AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material పద్య భాగం 1st Poem ధర్మ పరీక్ష Textbook Questions and Answers, Summary.

AP Inter 1st Year Telugu Study Material 1st Poem ధర్మ పరీక్ష

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ద్రౌపది మరియు పాండవుల పతన కారణాలను వివరించండి.
జవాబు:
పాండవులు, ద్రౌపది మరియు కుక్క హిమాలయాన్ని దాటి అడవులు, భూములు, నదులు, కొండలు పెక్కింటీని దృఢమైన యోగంలో, నిరాకుల మనస్సుతో, శోకాన్ని విడిచి, ఆయాసమన్నది లేక మేరు పర్వత ప్రాంతానికి చేరుకున్నారు.

అలా ఆ ఏడుగురూ (పాండవులు, ద్రౌపది, కుక్క స్థిరయోగ సాధనపరులై అత్యంత వేగంగా నడుస్తుండగా ద్రౌపది నేలపై పడిపోయింది. అది చూసిన భీముడు అన్నగారితో మహాత్మా ! ద్రౌపది’ నేలకు ఒరిగిపోయింది. ఈమె వలన ఏనాడు కించిత్తు’ కూడా ధర్మహాని జరగలేదు కదా ? మరి ఈమె పడుటకు కారణం ఏమిటి అని అడిగాడు. దానికి ధర్మరాజు ఆమెకు అర్జునుని పట్ల పక్షపాతం అందువల్ల ఆమె సుకృతాలు, ఫలించలేదు. కనుకనే ఇటువంటి కీడు జరిగింది అని చెప్పి స్థిరమైన మనస్సుతో ఆమె శవాన్ని అక్కడే విడిచి ముందుకు సాగిపోయాడు.

అలా వెళ్ళగా వెళ్ళగా సహదేవుడు ప్రాణాలు కోల్పోయి నేలకూలాడు. అది చూసిన వాయుపుత్రుడు భీముడు అన్నకు ఈ విషయం చెప్పి, సహదేవునికి అహంకారమన్నది. లేదు. మిమ్మల్ని ఎంతో భక్తితో సేవించాడు. మీ అందరిలో ఎంతో సన్మార్గుడు. అట్టి సహదేవునకు ఈ స్థితి ఎందుకు సంభవించింది ? అని అడుగగా, ఇతడు లోకంలో తనకంటే సమర్ధుడు ఎవడూ లేడని భావిస్తూ తనకు తాను చాలా గొప్పవాడినని భావించుకుంటూ ఉండేవాడు. అందువలన అతనికి ఈ దుస్థితి సంభవించింది అని నిర్వికార భావంతో ధర్మరాజు ముందుకు సాగిపోయాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

భీమార్జున, నకులుడు, కుక్క తనను అనుసరిస్తుండగా ధర్మరాజు మనసు స్థిరం చేసుకుని ముందుకు పోతున్నాడు. అంతలో ద్రౌపది, తన సోదరులు సహదేవుడు ప్రాణాలు కోల్పోవడం చూసిన నకులుడు ధైర్యం కోల్పోయి ప్రాణాలు విడిచాడు. దుఃఖించిన మనసుతో భీముడు అన్నగారిని అడిగాడు. అందం, శౌర్యం, ధైర్యం, సుజనత్వంలో కురువంశంలోనే కాక, లోకంలోనే ఇటువంటి గుణ శ్రేష్ఠుడు లేడు. అలాంటి పుణ్యమూర్తికి ఇలాంటి దురవస్థ సంభవించిందేమి, అనగా ఇతనికి లోకంలో తనను మించిన, పోలిన అందగాడు మరొకడు లేడని ఎంతో అహంకరించేవాడు. ఆ అహంకారమే అతనిని ఈ గతికి తెచ్చింది అని నకులుని పట్టించుకొనక ముందుకు సాగాడు.

ద్రౌపది, తన .సోదరులిరువురూ పడిపోవటం ‘అర్జునుని మనసును కలచి వేశాయి. ఆ దిగులుతో అతనూ పడిపోయాడు. అది చూసిన భీముడు అన్నగారితో మహాత్మా ! అర్జునుడెంతటి పుణ్యశాలి ! ఎంత ఋజువర్తనుడు ! మరి ఆయనకు ఈ గతి ఎందుకు సంభవించింది అని అడిగాడు. దానికి ధర్మరాజు భారత యుద్ధంలో కౌరవులందరిని ఒక్క దినంలోనే పరిమార్చుతానని అన్నాడు. కానీ అలా చేయలేదు. మాట ఒకటి చేత మరొకటి కావడం మహాదోషం. అంతేకాక ధనుర్ధారులందరినీ ఈసడించేవాడు. కనుక అతడికి ఈ స్థితి దాపురించింది. మరి దోషానికి ఫలితం తప్పుతుందా అంటూ అర్జునుని శవాన్ని విడిచి అలా ముందుకు సాగిపోయాడు.

భీమునికి సోదరులు, ద్రౌపది అందరూ అలా నేలకొరిగిపోవడం మనసును కలిచి వేసింది. ఆయన్ను దైన్యం వహించింది. ధైర్యం దిగజారిపోయింది అతనిలో. అంతే అతడు నేలకొరిగిపోయాడు. అలా ఒరిగిపోతూ ధర్మరాజుతో మహారాజా ! నేను నేల వాలిపోతున్నాను. నేను ఇలా కావడానికి కారణం తెలిస్తే దయతో చెప్పండి అన్నాడు.

దానికి ఆయన నీకు తిండి మీద ఆసక్తి అధికం, అతిగా ఆరగిస్తావు. అదిగాక నీకు గల భుజశక్తి వలన గర్వం అధికం. ఎవరినీ లెక్కచేయని తత్త్వం. పనికిమాలిన మాటలు అనేకం ఎపుడూ మాట్లాడేవాడివి. అందుకే నీకు ఈ స్థితి కలిగిందని ధర్మరాజు పాండవుల మరియు ద్రౌపదిల మరణానికి కారణాలను తెలిపాడు.

ప్రశ్న 2.
ధర్మరాజుని – ఇంద్రునికి శునకం విషయంగా జరిగిన చర్చను విశ్లేషించండి.
జవాబు:
ధర్మరాజును స్వర్గలోకానికి ఆహ్వానించాడు ఇంద్రుడు. స్వయంగా విచ్చేసి ధర్మరాజుని ఆహ్వానించగా తన సోదరులను గురించి దుఃఖించాడు. వారిని స్వర్గంలో చూస్తావు, నీవు సశీరంగా రావలసింది అని ఆహ్వానించాడు. అలాగైతే ఈ కుక్క నేను హస్తినాపురం విడిచింది మొదలుగా ఎంతో భక్తిగా నన్ను వెంబడించి వస్తోంది. అయినపుడు ఇది కూడా నాతో రావాలి గదా ! దానికి అనుమతించు, ఏమంటావా, కాఠిన్యం వహించ టానికి నాకు మనసు రాదు. దయాత్ములు, దానిని నాతో రావడానికి అనుమతించండి అని కోరాడు.

దానికి ఇంద్రుడు చిరునవ్వుతో ధర్మరాజా ! నీవు ఇలా అనడం బాగుందా ! అది ధర్మం కాదు. ఎందుకంటే కుక్కకు దైవత్వం ఎలా అబ్బుతుంది. నీవు అన్నట్టుగా చేయడం అసాధ్యం. దీనిని విడిచి రావటం కాఠిన్యమెలా అవుతుంది. కనుక దానిని వదిలేసి ఆలస్యం చేయక రథం ఎక్కు వెళదాము అన్నాడు. దానికి ధర్మరాజు ఆయనతో మహాత్మా ! నీవన్నది నిజమే, కావచ్చు, నేను అడిగింది చేయతగినదీ, కష్టమైనది కావచ్చు, కానీ పూజ్యుడవు సర్వప్రభువు అయిన మీరు ఆశ్రయించిన వారి కోరిక తీర్చాలి. నన్ను నమ్మిన కుక్కను వదిలివేస్తే వచ్చే సౌఖ్యాలు నాకు ఎలాంటి ఆనందాన్నిస్తాయి. కావున నా కోరిక నెరవేర్చు అని ప్రార్థించాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

అపుడు ఇంద్రుడు ధర్మరాజా ! పంతం వీడు, అలా పంతంపడితే అది ధర్మాన్ని హరించి వేస్తుంది. కనుక నేను చెప్పేది కోపగించకుండా విను. కుక్కలకు నా నివాసమైన స్వర్గంలో చోటు ఎలా కలుగుతుంది. ఈ కుక్కను నీవు వదులుట కాఠిన్యం వహించినట్లు కాదు. దానికోసం పట్టుదల వద్దు. శుభం కలిగేటపుడు దానిని దూరం చేసుకోవడం సమంజసమా అన్నాడు.

దానికి బదులు ధర్మరాజు ఆయనతో తనపట్ల విశ్వాసం. గలవానిని విడిచిపెట్టుట బ్రహ్మహత్యా పాతకంతో సమానమని పెద్దలు చెబుతారు. అన్ని ధర్మాలు తెలిసిన మహాత్ముడవు నీవు. అలాంటిది ధర్మం గురించి నేను చెప్పేవాడినా ! ఏమైనప్పటికీ స్వర్గసౌఖ్యం కొరకు పాపానికి ఒడికట్టుకోలేను అన్నాడు. అపుడు ఇంద్రుడు ధర్మరాజా! నియపరుడైన వాడు కుక్కను ముట్టుకున్నంత మాత్రానే అతడి పుణ్యమంతా కొట్టుకు పోతుంది గదా ! మరి నీవు ఎంతటి నియమపరుడవు. కాని పనికై పంతం పట్టడం బాగుందా ! కనుక ఈ కుక్కను వదిలెయ్యి అలా చేస్తే స్వర్గలోక సుఖం లభిస్తుంది.

లోకం మెచ్చేలా ఎన్నో పుణ్యకార్యాలు చేశావు. ఫలితంగా దైవభావాన్ని పొంద నున్నావు అలాంటిది కుక్క కొరకు దానిని వదులుకుంటానన్నావు. ద్రౌపది, భీమార్జున, నకుల సహదేవులను కూడా వదులుకున్నావు. కానీ కుక్కను వదలనంటున్నావు. నీవు బుద్ధిమంతుడవు. ఇలా పంతం పట్టుట సరైన పనా అని ఇంద్రుడు అన్నాడు.

దానిక ధర్మరాజు మహింద్రా ! అఖిలలో కాసక, ధర్మానికి నీవే ప్రభువువి. అటువంటి నీతో ధర్మాన్ని గురించి చెప్పటానికి నేనెంత వాడిని. అదీగాక మహాత్ములతో వాదం చేయవచ్చునా ! అయినా మనవి చేయవలసిన విషయాన్ని మనవి చేయటం దోషం కాదనే ఉద్దేశంతో విన్నవిస్తున్నాను. ద్రౌపది, భీముడు, ఇతర సోదరులు మరణించారు. వారిని విడువకుండా శోకిస్తుంటే తిరిగి నాతో కలిసి వస్తారా ! రారు కదా. నాతో వచ్చి వారి వలె చావని కుక్కను విడిచిపెట్టనని అనుట దోషమవుతుందా అన్నాడు.

ఇంకా శరణు కోరిన వారిని రక్షింపకుండుట, మిత్రునికి నమ్మక ద్రోహం చేయుట, స్త్రీని వధించుట, వేదజ్ఞానం గలవాని ధనాన్ని హరించుట అనే దోషాలు కూడా భక్తుడినీ, నిరపరాదినీ వదులుకొనే దోషంతో పోల్చలేము అన్నాడు. కావున దేవా ! నాకు స్వర్గలోక ప్రాప్తి అలా ఉండనివ్వండి. నామాట మీద మనసు పెట్టండి. నాపై తమకు గల దయతో కుక్కని వదలలేని నా అశక్తతను తప్పుగా భావించకుండా నాకు వరాన్ని గ్రహించండి. తాము వెళ్ళిరండి. నేను ఈ అడవిలోనే వానప్రస్థంలో వుండి తపస్సు చేసుకుంటూ తమనే సేవిస్తూ ఉంటాను అని నిర్మొహమాటంగా, నిశ్చయంగా ధర్మరాజు పలికాడు.

