These AP 6th Class Telugu Important Questions 6th Lesson సుభాషితాలు will help students prepare well for the exams.
AP State Syllabus 6th Class Telugu 6th Lesson Important Questions and Answers సుభాషితాలు
6th Class Telugu 6th Lesson సుభాషితాలు Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
పరిచిత పద్యాలు
ఆ) కింది పద్యం చదవండి. అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. భూమి నాది యన్న భూమి ఫక్కున నవ్వు
దానహీను జూచి ధనము నవ్వు
కదన భీతు జూచి కాలుండు నవ్వును
విశ్వదాభిరామ వినుర వేమ !
ప్రశ్నలు – జవాబులు:
అ) భూమి నాది అంటే ఎవరు నవ్వుతారు?
జవాబు:
భూమి నాది అంటే భూమి నవ్వుతుంది.
ఆ) ధనం ఎవరిని చూచి నవ్వుతుంది?
జవాబు:
దానహీనుని చూచి ధనం నవ్వుతుంది.
ఇ) కాలుడు ఎవరిని చూచి నవ్వుతాడు?
జవాబు:
యుద్ధం అంటే భయపడేవాడిని చూచి కాలుడు నవ్వుతాడు.
ఈ) కాలుడు అంటే అర్థం తెలపండి.
జవాబు:
కాలుడు అంటే యముడు అని అర్థం.
2. మఱవ వలెఁ గీడు, నెన్నఁడు
మఱవంగా రాదు మేలు, మర్యాదలతో
దిరుగవలె సర్వ జనముల
దరి, బ్రేమ మెలంగవలయు ధరణి కుమారీ !
ప్రశ్నలు – జవాబులు:
అ) మనం దేనిని మరచిపోవాలి?
జవాబు:
మనం ఇతరులు చేసిన కీడు మరచిపోవాలి.
ఆ) మనం దేనిని మరచిపోకూడదు?
జవాబు:
మనం ఇతరులు చేసిన మేలును మరచిపోకూడదు.
ఇ) సర్వజనులతో ఎలా మెలగాలి?
జవాబు:
సర్వజనులతో మర్యాదతో, ప్రేమతో మెలగాలి.
ఈ) ధరణి అంటే అర్థం ఏమిటి?
జవాబు:
ధరణి అంటే భూమి అని అర్థం.
3. నోఁచిన తల్లిదండ్రికిఁ దనూభవుఁడొక్కడే చాలు మేటి చే
చాఁచనివాడు వేడొకఁడు చాఁచిన లేదనకిచ్చువాఁడు నో
రాంచి నిజంబకాని పలుకాడనివాఁడు రణంబులోన మేన్
దాఁచనివాడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
ప్రశ్నలు – జవాబులు:
అ) మంచిపుత్రులు ఎంతమంది ఉండాలని కవి అన్నాడు?
జవాబు:
మంచివాడు ఒక్కడు చాలని కవి అన్నాడు.
ఆ) మంచివాడు ఇతరులు యాచిస్తే ఏమి చేయాలి?
జవాబు:
మంచివాడు ఇతరులు యాచిస్తే, దానం చేయాలి.
ఇ). మంచివాడు యుద్ధంలో ఏమి చేస్తాడు?
జవాబు:
మంచివాడు యుద్ధంలో నిలిచి పోరాడుతాడు.
ఈ) దాశరథీ శతకాన్ని ఎవరు రచించారు?
జవాబు:
దాశరథీ శతకాన్ని కంచర్ల గోపన్న రచించాడు.
అపరిచిత పద్యా లు
1. కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
గిరులందు మేరు వౌదువు
సురలందున నింద్రుఁ డౌదువు చుక్కలలోనన్
బరమాత్మ చంద్రుఁ డౌదువు
నరులందున నృపతి బౌదు నయమున కృష్ణా.
ప్రశ్నలు – జవాబులు:
అ) గిరులలో శ్రీ కృష్ణుడే మౌతాడు?
జవాబు:
గిరులలో శ్రీకృష్ణుడు మేరువు.
ఆ) సురలలో ఇంద్రుడెవరు?
జవాబు:
సురలలో ఇంద్రుడు శ్రీకృష్ణుడు.
ఇ) చుక్కలలో చంద్రుడెవరు?
జవాబు:
శ్రీకృష్ణుడు చుక్కలలో చంద్రుడు.
ఈ) నరులలో రాజు ఎవరు?
జవాబు:
నరులలో రాజు శ్రీకృష్ణుడు.
2. కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండుఁ
జూడఁ జూడ రుచుల జాడవేరు
పురుషులందుఁ బుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ ! వినుర వేమ !
ప్రశ్నలు – జవాబులు:
అ) ఉప్పు – కర్పూరం ఎలా ఉంటాయి?
జవాబు:
ఉప్పు – కర్పూరం పైకి చూడటానికి తెల్లగా ఒకే విధంగా ఉంటాయి.
ఆ) ఉప్పు – కర్పూరం రుచి ఎలా ఉంటాయి?
జవాబు:
ఉప్పు – కర్పూరం చప్పరించి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి.
ఇ) మానవులు ఎలా ఉంటారు?
జవాబు:
మానవులందరూ ఒకేలా ఉంటారు.
ఈ) మానవులు ఎలాంటివారో ఎలా తెలుస్తుంది?
జవాబు:
మానవుల గుణాల్ని బట్టి మంచివారెవరో, చెడ్డవారెవరో తెలిసిపోతుంది.
3. కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
తన కోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌఁ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు, తథ్యము సుమతీ!
ప్రశ్నలు – జవాబులు:
అ) మనకు శతృవు ఏమిటి?
జవాబు:
మన కోపమే మనకు శత్రువు.
ఆ) శాంతము ఎటువంటిది?
జవాబు:
శాంతము రక్షించేది.
ఇ) స్వర్గము ఎలా ఉంటుంది?
జవాబు:
సంతోషంగా ఉంటే స్వర్గంలా ఉంటుంది.
ఈ) దుఃఖం ఎటువంటిది?
జవాబు:
దుఃఖము నరకము వంటిది.
4. కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
కంటికి తెప్ప విధంబున
బంటుగ దాయనుచు నన్నుఁ బాయక నెపుడున్
జంటను నీవుండుటచే
కంటకనుగు పాపములను గడిచితి కృష్ణా.
ప్రశ్నలు – జవాబులు:
అ) మనం ఎవరికి బంటులము?
జవాబు:
మనం కృష్ణునికి బంటులము.
ఆ) కృష్ణుడు మనల్ని ఎలా కాపాడుతాడు?
జవాబు:
కృష్ణుడు మనల్ని కంటి టెప్పలా కాపాడుతాడు.
ఇ) మనం ఎటువంటి పాపాలను దాటుతాం?
జవాబు:
మనం ముండ్ల వంటి పాపాలను దాటుతాం.
ఈ) మనకు ఎవరి అండ గొప్పది?
జవాబు:
మనకు శ్రీకృష్ణుని అండ గొప్పది.
5. కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
చిత్తశుద్ధి గల్గి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియుఁ గొదువగాదు
విత్తనంబు మట్టి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ ! వినుర వేమ !
ప్రశ్నలు – జవాబులు:
అ) పుణ్యం ఎలా చేయాలి?
జవాబు:
చిత్తశుద్ధితో పుణ్యకార్యం చేయాలి.
ఆ) పుణ్యకార్యం ఎటువంటిది?
జవాబు:
పుణ్యకార్యం కొంచమైనా గొప్పదే.
ఇ) మజ్జి చెట్టు ఎటువంటిది?
జవాబు:
మట్టి చెట్టు చాలా పెద్దది.
ఈ) మజ్జి చెట్టు విత్తనం ఎంత ఉంటుంది?
జవాబు:
మట్టి చెట్టు విత్తనం చాలా చిన్నది.
6. కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
కూరిమి గల దినములలో
నేరము లెన్న ఁడునుఁ గలుగ నేరవు మఱియా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ !
ప్రశ్నలు – జవాబులు:
అ) స్నేహంగా ఉండే రోజులలో ఏం కనబడవు?
జవాబు:
స్నేహంగా ఉండే రోజులలో ఎప్పుడూ తప్పులు కనబడవు.
ఆ) విరోధంగా ఉన్నప్పుడు ఏమి కన్పిస్తాయి?
జవాబు:
స్నేహం విరోధంగా ఉన్నప్పుడు ఒప్పులన్నీ తప్పులుగా కన్పిస్తాయి.
ఇ) ఏది నిజము?
జవాబు:
స్నేహంగా ఉంటే తప్పు కూడా ఒప్పుగా కన్పిస్తుంది.
ఈ) పై పద్యము ఏ శతకములోనిది?
జవాబు:
పై పద్యము సుమతీ శతకములోనిది.
7. కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
చెప్పకు చేసిన మేలు నొ
కప్పుడయినగాని దాని హర్షింపరుగా
గొప్పలు చెప్పిన నదియును
తప్పేయని చిత్తమందు తలపు కుమారీ !
ప్రశ్నలు – జవాబులు :
అ) ఏమి చెప్పకూడదు?
జవాబు:
చేసిన మేలును చెప్పకూడదు.
ఆ) గొప్పలు చెప్పడం మంచిదేనా?
జవాబు:
గొప్పలు చెప్పడం మంచిది కాదు.
ఇ) ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ చెప్పారు?
జవాబు:
కుమారిని సంబోధిస్తూ ఈ పద్యం చెప్పారు.
ఈ) పై పద్యానికి ఆధారంగా చేసుకొని ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పై పద్యానికి తగిన శీర్షికను పెట్టండి.
8. కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
నీళ్ళలోన మొసలి నిగడి యేనుగు బట్టు
బయట కుక్క చేత భంగపడును
స్థాన బలిమి కాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు:
అ) మొసలి ఎక్కడ ఉంటే బలంగా ఉంటుంది?
జవాబు:
మొసలి నీటిలో ఉంటే బలంగా ఉంటుంది.
ఆ) బయటకు వస్తే దానిని ఏవి బెదిరిస్తాయి?
జవాబు:
బయటకు వస్తే కుక్కలు కూడా బెదిరిస్తాయి.
ఇ) బలం దేనిని బట్టి పెరుగుతుంది?
జవాబు:
స్థానాన్ని బట్టి బలం పెరుగుతుంది.
ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పై పద్యంలో ఎన్ని జంతువులున్నాయి?
II. వ్యక్తికరణ – సృజనాత్మకత
ప్రశ్న 1.
“దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి” అంటే మీకేమర్థమయ్యిందో వ్రాయండి.
జవాబు:
ఇల్లు సద్దుకునేటప్పుడు దీపం ఉండాలి. దీపం లేకపోతే ఇంట్లో వస్తువులేవీ కనబడవు. ఏ పనీ చేయలేము. అలాగే కాలం అవకాశం ఉన్నప్పుడే పనులను పూర్తి చేసుకోవాలి. కాలంకానీ, అవకాశం కానీ చేజారిపోతే మళ్ళీ తిరిగిరావు. అందుకే కాలం వృథా చేయకూడదు. ఏ పనిని ఎప్పుడు చేయాలో ఆ పనిని అప్పుడే పూర్తి చేయాలి. వాయిదా వేయడం మంచిది కాదు. అని మాకర్థమయ్యింది.
ప్రశ్న 2.
వేమన చెప్పిన సుభాషితాన్ని వివరించండి.
జవాబు:
వేమన చాలా సుభాషితాలను చక్కగా చెప్పాడు. చాలామంది భూముల కోసం గొడవలు పడతారు, కొట్టుకుంటారు. ప్రక్కవాళ్ళ భూములను ఆక్రమించుకొంటారు. కానీ ఈ భూమి శాశ్వతంగా ఎవరిదీ కాదు. అందుకే భూమి నాది అని ఎవరైనా అంటే భూదేవి నవ్వుతుంది. అలాగే ధనము కూడా శాశ్వతం కాదు. మనకున్నంతలో దానం చేయాలి. అలా దానం చేయని వారిని చూచి ధనం నవ్వుతుంది. జన్మించిన వారికి మరణం తప్పదు. కొందరు యుద్ధరంగంలో భయపడతారు. పారిపోతారు. అలాంటి వారిని చూచి యమధర్మరాజు నవ్వుతాడు. అందుకే భూమి కోసం గొడవపడటం, డబ్బును దానం చేయకుండా దాచుకోవడం, యుద్ధంలో భయపడటం అవివేకం.
ప్రశ్న 3.
చదువు యొక్క గొప్పతనాన్ని వివరించండి.
జవాబు:
అన్ని ధనములలోకి గొప్పది విద్యాధనం. ధనమును పరిపాలకులు పన్నుల రూపంలో దోచుకుంటారు. దొంగలెత్తుకుపోతారు. అన్నదమ్ములు పంచుకుంటారు. కానీ విద్యను ఎవరూ దోచుకోలేరు. ఏ దొంగలూ ఎత్తుకుపోలేరు. అన్నదమ్ములు పంచుకోలేరు. ప్రపంచాన్ని అభివృద్ధి చేసేది విద్య మాత్రమే. అందుకే విద్య యొక్క గొప్పతనాన్ని ఎవరూ కాదనలేరు.
