AP Inter 1st Year Zoology Important Questions Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

Students get through AP Inter 1st Year Zoology Important Questions 3rd Lesson జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు which are most likely to be asked in the exam.

AP Inter 1st Year Zoology Important Questions 3rd Lesson జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మీరు గమనించిన స్పంజికల దేహంలో ఏభౌతిక లక్షణం ఆధారంగా, అవి నివసించే మాధ్యమాన్ని బట్టి స్పంజికలను మొక్కలుగా కాక జంతువులుగా గుర్తిస్తారు? మీరు గమినించిన ఆ లక్షణాల ఆధారంగా స్పంజిక దేహంలోని భాగాన్ని ఏమంటారు?
జవాబు:

  1. స్పంజికలు సముద్ర జీవులు. శరీరకుడ్యం ద్విస్తరితం. వాటిని జంతువులుగా గుర్తించడానికి కారణం వాటిలో ఉండే ఆస్కులమ్.
  2. ఆస్కులమ్ స్పంజికల యొక్క అంత్య స్వేచ్ఛా భాగంలో’ వుంటుంది. ఇది నీటి ప్రసరణలో ఉపయోగపడుతుంది.

ప్రశ్న 2.
స్పంజికలో అంతరాస్థిపంజరాన్ని ఏర్పరచే వివిధ నిర్మాణాలు ఏవి? ఈ నిర్మాణాల ఏర్పాటుకు ఏ రసాయనాలు అవసరమో తెలపండి.
జవాబు:

  1. స్పంజికల యొక్క ‘అంతరాస్థి పంజరము’ కంటకములతోను మరియు స్పంజికా తంతవులతో నిర్మితమై ఉంటుంది.
  2. కాల్కేరియస్ కంటకాలు కాల్షియమ్ కార్బోనేట్తో నిర్మితమవుతాయి.
  3. సిలీషియస్ కంటకాలు సిలికాన్ డై ఆక్సైడ్ తో నిర్మితమవుతాయి.
  4. స్పంజి తంతువులు ప్రోటీన్ ఏర్పడుతాయి.

ప్రశ్న 3.
స్పంజికల కుల్యావ్యవస్థ విధులేవి? [TS MAY-22]
జవాబు:
స్పంజికల కుల్యావ్యవస్థ యొక్క విధులు:

  1. ఆహార సేకరణ (పోషణ)
  2. వాయువుల వినిమయం (శ్వాసక్రియ)
  3. వ్యర్థాల తొలగింపు (విసర్జనక్రియ)

AP Inter 1st Year Zoology Important Questions Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు
ప్రశ్న 4.
నిడేరియన్లలోని రెండు ముఖ్యమైన దేహరూపాలు ఏవి? వాటి ప్రధాన విధులు తెలపండి? [AP M-20]
జవాబు:

  1. నిడేరియన్ల యొక్క ప్రధాన బాహ్య స్వరూపాలు (i) మెడ్యూసా రూపం (ii) పాలిపాయిడ్ రూపం
  2. మెడ్యూసా ప్రధాన విధి ప్రత్యుత్పత్తి మరియు పాలిపాయిడ్ రూపం యొక్క వీధి పోషణ.

ప్రశ్న 5.
మెటాజెనిసిస్ అంటే ఏమిటి? ఏ వర్గానికి చెందిన జంతువులు దీన్ని ప్రదర్శిస్తాయి?[AP M-18]
జవాబు:

  1. జీవిత చక్రంలో లైంగిక మరియు అలైంగిక దశలు ఒకదాని తరువాత ఒకటి ఏకాంతంగా ప్రదర్శించడాన్ని ‘మెటాజెనిసిస్’ అని అంటారు
  2. నిడేరియా వర్గ జీవులు ‘మెటాజెనిసిస్’ను ప్రదర్శిస్తాయి.

ప్రశ్న 6.
ఏ నముదాయానికి చెందిన నిడేరియన్లలో మీసోగ్లియా పరిమాణం సాపేక్షరీత్యా ఎక్కువగా ఉంటుంది? నిడేరియన్ల జలజీవనానికి సంబంధించి బాగా అభివృద్ధి చెందిన మీసోగ్లియా ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:

  1. నిడేరియాకు చెందిన ‘స్కైఫోజోవా జీవుల’లో మీసోగ్లియా పరిమాణం సాపేక్షరీత్యా ఎక్కువగా ఉంటుంది.
  2. బాగా అభివృద్ధి చెందిన ఈ మీసోగ్లియా, ఆ జీవి నీటిపై తేలియాడుటకు తోడ్పడును.

ప్రశ్న 7.
రక్షకకణాలు లేదా రక్షకనిర్మాణాలు కలిగిన జననస్తరానికి సంబంధించి హైడ్రోజోవన్స్, ఇతర నిడేరియన్లకు గల ప్రధాన భేదమేమిటి?
జవాబు:

  1. నిడేరియా జీవులలో రక్షకకణాలు ‘దంశకణాలు (లేదా) కుట్టు కణాలు’
  2. హైడ్రోజోవన్లలో ‘దఁ కకణాలు’ బాహ్యత్వచములో మాత్రమే ఉంటాయి.
  3. కాని మిగిలిన నిడేరియా జీవుల దంశక కణాలు బాహ్యత్వచం మరియు అంతస్త్వచం రెండింటి నుంచి ఏర్పడుతాయి.

ప్రశ్న 8.
బల్లపరుపు పురుగుల విసర్జక కణాలేవి? ఈ ప్రత్యేక కణాల మరొక ముఖ్యవిధి ఏమిటి?
జవాబు:

  1. బల్ల పరుపు పురుగుల యొక్క విసర్జక కణాలు ద్వార కణములు (లేదా) ప్రాధమిక వృక్కాలు.
  2. వీటి యొక్క మరొక విధి ద్రవాభిసరణ క్రమత.

