి? [AP MAR-18,19]
జవాబు:
నీటి శక్మం (ψw) : నీరు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి విసరణ, ద్రవాభిసరణ పద్ధతులలో ప్రయాణించే సామర్ధ్యాన్ని కొలిచే ప్రమాణాన్ని ‘నీటి శక్మం’ అంటారు. దీని ప్రమాణాలు: పాస్కల్ (Pa). ప్రామాణిక ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద స్వచ్ఛమైన నీటి యొక్క నీటి శక్మం సున్నా.

నీటిశక్మంకు రెండు ముఖ్యమైన అంశాలు కలవు (i) ద్రావిత శక్మం మరియు (ii) పీడన శక్మం
i) ద్రావిత శక్మం (ψs) : శుద్ధమైన నీటిలో ద్రావితాన్ని కరిగించినపుడు స్వచ్ఛమైన నీటి గాఢత తగ్గుతుంది. దీని వలన నీటి శక్మం కూడా తగ్గుతుంది. నీటి శక్మంలో ఏర్పడిన ఈ తగ్గుదలను ‘ద్రావితశక్మం’ అంటారు. ఇది ఎప్పుడూ ఋణాత్మకంగానే ఉంటుంది.

ii) పీడన శక్మం (ψp) : మొక్క కణంలో కొంత నీరు విసరణ ద్వారా ప్రవేశించినపుడు కణకవచం పై పీడనం పెరుగుతుంది. దీని వల్ల కణం ఉబ్బుతుంది. ఈ విధంగా నీటిశక్మం పెరుగుటనే ‘పీడన శక్మం’ అంటారు. ఇది ఎప్పుడూ ధనాత్మకంగానే వుంటుంది. కాండంలో ఊర్ధ్వముఖంగా జరిగే నీటి రవాణాలో ఇది కనిపిస్తుంది. నీటిశక్మం ψw = ψs + ψp·
కావున నీటిశక్మం ఎల్లప్పుడూ ద్రావిత శక్మం మరియు పీడన శక్మంల చేత ప్రభావితమై ఉంటుంది.

ప్రశ్న 2.
సులభతర విసరణ పై లఘుటీకను వ్రాయండి.
జవాబు:

  1. సులభతర విసరణ: ఈ విసరణలో చిన్న చిన్న ప్రోటీను అణువులు, పొరిన్లు విసరణ ద్వారా చెందుతాయి.
  2. ఒక త్వచం ద్వారా ఏ పదార్ధమైనా విసరణ చెందాలంటే, అది లిపిడ్ ద్రావణీయతపై కూడా ఆధారపడి ఉంటుంది.
  3. సాధారణంగా లిపిడ్ కరిగిపోయే పదార్థాలు, త్వచం ద్వారా ఎక్కువ వేగంగా విసరణ చెందుతాయి.
  4. జలాకర్షక ప్రోస్థెటిక్ పదార్థాలు త్వచం ద్వారా సులభంగా ప్రయాణించలేవు.
  5. కావున వీటి కదలికను సులభతరం చేయ్యాలి.
  6. కొన్ని ప్రత్యేక ప్రోటీన్లు పదార్థాలను త్వచం ద్వారా చలింపచేయడానికి సహాయం చేస్తాయి. అవి ఎటువంటి ATPని వినియోగించుకోవు.
  7. కొన్ని త్వచ ప్రోటీన్లు కొన్ని స్థావరాలను ఏర్పాటు చేస్తాయి. వీటి ద్వారా ప్రోస్థెటిక్ పదార్థాలు త్వచంను దాటుతాయి.
  8. ఈ రకమైన పోట్రీన్ల ఏర్పాటు అనేది విసరణను సులభతరం చేస్తుంది. దీనినే ‘సులభతర విసరణ’ అంటారు.
  9. ప్రోటీన్ పక్క గొలుసులతో చర్య జరిపే నిరోధకాలకు ఈ చర్య సూక్ష్మగ్రాహ్యతను చూపుతుంది.

