These AP 9th Physical Science Important Questions and Answers 11th Lesson ధ్వని will help students prepare well for the exams.
AP Board 9th Class Physical Science 11th Lesson Important Questions and Answers ధ్వని
9th Class Physical Science 11th Lesson ధ్వని 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
ధ్వని యొక్క అనుభూతిని మనం ఎలా పొందుతాము?
జవాబు:
ఒకచోట ఉత్పత్తి అయిన ధ్వని గాలిలో ప్రయాణించి చెవిని చేరి, చెవిలో కర్ణభేరిని కదిలించడం ద్వారా ధ్వని యొక్క
అనుభూతిని కల్పిస్తుంది.
ప్రశ్న 2.
శృతిదండం యొక్క పిచ్ దేనిపై ఆధారపడి ఉంటుంది?
జవాబు:
శృతిదండం యొక్క పిచ్ దాని భుజాల పొడవుపై ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న 3.
ధ్వని ఏ రూపంలో ప్రసరిస్తుంది?
జవాబు:
ధ్వని తరంగ రూపంలో ప్రసరిస్తుంది.
ప్రశ్న 4.
అనుదైర్ఘ్య తరంగాలంటే ఏమిటి?
జవాబు:
యానకంలో కణాలు తరంగ చలన దిశలోనే కంపిస్తే, ఆ తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటారు.
ప్రశ్న 5.
యానకం సాంద్రతలో మార్పునకు కారణమయ్యే తరంగాలు ఏవి?
జవాబు:
అనుదైర్ఘ్య తరంగాలు.
ప్రశ్న 6.
అనుదైర్ఘ్య తరంగాలలో ఏర్పడే ప్రదేశాలను ఏమంటారు?
జవాబు:
యానక సాంద్రతలో మార్పువల్ల అనుదైర్ఘ్య తరంగాలలో సంపీడన, విరళీకరణములనబడే ప్రదేశాలు ఏర్పడతాయి.
ప్రశ్న 7.
తిర్యక్ తరంగాలనగానేమి?
జవాబు:
యానకంలో కణాలు తరంగచలన దిశకు లంబంగా కంపిస్తే ఆ తరంగాలను తిర్యక్ తరంగాలు అంటారు.
ప్రశ్న 8.
ప్రతిధ్వని అనగానేమి?
జవాబు:
అసలు ధ్వని వినబడిన 0.1 సె॥ తర్వాత శ్రోతకు పరావర్తన ధ్వని వినబడితే దానిని ప్రతిధ్వని అంటారు.
ప్రశ్న 9.
ప్రతినాదం అనగానేమి?
జవాబు:
అసలు ధ్వని వినబడిన 0.1 సె॥ కంటే తక్కువ కాలంలో నిజధ్వనితో కలిసి పరావర్తన ధ్వని వినిపిస్తే దానిని ప్రతినాదం అంటారు.
ప్రశ్న 10.
సాధారణ మానవుని సగటు శ్రవ్య అవధి ఎంత?
జవాబు:
20 హెర్ట్ నుండి 20,000 హెర్ట్.
ప్రశ్న 11.
పరశ్రావ్యాలను ఉత్పత్తి చేసే జంతువులకు ఉదాహరణలివ్వండి.
జవాబు:
ఏనుగులు, తిమింగలాలు, ఖడ్గమృగాలు మొదలైనవి.
ప్రశ్న 12.
సోనార్ (SONAR) అనగానేమి?
జవాబు:
సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్.
ప్రశ్న 13.
ఒక సంగీత స్వరం, మరొక సంగీత స్వరం కంటే భిన్నమైనదని తెలిపే అఖిలక్షణాలను వ్రాయుము.
జవాబు:
అభిలక్షణాలు :
i) పిచ్ (స్థాయి) ii) తీవ్రత iii) నాణ్యత
ప్రశ్న 14.
