AP Inter 1st Year Zoology Important Questions Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

Students get through AP Inter 1st Year Zoology Important Questions 1st Lesson జీవ ప్రపంచ వైవిధ్యం which are most likely to be asked in the exam.

AP Inter 1st Year Zoology Important Questions 1st Lesson జీవ ప్రపంచ వైవిధ్యం

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
జీవన చర్యలను నిర్వచించి ఒక ఉదాహరణ ఇవ్వండి?
జవాబు:

  1. ఒక జీవి యొక్క దేహంలో జరిగే అనేక రకాల రసాయన చర్యలన్నింటిని కలిపి సమిష్టిగా ‘జీవన క్రియలు’ అంటారు.
  2. ఉదా: జంతువులలో జీర్ణక్రియ, శ్వాసక్రియ, మొక్కలలో కిరణజన్యసంయోగ క్రియ మొదలైనవి.

ప్రశ్న 2.
నిర్జీవుల, సజీవుల పెరుగుదలలోని భేదాలను ఎలా గుర్తిస్తారు?
జవాబు:

  1. సజీవులలో పెరుగుదల అనేది శరీరంలో జీవకణాల పెరుగుదల వలన జరుగుతుంది. వీటిలో పెరుగుదల అంతర్గతం. జంతువులలో పెరుగుదల పరిమితంగా ఉంటే మొక్కలలో పెరుగుదల అపరిమితంగా ఉంటుంది.
  2. నిర్జీవులలో మాత్రం పెరుగుదల అనేది బాహ్యంగా పదార్థం సమకూరడం వల్ల జరుగుతంది.

ప్రశ్న 3.
బయోజెనిసిస్ అంటే ఏమిటి? [TS MAY-22][AP MAY-22] [AP M-18]
జవాబు:

  1. బయోజెనిసిస్ ఒక జీవ పరిణామ సిద్ధాంతం. ఇది ‘జీవి నుంచే జీవి ఉద్భవిస్తుంది’ అని తెలియజేస్తుంది.
  2. సజీవులు అన్నికూడా సజీవుల నుండి మాత్రమే ఉద్భవిస్తాయి, కాని నిర్జీవ పదార్ధం నుండి కాదు.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం
ప్రశ్న 4.
కణజాల శాస్త్రాన్ని నిర్వచించండి. దీనికి గల మరొక పేరు ఏమిటి? [AP M-19]
జవాబు:
కణజాల శాస్త్రం:

  1. వివిధ జీవ కణజాలల యొక్క సూక్ష్మయుత నిర్మాణాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రమును ‘కణజాల శాస్త్రము’ అంటారు.
  2. దీనిని సూక్ష్మ ‘అంతర నిర్మాణ శాస్త్రం’ అని కూడా అంటారు.

ప్రశ్న 5.
పిండోత్పత్తి శాస్త్రానికీ, ప్రవర్తనా శాస్త్రానికీ (ఇథాలజీ) మధ్య భేదమేమిటి?
జవాబు:
పిండోత్పత్తి శాస్త్రం

  1. పిండోత్పత్తి శాస్త్రం అనునది పిండాభివృద్ధిని అధ్యయనం చేయు శాస్త్రం.
  2. ఇది ఫలదీకరణం, సంయుక్త బీజం యొక్క ప్రాధమిక విభజనలు మరియు సంయుక్త బీజం నుండి అవయవాల అభివృద్ధి అనే అంశాలను అధ్యయనం చేస్తుంది.

ఇథాలజీ

  1. ఇథాలజీ అనునది జంతువుల ప్రవర్తనను గురించి అధ్యయనం చేయు శాస్త్రం.
  2. ఇది జీవుల ప్రవర్తనకు సంబంధించిన పరిశీలన, దత్తాంశము, పర్యావరణ, శరీరధర్మ మరియు పరిణామ సంబంధిత లక్షణాలను అధ్యయనం చేస్తుంది.

