Students can go through AP Inter 2nd Year Botany Notes 11th Lesson జీవసాంకేతికశాస్త్రం; సూత్రాలు, ప్రక్రియలు will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Botany Notes 11th Lesson జీవసాంకేతికశాస్త్రం; సూత్రాలు, ప్రక్రియలు
→ ‘జీవసాంకేతిక శాస్త్రం’ జీవులు, కణాలు లేదా ఎన్ఎమ్లను ఉపయోగించి భారీ ఎత్తున ఉత్పన్నాలను ఉత్పత్తి చేయడంతో పాటు వాటి ప్రక్రియలను మార్కెటింగ్ కూడా చేస్తుంది.
→ జీవసాంకేతిక శాస్త్రం ద్వారా DNA వరుస క్రమాలను మార్చి, సరికొత్త DNAను నిర్మించుకోవచ్చును.
→ ఈ ప్రక్రియలో రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్, DNA లైగేజ్, ప్లాస్మిడ్ లేదా వైరస్ వాహకాలు, విజాతీయ జన్యువుల వ్యక్తీకరణ, జన్యు ఉత్పనాల శుద్దీకరణ మొదలైనవి ఉంటాయి.
→ అణుకత్తెరలు అనేవి రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్లు. ఇవి DNA ను ఒక ప్రత్యేక స్థానాలలో ఖండిస్తాయి. [IPE]
→ విజాతీయ DNA క్రమాలను వృద్ధి చేయుటకు వినియోగించే వాహకాలను క్లోనింగ్ వాహకాలు అంటారు. [IPE]
→ PCR సాంకేతికతలోని అంశాలు: (i) DNA క్లోనింగ్ (ii) జన్యుసంవర్ధకం (iii) DNA ఫింగర్ ప్రింటింగ్ [IPE]
→ మార్కెటింగ్ చేయడానికంటే ముందుగా ఉత్పత్తులను వేరుచేయుట మరియు శుద్ద పరచడం అనే ప్రక్రియలకు గురిచేయు విధానాన్ని ‘డౌన్ స్ట్రీమ్ ప్రక్రియ’ అంటారు.
→ పునఃసంయోజక DNA సాంకేతిక విధాన ప్రక్రియలు: [IPE]
- DNA వివక్తత
- DNA ఖండితాలు
- వాంఛిత DNA ఖండితాలను వివిక్తత చేయడం
- PCR పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ద్వారా వాంఛనీయ జన్యువిస్తరణం
- వాహకంలోకి DNA ఖండాన్ని జతపరచడం
- అతిధేయి కణంలోనికి పునఃసంయోజన rDNA ను చొప్పించడం
- వాంఛనీయ జన్యు ఉత్పన్నాలను పొందడం
- అనుప్రవాహ ప్రక్రియ
→ పునఃసంయోజక DNA సాంకేతిక పద్ధతికి కావలసిన సాధనాలు: [IPE]
- రెస్ట్రిక్షన్ ఎంజైములు
- పాలిమరేజ్ ఎన్జైమ్లు
- లైగేజ్
- వాహకాలు
- అతిధేయి జీవి.