ప్రశ్న 3.
కణద్రవ్య సంకోచం అంటే ఏంటి? మన నిజజీవితంలో దాని ఉపయోగమేమి? [TS MAR-18][AP MAR-16]
జవాబు:

  1. కణద్రవ్య సంకోచంలో ‘కణం యొక్క జీవపదార్ధం’ నీటిని కోల్పోయి స్ఫీతంచెంది ముడుచుకుపోతుంది.
  2. ఇది మొక్క కణాలను అధిక గాఢ ద్రావణంలో ఉంచినపుడు జరుగుతుంది.
  3. అప్పుడు కణం లోపలి నీటి అణువులు ద్రావణంలోంచి బయటకు వెళ్ళిపోతాయి.
  4. అలాగే కణత్వచం కణకవచం నుంచి విడిపోయి ముడుచుకుపోతుంది.
  5. ఇది జీవ పదార్ధం కణకవచం నుంచి దూరంగా ముడుచుకునేలా చేస్తుంది.
  6. ఇది కణత్వచం, కణకవచం నుంచి విడిపోయేలా చేస్తుంది.
  7. అట్టి కణాన్ని ‘కణద్రవ్యసంకోచం’ చెందిన కణం అంటారు.
  8. కణద్రవ్య సంకోచం చెందిన కణాన్ని మరల వెంటనే అల్పగాఢ ద్రావణంలో ఉంచినపుడు అది కోల్పోయిన నీటిని విసరణ ద్వారా తిరిగి పొందుతుంది.
  9. ఈ విధానాన్ని ‘అకణద్రవ్యసంకోచం’ అంటారు.
  10. ఉపయోగాలు: ఊరబెట్టిన పచ్చళ్ళు, చేపలు, మాంసం మరియు రొయ్యల నిల్వ.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 1 మొక్కలలో రవాణా

ప్రశ్న 4.
ఎత్తైన వృక్షాలలో ద్రవ్యోద్గమం ఎలా జరుగుతుంది? [AP,TS MAR-15][AP MAY-19]
జవాబు:

  1. ద్రవ్యోద్గమం అనగా గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా దారువు ద్వారా నీరు పైకి కదులుట.
  2. బాష్పోత్సేకకర్షణ అనునది ద్రవ్యోర్గమంలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది.
  3. బాష్పోత్సేకం వల్ల పనిచేసే దారువు ద్రవ్యోద్గమంలో ఈ కింద పేర్కొన్న భౌతిక ధర్మాలపై ఆధారపడి ఉంటుంది.
    (a) సంసంజనం- ఇది నీటి అణువుల మధ్య ఉండే పరస్పర ఆకర్షణ.
    (b) అసంజనం – ఇది ధృవ ఉపరితలాలకు నీటి అణువులకు మధ్య ఉండే ఆకర్షణ.
    (c) బాష్పోత్సేకకర్షణ- ఇది నీటిని పైకి తోయగల తోపుడుబలం.
  4. ఈ ధర్మాలు నీటికి అధిక తన్యతా బలాన్ని ఇస్తాయి. అనగా ఆకర్షణ బలాన్ని ఎదుర్కొనే సామర్ధ్యం మరియు అధిక కేశిక బలాన్ని అంటే సన్నని కేశికలో ఉద్గమించే సామర్థ్యాన్ని ఇస్తాయి.
  5. కిరణజన్య సంయోగ క్రియకు నీరు అవసరం.
  6. వేరు నుంచి కాండం వరకు ఉండే దారునాళాల వ్యవస్థ దీనికి అవసరమైన నీటిని సరఫరా చేస్తుంది.
  7. పత్రాలలోని పత్రరంధ్రాలలో ఏర్పడే ‘నీటి ఆవిరి’ బాష్పోత్సేకకర్షణ ను కలిగిస్తుంది.

ప్రశ్న 5.
పత్రరంధ్రాలు స్ఫీత మార్పుల వల్ల పని చేసే కవాటాలు. వివరించండి.
జవాబు:

  1. పత్రరంధ్రాలు తెరుచుకునే మరియు మూసుకునే ప్రక్రియ రక్షక కణాల స్ఫీత మార్పుల వలన జరగుతుంది.
  2. రక్షక కణం లోపలి గోడ రంధ్రం దగ్గరగా దళసరిగా మరియు స్థితిస్థాపకంగా ఉంటుంది.
  3. రక్షక కణాలలో స్ఫీతస్థితి పెరిగితే వెలుపలి పలుచని గోడలు ఉబ్బి లోపలి గోడలను అర్థచంద్రాకారంగా వంచుతాయి.
  4. రక్షక కణాలు నీటిని కోల్పోయినప్పుడు, లోపలి స్థితిస్థాపక కవచాలు తమ అసలు ఆకారాన్ని తిరిగి పొంది, రక్షక కణాలు శ్రధఃస్థితిని చేరి పత్రరంధ్రాలు మూసుకుంటాయి.
  5. కావున, పత్రరంధ్రాలు స్పీత మార్పుల వల్ల పని చేసే కవాటాలు అని చెప్పవచ్చు.