ప్రశ్న 4.
మాటల యొక్క గొప్పతనాన్ని తెలియజేయండి.
జవాబు:
మంచి మాటలు మనకు గౌరవాన్ని పెంచుతాయి. స్నేహితులను పెంచుతాయి. ఏ పనినైనా సాధించటానికి ఉపయోగపడతాయి. అదే చెడ్డ మాటలయితే శత్రువులను పెంచుతాయి. అన్ని పనులను చెడగొడతాయి. శరీరంలో దిగిన బాణపు ముల్లునయినా ఉపాయంతో తీయవచ్చును. కానీ ఇతరుల మనసుకు బాధ కలిగేలా మాట్లాడిన మాటలను తీయలేము. ఆ బాధను పోగొట్టలేము. అందుకే మంచి మాటలను మాట్లాడాలి.
ప్రశ్న 5.
మనం ఎలా ప్రవర్తించాలి?
జవాబు:
అందరితోను మర్యాదగా ప్రవర్తించాలి. అందరిపట్ల ప్రేమ భావనతో ఉండాలి. ఇతరులెవరైనా మనకు అపకారం చేస్తే దానిని వెంటనే మరచిపోవాలి. ఇతరులెవరైనా మనకు మంచి చేస్తే మరచిపోకూడదు. జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి.
ప్రశ్న 6.
శతక పద్యాలను చదవడం వలన ప్రయోజనాలను వివరిస్తూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:
శ్రీకాకుళం, ప్రియమైన రంజను, నీ మిత్రుడు రంజిత్ వ్రాయు లేఖ. ఇక్కడ మేమంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను. మొన్న మాకు సుభాషితాలు పాఠం చెప్పారు. అన్నీ నీతి శతకాలలోని పద్యాలే, పద్యాలు చాలా బాగున్నాయి. సమయం గురించి, దానం గురించి, విద్య గురించి, కోపం, ఆవేశం గురించి ఇలా చాలా వాటి గురించి చెప్పారు. ఆ పద్య భావాలను ఆచరణలో పెడితే ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుందని మా తెలుగు ఉపాధ్యాయులు చెప్పారు. నేను వేమన శతకం, తెలుగుబిడ్డ శతకం కొనుక్కొంటా. అన్ని పద్యాలు చదువుతాను. నువ్వు కూడా కొనుక్కో ఉంటాను. రిప్లై రాయి. ఇట్లు, చిరునామా: |
ప్రశ్న 7.
నిన్ను నీవు శతక కవిగా ఊహించుకొని “శతక కవి’ ఏకపాత్రాభినయం రాయండి.
జవాబు:
శతక కవి
పిల్లలూ ! నేను శతక కవిని. చక్కటి శతకం వ్రాశాను. మీరంతా నా శతకపద్యాలు చదువుకోండి. వాటిలో చక్కటి నీతులున్నాయి. భక్తి కూడా ఉంది. మీరా పద్యాలు చదువుకొని, అర్థం చేసుకోండి. అర్థం కానివి మీ ఉపాధ్యాయుడిని అడగండి. నేను చెప్పినట్లుగా నడుచుకొంటే మీ జీవితం నందన వనంలా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఏ ఒడిదుడుకులకు భయపడక్కర్లేదు. జీవితం హాయిగా ఉంటుంది. మీరు చదువుకొన్న శతకపద్యాలు మీకు మార్గదర్శకాలు.
ఇంకొక శతకం రాస్తున్నాను. అది కూడా చదువుకొందురు గాని. మీ అందరికీ నా ఆశీస్సులు. చక్కగా చదువుకొని వృద్ధిలోకి రండి. సమాజానికి మంచి చేయండి. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. తల్లిదండ్రులు చెప్పినట్లు వినండి.
మళ్ళీ మాట్లాడుకొందాం. ఈ సారి మీ పాఠశాలకు వస్తా.