సంక్షిప్త రూప సమని హ్నాలు

ప్రశ్న 1.
సహదేవుడెట్టి వాడు ?
జవాబు:
సహదేవుడు పాండురాజుకు, మాద్రికి పుట్టిన సంతానం. పాండవులందరిలో చివరివాడు. సహదేవునికి అహంకారమనేది లేదు. మా అందరిలో అతడు ఎంతో సన్మార్గుడని భీముడు కూడా స్తుతించాడు. తన అన్నగారైన ధర్మరాజును తండ్రితో సమానంగా భక్తి ప్రపత్తులతో సేవించేవాడు. భీముడు సహదేవుని మరణ కారణం అడుగగా, సహదేవుడు లోకంలో తనకంటే ప్రాణుడు ఎవడూ లేడని భావిస్తూ తనను తాను గొప్పవాడిగా భావించుకునేవాడు. అందుకే ఈ దురవస్థ సంభవించింది అని ధర్మరాజు సహదేవుని గురించి చెప్పాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 2.
నకులుని గుణాలను పేర్కొనండి.
జవాబు:
నకులుడు పాండురాజుకు, మాద్రికి పుట్టిన కవల సంతానం. సహదేవునికి అన్న. తన సోదరుడి మరణం చూసి ధైర్యం కోల్పోయి ప్రాణాలు కోల్పోయాడు. శౌర్యం, ధైర్యం, సుజనత్వం మున్నగు విషయములలో మేటి. ఎంతో అందగాడు. మన కురువంశంలోనే కాక, లోకంలోనే ఇంతటి గుణశ్రేష్ఠుడు లేడు అని భీముడు నకులుని గురించి పేర్కొనగా, దానికి ధర్మరాజు లోకంలో తనని మించిన, పోలిన అందగాడు మరొకడు లేడని ఎంతో అహంకరించేవాడు. ఆ గుణం వలనే అతకి దురవస్థ కలిగిందని ధర్మరాజు పేర్కొన్నాడు.

ప్రశ్న 3.
పార్దుని మరణ కారణాలేవి ?
జవాబు:
ద్రౌపది, తన సోదరులిరువురూ పడిపోవటం అర్జునుని మనసును కలచి వేశాయి. ఆ దిగులుతో అతనూ పడిపోయాడు. అది చూసిన భీముడు అన్నగారితో మహాత్మా ! అర్జునుడెంతటి పుణ్యశాలి ! ఎంత ఋజువర్తనుడు ! మరి ఆయనకు ఈ గతి ఎందుకు సంభవించింది అని అడిగాడు. దానికి ధర్మరాజు భారత యుద్ధంలో కౌరవులందరిని ఒక్క దినంలోనే పరిమార్చుతానని అన్నాడు. కానీ అలా చేయలేదు. మాట ఒకటి చేత మరొకటి కావడం మహాదోషం. అంతేకాక ధనుర్ధారులందరినీ ఈసడించేవాడు. కనుక అతడికి ఈ స్థితి దాపురించింది. మరి దోషానికి ఫలితం తప్పుతుందా అంటూ అర్జునుని శవాన్ని విడిచి అలా ముందుకు సాగిపోయాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 4.
తిక్కన గురించి వివరించండి.
జవాబు:
కవిత్రయంలో ద్వితీయమైన తిక్కన 13వ శతాబ్దానికి చెందిన కవి. ఇంటి పేరు కొట్టరువు. ‘సోమ’ యజ్ఞం చేసి సోమయాజి అయ్యారు. నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానకవి. అతనికి తను రచించిన నిర్వచనోత్తర రామాయణాన్ని అంకితమిచ్చాడు. సంస్కృత వ్యాస భారతాన్ని నాలుగవదైన విరాటపర్వం నుండి చివరిదైన స్వర్గారోహణ పర్వం వరకు రచించాడు. తన భారతాన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చారు. తిక్కనకు కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు అనే బిరుదులున్నాయి. తిక్కన ఇతర రచనలు అలభ్యం.

ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ధర్మ పరీక్ష పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
తిక్కన

ప్రశ్న 2.
ధర్మ పరీక్షను ఏ గ్రంథం నుండి స్వీకరించారు ?
జవాబు:
ఆంధ్ర మహాభారతం, మహాప్రస్థాన పర్వం నుండి స్వీకరించారు.

ప్రశ్న 3.
తిక్కన ఎవరి ఆస్థాన కవి ?
జవాబు:
నెల్లూరి పాలకుడైన మనుమసిద్ధి.

ప్రశ్న 4.
తిక్కన తన భారతాన్ని ఎవరికి అంకితమిచ్చాడు ?
జవాబు:
హరిహరనాథుడుకి అంకితమిచ్చాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 5.
కేతన దశకుమార చరిత్రను ఎవరికి అంకితమిచ్చాడు ?
జవాబు:
తిక్కనకు అంకితమిచ్చాడు.

ప్రశ్న 6.
పాంచాల రాజకుమార్తె ఎవరు ?
జవాబు:
ద్రౌపది

ప్రశ్న 7.
‘ఒక విరోధి’ అనగా ఎవరు ?
జవాబు:
బకాసురుడనే రాక్షసునికి, విరోధి అయిన భీముడు.

ప్రశ్న 8.
త్రివిష్టపం అంటే ఏమిటి ?
జవాబు:
స్వర్గం

ప్రశ్న 9.
సారమేయ రూపాన ఉన్నదెవరు ?
జవాబు:
ధర్మదేవత

సందర్భ సహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
దీనికిట్టి దురవస్థ వాటిల్లె నీడ్య చరిత !
జవాబు:
కవి పరిచయం :
కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.

సందర్భం :
ద్రౌపది ఎందుకు నేలకూలింది అని భీముడు అడిగితే ధర్మరాజు బదులిచ్చిన సందర్భంలోనిది.

అర్థం :
ద్రౌపదికి. అందుకే ఇటువంటి దురవస్థ వాటిల్లింది.

భావం :
పాండవులు, ద్రౌపది, కుక్క అలా వేగంగా వెళుతుండగా ద్రౌపది నేలకూలింది. అది చూసిన భీముడు అన్నగారితో ద్రౌపది వలన ఏనాడూ కించిత్తు కూడా ధర్మహాని జరగలేదు. మరి ఇలా ఎందుకు జరిగింది అనగా ఆమెకు అర్జునుని పట్ల పక్షపాతం. అందువల్ల ఆమె సుకృతాలు ఫలించలేదు. కనుకనే ఇటువంటి కీడు జరిగింది అని ధర్మరాజు పేర్కొన్నాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 2.
పల్కొక్కటి సేత యొకటి యగుట చాల దోషము.
జవాబు:
కవి పరిచయం :
కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.

సందర్భం :
అర్జునుని మరణ కారణాన్ని అడిగిన భీమునికి ధర్మరాజు సమాధానం చెబుతున్న సందర్భంలోనిది.

అర్థం :
మాట ఒక విధంగా, చేత ఒక విధంగా ఉండుట దోషము.

భావం :
సోదరులు ద్రౌపది మరణాలు చూసిన అర్జునుడు నేల కూలగా, భీముడు అన్నగారితో, అర్జునుడెంతో పుణ్యశాలి, ఋజువర్తనుడు మరి ఇలా ఎందుకు జరిగింది అని అడుగగా, ధర్మరాజు, భారత యుద్ధంలో కౌరవులందరినీ ఒక్క దినంలోనే పరిమార్చుతానని అన్నాడు. కానీ అలా చేయలేదు. మాట ఒకటి, చేత ఒకటి ఉండుట మహాదోషం. అంతేకాక దనుర్థారులందరిని ఈసడించేవాడు. కనుక ఇట్టి దురవస్థ వాటిల్లింది అని ధర్మరాజు సమాధానం చెప్పాడు.

ప్రశ్న 3.
శునకమధిక భక్తి విడువక చనఁగన్.
జవాబు:
కవి పరిచయం :
కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.

సందర్భం :
భీముని మరణానంతరం ముందుకు వెళుతున్న ధర్మరాజు వెనుకనే విశ్వాసంతో అనుసరిస్తున్న కుక్కను గురించి పేర్కొన్న సందర్భంలోనిది.

అర్థం :
శునకం ఎంతో భక్తి విశ్వాసాలతో అతనిని (ధర్మరాజును) వదలకుండా అనుసరిస్తున్నది.

భావం :
చనిపోయేముందు భీముడు అడిగినమీదట అతని పతనానికి కారణాలను తెలిపి అక్కడ ఆగకుండా ధైర్యంతో, స్థిరచిత్తంతో గొప్పవాడైన ధర్మరాజు ముందుకు సాగాడు. ధర్మరాజుని వెనుకే కుక్క కూడా అధికమైన విశ్వాసంతో అతనిని వదలక వెంబడిస్తూనే ఉంది.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 4.
శుభగమనం బెడ సేఁత కృత్యమే.
జవాబు:
కవి పరిచయం :
కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.

సందర్భం :
ఇంద్రునికి, ధర్మరాజుకు మధ్య శునకాన్ని గూర్చి చర్చ జరిగి శునకాన్ని వదలమన్న సందర్భంలోనిది.

అర్థం :
శుభం ప్రాప్తిస్తున్నపుడు దానిని దూరం చేసుకోవడం సమంజసం కాదు.

భావం :
ధర్మరాజా ! పంతం వీడు, ఎందుకంటే అది ధర్మాన్ని హరించివేస్తుంది. కనుక నేను చెప్పేది కోపగించకుండా విను. కుక్కలకు నా నివాసమైన స్వర్గంలో చోటు ఎలా కలుగుతుంది. ఈ కుక్కను నీవు విడిచిపెడితే నీవు కఠినంగా ఉన్నట్లు కాదు. శుభం జరిగేటపుడు దానిని దూరం చేసుకోవడం సమంజసమా చెప్పు అని ఇంద్రుడు ధర్మరాజుతో అన్నాడు.

ప్రశ్న 5.
ఇత్తెఱఁగు సూరి నుతుండగు నీకు నర్హమే.
జవాబు:
కవి పరిచయం :
కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.

సందర్భం :
ఇంద్రుడు ధర్మరాజుతో పండితులతో కీర్తింపబడే నీవు కుక్క కోసం పంతం పట్టుట సమంజసమా అన్న సందర్భంలోనిది.

అర్ధం :
ఈ విధంగా పండితులతో స్తుతింపబడే నీకు ఇలా చేయుట తగునా.

భావం :
ప్రజలందరూ ప్రస్తుతించే పుణ్యకార్యాలు చేస్తావు. కుక్క కొరకు దైవత్వాన్ని వదులుకుంటానంటున్నావు. ఇది మంచిపనా ? ద్రౌపదిని, సోదరులను వదలుకున్నావు. సువ్రతుడవు, కుక్కను మాత్రం వదలనంటున్నావు. పండితులచే స్తుతించబడే ధర్మరాజా నీవు ఇలా పంతం పట్టుట తగునా అని అన్నాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 6.
వత్స ! భూలోకమును నిట్టి వారుఁగలం.
జవాబు:
కవి పరిచయం :
కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.

సందర్భం :
ధర్మదేవత నిజ స్వరూపం దాల్చి తన కుమారుడు ధర్మరాజుతో పలికిన సందర్భంలోనిది.

అర్థం :
కుమారా ! భూలోకంలో నీవంటి వారు గలరా ? (లేరు)

భావం :
ధర్మరాజు కుక్కను వదిలి స్వర్గానికి రాను అని నిశ్చయంగా చెప్పిన వెంటనే కుక్క ధర్మదేవతగా మారి తన కుమారుడైన ధర్మరాజుతో ఈ సర్వ భూలోకంలో నీవంటి వాడు మరొకడు లేడు. ఇంతకు పూర్వం కూడా ద్వైతవనంలోను లోపరహితమైన నీ మనస్సును పరీక్షించాను అన్నాడు.

సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి :
అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాటి దీర్ఘములు ఏకాదేశముగా వచ్చును.

  1. రూపాతిశయము = రూప + అతిశయము = సవర్ణదీర్ఘ సంధి
  2. మహాత్మ = మహా + ఆత్మ = సవర్ణదీర్ఘ సంధి
  3. మునీంద్ర = ముని + ఇంద్ర = సవర్ణదీర్ఘ సంధి

2. గుణ సంధి :
అకారమునకు ఇ, ఉ, ఋలు పరమైనపుడు క్రమంగా ఎ, ఒ, అర్ అనునవి ఏకాదేశమగును.

  1. అమరేంద్రుడు = అమర + ఇంద్రుడు = గుణ సంధి
  2. దేహోద్ధతి = దేహ + ఉద్ధతి = గుణ సంధి

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

3. యణాదేశ సంధి :
ఇ, ఉ, ఋలకు వాని అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమంగా య, వ, రలు ఆదేశమగును.

  1. అత్యంత = అతి + అంత = యణాదేశ సంధి
  2. ధుర్యాత్మ = ధురి + ఆత్మ = యణాదేశ సంధి

4. ఉకార సంధి :
ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.

  1. చిగురొత్తు = చిగురు + ఒత్తు = ఉకార సంధి
  2. శోకమేల : శోకము + ఏల = = ఉకార సంధి

5. యడగమ సంధి :
సంధి లేని చోట స్వరంబు కంటె పరంబయిన స్వరమునకు యడాగమంబగు.

