AP Inter 2nd Year Telugu Study Material Chapter 2 అర్థ విపరిణామం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material గద్య భాగం 2nd Lesson అర్థ విపరిణామం Textbook Questions and Answers, Summary.

AP Inter 2nd Year Telugu Study Material 2nd Lesson అర్థ విపరిణామం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అర్ధ సంకోచ, వ్యాకోచాలను గురించి తెల్పండి.
జవాబు:
భాషలో రెండు ప్రధానాంగాలుంటాయి. ఒకటి శబ్దం, రెండు అర్థం. ఆ రెండింటిలో పరిణామాలు వస్తుంటాయి. ఇలా పదాలలోని అర్థాలలో కాలక్రమంగా వచ్చే మార్పులను . “అర్థ విపరిణామం ” అంటారు.

ఒక పదానికి ప్రాచీన కాలంలో ఒక అర్థం వుంది. తరువాత ఆ అర్థంలో మార్పు రావచ్చు. వాటిలో ఒకటి అర్థవ్యాకోచము, రెండు అర్థసంకోచము, మూడు గ్రామ్యత్వము, నాలుగు సౌమ్యత, ఐదు సంకేతము.

1. అర్థ వ్యాకోచము :
అర్థము వ్యాకోచించటమే అర్థవ్యాకోచము. మొదట పరిమిత అర్థాన్ని బోధించే పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించటాన్ని అర్థవ్యాకోచ మంటాము.

ఉదా : పూర్వము ‘తైలమను’ పదం తిలలు అంటే నువ్వుల నుండి తీసే నూనె అను అర్థంలో చెప్పబడింది. తరువాత కాలంలో అది మందార తైలము, బృంగామలక తైలము మాషతైలము అని విస్తృతార్థంలో వాడబడుతున్నది.

‘దీపపు సెమ్మె’ అను మాట తెలుగున వాడుకలో ఉంది. దీనికి దీపము పెట్టుకొనటానికి వాడే స్తంభము అని అర్థం. పారశీక భాషలో ‘శమా’ అంటే దీపమని అర్ధం. అదే తెలుగున సెమ్మె అని మారింది. అచట ఆధేయమునకు వాచకమైనది, ఇచ్చట ఆధారవాచకమైనది.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 2 అర్థ విపరిణామం

2. అర్థ సంకోచము :
అర్థం సంకోచం చెందడమే అర్థసంకోచం. అంటే విశాలమైన అర్థాన్ని బోధించే ఒక పదం సంకుచితమై పరిమిత అర్థాన్ని ఇవ్వటం.

ఉదా : పూర్వము ‘చీర’ అను శబ్దము వస్త్రము అన్న విస్తృతార్థంలో వాడబడేది. సీతారాములిర్వురును నారచీరలు ధరించిరి, అన్నపుడు ‘చీర’ వస్త్రము అన్న సామాన్య వాచకంగా వాడబడింది. ఈనాడు అది స్త్రీలు ధరించే వస్త్రంగా సంకుచితార్థంలో వాడబడుతున్నది.

పూర్వం ‘వ్యవసాయము’ అంటే ‘పని’ అన్న విస్తృతార్థం అది ఇపుడు ‘సేద్యము’ అన్న అర్థానికి పరిమితమైపోయింది. దీనితో సమానార్థకమైన ‘కృషి’ అను పదము పూర్వము శ్రమపడు’ అర్థంలో వాడబడినది. అది ఇపుడు ‘వ్యవసాయం’ గా మారిపోయింది. అలానే ‘ఉద్యోగమను’ పదము ‘ప్రయత్న’ మన్న విస్తృతార్థంలో పూర్వము వాడబడింది. అది ఇపుడు ఆంగ్లంలోని ‘Job’ అను పదముగా మారి ‘ఉద్యోగము’ అను అర్థాన్నిస్తున్నది. ఉద్యోగ పర్వము నాటి ‘ఉద్యోగము’ గా నేడు వాడబడుట లేదు. ఇలా పూర్వం విస్తృతార్థంలో ఉండి సంకుచితార్థంగా మారటాన్ని అర్థసంకోచమంటాము.

