Students can go through AP Inter 2nd Year Botany Notes 14th Lesson మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Botany Notes 14th Lesson మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు
→ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలిగే సూక్ష్మజీవులను ‘మైక్రోబ్స్’ అంటారు.
→ మైక్రోబ్స్ అనేవి బాక్టీరియా, శిలీంధ్రాలు, ఈస్ట్లు వంటి వాటిలో కిణ్వన ప్రక్రియను కలుగజేసే సూక్ష్మజీవులు.
→ కొన్ని మైక్రోబ్స్ హానికరమైనవి. ఇవి ఆహారాన్ని మరియు ఉపయోగకరమైన వాటిని పాడు చేస్తాయి.
→ అధిక శాతం సూక్ష్మ జీవులు మానవులకు చాలా ఉపయోగకరమైనవి.
→ సూక్ష్మజీవుల ద్వారా పెరుగు, పిండి, రొట్టె, జున్ను, స్విస్ జున్ను మొదలైనవి ఏర్పడతాయి.
→ సూక్ష్మజీవుల ద్వారా పారిశ్రమికంగా లాక్టిక్ ఆమ్లం, అసిటిక్ ఆమ్లం మరియు ఆల్కహాల్ వంటి వాటిని ఉత్పత్తి చేస్తారు.
→ ‘పెన్సిలిన్’ అనే యాంటీబయాటిక్ ను సూక్ష్మజీవుల ద్వారా ఉత్పత్తి చేస్తారు.
→ డిప్తీరియా, కోరింత దగ్గు మరియు న్యూమెనియా వంటి వ్యాధులను యాంటీబయాటిక్స్ ద్వారా నియంత్రించవచ్చును.
→ మురుగు నీటిని శుద్ధిపరచటానికి మరియు నీటి పునరుత్పత్తికి సూక్ష్మజీవులు సహయపడతాయి.
→ మిధోనోజెన్స్ మొక్కల వ్యర్ధాలను కుళ్ళింపజేయడం ద్వారా మిథేన్ ను ఉత్పత్తి చేస్తాయి.
→ బయోగ్యాస్ అనేది సూక్ష్మజీవుల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఇది గ్రామాలలో ఒక శక్తి వనరుగా వినియోగిస్తారు.
→ హనికరమైన కీటకాలను నశింపజేయుటలో సూక్ష్మజీవులను వినియోగిస్తారు.
→ సూక్ష్మజీవుల ద్వారా ఉత్పత్తియైన జీవ ఎరువులను రసాయనిక ఎరువులకు బదులుగా వినియోగించవచ్చును.
→ స్విస్ జున్ను నందు పెద్ద రంధ్రాలు అధిక CO2 ఉత్పత్తి వలన ఏర్పడతాయి. [IPE]
→ ‘ఫర్ మెంటర్స్’ అనేవి పెద్ద పాత్రలు. వీటిని పానీయాలు మరియు యాంటిబయాటిక్స్ ఉత్పత్తికి వినియోగిస్తారు. [IPE]
→ ‘స్టాటిన్’ ల ఉత్పత్తిలో ఉపయోగించే సూక్ష్మజీవి ‘మొనాస్ కప్ పర్ప్యూరస్’ [IPE]
→ ‘న్యూక్లియోపాలి హైడ్రోవైరస్’ కీటకాల యొక్క జీవనియంత్రణకారి. [IPE]
→ సైక్లోస్పోరిన్ ను రోగ నిరోధకత బహిరంగం కాకుండా ఉండే సహకారిగా ఉపయోగిస్తారు. [IPE]