  1. నీయనుజులు : నీ + అనుజులు = యడగమ సంధి
  2. తూలినయట్లు = తూలిన + అట్లు = యడగమ సంధి

6. గసడదవాదేశ సంధి :
ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు.

  1. అట్లుగావున = అట్లు + కావున = గసడదవాదేశ సంధి
  2. రూపంబుదాల్చి = రూపంబు + తాల్చి = గసడదవాదేశ సంధి

7. సరళాదేశ సంధి. :
సూత్రం :

  1. ద్రుతము మీద పరుషములకు సరళములాదేశమగును.
  2. ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.
  3. డప్పింగూలె = డప్పిన్ + కూలె = సరళాదేశ సంధి
  4. నుడువఁదగునె = నుడవన్ + దగునె = సరళాదేశ సంధి

సమానములు

1. సిద్ధసాధ్యులు – సిద్ధులు మరియు సాధ్యులు – ద్వంద్వ సమాసం
2. నాకలోక సుఖములు – నాకలోకమందలి సుఖములు – సప్తమీ తత్పురుష సమాసం
3. భక్తియుక్తుడు – భక్తితో యుక్తుడు – తృతీయ తత్పురుష సమాసం
4. ధైర్యలత – ధైర్యమనెడి లత – రూపక సమాసం
5. పుష్ప వర్షము – పుష్పములతో వర్షము – తృతీయ తత్పురుష సమాసం.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

6. కోదండ ధరుడు – కోదండమును ధరించినవాడు – ద్వితీయ తత్పురుష సమాసం
7. ధర్మహాని – ధర్మమునకు హాని – షష్ఠీ తత్పురుష సమాసం .
8. విగతాసుడు – విగతమైన ఆ లు కలవాడు – బహుప్రీహి సమాసం
9. అసత్యము – సత్యము – నణ్ తత్పురుష సమాసం
10. దివ్య స్యందనము – దివ్యమైన స్యందనము – విశేషణ పూర్వపద కర్మధారయం
11. హిమాచలము – హిమము అను పేరుగల – సంభావన పూర్వపద అచలము కర్మధారయం
12. ధైర్య స్టార్యములు – ధైర్యము మరియు స్టైర్యము – విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం

పద్యాలు – ప్రతిపదార్థం – భావం

ప్రశ్న 1.
చ. అటసని యశ్రమంబున హిమాచలమున్ సమతిక్రమించి వా
రవులు భూములున్ నదులు నద్రులునుం గడుఁ బెక్కు లంచితో
త్కట ధృఢయోగసేవననితాంత నిరాకుల వర్తనంబు నొం
దుట గతభేదులై కడచి తూలక మేరుసమీప భూమికిన్.
జవాబు:
ప్రతిపదార్థం :
అటసని = అలా వెళ్ళుతూ
హిమాచలమున్ = హిమాలయ పర్వతాన్ని
సమతిక్రమించి = దాటి
వారు = ఆ ఏడుగురు (పాండవులు, ద్రౌపది, కుక్క)
అటవులు = అడవులను
భూములున్ = భూములు
నదులున్ = నదులను
అద్రులునుం = పర్వతాలను
కడున్ = పెక్కింటిని
అంచిత = ఒప్పుచున్నట్టు
ఉత్కట = అధికమైన
దృఢయోగ సేవనన్ = దృఢమైన యోగంతో
నిరాకుల వర్తనంబును = నిరాకులమైన మనస్సుతో
ఒందుట = పొంది
గతఖేదురై = శోకాన్ని విడచినవారై
కడచి = దాటుకుని
తూలక = చలించక
అశ్రమంబున = ఆయాసమన్నది లేక
మేరుసమీప = మేరు పర్వతానికి దగ్గరగా
భూమికిన్ = ప్రాంతానికి చేరుకున్నారు.

భావము :
పిదప వారు హిమాలయాన్ని దాటి అడవులు భూములు, నదులు, కొండలు పెక్కింటిని దృఢమైన యోగంతో, నిరాకుల మనస్సులతో, శోకాన్ని విడిచిన ఆయాస మన్నది లేక, మేరు పర్వత ప్రాంతానికి చేరుకున్నారు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 2.
సీ. చనునప్పు డయ్యేడ్వురును నతస్థిరయోగ
సాధన పరులయి సత్వరముగఁ
బోవంగఁ బాంచాల భూపపుత్రిక యోగ
మెడలిన మేదినిఁ బడియె నధిప
పడిన, సమీరణు కొడుకు గనుంగొని
యన్నతోఁ జెప్పి యయ్యతివ వలనఁ
గానమెన్నఁడు ధర్మహాని యిట్లగుటకు
ఆ నరయంగఁ గతమేమి యని విషజ్ఞుఁ

తే. డగుచు నడిగిన నాతం డిమ్మగువ యింద్ర
తనయు దెసఁ బక్షపాతిని దానఁజేసి
సుకృతములు ఫలియింపమిఁ జువె దీని
కిట్టి దురవస్థ వాటిల్లె నీడ్యచరిత
జవాబు:
ప్రతిపదార్థం :
అధిప = ఓ రాజా (జనమేజయుడు)
అయ్యేడ్వురు (ఆ + ఏడువురు) = ఆ ఏడుగురు (పాండవులు, ద్రౌపది, కుక్క)
అతిస్థిరయోగ = ధృడమైన యోగ
సాధనపరులై = సాధన లక్ష్యంగా
సత్వరముగ = అత్యంత వేగంగా
చనునప్పుడు = నడుస్తు
బోవంగన్ = ఉన్నపుడు
పాంచాల భూపపుత్రిక = పాంచాల రాజకుమార్తె (ద్రౌపది)
యోగమెడలిన = ప్రాణం కోల్పోవగా
మేదినిన్ = భూమిపై
పడియె = పడిపోయింది
పడిన = ఆ విధంగా పడిన ద్రౌపదిని చూసి
సమీరణు కొడుకు = వాయుదేవుని కొడుకు (భీముడు)
కనుంగొని = చూసి
అన్నతోఁ జెప్పి = అన్ని ధర్మరాజుగారితో చెప్పి
గుచు = విషాదానికి గురై
ఆ + అతివ = ఆ స్త్రీ (ద్రౌపది)
వలనన్ = వలన
ధర్మహాని = ధర్మానికి హాని జరుగుట
ఎన్నడు = ఎప్పుడూ
కానవల = చూడలేదు
యిట్లగుటకు = ఇలా జరుగుటకు
అరయంగ = విచారించి (బాధ)
గతమేమి = కారణం ఏమిటి
అడిగిన = అని భీముడు అడగగా
ఆతండు = అతడు (ఆ ధర్మరాజు)
ఈడ్వచరిత = పొగడదగిన చరిత గల ఓ భీమా !
ఈ + మగువ ఇంద్రతనయుడు = ఇంద్రుని కుమారుడు (అర్జునుడు)
దెసెన్ = మీదుగా
పక్షపాతిని = అధికమైన ప్రేమ
దానఁజేసి = అందువలన
సుకృతములు = చేసిన మంచి పనులు
ఫలియింపమిజువే = ఫలించలేదు
దీనికి + ఇట్టి = ద్రౌపదికి ఇటువంటి
దురవస్థ = కీడు వాటిల్లె

భావము :
అలా పాండవులు, ద్రౌపది, కుక్క మొత్తం ఏడుగురూ స్థిరయోగ సాధనపరులై అత్యంత వేగంగా నడుస్తుండగా, ద్రౌపది నేలపై పడిపోయింది. అది చూసి భీముడు అన్నగారితో, మహాత్మా ! ద్రౌపది నేలకు ఒరిగిపోయింది. ఈమె వలన ఎన్నడూ కించిత్తు కూడా ధర్మహాని జరుగలేదు కదా ? మరి ఈమె ఇలా పడుటకు కారణమేమిటి అని అడిగాడు. దానికి ధర్మరాజు ఆమెకు అర్జునుని పట్ల పక్షపాతం. అందువల్ల ఆమె సుకృతాలు ఫలించలేదు. కనుకనే ఇటువంటి కీడు జరిగింది అని అన్నాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 3.
క. అని పలికి సమాధానము
దనబుద్ధిం దిరము సేసి ధైర్య సైర్యం
బున వికృతి లేని గతి నా
వనిత శవము విడిచి కౌరవ విభుండఁగెన్
జవాబు:
ప్రతిపదార్థం :
అని = అని ధర్మరాజు
సమాధానం = జవాబు
పలికి = చెప్పి
తనబుద్దిన్ = తన బుద్ధిని (మనస్సుకు)
తిరము = స్థిరము
చేసి = చేసుకుని
స్టైర్యంబున = నిశ్చలత్వం
వికృతి = విచారం
లేనిగతిన్ = లేని విధంగా
ఆ వనిత = ఆ స్త్రీ (ద్రౌపది)
శవము = ప్రాణాలు లేని శరీరాన్ని
విడచి = వదిలి
కౌరవవిభుడు = కౌరవాధిపతి
ఏగెన్ = ముందుకు సాగిపోయాడు.

భావము :
అని ధర్మరాజు జవాబు చెప్పి, తన మనస్సును స్థిరపరచుకుని ఎటువంటి విచారం లేకుండా ఆమె శవాన్ని అక్కడే విడచి ముందుకు సాగిపోయాడు.

ప్రశ్న 4.
సీ. భూవర యమ్మెయిఁ బోవంగ సహదేవుఁ
డపగత ప్రాణుఁడై యవనిఁ బడిన
గని వాయుజుఁడు ధర్మ తనయున కెఱిఁగించి
యితఁ డనహంకారుఁ డెపుడు నీకు
నతి భక్తి శుశ్రూష యాచరించుచు నుండు
మాలోన నెల్ల సన్మార్గవర్తి
యితనికి నేలొకో యిద్దెస వాటిల్లె ,
ననిన, నమ్మనుజేంద్రుడుఁ డతనితోడ

తే. వీఁడు దనకంటెఁ బ్రజ్ఞుండు లేఁడు జగతి
నెందు ననిసంత తమ్ముఁదా నెడ్డఁ దలంచు
దాన నిట్లయ్యె నుంచుపేక్షా నిరూఢ
బుద్ధి నరుగుచు నుండె నప్పురుషవరుఁడు
జవాబు:
ప్రతిపదార్థం :
భూవర = రాజా (జనమేజయుడు)
ఆ + మెయిన్ = ఆ విధంగా
పోవంగ = వెళ్ళగా వెళ్ళగా
సహదేవుఁడ = సహదేవుఁడు
అపగత = పోయిన
ప్రాణుడై = ప్రాణం కలవాడై (ప్రాణం కోల్పోయి)
అవనిన్ = భూమిపై
పడినన్ = పడిపోయాడు
కని = చూసిన
వాయుజుఁడు = వాయుపుత్రుడు భీముడు
ధర్మ తనయునకు = యమధర్మరాజు పుత్రుడు ధర్మరాజుకు
ఎఱిఁగించి = తెలియజేసి
ఇతడు = సహదేవుడు
అనహంకారుడు = అహంకారము లేనివాడు
ఎపుడు = ఎల్లకాలం
నీకున్ = నీకు (ధర్మరాజుకి)
అతిభక్తి = ఎంతో భక్తితో
శుశ్రూష = సేవ
ఆచరించుచునుండు = చేశాడు
మాలోనెల్ల = మా అందరిలోను
సన్మార్గవర్తి = సన్మార్గుడు
యితనికిన్ = అటువంటి సహదేవునికి
ఏలొకో = ఎందుకు
యిద్దెస = ఈ స్థితి
వాటిల్లె = సంభవించింది
అనినన్ = అని అడుగగా
ఆ + మనుజేంద్రుడు = ఆ ధర్మరాజు
అతనితోడ = అతనితో (భీముడు)
వీఁడు = ఇతడు (సహదేవుడు)
తనకంటే = తనకంటే
ప్రాజ్ఞుండు = సమర్దుడు / తెలివిగలవాడు
జగతినెందు = ఈ లోకంలో
లేడు = ఎవడూ లేడని
అని = అనుకుంటూ
సంతతమ్ము = ఎల్లపుడూ
తాన్ = తను
ఎడ్డన్ = గొప్పవాడిగా
తలఁచు = భావించేవాడు
తనన్ = కావున
ఇట్లయ్యెన్ = ఇలా జరిగింది
అంచు = అని.చెబుతూ
ఉపేక్ష = పట్టించుకొనక
నిరూఢబుద్దిన్ = నిర్వికార భావంతో
అప్పురుషవరుఁడు = ఆ పురుషశ్రేష్ఠుడు ధర్మరాజు
అరుగుచునుండె = ముందుకు సాగిపోయాడు

భావము :
అలా వెళ్ళగా వెళ్ళగా సహదేవుడు ప్రాణం కోల్పోయి నేలకూలాడు. అది చూసిన వాయుపుత్రుడు భీముడు అన్నకు ఈ విషయం చెప్పి, సహదేవునికి అహంకార మన్నది లేదు. మా అందరిలో అతడు ఎంతో సన్మార్గుడు. మిమ్ములను ఎంతో భక్తితో సేవించాడు. అట్టి సహదేవునకు ఈ స్థితి ఎందుకు సంభవించింది అని అడుగగా . ! ఆయన ఇతడు లోకంలో తనకంటే సమర్ధుడు ఎవడూ లేడని భావిస్తూ తనకి తాను ” . చాలా గొప్పవాడినని భావించుకుంటూ ఉండేవాడు. అందువలన అతనికి ఈ దుస్థితి సంభవించింది అని చెబుతూ పట్టించుకొనక, నిర్వికార భావంతో, ఆ ధర్మరాజు ముందుకు సాగిపోయాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 5.
క. అనిలజుఁడు నరుఁడు నకులుఁడు,
వనకంబును దోన నరుగ సుస్థిరమతి యై
మనుజేంద్రవర్య యట్ల
జనపతి సన వకులు తమను జగతిం బడియెన్
జవాబు:
ప్రతిపదార్థం :
అనిలజుడు = వాయుపుత్రుడు (భీముడు)
నరుఁడు = అర్జునుడు
నకులుడు = నకులుడు
శునకంబును = కుక్క
తోనన్ = తనను
అరుగ = అనుసరించగా
సుస్థిరమతియై = మనసును స్థిరం చేసుకుని
మనుజేంద్రవర్య = ఆ ధర్మరాజు
అట్ల = ఆ విధంగా
జగపతి = ప్రభువు
సనన్ = సాగిపోతుండగా
నకులుతనువు = నకులుడి శరీరం
జగతిం = నేలపై
పడియెన్ = పడింది.

