AP Inter 1st Year Telugu Grammar సంధులు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material Intermediate 1st Year Telugu Grammar సంధులు Questions and Answers.

AP Intermediate 1st Year Telugu Grammar సంధులు

‘సంధి’ అనగా కలయిక. సంధిలో రెండు పదాలు ఉంటాయి. మొదటి పదాన్ని పూర్వపదమనీ, రెండవ పదాన్ని పరపదం లేదా ఉత్తరపదమనీ అంటారు. చిన్నయసూరి ‘బాలవ్యాకరణం’లో “పూర్వ పరస్వరంబులకు పరస్వరం బేకాదేశమగుట సంధి” అని నిర్వచించారు.

స్వరమనగా అచ్చు. పూర్వ స్వరం అనగా పూర్వ పదంలో చివర ఉండే అచ్చు. అట్లే పర స్వరం అంటే పర పదం మొదట్లో ఉండే అచ్చు. సంధి జరిగినపుడు పూర్వ స్వరం లోపించి దాని స్థానంలో పర స్వరం ఏకాదేశంగా వస్తుందని సూత్రార్థం.

సంధులు ప్రధానంగా రెండు రకాలు.

  1. తెలుగు సంధులు.
  2. సంస్కృత సంధులు.

1) తెలుగు సంధులు : తెలుగు పదాల మధ్య జరిగేవి తెలుగు సంధులు. ఇవి అత్వ, ఇత్వ, ఉత్వ, యడాగమ, సరళాదేశ, గ, స, డ, ద, వాదేశం మొదలైనవి.

1. అత్వ సంధి :
“అత్తునకు సంధి బహుళముగానగు”. ‘అత్తు’ అనగా హ్రస్వమైన ‘అ’ కారం. బహుళము అనగా సంధి నాలుగు రూపాలలో ఉండటం.

  1. ప్రవృత్తి – సంధి తప్పనిసరిగా ఉండటం. దీనినే వ్యాకరణ పరిభాషలో ‘ప్రవృత్తి’ అంటారు.
  2. ‘అప్రవృత్తి’ – అంటే సంధి జరగక పోవడం.
  3. వైకల్పికం లేదా విభాష – అనగా సంధి జరగ వచ్చు. ఒక్కోసారి జరగక పోవచ్చు.
  4. అన్యకార్యం – అనగా ఒక వ్యాకరణ కార్యం జరగవలసి ఉండగా మరో వ్యాకరణ కార్యం జరగడం.

AP Inter 1st Year Telugu Grammar సంధులు

ఉదా :

  1. వంట + ఆముదం = వంటాముదం (ప్రవృత్తి)
  2. దూత + ఇతడు = దూతయితడు (అప్రవృత్తి)
  3. వేడుక + ఎల్ల = వేడుకెల్ల / వేడుకయెల్ల (విభాష)
  4. ఒక + ఒక = ఒకానొక (అన్యకార్యం )

2. ఇత్వసంధి :
“ఏమ్యాదులందలి యిత్తునకు సంధి వైకల్పికముగానగు”. ‘ఇత్తు’ అనగా హ్రస్వమైన ‘ఇ’ కారం. ఏమ్యాదులు అనగా ఏమి, అది, ఇది, అవి, ఇవి, మణి, కి షష్ఠి మొదలైన రూపాలు. వైకల్పికం అనగా సంధి జరిగితే ఒక రూపం, జరగకుంటే మరో రూపం రావడం.
ఉదా :

  1. ఏమి + అని = ఏమని సంధి జరగకపోతే యడాగమం వచ్చి ‘ఏమియని’
  2. జగతిని + ఎందు = జగతినెందు
  3. ఎఱిగించి + ఇతడు = ఎఱిగించి యితడు (జరగలేదు – ఇక్కడ సంధి

క్వార్థంబైన యిత్తునకు సంధి లేదు. ‘క్వార్థము’ అనగా భూతకాలపు అసమాపక క్రియ. కాబట్టి చివరి పదం ‘యడాగమసంధి’ అనే చెప్పాలి.

3. ఉత్వ సంధి :
“ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు”.
ఉదా :

  1. శోకము + ఏల = శోమమేల
  2. ఇట్లు + అనియె = ఇట్లనియె
  3. ఒకడు + ఐనను = ఒకడైనను
  4. కపాలము + ఒక్కటి = కపాలమొక్కటి

AP Inter 1st Year Telugu Grammar సంధులు

4. యడాగమ సంధి :
“సంధిలేనిచోట స్వరంబుకంటెఁ బరంబైన స్వరంబునకు యడాగమంబగు.”
ఉదా :

  1. నీ + అనుజులు = నీయనుజులు
  2.  రోదసి + ఎల్ల = రోదసియెల్ల

5. గ, స, డ, ద, వా దేశ సంధి :
“ప్రథమ మీది పరుషములకు గ, స, డ, ద, వ లు బహుళముగానగు”.