ప్రశ్న 6.
మొక్కలలో పీడన ప్రవాహం పరికల్పన విధానంలో జరిగే చక్కెరల స్థానాంతరణను వర్ణించండి?
జవాబు:

  1. పీడన ప్రవాహం (స్థూల ప్రవాహం పరికల్పన): మొక్కల పత్రాలలో ఆహరం ‘గ్లూకోజ్’ రూపంలో తయారవుతుంది.
  2. ఈ గ్లూకోజ్ ‘సూక్రోజ్’ గా మార్చబడుతుంది.
  3. ఇది సహకణాలలోకి ప్రవేశిస్తుంది.
  4. అక్కడి నుంచి పోషకకణజాలం యొక్క ‘చాలనీ నాళాలలోకి’ సక్రియా విధానంలో రవాణా చెందుతుంది.
  5. పోషక కణజాలంలో అధికగాఢ పరిస్థితులు పెరుగుతాయి.
  6. ప్రక్క ప్రక్క దారుకణాలలో ఉండే నీరు, పోషక కణజాలంలోకి ద్రవాభిసరణ ద్వారా చేరుతుంది.
  7. దీని వలన పోషక కణజాలంలో ద్రవాభిసరణ పీడనం పెరుగుతుంది.
  8. ఇది తక్కువ పీడనాలు ఉన్న ప్రాంతంవైపు చలించి చివరకు సింక్ ను చేరుతుంది.
  9. ఈ సింక్ లో చక్కెర ‘పిండిగా మారి’ నిల్వ చేయబడుతుంది.
  10. సింక్ కణాల నుంచి పిండి, సక్రియా రవాణా ద్వారా తొలగించబడుతుంది.
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 1 మొక్కలలో రవాణా 1

ప్రశ్న 7.
“బాష్పోత్సేకం ఆవశ్యకమైన అనర్ధం”. వివరించండి. [APMAR-17,20,22][AP,TS MAY-17] [TS MAR-16,20]
జవాబు:
బాష్పోత్సేకం వలన ఉపయోగాలు మరియు అనర్ధాలు రెండూ ఉన్నాయి, కావున ఇది ఆవశ్యకమైన అనర్ధం. A) బాష్పోత్సేకం యొక్క ఉపయోగాలు:

  1. మొక్కలలో బాష్పోత్సేకం అనునది నీటి శోషణ మరియు రవాణాకు ‘బాష్పోత్సేకకర్షణను’ సృష్టిస్తుంది.
  2. ఇది కిరణజన్య సంయోగక్రియకు నీటిని అందిస్తుంది.
  3. ఇది ఖనిజాలను నేలనుంచి మొక్కలోని ఇతర అన్ని భాగాలకు రవాణా చేస్తుంది.
  4. ఇది పత్ర ఉపరితలాన్ని బాష్పీభవన శీతలీకరణం చేస్తుంది.
  5. ఇది కణాలకు స్ఫీత స్థితిని కలిగించి ఆకారాన్ని మరియు నిర్మాణాన్ని నిలుపుతుంది.

B) బాష్పోత్సేకం యొక్క అనర్థాలు:

  1. అధిక బాష్పోత్సేకం వలన కణం స్పీతానికి గురి అవుతుంది.
  2. ఇది మొక్క యొక్క పెరుగుదల పై ప్రభావం చూపుతుంది.
  3. అధిక శాతం నీరు బాష్పోత్సేకం ద్వారా ఆవిరైపోతుంది.
  4. నీటి లభ్యత కొరత వలన కిరణజన్య సంయోగ క్రియారేటు తగ్గుతుంది.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 1 మొక్కలలో రవాణా

ప్రశ్న 8.
వేసవిలో ఒక రోజు తోటమాలి కుండిలోని మొక్కకు నీరు పట్టడం మరచిపోయాడు. మొక్కలో ఏ మార్పు చోటు చేసుకుంటుంది. ఇది ద్విగతమా? వివరించండి.
జవాబు:

  1. వేసవి కాలంలో, బాష్పోత్సేకం వలన మొక్కలు పత్రాల ద్వారా నీటిని కోల్పోతాయి.
  2. కావున మొక్కలు తాత్కాలికంగా ‘వడలి’ పోతాయి.
  3. మొక్కలకు నీటిని అందిస్తే అవి నీటిని పీల్చుకుంటాయి. పత్రకణాలు స్ఫీతం చెంది మరల సాధారణ స్థితికి చేరుకుంటాయి.
  4. ఒక వేళ మొక్కలకు నీటిని అందించకుండా మరొక రోజు ఎక్కువగా ఉంచినట్లయితే, అవి శాశ్వతంగా వడలిపోతాయి.
  5. మొక్కలు తిరిగి సాధారణ స్థితికి మరియు నిర్మాణానికి చేరుకోలేవు.
  6. ఇది ద్విగతము కాదు. కావున చివరగా మొక్కలు చనిపోతాయి.

ప్రశ్న 9.
ఎలాంటి జీవక్రియాశక్తి అవసరం లేకుండా, త్వచప్రోటీన్ల ఆవశ్యకతను కలిగి అమిత వరణాత్మకంగా ఉండే అణుచలనాన్ని వివరించండి?
జవాబు:
ఎలాంటి జీవక్రియాశక్తి అవసరం లేకుండా, త్వచప్రోటీన్ల ఆవశ్యకతను కలిగి అమిత వరణాత్మకంగా ఉండే అణుచలన విధానంను ‘సులభతర విసరణ’ అంటారు. దీని ప్రత్యేకతలు:

  1. అమిత వరణాత్మక అణుచలనం
  2. ప్రత్యేక త్వచ ప్రోటీన్ల ఆవశక్యత
  3. శక్తి అనావశ్యకత

(i) అమిత వరణాత్మకం: ‘సులభతర విసరణ’ లో త్వచ ప్రోటీన్లు, రవాణా కాలేనటువంటి పదార్థాల రవాణాను సులభతరం చేస్తాయి. కావున సులభతర విసరణలో అణువుల కదలిక అమిత వరణాత్మకంగా ఉంటుంది.

(ii) ప్రత్యేక త్వచ ప్రోటీన్లు : సాధారణ విసరణలో అణువులు నిరంతరం అధికగాఢత నుంచి అల్పగాఢత వైపు సమతాస్థితి ఏర్పడేంత వరకు చలిస్తాయి. కాని ‘సులభతర విసరణలో’ త్వచం కొన్ని ప్రత్యేక ప్రోటీన్లను కలిగి ఉంటుంది. వీటినే ‘పోరిన్లు’ అంటారు. ఇవి అణువులను దాటవేసే తూములుగా ఉంటాయి.

(iii) శక్తి అనావశ్యకత: ‘సులభతర ‘ విసరణ అనేది ఒక నిష్క్రియాత్మక రవాణా. ఇది పదార్థాల గాఢతా ప్రవణత ఆధారంగా జరుగుతుంది. కావున దీనికి ఎటువంటి శక్తి అవసరం లేదు ( ATP జల విశ్లేషణం).

ప్రశ్న 10.
ఆరోగ్యవంతమైన మొక్కలో ఎక్కువ నీరు ఎలా ఏ మార్గంలో ప్రయాణిస్తుంది?
జవాబు:
ప్రాథమికంగా మొక్కలలో నీటి శోషణ వేరు కేశాలలో విసరణ ద్వారా జరుగుతుంది. నీరు రెండు విభిన్న మార్గాల ద్వారా చేరుతుంది. 1) అపోప్లాస్ట్ 2) సింప్లాస్ట్
1) అపోప్లాస్ట్:దీనిలో నీటి రవాణాకు ఎటువంటి త్వచాలు అవసరం లేదు. వల్కలం లోని వల్కల కణజాలం వదులుగా అమరి ఉంటుంది. ఇక్కడ నీటి రవాణాకు ఎటువంటి అవరోధాలు ఉండవు. కావున అధిక మొత్తం నీటి రవాణా మొక్కల కణజాలంలోని కణాంతరావకాశం ద్వారా జరుగుతుంది. అపోప్లాస్ట్ వేగంగా జరిగే ప్రక్రియ.