భావము :
భీముడు, అర్జునుడు, నకులుడూ, కుక్క తనను అనుసరించగా, ధర్మరాజు మనసును స్థిరం చేసుకొని సాగిపోతున్నాడు. అంతలో నకులుడు నేలపై పడిపోయాడు.

ప్రశ్న 6.
క. విను ద్రుపద నందవయుఁ దన
యనుజన్ముఁడు నంత నంత నవనిఁ బడుటఁ దాఁ
గని ధృతి దూలినయట్లు వ
డిన నకులునిఁ జూచి యదలు దెందముతోడన్
జవాబు:
ప్రతిపదార్థం :
విను = వినుము
ద్రుపదనందన = ద్రుపదుని కుమార్తె ద్రౌపది
తన = తన యొక్క
అనుజన్ముడున్ = అనుసరించి జన్మించినవాడు (సోదరుడు సహదేవుడు)
అంత అంత = ఆ విధంగా
అవనిన్ = భూమిపై
పడుటన్ = పడిపోవటం
తాన్ = తాను (నకులుడు)
కని = చూసి
ధృతి = ధైర్యం
తూలినయట్లు = కోల్పోయి
వడిన = నేలపడిన (ప్రాణాలు కోల్పోయిన)
నకులునిన్ = నకులుని
చూచి = చూసి
అడలు = దుఃఖించిన
డెందముతోన్ = మనస్సుతో

భావము :
ద్రౌపది తన సోదరుడు సహదేవుడు ఆ విధంగా ప్రాణాలు కోల్పోవడం చూసిన నకులుడు ధైర్యం కోల్పోయి ప్రాణాలు కోల్పోయాడు. అటువంటి నకులు: చూసి దుఃఖించిన మనసుతో భీముడు ఇలా అన్నాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 7.
సీ. అనిల సూనుఁడు ధర్మతనయున కెఱింగించి ఆ న
యవ్విభుతో సుందరాకృతియును
శౌర్యంబు ధైర్యంబు సౌజన్యమును గురు
సంఘమునన కాదు జగతి నెందు
నితనికిఁ బోలె నహీనత మెఱయునే
యెవ్వరి కైనను నిట్టిపుణ్యుం
గుత్సితదశ యెట్లాకో పొందె నక్కట
యనవుడు నక్కారవాగ్రగణ్యుఁ

తే. డతని కిట్లను నీతండు నాత్మసదృశుఁ,
డఖిల జగముల లేఁడు రూపాతిశయము
తనక కలదని యెపుడుఁ జిత్తమునఁ దలఁచు
నయ్యహంకృతి నెట్టి కీడయ్యెఁజువ్వేం
జవాబు:
ప్రతిపదార్థం :
అనిల సూనుఁడు = భీముడు
ధర్మతనయునకు = ధర్మరాజుకు
ఎఱిఁగించి = విషయాన్ని తెలిపి
ఆ + విభుతో = ఆ ప్రభువుతో
సుందరకృతియును = అందులో
శౌర్యం = శౌర్యం
ధైర్యంబు = ధైర్యం
సౌజన్యమును = మంచితనం
కురుసంఘమున కాదు = కురు వంశంలోనే కాక
జగతినెందు = లోకంలోనే
ఇతనికిన్ = ఇతని
పోలె = వలె
ఎవ్వరికైనను = ఎవరైనను
అహీనత = సౌందర్యంతో
మెఱయునే = ప్రకాశిస్తారా
అక్కటా = అయ్యో !
ఇట్టి పుణ్యన్ = ఇట్టి పుణ్యమూర్తికి
కుత్సితదశన్ = దురవస్థ
యెటొకో = ఏ విధంగా
పొందెన్ = పొందాడు
అనవుడు = అనగా
ఆ + కౌరవగ్రగణ్యుడు = ఆ ధర్మరాజు
అతనికిట్లను = అతనితో ఇలా అన్నాడు
ఈతండు = ఇతడు (నకులుడు)
ఆత్మసదృశున్ = తన వంటివారు
అఖిల జగముల = లోకంలో
లేఁడు = ఎవరూ లేరని
రూపాతిశయము = సౌందర్యము
తనక కలదని = తనకే కలదని
ఎపుడున్ = ఎల్లపుడు
చిత్తమునన్ = మనసులో
దలఁచున్ = భావించేవాడు
ఆ + అహంకృతి = ఆ అహంకారమే
ఇట్టి = ఇటువంటి
కీడయ్యెన్ = హాని జరిగింది
చువ్వె = చూడు

భావము :
అది చూసి భీముడు అన్నగారితో అందం, శౌర్యం , ధైర్యం, మంచితనాలలో కురువంశంలోనే కాక లోకంలోనే ఇలాంటి గుణశ్రేష్ఠుడు లేడు. అయ్యో ! అంతటి పుణ్యమూర్తికి ఇలాంటి దురవస్థ సంభవించిందేమి అనగా, ధర్మరాజు భీమునితో ఇలా అన్నాడు. ఇతడు (నకులుడు) తనవంటి వారు తనతో సమానమైన లోకంలో ఎవరూలేరని, అటువంటి సౌందర్యం తనకే కలదని ఎల్లప్పుడూ మనసు భావించేవాడు. ఆ అహంకారం వలనే ఇటువంటి హాని జరిగింది.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 8.
క. అని ధృతిసారంబూంది య
తని తనువు నుపేక్షఁ గూర్చి ధర్మతనూజుం
దనఘ చనుచుండెఁదక్కటి
యనుజులు గుర్కురముందోన యరుగుచునుం
జవాబు:
ప్రతిపదార్థం :
అని = అని చెప్పి
ధృతి = ధైర్యం
సారంబూది = మనోబలముతో
అతని = నకులుని
తనువు = శవాన్ని
ఉపేక్షన్ = పట్టించు
కూర్చి = కొనక
ధర్మతనుజుండు = ధర్మరాజు
చనుచుండెన్ = వెళ్ళిపోసాగాడు (ముందుకు సాగుట) .
తక్కట = మిగిలిన
అనుజులు = సోదరులు
కుర్కురమున్ = కుక్కయు
తోన = అతనితో
అరుగుచు = వెళుతూ
ఉండన్ = ఉండగా

భావము :
అని సమాధానమిచ్చి ధైర్యం, మనోబలంతో నకులుని శవాన్ని పట్టించుకొనక ధర్మరాజు ముందుకు సాగాడు. మిగిలిన సోదరులు, కుక్క అతనితో కలిసి వెళుతున్నారు.

ప్రశ్న 9.
ద్రౌపది పాటును దనయనుజన్ముల
పడుటయుఁ గనుంగొని పార్థం దాత్మ
యలమట మునింగిన నిల విగతాసుండై
పడినఁ గుందుచుఁ జూచి బక విరోధి
యన్నకుం జూపి యీ యమలచరిత్రుని
యం దెన్నఁడును నసత్యంబుఁ గాన
ఎటు వదుటకుఁ గతమేమి నావుడు నీతం
డక్కారవుల నెల్ల నొక్కనాఁడ

తే. యాహవంబునఁ దెగ టార్లు ననియె నట్లు
సేయఁడయ్యెఁ బిల్కొక్కటి సేఁత యొకటి యగుట
చాల దోషము విను మదియుఁ గాక
యెల్ల కీదండధరుల గర్పించుచుండు
జవాబు:
ప్రతిపదార్థం :
ద్రౌపది పాటును = ద్రౌపది పడిపోవుట (చనిపోవుట)
తన = తన యొక్క
అనుజన్ములఁ = సోదరులు
పడుటయున్ = పడిపోవుటను
కనుఁగొని = చూడుట
పార్థుడు = అర్జునుడు
ఆత్మ = మనస్సును
అలమట = చింత
పడినన్ = పడిపోయాడు
విగతాసుడై = ప్రాణాలు
కోల్పోయి = నేలపై
ఇలన్ = పడిపోయాడు
పడినన్ పడినన్ = అలా పడిపోగా (ప్రాణాలు కోల్పోగా)
చూచి = చూసి
కుందుచఁ = దుఃఖిస్తూ
ఒక విరోధి = బకాసురుడి విరోధి అయిన భీముడు
అన్నకుఁ జూపి = అన్న ధర్మరాజుని చూపి
అమల చరిత్రుని = నిర్మలమైన చరిత్రగలవాడైన అర్జునుడి
యందు = యందు.
ఎన్నఁడును = ఏనాడు
అసత్యమున్ = అబద్ధమాడుట/ఆడితప్పుట
కానము = చూడలేదు
ఇటువడుటకున్ = ఇలా ప్రాణాలు కోల్పోవడానికి
గతమేమి = కారణమేమిటి
నావుడు = అని అడుగగా
నీతండు = ఇతడు (అర్జునుడు)
ఆ + కౌరవులన్ = ఆ కౌరవులను
ఎల్లన్ = అందరినీ
ఒక్కనాడు = ఒకే దినంలో
ఆహవంబునన్ = యుద్ధ రంగంలో
తెగటారున్ = సంహరిస్తాను
అనియె = అన్నాడు
అట్లు సేయడయ్యెన్ = కానీ అలా చేయలేదు
పల్కొక్కటి = మాట ఒకటి
సేఁత యొకటి = చేత మరొకటి
అగుట = అవుట
చాలా దోషము = మహా దోషం
అదియుగాక = అంతేగాక
కోదండధరుల = ధనుర్ధారులు
ఎల్లన్ = అందరినీ
గర్జించుచుండు = ఈసడించుకునే వాడు

భావము :
ద్రౌపది, తన సోదరులు ఇరువురూ పడిపోవటం, అర్జునుని మనసును కలచి వేశాయి. ఆ దిగులుతో అతడు పడిపోయాడు. అది చూసిన భీముడు అన్నగారితో, మహాత్మా ! అర్జునుడెంతటి పుణ్యశాలి ! ఎంత ఋజువర్తనుడు ! మరి ఆయనకు ఈ గతి ఎందుకు సంభవించిందని అడిగాడు.

