AP Inter 2nd Year Zoology Important Questions Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ

Students get through AP Inter 2nd Year Zoology Important Questions Lesson 4b రోగనిరోధక వ్యవస్థ which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Zoology Important Questions Lesson 4(b) రోగనిరోధక వ్యవస్థ

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
రోగనిరోధకత, రోగనిరోధక వ్యవస్థలను నిర్వచించండి.
జవాబు:
1) రోగనిరోధకత: రోగకారక జీవుల నుండి రక్షించుకొనుటకు ఒక జీవి ఏర్పరుచుకునే పూర్తి సామార్థ్యాన్ని ‘రోగనిరోధకత’ అంటారు.

2) రోగనిరోధక వ్యవస్థ :హానికర సంక్రమణ జీవులైనటువంటి బాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు మొదలైనవి వాటి నుంచి జీవి తనదేహన్ని రక్షించుకొనుటకు ఏర్పరుచుకునే అవయవాలు, కణాలు మరియు ప్రోటీనుల వల వంటి నిర్మాణాన్ని ‘రోగనిరోధక వ్యవస్థ’ అంటారు.

ప్రశ్న 2.
శరీరంలో అవిశిష్ట రక్షణరేఖలను నిర్వచించండి. [TS MAR-18]
జవాబు:

  1. అవిశిష్ఠ రక్షణరేఖలు అనేవి జీవులకు పుట్టుకతోనే కలిగి ఉండే రోగనిరోధక శక్తి. ఇటువంటి ప్రధమరక్షణరేఖ విధానాన్ని ‘సహజ లేదా స్వాభావిక రోగనిరోధకత’ అంటారు
  2. ఈ నిరోధకత దేహంలో సూక్ష్మజీవుల దాడి జరగకముందే ఏర్పడుతుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ
ప్రశ్న 3.
పరిపక్వ B-కణాలు, క్రియాశీల B-కణాల మధ్యగల భేదాలను తెలపండి.
జవాబు:

  1. పరిపక్వ B-కణాలు: ఇది క్షీరదాలలో కాండ కణాల అస్థిమజ్జ నుంచి ఉద్భవిస్తాయి. ఇవి అనేక రకాల ప్రతిదేహలను సంశ్లేషణ చేసి త్వచ ఉపరితలం పై ప్రదర్శిస్తాయి.
  2. క్రియాశీల B-కణాలు: ఇది పరిణితి చెందిన B-కణాలు కలిగిన ద్వితీయ లింఫాయిడ్ అవయవాలనుంచి ఏర్పడతాయి అటు పిమ్మట చాలాకాలం జీవించే జ్ఞప్తికణాలుగా మరియు ప్లాస్మా కణాలుగా విభేదన చెందుతాయి.

ప్రశ్న 4.
ఏవైనా నాలుగు ఏకకేంద్రక ఫాగోసైట్ల (భక్షక కణాల) పేర్లు రాయండి? [AP MAR-17]
జవాబు:
ఏకకేంద్రక ఫాగోసైట్లు:

  1. సంయోజక కణజాలం యొక్క హిస్టోసైట్లు
  2. కాలేయం యొక్క కూఫర్ కణాలు
  3. మెదడు యొక్క మైక్రోగ్లియల్ కణాలు
  4. ఎముక యొక్క ఆస్టియోక్లాస్ట్లు
  5. సైనోవియల్ ద్రవం యొక్క సైనోవియల్ కణాలు.

ప్రశ్న 5.
పరిపూరక ప్రోటీన్లు అంటే ఏవి? [AP MAR-20,22]
జవాబు:

  1. పరిపూరక ప్రోటీన్లు:ఇవి ప్లాస్మాలోనూ మరియు కణత్వచం ఉపరితలం పై అమరి ఉండే అచేతన ప్రోటీన్లు.
  2. ఇవి చేతన స్థితికి వచ్చినపుడు ‘త్వచదాడి సంక్లిష్టం’ (MAC) ప్రోటీన్లు గా ఏర్పడతాయి. ఈ సంక్లిష్టం సాంక్రమిక కణాలు ప్లాస్మాత్వచం పై రంధ్రాలను ఏర్పరుస్తాయి.
  3. ఈ రంధ్రాల ద్వారా కణబాహ్య ద్రవం బాక్టీరియంలోకి ప్రవేశించి, బాక్టీరియా ఉబ్బి, పగిలి చనిపోయేలా చేస్తుంది.
  4. పరిపూరక ప్రోటీన్లు మరియు వాటి యొక్క విధులను సంయుక్తంగా కలిపి ‘పరిపూరక వ్యవస్థ’ అంటారు.