III. భాషాంశాలు
1. పర్యాయపదాలు:
సుభాషితము = మంచిమాట, మంచి పలుకు
దీపము = దివ్వె, తిర్లిక
తెలుగు = తెనుగు, ఆంధ్రము
భూమి = పుడమి, ధరణి
ధనము = డబ్బు, సంపద
కాలుడు = యముడు, సమవర్తి
దొంగ = తస్కరుడు, మ్రుచ్చు
విశ్వము = ప్రపంచము, జగము
తనువు = శరీరం, దేహం
మనము = మనసు, అంతరంగం
జనులు = ప్రజలు, జనములు
దోషము = తప్పు, దోసం
హితము = మేలు, మంచి
ప్రేమ = అనురాగం, ఆప్యాయత
వఱపు = వానలేమి, అనావృష్టి
పుస్తకము = పొత్తము, గ్రంథము
అంబుధి = సముద్రం, సాగరం
తల్లి = మాత, జనని
నిజం = సత్యం, యథార్థం
గిరి = పర్వతం, కొండ
కరుణ = కృప, దయ
కాలము = సమయము, ప్రొద్దు
ఇల్లు = గృహము, సదనము
బిడ్డ = శిశువు, బాలకుడు
నవ్వు = హాసము, దరహాసము
కదనము = యుద్ధము, రణము
దొర = ప్రభువు, ఏలిక
భ్రాతృజనము = సోదరులు, సహోదరులు
విద్య = చదువు, జ్ఞానము
అలుగు = బాణాగ్రం, ములికి
రోషము = కోపం, కినుక
దుఃఖము = బాధ, కష్టం
బుధులు పండితులు, విద్వాంసులు
కీడు = ఆపద, చెడు
సిరి = సంపద, లక్ష్మి
మేఘము = జలదము, అంబుదము
వర్షము = వాన, ఆసారము
భాస్కరుడు = సూర్యుడు, ఆదిత్యుడు
తనూభవుడు = కొడుకు, కుమారుడు
మేన్ = శరీరం, దేహం
దాశరథి = రాముడు, సీతాపతి
వ్యతిరేక పదాలు :
పోయి × వచ్చి
నవ్వు × ఏడ్పు
దొర × దొంగ
సుగుణం × దుర్గుణం
దోషము × నిర్దోషము
హితము × అహితము
కీడు × మేలు
ప్రేమ × ద్వేషం
సఫలము × నిష్ఫలము
పేద × ధనికుడు
ఉన్న × లేక
హీనుడు × అహీనుడు
విద్య × అవిద్య
బాల × వృద్ధ
దోషము × నిర్దోషము
దుఃఖము × సుఖము
మఱపు × జ్ఞప్తి
మర్యాద × అమర్యాద
కలవాడు × లేనివాడు
సత్ఫలము × దుష్ఫలము
నిజం × అబద్ధం
3. ప్రకృతి – వికృతి:
దీపము – దివ్వె
త్రిలింగము – తెలుగు
భూమి – బూమి
నవ్వు – నగవు
విద్య – విద్దె
రోషము – రోసము
దోషము – దోసము
దుఃఖము – దూకలి
హితవు – ఇతవు
మర్యా ద – మరియాద
ప్రేముడి – ప్రేమ
పుస్తకము – పొత్తము
హృదయము – ఎద
హంస – అంచ
శ్రీ – సిరి
ఫలము – పండు
మేఘము – మొగులు
4. సంధులు :
కాలము + ఊరక = కాలమూరక – ఉత్వ సంధి
దీపము + ఉన్న = దీపమున్న – ఉత్వ సంధి
దొంగలు + ఎత్తుక = దొంగలెత్తుక – ఉత్వ సంధి
అలుగులను + అనువున = అలుగులననువున – ఉత్వ సంధి
వచ్చును + అతి = వచ్చునతి – ఉత్వ సంధి
వినుము + ఎన్ని = వినుమెన్ని – ఉత్వ సంధి
కరమును + ఔ = కరమునౌ – ఉత్వ సంధి
కీడును + ఎన్నడు = కీడునెన్నడు – ఉత్వ సంధి
పూర్ణత్వము + అబ్బదు = పూర్ణత్వమబ్బదు – ఉత్వ సంధి
పారిశుధ్యము + ఒకటే = పారిశుధ్యమొకటే – ఉత్వ సంధి
మేలు + అది = మేలది – ఉత్వ సంధి
ఫలంబు + అగున్ = ఫలంబగున్ – ఉత్వ సంధి
మేఘుడు + ఒక = మేఘుడొక – ఉత్వ సంధి
భవుడు + ఒక్కడే = భవుడొక్కడే – ఉత్వ సంధి
లేదు + అనక = లేదనక – ఉత్వ సంధి
నోరు + ఆచి = నోరాచి – ఉత్వ సంధి
వానికి + ఎయ్యెడల = వానికెయ్యెడల – ఉత్వ సంధి
ఉన్న+ అపుడె = ఉన్నయపుడె – ఉత్వ సంధి
నాది + అన్న = నాదియన్న – యడాగమ సంధి
విరిగిన + అలుగుల = విరిగినయలుగుల – యడాగమ సంధి
ఎన్ని + ఉపాయములు = ఎన్నియుపాయములు – యడాగమ సంధి
వెడలునె + అధిపా = వెడలునెయధిపా – యడాగమ సంధి
విడిచిన + ఎడ = విడిచినయెడ – యడాగమ సంధి
కాక + అంబుధుల = కాకయంబుధుల – యడాగమ సంధి
5. కింది పదాల సంధులను విడదీసి, సంధి పేరు రాయండి.