ప్రశ్న 2.
అర్థ గ్రామ్యతను, అర్థ సౌమ్యతలను వివరించండి ?
జవాబు:
భాషలో రెండు ప్రధానాంగాలుంటాయి. ఒకటి శబ్దం రెండు అర్థం. ఈ రెండింటి యందు కాలానుగుణంగా మార్పులు వస్తుంటాయి. ఇలా పదాల అర్థాలలో కాలక్రమంగా వచ్చే మార్పులను ‘అర్థ విపరిణామము’ అంటారు. ఇవి ఐదు విధాలుగా జరుగు తుంటాయి. అవి అర్థసంకోచము, అర్థవ్యాకోచము, గ్రామ్యత, సౌమ్యత, సంకేతము. అర్థ గ్రామ్యత్వము : పూర్వకాలంలో మంచి అర్థంలో ఉన్న పదం కాలక్రమంలో నీచార్థంగా మారటాన్ని అర్థ గ్రామ్యత్వమంటారు.

ఉదా : ‘కంపు’ అన్న పదం పూర్వము సుగంధపరిమళాలను వెదజల్లు ‘సువాసన’ అన్న అర్థంలో వాడబడినది. నేడది దుర్గంధమన్న అర్థములో వాడబడుతున్నది. అలాగే వాసన కూడా ‘వాసన’ అంటే మంచి వాసన అని పూర్వము వ్యవహారములో ఉండేది. ఇపుడు అది చెడు వాసన అన్న అర్థంలో వాడుతున్నాము. మంచి వాసనకు మనం ఇపుడు ‘సువాసన’ అని వాడవలసి వస్తుంది.

పూర్వకాలంలో ‘సంభావన’ అంటే గౌరవము అని అర్థం. గౌరవపూర్వకంగా ఇచ్చిన ద్రవ్యమునకు సంభావన వాచకమైంది. నేడు సంభావన ఇచ్చుచోట్ల గౌరవ భావము ఉండటం లేదు. పూర్వం ‘ఛాందసుడు’ అన్న పదానికి వేద విద్యలు తెలిసినవాడని అర్థం. అది నేడు ‘మూర్ఖ్యుడను’ అర్థంలో వాడబడుతున్నది. ఇలా పూర్వం గౌరవార్థము కలిగి ఇపుడు నీచార్థమును బోధించటాన్ని అర్థ గ్రామ్యత అంటాము.

సౌమ్యత్వము : సమాజంలో అశుభసూచకాలైన పదాలను సౌమ్యంగా చెప్పడం సౌమ్యత్వము.

ఉదా : ‘చచ్చెను’ అను పదాన్ని సౌమ్యంగా చెప్పటానికి పరమపదించెను. స్వర్గమున లంకరించెను, శివైక్యము నొందెను అన్న పదాలను వాడుతుంటాము.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 2 అర్థ విపరిణామం

అలాగే బియ్యం అయిపోయాయని చెప్పటానికి ‘బియ్యంనిండుకున్నాయని’ (దీపం ఆరిపోయింద’ని చెప్పటానికి దీపం కొండెక్కిందని, ‘నల్లపూసలు తెగిపోయాయని చెప్పటానికి ‘నల్ల పూసలు పెరిగాయని’ అమంగళాన్ని సౌమ్యంగా చెప్తుంటాము. పాకీవాడు, దేవానాంప్రియ వంటి పదాలు కూడా అలాంటివే!

‘అగస్త్య భ్రాత’ అన్నపుడు అగస్త్యుడు గొప్ప తపస్వి అతని తమ్ముడు కూడా అంతటి వాడే అన్న అర్థం. కాని అగస్త్యభ్రాత అంటే ‘మూర్యుడు’ అని అర్థం. ఇలా అసభ్యతకు చోటు లేకుండా సభ్యతతో చెప్పు పదాలను ఉపయోగించటాన్ని సౌమ్యత్వము అంటారు.

సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అర్థవిపరిణామంలో ‘సంకోచమును’ గురించి రాయండి.
జవాబు:
భాషకు రెండు ప్రధానాంగాలుంటాయి. ఒకటి శబ్దం, రెండు అర్థం ఈ రెండింటియందు కాలక్రమంలో మార్పులు వస్తుంటాయి. పదాలలోని అర్థాలలో వచ్చే మార్పులను ‘అర్థవిపరిణామం’ అంటాము. భాషాశాస్త్రం ఈ మార్పులను ఐదు విధాలుగా సూచించింది.

