AP Inter 2nd Year Accountancy Notes Chapter 6 Admission of a Partner

Students can go through AP Inter 2nd Year Accountancy Notes 6th Lesson Admission of a Partner will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Accountancy Notes 6th Lesson Admission of a Partner

→ When a partner is admitted to the existing partnership firm, it is called admission of a partner. On the admission of a partner, the following adjustments are necessary.
a) Adjustment of profit sharing ratio : When the new partner is admitted, he acquires his share from existing partners. So, the profit sharing ratio of the firm is decided. When the existing partners surrender some of their share to new partner and the ratio in which they surrender their profits is called sacrificing ratio.

b) Revaluation of assets and liabilities : On the admission of a partner, the assets and liabilities are revalued to show the true position of the firm.

AP Inter 2nd Year Accountancy Notes Chapter 6 Admission of a Partner

c) Adjustment for reserves and accumulated profits : Any accumulated reserve or profit appearing in the balance sheet is credited / debited (in case of existing loss) to old partners in their old profit sharing ratio.

d) An established firm develops wide business connections and this helps the firm to earn more profits. The monetary value of such advantage is called goodwill.

e) There are three important methods of valuation of Goodwill.

  1. Average profit method
  2. Super profit method
  3. Capitalisation method

f) Sometimes, the partners may decide to calculate the capitals which are to be maintained in the new firm either on the basis of new partners capital and his profit sharing ratio or on the basis of existing partners capitals.

→ భాగస్తుడు ప్రవేశించేటపుడు సంస్థ పుస్తకాలలో ఈ క్రింది సర్దుబాట్లు చేయవలసి ఉంటుంది.

→ నూతన భాగస్తుడు ప్రవేశించేటపుడు అతని లాభనష్టాల వాటాను పాత భాగస్తుల నుండి పొందుతాడు. కాబట్టి నూతన లాభనష్టాల నిష్పత్తిని లెక్కించవలెను. కొత్త భాగస్తుడు ప్రవేశించేటపుడు పాత భాగస్తులు తమ వాటాలలో కొంత వాటాను వదులుకుంటారు. దీనిని త్యాగ నిష్పత్తి అంటారు.

→ భాగస్తుడు ప్రవేశించినపుడు భాగస్వామ్య సంస్థ వాస్తవ స్థితిని చూపడానికి సంస్థలో ఉన్న ఆస్తి – అప్పులను పునర్మూల్యాంకనము చేసి వచ్చిన లాభనష్టాలను పాత భాగస్తుల మూలధన ఖాతాలకు సర్దుబాటు చేయవలెను.

→ ఏవైనా పంపిణీ చేయని లాభనష్టాలు మరియు రిజర్వులు ఉన్నట్లయితే, వాటిని నూతన భాగస్తుని ప్రవేశానికి ముందు పాత భాగస్తులకు పాత నిష్పత్తిలో పంచవలెను.

AP Inter 2nd Year Accountancy Notes Chapter 6 Admission of a Partner

→ నూతనముగా స్థాపించి వ్యాపార సంస్థకన్నా కొనసాగుతున్న సంస్థ మంచి పేరు ప్రతిష్టలుండి అధిక లాభాలను ఆర్జిస్తాయి. దీనినే ఆ సంస్థకున్న గుడ్ విల్ అంటారు. దీనిని ఈ క్రింది మూడు పద్ధతుల ద్వారా లెక్కించవచ్చును.

  • సగటు లాభాల పద్ధతి.
  • అధిక లాభాల పద్ధతి.
  • మూలధనీకరణ పద్ధతి.

→ నూతన లాభనష్టాలకు అనుగుణముగా భాగస్తులు వారి మూలధనాలను సర్దుబాటు చేయడానికి అంగీకరించవచ్చును. నూతన భాగస్తుని మూలధనము ఆధారముగా పాత భాగస్తుల మూలధనాలను లేదా పాత భాగస్తుల మూలధనము ఆధారము నూతన భాగస్తుని మూల ధనాన్ని సర్దుబాటు చేయవచ్చు.

Leave a Comment