దానికి ధర్మరాజు భారత యుద్ధంలో కౌరవులనందరినీ. ఒక్క దినంలోనే పరిమార్చు తానని అన్నాడు. కానీ అలా చేయలేదు. మాట ఒకటి చేత మరొకటి కావడం మహాదోషం. అంతేగాక ధనుర్ధారులందరినీ ఈసడించేవాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 10.
ఉ. దానను దాన నిట్లగుట దప్పునె యంచుఁ దదీయమైన య
మ్మానిత దేహమున్ విడిచి మానవ నాథుడు దాల్మిఁ జేసి ఐ
నిరతాత్ముఁడై యరి?, నత్తడి వాయుజుం దార్తి నెంతయున్
దీనతఁ బొంది ధైర్యంత దైవ్విన నేలకు వ్రాలె భూవరా అని
జవాబు:
ప్రతిపదార్ధం :
భూవరా = ఓ జనమేజయ మహరాజా
తానను = కావున
తానన్ = తనకు
తదీయమైన = చేసిన దోషానికి
ఇట్లగుట = ఇలా జరగక
తప్పునే = తప్పుతుందా ? (తప్పదు)
అంచున్ = అంటూ
అమ్మానిత దేహమున్ = అర్జునుని శవాన్ని
విడిచి = అక్కడే విడిచి
మానవనాధుడు = ఆ ధర్మరాజు
తాల్మిఁజేసి = ధైర్యముతో
బద్ధ నిరతాత్ముడు అరిగెన్ = ముందుకు సాగిపోయాడు
అత్తటి = ఆ సమయంలో
వాయుజుఁడు = భీముడు
ఎంతయున్ = ఎంతో
ఆర్తిన్ = దుఃఖంతో
దీనతన్ బొంది = దైన్యాన్ని పొంది
ధైర్యలత = ధైర్యాన్ని
తెవ్వినన్ = కోల్పోయి
నేలకు వ్రాలె = నేలకొరిగిపోయాడు

భావము :
భీమునికి సోదరులు, ద్రౌపది అందరూ అలా నేలకొరిగిపోవడం మనసును కలిచివేసింది. ఆయనను దైన్యం ఆవహించింది. ధైర్యం దిగజారిపోయింది. అందే ! అతడూ నేలకొరిగిపోయాడు.

ప్రశ్న 11.
క. అప్పుడు దగ నిట్లను నతఁ,
డప్పారవ పరునకోధరాధిప కనుంగొ
మ్మిప్పా టేమిట వచ్చెం
జెప్పు మెఱుఁగుడేనిఁ గరుణ సిగు రొత్తంగన్
జవాబు:
ప్రతిపదార్థం :
అప్పుడు = అలా నేలకొరుగుతూ
తగనిట్లను = ఇలా అన్నాడు
అప్పారవ వరునకు = ఆ ధర్మరాజుతో
ఓ ధరాధిప, = ఓ రాజా !
కనుఁగొమ్మ = నేను నేలవ్రాలిపోతున్నాను చూడండి
ఈ + పాటు = ఈ విధంగా పడుటకు
ఏమిటి = కారణం ఏమిటి ?
ఎఱుఁగుదేనిన్ = కారణం తెలిస్తే
వచ్చెంజెప్పుము = తెలియజేయుము
కరుణ = దయ
చిగురొత్తంగన్ = వెలిగితే

భావము :
అలా నేలకొరిగిపోతూ ధర్మరాజుతో మహారాజా ! నేను నేలవ్రాలిపోతున్నాను. నేను ఇలా కావడానికి కారణం తెలిస్తే నాపై దయతో చెప్పండి అని అడిగాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 12.
చ. అన విని యాతఁ డిట్లనియె నాతనితో భవదీయ మైన భో
జన మతిమాత్ర ముద్ధతిఁ’ బ్రచండుఁడవై భుజశక్తి నెవ్వరిం
గొనక కడంగి రజ్జు పలుకుల్ గడుఁ బెక్కులు పల్కు దెపు నీ
వనుపమ శౌర్య యిప్పడుట కత్తెఱఁగుల్ గతమెల్లఁ జెప్పితిన్
జవాబు:
ప్రతిపదార్థం :
అనవిని = భీముడిట్లు అడగగా విని
అతనితో = అతనితో
ఆతడు + ఇట్లనియె = ఇలా అన్నాడు
భవదీయమైన = నీకు
భోజనము = తిండి
అతిమాత్రము = అతిగా ఆరగిస్తావు
ఉద్ధతిన్ = ఎక్కువైన
ప్రచండుఁడవై = ఇతరులకు సాధ్యం కాని
భుజశక్తిన్ = భుజ బలంతో
ఎవ్వరింగొనక కడంగి = ఎవ్వరినీ లెక్కచేయవు
రజు పలుకుల్ = పనికిమాలిన మాటలు
కడున్ = అనేకం
నీవు = నీవు
అనుపమ = సాటిలేని
శౌర్యము = వీరత్వాన్ని గురించి
పల్కుదెపు = ఎప్పుడూ మాట్లాడేవాడివి
ఈ + పడుటకు = ఇలా పడుటకు
అత్తెఱఁగుల్ = ఇవి కారణములు
గతమెల్లన్ = జరిగినదంతా
చెప్పితిన్ = చెప్పాను

భావము :
భీముడిలా అనగా విని ధర్మరాజు భీమునితో నీకు తిండి మీద ఆసక్తి అధికం. అతిగా ఆరగిస్తావు. అదీగాక నీకు గల భుజశక్తి వలన గర్వం అధికం. ఎవరినీ లెక్కచేయని తత్త్వం నీది. పనికిమాలిన మాటలు అనేకం ఎపుడూ మాట్లాడే వాడివి. ఇలా పడుటకు కారణాలివి జరిగినదంతా చెప్పాను అన్నాడు.

ప్రశ్న 13.
క. అని పలికి నిరీక్షింపక
చనుచుండె నితండు ధైర్యసారోదారుం
డును నిశ్చయ మహితుఁడునయి.
వెనుక శునక మధిక భక్తి విడువక చనఁగన్
జవాబు:
ప్రతిపదార్థం :
అని పలికి = అని చెబుతూ
నిరీక్షింపక = అక్కడ ఆగక
చనుచుండె = ముందకు సాగాడు
ఇతడు = ఇతడు (ధర్మరాజు)
ధైర్యసారము = ధైర్యం, బలం
ఉదారుడు = గొప్పవాడు
నిశ్చయమహితుఁడునయి = స్థిరమైన చిత్తంతో
వెనుక = ధర్మరాజు వెనుక
శునకము = కుక్క
అధిక భక్తితో = అధికమైన విశ్వాసంతో
విడువక = అతనిని వదలక
చనఁగన్ = వెంబడిస్తూనే ఉంది.

భావము :
అని చెబుతూ, అక్కడ ఆగకుండా ధైర్యం, బలం స్థిరచిత్తంతో గొప్పవాడైన ధర్మరాజు ముందుకు సాగాడు. ధర్మరాజు వెనుక కుక్క కూడా అధికమైన విశ్వాసంతో అతనిని వదలక వెంబడిస్తూనే ఉంది.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 14.
తే. అసమంచిత సారమేయంబు పాండు
ధరణినాయకు నగ్రిమతనయు పిజంద
నధిక భక్తి యుక్తంబుగ నరుగుచునికి
పలుమజను నీకుఁ జెప్పితిఁ దలఁచియుండు
జవాబు:
ప్రతిపదార్థం :
అసమ + అంచిత = సాటిలేని పూజింపదగిన
సారమేయంబు = కుక్క
పాండు ధరణినాయకున్ = పాండురాజు
అగ్రిమతనయున్ = పెద్దకుమారుడైన ధర్మరాజు
పిఱుఁద = వెనుక
అధిక భక్తియుక్తంబుగ = అధికమైన భక్తితో
అరుగుచునికి = వెంబడించుట
పలుమఱను = అనేక పర్యాయాలు
నీకున్ + చెప్పితి = నీకు చెప్పాను
తలచియుండు = బాగా గుర్తుంచుకో

భావము : జనమేజయ మహారాజా ! సాటిలేని పూజింపదగిన ఆ కుక్క పాండురాజు పెద్ద కుమారుడైన ధర్మరాజు వెనుక అధికమైన భక్తితో వెంబడిస్తోందని అనేక మారులు నీకు చెప్పాను, బాగా గుర్తుంచుకో అన్నాడు.

ప్రశ్న 15.
వ. అని పలికి వైశంపాయనుండు జనమేజయున కిట్లను నట్లు నిష్టాగరిష్ఠుండయి
యుధిష్ఠిరుండరుగు చుండ.
జవాబు:
ప్రతిపదార్థం :
అని పలికి = అలా చెప్పిన
వైశంపాయనుండే = వైశంపాయన మహర్షి
జనమేజయునకు = జనమేజయ మహారాజుతో
ఇట్లను = తరువాత కథ ఇలా చెప్పాడు
అట్లు = ఆ విధంగా
నిష్ఠాగరిష్ఠుండయి = దృఢమైన దీక్ష పూనినవాడై
యుధిష్ఠిరుండు = ధర్మరాజు
అరుగుచుండ = ముందుకు సాగుతుండగా

భావము :
అలా చెప్పిన వైశంపాయనుడు, జనమేజయ మహారాజుతో తరువాత కథ . ఇలా చెప్పాడు. ఆ విధంగా దృఢమైన దీక్ష పూనినవాడై ధర్మరాజు ముందుకు సాగు తున్నాడు.

ఇంద్రుడు ధర్మరాజు కొరకు రధం తెచ్చుట

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 16.
సీ. దివ్య దేవోద్ధత దీప్తి సంతానంబు
దిశలు పదింటను ధీటు కొనఁగ
రథ సమాగమన సంరావంబు మేరు గ
ద్వారములఁ బ్రతిరవోత్కరము నీన
నచ్చటి సిద్ధసాధ్య మునీంద్ర గణములు
నానావిధ స్తోత్రనాద మెసంగం
దత్రదేశంబు బోధస్ఫీత కల్ప వృ .
క్షంబులు పుష్ప వర్షములు గురియ

తే. నింద్రుఁ డేతెంచి యాదర మెసక మెసగం
నక్కురు క్షితిపాలునకగ్ర భాగ
వర్తి యగుటయు నతఁ డభివందనంబు
సేనె సవినయ భక్తి విశేష మొప్ప
జవాబు:
ప్రతిపదార్థం :
దివ్య = పుణ్య
దేహోద్ధత (దేహ + .ఉద్దత) = శరీరం నుంచి వెలువడుతున్న
దీప్తి సంతానంబు = కాంతి కిరణాలు
దిశలు పదింటను = పది దిక్కులు
ధీటుకొనఁగ = ప్రకాశిస్తుండగా
రథ సమాగమన = రథం వస్తున్న
సంరావంబు = ధ్వనికి
మేరు = మేరు పర్వత
గహ్వరములన్ = గుహలు
ప్రతిరవోత్కరమున్ = ప్రతిధ్వని
ఈవ = ఇవ్వగా

విశేషం : అష్ట సిద్ధులు ఎనిమిది. అవి :

  1. అణివు – సూక్ష్మంగా (చిన్నగా) మారిపోవుట .
  2. మహిమ – – పెద్దగా అగుట .
  3. గరిమ – బరువు పెరుగుట
  4. లఘిమ – తేలికగా అగుట
  5. ప్రాప్తి – కావాలనుకున్నది పొందుట
  6. ప్రాకమ్యము . – ఇష్టం వచ్చిన చోటుకు పోగలుగుట
  7. ఈశత్వము – దైవత్వం
  8. వశత్వము – ఇంద్రియములు వశమగుట.

భావము :
అలా ధర్మరాజు ముందుకు వెళుతుండగా, రథంపై ఇంద్రుడు తన దేహపు దివ్యకాంతులు దశదిశలు వెలిగిస్తుండగా, రధ ధ్వనికి మేరు పర్వత గుహలు ప్రతిధ్వని స్తుండగా, అక్కడ నివసిస్తున్న సిద్ధులు, సాధ్యులు, మునీంద్రులు అనేక విధాల ఇంద్రుని స్తోత్రం చేస్తుండగా, ఆ ప్రదేశంలోని కల్పవృక్షాలు పూల జల్లుని కురిపిస్తుండగా, ఎంతో ఆదరభావంతో ఇంద్రుడు ధర్మరాజుకు ఎదురు వచ్చాడు. అప్పుడు ధర్మరాజు సవినయంగా భక్తి ప్రవత్తులతో, ఇంద్రునికి అభివాదం చేశాడు.

ప్రశ్న 17.
వ. అట్లు ప్రణతుండయిన నభినందించి యప్పురందరుండవని దివ్యస్యందనం
బెక్కుమని పలికిన నతండు శోక సంతప్తుండగుచు నతని కిట్లనియె
జవాబు:
ప్రతిపదార్థం :
అట్లు = ఆ విధంగా
ప్రణతుండయిన = ప్రణామం చేసిన
అభినందించి = అభినందించి
ఆ + పురంధరుడు = ఆ దేవేంద్రుడు
అతని = ధర్మరాజును
దివ్యస్యందనం = దివ్య రథాన్ని
ఎక్కుమని = అధిరోహించమని
పలికినన్ = చెప్పగా
అతండు = ఆ ధర్మరాజు
శోకసంతప్తుండ = దుఃఖంలో మునిగి
అగుచు = అగును
అతనికి = ఆ దేవేంద్రునితో
ఇట్లనియె = ఇలా అన్నాడు.