ప్రశ్న 9.
ఆంఫిడ్లు, ఫాస్మిడ్ల మధ్య భేదాన్ని తెలపండి. [AP MAY-22] [AP M-19]
జవాబు:

  1. నిమటోడా జీవులలో ముఖ భాగము చుట్టూ క్యూటికల్తో ఏర్పడిన లోతైన నిర్మాణాలను ‘ఆంఫిడ్లు’ అని అంటారు. అవి రసాయనక గ్రాహకాలు.
  2. కొన్ని నిమటోడ్ యొక్క పరాంతంలో వుండే ఏకకణయుత గ్రంధులులను ‘ఫాస్మిడ్లు’ అంటారు. ఇవి గ్రంధిజ్ఞాన నిర్మాణాలు.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 10.
దేహ పర్యాంతరంగ స్ధలానికి సంబంధించి బల్లపరుపు పురుగులు, గుండ్రటి పురుగులకు మధ్య ఉండే ప్రధాన భేదం ఏమిటి?
జవాబు:

  1. బల్లపరుపు పురుగులలో పర్యాంతర ప్రదేశం పారెన్ ్కమాతో నిండి ఉటుంది. కావున ఇవి శరీర కుహర రహిత జీవులు.
  2. గుండ్రని నిమటోడా జీవులలోని పర్యాంతరంగ ప్రదేశం మధ్యత్వచం నుంచి ఏర్పడదు. కావున ఇవి మిధ్యాశరీరకుహర జీవులు.

ప్రశ్న 11.
నిమటోడా, అనెలిడా దేహాంలోని పర్యాంతరాంగ స్ధలం పుట్టుక గురించి మీరు ఏ విధంగా వివరిస్తారు?
జవాబు:

  1. త్రిస్తరిత జీవుల అంతరాంగ అవయవాల చుట్టూ ఉన్న ప్రదేశమును పర్యాంతరంగ ప్రదేశం అని అంటారు.
  2. నిమటోడా జీవులలో మధ్యత్వచం, బాహ్యత్వచం నిరోధించబడి ఉంటుంది.
  3. మిగిలిన పర్యాంతరంగ ప్రదేశంను సంయుక్త బీజకుహరిక అని అంటారు. ఇది నిజశరీక కుహరం కాదు, మిధ్యాశరీరకుహరం.
  4. అనెలిడా జీవులలో పర్యాంతరంగ ప్రదేశం మధ్యత్వచం యొక్క చీలిక వల్ల ఏర్పడుతుంది. ఇది నిజశరీర కుహరం వేష్ఠనంతో ఆవరించబడి ఉంటుంది.

ప్రశ్న 12.
దేహ సమఖండీభవనం అంటే ఏమిటి? బద్దెపురుగు, వానపాములలో స్వరూపపరంగా దేహ ఖండితాలు ఏర్పడే పద్ధతిలో ప్రధాన భేదం ఏమిటి?
జవాబు:
దేహ సమఖండీభవనం:దేహము విభాజకాల ద్వారా సమానమైన ఖండితాలుగా విభజింపబడటాన్ని ‘సమఖండ విన్యాసము’ అంటారు. వీటిలో ఖండితాలు పరాంతం చివర ఏర్పడతాయి. ఇది అనెలిడా ప్రత్యేక లక్షణం.

  1. బద్దె పురుగులలో ‘స్వరూప పరంగా దేహ ఖండితాలు మెడ భాగం నుండి పరాంతం చివర వరకు ఏర్పడతాయి.
  2. కాని వానపాములలో ఖండితాలు పూర్వాంతము నుంచి ఏర్పడతాయి.

ప్రశ్న 13.
దేహ సమఖండీభవనానికి సంబంధించిన స్వరూప లక్షణాల ఆధారంగా ఒక హైరుడినీయన్ను ఇతర అనెలిడ్ల నుంచి ఎలా గుర్తిస్తారు? శరీర కుహర అంశాలకు సంబంధించి జలగ శరీరకుహరం వానపాము శరీరకుహరం నుంచి ఏ రకంగా భిన్నమైంది?
జవాబు:

  1. హైరుడినీయన్స్ ఖండితాలు నిర్ధిష్ట సంఖ్యలో ఉంటాయి. కాని మిగిలిన అనెలిడా జీవులలో ఖండితాల సంఖ్య నిర్ధిష్టంగా ఉండదు.
  2. జలగ శరీర కుహరము బోట్రాయిడలో కణజాలంతో నిండి ఉంటుంది. కాని వానపాములలో శరీర కుహరం ఉండదు.

ప్రశ్న 14.
నీరిస్లోలోని చలనానికి తోడ్పడే నిర్మాణాలను ఏమంటారు? నీరిస్ ను పాలికీట్ అని ఎందుకు అంటారు?
జవాబు:

  1. నీరిస్ యొక్క చలనాంగాలను పార్శ్వపాదులు అని అంటారు.
  2. నీరిస్ యొక్క ప్రతి పార్శ్వపాదం అనేక శూకాలను కలిగి ఉండటం వలన నీరిస్ ను ‘పాలికీట్’ అని అంటారు.

ప్రశ్న 15.
బోట్రాయిడల్ కణజాలం అంటే ఏమిటి?
జవాబు:

  1. జలగలో ఉండే ప్రత్యేక కణజాలమును బోట్రాయిడల్ కణజాలం అంటారు.
  2. ఇది శరీర కుహరం అంతా ఆక్రమించి, ద్రాక్ష గుత్తులను పోలి ఉంటుంది.
  3. దీని యొక్క విధులు విసర్జన, ఇనుము, కాల్షియం నిల్వ మరియు గాయం తగిలిన ప్రాంతాల పునర్నిర్మాణం.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 16.
నిమటోడా, అనెలిడా బాహ్యచర్మాల మధ్య భేదమేమిటి? శరీరకుడ్యం కండరాలలో ఏ విధంగా విభేదిస్తుంది?
జవాబు:

  1. నిమటోడా జీవులలో బాహ్యచర్మము బహుకేంద్రక స్థితి (సిన్సీషియల్) .
    కాని అనెలిడా జీవులలో బాహ్యచర్మము ఒకే కణమందములో ఉండే ఉపకళా కణములతో ఏర్పడతాయి.
  2. నిమటోడా జీవుల దేహకుడ్యంలో వర్తులాకార కణజాలం ఉండదు.
    కాని అనెలిడా జీవుల దేహకుడ్యంలో వర్తుల మరియు ఆయత కండరాలు రెండూ ఉంటాయి.