  1. అర్థ సంకోచం
  2. అర్థ వ్యాకోచం,
  3. గ్రామ్యత్వం,
  4. సౌమ్యత్వం,
  5. సంకేతం.

1. అర్థ సంకోచం :
పదాలలోని అర్థం సంకోచం చెందటమే అర్థసంకోచం. అంటే విశాలమైన అర్థాన్ని బోధించే ఒకపదం కొంతకాలం తరువాత ‘ కుంచితార్థాన్ని లేక తక్కువ అర్థాన్ని బోధిస్తే దానిని అర్థసంకోచం అంటారు.

ఉదా : పూర్వం ‘చీర’ అనే పదం ‘వస్త్రము’ అన్న విస్తృతార్థంలో వాడబడింది. అది ఇపుడు సంకుచితమై ‘స్త్రీలు’ ధరించే వస్త్రంగా మాత్రమే వ్యవహరింపబడుతుంది. “సీతారాములిర్వురును నార చీరలు ధరించిరి” ఇక్కడ చీరలన్నది విస్తృతార్థమే కదా!

అలాగే పూర్వము ‘వ్యవసాయమంటే’ పని అనే విస్తృతార్థం. ఇపుడది ‘సేద్యమన్న’ ఒక్క పనికే వాడబడుతున్నది. ‘ఉద్యోగమన్న పదం’ పూర్వం ‘ప్రయత్నం’ అన్న విస్తృతార్థంలో వాడబడినది. అది ఇపుడు ఆంగ్ల భాషా పదమైన ‘Job’ కు తోడై ‘ఉద్యోగ పర్వము’ లోని అర్థాన్ని ఇవ్వటం లేదు. ఇలా పూర్వము విస్తృతార్థంలో ఉండి సంకు తార్థాన్ని పొందిన ఎడల దానిని అర్థసంకోచమంటాము.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 2 అర్థ విపరిణామం

ప్రశ్న 2.
అర్థ విపరిణామంలో వ్యాకోచమును గురించి రాయండి ?
జవాబు:
భాషకు రెండు ప్రధానాంగాలుంటాయి. ఒకటి శబ్దం రెండు అర్థం. ఈ రెండింటిలో కాలక్రమంలో మార్పులు వస్తుంటాయి. పదాలలోని అర్థాలలో వచ్చే మార్పులను ‘అర్థ విపరిణామం’ అంటాము. భాషాశాస్త్రం ఈ మార్పులను ఐదు విధాలని చెప్పింది.

  1. అర్థ సంకోచము
  2. అర్థ వ్యాకోచము
  3. గ్రామ్యత
  4. సౌమ్యత్వము
  5. సంకేతం

అర్థ వ్యాకోచము : అర్థం సంకోచించటమే అర్ధ సంకోచమంటారు. మొదట ఒక పదం పరిమితార్థాన్ని చెప్తూ కాల క్రమంలో విస్తృతార్థాన్ని బోధించిన దానిని అర్థవ్యాకోచమంటారు.

ఉదా : పూర్వము తిలల (నువ్వుల) నుండి తీసిన నూనెనే తైలమని వ్యవహరించేవారు. కాలక్రమంలో తైలమను పదం విస్తృతార్థంగా పరిణామం చెంది మందార తైలము, బృంగామలక తైలము అని వ్యవహారములోనికి వచ్చింది.

అలాగే ‘దీపపు సెమ్మె’ అన్న మాట దీపము పెట్టుకొను స్తంభము’ అని పూర్వార్థము. పారశీక భాషలో ‘శమా’ అనగా దీపమని అర్థము. అదే తెలుగున ‘సెమ్మె’ అయింది. ఈ పదం పూర్వం ఆదేయమునకు ఇపుడు ఆధారమునకు వాచకం అయింది.

‘మాఘము చదువు చుంటిని’, భారవిని పూర్తిచేసి తిని అన్న వాక్యాలు భారవి వ్రాసిన కిరాతార్జునీయాన్ని, మాఘుడు వ్రాసిన శిశుపాలవధను పఠించినట్లు విస్తృతార్థమును చెప్తున్నాము. ఇలా పరిమితార్థం గల పదాలు వాక్యాలు విస్తృతార్థాన్ని పొందడాన్ని అర్ధవ్యాకోచమంటారు.