భావము :
అలా తనకు ప్రణామం చేసిన ధర్మరాజును ఇంద్రుడు అభినందించి తన దివ్య రథాన్ని అధిరోహించమని చెప్పగా, అపుడు విషాదం కమ్మిన ఆ ధర్మరాజు ఇలా అన్నాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 18.
శా. తోడంబుట్టువులందఱుం బడిన యా దుఃఖంబు చిత్తంబు సం
పీడం బెట్టెడు సౌకుమార్యవతి డప్పిం గూలెఁ బాంచాలి వా
రోడై వచ్చిరి వారు లేక యిట మీతో రాను వారెల్ల నా
తోడం గూడఁగ వచ్చునట్లుగఁ గృపాధుర్యాత్మ కావింపవే
జవాబు:
ప్రతిపదార్థం :
తోడంబుట్టువులు = తోడబుట్టిన వారు (సోదరులు)
అందఱుం = అందరూ
పడిన = చనిపోగా
ఆ దుఃఖంబు = ఆ బాధ
చిత్తంబు = మనసును
సంపీడనం బెట్టెడు = కలిచివేస్తోంది
డప్పింగూలెన్ = అలసి దాహంతో కూలిపోయింది
సౌకుమార్యవతి = సుకుమారి
పాంచాలి = ద్రౌపది
కూలెన్ = మరణించింది
వార్డోడై. (వారు + తోడై) = వారందరూ నాతో బయలుదేరి వచ్చారు
వారు లేక = వారంతా లేకుండా
ఇట = ఇక
మీతో రాను = మీతో రాలేను
వారెల్ల = వారందరూ
నా తోడం = నాతో
కూడగ = కలిసి
వచ్చునట్లుగన్ = వచ్చేట్లుగా
కృప = దయ
ధుర్యాత్మ = మనసంతా నిండినవాడా
కావింపవే = అనుమతించు

భావము :
అంతట ధర్మరాజు ఇంద్రునితో ‘మహాత్మా ! నా తోబుట్టువులందరూ మరణించారు. సుకుమారి ద్రౌపది అలసి దప్పికతో. చనిపోయింది. ఆ దుఃఖం నా మనసును కలచివేస్తోంది. వారందరూ నాతో బయలుదేరి వచ్చారు. వారు లేకుండా నేను రాలేను. కనుక వారు కూడా నాతో వచ్చేట్లుగా తాము నాపై దయతో అనుమతింతురు గాక అని ధర్మరాజు అన్నాడు.

ప్రశ్న 19.
చ. అన అని యింద్రుఁడిట్లనియే నక్కురు భర్తకు శోకమేల నీ
యనుజులు ద్రౌపదీసహీతులై తనువుల్ దిగఁద్రావి చన్న వా
రనఘ యమర్త్య లోకమున కక్కడఁ గాంచెదు. గాక వారలం
దనువు దొజంగం గావలదు ధర్మమయాత్మక నీవు రావనా
జవాబు:
ప్రతిపదార్థం :
అనవిని = ధర్మరాజు చెప్పినది విని
ఇంద్రుడు = ఇంద్రుడు
ఇట్లనియెన్ = ఇలా అన్నాడు
ఆ + కురుభర్తకు = ఆ కురురాజుతో
శోకమేల = దుఃఖమేల
నీ అనుజులు = నీ సోదరులు
ద్రౌపదీ సహితులై = ద్రౌపదితో సహా
తనువుల్ = శరీరం
దిగఁద్రావీ = త్యాగంచేసి
అమర్త్యలోకమునకు = స్వర్గమునకు
చన్నవారు = వెళ్ళిపోయారు
అనఘ = ఓ పుణ్యాత్ముడా
అక్కడన్ = అక్కడ స్వర్గ లోకంలో
కాంచెదుగాన్ = వారిని చూచెదవుగాక
వారలం = వారి వలె
తనువు = దేహం
తొఱంగన్ = విడువవలసిన
కావలదు = అవసరం లేదు
ధర్మమయాత్మక = ధర్మస్వరూప ధర్మంజీ
నీవు = నీవు సశరీరంగా
రావనా = రావచ్చును.

భావము :
ధర్మరాజు చెప్పినది విని ఇంద్రుడు ఆయనతో, ఎందుకు నీవు అలా : దుఃఖిస్తావు. నీ సోదరులు, ద్రౌపదితో సహా దేహత్యాగం చేసి స్వర్గానికి వెళ్ళిపోయారు. వారక్కడ ఉన్నారు. నీవు. వారిని అక్కడే చూస్తావు గాక ! నీవు దేహాన్ని విడువవలసిన అవసరం లేకుండానే అక్కడకు రావచ్చును. కనుక నాకు రావలసింది అని చెప్పాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 20.
సీ. అనుటయు ధర్మజుండ మరేంద్రుతో నన్ను
నత్యంత దృఢభక్తి నాశ్రయించి
పుర మేను వెడలునప్పుడు మొదల్ గాఁ దోన
చనుదెంచెనీ భవ్యసారమేయ
మిరియట రావలదే నా మనంబు ని
పుర వృత్తికోర్వ దస్తోక పుణ్య
నిరతాత్మ నావుడు దరహాస మొప్ప న
అ బ్బల వైరి యిట్లంట పాడియే య

తీ. మర్త్య భావము కుక్క కేమాడ్కిఁ గలుగు
ననఘ నీ చింత తెఱఁగశక్యంబు దీని
విడిచి చనుటేల నిష్ఠుర వృత్తియయ్యె,
నిచటఁ దడయంగ నేటికి నెక్కు రథము.
జవాబు:
ప్రతిపదార్థం :
అనుటయు = ఇంద్రుడు స్వర్గానికి ఆహ్వానించగా
ధర్మజుండు = ధర్మరాజు
అమరేంద్రుతో = ఇంద్రునితో ఇలా అన్నాడు
ఏను = నేను
పురము = హస్తినాపురము
వెడలునప్పుడు = విడిచింది
మొదల్ గాన్ = మొదలుకొని
తోన = కలిసి
ఈ భవ్య = ఈ యోగ్యమయిన
సారమేయము = కుక్క
చునుదెంచెన్ = వెంబడించి వస్తోంది.
అట = అయినపుడు
ఇది = ఇది కూడా
రావలదే = నాతో రావాలి కదా
నామనంబు = నా మనసు
నిష్ఠుర వృత్తి = కాఠిన్యం వహించడానికి
ఓర్వదు = అనుమతించదు
అస్తోక = శోకాన్ని హరించే
పుణ్య నిరతాత్మ = పవిత్ర హృదయం గల ఇంద్రా
నావుడు = అనగా
దరహాస మొప్ప = చిరునవ్వుతో
అనయీ = శ్రేష్ఠుడా !
ఇట్లంట = నీవు ఇలా అనటం
పాడియే = ఏమైనా బాగుందా (ధర్మమా)
అమర్త్య భావం = దైవత్వం
కుక్కకు = శునకానికి
ఏమాడ్కిన్ = ఏ విధంగా
కలుగున్ = అబ్బుతుంది
నీ చింత = నీవు భావించినట్లు
తెఱఁగ = చేయుట
అశక్యంబు = అసాధ్యము
దీని విడిచి = దీనిని వదిలి
చనుట = పోవుట
ఏల = ఏవిధంగా
నిష్ఠుర వృత్తి = కాఠిన్యం
అయ్యెన్ = అవుతుంది
ఇచటన్ = ఇక్కడ
తడయంగన్ = ఆలస్యం
ఏటికి = ఎందుకు
రథము = రథము
ఎక్కు = ఎక్కవలసింది

భావము :
ఇంద్రుడు స్వర్గానికి ఆహ్వానించగా, ధర్మరాజు ఇంద్రునితో ఇలా అన్నాడు. నేను హస్తినాపురం విడిచింది మొదలుగా నాతో కలిసి ఈ యోగ్యమయిన కుక్క వెంబడించి వస్తోంది. అయినపుడు ఇది కూడా నాతో రావాలి కదా ! ఎందుకంటే కాఠిన్యం వహించడానికి నాకు మనసు రాదు. శోకాన్ని హరించే పవిత్ర హృదయం గల ఇంద్ర దానికి అనుమతించు అన్నాడు.

దానికి ఇంద్రుడు చిరునవ్వుతో శ్రేష్ఠుడా ! నీవు ఇలా అనడం ఏమైనా బాగుందా! అది ధర్మమైన మాటకాదు. కుక్కకు దైవత్వం ఎలా అబ్బుతుంది. నీవు అన్నట్లుగా చేయటం అసాధ్యం. దీనిని విడిచి రావటం కాఠిన్యం ఎలా అవుతుంది. కనుక దాని విషయం వదిలేయి. ఇంక ఇక్కడ ఆలస్యం చేయుట ఎందుకు. త్వరగా రథం ఎక్కు వెళ్తాము అన్నాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 21.
వ. అనిన నమ్మనుజేంద్రుం డింద్రునితోడ నవార్యంబును దుష్కరంబును నగు కార్యం
బేనియు నార్యుండును ప్రభుండును నైన నీయట్టిసంశ్రితులకై సంఘటింప వలదె
భక్త పరిత్యాగంబు సేసి పడయు సిరి నాకు నెంత యింపయ్యెడు ననుటయు
నయ్యనిమిష నాథుండు.
జవాబు:
ప్రతిపదార్థం :
అనినన్ = ఇంద్రుడు ఇలా పలుకగా
ఆ + మనుజేంద్రుడు = ఆ ధర్మరాజు
ఇంద్రుని తోడన్ = ఇంద్రునితో
అవార్యంబును = అడ్డుకోదగిన
దుష్కరంబున్ = కష్టమయిన
అగు = అయిన
కార్యంబే = పని
ఏనియు = కావచ్చు
ఆర్యుండును = శ్రేష్ఠుడవు
ప్రభుండును = సర్వ ప్రభువువు
ఇన = అయిన
నీకొట్టి = మీవంటి
సత్పురుషుండు = పుణ్యాత్ములు
సంశ్రితులకై = ఆశ్రయించిన వారిని
సంఘటింపవలదె = కోరిక చెల్లించాలి కదా
భక్త పరిత్యాగంబు = నాపట్ల భక్తితో ఉన్నవారిని వదిలి
జేసి = చేయుట (వదిలివేయుట)
పడయు = పొందే
సిరి = సుఖసంపదలు
నాకున్ = నాకు
ఏమంత
ఇంపు + అయ్యెడు = ఆనందాన్ని కలిగిస్తుంది
అనుటయు = అనగా
ఆ + అనిమిషనాథుడు = ఆ దేవతల రాజు

భావము :
ఇంద్రుని మాటలు విని ధర్మరాజు ఆయనతో మహాత్మా ! నీవన్నది నిజమే కావచ్చును. నేను అడిగింది చేయతగినది, కష్టమైనది కావచ్చు గాక. కాని పూజ్యుడవు, సర్వప్రభువువు అయిన మీ వంటి పుణ్యాత్ములు ఆశ్రయించిన వారి కోరిక చెల్లించాలి కదా ! ఏమైనా నాపట్ల భక్తితో ఉన్నవారిని వదిలిపెడితే వచ్చే సిరి నాకు ఎలాంటి ఆనందాన్ని కలిగిస్తుంది. (కలిగించు) కనుక నా కోర్కెను నెరవేర్చు అన్నాడు. అపుడు ఆ ఇంద్రుడు ఇలా అన్నాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 22.
చ. అలుక హరించు ధర్మముల నట్లగుటం గురువంశవర్య
పలుగక విన్ము కుక్కలకు నావసరంబు ద్రవిష్టపంబునం
గలుగునె నీకు నిష్ఠురత గల్గదు దీనిఁ బరిత్యజించినం
జలము కొనంగనేల శుభ సంగమనం బెడసేంత కృత్యమే
జవాబు:
ప్రతిపదార్థం :
అలుక = పంతం
హరించు = విడుచుట (తొలగించు)
ధర్మములన్ = ధర్మములను
అట్లగుటన్ = అలా పంతగిస్తే
కురువంశవర్య = ఓ. ధర్మరాజా
నీవలుగక = కోపగించకుండా
విన్ము = విను
కుక్కలను = కుక్కలకు
నావసథంబు = నా నివాసమైన
త్రివిష్టపంబునన్ = స్వర్గం నందు
కలుగున్ = చోటు ఎలా కలుగుతుంది
దీనిన్ = ఈ కుక్కను
పరిత్యజించినం = విడిచిపెట్టుట వలన
నీకు = నీకు
నిష్ఠురత = కాఠిన్యం
కల్గదు = వహించినట్లు కాదు
జలమకొనంగన్ = పట్టుదల, మీత్పర్యం
ఏల = ఎందుకు
శుభ = శుభం
సంగమనంబు = కలిగేటపుడు, ప్రాప్తిస్తున్నపుడు
ఎడసేంత = దూరం చేసుకొనుట ,
కృత్యమా – సమంజసమా, సరైన పనా

భావము :
ధర్మరాజా ! పంతం విడు. అలా పంతగిస్తే అది ధర్మాన్ని హరించివేస్తుంది. కనుక నేను చెప్పేది కోపగించకుండా విను. కుక్కలకు నా నివాసమైన స్వర్గంలో చోటు ఎలా కలుగుతుంది. ఈ కుక్కను విడిచిపెట్టినందు వలన నీకు కలిగే నిష్ఠురత్వం వుండదు. అంటే నీవు కాఠిన్యం వహించినట్లు కాదు. దానికోసం పట్టుదల ఎందుకు. శుభం ప్రాప్తిస్తున్నపుడు దానిని దూరం చేసుకోవడం సమంజసమా చెప్పు అని ఇంద్రుడు అన్నాడు.