నీకు దగ్గరలో గల కాంపౌండర్ గారి వద్దకు వెళ్ళి స్టెతస్కోప్ ఎలా గుండె చప్పుళ్లను తెలుపుతుందో సమాచారాన్ని అడిగి క్లుప్తంగా వ్రాయుము.
జవాబు:
శరీర అంతర్భాగాల ద్వారా వచ్చే శబ్దాలు స్టెతస్కోప్ కుండే గొట్టంలో అనేక పర్యాయాలు పరావర్తనం చెందుతూ, దానికి ఉండే గ్రాహకంలో కూడా అభివృద్ధి చెందబడి ధ్వని వైద్యుని చెవికి చేరుతుంది.
ప్రశ్న 15.
SONAR వ్యవస్థలో ఉపయోగించే రెండు ముఖ్యమైన పరికరాలను తెలుపండి.
జవాబు:
SONAR వ్యవస్థలో క్రింది ముఖ్యమైన పరికరాలు వినియోగిస్తారు. అవి :
1) ప్రసారిణి 2) గ్రాహకం
9th Class Physical Science 11th Lesson ధ్వని 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
0.6 సెం.మీ. తరంగ దైర్ఘ్యము గల ధ్వని గాలిలో 300 మీ/సె. వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ధ్వనిని వినగలమా?
జవాబు:
vani అని మనకు తెలుసు.
n: v. 300 : 50,000 Hz
0.6×10-2
ఇది శ్రవ్య అవధిలో లేదు. కావున మనము వినలేము.
ప్రశ్న 2.
తరంగ స్వభావము వివరించే తరంగపు లక్షణాలు ఏవి?
జవాబు:
ఒక తరంగ స్వభావాన్ని వివరించే తరంగ లక్షణాలు :
- తరంగ దైర్ఘ్యం (wavelength)
- కంపన పరిమితి (amplitude)
- పౌనఃపున్యం (frequency)
- తరంగ వేగం (wave speed)
ప్రశ్న 3.
ధ్వనులను ఎన్ని రకాలుగా విభజించవచ్చును? అవి ఏవి? వాటిని వ్రాయుము.
జవాబు:
ధ్వనులను రెండు రకాలుగా విభజించవచ్చును. అవి : i) సంగీత స్వరాలు ii) చప్పుళ్లు.
- వినుటకు చెవికి ఇంపుగా ఉన్న శబ్దాలను సంగీత స్వరాలు అని అంటారు.
- వినుటకు చెవికి కఠోరంగా ఉన్న శబ్దాలను చప్పుళ్లు అంటారు.
ప్రశ్న 4.
“ధ్వని చరిత్ర”ను వ్రాయుము.
జవాబు:
- పైథాగరస్ అనే గ్రీకు తత్త్వవేత్త ధ్వని గాలిలో అణువులు ముందుకు, వెనుకకు కదలడం ద్వారా ప్రయాణించి చెవిని చేరి గ్రహణ సంవేదనను కలిగిస్తుందని వివరించాడు.
- ఈ విషయాన్ని గెలీలియో మరియు బెకన్లు సమర్థించారు.
- ఆ తర్వాత న్యూటన్ మొట్టమొదటగా గాలిలో ధ్వని ప్రసారాన్ని పూర్తిగా వివరించాడు.
ప్రశ్న 5.
పౌనఃపున్యము మరియు ఆవర్తన కాలాల మధ్య సంబంధమును రాబట్టుము.
జవాబు:
యానకంలో ఒక కణం ‘n’ డోలనాలు చేయుటకు పట్టిన కాలము ‘1’ సెకను అనుకొనుము.
ఒక డోలనానికి పట్టిన కాలం = 1/n సెకన్లు. దీనినే ఆవర్తన కాలం అంటారు.
కావున ఆవర్తన కాలం (T) = 1/n సెకన్లు.
ఒక సెకనులో చేసిన డోలనాల సంఖ్య పౌనఃపున్యం (n) కావున ఆవర్తన కాలం (T) = 1/η అగును.
ప్రశ్న 6.
