AP Inter 1st Year Zoology Important Questions Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

Students get through AP Inter 1st Year Zoology Important Questions 4th Lesson జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర which are most likely to be asked in the exam.

AP Inter 1st Year Zoology Important Questions 4th Lesson జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
కార్డేట్లు, ఇకైనోడర్న్లు పంచుకొనే లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
కార్డేట్లు మరియు ఇకైనోడర్న్లో యొక్క సంయుక్త లక్షణాలు:

  1. సంయుక్త బీజ కుహరిక (డ్యూటిరోస్టోమ్ల స్థితి).
  2. వలయ మరియు అనిర్ధారిత విళదనం.
  3. ఆంత్రకుహర శరీర కుహరం (ఎంటిరో సీలోమ్)

ప్రశ్న 2.
సైక్లోస్టోమ్ల నాలుగు ముఖ్య లక్షణాలు రాయండి.
జవాబు:
సైక్లోస్టోమ్ల ముఖ్య లక్షణాలు:

  1. సైక్లోస్టోమ్లు దవడలు లేని జలచర జీవులు.
  2. శరీరము పొడవు, స్థూపంగా, పొలుసులేని ఈల్ లాగా ఉంటుంది.
  3. నోరు గుండ్రంగా మరియు చూషకంలా ఉంటుంది.
  4. నాలుక కొమ్ము వంటి దంతాలను కల్గి ఉంటుంది.
  5. హృదయం రెండు గదులను కల్గి ఉంటుంది.

ప్రశ్న 3.
లాన్సిలెట్లు, ఎసీడియన్లలో ఎండోస్టైల్ ప్రాముఖ్యం ఏమిటి? [TS M-18]
జవాబు:

  1. వీటిలో గ్రసని ఉదరకుడ్యం పై ఎండోస్టైల్ ఉంటుంది. ఇది శ్లేష్మాన్ని స్రవించే పొడవాటి నొక్కువంటి నిర్మాణము.
  2. ఇది ఆహార సేకరణకు ఉపయోగపడుతుంది. ఇది సకశేరుకాలలో థైరాయిడ్ గ్రంధికి సమజాతము.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర
ప్రశ్న 4.
షార్క్లు, కట్ల చేపలలో పుచ్ఛవాజం రకం, పొలుసుల పేర్లు తెలపండి. [TS M-16]
జవాబు:

  1. షార్క్లో పుచ్ఛ వాజం ‘విషమపాలిరకం’ మరియు పొలుసు ‘ సైక్లాయిడ్రకం’.
  2. కట్లా చేపలలో పుచ్ఛవాజం ‘సమపాల రకం’ మరియు పొలుసులు ‘సైక్లాయిడ్ (లేదా) టినాయిడ్’.

ప్రశ్న 5.
చేపలలో వాయుకోశాల ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:

  1. అస్థిచేపలలో వాయుకోశాలు ఉత్సవకతకు ఉపయోగపడతాయి. కావున చేపలు తేలికగా కావల్సిన ఎత్తులో ఈదగలుగుతాయి.
  2. ఇవి చేపలు నిలువుగా కదులటకు సహాయపడుతాయి.
  3. కొన్ని చేపలలో ఇవి శ్వాసక్రియకు సహాయపడుతాయి.

ప్రశ్న 6.
‘చేపల హృదయం జలశ్వాస హృదయం’ . ఈ వ్యాఖ్యను ఎలా సమర్ధిస్తారు? [TS M-19]
జవాబు:

  1. చేపల హృదయం రెండు గదులను కల్గివుంటుంది.
  2. ఇది రక్తమును నేరుగా మొప్పలకు రవాణా చేస్తుంది. కావున దీనిని జలశ్వాస హృదయము అని అంటారు.

ప్రశ్న 7.
సంపర్క కంటకాలు అంటే ఏమిటి? ఇవి ఏ చేపల సమూహంలో ఉంటాయి. [APM-18] [TS May-17,22]
జవాబు:

  1. సంపర్క కంటకాలు (దండాలు) అనేవి మగ చేపలలో శ్రోణి వాజాల వద్ద ఉండే సంపర్క అవయవాలు.
  2. ఇవి మృదులాస్థి చేపలలో కనిపిస్తాయి. ఉదా: షార్క్లు

ప్రశ్న 8.
ఉభయచరాల హృదయం సరీసృపాల హృదయంతో ఎలా విభేదిస్తుంది? [TS M-15]
జవాబు:

  1. ఉభయచర జీవులలో, హృదయం మూడు గదులుగా (రెండు కర్ణికలు, ఒక జఠరిక) ఉంటూ సిరాసరణి మరియు ధమని శంకువులను కల్గి వుంటుంది.
  2. సరీసృపాలలో హృదయము నాలుగు అసంపూర్తి గదులుగా ( 2 కర్ణికలు మరియు అసంపూర్తిగా విభజన చెందిన 2 జఠరికలు) ఉంటూ సిరాసరణిని కల్గి ఉంటుంది. కాని మూల మహాధమని ఉండదు.
  3. కాని మొసళ్లలో హృదయం పూర్తిగా నాలుగు గదులుగా విభజించబడి ఉంటుంది.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 9.
పరిణామక్రమంలో ఉభయచరాలలో మొట్టమొదటగా కనిపించిన నిర్మాణాల పేర్లు తెలపండి?
జవాబు:
పరిణామ క్రమములో ఉభయ చరజీవులలో మొదటగా కనిపించిన నిర్మాణాలు

  1. కర్ణభేరి( గాలి నుంచి వచ్చే శబ్దాలను గ్రహిస్తుంది).
  2. హర్డేరియన్ గ్రంధులు (కన్నులలో తేమ ఉండేలా చేస్తుంది).
  3. లాక్రియల్ గ్రంధులు (కన్నులలో తేమ ఉండేలా చేస్తుంది).

ప్రశ్న 10.
స్త్రీ, పురుష కప్పలను ఎలా గుర్తిస్తారు? [AP M-18]
జవాబు:
మగకప్పలు ద్వితీయ లైంగిక లక్షణాలను కల్గి ఉంటాయి. కాని ఆడ కప్పలలో ఇవి ఉండవు.

  1. మగకప్పలు క్రింది దవడ స్వరకోశాలను, శబ్ద బృహరీకరణకు కలిగి ఉంటాయి. ఆడ కప్పలలో ఉండవు.
  2. మగ కప్పలు ‘పూర్వాంగాల మొదటి వేలి’ కి ‘సంపర్క మొత్తలను’ కలిగి ఉంటాయి. ఆడ కప్పలలో ఉండవు.