ప్రశ్న 23.
సీ. అనవుడు ధర్మనందనుఁ డమ్మహాత్ముతో
విను భక్తియుక్తుని విడువు బ్రహ్మ
హత్యఁ బోలెడి పాపమని చెప్పుదురు పెద్ద
లట్లు గావున దీని నఖిలధర్మ
సారజ్ఞ విడుచుట సనదు దివ్య సుఖంబు
నకుఁ గాఁగఁ బాపంబునకుఁ జొరంగం
జాల నావుడను వాసవుఁడు వ్రతస్థుండు
కుక్క నంటిన వారి కోరి చేయు.

తీ. సుకృతమునకు నాశంబగు సువ్రతాత్మ
యింత యెప్పని నిర్బంధ మేల చెపుమ
విడువుమీ శునకము దీని విడువఁబదుట
నాక లోక సౌఖ్యంబు నొనర్చు నీకు
జవాబు:
ప్రతిపదార్థం :
అనవుడు = ఇంద్రుడు అలా అనగా
ధర్మనందనున్ = ధర్మరాజు
ఆ + మహాత్ముతో = ఆ మహాత్ముడితో
విను = వినుము
భక్తియుక్తుని = భక్తి విశ్వాసవంతుని
విడువు = విడిచి పెట్టడం
బ్రహ్మహత్యమ్ = బ్రహ్మ హత్యతో
పోలెడి పాపమని = సమానమని
పెద్దలు = పెద్దలు.
చెప్పుదురు = చెబుతారు
అట్లుగావున = ధర్మం అటువంటిది కావున
దీనిన్ = దాని గురించి
అఖిలధర్మ = అన్ని ధర్మాలు తెలిసిన
సాంజ్ఞ = మహాత్ముడవు
విడుచుట = వదలమని
చనదు = చెప్పతగదు
దివ్యసుఖంబునకున్ = స్వర్గ సౌఖ్యం
కాఁకఁ = కొరకు
పాపంబునకున్ = పాపానికి
చొరంగన్ జాలన్ = ఒడికట్టుకోలేను
నావుడను = అన్నాడు
వాసవుఁడు = ఇంద్రుడు, ధర్మరాజునితో
సువ్రతాత్మ = పుణ్యవంతుడా !
వ్రతస్థుండు = నియమపరుడు
కుక్కనంటిన = కుక్కని ముట్టుకుంటే
వారి కోరు చేయు = వారు చేసుకున్న
సుకృతమునకు = పుణ్యమంతా
నాశంబగు = కొట్టుకొని పోతుంది
యింతయు = ఇంత
ఒప్పని = కూడనిదానికి
నిర్బంధం = పంతం పట్టుట
ఏలచెపుమా = ఏమైనా బాగుందా చెప్పు
ఈ శునకము = ఈ కుక్కను
విడువుము = విడిచిపెట్టు
దీని = = దీనిని
విడువఁబడుట = వదిలివేసిన
నాకలోక = స్వర్గలోక
సౌఖ్యంబున్ = సుఖములను
నీకు = నీకు
ఒనర్చు = ఇస్తుంది

భావము :
అది విని ధర్మరాజు ఇంద్రునితో, తనపట్ల విశ్వాసం గల వానిని విడిచి పెట్టుట బ్రహ్మహత్యా పాతకంతో సమానమని పెద్దలు చెపుతారు. అన్ని ధర్మాలు తెలిసిన మహాత్ముడవు నీవు. అలాంటిది ధర్మం గూర్చి నేను చెప్ప తగుదునా ! ఏమైనప్పటికీ స్వర్గ సౌఖ్యం కొరకు పాపానికి ఒడికట్టుకోలేను అన్నాడు.

అంతట ఇంద్రుడు ధర్మజునితో అలా అనడం సరికాదు. ఎందుకంటే నియమ పరుడైనవాడు కుక్కను ముట్టుకున్నంత మాత్రాననే, అతడి పుణ్యమంతా కొట్టుకుపోతుంది కదా ! మరి నీవు ఎంతో నియమపరుడవు. కూడనిదానికి నీవు ఇంతగా పంతం పట్టటం ఏమైనా బాగుందా. కనుక ఈ కుక్కను వదిలెయ్యి అలా చేస్తే నీకు స్వర్గలోక సుఖం లభిస్తుంది.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 24.
చ. జనులు నుతింపఁగా సుకృత సంపదజేసి యమర్త్య భావముం
గనియును జెందకిట్లునికి కార్యమె ద్రౌపది భీమసేను న
అర్జునుఁ గవలం ద్యజించుటకు సువ్రత చాలితి చాల వయ్యె దీ
శునకము విద్వ నిత్తేజంగు సూరి మతుం డగు నీకు నరమే
జవాబు:
ప్రతిపదార్థం :
జనులు = ప్రజలు
నుతింపగా – ప్రస్తువింపగా
సుకృత = పుణ్యకార్యములు
సంపదఁజేసి = చేసి
అమర్త్యభావముం = దైవ భావాన్ని
కనియును = పొందనున్నావు
చెందక = పొందక
ఇట్లునికి = ఇలా కుక్క కొరకు
కార్యమె = వదులుకొంటానంటున్నావు
ద్రౌపది = ద్రౌపది
భీమసేనున్ = భీముడు
అర్జునున్ = అర్జునుడు
కవలలం = కవలలు (నకుల, సహదేవులు)
చాలితవయ్యెద = సిద్ధపడి
త్యజించుటకు = వదులుకున్నా
సువ్రత = సువ్రతుడవే
ఈ శునకము = ఈ కుక్కను
విడ్వన్ = విడువను
సూరినుతుండు = బుద్ధిమంతులచే (పండితులచే) స్తుతింపబడిన
నీకు = నీకు
అర్హమే = తగునా (పంతం తగునా)

భావము :
ప్రజలందరూ ప్రస్తుతించే పుణ్యకార్యాలు చేశావు. ఫలితంగా దైవభారాన్ని పొందనున్నావు. అటువంటిది ఇలా కుక్క కొరకు దైవత్వాన్ని వదులుకుంటానంటున్నావు ఇది ఏమంత మంచి పని. ద్రౌపదిని, భీమార్జునులను, నకుల, సహదేవులను కూడా వదులుకున్న సువ్రతుడవే ! కానీ కుక్కను మాత్రం వదలనంటున్నావు. బుద్ధిమంతులచే స్తుతించబడే నీకు పంతగించటం తగునా అన్నాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 25.
సీ. అన విని ధర్మజుం డఖిలలోకములకుఁ
మన బతివి ధర్మమునకుఁ బ్రభువ విట్టి
నీ కంటే నెఱుఁగుదునే సదసత్రకా
రము లట్లుఁ గాక వాదము మహాత్ము
లయిన వారలతోడ నగునె చేయంగ నై
నను విన్నవింపఁ దగిన తెఱుంగు
విన్నవించుట దోష విధముగా
దనియెడు బుద్ధిఁ జేసెద నేను బూని విన్న
పంబు భీమ ముఖ్యులును ద్రౌపదియుఁ జచ్చి
రేను వారల విడువక యేడ్చుచున్న
వత్తురే తోడ వచ్చి చావని శునకము
విడువ కుండుట తప్పుగా నుడువఁదగునె
జవాబు:
ప్రతిపదార్థం :
అనవిని = ఇంద్రుడు పలకగా విని
ధర్మరాజుండు = ధర్మరాజు
అభిలలోకములకున్ = సర్వ లోకాలకు
పతివి = అధిపతివి
ధర్మమునకు = ధర్మానికి కూడా
ప్రభువవు = ప్రభువువి
ఇట్టి = ఇటువంటి
నీకంటెన్ = నీకన్నా, నిన్ను మించి
ఎఱుఁగుదునే = జ్ఞానవంతుడిని కను
సదసత్సకారము = ధర్మము, అధర్మములు
అట్లుఁగాక = అలాకాక
వాదము = వాదించుట
మహాత్ములైన వారలతోడన్ = మహాత్ములైన వారితో
చేయంగ = చేయ
అగునే = వచ్చునా
ఐనను = అయినా
విన్నవింపఁదగిన = మనవి చేయదగింది
తగిన తెఱంగు = తగిన విధంగా
విన్నవించుట = చెప్పుకొనుట
దోషవిధము = దోషం
కాదనియెడు = కాబోదనే
బుద్ధి = ఆలోచనతో
నేను = నేను (ధర్మరాజు)
విన్నపంబు = విన్నపం
చేసెద = చేస్తున్నాను
భీమ = భీముడు
ముఖ్యులును = ఇతర సోదరులు
ద్రౌపదియున్ = ద్రౌపది
చచ్చిరి = చనిపోయారు
ఏను = నేను
వారల = వారిని
విడువక = విడువకుండా
ఏడ్చుచున్న = శోకిస్తూ ఉంటే
తోడ = నాతోడ తిరిగి
వత్తురే = వస్తారా !
తోడవచ్చి = నాతోవచ్చి
చావని = వారివలె చావని
శునకము = కుక్కను
విడవకుండుట = విడచిపెట్టనని అనుట
తప్పుగా = దోషమని
నుడువదగునె = పేర్కొనవచ్చునా

భావము :
ఇంద్రుడు పలుకగా విని ధర్మరాజు మహేంద్రా ! అఖిలలోకాలకు ప్రభువ్వి నీవు. ధర్మానికి నీవే ప్రభువ్వి. అలాంటి నీతో ధర్మాన్ని గూర్చి చెప్పటానికి నేనెంతటి వాణ్ణి ! మహాత్ములైన వారితో వాదం చేయవచ్చునా ! అయినా మనవి చేయదగింది, మనవి చేయటం దోషం కాదని నేను విన్నపం చేస్తున్నాను.

ద్రౌపది, భీముడు, ఇతర సోదరులు మరణించారు. వారిని విడువకుండా శోకిస్తుంటే నాతో కలిసి వస్తారా ? (రారు), నాతో వచ్చి వారివలె చావని కుక్కను విడచిపెట్టనని అనుట దోషమవుతుందా ! అనేను.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 26.
చ. అనఘ చరిత్ర విన్ము శరణాగతుఁ జేకొన కున్కి శుద్ధ మి
త్రునియెడఁ జేయు ద్రోహము వధూటి వధించుట విపు నర్థముం
గొనుట యనంగఁ గల్గునివి గూడి సమంబగు నాకుఁ జూడ భ
కున నపరాధునిన్ విడుచు దోషముతో నిది యోర్వ వచ్చునే
జవాబు:
ప్రతిపదార్థం :
అనఘ చరిత్ర = నిర్మల చరిత్ర గల దేవా
విన్ము = వినవలసింది
శరణాగతున్ = శరణు కోరిన వారిని
చేకొనకున్కి = రక్షింపకుండుట
శుద్దమిత్రుని = నిజమైన మిత్రుని
ఎడన్ = పట్ల
చేయుద్రోహము = ద్రోహం చేయుట
వధూటి = స్త్రీని
వధించుట = చంపుట
విప్రుని = వేదజ్జానం గలవాని
అర్థముంగొనుట = ధనమును అపహరించుట
అనంగ = అనేవి
కల్గున్ = కలుగును
ఇవిగూడ = ఇవి కూడా
సమంబగు = సమానం కావు
నాకుఁజూడ = నేను ఆలోచిస్తే
భక్తునన్ = భక్తుడిని
అనపరాధిన్ = నిరపరాధిని
విడుచు = వదిలివేయు
దోషముతో – = దోషంతో
ఇది = ఈ దోషాన్ని
ఓర్వవచ్చునే = పోల్చవచ్చునా (పోల్చలేము)

భావము :
నిర్మల చరితా ! శరణు కోరిన వారిని రక్షింపకుండటం, మిత్రునికి ద్రోహం చేయటం, స్త్రీని వధించుట, వేదజ్ఞానం గలవాని ధనాన్ని అపహరించుట అనే దోషాలు కూడా భక్తుడిని నిరపరాధినీ వదులుకొని దోషంతో పోల్చలేము అని నేను భావిస్తున్నాను అని ధర్మరాజు అన్నాడు.

