AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

Students get through AP Inter 2nd Year Zoology Important Questions Lesson 5a మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Zoology Important Questions Lesson 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మానవుడిలో ముష్కాలు ఎక్కడ ఉంటాయి? ప్రతి ముష్కాన్ని ఆవరించి ఉండే రక్షణ కవచాలేవి?
జవాబు:

  1. మానవుడిలో ముష్కాలు ఉదర కుహరం బయట ముష్కగోణిలో వేలాడుతూ ఉంటాయి.
  2. ప్రతి ముష్కాన్ని ఆవరించి ‘ట్యూనికా ఆల్బుజీనియా’ అనే తంతుయుత కణజాల కవచం ఉంటుంది.
  3. ప్రతి ముష్కా బాహ్యతలం సీరస్ త్వచం అనే ఆంత్రవేష్ఠన పొరతో ఆవరించి ఉంటుంది. దీనినే ‘ట్యూనికా వెజైనాలిస్’ అంటారు.

ప్రశ్న 2.
ముష్కగోణులలోని కుహరాలను, ఉదరకుహరంలో కలిపే నాళాలను (కుల్యలను) ఏమంటారు? ముష్కాలను తమ స్ధానంలో నిలిపి ఉంచే నిర్మాణాలేవి?
జవాబు:

  1. ముష్కగోణులలోని కుహరాలను, ఉదరకుహరాలను కలిపే నాళాలను ‘వాంక్షణ నాళాలు’ అంటారు.
  2. ముష్కాలను తమ స్థానంలో నిలిపి ఉంచే నిర్మాణాలు ‘గుబర్నాక్యులమ్’ మరియు ‘శుక్రదండం’ .

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ
ప్రశ్న 3.
మానవ శుక్రోత్పాద నాళికలలోని సెర్టోలి కణాల, లీడిగ్ కణాల విధులేమిటి? [AP MAY-22][TS MAR-15,20]
జవాబు:

  1. సెర్టోలికణాలు:ఇవి పోషక కణాలు. ఇవి శుక్రకణాలకు పోషణను అందిస్తాయి మరియు ‘ఇన్హిబిన్’ అనే హర్మోనును విడుదల చేస్తాయి. ఇవి హార్మోన్ పుటిక ఉద్దీపన హార్మోన్ (FSH) ఉత్పత్తిని నిరోధిస్తాయి. ఇవి మాతృశుక్రకణాల మధ్య ఉంటాయి.
  2. లీడిగ్ కణాలు అనే మధ్యాంతర కణాలు శుక్రోత్పాదక నాళికల మధ్యలో ఉంటాయి. ఇవి ‘ఆండ్రోజెన్లు’ అనే పురుష హార్మోనులను స్రవిస్తాయి. వీటిలో ‘టెస్టోస్టిరాన్’ ముఖ్యమైనది.

ప్రశ్న 4.
మానవుడిలో సంపర్కావయవం ఏది ? దానిలో ఉండే మూడు రకాల కణజాల స్తంభాల పేరేమిటి?
జవాబు:

  1. మానవునిలో సంపర్క అవయవం ‘మేహనము’.
  2. ఈ మేహనం నిలువుగా ఉన్న మూడు స్పంజిక కణజాలపు స్తంభాలను కలిగి ఉంటుంది. రెండు పృష్ఠ భాగ స్తంభాలను ‘కార్పోరా కావెర్నోసా’ అని, ఉదర మధ్య ఒక స్తంభాన్ని ‘కార్పస్ స్పాంజియోజమ్’ అని అంటారు.

ప్రశ్న 5.
స్పెర్మియేషన్, స్పెర్మియోజెనిసిస్ అంటే ఏమిటి? [TS MAR-18]
జవాబు:

  1. స్పెర్మియేషన్: క్రియాశీలక శుక్రకణాలు శుక్రకణోత్పాదక నాళికల నుంచి శుక్రోత్పాదనాళికా కుహరంలోకి విడుదలయ్యే చర్యనే స్పెర్మియేషన్ (శుక్రకణాల విడుదల) అంటారు.
  2. స్పెర్మియోజెనిసిస్: చలనరహిత శుక్రకణాలు విచ్ఛేదనం చెంది చలనసహిత శుక్రకణాలుగా రూపాంతరం చెందడాన్నే స్పెర్మియోజెనిసిస్ (శుక్రకణజననం) అంటారు.

ప్రశ్న 6.
అండోత్సర్గం తరువాత పగిలిన పుటికలో సంచితమై ఉన్న పసుపు కణాల ముద్దను ఏమంటారు? ఇది స్రవించే హోర్మోన్ ఏది? దాని విధి ఏమిటి? [AP MAR-16]
జవాబు:

  1. అండోత్సర్గం తరువాత గ్రాఫియన్ పుటికలలో ఉండే పసుపు రంగు ముద్దను ‘కార్పస్ లూటియం’ అంటారు. ఇది తాత్కాలిక అంతః స్రావ గ్రంధి కణజాలంగా ఏర్పడుతుంది.
  2. ఇది ‘ప్రొజెస్టిరాన్’ అనే హార్మోన్ ను స్రవిస్తుంది. ఇది పిండ ప్రతిస్థాపనను ప్రోత్సహించి, గర్భాన్ని నిలిచేటట్లు చేస్తుంది.

ప్రశ్న 7.
గర్భావధి అంటే ఏమిటి? మానవుడిలో గర్భావధి ఎంత?
జవాబు:

  1. గర్భాశయంలో పిండం అభివృద్ధి చెందే కాలాన్ని ‘గర్భావధి’ అంటారు. ఇది గర్భందాల్చిన సమయం నుండి ప్రసవం జరిగేంత వరకు పట్టేకాలం.
  2. మానవుని గర్భావధి కాలం ఫలదీకరణం జరిగిన తరువాత నుండి సుమారు 38′ వారాలు (లేదా) ఆఖరి ఋతు చక్రం నుండి 40 వారాలు.

ప్రశ్న 8.
పిండ ప్రతిస్ధాపన అంటే ఏమిటి?
జవాబు:
పిండ ప్రతిస్ధాపన:ఇది గర్భాధారణ మొదటి రోజులలో జరిగే అంశం. అనగా ఫలదీకరణ జరిగిన 6వ రోజున ప్రతిస్థాపన ఆరంభమవుతుంది. బ్లాస్టోసిస్ట్ గర్భాశయ అంతర ఉపకళకు అతికి దానిలో పూర్తిగా అంతర్గతం అయ్యే వరకు చొచ్చుకొనిపోతుంది.

ప్రశ్న 9.
ఎపి బ్లాస్ట్, హైపోబ్లాస్ట్ల మధ్య వ్యత్యాసం (తేడా ఏమిటి?
జవాబు:
ఎపి బ్లాస్ట్

  1. పిండ ప్రతిస్ధాపన జరిగిన తరువాత బ్లాస్టోసిస్ట్ యొక్క బాహ్య తలంలోని కొన్నికణాలు కుహరం ఎదురు తలంలో ఒక స్తరంగా ఏర్పడతాయి. దీనినే ఎపిబ్లాస్ట్ అంటారు.
  2. ఇది భవిష్యత్తులో పిండ బాహ్యత్వచాన్ని ఏర్పరుస్తుంది.

హైపోబ్లాస్ట్

  1. పిండ ప్రతిస్థాపన జరిగిన తరువాత బ్లాస్టోసిస్ట్ యొక్క అంతర తలంలోని కొన్నికణాలు కుహరం ఎదురు తలంలో ఒక స్తరంగా ఏర్పడతాయి. దీనినే హైపోబ్లాస్ట్ అంటారు.
  2. ఇది భవిష్యత్తులో పిండ బాహ్య అంతరత్వచాన్ని ఏర్పరుస్తుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

ప్రశ్న 10.
ముష్కం, స్త్రీ బీజకోశాలకు ఒక్కోదానికి రెండు ముఖ్య విధులు రాయండి.
జవాబు:

  1. ముష్కాలు శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. పురుష హార్మోనులైన ఆండ్రోజెన్స్ (టెస్టోస్టిరాన్) లను కూడా ఉత్పత్తి చేస్తాయి.
  2. స్త్రీబీజకోశాలు స్త్రీ బీజకణాలను మరియు స్త్రీ హార్మోనులైన ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్ ను విడుదల చేస్తుంది.

