Andhra Pradesh BIEAP AP Inter 1st Year Sanskrit Study Material उपवाचकम् 4th Lesson दानशूरः शिबिः Questions and Answers Summary.
Inter 1st Year Sanskrit दानशूरः शिबिः Questions and Answers
अभ्यासः
प्रश्नौ
प्रश्न 1.
अग्निः किं रूपम अवाप्तमान् ?
जवाब:
अग्निः कपोतरूपं अवाप्तवान् ।
प्रश्न 2.
कः सर्वेषाम् अपि प्राणिनाम् आधारभूतः ?
जवाब:
आहारः सर्वेषामपि प्राणिनाम् आधार भूतः ।
![]()
दानशूरः शिबिः Summary in Telugu
डा. उदयन हेगडे
परिचय:-
“दानशूरः शिबिः” इत्ययं पाठ्यभागः ” बालेभ्यः महाभारतनीतिकथाः” इत्यस्मात् ग्रन्थात् स्वीकृतः । अस्मिन् ग्रन्थे स्थिताः कथाः बालेभ्यः महाभारते इतिहासपरिचयार्थम् उत्तमगुणाभ्यसनाय उपयुक्ताः भवन्ति । अस्य ग्रन्थस्य रचयिता डा. उदयन हेगडे महोदयः । अयं महोदयः आन्ध्रप्रदेशे तिरुपतिस्थ राष्ट्रिय- संस्कृतविश्वविद्यालये व्याकरणविभागे सहाचार्यपदे कार्यं कुर्वन्नस्ति ।
दानशूरः कः इति प्रश्ने प्रायशः सर्वेऽपि स्मरन्ति कर्णस्य नाम एव । किन्तु चक्रवर्तिनः शिबेः नाम दानशूरत्वेन प्राचीनकथासु अपि प्रख्यातं वर्तते । इदं किञ्चन लघु उपाख्यानम् । लोमशर्षिः एतत् युधिष्ठिरं प्रति प्रस्तौति ।
దానశూరః శిబిః అను ఈ పాఠ్యభాగము బాలుర కొఱకు మహాభారత నీతి కథాః అను గ్రంథం నుండి స్వీకించబడినది. ఈ గ్రంథమునందున్న కథలు బాలుర కొఱకు మహాభారతము నందు “ఇతిహాస పరిచయము కొఱకు ఉత్తమ గుణ అభ్యాసమునకు ఉపకరించుచున్నవి.
గ్రంథం యొక్క రచయిత డా॥ ఉదయన హెగడే మహోదయః ఈ మహోదయుడు ఆంధ్రప్రదేశ్ నందున్న తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాలయమునందు వ్యాకరణ విభాగమున సహ ఆచార్య పదవి యందు ఉద్యోగం చేయుచున్నారు.
దానశూరః కః ? దానశూరుడు ఎవరు ? అను ప్రశ్న సాధారణంగా అందరు కర్ణుని స్మరింతురు. కాని చక్రవర్తి అయిన శిబి యొక్క దానశూరత్వము ప్రాచీన కథల యందు కూడా ప్రఖ్యాతి చెందినది. ఈ పాఠము నందు సంక్షిప్తంగా చెప్పబడుచున్నది. లోమశ మహర్షి ఈ కథను ధర్మరాజునకు చెప్పెను.