“సోనిక్ బూమ్” గురించి వ్రాయుము. (లేదా) సూపర్ సానిక్ వేగము, షాక్ తరంగాలు మరియు సోనిక్ బూమ్ ల గూర్చి వ్రాయుము.
జవాబు:
- ఒక వస్తువు గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువగా ప్రయాణిస్తున్నప్పుడు ఆ వస్తువు వేగాన్ని సూపర్ సానిక్ వేగమంటారు.
- ఒక ధ్వని జనకం నుండి ఉత్పత్తైన ధ్వని సూపర్ సానిక్ వేగంతో ప్రయాణిస్తున్నపుడు అది గాలిలో “షాక్ తరంగాలను” ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి అధికశక్తి గల తరంగాలను ఉత్పత్తి చేసే అధిక తీవ్రత గల ధ్వనులనే “సోనిక్ బూమా” అంటారు.
- ఈ “సోనిక్ బూమ్” వలన విడుదలయ్యే షాక్ తరంగాల వలన అద్దాలకు మరియు భవనాలకు నష్టం వాటిల్లును
ప్రశ్న 7.
రాజు తన స్నేహితుని ఊరికి ఒక ఫంక్షన్ నిమిత్తం వెళ్లాడు. అక్కడ అతను కొన్ని రకాల శబ్ద జనకాలను గమనించాడు అవి వివిధ ఆకృతులలో ఉండటంతో అతనికి కొన్ని సందేహాలు తలెత్తాయి. అవి ఏమిటో కొన్నింటిని వ్రాయండి.
జవాబు:
- ఆ శబ్దజనకాల ఆకృతి పేరేమిటి?
- వాటిని ఆ ఆకృతిలోనే తయారుచేయాలా?
- వాటిని పొడవైన గొట్టాల లాగా ఉంచకూడదా?
- ఆ ఆకృతి వలన ఏమైనా ఉపయోగముందా?
ప్రశ్న 8.
సిరి ప్రతిరోజూ “నేషనల్ జాగ్రఫిక్ ఛానల్”ను చూస్తూ ఉంటుంది. ఒక రోజు ఆ ఛానల్ లో ట్యూనా చేపలు పట్టే కార్యక్రమం చూపిస్తున్నారు. ఆ చేపలు పట్టేవారు, వారి పడవలో చేపలు ఎక్కడ ఉన్నాయో, ఎంత దూరంలో ఉన్నాయో అని కచ్చితముగా చెప్పగలుగుచున్నారు. ఇది చూసిన సిరికి కొన్ని రకాల ప్రశ్నలు తలెత్తాయి. అవి ఏమిటో మీరు ఊహించగలరా? అయితే వాటిని కొన్నింటిని వ్రాయుము.
జవాబు:
- ఆ చేపలు పట్టే వారు వాడే సాధనం పేరేమిటి?
- ఆ సాధనం ఏ విధముగా పనిచేస్తుంది?
- వారు కచ్చితముగా చేపల దూరాన్ని ఎలా చెప్పగలుగుచున్నారు?
- ఈ పరికరము చేపలు పట్టేందుకు మాత్రమేనా ఇంకా దేనికైనా వినియోగిస్తారా?
ప్రశ్న 9.
నీకు దగ్గరగా ఉన్న పారిశ్రామికవాడకు వెళ్ళి మోడరన్ టెక్నాలజీ సహాయంతో వారు లోహపు వస్తువులకు రంధ్రాలు చేయడంగాని, పెళుసైన పదార్ధాలను కావలసిన ఆకృతులలో ఎలా రంధ్రాలు మరియు కట్ చేయుచున్నారో వారిని అడిగి సమాచారాన్ని వ్రాయండి.
జవాబు:
- లోహపు వస్తువులకు రంధ్రాలను చేయడానికి ‘హర్న్” అనే సన్నని, దృఢమైన లోహపు కొనను కంపింపచేయటం వల్ల జనించే అతిధ్వనులను వాడతారు.
