These AP 9th Physical Science Important Questions and Answers 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం will help students prepare well for the exams.
AP Board 9th Class Physical Science 7th Lesson Important Questions and Answers వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం
9th Class Physical Science 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
వాహనాలలో రియర్ వ్యూ మిర్రర్ గా ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు?
జవాబు:
వాహనాలలో రియర్ వ్యూ మిర్రర్ గా కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు.
ప్రశ్న 2.
నాభ్యాంతరం, వక్రతా వ్యాసార్ధముల మధ్య సంబంధాన్ని వ్రాయండి.
జవాబు:
నాభ్యాంతరానికి రెట్టింపు దూరమే వక్రతా వ్యాసార్ధము. (R = 21)
ప్రశ్న 3.
ఇచ్చిన పటాన్ని పూర్తిగా గీసి, ప్రతిబింబాన్ని గీయండి.
జవాబు:
ప్రశ్న 4.
5 సెం.మీ. వక్రతా వ్యాసార్థం గల కుంభాకార దర్పణం ముందు 5 సెం.మీ. దూరంలో 1 సెం.మీ. ఎత్తు గల వస్తువును ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబాన్ని కిరణ చిత్రం ద్వారా చూపండి.
జవాబు:
ప్రశ్న 5.
దర్పణ సూత్రంలోని వస్తుదూరం విలువ (u) ఎల్లప్పుడూ ఋణాత్మకంగా ఉండటానికి కారణం ఊహించి రాయంది.
జవాబు:
- పతన కాంతి దిశను ధనాత్మకంగా తీసుకోవడం
- వస్తు దూరాన్ని పతన కాంతికి వ్యతిరేక దిశలో ధృవం నుండి వస్తువు వరకు గల దూరంగా పరిగణించడం.
ప్రశ్న 6.
పుటాకార దర్పణం యొక్క ఏ ధర్మం ఆధారంగా సోలార్ కుక్కర్ తయారు చేయబడుతుంది?
జవాబు:
ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చి పుటాకార దర్పణంపై పతనం చెందిన కాంతి కిరణాలు నాభి వద్ద కేంద్రీకరింపబడుతాయి అనే ధర్మం ఆధారంగా సోలార్ కుక్కర్ తయారు చేయబడుతుంది.
ప్రశ్న 7.
కుంభాకార దర్పణ నాభ్యంతరం 50 సెం.మీ. అయిన దర్పణ వక్రతా వ్యాసార్ధం ఎంత?
జవాబు:
కుంభాకార దర్పణ నాభ్యంతరం = (f) = 50 సెం.మీ.
దర్పణ వక్రతా వ్యాసార్ధం = R
∴ f = \(\frac{R}{2}\) ⇒ R = 2f = 2 × 50 = 100 సెం.మీ.
ప్రశ్న 8.
గాలిలో ఉన్న పుటాకార దర్పణ నాభ్యంతరం f. దీనిని నీటిలో పూర్తిగా ముంచినపుడు దాని నాభ్యంతరంలో మార్పు వస్తుందా? రాదా? ఎందుకు?
జవాబు:
ఏ దర్పణమైనా, తనపై పతనమయ్యే కాంతి కిరణం యొక్క పతనకోణం, దాని తలాన్ని తాకే కోణంకు సమానము అగును. కనుకనే దర్పణపు నాభ్యంతరంలో మార్పు రాదు.
ప్రశ్న 9.
ఫుటాకార దర్పణ ఆవర్ధనం – 1. అయితే క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎ) వస్తుస్థానం, ప్రతిబింబి స్థానంలను తెలపండి.
బి) ప్రతిబింబ స్వభావాన్ని చర్చించండి.
జవాబు:
ఎ) పై సందర్భంలో వస్తుస్థానం – వక్రతా కేంద్రం ; ప్రతిబింబ స్థానం – వక్రతా కేంద్రం
బి) తలక్రిందులుగా వున్న, వాస్తవమైన వస్తు పరిమాణంకు సమాన పరిమాణం గల ప్రతిబింబం ఏర్పడును.
ప్రశ్న 10.
ఏ దర్పణాలను గోళాకార దర్పణాలు అంటారు?
జవాబు:
వక్రముగా ఉన్న పరావర్తన తలాలను కలిగి ఉన్నటువంటి దర్పణాలను, అంతర భాగములు గుల్లగా ఉన్న దర్పణాలను “గోళాకార దర్పణాలు” అంటారు.
ప్రశ్న 11.
ఫుటాకార దర్పణం అంటే ఏమిటి?
జవాబు:
గోళాకార దర్పణంలోని అంతర తలం పరావర్తన తలం అయ్యే దర్పణంను “పుటాకార దర్పణం” అంటారు.
ప్రశ్న 12.
కుంభాకార దర్పణం అంటే ఏమిటి?
జవాబు:
గోళాకార దర్పణంలోని బాహ్యతలం పరావర్తన తలం అయ్యే దర్పణంను “కుంభాకార దర్పణం” అంటారు.
ప్రశ్న 13.
దర్పణ నాభ్యంతరం మరియు వక్రతా వ్యాసార్ధానికి గల సంబంధమేమి?
జవాబు:
దర్పణ వక్రతా వ్యాసార్ధం, దాని నాభ్యంతరానికి రెండు రెట్లుండును.
∴ వక్రతా వ్యాసార్ధం (R) = 2 × నాభ్యంతరం (f)
ప్రశ్న 14.
దర్పణ సూత్రాన్ని రాయుము.
జవాబు:
దర్పణ సూత్రం = \(\frac{1}{f}=\frac{1}{u}+\frac{1}{v}\)
ఇక్కడ : f = నాభ్యంతరం, u = వస్తు దూరం, v = ప్రతిబింబ దూరం
ప్రశ్న 15.
ఏ కిరణాలను పారాక్సిల్ కిరణాలంటారు?
జవాబు:
ప్రధానాక్షానికి దగ్గరగా ఉండే కిరణాలను “పారాక్సిల్ కిరణాలు” అంటారు.
ప్రశ్న 16.
వృద్ధీకరణం అంటే ఏమిటి?
జవాబు:
గోళాకార దర్పణం వలన ఏర్పడిన ప్రతిబింబ పరిమాణం, అసలు వస్తు పరిమాణానికి గల నిష్పత్తిని “వృద్ధీకరణం” అంటారు.
ప్రశ్న 17.
మిధ్యా ప్రతిబింబం అంటే ఏమిటి?
జవాబు:
వస్తువు వలన ఏర్పడిన ప్రతిబింబాన్ని తెరపై పట్టలేని ప్రతిబింబమే మిథ్యా ప్రతిబింబం.
ప్రశ్న 18.
నిజప్రతిబింబం అంటే ఏమిటి?
జవాబు:
తెరపై పట్టగల ప్రతిబింబాన్ని “నిజప్రతిబింబం” అంటారు.
ప్రశ్న 19.
తెరపై ఏర్పడని ప్రతిబింబం ఏది?
జవాబు:
మిథ్యా ప్రతిబింబం తెరపై ఏర్పడదు.
ప్రశ్న 20.
దంతవైద్యులు ఎందుకు పుటాకార దర్పణాలు వాడతారు?
జవాబు:
పుటాకార దర్పణాలు దంతాల యొక్క మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. కావున పుటాకార దర్పణాలను వాడతారు.
ప్రశ్న 21.
నాభ్యంతరం 20 సెం.మీ. లుగా గల దర్పణపు వక్రతావ్యాసార్థం ఎంత?
జవాబు:
నాభ్యంతరం = f = 20 సెం.మీ.