ప్రశ్న 3.
అర్థ విపరిణామంలో సంకేతార్థం’ గురించి రాయండి ?
జవాబు:
భాషకు రెండు ప్రనాంగాలుంటాయి. ఒకటి శబ్దం రెండు అర్థం. ఈ రెండింటిలో కాలక్రమంలో మార్పులు వస్తుంటాయి. అలా పదాల యొక్క అర్థాలలో వచ్చే మార్పులను “అర్థ విపరిణామం” అంటారు. భాషా శాస్త్రం ఈ మార్పులను ఐదు విధాలుగా చెప్పింది.

  1. అర్థ సంకోచం
  2. అర్థ వ్యాకోచం
  3. గ్రామ్యత
  4. సౌమ్యత్వము
  5. సంకేతం.

సంకేతము :
కొందరు కొన్ని సంకేతములను కల్పించుకొని మాట్లాడుతారు. ఇట్టి సంకేతములు వృత్తులను బట్టి కులములను బట్టి కూడా ఏర్పడతాయి. ఒక జన సమూహములో మాట్లాడు సాంకేతికాలు రెండవ సమూహము వారికి పూర్తిగా ముసుగు మాటలుగా ఉంటాయి. ఉదాహరణకు వైదికుల పరిభాషలో ‘ఇంద్రాణి’ అంటే ‘వితంతువు’ అని అర్థం. తగవుల మారి స్వభావము కలిగిని వారిని ‘ఛండిక’ అని విశ్వామిత్రుడని, దుర్వాస మహర్షి అని పలువిధములైన పదాలు వాడబడుతున్నాయి.

కారణం లేకుండా తగవులను పెట్టువానిని ‘నారదుడని’ అంటుంటారు. చండశాసనుడైన అధికారికి వీడు యముడురా అని, మంచి వానికి ‘ధర్మరాజని’ పేర్లు పెట్టుట మనకు తెలిసినదే! అబద్దాలు మాట్లాడువానిని హరిశ్చంద్రుడని పిలుచుట మనం వింటుంటాం. స్వభావాలకు బదులు కొన్ని సంకేత పదాలను కల్పించుకొని మాట్లాడటాన్ని సంకేత మంటారు.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 2 అర్థ విపరిణామం

ప్రశ్న 4.
స్ఫూర్తి శ్రీ సాహిత్య కృషిని తెల్పండి ?
జవాబు:
అర్థ విపరిణామము అను పాఠ్యభాగం స్ఫూర్తి శ్రీ చే రచించబడిన తెలుగు భాషా చరిత్రలోని అర్థప్రకరణం నుండి గ్రహించబడింది. వీరు శాస్త్ర గ్రంథాలను సరళతరం చేసి తెలుగు జాతికి అందించారు. స్ఫూర్తిశ్రీ అసలు పేరు తోకల భాస్కరరావు. స్ఫూర్తి శ్రీ జనవరి 5, 1928న కాకినాడలో వీరాయమ్మ, బుచ్చిరాజులకు జన్మించారు. కాకినాడ పిఠాపురం రాజావారి విద్యా సంస్థలలో పాఠశాల కళాశాల చదువును పూర్తిచేసి ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి బి.ఏ ఆనర్స్ చేశారు.

స్ఫూర్తిశ్రీ రచనలు : భోజుని సరస్వతీ కంఠాభరణానికి తెలుగు వ్యాఖ్యానం మూడు భాగాలు, జయదేవుని చంద్రాలోక సమున్మేషణానికి తెలుగులో అర్థవివరణము. క్షేమేంద్రుని ఔచిత్య సంప్రదాయానికి చారిత్రక సమీక్ష, బాల పౌఢ వ్యాకరణాల వ్యాఖ్య, తెలుగు భాషా చరిత్రను వ్రాశారు. ఇవేకాక స్ఫూర్తిశ్రీ ‘స్ఫూర్తిశ్రీ వ్యాసావళి’ అను పేర రెండు సాహితీ సంపుటాలను రచించారు. వీరి సరళ సులభమైన గ్రంథాలను చదివి విద్యావంతులైన వారెందరో తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు. తెలుగు భాషను సులభతరం . చేసి విశేష కృషిచేసిన సాహితీ వేత్త స్ఫూర్తిశ్రీ.