పోయినట్టి = పోయిన + అట్టి – అత్వ సంధి
లేదనకిచ్చువాడు = లేదనక + ఇచ్చువాడు – అత్వ సంధి
విశ్వదాభిరామ = విశ్వద + అభిరామ – సవర్ణదీర్ఘ సంధి
రోషావేశము = రోషము + ఆవేశము – సవర్ణదీర్ఘ సంధి
కాళికాంబ = కాళిక + అంబ – సవర్ణదీర్ఘ సంధి
6. క్రింది సమాసపదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
సమాస పదం | విగ్రహవాక్యం | సమాస నామం |
మంచిచెడులు | మంచియును, చెడుయును | ద్వంద్వ సమాసం |
అక్కా చెల్లెళ్లు | అక్కయును, చెల్లియును | ద్వంద్వ సమాసం |
మాతాపితలు | మాతయును, పితయును | ద్వంద్వ సమాసం |
బంధుమిత్రులు | బంధువులును, మిత్రులును | ద్వంద్వ సమాసం |
భార్యాభర్తలు | భార్యయును, భర్తయును | ద్వంద్వ సమాసం |
7. కింది వాక్యాలలో విభక్తి ప్రత్యయాలు గుర్తించి రాయండి.
1. గొప్పరాయందు తప్పులు వెతకకు.
జవాబు:
అందు – సప్తమీ విభక్తి
2. భగవంతుని గూర్చి తపస్సు చేశాడు.
జవాబు:
గూర్చి – ద్వితీయా విభక్తి
3. హనుమంతుని చేత లంక కాల్చబడెను.
జవాబు:
చేత – తృతీయా విభక్తి
8. కింద గీత గీసిన వానికి సరైన జవాబులను గుర్తించి బ్రాకెట్లలో రాయండి.
1. కాలుడు అంటే భయపడనివారుండరు. (అర్థం గుర్తించండి)
అ) యముడు
ఆ) మగడు
ఇ) రౌడీ
జవాబు:
అ) యముడు
2. ఈ విశ్వం చాలా చిత్రమైనది. (అర్థం గుర్తించండి)
అ) ఆకాశం
ఆ) ప్రకృతి
ఇ) ప్రపంచం
జవాబు:
ఇ) ప్రపంచం
3. అనవసరంగా రోషం ప్రదర్శించకూడదు. (అర్థం గుర్తించండి)
అ) దోషం
ఆ) కోపం
ఇ) పరాక్రమం
జవాబు:
ఆ) కోపం
4. దీపము వెలిగిస్తే చీకటిపోతుంది. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) దివ్వె, తిర్లిక
ఆ) పొయ్యి, కాగడా
ఇ) సూర్యుడు, రవి
జవాబు:
అ) దివ్వె, తిర్లిక
5. అంబుధిలో కెరటాలెక్కువ. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) గోదావరి, కృష్ణ
ఆ) సముద్రం, సాగరం
ఇ) నది; నదము
జవాబు:
ఆ) సముద్రం, సాగరం
6. కదనము అనర్ధదాయకం. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) కత్తి, ఖడ్గం
ఆ) కథ, కత
ఇ) యుద్ధం, రణం
జవాబు:
ఇ) యుద్ధం, రణం
7. అందరితో ప్రేమగా ఉండాలి. (వ్యతిరేకపదం గుర్తించండి)
అ) ద్వేషం
ఆ) ఆప్యాయత
ఇ) అనురాగం
జవాబు:
అ) ద్వేషం
8. మంచి పనిచేస్తే సత్ఫలము వస్తుంది. (వ్యతిరేకపదం గుర్తించండి)
అ) నిష్ఫలము
ఆ) ఫలము
ఇ) దుష్ఫలము
జవాబు:
ఇ) దుష్ఫలము
9. దోషమును సవరించాలి. (వ్యతిరేకపదం గుర్తించండి)