- ఇది ఒక సుత్తిలాగా పనిచేసి సెకనుకు సుమారు 10 లక్షల సార్లు లోహపు పలకపై కొట్టడం వలన కావలసిన ఆకృతులలో రంధ్రాలు చేస్తుంది.
- అట్లాగే గాజు వంటి పెళుసైన పదార్థాలను సైతం కోరిన ఆకృతులలో రంధ్రాలు చేయడం, కట్ చేయడం సులభంగా చేయవచ్చు.
ప్రశ్న 10.
సాధారణ పద్ధతిలో శుభ్రపరచబడిన వస్తువులపై మురికిని పూర్తిగా కొన్ని ప్రదేశాలలో తొలగించలేము. ఈ సమస్యకు నీవు ఏ విధమైన పరిష్కారమివ్వగలవో మీ పెద్దలనడిగి సమాచారాన్ని సేకరించి వ్రాయుము.
జవాబు:
- ఇటువంటి మురికిని అతిధ్వనులను ఉపయోగించి సులభంగా శుభ్రపరచవచ్చు.
- వస్తువులను శుభ్రపరిచే ద్రావణంలోకి అత్యధిక పౌనఃపున్యం కలిగిన తరంగాలను పంపించి వస్తువులకు వివిధ ప్రదేశాలలో అంటిన మురికి కణాలను కదిలిస్తారు.
- వాటిని తిరిగి నీటితో సులభంగా శుభ్రపరుస్తారు.
ప్రశ్న 11.
ప్రస్తుత రోజులలో కాలేయం, పిత్తాశయం, గర్భాశయం మొదలగు వాటిల్లో ఏర్పడే రాళ్ళను, కణితులను గుర్తించుటకు ఏ పద్ధతులను పాటిస్తున్నారో ప్రముఖ వైద్యుని ఇంటర్వ్యూ ద్వారా సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
- అతిధ్వనులు వైద్యుల చేతికి అందిన శక్తివంతమైన మరియు సురక్షితమైన పరికరము.
- ఇకోకార్డియోగ్రఫి అనే పద్ధతిలో గుండెలోని వివిధ భాగాల నుండి పరావర్తనం చెందిన అతిధ్వనులు గుండె చిత్రాల్ని ఏర్పరుస్తాయి.
- అల్ట్రాసోనోగ్రఫి అనే పద్ధతిని రోగి శరీరంలోని అవయవాలలో ఏర్పడ్డ కణితులను, రాళ్ళను గుర్తించడానికి ఉపయోగిస్తారు.
- ఇదే పద్ధతిని తల్లి గర్భంలోని భ్రూణము యొక్క పెరుగుదలను పరిశీలించుటకు కూడా వాడతారు.
ప్రశ్న 12.
స్వరము యొక్క పిచ్ ను నిర్ధారించే నమూనాను తయారు చేయండి.
జవాబు:
ప్రశ్న 13.
ప్రక్క పటంను గమనించి దాని గురించి రెండు వాక్యాలు వ్రాయుము.
జవాబు:
- ఇచ్చిన పటం ధ్వని పరావర్తనంను తెలియజేయుచున్నది.
- ధ్వని పరావర్తనం చెందిన తర్వాత అన్ని మూలలకు సమానంగా చేరుకునేటట్లు సమావేశ మందిరంను నిర్మించారు.
ప్రశ్న 14.
శృతిదండంను కనుగొన్న సంగీత విద్వాంసుడు అయిన “జాన్ షోర్” కృషిని ఎలా అభినందిస్తారు?
జవాబు:
- జాన్ షోర్ కనుగొన్న శృతిదండము లేకుంటే ప్రస్తుతము మనము వింటున్న సంగీత సాధనాలుగాని, ఇంపైన సంగీతముగాని ఉండేది కాదు.
- శృతిదండంను ఉపయోగించి సంగీత వాయిద్యాలను శృతి చేస్తారు.
- ఈ విధంగా మనకు ఉపయోగకరమైన శృతిదండంను కనుగొనుటలో జాషోర్ కృషిని ఏ విధంగా అభినందించినా అది తక్కువే.