వక్రతా వ్యా సార్థం = R = 2f = 2 × 20 = 40 సెం.మీ.
ప్రశ్న 22.
సోలార్ కుక్కర్ లో పాత్రను ఎక్కడ ఉంచుతారు?
జవాబు:
నాభి బిందువు వద్ద ఉంచుతారు.
ప్రశ్న 23.
ఆవర్తనం ఎల్లప్పుడూ ఒకటి కంటే తక్కువగా ఉండే దర్పణం పేరేమిటి?
జవాబు:
కుంభాకార దర్పణం.
ప్రశ్న 24.
ఏ ధర్మం ఆధారంగా దంతవైద్యులు పుటాకార దర్పణాన్ని వాడతారు?
జవాబు:
పుటాకార దర్పణ నాభి వద్ద బల్బునుంచినపుడు, ఆ బల్బు నుండి వచ్చే కాంతికిరణాలు దర్పణంపై పడి, పరావర్తనం చెందిన తరువాత ఒక దృఢమైన సమాంతర కాంతి కిరణ పుంజంగా వెలువడుతుంది. ఈ ధర్మం ఆధారంగానే దంతవైద్యులు పుటాకార దర్పణాన్ని ఉపయోగించి నోటి లోపలి భాగాలను పరిశీలించగలరు.
ప్రశ్న 25.
సోలార్ హీటర్ కుక్కర్ లో ఉపయోగించు సూత్రమేమి?
జవాబు:
అనంత దూరం నుండి వచ్చు కాంతి కిరణాలు, పెద్ద పెద్ద పుటాకార దర్పణాలపై పడి, పరావర్తనం చెందిన తరువాత ప్రధాన నాభిగుండా ప్రసరిస్తాయి (కేంద్రీకరించబడతాయి). ఈ ప్రధాన నాభి వద్ద ఉంచిన వస్తువు, ఈ కిరణాల వల్ల వేడెక్కుతుంది.
ప్రశ్న 26.
పుటాకార దర్పణం ద్వారా మిథ్యా ప్రతిబింబం ఏర్పరచుటకు వస్తువును ఎక్కడ ఉంచాలి? కిరణ చిత్రం గీయుము.
జవాబు:
పుటాకార దర్పణం యొక్క దర్పణ ధృవం (P), ప్రధాననాభి (F)ల మధ్య వస్తువును ఉంచినపుడు మిథ్యా ప్రతిబింబం ఏర్పడును.
ప్రశ్న 27.
“రియర్ వ్యూ మిర్రర్”గా ఏ దర్పణాన్ని వాడుతారు?
జవాబు:
“రియర్ వ్యూ మిర్రర్”గా కుంభాకార దర్పణాన్ని వాడుతారు.
ప్రశ్న 28.
కాంతికిరణాల ‘కేంద్రీకరణ’ అనగానేమి?
జవాబు:
దర్పణంపై పడిన కాంతికిరణాలు, పరావర్తనం చెందిన తరువాత, ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడినట్లయితే, ఆ కిరణాలను కేంద్రీకరణ కిరణాలు అంటారు.
ప్రశ్న 29.
కాంతికిరణాల ‘వికేంద్రీకరణ’ అనగానేమి?
జవాబు:
పరావర్తనం చెందిన కిరణాలు దర్పణం ఆవల ఏదో ఒక బిందువు నుండి వస్తున్నట్లుగా వుంటే ఆ కిరణాలను వికేంద్రీకరణ కిరణాలు అంటారు.
ప్రశ్న 30.
ఒక దర్పణం యొక్క నాభ్యాంతరం 20 సెం.మీ. అయిన ఆ దర్పణ వక్రతా వ్యాసార్థం ఎంత?
జవాబు:
1 = 20 సెం.మీ.
వక్రతా వ్యా సార్థం (R) = 2f = 2 × 20 = 40 సెం.మీ.
ప్రశ్న 31.
ఒక పుటాకార దర్పణంపై పడిన కాంతి కిరణం, పరావర్తనం తరువాత తిరిగి అదే మార్గం గుండా వెళ్ళే సందర్భమేది?
జవాబు:
వక్రతా కేంద్రం గుండా ప్రయాణించి దర్పణంపై పడిన కాంతికిరణం, పరావర్తనం తరువాత తిరిగి అదే మార్గంలో వెనుకకు మరలుతుంది.
ప్రశ్న 32.
ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించి దర్పణంపై పడిన కాంతికిరణం పరావర్తనం తరువాత ఏ మార్గం గుండా ప్రయాణించును?
జవాబు:
పరావర్తన కిరణం ప్రధాన నాభిగుండా ప్రయాణించును.
ప్రశ్న 33.
ఒక గోళాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం 20 సెం.మీ. అయిన దాని నాభ్యంతరం ఎంత?
జవాబు:
వక్రతా వ్యాసార్ధం (R) = 20 సెం.మీ.
నాభ్యంతరం (f) = \(\frac{R}{2}\) = \(\frac{20}{2}\) = 10 సెం.మీ.
ప్రశ్న 34.
ఒక వస్తువు యొక్క నిటారైన, వృద్ధీకృత ప్రతిబింబాన్నిచ్చే దర్పణం ఏది?
జవాబు:
పుటాకార దర్పణం.
ప్రశ్న 35.
ఒక దర్పణం ముందు, 10 సెం.మీ. దూరంలో వస్తువు ఉంచినపుడు 3 రెట్లు వృద్ధీకృత ప్రతిబింబం ఏర్పడింది. అయిన ప్రతిబింబ స్థానమేది?
జవాబు:
ప్రతిబింబ దూరం = – 3 × 10 = -30 సెం.మీ. (దర్పణం వెనుక)
ప్రశ్న 36.
నిత్యజీవితంలో ఫుటాకార దర్పణాల రెండు ఉపయోగాలను పేర్కొనుము.
జవాబు:
- దంతవైద్యులు నోటిలోపలి భాగాలను చూచుటకు
- కార్ల హెడ్ లైట్లలో పరావర్తకాలుగా
ప్రశ్న 37.
కుంభాకార దర్పణాన్ని నిత్యజీవితంలో ఎక్కడ ఉపయోగిస్తారు?
జవాబు:
- వాహనాల ‘రియర్ వ్యూ మిర్రర్’ గాను
- వీధి దీపాలలో పరావర్తకాలుగాను వాడుతారు.
ప్రశ్న 38.
గోళాకార దర్పణాల యొక్క వినూత్న ఉపయోగాన్ని తెలుపుము.
జవాబు:
గోళాకార దర్పణాలను ATM లలో వాడుతున్నారు.
ప్రశ్న 39.
కుంభాకార దర్పణంతో కాగితాన్ని మండించగలమా? ఎందుకు?
జవాబు:
కుంభాకార దర్పణ ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తరువాత వికేంద్రీకరించబడుతాయి. అందువల్ల కాగితాన్ని మండించలేము.
ప్రశ్న 40.
ఎక్కువ పరిధిలో దృశ్యాన్ని అందించగల దర్పణమేది?
జవాబు:
కుంభాకార దర్పణాలు ఎక్కువ పరిధిలో దృశ్యానుభూతిని అందించగలవు. అందువలననే వీటిని వాహనాల ‘రియర్ వ్యూ మిర్రర్’గా వాడుతారు.
ప్రశ్న 41.
గోళాకార దర్పణాలలో మన ప్రతిబింబం సన్నగా లేక ఉబ్బినట్లుగా ఎందుకుంటుంది?