అ) దోసము
ఆ) నిర్దోషము
ఇ) ప్రదోషము
జవాబు:
ఆ) నిర్దోషము
10. మన తెలుగు భాష తియ్యనిది. (ప్రకృతిని గుర్తించండి)
అ) తెనుగు
ఆ) ఆంధ్రము
ఇ) త్రిలింగము
జవాబు:
ఇ) త్రిలింగము
11. పుస్తకము చింపకూడదు. (వికృతిని గుర్తించండి)
అ) పొత్తము
ఆ) పుస్తె
ఇ) పుత్తము
జవాబు:
అ) పొత్తము
12. హంస పాలను త్రాగి, నీటిని విడుస్తుంది. (వికృతిని గుర్తించండి)
అ) హన్స
ఆ) అంచ
ఇ) హమ్స
జవాబు:
ఆ) అంచ
13. చదువును దొంగలెత్తుకుపోరు. (సంధి పేరు గుర్తించండి)
అ) అత్వ సంధి
ఆ) ఇత్వ సంధి
ఇ) ఉత్వ సంధి
జవాబు:
ఇ) ఉత్వ సంధి
14. మేలది (సంధి విడదీసిన రూపం గుర్తించండి)
అ) మేల + అది
ఆ) మేలు + అది
ఇ) మేలె + అది
జవాబు:
ఆ) మేలు + అది
15. భవుడొక్కడే శాశ్వతుడు. (సంధి విడదీసిన రూపం గుర్తించండి)
అ) భవుడు + ఒక్కడే
ఆ) భవుడు + వక్కడే
ఇ) భవుడు + వొక్కడే
జవాబు:
అ) భవుడు + ఒక్కడే
16. నాదియన్న భావం గొప్ప వారికుండదు. (సంధి పేరు గుర్తించండి)
అ) ఇత్వ సంధి
ఆ) అత్వ సం ధి
ఇ) యడాగమం
జవాబు:
ఇ) యడాగమం
17. విరిగిన + అలుగులు (యడాగమ రూపం గుర్తించండి)
అ) విరిగినలుగులు
ఆ) విరిగినయలుగులు
ఇ) విరిగెనలుగులు
జవాబు:
ఆ) విరిగినయలుగులు
18. ఉన్నయపుడె మంచి చేయాలి. (సంధి విడదీసిన రూపం గుర్తించండి)
అ) ఉన్న + అపుడె
ఆ) ఉన్న + యపుడె
ఇ) ఉన్నయ + అపుడె
జవాబు:
అ) ఉన్న + అపుడె
19. వానికేమి రోగం ? (సంధి పేరు గుర్తించండి)
అ) ఉత్వ సంధి
ఆ) అత్వ సంధి
ఇ) ఇత్వ సంధి
జవాబు:
ఇ) ఇత్వ సంధి
20. రామునికెవ్వరూ సాటిరారు. (సంధి విడదీసిన రూపం గుర్తించండి)
అ) రామునకు + ఎవ్వరూ
ఆ) రామునికి + ఎవ్వరూ
ఇ) రామునికె + వ్వరూ
జవాబు:
ఆ) రామునికి + ఎవ్వరూ
21. మఱి + ఏల (సంధి కలిసిన రూపం గుర్తించండి)
అ) మఱేల
ఆ) మఱిఏల
ఇ) మఱీఏల
జవాబు:
అ) మఱేల
22. రామలక్ష్మణులు మహావీరులు. (సమాసం పేరు గుర్తించండి)
అ) ద్విగువు
ఆ) ద్వంద్వ
ఇ) బహుబ్లిహి
జవాబు:
ఆ) ద్వంద్వ
23. అన్నోదకాలు అందరికీ ఉండాలి. (విగ్రహవాక్యం గుర్తించండి)
అ) అన్న యొక్క ఉదకము
ఆ) అన్న అనే ఉదకం
ఇ) అన్నమును, ఉదకమును
జవాబు:
ఇ) అన్నమును, ఉదకమును
24. పార్వతియును, పరమేశ్వరుడును – సమాసపదం గుర్తించండి.
అ) పార్వతీ పరమేశ్వరులు
ఆ) శివపార్వతులు
ఇ) శివకేశవులు
జవాబు:
అ) పార్వతీ పరమేశ్వరులు
25. కిందివానిలో ద్వంద్వ సమాసపదం గుర్తించండి.