ప్రశ్న 6.
అప్పుడే జన్మించిన శిశువులకు ‘కొలోస్ట్రమ్’ అత్యావశ్యకం. నిరూపించండి. [TS MAR, MAY-18,17,16,22]
జవాబు:
1) కొలోస్ట్రమ్: కొలోస్ట్రమ్ (ముర్రుపాలు) అనేవి ప్రసవించిన తరువాత తల్లి నుంచి ఉత్పత్తి అయ్యే మొదటి పాలు. దీని యందు అధిక IgA రకపు ప్రతిదేహలు ఉండి శిశువుకు రోగనిరోధకతను మరియు సంక్రమణల నుంచి కాపాడుతాయి.

2) ఈ ప్రతిదేహాలు తల్లి నుంచి బిడ్డకు సహజంగా ప్రవేశిస్తాయి. దీనినే ‘సహజ స్తబ్ద రోగనిరోధకత’ అంటారు. కావున అప్పుడే జన్మించిన శిశువులకు ‘కొలోస్ట్రమ్’ అత్యావశ్యకం.

ప్రశ్న 7.
పెర్ఫోరిన్స్, గ్రానై జైమ్స్ మధ్యగల భేదాలు తెల్పండి.
జవాబు:
పెర్ఫోరిన్స్

  1. పెర్ఫోరిన్లు సంక్రామిత కణాల కణత్వచంకు రంధ్రాలను ఏర్పరుస్తాయి.
  2. కణద్రవాలను కణంలోనికి పంపించుట ద్వారా కణవిచ్ఛిన్నతకు సహాయపడుతుంది.

గ్రాన్ జైమ్లు

  1. గ్రాన్ జైమ్లు ఈ రంధ్రాల ద్వారా సంక్రామిత కణాలలోనికి ప్రవేశిస్తాయి.
  2. సంక్రామిత కణాల విచ్ఛిన్నమునకు అవసరమయ్యే ప్రోటీన్లను ఉత్తేజపరుస్తాయి.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ

ప్రశ్న 8.
వాక్సినేషన్ లేదా ఇమ్యునైజేషన్ విధానాన్ని వివరించండి. [TS MAR-15] [AP MAR-17]
జవాబు:

  1. వాక్సినేషన్ లేదా ఇమ్యునైజేషన్: ‘రోగనిరోధకతను జ్ఞప్తి ఉంచుకోవడం’ అనే లక్షణం మీద వ్యాక్సినేషన్ మరియు ఇమ్యునైజేషన్ సూత్రం ఆధారపడి ఉంటుంది.
  2. వ్యాక్సినేషన్ ప్రక్రియలో అచేతనపరిచిన లేదా బలహీనపరచిన వ్యాధిజనక లేదా వ్యాధిజనక క్రిముల ప్రతిజనక ప్రోటీన్లను అతిధేయి దేహంలోకి ప్రవేశపెడతారు.
  3. ఇవి అతిధేయిలో విశిష్ట ప్రతిదేహలను ఉత్పత్తి చేసేందుకు ప్రేరేపిస్తాయి మరియు జ్ఞప్తి -B కణాలను మరియు జ్ఞప్తి -T కణాలను ఏర్పరుస్తాయి.
  4. అదే వ్యాధి జనక క్రిములు దేహంలోకి ప్రవేశించినపుడు, జ్ఞప్తి కణాలు వాటిని గుర్తించి వెంటనే ప్రతి దేహలను అధికసంఖ్యలో వేగంగా ఉత్పత్తి చేసి వాటిని నాశనం చేస్తాయి.

ప్రశ్న 9.
వివిధ రకాల రోగనిరోధక అపస్థితుల పేర్లు రాయండి.
జవాబు:
వివిధ రకాల రోగనిరోధక అపస్ధితులు:

  1. ఆర్జిత రోగనిరోధక లోప సిండ్రోమ్ – HIV / AIDS
  2. అతి సున్నితత్వ అపస్థితులు – అలర్జీలు
  3. స్వయం రోగనిరోధకత అపస్థితులు – రుమటాయిడ్ ఆర్టిటిస్, డయాబెటిస్
  4. అంటు తిరస్కరణ చర్యలు – అవయవ మార్పిడి

ప్రశ్న 10.
మెట్రో నగరాల యందు నివసించే అత్యధిక శాతం ప్రజలు అలర్జీలకు గురిఅవుతున్నారు. నిరూపించండి.
జవాబు:
1) మెట్రో నగరాల యందు అధికశాతం కాలుష్యం వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల ఏర్పడుతుంది. ఈ కాలుష్య మబ్బుల వలన ఆకాశం ఎప్పుడూ కూడా నిర్మలంగా కనిపించుటలేదు. ఈ కాలుష్య కారకాలు ప్రజలలో అలర్జీ అనుక్రియలను ఏర్పరుస్తున్నాయి. కావున అధిక శాతం పట్టణప్రజలు, పల్లెటూరి ప్రజల కంటే ఎక్కువ అలర్జీలకు గురి అవుతున్నారు.