జవాబు:
గోళాకార దర్పణాలలో కాంతికిరణాల కేంద్రీకరణ లేదా వికేంద్రీకరణ వల్ల మన ప్రతిబింబం సన్నగా లేదా ఉబ్బినట్లుగా కనబడుతుంది.
ప్రశ్న 42.
నిజ ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబం మధ్య తేడాలను తెలపండి.
జవాబు:
నిజ ప్రతిబింబం తెరపై ఏర్పడుతుంది, మిథ్యా ప్రతిబింబం తెరపై ఏర్పడదు.
ప్రశ్న 43.
వాహనాల “రియర్ వ్యూ మిర్రర్స్”గా కుంభాకార దర్పణాలనే ఎందుకు వాడతారు? తెలపండి.
జవాబు:
కుంభాకార దర్పణాలు ఎంత పెద్ద వాహనాన్ని అయినా దర్పణంలో కనబడేటట్లు చేస్తుంది మరియు ఎక్కువ ప్రాంతాన్ని దర్పణంలో చూపిస్తుంది. కాబట్టి కుంభాకార దర్పణాన్ని రియర్ వ్యూ మిర్రర్ గా వాడతారు.
ప్రశ్న 44.
పుటాకార, కుంభాకార దర్పణాలను గోళాకార దర్పణాలు అని ఎందుకు అంటారు?
జవాబు:
పుటాకార, కుంభాకార దర్పణాలను “గోళాకార దర్పణాలని” అంటారు. ఎందుకనగా
- ఈ దర్పణాల పరావర్తన తలాలు ఒక గోళం యొక్క బాహ్య, అంతర తలాలుగా ఉంటాయి.
- ఈ దర్పణాల పరావర్తన తలాలు చదునుగా కాక ఉబ్బెత్తుగా లేక లోతుగా ఉంటాయి.
ప్రశ్న 45.
మిధ్యా ప్రతిబింబాన్ని కెమెరాలో ఫోటో తీయగలమా?
జవాబు:
అవును. మిథ్యా ప్రతిబింబాన్ని కెమెరాలో ఫోటో తీయగలము.
ప్రశ్న 46.
పతన బిందువు అనగా నేమి?
జవాబు:
దర్పణంపై కాంతి కిరణం పతనమయ్యే బిందువును ‘పతన బిందువు’ అంటారు.
ప్రశ్న 47.
వక్రతలాలపై పరావర్తనం చెందినపుడు పతనకోణం, పరావర్తన కోణం సమానంగా ఉంటాయా?
జవాబు:
ఉండవు, వక్రతలాలపై పతనకోణము, పరావర్తన కోణాలు వేరువేరుగా ఉంటాయి.
ప్రశ్న 48.
వాహనాలలో రియర్ వ్యూ మిర్రర్ గా ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు?
జవాబు:
కుంభాకార దర్పణం
9th Class Physical Science 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
నీ స్నేహితునికి వాహనాలలో ‘రియర్ వ్యూ మిర్రర్’ గా పుటాకార దర్పణం వాడతారా? కుంభాకార దర్పణం వాడతారా? అనే సందేహం కలిగింది. అతని సందేహాన్ని నివృత్తి చేయుటకు నీవు అతనిని ఏయే ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
- రియర్ వ్యూ మిర్రర్ లో ప్రతిబింబం నిజ వస్తువు కన్నా చిన్నదా? పెద్దదా?
- ఇచ్చిన దర్పణాలలో ఏ దర్పణం నిజ వస్తువు కన్నా చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది?
- రియర్ వ్యూ మిర్రర్ లో వాడే దర్పణం ఏమిటి?
ప్రశ్న 2.
10 సెం.మీ. నాభ్యంతరం గల పుటాకార దర్పణం నుండి 30 సెం.మీ. దూరంలో 6 సెం.మీ. ఎత్తుగల వస్తువు ఉందనుకుందాం. దర్పణానికి ఎంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది? ప్రతిబింబ లక్షణాలు రాయండి.
జవాబు:
వసుదూరం = u= – 30 సెం.మీ.
నాభ్యాంతరం = f = – 10 సెం.మీ.
వస్తువు ఎత్తు = h0 = 6 సెం.మీ.
ప్రశ్న 3.
సౌరశక్తిని దర్పణాలను ఉపయోగించుకొని ఏదైనా పాత్రను వేడిచేయుటకు మీరు చేసే ప్రయత్నాన్ని ప్రయోగ అమరిక పూర్వకంగా వివరించండి.
జవాబు:
- పుటాకార దర్పణం సమాంతర సూర్యకిరణాలను నాభి వద్ద కేంద్రీకరించును.
- పుటాకార దర్పణంతో ఒక చిన్న కాగితం ముక్కను మండించవచ్చును.
- కర్ర లేదా ఇనుపబద్దలతో టి.వి. డిష్ ఆకారంలో ఫ్రేమను తయారు చేయుము.
- “ఆక్రలిక్ అద్దం షీట్” ను సేకరించి మీ డిష్ యొక్క వ్యాసార్ధానికి సమానమైన ఎత్తు ఉండే విధంగా 8 లేదా 12 సమద్విబాహు త్రిభుజాలుగా ఆక్రలిక్ అద్దాలను కత్తిరించుము.
- పటంలో చూపినట్లుగా త్రిభుజాకార అద్దాలను డిష్ ఫ్రేమ్ పై అంటించుము.
- దీనిని సూర్యునికి అభిముఖంగా ఉంచి, దాని నాభిని కనుగొనుము.
- ఆ నాభివద్ద పాత్రను ఉంచితే వేడెక్కును.
- ఆ పాత్రలో ఏ పదార్థాన్ని ఉంచిన అది వేడెక్కును.
- ఈ విధంగా సోలార్ కుక్కర్ ను తయారుచేయవచ్చును.
ప్రశ్న 4.
120 సెం.మీ. నాభ్యంతరం గల పెద్ద పుటాకార దర్పణం ముందు 40 సెం.మీ. దూరంలో నిలబడిన వ్యక్తికి ఆ దర్పణంలో కనిపించే తన ప్రతిబింబ లక్షణాలు రాయండి.
జవాబు:
- ప్రతిబింబం దర్పణంలో ఏర్పడుతుంది
- మిథ్యా ప్రతిబింబం
- నిటారు ప్రతిబింబం.
- వ్యక్తి కన్నా పెద్ద ప్రతిబింబం
ప్రశ్న 5.
సూర్యుని కాంతి అందుబాటులో లేనప్పుడు ఒక పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరాన్ని ప్రయోగ పూర్వకంగా మీరు ఎలా కనుగొంటారో తెలపండి.
జవాబు:
దర్పణం ఎదురుగా వస్తువు / కొవ్వొత్తిని ఉంచి ప్రతిబింబం తెరపై ఏర్పడేటట్లు చేయాలి. వస్తుదూరం, ప్రతిబింబ దూరాలను కొలిచి దర్పణ సూత్రంలో (\(\frac{1}{f}=\frac{1}{u}+\frac{1}{v}\) సూత్రంలో) సంజ్ఞాసాంప్రదాయం ప్రకారం విలువలను ప్రతిక్షేపించి నాభ్యాంతరం (f)ను లెక్కగట్టవచ్చు
(లేదా)
దర్పణం ఎదురుగా వస్తువు / కొవ్వొత్తిని మరియు తెరను ఒకే దూరంలో ఉంచి నిజ ప్రతిబింబం పొందేవరకు అమరికను సర్దుబాటు చేయాలి. దర్పణం నుండి తెరకు లేదా వస్తువుకు గల దూరాన్ని (వక్రతా వ్యాసార్ధాన్ని) కొలచి ఆ దూరంలో సగాన్ని ఆ దర్పణ నాభ్యంతరంగా పరిగణించాలి.