ప్రశ్న 11.
శుక్రకణ పటం గీచి, భాగాలను గుర్తించండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 1

ప్రశ్న 12.
శుక్రద్రవంలోని ముఖ్యమైన అనుఘటకాలు ఏవి? [AP MAY-19]
జవాబు:

  1. శుక్రద్రవంలోని ముఖ్యమైన అనుఘటకాలు: ఫ్రక్టోజ్, ప్రోటీన్లు, సిట్రిక్లామం, అకర్బన ఫాస్ఫారస్, పోటాషియమ్, ప్రోస్టాగ్లాండిన్లు మరియు విటమిన్ ‘సి’.
  2. ఇవన్నీ శుక్రాశయాలు, పౌరుషగ్రంధి మరియు బల్బో యూరెత్రల్ (లేదా) కౌపర్ గ్రంధుల స్రావకాలు.

ప్రశ్న 13.
రుతుచక్రం అంటే ఏమిటి? రుతుచక్రాన్ని క్రమపరిచే హార్మోన్లు ఏవి?
జవాబు:

  1. మానవ ప్రైమేట్స్లోని స్త్రీ జీవులలో జరిగే ప్రత్యుత్పత్తి వలయాన్ని ‘రుతుచక్రం’ అంటారు.
  2. ప్రతి వలయానికి మధ్యలో ఒక అండం విడుదల అవుతుంది. అది గర్భాశయ అంతర ఉపకళలో అభివృద్ధి చెంది విచ్ఛిన్నమవుతుంది. మానవ స్త్రీలలో రుతు చక్రం ప్రతి 28/29 రోజుల వ్యవధితో మొదలవుతుంది.
  3. ఈ రుతుచక్రం ముఖ్యంగా నాలుగు హార్మోనుల ద్వారా నియంత్రించబడుతుంది :
    (i)పుటిన్ ప్రేరక హార్మోన్ (FSH)
    (ii) లూటినైజింగ్ హార్మోన్(LH) ఈ రెండు పిట్యూటరి గ్రంధిని స్రవిస్తాయి.
    (iii) ఈస్ట్రోజెన్
    (iv) ప్రొజెస్టిరాన్ ఈ రెండు అండాశయాల నుంచి విడుదలవుతుంది.

ప్రశ్న 14.
ప్రసవం అంటే ఏమిటి? ప్రసవంలో పాల్గొనే హార్మోన్లు ఏవి?
జవాబు:

  1. ‘శిశుజననం’ జరిగే ప్రక్రియనే ‘ప్రసవం’ అంటారు.
  2. ‘ఆక్సిటోసిన్’ అనే హార్మోన్ ఈ ప్రక్రియకు సహకరిస్తుంది.

ప్రశ్న 15.
ఒక ఆడకుక్క ఆరు (6) పిల్లలకు జన్మనిచ్చిందనుకుంటే ఆ కుక్క స్త్రీ బీజకోశం ఎన్ని అండాలను విడుదల చేసి ఉండొచ్చు?
జవాబు:
ఆడ కుక్క ‘ఆరు” పిల్లలకు జన్మనిచ్చిందనుకుంటే ఆ కుక్క స్త్రీ బీజకోశం నుంచి ‘ఆరు’ అండాలను విడుదల చేసిందని నిర్ధారించవచ్చు.

ప్రశ్న 16.
న్యూరులేషన్ అంటే ఏమిటి?
జవాబు:
న్యూరులేషన్ : అవయవోత్పత్తి జరిగే సందర్భంలో పిండం యొక్క నాడీఫలకం, నాడీ నాళంగా ఏర్పడుటనే ‘న్యూరులేషన్’ అంటారు.

ప్రశ్న 17.
శుక్రకణాల ‘కెపాసిటేషన్’ అంటే ఏమిటి? [TS MAR-19]
జవాబు:
శుక్రకణాల యొక్క సామర్ధ్యాకరణం అనగా అండాన్ని ఫలదీకరించే సామర్ధ్యాన్ని పొందుటకు కొన్ని శరీరధార్మిక మార్పులకు లోనవుతాయి. ఈ మార్పులనే ‘కెపాసిటేషన్’ (లేదా) ‘సామర్ధ్య కరణం’ అంటారు.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

ప్రశ్న 18.
మానవ పిండాభివృద్ధిలో ‘కాంపాక్షన్’ అంటే ఏమిటి? [AP MAR-15]
జవాబు:

  1. కాంపాక్షన్: మారులా దశలో కాంపాక్షన్ ప్రక్రియ నందు సూక్ష్మ మరియు స్థూల సంయుక్త బీజఖండితాలు దగ్గరగా లాగబడి సాంద్రంగా అమరుతాయి.
  2. ఈ ప్రక్రియలో, బ్లాస్టోమియర్లు వాటి ఆకారాన్ని మార్చుకొని, వాటిలో అవే గట్టిబంధనాన్ని ఏర్పరుచుకొని దగ్గరగా లాగబడి మారులాను ఏర్పరుస్తాయి.

ప్రశ్న 19.
మానవ పిండాభివృద్ధిలో ‘అంతర్వలనం,’ ‘ఇంగ్రెషన్’ (ప్రవేశం) ల మధ్య వ్యత్యాసం ఏమిటి?
జవాబు:
అంతర్వలనం

  1. బ్లాస్ట్యులా దశ నుండి గాస్ట్ర్యులా దశకు మారే సందర్భంలో కొన్ని కణాల సమూహం ఆది మడతల వద్ద పెరుగుదలను మరియు ఆదికుల్యకు చేరతాయి. ఈ ప్రక్రియనే అంతర్వలనం అంటారు.

ప్రవేశం

  1. గాస్ట్రు లేషన్ సమయంలో ఎపిబ్లాస్ట్ నుంచి కొన్ని భవిష్యత్ అంతస్వచకణాలు లోపలివైపు వలసపోవడాన్ని ‘ప్రవేశం’ అంటారు.

ప్రశ్న 20.
మానవ పిండాభివృద్ధిలో ఉన్న నాలుగు రకాల పిండబాహ్య త్వచాలను తెలియజేయండి.
జవాబు:
నాలుగు రకాల పిండ బాహ్యత్వచాలు (లేదా) భ్రూణత్వచాలు (1) ఉల్బం (2) అళిందం (3) సొనసంచి మరియు పరాయువు.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మానవ ‘ముష్కం’ సూక్ష్మ నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:

  1. మానవుల యొక్క ముష్కాలు ఉదరకుహారం బయట ముష్కగోణిలో వేలాడుతూ ఉంటాయి.
  2. ప్రతి ముష్కాన్ని ఆవరించి ‘ట్యూనికా ఆల్బుజీనియా’ అనే తంతుయుత కణజాల కవచం ఉంటుంది.
  3. ఈ ట్యూనికా ముష్కంలోకి వ్యాపించి అడ్డు విభాజకాలను ఏర్పరుస్తుంది. ఇది ముష్కాన్ని లంబికలుగా విభజిస్తుంది.
  4. ప్రతి విభాజకంలో సుమారు 250 ముష్కలంబికలు ఉంటాయి.
  5. ప్రతి లంబిక రెండు లేదా మూడు మెలికలు తిరిగిన ‘శుక్రోత్పాదక నాళికలను కలిగి ఉంటుంది.
  6. ప్రతి శుక్రోత్పాదక నాళికను ఆవరించి జనన ఉపకళ ఉంటుంది. దీనిలో శుక్రమాతృకణాలు మరియు సెర్టోలి కణాలు ఉంటాయి.
  7. శుక్రమాతృకణాలు ప్రాధమిక స్పెర్మోటోసైట్లను ఏర్పరుస్తుంది. ఇవి క్షయకరణ విభజన చెంది శుక్రకణాలను లేదా పురుషబీజ కణాలను శుక్రకణోత్పత్తి ద్వారా ఏర్పరుస్తాయి.
  8. ‘సెర్టోలి కణాలు’ ‘శుక్రకణాలకు పోషణను అందిస్తాయి. అంతేకాకుండా ‘ఇన్హిబిన్’ అనే హార్మోను విడుదల చేస్తాయి. ఇది పటిక ఉద్దీపన హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది.
  9. శుక్రోత్పాదక నాళికల మధ్య ‘మధ్యాంతర కణాలు’ ఉంటాయి. వీటినే ‘లీడిగ్’ కణాలు అంటారు. ఇవి ఆండ్రోజెన్ అనే పురుష హార్మోనులను ఉత్పత్తి చేస్తాయి.
  10. ఈ హార్మోనులలో ముఖ్యమైనది టెస్టోస్టిరాన్, ఇది ‘ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని మరియు శుక్రకణోత్పత్తిని నియంత్రిస్తుంది.
  11. శుక్రోత్పాదక నాళికలు ‘రీటేముష్కం’ లోనికి తెరచుకుని, దీనిద్వారా శుక్రనాళికల లోనికి తెరచుకుంటాయి.
  12. ‘శుక్రనాళికలు’ ‘ఎపిడిడైమిస్’ అనే నాళికలోకి తెరచుకుంటాయి. ఇది శిరోఎపిడిడైమిస్, మధ్య మరియు పుచ్ఛ ఎపిడిడైమిస్ భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఎపిడిడైమిస్ అధికంగా మరియు ధృడంగా చుట్టలు చుట్టుకొని ఉంటుంది. ఇది పరిపకత్వ చెందే శుక్రకణాలను నిలువ చేస్తుంది.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 2