ప్రశ్న 15.
X – కిరణాలు మరియు కాంతి తరంగాలకు బదులుగా అతిధ్వనులను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలేమిటి?
జవాబు:
- అల్ట్రాసోనోగ్రఫి అతిధ్వనులపై ఆధారపడి పనిచేస్తుంది. అల్ట్రాసోనోగ్రఫి అనునది X – కిరణాలతో పరీక్షించడం వంటి పాత పద్ధతుల కంటే సురక్షితమైనది.
- ఎందుకనగా తరచుగా X – కిరణాలు వాడటం వలన శరీర కణజాలాలకు ముఖ్యంగా, గర్భంలోని భ్రూణాలకు అపాయం కలిగే అవకాశం ఉంటుంది.
9th Class Physical Science 11th Lesson ధ్వని 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
శృతిదండం గురించి వ్రాయుము.
జవాబు:
- శృతిదండం ఒక శబ్ద అనునాదకము. దీనిని “జాన్ షోర్” అనే సంగీత విద్వాంసుడు కనుగొనెను.
- ఇది U – ఆకారములో వంచబడిన ఉక్కు ముక్క.
- దీనిని పట్టుకునేందుకు U – ఆకారపు వంపు వద్ద కడ్డీ అతుకబడి ఉంటుంది.
- ఇది నిర్దిష్ట పి’ అనునాదం చెందును.
- దీని పిచ్ దాని భుజాల పొడవులపై ఆధారపడును.
- సంగీత వాయిద్యాలను శృతిచేయడంలో దీని పిచ్ ను ప్రామాణికంగా తీసుకుంటారు.
ప్రశ్న 2.
కంపన తరంగాలలోని రకాలు ఎన్ని? అవి ఏవి? వాటిని వివరింపుము.
జవాబు:
కంపన తరంగాలు రెండు రకాలు. అవి:
- అనుదైర్ఘ్య తరంగాలు,
- తిర్యక్ తరంగాలు.
అనుదైర్ఘ్య తరంగాలు:
- యానకంలోని కణాలు తరంగ చలనదిశలో (తరంగ చలనదిశకు సమాంతరంగా)నే కంపిస్తే, ఆ తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటారు.
- అనుదైర్ఘ్య తరంగాలు యానకం సాంద్రతలో మార్పుకు కారణమవుతాయి.
- అనుదైర్ఘ్య తరంగాలలో వరుసగా సంపీడన మరియు విరళీకరణములు ఏర్పడును.
- అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణ : ధ్వని తరంగాలు.
తిర్యక్ తరంగాలు:
- యానకంలోని కణాలు తరంగ చలనదిశకు లంబంగా కంపిస్తే ఆ తరంగాలను తిర్యక్ తరంగాలు అంటారు.
- తిర్యక్ తరంగాలు యానకపు ఆకృతిలో మార్పునకు. కారణమవుతాయి.
- తిర్యక్ తరంగాలలో వరుసగా శృంగాలు మరియు ద్రోణులు ఏర్పడును.
- తిర్యక్ తరంగాలకు ఉదాహరణ : నీటిలో ఏర్పడే తరంగాలు
ప్రశ్న 3.
సాంద్రత – దూరం గ్రాఫులో తరంగ దైర్ఘ్యం, కంపన పరిమితులను చూపే పటంను గీయుము.
జవాబు:
ప్రశ్న 4.
పౌనఃపున్యం యొక్క ఉన్నత ప్రమాణాలను చూపు నమూనాను తయారు చేయండి.
జవాబు:
పౌనఃపున్యం యొక్క ఉన్నత ప్రమాణాలు
కిలో హెర్ట్ (KHz) | 103 Hz |
మెగా హెర్జ్ (MHz) | 106Hz |
గిగా హెర్ట్ (GHz) | 109 Hz |
టెరా హెర్జ్ (THz) | 1012 Hz |
ప్రశ్న 5.