ప్రశ్న 6.
పుటాకార దర్పణం వలన ఏర్పడిన ప్రతిబింబం ఆవర్ధనం – 1. ఈ సమాచారం నుండి ప్రతిబింబ లక్షణాలను నాల్గింటిని రాయండి.
జవాబు:
- ప్రతిబింబం వక్రతా కేంద్రం (C) వద్ద ఏర్పడింది.
- ప్రతిబింబ పరిమాణం, వస్తుపరిమాణానికి సమానం.
- ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడింది.
- నిజ ప్రతిబింబం ఏర్పడింది.
ప్రశ్న 7.
పుటాకార దర్పణానికి ముందు 20 సెం.మీ. దూరంలో వస్తువునుంచామనుకుందాం. దాని నాభ్యంతరం 30 సెం.మీ. అయిన
a) ప్రతిబింబ దూరం ఎంత?
b) దర్పణానికి ఈ సందర్భంలో ఆవర్ధనం ఎంత?
జవాబు:
ప్రశ్న 8.
కుంభాకార దర్పణానికి ముందు 5 సెం.మీ. దూరంలో వస్తువుంది. దాని నాభ్యంతరం 10 సెం.మీ. అయితే
a) ప్రతిబింబ దూరం ఎంత?
b) దాని ఆవర్ధనం ఎంత?
జవాబు:
కుంభాకార దర్పణము విషయంలో
a) వస్తుదూరము = u= – 5 సెం.మీ.
నాభ్యంతరం = f = + 10 సెం.మీ.
ప్రతిబింబ దూరము = v = ?
ప్రశ్న 9.
క్రింది పటంలో దర్పణధృవం (పోల్), నాభి, వక్రతా కేంద్రం, ప్రతిబింబ స్థానాలను గుర్తించండి.
జవాబు:
OB = వస్తువు
IG = ప్రతిబింబం
పటంలో ప్రతిబింబం C, F ల మధ్య ఏర్పడినది.
ప్రశ్న 10.
సుకుమార్ కారుకు ప్రక్కన గల అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నాడు. దానిలో అతడి ప్రతిబింబం చిన్నదిగా కనిపించింది.
a) అది ఏ దర్పణం?
b) అతడు చూసుకున్న ప్రతిబింబ స్వభావం ఏమిటి?
c) పై ప్రతిబింబాన్ని చూపు కిరణ చిత్రం గీయండి.
జవాబు:
a) అది పుటాకార దర్పణం.
b) ప్రతిబింబ పరిమాణం వస్తువు కన్నా చిన్నదిగా కలదు.
c)
ప్రశ్న 11.
a) కారు హెడ్ లైట్లలో వాడే దర్పణం ఏమిటి?
b) కారులో బల్బును దర్పణ పరంగా ఎక్కడ ఉంచుతారు?
c) కారు హెడ్ లైలో బల్బు నుండి వెలువడిన కాంతి దర్పణంపై పడి పరావర్తనం చెందుతుంది. దీనిని తెలుపుతూ ఒక కిరణ చిత్రాన్ని గీయండి.
జవాబు:
a) కార్ హెడ్ లైట్లలో పుటాకార దర్పణం వాడతారు.
b) బల్బును దర్పణపు వక్రతా కేంద్రం వద్ద ఉంచుతారు.
c)
ప్రశ్న 12.
పటంలో చూపిన విధంగా కాంతికిరణం పుటాకార దర్పణంపై పడింది. ఆ కిరణం పరావర్తనం చెందుతుంది. ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి.
i) ప్రధానాక్షానికి సమాంతరంగా పోయే కాంతి కిరణం పుటాకార దర్పణాన్ని తాకి పరావర్తనం చెందినపుడు ఎలా పోతుంది?
ii) నాభి గుండా పోయే కిరణం పుటాకార దర్పణాన్ని తాకి పరావర్తనం చెందినపుడు ఎలా పోతుంది?
iii) పై ప్రశ్నలకు సమాధానాలు ఆధారంగా P వద్ద పడ్డ కిరణానికి పరావర్తన కిరణాన్ని గీయండి.
జవాబు:
i) ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చిన కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత నాభి గుండా ప్రయాణిస్తాయి.
ii) నాభిగుండా పోయే కిరణం పుటాకార దర్పణాన్ని తాకి పరావర్తనం చెందినపుడు ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించును.
iii)
ప్రశ్న 13.
మీ యింట్లో గోళాకార దర్పణాలుగా అనిపించే వస్తువులు ఏవి?
జవాబు:
- స్పూన్లు, స్టీలుగిన్నెలు, ప్లేట్ల బాహ్య ఉపరితలాలు కుంభాకార దర్పణాలుగాను, లోపలి ఉపరితలాలు పుటాకార దర్పణాలుగాను కనిపిస్తాయి
- బాగా మెరుగు పెట్టబడిన ఏదైనా వస్తువు ఉపరితలము కుంభాకార దర్పణంగా పనిచేస్తుంది.
ప్రశ్న 14.
సోలార్ కుక్కర్లు, కారు హెడ్ లైట్లలో పరావలయాకారపు దర్పణాలు వాడతారు. ఎందుకు?
జవాబు:
- పుటాకార దర్పణాలలో ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కిరణాలన్నీ ప్రధాన నాభి వద్ద కేంద్రీకరింపబడకపోవచ్చు.
- ప్రధానాక్షానికి చాలా దగ్గరగా వుండే కిరణాలు మాత్రమే ప్రధాన నాభి వద్ద కేంద్రీకరింపబడతాయి.
- దీనిని నివారించడానికి పరావలయాకారపు దర్పణాలను వాడుతారు.
ప్రశ్న 15.
కిరణ చిత్రం ఆధారంగా పుటాకార దర్పణంలో ఈ క్రింది వాటిని గుర్తించండి.
1) దర్పణ ధృవం, 2) ప్రధానాక్షం, 3) వక్రతా వ్యాసార్ధం, 4) నాభీయ బిందువు, 5) నాభ్యంతరం.
జవాబు:
P దర్పణ ధృవం
F నాభీయ బిందువు
PR నాభ్యంతరం
PC వక్రతా వ్యాసార్ధం
PX ప్రధాన అక్షం
9th Class Physical Science 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
సుధీర్ పుటాకార దర్పణ నాభ్యంతరాన్ని ప్రయోగ పూర్వకంగా కనుక్కోవాలి అని అనుకున్నాడు. ఐతే
a) అతనికి అవసరమయ్యే పరికరాలు ఏమిటి?
b) తెర అవసరం ఉందా? లేదా? వివరింపుము.
c) ప్రయోగంలో కనుగొను విలువలను పొందుపరచు పట్టికను రాయండి.
d) నాభ్యంతరాన్ని కనుగొనాలంటే ఈ ప్రయోగంలో అతడు ఉపయోగించాల్సిన ఫార్ములా ఏమిటి?
జవాబు:
a) పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరాన్ని కనుగొనుటకు సుధీర్ కు కావలసిన పరికరాలు
1. కొవ్వొత్తి, 2. తెల్లకాగితం / డ్రాయింగ్ షీట్, 3) పుటాకార దర్పణం, 4) V – స్టాండ్, 5) కొలత టేపు లేదా మీటర్ స్కేలు
b) తెరను ఖచ్చితంగా ఉపయోగించాలి. ఎందుకంటే నిజ ప్రతిబింబాలు తెరపైనే ఏర్పడతాయి. ఇలా తెరపై ఏర్పడిన ప్రతిబింబాల దూరాలను సులభంగా కొలవచ్చును.
c) ప్రయోగంలో అతను కనుగొన్న విలువలను పొందుపరచడానికి ఉపయోగించే పట్టిక.
d) నాభ్యంతరం కనుగొనుటకు ఉపయోగించవలసిన సూత్రం.