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

ప్రశ్న 2.
మానవ ‘స్త్రీ బీజకోశం’ సూక్ష్మ నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:

  1. ‘స్త్రీ బీజకోశం’ (లేదా) అండం: స్త్రీబీజకోశాలు ప్రాధమిక స్త్రీ లైంగిక అవయవాలు. ఇవి అండాలను (స్త్రీబీజకణాలు) మరియు స్త్రీ బీజకోశ హార్మోన్లను విడుదల చేస్తాయి.
  2. స్త్రీ బీజకోశాలు రెండూ ఉదర కింద భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి.
  3. బీజకోశాలు రెండూ మీసోఒవేరియం అనే ద్విస్తరిత ఆంత్ర వేష్టనం ద్వారా ఉదర కుహర కుడ్యానికి బంధించబడి ఉంటాయి.
  4. బీజకోశాలను ఆవరించి ‘సరళ ఘనాకార ఉపకళ’ ఉంటుంది. దీనినే ‘స్త్రీ బీజకోశ జనన ఉపకళ’ అంటారు.
  5. ఈ పొర కింద మందంగా ఉన్న సంయోజక కణజాలపు గుళిక ఉంటుంది. దీనినే ‘ట్యూనికా ఆల్బుజీనియా’ అంటారు.
  6. బీజకోశాల యొక్క ప్రధాన భాగం (లేదా) స్ట్రోమాబయటి వల్కలం మరియు లోపలి దవ్వగా విడగొట్టబడి ఉంటుంది.
  7. దవ్వ వదులుగా ఉన్న సంయోజక కణజాలం. ఇది రక్తనాళాలు శోషరస నాళాలు మరియు నాడీ తంతువులను కలిగి ఉంటుంది.
  8. వల్కలం వివిధ దశలలో అభివృద్ధి చెందుతున్న అండాశయ పుటికలను కలిగి ఉండటం వల్ల కణికాయుతంగా ఉంటుంది.
  9. ‘గ్రాఫియన్ పుటికలు’ ‘కార్పస్ లూటియం’ మరియు ‘కార్పస్ ఆల్బికాన్స్’ అనునవి కూడా బీజకోశాల యందు ఉంటాయి.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 3

ప్రశ్న 3.
మానవ స్త్రీలో ‘గ్రాఫియన్ పుటిక’ ను వివరించండి.
జవాబు:

  1. అభివృద్ధి చెంది విడుదలకు సిద్ధంగా ఉన్న పుటికను ‘గ్రాఫియన్ పుటిక’ అంటారు.
  2. గ్రాఫియన్ పుటిక అనేది పరిణితి చెందిన స్త్రీ బీజకోశ పుటిక.
  3. ప్రాధమిక అండమాతృ కణంను ఆవరించి ‘జోనా పెల్యూసిడా’ అనే ఒక సజాతీయ త్వచం ఉంటుంది.
  4. ‘జోనా పెల్యూసిడా’ వెలుపలి వైపుకు గ్రాన్యులోసా కణాలు ఉంటాయి.
  5. జోనా పెల్యూసిడాకు దగ్గర ఉన్న గ్రాన్యులోసా లోపలి కణాలు ‘కరోనా రేడియేటా’ను ఏర్పరుస్తాయి.
  6. అండ-మాతృకణం వెలుపలి వైపుకు కరోనం రేడియేటా మరియు గ్రాన్యులోపా కణాలు మధ్య ద్రవంలో నిండిన కుహరం ఉంటుంది. దీనినే ‘ఏస్ట్రమ్’ అంటారు.
  7. గ్రాఫియన్ పుటిక యొక్క బాహ్య త్వచం ‘బయటి తొడుగు’ మరియు ‘లోపలి తొడుగు’ తో ఏర్పడుతుంది.
  8. ఈ రెండు తొడుగుల మధ్య మధ్యాంతర కణాలు, సంయోజక కణజాలం మరియు రక్త కేశనాళికలు ఉంటాయి.
  9. ద్వితీయ అండ మాతృకణ దశలో ‘అండం’ విడుదలవుతుంది.
  10. పుటిక పగిలి అండాన్ని విడుదల చేయుట అనేది ‘ల్యూటినైజింగ్’ హార్మోన్ ప్రేరణ ద్వారా జరుగుతుంది.

ప్రశ్న 4.
మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీచి, భాగాలను గుర్తించండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 4

ప్రశ్న 5.
మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీచి, భాగాలను పేర్కొనండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 5

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

ప్రశ్న 6.
శుక్రకణోత్పాదక నాళిక నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
శుక్రకణోత్పాదక నాళికలు:

  1. శుక్రోత్పాదక నాళికలు ముష్కలంబికలలో శుక్రోత్పాదక నాళికకుహరం ఉంటాయి.
  2. ఈ ముష్కలంబికలు ముష్కంలోకి వ్యాపించి అడ్డు విభాజకాలను ఏర్పరచిన ‘ట్యూనికా ఆల్బుజీనియా’ నందు ఉంటాయి.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 6
  3. ప్రతి శుక్రోత్పాదక నాళిక ఎక్కువ చుట్టలు చుట్టుకొని ఉంటుంది.
  4. ప్రతి శుక్రోత్పాదక నాళికను ఆవరించి ‘జనన ఉపకళ’ ఉంటుంది.
  5. ఈ జనన ఉపకళ ‘శుక్రమాతృకణాలు’ మరియు సెర్టోలికణాలను కలిగి ఉంటుంది.
  6. శుక్ర మాతృకణాలు ప్రాధమిక స్పెర్మటో సైట్లను ఏర్పరుస్తాయి. ఇది క్షయకరణ విభజన చెంది శుక్రోత్పాదకాలను ఏర్పరుస్తాయి.
  7. ఈ శుక్రోత్పాదకాలు శుక్రకణోత్పత్తి ప్రక్రియ ద్వారా శుక్రకణాలను ఏర్పరుస్తాయి.
  8. సెర్టోలి కణాలు శుక్రకణాలకు పోషణను అందిస్తాయి. శుక్రోత్పాదక నాళికల మధ్య మధ్యాంతర ఖాళీ ఉంటుంది.
  9. లీడిగ్ కణాలు పురుష బీజకోశ హార్మోనులను స్రవిస్తాయి. వీటిలో ‘టెస్టోస్టిరాన్’ ముఖ్యమైన హార్మోను .
    శుక్రోత్పాదక నాళికలు రీటే ముష్కం వలలాంటినిర్మాణం ద్వారా శుక్రనాళికలలోకి తెరచుకొంటాయి.