पाठ्यांशः
चक्रवर्ती शिबिः अनेकान् यागान् अनुष्ठाय इन्द्रस्यापेक्षया श्रेष्ठः जातः आसीत् । तस्य कीर्तिः स्वर्गपर्यन्तं व्याप्ता आसीत् । इन्द्रः विषयमेतं ज्ञात्वा महत् आश्चर्यं प्राप्नोत् । अस्य विषयस्य वास्तविकतां परीक्षितुम् इन्द्राग्नी भूमिम् आगतौ । इन्द्रः गृध्ररूपं, अग्निः कपोतरूपं च अवात्पवन्तौ ।
चक्रवर्तिना शिबिना कश्चन यागः अनुष्ठीयमानः आसीत् । तत्काले कञ्चन कपोतः तस्य अङ्के आगत्य उपविष्टवान् । सः भयेन त्रस्तः आसीत् । भयग्रस्तं तं कपोतं समाधातुं शिबिः प्रयतमानः आसीत् । तावता च गृध्रः तत्र उपस्थितः । राज्ञा कपोताय अभयहस्तः प्रदर्शितः ।
तदा गृध्रः शिबिं पृष्टवान् – “राजन् ! लोके सर्वे अपि भवन्तं धर्मात्मानं कथयन्ति । तथा प्रशसामपि कुर्वन्ति । एवं स्थिते धर्मविरुद्धं कार्यं भवता कृतम् उचितं किम् ?” इति । गृध्रस्य एतद्वचनं श्रुत्वा आश्चर्येण पृष्टवान् शिबिः ‘किं मया धर्मविरुद्धं किमपि आचरितम् । भवतः वचनं विचित्रं प्रतीयते ?” इति ।
‘भवता कृतम् अनुचितं कार्यं मया किं पुनर्वक्तव्यम् ? कपोतः गृध्रणाम् आहारः । भवान् तु कीर्त्याशया एनं कपोतं रक्षति । तेन मम हिंसा त्वया विहिता भवेत् । अयम् अधर्मः खलु ?” इति उक्तवान् गृध्रः । ‘गृध्र ! अयं दुर्बलः पक्षी अभयार्थी सन् मत्समीपम् आगतः । आश्रितानां प्राणरक्षणम् अपि धर्मः एव खलु ? अयं कथम् अधर्मः भवितुम् अर्हेत् ?” इति पुनः पृष्टवान् शिबिः ।
तदा गृध्रः अवोचत् – “राजन् ! आहारः सर्वेषाम् अपि प्राणिनाम् आधारभूतः । अहं यदि अधुना मम आहारं त्यजेयं तर्हि प्राणाः मच्छरीरं मुञ्चेयुः । माम् आश्रित्य मम पत्नीपुत्राः अपि प्राणान् त्यजेयुः | अतः एकं कपोतं रक्षता भवता समग्रः गृध्रपरिवारः नाशितः भवेत्” इति । अनेन वाक्येन महत् आश्चर्यं प्राप्तवान् शिबिः उक्तवान् – “कश्चन साधारणः पक्षी भवान् एतादृशं धर्मसूक्ष्मं जानाति इति यत् तत् तु मयि महत् आश्चर्यं जनयति । भवतः वचनम् अङ्गीक्रियते मया । भवतः आहारस्य कपोतस्य परतया ततोऽप्यधिकं मांसाहारम् एव अहं प्रदास्यामि । ब्रूहि, कीदृशं प्राणिमांसम् इच्छसि ?” इति ।
”राजन्, कपोतमांसम् एव मम सहजः आहारः । अन्येषां प्राणिनां मांसं न भक्ष्यते अस्माभिः । बुभुक्षावशात् कदाचित् मरणमेव स्यात् चेदपि इतरेषां प्राणिनां मांसं न भक्ष्यते कदापि” इति उत्तरितवान् गृध्रः । ‘एवं तर्हि पक्षिराज ! भवता एव अस्य परिहारः सूचनीयः । माम् आश्रितम् एतं कपोतं भवते समर्पयितुं तु अहं न इच्छामि । मम मनः इदं न अङ्गीकरोति । इदं धर्मविरुद्धम्’ इति उक्तवान् शिबिः ।