\(\frac{1}{f}=\frac{1}{u}+\frac{1}{v}\)
ప్రశ్న 2.
20 సెం.మీ. నాభ్యంతరం గల పుటాకార దర్పణానికి ఎదురుగా ప్రధానాక్షంపై 30 సెం.మీ. దూరంలో 5 సెం.మీ. ఎత్తుగల వస్తువును ఉంచాం. ప్రతిబింబ దూరాన్ని, ప్రతిబింబ ఎత్తును కనుగొనండి.
జవాబు:
దత్తాంశం :
నాభ్యంతరం (f) = – 20 సెం.మీ. (పుటాకార దర్పణం)
వస్తుదూరం (u) = – 30 సెం.మీ. (సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం)
వస్తువు ఎత్తు (h0) = 5 సెం.మీ.
ప్రశ్న 3.
పుటాకార దర్పణ నాభ్యాంతరం ‘f’. దాని నాభి నుండి వస్తువుకు గల దూరం P. ప్రతిబింబం ఎత్తుల నిష్పత్తిని కనుగొనండి.
జవాబు:
పుటాకార దర్పణము గోళాకార దర్పణపు భాగము.
ప్రశ్న 4.
ఈ క్రింద ఇవ్వబడిన స్థానాలకు ఆవర్ధన విలువలను పుటాకార దర్పణానికి రాయండి. కారణాన్ని వివరించండి.
a) వస్తువు దర్పణ నాభి వద్ద ఉన్నప్పుడు
b) వస్తువు నాభి, ధృవం మధ్య ఉన్నప్పుడు
జవాబు:
పుటాకార దర్పణ విషయంలో
a) వస్తువు దర్పణ నాభి వద్ద ఉన్నపుడు దాని ఆవర్తనము విలువ -1 అగును.
కారణం :
ఈ సందర్భంలో వస్తువు కన్నా ప్రతిబింబ పరిమాణం ఎక్కువ, కనుక ఇది ఒక మిథ్యా ప్రతిబింబము. ప్రతిబింబం కటకం వెనుక ఏర్పడుచున్నది. కావున ఆవర్ధనము విలువ ఋణాత్మకమైనది.
ప్రతిబింబ స్వభావం :
ఇది వాస్తవమైన, తలక్రిందులైన, వృద్ధి చెందినది అయ్యి అనంతం వద్ద ఏర్పడును.
b) వస్తువు నాభి, ధృవం మధ్య ఉన్నపుడు దాని ఆవర్ధనము విలువ + 1 అగును.
కారణము :
ఈ సందర్భంలో ప్రతిబింబం, వస్తువున్న వైపే ఏర్పడుచున్నది కనుక ఆవర్తనము విలువ ధనాత్మకము మరియు ఇది ఒక మిథ్యా ప్రతిబింబము.
ప్రతిబింబ స్వభావం :
ఇది వాస్తవమైన, నిలువుగా వున్న, వృద్ధి చెందినది మరియు వస్తువున్న వైపే ఏర్పడును.
ప్రశ్న 5.
పూర్వకాలంలో రాజులు శత్రువుల ఓడలను, శిబిరాలను అద్దాలు ఉపయోగించి యుద్ధ సమయంలో తగులబెట్టేవారట.
అ) వారు ఉపయోగించిన అద్దాలు అంటే ఏమిటో ఊహించండి.
ఆ) శత్రువులను ఓడించడంలో వారు ఉపయోగించిన శక్తి ఏమై ఉంటుంది?
ఇ) ఇందుకోసం వారు ఏ పద్ధతిని ఉపయోగించి ఉంటారో ఊహించంది.
ఈ) దీనిని వివరించడానికి ఒక రేఖా చిత్రం గీయండి.
జవాబు:
అ) వారు ఉపయోగించిన అద్దాలు కుంభాకార, పుటాకార దర్పణాలు.
ఆ) శత్రువులను ఓడించటంలో వారు సూర్యకాంతి శక్తిని ఉపయోగించారు.
ఇ) వారు “కాంతి పరావర్తనం” అనే పద్ధతిని ఉపయోగించి ఉంటారు.
ప్రశ్న 6.
పుటాకార దర్పణం ముందు వివిధ స్థానాలలో వస్తువునుంచి ఏర్పడిన ప్రతిబింబ స్థానం, పరిమాణం, ప్రతిబింబ లక్షణాలను తెల్పుము. కిరణ చిత్రాలను గీయుము.
జవాబు:
ప్రశ్న 7.
గోళాకార దర్పణాలకు సంబంధించిన దర్పణ సూత్రాన్ని ఉత్పాదించుము.
జవాబు:
1) దర్పణ ప్రధానాక్షంపై గల బిందువు ‘O’ నుండి వచ్చిన కిరణం దర్పణంపై ప్రధానాక్షానికి 4 ఎత్తులో ఉన్న బిందువు A వద్ద పతనమై, పరావర్తనం తర్వాత తిరిగి ప్రధానాక్షంపై గల బిందువు I గుండా వెళుతుంది.
2) AC దర్పణానికి పతన బిందువు వద్ద లంబము
∠AOC = ∠CAI = θ మరియు
AP’ ⊥ PO
3) ∠AOP’ = α, ∠ACP’ = β మరియు
∠AIP’ = γ అనుకొనుము.
4) త్రిభుజంలో అంతర కోణాల మొత్తం బాహ్య కోణానికి సమానం.
5) త్రిభుజం AOC లో β = α + θ ⇒ θ = β – α → (1)
త్రిభుజం ACI లో γ = β + θ = γ – β = θ → (2)
(1) మరియు (2) ల నుండి 2β = α + γ → (3)
6) h విలువ చాలా తక్కువయినపుడు
i) P’ బిందువు, దర్శణ కేంద్రం P తో ఏకీభవించవచ్చును.
అపుడు P’O = PO, P°C = P’C మరియు P’I = PI అగును.
ii) పటంలో α, β , γ లు మరీ చిన్న కోణాలు కావున Tan విలువ చాలా తక్కువైనప్పుడు P విలువలు తీసుకొనగా P’P తో ఏకీభవిస్తుందని భావించిన
ప్రశ్న 8.
వృద్ధీకరణము అనగానేమి? దానికి సూత్రాన్ని ఉత్పాదించుము.
జవాబు:
వృద్దీకరణము :
వస్తు పరిమాణం, ప్రతిబింబ పరిమాణాల మధ్య గల నిష్పత్తిని “వృద్ధీకరణము” అంటారు.
సూత్ర ఉత్పాదన :
ప్రశ్న 9.
పుటాకార దర్పణం యొక్క ఏదైనా ఒక బిందువు వద్ద లంబాన్ని గీయుము.
జవాబు:
- ‘P’ అనేది దర్పణం యొక్క దర్పణ కేంద్రం అనుకొనుము.
- P, C గుండా గీసిన రేఖను ప్రధానాక్షం అంటారు.
- ‘C’ అనేది వక్రతా కేంద్రం.
- దర్పణంపై ఏదైనా ఒక బిందువు ‘A’ ను గుర్తించుము.
- A, C లను కలుపుము.
- AC అనే రేఖ దర్పణానికి A వద్ద లంబము.