‘ప్రథమ’ మీది అనగా ప్రథమా విభక్తి ప్రత్యయాలైన డు, ము, వు, లపై వచ్చిన పదాలు; వచ్చి లోపించినవి, ఉప విభక్తులైన ఇ, టి, తి వర్ణాలపై వచ్చిన క, చ, ట, త, పలకు గ, స, డ, ద, వ లు బహుళంగా వస్తాయి.
ఉదా :

  1. అట్లు + కావున = అట్లుగావున
  2. నగరంబు + చొచ్చి = నగరంబుసొచ్చి
  3. నీవు + టక్కరి = నీవుడక్కరి
  4. రూపంబు + తాల్చి = రూపంబుదాల్చి
  5. బలి + పెట్టి = బలివెట్టి

6. ద్రుత ప్రకృతిక సంధి. (సరళా దేశ సంధి) :
(అ) “ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు”.
‘ద్రుతము’ అనగా ‘న’ కారం. ద్రుతం చివరగల పదాలను ద్రుత ప్రకృతికాలు అంటారు. పరుషములు అనగా వర్గ ప్రథమాక్షరాలు (క, చ, ట, త, ప). సరళములు అనగా వర్గ తృతీయాక్షరాలు (గ, జ, డ, ద, బ).

(ఆ) “ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు, సంశ్లేషలు విభాషనగు”. ‘ఆదేశము’ అనగా ఒక వర్గాన్ని తొలగించి మరో వర్ణం రావడం. ఇక్కడ మొదట ఉన్న పరుషాలను తొలగించి వచ్చి చేరిన సరళాలు ఆదేశ సరళాలు. బిందువు అనగా అనుస్వారం. అది పూర్ణానుస్వారం కావచ్చు. ‘అర్థానుస్వారం కావచ్చు. ‘సంశ్లేష’ అంటే మీది హల్లుతో కూడుకొని ఉన్నరూపం.
ఉదా : ఛ, న్దు, న్ద మొదలైనవి. విభాష కాబట్టి ఏ రూపమైనా రావచ్చు.
ఉదా :

  1. డబ్పిన్ + కూలె = కప్పింగూలె
  2. తాల్మిన్ + చేసి = తాల్మిఁజేసి
  3. చేసెన్ + టక్కులు = చేసిండక్కులు
  4. నుడువన్ + తగునే = నుడువందగునె
  5. తోడన్ + పుట్టువు = తోడంబుట్టువు

AP Inter 1st Year Telugu Grammar సంధులు

2) సంస్కృత సంధులు :
సంధిలోని రెండు పదాలూ సంస్కృత భాషకు చెందినవైతే దానిని సంస్కృత సంధి అంటారు. వీటిలో ముఖ్యంగా మనం నేర్చుకోవలసినవి

  1. సవర్ణదీర్ఘ సంధి
  2. గుణ సంధి
  3. వృద్ధి సంధి
  4. యణాదేశ సంధి.

1. సవర్ణదీర్ఘ సంధి :
“అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాటి దీర్ఘములు ఏకాదేశముగా వచ్చును.” సవర్ణము అనగా అదే వర్ణము. ఉదా : ‘అ’ కు అ, ఆ, ‘ఇ’కి ఇ, ఈ లు సవర్ణాలు .
ఉదా :

  1. రూప + అతిశయం = రూపాతిశయం
  2. మహా + ఆత్మ = మహాత్మ
  3. కవి + ఇంద్రుడు = కవీంద్రుడు
  4. మృగ + ఆదులు = మృగాదులు
  5. భాను + ఉదయం = భానూదయం
  6. మాతృ + ఋణం = మాతణం

2. గుణ సంధి :
‘అ’కారమునకు ఇ, ఉ, ఋలు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ అనునవి ఏకాదేశమగును, ఏ, ఓ, అర్లను గుణములు అంటారు. ‘అకారము’ అనగా హ్రస్వమైన ‘అ’ లేదా దీర్ఘం (ఆ) ఏదైనా కావచ్చు.
ఉదా :

  1. నయన + ఇంద్రియం = నయనేంద్రియం
  2. హిత + ఉక్తులు = హితోక్తులు
  3. మహా + ఋషి = మహర్షి

AP Inter 1st Year Telugu Grammar సంధులు

3. వృద్ధి సంధి :
‘అ’కారమునకు, ఏ, ఐలు పరమైతే ‘ఐ’ కారము, ఓ, ఔలు పరమైతే ‘ఔ’ కారము ఏకాదేశంగా వస్తాయి.
ఉదా :

  1. ఆత్మ + ఏక = ఆత్మైక
  2. అష్ట . + ఐశ్వర్యం = అప్లైశ్వర్యం
  3. మేఘ + ఓఘము = మేఘము
  4. వన + ఔషధి = వనౌషధి

4. యణాదేశ సంధి :
ఇ, ఉ, ఋలకు అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమంగా య, వ, రలు ఏకాదేశమగును. య, వ, రలను ‘యజ్ఞులు’ అంటారు.
ఇ + అసవర్ణాచ్చు = య్
ఉ + అసవర్ణాచ్చు = వ్
ఋ + అసవర్ణాచ్చు = ర్
ఉదా :

  1. అతి + అంత = అత్యంత
  2. ధురి + ఆత్మ = ధుర్యాత్మ
  3. మధు + అరి = మధ్వ రి
  4. పితృ + అంశ = పిత్రంశ

గమనిక :
గుర్తు ఉన్న పదాలు వాచకంలో లేనివని గ్రహించాలి.

Leave a Comment