तदा गृध्रः उक्तवान् – ‘“भवते एतस्य पक्षिणः विषये तावती धर्मप्रज्ञा जागरिता चेत्, राजन् ! तस्य पक्षिणा तुल्यः मांसभागः स्वशरीरात् दीयताम्’ इति । एतत् श्रुत्वा शिबिः सन्तुष्टः । तस्य मुखं विकसितम् । “पक्षिराज ! भवता मह्यं वरः प्रदत्तः इति चिन्तयामि अहम् | भवद्वचनम् अधुनैव पालयामि’ इति वदन् शिबिः तुलाम् आनेतुं भटान् आदिष्टवान् । तुलायाः आगमनस्य अनन्तरम् एकस्मिन् पार्श्वे कपोतम् उपावेश्य अपरपार्श्वे सः स्वशरीरमांसं कर्तयित्त्वा स्थापितवान्ं ।. स्वशरीरात् मांसोत्पाटनावसरे शिबिना आक्रन्दनं न कृतं, न वा अश्रुपातः कृतः । प्रसन्नचित्तः एव आसीत् सः ।
किन्तु दौर्भाग्यं नाम शिबेः शरीरात् कर्तितस्य मांसस्य भारः पर्याप्तः न जातः । कपोतेन उपविष्टः भागः इतोऽपि अधः एव आसीत् । किञ्चिदपि अविचिन्तयन् शिबिः शरीरस्य अन्यस्मात् पार्श्वत् मांसखण्डम् उत्पाट्य तुलायां न्यस्तवान् । तथापि पर्याप्तता न जाता । पुनः शिबिः अन्यस्मात् भागात् मांसम् उत्पाट्य निक्षिप्तवान् तुलायाम् ।
एवं हस्तलभ्यान् सर्वान् अपि शरीरमांसखण्डान् उत्पाट्य चक्रवर्ती शिबिः तुलायां स्थापितवान् । किन्तु मुखे प्रसन्नभावः यथापूर्वमेव आसीत् । अन्ते तुलायां स्थापितः सर्वोऽपि मांसखण्डः कपोतभारेण अतुल्यः इति अवगतवान् शिबिः स्वयमेव तुलायाम् उपविष्टवान् । “पक्षिराज ! मामेव आहारत्वेन स्वीकरोतु भवान्” इति प्रसन्नचित्तः सन् उक्तवान् शिबिः ।
तदा गृध्रः कपोतश्च नैजं स्वरूपं प्राप्य चक्रवर्तिनः शिबेः पुरतः इन्द्राग्नित्वेन प्रत्यक्षौ जातौ । तौ अञ्जलिं बद्ध्वा उक्तवन्तौ “हे धर्मज्ञ ! अहम् इन्द्रः, अयम् अग्निः । भवतः धर्मनिष्ठां दानशूरत्वं च बहुधा बहुभायः श्रुत्वा, तादृशं वचः अतिशयोक्तिं मत्त्वा स्वयमेव परीक्षितुम् आवाम् अत्र उपस्थितौ । किन्तु भवान् शरणागतस्य पक्षिणः निमित्तम् आत्मानमेव समर्पितवान् । एवम् आचरन् भवान् दानरूपस्य धर्मस्य महत्तमां प्रतिष्ठां प्रापितवान् । ‘आचन्द्रार्कं तव कीर्तिः स्थिरा तिष्ठतु” इति । एवं चक्रवर्तिनं शिबिम् आशिषा अनुगृह्य तस्मै पूर्वरूपं प्रदाय अन्तर्हितौ जातौ इन्द्राग्नी ।
పాఠ్యాంశం :
శిబి చక్రవర్తి అనేక యాగములను చేసి శ్రేష్టమైన ఇంద్ర పదవిని కోరెను. అతని కీర్తి స్వర్గము వరకు వ్యాపించెను. ఇంద్రుడు విషయమును తెలుసుకొని గొప్ప ఆశ్చర్యమును పొందెను. ఇతని యొక్క అసలు విషయమును పరీక్షించుటకు ఇంద్రుడు, అగ్ని భూమండలమునకు వచ్చిరి. ఇంద్రుడు గ్రద్ద రూపమును, అగ్ని పావురముగను అయిరి. (ఆ రూపాలు ధరించారు)
చక్రవర్తి శిబిచే ఒక యాగము అనుష్టింపబడెను (చేయబడెను). అదే సమయమున ఒక పావురము అతని తొడపైకి వచ్చి కూర్చొనెను. అది భయముచే వణుకుచుండెను. భయము పొందిన ఆ పావురమును నిమిరి సమాధానపరచుచుండెను. అంతలో ఒక గ్రద్ద అక్కడకు వచ్చి నిలబడెను. రాజు కపోత రక్షణ కొఱకు అభయమిచ్చెను. అప్పుడు గ్రద్ద శిబిని గూర్చి ఈ విధంగా అడిగెను.