ప్రశ్న 17.
తేళ్లలోని మొదటి, రెండవ జత శిరో ఉపాంగాలను ఏమంటారు? [TS MAY-22]
జవాబు:

  1. తేళ్లలోని మొదటి జత శిరో ఉపాంగాలను ‘కెలిసెరాలు’ అని అంటారు.
  2. రెండవ జత శిరో ఉపాంగాలను ‘పెడిపాలు’ అని అంటారు.

ప్రశ్న 18.
క్రస్టేషియాలోని మొదటి రెండు జతల శిరో ఉపాంగాలు, ఇతర సజీవ ఆర్థ్రోపోడ్ జీవులతో పోల్చినప్పుడు కనిపించే ప్రత్యేకత ఏమిటి?
జవాబు:

  1. క్రస్టేషియాలో శిరోభాగములో మొదటి రెండు జతలు స్పర్శశృంగికలు మరియు స్పర్శశృంగాలు ఉంటాయి.
  2. మిగతా సమూహాలలో స్పర్శశృంగికలు మాత్రమే ఉంటాయి. కాని స్పర్శశృంగాలు ఉండవు.

ప్రశ్న 19.
టిక్లు, మైట్లను చేర్చిన ఉపవర్గం ఏది? నడిచే కాళ్ల ఆధారంగా వీటిని కీటకాల నుంచి ఏ విధంగా గుర్తిస్తారు?
జవాబు:

  1. టిక్లు మరియు మైట్ల ఉపవర్గము ‘కెలిసిరేటా’.
  2. కెలిసిరేటా జీవులు నాలుగు జతల నడిచే కాళ్ళును కల్గిఉంటాయి, కాని కీటకాలు మూడు జతల నడిచే కాళ్ళను కల్గి ఉంటాయి.

ప్రశ్న 20.
లిమ్యులస్, పేలామ్నియన్లలో వాటి శ్వాస నిర్మాణాలను పేర్కొనండి.
జవాబు:

  1. లిమ్యులస్ (రాచపీత) యొక్క శ్వాసాంగాలు ‘పుస్తకాకార మొప్పలు’.
  2. పేలామ్నియస్ (తేలు) యొక్క శ్వాసాంగం ‘పుస్తకాకార ఊపిరితిత్తులు’.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 21.
స్పర్శశృంగాలు అంటే ఏమిటి? స్పర్శశృంగాలు లేని ఆర్థ్రోపోడ్ ని సముదాయం ఏది? [TS M-19]
జవాబు:

  1. స్పర్శశృంగాలు అనగా జ్ఞానాంగాలు.
    2. స్పర్శ శృంగాలు లేని ఆర్థ్రోపోడ్ సముదాయం ‘కెలిసిరెటా జీవులు’.

ప్రశ్న 22.
ఒక ఆర్థ్రోపోడ్లోని పర్యాంతరాంగకుహరాన్ని ఏమంటారు? అది పిండాభివృద్ధిలో ఎక్కడ నుంచి ఏర్పడుతుంది?
జవాబు:

  1. ఆర్థ్రోపోడా జీవులలోని ‘పర్యాంతరంగా కుహరం’ను ‘రక్త కుహరం'( హీమోసీల్) అని అంటారు. ఇది పూర్తి నిజ శరీర కుహరం కాదు.
  2. పిండాభివృద్ధి దశలో అది సంయుక్త బీజ కుహరిక నుంచి ఏర్పడుతుంది.

ప్రశ్న 23.
మీరు చదివిన ఏ ఆర్థ్రోపోడు సజీవశిలాజం అంటారు? దాని శ్వాసాంగాలను పేర్కొనండి. [APM-15,16,18]
జవాబు:

  1. లిమ్యులస్ (రాచపీత)ను ఆర్థ్రోపోడ్ యొక్క సజీవ శిలాజం’ అంటారు.
  2. రాచపీత శ్వాసాంగాలు : పుస్తకాకార మొప్పలు.

ప్రశ్న 24.
బాహ్యరూపం ఆధారంగా కైటానన్ను ఏ విధంగా గుర్తించగలవు? కైటాన్లో ఎన్ని జతల మొప్పలు శ్వాసక్రియలో సహాయపడతాయి?
జవాబు:

  1. కైటాన్ అనేది మొలస్కా జీవి. దీని పృష్ఠభాగం ఉండే ఎనిమిది అడ్డు ఫలకాల ద్వారా దీనిని గుర్తించవచ్చు.
  2. కైటాన్లో 6 నుంచి 88 జతల మొప్పలు శ్వాసక్రియలో సహాయపడతాయి.

ప్రశ్న 25.
రాడ్యులా విధి ఏమిటి? రాడ్యులా లేని మలస్కా జీవుల సముదాయం పేరు తెలపండి.
జవాబు:

  1. రాడ్యులా అనేది మొలస్కా జీవుల యొక్క నికషణ అవయవం. దీని విధి ఆహార సేకరణ.
  2. రాడ్యులా లేని మొలస్కా జీవుల సముదాయం పేరు బైవాల్వియా (లేదా) పెలిసిపోడా .