ప్రశ్న 11.
కప్పలో శక్తియుత పంపు( ‘force pump’ ) అని దేన్ని అంటారు? దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారు?
జవాబు:
కప్పల పుపుస శ్వాసక్రియలో ఆస్యగ్రసని కుహరంను శక్తియుత పంపు అంటారు. ఆ పేరు పెట్టడానికి కారణం అది ఒక బలమైన పంపులాగా పని చేయడమే. ఉచ్ఛ్వాస క్రియలో ఆస్యగ్రసనీ కుహరం అడుగు భాగం పైకి లేచి గాలి ఒత్తిడికి కంఠబిలం తెరచుకొని, గాలి ఊపిరితిత్తులను చేరుతుంది. నిశ్వాసక్రియలో ఆస్యగ్రసనీ కుహరం క్రిందికి రావడం వలన గాలి వెలుపలికి పోతుంది.

ప్రశ్న 12.
కార్పొరాజైజెమినా అంటే ఏమిటి? వీటి ముఖ్యవిధి తెలపండి.
జవాబు:

  1. కప్ప యొక్క మధ్య మెదడులో ఉన్న రెండు దృష్టి లంబికలను ‘కార్పొరా బైజెమినా’ అని అంటారు.
  2. వీటి ముఖ్య విధి: దృష్టి (చూపు)

ప్రశ్న 13.
ముష్కయోజని, స్త్రీ బీజకోశయోజని మధ్య భేదాన్ని గుర్తించండి.
జవాబు:

  1. ముష్కయోజని: మగకప్పలలో ‘ముష్కాలు’ మూత్రపిండాలకు మరియు పృష్ఠశరీర కుడ్యానికి రెండు మడతల ఆంత్రవేష్ఠనంతో అతకబడి ఉంటాయి. అటువంటి ఆంత్ర వేష్ఠనాన్ని ముష్కయోజని అని అంటారు.
  2. స్త్రీ బీజకోశ యోజని:ఆడకప్పలలో స్త్రీ బీజకోశాలు మూత్రపిండాలకు మరియు పృష్ఠశరీర కుడ్యానికి రెండు మడతల ఆంత్రవేష్ఠనంతో అతకబడి ఉంటాయి. అటువంటి ఆంత్ర వేష్ఠనాన్ని స్త్రీ బీజకోశయోజని అని అంటారు.

ప్రశ్న 14.
మిల్ట్, స్పాన్ మధ్య భేదాలను గుర్తించండి. [TS MAY-22] [APM-17]
జవాబు:

  1. స్పాన్ అనగా ఆడకప్ప విడుదల చేసే గుడ్లరాశి (క్రిందిస్థాయి జలచర వర్టిబ్రేట్స్).
  2. మిల్ట్ అనగా మగకప్ప విడుదల చేసే శుక్రకణాల రాశి ( క్రిందిస్థాయి జలచర వర్టిబ్రేట్స్).

ప్రశ్న 15.
మొట్టమొదటి దవడల సకశేరుకాలు, మొదటి ఉల్బధారులు ‘స్వర్ణయుగాలను’ తెలపండి.
జవాబు:

  1. ‘చేపలు’ వర్టీబేట్స్లో మొట్టమొదటి దవడలు కలిగిన సకశేరుకాలు. వీటి ‘ ‘స్వర్ణయుగం’ ‘డివోనియన్ కాలం’
  2. సరీసృపాలు-మొదటి ఉల్బధారులు. వీటి ‘స్వర్ణయుగం’ ‘మేసోజాయిక్ కాలం’ .

ప్రశ్న 16.
దక్షిణ భారతదేశంలో గల రెండు విషయుత, విషరహిత సర్పాల పేర్లు తెలపండి. [AP M-16][IPE-14]
జవాబు:

  1. విషయుతసర్పాలు: నాజా నాజా (నాగు పాము), వైపరారసెల్లి ( గొలుసు రక్తపింజరి)
  2. విషరహిత సర్పాలు: ట్యాస్ (రాట్ స్నేక్), ట్రోపిడోనోటస్ (నీటి పాము)

ప్రశ్న 17.
సరీసృప చర్మం, కప్ప చర్మంతో ఏ లక్షణాలలో విభేదిస్తుంది?
జవాబు:

  1. సరీసృపాల చర్మము గరుకుగా, పొడిగా మరియు పొలుసులతో ఉంటుంది. కప్పల చర్మము సున్నితంగా, తేమగా మరియు పొలుసులు లేకుండా ఉంటుంది.
  2. సరీసృపాలలో బాహ్యస్థిపంజరం ఉంటుంది. కాని కప్పలలో బాహ్యస్థిపంజరం ఉండదు.

ప్రశ్న 18.
పిల్లి, బల్లిని అవి విసర్జించే ముఖ్య నత్రజని వ్యర్థాల ఆధారంగా వివరించండి.
జవాబు:

  1. పిల్లి క్షీరదము. క్షీరదాల విసర్జక పదార్ధం ‘యూరియ. ‘ కావున పిల్లి యూరియోటెలిక్ జీవి.
  2. బల్లి సరీసృపం. సరీసృపాల విసర్జక పదార్ధం ‘యూరిక్ ఆమ్లం’. కావున బల్లి యూరికోటెలిక్ జీవి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 19.
నాలుగు పిండ బాహ్యత్వచాల పేర్లు తెలపండి. [AP M-20][TS M-17,20]
జవాబు:
నాలుగు పిండ బాహ్యత్వచాలు

  1. ఉల్బము
  2. అళిందం
  3. పరాయువు
  4. సొనసంచి

ప్రశ్న 20.
జాకబ్సన్ అవయవాలు అంటే ఏమిటి? అవి పక్షులకు ఎలా తోడ్పడతాయి?
జవాబు:

  1. పాములు మరియు కొన్ని బల్లులలో ఉండే ప్రత్యేక ఘ్రాణ నిర్మాణాలను జాకబ్సన్ అవయవాలు అంటారు.
  2. ఇవి వాసన తెలుసుకొనుటకు సహాయపడతాయి. ఇవి ఆహార సేకరణకు ఉపయోగపడతాయి.

ప్రశ్న 21.
వాతిలాస్థులు అంటే ఏమిటి? అవి పక్షులకు ఎలా తోడ్పడతాయి? [AP M-19]
జవాబు:

  1. ఎగిరే పక్షులలో బోలుగా ఉండి గాలి కుహరాలతో నింపబడిన ఎముకలను వాతిలాస్థులు అంటారు.
  2. ఈ వాతిలాస్థులు పక్షి బరువును తగ్గిస్తూ మరియు పక్షులు సునాయసంగా ఎగరడానికి ఉపయోగపడతాయి.

ప్రశ్న 22.
విష్ బోన్ అంటే ఏమిటి? దీన్ని ఏర్పరచే అస్థి ఘటకాలను తెలపండి?
జవాబు:

  1. పక్షులలో ‘V’ ఆకారంలో ఉండే ఎముకను విష్ బోన్ అంటారు. దీనినే ఫర్కులా (లేదా) మెర్రధాట్ బోన్ అని కూడా అంటారు.
  2. ఇది రెండు జత్రుకలు మరియు అంతరజత్రుక కలయికతో ఏర్పడుతుంది.
  3. ఇది పక్షులు ఎగిరే సమయంలో, రెక్కలు దూరంగా ఉండటానికి స్ప్రింగ్ లాగా సహాయపడుతుంది.