ఓ రాజా ! లోకమునందు అందరూ కూడా నీవు ధర్మాత్ముడవని చెప్పుచున్నారు. అదేవిధంగా కీర్తించుచున్నారు. అటువంటి నీకు ధర్మవిరుద్ధ కార్యం నీచే చేయబడుట తగునా ఏమి ? అని. గ్రద్ద యొక్క మాటలు విని, శిబి ఆశ్యర్యముతో పలికెను. “ఏమి నాచే ధర్మవిరుద్ధమైనది ఆచరించడినదా ? నీ యొక్క మాటలు విచిత్రముగా ఉన్నవి.
గ్రద్ద ఈ విధంగా పలికెను. నీచేత చేయబడిన అనుచితమైన (చేయకూడని పనిని నాచే మరల పలకవలెను ? పావురము గ్రద్ద యొక్క ఆహారము. నీవు కీర్తి కొఱకు ఈ పావురమును రక్షించుచున్నావు. నేను పావురమును భుజించుట. హింస కాదు. నీవు పావురమును విడువుము. నీవు రక్షించుట అధర్మము కదా ?
అంత శిబి – ఓ గ్రద్ద ఈ పక్షి రక్షణ కోరి నా సమీపమునకు వచ్చెను. దీనిని విడుట కుదరదు. ఆశ్రితుల యొక్క ప్రాణ రక్షణ కూడా ధర్మమే కదా ! ఏ విధంగా అధర్మము చేయవలెను అని పలికెను. అప్పుడు గ్రద్ద ఈ విధంగా పలికెను. రాజా ! అన్ని ప్రాణులకు ఆహారమే ఆధారమైనది.
ఒకవేళ ఇప్పుడు నా ఆహారమును విడచిన నా శరీరం పడిపోవును. నన్ను ఆశ్రయించుకొనిన నా భార్యా పిల్లలు కూడా ప్రాణములు విడిచెదరు. అందువలన ఒక్క పావురమును రక్షించు నీచే గ్రద్ద పరివారమును నాశనం చేయుదువు అని.
గ్రద్ద మాటలచే గొప్ప ఆశ్చర్యమును పొందిన శిబి ఈ విధంగా పలికెను. “సాధారణంగా ఒక పక్షికి ఇటువంటి ధర్మ సూక్ష్మములు తెలియవు. అని ఈ విషయం నాకు మహా ఆశ్చర్యం కలగజేయుచున్నది. నీయొక్క మాట నాచే అంగీకరించబడినది. నీయొక్క ఆహారమునకు పావురమునకు బదులుగా అత్యధికంగా మాంసమును ఇస్తాను. ఇటువంటి ప్రాణి మాంసమును కోరినచో చెప్పుము.
గ్రద్ద ఈ విధంగా పలికెను. రాజా పావురము యొక్క మాంసము నాకు సహజమైన ఆహారము. నాచే వేరొక ప్రాణి ఆహారం ఏల తినవలెను. ఆకలి వలన వేరొక దాని మరణం కలిగించి ఇతర ప్రాణుల యొక్క మాంసమును ఎప్పటికి తినను.” అంత శిబి ఓ పక్షి రాజా ! నీవే దీనికి పరిహారం సూచించుము. నన్ను ఆశ్రయించిన ఈ పావురమును నీ కొఱకు ఇచ్చుట నాకిష్టం లేదు. నా మనసు అంగీకరించుట లేదు. ఇది ధర్మ విరుద్ధం అని పలికెను.