ప్రశ్న 26.
మొలస్కా జీవుల మొప్ప వేరొక పేరేమిటి? ఓస్ప్రేడియం విధి ఏమిటి? [IPE-14]
జవాబు:

  1. మొలస్కా జీవుల మొప్పలకు (టినీడియా) వేరొక పేరు ‘కంకాభాంగాం’ .
  2. ‘ఓస్ప్రేడియం’ బైవాల్వియా మరియు గాస్ట్రోపోడ్ జీవులలో ‘నీటి స్వచ్ఛతను పరీక్షిస్తుంది.’

ప్రశ్న 27.
అరిస్టాటిల్ లాంతరు అంటే ఏమిటి? దీన్ని కలిగి ఉండే ఒక జంతువు ఉదాహరణను పేర్కొనండి [AP,TS M-17]
జవాబు:

  1. సీఆర్చిన్ల యొక్క నోటిలో ఐదు దవడలు కలిగి ఆహరాన్ని నమలటానికి ఉపయోగపడే నిర్మాణమును అరిస్టాటిల్ లాంతరు అంటారు.
  2. ఉదా: ఎఖినస్ (సీ ఆర్చిన్)

AP Inter 1st Year Zoology Important Questions Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 28.
సౌష్ఠవపరంగా ఇకైనోడర్మ్ జువెనైల్, ప్రౌఢజీవుల మధ్య ప్రధాన భేదం ఏమిటి? [TS MAY-22] [AP MAY-22] [TS M-20]
జవాబు:

  1. ఇకైనోడర్మ్ డింభకాలు ‘ద్విపార్శ్వ సౌష్ఠవము’ను ప్రదర్శిస్తాయి.
  2. ప్రౌఢ ఇకైనోడర్మ్ జీవులు ‘పంచభాగ వ్యాసార్ధ సౌష్ఠము’ ను ప్రదర్శిస్తాయి.

ప్రశ్న 29.
ఫెరిటిమాలో రక్తగ్రంధులు అంటే ఏమిటి? [TS M-16]
జవాబు:

  1. ఫెరిటిమా దేహంలో 4వ, 5వ మరియు 6వ ఖండితాలలో ఉండే గ్రంధులను రక్తగ్రంధులు అంటారు.
  2. అవి రక్తకణాలను మరియు ప్లాస్మాలో కరిగి ఉండే హిమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేస్తాయి.

ప్రశ్న 30.
ఫెరిటిమాలోని శుక్రగ్రాహికలు అంటే ఏమిటి? అవి ఏ ఖండితాల్లో ఉంటాయి?
జవాబు:

  1. ఫెరిటిమాలోని శుక్రగ్రాహికలు శుక్ర కణాలను నిల్వచేసే అవయవాలు. ఇవి సంపర్క సమయంలో శుక్ర కణాలను గ్రహించి నిల్వ చేస్తాయి.
  2. ఖండితానికి ఒక జత చొప్పున 6వ, 7వ, 8వ మరియు 9వ ఖండితాలలో ఇవి ఉంటాయి.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ఆంథోజోవన్ల ముఖ్య లక్షణాలపై లఘుటీక రాయండి. [AP M-16][TS M-18,20]
జవాబు:
ఆంథోజోవన్ల ముఖ్య లక్షణాలు:

  1. ఆంథోజోవా జీవులను సాధారణంగా ‘సీ అనిమోన్లు’ అంటారు.
  2. ఇవి స్థానబద్ద సముద్రపు జీవులు.
  3. ఇవి తన జీవిత చక్రంలో పాలిప్ రూపాలను మాత్రమే కలిగి ఉంటాయి. వీటిలో మెడ్యుసా దశ ఉండదు.
  4. వీటి దంశకణాలు బాహ్యచర్మం మరియు అంతఃచర్మం రెండింటిలో ఉంటాయి.
  5. వీటి మధ్యశ్లేష్మస్తరం సంయోజక కణజాలాన్ని కలిగి ఉంటుంది.
  6. వీటిలో బీజకణాలు అంతఃచర్మం నుండి ఏర్పడతాయి.
  7. వీటిలో ‘బీజకణాలు’ ఎండోడెర్మ్ లో ఏర్పడతాయి.
  8. ఇవి అభివృద్ధి చెందిన నిడేరియా జీవులు –
  9. ఉదా:ఎడామ్సియా (సీ అనిమోన్), గాన్జోనియా (సముద్రపు విసనకర్ర), పెన్నాట్యూలా (సముద్ర కలం).

AP Inter 1st Year Zoology Important Questions Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 2.
ఫ్లూక్లను ఏ విభాగంలో చేర్చారు. ఆ సముదాయం ప్రధాన లక్షణాలపై లఘుటీక రాయండి. [TS MAY-22]
జవాబు:
ఫ్లూక్ ల ప్రధాన లక్షణాలు:

  1. ప్లూక్ు ప్లాటి హెల్మింథిస్ వర్గంలోని ‘ట్రిమటోడా’ తరగతికి చెందినవి.
  2. ప్లూక్లు అన్నీ పరాన్న జీవులు.
  3. వీటి దేహం మందమైన అవభాసినితో కప్పబడి ఉంటుంది.
  4. ఇది సాధారణంగా రెండు చూషకాలను కల్గి ఉంటుంది. ఒకటి ముఖచూషకం మరియు రెండవది ఉదరచూషకం.
  5. వీటి జీర్ణాశయం రెండుగా చీలి వుంటుంది ( ఫోర్క్).
  6. ఇవి ద్విలింగక జీవులు.
  7. వీటి జీవిత చరిత్రలో ఒకటి కంటే ఎక్కువ అతిధేయిలను కల్గి ఉంటాయి.
  8. ఇవి వివిధ రకాల డింభక దశలను కల్గి ఉంటాయి. ( మిరాసీడియం, రీడియా, సర్కేరియా, స్పోరోసిస్ట్)
  9. ఉదా: ఫాసియోలా (లివర్ ప్లూక్), షిస్టోసోమా (బ్లడ్ూక్)

