AP Inter 1st Year Telugu Question Paper April 2022

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers and AP Inter 1st Year Telugu Question Paper April 2022 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Question Paper April 2022

Time : 3 Hours
Max. Marks : 100

గమనిక : ప్రశ్న పత్రము ప్రకారము సమాధానాలు వరుస క్రమంలో రాయాలి.

I. ‘ఈ క్రింది పద్యాలలో ఒక దానికి పాద భంగము లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి. (1 × 6 = 6)

1) జనులు నుతింపఁగా సుకృత సంపదఁజేసి ……………… నూరి సుతుండగు నీకు నర్హమై

2) ఏన్నో యేండ్లు గతించి పోయినవి గానీ ………………….. నిక్కంబిందు పౌషాణముల్

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒక దానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1) తిన్నడు శివుణ్ణి తన ఊరికి రమ్మని పిలిచిన తీరును తెల్పండి.
2) వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న పూర్వపు ‘తెలుగోడి’ వైభవాన్ని వివరించండి.

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒక దానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1) హాస్యం అంటే ఏమిటో తెలిపి సోదాహరణంగా వివరించండి.
2) ‘కలవారి కోడలు కలికి కామాక్షి’ లోని గ్రామీణ సంస్కృతిని వివరించండి.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 15 పంక్తులలో సమాధానాలు రాయండి. (2 × 4 = 8)

1) ‘అంపకం’ ఆధారంగా తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని వివరించండి.
2) ‘ఊతకర్ర’ కథ ఆధారంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే కష్టాలను వివరించండి.
3) ‘రేఖపాత్ర’ ఆలోచనా విధానాన్ని విశ్లేషించండి.
4) ‘దహేజ్’ కథలోని వివాహ సంప్రదాయాన్ని వివరించండి.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1) దీనికిట్టి దురవస్థ వాటిల్లె నీక్య చరిత
2) ఓడగట్టిన దూలంబై లంకెనుండ జేసితి
3) అధికార ముద్రిక లంతరించె
4) సవతి బిడ్డల పోరు మనకేల.

VI. ఈ క్రింది పద్యభాగం ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1) సహదేవుడెట్టివాడు.
2) తిన్నడు తెలిపిన పండ్ల రకాలను పేర్కొనండి.
3) శ్మశానంలోని అభేద భావాన్ని తెలపండి.
4) ఐకమత్యాన్ని ఏ విధంగా సాధించాలని వేములపల్లి కోరారు.

VII. ఈ క్రింది గద్యభాగం ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1) అపహాస్యం గురించి సంక్షిప్తంగా వివరించండి.
2) కందుకూరి సంస్కరణలను పేర్కొనండి.
3) ద్విపద ప్రక్రియ ప్రాశస్త్యాన్ని గురించి తెలియజేయండి.
4) మాటతీరు అంటే ఏమిటో వివరించండి.

VIII. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు/రచయితలు) (2 × 3 = 6)

1) ధూర్జటి కవి గురించిన విశేషాలేమిటి ?
2) వేములపల్లి శ్రీకృష్ణ సాహిత్య, రాజకీయ జీవితాన్ని సంగ్రహంగా రాయండి.
3) మల్లాది సుబ్బమ్మ సామాజిక సేవను వివరించండి.
4) యార్లగడ్డ బాలగంగాధర రావు గురించిన విశేషాలేమిటి ?

IX. ఈ క్రింది వానిలో ఒక దానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1) ఇంటర్ పరీక్షల సమయంలో విద్యుత్ కోత నివారణ కోరుతూ సంబంధిత అధికారికి లేఖ రాయండి.
2) బదిలీ పత్రం (టి.సి.) గురించి విజ్ఞప్తి చేస్తూ కళాశాల ప్రధానాచార్యునికి లేఖ రాయండి.

X. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1) అమరేంద్రుడు
2) అత్యంత
3) బలివెట్టి
4) ఆత్మైక
5) కవీంద్రుడు
6) కదలించియాడు
7) తోడబుట్టిన
8) గతమెంతో

XI. ఈ క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహ వాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 8)

1) సిద్ధసాధ్యులు
2) ధైర్యల
3) నలుదిక్కులు
4) వేటకుక్కలు
5) అభాగ్యము
6) నల్లపూసలు
7) తుంగభద్రానది
8) కార్యశూరులు

XII. ఈ క్రింది పదాలలో ఐదింటికి పద దోషాలను సవరించి, సరైన రూపాలను రాయండి. (5 × 1 = 5)

1) వూరు
2) ఇనాయక
3) బాష
4) ప్రబందం
5) బాధ
6) సివుడు
7) క్రుష్ణుడు
8) దృతం
9) ననివారం
10) క్రూరుడు

XIII. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువధించండి. (5 × 1 = 5)

1) Sardar Vallabhai Patel is the first Home-Minister of India.
2) The train had left-before I reached the station.
3) Honesty is the best policy.
4) The Peacock is our National bird.
5) Dams are built to reserve water.

XIV. ఈ క్రింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని ప్రగాఢంగా నమ్మిన మహిళ సావిత్రిబాయి ఫూలే. ఈమె సామాజికంగా వెనుకబడిన వర్ణాల, నిమ్న వర్ణాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావ్ పూలే భార్య, భర్తతో కలిసి ఈమె 1848 జనవరి 1న పూనేలో దేశంలోనే మొదటిసారి బాలికల పాఠశాలను ప్రారంభించారు. కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. శూద్రుల, దళితుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. ఈమె మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో 1831, జనవరి 3న జన్మించారు. సావిత్రీబాయి 1848లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సామిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది.

ప్రశ్నలు :
1) సావిత్రిభాయి ఫూలే ఎప్పుడు జన్మించారు ?
2) సావిత్రిభాయి ఫూలే భర్త పేరేమిటి ?
3) సావిత్రిభాయి ఫూలే జన్మదిన ప్రత్యేకత ఏమిటి ?
4) మన దేశంలో మొదటి బాలకల పాఠశాల ఎప్పుడు ప్రారంభమైంది ?
5) స్త్రీ విముక్తి ఎలా సాధ్యపడుతుందని సావిత్రిభాయి ఫూలే భావించారు ?

XV. ఈ క్రింది. ప్రశ్నలలో ఐదింటికి ఏక పద/ఏక వాక్య సమాధానాలు రాయండి. (పద్యభాగం నుండి) (5 × 1 = 5)

1) ఒర విరోధి ఎవరు ?
2) త్రివిష్టవం అంటే ఏమిటి ?
3) కాళము అంటే ఏమిటి ?
4) ఈశ్వరుని మూడవ కంటికి దగ్ధమయింది ఎవరు ?
5) జాషువా జన్మ స్థలమేది ?
6) అస్పృశ్యత సంచరించుటకు తావులేని స్థలమేది ?
7) వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న అమరకవి ఎవరు ?
8) ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’ గేయం ఏ చిత్రంలో ఉంది ?

XVI. ఈ క్రింది ప్రశ్నలలో ఐదింటికి ఏక పద/ ఏక వాక్య సమాధానాలు రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1 = 5)

1) సప్త సముద్రాలను ఆపోశన పట్టిందెవరు ?
2) నారదుని వీణ పేరు ఏమిటి ?
3) కందుకూరిని గద్య తిక్కన అని ఎవరు శ్లాఘించారు ?
4) కందుకూరి స్థాపించిన ఒక పత్రిక పేరు తెల్పండి.
5) కలవారంటే అర్థం ఏమిటి ?
6) దేశి కవితకు ఒకవడి దిద్దింది ఎవరు ?.
7) మొత్తం లోకాలు ఎన్ని ?
8) చేమకూర వేంకటకవి రచించిన కావ్యం ఏది ?

Leave a Comment