ఒక సంగీత స్వరం యొక్క పిచను తెలిపే పటాలను గీయుము.
జవాబు:
9th Class Physical Science 11th Lesson ధ్వని 1 Mark Bits Questions and Answers
1. క్రింది జతలలో సరైనది కానిది
A) పిచ్, పౌనఃపున్యం
B) ప్రతిధ్వని, వక్రీభవనం
C) గుణం, తరంగరూపం
D) తీవ్రత, కంపన పరిమితి
జవాబు:
B) ప్రతిధ్వని, వక్రీభవనం
2. వేగం (V), పౌనఃపున్యం (υ) మరియు తరంగదైర్ఘ్యం (λ)ల మధ్య సంబంధం
A) V = υλ
B) υ = Vλ
C) λ = Vυ
D) \(\mathrm{V}=\frac{\mathrm{U}}{\lambda}\)
జవాబు:
A) V = υλ
3. భూమిపై వాతావరణం లేదనుకుంటే ధ్వని తరంగవేగం
A) 3 × 108ms-1
B) 331.2ms-1
C) 3 × 10-8 ms-1
D) వ్యాప్తి చెందదు
జవాబు:
D) వ్యాప్తి చెందదు
4. కింది వానిలో సంగీత ధ్వనుల లక్షణం కానిది
A) తరంగదైర్ఘ్యం
B) కీచుదనం
C) తీవ్రత
D) నాణ్యత
జవాబు:
C) తీవ్రత
5. ట్రాఫిక్ పోలీస్ రోడ్డుపై వెళుతున్న కారు యొక్క వడిని తన వద్ద ఉన్న రాదాగతో కొలిచాడు. అతడు ఆ క్షణంలో కొలిచినది
A) తక్షణ త్వరణం
B) తక్షణ వేగం
C) సరాసరి త్వరణం
D) సరాసరి వేగం
జవాబు:
B) తక్షణ వేగం
6. ఏ స్వరం యొక్క పిచ్ ఎక్కువగా ఉంటుందో తెల్పండి.
A) స
C) గ
D) మ
జవాబు:
D) మ
I. సరియైన సమాధానమును రాయుము.
1. వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ప్రభావితమయ్యే ధ్వని లక్షణం
A) తరంగ దైర్ఘ్యం
B) పౌనఃపున్యము
C) వేగం
D) కంపన పరిమితి
జవాబు:
C) వేగం
2. ఈ క్రింది వానిలో …….. లోధ్వని వేగము అధికము.
A) ఘనపదార్ధములు
B) ద్రవపదార్ధములు
C) వాయు పదార్ధములు
D) శూన్యము
జవాబు:
A) ఘనపదార్ధములు
3. సోనార్ వ్యవస్థలో ఉపయోగించు తరంగాల రకము
A) నీటి తరంగాలు
B) రేడియో తరంగాలు
C) ధ్వని తరంగాలు
D) పరశ్రావ్యాలు
జవాబు:
C) ధ్వని తరంగాలు
4. కింది వానిలో పరశ్రావ్యాలను వినగలిగేది.
A) కుక్క
B) గబ్బిలం
C) ఖడ్గమృగం
D) మానవుడు
జవాబు:
C) ఖడ్గమృగం
5. 20°C వద్ద ఒక వ్యక్తి ప్రతిధ్వనిని వినుటకు పరావర్తన తలంకు, అతనికి మధ్యగల కనీస దూరము
A) 12.2మీ.
B) 17.2మీ.
C) 15.2మీ.
D) 134.4మీ.
జవాబు:
B) 17.2మీ.
6. ఒక యానకములో తరంగము ప్రయాణించేటపుడు, ఈ కింది వానిలో ఒక కణము నుండి వేరొక కణానికి బదిలీ అగునది.
A) శక్తి
B) ద్రవ్యవేగం
C) రెండూనూ
D) ఏదీకాదు
జవాబు:
A) శక్తి
7. అనుదైర్ఘ్య తరంగము కింది వానిలో ప్రయాణిస్తుంది.