ఏకవాక్కపదరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్ఫూర్తిశ్రీ అసలు పేరేమిటి ?
జవాబు:
తోకల భాస్కర రావు.

ప్రశ్న 2.
స్ఫూర్తిశ్రీ ఎపుడు జన్మించారు ?
జవాబు:
జనవరి 5, 1928న జన్మించారు.

ప్రశ్న 3.
స్ఫూర్తి శ్రీ జన్మస్థలమేది ?
జవాబు:
స్ఫూర్తిశ్రీ జన్మస్థలం కాకినాడ.

ప్రశ్న 4.
స్ఫూర్తిశ్రీ తల్లిదండ్రులెవరు ?
జవాబు:
వీరాయమ్మ, బుచ్చిరాజులు.

ప్రశ్న 5.
స్ఫూర్తిశ్రీ బి.ఎ. ఆనర్స్ ఎక్కడ చదివాడు ?
జవాబు:
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో

AP Inter 2nd Year Telugu Study Material Chapter 2 అర్థ విపరిణామం

ప్రశ్న 6.
స్ఫూర్తిశ్రీ పాఠశాల కళాశాల విద్యలను ఎక్కడ నేర్చాడు ?
జవాబు:
కాకినాడ పిఠాపురం రాజావారి విద్యా సంస్థలలో.

ప్రశ్న 7.
స్ఫూర్తిశ్రీ ఏ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు ?
జవాబు:
గుంటూరు ఏ.సి. కళాశాలలో

ప్రశ్న 8.
స్ఫూర్తి శ్రీ ఎప్పటినుండి ఎప్పటి వరకు ఏసీ కళాశాలలో పనిచేశారు ?
జవాబు:
1953 నుండి 1988 వరకు పనిచేశారు.

ప్రశ్న 9.
స్ఫూర్తిశ్రీ రచనలలో ముఖ్యమైన మూడు రచనలను తెల్పండి ?
జవాబు:

  1. బాలపౌఢ వ్యాకరణాల వ్యాఖ్యలు
  2. స్ఫూర్తిశ్రీ వ్యాసావళి
  3. తెలుగు భాషా చరిత్ర

ప్రశ్న 10.
స్ఫూర్తిశ్రీ ఎపుడు కాలం చేశారు.
జవాబు:
నవంబరు 19, 2015వ తేదీన మరణించారు.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 2 అర్థ విపరిణామం

ప్రశ్న 11.
‘అర్థవిపరిణామము’ స్ఫూర్తిశ్రీ రచనలలో దేని నుండి గ్రహించబడింది.
జవాబు:
‘తెలుగు భాషా చరిత్ర’ అర్థ ప్రకరణం నుండి గ్రహించబడింది.

ప్రశ్న 12.
‘చీర’ అను పదానికి పూర్వకాలంలో గల అర్థమేమిటి ?
జవాబు:
వస్త్రమన్న విస్తృతార్థం ఉన్నది.

ప్రశ్న 13.
పూర్వకాలంలో వ్యవసాయము అంటే ఏమిటి ?
జవాబు:
పూర్వకాలంలో వ్యవసాయమంటే ‘పని’ అని అర్థం.

ప్రశ్న 14.
నేడు వ్యవసాయమంటే ఏమిటి ?
జవాబు:
సేద్యమని అర్థం.

ప్రశ్న 15.
భోజుని రచన ఏది ?
జవాబు:
సరస్వతీ కంఠాభరణం.

ప్రశ్న 16.
క్షేమేంద్రుని సంప్రదాయమేమిటి ?
జవాబు:
ఔచితీ సంప్రదాయం.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 2 అర్థ విపరిణామం

ప్రశ్న 17.
జయదేవుని రచన ఏది ?
జవాబు:
చంద్రాలోక సమున్నేషణము.

ప్రశ్న 18.
భారవి రచించిన గ్రంథం పేరేమిటి ?
జవాబు:
కిరాతార్జునీయం.

ప్రశ్న 19.
మాఘకవి రచించిన గ్రంథము పేరేమిటి ?
జవాబు:
శిశుపాల వధ.

ప్రశ్న 20.
నేటి కాలమున నారదుడు అంటే అర్థమేమిటి ?
జవాబు:
తగవులు పెట్టే స్వభావం గల వాడని అర్థం.