ప్రశ్న 3.
పాలికీట్లు ప్రదర్శించే ముఖ్య లక్షణాలు ఏమిటి? [AP M-18,20] [TS M-16,19]
జవాబు:
పాలికీట్ల ముఖ్య లక్షణాలు:

  1. పాలికీట్ జీవులు సముద్రపు జీవులు.
  2. వీటిని సాధారణంగా బ్రిసిల్ పురుగులు (లేదా) క్లామ్ వార్మ్స్ అంటారు.
  3. ఈ జీవులు చాలా వరకు స్వేచ్ఛగా కదులుతాయి. మిగతావి బొరియలలో జీవిస్తాయి.
  4. వీటి తల నిర్ధిష్టంగా ఉంటుంది. ఇది నేత్రాలు స్పర్శకాలు మరియు జ్ఞానఅవయవాలను కల్గి ఉంటుంది.
  5. వీటి పార్శ్వపాదాలు గమనాంగాలు.
    AP Inter 1st Year Zoology Important Questions 3 జంతు వైవిధ్యం-I అకశేరుక వర్గాలు 1
  6. వీటిలో పార్శ్వపాదాలు శ్వాసప్రక్రియలో కొంతవరకు సహకరిస్తాయి.
  7. వీటిలో క్లైటెల్లం మరియు బీజవాహికలుండవు.
  8. ఈ జీవులు ఏకలైంగికాలు.
  9. వీటిలోని సంయోగబీజాలు శరీరకుహరంలోకి విడుదల చేయబడి వృక్కరంధ్రాల ద్వారా వెలుపలికి వచ్చును.
  10. వీటి ఫలదీకరణం బాహ్యఫలదీకరణం.
  11. వీటిలో ట్రోకోఫోర్ డింభకం ఉంటుంది.
    ఉదా: నీరిస్ (ఇసుక పురుగు), ఎఫ్రోడైట్ (సముద్రపు చెంచెలుక), అరెనికోలా( లగ్ వార్మ్) నీరిస్

ప్రశ్న 4.
హైరుడీనియన్లు పాలికీట్లు, ఒలిగోకీట్ల నుంచి ఏ విధంగా భిన్నంగా ఉంటాయి?
జవాబు:
ఈ క్రింది లక్షణాల ఆధారంగా హైరుడీనియన్లు, పాలికీటా మరియు ఒలిగోకీట్ నుండి భిన్నంగా ఉంటాయి.
AP Inter 1st Year Zoology Important Questions 3 జంతు వైవిధ్యం-I అకశేరుక వర్గాలు 2

ప్రశ్న 5.
క్రస్టేషియన్ల ప్రధాన లక్షణాలు ఏవి?
జవాబు:
క్రస్టేషియన్ల ప్రధాన లక్షణాలు:

  1. క్రస్టేషియన్లు స్పర్శశృంగాలు కలిగిన ఆర్థ్రోపోడా జీవులు. ఇవి మంచి నీటి జీవులు.
  2. వీటి బాహ్యకవచం కాల్షియం కార్బొనేట్ తో దృఢ పరచబడి ఉంటుంది.
  3. వీటిలో తల మరియు ఉరం కలిసి శిరోవక్షంగా ఏర్పడుతుంది.
  4. తల భాగంలో ఐదు జతల ఖండితాలుంటాయి.
    (a) స్పర్శశృంగికలు (b) స్పర్శశృంగాలు (c) హనువులు (d) మొదటి జత జంభికాలు (e) రెండవ జత జంభికాలు
  5. ఉరం మరియు ఉదర ఉపాంగాలు ద్విశాఖీయం.
  6. శ్వాసాంగాలు మొప్పులు( బ్రాంకియా).
  7. విసర్జకాంగాలు హరిత గ్రంధులు (లేదా) స్పర్శ శృంగగ్రంధులు.
  8. వీటి దేహంలో స్పర్శ శృంగాలు, సంయుక్త నేత్రాలు ఉంటాయి. సంతులన కోశాల వంటి
  9. వీటిలో ఫరోక్ష పిండాభివృద్ధి జరిగి వివిధ రకాల డింభదశలు ఏర్పడతాయి. 10.ఉదా: పాలిమాన్ (మంచినీటి రొయ్య), కాన్సర్ (పీత), డాఫ్నియా( వాటర్ ఫ్రీ)

AP Inter 1st Year Zoology Important Questions Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 6.
అరాక్నిడా సాధారణ లక్షణాలను రాయండి.
జవాబు:
అరాక్నిడా సాధారణ లక్షణాలు:

  • అరాక్నిడాలు భూచర కెలిసిరేటా ఆర్థ్రోపోడ్లు.
  • వీటి దేహం ప్రోసోమా మరియు ఒపిస్టోసోమాలుగా విభజించబడి ఉంటుంది.
  • ప్రోసోమా ఆరు ఖండితాలను కల్గి ఉంటుంది.
    (a) ఒక జత కలిసెరాలు (b) ఒక జత పెడిపాలు (c) నాలుగు జతల నడిచే కాళ్ళు జ్ఞానాంగాలు ఉంటాయి.
  • సాలీళ్ళ స్పిన్నరెట్లు ‘సాలీడు పట్టు’ను స్రవిస్తాయి. స్పిన్నరెట్లు రూపాంతరం చెందిన ఉదర ఉపాంగాలు.
  • వీటి శ్వాసాంగాలు పుస్తకాకార ఊపిరితిత్తులు (తేళ్లు) పారియు వాయునాళాలు (కొన్ని సాలీళ్లు)
  • వీటిలో రాగి కలిగిన ‘హీమోసయనిన్’ అనే శ్వాస వర్ణకం ఉంటుంది.
  • వీటిలో విసర్జకాంగాలు మాల్ఫీజియన్ నాళికలు మరియు కోక్సల్ గ్రంధులు.
  • వీటిలో పిండాభివృద్ధి ప్రత్యక్షంగా ఉంటుంది. లార్వాదశ ఉండదు.
  • ఢీళ్లు శిశూత్పాదాకాలు
    ఉదా: పేలామ్నియస్ (తేలు), ఎరానియా (సాలీడు), సార్కొప్టెస్ (దురదమైట్)