ప్రశ్న 6.
ప్రాచీన కాలంలో నివసించిన జీవి అవశేషాలను ఒక (నిర్ధిష్ట) ప్రదేశంలో తవ్వి తీయడం జరిగింది. ఇలాంటి అధ్యయనాన్ని జరిపే జీవశాస్త్ర శాఖను ఏమంటారు?
జవాబు:
పురాజీవ శాస్త్రం.

ప్రశ్న 7.
‘జంతు ప్రదర్శనశాలలు వర్గీకరణకు ఉపకరణాలు’, వివరించండి?
జవాబు:

  1. జంతు ప్రదర్శనశాల అనగా క్రూర మృగాలను మరియు పక్షులను మానవ సంరక్షణలో ఉంచే ప్రదేశం.
  2. ఇవి జంతువుల యొక్క బాహ్యలక్షణాలను, ఆహారపు అలవాట్లను, ప్రవర్తనలను తెలుసుకొనుటకు సహాయపడతాయి. ఇవి జంతు రాజ్యంలో వాటి యొక్క వ్యవస్థాత్మాక స్థానాన్ని నిర్ణయించేందుకు ఉపకరిస్తాయి. కావున జంతు ప్రదర్శానశాలలు ‘వర్గీకరణకు ఉపకరణాలు’.

ప్రశ్న 8.
పొడి నమూనాలు (Dry specimens), అస్థిపంజరాలను ఎక్కడ, ఎట్లా పరిరక్షిస్తారు
జవాబు:

  1. జంతు అస్థిపంజరాలు మరియు పొడి నమూనాలను ప్రదర్శనశాలలో పరిరక్షిస్తారు.
  2. కొన్ని జంతువుల లోపలి అవయవాలను తీసివేసి వాటి స్థానంలో రంపపు పొట్టు, ఊకలాంటి పదార్థాలను దట్టించి భద్రపరచి ప్రదర్శిస్తారు.

ప్రశ్న 9.
త్రినామ నామీకరణ అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి. [AP M-15] [TS M-16]
జవాబు:

  1. త్రినామ నామీకరణ : జీవులను ప్రజాతి, జాతి మరియు ఉపజాతి అనే మూడు పదాలతో నామీకరణం చేయడాన్ని త్రినామ నామీకరణం అంటారు. దీనిని ఉపజాతికి పేరు పెట్టడానికి ఉపయోగిస్తారు.
  2. ఉదా: హోమో సెపియన్స్ సెపియన్స్

AP Inter 1st Year Zoology Important Questions Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

ప్రశ్న 10.
టాటోనిమీ అంటే ఏమిటి? రెండు ఉదాహరణలు ఇవ్వండి. [TS M-20,22][AP M-16,17][TS May-17]
జవాబు:

  1. ఒక జీవికి ప్రజాతి నామం మరియు జాతి నామం ఒకేలా ఉండునట్లు నామీకరణం జరిగే విధానాన్ని టాటోనిమీ
    అంటారు.
  2. ఉదా 1: నాజా నాజా -నాగుపాము ఉదా 2: ఏక్సిస్ ఏక్సిస్ -మచ్చల జింక

ప్రశ్న 11.
ప్రోటోస్టోమియా, డ్యుటిరోస్టోమియాలను విభేదీకరించండి. [AP MAY-22] [TS M-17,18]
జవాబు:
ప్రోటోస్టోమియా

  1. ప్రోటోస్టోమియా జీవులు అనగా ఆంత్ర రంధ్రము నోరుగా అభివృద్ధి చెందే యుమెటాజోవన్లు.
  2. ఉదా: అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా

డ్యుటిరోస్టోమియా

  1. డ్యుటిరోస్టోమియా జీవులు అనగా ఆంత్ర రంధ్రము పాయువుగా మార్పుచెందే యుమెటాజోవన్లు.
  2. ఉదా: ఇకైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా

ప్రశ్న 12.
‘ఇకైనోడెర్మేటా జీవులు అన్నియూ ఎంటిరోసీలోమేట్లు’ వ్యాఖ్యానించండి.
జవాబు:
ఇకైనోడెర్మేటా జీవులలో శరీరకుహరం అనేది ఆది ఆంత్రం నుంచి పార్శ్వా సంచుల రూపంలో ఏర్పడుతుంది. అందుకే ఇకైనోడెర్మేటా జీవులను ‘ఎంటిరోసిలోమేట్లు’ అని అంటారు.