- ఇదే విధంగా దర్పణానికి ఏ బిందువు వద్దనుండైనా లంబాలు గీయవచ్చు.
ప్రశ్న 10.
నిత్య జీవితంలో కుంభాకార, పుటాకార దర్పణాల ఉపయోగాలను రాయుము.
జవాబు:
కుంభాకార దర్పణాలు :
- బస్సులు, కార్లు, ట్రక్కులు, స్కూటర్లు వంటి వాహనాల ‘రియర్ వ్యూ మిర్రర్’ గా కుంభాకార దర్పణాలను వాడుతారు.
- టెలిస్కోపులలో కుంభాకార దర్పణాలను వాడుతారు.
పుటాకార దర్పణాలు :
- దంతవైద్యులు, కంటివైద్యులు పుటాకార దర్పణాలని వాడతారు.
- మోటారు వాహనాల హెడ్ లైట్లలో పరావర్తకాలుగా పుటాకార దర్పణాలను వాడతారు.
- సోలార్ కుక్కర్‌లో పెద్దపెద్ద పుటాకార దర్పణాలు వాడతారు.
- టెలిస్కోలో కూడా పుటాకార దర్పణాలు వాడుతారు.
ప్రశ్న 11.
ప్రక్క పటంలో ‘A’ వద్ద ప్రతిబింబం స్పష్టంగాను, ‘B’ వద్ద కొంచెం మసక బారినట్లుగాను ఎందుకు కనిపిస్తుంది?
జవాబు:
- A బిందువుకు ముందు లేదా తరువాత ఏదేని బిందువు (B) వద్ద తెరను ఉంచితే, పరావర్తన కిరణాలు తెరపై వివిధ బిందువులు చేరడం గమనించవచ్చు.
- కాబట్టి ఈ కిరణాల వల్ల ప్రతిబింబం వివిధ బిందువుల వద్ద ఏర్పడుతుంది.
ఉదాహరణలు
ప్రశ్న 1.
15 సెం.మీ. నాభ్యంతరం గల పుటాకార దర్పణం ముందు 25 సెం.మీ. దూరంలో 4 సెం.మీ. ఎత్తుగల వస్తువును ఉంచాం. దర్పణానికి ఎంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది ? ప్రతిబింబ లక్షణాలను తెలపండి.
జవాబు:
సంజ్ఞాసాంప్రదాయం ప్రకారం ;
దర్పణనాభ్యంతరం [ = – 15 సెం.మీ.
వస్తుదూరం u = – 25 సెం.మీ.
వస్తువు ఎత్తు h0 = 4 సెం.మీ.
ప్రతిబింబ దూరం = v = ?
ప్రతిబింబం ఎత్తు hi = ?
కావున, ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుతుంది. వస్తువు కంటే పెద్దగా ఉంటుంది.
ప్రశ్న 2.
ఒక పుటాకార దర్పణానికి ముందు 10 మి.మీ. పొడవు గల వస్తువును ఉంచిన, 5 మి.మీ.ల పొడవు గల వస్తు ప్రతిబింబం 30 సెం.మీ.ల దూరంలో దర్పణానికి ముందు ఏర్పడింది. దర్పణ నాభ్యంతర విలువ ఎంత?
జవాబు:
వస్తువు ఎత్తు = h0 = 10 మి.మీ. = 1 సెం.మీ.
ప్రతిబింబ ఎత్తు = hi = 5 మి.మీ. = 0.5 సెం.మీ.
ప్రతిబింబ దూరం = v = – 30 సెం.మీ.
నాభ్యంతరం = f = ?
ప్రశ్న 3.
3 సెం.మీ. ఎత్తుగల వస్తువును ఒక పుటాకార దర్పణానికి ముందు 15 సెం.మీ. దూరంలో ఉంచారు. ఆ దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం 20 సెం.మీ. అయిన ప్రతిబింబ లక్షణాలను కనుగొనండి. (v = – 30 సెం.మీ., m = – 2, hi = – 6 సెం.మీ.)
జవాబు:
ప్రశ్న 4.
5 సెం.మీ. ఎత్తుగల వస్తువును ఒక కుంభాకార దర్పణానికి ముందు 10 సెం.మీ. దూరంలో ఉంచారు. ఆ దర్పణం యొక్క నాభ్యంతరము 15 సెం.మీ. అయిన ప్రతిబింబ లక్షణాలను కనుగొనండి. (v = + 6 సెం.మీ. ; m = 0.6; hi = 3 సెం.మీ.)
జవాబు:
9th Class Physical Science 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 1 Mark Bits Questions and Answers
1. చెవి, ముక్కు, గొంతు దాక్టర్లు (ENT) ఉపయోగించే దర్పణము
A) కుంభాకార దర్పణాలు
B) పుటాకార దర్పణాలు
C) సమతల దర్పణాలు
D) పరావలయ దర్పణాలు
జవాబు:
B) పుటాకార దర్పణాలు
2. ఒక విద్యార్థి 10 సెం.మీ. నాభ్యంతరం గల పుటాకార దర్పణాన్ని వాడి, ప్రయోగం చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు అతని చేతి నుండి జారిపడి ఆ దర్పణం పగిలిపోయింది. అతడు పెద్ద ముక్క (దర్పణ భాగం)తో ప్రయోగాన్ని చేశాడు. అతడి ప్రయోగంలో పొందే నాభ్యంతరం విలువ ……………
A) 5 సెం.మీ.
B) 10 సెం.మీ.
C) 15 సెం.మీ.
D) 20 సెం.మీ.
జవాబు:
B) 10 సెం.మీ.
3. వస్తువును ఏ స్థానం వద్ద ఉంచినపుడు కుంభాకార కటకం అదే పరిమాణంలో తలక్రిందులైన, నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచును?
A) C వద్ద
B) F వద్ద
C) F మరియు C వద్ద
D) F మరియు కటక దృక్ కేంద్రం వద్ద
జవాబు:
A) C వద్ద
4. టార్చ్, సెర్చ్ లైట్, వాహనాల హెడ్ లైట్లలో బల్బు ఉంచబడే స్థానం ………..
A) పరావర్తకపు నాభి మరియు ధృవంల మధ్య
B) పరావర్తకం నాభి వద్ద
C) పరావర్తకం యొక్క వక్రతా కేంద్రం వద్ద
D) పరావర్తకం యొక్క నాభి మరియు వక్రతా కేంద్రం మధ్య
జవాబు:
B) పరావర్తకం నాభి వద్ద
5. ఒక ఉపాధ్యాయుడు గోళాకార దర్పణానికి చేరువలో పెన్సిలను ఉంచాడు. వస్తువుకన్నా పెద్దదైన నిటారు ప్రతిబింబం దర్పణంలో ఏర్పడింది. ప్రతిబింబాన్ని పరిశీలించి దర్పణ స్వభావాన్ని ఊహించమని W, X, Y, Z విద్యార్థులను ఉపాధ్యాయుడు అడిగాడు. ఆ విద్యార్థులు కింది విధంగా సమాధానాలిచ్చారు
W – కుంభాకార దర్పణం
X- పుటాకార దర్పణం
Y- సమతల దర్పణం
Z – సమతల పుటాకార దర్పణం
వీరిలో సరియైన సమాధానాన్ని ఇచ్చిన విద్యార్థి
A) W
B) X
C) Y
D) Z
జవాబు:
B) X
6. క్రింది ఇవ్వబడిన కిరణ రేఖా చిత్రంలో గల ప్రతిబింబం (I) ఆవర్ధనం …………
A) M = – 1
B) M = 1
C) M = 0
D) M > 1
జవాబు:
A) M = – 1
7. ఒక పుటాకార దర్పణం ముందు 6 సెం.మీ. దూరంలో ఉంచబడిన వస్తువు ఆవర్తనం “-3″ అనగా ……..
