Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material Intermediate 1st Year Telugu Grammar సమాసాలు Questions and Answers.
AP Intermediate 1st Year Telugu Grammar సమాసాలు
వేరు వేరు అర్థాలు కలిగిన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే ‘సమాసం’ అంటారు. దీనినే పరవస్తు చిన్నయసూరి బాలవ్యాకరణంలో “సమర్థంబులగు పదంబులేక పదంబగుట సమాసంబు” అని నిర్వచించారు.
ఉదా : ‘రాజు’, ‘ఆజ్ఞ’ అనేవి రెండు వేరు వేరు పదాలు. వాటికి వేరు వేరు అర్థాలున్నాయి. ఆ రెండు పదాలు కలిసి ‘రాజాజ్ఞ’ అనే సమాసం ఏర్పడుతుంది.
విగ్రహ వాక్యం :
రెండు పదాలను సమాసంగా చేసినపుడు, ఆ సమాసాల మధ్య లోపించిన విభక్తి ప్రత్యయాలను చేర్చి, సమాసం యొక్క అర్థాన్ని వివరించడాన్ని ‘విగ్రహ వాక్యం’ అంటారు.
ఉదా : ‘రాజాజ్ఞ’ అన్న సమాసానికి ‘రాజు యొక్క ఆజ్ఞ’ అనేది విగ్రహ వాక్యం .
పూర్వపదం :
సమాసంలోని మొదటి పదాన్ని ‘పూర్వపదం’ అంటారు.
ఉదా : రాజాజ్ఞ అనే సమాసంలో ‘రాజు’ అనేది పూర్వపదం.
ఉత్తరపదం :
సమాసంలోని రెండవ పదాన్ని ‘ఉత్తర పదం’ లేదా ‘పరపదం’ అంటారు. పై ఉదాహరణలో ‘ఆజ్ఞ’ అనేది ‘ఉత్తర పదం’ లేదా ‘పరపదం’. – సమాసాలు ప్రధానంగా మూడు రకాలు.
- తత్పురుషం
- బహుజొహి
- ద్వంద్వం.
1) తత్పురుషం :
ఉత్తర పదం యొక్క అర్థం ప్రధానంగా గల సమాసం తత్పురుషం. ఇది వ్యధికరణం, సమానాధికరణం అని రెండు రకాలు.
1. వ్యధికరణం :
ద్వితీయాది విభక్తులకు మీది పదంతో చేసే సమాసాన్ని ‘వ్యధికరణం’ అంటారు. ఇదే తత్పురుష సమాసం. ఇవి ప్రథమా తత్పురుషం, ద్వితీయా తత్పురుషం, తృతీయా తత్పురుషం, చతుర్థి తత్పురుషం, పంచమీ తత్పురుషం, షష్ఠీ తత్పురుషం, సప్తమీ తత్పురుషం మొదలైనవి.
అ. ప్రథమా తత్పురుష సమాసం :
ఉదా :
- మధ్యాహ్నం – అహ్నము యొక్క మధ్య భాగం.
- పూర్వకాలం – కాలము యొక్క పూర్వం భాగం.
- నడిరేయి – రేయి యొక్క నడిమి భాగం.
ఆ. ద్వితీయా తత్పురుష సమాసం :
ఉదా :
- తోబుట్టువులు – తోడను పుట్టినవారు.
- కోదండధరుడు – కోదండమును ధరించినవాడు.
ఇ. తృతీయా తత్పురుష సమాసం :
ఉదా :
- పుష్పవర్షం – పుష్పములతో వర్షం.
- ధనాధిపుడు – ధనము చేత అధిపుడు.
ఈ. చతుర్థి తత్పురుష సమాసం :
ఉదా :
- వేటకుక్కలు – వేట కొరకు కుక్కలు.
- యూపదారువు – యూపం కోసం దారువు.
ఉ. పంచమీ తత్పురుష సమాసం :
ఉదా :
- ఆనంద భాష్పములు – ఆనందం వలన భాష్పములు.
- పాపఫలంబు – పాపం వలన ఫలంబు.
ఊ. షష్ఠీ తత్పురుష సమాసం :
ఉదా :
- మృగశ్రేణి – మృగముల యొక్క శ్రేణి.
- కపాల మోక్షం – కపాలమునకు మోక్షం.
ఋ. సప్తమీ తత్పురుష సమాసం :
ఉదా :
- కార్యశూరులు – కార్యమందు శూరులు.
- రౌరవబాధలు – రారవము నందలి బాధలు.
బూ. నజ్ తత్పురుష సమాసం :
విగ్రహ వాక్యంలో ‘కానిది’, ‘లేనిది’ అనే వ్యతిరేక అర్ధాన్ని కలిగి ఉంటే దాన్ని ‘నఃణ్ తత్పురుష సమాసం’ అంటారు.
ఉదా :
- అసత్యము – సత్యము కానిది.
- అభాగ్యము – భాగ్యము లేనిది.