ప్రశ్న 21.
అగస్త్యభ్రాత అంటే అర్థమేమిటి ?
జవాబు:
మూర్ఖుడు అని అర్థం.

ప్రశ్న 22.
అర్థ విపరిణామాన్ని తెలియజేసే శాస్త్రాన్ని ఆంగ్లంలో ఏమంటారు.
జవాబు:
సెమాటిక్స్ (Semantic) SEMANTICS

AP Inter 2nd Year Telugu Study Material Chapter 2 అర్థ విపరిణామం

ప్రశ్న 23.
ఉర్దూ భాషలో ‘పాక్’ అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
‘పాక్’ అంటే ఉర్దూ భాషలో పవిత్రమైన అని అర్థం.

ప్రశ్న 24.
‘దీపం ఆరిపోయింది’ అన్న మాటలను సౌమ్యంగా ఎలా చెప్తారు ?
జవాబు:
‘దీపం కొండ ఎక్కింది’ అని సౌమ్యంగా చెప్తారు.

కవి పరిచయం

కవి పేరు : తోకల భాస్కరరావు

కలం పేరు : స్ఫూర్తి శ్రీ

జననం : జనవరి 5, 1928

పుట్టిన ఊరు : కాకినాడ తూర్పుగోదావరి జిల్లా

తల్లిదండ్రులు : వీరాయమ్మ, బుచ్చిరాజు

విద్యార్హతలు : బి.ఏ. ఆనర్స్ (ఆంధ్ర విశ్వవిద్యాలయం)

వృత్తి : అధ్యాపకులు, గుంటూరు ఏ.సి. కళాశాల

రచనలు :

  1. భోజుడి సరస్వతీ కంఠాభరణానికి తెలుగు వ్యాఖ్యానం మూడు భాగాలు
  2. జయదేవుని చంద్రాలోక సమున్మేషణానికి తెలుగులో అర్థవివరణ.
  3. క్షేమేంద్రుని ఔచిత్య ప్రస్థానము చారిత్రక సమీక్ష
  4. బాల, పౌఢ వ్యాకరణాలకు వ్యాఖ్య
  5. తెలుగు భాషా చరిత్ర
  6. స్ఫూర్తి శ్రీ వ్యాసావళి సాహిత్య వ్యాసాలు రెండు భాగాలు

మరణము : నవంబరు 19, 2015

AP Inter 2nd Year Telugu Study Material Chapter 2 అర్థ విపరిణామం

ప్రస్తుత పాఠ్యభాగం ‘అర్థవిపరిణామం’ స్పూర్తి శ్రీ రచించిన “తెలుగు భాషా చరిత్ర” లోని అర్థ ప్రకరణం నుండి గ్రహించబడింది.

శాస్త్రం గ్రంథాలను విద్యార్థులకు, అధ్యాపకులను సులభంగా అర్థమయ్యే రీతిలో వ్రాయాలని సంకల్పించినవారు స్పూర్తి శ్రీ. వీరు కాకినాడలో జనవరి 5, 1928న జన్మించారు. తల్లిదండ్రులు వీరాయమ్మ, బుచ్చిరాజులు. స్ఫూర్తిశ్రీ అసలు పేరు తోకల భాస్కరరావు. వీరి కలం పేరు స్ఫూర్తి శ్రీ.

వీరు కాకినాడలోని పిఠాపురం రాజావారి విద్యాసంస్థలలో పాఠశాల, కళాశాల విద్యలను పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఏ ఆనర్స్ పూర్తి చేశారు.

గుంటూరులోని ఏ.సి. కళాశాలలో 1953లో అధ్యాపకునిగా చేరి 1988 వరకు పనిచేసి పదవీ విరమణ పొందారు. స్ఫూర్తిశ్రీ రచనలలో ముఖ్యమైనవి

  1. భోజుడి సరస్వతీ కంఠాభరణానికి తెలుగు వ్యాఖ్యానం. ఇది మూడు భాగాలు.
  2. జయదేవుని చంద్రాలోక సమున్మేషణానికి తెలుగులో అర్థ వివరణం.
  3. క్షేమేంద్రుని ఔచిత్యసిద్ధాంతాన్ని వివరిస్తూ ఔచిత్య ప్రస్థాన చారిత్ర సమీక్ష.
  4. బాల పౌఢ వ్యాకరణాల వ్యాఖ్య
  5. తెలుగు భాషా చరిత్ర.
  6. స్ఫూర్తి శ్రీ వ్యాసావళి పేరుతో రెండు సాహిత్య వ్యాసాల సంపుటాలు వ్రాశారు.