ప్రశ్న 23.
రక్తం నిరంతర ఆక్సిజినేషన్ (ఆక్సీకరణం) అంటే ఏమిటి? ఇది పక్షులలో ఎలా సాధ్యమవుతుంది?
జవాబు:
పక్షుల ఊపిరితిత్తుతలలో 9 వాయుగోణులు ఉంటాయి. ఈ వాయుగోణులు నిరంతరం రక్తానికి ఆక్సిజన్ అందిస్తాయి. కావున పక్షులలో రక్తం నిరంతరం ఆక్సీకరణం చెందుతుంటుంది.

ప్రశ్న 24.
పక్షులలో అన్నకోశం, ఆంతరజఠరం మధ్య భేదాలను తెలపండి.
జవాబు:

  1. అన్నకోశం: పక్షులలో ఆహారవాహికయే అన్నకోశంగా విస్తరించి ఉంటుంది. ఇది ఆహారాన్ని నిల్వ చేస్తుంది.
  2. అంతరజఠరము: పక్షులలో జీర్ణాశయం యొక్క కండరయుత భాగమే అంతరజఠరము. ఇది ఆహారాన్ని మెత్తగా చేస్తుంది.

ప్రశ్న 25.
ఆల్ట్రీషియల్, ప్రికోషియల్ పక్షిపిల్లల మధ్య తేడాలను తెలపండి.
జవాబు:

  1. ఆల్ట్రీషియల్ స్థితిలో పక్షిపిల్లలు ఆహారం మరియు రక్షణ కొరకు తల్లిదండ్రులపై, ఈకలు మరియు రెక్కలు వచ్చి ఎగిరేంత వరకు ఆధారపడతాయి. ఈ స్థితి ఎగిరే పక్షులలో ఉంటుంది.
  2. ప్రికోషియల్ స్థితిలో పక్షిపిల్లలు ఆహారం కొరకు తల్లిదండ్రులపై ఆధారపడవు. అవే ఆహారాన్ని సేకరించుకుంటాయి. ఈ స్థితి ఎగురలేని పక్షులలో ఉంటుంది.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 26.
ఏ సముహ జంతువులలో ప్రతీ పార్శ్వంలో మూడు కర్ణాస్థికలు ఉంటాయి. వాటి పేర్లను లోపలి నుంచి వెలుపలికి వరస క్రమంలో తెలపండి
జవాబు:

  1. క్షీరదములలో మూడు కర్ణాస్థి ఖండాలు ఉంటాయి.
  2. లోపలి నుంచి వెలుపలి వాటి పేర్లు: కర్ణాంతరాస్థి, దాగలి మరియు కూటకం.

ప్రశ్న 27.
క్షీరదాల పరిపక్వ RBC ఇతర సకశేరుకాల RBC తో ఎలా విభేదిస్తుంది?
జవాబు:

  1. క్షీరదాల పరిపక్వం RBC కణం గుండ్రంగా ద్విపుటాకారంగా మరియు కేంద్రక రహితంగా ఉంటుంది.
  2. సకశేరుకాల RBC కణం అండాకారంగా, ద్వికుంభాకారంగా మరియు కేంద్రక యుతంగా ఉంటుంది.

ప్రశ్న 28.
సరీసృపాలు, పక్షులు, క్షీరదాలలో ముఖ్యమైన సకశేరుకాల రకాల పేర్లను తెలపండి.
జవాబు:

  1. సరీసృపాలలో ముఖ్యమైన సకశేరుకాల రకం ‘పురోగర్తి’
  2. పక్షులలో ముఖ్యమైన సకశేరుకాల రకం ‘విషమగర్తి’
  3. క్షీరదాలలో ముఖ్యమైన సకశేరుకాల రకం ‘ఉభయ సమతలు’

ప్రశ్న 29.
మూడు మెనింజెస్ పేర్లను తెలపండి. ఈ మూడూ ఏ సమూహ జంతువులలో కనిపిస్తాయి. [AP M-15]
జవాబు:

  1. మెదడు యొక్క పొరలను మెనింజెస్ లు అంటారు.
  2. మూడు మెనింజెస్లు: (i) పరాశిక (బాహ్య) (ii) ఆర్కినాయిడ్ (మధ్య) (iii) మృద్వి (అంతర)పొరలు.
  3. ఈ మూడు పొరలు క్షీరదముల లోనికి వస్తాయి.

ప్రశ్న 30.
వృక్క నిర్వాహకవ్యవస్థ లోపించిన సకశేరుక సమూహాల పేర్లు తెలపండి.
జవాబు:
వృక్క నిర్వాహకవ్యవస్థ లోపించిన సకశేరుకాలు: క్షీరదాలు మరియు సైక్లోస్టోమేటా.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
సకశేరుకాలు, అకశేరుకాల మధ్య మూడు ముఖ్య తేడాలను తెలపండి. ఈ లక్షణాలను చూపే సకశేరుక శరీరపటాన్ని గీయండి.
జవాబు:

  1. ‘పృష్ఠవంశం’ సకశేరుకాలలో మాత్రమే ఉంటుంది, కాని అకశేరుకాలలో ఉండదు.
  2. సకశేరుకాలలో ‘నాడీదండం’ పృష్ఠభాగం పైన నాళంగా ఉంటుంది. కాని అకశేరుకాలలో అది ఉదర భాగంలో ధృడంగా ఉంటుంది.
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 4 జంతు వైవిధ్యం-II కార్డేటాల క్లుప్త చరిత్ర 1
  3. సకశేరుకాలలో ‘గ్రసనీ మొప్ప చీలికలు’ ఉంటాయి. కాని అకశేరుకాలలో ఇవి ఉండవు.
  4. సకశేరుకాలలో ‘పాయు పరపుచ్ఛం’ ఉంటుంది. కాని అకశేరుకాలలో అది ఉండదు.
  5. సకశేరుకాలలో ‘హృదయం’ ఉదర భాగంలో ఉంటుంది. కాని అకశేరుకాలలో అది పృష్ఠభాగంలో ఉంటుంది.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 2.
కార్డేట్లలో నాలుగు ముఖ్య లక్షణాలు పేర్కొని ప్రతిదాని ముఖ్య విధిని తెలపండి? [TSM-16] [AP M–18,20] [AP MAY-22]
జవాబు:
కార్డేట్ జీవులన్నింటిలో కనిపించే నాలుగు ముఖ్య లక్షణాలు:
(i) పృష్ఠవంశం:అన్ని కార్డేటాల జీవితంలో ఒక దశ వరకు ఇది ఉంటుంది. ఇది ఒక కడ్డీలాంటి నిర్మాణం. ఆహారనాళానికి ఎగువగా మరియు పృష్ఠనాడీ దండానికి దిగువగా ఉంటుంది. ఇది వివిధ క్రియలకు ఆధారాన్ని ఇస్తుంది.