2. సమానాధికరణం :
విశేషణానికి విశేష్యంతో జరిగే సమాసం సమానాధికరణం. ‘విశేష్యం’ అనగా నామవాచకం. ఈ సమాసాన్నే ‘కర్మధారయం’ అని కూడా అంటారు. ఇవి విశేషణ పూర్వపదం, విశేషణ ఉత్తర పదం, విశేషణ ఉభయ పదం, ఉపమాన పూర్వ పదం, ఉపమాన ఉత్తర పదం అని ఐదు రకాలు.
అ. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం :
ఈ సమాసంలో విశేషణం పూర్వ పదంగా ఉంటుంది. ఉత్తర పదంలో విశేష్యం ఉంటుంది.
ఉదా :
- నల్లపూసలు – నల్లనివైన పూసలు.
- క్రొత్త నెత్తురు – క్రొత్తదైన నెత్తురు.
ఆ. విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం :
దీనిలో విశేషణం ఉత్తర పదంలో ఉంటుంది. పూర్వ పదంలో నామవాచకం ఉంటుంది.
ఉదా :
- పురుషవరుడు – శ్రేష్ఠుడైన పురుషుడు.
- రాక్షషాధముడు – అధముడైన రాక్షసుడు.
ఇ. విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం :
ఈ సమాసంలో పూర్వోత్తర పదాలు రెండూ విశేషణాలై ఉంటాయి.
ఉదా :
- ధైర్య ఫైర్యములు – ధైర్యమునూ, స్టైర్యమునూ లేదా ధైర్యము మరియు స్టైర్యము.
- చిన్న పెద్దలు – చిన్నలునూ, పెద్దలునూ లేదా చిన్నలు మరియు పెద్దలు.
ఉ. ఉపమాన పూర్వపద, కర్మాధారయ సమాసం :
దీనిలో ఉపమానం పూర్వ పదంలో ఉంటుంది. ఉత్తర పదంలో నామవాచకం ఉంటుంది. ఉపమానం అనగా పోల్చే వస్తువు.
ఉదా :
- చిగురుకేలు – చిగురులాంటి కేలు.
- కమలనయనాలు – కమలము వంటి నయనాలు.
ఊ. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం :
దీనిలో ఉపమానం ఉత్తర పదంలోనూ, నామవాచకం పూర్వపదంలోనూ ఉంటాయి.
ఉదా :
- ముఖ కమలము – కమలము వంటి ముఖము.
- పాదాంబుజములు – అంబుజముల వంటి పాదాలు.
3. ద్విగు సమాసం :
‘సంఖ్యాపూర్వకం ద్విగువు’. ద్విగు సమాసంలో పూర్వ పదంలో సంఖ్యావాచకాలు, ఉత్తర పదంలో నామవాచకాలు ఉంటాయి.
ఉదా :
- నలుదిక్కులు – నాలుగు అను సంఖ్యగల దిక్కులు.
- ఆరుకోట్లు – ఆరు అను సంఖ్యగల కోట్లు.
4. సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం :
ఈ ‘సమాసం పూర్వపదంలో సంజ్ఞా నామవాచకాన్ని కలిగి ఉంటుంది.
ఉదా :
- తుంగభద్రానది – తుంగభద్ర అను పేరుగల నది.
- హిమాచలం – హిమము అను పేరుగల అచలం (కొండ).
5. అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం :
దీనిని ‘రూపక సమాసం’ అని కూడా అంటారు. ‘అవధారణం’ అంటే ‘నిర్ధారించుట’ అని అర్థం, ‘రూపకం’ అంటే ఆరోపించటం అని అర్ధం. ఉపమాన ధర్మాన్ని ఉపమేయమందు ఆరోపించటాన్ని ‘రూపక సమాసం’ అంటారు.
ఉదా :
- ధైర్యలత – ధైర్యము అనెడి లత.
- ప్రకృతి రంగము – ప్రకృతి అనెడి రంగము.
2) బహుప్రీహి సమాసం :
‘అన్య పదార్ధ ప్రధానం బహుజొ హీ’ అని నిర్వచనం. అనగా సమాస పదంలోని అర్థం కాకుండా ఇతర (అన్య) అర్థం స్ఫురించడమే బహుజొహి, దీని విగ్రహ వాక్యంలో కలది; కలవాడు అనే రూపాలను మనం గమనించవచ్చు.
ఉదా :
- దశాననుండు – పది ముఖములు కలవాడు.
- కంఠేకాలుడు – కంఠమందు విషం కలవాడు.
3) ద్వంద్వ సమాసం :
‘ఉభయపదార్థ ప్రధానం ద్వంద్వం’. అంటే సమాస పదంలో ఇచ్చిన రెండు పదాల యొక్క అర్థాలు ప్రధానంగా కలిగింది. ఈ సమాసంలోని రెండు పదాలూ నామవాచకాలై ఉంటాయి.
ఉదా :
తల్లిదండ్రులు – తల్లీ, తండ్రీ (లేక) తల్లి మరియు తండ్రి (లేక) తల్లియును, తండ్రియును. మూడు విగ్రహవాక్యాలు సరైనవే.
శార్దూలక్రోడములు – శార్దూలము మరియు క్రోడము.
గమనిక :
గుర్తు ఉన్న పదాలు వాచకంలో లేనివని గ్రహించాలి.