A)ఘనపదార్థాలు
B) ద్రవాలు
C) వాయువులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
8. ఒక వస్తువు కంపిస్తుంటే స్థిరంగా ఉండే భౌతిక రాశి
A) కంపన పరిమితి
B) వేగం
C)త్వరణము
D) దిశ
జవాబు:
A) కంపన పరిమితి
9. ఈ క్రింది వానిలో దేనిలో మార్పునకు ధ్వని వేగం ప్రభావితం కాదు?
A) ఉష్ణోగ్రత
B) యానకము
C) పీడనము
D) తరంగదైర్ఘ్యం
జవాబు:
C) పీడనము
10. ధ్వని యొక్క పిచ్ ప్రాథమికముగా ఆధారపడునది.
A) తీవ్రత
B) పౌనఃపున్యము
C) లక్షణము
D) అన్నియూ
జవాబు:
B) పౌనఃపున్యము
11. సితార మరియు వీణల నుండి వచ్చే ధ్వనులను వేరుపరచునది.
A) తీవ్రత
B) పిచ్
C) లక్షణము
D) B మరియు C
జవాబు:
C) లక్షణము
12. స్ప్రింగులో ఏర్పడే తరంగాలు …… రకపు తరంగాలు.
A) అనుదైర్ఘ్య
B) తిర్యక్
C) రెండూనూ
D) ఏవీకావు
జవాబు:
A) అనుదైర్ఘ్య
13. ఒక వస్తువు ధ్వనిని మాత్రమే ఉత్పత్తి చేయు స్థితి
A) నిశ్చల
B) కంపన
C) చలన
D) శూన్యము
జవాబు:
B) కంపన
14. Hz ప్రమాణముగా గలది ……….
A) పౌనఃపున్యం
B) అవధి
C) కంపన పరిమితి
D) ఏదీకాదు
జవాబు:
A) పౌనఃపున్యం
15. కంపన పరిమితికి S.I ప్రమాణము
A) మి.మీ.
B) సెం.మీ.
C) మీ.
D) Å
జవాబు:
C) మీ.
II. ఈ క్రింది ఖాళీలను పూరింపుము.
1. ధ్వని ఉత్పత్తి అగు స్థితి ……………….
2. ధ్వని తరంగంలో అధిక పీడనంగల ప్రాంతములు ……………
3. ధ్వని ……………….. గుండా ప్రయాణించదు.
4. ధ్వని ఒక ……………….. స్వరూపము.
6. ధ్వని తరంగంలో అల్ప సాంద్రత గల ప్రాంతములు ……………….
7. కీచుదనం మరియు బొంగురు స్వరాల మధ్య తేడాకు కారణం …….
8. 1 కిలో హెర్ట్జ్ = ……………… హెర్ట్జ్‌లు.
9. అనుదైర్ఘ్య తరంగాలు యానకపు …………….. లో మార్పునకు కారణమవుతాయి.
10. మొట్టమొదటగా గాలిలో ధ్వని ప్రసారాన్ని పూర్తిగా వివరించినవాడు ………………
11. శృతిదండాన్ని కనుగొన్న సంగీత విద్వాంసుడు ………………
12. తిర్యక్ తరంగాలు యానకపు ………… లో మార్పునకు కారణమవుతాయి.
13. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద గాలి పీడనం …………….. కు అనులోమానుపాతంలో ఉంటుంది.
14. రెండు వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరంను ……………….. అంటారు.
15. యానకంలోని కణాలు వాని. మధ్యస్థ స్థానానికి ఇరువైపులా పొందే గరిష్ఠ అలజడిని ………………. అంటారు.
16. కణాలు ఒక పూర్తి డోలనం చేయుటకు పట్టిన కాలాన్ని …………… అంటారు.
17. 20°C వద్ద పొడిగాలిలో ధ్వ నివేగం ……………..
18. 20°C వద్ద నీటిలో ధ్వని వేగం గాలిలో ధ్వని వేగానికి ……………… రెట్లు అధికం.