అ) నాకలం
ఆ) ముక్కంటి
ఇ) హరిహరులు
జవాబు:
ఇ) హరిహరులు
26. కిందివానిలో క్రియాపదం గుర్తించండి.
అ) రాముడు
ఆ) చేశాడు
ఇ) యుద్ధం
జవాబు:
ఆ) చేశాడు
27. అతను పాట బాగా పాడాడు. (సర్వనామం గుర్తించండి)
అ) అతను
ఆ) పాట
ఇ) పాడాడు
జవాబు:
అ) అతను
28. నా యొక్క కలము గూర్చి వెళ్లాను. (షష్ఠీ విభక్తి ప్రత్యయం గుర్తించండి)
అ) యొక్క
ఆ) గూర్చి
ఇ) వెళ్లాను
జవాబు:
అ) యొక్క
29. కృష్ణుడు వెన్నను అతనికి ఇచ్చాడు. (ప్రథమా విభక్తి ప్రత్యయం గుర్తించండి)
అ) ను
ఆ) కి
ఇ) డు
జవాబు:
ఇ) డు
30. లింగ, విభక్తి, వచనములు లేనిది గుర్తించండి.
అ) విశేషణం
ఆ) అవ్యయం
ఇ) నామవాచకం
జవాబు:
ఆ) అవ్యయం
చదవండి – ఆనందించండి
టోపీల వ్యాపారి
ఒక ఊరిలో కాశీనాథుడు అనే ఒక టోపీలు అమ్మేవాడు ఉండేవాడు. అతడు చాలా నీతిమంతుడు. టోపీలను కొద్ది లాభానికే అమ్మేవాడు. అతడు దేశ విదేశాల నుండి తెప్పించిన రంగు రంగుల టోపీలను సరసమైన ధరలకే అమ్మడంతో జనం విరగబడి అతని దగ్గర టోపీలు కొనేవారు. అంగడిలో ఉన్నప్పుడు ఆ రోజు వ్యాపారంలో వచ్చిన డబ్బును అతడు ఓ టోపీలో దాచుకునేవాడు.
ఓ రోజు పూరి జగన్నాథుని రథ మసూత్సవం ఉండడంతో అతడు రథము లాగబడే వీథిలో ఒక చిన్న దుకాణం పెట్టు కున్నాడు. మొదటి రోజే చాలా టోపీలు అమ్మాడు. ఎప్పటిలాగే అతను డబ్బును ఒక టోపీలో దాచాడు. చీకటి పడ్డాక తన సంపాదన ఎంతో లెక్కపెడదామని, తన డబ్బు దాచుకునే టోపీ కొరకు వెతికాడు. టోపీ దొరకలేదు.
అతనికి గుండె ఆగినంత పనైంది. “అమ్మో ! నేను బాగా నష్టపోయానే. పొరపాటున డబ్బు దాచుకునే టోపీని అమ్మేసినట్టున్నాను” అని బాధతో కుమిలిపోతూ, రాత్రంతా నిదురపోలేదు.
మరునాడు ఉదయాన్నే తన దుకాణానికి వెళ్లి ‘ఎవరికైనా తన డబ్బు దాచిన టోపీ దొరికిందా’ అని అడుగసాగాడు.
“ఎవరికైనా నువ్వు డబ్బు దాచిన టోపీ దొరికితే నీకు ఇస్తారా ! నీ మూర్ఖత్వం కాకపోతే ఏంటి” అని జనం ఎగతాళిగా నవ్వారు.
కొంచెం సేపు అయ్యాక, ఒక ముసలాయన దిగులుగా కూర్చున్న కాశీనాథ్ దగ్గరకు వచ్చి “నాయనా! నువ్వు ఇచ్చిన టోపీ చాలా బరువుగా ఉంది. ఇది తీసుకొని నాకు తేలికగా ఉన్న టోపీని ఇవ్వు” అని అన్నాడు.
కాశీనాథుడు ఆ టోపీని తీసుకొని తేలికైన టోపీని ఇచ్చి ఆ ముసలాయనను పంపేశాడు. టోపీ : ఎందుకు బరువుగా ఉంది అని చూడగా, అతనికి అందులో దాచిన డబ్బు కనిపించింది.
‘హమ్మయ్యా !’ అని ఊపిరి పీల్చుకుంటూ, ‘నిజాయితీగా బతికే వారిని దేవుడు ఎప్పుడూ మోసం చేయడని రుజువైంది’ అని తన మనసులో అనుకున్నాడు కాశీనాథుడు.