ప్రశ్న 7.
శుక్రకణోత్పాదన అంటే ఏమిటి? మానవుడిలో జరిగే ‘శుక్రకణోత్పత్తి’ ని గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:

  1. శుక్రకణోత్పత్తి (పురుష బీజకణోత్పత్తి): శుక్రకణాల ఉత్పత్తి ప్రక్రియను శుక్రకణోత్పత్తి అంటారు. పురుషులలో శుక్రకణోత్పత్తి యౌవన దశ ఆరంభం నుంచి ప్రారంభమవుతుంది.
  2. శుక్రోత్పాదక నాళికలు ‘శుక్రమాతృకణ మూలకణం’ను కలిగి ఉంటాయి. ఇవి సమవిభజన ద్వారా సంఖ్యలో వృద్ధి చెందుతాయి.
  3. కొన్ని మాతృశుక్రకణ మూలకణాలు ప్రాధమిక మాతృశుక్రకణాలుగా అభివృద్ధి చెందుతాయి (46 క్రోమోజోమ్లు).
  4. ఈ ప్రాధమిక మాతృశుక్రకణం దాని మొదటి క్షయకరణ విభజన జరిపి, ఏకస్థితిక ద్వితీయ మాతృశుక్రకణాలను (23) ఏర్పరుస్తాయి.
  5. ద్వితీయ మాతృశుక్రకణాలు, ద్వితీయ క్షయకరణ విభజన జరిపి శుక్రోత్పాదకాలను ఉత్పత్తి చేస్తాయి.
  6. ప్రతి ప్రాధమిక మాతృశుక్రకణాలు నాలుగు సమాన ఏకస్థితిక శుక్రోత్పాదకాలను ఏర్పరుస్తాయి.
  7. శుక్రకణోత్పత్తి ప్రక్రియ ద్వారా ఈ శుక్రోత్పాదకాలు శుక్రకణాలుగా మార్పుచెందుతాయి.
  8. శుక్రకణాల తలలు సెర్టోలి కణాల కణద్రవ్యంలో అంతస్థగితంగా ఉంటాయి. చివరకి ఇవి ‘శుక్రకణాల విడుదల’ అనే ప్రక్రియ ద్వారా శుక్రోత్పాదనాళికా కుహరంలోకి విడుదల అవుతాయి.
  9. గోనాడోట్రోపిన్ విడుదల హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ మరియు పుటిక ప్రేరక హార్మోన్ లేదా శుక్రకణోత్పత్తిని ప్రేరేపిస్తాయి.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 12
  10. పరిణితి చెందిన శుక్రకణం తల, మెడ, మధ్యభాగం మరియు తోక అనే భాగాలను కలిగి ఉంటుంది.
  11. తల టోపిలాంటి నిర్మాణంలో కప్పబడి ఉంటుంది. దీనినే ఏక్రోజోమ్ అంటారు. ఇది చొచ్చుకునిపోయే ఎన్ఎమ్లను కలిగి ఉంటుంది.
  12. తల ఏకస్థితిక కేంద్రకాన్ని మరియు మధ్యభాగం మైటోకాండ్రియాలను కలిగి ఉంటాయి. మైటోకాండ్రియాలు శుక్రకణాల తోక చలించడానికి కావలసిన శక్తిని అందిస్తాయి.

ప్రశ్న 8.
అండోత్పత్తి అంటే ఏమిటి? స్త్రీలలో జరిగే ‘అండోత్పత్తి’ని సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
అండోత్పత్తి: పరిణితి చెందిన స్త్రీ బీజకణాలు ఏర్పడే విధానాన్ని ‘అండోత్పత్తి’ లేదా ‘అండజననం’ అంటారు.

  1. పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడే ప్రతీ భ్రూణ స్త్రీ బీజకోశాలో అండకణోత్పత్తి ఆరంభమై రెండు మిలియన్ల ‘అండ మాతృకణాలు’ ఏర్పడతాయి.
  2. ఈ కణాలవిభజన క్షయకరణ విభజన-I లోని ప్రధమ దశ-1 లోనే ఆగిపోతాయి.
  3. ఈ దశలో ఈ కణాలను ‘ప్రాధమిక అండ మాతృకణాలు’ అంటారు.
  4. యౌవన దశకు ముందరే అనేక ‘ఆద్యపుటికలు’ క్షీణిస్తాయి.
  5. యౌవన దశకు చేరగానే శల్కల పుటికా కాణాలు ఘనాకారంగా మారి, విభజన చెంది త్వచ గ్రాన్యులోసా’ అనే స్తరిత ఉపకళను ఏర్పరుస్తాయి.
  6. ఈ గ్రాన్యులోసా కణాలు కలిగిన ప్రాధమిక అండ మాతృకణాలను ‘ప్రాధమిక పుటికలు’ అంటారు.
  7. ప్రాధమిక అండ మాతృకణం చుట్టూ ఆవరించి ఉన్న పొరను ‘జోనా పెల్యుసిడా’ అంటారు.
  8. ‘జోనా పెల్యుసిడా’ కు దగ్గరా ఉన్న గ్రాన్యులోసా కణాల వరుస దానికి బలంగా అతికి ఉన్న ‘కరోనా రేడిమేటా’ ను ఏర్పరుస్తాయి.
  9. ‘ఏన్ద్రమ్’ అని పిలువబడే ‘కుహరం’ గ్రాన్యులోసా కణాలలో ఏర్పడి, పరిమాణాన్ని పెంచుతూ అండమాతృకణంను ఒక పక్కకు నెడుతుంది.
  10. గ్రాన్యులోసా కణాలు ప్రాధమిక ‘అండమాతృకణాన్ని’ ఆవరించి, ‘ఏన్ద్రమ్’ కు బాహ్యంగా ఉన్న గ్రాన్యులోసా కణాలతో ‘కుమ్యులస్ ఊఫోరస్’ ద్వారా సంబంధాన్ని కలిగి ఉంటాయి.
  11. అండాశయం యొక్క స్ట్రోమా కణాలు గ్రాన్యులోసాస్తరం చుట్టూ సాంద్రీకరణం చెంది ‘లోపలి తొడుగు’ ను ఏర్పరుస్తాయి.
  12. ఈ లోపలి ‘తొడుగు’ను ఆవరిస్తూ కొంత సంయోజక కణజాలం సాంద్రీకరణం చెంది ఇంకొక పొర ‘బయట
    తొడుగు’ ను ఏర్పరుస్తాయి.
  13. ఈ దశలోని పుటికను ‘ద్వితీయ పుటిక’ అంటారు.
  14. ప్రాధమిక అండ మాతృకణం క్షయకరణ విభజనను -1 ను పూర్తి చేసుకుని, స్థూల ద్వితీయ అండ మాతృకణం(ఏకస్థితిక) ను మరియు ప్రధమ ధృవ దేహంను ఏర్పరుస్తుంది.
  15. అపుడు క్షయకరణ విభజన-II ప్రారంభమై మధ్యస్థ దశలో ఆగిపోతుంది.
  16. ఈ దశలోని పుటికను ‘గ్రాఫియన్ పుటిక’ అంటారు.
  17. గ్రాఫియన్ పుటిక యొక్క పరిమాణం (FSH) పుటిక ప్రేరక హార్మోన్ మరియు (LH) ల్యూటినైజింగ్ హార్మోన్ల యొక్క చర్యతో పెద్దదై పగిలి, ద్వితీయ అండ మాతృకణం(అండంగా)గా విడుదలవుతుంది. దీనినే ‘అండోత్సర్గం’ అంటారు. క్షయకరణ విభజన శుక్రకణం అండాన్ని చేరినపుడు మాత్రమే పూర్తవుతుంది.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 7

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

ప్రశ్న 9.
గ్రాఫియన్ పుటిక నిర్మాణం పటం గీచి, భాగాలను గుర్తించండి?
జవాబు:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 8

ప్రశ్న 10.
మానవ సమాజంలో స్త్రీలు ఆడపిల్లలను కంటున్నందుకు తరచూ నిందించబడతారు. ఎందుకు ఇది నిజమో కాదో మీరు తెలుపగలరా?
జవాబు:

  1. ఒక శిశువు యొక్క అభివృద్ధి అనేది సంయుక్త బీజం నుండి ప్రారంభమవుతుంది.
  2. సంయుక్త బీజం అనేది స్త్రీ యొక్క అండం మరియు పురుషుని యొక్క శుక్రకణాల కలయిక ద్వారా ఏర్పడుతుంది.
  3. మానవ స్త్రీ సమయుగ్మజా సంయోగ బీజాలను కలిగి ఉంటుంది.
  4. స్త్రీ యొక్క క్రోమోజోమ్ల విన్యాసం 44XX X అనేది లైంగిక క్రోమోజోమ్).
  5. స్త్రీ 22X విన్యాసంతో కూడిన అండాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. కావున అన్ని అండాలు 22X క్రోమోజోమ్లను మాత్రమే కలిగి ఉంటాయి.
  6. మానవ పురుషుడు ‘విషమయుగ్మజ సంయోగబీజాలను’ కలిగి ఉంటాడు. అతను రెండు రకాల శుక్రకణాలను ఉత్పత్తి చేయగలుగుతాడు.
  7. పురుషుని క్రోమోజోమ్ల విన్యాసం 44XY (X మరియు Y అనేది లైంగిక క్రోమోజోమ్లు).
  8. పురుషుడు రెండు రకాల శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాడు. 50% 22X క్రోమోజోమ్లను మరియు మిగిలిన 50% 22Y క్రోమోజోమ్లను కలిగి ఉంటాయి.
  9. ఫలదీకరణం అనేది నిరంతరంగా జరిగే సంయోగం.
  10. 22X క్రోమోజోమ్లు ఉన్న అండం 22X క్రోమోజోమ్లు ఉన్న శుక్రకణంతో కలిసినపుడు ఏర్పడే శిశువు ‘ఆడశిశువు’
  11. 22X క్రోమోజోమ్లు ఉన్న అండం 22Y క్రోమోజోమ్లు ఉన్న శుక్రకణంతో కలిసినపుడు ఏర్పడే శిశువు ‘మగశిశువు’
  12. కావున ‘లింగ విర్ధారణ’ అనేది X (లేదా) Y క్రోమోజోమ్లను కలిగిన శుక్రకణాలపై ఆధారపడి ఉంటుంది.
  13. కావున ఇది పురుషుని పై ఆధారపడి ఉంటుంది. మగ మరియు ఆడ శిశువులను గురించి స్త్రీని నిందించుట అనేది మూర్ఖత్వం ‘లింగనిర్ధారణ’ అనేది ఎవరికి తెలియని విషయం. దీనికిగాను ఎవరు బాధ్యులు కారు.

ప్రశ్న 11.
మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థతో సంబంధం ఉన్న అనుబంధ గ్రంథులను వివరించండి.
జవాబు:
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అనుబంధ జననేంద్రియ గ్రంధులు:
a) శుక్రాశయాలు: ఇవి ఒక జత సాధారణ నాళాకార శ్రోణి ప్రాంతంలో మూత్రాశయం పరాంత కింది భాగంలో అమరి ఉండే గ్రంధులు. ప్రతి శుక్రాశయం ఆవైపు శుక్ర వాహికలోకి తెరుచుకుంటుంది. ఇవి స్రవించే స్రావం ‘శుక్రద్రవం’ సుమారు 60% ఉంటుంది. ఇది చిక్కగా, క్షారయుతంగా ఉంటుంది. ఇది ఫ్రక్టోజ్, ప్రోటీన్లు, సిట్రీక్ ఆమ్లం, అకర్బన ఫాస్ఫేట్, పొటాషియం ప్రోస్టాగ్లాండిన్లు మరియు విటమిన్ ‘సి’లను కలిగి ఉంటుంది. ఫ్రక్టోజ్ శక్తి వనరుగా పనిచేస్తుంది. ప్రోస్టాగ్లాండిన్లు శుక్రకణాల కదలికలకు అనుకూలంగా గర్భాశయ ముఖద్వారంలోని శ్లేష్మ పొరను ఏర్పాటుచేస్తాయి. ఇవి గర్భాశయం మరియు ఫాలోపియన్ నాళాలలో తరంగ చలన సంకోచాలను కలిగించడంలో సహాయపడతాయి.

b) పౌరుషగ్రంధి: పౌరుషగ్రంధి మూతాశ్రయం క్రింది భాగంలో ఉంటుంది. దీని స్రావాలు అనేక వాహికల ద్వారా విడుదలవుతాయి. ఇది 15-30% శాతం శుక్రద్రవాన్ని స్రవిస్తుంది. ఇది స్వల్ప ఆమ్లత్వంగా ఉండి శుక్రకణాలను ఉత్తేజపరచడంలో మరియు పోషణ అందించడంలో సహాయపడుతుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

c) కాపర్ గ్రంధులు (లేదా) బల్బోయూరెడ్రల్ గ్రంధులు: ఈ గ్రంధులు పౌరుషగ్రంధి క్రింద, మరియు ప్రసేకానికి ఇరుపక్కలా బటాణిగింజ పరిమాణం మరియు ఆకారంలో మేహనం మొదలయ్యేచోట ఒక జతగా ఉంటాయి. దీని స్రావకం క్షారయుతంగా ఉంటుంది. ఇవి ప్రసేకాన్ని జారేటట్టుచేస్తాయి.

ప్రశ్న 12.
స్త్రీలోని జరాయువు నిర్మాణం, విధులను తెల్పండి.
జవాబు:
1) జరాయువు : జరాయువు క్షీరదాల గర్భాశయంలో ఉంటుంది. పిండం యొక్క గర్భస్థ అభివృద్ధికి సహాయపడుతుంది.

2) జరాయువు తల్లి కణజాలం మరియు అభివృద్ధి చెందుతున్న పిండం యొక్క కణజాలం నుంచి ఏర్పడిన తాత్కాలిక అవయవం. ఇది పిండంకు వాయువులు, హార్మోనులు మరియు పోషణను మొదలైనవి అందిస్తుంది.

3) సాధారణంగా తల్లి రక్తం శిశువు రక్తంతో కలిసి ఉండదు. దీనికి గాను కొన్ని అవరోధాలు ఉన్నాయి.
A. తల్లి కణజాలం

  1. గర్భాశయ ఉపకళా కణజాలం
  2. గర్భాశయ సంయోజక కణజాలం
  3. గర్భాశయ కేశనాళికాయుత ఎండోథీలియం

B. పిండ కణజాలం

  1. భ్రూణ కేశనాళిక యుత ఎండోధిలియం
  2. భ్రూణ సంయోజక కణజాలం
  3. భ్రూణ పరాయువు ఉపకళా కణజాలం

4) మానవులలో పిండ బాహ్య త్వచాలైన పరాయువు మరియు అళిందం కలిసి జరాయువును ఏర్పరుస్తాయి కావున ఈ రకం జరాయువును ‘అళిందపరాయు జరాయువు’ అంటారు.

5) జరాయువును ‘హీమోకోరియలో’ అని అంటారు. ఎందుకనగా పిండపరాయువు చూషకాలు నేరుగా మాతృరక్తంతో సంబంధాన్ని ఏర్పరుచుకొంటాయి.

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
పటం సహాయంతో మానవ ‘స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ’ గురించి వివరించండి? [APMAY-19,22][AP,TS MAR-15] [TS MAY-17][TS MAR-19,20]
జవాబు:
మానవ ‘స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ’:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 9
శ్రోణిప్రాంతంలో ఉన్న స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఈ క్రింద విధంగా ఉంటాయి:

  1. స్త్రీబీజకోశాలు
  2. ఫాలోఫియన్ నాళాలు (స్త్రీ బీజ వాహికలు)
  3. గర్భాశయం
  4. యోని
  5. యోని పరివృతం

1) స్త్రీ బీజ కోశాలు:

  1. స్త్రీ బీజ కోశాలు ప్రాధమిక స్త్రీ లైంగిక అవయవాలు. ఇవి స్త్రీ బీజ కణాలను (అండాలను) మరియు వివిధ రకాల స్టిరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి.
  2. ఒక జత స్త్రీ బీజ కోశాలు ఉదరక్రింది భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి.
  3. ప్రతి స్త్రీ బీజకోశం ‘మీసోఒవేరియం’ అనే దికవస్తరిత ఆంత్రవేష్టన మడత ద్వారా ఉదర కుహర కుడ్యానికి బంధించబడి ఉంటుంది.
  4. ప్రతిస్త్రీ బీజకోశం మూడు ప్రత్యేక భాగాలను కలిగి ఉంటుంది.