(ii) పృష్ఠనాళికాయుత నాడీ దండం: ఇది పృష్ఠవంశానికి పైన, నాళం లాగా ఉండి ద్రవంతో నిండి ఉంటాయి. ఇది పూర్వాంతములో మెదడుగాను, పరభాగంలో కశేరు నాడీదండముగాను పని చేస్తుంది.

(iii) గ్రసనీ మొప్ప చీలికలు:ఇవి గ్రసనీ కుహరం నుంచి వరుసగా ఇరువైపులా రంధ్రాలుగా ఉంటాయి. వీటినే మొప్ప చీలికలు అంటారు. ఇవి శ్వాసక్రియలో వాయువుల మార్పిడికి తోడ్పడతాయి.

(iv) పాయు పరపుచ్ఛం:పాయువుకు పరభాగంలో పొడిగించబడిన భాగమే పాయుపరపుచ్ఛం. సాధారణంగా ఇది రక్త నాళాలను మరియు కండరాలను కలిగి ఉంటుంది. ఇది చలనానికి, రక్షణకు ఉపయోగపడుతుంది.

ప్రశ్న 3.
కార్డేటా ఉనికిని తెలిపే ట్యునికేట్ లక్షణాలను వివరించండి?
జవాబు:
ట్యూనికేట్ లక్షణాలు:

  1. ప్రౌఢ ట్యూనికేట్లు ఎక్కువగా అకశేరుకాలను పోలివుంటాయి. ఒక మొప్ప చీలికలలో మాత్రం ఇవి వేరుగా ఉంటాయి.
  2. ఇవి వృంత రహిత లేదా నీటిపై తేలియాడేవి, ఏకాంతం లేదా సహనివేశాలు.
  3. వీటి శరీరం ఖండిత రహితమై, ‘సెల్యులోజ్’తో నిర్మితమైన కంచుకతో కప్పబడి ఉంటుంది.
  4. వీటికి శరీర కుహరం ఉండదు.
  5. వీటి గ్రసని చుట్టూ బహిస్త్వచంతో ఆవరించి ఉన్న ఏట్రియలో కుహరం ఉంటుంది.
  6. వీటిలో అంతర్ కీలితం గ్రసని ఉదరకుడ్యంపై వుంటుంది. ఇది ఆహర సేకరణకు సహయపడుతుంది.
  7. వీటి అంతర్ కీలితం సకశేరుకాలలో థైరాయిడ్ గ్రంధి గా మార్పుచెందుతుంది. ఇది కార్డేటా లక్షణం.
  8. ఇది మొప్ప చీలికలు గ్రసనికి ఇరువైపులా ఉంటాయి. ఇవి ఎట్రియమ్లోనికి తెరచుకుంటాయి. ఇది కార్డేటా లక్షణం.
  9. వీటి హృదయం ఉదరభాగంలో ఉంటుంది. ఇది కూడా కార్డేటా మరో లక్షణం.
  10. హృదయం ఏకాంతరంగా వ్యతిరేకదిశలో కొట్టుకుంటుంది.
  11. వీటి డింభకంలో పృష్ఠవంశం తోకకు పరితమైవుంటుంది. కావున వీటిని యూరోకార్డేటాలు అని అంటారు.
  12. ఇవి ద్విలింగకాలు మరియు డింభకం ఎసిడియన్ ‘టాడోపోలోడింభక’ ఉదా: ఎసీడియా, సాల్ప, డోలియోలం, పైరోసోమా
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 4 జంతు వైవిధ్యం-II కార్డేటాల క్లుప్త చరిత్ర 2

ప్రశ్న 4.
స్కీర్ట్లు, లాన్సిలెట్ల పోలికలు, భేదాలు చూపండి.
జవాబు:
స్కీర్ట్లు మరియు లాన్సిలెట్ల మధ్య పోలిక:

  1. ఈ రెండూ జీవులు సముద్ర జీవులు.
  2. ఈ రెండూ జీవులలో రంధ్రయుత గ్రసని, అంతర్ కీలితం మరియు బహిస్త్వచంతో ఆవిరించి ఉన్న ఏట్రియల్ ఉంటాయి.

స్కీర్ట్లు మరియు లాన్సిలెట్ల మధ్య భేదాలు:
1(a). స్కీర్ట్లు (ఏసీడియన్) ‘యూరో కార్డేటా’ ఉపవర్గంకు చెందినవి.
1(b). లాన్సిలెట్లు (ఆంఫియాక్సస్) ‘సెఫాలో కార్డేటా’ ఉపవర్గంకు చెందినవి.
2(a). స్కీర్ట్ల దేహం ఖండితరహితం మరియు సంచివలె ఉంటుంది.
2(b). లాన్సిలెట్ల దేహం ఖండితయుతంగా ఉండి చేపను పోలి ఉంటుంది.
3(a). స్కీర్ట్లు రక్షణయుత కంచుకంతో వృంతరహితంగా ఉంటాయి.
3(b). లాన్సిలెట్లలో కంచుకం ఉండదు. ఇవి ఇసుక బొరియాలలో జీవిస్తాయి.
4(a). ఏసిడియన్స్లో ప్రసరణ వ్యవస్థ ‘వివృత రకానికి’ చెంది ఉంటుంది.
4(b). ఆంఫియాక్సస్ లో ప్రసరణ వ్యవస్థ ‘సంవృత రకానికి’ చెంది ఉంటుంది. 5(a). ఏసిడియన్స్ల డింభకం ‘టాడ్పోల్ డింభకం’.
5(b). ఆంఫియాక్సన్ల డింభకం ‘లాన్సిలేట్ డింభకం’.
6(a). ‘బాగా అభివృద్ధి చెందిన నాళికాయుత నాడి దండం మరియు పృష్ఠవంశం’ ప్రౌడ స్క్వీర్ట్లలో ఉండవు.
కాని వాటి డింభకంలో ఉంటాయి.
6(b). అవి లాన్సిలెట్లలో ఉంటాయి.
7(a). ఉదా: ఎసిడియం అనేది ఒక సీ స్కీర్ట్.
7(b). ఉదా: బ్రాంకియోస్టోమా అనేది ఒక లాన్సిలెట్.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 5.
చేపలను ఇతర సకశేరుకాల నుంచి వేరుచేసే ఎనిమిది లక్షణాలను రాయండి. [AP M-19]
జవాబు:
చేపల యొక్క ప్రత్యేక లక్షణాలు:

  1. చేపలు జలచర, శీతల రక్త పొలుసుయుత సకశేరుకాలు.
  2. మధ్యస్త్వచయుత పొలుసులు, కొన్ని చేపలలో పొలుసులు (లేదా) కంటకాలుగా మార్పు చెందుతాయి.
  3. కశేరుకాలు ఉభయగర్తి
  4. వీటిలో చలనానికి వాజాలుంటాయి.
  5. వీటి వాజాలు జతలుగా (ఉరో మరియు శ్రోణి) కలిసి ఉంటాయి మరియు మాధ్యమికంగా (పృష్ఠ, కాడల్ మరియు పాయువు) ఉంటాయి.
  6. చేపల మొప్పలు ‘శ్వాస అవయవాలు’గా పని చేస్తాయి.
  7. మృదులాస్థి చేపలలో మొప్ప చీలికలు తెరచుకుని ఉంటాయి మరియు అస్థి చేపలలో ఇవి ఉపరికులచే మూయబడి ఉంటాయి.
  8. చేపల హృదయం ఉదరభాగం రెండుగదులతో ఉంటుంది. దీనినే జలశ్వాస హృదయం మరియు సిరా హృదయం అని కూడా అంటారు.
  9. మెనింక్స్ ప్రిమిటివా అనేది చేపల మెదడును కప్పిఉంచే రక్షణ పొర.
  10. వీటిలో పార్శ్వరేఖ జ్ఞానాంగ అవయవాలు చూట్టూ ఉన్న నీటిలోని తేడాలను గుర్తిస్తాయి.
  11. ఇతర లక్షణాలు: అనుకపాలకందం, అగ్రదంత, సమదంత మరియు బహువార కదంతాలు, మధ్యవృక్కరకం మూత్రపిండాలు అమ్మోనోటెలిక్ మరియు యూరియోటెలిక్ రకాలు, నిమేషక పటలం మొదలగునవి.

ప్రశ్న 6.
మృదులాస్థి, అస్థిచేపల పోలికలు, భేదాలు రాయండి. [AP M-16][TS MAY-22]
జవాబు:
అస్థిచేపలు
మృదులాస్థి చేపలు

  1. మృదులాస్థి చేపలు అధికంగా సముద్ర జీవులు
  2. అంతరాస్థి పంజరం ‘మృదులాస్థి నిర్మితం’
  3. నోరు ఉదారయుతం
  4. పొలుసులు ప్లాకాయిడ్ రకం
  5. వాయుకోశం ఉండదు.
  6. విసర్జక పదార్ధం యూరియోటెలిక్
  7. పుచ్ఛవాజం విషమపాలి
  8. మగజీవులలో సంపర్కదండాలు ఉంటాయి.
  9. అధికశాతం శిశూత్పాదకాలు
  10. ఉదా: స్కొలియోడాన్ (సొరచేప), టార్పిడో

అస్థిచేపలు

  1. అన్ని రకాల జల ఆవాసాల్లో కనిపిస్తాయి. అంతరాస్థి పంజరం ‘ఎముకలతో’ నిర్మితమై ఉంటుంది.
  2. నోరు అంత్యయుతం
  3. పొలుసులు సైక్లాయిడ్, టినాయిడ్, గానాయిడ్,
  4. కాస్మయిడ్ రకాలు
  5. వాయుకోశం ఉంటుంది.
  6. విసర్జక పదార్ధం అమ్మోనోటెలిక్
  7. పుచ్ఛవాజం సమపాలి(లేదా) సమవిభక్త
  8. మగజీవులలో సంపర్క దండాలు ఉండవు.
  9. అధిక శాతం అండోత్పదకాలు
  10. ఉదా: ఎక్సోసీటన్ (ఎగిరేచేప)

AP Inter 1st Year Zoology Important Questions Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 7.
కప్ప హృదయ నిర్మాణాన్ని వివరించండి. [TS M-19]
జవాబు:
కప్ప యొక్క హృదయ నిర్మాణం:

  1. కప్ప హృదయం కండరయుత పంపు వంటి నిర్మాణం. ఇది శరీర కుహరం పై భాగంలో ఉంటుంది.
  2. కప్ప హృదయం మూడు గదులుగా ఉంటుంది.
  3. ఇందులో రెండు కర్ణికలు మరియు ఒక జఠరిక ఉండును.
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 4 జంతు వైవిధ్యం-II కార్డేటాల క్లుప్త చరిత్ర 3
  4. రెండు స్తరాల హృదయావరణ త్వచం హృదయాన్ని కప్పి ఉంచుతుంది. ఇది యాంత్రిక షాక్ ల నుంచి హృదయాన్ని కాపాడుతుంది.
  5. హృదయం పృష్ఠతలంలో త్రికోణాకార సరాసరణి కుడి కర్ణికలోనికి తెరుచుకుంటుంది.
  6. ఉదరతలంలో జఠరిక ధమనీ శంకువులోనికి తెరచుకుంటుంది.
  7. ధమని శంకువు రెండు శాఖలుగా చీలి, ఒక్కొక్కటి మూడు ధమని చాపాలుగా ఏర్పడుతాయి. అవి కెరోటిడ్, దైహిక మరియు పుప్పుస చర్మీయ.
  8. హృదయంలోని రక్తం ధమని చాపాల శాఖల ద్వారా వివిధ భాగాలకు చేరుతుంది.
  9. మూడు సంఖ్య సిరలు రక్తాన్ని సేకరించి సిరాసరణికి చేరవేస్తాయి.
  10. కప్ప యొక్క రక్తప్రసరణను అసంపూర్ణ ద్వంద్వ ప్రసరణగా చెప్పవచ్చును.

ప్రశ్న 8.
ఉభయచరాల విభాగం ఎనిమిది ముఖ్య లక్షణాలను తెలపండి. [TS MAY-22] [AP MAY-22] [TS M-20]
జవాబు:
ఉభయచరాల ముఖ్య లక్షణాలు:

  1. ఉభయచరాలు మొట్ట మొదటి చతుష్పాదులు.
  2. ఇవి నీరు మరియు భౌమ్య ఆవాసాలు రెండింటిలోనూ జీవించగలవు.
  3. వీటి ‘శరీరం’ తల, మొండెం మరియు తోక ( ఉండవచ్చు లేదా లేకపోవచ్చు) గా విభజించబడింది.
  4. వీటి చర్మం తేమగా, గ్రంధియుతంగా మరియు పొలుసులు లేకుండా (అంతర అస్థిపంజరం ఉండదు) ఉంటుంది.
  5. వీటిలో పంచాంగుళిక గమనాంగాలు ఉంటాయి.
  6. వీటి కపాలం డైకాండైలిక్ రకానికి చెందుతుంది.
  7. సకశేరుకాలలో సాధారణంగా పురోగర్తి, ఉభయగర్తి మరియు పరగర్తి అనే రకాలు కలవు.
  8. ఉరోస్థి మొదటిసారిగా ఉభయ చరాల్లో కనిపించింది.
  9. వీటి శ్వాసక్రియ పుపుస. ఇవి చర్మం ద్వారా మరియు ఆస్యగ్రసనిల ద్వారా జరుగుతుంది.
  10. వీటి హృదయం మూడు గదులుగా విభజించబడి ఉంటుంది.
  11. వీటిలో సిరాసరణి మరియు ధమనీ శంకువులు ఉంటాయి.
  12. వీటి మూత్రపిండాలు మధ్యవృక్క రకానికి చెందినవి.
  13. ఈ ఉభయచరాలు యూరియోటెలిక్ జీవులు.
  14. వీటిలో మెనింజస్ అనేవి పరాశిక మరియు మృధ్వి అనే రెండు రకాలు.
  15. మధ్య చెవిలో కర్ణస్తంభిక, కర్ణభేరిత్వచంను లోపలి చెవితో కలిపి వుంచుతుంది.
  16. వీటి కంటిలో లాక్రియల్ మరియు మల్దేరియన్ గ్రంధులు ఉంటాయి.
  17. లింగాలు వేరువేరుగా ఉంటాయి (ఏకలింగ జీవులు).
  18. ఉదా: బ్యూఫో (గోదురు కప్ప), రానా (కప్ప), హైలా(చెట్టుకప్ప), రాకోఫోరస్ (ఎగిరే కప్ప)