ప్రశ్న 13.
ICZNసు విపులీకరించండి. [TS MAY-22] [TS M-15]
జవాబు:
ICZN అనగా ‘అంతర్జాతీయ జంతు నామీకరణ నియమావళి’.

ప్రశ్న 14.
ప్రోటోస్టోమినాకు చెందిన నాలుగు వర్గాలను తెలపండి..
జవాబు:

  1. ప్లాటి హెల్మింథస్
  2. నిమటోడా
  3. అసలీ
  4. ఆర్థ్రోపొడా

ప్రశ్న 15.
నిమటోకా ప్రొటోస్టోమియా సమూహానికి చెందింది. కానీ యూసీలోమేట్ కాదు. ఈ వ్యాఖ్యానాన్ని సమర్ధించండి.
జవాబు:
1. నిమటోడా జీవులలో ఆదిఆంత్రరంధ్రం ‘నో.’ .గా’ మారుతుంది కావున వీటిని ఫోటోస్టోమ్లు అంటారు. 2. నీటి శరీర కుహరం నిజమైనది కాదు. కారణము వీటి శరీరకుహరం మధ్యస్త్వచ ఉపకళాస్తరములతో ఆవరింపబడి ఉండదు. అందుచే దానిని ‘మిథ్యాశరీర బహరం’ అంటారు.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

ప్రశ్న 16.
జీవావరణ వైవిధ్యం అంటే ఏమిటి? వివిధ రకాల జీవావరణ వైవిధ్యాలను పేర్కొనండి.
జవాబు:
1. జీవావరణ వైవిధ్యం అనగా ‘జీవావరణ వ్యవస్థ’ స్థాయిలలో ఉండే వైవిధ్యం.
ఉదా: ఎడారులు, వర్షాధార అడవులు, మడ అడవులు.

2. జీవావరణ వైవిధ్యాలు -రకాలు:

  • ఆల్ఫా వైవిధ్యము: ఇది టాక్సా అనగా జాతులను లెక్కించడంపై ఆధారపడి వుంటుంది.
  • బీటా వైవిధ్యము: ఇది ప్రక్కప్రక్క జీవావరణ వ్యవస్థలలో ఉంటూ అంతరించిపోతున్న జాతులపై ఆధారపడి ఉంటుంది.
  • గామావైవిధ్యము: ఒక విస్తృత జీవావరణ మండలంలోని వివిధ జీవావరణ వ్యవస్థల్లోని మొత్తం భిన్నత్వం పై ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న 17.
జాతి సమృద్దతను నిర్వచించండి. [TS MAY-22] [APM-17]
జవాబు:
1. జాతి సమృద్ధత: ఒక నిర్ణీత విస్తీర్ణత గల ప్రాంతములో నివసించే జాతుల సంఖ్యను జాతి సమృద్ధత అంటారు. జాతుల సంఖ్య పెరిగే కొద్దీ జాతి సమృద్ధత పెరుగుతుంది.

2. సూత్రం: Log S=Z log A+ log C
(ఇది y=mx+c అనే రేఖారూపంలో కలదు)
ఇక్కడ S= జాతి సమృద్ధత, A= విస్తీర్ణత, Z = రేఖ యొక్క వాలు (జాతి పెరిగే రేటు), log C = Y-అంతరఖండం.

ప్రశ్న 18.
ప్రకృతి నుంచి లభించే ఏవైనా రెండు ఔషధాలను పేర్కొనండి.
జవాబు:

  1. రెస్పరిన్: ఇది రావుల్ఫియా (సర్పగంధి) మొక్క నుండి తయారగును. దీనిని అధిక రక్త పోటు నివారణకు వాడతారు.
  2. క్వినైన్: ఇది సింకోనా బెరడు నుండి తయారగును. దీనిని మలేరియా జ్వర నివారణకు వాడతారు.
  3. విస్టిన్: ఇది. వింకారోజియా మొక్క నుండి తయారగును. దీనిని క్యాన్సర్ నిరోధానికి వాడతారు.