(a) స్త్రీ బీజ కోశాలను బాహ్యంగా ఆవరించి ఒక పొర ఉంటుంది. దానిని ‘స్త్రీ బీజకోశ జనన ఉపకళ’ అంటారు.
(b) ఈ పొర క్రింద మంధంగా ఉన్న సంయోజక కణజాలపు గుళిక ఉంటుంది. దీనిని ‘ట్యూనికా ఆల్బుజీనియా’ అంటారు.
(c) స్త్రీ బీజకోశం యొక్క ప్రాధమిక దేహ భాగాన్ని స్ట్రోమా అంటారు. స్ట్రోమా యొక్క బయటి భాగాన్ని వల్కలం మరియు లోపలి భాగాన్ని దవ్వ అంటారు. దవ్వ యందు రక్తనాళాలు, శోషరస నాళాలు మరియు నాడీ తంతువులు అధికంగా ఉంటాయి.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

2) ఫాలోపియన్ నాళాలు (స్త్రీ బీజవాహికలు):

  1. ప్రతి ఫాలోపియన్ నాళం బీజకోశ పరిధి నుండి గర్భాశయం వరకు వ్యాపించి ఉంటుంది.
  2. ప్రతి ఫాలోపియన్ నాళం చివర గరాట ఆకారంలో ‘కాలాంచిక’ అనే భాగాన్ని కలిగి ఉంటుంది.
  3. ‘కాలాంచిక’ అంచు యందు, సన్నటి వేళ్ల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. వీటిని ‘ఫింబ్రియే’ అంటారు.
  4. ఈ ఫింబ్రియేలు అండోత్సరగం తరువాత విడుదలైన అండాలను సేకరిస్తాయి.
  5. కాలాంచిక వెడల్పైన ‘కలశిక’ లోనికి దారి తీస్తుంది.
  6. ‘ఇస్తుమస్’ అనేది చివరి భాగం గర్భాశయంలోకి తెరచుకుంటుంది.
  7. ఫాలోపియన్ నాళంలోని కలశికలో ‘ఫలదీకరణ’ జరుగుతుంది.
  8. ఫాలోపియన్ నాళం ‘మేసోసాలోపింక్స్’ అనే ఆంత్రయోజని మడతతో శ్రోణికుడ్యానికి అతికి ఉంటుంది.

3) గర్భాశయం:

  1. గర్భాశయం అనునది ఏకయుతంగా ఉంటుంది మరియు దీనిని గర్భం అని కూడా అంటారు.
  2. ఇది మూత్రాశయానికి మరియు పురీషనాళానికి మధ్య ఉంటుంది.
  3. ఇది పెద్ద ‘పియర్ ఆకార’ పరిమాణంలో ఉండే కోశం లాంటి నిర్మాణం. ఇది అధిక కండర యుతమైనది మరియు ప్రసరణయుత మైనది.
  4. ఇది మీసోమెట్రియం అనే ఆంత్రవేష్టన మడతతో శ్రోణి కుడ్యానికి అతికి ఉంటుంది.
  5. గర్భాశయం యోనిలోకి సన్నగా ఉన్న గర్భాశయ ముఖద్వారం ద్వారా తెరుచుకొంటుంది.
  6. గర్భాశయ ముఖద్వార కుల్య మరియు యోని రెండూ కలిసి ‘శిశుజనన మార్గాన్ని’ ఏర్పరుస్తాయి.
  7. గర్భాశయ కుడ్యం వెలుపలి ‘పరి ఉపకళ’, మధ్య ‘కండర ఉపకళ’ మరియు లోపలి ‘అంతర ఉపకళ’ అనే మూడు పొరలను కలిగి ఉంటుంది.
  8. ఈ అంతర ఉపకళ (ఎండోమెట్రియం) చక్రీయ మార్పులకు లోనవుతుంది, వీటినే ‘రుతు చక్రం’ అంటారు.

4) యోని:

  1. యోని విశాలమైన తంతు కండరయుత నాళం. ఇది గర్భాశయ ముఖద్వారం నుంచి యోనిరంధ్రం వరకు వ్యాపించి ఉంటుంది.
  2. ఇది కెరటిన్ రహిత స్తరిత శల్కల ఉపకళతో ఆవరించి ఉంటుంది. అధిక కండరయుతం.

5) యోని పరివృతం :

  1. ఉల్వా లేదా యోని పరివృతం అనేది స్త్రీ బాహ్యా జననాంగాలను సూచిస్తుంది.
  2. అళిందం ‘ఊర్ధ్వ బాహ్యా ప్రసేక రంధ్రం’ మరియు ‘నిమ్మ యోనిరంధ్రం’ అనే రెండు రంధ్రాలను కలిగి ఉంటుంది.
  3. యోని రంధ్రం పాక్షికంగా శ్లేష్మపొరతో మూయబడి వుంటుంది. దీనినే ‘హైమన్’ పొర అంటారు.
  4. గుహ్యంగాంకురం అనేది సున్నిత మైన మరియు స్తంభించగల నిర్మాణం ఇది లోపలి పెదవులు కలిసే పైభాగంలో, ప్రసేక రంధ్రం పైన ఉంటుంది.
  5. గుహ్యంగాం కురం పురుష మేహనానికి సమజాతం అంతర్గతంగా ఈ రెండింటికి ‘కార్పోరా కావెర్నోసా’ ఊతమిస్తుంది.
  6. బయట పెదవుల పై భాగంలో చర్మం కింద కొవ్వుకణజాల దిండు వంటి ఉబ్బెత్తు ప్రాంతం ఉంటుంది. దీనినే ‘మాన్స్ ప్యూబిస్’ అంటారు. ఈ చర్మం పైన జఘన రోమాలు ఉంటాయి.

స్త్రీ జననేంద్రియ అనుబంధ గ్రంధులు:ఇవి మూడు రకాలు. అవి
(a) బార్తొలిన్ గ్రంధులు
(b)స్కీన్ గ్రంధులు
(c) క్షీరగ్రంధులు

a) బాక్తోలిన్ గ్రంధులు:

  1. ఒక జత బార్తొలిన్ గ్రంధులు (అగ్ర అళింద గ్రంధులు) అళింద కుడ్యంలో యోనిరంధ్రానికి కొద్ది క్రిందుగా ఇరువైపులా అమరి ఉంటాయి.
  2. ఇవి శ్లేష్మ స్రావాన్ని స్రవించి యోని మార్గం సులభంగా జారేటట్లు చేస్తాయి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని బల్బోయూరెత్రల్ గ్రంధులకు ఇవి ‘సమజాతం’
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 10

b) స్కీన్ గ్రంధులు:

  1. స్కీన్ గ్రంధులు (నిమ్మ ఆళింద గ్రంథులు) యోని పూర్వాంత కుడ్యం వద్ద మరియు ప్రసేకం క్రిందగా అమరి ఉంటాయి.
  2. ఇవి ప్రేరేపించబడినపుడు క్షార, జీగట ద్రవాన్ని స్రవిస్తాయి.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

c) క్షీర గ్రంధులు:

  1. క్షీరగ్రంధులు (వక్షోజాలు) గ్రంధియుత కణజాలాన్ని మరియు వివిధ మొత్తాలలో కొవ్వు కణజాలాన్ని కలిగి ఒక జతగా ఉంటాయి.
  2. క్షీర గ్రంధులు క్షీర లంభికలుగా విభజన చెంది క్షీర కోశాలు అనే గుత్తులను కలిగి ఉంటాయి. ఇవి ప్రసవం తరువాత పాలను ఉత్పత్తి చేస్తాయి.
  3. ఈ క్షీరకోశాలు ‘క్షీరనాళికల’ లోనికి తెరచుకుంటాయి. ప్రతీ లంబిక లోని నాళికలు అన్నీ కలిసి క్షీర నాళాన్ని ఎరియోలా ఏర్పరుస్తాయి.
  4. అనేక క్షీరనాళాలన్ని కలిసి విశాలంగా ఉన్న ‘క్షీరకలశిక’ను ఏర్పరుస్తాయి. ఈ కలశికలన్నీ కలసి క్షీరవాహిక కు కలపబడి క్షీరగ్రంధి ఉపరితల మధ్యభాగంలో ఉన్న వక్షోజాంకురం పై తెరచుకుంటాయి. దీని ద్వారా పాలు శిశువుచేత పీల్చబడుతుంది.