ప్రశ్న 9.
చక్కని పటంతో కప్ప పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను వివరించండి.
జవాబు:
పురుష కప్ప యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ:
మగ కప్ప ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు, శుక్రనాళికలు, బిడ్డర్స్ కుల్య, మూత్ర జనన నాళాలు మరియు అవస్కరం ఉంటాయి.

  1. ఒకజత ముష్కాలు పసుపు రంగులో అండాకారంగా వుంటాయి.
  2. ముష్కాలు మూత్రపిండాలకు మరియు పృష్ఠశరీర కుడ్యానికి రెండు మడతల ఆంత్రవేష్టనంతో అతకబడివుంటాయి. దీనినే ముష్కయోజని అంటారు.
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 4 జంతు వైవిధ్యం-II కార్డేటాల క్లుప్త చరిత్ర 4
  3. ప్రతీ ముష్కం పెద్ద సంఖ్యలో శుక్రోత్పాదక నాళికలను కలిగి ఉంటుంది.
  4. శుక్రోత్పాదక నాళికలు అన్ని 10-12 ఇరుకైన శుక్రనాళికలలోనికి తెరచుకుంటాయి.
  5. శుక్రనాళికలు మూత్రపిండాలలోని ప్రయాణించి బిడ్డర్స్ కాలువలోనికి తెరచుకుంటాయి.
  6. అడ్డు కుల్యల ద్వారా బిడ్డర్స్ కాలువ, మూత్రాశయంకు (మూత్రజనన నాళాలు) కలుపబడుతుంది.
  7. మూత్ర జనన నాళాలు అవస్కరంలోనికి తెరచుకుంటాయి.
  8. ఒక జత పనుపు రంగు కొవ్వుదేహలు ముష్కాలను అంటిపెట్టుకొని ఉంటాయి.

ప్రశ్న 10.
కప్ప ప్రత్యేక జ్ఞానాంగాల గురించి లఘుటీక రాయండి
జవాబు:
కప్ప యొక్క ప్రత్యేక జ్ఞానాంగాలు:

  1. కప్పలో స్పర్శ, రుచి, వాసన, దృష్టి మరియు శ్రవణానికి సంబంధించి జ్ఞానాంగాలు ఉంటాయి.
  2. స్పర్శ జ్ఞానాంగాలు శరీరంలో ఉంటాయి, మిగిలినవి నాడీ అంత్యాల చుట్టూ ఉంటాయి.
  3. రుచి గుళికలు రుచికి సంబంధించిన అంగాలును, నాలుకపై గుత్తులుగా కల్గి ఉంటాయి.
  4. నాసికా గదులు ప్రూణ అవయవాల ద్వారా వాసన గ్రహించుటకు సహాయపడతాయి.
  5. దృష్టి మరియు వినికిడి అవయవాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
  6. వీటి దృష్టి అవయవాలు నేత్రాలు.
    i. ఒకజత నేత్రాలు పుర్రెనేత్ర కోటరంలో ఉంటాయి.
    ii. నేత్రాలు కనురెప్పల ద్వారా రక్షించబడతాయి.
    iii. పైరెప్ప కదలదు.
    iv. క్రింది రెప్ప పారదర్శక నిమేషక పటలం రూపంలో మడతపడి ఉంటుంది.
    v. రెటీనా పటలంలో కడ్డీలు మరియు శంఖువులు ఉంటాయి. శంఖువులు రంగులు దృశ్యానికి మరియు కడ్డీలు మసక వెలుతురులో దృష్టికి తోడ్పడతాయి.
  7. చెవులు వినికిడి మరియు సమతుల్యతకు తోడ్పడతాయి. ప్రతి చెవి కర్ణభేరి త్వచం, స్తంభిక, పేటిక, అర్ధచంద్రాకార కుల్యలు మరియు గోణికను కలిగి ఉంటాయి.
  8. స్తంభిక, కర్ణభేరి త్వచాన్ని మరియు లోపలి చెవిని కలిపి వుంచుతుంది. అర్థచంద్రాకార కుల్యలు జీవియొక్క సమతుల్యతను కాపాడుతాయి. పేటిక, గోణిక, మరియు అర్ధచంద్రాకార కుల్యలు లోపలి చెవి యొక్క భాగాలు.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 11.
సరీసృపాల బాహ్య, అంతరాస్థిపంజర ముఖ్య లక్షణాలను రాయండి.
జవాబు:
సరీసృపాల బాహ్య మరియు అంతరాస్థి పంజరం ముఖ్య లక్షణాలు:

  1. సరీసృపాల బాహ్యస్థిపంజరం కొమ్ముయుత బహిస్త్వచ పొలుసులు, ఫలకాలు మరియు నఖాలను కలిగి ఉంటుంది.
  2. అంతరాస్థిపంజరం పుర్రె
  3. కపాలం ఏకకంద రకం.
  4. శంఖాఖాతాలు ఉంటాయి.
  5. కశేరుకాలు పురోగర్తి రకం.
  6. మొదటి రెండు కశేరుకాలు శీర్షధరం మరియు అక్షకశేరుకం. తల కదలికలకు సహయపడుతుంది.
  7. త్రికకశేరుకాల సంఖ్య రెండు .
  8. దంతవిన్యాసం అగ్రదంత, సమదంత మరియు బహువార దంత రకాలు.
  9. మొసళ్లు ఢీకోడాండ్ దంతవిన్యాసం కలిగి ఉంటాయి.
  10. కెలోనియాలో దంతాలు ఉండవు.