ప్రశ్న 19.
స్థానికేతర జాతుల చొరబాటు స్థానికజాతుల విలుప్తతకు కారణమవుతుంది. రెండు ఉదాహరణలతో ఈ వ్యాక్యాన్ని నిరూపించండి.
జవాబు:
1. ‘లేక్ విక్టోరియా’ లో స్థానికేతర నైల్పెరున్న ప్రవేశపెట్టుట వలన స్థానిక సిక్లిడ్ జాతుల చేపలు అంతరించిపోయాయి.

2. స్థానికేతర ‘ఆఫ్రికన్ పిల్లి చేపను’ ప్రవేశపెట్టుట వలన స్థానిక ఇండిజీనస్ క్యాట్ చేపలు సంఖ్య భారీగా తగ్గిపోయింది. సిక్లిడ్ చేపలు మరియు ఇండిజీనస్ క్యాట్ చేపలు, ఏలియన్ జాతుల ముందు పోటీపడలేక అవి విలుప్తమయ్యాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

ప్రశ్న 20.
భారతదేశంలోని ఏవైనా నాలుగు పావన వనాలను పేర్కొనండి.
జవాబు:
మత ప్రాముఖ్యతగల వృక్ష సమూహాన్ని పావన వనాలు అంటారు.

  1. ఖాసీ, జైంటియా కొండలు – మేఘాలయ
  2. ఆరావళి పర్వతాలు – రాజస్థాన్, గుజరాత్
  3. సద్గు, బస్తర్ – ఛత్తీస్ ఘడ్
  4. చందా – మధ్యప్రదేశ్

ప్రశ్న 21.
IUCN ను విపులీకరించండి. అంతరించిపోతున్న జాతుల పట్టికను ఏ పుస్తకంలో ఇచ్చారు? [TS M-19] [AP M-20]
జవాబు:

  1. IUCN అనగా అంతర్జాతీయ సహజ మరియు సహజవనరులు సంరక్షణ సంస్థ.
  2. అంతరించిపోతున్న జాతులను ‘రెడ్ డేటా’ పుస్తకంలోని పట్టిలో ప్రచురిస్తారు.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
వర్గవికాస జీవవర్గీకరణను వివరించండి.
జవాబు:

  1. వర్గవికాస వర్గీకరణను ‘ఎర్నెస్ట్ హెకల్ ‘ ప్రవేశపెట్టాడు.
  2. ఇది ఉమ్మడి వంశపారంపర్యంపై ఆధారపడి ఉంటుంది.
  3. (i) వర్గవికాసం (ii) క్లాడ్ అనే రెండు పదాలు ఈ వర్గీకరణకు ఆధారం.
  4. జన్యు అంతరం కలిగి ఉన్న జీవుల మధ్య ఉండే ‘పరిణామక్రియ చరిత్ర’ ను ‘వర్గవికాసం’ తెలియజేస్తుంది.
  5. వర్గవికాసం అనే దానిని ఒక వృక్ష చిత్రం ద్వారా తెలియజేసినట్లయితే దానిని ‘వర్గవికాస వృక్షం’ అంటారు.
  6. దీని యందు పూర్విక జాతులు మరియు ప్రస్తుత సంతతి ఉంటాయి.
  7. క్లాడ్ అనగా ఒకేజాతి ‘సమూహజీవులు’. దీనియందు ఒకే వంశానికి చెందిన సంతతి ఉంటుంది.
  8. ఇది వర్గవికాసవృక్షంలో ఒక కొమ్మను సూచిస్తుంది.
  9. క్లాడ్స్టిక్ లక్షణాలు:
    (i) క్రియాసామ్య లక్షణాలు (విధి ఆధారంగా):
    ఉదా: పక్షుల మరియు సీతా కోకచిలుక రెక్కలు; పిచ్చుక రెక్కలు, ఎగిరే ఉడుతలు, గబ్బిలాల పెటాజియం.
    (ii) నిర్మాణసామ్య లక్షణాలు (ఉమ్మడి వంశ కర్త నుండి వచ్చిన అనువంశికత ఆధారంగా).
    ఉదా: పక్షులు, తిమింగిలాల పూర్వాంగాలు.