పాఠ్యభాగ సారాంశం

కాళిదాస మహాకవి వాక్కు అర్థము రెండూ ఒక దానితో మరొకటి పార్వతీ పరమేశ్వరుల వలే. కలసి ఉంటాయని చెప్పారు.

“వాగర్థావివ సంపృక్తా వాగర్ధ ప్రతిపత్తయే
జగతఃపితరౌ వందే పార్వతీపరమేశ్వరా”

AP Inter 2nd Year Telugu Study Material Chapter 2 అర్థ విపరిణామం

వాక్కు లేకపోతే అర్థముండదు. అర్థములేని ధ్వని వాక్కు అనిపించుకోదు. అర్ధముతో కూడిన ధ్వని సమూహమువే శబ్దమంటాము. శబ్ద ఉఛ్చారణ, శబ్ద గ్రహణముల వలన శబ్దాలు వాటి అర్థాలు మారుతుంటాయి. అవసరమును బట్టి ఒక్కొక్క పదాన్ని విస్తృతార్థంలోను, సంకుచితార్థంలోను ఉపయోగించటం జరుగుతుంది. పదాలలోను అర్థాలలోను మార్పులు రావటం సహజమే! వీటి పరిణామ క్రమాన్ని భాషా శాస్త్రజ్ఞులు. ఐదు విధములుగా వివరించారు.

  1. అర్థ సంకోచము
  2. అర్థ వ్యాకోచము
  3. గ్రామ్యత్వము
  4. సౌమ్యత
  5. సంకేతము.

1. అర్థ సంకోచము :
ఒక పదము తన విస్తృతార్థమును కోల్పోయి సంకుచితార్ధముగా మారుట.

ఉదాహరణకు ప్రాచీన కాలంలో ‘చీర’ అంటే ‘వస్త్రమన్న’ విస్తృతార్థంలో వాడబడింది. అది నేడు స్త్రీలు ధరించే ‘చీర’ అయి సంకుచితార్థంలో వాడబడుతున్నది. అలాగే పూర్వము ‘వ్యవసాయము’ అన్న పదం పని అన్న అర్థంలో వాడబడింది. అది ఇపుడు సంకుచితమై ‘సేద్యము’ అనే అర్థంలో వాడబడుతున్నది. ఇలా ఒకపదం ఒకప్పుడు విస్తృతార్థంలో వాడబడి సంకుచితార్థంలోకి మారటాన్ని అర్ధసంకోచ మంటాము.

2. అర్థవ్యాకోచము :
పదముల యొక్క అర్థము వ్యాకోచించటమే అర్థవ్యాకోచము. పూర్వము అపరిమితార్థాన్ని చెప్పే పదాలు కాలక్రమంలో విస్తృతార్థాన్ని చెప్పిన ఎడల దానిని అర్థ వ్యాకోచమని అంటారు.

ఉదాహరణకు పూర్వము ‘తైలము’ అను పదము తిలలు(నువ్వుల) నుండి తీసిన నూనెనే ‘తైలమని’ వ్యవహరించేవారు. ఆ తరువాత కాలంలో ఈ తైలమను పదం మందార తైలము, బృంగామలక తైలము అని ఏ పదార్థము నుండి తీసినా తైలమనే వ్యవహరించటం మనము చేస్తున్నాము.

‘దీపపు సెమ్మె’ తెలుగున వాడుకలో ఉంది. దీనికి దీపము పెట్టుకోవటానికి వాడే స్తంభమని అర్థం. పారశీక భాషలో ‘శమా’ అంటే దీపమని అర్థం. అదే తెలుగున ‘సెమ్మె’ అయింది. అచట ఆదేయమునకు వాచకమయినది. ఇచట ఆధారవాచకమైంది.