అప్పుడు గ్రద్ద పలికెను “ఓ రాజా ఈ పక్షి యొక్క విషయమునందు ధర్మ ప్రతిజ్ఞ కలిగిన పక్షితో సమానమైన “మాంసఖండమును నీ శరీరము నుండి ఇమ్ము అని పలికెను. ఈ మాటలు విన్న శిబి ఆనందించెను. అతని ముఖము వికశించెను. గ్రద్దతో ఈ విధంగా పలికెను. నేను నీవు నాకు వరమిచ్చినటుల భావించుచున్నాను. నీ వచనము ఇప్పుడే పాలించుచున్నాను. అని పలుకుచూ త్రాసును తెమ్మని భటులను ఆదేశించెను.
ఆ త్రాసునందు ఒక వైపు కపోతమును ఉంచి వేరొకవైపు అతడు తన శరీర మాంసమును ఖండించుచు అందు వేసెను. తన శరీరము నుండి మాంసము ఖండించుచున్నను కొంచెం కూడా ఆక్రందన చేయలేదు. ఒక్క కంటి నుండి నీటి బిందువును కూడా వదలలేదు. ప్రసన్నమైన మనసు కలవాడై ఉండెను.
కాని శిబి శరీరము నుండి ఖండించబడని మాంసము ఎంత వేసినను త్రాసు సమానమగుట లేదు. ఇది ఏమి దౌర్భాగ్యము. పావురము ఉన్న తులాభాగము క్రిందకు వచ్చుట లేదు. కొంచెం ఆలోచించి శిబి శరీరము యొక్క వేరొక భాగమును ఖండించి మాంసము వేసినను తలాసమానమగుట లేదు. శిబి మరల వేరొక శరీర భాగము నుండి మాంసమును కోసి తులా భాగమున ఉంచెను.
ఈ విధంగా చేతితో నరకదగిన శరీర మాంసమును ఖండించి తులాభాగమున వేసెను. కాని ముఖమునందు ప్రసన్న భావము పూర్వంవలే ఉండెను. శిబి చక్రవర్తి తన మాంసమునంతటిని తులాభాగమున ఉంచినను పావురమునకు సమానంగా తూగలేదు. ఈ విషయమును తెలుసుకొన్న శిబి తానే స్వయంగా తులా భాగమున కూర్చొనెను. “ఓ పక్షి రాజా ! నీవు నన్ను ఆహారంగా స్వీకరించుము. అని ప్రసన్న మనస్సుతో పలికెను.
అప్పుడు గ్రద్ద పావురము నిజస్వరూపములతో చక్రవర్తి శిబిముందు ప్రత్యక్షమైరి. వారు నమస్కరించుచూ విధంగా పలికిరి. ఓ ధర్మజ్ఞా (ధర్మములు తెలిసినవాడా) నేను ఇంద్రుడను నేను అగ్నిని. నీయొక్క ధర్మనిష్ఠను, దానశూరత్వమును అనేక విధములుగా అనేకుల నుండి విని అటువంటి మాటలు అతిశయోక్తి అని భావించి స్వయంగా పరీక్షించుటకు మేమిద్దరము నీ వద్దకు వచ్చినాము.
కాని నీవు శరణు కోరిన పక్షి యొక్క నిమిత్తం నిన్ను నీవే సమర్పించుకొంటివి. ఈ విధంగా ఆచరించు నీవు దానరూపం యొక్క ధర్మము యొక్క మహత్మ్యమును ప్రతిష్ఠించితివి. చంద్ర సూర్యలు ఉన్నంత వరకు నీ కీర్తి స్థిరంగా ఉండును అని. ఈ విధంగా చక్రవర్తి అయిన శిబిని ఆశీర్వదించి అనుగ్రహించి మాంసఖండన జరగకముందు ఉన్న (పూర్వరూపం) ప్రసాదించి ఇంద్రాగ్నులు అంతర్థానమయిరి.