ప్రశ్న 2.
వర్గీకరణలో వివిధ అంతస్తులను వివరించండి.
జవాబు:
1. జీవులను వాటి గుర్తింపు లక్షణాల ఆధారంగా అనుకూలమైన సమూహాలుగా విభజించే పద్ధతిని వర్గీకరణ అంటారు.

2. ‘ప్రాధాన్య క్రమ వర్గీకరణ’ ను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ‘కరోలస్ లిన్నియస్’.

3. వర్గీకరణలోని అవికల్ప అంతస్తులు:

  1. రాజ్యం
  2. వర్గము
  3. విభాగము
  4. క్రమము
  5. కుటుంబము
  6. ప్రజాతి
  7. జాతి

4. రాజ్యం: ఇందులో అన్ని బహుకణ జీవులు, పరపోషకాలు ఉంటాయి.

5. వర్గం: ఇందులో సన్నిహిత సంబంధం ఉన్న ఒకటి లేదా ఎక్కువ తరగతులు ఉంటాయి.

6. తరగతి: ఇందులో ఒకటి లేదా ఎక్కువ క్రమాలు ఉంటాయి.

7. క్రమము: ఇందులో ఒకటి లేదా ఎక్కువ కుటుంబాలు ఉంటాయి.

8. కుటుంబము:ఇందులో ఒకటి లేదా ఎక్కువ ప్రజాతులు ఉంటాయి.

9. ప్రజాతి: ఇందులో ఒకటి లేదా ఎక్కువ జాతులు ఉంటాయి

10. జాతి: ఇందులో ఒకే సారూప్యత ఉన్న అంతర ప్రజననం చెందే జీవులన్నీ ఉంటాయి. జాతి వర్గీకరణకు ప్రాధమిక ప్రమాణం.

11. డోమైన్ అనేది వర్గం కంటే పైన ఉండే స్థాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

12. ఇంకా ఉప-కుటుంబం, ఉప-తరగతి మొదలైన అంతర విభాగాలు కూడా వర్గీకరణలో కలవు.

ప్రశ్న 3.
వర్గీకరణ అంటే ఏమిటి? వర్గీకరణ ఆవశ్యకతను తెలియజేయండి.
జవాబు:

  1. జీవులను వాటి గుర్తింపు లక్షణాల ఆధారంగా సామీప్య సమూహాలుగా విభజించే పద్ధతిని ‘వర్గీకరణ’ అంటారు.
  2. ఈ సామీప్య సమూహాలను ‘టాక్సా’ అంటారు. సమూహలను టాక్సాగా విభజించే విధానమే టాక్సానమి.
  3. టాక్సానమీలోని ప్రధాన ప్రక్రియలు: లక్షణీకరణం, గుర్తింపు, నామీకరణ, వర్గీకరణ.
  4. వర్గీకరణ యొక్క ఆధారిత అంశాలు: బాహ్య స్వరూపం, అంతర నిర్మాణం, కణ నిర్మాణం, అభివృద్ధి ప్రక్రియలు, పరిసరాలతో సంబంధం.
  5. వర్గీకరణ ఆవశ్యకత
    (i) మిలియన్ల కొద్ది ఉన్న జీవరాశులను వాటిని అదే విధంగా అధ్యయనం చేయడం సాధ్యం కాదు.
    (ii) కావున వాటి యొక్క లక్షణాలు ఆధారంగా వాటిని అనుకూలమైన సమూహలుగా విభజించడం జరిగింది.

ప్రశ్న 4.
జాతిని నిర్వచించండి. ‘జాతి’ భావనలను వివరించండి. [AP M-20][TS M-16,17][IPE-14]
జవాబు:
1. జాతి అనేది జీవుల వర్గీకరణకు సంబంధించిన ‘ప్రాథమిక ప్రమాణం’.

2. జాతి (జాన్ నిర్వచనం): ‘జాతి’ అనే పదాన్ని ‘ఉమ్మడి వంశపారంపర్యం’ యొక్క ప్రమాణంగా జాన్రె వర్ణించాడు.