ప్రశ్న 7.
శతపాదులను, సహస్రపాదులతో సంక్షిప్తంగా పోల్చండి. [AP M-18]
జవాబు:
శతపాదులు

  1. శతపాదులు కీళ్ళు ఉపాంగాలుగా గల ఆర్థ్రోపొడాలు.
  2. శతపాదులు కైలోపొడా విభాగంనకు చెందినవి.
  3. శతపాదులను ‘వందకాళ్ళ జీవులు’ అని అంటారు.
  4. ఇవి భూచరాలు.
  5. వాయునాళాలే వీటి శ్వాసాంగాలు.
  6. వీటి దేహాన్ని తల మరియు మొండెంగా విభజించవచ్చు.
  7. కైలోపొడా జీవులలో ప్రతి ఖండితానికి ఒక జత నఖాలు ఉన్న ఉపాంగాలుంటాయి.
  8. వీటిలో విషపు నఖాలు ఉంటాయి.
  9. మాల్ఫీజియన్ నాళికలు వీటి విసర్జకాంగాలు.
  10. ఇవి మాంసాహారజీవులు
  11. ఉదా: (స్కోలేపెండ్రా, స్కూటిజెరా- శతపాదులు),

సహస్రపాదులు

  1. సహస్ర పాదులు కీళ్ళు ఉపాంగాలుగా గల ఆర్థ్రోపొడాలు.
  2. సహస్రపాదులు డిప్లోపోడా తరగతికి చెందినవి.
  3. సహస్ర పాదులను ‘వేయి కాళ్ళ జీవులు’ అని అంటారు.
  4. ఇవి భూచరాలు .
  5. వాయునాళాలే వీటి శ్వాసాంగాలు.
  6. వీటి దేహాన్ని తల మరియు మొండెంగా విభజించవచ్చు.
  7. డిప్లోపోడా జీవులలో ప్రతి ఖండితానికి రెండు జతల ఉపాంగాలుంటాయి.
  8. వీటిలో విషపు నఖాలు ఉండవు.
  9. మాల్ఫీజియన్ నాళికలు వీటి విసర్జకాంగాలు.
  10. ఇవి శాఖాహారులు.
  11. ఉదా: (స్పైరోస్ట్రిప్టన్, జూలస్ – సహస్ర పాదులు)

ప్రశ్న 8.
ఇతర మలస్కా జీవులతో పోలిస్తే సెఫలోపోడ్లు అనేక ప్రత్యేక లేదా పురోగతి చెందిన లక్షణాలను ప్రదర్శిస్తాయి. సంక్షిప్తంగా చర్చించండి..
జవాబు:
సెఫలోపోడ్ల ప్రత్యేక లక్షణాలు:

  1. సెఫలోపొడ్ జీవులు బాగా అభివృద్ధి చెందిన మలస్కా జీవులు.
  2. ఇవి అధికంగా సముద్రపు జీవులు.
  3. వీటి తలస్పష్టంగా ఉండి సుస్పష్టమైన కళ్ళను కల్గి ఉంటాయి. (సకశేరుకాల వలే)
  4. ఆస్యకుహరంలో కొమ్ము లాంటి దవడలు మరియు రాడ్యులా ఉంటాయి.
  5. వీటి నాటిలిస్ కర్పరం. బాహ్యంగా అనేక గదులను కల్గిఉంటుంది. అంతరంగా కర్పరం సెపియా (కటిల్ ఎముక) మరియు లాలిగోలో (కలం) ఉంటుంది. ఆక్టోపస్లో కర్పరం ఉండదు.
  6. వీటి పాదం కొంత మేర రూపాంతరం చెంది నోటి చుట్టూ 8 చూషకాలతో ఆక్టోపస్ లోను మరియు 10 చూషకాలతో సెపియా, లాలిగోలలో ఉంటుంది.
  7. పాదంలోని కొంత భాగం రూపాంతరం చెంది అంకుశనాళం గా మార్పు చెందుతుంది. ఇది ఈదుటలో ఆకస్మిక కదలికలకు సహాయపడుతుంది.
  8. అంకుశనాళంను కల్గి ఉండటం వల్ల సెఫలోపొడాను’ సైఫనోపోడా’ అని కూడా అంటారు.
  9. కొన్ని సెఫలోపొడా జీవులు సిరాగ్రంధిని కల్గి ఉంటాయి, దీనిని రక్షణ అనుకూలతగా వినియోగించుకుంటాయి.
  10. టెట్రాబ్రాంకియేట్లలో కంకాభాంగాలు, ఏట్రియమ్లు మరియు వృక్కాలు రెండు చొప్పున ఉంటాయి.
  11. ప్రసరణ వ్యవస్థ సంవృత రకం (రక్తం నాళాలలో ప్రవహిస్తుంది)
  12. మెదడు బాగా అభివృద్ధి చెంది, మృదులాస్థి నిర్మిత కపాలంలో ఉంటుంది.
  13. ఇవి ఏకలింగ జీవులు
  14. వీటి అభివృద్ధి ప్రత్యక్షం
  15. ఉదా: సెపియా (కటిల్ చేప), ఆర్కిటూథిస్ (బృహత్స్క్విడ్), ఆక్టోపస్ ( దయ్యపు చేప).