2) సింప్లాస్ట్:దీనిలో నీటి రవాణా త్వచాల ద్వారా జరుగుతుంది. అంతశ్చర్మ కణాల గోడలు మందంగా, ‘కాస్పేరియన్ బద్దీల’ చే ఏర్పడి ఉంటాయి. కావున ఇవి నీటికి అపారగమ్యతను ప్రదర్శిస్తాయి. సింప్లాస్ట్ ప్రక్రియలో నీరు కణజాలంలోకి నాళికపుంజాల ద్వారా నెమ్మదిగా చేరుతుంది. కావున ఇది నెమ్మదిగా జరిగే చర్య.

ప్రశ్న 11.
బాష్పోత్సేకం, కిరణజన్య సంయోగ క్రియ ఒక సర్దుబాటు, వివరించండి? [TS M-19]
జవాబు:

  1. కిరణజన్య సంయోగ క్రియకు నిరంతర నీటి సరఫరా అవసరం. కారణం మొక్కలకు అసంతుష్టమైన నీటి ఆవశ్యకత ఉండుట.
  2. దీని వలన, మొక్కలు వాటి పత్ర రంధ్రాలను తెరచి వాయువుల వినిమయం చేస్తాయి.
  3. ఇలా పత్ర రంధ్రాలు తెరచుకోవటం వల్ల, నీరు ఆవిరి రూపంలో కోల్పోతుంది’.
  4. ఇది నీటిని నేల నుంచి ‘పైకి తోయుట’ ద్వారా బాష్పోత్సేకానికి దారి తీస్తుంది.
  5. ఈ విధంగా కిరణజన్య సంయోగ క్రియకు కావలసిన నీటిని బాష్పోత్సేకం అందిస్తుంది.
  6. కావున, బాష్పోత్సేకం మరియు కిరణజన్య సంయోగక్రియ రెండూ ఒకదానికొకటి సర్దుబాటు చేసుకునే ప్రక్రియలు లేదు ప్రదర్శించవు.

ప్రశ్న 12.
ఒకే ప్రాంతంలో పెరుగుతున్న భిన్న జాతుల మొక్కలు విశేషమైన కాలంలో ఒకే బాష్పోత్సేక వేగాన్ని ప్రదర్శిస్తాయా? మీ సమాధానాన్ని బలపరచండి.
జవాబు:
బాష్పోత్సేకం ప్రక్రియలో మొక్కల వాయుగత భాగాలలోని సజీవకణజాలాల నుంచి నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోకి చేరుతుంది.
ఒకే ప్రాంతంలో పెరుగుతున్న భిన్న జాతుల మొక్కలు విశేషమైన కాలంలో ఒకే భాష్పోత్సేక వేగాన్ని ప్రదర్శించవు. ఎందుకంటే, బాష్పోత్సేక వేగం రేటు అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది.

  1. పత్రం ఆకారం
  2. పత్రం నిర్మాణం
  3. పత్రం ఉపరితలం
  4. రక్షక కణాల pH
  5. పత్రరంధ్రాల సంఖ్య, విస్తరణం
  6. నీటి శోషణ
  7. మొక్క ఆవిర్భావం.

ఉదా: పూర్తి స్థాయికి పెరిగిన మొక్క జొన్న మొక్క రోజు మొత్తం మీద 3 లీటర్ల నీటిని శోషించుకుంటుంది. కాని ఆవమొక్క 5 గంటలలో తన బరువుకు సమానమైన నీటిని గ్రహిస్తుంది.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 1 మొక్కలలో రవాణా

ప్రశ్న 13.
పత్రరంధ్రాలు నిర్మాణం మరియు తెరచుకునే మూసుకునే యాంత్రికాన్ని వివరించండి. [TS MAR-15]
జవాబు:
లెవిట్ K+ అయానుల పంపు సిద్ధాంతం:

  1. ఈ సిద్ధాంతం ప్రకారం K+ అయాన్లు కాంతి ఉన్నపుడు అనుబంధ కణాల నుంచి రక్షక కణాలలోనికి సంచయనమవుతాయి.
  2. దీనితో పాటు ప్రోటాన్ల బహిస్రవణం జరిగి, రక్షక కణాల pH పెరుగుతుంది.
  3. Cl అయాన్ల నిష్క్రియా అంతఃస్రవణ జరిగి, రక్షక కణాల నీటి శక్మం పడిపోతుంది.
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 1 మొక్కలలో రవాణా 2
  4. రక్షక కణాలలోనికి నీరు ‘విసరణ చెంది’ స్ఫీత స్థితిని కలిగిస్తుంది.
  5. రక్షక కణాల యొక్క వెలుపలి గోడలు పలుచగా ఉండి, బయటకు ఒక చిన్న రంధ్రం మధ్యలో ఏర్పడేలా తెరచుకుంటాయి.
  6. రాత్రి సమయం, కాంతి లేనప్పుడు K+ మరియు Cl అయానులు రక్షక కణాల నుంచి బయటకు వెళ్ళిపోతాయి, దీని వలన రక్షక కణాల నీటి శక్మం పెరిగి, నీరు వెలుపలికి పోయి పత్రరంధ్రాలు మూసుకుంటాయి.
  7. నీటిఎద్దడి పరిస్ధితులలో అబిసైసిక్ ఆమ్లం (ABA), సహజ బాష్పోత్సేకం నిరోధకం, K+ అయానులను రక్షక కణం నుంచి బయటకు పంపి, మూసుకునేలా చేస్తుంది.
  8. రసభరితమైన మొక్కలలో నీటిశక్మం వలన రాత్రి వేళలో రక్షక కణాలలోనికి కర్బనిక ఆమ్లాలు చేరి స్ఫీతం చెందిస్తాయి. కావున పత్రరంధ్రాలు రాత్రివేళ తెరచుకుంటాయి.

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మొక్కలు నీటిని శోషించే విధమును వివరించండి.
జవాబు:
మొక్కలు నీటిని రెండు మార్గాల ద్వారా శోషించుకుంటాయి. I) అపోప్లాస్ట్ పథం II) సింప్లాస్ట్ పథం
I) అపోప్లాస్ట్ పథం:

  1. ఈ పథంలో నీటి రవాణాకు ఎటువంటి త్వచాలు అవసరం లేదు.
  2. అధిక మొత్తంలో నీటి రవాణా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది.
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 1 మొక్కలలో రవాణా 3
  3. నీరు వేర్ల నుండి అంతశ్చర్మం యొక్క ‘కాస్పేరియన్’ పట్టీలు తప్ప మిగిలిన అన్ని కణాల ద్వారా దారువును చేరుతుంది.
  4. ఇది ప్రవణత మరియు స్థూల ప్రవాహం పై ఆధారపడి ఉంటుంది.
  5. నీరు ఆవిరౌవుతున్న కొద్ది అపోప్లాస్ట్ విధానంలో తన్యత మరియు స్థూల ప్రవాహం నీటి కున్న సంసంజన మరియు అసంజన ధర్మాల వలన ఏర్పడుతుంది.

II) సింప్లాస్ట్ పథం:

  1. ఈ పథంలో నీటి రవాణా త్వచాల ద్వారా జరిగి కణంలోని కణద్రవ్యంకు చేరుతుంది.
  2. కణాల మధ్య నీటి చలనం కణద్రవ్య బంధాలు (ప్రక్క ప్రక్క కణాలు అనుసంధానించబడి ఉండే బంధాలు) ద్వారా జరుగుతుంది.
  3. ఈ ప్రక్రియ సాధారణంగా నెమ్మదిగా, కణద్రవ్యం ప్రవాహంలో జరుగుతుంది.
  4. దారువులో కణాల మధ్య నీటి ప్రవాహం సులువుగా జరుగుతుంది. అనేక రకాల అయాన్లు వేర్లకు రవాణా చేయబడతాయి. నీరు ప్రవణత గాఢత ఆధారంగా ప్రవహిస్తుంది.
  5. ఇది దారువు లోపల ఒత్తిడిని పెంచుతుంది. దీనినే ‘వేరు పీడనం’ అంటారు.
  6. ఈ వేరు పీడనం, మొక్కలలో నీటిని కొంత ఎత్తు వరకు పైకి పంపుటకు ఉపయోగపడుతుంది.
  7. మొక్కలు నీటిని ద్రవాభిసరణ విధానంలో శోషించుకుంటాయి.