ప్రశ్న 12.
సరీసృపాల విభాగంలో వర్తమాన క్రమాలను తెలపండి. ప్రతీ క్రమానికి రెండు ఉదాహరణాలు ఇవ్వండి.
జవాబు:
వర్తమాన సరీసృపాల నాలుగు క్రమాలు:

  1. కెలోనియా:కిలన్ (సముద్రపు ఆకుపచ్చ తాబేలు), టేస్టుడో (భౌమ్య తాబేలు), ట్రియోనిక్స్ (మంచినీటి తాబేలు)
  2. రికోసెఫాలియా(తల ముక్కులాకల సరీసృపాలు): స్ఫీనోడాన్ (సజీవ శిలాజం న్యూజిలాండ్ కి పరిమితమై ఉంటుంది)
  3. క్రోకోడీలియా: క్రొకోడైలస్ పాలుస్ట్రిస్ అలిగేటర్ (భారతదేశ మొసలి), గేవియాలిస్ గాంజిటికస్ (షురియాల్)
  4. స్క్వామేటా: ఇవి పొలుసుయుత సరీసృపాలు. ఇవి రెండు రకాల సమూహాలు
    a) బల్లులు: హెమిడాక్టైలస్ (గోడబల్లి), కెమిలియాన్, డ్రాకో (ఎగిరేబల్లి).
    b) పాములు:
    i. సర్పాలు: ట్యాస్ (రాట్ స్నేక్), ట్రోపిడోనోటస్ (నీటి పాము)
    ii. విష సర్పాలు : నాజా నాజా (కోబ్రా), ఒఫియోఫాగస్ (రాచనాగు), బంగారస్ (కట్లపాము), వైపరా రసెల్లి (గొలుసు రక్త పింజరి)

ప్రశ్న 13.
పక్షులలో ఎగరడానికి ఏర్పడిన అనుకూలనాలను పేర్కొనండి. [AP,TS M-15,17]
జవాబు:
పక్షులు వైహయన నిష్ణాతులు ( masters of air). పక్షులలో ఎగరటానికి ఏర్పడిన అనుకూలనాలు:

  1. పక్షులలో దేహం కుదించిన తోకతో ‘బోటు’ మాదిరిగా ఉంటుంది.
  2. బాహ్యస్థిపంజరంలో బాహ్యచర్మ ఈకలు ఉంటాయి.
  3. ఈకలు తేలికపాటిగా ఉండి, గాలిలో ఆధారాన్ని అందిస్తాయి.
  4. నేత్రాలు పెద్దవిగా ఉండి, ధృడ ఫలకాలను మరియు దువ్వెన లాంటి పెక్టెను కలిగి ఉంటాయి.
  5. చర్మం పొడిగా, ఎటువంటి గ్రంధులు లేకుండా ఉంటుంది. తోకలో మాత్రం ప్రీన్ గ్రంధి ఉంటుంది.
  6. పూర్వాంగాలు రెక్కలుగా మార్పు చెందాయి.
  7. ఎముకలు వాతిలాస్థులు (బరువు తగ్గించుట) మరియు అవి వాయుగోణులు యొక్క విస్తరణులు.
  8. ఆధునిక ఎగిరే పక్షులు అన్నీ ఉరోకండరాలను కలిగి ఉంటాయి.
  9. ఊపిరితిత్తులను అంటి పెట్టుకుని ఉన్న వాయుగోణులు నిరంతరంగా రక్తానికి ఆక్సిజన్ ను అందజేస్తాయి.
  10. ‘శబ్దిని’ ధ్వని ఉత్పాదక పెట్టె.
  11. మెదడులో ‘దృష్టి లంబికలు’ క్షీణించి ఉంటాయి.
  12. కొన్ని పుచ్ఛ కశేరుకాలన్నీ కలిసిపోయి ‘హలాస్థి’గా ఏర్పడతాయి. ఇది తోక యొక్క ఈకల కదలికలకు సహయపడుతుంది.
  13. అంతర జత్రుకలు, జత్రుకలతో కలిసిపోయి ‘ఫర్కులాను’ ఏర్పరుస్తాయి. ఇది ఎగిరే సమయంలో రెక్కలను దూరంగా ఉంచటకు సహాయపడుతుంది.
  14. ఉరోస్థి పెద్దగా ఉండి, ఎగిరే పెద్ద కండరాలకు ఆధారాన్ని ఇస్తుంది.
  15. కుడి స్త్రీ బీజకోశం మరియు కుడి స్త్రీ బీజవాహిక క్షీణించి ఉంటాయి.

ప్రశ్న 14.
రాటిటే పక్షుల విలక్షణ లక్షణాలను తెలపండి రెండు ఉదాహరణలు ఇవ్వండి. [TS MAY-22][TS M-18]
జవాబు:
రాటిటే పక్షుల విలక్షణ లక్షణాలు:

  1. ఇవి ఆధునిక ఎగరలేని, పరిగెత్తే పక్షులు.
  2. వీటి ముఖ్య లక్షణాలు: క్షీణించిన రెక్కలు, ద్రోణి లేకుండా తెప్పలాగా వున్న ఉరోస్థి .
  3. ఈకలలో ‘అంతర్ బంధన’ ప్రక్రియ ఉండదు.
  4. ‘శబ్ధిని’ ఉండదు (టినామస్ తప్ప)
  5. ప్రీన్ గ్రంధి ఉండదు.
  6. జత్రుకలు ఉండవు.
  7. ‘హలాస్థి’ క్షీణించి ఉంటుంది (లేదా ఉండదు).
  8. మగ జీవులు సంపర్క అంగాలను కలిగి ఉంటాయి.
  9. పక్షి పిల్లలు ప్రికోసియలోగా ఉంటాయి.
  10. ఇవి విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శిస్తాయి.
  11. ఉదా: కివి (న్యూజిలాండ్); రియా (అమెరికన్ ఆస్ట్రిచ్) దక్షిణ అమెరికా; స్టుతియో(ఆఫ్రికన్ ఆస్ట్రిచ్ ) ఆఫ్రికా; డ్రోమియస్; కాసువారియన్ ఆస్ట్రేలియా .

AP Inter 1st Year Zoology Important Questions Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 15.
క్షీరదాలలో నాడీవ్యవస్థ జ్ఞానాంగాల ముఖ్య లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
A) క్షీరదాల నాడీవ్యవస్థ:

  • క్షీరదాల మెదడు మిగిలిన అన్ని సకశేరుకాల కన్నా పెద్దదిగా ఉండును.
  • మస్తిష్కార్ధ గోశాల అభివృద్ధి వలన మెదడు పెద్దదిగా ఉంటుంది.
  • కార్పస్ కెల్లోసం రెండు మస్తిష్కార్ధ గోళాలను కలుపుతుంది.
  • వీటిలో నాలుగు దృష్టి లంబికలను ‘కార్పోరాక్వాడ్రి జెమీనా’ అంటారు.
  • వీటిలో మూడు మెనింజస్ వరాశిక, తౌతికళ మరియు మృద్వి.
  • క్షీరదాలలో మాత్రం ప్రత్యేక అరక్నాయిడ్ త్వచం ఉంటుంది.
  • వీటిలో 12 జతల కపాల నాడులు ఉంటాయి.