A) ప్రతిబింబం 2 సెం.మీ దూరంలో దర్పణం ముందు ఏర్పడింది.
B) ప్రతిబింబం 2 సెం.మీ. దూరంలో దర్పణం లోపల ఏర్పడింది.
C) ప్రతిబింబం 18 సెం.మీ. దూరంలో దర్పణం ముందు ఏర్పడింది.
D) ప్రతిబింబం 18 సెం.మీ. దూరంలో దర్పణం లోపల ఏర్పడింది.
జవాబు:
C) ప్రతిబింబం 18 సెం.మీ. దూరంలో దర్పణం ముందు ఏర్పడింది.
8. దంత వైద్యుడు దంతాలను పరిశీలించటానికి …………….. ఉపయోగిస్తాడు.
A) పుటాకార దర్పణం
B) పుటాకార కటకం
C) కుంభాకార దర్పణం
D) సమతల దర్పణం
జవాబు:
A) పుటాకార దర్పణం
9. కింది వాటిలో ఏ దర్పణంగా కుంభాకార దర్పణాన్ని వినియోగిస్తాం?
A) షేవింగ్ కొరకు వాడే దర్పణం
B) కేంద్రీకరణకు వాడే దర్పణం
C) వాహనాలకు ‘రియర్ వ్యూ’ కొరకు వాడే దర్పణం
D) వాహనాల హెడ్ లైట్లలో పరావర్తన దర్పణం
జవాబు:
C) వాహనాలకు ‘రియర్ వ్యూ’ కొరకు వాడే దర్పణం
10. పుటాకార దర్పణం ఉపయోగించి వస్తువు కంటే పెద్దదైన మిధ్యా ప్రతిబింబం ఏర్పడాలంటే వస్తువునుఉంచవలసిన స్థానం
A) ‘F’ వద్ద
B) ‘C’ వద్ద
C) ‘C’ అవతల
D) F, Pల మధ్య
జవాబు:
D) F, Pల మధ్య
11. గోళాకార దర్పణపు వక్రతా వ్యాపారానికి, దాని నాభ్యంతరానికి గల నిష్పత్తి విలువ
A) 0. 4
B) 0.3
C) 0.5
D) 0.6
జవాబు:
C) 0.5
12. పుటాకార దర్పణం వల్ల ఏర్పడు ప్రతిబింబము
A) ఎల్లప్పుడూ నిజ ప్రతిబింబం
B) మిథ్యా ప్రతిబింబం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B
13. వాహనాలలో డ్రైవర్లు వాడు దర్పణం
A) కుంభాకార
B) పుటాకార
C) సమతల
D) ఏదీకాదు
జవాబు:
A) కుంభాకార
14. ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబమును ఏర్పరచు దర్పణం
A) కుంభాకార
B) పుటాకార
C) సమతల
D) B లేదా C
జవాబు:
D) B లేదా C
15. సోలార్ కుక్కర్ లో వాడు దర్పణాలు
A) కుంభాకార
B) పుటాకార
C) సమతల
D) ఏదీకాదు
జవాబు:
C) సమతల
16. పుటాకార దర్పణాల ఆవర్తనం విలువ
A) < 1 B) = 1 C) >1
D) చెప్పలేము
జవాబు:
A) < 1
17. ఒక గోళాకార దర్పణపు వక్రతా వ్యాసార్థం 20 సెం.మీ. అయిన దాని నాభ్యంతరం విలువ ………. సెం.మీ.
A) 10
B) 20
C) 30
D) 40
జవాబు:
A) 10
18. కుంభాకార దర్పణపు ఆవర్ధనం విలువ
A) < 1
B) = 1
C) 1
D) చెప్పలేము
జవాబు:
C) 1
19. గోళాకార దర్పణం ఏ గోళానికి సంబంధించినదో ఆ గోళ కేంద్రాన్ని దర్పణం యొక్క ….. అంటారు.
A) వక్రతా కేంద్రం
B) ప్రధాన నాభి
C) నాభ్యంతరము
D) వక్రతా వ్యాసార్ధం
జవాబు:
A) వక్రతా కేంద్రం
20. దర్పణం యొక్క జ్యామితీయ కేంద్రాన్ని …… అంటారు.
A) వక్రతా కేంద్రం
B) ప్రధాన నాభి
C) దర్పణ కేంద్రం
D) దర్పణం ఎత్తు
జవాబు:
C) దర్పణ కేంద్రం
21. దర్పణ వక్రతా కేంద్రం మరియు దర్పణ కేంద్రం గుండా పోయే రేఖను ……. అంటాం.
A) వక్రతా వ్యాసార్ధం
B) ప్రధానాక్షం
C) పతన కిరణం
D) పరావర్తన కిరణం
జవాబు:
B) ప్రధానాక్షం
22. ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు పుటాకార దర్పణం వల్ల ………………….. వద్ద కేంద్రీకరించబడతాయి.
A) వక్రతా కేంద్రం
B) దర్పణ కేంద్రం
C) ప్రధాన నాభి
D) అనంతదూరం
జవాబు:
C) ప్రధాన నాభి
23. దర్పణ ధృవానికి, దర్పణవక్రతా కేంద్రానికి మధ్య దూరాన్ని ఏమంటారు?
A) నాభ్యంతరం
B) నాభి
C) వ్యాసం
D) వక్రతా వ్యాసార్ధం
జవాబు:
D) వక్రతా వ్యాసార్ధం
24. దర్పణ ధృవానికి, నాభికి మధ్య దూరాన్ని …………… అంటారు.
A) నాభ్యంతరం
B) నాభి
C) వ్యాసం
D) వ్యాసార్ధం
జవాబు:
A) నాభ్యంతరం
25. నాభ్యంతరం మరియు వక్రతా వ్యాసార్ధాల మధ్య సంబంధాన్ని ………. గా రాయవచ్చు.
A) f = R
B) R = 2f
C) f = 2R
D) f = R + 2
జవాబు:
B) R = 2f
26. వస్తుదూరం, ప్రతిబింబదూరం మరియు నాభ్యంతరాల మధ్య సంబంధాన్ని ……… గా రాయవచ్చు.
జవాబు:
D
27. ఫటాకార దర్పణం పతనమైన సమాంతర కాంతి కిరణాలు పరావర్తనం చెందాక ………………….. వద్ద కేంద్రీకరింపబడతాయి.
A) నాభి
B) వక్రతా కేంద్రం
C) దర్పణ కేంద్రం
D) పరావర్తన తలం
జవాబు:
A) నాభి
28. తెరపై పట్టగల ప్రతిబింబాన్ని ………. ప్రతిబింబం అంటారు.
A) తెర ప్రతిబింబం
B) మిథ్యా ప్రతిబింబం
C) నిజ ప్రతిబింబం
D) దర్పణ ప్రతిబింబం
జవాబు:
C) నిజ ప్రతిబింబం
29. తెరపై పట్టలేని ప్రతిబింబమును …….. ప్రతిబింబం అంటారు.
A) తెర ప్రతిబింబం
B) మిథ్యా ప్రతిబింబం
C) నిజ ప్రతిబింబం
D) దర్పణ ప్రతిబింబం
జవాబు:
B) మిథ్యా ప్రతిబింబం
30. టివి యాంటెన్నా …. ఆకారంలో ఉంటుంది.