AP Inter 1st Year Zoology Important Questions Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 9.
మొలస్కాలోని ఏ విభాగంలో పురాతన జీవులు ప్రాతినిధ్యం వహిస్తాయి. వాటి ముఖ్య లక్షణాలను వివరించండి.
జవాబు:
పురాతనమైన మొలస్కాలు:

  1. పురాతన మొలస్కాలను కలిగిన విభాగం ఏప్లోకోఫోరా తరగతి.
  2. ఇవి క్రిమిరూపంలో ఉండే ఆదిమ జీవులు.
  3. ఇవి సాగర జీవులు.
  4. వీటిలో ప్రావారం, కర్పరం, పాదం మరియు వృక్కాలు ఉండవు.
  5. వీటిలో తల అంతగా అభివృద్ధి చెందలేదు.
  6. వీటిలో రాడ్యులా ఉంటుంది.
  7. వీటిలో అవభాసిని కాల్కేరియస్ కంటకాలను కల్గి ఉంటుంది.
  8. కొన్ని జీవులలో మధ్య ఉదరగాడి ఉంటుంది. ఇది ఇతర మొలస్కా జీవుల పాదాన్ని పోలి ఉంటుంది.
  9. ఉదా: నియోమేనియా, కీటోడెర్మా.

ప్రశ్న 10.
ఎకినాయిడ్ల ప్రధాన లక్షణాలను పేర్కొనండి. [AP MAY-22] [AP M-17,19]
జవాబు:
ఎకినాయిడ్ల ప్రధాన లక్షణాలు:

  • ఎకినాయిడ్లు ‘ఇకైనోడర్మేటా’ వర్గానికి చెందిన జీవులు.
  • వీటి దేహం అండాకారంగా (లేదా) చక్రిక ఆకారంలో ఉంటుంది.
  • వీటిలో దేహాన్ని కప్పి కదిలే కంటకాలు ఉంటాయి.
  • వీటికి బాహువులు ఉండవు.
  • వీటిలో కాల్కేరియస్ అస్థిఖండాలు కలిసిపోయి ఒక దృఢమైన కవచాలను (కరోనా (లేదా) పెట్టె) ఏర్పరుస్తాయి.
  • వీటి రంధ్రఫలకం మరియు పాయువు ప్రతిముఖ తలంలో ఉంటాయి.
  • వీటిలో అంబులేక్రల్ గాడులు మూసుకొని ఉంటాయి.
  • వీటిలో పెడిసిల్లేరియాలకు మూడు దవడలుంటాయి.
  • ‘అరిస్టాటిల్ లాంతరు’ అనే ఒక సంక్లిష్టమైన ఐదు దవడల నమిలే యంత్రాంగం సీ అర్చిన్ నోటిలో ఉంటుంది కాని హార్ట్ అర్చిన్లో అది ఉండదు.
  • వీటి అభివృద్ధిదశలో ఎకైనోప్లూటియస్ అనే డింభకం ఉంటుంది.
    ఉదా:ఎకైనస్ (సీ అర్చిన్), ఎకైనోకార్డియం (హర్ట్ అర్చిన్, ఎకైనోఫ్లూటియస్ డింభకం ఉంటుంది.

ప్రశ్న 11.
హోలోథురాయిడియా ప్రధాన లక్షణాలను వివరించండి. [AP M-15]
జవాబు:
హోలోథురాయిడియా ప్రధాన లక్షణాలు:

  • హాలోథురాయిడ్లు మెత్తని దోసకాయ వంటి నిర్మాణం కల ఇకైనోడర్మ్లు. వీటిని సముద్ర దోసకాయలు అంటారు.
  • వీటి దేహం ‘ముఖ-ప్రతిముఖ అక్షం’ వెంబడి పొడవుగా సాగి ఉంటుంది.
  • చర్మం తోలులాగా ఉండి, అంతశ్చర్మం వదులైన కంటకాలను కల్గి ఉంటుంది.
  • వీటిలో బాహువులు, ముళ్ళు, పెడిసిల్లేరియాలు ఉండవు.
  • వీటి నోటి చుట్టూ ముకుశించుకోగల స్పర్శకారులు ఉంటాయి.
  • వీటిలో అంబులేక్రల్ గాడులు మూసుకొని ఉంటాయి.
  • వీటి నాళికాపాదాలకు చూషకాలుంటాయి.
  • వీటిలో రంధ్ర ఫలకం అంతర్గతంగా (శరీరకుహరంలో ) ఉంటుంది.
  • వీటిలో ప్రోసోమా ఆరు ఖండితాలను కల్గి ఉంటుంది.
    ఉదా:హాలోతూరియా, సినాప్టా, థయోన్

ప్రశ్న 12.
వృక్కాల విధులను తెలపండి.
జవాబు:
వృక్కాల విధులు:

  1. వృక్కాలు బాహ్యచర్మం నుంచి ఏర్పడి, ఖండితాయుతంగా అమరి మెలికలు తిరిగిన నాళికలను కల్గి ఉంటాయి.
  2. వృక్కాల యొక్క ప్రధాన విధి, ‘జీవక్రియ వ్యర్థాలను తొలగించుట’.
  3. వివిధ రకాల విధుల ఆధారంగా వృక్కాలు వివిధ రకాలు.
  4. సముద్ర పాలికీట్లలో సంయోగబీజాలు బయటకు రవాణా చేసేందుకు వృక్కాలు సహాయపడతాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 13.
ఫెరిటిమాలో ఎన్ని రకాల వృక్కాలు కలవు? వాటిని వివరించండి.
జవాబు:
ఫెరిటిమాలోని రకాలను ఖండితాల ఆధారంగా విభజించవచ్చు. ఇవి మూడు రకాలు

  1. గ్రసని వృక్కాలు: ఇవి 4వ, 5వ, 6వ ఖండితాలలో ఉంటాయి.. ఇవి గ్రసని మరియు ఆస్యకుహరంలోనికి తెరచుకుంటాయి. ఇవి బంధించిన వృక్కాలు కావున వీటిలో నెఫ్యూస్టోమ్ ఉండదు.
  2. త్వచ వృక్కాలు: ఇవి 3వ ఖండితం నుంచి ఆఖరి ఖండితం వరకు శరీర కుడ్యం లోపలి తలంలో అతుక్కొని ఉంటాయి. ఇవి వెలుపలికి వృక్కరంధ్రాల ద్వారా తెరచుకుంటాయి. ఇవి సంవృత రకాలు.
  3. విభాజకాయుత వృక్కాలు: ఇవి ఖండితాలకు ఇరువైపులా అతుక్కొని ఉంటాయి. ఇవి పేగులోనికి తెరచుకుంటాయి. ఇవి 15/16 ఖండితాలకి ఇరువైపులా చివరి వరకు ఉంటాయి.