B) క్షీరదాలలో జ్ఞానాంగాలు:

  • వీటిలో నేత్రాలు కదిలే కనురెప్పలు పై పక్ష్మాలతో ఉంటాయి.
  • వీటి చెవులు బాహ్య, మధ్య మరియు లోపలి చెవిగా విభజించబడి ఉంటాయి.
  • బాహ్య చెవి పిన్నా మరియు (కాలువ)ను కల్గిఉంటుంది.
  • సాగే గుణం కల మృదులాస్థితో పిన్నాకు ఆధారాన్ని ఇస్తుంది.
  • మధ్య చెవి మూడు కర్ణాస్థి ఖండాలై, కుంటకం, దాగలి మరియు కర్ణాంతరాస్థిలను కలిగి ఉంటుంది.
  • కర్ణాంతరాస్థి లోపలి చెవికి కలుపబడి ఉంటుంది.
  • లోపలి చెవిలో కర్ణావర్తం మెలితిరిగి, కోర్టి అవయవాన్ని కలిగి ఉంటుంది. ఇది శబ్ద తరంగాలను గ్రహిస్తుంది.

ప్రశ్న 16.
యూథీరియన్ల కింది లక్షణాల గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
a) దంత విన్యాసం
b) అంతరాస్థి పంజరం

a. యూథీరియన్ల దంత విన్యాసం:

  • దంత విన్యాసం అనగా దంతాల అమరిక
  • యూథీరియాలలో దంతవిన్యాసం, ధీకోడాంట్, విషమ దంత మరియు ద్వివారదంత రకాలు.
  • ధీకోడాంట్: దంతాలు దవడ గర్తాలలో ఇమిడి ఉంటుంది.
  • విషయదంత: నాలుగు రకాల దంతాలు కుంతకాలు, రదనికలు, చరవణకాలు మరియు అగ్రచరవణకాలు అనేవి ఉంటాయి.
  • ద్వివార దంత: జీవితకాలంలో రెండుసార్లు దంతాలు ఏర్పడతాయి. అవి పాల దంతాలు మరియు శాశ్వత దంతాలు.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

b. యూథీరియన్ల అంతరాస్థి పంజరం:

  • యూథీరీయన్ల అంతరాస్థిపంజరము ఎముక యుతంగా ఉంటుంది.
  • పుర్రె ద్వికంద రకానికి చెందింది.
  • ప్రతి కింది దవడ అర్ధభాగంలో దంతాస్థి అనే ఒకే ఎముక ఉంటుంది.
  • కొలియోపస్, ట్రికకన్లలో ఆరు, బ్రాడిప్టస్ లో తొమ్మిది మిగిలిన కశేరుకాలలో ఏడు గ్రీవకశేరుకాలు ఉంటాయి.
  • త్రికకశేరుకాలు రెండు నుంచి ఐదు వరకు ఉంటాయి.
  • కశేరుకాలు ఉభయ సమతల (కశేరుమధ్యం రెండు తలాలు చదునుగా ఉంటాయి) రకానికి చెందినవి.
  • పర్ముకలు రెండు శీర్షాలతో ఉంటాయి.

ప్రశ్న 17.
కింది వాటికి ఉదాహరణలు ఇవ్వండి.
a) శిశూత్పాదక చేప
b) విద్యుత్ అవయవాలు గల చేప
c) విషపుకొండి గల చేప
d) చేప నీటిలో తేలియాడటాన్ని క్రమపరచడానికి
e) క్షీరగ్రంధులు గల అండోత్పాదక జంతువు.
జవాబు:
(a) శిశూత్పాదక చేప – స్కోలియోడాన్ (షార్క్)
(b) విద్యుత్ అవయవాలు గల చేప – టార్పిడో (విద్యుత్ చేప)
(c) విషపు కొండి గల చేప – ట్రైగాన్ (స్టీంగ్ రే)
(d) చేప నీటిలో తేలియాడటాన్ని క్రమ పరచడానికి – వాయుకోశం(ప్లవనస్థితిక అవయవం)
(e) క్షీర గ్రంధులు గల అండోత్పాదక జంతువు

ప్రశ్న 18.
కింది వాటిలో రెండు పోలికలు రాయండి.
a) పక్షులు, క్షీరదాలు b) కప్ప, మొసలి c) బల్లి, పాము
జవాబు:
a) పక్షులు మరియు క్షీరదాల మధ్య రెండు పోలికలు

  • ఈ రెండింటిలోనూ హృదయం నాలుగు గదులను కల్గి ఉంటుంది. సిరా హృదయం మరియు మూల మహధమని ఉండవు.
  • ఈ రెండింటిలోనూ పర్శుకలు రెండు శీర్షాలతో ఉంటాయి.

b) కప్ప మరియు మొసళ్లు మధ్య రెండు పోలికలు:

  • ఈ రెండూ జీవులు భౌమ్య మరియు నీటిలో నివశించే ఉభయచరాలు.
  • ఈ రెండింటిలోనూ అవస్కరం మరియు కర్ణస్తంభిక ఉంటాయి.

c) బల్లులు మరియు పాములు మధ్య రెండు పోలికలు:

  • ఈ రెండింటిలోనూ జాకబ్సన్ అవయవాలు ప్రత్యేక ష్రూణ నిర్మాణాలు
  • ఈ రెండింటిలోనూ ఒక జత హెమ పెనిస్ ను సంపర్క అవయవంగా కల్గి ఉంటాయి.

ప్రశ్న 19.
కింది జంతువుల పేర్లు రాయండి.
a) అంగవిహీన ఉభయచరం
b) సజీవ జంతువులలో అతిపెద్ద జంతువు
c) పొడి, కార్నిఫైడ్ చర్మం గల జంతువు
d) భారతదేశ జాతీయ జంతువు
జవాబు:
a) అంగవిహీన ఉభయచరం – ఇస్తియోపిస్,
b) సజీవ జంతువులలో అతిపెద్ద జంతువు – బెలనాప్టిరా (నీలి తిమింగలు)
c) పొడి, కార్నిఫైడ్ చర్మం గల జంతువు – సరీసృపాలు (కెమిలియాన్)
d) భారతదేశ జాతీయ జంతువు – పాంధీరాటైగ్రిస్ (పులి)

AP Inter 1st Year Zoology Important Questions Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 20.
కింది జంతువుల ప్రజాతులను తెలపండి.
a) అండోత్పాదక క్షీరదం
b) ఎగిరే నక్క
c) నీలి తిమింగలం
d) కంగారు
జవాబు:
a) అండోత్పాదక క్షీరదం – ఆర్నితోరింకస్
b) ఎగిరే నక్క – టీరోపస్
c) నీలి తిమింగలం – బెలనాప్టిరా
d) కంగారు – మాక్రోపస్

Leave a Comment