ప్రశ్న 2.
పటం సహాయంతో మానవ “పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ” ను వివరించండి. [TS MAY-19,22][AP MAR-20,19,18,17,16][TS MAR-17,16]
జవాబు:
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 11
శ్రోణిప్రాంతంలో ఉన్న పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఈ క్రింద విధంగా ఉంటాయి:

  1. ముష్కాలు
  2. శుక్రవాహికలు
  3. ఎపిడిడైమిస్
  4. ప్రసేకం
  5. మేహనం
  6. అనుబంధ గ్రంధులు

1) ముష్కాలు:

  1. ఒక జత అండాశయ ముష్కాలు ముదురు గులాబి రంగులో ఉండే పురుష ప్రాధమిక అవయవాలు
  2. ఇవి ఉదర కుహరం బయట ముష్కగోణిలో వేలాడుతూ ఉంటాయి.
  3. దేహ ఉష్ణోగ్రతకు శుక్రకణాల ఉత్పత్తి జరగదు. కావున ముష్కాలు ముష్కగోణిలో వేలాడుతూ దేహం బయట ఉంటాయి.
  4. ముష్కగోణి కుహరం ‘వాంక్షణ నాళం’ ద్వారా ఉదరకుహరంలో కలిసి ఉంటుంది.
  5. ముష్కగోణి లోపల ముష్కాలు గుబర్నాక్యులమ్ ద్వారా అడుగు భాగంలో నిలిపి ఉంచుతాయి. శుక్ర దండం ముష్కాలను ఉదర కుడ్యాలకు అతికి ఉంచుతుంది.
  6. శుక్రదండం రక్తనాళాలు, నాడులు మరియు శుక్రవాహిక ద్వారా ఏర్పడుతుంది. ఈ దండం ఉదరం నుంచి ముష్కం వరకు వాంక్షణ నాళం ద్వారా వ్యాపిస్తాయి.
  7. ‘ట్యూనికా ఆల్బుజీనియా’ ముష్కాన్ని ఆవరించి ఉండే తంతుయుత కణజాల కవచం, అడ్డు విభాజకాలను ఏర్పరచి ముష్కాన్ని లంబికలుగా విభజిస్తుంది. ప్రతి ముష్కం నందు సుమారు 250 ముష్కలంబికలు ఉంటాయి. ప్రతి లంబికలో 1 నుంచి 3 మెలికలు తిరిగి ఉండే శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి.
  8. ప్రతి శుక్రోత్పాదక నాళికను ఆవరించి ‘జనన ఉపకళ’ మరియు సెర్టోలి కణాలు ఉంటాయి. జనన ఉపకళ శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది. సెర్టోలికణాలు శుక్రకణాలకు పోషణను అందిస్తాయి. శుక్రోత్పాదక నాళికల బయట ఉన్న ప్రాంతాలను మధ్యాంతర ప్రదేశాలు అంటారు. వీటిని ‘లీడిగ్ కణాలు’ అంటారు. ఇవి పురుష బీజకోశ హార్మోన్లు అయిన ఆండ్రోజన్లోని అతి ముఖ్యమైన ‘టెస్టోస్టిరాన్’ ను ఉత్పత్తి చేస్తాయి.
  9. ‘టెస్టోస్టిరాన్’ ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని మరియు శుక్రకణోత్పత్తిని నియంత్రిస్తుంది.
  10. శుక్రోత్పాదక నాళికలు ‘రీటే ముష్కం’ లోనికి తెరుచుకుంటాయి రీటే ముష్కం శుక్రనాళికల లోనికి, అక్కడి నుంచి చుట్టలు చుట్టుకొని ఉన్న ‘ఎపిడడైమిస్’ లోనికి తెరుచుకుంటుంది.

2) ఎపిడిడైమిస్ :

  1. ఇది సన్నని చుట్టలు చుట్టుకొని ముష్క పరాంత తలం వెంబడి ఉంటుంది.
  2. శుక్రవాహికలు ముష్కం నుంచి ఎపిడిడైమిస్ లోనికి తెరుచుకుంటాయి.
  3. ఇది శుక్రకణాల పరిపకత్వకు వరకు మరియు తాత్కాలిక నిల్వకు సమయాన్ని కలుగజేస్తాయి.
  4. ఎపిడిడైమిస్ మూడు భాగాలుగా విభజించబడింది.
    (a) శిరోఎపిడిడైమిస్
    (b) మధ్యఎపిడిడైమిస్
    (c) పుచ్చఎపిడిడైమిస్
  5. శిరోఎపిడిడైమిస్ శుక్రవాహికలు ద్వారా శుక్రకణాలను స్వీకరిస్తుంది.

3) శుక్రవాహికలు:

  1. శుక్రవాహికలు (లేదా) నాళ వాహికలు సన్నగా, పొడవుగా మరియు కండరయుతమై ఉండే నాళాలు.
  2. ఇది పుచ్చ ఎపిడిడైమిస్ నుంచి బయలుదేరి వాంక్షణ నాళం ద్వారా ఉదర కుహారంలోకి ప్రవేశించి, మూత్రాశయం పై నుండి శక్యంలా మారి శుక్రాశయం నుంచి వచ్చే వాహికతో కలిసి స్కలన నాళనమును ఏర్పరుస్తుంది.
  3. రెండు శుక్ర నాళాలు పౌరుషగ్రంధి మధ్యభాగంలో కలిసి ప్రసేకంలోకి తెరుచుకుంటాయి.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

4) ప్రసేకం:

  1. ప్రసేకం మూత్ర మరియు జననేంద్రియ రూహికలు కలసి ఏర్పడిన అంత్యనాళం మూత్రాశయం నుంచి ప్రారంభమై మేహనం ద్వారా వ్యాపించి యూరెత్రల్ మీటస్ అనే రంధ్రం ద్వారా బయటికి తెరుచుకొంటుంది.
  2. ప్రసేకం మూత్రం మరియు శుక్రకణాలు రెండింటిని విడుదల చేస్తుంది.

5) మేహనం:

  1. మేహనం మూత్రనాళంగానే కాకుండా స్త్రీ జీవి యోనిలో శుక్రద్రవాన్ని విడుదల చేసే ప్రవేశ్యాంగం గా కూడా పని చేస్తుంది.
  2. ఇది మూడు రకాల స్పంజిక కణజాలపు స్తంభాలను కలిగి ఉంటుంది. అవి ‘కార్పోరా కావెర్నోసా’ అనే రెండు పృష్ఠ భాగం లోని స్తంభాలు మరియు ఉదర మధ్య ‘కార్పస్ స్పాంజియోజమ్’ అనే ఒకస్తంభం
  3. మేహనం చివరి భాగం గ్లాన్స్ మేహనం అని, దాన్ని ఆవరించి వదులుగా ఉన్న చర్మం ముడుతను (ముందు చర్మం) ‘ప్రెప్యూస్’ అని అంటారు.
  4. చర్మం, అధశ్చర్మపొర మూడు నిలువుగా ఉన్న కణజాలపు స్తంభాలను ఆవరించి ఉంటాయి. వీటి యందు ప్రత్యేకించిన కణజాలం ఉండటం వల్ల మేహనం నిటారుగా కడ్డీ లాగా మారి శుక్రాన్ని విడుదల చేయడంలో సహాయపుడుతుంది.