ప్రశ్న 14.
ఫెరిటిమాలోని హృదయాలను వర్ణించండి.
జవాబు:
ఫెరిటిమాలోని హృదయాలు:

  • ఫెరిటిమా (వానపాము) ప్రసరణ వ్యవస్థలో నాలుగు జతల హృదయాలు ఉంటాయి.
    (a) రెండుజతల పార్శ్వ హృదయాలు 7వ మరియు 9వ ఖండితాలలో ఉంటాయి.
    (b) రెండు జతల పార్శ్వ ఆహర వాహికా హృదయాలు 12వ మరియు 13వ ఖండితాలలో ఉంటాయి..
  • ఇవి కవాటయుతాలు, కణజాల యుతం మరియు సంకోచయుతం.
  • ఇవి రక్తాన్ని పృష్ఠ రక్తనాళం నుంచి ఉదర రక్తనాళంకు సరఫరా చేస్తాయి.
  • పార్శ్వ ఆహార వాహిక హృదయాలు కూడా రక్తాన్ని ఆహరవాహిక రక్తనాళాలకు అక్కడి నుంచి ఉదర రక్తనాళాలకు సరఫరా చేస్తాయి.
  • వీటిలో రెండు జతల పార్శ్వ ఆహార వాహికా హృదయాలు ఉంటాయి.

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ఫెరిటిమాలోని ప్రత్యుత్పుత్తి వ్యవస్థ పటం గీచి భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Important Questions 3 జంతు వైవిధ్యం-I అకశేరుక వర్గాలు 3

ప్రశ్న 2.
ఫెరిటిమాలోని జీర్ణ వ్యవస్థను వర్ణించి, జీవక్రియా విధానాన్ని వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Important Questions 3 జంతు వైవిధ్యం-I అకశేరుక వర్గాలు 4
(A) ఫెరిటిమా జీర్ణ వ్యవస్థ:

1. ఫెరిటిమా జీర్ణవ్యవస్థలో ఆహారనాళం మరియు దానికి సంబంధించిన గ్రంధులుంటాయి.

2. ‘ఫెరిటిమాలో ’ ఆహారనాళం తిన్నగా ఉండే నాళం. ఇది రెండు చివర్లు, ఒకటి నోరు మరియు పాయువును కల్గి ఉంటుంది.

3. ఆహారనాళం యొక్క భాగాలు:

  • ఆహార నాళంలో నోరు పూర్వ భాగాన ఉంటుంది.
  • ఆస్యకుహరం 1-3 ఖండితాలలో ఉంటుంది.
  • గ్రసని పెద్దదిగా, కండరయుతంగా ఉండి 4వ ఖండితంలోకి తెరచుకుంటుంది.
  • ఆహరవాహిక పొట్టిగా, సన్నగా ఉండి 5 నుండి 7 ఖండితాలలోకి తెరచుకుంటుంది.
  • కండరయుతం మరియు గరుకుగా ఉండే ‘అంతర జఠరం’ 8వ ఖండితంలో ఉంటుంది. దీనినే ‘పిండిమర’ అని కూడా అంటారు.
  • జీర్ణాశయం 9-14 ఖండితాలలో కాల్సిఫెరస్ గ్రంధులతో ఉంటుంది.
  • జీర్ణాశయం 15వ ఖండితం నుంచి చివర వరకు ఉంటుంది.
  • 23 నుండి 28 ఖండితాల వరకు మధ్యస్థంగా లోపలి వైపునకు ఒక మడత ఏర్పడుతుంది. దీనినే ఆంత్రావళి అని అంటారు.
  • ‘ఆంత్రావళి’ శోషించే తలాన్ని పెంచుతుంది.
  • ఇది ఫెరిటిమాలో తక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది.
  • ఒక జతకురచ శంక ఆకార ఆంంధ నాళాలు 26వ ఖండితంలోని పేగు నుండి పార్శంగా ఏర్పడతాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

(B) జీర్ణక్రియ విధానం:

  • వానపాము యొక్క ఆహారం కర్బన పదార్ధాలతో కూడిన మట్టి(హ్యుమస్).
  • వానపాము మట్టి మరియు హ్యుమన్ను నోటి ద్వారా గ్రహిస్తుంది.
  • గ్రసనిలో హ్యుమస్ అనునది ఎంజైమ్లతో కలుపబడుతుంది.
  • అంతరజఠరం నందు (పిండిమర) ఆహరం మెత్తగా చేయబడుతుంది.
  • కాల్సిఫెరస్ గ్రంధుల స్రావాలు హ్యుమన్ లోని ఆమ్లాలను తటస్థీకరిస్తుంది.
  • వానపాము జీర్ణాశయంలో ఆహారం జీర్ణరసాల ద్వారా జీర్ణమవుతుంది.
  • ‘పేగు కుడ్యాలు’ జీర్ణమైన ఆహారాన్ని శోషించుకుంటాయి.
  • శోషించిన ఆహారాన్ని వివిధ రకాల జీవక్రియలకు వినియోగించుకుంటుంది.
  • జీర్ణంకాని ఆహారం పేల్లేట్స్ రూపంలో పాయువు ద్వారా బయటకు పంపబడుతుంది.

Leave a Comment