ప్రశ్న 2.
బాష్పోత్సేకమును నిర్వచించండి. పత్రరంధ్రాల నిర్మాణం అవి తెరుచుకునే మూసుకునే యాంత్రికాన్ని వివరించండి.
జవాబు:
బాష్పోత్సేకము: జీవ లేదా నిర్జీవ భాగాలు యొక్క ఉపరితల భాగాల నుంచి నీరు కోల్పవటం జరుగుతుంది. ఈ ప్రక్రియనే బాష్పోత్సేకము అంటారు.
పత్రరంధ్రాల నిర్మాణం:

  1. పత్రం యొక్క బాహ్యచర్మంలో ఉన్న చిన్న రంధ్రాల వంటి నిర్మాణాలను పత్రరంధ్రాలు అంటారు. వీటి ద్వారా బాష్పోత్సేకం జరుగుతుంది.
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 1 మొక్కలలో రవాణా 4
  2. ద్విదళబీజంలో, ప్రతి పత్రరంధ్రం మూత్రపిండ ఆకారంలో ఉంటుంది. రక్షకణాలచే ఆవరించబడి ఉంటుంది.
  3. గడ్డిజాతి మొక్కలలో రక్షకకణాలు ‘డంబెల్ ఆకృతి’లో ఉంటాయి.
  4. రక్షక కణాలు పత్రహరిత రేణువులను కలిగి ఉంటాయి.
  5. రక్షకకణం లోపలి గోడ దళసరిగాను, వెలుపలి గోడలు పలుచగా ఉంటాయి.
  6. రక్షక కణాలను ఆవరించియున్న కణాలను ‘అనుబంధ కణాలు’ అంటారు.
  7. పత్రరంధ్రాల పరికరాలు (i) పత్ర రంధ్రం (ii) రక్షక కణాలు (iii) అనుబంధ కణాలు

పత్రరంధ్రాలు తెరుచుకోవటం మరియు మూసుకోవడం:

  1. పత్రరంధ్రాలు తెరుచుకోవటం లేదా మూసుకోవడం అనేది రక్షక కణాల స్పీథ మార్పుల వలన జరుగుతుంది.
  2. రెండు రక్షక కణాలో స్పీథ స్థితి పెరిగితే వెలుపలి పలచని గోడలు ఉబ్బి పత్రరంధ్రం తెరుచుకునేల చేస్తాయి.
  3. రక్షక కణాలు నీటిని కోల్పోయినపుడు లేదా నీటి ఎద్దడి ఏర్పడినపుడు, లోపలి స్థితి స్థాపక కవచాలు తమ అసలు ఆకారాన్ని తిరిగి పొందుతాయి. అప్పుడు రక్షకకణాలు శ్రధఃస్థితిని చేరి పత్రరంధ్రాలు మూసుకుంటాయి.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 1 మొక్కలలో రవాణా

లెవిట్ K+ అయానుల పంపు సిద్ధాంతం:

  1. ఈ సిద్ధాంతం ప్రకారం K+ అయాన్లు కాంతి ఉన్నపుడు అనుబంధ కణాల నుంచి రక్షక కణాలలోనికి సంచయనమవుతాయి.
  2. దీనితో పాటు ప్రోటాన్ల బహిస్రవణం జరిగి, రక్షక కణాల pH పెరుగుతుంది.
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 1 మొక్కలలో రవాణా 5
  3. Cl అయాన్ల నిష్క్రియా అంతఃస్రవణ జరిగి, రక్షక కణాల నీటి శక్మం పడిపోతుంది.
  4. రక్షక కణాలలోనికి నీరు ‘విసరణ చెంది’ స్ఫీత స్థితిని కలిగిస్తుంది.
  5. రక్షక కణాల యొక్క వెలుపలి గోడలు పలుచగా వుండి, బయటకు ఒక చిన్న రంధ్రం మధ్యలో ఏర్పడేలా తెరచుకుంటాయి.
  6. రాత్రి సమయంలో కాంతి లేనప్పుడు K+ మరియు Cl అయానులు రక్షక కణాల నుంచి బయటకు వెళ్ళిపోతాయి, దీని వలన రక్షక కణాల నీటి శక్మం పెరిగి, నీరు వెలుపలికి పోయి పత్రరంధ్రాలు మూసుకుంటాయి.
  7. నీటిఎద్దడి పరిస్థితులలో అబ్సైసిక్ ఆమ్లం (ABA), సహజ బాష్పోత్సేకం నిరోధకం, K+ అయానులను రక్షక కణం నుంచి బయటకు పంపి, మూసుకునేలా చేస్తుంది.
  8. రసభరితమైన మొక్కలలో నీటిశక్మం వలన రాత్రి వేళలో రక్షక కణాలలోనికి కర్బనిక ఆమ్లాలు చేరి స్ఫీతం చెందిస్తాయి. కావున పత్రరంధ్రాలు రాత్రివేళ తెరచుకుంటాయి.

Leave a Comment