6) పురుష అనుబంధ జననేంద్రియ గ్రంధులు:
(a) ఒక జత శుక్రాశయాలు,
(b) ఒక పౌరుషగ్రంధి మరియు
(c) బల్బోయూరెత్రల్ గ్రంధులు

(a) శుక్రాశయాలు:

  1. శుక్రాశయాలు పరాంత కింది భాగంలో ఉండే ఒక జత సాధారణ నాళకార గ్రంధులు, ఆవైపు శుక్రవాహికలోకి తెరచుకుంటాయి.
  2. ఘనపరిమాణంలో సుమారు 60% శుక్రద్రవంను ఇవి స్రవిస్తాయి. ఇది చిక్కగా, క్షారయుతంగా ఉండి ఫ్రక్టోజ్, ప్రోటీన్లు, సిట్రిక్ ఆమ్లం అకర్బన ఫాస్పేట్ (pi) పొటాషియం, ప్రోస్టాగ్లాండిన్లను మరియు ‘విటమిన్’ లను కలిగి ఉంటుంది.
  3. ఫ్రక్టోజ్ శుక్రక: ప్రధాన శక్తి వనరుగా పని చేస్తుంది.

(b) పౌరుష గ్రంధి ‘ 3 మూత్రాశయం క్రింద ఉంటుంది.

  1. మానవుడిలో పౌరుషగ్రంధి శుక్రద్రవం లో 15-30% భాగాన్ని స్రవిస్తుంది.
  2. దీని స్రావం స్వల్ప ఆమ్లయుతంగా ఉంటుంది. శుక్రకణాలను ఉత్తేజపరచడంలో మరియు పోషణ అందించడంలో సహాయపడతాయి.

(c) బల్బోయూరెత్రల్ గ్రంధులు (లేదా) కౌపర్ గ్రంధులు:

  1. ఇది పౌరుషగ్రంధి క్రింది, అమరి ఉంటాయి. శుక్రద్రవానికి క్షారత్వాన్ని కల్పించి, ప్రేరణ సమయంలో సులభంగా జారేటట్టు చేస్తుంది.
  2. వీటి స్రావాలు మేహనం చివరను జారేటట్టు చేస్తాయి.

ప్రశ్న 3.
మానవ పిండాభివృద్ధిలోని వివిధ సంఘటనల (దశలు) గురించి వ్యాసం రాయండి.
జవాబు:
మానవ పిండాభివృద్ధి:
1) ఫలదీకరణం: ఫలదీకరణం అనగా శుక్రకణ కేంద్రకం, అండ కేంద్రకంతో కలిసి సంయుక్త బీజంను ఏర్పరుచుట. ఈ విధానాన్ని సమసంయోగం(సింగమి) అంటారు . అండంలో విడుదలైన కాల్షియం రెండవ శుక్రకణ ప్రవేశాన్ని నిలుపుతుంది. కరోనా రేడియేటా అదృశ్యమవుతుంది.

2) విదళనం: ఇది పూర్ణభంజితం మరియు అనిర్ధారితం. ఫలదీకరణం జరిగిన 36 గంటలకు మొదటి విభజన జరుగుతుంది. అన్ని కణాలు పరిమాణంలో సమానంగా ఉంటాయి. 16-32 కణాల దశలో ఉన్న ధృడమైన బంతివంటి నిర్మాణాన్ని మార్యులా అంటారు. కాంపాక్షన్ ప్రక్రియ వల్ల మార్యులా దగ్గరగా లాగబడి సాంద్రంగా మార్యులా మధ్యలో కుహారం ఏర్పడిన కణాలను పరిధియంవైపును నెడుతుంది. ఈ కుహారాన్ని ‘బ్లాస్టోసిస్ట్’ అంటారు. బాహ్యకణాలు పోషక బహిస్త్వచంగా ఏర్పడతాయి.

3) బ్లాస్టోసిస్ట్: పోషక బహిస్త్వచ పిండం, అంతర కణాల సముదాయం మరియు ద్రవంతో నిండి సంయుక్త బీజకుహరికను అంతటిని కలిపి ‘బ్లాస్టోసిస్ట్’ అంటారు. అంతర కణాల సముదాయం (రూపోత్పాదక కణాలు) పిండంకు అదనపు పిండత్వచాలను ఏర్పరుస్తాయి.

4) ప్రతిస్ధాపన: బ్లాస్టోసిస్ గర్భాశయంను చేరుతుంది. బ్లాస్టోసిస్ ను ఆవరించి యున్న జోనా పెల్యుసిడా అదృశ్య మవుతుంది. ట్రోపోబ్లాస్ట్ కణాలు గర్భాశయ అంతర ఉపకళకు అతి వుంటాయి. ఫలదీకరణ జరిగిన ‘6’వ రోజున ప్రతిస్ధాపన ఆరంభమవుతుంది. ట్రోఫోబ్లాస్ట్ గర్భాశయంలోకి చొచ్చుకొని పోయి విల్లేలను (వేళ్లవంటి నిర్మాణాలు) ఏర్పరచి రెండు పొరలుగా విభజన చెందుతుంది.

5) పిండ చక్రాభం: అంతర కణ సముదాయం రెండు పొరల పిండ చక్రాభంగా మారుతుంది అవి బాహ్యఎ పిబ్లాస్ట్ (పూర్వబాహ్యచర్మం) మరియు అంతర హైపోబ్లాస్ట్ (అదనపు పిండ అందస్త్వచం).

6) గాస్ట్రులేషన్: ఈ ప్రక్రియలో ఎపిబ్లాస్ట్ కణాలు కదలికలను జరిపి గమ్యస్థానాన్ని చేరతాయి. ఈ కదలికలను ‘రూపాంతర’ కదలికలు అంటారు. ఆదిరేఖ ఏర్పడటం అనేది గాస్ట్రులేషన్ యొక్క ప్రారంభం.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

7) పృష్ఠవంశం: పృష్ఠవంశ మధ్యత్వచకణాలు హెన్సన్స్ కణుపు వద్దకు కేంద్రీకృతమై అంతర్వలనం చెంది పృష్ఠవంశ అవశిష్టంగా ముందుకు వ్యాపిస్తాయి. ఈ నిర్మాణం గట్టీ కడ్డీలాంటి పృష్ఠవంశంగా మార్పు చెందుతుంది.

8) నాడీనాళం: పృష్ఠవంశ కణాలు నాడీఫలకాన్ని ప్రేరణ ద్వారా ఏర్పరుస్తాయి. ఈ నాడీ ఫలకం మొదట అండాకారంలో ఉండి పొడవుగా సాగి, పృష్ఠవంశం వైపుకు అంతర్వర్తనం చెంది నాడీ గాడిగా ఏర్పడి చివరకు ‘నాడీనాళం’గా ఏర్పడుతుంది. దీనినే ‘న్యూరులేషన్’ అంటారు.

9) మధ్యస్త్వచం: ఇది మూడు పొరలను కలిగి ఉంటుంది. (a) ఎపిమియర్ (b) హైపోమియర్ (c) మీసోమియర్
(a) ఎపిమియర్ కశేరు దండం, నియంత్రిత కండారాలు చర్మం మరియు ఇతర సంయోజక కణజాలలను ఏర్పరుస్తుంది.
(b) మీసోమియర్ మూత్రజననేంద్రియ అవయవాలను మరియు వాటి నాళాలను ఏర్పరుస్తుంది.
(c) హైపోమియర్ వెలుపలి సొమాటిక్ మరియు లోపలి స్పాంకనిక్ పొరలుగా చీలుతుంది. వీటి మధ్య ఉన్న కుహరాన్ని పిండాంతస్ధ కుహరం అంటారు.

10) అదనపు పిండబాహ్యాత్వచాలు: అదనపు పిండ బాహ్యాత్వచాలయిన పరాయువు, ఉల్బం, అళిందం మరియు సొనసంచి పిండాన్ని కుదుపులు ప్రచోదనాలు నుండి రక్షిస్తాయి మరియు పోషకాల శోషణ యందు సహాయపడతాయి.

11) జరాయువు: జరాయువు అనేది అళింద పరాయు జరాయువు మరియు హీమోకోరియల్ రకం పరాయువు చూషకాలు నేరుగా మాతృరక్తంతో సంబంధాన్ని ఏర్పరచుకుంటాయి.

12) గర్భావధికాలం: మానవ గర్భావధికాలం ఫలదీకరణం జరిగిన రోజు నుంచి సుమారు 266 రోజులు (లేదా) 38 వారాలు (లేదా) చివరి రుతుచక్రం ప్రారంభం నుంచి 280 రోజు (లేదా) 40 వారాల కాలం పడుతుంది.

Leave a Comment