3. జాతి(బ్యూఫోన్ నిర్వచనం): ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉమ్మడి జన్యు సముదాయాన్ని ఎంచుకొని, అంతర ప్రజననం జరుపుకొని ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయాన్ని జాతి అంటారు.
జాతి లక్షణాలు:

  1. జాతి ఒక ‘ప్రజనన ప్రమాణం’. ఇది వేరే జాతికి చెందిన జీవులతో ‘ప్రత్యుత్పత్తి విభిన్నతను’ ప్రదర్శిస్తుంది.
  2. జాతి ఒక ‘జీవావరణ ప్రమాణం’. ఇది ఒకే ‘జీవావరణ స్థానాన్ని’ పంచుకుంటుంది.
  3. జాతి ఒక ‘జన్యుప్రమాణం’. ఇది ఒకే రకమైన ‘క్రోమోజోముల పటం’ను చూపిస్తుంది.
  4. జాతి ఒక ‘పరిణామ జన్యుప్రమాణం’. ఇది నిర్మాణాత్మక మరియు క్రియాత్మక లక్షణాలతో సారూప్యతను ప్రదర్శిస్తుంది.
  5. జాతి అనేది ‘గతిశీల ప్రమాణం’. ఇది ‘నిరంతర మార్పును కోరుకునే లక్షణాన్ని’ ప్రతిబింబిస్తుంది.

ప్రశ్న 5.
జన్యువైవిధ్యం అంటే ఏమిటి? వివిధ జన్యు వైవిధ్యాలను తెలపండి. [TS M-20]
జవాబు:
1. ఒక జాతి యొక్క జన్యువులో ఉండే వైవిధ్యాన్ని జన్యువైవిధ్యం అంటారు.

2. ఒక జాతి జీవులు వాటి యొక్క విస్తరణా పరిధిని అనుసరించి అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శించవచ్చు. ఉదా-1: మనం ఆహరంగా భుజించే వరి 50,000 కంటే ఎక్కువ రకాల జన్యువైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఉదా-2: హిమాలయాల్లో పెరిగే రావుల్ఫియా వోమిటోరియా అనే ఔషధ మొక్క రెస్పరిన్ ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని అధిక రక్తపోటు చికిత్సలో వినియోగిస్తారు.

రెస్పరిన్ యొక్క సామర్ధ్యం మరియు గాఢతను బట్టి రావుల్ఫియాలో అధిక జన్యు వైవిధ్యాన్ని గమనించవచ్చు. 3. జన్యువైవిధ్య రకాలకు కారణాలు:

  1. అధిక విస్తరణా పరిధి
  2. జాతుల యొక్క జన్యువులలో ఉండే వివిధ వికల్పాలు (Alleles) యొక్క సంఖ్య
  3. అవి కనిపించే పౌనఃపున్యం

ప్రశ్న 6.
ఉష్ణమండలాల్లో అధిక బయోడైవర్సిటీకి గల కారణాలు తెలపండి? [AP MAY-22] [TS M-18]
జవాబు:

  1. ఉష్ణమండల ప్రాంతాలు అనేవి భూమధ్య రేఖకి ఇరువైపులా ఉండే ప్రాంతాలు.
  2. ఉష్ణమండల అక్షాంశాలు సుదీర్ఘకాలంగా ఎటువంటి మార్పులకు గురికాలేదు.
  3. ఉష్ణమండల ప్రాంతాలలో జీవపరిణామ క్రమము సుదీర్ఘ కాల వ్యవధిలో ఉండేది.
  4. ఇలాంటి దీర్ఘ పరిణామ కాలం జాతుల ఉత్పత్తికి మరియు జాతుల భిన్నత్వానికి సహాయపడింది.
  5. ఉష్ణమండల వాతావరణం ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి, జీవులు వాటి వృత్తిరీత్యా ప్రత్యేక లక్షణాలను పెంపొందించు కోవడానికి మరియు గొప్ప జీవవైవిధ్యతకు కారణమయింది.
  6. ప్రకృతిలో అపరిమిత సౌరశక్తి మరియు నీటి లభ్యత కలదు. కావున ఆహరోత్పత్తి కూడా గొప్ప జీవవైవిధ్యతకు
    కారణమయింది.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