2) అలర్జీ లక్షణాలు: తుమ్ములు, కంటి నుండి నీరుకారడం, ముక్కు నుండి నీరుకారడం, శ్వాస తీయడంలో ఇబ్బంది. పట్టణాలలోని అధిక శాతం ప్రజలు ‘ఆస్తమా’ వ్యాధికి లోనవుతున్నారు.

ప్రశ్న 11.
స్వయం రోగనిరోధక అపస్థితులు అంటే ఏమిటి? రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:

  1. సాధారణంగా రోగనిరోధక వ్యవస్థ మన స్వంతప్రోటీన్లను గుర్తించడం వల్ల మన పై దాడి చేయదు.
  2. కొంతమంది యొక్క ‘రోగనిరోధక వ్యవస్థ’ స్వంత ప్రోటీన్లను గుర్తించక వాటిపై దాడి జరిపి ‘స్వయం రోగనిరోధకత వ్యాధులను’ కలుగజేస్తాయి.
  3. ఉదా: (డయాబెటిస్) చక్కెర వ్యాధి, రుమటాయిడ్ ఆరెటిస్.

ప్రశ్న 12.
రోగిలో అంటు తిరస్కరణ చర్యలను ఏవిధంగా ఆపాదించవచ్చు?
జవాబు:

  1. మార్పిడికి సంబంధించి కణజాలం మరియు రక్తం అనేవి ఒకటి కావడం చాలా ముఖ్యమైన అంశం.
  2. ఇటువంటి మార్పులు జరిగిన తరువాత కూడా, రోగి తెలియని కారణాలతో బాధపడుతుంటాడు.
  3. కావున, రోగి జీవితాంతం ఇమ్యునో సప్రెస్సెంట్ మందులను వాడవలసి ఉంటుంది.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
B-కణాల గురించి లఘుటీక రాయండి. [AP MAR-20,22] [TS MAY-17,19,20,22]
జవాబు:
B-కణాలు:

  1. B-కణాలు అనేవి లింఫోసైట్లలోని ఒక రకమైన కణాలు. ఇవి ప్రతిదేహలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
  2. ఇవి క్షీరదాలలో అస్థిమజ్జ మరియు భ్రూణపు కాలేయం నుండి, మరియు పక్షులలో బర్సాఫాబ్రిసియస్ నుండి ఉత్పత్తి అవుతాయి.
  3. పరిణితి చెందిన B కణాలు అనేక రకాల ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి ప్లాస్మాత్వచ ఉపరితలం పై ప్రదర్శిస్తాయి.
  4. ఈ ప్రతిదేహలు, ప్రతిజనకాలను గ్రహిస్తే, పరిణితి చెందిన B కణాలను కూడా ‘రోగనిరోధక అర్హత’ B కణాలు అని అంటారు.
  5. MBC కణాలు ద్వితీయ శోషరస అవయవాలను చేరి, క్రియాత్మక రోగనిరోధక కణాలుగా అభివృద్ధి చెందుతాయి.
  6. ఈ క్రియాత్మక రోగనిరోధక కణాలు దీర్ఘకాల జ్ఞప్తి కణాలుగా పరివర్తనం చెంది ప్లాస్మాకణాలను ప్రభావితం చేయును.
  7. ప్లాస్మా కణాలు ప్రత్యేక ప్రతిజనకాలకు ప్రతిదేహలను ఉత్పత్తి చేస్తాయి.
  8. జ్ఞప్తి కణాలు ప్రత్యేక ప్రతి జనకాల యొక్క సమాచారాన్ని నిల్వ చేసుకుంటాయి మరియు అదే ప్రతిజనకం దేహంపై దాడి జరిపినపుడు వెంటనే ప్రతిచర్యను ప్రదర్శిస్తాయి.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ

ప్రశ్న 2.
ఇమ్యునోగ్లోబ్యులిన్ల గురించి లఘుటీక రాయండి. [AP MAY-19] [AP MAR-19] [TS MAR-15]
జవాబు:
ఇమ్యునోగ్లోబ్యులిన్లు (ప్రతి దేహలు):

