AP Inter 2nd Year Botany Notes Chapter 8 వైరస్లు

Students can go through AP Inter 2nd Year Botany Notes 8th Lesson వైరస్లు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Botany Notes 8th Lesson వైరస్లు

→ ‘వైరస్లు’ అనేవి అతి సూక్ష్మమైన, సంక్రమణ చెందే మరియు అవికల్ప కణాంతస్థ ‘పరాన్నజీవులు’.

→ వైరస్లు అనేవి బాక్టీరియమ్లు, శైవలాలు, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులలో ఉన్న అన్ని రకాల కణాలకు సంక్రమించేవిగా చెప్పవచ్చు.

→ వైరస్లు కణాలను కలిగి ఉండవు మరియు వాటిని కాంతి సూక్ష్మదర్శిని క్రింద కూడా చూడలేము.

→ వైరస్లను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘వైరాలజీ’ అంటారు.

→ వైరస్ యొక్క పూర్తి రేణువును ‘విరియన్’ అంటారు.

→ వైరస్ రేణువు ఒక కేంద్రకామ్లాన్ని కలిగి ఉంటుంది.

→ దీని యొక్క జీనోమ్ నందు ఏక పోచయుత గుండ్రటి DNA (లేదా) RNA వుంటుంది.

AP Inter 2nd Year Botany Notes Chapter 8 వైరస్లు

→ వైరస్ లో ప్రోటీన్ కాప్సిడ్చే రక్షించబడుతూ కేంద్రకామ్లం వుంటుంది.

→ వైరస్లు చాలావరకు కణంలో జరిగే అన్ని జీవక్రియలను ప్రదర్శించలేవు.

→ కాని ప్రత్యుత్పత్తి ద్వారా జన్యు లక్షణాలను కొనసాగిస్తూ ఉత్పరివర్తనాలకు లోనవుతాయి.

→ వైరస్లు అవి దాడిచేసే అతిధేయి కణాలలో వృద్ధి చెందుతాయి.

→ ‘విరులెంట్ ఫాజ్లు’ లైటిక్ చక్రం ద్వారా ప్రతికృతిని అనుసరిస్తాయి.

→ ‘టెంపరేట్ ఫాజ్లు’ లైసోజెనిక్ చక్రం ద్వారా ప్రతికృతిని అనుసరిస్తాయి.

→ ఈప్రక్రియలో వైరస్ అనేక మానవ, మొక్కల మరియు జంతువుల వ్యాధులను కలుగచేస్తాయి.

→ క్యాన్సర్ను కలుగజేయు వైరస్లను ‘ఆంకోజెనిక్ వైరస్లు’ అంటారు.

→ బాక్టీరియాలపై దాడిచేయు వైరస్లను ‘బాక్టీరియోఫాజ్లు’ అంటారు.

→ వైరస్ల కంటే సరళమైన సంక్రమణ కారకాలను ‘ప్రియాన్లు’ అంటారు.

→ ‘ప్రియాన్లు’ అనేవి ప్రోటిన్ యుత సంక్రమణ కారకాలు.

AP Inter 2nd Year Botany Notes Chapter 8 వైరస్లు

→ ‘ప్రియాన్’ లు ఆవుల యందు ‘మాడ్ కౌ’ వ్యాధిని కలుగచేస్తాయి.

→ అతిధేయి కణం యొక్క ప్లాస్మా త్వచాన్ని వైరల్ ఎన్జైమ్ అయిన ‘లైసోజైమ్’తో కరిగిస్తాయి. [IPE]

→ TMV అనగా పొగాకు మొజాయిక్ వైరస్. ఇది దండాకృతి లో ఉంటుంది. [IPE]

→ TMV యొక్క జన్యుపదార్ధం ఒకే పోగు గల RNA అణువు, ఇది 6500 న్యూక్లియోటైడ్లను కలిగి ఉంటుంది. [IPE]

Leave a Comment