ప్రశ్న 7.
“అరిష్ట చతుష్టయం”అంటే ఏమిటి? [TS MAY-22] [AP, TS M-15] [AP M-16,18]
జవాబు:
కొన్ని జాతుల నాశనం (విలుప్తత) త్వరితంగా జరగడానికి దోహదపడే నాలుగు ప్రధాన కారణాలే అరిష్ట చతుష్టయం.
1. ఆవాస క్షీణత మరియు శకలీకరణం (లేదా) ముక్కలవడం:

  • అడవుల నరికివేత, అనేక జాతుల ఆవాస క్షీణతకు దారి తీస్తుంది.
  • అటవీ భూములను సాగు భూములుగా మార్చి వేయడం కూడా ఆవాస క్షీణతకు దారి తీస్తుంది.
  • భూసారాన్ని తగ్గించడం వల్ల వాతావరణ కాలుష్యం చెంది జీవుల ఆవాసం నాశనమవుతుంది.
  • ప్రధాన భూభాగం చిన్న భూభాగాలుగా శకలీకరణం చెందటం వలన జనాభా క్షీణతకు దారి తీస్తుంది.

2. వనరుల అతివినియోగం: అవసరం అంతులేని ఆశకు దారితీసినప్పుడు అది వనరులు అతివినియోగానికి కారణమవుతుంది. స్టాలర్ సముద్రపు ఆవు మరియు పాసింజర్ పావురం మానవుల దుర్వినియోగం అధికమవడం
కారణంగా అంతరించిపోయాయి.

3. స్థానికేతర జాతుల చొరబాటు స్థానికేతర జాతులను స్థానిక ఆవాసాలలో ప్రవేశపెట్టినప్పుడు అవి చొరబడేవిగా మారి, స్థానిక జాతుల మీద పై చేయి సాధించి స్థిరపడిపోతాయి.
ఉదా: నైల్పర్చ్ చేపను లేక్ విక్టోరియా సరస్సులోకి ప్రవేశపెట్టడం.

4. సహ-విలుప్తత: ఇది ‘మొక్కలు జంతువుల’ మధ్యగల అవికల్ప సహజీవనం. ఒక మొక్క యొక్క విలుప్తత, జంతు విలుప్తతకు దారి తీస్తుంది. ఉదా: అతిధేయి మరియు పరాన్న జీవి; మొక్కలు మరియు పరాగ సంపర్కకారులు.

ప్రశ్న 8.
“బయోడైవర్సిటీ హాట్స్పాట్స్” గురించి లఘుటీక రాయండి? [AP M-19]
జవాబు:

  1. ‘బయోడైవర్సిటీ హట్ స్పాట్స్’ భావనను ‘నార్మన్ మేయర్’ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు.
  2. అత్యధిక జాతి సమృద్ధి కలిగి, జీవవైవిధ్యానికి సంరక్షణ కేంద్రాలుగా ఉండి కూడా మానవుడి కారణంగా విలుప్తతకు గురయ్యే జీవభౌగోళిక ప్రదేశాలను బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అని అంటారు.
  3. జీవజాతులు పరంగా వీటిని ‘అత్యంత ముప్పు ఎదుర్కొంటున్న’ జీవ సమృద్ధి కలిగిన భౌమ్య పర్యావరణ ప్రాంతాలుగా పరిగణిస్తారు.
  4. ప్రపంచంలో సుమారు 34 బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఉన్నాయి.
    ఉదా: పశ్చిమ కనుమలు మరియు శ్రీలంక భూభాగం, ఇండో-బర్మా ప్రాంతం మరియు హిమాలయ ప్రాంతం.
  5. ప్రత్యేక జీవావరణం మరియు అధిక జీవవైవిధ్యం గల ప్రాంతాలు చట్టపరంగా ఈ క్రింది విధానంలో సంరక్షించబడుతున్నాయి.
    i) జీవగోళపు సురక్షిత కేంద్రాలు ii) జాతీయ పార్కులు iii) అభయారణ్యాలు