3. అర్ధగ్రామ్యత :
పూర్వకాలంలో మంచి అర్థంలో ఉన్న పదాలు కాలక్రమంలో నీ చార్ధంగా మారటాన్ని అర్థ గ్రామ్యత అంటాము. ఉదాహరణకు కంపు అన్న పదం పూర్వం సువాసన అన్న అర్థంలో వాడబడింది. ఇపుడది చెడు వాసన అన్న అర్థంలో వాడబడుతున్నది. అలాగే ‘వాసన’ అన్న పదం పూర్వం మంచి వాసన అన్న అర్థంలో వాడబడింది.

ఇపుడది చెడు అర్థాన్నిస్తూ ‘వాసన’ అన్న పదానికి ‘సు’ చేర్చితేనే మంచి వాసన అన్న అర్థాన్నిస్తుంది. పూర్వం ‘ఛాందసుడు’ అన్నపదం వేదవిద్యలు తెలిసిన వాడు అన్న అర్థంలో వాడబడింది. ఇపుడది ‘మూర్ఖ్యుడ’ న్న అర్థంలో వాడబడుతుంది.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 2 అర్థ విపరిణామం

4. సౌమ్యత్వము :
సమాజంలో అశుభ సూచకములైన పదాలను సౌమ్యంగా చెప్పటాన్ని సౌమ్యత్వమంటాము.

ఉదాహరణకు ‘చచ్చాడు’ అన్న పదాన్ని సౌమ్యంగా చెప్పటానికి పరమపదించెను, కాలంచేశాడు, శివైక్యం పొందాడు, స్వర్గమునలంకరించాడు అన్న సుకుమార పదాల ద్వారా చెప్తుంటాము. అలాగే బియ్యం అయిపోయాయని చెప్పటానికి బియ్యం నిండు కున్నాయని, దీపం ఆరిపోయిందని చెప్పటానికి దీపం కొండెక్కిందని, నల్లపూసలు తెగిపోయాయని చెప్పటానికి ‘నల్లపూసలు పెరిగాయని’ ఇలాంటి అమంగళకరమైన పదాలను సౌమ్యంగా చెప్తుంటాము. దీనినే సౌమ్యత్వమంటాము.

5. సంకేతము :
ఈ సంకేత పదాలు వృత్తులను బట్టి కులములను బట్టి ఉంటాయి. ఒక జన సమూహంలో మాట్లాడు సాంకేతిక పదాలు రెండవ జన సమూహం వారికి పూర్తిగా ముసుగు మాటలుగా ఉంటాయి. ఉదాహరణకు వైదికుల పరిభాషలో ‘ఇంద్రాణి’

అంటే ‘వితంతువు’ అని అర్థం. కోపం, తగవుల మారితనం గల వారిని ‘ఛండిక’ అని విశ్వామిత్రుడని, దుర్వాసుడని, నారదుడని వ్యవహరిస్తుంటాము. చండశాసనుడైన అధికారిని ‘యముడని’ మంచివానికి ‘ధర్మరాజని’ పేరు పెట్టుట మనకు తెలియనిది కాదు. అబద్ధమాడువానిని సత్యహరిశ్చంద్రుడని పిలుస్తుంటాము. ఇలా కొన్ని సంకేత పదాలతో మాట్లాడటాన్ని సంకేతమంటారు.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 2 అర్థ విపరిణామం

ఇలా మనం మనకు అందుబాటులో నున్నంత మాటలను మలచుకొని ఉపయోగిస్తాము. దీనికి సంబంధించిన విషయాలను చెప్పు శాస్త్రాన్ని అర్థవిపరిణా మంటారు.

కఠిన పదాలకు అర్థాలు

లాఘవము = నేర్పు
సౌమ్యము = పోలిక
అనవధానత = అవధానం లేకుండా
బోధించు = నేర్పు
సంకుచితత్వము = తక్కువ తనము
కృత్యము = పని
కర్షకుడు = రైతు
ఉద్యోగము = ప్రయత్నము
వ్యాకోచము = వికసించు
తైలము = నూనే
దుర్గంధము = చెడువాసన
పరిమళము = వాసన
శుశ్రూష = వినవలెనన్నకోరిక
పరిచర్య = సేవ
నాగరికులు = నాగరికత తెలిసినవారు
అగస్త్యఢత = మూర్యుడు
అర్ధగ్రహణము = అర్థములను తెలుసుకొనుట.

Leave a Comment