A) కుంభాకార
B) పుటాకార
C) సమతల
D) పరావలయ
జవాబు:
D) పరావలయ
31. కార్ల హెలైట్లలో వాడు దర్పణపు రకము ………
A) పుటాకార దర్పణం
B) కుంభాకార దర్పణం
C) పరావలయ దర్పణం
D) సమతల దర్పణం
జవాబు:
A) పుటాకార దర్పణం
32. దర్పణ సూత్రము ………
జవాబు:
A
33. సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం అన్ని దూరాలను ………………. నుండి కొలవాలి.
A) ప్రతిబింబ పరిమాణం
B) వృద్ధీకరణం
C) వస్తు పరిమాణం
D) ప్రతిబింబ నిష్పత్తి
జవాబు:
B) వృద్ధీకరణం
34. వస్తువు ఎత్తు ప్రతిబింబం ఎతు ………….
A) దర్పణ కేంద్రం
B) నాభి
C) వక్రతా కేంద్రం
D) వస్తువు
జవాబు:
A) దర్పణ కేంద్రం
35. షాపింగ్ మాల్స్ లో సెక్యూరిటీ కొరకై వాదు దర్పణాలు …………..
A) కుంభాకార దర్పణాలు
B) పుటాకార దర్పణాలు
C) సమతల దర్పణాలు
D) పరావలయ దర్పణాలు
జవాబు:
A) కుంభాకార దర్పణాలు
36. …………. అనే శాస్త్రవేత్త దర్పణాలను వాడి శత్రువుల ఓడలను తగులబెట్టారు.
A) ఫెర్మాట్
B) గెలీలియో
C) న్యూటన్
D) ఆర్కిమెడిస్
జవాబు:
D) ఆర్కిమెడిస్
37. దర్పణ వృద్దీకరణము విలువ + 2 అయిన ప్రతిబింబము ……………. ఉండును.
A) మిథ్యా – నిటారుగా
B) చిన్నదిగా
C) A మరియు B
D) పెద్దదిగా
జవాబు:
A) మిథ్యా – నిటారుగా
38. కుంభాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం ఎల్లప్పుడూ
A) వస్తువు పరిమాణం కన్నా ఎక్కువగా ఉంటుంది
B) వస్తు పరిమాణం కన్నా తక్కువగా ఉంటుంది
C) వస్తు పరిమాణంతో సమాన పరిమాణం కలిగి ఉంటుంది
D) వస్తు స్థానాన్ని బట్టి మారుతుంది
జవాబు:
B) వస్తు పరిమాణం కన్నా తక్కువగా ఉంటుంది
39. 15 సెం.మీ. వక్రతా వ్యాసార్థం గల పుటాకార దర్పణం ప్రధానాక్షంపై కొంత దూరంలో ఒక వస్తువును ఉంచాము. అప్పుడు ప్రతిబింబం దర్పణం నుండి 30 సెం.మీ. దూరంలో ఏర్పడితే వస్తు దూరం ఎంత?
A) 15 సెం.మీ.
B) 20 సెం.మీ.
C) 30 సెం.మీ.
D) 10 సెం.మీ
జవాబు:
D) 10 సెం.మీ
40. గోళాకార దర్పణంలో కొలిచే దూరాలన్నింటిని …………… కొలుస్తారు.
A) వస్తువు
B) దర్పణ నాభి
C) దర్పణ ధృవం
D) ప్రతిబింబం
జవాబు:
C) దర్పణ ధృవం
41. పుటాకార దర్పణంలో నిజవస్తువుకి, నిజ ప్రతిబింబానికి మధ్యగల గరిష్ట దూరం
A) 2
B) f
C) 4f
D) f/2
జవాబు:
A) 2
42. కింది జతలను పరిశీలించి జతపరుచగా
వస్తువు స్థానం | ప్రతిబింబస్థానం |
1) C పైన | a) అనంత దూరం |
2) F పైన | b) C ఆవల |
3) C, F ల మధ్య | c) C పై |
A) a, b, c
B) c, b, a
C) c, a, b
D) a, c, b
జవాబు:
C) c, a, b
43. రాజు కుంభాకార దర్పణం ఉపయోగించి ప్రయోగం చేశాడు. అతనికి ప్రతిబింబం అన్ని సందర్భాలలో ఏర్పడిన ప్రతి సందర్భములో
A) నిజ ప్రతిబింబం
B) మిథ్యా ప్రతిబింబం, వస్తు పరిమాణం కంటే తక్కువ
C) నిజ ప్రతిబింబ, వస్తు పరిమాణానికి సమానం
D) మిథ్యా ప్రతిబింబం వస్తు పరిమాణం కంటే ఎక్కువ
జవాబు:
D) మిథ్యా ప్రతిబింబం వస్తు పరిమాణం కంటే ఎక్కువ
44. పటంలో AB వస్తువు అయిన ప్రతిబింబం ఏర్పడు స్థానం
A) అదే స్థానంలో
B) C వద్ద
C) C, F ల మధ్య
D) F పై
జవాబు:
C) C, F ల మధ్య
45. పటంలో A’B’ ప్రతిబింబ స్థానం అయిన వస్తువు గల స్థానం
A) C పై
B) F పై
C) C, F లపై
D) F, P ల మధ్య
జవాబు:
D) F, P ల మధ్య
46. క్రింది వానిలో వేరుగా గల అంశం
A) వస్తువు P, F ల మధ్య ఉంచినా ప్రతిబింబము నుండి మిథ్యా ప్రతిబింబము
B) వస్తువు P, F ల మధ్య తప్ప మిగతా అన్ని సందర్భాలలో నిజప్రతిబింబం
C) వస్తువు P, F ల మధ్య తప్ప మిగిలిన అన్ని సందర్భాలలో తలక్రిందులైన ప్రతిబింబం
D) వస్తువు యొక్క ప్రతిబింబం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబము
జవాబు:
D) వస్తువు యొక్క ప్రతిబింబం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబము
47. పుటాకార దర్పణం ధృవం నుండి 15 సెం.మీ. దూరంలో వస్తువు ఉంచబడినది. దాని నాభ్యంతరం 10 సెం.మీ. అయిన ప్రతిబింబ దూరం
A) 15 సెం.మీ.
B) 20 సెం.మీ.
C) + 30 సెం.మీ.
D) – 30 సెం.మీ.
జవాబు:
D) – 30 సెం.మీ.
48. పటంలో వస్తు దూరం (u), ప్రతిబింబ దూరం (v), నాభ్యంతరం గ్ ఇవ్వబడ్డాయి. వాటిని సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం అనుసరించి గణించగా
A) -u, -f, – υ
B) u, v, f
C) -u, + v, +f
D) +u, +v, -f
జవాబు:
A) -u, -f, – υ
49. కిరణ చిత్రాలను గీయుటకు నియమాలు ఇవ్వబడ్డాయి. క్రింది వాటిలో ఒకటి తప్పుగా కలదు. అది
జవాబు:
C
50. క్రింద ఇవ్వబడిన కిరణ రేఖా చిత్రంలో గల ప్రతిబింబం ఆవర్ధనం?
A) M = -1
B) M = 1
C) M = 0
D) M > 1
జవాబు:
A) M = -1
51. ఆవర్ధనానికి సూత్రం …………
జవాబు:
D) A మరియు B
52. బయటకు బుగ్గలా పొంగిన ఉపరితలం గల దర్పణం
A) పుటాకార
B) సమతల
C) కుంభాకార
D) పైవన్నీ
జవాబు:
C) కుంభాకార