ప్రశ్న 27.
ఉ. కావున నాకకలోకపు సుఖంబటు లుండఁగ నిమ్ము దేవ నీ
భావము నిల్చు నా దెసఁ గృపా భరితంబుగ సారమేయ సం
భావనసేంత దోసముగఁ బట్టమి నాకు వరంబు నీవు వా
మ్మీ వనభూమి నుండెద సవిద్ధ తపంబుల నిన్న కొల్చుచున్
జవాబు:
ప్రతిపదార్థం :
కావున = కావున
దేవ = దేవా
నాకలోకపు = స్వర్గలోకపు
సుఖంబు = సుఖములు
అటులుండగనీమ్ము = అలా ఉండనివ్వండి
ఈ భావము = ఈ విషయం
నిల్పు = మనసు పెట్టండి
నాదెసన్ = నాపై
కృపాభరితంబుగ = దయ నిండిన వారై
సారమేయ = కుక్కని
సంభావనసేంత = వదలలేని అశక్తతను
దోసముగన్ = తప్పుగా
పట్టమి = ఎంచకు
నాకు = నాకు
వరంబునీవు = అలాంటి వరం ఇవ్వండి
నీవుపొమ్ము = మీరు వెళ్ళిరండి
ఈ వనభూమిన్ = ఈ అడవిలోనే
ఉండెద = ఉంటాను
సమిత్థ = వానప్రస్థంలో
తపంబుల = తపస్సు
నిన్న = నిన్నే
కొల్చుచున్ = సేవిస్తూ ఉంటాను.

భావము :
కావున దేవా ! నాకు స్వర్గలోకపు సుఖప్రాప్తి అలా ఉండనివ్వండి. నా మాట మీద మనసు పెట్టండి. నాపై తమకు గల దయతో కుక్కని వదలలేని అశక్తతను తప్పుగా ఎంచకుండా నాకు వరాన్ని అనుగ్రహించండి చాలు. తాము వెళ్ళిరండి. నేను .ఈ అడవిలోనే వానప్రస్థంలో వుండి తపస్సు చేసుకుంటూ తమనే సేవిస్తూ ఉంటాను.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

ప్రశ్న 28.
వ. అని పుయిలోడక పలికెఁ బౌరవోత్తమా యాకర్ణింపుము.
జవాబు:
ప్రతిపదార్థం :
అని = అని
పుయిలోడక = మొహమాటం లేకుండా
పలికెన్ = పలికాడు
పౌరవోత్తమా = జనమే జయ మహారాజా
ఆకర్షింపుము = వినుము

భావము :
అని మోహమాటం లేకుండా ధర్మరాజు పలికాడు.

ప్రశ్న 29.
సీ. అట్లతి దృఢనిశ్చయంబుగఁ బలికిన
తనపుత్రుఁ గనుఁగొని ధర్ముఁడధిక
సంప్రమోదముఁ బొంది సారమేయాకృతిం
బాసి తానాత్మ రూపంబుఁ దాల్చి
పరమ సంభ్రమకృత ప్రణతియు నానంద
భరితుండునగు నానృపాలు తోడ
నీ పుణ్యవృత్తంబు నిర్మల మేధయు
నఖిలభూతంబులయందుఁ గలుగు

తే. దయయు నాదు చిత్తముఁ బ్రమదమునఁ దేల్చె
వత్స భూలోకమున నిట్టివారుఁ గలరె
తొల్లియును ద్వైత వనమున దోష దూర
మయిన నీ మనమున తెఱంగరసి నాఁడ
జవాబు:
ప్రతిపదార్థం :
అట్లు + అతి = అలా అత్యంత
దృఢనిశ్చయంబుగఁ = దృఢ నిశ్చయంతో
పలికిన = పలకటంతో
తన పుత్రున్ = తన కుమారుని
కనుఁగొని = చూసి
ధర్మఁడు = ధర్మదేవత
అధిక = అత్యంత
సంప్రమోదమున్ = ఆనందాన్ని
పొంది = పొందాడు
సారమేయాకృతిన్ = కుక్క రూపాన్ని
సాసి = వదిలి
తానాత్మరూపంబు = తన నిజస్వరూపాన్ని
దాల్చి = పొందాడు
పరమ = అత్యంత
సంభ్రమకృత = ఆశ్చర్యచకితుడై
ప్రణతియున్ = నమస్కరించి
ఆనంద భరితుండన్ + అగున్ = ఆనందభరితుడయ్యాడు
ఆనృపాలు = ఆ ధర్మరాజు
తోడ = తో
నీపుణ్యవృత్తంబు = నీ పుణ్య చరిత్ర
నిర్మలమేధయు = నిర్మలమైన చిత్తవృత్తి
అఖిలభూతములయందు = అన్ని ప్రాణులయందు
కలుగుదయయు = నీకున్న ప్రేమ
నాదుచిత్తమున్ = నా మనసును
ప్రమదమునన్ = ఆనందంతో
తేల్చె = ముంచెత్తాయి
భూలోకమునన్ = భూలోకంలో
ఇట్టివారు = ఇటువంటివారు
కలరె = ఉన్నారా (లేరు)
వత్స = కుమారా
తొల్లియును = ఇంతకు పూర్వం
ద్వైతవనమున = ద్వైత వనంలో
దోషదూరమయిన = ఎటువంటి లోపాలు లేని
నీ మనమున = నీ మనసును
తెఱంగరసినాడ = పరీక్షించాను

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

భావము:
అలా ధర్మరాజు దృఢ నిశ్చయంతో పలుకగా తన పుత్రుని మీద అనురాగంతో ధర్మదేవత అప్పటి వరకు తను ధరించిన శునక స్వరూపాన్ని వదిలి స్వస్వరూపంలో ప్రత్యక్షమైనాడు. ఆయనను చూసి ఆశ్చర్యపోయిన ధర్మరాజు అత్యంత ఆనందంతో ఆయనకు ప్రణామం చేశాడు.. ధర్మదేవత, ధర్మరాజా నీ పుణ్య చరిత్ర, నిర్మలమైన చిత్తవృత్తి, అన్ని ప్రాణాల యందు సమదృష్టి నా మనసును ఆనందంలో ముంచెత్తాయి. ఈ సర్వ భూలోకంలో నీవంటివాడు మరొకడు లేడంటే లేడు. ఇంతకు పూర్వమే ద్వైతవనంలోను, లోపరహితమైన నీ మనసును పరీక్షించాను అన్నాడు.

కవి పరిచయం

ఈ పాఠ్యభాగం ఆంధ్ర మహాభారతంలో తిక్కనచే రచింపబడిన మహాప్రస్థాన పర్వంలోనిది. కవిత్రయంలో ఒకరైన తిక్కన 13వ శతాబ్దానికి చెందివ కవి. ఇంటి పేరు కొట్టరువు. సోమ యజ్ఞం చేసి సోమయాజి అయ్యాడు. తిక్కన నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి ఆస్థాన కవి. తొలుత నిర్వచనోత్తర రామాయణాన్ని రచించి మనుమసిద్ధికి అంకితమిచ్చాడు.

సంస్కృత వ్యాసభారతంలోని నాల్గవదయిన విరాటపర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకూ 15 పర్వాలను ఒంటి చేతితో జాతికందించాడు. భారతాన్ని ఆంధ్రావళి మోదం పొందేటట్లు రచించి, హరిహరనాధునికి అంకితమిచ్చాడు.

కేతన తన దశకుమార చరిత్రను తిక్కనకు అంకితమిస్తూ, తిక్కన వంశ వివరాలను, కవిత్వ విశేషాలను, వ్యక్తిత్వ గుణాలను కొన్నింటిని తెలిపాడు. తిక్కన మహాభారతాన్నే కాక ‘విజయసేనము’ అనే ప్రబంధాన్ని, ‘కవి వాగ్భంధము’ అనే ఛందోగ్రంథాన్ని, కృష్ణశతకాన్ని రచించాడని అంటారు. అయితే అది అలభ్యం. తిక్కన సోమయాజికి ‘కవిబ్రహ్మ’, ‘ఉభయ కవి మిత్రుడు’ అనే బిరుదులున్నాయి. తిక్కన కవిత్వంలో అల్పాక్షరములలో అనల్పార్ధ రచన కనిపిస్తుంది. నాటకీయత తిక్కన ప్రధాన కవితా లక్షణం .

పాఠ్యభాగ సందర్భం

కురుక్షేత్ర యుద్ధవిజేత అయిన ధర్మరాజు హస్తినాపుర రాజ్యపాలన సాగిస్తున్నాడు. కాలంతో ప్రజల మనస్తత్వాలలో వచ్చిన మార్పును గమనించాడు. కొంతకాలానికి మన మనికి (అవసరం) తీరిపోయింది. ఉత్తమగతిని పొందుటకు మహాప్రస్థానమే అత్యుత్తమ సాధనంగా తోచింది. ప్రజలను పిలిచి తమకు మారుగా పరీక్షిత్తును రాజుగా స్వీకరించమని వారికి నచ్చచెప్పి, పరీక్షిత్తుని రాజుచేసి బరువు, బాధ్యతల నుండి విడుదల పొందాడు. రాజభోగాలు వదిలాడు. నారదుస్తులు ధరించాడు. తమ్ముళ్ళు, ద్రౌపది ధర్మరాజును అనుసరించారు. వారికి తోడుగా ఒక శునకము వచ్చింది.

ఇలా పాండవులు ఉపవాస దీక్షాపరులై హస్తినాపురం దాటి ఎంతో దూరం ప్రయాణించారు. అలా మార్పు సముద్రానికి చేరుకొనగా, అపుడు వారి ముందు దిక్కులు ఆవేశం పిక్కటిల్లేలా అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అగ్నిదేవుడు అర్జునులు నీవు గాండీవాన్ని విడిచి పెట్టలేదు. దానిని దేవకార్యం కోసం వరుణుని నుండి తెచ్చి ఇచ్చాను. దానితో నీకు పని తీరిపోయింది. కనుక దానిని వరుణునికి ఇమ్మని చెప్పాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 1 ధర్మ పరీక్ష

అర్జునుడు అలాగే చేస్తానని గాండీవాన్ని సముద్రం పాలు చేశాడు. అగ్నిదేవుడు అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత భూమికి ప్రదక్షిణంగా దక్షిణానికి మరల దక్షిణ సముద్రాన్ని చేరుకున్నారు. అక్కడి నుండి పడమటి వైపుకు మరల పశ్చిమ సముద్రతీరం చేరి, అక్కడి నుండి ఉత్తరదిశకు మరల ద్వారకను దాటికి హిమాలయాలు చేరుకొన్న సందర్భం నుంచి మన పాఠ్యాంశం ప్రారంభమవుతుంది.

పాఠ్యభాగ సంగ్రహం

యోగసాధన పరులయిన వారు తమ ప్రయాణంలో ఒక్కొక్కరు తమ శరీరాలు విడిచిపెట్టారు. ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీమసేనుడు క్రమంగా నేలకొరిగారు. భీముడు అడిగిన ప్రకారం భీమునితో సహా అందరి పతన హేతువులను – ధర్మరాజు వివరించాడు. చివరకు కుక్క మాత్రమే ధర్మరాజుకు తోడుగా నిలిచింది.

ఇంతలో అమరావతి పురాధీశుడు ఇంద్రుడు వచ్చాడు. తన లోకానికి రమ్మని ధర్మరాజుని కోరాడు. అపుడు ధర్మరాజు మాటలలో సోదరప్రేమ మాత్రమే కాక, తోటి బాటసారులుగా వారి పట్ల చూపిన ఆదరణ వ్యక్తమయింది. తనువును వదిలిన ద్రౌపదిని, తమ్ముళ్ళను స్వర్గంలో చూడవచ్చని, తనతో రమ్మని ఆహ్వానించాడు.

శునకం విషయంలో వీరిద్దరికీ ధర్మ చర్చ జరిగింది. దేవాధిపతి ఇంద్రుడు, సమవర్తి అయిన యమధర్మరాజు పెట్టిన పరీక్షలో ధర్మరాజు నిలిచాడు. శునకం యమధర్మరాజుగా మారి ధర్మరాజుని ఋజువర్తనను కొనియాడింది. ఇంద్రాది దేవతలందరూ ధర్మరాజును దివ్యరథంలో స్వర్గలోకానికి తీసుకెళ్ళారు.

పాఠ్యభాగ ఉద్దేశ్యం

ఈ పాఠ్యభాగంలో భీముని ప్రశ్నలు – ధర్మరాజు సమాధానాలు విద్యార్థులకు ఉత్సుకత, ఆసక్తిని కలిగిస్తాయి. అంతేకాక వారి మానసిక వికాసానికి మూర్తిమత్వం ఇనుమడించడానికి దోహదపడతాయి. పాండవుల పతన కారణాలైన లోపాలు ఎవరిలోనూ ఉండరాదని ధర్మప్రవర్తనే మనిషికి ఉత్తమగతిని చూపిస్తుందని తెలియ
జేయడం ఈ పాఠ్యభాగం ఉద్దేశం.

Leave a Comment