19. ఇనుములో ధ్వని వేగం ……….
20. చెవికి ఇంపుగా ఉన్న శబ్దాలను ………… అంటారు.
21. శబ్ద తరంగపు పౌనఃపున్యం ఎక్కువైతే దాని. ………… ఎక్కువ అని చెప్పవచ్చు.
22. మానవుని చెవులు …………………. dB నుండి ……………… dB వరకు గల శబ్దాలను వినగలవు.
23. విమానపు జెట్ ఇంజన్ శబ్ద తీవ్రత …………….. dB ఉంటుంది.
24. ధ్వని పరావర్తనం కూడా … …………….. పరావర్తన నియమాలను పాటిస్తుంది.
25. మానవుని శ్రవ్య అవధి 5. శృతిదండం ఒక
26. వృద్ధులకు గరిష్టంగా ధ్వనులను వినే అవధి ………..
27. ఖడ్గమృగాలు వినగల పరశ్రావ్య ధ్వనుల పౌనఃపున్యము
28. డాల్ఫిన్లు వినగల ధ్వనుల పౌనఃపున్యం ……………..
29. కొన్ని రకాల చేపలు ………………… పౌనఃపున్యం గల ధ్వనులను వినగలవు.
30. సోనార్ అనగా …………….
జవాబు:
- ప్రకంపన స్థితి
- సంపీడనాలు
- శూన్యం
- శక్తి
- శబ్ద అనునాదకం
- విరళీకరణాలు
- పిచ్
- 10
- సాంద్రత
- న్యూటన్
- జాన్ స్టోర్
- ఆకృతి
- సాంద్రత
- తరంగదైర్ఘ్యం
- కంపన పరిమితి
- ఆవర్తనకాలం
- 343.2 మీ/సె
- 4.3
- 1487 మీ/సె
- సంగీత స్వరములు
- పిచ్
- 9 – 180
- 120
- కాంతి
- 20 Hz – 20 KHz
- 10 KHz – 12 KHz
- 5 Hz
- 1 లక్షకు పైగా
- 1 – 25 Hz
- సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్
III. జతపరచుము.
i)
Group – A | Group – B |
1. పరశ్రావ్యాలు | A) 20 Hz కంటే తక్కువ పౌనఃపున్యం |
2. అతిధ్వనులు | B) 1,00,000 Hz లు |
3. శ్రవ్య అవధి | C) 1-25 Hz |
4. గబ్బిలం | D) 20 Hz కంటే తక్కువ పౌనఃపున్యం |
5. ఏనుగులు | E) 20 Hz – 20,000 Hz |
F) 20 KHz కంటే ఎక్కువ పౌనఃపున్యం |
జవాబు:
Group – A | Group – B |
1. పరశ్రావ్యాలు | A) 20 Hz కంటే తక్కువ పౌనఃపున్యం |
2. అతిధ్వనులు | F) 20 KHz కంటే ఎక్కువ పౌనఃపున్యం |
3. శ్రవ్య అవధి | E) 20 Hz – 20,000 Hz |
4. గబ్బిలం | B) 1,00,000 Hz లు |
5. ఏనుగులు | D) 20 Hz కంటే తక్కువ పౌనఃపున్యం |
ii)
Group – A | Group – B |
1. శబ్ద తీవ్రత | A) మీటరు |
2. కంపన పరిమితి | B) సెకను |
3. పౌనఃపున్యం | C) డెసిబెల్స్ |
4. తరంగ దైర్ఘ్యం | D) హెర్టర్లు |
5. ఆవర్తన కాలం | E) పాస్కల్ |
F) υ |
జవాబు:
Group – A | Group – B |
1. శబ్ద తీవ్రత | C) డెసిబెల్స్ |
2. కంపన పరిమితి | E) పాస్కల్ |
3. పౌనఃపున్యం | D) హెర్టర్లు |
4. తరంగ దైర్ఘ్యం | A) మీటరు |
5. ఆవర్తన కాలం | B) సెకను |