  1. వ్యాధిజనక జీవులు దేహంలోకి ప్రవేశించగానే B లింఫోసైట్స్ ‘ప్రతిదేహలను’ ఉత్పత్తి చేస్తాయి.
  2. ప్రతిదేహలు ప్రతిజనకాల యొక్క ప్రత్యేకాలు.
  3. చలనం ఆధారంగా ప్రతిదేహలు రెండు రకాలు అవి స్వేచ్ఛా (లేదా) ప్రసరణ ప్రతిదేహలు మరియు కణ ఉపరితల ప్రతి జనకాలు.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ 1
  4. ప్రసరణ ప్రతిదేహాలు రక్తం మరియు శోషరసం యందు ఉంటాయి.
  5. ఉపరితల ప్రతిదేహాలు B కణాలు యొక్క ఉపరితలం మరియు జ్ఞప్తి కణాల యందు ఉంటాయి.
  6. నిర్మాణం: ప్రతిదేహం Y ఆకారంలో, నాలుగు పాలిపెప్టైడ్ గొలుసులతో వుంటుంది.
  7. రెండు పొడవుగా, స్వరూప పరంగా భారగొలుసుగా (H) మిగిలిన రెండు పొట్టిగా, స్వరూప పరంగా తేలికపాటి గొలుసులు (L) గా ఉంటాయి.
  8. ఈ రెండు గొలుసులు డైసల్ఫైడ్ బంధాలతో బంధించబడి ఉంటాయి. ఒక చివరను ‘ఫాబ్ ఖండం’ అంటారు. దీనియందు ప్రతిజనకం అతకబడి ఉంటుంది. మరొక చివరను Fc ఖండం అంటారు. దీనియందు B- కణాలు అతకబడి ఉంటాయి.
  9. నిర్మాణం ఆధారంగా ప్రతిదేహలు ఐదు రకాలు అవి 1gD, 1gE, 1gG, 1gA,1gM.

ప్రశ్న 6.
HIV ఏవిధంగా AIDS కలుగజేస్తుందో వివరించండి. [TS MAR-19] [AP MAR-15]
జవాబు:
HIV-AIDS:

  1. HIV అనగా హ్యుమన్ ఇమ్యూనో డెఫిసియన్సీ వైరస్. ఇది మానవ రోగనిరోధకతను లోపింపచేసే వైరస్.
  2. ఇది లైంగిక సంబంధాల ద్వారా, రక్తం మార్పడి, సాంక్రామిక సూదులు వాడటం వల్ల మరియు సాంక్రమిక తల్లి నుంచి గర్భస్థశిశువుకు సంక్రమిస్తుంది.
  3. సంవిధానం: అతిధేయి కణంలోకి ప్రవేశించి వెంటనే కణాలు, మాక్రోఫెజ్లు, డెండ్రటిక్ కణాల పై దాడి చేస్తుంది.
  4. ssRNA ‘రివర్స్ట్రాన్స్ క్రిప్టేజ్’ ఎన్జైమ్ సహాయంతో ‘తిరోఅనులేఖన’ ప్రక్రియ ద్వారా ‘ద్విసర్పిల’ వైరల్ DNA పోచను సంశ్లేషణం చేస్తుంది.
  5. ఈ ట్రాన్క్రిప్టేజ్ ఎన్ఎమ్ ‘ద్వితీయ DNA’ పోచను మొదటి పోచకు సంపూరకంగా ఉండేటట్లు చేయుటకు సహాయపడతాయి.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ 2
  6. దీని ద్వారా ‘ద్విసర్పిల’ (లేదా) ‘యుగళపోచలు వైరల్ DNA ఏర్పడుతుంది.
  7. ఈ వైరస్ DNAను ఎన్జైమ్ ‘ఇంటిగ్రేజ్’ అతిధేయి కణ DNA లోకి ప్రవేశపెడుతుంది.
  8. ఈ రకంగా ప్రవేశపెట్టబడిన DNA ను ‘ప్రోవైరస్’ అంటారు.
  9. ఈ ప్రోవైరస్ అనులేఖన RNA ను ఏర్పరుస్తుంది. ఇది వైరల్ ప్రోటీనులుగా మారుతుంది.
  10. ఈ ‘వైరల్ రేణువులు’ దగ్గరగా చేరి HIV గా ఏర్పడతాయి.
  11. ‘సంక్రామిక మానవ కణాలు’ HIV ఉత్పత్తి కర్మాగారాలు గా పనిచేస్తాయి.
  12. ఈ వైరస్ కణాలు TH కణాలపై దాడి చేసి నశింపచేస్తాయి.
  13. మొదటిసారి HIV సంక్రమణ జరిగినప్పటి నుంచి వ్యాధిలక్షణాలు బయటపడే వరకు కొన్ని నెలలు-నుండి10 సంవత్సరల వరకు పడుతుంది.
  14. వ్యాధిలక్షణాలు: ఆ వ్యక్తి జ్వరం, విరేచనాలు మరియు బరువును కోల్పోతాడు.
  15. TH కణాల సంఖ్య తగ్గిపోతుండటంతో బాక్టీరియా మరియు వైరస్లు పూర్తిగా కణజాలలను భుజించవు. కావున అటువంటి వ్యాధిగ్రస్తుడని AIDS వ్యాధిగ్రస్తుడని చెప్పవచ్చు.

Leave a Comment