ప్రశ్న 9.
“రివెట్ పాపర్” దృగ్విషయాన్ని వివరించండి? [TS M-19,22][AP Mar, May-17] [TS May-17]
జవాబు:

  1. జీవావరణ వ్యవస్థ నుండి కొన్ని జాతులు నశించినపుడు జరిగే పరిణామాలను ‘రివెట్ పాపర్ దృగ్విషయం’ వివరిస్తుంది.
  2. రివెట్ పాపర్ సిద్ధాంతం: జీవావరణ వ్యవస్థకు ఉదాహరణగా విమానంను తీసుకున్నారు.
  3. విమానం యొక్క వివిధ రివెట్లను వివిధ జాతులతో పోల్చారు.
  4. ఒక రివెట్ను (జాతిని) ఒక సీటు (ప్రాముఖ్యతలేని భాగాన్ని) నుంచి తొలగిస్తే విమానంకు ఎటువంటి నష్టం జరగదు. కాని రెక్క మరియు దేహానికి మధ్య నుండే రివెట్ (ప్రాముఖ్యతగల భాగం) ను తొలగించినపుడు
    విమానం కూలిపోతుంది.
  5. ఈ విధంగా ఒక్కొక భాగం నుంచి క్రమక్రమంగా రివెట్లను తొలగించడం వల్ల విమానం దెబ్బతింటుంది. 6. అదే విధంగా, కొన్ని ముఖ్యమైన జాతులను క్రమక్రమంగా తొలగించడం వల్ల జీవ సమాజం మొత్తం, తద్వారా జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

ప్రశ్న 10.
‘సహజస్ధానంలో సంరక్షణ’ పై లఘుటీక రాయండి?
జవాబు:

  1. ‘సహజస్ధానంలో సంరక్షణ’ అనగా జంతు జాతులను వాటి సహజ ఆవాసాల్లోనే సంరక్షించడం.
  2. బయోడైవర్సిటీ హాట్స్పాట్: అత్యధిక జాతి సమృద్ధి కలిగి, జీవవైవిధ్యానికి సంరక్షణ కేంద్రాలుగా ఉండి కూడా మానవుడి కారణంగా విలుప్తతకు గురయ్యే జీవభౌగోళిక ప్రదేశాలను ‘బయోడైవర్సిటీ హాట్స్పాట్స్’ అని అంటారు. ఉదా: పశ్చిమ కనుమలు మరియు శ్రీలంక, ఇండో మరియు హిమాలయాలు
  3. జీవగోళపు సురక్షిత కేంద్రాలు: ఇవి తక్కువ స్థాయిలో దెబ్బతిన్న ప్రత్యేక ప్రాంతాలు. ఇటువంటివి మన దేశంలో 17 కలవు. ఉదా: శేషాచలం కొండలు.
  4. జాతీయ పార్కులు: ఇవి జంతు సంపద మరియు వృక్షసంపదలో ఆకర్షణీయమైన వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. ఉదా: జిమ్ కార్బెట్ జాతీయ పార్కు, కజిరంగా జాతీయపార్కు, కాసు బ్రహ్మనందరెడ్డి జాతీయ పార్కు.
  5. అభయారణ్యాలు: అంతరించిపోతున్న నిర్దిష్ట జంతు జాతుల్ని ఇక్కడ సంరక్షిస్తారు.
    ఉదా: కోరింగా అభయారణ్యం, ఏటూరునాగారం అభయారణ్యం, పాపికొండలు అభయారణ్యం.
  6. పావన వనాలు: మత ప్రాముఖ్యతగల వృక్ష సమూహాన్ని ‘పావన వనాలు’ అంటారు. ఉదా: ఖాసీ, జైంటియా కొండలు – మేఘాలయ; ఆరావళి పర్వతాలు – రాజస్థాన్, గుజరాత్; సద్గుజ, బస్తర్-ఛత్తీస్ ఘడ్; చందా – మధ్యప్రదేశ్

Leave a Comment